చెన్నై టెస్ట్‌లో భారత్ బంగ్లాదేశ్‌పై 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ గెలుపుతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పరుచుకుంది. తాజా గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ 2023-25లో గెలుపు శాతాన్ని 71.67కి చేర్చుకుని వరుసగా మూడో ఎడిషన్ ఫైనల్ దిశగా దూసుకెళ్తుంది.
ఈ గెలుపు తర్వాత భారత్.. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మధ్య 9.17 గెలుపు శాతం వ్యత్యాసంగా ఉంది. ప్రస్తుతం ఆసీస్ గెలుపు శాతం 62.50గా ఉంది. భారత్ ముందున్న టెస్ట్ సీజన్‌లో (9 మ్యాచ్‌ల్లో) మరో నాలుగు విజయాలు సాధిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. భారత్.. తదుపరి బంగ్లాదేశ్‌తో ఒకటి.. ఆతర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
బంగ్లాదేశ్ విషయానికొస్తే.. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో ఓడించిన బంగ్లాదేశ్, ఆతర్వాత గణనీయంగా పాయింట్లు పెంచుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే భారత్ చేతిలో తాజా ఓటమితో బంగ్లా 6.54 గెలుపు శాతాన్ని కోల్పోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ విజయాల శాతం 39.29గా ఉంది. తాజా స్టాండింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ ఉన్నాయి.
కాగా, భారత్ సెప్టెంబర్ 27 నుంచి బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో తలపడుతుంది. కాన్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.
చదవండి: క్లీన్ స్వీప్ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా
Comments
Please login to add a commentAdd a comment