రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారీగా పాయింట్ల శాతాన్ని మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా ఓటమితో పాక్ పాయింట్ల శాతాన్ని మరింత దిగజార్చుకుని ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తాజాగా విడుదల చేసిన పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇటీవలే శ్రీలంకపై రెండో టెస్ట్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ ఐదో స్థానానికి ఎగబాకగా.. సౌతాఫ్రికా ఆరులో, శ్రీలంక ఏడో స్థానంలో నిలిచాయి. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో కేవలం ఒకే ఒక విజయం సాధించిన వెస్టిండీస్ చిట్టచివరి స్థానమైన తొమ్మిదో స్థానంలో నిలిచింది.
INDIA AT THE TOP IN WTC 🇮🇳
- Pakistan 8th in the table.....!!!! pic.twitter.com/O4WQAIuuzg— Johns. (@CricCrazyJohns) September 3, 2024
కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ఫైనల్ తేదీ మరియు వేదికను ఐసీసీ ఇవాళే ప్రకటించింది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11-15 మధ్యలో లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను (జూన్ 16) కూడా ప్రకటించారు నిర్వహకులు. లార్డ్స్‌లో మొట్టమొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది.
ఇదిలా ఉంటే, రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పాక్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. బంగ్లాదేశ్‌కు పాక్‌లో ఇది తొలి సిరీస్ విజయం.
Comments
Please login to add a commentAdd a comment