pakistan vs australia
-
విరాట్ కోహ్లిని అధిగమించిన బాబర్ ఆజమ్
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 18) జరిగిన మూడో టీ20లో బాబర్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేసిన బాబర్.. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లిని అధిగమించాడు. ప్రస్తుతం బాబర్ కంటే ముందు రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడు.టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-4 ఆటగాళ్లు..1. రోహిత్ శర్మ- 4231 పరుగులు2. బాబర్ ఆజమ్- 41923. విరాట్ కోహ్లి- 41884. పాల్ స్టిర్లింగ్- 3655మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో పాక్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు ఆరోన్ హార్డీ మూడు.. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ తలో రెండు.. జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో కేవలం 11.2 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో జోస్ ఇంగ్లిస్ 27, జేక్ ఫ్రేజర్ 18, టిమ్ డేవిడ్ 7 (నాటౌట్), మాథ్యూ షార్ట్ 2 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, జహన్దాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదిలకు తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆస్ట్రేలియానే గెలుపొందింది. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో పర్యటించింది. -
ఆసీస్‌తో మూడో టీ20.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్! ఎవరంటే?
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ చివరి మ్యాచ్‌లో పాక్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పాక్ జట్టుకు సల్మాన్ అలీ అఘా సారథ్యం వహించనున్నాడు. రిజ్వాన్‌తో పాటు స్టార్ పేసర్ నషీం షాకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరి స్థానాల్లో హసీబుల్లా ఖాన్, పేసర్ జహందాద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. అయితే 21 ఏళ్ల జహందాద్ ఖాన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం. దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో జహందాద్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జోష్ ఇంగ్లిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపాపాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, జహందాద్ ఖాన్, హరీస్ రవూఫ్, సోఫియన్ ముఖీమ్చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి -
చరిత్ర సృష్టించిన హరీస్ రౌఫ్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షాదాబ్ ఖాన్ సరసన నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 16) జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ ఈ ఘనత సాధించాడు. రౌఫ్ తన 72 ఇన్నింగ్స్‌ల టీ20 కెరీర్లో 107 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్ 96 ఇన్నింగ్స్‌ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. పాక్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ తర్వాత షాహిద్ అఫ్రిది (97 వికెట్లు), షాహీన్ అఫ్రిది (96) ఉన్నారు. 2020లో టీ20 అరంగేట్రం చేసిన రౌఫ్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే పాక్ తరఫున లీడింగ్ వికెట్‌టేకర్‌గా అవతరించాడు.ఆసీస్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన రౌఫ్ మరో ఘనత కూడా సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు (4-0-22-4) నమోదు చేసిన విదేశీ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర పేరిట ఉండేది. కులశేఖర 2017లో నాలుగు వికెట్లు తీసి 31 పరుగులిచ్చాడు. ఈ జాబితాలో రౌఫ్, కులశేఖర తర్వాత కృనాల్ పాండ్యా (4/36), క్రిస్ వోక్స్ (3/4), టిమ్ సౌథీ (3/6) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. హరీస్ రౌఫ్ (4/22), అబ్బాస్ అఫ్రిది (3/17), సూఫియాన్ ముఖీమ్ (2/21) ఆసీస్ పతనాన్ని శాశించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ (20), మ్యాక్స్‌వెల్ (21), స్టోయినిస్ (14), టిమ్ డేవిడ్ (18), ఆరోన్ హార్డీ (28) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే 12 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందిన విషయం తెలిసిందే. -
చరిత్రకెక్కిన బాబర్ ఆజం.. తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా! మాలిక్ రికార్డు బ్రేక్
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ తరపున అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా బాబర్ రికార్డులకెక్కాడు. గురువారం బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 బాబర్‌కు 124వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను బాబర్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇంతకుముందు ఈ రికార్డు పాక్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(123) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మాలిక్ రికార్డును ఆజం బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు 124 టీ20లు ఆడిన బాబర్.. 40.67 సగటుతో 4148 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై 29 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. వెలుతురు లేమి కారణంగా నిర్ణీత సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన తొలి టి20ని చివరకు 7 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్వెల్19 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టొయినిస్ (7 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 7 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 64 పరుగులకు పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో అబ్బాస్ అఫ్రిది (20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. -
మాక్సీ మెరుపులు.. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్రిస్బేన్ వేదికగా పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాబా స్టేడియంలో ఆసీస్- పాక్ మధ్య గురువారం తొలి టీ20 జరిగింది.వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ టీ20 మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.ధనాధన్ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగాఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్(19 బంతుల్లో 43) రాకతో సీన్ మారింది. ధనాధన్ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగా.. నాలుగో నంబర్ బ్యాటర్ టిమ్ డేవిడ్(10) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో మాక్సీకి తోడైన మార్కస్ స్టొయినిస్(7 బంతుల్లో 21 నాటౌట్) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.మాక్సీ, స్టొయినిస్ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పాక్ తడ‘బ్యాటు’కు గురైంది. ఆసీస్ పేసర్లు నిప్పులు చెరగడంతో 64 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(8)ను అవుట్ చేసి స్పెన్సర్ జాన్సన్ వికెట్ల వేట మొదలుపెట్టగా.. జేవియర్ బార్ట్లెట్ మహ్మద్ రిజ్వాన్(0)ను డకౌట్ చేశాడు. అనంతరం ఉస్మాన్ ఖాన్(4)ను కూడా అతడు పెవిలియన్‌కు పంపాడు.ఆ తర్వాత నాథన్ ఎల్లిస్ బాబర్ ఆజం(3)తో పాటు.. ఇర్ఫాన్ ఖాన్(0) వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో మరోసారి రంగంలోకి దిగిన బార్ట్లెట్ ఆఘా సల్మాన్(4)ను వెనక్కి పంపగా.. నాథన్ ఎల్లిస్ హసీబుల్లా ఖాన్(12) పనిపట్టాడు. అయితే, అబ్బాస్ ఆఫ్రిది(20 నాటౌట్)తో కలిసి టెయిలెండర్ షాహిన్ ఆఫ్రిది(6 బంతుల్లో 11) బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేయగా.. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా అతడిని బౌల్డ్ చేశాడు. అనంతరం.. పాక్ ఇన్నింగ్స్ ఆఖరి వికెట్‌గా నసీం షాను బౌల్డ్ చేసి వెనక్కి పంపించాడు. 64 పరుగులకేఈ క్రమంలో పాకిస్తాన్ ఏడు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 64 రన్స్ చేసింది. ఫలితంగా ఆసీస్ చేతిలో 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించి ఆసీస్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా రెండో టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2025: సీఎస్కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
పాక్‌తో తొలి టీ20: మాక్స్వెల్ ఊచకోత.. చరిత్ర పుటల్లోకి!
పాకిస్తాన్‌తో తొలి టీ20లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. కేవలం పందొమ్మిది బంతుల్లోనే 43 పరుగులు సాధించాడు. 226కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేసిన మాక్సీ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.ఇక మాక్సీతో పాటు మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం ఏడు బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.కాగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి పాకిస్తాన్ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా టీ20 సిరీస్ మొదలైంది.గాబా స్టేడియంలో గురువారం నాటి ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో టీ20ని ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఆసీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఓపెనర్లు మాథ్యూ షార్ట్(7), జేక్ ఫ్రేజర్ మెగర్క్(9).. అదే విధంగా టిమ్ డేవిడ్(10) విఫలం కాగా.. మాక్సీ, స్టొయినిస్ దంచికొట్టారు.చరిత్ర పుటల్లోకి!ఇక పాక్‌తో తొలి టీ20 సందర్భంగా మాక్స్వెల్ పొట్టి ఫార్మాట్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా పురుషుల క్రికెట్లో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదహారో బ్యాటర్‌గా.. అదే విధంగా మూడో ఆసీస్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. మాక్సీ (10012) కంటే ముందు డేవిడ్ వార్నర్(12411), ఆరోన్ ఫించ్(11458) ఆస్ట్రేలియా తరఫున పదివేల పరుగుల క్లబ్లో చేరారు. 'This is why people pay a lot of money to watch this guy bat' #AUSvPAK pic.twitter.com/Zwab5Pnw3j— cricket.com.au (@cricketcomau) November 14, 2024 -
చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ తరఫున కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కు తాకలేకపోయారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ సిరీస్ ఆసీస్ టాప్ స్కోరర్‌గా జోస్ ఇంగ్లిస్ నిలిచాడు. ఇంగ్లిస్ తొలి వన్డేలో 49 పరుగులు చేశాడు. ఇదే ఈ సిరీస్ మొత్తానికి ఆసీస్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్.పాక్‌తో సిరీస్‌లో బ్యాటర్ల చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఆసీస్ 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. 22 ఏళ్లలో సొంతగడ్డపై పాకిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం ఆసీస్‌కు ఇదే మొదటిసారి. ఇవాళ (నవంబర్ 10) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 31.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (3/32), నసీం షా (3/54), హరీస్ రౌఫ్ (2/24), మొహమ్మద్ హస్నైన్ (1/24) ఆసీస్ పతనాన్ని శాశించారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో సీన్ అబాట్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ (22), ఆరోన్ హార్డీ (12), ఆడమ్ జంపా (13), స్పెన్సర్ జాన్సన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37) రాణించగా.. బాబర్ ఆజమ్ (28), మొహమ్మద్ రిజ్వాన్ (30) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో లాన్స్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి వన్డేలో గెలుపొందగా.. పాక్ వరుసగా రెండు, మూడు వన్డేల్లో గెలిచింది.ఈ సిరీస్‌లో ఆసీస్ బ్యాటర్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..జోస్ ఇంగ్లిస్- 49 (తొలి వన్డే)స్టీవ్ స్మిత్- 44 (తొలి వన్డే)స్టీవ్ స్మిత్- 35 (రెండో వన్డే)పాట్ కమిన్స్- 32 (తొలి వన్డే)సీన్ అబాట్- 30 (మూడో వన్డే) -
సంచలనం.. ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించిన పాక్
అంతర్జాతీయ క్రికెట్లో పాక్ చాలా రోజుల తర్వాత తమ స్థాయి మేరకు రాణించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. పాక్.. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మట్టికరిపించడం విశేషం. 22 ఏళ్లలో ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌ను ఇది తొలి వన్డే సిరీస్ విజయం. ఇవాళ (నవంబర్ 10) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాక్ ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది (3/32), నసీం షా (3/54), హరీస్ రౌఫ్ (2/24), మొహమ్మద్ హస్నైన్ (1/24) ఆసీస్ పతనాన్ని శాశించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సీన్ అబాట్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ (22), ఆరోన్ హార్డీ (12), ఆడమ్ జంపా (13), స్పెన్సర్ జాన్సన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (7), కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ (7), కూపర్ కన్నోలీ (7), మార్కస్ స్టోయినిస్ (8), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), లాన్స్ మోరిస్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 141 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో సైమ్ అయూబ్ (42), అబ్దుల్లా షఫీక్ (37) రాణించగా.. బాబర్ ఆజమ్ (28), మొహమ్మద్ రిజ్వాన్ (30) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో లాన్స్ మోరిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆసీస్ గెలుపొందగా.. పాక్ వరుసగా రెండు, మూడు వన్డేల్లో జయకేతనం ఎగురవేసింది. -
నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పాక్ బౌలర్ల దాటికి 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. షాహీన్ షా అఫ్రిది, నసీం షా తలా మూడు వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించగా, హారిస్ రౌఫ్ రెండు, హస్నన్ ఒక వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ సీన్ అబాట్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు రెగ్యూలర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్ అందుబాటులో లేరు. వీరిందరూ భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి ఈ ఆఖరి వన్డేకు దూరమయ్యారు. కాగా ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే సిరీస్ వారి వశమవుతుంది.చదవండి: CK Nayudu Trophy: ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో Congratulations to pakistan winning series against australia.All World class field. Most hyped team Australia in the world 😁 #PAKvsAUSpic.twitter.com/AiwacybfvT— JassPreet (@JassPreet96) November 10, 2024 -
నిప్పులు చెరిగిన రౌఫ్.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన పాక్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. హరీస్ నిప్పులు చెరిగే బంతులలో ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టాడు. రౌఫ్ 8 ఓవర్లలో 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మరో ఎండ్ నుంచి ఫాహీన్ అఫ్రిది కూడా ఆసీస్ బ్యాటర్లపై అటాకింగ్ చేశాడు. అఫ్రిది 8 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. పేసర్లు నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మాథ్యూ షార్ట్ 19, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 13, జోష్ ఇంగ్లిస్ 18, లబూషేన్ 6, హార్డీ 14, మ్యాక్స్‌వెల్ 16, కమిన్స్ 13, స్టార్క్ 1, జంపా 18, హాజిల్‌వుడ్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. ఓపెనర్ సైమ్ అయూబ్ మెరుపు హాఫ్ సెంచరీతో (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అలరించగా.. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు. బాబర్ ఆజమ్ 20 బంతుల్లో సిక్సర్ సాయంతో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది. -
ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు.. మహ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డు
అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ల వెనక అద్బుతం చేశాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఏకంగా 6 క్యాచ్‌లను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఫీట్‌ను రిజ్వాన్ తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పాకిస్తాన్ వికెట్‌కీపర్‌గా సర్ఫరాజ్ ఆహ్మద్ రికార్డును సమం చేశాడు. మార్చి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సర్ఫరాజ్ కూడా ఆరు క్యాచ్‌లను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ రిజ్వాన్‌కు లభించింది. కానీ జంపా ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రిజ్వాన్ జారవిడచడంతో ఆహ్మద్‌ను అధిగమించలేకపోయాడు. లేదంటే 7 క్యాచ్‌లతో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయివుండేది.నిప్పులు చెరిగిన రవూఫ్కాగా ఈ మ్యాచ్‌లో పాక్ స్పీడ్‌స్టర్ హారిస్ రౌఫ్ నిప్పులు చేరిగాడు. రౌఫ్ 5 వికెట్ల హాల్‌తో చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్లకు వారి సొంతగడ్డపైనే రౌఫ్ చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి కంగారులు బెంబేలెత్తిపోయారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హారిస్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. రౌఫ్‌తో పాటు షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే' -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్‌తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గాఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్‌తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ప్యాట్ కమిన్స్ అందుకే దూరంకాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.వీరంతా భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్‌కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.వన్డేల్లో 30వ సారథిగాఅయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్‌గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్‌కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.పాకిస్తాన్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.పాకిస్తాన్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుసీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా. -
అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. పాక్ పేసర్లు అద్భుతంగా పోరాడినప్పటకి విజయం మాత్రం వరించలేదు.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించి పాక్‌ను దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(44), ఇంగ్లీష్(49) నిలకడగా ఆడటంతో ఆసీస్ సునాయసంగా లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా భావించారు.కానీ పాక్ హ్యారీస్ రవూఫ్ మాత్రం మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఒక్కసారిగా పాక్ జట్టు మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పుకుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(32 నాటౌట్) ఆఖరివరకు క్రీజులో నిలుచోని తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందిచాడు. తమ జట్టు పేస్ బౌలర్లపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ ఓటమి మాకు ఎటువంటి నిరాశ కలిగించలేదు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆఖరి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో అదే చేశాము. చివర వరకు పోరాడి ఓడిపోయాం. ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మేము బ్యాటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాలి. హ్యారీస్ రవూఫ్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మా నలుగురు పేసర్లు కూడా తమ పని తాము చేశారు. తర్వాతి మ్యాచ్‌లో కూడా నలుగురు పేసర్లతోనే ఆడనున్నాం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కాస్త ఆదృష్టం కలిసొచ్చింది అని పోస్ట్ మ్యాచ్ప్రేజేంటేషన్లో రిజ్వాన్ పేర్కొన్నాడు. -
PAK VS AUS: భారీ రికార్డుపై కన్నేసిన షాహీన్ అఫ్రిది
ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో అఫ్రిది మరో 12 వికెట్లు తీస్తే.. పాకిస్తాన్ ఆల్‌టైమ్ గేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొడతాడు. వకార్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) ఆస్ట్రేలియాపై 59 వికెట్లు పడగొట్టగా.. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో 48 వికెట్లు ఉన్నాయి. ఆసీస్‌పై వకార్ ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. షాహీన్ కూడా ఓ సారి ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ఇవాళ తొలి వన్డే ఆడింది. ఈ పర్యటనలో పాక్ మరో రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో షాహీన్ మరో 12 వికెట్లు పడగొట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ పర్యటనలోనే షాహీన్ వకార్ యూనిస్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.షాహీన్ ఆల్‌రౌండ్ షోమెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 4) జరిగిన తొలి వన్డేలో షాహీన్ అఫ్రిది ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్ బ్యాట్‌తో, బంతితో రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది.నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్, జంపా, అబాట్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (32 నాటౌట్) ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. -
Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియాపాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్‌కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌తో ఆడిన తక్కువ మ్యాచ్‌లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు పాక్‌తో 109 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్‌లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్‌తో సమానంగా 71సార్లు పాక్‌పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.రిజ్వాన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమికాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు ఇదే తొలి మ్యాచ్.ఇక మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.నసీం షా బ్యాట్ ఝులిపించినాపాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్‌తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్ కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. పాక్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్(12), సయీమ్ ఆయుబ్(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్ చేసిన షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతడు దెబ్బకొట్టాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్‌లు)వెస్టిండీస్- 71 (137 మ్యాచ్‌లు)శ్రీలంక- 59 (157 మ్యాచ్‌లు)ఇంగ్లండ్- 57 (92 మ్యాచ్‌లు)ఇండియా- 57 (135 మ్యాచ్‌లు)ఆసీస్ వర్సెస్ పాక్ తొలి వన్డే - ప్లేయింగ్ ఎలెవన్ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: ICC: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు భారత్ ఆతిథ్యం -
మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు.. ఆరో బౌలర్‌గా
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో పాక్ బ్యాట్లకు స్టార్క్ చుక్కలు చూపించాడు. తన 10 ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇందులో మూడు మేడిన్ ఓవర్లు ఉండడం విశేషం. స్టార్క్‌తో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. దీంతో పాకిస్తాన్ 46.2 ఓవర్లలో కేవలం 203 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ రిజ్వాన్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నసీం షా(40) ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.స్టార్క్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో వన్డేల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న ఆరో ఆసీస్ బౌలర్‌గా స్టార్క్ రికార్డులకెక్కాడు. పాక్ ఓపెనర్లు షఫీక్, అయూబ్‌లను ఔట్ చేసి స్టార్క్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్టార్క్ కంటే ముందు బ్రెట్ లీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్,క్రెయిగ్ మెక్డెర్మాట్లు ఉన్నారు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు స్టార్క్‌ను కేకేఆర్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని ఐపీఎల్-2024 మినీవేలంలో ఏకంగా 24.75 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరి కొనుగోలు చేసింది. -
Aus vs Pak: ఆసీస్‌తో వన్డే.. దంచికొట్టిన షాహిన్ ఆఫ్రిది, నసీం షా.. కానీ..
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. కంగారూ పేసర్ల విజృంభణ ముందు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో టెయిలెండర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా దంచికొట్టడంతో పర్యాటక జట్టు రెండు వందల మార్కును దాటగలిగింది.ఆస్ట్రేలియా పర్యటనలోకాగా వరుస ఓటముల అనంతరం పాక్ జట్టు ఇటీవలే ఫామ్‌లోకి వచ్చింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచి పునరుత్తేజం పొందింది. అనంతరం.. మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఇక ఈ టూర్‌తో మహ్మద్ రిజ్వాన్ పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు.ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య సోమవారం నాటి తొలి వన్డేకు మెల్బోర్న్ వేదికైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ పాక్ ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(1), అబ్దుల్ షఫీక్(12)లను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపాడు.బాబర్, రిజ్వాన్ నామమాత్రంగానే..అయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(37).. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(44)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, బాబర్‌ను అవుట్ చేసి ఆడం జంపా ఈ జోడీని విడదీయగా.. రిజ్వాన్ వికెట్‌ను మార్నస్ లబుషేన్ దక్కించుకున్నాడు.మిగతా వాళ్లలో కమ్రాన్ గులామ్(5), ఆఘా సల్మాన్(12) పూర్తిగా విఫలం కాగా.. ఇర్ఫాన్ ఖాన్ 22 పరుగులు చేయగలిగాడు. ఇలా స్పెషలిస్టు బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా బ్యాట్ ఝులిపించారు.షాహిన్ ధనాధన్.. నసీం సూపర్గాషాహిన్ 19 బంతుల్లోనే 24 రన్స్(3 ఫోర్లు, ఒక సిక్సర్) చేయగా.. నసీం షా ఆడిన కాసేపు సిక్సర్లతో అలరించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 40 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లు ఉండటం విశేషం. ఈ క్రమంలో పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 203 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్లు స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ కమిన్స్ రెండు, సీన్ అబాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. స్పిన్నర్లు ఆడం జంపా రెండు, లబుషేన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Starc gets the ball rolling! #AUSvPAK pic.twitter.com/CYXcVECkj1— cricket.com.au (@cricketcomau) November 4, 2024 ఇదిలా ఉంటే.. నసీం షా ఇన్నింగ్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై ఇలాంటి షాట్లు బాదడం మామూలు విషయం కాదంటూ కొనియాడుతున్నారు. ఇక పాక్ జట్టు ఫ్యాన్స్ అయితే.. నసీం కాబోయే సూపర్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. బాబర్ ఆజం, రిజ్వాన్ వంటి వాళ్లు నసీంను చూసి నేర్చుకోవాలంటూ వీరిద్దరి వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. Babar and Rizwan should learn something from Naseem Shah. #PAKvsAUS pic.twitter.com/Hd7BhgtAMa— Humza Sheikh (@Sheikhhumza49) November 4, 2024 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ తొలి వన్డే- మెల్బోర్న్తుదిజట్లుఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
ఐదుగురిని సంప్రదించా.. త్వరలోనే కొత్త కోచ్ ఎంపిక: పీసీబీ చీఫ్
దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్‌స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్‌ను నియమిస్తామని తెలిపాడు.అందుకే రాజీనామా!కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్‌లో కిర్‌స్టెన్‌ను ప్రధాన కోచ్‌గా పీసీబీ నియమించింది. కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్‌గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్‌స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్‌స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్‌స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్‌స్టెన్‌కు పీసీబీ సూచించడం గమనార్హం. ఇక కిర్‌స్టెన్‌తో టెస్టు టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది. ఒక్క వన్డే ఆడకుండా... ఇదిలా ఉంటే.. కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిపిన రికార్డు ఉన్న కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్‌ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్‌ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలుమరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్‌గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్‌స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.ఐదుగురిని సంప్రదించాఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్‌గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే! -
ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం: పాక్ కొత్త కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని మహ్మద్ రిజ్వాన్ హర్షం వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఆడాలన్న కోరికతో పాటు సారథిగా ఎదగాలన్న కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతామాజీ కెప్టెన్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తనదైన శైలిలో జట్టుకు ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతానంటూ రిజ్వాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం తర్వాత బాబర్ ఆజం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. షాన్ మసూద్ టెస్టులు, షాహిన్ ఆఫ్రిది టీ20 జట్టు కెప్టెన్లుగా నియమితులయ్యారు.అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలోనూ షాన్ మసూద్‌ను కొనసాగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ఆఫ్రిదిపై మాత్రం వేటువేసింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024కు ముందు బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఈసారి కూడా పాక్ మెగా టోర్నీలో విఫలం కావడంతో బాబర్ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించినట్లు పీసీబీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రిజ్వాన్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాంఈ నేపథ్యంలో రిజ్వాన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘గతంలో ఆస్ట్రేలియా గడ్డపై మేము ఇబ్బంది పడ్డామన్న మాట వాస్తవం. అయితే, ఈసారి మాత్రం అభిమానుల కలను నెరవేరుస్తాం. గత సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో చివరి వరకు విజయం మాదే అన్నట్లుగా పోరాటం సాగించాం. కానీ దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో ప్రతికూల ఫలితం వచ్చేది. నాడు చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్ చివరగా 2002లో ఆసీస్‌లో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నవంబరు 4- 18 వరకు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక వరుస వైఫల్యాల అనంతరం ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి 2-1తో గెలిచింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
పాక్‌తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్ జరిగే మూడు మ్యాచ్ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (అక్టోబర్ 28) ప్రకటించారు. 13 మంది సభ్యుల ఈ జట్టుకు కెప్టెన్‌ను ఎంపిక చేయలేదు. త్వరలో కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. గాయాల కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దృష్ట్యా టెస్ట్ జట్టు సభ్యులను పాక్‌తో సిరీస్ ఎంపిక చేయలేదు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ సైతం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.పాక్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు..సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాపాక్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20- నవంబర్ 14 (బ్రిస్బేన్)రెండో టీ20-నవంబర్ 16 (సిడ్నీ)మూడో టీ20- నవంబర్ 18 (హోబర్ట్)కాగా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును నిన్ననే ప్రకటించారు. పాక్ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్ -
పాకిస్తాన్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్..!?
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న పాకిస్తాన్ తమ తదుపరి సవాల్‌కు సిద్దమైంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ ఆసీస్ పర్యటనకు ముందు పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ను తమ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. జియో న్యూస్ ప్రకారం.. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై పీసీబీ నుంచి ఆధికారిక ప్రకటన వెలవడనుంది. ఇప్పటికే పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో రిజ్వాన్ సమావేశమైనట్లు సదరు మీడియా సంస్థ తమ కథనాల్లో పేర్కొంది.ఈ మీటింగ్‌లోనే పాక్ వన్డే, టీ20ల్లో పాక్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రిజ్వాన్ అంగీకరించినట్లు సమాచారం. ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ సూచన మేరకు రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ పాక్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.కాగా కెప్టెన్సీ పరంగా రిజ్వాన్‌కు అనుభవం ఉంది. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనప్పటకీ, పాకిస్తాన్ సూపర్ లీగ్, దేశీవాళీ టోర్నీల్లో నాయకత్వ పాత్ర పోషించాడు. పీఎస్ఎల్-2021లో అతడి సారథ్యంలోనే ముల్తాన్ సుల్తాన్ ముల్తాన్ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర వైఫల్యం తర్వాత పాక్ కెప్టెన్సీ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం తప్పుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో పాక్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.చదవండి: IND vs NZ: రెండో టెస్టులో ఘోర ఓటమి.. గౌతం గంభీర్ కీలక నిర్ణయం!? -
బాబర్ ఆజంకు సపోర్ట్ .. కట్ చేస్తే! జట్టులో నో ఛాన్స్?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా పాక్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌తో తలపడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం పాక్ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో తమ జట్టును ప్రకటించే అవకాశముంది. నవంబర్ 4న మెల్బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో పాక్ పర్యటన ప్రారంభం కానుంది.ఫఖార్ జమాన్‌పై వేటు?ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌పై పాక్ సెలక్షన్ కమిటీ వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను నుంచి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను అర్ధంతరంగా తప్పించడాన్ని జమాన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్ల తీరుపై ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు.భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ అతడు హితువు పలికాడు. దీంతో అతడిపై పీసీబీ సీరియస్ అయింది. ఇప్పటికే అతడికి పాక్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అంతటితో ఆగకుండా ఆసీస్ టూర్‌కు జమాన్‌ను ఎంపిక చేయకూడని పాక్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా జమాన్ ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో కూడా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. మోకాలి సమస్యలతో బాధపడుతున్న 34 ఏళ్ల జమాన్.. ఎనిమిది నిమిషాల్లో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడంలో విఫలమైనట్లు సమాచారం. ఆసీస్ టూర్‌కు జమాన్ వెళ్తాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. -
ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ వచ్చేశాడు! విధ్వంసకర వీరులు దూరం
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌తో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగి వన్డేల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే ప్రపంచ కప్ 2023 విజయం తర్వాత కమ్మిన్స్ వన్డేల్లో తొలిసారి ఆడనున్నాడు.పాట్ కమిన్స్‌తో పాటు వెటరన్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా దూరమయ్యాడు. మరోవైపు స్టార్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.గత కొంత కాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న వీరిద్దరికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. యువ ఆటగాళ్లు జాక్ ఫ్రెసర్ ముక్గర్క్, కూపర్ కొన్నోలీలు పాక్ సిరీస్‌కు ఎంపికయ్యారు. కాగా ఈ సిరీస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. నవంబర్ 4న మెల్బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో వన్డే నవంబర్ 8న ఆడిలైడ్‌లో రెండో వన్డే, నవంబర్ 10న పెర్త్‌లో ఆఖరి వన్డే జరగనుంది.ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిష్, జంపా -
రాణించిన యూనిస్ ఖాన్, మిస్బా.. ఆసీస్‌పై పాక్ విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ 2024లో భాగంగా నిన్న (జులై 3) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రాణించిన ఫించ్టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ఓ మోస్తరు స్కోర్ చేసింది. ఆరోన్ ఫించ్ (40 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కౌల్టర్ నైల్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. బెన్ డంక్ (27), ఫెర్గూసన్ (26 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సోహైల్ తన్వీర్, వాహబ్ రియాజ్, సయీద్ అజ్మల్ తలో వికెట్ దక్కించుకున్నారు.సత్తా చాటిన మిస్బా, యూనిస్190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్.. కెప్టెన్ యూనిస్ ఖాన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిస్బా ఉల్ హక్ (30 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 19.4 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. పాక్ ఇన్నింగ్స్‌లో షోయబ్ మక్సూద్ (21), షోయబ్ మాలిక్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్ లీ, కౌల్టర్ నైల్ చెరో 2 వికెట్లు.. జేవియర్ దోహర్తి ఓ వికెట్ పడగొట్టారు. -
కొవ్వు పేరుకుపోయింది: బాబర్‌పై మండిపడ్డ హఫీజ్
When the fat levels Checked Skin fold of all of them was high: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బ్యాటర్ బాబర్ ఆజం తీరును హెడ్‌కోచ్ మహ్మద్ హఫీజ్ విమర్శించాడు. మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్‌తో కలిసి జట్టును భ్రష్టుపట్టించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు క్రమశిక్షణ లేకుండా తయారు కావడానికి బాబర్, మిక్కీ కారణమని హఫీజ్ మండిపడ్డాడు. వరల్డ్‌కప్‌లో వైఫల్యం కాగా మిక్కీ ఆర్థర్ మార్గదర్శనంలో బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్‌కప్-2023లో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్లో కనీసం సెమీస్ కూడా చేరుకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. హెడ్‌కోచ్ మిక్కీ ఆర్థర్‌పై వేటు పడింది. ఈ క్రమంలో మహ్మద్ హఫీజ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. అంతేకాదు హెడ్‌కోచ్ బాధ్యతలనూ తానే చేపట్టాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చేదు అనుభవం ఇక బాబర్ స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో కొత్త నాయకత్వంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాక్.. న్యూజిలాండ్ టూర్లో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో తనకు ఓ విచిత్రమైన విషయం తెలిసిందంటూ మహ్మద్ హఫీజ్ తాజాగా వెల్లడించాడు. బాబర్ ఆజం, మిక్కీ ఆర్థర్ కలిసి ఫిట్నెస్ విలువలు గాలికొదిలేసిన తీరు తెలిసి ఆశ్చర్యపోయానన్నాడు. ఈ మేరకు.. ‘‘ఆస్ట్రేలియాకు వెళ్లినపుడు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు చెప్పాను. ట్రైనర్‌తో కూడా ఇదే మాట అన్నాడు. కానీ అప్పుడతడు నాకో షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆర్నెళ్ల క్రితం అప్పటి కెప్టెన్, డైరెక్టర్.. ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయొద్దని చెప్పారన్నాడు. వారి శరీరాల్లో కొవ్వు పేరుకుపోయింది ఆటగాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలని వాళ్లిద్దరు తనను ఆదేశించారన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్ల ఫిట్నెస్ లెవల్స్ చెక్ చేయిస్తే.. ఉండాల్సిన దాని కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ కొవ్వు వారి శరీరాల్లో పేరుకుపోయినట్లు తెలిసింది. చాలా మంది అన్‌ఫిట్‌గా ఉన్నారు. కొంతమంది కనీసం 2 కిలోమీటర్ల ట్రయల్ రన్ కూడా పూర్తిచేయలేకపోయారు. ఆర్నెళ్ల క్రితం వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను తారుమారు చేశాను. ఫిట్‌గా లేకుంటే ఓడిపోతూనే ఉంటారని ఆటగాళ్లను హెచ్చరించాను’’ అని మహ్మద్ హఫీజ్ ‘ఏ’ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం పాక్ ప్రధాన ఆటగాళ్లంతా పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. చదవండి: Ind Vs Eng 4th Test: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్ సిగ్నల్! -
ఉత్కంఠ పోరులో విజయం.. సెమీ ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్
అండర్ 19 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బెనోని వేదికగా బంగ్లాదేశ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించిన పాక్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 35.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. పాక్ విజయంలో పేసర్ ఉబైడ్ షా కీలక పాత్ర పోషించాడు. ఉబైడ్ షా 5 వికెట్లు పడగొట్టి పాక్‌ను సెమీస్‌కు చేర్చాడు. ఉబైడ్ షాతో పాటు అలీ రజా 3 వికెట్లు, జీషన్ ఒక్క వికెట్ సాధించాడు. బంగ్లా బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్(26) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కూడా 40.4 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. ఆల్‌రౌండర్ అరాఫత్ మిన్హాస్(34) రాణించడంతో నామమాత్రపు స్కోరైనా పాక్ సాధించగల్గింది. బంగ్లా బౌలర్లలో షేక్ పావెజ్ జిబోన్, రోహనత్ డౌల్లా బోర్సన్ తలా 4 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. అదే విధంగా తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, భారత్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. -
వార్నర్ ‘గ్రేట్’ కాదు.. ఆ జాబితాలో వాళ్లు ముగ్గురే: ఆసీస్ మాజీ కోచ్
ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ఆ జట్టు మాజీ కోచ్ జాన్ బుకానన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ మెరుగైన బ్యాటరేనని.. అయితే, అంత గొప్ప ఆటగాడేమీ కాదని అన్నాడు. ఆసీస్ గ్రేట్ అన్న జాబితాలో అతడికి చోటు దక్కే ప్రసక్తే లేదన్నాడు. కాగా ఆసీస్ ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు సాధించిన వార్నర్ ఇటీవలే టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో సంప్రదాయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన అతడు ఇకపై టీ20లకు మాత్రమే పరిమితం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతున్న సందర్భంగా ఆసీస్ మాజీ కోచ్ జాన్ బుకానన్కు వార్నర్‌ను ‘గ్రేట్’ అనొచ్చా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. నేనైతే అలా అనుకోవడం లేదు. తన కెరీర్ ఆసాంతం అతడు అద్భుతంగా ఆడాడు. వందకు పైగా టెస్టులు ఆడిన అనుభవం అతడికి ఉంది. 8 వేలకు పైగా పరుగులు సాధించాడు. 160కి పైగా వన్డేలు, 100 వరకు టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో అతడి బ్యాటింగ్ సగటు కూడా బాగానే ఉంది. స్ట్రైక్ రేటు కూడా బాగుంది. ప్రదర్శనపరంగా అతడు మెరుగైన స్థానంలో ఉన్నాడు. అయితే, ఒక క్రీడలో దిగ్గజాల గురించి చెప్పాల్సి వచ్చినపుడు నా వరకైతే ఆసీస్ తరఫున డాన్ బ్రాడ్‌మన్, గ్లెన్ మెగ్రాత్, షేన్ వార్న్ వంటి వాళ్లే గుర్తుకువస్తారు. నా దృష్టిలో వాళ్లు ముగ్గురే గ్రేట్ ప్లేయర్లు. మిగతా వాళ్లలో చాలా మంది వీరికి చేరువగా వచ్చిన గ్రేట్ కేటగిరీలో చోటు సంపాదించలేరు. వార్నర్ కూడా అంతే’’ అని బుకానన్ చెప్పుకొచ్చాడు. కాగా తన కెరీర్లో ఆఖరి సిరీస్‌లో వార్నర్ శతకం బాదాడు. ఇక పాక్‌తో జరిగిన ఆ సిరీస్‌లో ఆసీస్ 3-0తో వైట్‌వాష్ చేసింది. సొంతగడ్డపై పాకిస్తాన్‌పై వరుసగా పదిహేడవ విజయం నమోదు చేసింది. -
క్యూరేటర్ నుంచి ఆసీస్ స్పిన్ లెజెండ్‌గా.. ఏకంగా షేన్ వార్న్ సరసన!
ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానం.. తర్వాతి మ్యాచ్ కోసం క్యురేటర్ల బృందం పిచ్ తయారు చేస్తోంది. అందులో ఒక 24 ఏళ్ల కుర్రాడు అమితోత్సాహంతో అందరికంటే వేగంగా చకచకా పని పూర్తి చేస్తున్నాడు. ముఖ్యంగా పిచ్ చివర్లో స్టంప్స్ వద్ద స్పిన్ బంతి టర్నింగ్‌కు సంబంధించి సహచరులకు ప్రత్యేక సూచనలు ఇస్తూ వాటరింగ్ చేయిస్తున్నాడు. అతను కొన్నాళ్ల క్రితమే ఆ మైదానానికి బదిలీపై వచ్చాడు. అంతకు ముందు నాలుగేళ్ల పాటు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ గ్రౌండ్లోనూ ఇదే పని చేశాడు. పిచ్ తయారీపై బేసిక్స్ నేర్చుకొని అక్కడే పూర్తి స్థాయిలో శిక్షణ కూడా పొందాడు. అయితే క్యురేటర్‌గా అనుభవం మాత్రమే కాదు ఒక ఆటగాడి తరహాలో అతనికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ అడిలైడ్‌లోని కోచ్‌లను ఆకర్షించింది. అనంతరం జట్లు ప్రాక్టీస్‌కు సిద్ధమైనప్పుడు నెట్ బౌలర్లు తక్కువ పడటంతో నువ్వు బౌలింగ్ చేయగలవా అని కోచ్ డారెన్ బెరీ ఈ కుర్రాడిని అడిగాడు. కచ్చితంగా అని బదులిచ్చిన అతను వెంటనే బంతితో బరిలోకి దిగిపోయాడు. అతని స్పిన్ బౌలింగ్ శైలి, టర్నింగ్ రాబడుతున్న తీరు కోచ్‌ను అమితాశ్చర్యానికి గురి చేశాయి. అతని వివరాలను తెలుసుకోగా.. తాను అప్పటికే చాలా చోట్ల క్రికెట్ ఆడానని, అయితే అవేవీ గుర్తింపు పొందిన స్థాయిలో కాదని ఆ బౌలర్ చెప్పాడు. దాంతో నీకు తగిన అవకాశం కల్పిస్తానన్న కోచ్ బెరీ మాట తప్పలేదు. అతని ప్రతిభ గురించి అందరికీ చెప్పి అడిలైడ్ టి20 టీమ్ రెడ్బ్యాక్స్లోకి ఎంపిక చేశాడు. అంతే.. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తొలి అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని సత్తా చాటడంతో వరుసగా మ్యాచ్‌లు దక్కాయి. ఆపై ఫార్మాట్ మారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడే అవకాశమూ లభించింది. దానిని అందిపుచ్చుకొని ఆ బౌలర్ ఉవ్వెత్తున ఎగశాడు. ఏడు నెలల వ్యవధిలోనే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత పుష్కరకాలంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఆ బౌలర్ పేరే నాథన్ లయన్. క్యురేటర్‌గా మొదలై టెస్టుల్లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందడం వరకు ఆఫ్‌స్పిన్నర్ లయన్ సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. స్టూవర్ట్ మెక్‌గిల్, మైకేల్ బీర్, డోహర్తి, క్రేజా, మెక్‌గెయిన్, హారిట్జ్, స్టీవ్ స్మిత్, హాగ్, హాలండ్, వైట్, కాసన్.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మందితో కూడిన జట్టు ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ షేన్ వార్న్ రిటైర్మెంట్ తర్వాత ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్వేషణ సుదీర్ఘంగా సాగింది. ఆ ప్రయత్నంలో భాగంగా వారు ప్రయత్నించిన 11 మంది స్పిన్నర్ల పేర్లు ఇవి. కానీ ఇందులో ఏ ఒక్కరూ ప్రతిభపరంగా వార్న్ దరిదాపుల్లోకి రావడం అటుంచి.. కనీసం పోలికకు కూడా అర్హత లేని స్థాయి వారిది. అందుకే ఎన్ని అవకాశాలు కల్పించినా ప్రతిభను చూపించలేక అతి తక్కువ సమయంలోనే కనుమరుగైపోయారు. వార్న్ స్థాయిలో కాకపోయినా, కనీసం ఉపఖండంలో సిరీస్‌లు ఆడేందుకు వెళ్లినప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్లుగా కొంతయినా ప్రభావం చూపించేవాడు ఉంటే చాలని ఆసీస్ క్రికెట్ భావించినా.. అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఇక స్పిన్నర్ల వేటను మానేసి ఆస్ట్రేలియా జట్టు ప్రపంచవ్యాప్తంగా ఏ మైదానంలో ఆడినా తమ పేసర్ల బలాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగుతూ వచ్చింది. అలాంటి సమయంలో నాథన్ లయన్ వచ్చాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సంప్రదాయ స్పిన్ బౌలింగ్, క్లాసికల్‌గా బంతిని ఫ్లయిట్ చేయడానికి ఇష్టపడే స్పిన్నర్‌గా లయన్ వెలుగులోకి వచ్చాడు. ఇలాంటి స్పిన్నర్లు సాధారణంగా ఉపఖండంలోనే గుర్తింపు దక్కించుకుంటారు. కానీ ఆసీస్‌కు లయన్ రూపంలో అలాంటి ఆటగాడు దక్కాడు. అందుకే వారు అతడిని కళ్లకు అద్దుకొని జట్టులోకి తీసుకున్నాడు. లయన్ కూడా తన ఎంపికకు న్యాయం చేస్తూ వారిని ఎప్పుడూ నిరాశపరచలేదు. అటు ఉపఖండం పిచ్‌లపై కూడా సత్తా చాటడంతో పాటు స్పిన్‌ను ఏమాత్రం అనుకూలించని ఆసీస్ మైదానాల్లోనూ ప్రత్యర్థులపై చెలరేగి తాను లేకుండా ఆసీస్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడలేని స్థాయికి చేరుకున్నాడు. వార్న్‌కు సరైన వారసుడినని నిరూపించుకుంటూ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఏకంగా 500 టెస్టు వికెట్లతో ఇప్పుడు శిఖరాన నిలిచాడు లయన్. అలా మొదలైంది.. 2011, సెప్టెంబర్ 1.. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు. లయన్ తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్‌కు దిగాడు. రౌండ్ ద వికెట్‌గా వచ్చి బంతిని సంధించాడు. గ్రిప్, ఫ్లయిట్, టర్న్, బౌన్స్.. అనూహ్యంగా వచ్చిన బంతిని ఆడలేక లంక దిగ్గజం సంగక్కర గందరగోళానికి గురయ్యాడు. బ్యాట్‌ను తాకిన బంతి స్లిప్స్‌లో కెప్టెన్ క్లార్క్ చేతుల్లో పడింది. అంతే.. అటు లయన్‌తో పాటు ఇటు ఆసీస్ బృందంలో సంబరాలు. టెస్టు క్రికెట్లో వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన జాబితాలో లయన్‌కు చోటు లభించింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో అతనికి ఘనారంభం దొరికింది. అద్భుతంగా మొదలైన కెరీర్ ఆపై మరిన్ని ఘనతల దిశగా సాగింది. నాలుగేళ్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా తరఫున వికెట్లపరంగా అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్‌గా లయన్ గుర్తింపు తెచ్చేసుకున్నాడు. యాషెస్‌తో మేలిమలుపు.. ఆటలో ఎంత సత్తా ఉన్నా, అద్భుతాలు చేసే నైపుణ్యం ఉన్నా ఆటగాళ్లకు తగిన అవకాశం, సరైన వేదిక ఎంతో ముఖ్యం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లకు సంబంధించి యాషెస్ సిరీస్ అలాంటిదే. ఈ చిరకాల ప్రత్యర్థుల జట్లలో ఎంతో మంది ఆటగాళ్లను యాషెస్ సిరీస్ హీరోలను చేస్తే, మరెంతో మందిని జీరోలను చేస్తుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటున్న క్రమంలో 2011 యాషెస్ సిరీస్ కోసం లయన్‌కు చాన్స్ లభించింది. ఎంతో ఉత్సాహంతో తన టాలెంట్ చూపించేందుకు లయన్ సిద్ధం కాగా, వేర్వేరు పరిస్థితులను కారణాలుగా చూపుతూ టీమ్ మేనేజ్మెంట్ తొలి రెండు టెస్టుల్లో అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది. అయితే తర్వాతి మూడు టెస్టుల్లో అవకాశం సాధించి కీలక దశలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన లయన్ రెండు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి ఆసీస్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన రిటర్న్ యాషెస్ సిరీస్‌తో లయన్ విలువేమిటో ఆసీస్ మేనేజ్మెంట్కు బాగా తెలిసొచ్చింది. సొంత గడ్డపై 19 వికెట్లతో సత్తా చాటిన లయన్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడా తన స్పిన్ పదును చూపించడంలో అతను సఫలమయ్యాడు. ఆ తర్వాత 2022లో గాయం కారణంగా ఒక మ్యాచ్ దూరమయ్యే వరకు లయన్ లేకుండా ఆస్ట్రేలియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదంటే అతిశయోక్తి కాదు. ఆసీస్ దిగ్గజంగా ఎదిగి.. షేన్‌వార్న్ తర్వాత ఆస్ట్రేలియా అత్యుత్తమ స్పిన్నర్‌గా లయన్‌కు ఎప్పుడో గుర్తింపు దక్కింది. స్పిన్నర్లకు వికెట్లే దక్కవని భావించే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లాంటి దేశాల్లో కూడా అతను పెద్ద సంఖ్యలో వికెట్లు పడగొట్టాడు. కానీ ఏదో అసంతృప్తి. అతడిని ప్రత్యేకంగా నిలబెట్టే మరి కొన్ని ప్రదర్శనలు కావాలి. ఒక స్పిన్నర్ గుర్తింపు దక్కించుకునేందుకు భారత్‌కంటే సరైన వేదిక ఏముంటుంది. భారత గడ్డపై సత్తా చాటి స్పిన్‌కు అనుకూలించే మైదానాలే అయినా భారతీయేతర స్పిన్నర్లు ఎవరూ ఇక్కడ తమదైన ముద్ర వేయలేకపోయారు. ఇక్కడా రాణిస్తే అతని కీర్తి రెట్టింపవుతుంది. లయన్ సరిగ్గా అదే చేసి చూపించాడు. భారత గడ్డపై ఆడిన 11 టెస్టుల్లో కేవలం 27.35 సగటుతో 56 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన విదేశీ బౌలర్‌గా నిలిచాడు. అతని కెరీర్ సగటు (30.85) కంటే ఇది తక్కువ కావడం విశేషం. షేన్ వార్న్ సరసన లయన్ కెరీర్లో మూడు అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (8/50, 8/64, 7/94) భారత దేశంలోనే వచ్చాయి. లయన్ సాధించిన ఈ తొలి 8 వికెట్ల ప్రదర్శనకు బెంగళూరు వేదికైంది. సొంత గడ్డపై కంటే విదేశాల్లోనే ఎక్కువ వికెట్లు (258) సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో లయన్ కూడా ఉన్నాడు. కాగా స్వదేశంలో ఇటీవల పాకిస్తాన్ మూడో టెస్టు(2024) సందర్భంగా 250 వికెట్ల మైలురాయి అందుకుని షేన్ వార్న్ సరసన నిలిచాడు లయన్. ఆసీస్ ఓడిన మ్యాచ్‌లలో తీసిన వికెట్లకంటే (138) ఆ జట్టు గెలిచిన మ్యాచ్‌లలో అతను పడగొట్టిన వికెట్లు (301) అతని విలువను చూపిస్తూ దిగ్గజ స్థాయిని అందించాయి. ఆస్ట్రేలియా జట్టు అవసరాలు, కూర్పు కారణంగా లయన్ వన్డే కెరీర్ 29 మ్యాచ్‌లకే పరిమితం అయినా.. టెస్టుల్లో అతని కీర్తి శాశ్వతం. 36 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌తో చెలరేగుతున్న లయన్ టెస్టు క్రికెట్లో మున్ముందు మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్కు ఆస్ట్రేలియా.. మరి భారత్?
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 56.25 శాతం పాయింట్లతో కంగారూ జట్టు.. నాలుగో స్ధానం నుంచి టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా.. ఐదింట విజయం, ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. కాగా ఇప్పటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న భారత్( 54.16 శాతంతో) రెండో స్ధానానికి పడిపోయింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు తొలి స్ధానానికి చేరుకుంది. అయితే భారత్ టాప్ ప్లేస్‌ను 24 గంటల వ్యవధిలోనే కోల్పోయింది. ఇక భారత్ తర్వాతి స్ధానాల్లో బాకింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్(50.0), బంగ్లాదేశ్(50.0) పాకిస్తాన్(45.83) కొనసాగుతున్నాయి. చదవండి: PAK vs AUS: కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్ -
కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన 13 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు ముగింపు పలికాడు. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్ నుంచి వార్నర్ తప్పుకున్నాడు. తన ఫేర్వెల్ సిరీస్ తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన వార్నర్.. తన కెరీర్ చివరి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో (75 బంతుల్లో 7 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీ సాధించాడు. ఆసీస్ విజయానికి చేరువైన సమయంలో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ ఎల్బీగా వెనుదిరాడు. మైదానాన్ని వీడి వెళ్తున్న క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు వార్నర్‌ను అభినందించారు. అదే విధంగా స్టేడియంలోని ప్రేక్షకులు సైతం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన వార్నర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వార్నర్ కన్నీరు పెట్టుకున్నాడు. "విజయంతో నా కెరీర్‌ను ముగించాలనుకున్నాను. నా కల నిజమైంది. మేము 3-0తో విజయం సాధించాము. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు గత 2 ఏళ్ల నుంచి అద్బుతమైన క్రికెట్ ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజయం, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచ కప్ విజయాల్లో భాగమైనందుకు గర్వపడుతున్నాను. కొంత మంది లెజెండరీ క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టంగా భావిస్తున్నానని"వార్నర్ పేర్కొన్నాడు. తన టెస్టు కెరీర్లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ranji Trophy: చరిత్ర సృష్టించిన రాహుల్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! రెండో ఆటగాడిగా David Warner got emotional and crying when he was giving his interview. An emotional moment for him🫶 pic.twitter.com/BhXAsl2PQj — CricGuru (@Cse1Das) January 6, 2024 -
ముగిసిన వార్నర్ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ?
ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు విడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం రెడ్‌బాల్ క్రికెట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్ల సైతం వార్నర్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఇక మూడో టెస్టులో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. ఈ విజయంతో వార్నర్‌కు ఆసీస్ ఘనమైన విడ్కోలు పలికింది. తన చివరి టెస్టు ఇన్నింగ్స్‌ను వార్నర్ హాఫ్ సెంచరీతో ముగించాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. కివీస్‌తో మొదలెట్టి పాక్‌తో ముగింపు.. 2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్.. 13 ఏళ్ల పాటు తన సేవలను ఆస్ట్రేలియా క్రికెట్‌కు అందించాడు. తన ఈ సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో డేవిడ్ భాయ్ భాగమయ్యాడు. ఓపెనర్‌గా ఎన్నో చిర్మసరణీయ విజయాలను కంగరూలకు అందించాడు. ఫార్మాట్ ఏదైనా వార్నర్ క్రీజులో ఉంటే ప్రత్యర్ధి బౌలర్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అటువంటి విధ్వంసకర ఆటగాడు తప్పుకోవడం నిజంగా క్రికెట్ ఆస్ట్రేలియాకు తీరని లోటు అనే చెప్పాలి. తన టెస్టు కెరీర్లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 44. 59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 26 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. మాయని మచ్చలా.. అయితే వార్నర్‌కు తన అద్భుత కెరీర్లో బాల్‌టాంపరింగ్ వివాదం మాత్రం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ సమయంలో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్ చేసి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన అతడిపై విచారణ జరపగా.. అందులో వార్నర్ హస్తం ఉందని తేలింది. దాంతో వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేదం విధించింది. తర్వాత అతడిపై బ్యాన్ ఎత్తివేసినప్పటికీ.. ఆ వివాదం ఓ పీడకలలా మిగిలిపోయింది. కాగా వార్నర్ టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై టీ20ల్లో మాత్రమే వార్నర్ ఆడనున్నాడు. చదవండి: AUS vs PAK 3rd Test: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్‌స్వీప్ One final time.#AUSvPAK pic.twitter.com/gbD9Fv28h8 — cricket.com.au (@cricketcomau) January 6, 2024 -
పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్.. సిరీస్ క్లీన్‌స్వీప్
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్‌స్వీప్ చేసింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తన టెస్టు కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్ లబుషేన్(62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక 68/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని ఆసీస్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని పాక్ నిలిపింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ 4 వికెట్లతో పాక్‌ను దెబ్బతీయగా.. లయోన్ 3 వికెట్లు, స్టార్క్, కమ్మిన్స్, హెడ్ తలా వికెట్ సాధించారు. కాగా అంతకముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో లబుషేన్(60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లబుషేన్‌తో పాటు మిచెల్ మార్ష్(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. -
ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్‌రౌండర్
ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్‌కు ఓ ఆణిముత్యం లభించింది. ఈ పర్యటనలో తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన 27 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్.. ఆసీస్ గడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 6 వికెట్ల ప్రదర్శనతో (మొత్తంగా 7 వికెట్లు, 10 పరుగులు) చెలరేగిన జమాల్.. ఆ తర్వాత మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్ట్‌లో 5 వికెట్లు, 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న జమాల్.. తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపు అర్ధ సెంచరీ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించిన జమాల్.. ఆతర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి (6/69) ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను తునాతునకలు చేశాడు. జమాల్ ప్రదర్శన కారణంగా పాక్ ఈ పర్యటనలో తొలిసారి మ్యాచ్ గెలిచే అవకాశం దక్కించుకుంది. అయితే పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జమాల్ అందించిన సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో జమాల్ (0) ఇంకా క్రీజ్‌లోనే ఉండటంతో పాక్ అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది. అతనికి జతగా రిజ్వాన్ (6) క్రీజ్‌లో ఉన్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జమాల్ సహా రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53) రాణించడంతో పాక్ 313 పరుగులు చేసింది. అనంతరం జమాల్ ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేసిన పాక్ సంచలన ఆల్‌రౌండర్ పాక్ సంచలన ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్.. దిగ్గజ ఆల్‌రౌండర్లైన ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్ సరసన చేరాడు. ఆస్ట్రేలియా గడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 125 అంత కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 15 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన పర్యాటక జట్టు ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బోథమ్, వసీం అక్రమ్ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. స్కోర్ వివరాలు.. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్: 313 ఆలౌట్ (రిజ్వాన్ 88, జమాల్ 82, కమిన్స్ 5/61) ఆస్ట్రేలియా తొల ఇన్నింగ్స్: 299 ఆలౌట్ (లబూషేన్ 60, మిచెల్ మార్ష్ 54, జమాల్ 6/69) పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్: 68/7 (సైమ్ అయూబ్ 33, రిజ్వాన్ 6 నాటౌట్, జమాల్ 0 నాటౌట్, హాజిల్‌వుడ్ 4/9) మూడో రోజు ఆట ముగిసే సమయానికి 82 పరుగుల ఆధిక్యంలో పాక్ మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
టీమిండియాతో పోటీపడిన పాక్.. భారత్ 0/6.. పాక్ 9/6
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయిన ఘటన మరువక ముందే.. దాయాది పాకిస్తాన్ దాదాపుగా ఇలాంటి సీన్‌నే మరోసారి రిపీట్ చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పాక్ తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి, ఏ విషయంలోనైనా వారు భారత్‌నే ఫాలో అవుతారనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల పుణ్యమా అని తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. ఆరో నంబర్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (88), ఏడో నంబర్ ఆటగాడు అఘా సల్మాన్ (53), తొమ్మిదో నంబర్ ప్లేయర్ ఆమిర్ జమాల్ (82) అర్ధసెంచరీలు చేసి పాక్‌ను ఆదుకున్నారు. అనంతరం ఆమిర్ జమాల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (6/69) తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 299 పరుగులకే పరిమితం చేసి, ప్రస్తుత సిరీస్‌లో పాక్‌కు తొలి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే పాక్ బ్యాటర్లు ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఆతర్వాత తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 67/7గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం చాలా కష్టం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-9-4) పాక్‌ను కష్టాల ఊబిలోకి నెట్టాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన ఆసీస్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్ ఈ మ్యాచ్ కూడా ఓడితే ఆసీస్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. -
ఆసీస్‌తో మూడో టెస్టు.. 68 పరుగులకే 7 వికెట్లు! పీకల్లోతు కష్టాల్లో పాక్
సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు. హాజిల్‌వుడ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు 14 పరుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాకిస్తాన్.. కేవలం 68 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ రిజ్వాన్(6), అమీర్ జమాల్(0) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా.. హెడ్, లయోన్, స్టార్క్ తలా వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యంతో కలుపుకుని 82 పరుగుల ముందుంజలో పాక్ ఉంది. అంతకుముందు 116/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబుషేన్(60) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లబుషేన్‌తో పాటు మిచెల్ మార్ష్(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమీల్ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Aus Vs Pak: జారిపడ్డ పాక్ ఫీల్డర్!.. 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు? వీడియో -
క్యాప్‌తో బంతిని ఆపాడు!?.. పాక్‌కు 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు?
Australia vs Pakistan, 3rd Test- Day 3: అరంగేట్ర టెస్టుతోనే పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే, అద్భుత బ్యాటింగ్‌తో అతడు ట్రెండింగ్‌లోకి వచ్చాడనుకుంటే పొరపాటేనండోయ్! మరి హాట్‌టాపిక్‌లా మారడానికి అంత ‘గొప్ప’గా ఈ యంగ్ క్రికెటర్ ఏం చేశాడు?! ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ నామమాత్రపు ఆఖరి టెస్టులో సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించింది. సిడ్నీ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో అతడు డకౌట్‌గా వెనుదిరిగి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు. అప్పుడు ఈజీ క్యాచ్ వదిలేశాడు అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలతోనూ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి సొంతజట్టు అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాగా. కేవలం 33 పరుగులకే పరిమితమయ్యాడు 21 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఓపెనర్. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంకా నయం.. గాయపడలేదు ఈ పరిణామాల క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సయీమ్ ఆయుబ్.. తాజాగా మైదానంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. సిడ్నీ అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఫీల్డింగ్ చేసే క్రమంలో జర్రున జారి పడ్డాడు ఆయుబ్. అయితే, అదృష్టవశాత్తూ అతడికి ఎటువంటి గాయం కాలేదు. దీంతో పాక్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. క్యాప్‌తో బంతిని ఆపాడు? అయినా పెనాల్టీ లేదెందుకు? శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో... నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. స్టీవ్ స్మిత్ బాదిన బంతిని ఆపే క్రమంలో జారిపడ్డ ఆయుబ్ క్యాప్ బాల్‌ను బౌండరీకి వెళ్లకుండా అడ్డుపడింది. దీంతో నిబంధనల ప్రకారం.. బ్యాటింగ్ చేస్తున్న జట్టు అంటే ఆస్ట్రేలియాకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు రావాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ‘‘ఎవరైతే పెనాల్టీ పరుగుల గురించి అడుగుతున్నారో వారి కోసం ఈ జవాబు: క్యాప్ కారణంగా బంతి బౌండరీ వెళ్లకుండా ఆగిపోయినప్పటికీ.. ఇది యాక్సిడెంటల్‌గా జరిగిన పరిణామం. ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అందుకే బ్యాటింగ్ జట్టుకు పెనాల్డీ పరుగులు రాలేదు’’ అని ప్రకటన విడుదల చేసింది. ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: T20 WC: అగార్కర్ ఒప్పించేశాడు.. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ!? For those asking: It's not a five-run penalty for hitting the cap as the contact between ball and hat was accidental, and nor was the cap deliberately left on the field, as helmets tend to be #AUSvPAK https://t.co/BFcgfoKnnT — cricket.com.au (@cricketcomau) January 5, 2024 -
Aus Vs Pak: ఈజీ క్యాచ్ వదిలేశాడు.. తలపట్టుకున్న బాబర్! వీడియో
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌లలో సులువైన క్యాచ్‌లు వదిలేసి పాక్ భారీ మూల్యం చెల్లించిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ జారవిడిచాడు. అదే విధంగా.. మెల్బోర్న్లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ డేవిడ్ వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. ఇలా కీలక సమయాల్లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపే ఛాన్స్ మిస్ చేసుకున్న పాకిస్తాన్.. ఆయా మ్యాచ్‌లలో 360, 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా సిరీస్ కోల్పోవడమే గాకుండా కంగారూ గడ్డపై వరుసగా 16 టెస్టుల్లో ఓడి తమ చెత్త రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన షాన్ మసూద్ బృందం తొలుత బ్యాటింగ్ చేసి.. 313 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో మొదటిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 6/0తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టే ఛాన్స్ పాకిస్తాన్‌కు వచ్చింది. గురువారం నాటి ఆటలో పద్నాలుగో ఓవర్ రెండో బంతికి ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను సయీమ్ ఆయుబ్ మిస్ చేశాడు. వార్నర్ బంతిని గాల్లోకి లేపగా ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆయుబ్.. బాల్‌ను రెండు చేతులతో ఒడిసిపట్టినట్టే పట్టి జారవిడిచేశాడు. దీంతో పక్కనే ఉన్న బాబర్ ఆజం తీవ్ర అసహనానికి గురయ్యాడు. సులువైన క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన వార్నర్ మరోసారి ప్రమాదకారిగా మారుతాడేమోనన్న భయంతో తలపట్టుకుని కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వార్నర్ క్యాచ్ మిస్ చేసిన పాక్ అరంగేట్ర బ్యాటర్ సయీమ్ ఆయుబ్‌పై సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. బ్యాటర్‌గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్ చేయడం కూడా రాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా సిడ్నీ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆయుబ్.. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. ఆయుబ్ క్యాచ్ చేసే సమయానికి వార్నర్ 20 పరుగులతో ఆడుతున్నాడు. అయితే, 24.3వ ఓవర్ వద్ద ఆగా సల్మాన్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్(34) వెనుదిరిగాడు. చదవండి: Ind Vs SA 2nd Test: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం It's happened again! 😲 David Warner gets a life courtesy of the debutant Saim Ayub #AUSvPAK pic.twitter.com/VAr7bBis6L — cricket.com.au (@cricketcomau) January 4, 2024 -
వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిన రెండో రోజు ఆట
Australia vs Pakistan, 3rd Test Day 2: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా రెండో రోజు కేవలం 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు షఫీక్ (0), అయూబ్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ షాన్ మసూద్ (35; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (26; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడారు. ఒక దశలో స్కోరు 96/5కి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (88), ఆగా సల్మాన్ (53) సల్మాన్ ఆరో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాక్ ఇక సులువుగానే తలవంచుతుందని ఆసీస్ భావించింది. కానీ పేస్ ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాటింగ్‌లో వీరోచిత పోరాటం చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 77.1 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆట నిలిచే సమయానికి 6/0(2) స్కోరు చేసింది. ఈ క్రమంలో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 24.3 ఓవర్ వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(34) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కానీ అర్ధ శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న ఖవాజా(47)ను ఆమిర్ జమాల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 47వ ఓవర్ ముగిసే సరికి మొదలైన వర్షం తెరిపినివ్వలేదు. దీంతో అక్కడితో ఆటను ముగించేశారు. అప్పటికి లబుషేన్ 23, స్టీవ్ స్మిత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆగా సల్మాన్, ఆమిర్ జమాల్‌కు చెరో వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
ఆసీస్‌తో మూడో టెస్ట్.. పాక్ లోయర్ ఆర్డర్ అద్భుత పోరాటం
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది. 96 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశ నుంచి పాక్ అద్భుతంగా తేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మొహమ్మద్ రిజ్వాన్ (88), అఘా సల్మాన్ (53), ఆమిర్ జమాల్ (82) వీరోచితంగా పోరాడి పాక్ పరువు కాపాడారు. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్ డకౌట్లు కాగా.. షాన్ మసూద్ (35), బాబర్ ఆజమ్ (26) కాసేపు ఆసీస్ బౌలర్లను నిలువరించారు. ఆతర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సౌద్ షకీల్ (5) ఔట్ కావడంతో పాక్ కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వాన్.. అఘా సల్మాన్, ఆమిర్ జమాల్ సహకారంతో పాక్‌కు ఫైటింగ్ టోటల్‌ను అందించాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమిర్ జమాల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5/61) చెలరేగి పాక్ వెన్నువిరచగా.. స్టార్క్ (2/75), హాజిల్‌వుడ్ (1/65), లయోన్ (1/74), మార్ష్ (1/27) మిగతా పనిని కానిచ్చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ 6, ఉస్మాన్ ఖ్వాజా 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
Aus Vs Pak: ఐదు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. పాక్ ఆలౌట్
Australia vs Pakistan, 3rd Test Day 1 Report: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలినా.. మహ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఆమెర్ జమాల్ అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ 300 పరుగుల మార్కును అందుకోగలిగింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు టెస్టు సిడ్నీ వేదికగా బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్‌ను జోష్ హాజిల్‌వుడ్ డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్(35).. బాబర్ ఆజంతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాబర్‌ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్‌ను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులతో రాణించాడు. అతడి తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆగా సల్మాన్ మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు అవుట్ కాగానే పాక్ సులువుగానే తలవంచుతుందని భావించిన కమిన్స్ బృందానికి ఆల్‌రౌండర్ ఆమెర్ జమాల్ షాకిచ్చాడు. తొమ్మిద స్థానంలో బరిలోకి దిగిన అతడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ 97 బంతుల్లో 82 పరుగులు రాబట్టాడు. అయితే, నాథన్ లియోన్ అద్బుత బంతితో అతడిని బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి రోజు ఆటలో భాగంగా 77.1 ఓవర్లలో 313 పరుగుల వద్ద పాక్ జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ రెండు, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బుధవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు పాకిస్తాన్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం మొదటి రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆసీస్ పాక్ కంటే 307 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ ఆరు, ఉస్మాన్ ఖవాజా సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. -
మహ్మద్ హఫీజ్‌ను వదలట్లేదు.. మొన్న అలా.. ఇప్పుడిలా సెటైర్!
Australia vs Pakistan, 3rd Test: పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్‌ను ఐస్లాండ్ క్రికెట్ మరోసారి ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియన్ ఎయిర్‌లైన్స్ కూడా హఫీజ్‌ను ఇబ్బంది పెడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన షాన్ మసూద్ బృందం.. తొలి రెండింటిలో ఓడిపోయింది. పెర్త్‌లో ఏకంగా 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. మెల్బోర్న్ టెస్టులో పోరాడగలిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరుపై పాక్ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రిజ్వాన్ అవుటైన తీరుపై రచ్చ ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బంతి రిజ్వాన్ రిస్ట్‌బ్యాండ్‌ను తాకినట్లుగా కనిపించడంతో అతడు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కాన్ఫిడెంట్‌గా ఉన్న కమిన్స్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. పాకిస్తాన్ కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయి 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, అంపైర్ల తప్పిదాల వల్లే తాము ఓడిపోయామంటూ పాక్ మాజీ క్రికెటర్, జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి మెల్బోర్న్లో తాము ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చామంటూ ప్రత్యర్థి జట్టు ఆట తీరును విమర్శించాడు. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు ఆసీస్ ఎయిర్‌లైన్స్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐస్లాండ్ క్రికెట్ హఫీజ్‌పై సెటైరికల్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ అత్యంత ప్రతిభావంతమైన జట్టు అయినందుకే.. ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 16 టెస్టులు ఓడిపోయిందా అని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. తాజాగా సిడ్నీ టెస్టు కోసం.. మహ్మద్ హఫీజ్ తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో మరోసారి ట్రోల్ చేసింది. ‘‘అయ్యో అందరూ ప్రతిభావంతులే ఉన్న జట్టు అది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఎయిర్‌లైన్స్ కూడా అతడిని వదిలేసి వెళ్లిందా?’’ అని సెటైర్ వేసింది. సిరీస్ సమర్పయామి.. ఆఖరి టెస్టులో ఆఫ్రిది లేకుండానే కాగా ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకున్న పాకిస్తాన్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఈ టెస్టుకు ఎంపిక చేసిన పాక్ జట్టులో షాహిన్ ఆఫ్రిదికి చోటు దక్కలేదు. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో అతడికి విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించేందుకు సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి విమానంలో వెళ్లాల్సి ఉండగా.. మహ్మద్ హఫీజ్ ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ మిస్సయ్యాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ All that talent, and now even the Aussie airlines are out to get him! https://t.co/gtF1rXqOit — Iceland Cricket (@icelandcricket) January 1, 2024 -
తన చివరి టెస్ట్‌కు ముందు అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్న వార్నర్
తన కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అతి మూల్యమైన వస్తువును పోగొట్టుకున్నాడు. వార్నర్ తన కెరీర్లో మెజార్టీ శాతం ధరించిన బ్యాగీ గ్రీన్ (క్యాప్) కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఆస్ట్రేలియన్‌గా తనకు బ్యాగీ గ్రీన్ అతి మూల్యమైన వస్తువని, ఎవరైనా దాన్ని తీసి ఉంటే తిరిగి ఇచ్చేయాలని సోషల్‌మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్ట్‌కు ముందు మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో తన బ్యాగీ గ్రీన్ మిస్ అయినట్లు అనుమానిస్తున్నాడు. ఈ విషయమై అతను ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల్లో వార్నర్ బ్యాగీ గ్రీన్ దొంగిలించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎయిర్పోర్ట్ అధికారులు వివరణ ఇచ్చారు. తనకు ఎంతో ప్రత్యేకమైన క్యాప్ కనపడకపోవడంతో వార్నర్ తెగ బాధపడిపోతున్నాడు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) సోషల్‌మీడియా వేదికగా తన బాధను పంచుకున్నాడు. నా కెరీర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడే ముందు బ్యాగీ గ్రీన్‌ను మిస్ అయ్యాను. దయచేసి ఎవరికైనా అది దొరికి ఉంటే తిరిగి ఇచ్చేయండని విజ్ఞప్తి చేశాడు. ఇందుకు ప్రతిగా ఎదైనా ఇచ్చేందుకు కూడా తాను సిద్దమేనని అభ్యర్ధించాడు. క్యాప్‌ను తిరిగి ఇచ్చే వారిపై ఎలాంటి కంప్లైంట్ కూడా ఇవ్వనని హామీ ఇచ్చాడు. బ్యాగీ గ్రీన్ దొరికిన వారు తనను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించవచ్చని లేదా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులతోనైనా మాట్లాడవచ్చని మెసేజ్ పాస్ చేశాడు. కాగా, వార్నర్ తన 111 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఎక్కువ శాతం మ్యాచ్‌లు ఇప్పుడు పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్‌తోనే ఆడాడట. ఈ క్యాప్ వార్నర్‌కు చాలా కలిసొచ్చిందిగా చెబుతారు. మెల్బోర్న్ నుంచి సిడ్నీకి ప్రయాణిస్తున్న సమయంలో తన రెండు బ్యాగీ గ్రీన్‌లతో కూడిన లగేజ్ చోరీకి గురైందని వార్నర్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ కూడా స్పందించడం విశేషం. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయమై ప్రత్యేక చొరవ తీసుకుని, వార్నర్ పోగొట్టుకున్న బ్యాగీ గ్రీన్‌ను వెతికపెట్టాలని మసూద్ కోరాడు. ఇందుకోసం దేశవ్యాప్తంగా శోధన జరగాలని పిలుపునిచ్చాడు. అవసరమైతే డిటెక్టివ్‌ల సాయం కూడా తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్‌కు వార్నర్ గొప్ప ప్రతినిధి అని, అలాంటి వ్యక్తికి చెందిన అతి మూల్యమైన వస్తువు పోతే ప్రభుత్వం స్పందించాల్సిందేనని డిమాండ్ చేశాడు. -
ఆసీస్‌తో మూడో టెస్టు: పాక్ తుది జట్టు ప్రకటన.. షాహిన్‌కు నో ఛాన్స్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు తమ తుది జట్టును పాకిస్తాన్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది దూరమయ్యాడు. గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న అఫ్రిదికి మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై వేటుపడింది. అతడి స్ధానంలో యువ ఓపెనర్ సైమ్ అయూబ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. అదే విధంగా మరో యువ పేసర్ సాజిద్ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టెస్టు సిరీస్ అనంతరం 5 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో పాక్ జట్టును అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఆసీస్‌తో మూడో టెస్టుకు పాక్ జట్టు: సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, సాజిద్ ఖాన్, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్. చదవండి: Petra Kvitova: అభిమానులకు శుభవార్త చెప్పిన టెన్నిస్ స్టార్.. ఆటకు దూరం -
నేను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్లు వీరే: ఆసీస్ స్టార్ స్పిన్నర్
గత కొన్నేళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్ బౌలర్‌గా చరిత్రకెక్కిన అతడు.. మరో నాలుగేళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ ఘనత సాధించిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ మైలురాయి అందుకున్న స్పిన్నర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది బ్యాటర్లను ఎదుర్కొన్న నాథన్ లియోన్.. ముగ్గురు మాత్రం తనకు కఠిన సవాల్ విసిరారని పేర్కొన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సహా రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తాను ఫేస్ చేసిన బౌలర్లలో అత్యుత్తమ బ్యాటర్లు అని తెలిపాడు. కాగా కోహ్లి- లియోన్ ముఖాముఖి పోరులో రన్మెషీన్దే పైచేయి కావడం విశేషం. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లి లియోన్ బౌలింగ్‌లో కేవలం ఏడుసార్లు అవుట్ కాగా.. 75కు పైగా సగటుతో పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో లియోన్ బౌలింగ్‌లో 96కు పైగా స్ట్రైక్‌రేటుతో 100 పరుగులు సాధించిన కోహ్లి.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. మరోవైపు.. టెస్టుల్లో లియోన్‌పై డివిలియర్స్‌ది కూడా పైచేయే! అతడి బౌలింగ్‌లో 171 సగటుతో 342 పరుగులు సాధించిన ఏబీడీ.. కేవలం రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, టెండుల్కర్‌కు మాత్రం నాథన్ లియోన్ బౌలింగ్‌లో మెరుగైన రికార్డు లేదు. టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో కేవలం సగటు 29 కలిగి ఉన్న సచిన్ నాలుగుసార్లు అవుటయ్యాడు. కాగా నాథన్ లియోన్ తదుపరి పాకిస్తాన్‌తో మూడో టెస్టు సందర్భంగా మైదానంలో దిగనున్నాడు. సిడ్నీ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నాథన్ లియోన్.. తాను ఎదుర్కొన్న గొప్ప బ్యాటర్ల జాబితాలో ముందుగా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. సచిన్ టెండుల్కర్, ఏబీ డివిలియర్స్‌లను అవుట్ చేసేందుకు కూడా తానెంతో కష్టపడాల్సి వచ్చేదని ఈ సందర్భంగా వెల్లడించాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
Aus Vs Pak: వార్నర్ ఫేర్వెల్ టెస్టు.. ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన
Australia vs Pakistan, 3rd Test: సొంతగడ్డపై పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఆడిన జట్టుతోనే ఆఖరి టెస్టులో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మంగళవారం ధ్రువీకరించాడు. స్వదేశంలో పాకిస్తాన్‌పై టెస్టుల్లో రెండు దశాబ్దాలకు పైగా ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ఆసీస్ మరోసారి సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో పర్యాటక పాక్‌ను 360 పరుగుల తేడాతో చిత్తు చేసిన కంగారూ జట్టు.. బాక్సింగ్ డే టెస్టులోనూ విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. వార్నర్ ఫేర్వెల్ టెస్టు ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు జరుగనుంది. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం (జనవరి 3) నుంచి ఐదు రోజుల మ్యాచ్ మొదలు కానుంది. ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం పింక్ టెస్టుగా నిర్వహించనున్న ఈ మ్యాచ్ సందర్భంగా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడనున్నాడు. తన రెగ్యులర్ జోడీ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ తమ స్థానాలు నిలబెట్టుకోగా.. నెట్స్‌లో శ్రమిస్తున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మరో ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సూపర్ ఫామ్‌లో ఉన్న కారణంగా గ్రీన్‌ను పక్కనపెట్టక తప్పలేదు. 👀 #AUSvPAK https://t.co/YcZvY1CYlM — cricket.com.au (@cricketcomau) January 1, 2024 ‘పింక్’ టెస్టులో గెలుపు ఎవరిది? ఇక బౌలింగ్ దళంలో పేస్ త్రయం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌తో పాటు స్పిన్నర్ నాథన్ లియోన్ ఉండగా.. అలెక్స్ క్యారీ వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ గ్లెన్ మెగ్రాత్ భార్య జేన్ మెగ్రాత్ రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది. ఈ నేపథ్యంలో.. క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా.. సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆమె జ్ఞాపకార్థం మెగ్రాత్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఆసీస్ ఆడే టెస్టుల్లో ఒక మ్యాచ్‌ను పింక్ టెస్టుగా నిర్వహిస్తూ ఫండ్‌రైజింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుదిజట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే.. చాలా డేంజరస్: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 3 నుంచి పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం సంప్రదాయక్రికెట్కు డేవిడ్ భాయ్ విడ్కోలు పలకనున్నాడు. టెస్టులతో పాటు వన్డేలకు వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్‌కు తన టెస్టు కెరీర్లో ఎదు అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదలుగా వార్నర్ ఏమి ఆలోచించకుండా దక్షిణాఫ్రికా లెజెండ్ డేల్ స్టేయిన్ పేరును చెప్పుకొచ్చాడు. 'నా టెస్టు కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టేయిన్. 2016-2017లో గబ్బా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఇప్పటికి నాకు గుర్తుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ సెషన్లో డేల్ స్టేయిన్ నిప్పలు చేరిగాడు. బౌన్సర్లతో నన్ను షాన్ మార్ష్‌ను భయపెట్టాడు. 45 నిమిషాల సెషన్ అయితే మాకు చుక్కలు చూపించింది. షాన్ నా దగ్గరకు వచ్చి అతడి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలో నాకు అర్ధ కావడం లేదని చెప్పాడు. కనీసం పుల్ షాట్ ఆడాదామన్న కూడా అవకాశం లేదు. చాలా ఓవర్ల పాటు కనీసం బంతిని కూడా టచ్ చేయలేకపోయాను. ఓ బంతి ఏకంగా నా భుజానికి వచ్చి తాకింది. నొప్పితో విల్లాలాడాను. స్టేయిన్ ఎడమచేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్ చేస్తాడు. అతడు బౌలింగ్ చేస్తే ప్రతీ బ్యాటర్‌కు కొంచెం భయం కచ్చితంగా ఉంటుందని' వార్నర్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్ క్రికెట్ చరిత్రలో స్పీడ్‌గన్ స్టేయిన్ తన పేరును సువర్ణఅక్షరాలతో లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టులలో 439 వికెట్లు, వన్డేలలో 196 వికెట్లు, టీ20లలో 64 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ -
Aus Vs Pak: నా రికార్డు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజం
Australia vs Pakistan, 3rd Test: ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఆట తీరుపై బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ తరఫున తాను నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టగల సత్తా లియోన్‌కు ఉందన్నాడు. కాగా పాకిస్తాన్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. నామమాత్రపు ఆఖరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆమె జ్ఞాపకార్థం ‘పింక్’ టెస్టు నిర్వహణ ఇరుజట్ల మధ్య బుధవారం (జనవరి 3) నుంచి ‘పింక్ టెస్టు’ ఆరంభం కానుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఇందుకు వేదిక. కాగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించిన గ్లెన్ మెగ్రాత్ సతీమణి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది పింక్ టెస్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీలో తాజాగా జరుగనున్న మ్యాచ్ 16వది. ఈ టెస్టు సందర్భంగా మెగ్రాత్ ఫౌండేషన్ విరాళాల సేకరణ చేపట్టనుంది. ఈ సందర్భంగా గ్లెన్ మెగ్రాత్ ప్రసంగిస్తూ.. నాథన్ లియోన్ బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు. ‘‘ప్రతి రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు. ఒకవేళ లియోన్ నన్ను దాటేస్తే అంతకంటే సంతోషం ఉండదు. అతడు అసాధారణ బౌలర్. అలా అయితే అతడికి తిరుగే ఉండదు లియోన్‌కు ఆల్ ది బెస్ట్. ఒకవేళ నాతో పాటు షానో(షేన్ వార్న్) రికార్డును కూడా అధిగమిస్తే అతిడికి తిరుగే ఉండదు. లియోన్ బౌలింగ్ నైపుణ్యాలు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం అతడికి అలవాటు’’ అని మెగ్రాత్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా గ్లెన్ మెగ్రాత్ ఘనత సాధించాడు. నేటికీ అతడి రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. ఆసీస్ తరఫున 124 టెస్టులు ఆడిన రైటార్మ్ పేసర్ మెగ్రాత్ 563 వికెట్లు తీశాడు. 500 వికెట్ల క్లబ్లో నాథన్ లియోన్ మరోవైపు.. ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇటీవలే 500 వికెట్ల క్లబ్లో చేరాడు. పాకిస్తాన్‌తో పెర్త్ టెస్టు సందర్భంగా ఈ మైలురాయిని చేరుకున్నాడు. తాజా పింక్ టెస్టుకు ముందు అతడి ఖాతాలో మొత్తంగా 505 వికెట్లు ఉన్నాయి. సుమారు మరో నాలుగేళ్ల పాటు టెస్టు క్రికెట్ ఆడే సత్తా ఉన్న లియోన్ ఇంకో 59 వికెట్లు తీస్తే .. ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో మెగ్రాత్‌ను అధిగమిస్తాడు. ఇదిలా ఉంటే.. ఆసీస్ దిగ్గజ దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టుల్లో 708 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. చదవండి: IPL 2024: హార్దిక్ పాండ్యా దూరం! ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బుమ్రా? -
తప్పిదారి షాహిన్ కెప్టెన్ అయ్యాడు: అల్లుడిపై ఆఫ్రిది విమర్శలు!
పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ ఎంపిక గురించి ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథి అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్ రిజ్వాన్‌కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో షాన్ మసూద్‌ను కెప్టెన్ చేసిన పాక్ క్రికెట్ బోర్డు.. టీ20 సారథ్య బాధ్యతలను పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మసూద్ నాయకత్వంలో టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టు.. తదుపరి షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆటగాడిగా రిజ్వాన్‌ను నేను ఆరాధిస్తాను. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిపాయి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. తనొక గొప్ప యోధుడు’’ అని మహ్మద్ రిజ్వాన్‌ను ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘రిజ్వాన్‌ను పాక్ టీ20 కెప్టెన్‌గా చూడాలనుకున్నాను. కానీ తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథిగా ఎంపికయ్యాడు’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆ సమయంలో హ్యారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో పాటు అక్కడే ఉన్న షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా షాహిద్ ఆఫ్రిదికి షాహిన్ ఆఫ్రిది సొంత అల్లుడన్న సంగతి తెలిసిందే. షాహిద్ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్.. జనవరి 3 నుంచి నామమాత్రపు మూడో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్ వా Shahid Afridi praised Muhammad Rizwan and said that Rizwan should have been captain of T20 but Shaheen became it by mistake.#Rizwan #PakistanCricket pic.twitter.com/TSECe93ZPM — Ahtasham Riaz 🇵🇰 (@AhtashamRiaz_) December 30, 2023 -
కొత్త సంవత్సరం వేళ.. డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్.. తాజాగా వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం తన నిర్ణయాన్ని డేవిడ్ భాయ్ వెల్లడించాడు. అయితే జట్టుకు తన అవసరం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తే పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆడేందుకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. "టెస్టులతో పాటు వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. భారత్‌పై వన్డే ప్రపంచకప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్లో సాధించిన భారీ విజయం. టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం లభిస్తోంది. నేను తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తోంది. అయితే త్వరలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉందన్న విషయం నాకు తెలుసు. గత రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతున్నాను. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ నేను ఫిట్నెస్గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుకు అవసరమైతే కచ్చితంగా నేను అందుబాటులో ఉంటానని సిడ్నీ గ్రౌండ్లో విలేకరుల సమావేశంలో వార్నర్ పేర్కొన్నాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోవడంలో డేవిడ్ వార్నర్‌ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 528 పరుగులు చేసిన డేవిడ్ భాయ్.. ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా తన వన్డే కెరీర్లో 161 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా వార్నర్ కొనసాగుతున్నాడు. -
మూడు ఫార్మాట్లలోనూ అతడొక అద్బుతం.. నిజంగా మాకు ఇది: ఆసీస్ హెడ్ కోచ్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్‌కు వార్నర్ విడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే తన నిర్ణయాన్ని వార్నర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. . జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్టు జరగనుంది. తన సొంత మైదానంలో అద్బుతప్రదర్శన కనబరిచి తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌పై ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకడని మెక్‌డొనాల్డ్ కొనియాడాడు. డేవిడ్ వార్నర్ ఒక అద్బుతమైన ఆటగాడు. అతొడక ఆల్‌ఫార్మాట్ ప్లేయర్. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నాడు. ఇది నిజంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బ. గత కొంతకాలం నుంచి వార్నర్ టెస్టు క్రికెట్ ఫామ్‌పై చాలా మంది విమర్శలు చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఒక జట్టుగా మేము అతడిపై నమ్మకం ఉంచాము. అందుకే పాకిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేశాము. తొలి టెస్టు మ్యాచ్‌లోనే తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఏదైమైనప్పటికి అతడి స్థానాన్ని భర్తీ చేయడం మాకు చాలా కష్టం. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా వార్నర్ కొనసాగుతున్నాడు. మేము మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి వార్నర్‌కు అంకితమివ్వాలని భావిస్తున్నాము అని క్రికెట్ ఆస్ట్రేలియా.కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! వార్నర్‌కు ఆఖరి మ్యాచ్
పాకిస్తాన్‌తో మూడో టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌లో కోసం జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. రెండో టెస్టుకు ఎంపిక చేసిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్న స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఘనంగా విడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్దమైంది. జనవరి 3 నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అనంతరం టెస్టు క్రికెట్‌కు వార్నర్ గుడ్‌బై చెప్పనున్నాడు. ఇప్పటికే తన నిర్ణయాన్ని డేవిడ్ భాయ్ వెల్లడించాడు. తన హోం గ్రౌండ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్ భావిస్తున్నాడు. ఇక తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఆసీస్ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్,ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్,నాథన్ లియోన్,మిచెల్ మార్ష్,స్టీవ్ స్మిత్,మిచెల్ స్టార్క్,డేవిడ్ వార్నర్ చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
Aus vs Pak: అద్భుతం.. అందుకే వరుసగా 16 టెస్టులు ఓడిపోయారా?
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్‌పై ఐస్లాండ్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆస్ట్రేలియా ఇకపై తన అదృష్టాన్ని కాలదన్నుకుని పాక్‌కు గెలిచే అవకాశం ఇస్తుందేమో అంటూ అతడిని దారుణంగా ట్రోల్ చేసింది. కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ వరుసగా రెండింట ఓడింది. దీంతో సిరీస్ 2-0 తేడాతో ఆతిథ్య జట్టు కైవసం అయింది. అయితే, తొలి టెస్టులో 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. రెండో టెస్టులో మెరుగ్గానే ఆడింది. కానీ.. కీలక సమయంలో ఫీల్డింగ్ తప్పిదాలు, బ్యాటింగ్ వైఫల్యాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అవుట్ కావడంతో పాక్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్యాట్ కమిన్స్ విసిరిన బంతి రిజ్వాన్ రిస్ట్‌బ్యాండ్‌ను తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడినట్లు కనిపించగా.. అప్పీలు చేశాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో.. ఆసీస్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో రిజ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఈ నేపథ్యంలో.. ఓటమి అనంతరం మహ్మద్ హఫీజ్ స్పందిస్తూ.. తమ జట్టు గొప్పగా ఆడినా.. సాంకేతిక లోపాలు, అంపైరింగ్ తప్పిదాల వల్లే ఓడిపోయిందని ఆసీస్ ఆట తీరును విమర్శించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి కమిన్స్ ఇప్పటికే అతడికి కౌంటర్ ఇచ్చాడు. ఆఖరి వరకు బాగా ఆడిన జట్టునే విజయం వరిస్తుందని హఫీజ్ వ్యాఖ్యలకు బదులిచ్చాడు. తాజాగా ఐస్లాండ్ క్రికెట్ సైతం.. ‘‘నిజంగా ఇదొక అద్భుతం. అత్యంత ప్రతిభావంతమైన, సుపీరియర్ టాలెంట్ ఉన్న జట్టు ఆస్ట్రేలియాతో వరుసగా 16 టెస్టులు ఎలా ఓడిపోయింది? ఇక నుంచి ఆస్ట్రేలియా జట్టు తాము అదృష్టవంతులుగా ఉండటం ఆపేస్తే బాగుంటుంది’’ అంటూ మహ్మద్ హఫీజ్‌ను ట్రోల్ చేసింది. కాగా ఆస్ట్రేలియాలో టెస్టుల్లో పాకిస్తాన్ ఇప్పటి వరకు వరుసగా పదహారు ఓడిపోవడం గమనార్హం. ఆసీస్ గడ్డపై ఇంత వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. It's amazing. How can the more talented and superior team have lost 16 matches in a row in Australia? Surely those lucky Aussies will stop being lucky soon. https://t.co/118gmMCe2K — Iceland Cricket (@icelandcricket) December 29, 2023 -
Aus Vs Pak: అంతిమ విజయం మాదే.. హఫీజ్‌కు కమిన్స్ కౌంటర్
పాకిస్తాన్ క్రికెట్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కౌంటర్ ఇచ్చాడు. అత్యుత్తంగా ఆడిన జట్టుకే అంతిమంగా విజయం లభిస్తుందని.. తాము విమర్శలను పెద్దగా పట్టించుకోమంటూ చురకలు అంటించాడు. పాకిస్తాన్‌తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించి.. 79 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన ఈ టెస్టులో పాక్ ఓటమి అనంతరం ఆ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ స్పందిస్తూ.. ఆస్ట్రేలియా ఆట తీరును విమర్శించాడు. ‘‘జట్టుగా మేము కొన్ని తప్పిదాలు చేసిన మాట వాస్తవమే. కూర్చుని చర్చిస్తే వాటిని అధిగమించగలం. కానీ.. మా ఓటమికి కేవలం మా ప్రదర్శన ఒక్కటే కారణం కాదు. అంపైరింగ్ తప్పిదాలు, సాంకేతిక లోపాల వల్ల కూడా మేము నష్టపోయాం’’ అని పేర్కొన్నాడు. మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరును ప్రస్తావిస్తూ.. ‘‘ఒకవేళ అలా గనుక జరిగి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. కొన్నిసార్లు టెక్నాలజీ చేసే చమత్కారాలు మనుషులమైన మనం అర్థం చేసుకోలేం. ఒకవేళ బాల్ స్టంప్స్‌ను హిట్ చేస్తే కచ్చితంగా అది అవుటే కదా!అలాంటపుడు అంపైర్స్ కాల్‌తో పనేం ఉంటుంది? అయితే, కొన్నిసార్లు టెక్నాలజీ వల్ల మ్యాచ్‌లు చేజారిపోయే పరిస్థితులు కూడా వస్తాయి’’ అని మహ్మద్ హఫీజ్ పేర్కొన్నాడు. రిజ్వాన్ అవుట్ విషయంలో తప్పు జరిగిందంటూ పరోక్షంగా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్‌కు హఫీజ్ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కూల్.. వాళ్లు బాగానే ఆడారు. అయితే, మేము గెలిచాం. ఇప్పుడిక మాటలు అనవసరం. నిజంగా బాగా ఆడిన జట్టే కదా అంతిమంగా విజయం సాధిస్తుంది’’ అంటూ కమిన్స్.. హఫీజ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్ బౌలింగ్‌లో రిజ్వాన్ రిస్ట్‌బ్యాండ్‌ను తాకిన బంతిని కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకోగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కమిన్స్ రివ్యూకు వెళ్లడంతో థర్డ్ అంపైర్ అతడిని అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం తమ విజయావకాశాలపై ప్రభావం చూపిందని హఫీజ్ వ్యాఖ్యానించగా.. కమిన్స్ ఇలా కౌంటర్ వేశాడు. చదవండి: Ind A Vs SA A: ఐదు వికెట్లు తీసిన ఆవేశ్.. తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే -
Aus Vs Pak: రిజ్వాన్ అవుటా? నాటౌటా?.. వీడియో వైరల్
Australia vs Pakistan, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరు నెట్టింట చర్చకు దారితీసింది. ఈ అంశంపై క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర విరుద్ధ కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. బాక్సింగ్ డే టెస్టులో పాకిస్తాన్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా మంగళవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న షాన్ మసూద్ బృందం.. ఆతిథ్య ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, కంగారూ బౌలర్ల ధాటికి తాళలేక 264 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. మరో 262 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. దీంతో పాక్ విజయ లక్ష్యం 317గా మారింది. అయితే, టార్గెట్ ఛేదనకై బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చార్లు ఆసీస్ పేసర్లు. ఓపెనర్లు.. అబ్దుల్లా షఫీక్‌ను 4 పరుగుల వద్ద స్టార్క్ పెవిలియన్‌కు పంపగా.. 12 పరుగులతో ఆడుతున్న ఇమామ్ ఉల్ హక్‌ను కమిన్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్ 60 పరుగులు చేసి అవుట్ కాగా.. బాబర్ ఆజం 41, సౌద్ షకీల్ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. రిజ్వాన్‌పై ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ ఈ క్రమంలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌పై ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్‌ను ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మరోసారి దెబ్బకొట్టాడు. పాక్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 61వ ఓవర్ వేసిన కమిన్స్ బౌలింగ్‌లో బంతి రిజ్వాన్ రిస్ట్‌బ్యాండ్‌ను తాకి కీపర్ చేతుల్లో పడినట్లు కనిపించింది. రివ్యూకు వెళ్లిన కమిన్స్ దీంతో కమిన్స్ గట్టిగా అప్పీలు చేయగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కమిన్స్ మాత్రం అంపైర్ నిర్ణయాన్ని చాలెంజ్ తీస్తూ డీఆర్ఎస్కు వెళ్లాడు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్.. నిశితంగా పరిశీలించిన తర్వాత.. ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేసి.. రిజ్వాన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. రిజ్వాన్ తనకు అన్యాయం జరిగిందన్నట్లుగా మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అంపైర్ వద్దకు దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిజ్వాన్ అవుటా? నాటౌటా? అంటూ చర్చలు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంపైర్‌ను ఒత్తిడిలోకి నెట్టి తమకు అనుకూలంగా ఫలితం వచ్చేలా చేశారని.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రిజ్వాన్‌ను నాటౌట్‌గా ప్రకటించాల్సిందని పాక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. బంతి బ్యాటర్ గ్లోవ్స్‌ను తాకి కీపర్ చేతుల్లో పడితే నిబంధనల ప్రకారం అవుట్ ఇవ్వడం సరైందేనని.. ఇక్కడ రిస్ట్‌బ్యాండ్ కూడా గ్లోవ్‌ను అంటి ఉందనే విషయాన్ని గమనించాలని హితవు పలుకుతున్నారు. కాగా రిజ్వాన్(35 పరుగులు) రూపంలో కమిన్స్ 250వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 79 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను మరోసారి ఆతిథ్య ఆసీస్‌కు సమర్పించుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టెస్టు బుధవారం నుంచి మొదలుకానుంది. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 146 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తొలి ఆటగాడిగా! Wicket 250 for Pat Cummins! 🎉 The third umpire decided the ball flicked Mohammad Rizwan's sweatband on the way through. #MilestoneMoment | @nrmainsurance | #AUSvPAK pic.twitter.com/vTuDL5DmNB — cricket.com.au (@cricketcomau) December 29, 2023 -
కమిన్స్ దెబ్బ.. రెండో టెస్టులోనూ పాక్ చిత్తు.. సిరీస్ ఆస్ట్రేలియాదే
Australia vs Pakistan, 2nd Test : పాకిస్తాన్‌తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. బాబర్ ఆజం స్థానంలో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్తాన్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 14న మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్ ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా గెలిచి నిలవాలని పాక్ భావించింది. బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టును 318 పరుగులకు కట్టడి చేయగలిగింది పాక్. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 264 పరుగులకే షాన్ మసూద్ బృందం ఆలౌట్ కావడంతో.. ఆసీస్‌కు 54 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు పాక్ ఆరంభంలోనే షాకిచ్చింది. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా దెబ్బకు టాపార్డర్ కుప్పకూలిపోయింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇబ్బందుల్లో పడింది. Mitch Marsh hangs on at third man! Whatta catch! #AUSvPAK pic.twitter.com/BFC1LBXjeK — cricket.com.au (@cricketcomau) December 29, 2023 ఇలాంటి క్లిష్ట దశలో మిచెల్ మార్ష్ (96; 13 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 153 పరుగులు జోడించి ఆసీస్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62.3 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 241 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 262 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ బెంబేలెత్తించాడు. ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరో పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తనదైన శైలిలో రాణించడంతో పాకిస్తాన్ 237 పరుగులకే చాపచుట్టేసింది. షాన్ మసూద్ కెప్టెన్ ఇన్నింగ్స్(71 బంతుల్లో 60 పరుగులు), ఆగా సల్మాన్ అర్ధ శతకం(50)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 79 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలు కాగా నాలుగో రోజే ఆట ముగిసిపోయింది. ఇక పాక్ రెండో ఇన్నింగ్స్‌లో స్టార్క్ నాలుగు, జోష్ హాజిల్‌వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు ఆఖరి టెస్టు బుధవారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది. కాగా ఆస్ట్రేలియాలో పాక్ ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. 1995లో చివరగా కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. తాజా పరాజయంతో 1999 పర్యటన నుంచి ఆ జట్టు వరుసగా 16 టెస్టుల్లో ఓడింది. THE AUSSIES GET IT DONE! 🔥 📺 Watch Day 4 #AUSvPAK on Fox Cricket and Kayo Sports: https://t.co/VNpf5Xojhg ✍ BLOG: https://t.co/physFvdl0W 🔢 MATCH CENTRE: https://t.co/v8I8vaM89H pic.twitter.com/D8dCwItqhb — Fox Cricket (@FoxCricket) December 29, 2023 -
పాక్ పేసర్ల దెబ్బ: కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. మార్ష్ సెంచరీ మిస్
బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా కలిసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, మిడిలార్డర్లో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ అర్ధ శతకాలతో రాణించి ఆసీస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కానీ.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆట ముగిసే సరికి 62.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. కాగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మంగళవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 318 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే ఆలౌట్ అయింది. 194/6 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన పాక్ మరో 70 పరుగులు మాత్రమే జతచేయగలిగింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్ పేసర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేసిన షాహిన్ ఆఫ్రిది.. మార్నస్ లబుషేన్(4) రూపంలో మరో వికెట్ కూల్చాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(6) వికెట్‌ను మీర్ హంజా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ట్రవిస్ హెడ్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ ఓపికగా ఆడుతూ పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే, హంజా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ కావడంతో ఈ పార్ట్‌నర్‌షిప్‌నకు తెరపడింది. 130 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అగా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో స్మిత్‌కు తోడైన అలెక్స్ క్యారీ ఆచితూచి ఆడాడు. పరుగులు రాబట్టలేకపోయినా వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, మూడో రోజు ఆటలో సరిగ్గా ఆఖరి బంతికి స్మిత్‌ను షాహిన్ ఆఫ్రిది అవుట్ చేశాడు. దీంతో స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో.. గురువారం 62.3 ఓవర్ వద్ద మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి.. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అలెక్స్ క్యారీ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. Mitch Marsh gone for 96 - to an absolute belter at first slip from Agha Salman! #AUSvPAK pic.twitter.com/KNUP3kDr3j — cricket.com.au (@cricketcomau) December 28, 2023 -
మరి నీవు మారవా? వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో! వీడియో వైరల్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ తమ పేలవ ఫీల్డింగ్ ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు విడిచిపెట్టిన పాక్ స్టార్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ క్రమంలో మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ మాత్రం బౌలర్లను మారుస్తూ ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 15 ఓవర్ వేసేందుకు అమీర్ జమీల్ చేతికి బంతిని అందించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే సెకెండ్ స్లిప్‌లో ఉన్న షఫీక్ ఈజీ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు. అందుకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోంది. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మార్ష్.. ఏకంగా 96 పరుగులు చేశాడు. దీంతో షఫీక్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం మార్క్ వా సైతం ఆంసతృప్తి వ్యక్తం చేశాడు. 'మొసలి దవడలా క్యాచ్ పడుతున్నాడు.. వెంటనే అతడిని అక్కడ నుంచి తీసియేండి' అని అన్నాడు. అదే విధంగా ఓ సోషల్ మీడియా యూజర్ 'మరి నీవు మారవా? వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో పో' అంటూ ఓ పోస్ట్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 57 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ప్రస్తుతం 230 పరుగుల అధిక్యంలో ఆసీస్ కొనసాగుతోంది. చదవండి: IND vs SA: 'అతడిని టీమిండియా మిస్సవుతోంది.. సౌతాఫ్రికాకు చుక్కలు చూపించేవాడు' Another drop by Pakistan. Mark Waugh - it's like a crocodile jaw trying to catch a ball.pic.twitter.com/RAjkkanfzp — Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2023 -
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్
సాధారణంగా క్రికెట్లో వర్షం, వెలుతురులేమి, సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోవడం చూస్తూ ఉంటాం. కానీ మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఊహించని ఘటనతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా వ్యహరిస్తున్న థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు దీంతో దాదాపు 5 నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఆటను ప్రారంభించేందుకు అన్‌ఫీల్డ్ అంపైర్లు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కెమెరామెన్ థర్డ్ అంపైర్ బాక్స్ వైపు కెమెరాను టర్న్ చేయగా సీటులో ఇల్లింగ్‌వర్త్ కన్పించలేదు. దీంతో ఆటను అంపైర్లు ప్రారంభించలేదు. వెంటనే ఈ విషయాన్ని ఫోర్త్ అంపైర్‌కు ఫీల్డ్ అంపైర్లు తెలియజేయగా.. అతడు ఏమైందోనని థర్డ్ అంపైర్ గదికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలోనే లంచ్ పూర్తి చేసిన తర్వాత ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అయితే 5 నిమిషాల తర్వాత థర్డ్ అంపైర్ తిరిగి రావడంతో మ్యాచ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చదవండి: IND Vs AFG T20I Series: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కొత్త కెప్టెన్ అతడే!? రోహిత్ డౌటే? A wild Richard Illingworth appeared! #AUSvPAK pic.twitter.com/7Rsqci4whn — cricket.com.au (@cricketcomau) December 28, 2023 -
5 వికెట్లతో చెలరేగిన కమ్మిన్స్.. 264 పరుగులకు పాక్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 264 పరుగులకు ఆలౌటైంది. 194/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్.. అదనంగా మరో 70 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 54 అధిక్యం లభించింది. ఇక పాక్ బ్యాటర్లలో షఫీక్(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మసూద్(54), రిజ్వాన్(42) పరుగులతో రాణించారు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు స్పిన్నర్ నాథన్ లయోన్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఖావాజా(42), మిచెల్ మార్ష్(41) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి! -
నమ్మశక్యం కాని రీతిలో బాబర్ బౌల్డ్.. పాక్ మాజీ బ్యాటర్ ట్వీట్
ఆస్ట్రేలియా పర్యటనలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజంనకు మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అండగా నిలిచాడు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనపుడు ఓపికగా వేచి చూడాలని సూచించాడు. కఠిన సవాళ్లు ఎదురైపుడు మరింత ధైర్యంగా ముందుకు సాగాలే తప్ప డీలా పడకూడదంటూ బాబర్‌కు మద్దతుగా నిలిచాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ విఫలమైన నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షాన్ మసూద్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా.. అతడి సారథ్యంలో తొలిసారిగా.. పాకిస్తాన్ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాక్ జట్టు.. రెండో టెస్టులోనైనా పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా 318 పరుగులకు ఆలౌట్ అయింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఈ రెండు మ్యాచ్‌లలోనూ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా విఫలమయ్యాడు. మొదటి టెస్టులో 35 పరుగులు సాధించిన బాబర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. బుధవారం నాటి ఆటలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో నమ్మశక్యం కాని రీతిలో బౌల్డ్ అయ్యాడు. UNBELIEVABLE! Pat Cummins gets rid of Babar Azam again - with another BEAUTY! #OhWhatAFeeling @Toyota_Aus #AUSvPAK pic.twitter.com/iXQ6M7E10l — cricket.com.au (@cricketcomau) December 27, 2023 ఈ నేపథ్యంలో బాబర్ ఆజం ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. నెట్టింట అతడిపై ట్రోల్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ మహ్మద్ యూసఫ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘ధైర్యంగా ఉండు. పరిస్థితులు తప్పక మెరుగుపడతాయి’’ అంటూ బాబర్ ఆజంకు అండగా నిలిచాడు. ఇపుడు తుఫాను ఉన్నంత మాత్రాన.. ఎల్లకాలం వాన కురుస్తూనే ఉండదు కదా అంటూ త్వరలోనే.. తిరిగి మునుపటి ఫామ్ అందుకోవాలని ఆకాంక్షించాడు. Be strong now because things will get better,it might be stormy now, but it can't rain forever. pic.twitter.com/zGjYWV1jNJ — Mohammad Yousaf (@yousaf1788) December 27, 2023 -
బాబర్ విఫలం.. కమిన్స్ జోరు! రెండో రోజు ఆసీస్‌దే పైచేయి!
Australia vs Pakistan, 2nd Test Day 2: పాకిస్తాన్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి పర్యాటక జట్టుపై పైచేయి సాధించింది. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాకిస్తాన్ మధ్య బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. టీ విరామానికి 37 నిమిషాల ముందు వర్షం రావడంతో ఆటకు మూడు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. దాంతో తొలి రోజు 66 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖవాజా (42; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. స్టీవ్ స్మిత్ (26; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి లబుషేన్ (44 బ్యాటింగ్; 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (9 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లు హసన్ అలీ, ఆమెర్ జమాల్, ఆగా సల్మాన్ ఒక్కోవికెట్ తీశారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మొదలుపెట్టిన కంగారూ జట్టును పాక్ బౌలర్లు కట్టడి చేశారు. 187/3 ఓవర్‌నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను 318 పరుగులకు ఆలౌట్ చేశారు. ఆతిథ్య ఆసీస్ రెండో రోజు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జోష్‌లో బ్యాటింగ్ మొదలుపెట్టిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాకిచ్చాడు ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్. పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌ను అవుట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అర్ధ శతకం(62)తో మెరిశాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాన్ మసూద్(54)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ షఫీక్‌ను, లియోన్ మసూద్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడగొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లోనూ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. కమిన్స్ అద్భుత బంతితో బాబర్(1)ను బౌల్డ్ చేయగా.. సౌద్ షకీల్‌ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోష్ హాజిల్‌వుడ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక మరోసారి బంతితో మ్యాజిక్ చేసిన కమిన్స్.. ఆగా సల్మాన్(9)ను అవుట్ చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి మళ్లీ ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా 55 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 194 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 29, ఆమిర్ జమాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌కు మూడు, నాథన్ లియోన్‌కు రెండు, జోష్ హాజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి! -
పాపం బాబర్.. కమిన్స్ దెబ్బకు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న బ్యాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. అనంతరం బౌలింగ్‌లో కూడా అదరగొడుతుంది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. ఇప్పటివరకు 12 ఓవర్లు వేసిన కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు లయోన్ రెండు, హాజిల్ వుడ్ ఒక్క వికెట్ సాధించారు. దీంతో పాకిస్తాన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బాబర్ ఆజంకు ఫ్యూజ్‌లు ఔట్.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు బాబర్ ఆజం మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం సింగిల్ డిజిట్ స్కోర్‌కే బాబర్ పెవిలియన్‌కు చేరాడు. బాబర్‌ను ఓ అద్భుతమైన బంతితో కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్ 37 ఓవర్లో మూడో బంతిని కమిన్స్ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌గా సంధించాడు. ఆఫ్‌సైడ్ పడిన బంతి అద్బుతంగా టర్న్ అవుతూ బాబర్ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్తూ స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన బాబర్ తెల్లముఖం వేశాడు. చేసేది ఏమి లేక కేవలం ఒక్క పరుగుతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బాబర్ తొలి టెస్టులో కూడా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు. చదవండి: IND vs SA: 'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు' UNBELIEVABLE! Pat Cummins gets rid of Babar Azam again - with another BEAUTY! #OhWhatAFeeling @Toyota_Aus #AUSvPAK pic.twitter.com/iXQ6M7E10l — cricket.com.au (@cricketcomau) December 27, 2023 -
పాకిస్తాన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ క్రికెట్లోనే తొలి జట్టుగా
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 318 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లాబుషేన్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ ఏకంగా ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 52 అదనపు పరుగులను సమర్పించుకుంది. తద్వారా అత్యంత చెత్త రికార్డును పాకిస్తాన్ తమ పేరిట లిఖించుకుంది. చారిత్రత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టుగా పాక్ రికార్డులకెక్కింది. పాకిస్తాన్ సమర్పించుకున్న ఎక్స్ట్రాస్లో 15 వైడ్లు, 20 బైలు ఉన్నాయి. చదవండి: IND vs SA: 'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు' -
పాక్ బౌలర్లు కమ్‌బ్యాక్.. 318 పరుగులకు ఆసీస్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు)లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు మాత్రం పాక్ బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. 187/3 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. అదనంగా 131 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లబుషేన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఖావాజా(42), మిచెల్ మార్ష్(41) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా, షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా తొలి టెస్టులో పాక్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం.. ‘ఖేల్‌రత్న... అర్జున’ వెనక్కి -
బాబర్‌ను హత్తుకున్న ఖవాజా చిన్నారి కూతురు.. అందమైన దృశ్యాలు
ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఆసీస్ క్రికెటర్లకు స్వీట్ షాకిచ్చారు పాక్ ప్లేయర్లు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఇండోర్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న కంగారూ ఆటగాళ్లను బహుమతులతో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా వారి కుటుంబాలకు కానుకలు అందజేసిన పాకిస్తానీ క్రికెటర్లు.. చిన్నపిల్లలకు లాలీపాప్స్ అందించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్ల చర్యకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ సహా డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ తదితరలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ వారి ప్రయత్నాన్ని అభినందించారు. Warm wishes and heartfelt gifts for the Australian players and their families at the MCG indoor nets 🎁✨ pic.twitter.com/u43mJEpBTR — Pakistan Cricket (@TheRealPCB) December 25, 2023 ఇక ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూతుళ్లు.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను ఆత్మీయంగా హత్తుకుని ధన్యవాదాలు తెలియజేయడం హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన అందమైన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. A very cute moment between Babar Azam and Usman Khawaja's daughter ♥️♥️ #AUSvPAKpic.twitter.com/GP5NhpJ95f — Farid Khan (@_FaridKhan) December 25, 2023 ఈ నేపథ్యంలో.. ‘‘మైదానంలో దిగిన తర్వాతే ప్రత్యర్థులం.. మైదానం వెలుపల మాత్రం మేమెప్పటికీ స్నేహితులమే అన్న భావనతో మెలుగుతామని ఈ క్రీడాకారులు మరోసారి నిరూపించారు’’ అంటూ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాక్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. అప్పటికి 42.4 ఓవర్లలో ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇక వాన తెరిపినివ్వడంతో మళ్లీ ఆటను ఆరంభించగా.. 50 ఓవర్లలో స్కోరు 126-2గా ఉంది. చదవండి: స్టార్ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్ బోర్డు.. రెండేళ్ల నిషేధం! -
మళ్లీ అదే పొరపాటు.. తలపట్టుకున్న ఆఫ్రిది! ఆటకు వర్షం అంతరాయం
Australia vs Pakistan, 2nd Test Day 1: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక పాక్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ షాన్ మసూద్ నమ్మకాన్ని నిలబెడుతూ పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను 38 పరుగులకే పరిమితం చేశారు. వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ వదిలేశాడు నిజానికి మూడో ఓవర్ ఆఖరి బంతికే అతడు అవుట్ కావాల్సింది. కానీ అబ్దుల్లా షఫీక్ చేసిన పొరపాటు వల్ల వార్నర్‌కు లైఫ్ లభించింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచాడు. అప్పటికి ఈ ఓపెనింగ్ బ్యాటర్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. అయితే, షషీక్ పొరపాటు వల్ల బతికిపోయిన వార్నర్‌ను పాక్ స్పిన్నర్ ఆఘా సల్మాన్ పెవిలియన్‌కు పంపాడు. 28వ ఓవర్ మొదటి బంతికి సల్మాన్ బౌలింగ్‌లో.. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. David Warner gets a life on two! Shaheen Afridi gets the ball swinging and Abdullah Shafique puts it down at first slip #AUSvPAK pic.twitter.com/EJc4AptxJk — cricket.com.au (@cricketcomau) December 25, 2023 ఖవాజాను అవుట్ చేసిన హసన్ అలీ ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(101 బంతుల్లో 42 పరుగులు)ను పేసర్ హసన్ అలీ అద్భుత బంతితో అవుట్ చేశాడు. 33.1 ఓవర్ వద్ద అఘా సల్మాన్ అందుకున్న క్యాచ్‌తో ఖవాజా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ప్రస్తుతం మార్నస్ లబుషేన్ 14, స్టీవ్ స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆటకు వర్షం అంతరాయం కాగా ఆసీస్- పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 42.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అప్పుడు ఖవాజా.. ఇప్పుడు వార్నర్ ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ బృందం ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచిన విషయం తెలిసిందే. తాజాగా రెండో టెస్టులోనూ తప్పిదాన్ని పునరావృతం చేశాడు. అయితే, ఈసారి వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అతడిపై నెట్టింట మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
Aus vs Pak 2nd Test: సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ
Aus vs Pak Boxing Day Test Squads: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విఫలమైన పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు పడింది. అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను తుదిజట్టులోకి తీసుకుంది పాక్ మేనేజ్మెంట్. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత షాన్ మసూద్ పాకిస్తాన్ టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. వచ్చీరాగానే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో అతడికి కఠిన సవాలు ఎదురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో కంగారూ జట్టు చేతిలో పాక్ ఘోర పరభవాన్ని చవిచూసింది. ఏకంగా 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 89 పరుగులకే జట్టు ఆలౌట్ కావడంతో భారీ తేడాతో ఓటమి తప్పలేదు. మిగతా వాళ్లు తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం నిరాశపరిచాడు. మొత్తంగా ఏడు (3,4) పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ను తప్పించిన యాజమాన్యం అతడి స్థానాన్ని స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌తో భర్తీ చేసేంది. ఈ విషయం గురించి కెప్టెన్ షాన్ మసూద్ మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం కావాలి. రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లను ఒక్కోసారి పక్కనపెట్టాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. నొమన్ అలీ, ఖుర్రం షెహజాద్ గాయపడటంతో జట్టుకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్టు ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనుంది. ఎలాంటి మార్పులు లేకుండానే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాక్‌తో రెండో టెస్టు ఆడనున్నట్లు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. ఈ జట్టులో చోటు ఆశించి భంగపడిన వెటరన్ పేసర్ స్కాట్ బోలాండ్కు తగిన సమయంలో అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా కమిన్స్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్. పాకిస్తాన్ జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్, సాజిద్ ఖాన్. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
PAK vs AUS: పాకిస్తాన్‌కు ఊహించని షాక్..
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు ముందు పాకిస్తాన్‌కు బిగ్‌షాక్ తగిలింది. పాక్ యువ పేసర్ ఖుర్రం షాజాద్ గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టుతో అరంగేట్రం చేసిన షాజాద్.. మోకాలి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ అనంతరం అతడిని స్కానింగ్ తరలించగా గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే అతడిని పాకిస్తాన్ మేనెజ్మెంట్ తప్పించింది. కాగా తన అరంగేట్ర మ్యాచ్‌లో ఈ యువ పేసర్ అకట్టుకున్నాడు. మొదటి టెస్టులో 5 వికెట్లు పడగొట్టి షాజాద్ సత్తాచాటాడు. ఇక అతడి స్ధానంలో సీనియర్ పేసర్ హసన్ అలీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
మూలిగే నక్కమీద తాటిపండు.. పాక్‌కు మరో షాకిచ్చిన ఐసీసీ!
Aus vs Pakistan lose WTC25 Points: ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. పెర్త్ టెస్టులో నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి పాక్ జట్టుకు జరిమానా విధించింది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ పాయింట్లలో రెండు పాయింట్ల మేర కోత విధించింది. భారీ ఓటమి కాగా పాకిస్తాన్‌తో టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదివారం 450 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది పాకిస్తాన్. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 30.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. పాక్ జట్టులో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హఖ్ (10) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్ (3/31), హాజిల్‌వుడ్ (3/13), నాథన్ లియోన్ (2/14) పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు. ఆసీస్ చేతిలో మరోసారి ఘోర పరాభవం దీంతో కంగారూల చేతిలో షాన్ మసూద్ బృందానికి ఘోర పరాభవం తప్పలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 84/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 233 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక తాజా పరాజయంతో ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్‌కిది వరుసగా 15వ ఓటమి కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలో చివరిసారిగా 1995లో పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ గెలిచింది. అంతేకాదు.. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో పాకిస్తాన్‌కిది రెండో అతిపెద్ద పరాజయం. మూలిగే నక్కమీద తాటిపండు ఇన్ని పరాభవాల మధ్య డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఇప్పటికే టీమిండియాకు కోల్పోయిన పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో తొలి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో పది శాతం మేర కోతపడింది. అంతేకాదు.. రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కూడా కోల్పోయింది. దీంతో టీమిండియా అగ్రపీఠాన్ని మరింత పదిలమైంది. అప్డేట్ అయిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక PC: ICC ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైందని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు డిసెంబరు 26న మొదలుకానుంది. అదే రోజు టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభించనుంది. చదవండి: Ind vs SA: ముఖం మీదే డోర్ వేసేశాడు! పాపం రుతురాజ్.. వీడియో వైరల్ -
పాక్‌తో రెండో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! యువ ఆటగాడు రిలీజ్
పాకిస్తాన్‌తో బాక్సింగ్ డే టెస్టుకు 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. పేసర్ లాన్స్ మోరిస్‌ను రెండో టెస్టుకు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. మోరిస్ బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గోనున్నాడు. ఇదొక్కటి మినహా తమ జట్టులో ఆసీస్ ఎటువంటి మార్పు చేయలేదు. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆసీస్ 1-0 అధిక్యంలోకి దూసుకెళ్లింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఏకంగా 360 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 450 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆసీస్ బౌలర్ల దాటికి 89 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచల్ స్టార్క్, డేవిడ్ వార్నర్ -
పాకిస్తాన్‌తో తొలి టెస్టు.. పట్టు బిగించిన ఆస్ట్రేలియా
పెర్త్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆ్రస్టేలియా తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మ్యాచ్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (0), లబుషేన్ (2) విఫలం కాగా...ఉస్మాన్ ఖాజా (34 నాటౌట్), స్టీవ్ స్మిత్ (43 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 79 పరుగులు జత చేశారు. ప్రస్తుతం ఆ్రస్టేలియా ఓవరాల్ ఆధిక్యం 300 పరుగులకు చేరింది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 132/2తో ఆట కొనసాగించిన పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్‌కు 216 పరుగుల ఆధిక్యం లభించింది. ఇమామ్ ఉల్ హక్ (199 బంతుల్లో 62; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...చివర్లో సౌద్ షకీల్ (28), ఆగా సల్మాన్ (28 నాటౌట్) చివర్లో కొన్ని పరుగులు జత చేశారు. 3 వికెట్లు తీసిన నాథన్ లయన్ తన టెస్టు వికెట్ల సంఖ్యను 499కి చేర్చుకోగా...కమిన్స్, స్టార్క్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అయితే ఫాలో ఆన్ ఇవ్వకుండా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది. -
ఆసీస్‌తో టెస్టులో బాబర్ విఫలం.. వసీం అక్రం రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సందర్భంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం విఫలమయ్యాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో పాక్ ఘోర ఓటమి నేపథ్యంలో బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ పాక్ సారథిగా వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్.. టీ20 నాయకుడిగా షాహిన్ ఆఫ్రిది బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో కెప్టెన్ మార్పు అనంతరం పాకిస్తాన్ జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 113.2 ఓవర్లలో 487 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 346/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 141 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ (90; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీని చేజార్చుకున్నాడు. ఇక తొలి టెస్టు ఆడుతున్న పాక్ బౌలర్ ఆమెర్ జమాల్ 111 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (42; 6 ఫోర్లు), కెప్టెన్ షాన్ మసూద్ (30; 5 ఫోర్లు) అవుటయ్యారు. ఈ క్రమంలో శనివారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బాబర్ ఆజం.. 54 బంతులు ఎదుర్కొని 21 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ తీరుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఆసీస్- పాక్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రం సైతం బాబర్ ప్రదర్శన పట్ల పెదవి విరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by cricket.com.au (@cricketcomau) ఇదిలా ఉంటే.. మిగతా పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ 28, అఘా సల్మాన్ 28 పరుగుల(నాటౌట్)తో పర్వాలేదనిపించారు. దీంతో 271 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇక మూడో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, స్టీవ్ స్మిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్ ఈసారి డకౌట్ కాగా.. మార్నస్ లబుషేన్(2) మరోసారి నిరాశపరిచాడు. -
పాక్‌తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. ఆసీస్ భారీ స్కోర్
పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్‌కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్‌తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. -
26వ టెస్ట్ శతకం.. డేవిడ్ వార్నర్ ఖాతాలో పలు రికార్డు
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (డిసెంబర్ 14) మొదలైన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. డేవిడ్ వార్నర్ 26వ టెస్ట్ శతకంతో (211 బంతుల్లో 164; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ శతకానికి ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు తోడవ్వడంతో ఆసీస్ తొలి రోజే భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (16) ఒక్కడే కాస్త నిరాశపరిచాడు. ఆట ముగిసే సమయానికి మిచెల్ మార్ష్ (15), అలెక్స్ క్యారీ (14) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆమిర్ జమాల్ 2 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, ఖుర్రమ్ షెహజాద్, ఫహీప్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. రికార్డు శతకం.. తన కెరీర్లో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్నట్లు ఇదివరకే ప్రకటించిన వార్నర్.. తన కెరీర్ చరమాంకంలో రికార్డు శతకంతో మెరిశాడు. ఈ ఇన్నింగ్స్ ఆరంభంలో టీ20 తరహాలో చెలరేగిన వార్నీ.. ఆతర్వాత కాస్త నెమ్మిదించి డబుల్ సెంచరీ దిశగా సాగాడు. అయితే దురదృష్టవశాత్తు అతను ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో ఇమామ్ ఉల్ హాక్కు క్యాచ్ ఇచ్చి 164 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (49) చేసిన ఓపెనర్‌గా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లి (80) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా.. ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్ స్వదేశంలో పాకిస్తాన్‌తో ఆడిన గత 14 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఏడు సెంచరీలు చేసి సొంతగడ్డపై పాకిస్తాన్ పాలిట ఎంతటి ప్రమాదకారో నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనర్లు.. డేవిడ్ వార్నర్ (49) సచిన్ టెండూల్కర్ (45) క్రిస్ గేల్ (42) సనత్ జయసూర్య (41) మాథ్యూ హేడెన్ (40) రోహిత్ శర్మ (40) ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు.. విరాట్ కోహ్లి (574 ఇన్నింగ్స్‌ల్లో 80 సెంచరీలు) డేవిడ్ వార్నర్ (458 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు) జో రూట్ (437 ఇన్నింగ్స్‌ల్లో 46) రోహిత్ శర్మ (482 ఇన్నింగ్స్‌ల్లో 45) స్టీవ్ స్మిత్ (374 ఇన్నింగ్స్‌ల్లో 44) కేన్ విలియమ్సన్ (410 ఇన్నింగ్స్‌ల్లో 42) బాబర్ ఆజమ్ (300 ఇన్నింగ్స్‌ల్లో 31) ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు.. రికీ పాంటింగ్ 13378 అలెన్ బోర్డర్ 11174 స్టీవ్ వా 10927 స్టీవ్ స్మిత్ 9351 డేవిడ్ వార్నర్ 8651 మైఖేల్ క్లార్క్ 8643 -
Aus Vs Pak: మేమేం తప్పు చేశాం భయ్యా? షాక్‌లో పాక్ ఫ్యాన్స్!
David Warner 164- Australia's dominance over Pakistan on Day 1: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు గురువారం ఆరంభమైంది. పెర్త్ వేదికగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆది నుంచే దూకుడైన బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కొరకరాని కొయ్యగా మారి.. టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. దానిని శతకంగా మలచడంలో సఫలమయ్యాడు. మొత్తంగా 211 బంతులు ఎదుర్కొన్న ఈ వెటరన్ ఓపెనర్ 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 164 పరుగులు సాధించాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అందించిన శుభారంభాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 16 పరుగులకే పెవిలియన్ చేరగా.. స్టీవ్ స్మిత్ 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ మాత్రం 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీ కారణంగా ఈ మేరకు స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్ మొదటి మ్యాచ్ మొదటి రోజే సెంచరీ బాదడం విశేషం. అంతర్జాతీయ టెస్టుల్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు ఇది 26వ శతకం కాగా.. ఓవరాల్‌గా 49వది. ఇలా అద్భుత ఇన్నింగ్స్‌తో తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన వార్నర్‌పై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. పాక్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘మేమేం పాపం చేశాం వార్నర్ భాయ్?’’ అని బాధపడుతూ ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఇమ్రాన్ సిద్ధికీ అనే ఎక్స్ యూజర్.. ‘‘పాకిస్తాన్ మీద వార్నర్‌కు ఇది ఆరో సెంచరీ.. మేం చేసిన తప్పేంటి భయ్యా!’’ అంటూ వార్నర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో షేర్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఆస్ట్రేలియా- పాకిస్తాన్ తొలి టెస్టు తొలి రోజు ఆట మొత్తమంతా డేవిడ్ వార్నర్ ట్రెండింగ్‌లో నిలిచాడు. A century to silence all the doubters. David Warner came out meaning business today.@nrmainsurance #MilestoneMoment #AUSvPAK pic.twitter.com/rzDGdamLGe — cricket.com.au (@cricketcomau) December 14, 2023 Its a 6th Century for David Warner Against Pakistan Bhaii Humne Kya bigara hai ? pic.twitter.com/Gry5QkHbaN — ٰImran Siddique (@imransiddique89) December 14, 2023 -
ఫేర్వెల్ టెస్టు సిరీస్ ... పాక్‌పై సెంచరీతో చెలరేగిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్టు సిరీస్‌ను అద్భుతమైన సెంచరీతో ఆరంభించాడు. పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వార్నర్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో వార్నర్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా వార్నర్‌కు ఇది 26వ టెస్టు సెంచరీ. ఓవరాల్‌గా ఇది డేవిడ్ భాయ్‌కు 49వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్‌తో పాటు స్మిత్(17) ఉన్నాడు. కాగా ఈ సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్ నుంచి వార్నర్ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. This is David Warner. 💪 - Davey is roaring like a Lion in Test cricket. pic.twitter.com/dTpMfiwT0z — Johns. (@CricCrazyJohns) December 14, 2023 -
ఇదొక పిచ్చి నిర్ణయం.. పాకిస్తాన్ క్రికెట్‌పై విమర్శలు
పెర్త్ వేదికగా పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి టెస్టులో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్‌కు చోటు దక్కపోవడం అందరని ఆశ్యర్యపరిచింది. మ్యాచ్ ఆరంభానికి ముందే ఒక్కరోజు ముందే తుది జట్టును ప్రకటించిన క్రికెట్ పాకిస్తాన్.. రిజ్వాన్‌కు ఛాన్స్ ఇవ్వలేదు. అతడి స్ధానంలో మాజీ కెప్టెన్, వెటరన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు జట్టు మేనెజ్మెంట్ ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో పాక్ జట్టు మేనెజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం సరికాదని మాజీలు సైతం మేనెజ్మెంట్ను దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో పాక్ తరపున రిజ్వాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా రిజ్వాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అదే విధంగా వన్డే వరల్డ్‌కప్‌లో కూడా రిజ్వాన్ తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌తో పాకిస్తాన్ యువ ఆటగాళ్లు ఖుర్రం షాజాద్, అమీర్ జమాల్ టెస్టు అరంగేట్రం చేశారు. ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ -
పాక్ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్ టీ20 ఇన్నింగ్స్! చెత్త ఫీల్డింగ్‌తో
Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. పెర్త్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు ఫీల్డింగ్‌కు దిగిన పాక్‌కు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. ముఖ్యంగా వార్నర్ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ.. పాకిస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. ఖవాజా మాత్రం ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. Twin boundaries in the first! Shaheen has his tail up despite an expensive first over #AUSvPAK pic.twitter.com/oixensArZG — cricket.com.au (@cricketcomau) December 14, 2023 షఫీక్ ఆ క్యాచ్ జారవిడవడంతో పాక్ అరంగేట్ర పేసర్ ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ.. వార్నర్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనిస్తున్నాడు. కాగా పదహారో ఓవర్ ఆరంభంలో ఆమిర్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు ఉస్మాన్ ఖవాజా. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా అబ్దుల్లా షఫీక్ క్యాచ్ పట్టినట్టే పట్టి జారవిడిచాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఖవాజా.. మరోసారి తప్పిదం పునరావృతం చేయలేదు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 25 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది పటిష్ట స్థితిలో నిలిచింది. WTF bcci installed a chip in the ball 😤#AUSvsPAK pic.twitter.com/xoNuaUK3s9 — 𝙕𝙀𝙀𝙈𝙊™ (@Broken_ICTIAN) December 14, 2023 వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు చుక్కలే లంచ్ బ్రేక్ సమయానికి డేవిడ్ వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు సాధించగా.. ఉస్మాన్ ఖవాజా 84 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సహా ఇతర బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టాలని విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖవాజా ఇచ్చిన సిట్టర్‌ను డ్రాప్ చేసిన అబ్దుల్లా షఫీక్‌పై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. ఖవాజా క్యాచ్‌ను అతడు జారవిడిచిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉందన్న విషయం తెలిసిందే. 1995లో కంగారూ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్.. ఇంతవరకు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై? Tired of the conventional, David Warner's 12th boundary of the first session was nothing short of inventive! 😯#AUSvPAK @nrmainsurance #PlayOfTheDay pic.twitter.com/8ih9vnjhUj — cricket.com.au (@cricketcomau) December 14, 2023 -
ఆసీస్‌ను పాక్ ఆపతరమా..? తొలి టెస్టుకు సర్వం సిద్దం
పెర్త్: ప్రపంచకప్ గెలిచిన సమరోత్సాహంతో ఉన్న ఆ స్ట్రేలియా, పేలవ ప్రదర్శనతో పరిమిత ఓవర్ల లోనూ తడబడుతున్న పాకిస్తాన్ మధ్య టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే తొలి టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై తిరుగులేని జట్టయిన ఆసీస్ అన్ని రకాలుగా బలంగా కనిపిస్తూ నిస్సందేహంగా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. మరో వైపు వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత జట్టు, కెప్టెన్ల మార్పులతో పాక్ బరిలోకి దిగుతోంది. 1995లో ఆసీస్ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. 1999 టూర్‌నుంచి ఆ జట్టు వరుసగా 14 టెస్టుల్లో ఓడింది. కనీసం ‘డ్రా’గా కూడా ముగించలేకపోయింది. టెస్టుకు ముందు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖాజా గాజాలో పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నట్లుగా తన షూస్‌కు ‘ఆల్ లైవ్స్ ఆర్ ఈక్వల్’ అనే క్యాప్షన్‌తో ప్రాక్టీస్‌తో పాల్గొన్నాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి క్రికెట్ మైదానంలో ప్రదర్శించరాదు. ఖాజాకు తన భావాలను ప్రదర్శించే స్వేచ్ఛ ఉందని ఆసీస్ బోర్డు, కెప్టెన్ కమిన్స్ అండగా నిలిచినా... అతను ఆ వ్యాఖ్యలు ఉన్న షూస్‌తో టెస్టు బరిలోకి దిగరాదని నిర్ణయించుకున్నాడు. తనది రాజకీయ ప్రకటన కాదని, మానవత్వం మాత్రమేనని ఖాజా అన్నాడు.