అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ల వెనక అద్బుతం చేశాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఏకంగా 6 క్యాచ్‌లను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఫీట్‌ను రిజ్వాన్ తన పేరిట లిఖించుకున్నాడు.
వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పాకిస్తాన్ వికెట్‌కీపర్‌గా సర్ఫరాజ్ ఆహ్మద్ రికార్డును సమం చేశాడు. మార్చి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సర్ఫరాజ్ కూడా ఆరు క్యాచ్‌లను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ రిజ్వాన్‌కు లభించింది. కానీ జంపా ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రిజ్వాన్ జారవిడచడంతో ఆహ్మద్‌ను అధిగమించలేకపోయాడు. లేదంటే 7 క్యాచ్‌లతో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయివుండేది.
నిప్పులు చెరిగిన రవూఫ్
కాగా ఈ మ్యాచ్‌లో పాక్ స్పీడ్‌స్టర్ హారిస్ రౌఫ్ నిప్పులు చేరిగాడు. రౌఫ్ 5 వికెట్ల హాల్‌తో చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్లకు వారి సొంతగడ్డపైనే రౌఫ్ చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి కంగారులు బెంబేలెత్తిపోయారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హారిస్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. రౌఫ్‌తో పాటు షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే'
Comments
Please login to add a commentAdd a comment