Mohammad Rizwan
-
ఆసీస్‌తో మూడో టీ20.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్! ఎవరంటే?
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఆఖరి టీ20లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.అయితే ఈ చివరి మ్యాచ్‌లో పాక్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో పాక్ జట్టుకు సల్మాన్ అలీ అఘా సారథ్యం వహించనున్నాడు. రిజ్వాన్‌తో పాటు స్టార్ పేసర్ నషీం షాకు కూడా జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. వీరిద్దరి స్థానాల్లో హసీబుల్లా ఖాన్, పేసర్ జహందాద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. అయితే 21 ఏళ్ల జహందాద్ ఖాన్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం. దేశవాళీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తుండండంతో జహందాద్కు సెలక్టర్లు చోటు ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లుఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జోష్ ఇంగ్లిస్(కెప్టెన్/ వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జాంపాపాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), సాహిబ్జాదా ఫర్హాన్, బాబర్ ఆజం, హసీబుల్లా ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్, షాహీన్ అఫ్రిది, జహందాద్ ఖాన్, హరీస్ రవూఫ్, సోఫియన్ ముఖీమ్చదవండి: అతడొక అద్బుతం.. తొలి టెస్టులో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడించండి: రవిశాస్త్రి -
ఒకే ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు.. మహ్మద్ రిజ్వాన్ అరుదైన రికార్డు
అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ల వెనక అద్బుతం చేశాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ ఏకంగా 6 క్యాచ్‌లను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఫీట్‌ను రిజ్వాన్ తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న పాకిస్తాన్ వికెట్‌కీపర్‌గా సర్ఫరాజ్ ఆహ్మద్ రికార్డును సమం చేశాడు. మార్చి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సర్ఫరాజ్ కూడా ఆరు క్యాచ్‌లను అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ రిజ్వాన్‌కు లభించింది. కానీ జంపా ఇచ్చిన ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రిజ్వాన్ జారవిడచడంతో ఆహ్మద్‌ను అధిగమించలేకపోయాడు. లేదంటే 7 క్యాచ్‌లతో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయివుండేది.నిప్పులు చెరిగిన రవూఫ్కాగా ఈ మ్యాచ్‌లో పాక్ స్పీడ్‌స్టర్ హారిస్ రౌఫ్ నిప్పులు చేరిగాడు. రౌఫ్ 5 వికెట్ల హాల్‌తో చెలరేగాడు. ఆసీస్ బ్యాటర్లకు వారి సొంతగడ్డపైనే రౌఫ్ చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి కంగారులు బెంబేలెత్తిపోయారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన హారిస్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. రౌఫ్‌తో పాటు షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్ల పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs SA: 'అతడికి ఇది డూ ఆర్ డై సిరీస్.. లేదంటే ఇక మర్చిపోవాల్సిందే' -
అదృష్టం వల్లే ఆస్ట్రేలియా గెలిచింది: పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓటమితో ఆరంభించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. పాక్ పేసర్లు అద్భుతంగా పోరాడినప్పటకి విజయం మాత్రం వరించలేదు.తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 202 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, కమ్మిన్స్, జంపా తలా రెండు వికెట్లు సాధించి పాక్‌ను దెబ్బతీశారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్(44), ఇంగ్లీష్(49) నిలకడగా ఆడటంతో ఆసీస్ సునాయసంగా లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా భావించారు.కానీ పాక్ హ్యారీస్ రవూఫ్ మాత్రం మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఒక్కసారిగా పాక్ జట్టు మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పుకుంది. అయితే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(32 నాటౌట్) ఆఖరివరకు క్రీజులో నిలుచోని తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఇక ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందిచాడు. తమ జట్టు పేస్ బౌలర్లపై రిజ్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ ఓటమి మాకు ఎటువంటి నిరాశ కలిగించలేదు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆఖరి వరకు పోరాడాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌లో అదే చేశాము. చివర వరకు పోరాడి ఓడిపోయాం. ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మేము బ్యాటింగ్‌పై కాస్త దృష్టిపెట్టాలి. హ్యారీస్ రవూఫ్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. మా నలుగురు పేసర్లు కూడా తమ పని తాము చేశారు. తర్వాతి మ్యాచ్‌లో కూడా నలుగురు పేసర్లతోనే ఆడనున్నాం. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు కాస్త ఆదృష్టం కలిసొచ్చింది అని పోస్ట్ మ్యాచ్ప్రేజేంటేషన్లో రిజ్వాన్ పేర్కొన్నాడు. -
టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక.. : మహ్మద్ రిజ్వాన్
చాంపియన్స్ ట్రోఫీ రూపంలో వచ్చే ఏడాది మరో ఐసీసీ టోర్నీ అభిమానులకు వినోదం పంచనుంది. పాకిస్తాన్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా పాల్గొంటుందా? లేదా? అన్న అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ సేనను పాకిస్తాన్‌కు పంపేందుకు సుముఖంగా లేదు.వారి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదుఈ నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించాలని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే, పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు తమ దేశంలో పర్యటించాయి కాబట్టి.. భారత జట్టు భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని వాదిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. లాహోర్ వేదికగా టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నామని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ కూడా ఇటీవల వ్యాఖ్యానించాడు. అతడి వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ కూడా చాంపియన్స్ ట్రోఫీ వేదికను మార్చబోమని స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో టీమిండియా ఈ మెగా టోర్నీలో ఆడకుండా బహిష్కరిస్తే మాత్రం భారీ నష్టం తప్పదు. భారత జట్టు టోర్నమెంట్లో లేకుంటే.. ప్రసార హక్కులు కొనేందుకు కూడా ఎవరూ ముందుకు రారని ఇంగ్లండ్ బోర్డు పెద్దలు సైతం అభిప్రాయపడ్డారు.టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే గనుక..ఈ క్రమంలో పాకిస్తాన్ వన్డే, టీ20 జట్ల కొత్త కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తమ దేశానికి రావాలని విజ్ఞప్తి చేశాడు. ‘‘పాకిస్తాన్‌లోని క్రికెట్ అభిమానులకు టీమిండియా ఆటగాళ్లు అంటే ఎంతో ఇష్టం. తమ దేశంలో భారత క్రికెటర్లు ఆడుతుంటే చూడాలని వారు ఆశపడుతున్నారు.మేము భారత్‌కు వెళ్లినపుడు అక్కడ మాకు సాదర స్వాగతం లభించింది. అయితే, వాళ్లు చాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి ఇక్కడికి వస్తారో లేదో తెలియదు.. ఒకవేళ వస్తే మాత్రం టీమిండియాకు ఇక్కడ ఘన స్వాగతం లభిస్తుంది’’ అని రిజ్వాన్ పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు గతేడాది పాక్ జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బాబర్ ఆజం ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. పాక్ బోర్డు ఆ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిజ్వాన్‌కు అప్పగించింది. చదవండి: Expensive Players In IPL: ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే..! -
ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం: పాక్ కొత్త కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని మహ్మద్ రిజ్వాన్ హర్షం వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఆడాలన్న కోరికతో పాటు సారథిగా ఎదగాలన్న కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతామాజీ కెప్టెన్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తనదైన శైలిలో జట్టుకు ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతానంటూ రిజ్వాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం తర్వాత బాబర్ ఆజం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. షాన్ మసూద్ టెస్టులు, షాహిన్ ఆఫ్రిది టీ20 జట్టు కెప్టెన్లుగా నియమితులయ్యారు.అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలోనూ షాన్ మసూద్‌ను కొనసాగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ఆఫ్రిదిపై మాత్రం వేటువేసింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024కు ముందు బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఈసారి కూడా పాక్ మెగా టోర్నీలో విఫలం కావడంతో బాబర్ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించినట్లు పీసీబీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రిజ్వాన్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాంఈ నేపథ్యంలో రిజ్వాన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘గతంలో ఆస్ట్రేలియా గడ్డపై మేము ఇబ్బంది పడ్డామన్న మాట వాస్తవం. అయితే, ఈసారి మాత్రం అభిమానుల కలను నెరవేరుస్తాం. గత సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో చివరి వరకు విజయం మాదే అన్నట్లుగా పోరాటం సాగించాం. కానీ దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో ప్రతికూల ఫలితం వచ్చేది. నాడు చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్ చివరగా 2002లో ఆసీస్‌లో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నవంబరు 4- 18 వరకు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక వరుస వైఫల్యాల అనంతరం ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి 2-1తో గెలిచింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
పాకిస్తాన్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్..!?
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న పాకిస్తాన్ తమ తదుపరి సవాల్‌కు సిద్దమైంది. ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ ఆసీస్ పర్యటనకు ముందు పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడు.స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్‌ను తమ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. జియో న్యూస్ ప్రకారం.. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంపై పీసీబీ నుంచి ఆధికారిక ప్రకటన వెలవడనుంది. ఇప్పటికే పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీతో రిజ్వాన్ సమావేశమైనట్లు సదరు మీడియా సంస్థ తమ కథనాల్లో పేర్కొంది.ఈ మీటింగ్‌లోనే పాక్ వన్డే, టీ20ల్లో పాక్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రిజ్వాన్ అంగీకరించినట్లు సమాచారం. ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ సూచన మేరకు రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ పాక్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.కాగా కెప్టెన్సీ పరంగా రిజ్వాన్‌కు అనుభవం ఉంది. జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనప్పటకీ, పాకిస్తాన్ సూపర్ లీగ్, దేశీవాళీ టోర్నీల్లో నాయకత్వ పాత్ర పోషించాడు. పీఎస్ఎల్-2021లో అతడి సారథ్యంలోనే ముల్తాన్ సుల్తాన్ ముల్తాన్ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర వైఫల్యం తర్వాత పాక్ కెప్టెన్సీ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం తప్పుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 4న జరగనున్న తొలి వన్డేతో పాక్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.చదవండి: IND vs NZ: రెండో టెస్టులో ఘోర ఓటమి.. గౌతం గంభీర్ కీలక నిర్ణయం!? -
చరిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్..
పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్‌గా రిజ్వాన్ రికార్డులకెక్కాడు.రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సర్ఫరాజ్ ఆల్‌టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 39 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్.. 41.85 సగటుతో 2009 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ కేవలం 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే' -
Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పూర్తిగా విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా అతడి ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. హై వే రోడ్డు మీద సైతం బ్యాటింగ్ చేయడం చేతకాదంటూ సోషల్ మీడియాలో రిజ్వాన్ బ్యాటింగ్‌పై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.ఓపెనర్ల సెంచరీలుకాగా బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్... ఇంగ్లండ్‌తో సిరీస్‌ను మెరుగ్గా ఆరంభించింది. ముల్తాన్ వేదికగా సోమవారం మొదలైన మ్యాచ్‌లో కెప్టెన్ షాన్ మసూద్ (177 బంతుల్లో 151; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (184 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో ఆకట్టుకున్నారు.ఇంగ్లండ్ అనుభవజ్ఞులైన బౌలర్లు ఈ పర్యటనకు దూరంగా ఉండటం పాకిస్తాన్‌కు కలిసివచ్చింది. దీంతో తొలిరోజు పూర్తిగా ఆతిథ్య జట్టు పైచేయి సాధించి.. భారీస్కోరుకు బాటలు వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. నసీం షా సైతం 33 పరుగులతోఈ క్రమంలో మంగళవారం రెండో రోజు ఆటలో సౌద్ షకీల్ అర్ధ శతకం(177 బంతుల్లో 82 రన్స్) పూర్తి చేసుకోగా.. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పేసర్ నసీం షా సైతం 33 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, అనూహ్యంగా ఏడో స్థానంలో వచ్చిన స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం నిరాశపరిచాడు.రిజ్వాన్ మాత్రం డకౌట్ఈ వికెట్ కీపర్ 12 బంతులు ఎదుర్కొన్నా ఖాతా తెరవలేకపోయాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు రిజ్వాన్ ఆట తీరుపై జోకులు పేలుస్తున్నారు. ‘‘ముల్తాన్ పిచ్‌ను హై వే రోడ్డులా మార్చేసినా.. నువ్వు పరుగులు చేయలేవు. బౌలర్లు కూడా బంతిని బాదుతున్నారు. నువ్వు మాత్రం చెత్తగా ఆడుతున్నావు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టుల్లో రిజ్వాన్ రాణించలేకపోతున్నాడు. 2022-23లో జరిగిన సిరీస్‌లోనూ రిజ్వాన్ వరుసగా 29, 46, 10, 30, 19, 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. మంగళవారం మధ్యాహ్నం టీ బ్రేక్ సమయానికి పాకిస్తాన్ 138 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 515 పరుగులు చేసింది.చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
‘ఈసారి అతడిని కెప్టెన్ చేయకపోతే పాక్ జట్టుకు అధోగతే’
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. షాహిన్ ఆఫ్రిది వంటి పాక్ దిగ్గజాలు ఇప్పటికే ఈ విషయం గురించి పాక్ బోర్డుకు సూచనలు చేయగా.. మరో మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా ఇదే మాట అంటున్నాడు. బాబర్‌కు నాయకత్వ లక్షణలు లేవని.. అతడిని ఇకపై సారథిగా కొనసాగించవద్దని సూచిస్తున్నాడు.సరైన నిర్ణయం తీసుకోకపోతేబాబర్ ఆజం స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు పాక్ వన్డే, టీ20 పగ్గాలు అప్పగించాలని బసిత్ అలీ విజ్ఞప్తి చేశాడు. ఇప్పుడు గనుక కెప్టెన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే.. పాక్ క్రికెట్ మరింత భ్రష్టుపట్టిపోతుందని హెచ్చరించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల(వన్డే, టెస్టు, టీ20) కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులయ్యారు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అనూహ్యంగా షాహిన్‌పై వేటు వేసిన పాక్ బోర్డు.. తిరిగి వన్డే, టీ20 నాయకత్వ బాధ్యతలను బాబర్‌కు అప్పగించింది. అయితే, గత టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన అతడు.. ఈసారి మాత్రం కనీసం సూపర్-8కు చేర్చలేకపోయాడు. ఫలితంగా బాబర్‌పై వేటు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ మాట్లాడుతూ.. మహ్మద్ రిజ్వాన్‌లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. చాంపియన్స్ వన్డే కప్-2024లో అతడు మార్ఖోర్స్ జట్టును నడిపిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. బాబర్ బదులు రిజ్వాన్‌ను పాకిస్తాన్ కెప్టెన్ చేయాలని సూచించాడు.బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు‘‘తన కంటే పాకిస్తాన్‌కు మెరుగైన కెప్టెన్ మరొకరు దొరకరు అనేలా రిజ్వాన్ చాంపియన్స్ కప్‌లో జట్టును నడిపిస్తున్నాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేస్తూ.. మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. బాబర్ ఇలాంటి విషయాల్లో అస్సలు పనికిరాడు. షాన్ మసూద్ కూడా రిజ్వాన్లా జట్టుకు న్యాయం చేయలేడు.ఈసారి గనుక రిజ్వాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించకపోతే పాకిస్తాన్ క్రికెట్‌కు అంతకంటే భారీ నష్టం మరొకటి ఉండదు. రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన సమయం’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ చాంపియన్స్ వన్డే కప్‌లో మహ్మద్ రిజ్వాన్ మార్ఖోర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ జట్టు ఆదివారం నాటి మ్యాచ్‌లో స్టాలియన్స్‌ను 126 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక బాబర్ ఆజం స్టాలియన్స్ జట్టుకు ఆడుతుండటం కొసమెరుపు. చదవండి: 4,4,4,4,4: బాబర్ ఆజం ఫోర్ల వర్షం.. అంత ఈజీగా ఎలా కొట్టేశాడు! -
Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. తొమ్మిదికి పడిపోయిన బాబర్
ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్లో ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. ఏకంగా మూడుస్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకు సంపాదించాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బ్రూక్.. తొలి మ్యాచ్‌లో వరుసగా 56, 32 పరుగులు సాధించాడు.టాప్-10లోనే మనోళ్లుఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థానాన్ని భర్తీ చేస్తూ టాప్-5లో నిలిచాడు. ఇక ఇంగ్లిష్ వెటరన్ స్టార్ జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండియా స్టార్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో ర్యాంకులో కొనసాగుతుండగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక స్థానం(7), రన్‌మెషీన్ విరాట్ కోహ్లి(8) రెండు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-10లో నిలిచారు.తొమ్మిదికి పడిపోయిన బాబర్కాగా గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్న పాక్ బ్యాటర్ బాబర్ ఆజం ఏకంగా ఆరు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. అయితే, ఇటీవల బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో శతకం బాదిన పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ పదవ ర్యాంకు అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో 191 పరుగులతో చెలరేగిన బంగ్లా వెటరన్ స్టార్ ముష్ఫికర్ రహీం సైతం కెరీర్ హై రేటింగ్ సాధించి 17వ ర్యాంకులో నిలిచాడు.ఐసీసీ తాజా టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10👉జో రూట్(ఇంగ్లండ్)- 881 రేటింగ్ పాయింట్లు👉కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు👉డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు👉హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 758 రేటింగ్ పాయింట్లు👉స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు👉రోహిత్ శర్మ(ఇండియా)- 751 రేటింగ్ పాయింట్లు👉యశస్వి జైస్వాల్(ఇండియా)- 740 రేటింగ్ పాయింట్లు👉విరాట్ కోహ్లి(ఇండియా)- 737 రేటింగ్ పాయింట్లు👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- 734 రేటింగ్ పాయింట్లు👉ఉస్మాన్ ఖవాజా(ఆస్ట్రేలియా)- 728 రేటింగ్ పాయింట్లుఇక టెస్టు బౌలర్ల ర్యాంకుల విషయానికొస్తే టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. జోష్ హాజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), కగిసో రబడ(సౌతాఫ్రికా) టాప్-5లో నిలకడగా ఉన్నారు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ మైదానంలో మరోసారి దురుసుగా ప్రవర్తించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా షకీబ్.. పాక్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ముఖంపైకి ఉద్దేశపూర్వకంగా బంతిని విసిరాడు. దీని కారణంగా ఐసీసీ షకీబ్ మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది. అలాగే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కింద ఓ డీ మెరిట్ పాయింట్ పొందాడు. 😲😲pic.twitter.com/5fybTO3j1h— CricTracker (@Cricketracker) August 25, 2024ఈ ఘటన ఆట చివరి రోజు (ఆదివారం) పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ సందర్భంగా జరిగింది. షకీబ్ బంతి వేయడానికి సిద్దం కాగా.. రిజ్వాన్ చివరి నిమిషంలో స్ట్రయిక్ నుంచి వెనక్కు తగ్గాడు. దీంతో చిర్రెత్తిపోయిన షకీబ్ కోపంగా బంతిని రిజ్వాన్వైపు విసిరాడు. ఇది గమనించిన ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బొరో షకీబ్‌ను వెంటనే మందలించాడు. అంతటితో విషయం సద్దుమణిగింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి లేదా ఇతరత్రా వస్తువులను ఆటగాళ్లపై కానీ, వారి సమీపంలో కానీ విసిరడం లెవెల్ 1 ఉల్లంఘన కింద పరిగణిస్తారు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.9 కింద షకీబ్‌కు పెనాల్టీ విధించారు.కాగా, ఇదే మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోపు కోటా ఓవర్లు పూర్తి చేయనందుకు పాక్, బంగ్లాదేశ్ జట్లకు ఐసీసీ షాకిచ్చింది. పాక్‌కు ఆరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు, బంగ్లాదేశ్‌కు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడింది. ఈ పాయింట్ల కోత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆయా జట్ల స్థానాలపై ప్రభావం చూపించింది. మూడు పాయింట్లు కోల్పోయినందుకు బంగ్లాదేశ్ ఏడో స్థానానికి పడిపోగా.. పాక్ పాయింట్లు మరింత తగ్గిపోయి ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.ఇదిలా ఉంటే, రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
మొహమ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినా ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున అత్యధిక పరుగులు (ఓ మ్యాచ్‌లో) చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రిజ్వాన్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు (నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ 222 పరుగులు చేశాడు. పాక్ తరఫున ఓ మ్యాచ్‌లో ఇన్ని పరుగులు చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్ ఎవరూ లేరు. 1980లో తస్లిమ్ ఆరిఫ్ ఓ మ్యాచ్‌లో 210 (తొలి ఇన్నింగ్స్‌లో 210 నాటౌట్) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ మరో రికార్డు కూడా సాధించాడు. పాక్ తరఫున ఓ టెస్ట్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో సర్ఫరాజ్ ఖాన్ రెండుసార్లు ఓ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం. పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
'బంతి బంతికి అరుస్తునే ఉంటాడు'.. రిజ్వాన్‌పై భారత అంపైర్ ఫైర్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ వరల్డ్ క్రికెట్ అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. తన అద్భుత ఇన్నింగ్స్‌లతో పాకిస్తాన్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఘనత రిజ్వాన్‌ది. అయితే రిజ్వాన్ తన ఆటతీరుతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. మైదానంలో తన చేష్టలతో అంతే చెడ్డపేరు తెచ్చుకున్నాడు. వికెట్ల వెనక ఉండి పదే పదే అప్పీల్ చేయడం, క్రాంప్స్(తిమ్మరి) వచ్చినట్లు మైదానంలో పడిపోవడం వంటివి చేస్తూ అంపైర్లను ఎక్కవగా అతడు విసుగిస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రిజ్వాన్‌పై భారత్‌కు చెందిన ఐసీసీ ఎలైట్ ప్యానిల్ అంపైర్ అనిల్ చౌదరి విమర్శల వర్షం కురిపించాడు. రిజ్వాన్ ప్రతీ బంతికి అప్పీల్ చేస్తాడని, అది సరైన పద్దతి కాదని చౌదరి మండిపడ్డాడు."ఆసియాకప్‌లో పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌కు నేను ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాను. మహ్మద్ రిజ్వాన్ వికెట్లు వెనక ఉండి కంటిన్యూగా అప్పీల్ చేస్తూనే ఉంటాడు. అప్పటికే చాలా మ్యాచ్‌ల్లో అతడి తీరును నేను గమనించాను. అయితే నాతో పాటు ఉన్న మరో అంపైర్‌కు రిజ్వాన్ కోసం పెద్దగా తెలియదు.కాబట్టి అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలని నా తోటి అంపైర్‌కు చెప్పాను. ఓ సందర్భంలో రిజ్వాన్ గట్టిగా అప్పీల్ చేయడంతో నాతోటి అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తడానికి సిద్దమయ్యాడు. కానీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుని నాటౌట్ అంటూ తలఊపాడు. పాక్ రివ్యూకు వెళ్లినప్పటకి నాటౌట్ తేలింది.రిజ్వాన్ అంతే బంతి బంతికి అరుస్తూనే ఉంటాడు. తెల్లటి లిప్ బామ్ పూసుకుని పావురంలా జంప్ చేస్తూ ఉంటాడు. మంచి కీపర్ ఎవరనేది మంచి అంపైర్‌కు తెలుస్తుంది. అంతేతప్ప పదేపదే అప్పీల్ చేస్తే ఔట్‌గా ప్రకటించడు. అంతేకాకుండా టెక్నాలజీ కూడా బాగా అభివృద్ది చెంది. అటువంటి అప్పుడు మీరు ఎందుకు హైలెట్ కావాలి. ప్రజలు అంతా గమనిస్తారు. ఆఖరి ట్రోల్స్‌కు గురవ్వడం తప్ప ఇంకొకటి ఉండదు"అని చౌదరి ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా రిజ్వాన్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 249 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 171 పరుగులు చేశాడు. -
రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టిన రిజ్వాన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ పలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచరీతో (171 నాటౌట్) విరుచుకుపడిన రిజ్వాన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పేరిట ఉండేది. 2022లో పంత్ ఇంగ్లండ్‌పై 146 పరుగులు చేశాడు.నిన్నటి మ్యాచ్‌లో సెంచరీ అనంతరం రిజ్వాన్.. పంత్ పేరిట ఉండిన మరో రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పంత్ డబ్ల్యూటీసీలో 1575 పరుగులు చేయగా.. రిజ్వాన్ 1658 పరుగులు చేసి డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. రిజ్వాన్ పాటు సౌద్ షకీల్ (141) సెంచరీ చేయడంతో పాక్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. షద్మాన్ ఇస్లాం 12, జకీర్ హసన్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్.. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 421 పరుగులు వెనుకపడి ఉంది. -
BAN vs PAK: పాకిస్తాన్ 448/5.. తొలి ఇన్నింగ్స్ డిక్లేర్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్లు దుమ్ములేపారు. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది.158/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజును ఆట ప్రారంభించిన పాక్ జట్టు అదనంగా మరో 290 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్, వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్ 174 పరుగులతో ఆజేయంగా నిలవగా.. షకీల్ 141 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అయూబ్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే టాపర్డర్ బ్యాటర్లు షఫీక్(2), షాన్ మసూద్(6), బాబర్ ఆజం(0) నిరాశ పరిచారు. ఇక బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం, హసన్ మహ్ముద్ తలా రెండు వికెట్లు సాధించగా.. షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో షద్మాన్ ఇస్లాం(12), జాకిర్ హోస్సేన్(11) పరుగులతో ఉన్నారు. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. సెంచరీతో కదంతొక్కిన మొహమ్మద్ రిజ్వాన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ సెంచరీతో కదంతొక్కాడు. రిజ్వాన్ తన సెంచరీ మార్కును 143 బంతుల్లో తాకాడు. రిజ్వాన్ కెరీర్లో ఇది మూడో టెస్ట్ శతకం. ప్రస్తుతం రిజ్వాన్ 147 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 75 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోర్ 277/గా ఉంది. రిజ్వాన్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న సౌద్ షకీల్ కూడా సెంచరీకి చేరువయ్యాడు. షకీల్ 182 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, పాక్ 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించింది. తొలి రోజు ఆటలో పాక్ అబ్దుల్లా షఫీక్ (2), సైమ్ అయూబ్ (56), షాన్ మసూద్ (6), బాబర్ ఆజమ్ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్తాం, హసన్ మహ్మూద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రెండో రోజు బంగ్లాదేశ్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. షకీల్ 1000 పరుగుల మార్కును తాకేందుకు 20 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 1959లో సయీద్ అహ్మద్ కూడా ఇన్నే ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మైలురాయిని తాకాడు. -
అతడికి ధోనీతో పోలికా? ఏం మాట్లాడుతున్నావ్: భజ్జీ ఫైర్
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ జర్నలిస్ట్‌కు అదరి పోయే కౌంటరిచ్చాడు. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ కీపర్-బ్యాటర్ ఎంఎస్ ధోనిని పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌తో పోల్చినందుకు సదరు జర్నలిస్ట్‌పై హర్భజన్ మండిపడ్డాడు.ఫరీద్ ఖాన్ అనే పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎంఎస్ ధోని, మహ్మద్ రిజ్వాన్‌లలో ఎవరు బెటర్ అన్న పోల్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అందుకు స్పందించిన భజ్జీ ఇదేమి చెత్త ప్రశ్న అంటూ ఫైరయ్యాడు. "ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం దారుణం. భయ్యా అతడికి ఎవరైనా చెప్పండి.ధోనితో రిజ్వాన్‌కు పోలికా? రిజ్వాన్ కంటే ధోని చాలా ముందున్నాడు. మీరు ఇదే విషయం రిజ్వాన్‌ను అడిగినా అతడు నిజాయితీగా సమాధానం చెబుతాడు. రిజ్వాన్ ఆట అంటే నాకు కూడా ఇష్టం. అతడు జట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తాడు. కానీ ధోనీతో రిజ్వాన్‌ను పోల్చడం చాలా తప్పు.ప్రపంచ క్రికెట్లో ఇప్పటికీ ధోనినే నంబర్ వన్. వికెట్ల వెనక ధోనిని మించిన వారే లేరు" అంటూ ఎక్స్‌లో భజ్జీ రిప్లే ఇచ్చాడు. ఇక భారత క్రికెట్లో ధోని కంటూ ఒక ప్రత్యేకస్ధానముంది.భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ధోనినే. అతడి సారథ్యంలోనే 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. What r u smoking nowadays ???? What a silly question to ask . Bhaiyo isko batao . DHONI bhut aage hai RIZWAN se Even if u will ask Rizwan he will give u an honest answer for this . I like Rizwan he is good player who always play with intent.. but this comparison is wrong. DHONI… https://t.co/apr9EtQhQ4— Harbhajan Turbanator (@harbhajan_singh) July 19, 2024 -
'పదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు.. కొంచెం కూడా గేమ్ ప్లాన్ లేదు': అక్రమ్
టీ20 వరల్డ్‌కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఆదివారం న్యూయర్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ చతకిలపడింది.దీంతో తమ సూపర్-8 ఆశలను పాక్ సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్ పాక్ ఆటగాళ్లపై ఆ దేశ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విమర్శల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రాను మహ్మద్ రిజ్వాన్ మరింత జాగ్రత్తగా ఆడుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అక్రమ్ మండిపడ్డాడు."వారు 10 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారు. మా ఆటగాళ్లకు క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పించలేను. తొలుత మహ్మద్ రిజ్వాన్‌కు అస్సలు గేమ్‌పై అవగాహన లేదు. వికెట్లు తీయడానికే బుమ్రాను రోహిత్ ఎటాక్‌లోకి తెచ్చాడని రిజ్వాన్‌కు తెలుసు. అటువంటి అప్పుడు అతడి బౌలింగ్‌ను జాగ్రత్తగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. కానీ రిజ్వాన్ మాత్రం రిజ్వాన్ భారీ షాట్‌కు వెళ్లి వికెట్ కోల్పోయాడు. ఇక ఇఫ్తికార్ అహ్మద్‌కి లెగ్ సైడ్ ఆడటం తప్ప ఇంకేమి రాదు. గతకొన్నేళ్లగా జట్టులో భాగమైనా బ్యాటింగ్ ఎలా చేయాలి అతడికి తెలియదు. పాక్ ఆటగాళ్లకు ఒక్కటే తెలుసు. మేము ఆడకపోతే మాకెంటి నష్టం, కోచ్‌లను కదా తొలగిస్తారని థీమాగా ఉన్నారు. కానీ నావరకు అయితే కోచ్‌లను కొనసాగించి మొత్తం జట్టును మార్చాల్సిన సమయమిదని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ పేర్కొన్నాడు. -
టీమిండియా విజయం.. క్రెడిట్ మొత్తం మా వాళ్లకే: అక్తర్
‘‘టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం పాకిస్తాన్‌కే ఇవ్వాలి. ఓడిపోవడానికి అత్యుత్తమంగా ప్రయత్నించారు. ఇంతకంటే గొప్పగా వాళ్ల గురించి చెప్పడానికి ఏమీ లేదు.పాకిస్తాన్ మిడిలార్డర్‌ను గమనించారా? మిమ్మల్ని ఎవరూ షాట్లు ఆడమని అడుగలేదు. కనీసం చెత్త షాట్లు ఆడకుండా ఉంటే చాలని మాత్రమే కోరుకున్నాం.కానీ మీరదే చేశారు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారు. విజయం చేరువగా వచ్చినా.. మాకొద్దే వద్దు అన్నట్లు వెనక్కి నెట్టేశారు. ఇది నిజంగా షాకింగ్‌గా.. సర్ప్రైజ్గా ఉంది’’ అని పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ బాబర్ ఆజం బృందంపై విరుచుకుపడ్డాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్ వేదికగా తలపడ్డ దాయాదుల పోరు ఆద్యంతం ఆసక్తి రేపింది.తొలుత అద్భుత బౌలింగ్‌తో టీమిండియాను 119 పరుగులకే కట్టడిచేయగలిగిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో మాత్రం చేతులెత్తేసింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచి మరోసారి టీమిండియా చేతిలో భంగపాటుకు గురైంది. నిజానికి ఏ ఒక్క బ్యాటర్ కాసేపు ఓపికగా నిలబడినా ఫలితం వేరేలా ఉండేదేమో!అయితే, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధాటికి పరుగులు రాబట్టలేక చతికిల పడ్డ పాక్ బ్యాటర్లు.. ఓటమిని చేజేతులా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు చేశారు.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
వాళ్ల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం: బాబర్ ఆజం
టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి పైచేయి సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని చాటుకుంటూ మెగా ఈవెంట్లో బాబర్ ఆజం బృందాన్ని ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్-2024లో వరుసగా రెండో విజయం నమోదు చేసి గ్రూప్-ఏలో అగ్రస్థానం నిలబెట్టుకుంది.ఇక ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఓటమిపై స్పందించాడు.మా ఓటమికి ప్రధాన కారణం అదేటీమిండియా చేతిలో పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మేము అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోవడం.. ఎక్కువగా డాట్ బాల్స్ కావడంతో వెనుకబడ్డాం.స్ట్రైక్ రొటేట్ చేస్తూ నెమ్మదిగా పరుగులు రాబట్టాలనే ప్రయత్నం విఫలమైంది. తొలి ఆరు ఓవర్లలోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించాం.కానీ.. తొలి వికెట్ పడిన తర్వాత నుంచి మళ్లీ కోలుకోలేకపోయాం. నిజానికి పిచ్ బాగానే ఉంది. బంతి బ్యాట్ మీదకు వస్తోంది. వికెట్ కాస్త స్లోగా.. అదనపు బౌన్స్‌కు అనుకూలించింది.వారి నుంచి ఎక్కువగా ఆశించకూడదుఅయినా.. పరుగుల కోసం టెయిలెండర్ల మీద ఆధారపడటం.. వారి నుంచి ఎక్కువగా ఆశించడం కూడా సరైంది కాదు’’ అని బాబర్ ఆజం తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు.న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాను 119 పరుగులకే ఆలౌట్ చేసిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో 113 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో ఓడింది. పాక్ ఆటగాళ్లలో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మిగిలిన వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు సాధించారు.ఇంకో రెండు గెలిస్తేనేకాగా గ్రూప్-ఏలో భాగమైన పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో తమ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైన బాబర్ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్ చేతిలోనూ ఓడిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే పాక్ ఈ టోర్నీలో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మా ఆట తీరులో లోపాలేమిటో కూర్చుని చర్చిస్తాం. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.వాటిలో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం’’ అని తెలిపాడు. కాగా పాకిస్తాన్ తదుపరి జూన్ 11న కెనడా, జూన్ 16న ఐర్లాండ్‌తో తలపడనుంది.చదవండి: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్‌వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముల్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(59 బంతుల్లో 82, 9 ఫోర్లు,3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరిలో సుల్తాన్స్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు చేసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. 19 ఓవర్ వేసిన లహోర్ పేసర్ జమాన్ ఖాన్‌కు ఇఫ్తి భాయ్ చుక్కలు చూపించాడు. ఏకంగా ఆ ఓవర్లో 24 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముగించేశాడు. డగౌట్ నుంచి ఇఫ్తికర్ విధ్వంసం చూసిన రిజ్వాన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో కూడా ఇఫ్తికర్ పాక్ జట్టుకు ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్ 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లాహోర్ బ్యాటర్లలో వండర్ డస్సెన్(54) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముల్తాన్ బౌలర్లలో మహ్మద్ అలీ రెండు వికెట్లు పడగొట్టగా.. అఫ్రిది, ఉసామా మీర్ తలా వికెట్ పడగొట్టారు. చదవండి: AFG vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్ IFTI MANIA 🤯 Enough said...#HBLPSL9 | #KhulKeKhel | #MSvLQ pic.twitter.com/uXqkWv2btV — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2024 -
#NZvPAK: దంచి కొట్టిన మిచెల్, ఫిలిప్స్.. పాకిస్తాన్‌కు మరో పరాభవం
New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రిజ్వాన్‌కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్‌కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇక పాక్‌తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF — BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024 -
Aus Vs Pak: ఐదు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. పాక్ ఆలౌట్
Australia vs Pakistan, 3rd Test Day 1 Report: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలినా.. మహ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఆమెర్ జమాల్ అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ 300 పరుగుల మార్కును అందుకోగలిగింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు టెస్టు సిడ్నీ వేదికగా బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్‌ను జోష్ హాజిల్‌వుడ్ డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్(35).. బాబర్ ఆజంతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాబర్‌ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్‌ను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులతో రాణించాడు. అతడి తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆగా సల్మాన్ మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు అవుట్ కాగానే పాక్ సులువుగానే తలవంచుతుందని భావించిన కమిన్స్ బృందానికి ఆల్‌రౌండర్ ఆమెర్ జమాల్ షాకిచ్చాడు. తొమ్మిద స్థానంలో బరిలోకి దిగిన అతడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ 97 బంతుల్లో 82 పరుగులు రాబట్టాడు. అయితే, నాథన్ లియోన్ అద్బుత బంతితో అతడిని బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి రోజు ఆటలో భాగంగా 77.1 ఓవర్లలో 313 పరుగుల వద్ద పాక్ జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ రెండు, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బుధవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు పాకిస్తాన్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం మొదటి రోజు ఆటలో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆసీస్ పాక్ కంటే 307 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ ఆరు, ఉస్మాన్ ఖవాజా సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. -
మహ్మద్ హఫీజ్‌ను వదలట్లేదు.. మొన్న అలా.. ఇప్పుడిలా సెటైర్!
Australia vs Pakistan, 3rd Test: పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్‌ను ఐస్లాండ్ క్రికెట్ మరోసారి ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టు మాత్రమే కాదు.. ఆస్ట్రేలియన్ ఎయిర్‌లైన్స్ కూడా హఫీజ్‌ను ఇబ్బంది పెడుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన షాన్ మసూద్ బృందం.. తొలి రెండింటిలో ఓడిపోయింది. పెర్త్‌లో ఏకంగా 360 పరుగుల భారీ తేడాతో ఓడిన పాక్.. మెల్బోర్న్ టెస్టులో పోరాడగలిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ అవుటైన తీరుపై పాక్ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రిజ్వాన్ అవుటైన తీరుపై రచ్చ ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బంతి రిజ్వాన్ రిస్ట్‌బ్యాండ్‌ను తాకినట్లుగా కనిపించడంతో అతడు అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే, కాన్ఫిడెంట్‌గా ఉన్న కమిన్స్ రివ్యూకు వెళ్లగా థర్డ్ అంపైర్ రిజ్వాన్ అవుటైనట్లు ప్రకటించాడు. దీంతో ఆసీస్ శిబిరంలో సంబరాలు మొదలుకాగా.. పాకిస్తాన్ కీలక సమయంలో కీలక వికెట్ కోల్పోయి 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, అంపైర్ల తప్పిదాల వల్లే తాము ఓడిపోయామంటూ పాక్ మాజీ క్రికెటర్, జట్టు డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి మెల్బోర్న్లో తాము ఆస్ట్రేలియా కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చామంటూ ప్రత్యర్థి జట్టు ఆట తీరును విమర్శించాడు. అప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు ఆసీస్ ఎయిర్‌లైన్స్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐస్లాండ్ క్రికెట్ హఫీజ్‌పై సెటైరికల్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ అత్యంత ప్రతిభావంతమైన జట్టు అయినందుకే.. ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 16 టెస్టులు ఓడిపోయిందా అని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసింది. తాజాగా సిడ్నీ టెస్టు కోసం.. మహ్మద్ హఫీజ్ తాను ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో మరోసారి ట్రోల్ చేసింది. ‘‘అయ్యో అందరూ ప్రతిభావంతులే ఉన్న జట్టు అది. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా ఎయిర్‌లైన్స్ కూడా అతడిని వదిలేసి వెళ్లిందా?’’ అని సెటైర్ వేసింది. సిరీస్ సమర్పయామి.. ఆఖరి టెస్టులో ఆఫ్రిది లేకుండానే కాగా ఇప్పటికే 2-0తో టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకున్న పాకిస్తాన్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న మూడో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. బుధవారం నుంచి ఆరంభం కానున్న ఈ టెస్టుకు ఎంపిక చేసిన పాక్ జట్టులో షాహిన్ ఆఫ్రిదికి చోటు దక్కలేదు. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో అతడికి విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించేందుకు సిద్ధమైంది. ఇక మ్యాచ్ కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి విమానంలో వెళ్లాల్సి ఉండగా.. మహ్మద్ హఫీజ్ ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా రావడంతో ఫ్లైట్ మిస్సయ్యాడు. చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్ All that talent, and now even the Aussie airlines are out to get him! https://t.co/gtF1rXqOit — Iceland Cricket (@icelandcricket) January 1, 2024