టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ నిర్ధేశించిన 92 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాక్ ముక్కి మూలిగి 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత పాక్ బౌలర్లు షాదాబ్ ఖాన్ (3/22), మహ్మద్ వసీం జూనియర్ (2/15), షాహీన్ అఫ్రిది (1/19), నసీం షా (1/11), హరీస్ రౌఫ్ (1/10) సత్తా చాటడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేయగా, ఛేదనలో పాకిస్తాన్ నానా కష్టాలు పడి అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది.
సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 4 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. అయితే మహ్మద్ రిజ్వాన్ (49), ఫఖర్ జమాన్ (20) బాధ్యతాయుతంగా ఆడి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 30 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో పాక్ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో షాన్ మసూద్ (12) ఔట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ (6), షాదాబ్ ఖాన్ (4) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాక్ ప్రస్తుత ప్రపంచకప్‌లో బోణీ కొట్టడంతో పాటు ఆసీస్ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment