Netherlands
-
FIH Pro League: భారత హాకీ జట్లకు నిరాశ
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో సోమవారం భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 2–4 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 2–3 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోయాయి. నెదర్లాండ్స్‌తో జరిగిన పోరు ద్వారా భారత జట్టు గోల్‌కీపర్ సవితా పూనియా తన కెరీర్లో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. వందన కటారియా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ప్లేయర్‌గా సవిత గుర్తింపు పొందింది.నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత్ తరఫున ఉదిత (18వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున ఎమ్మా రెజ్నెన్ (7వ నిమిషంలో), ఫే వాన్‌డెర్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... ఫెలిస్ అల్బెర్స్ (34వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది.ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టుకు అభిషేక్ (18వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇంగ్లండ్ తరఫున జేకబ్ పేటన్ (15వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... సామ్ వార్డ్ (19వ, 29వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. -
జోరు కొనసాగించాలని...
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌పై భారీ విజయాలు నమోదు చేసుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా... సోమవారం తమకంటే మెరుగైన ర్యాంకర్ ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆడనుంది. భారత అంచె పోటీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న భారత్... తాజా సీజన్లో 6 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 13 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ మూడో ‘ప్లేస్’లో ఉంది. స్పెయిన్, జర్మనీతో మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన భారత జట్టు... ఐర్లాండ్‌పై మాత్రం సమష్టిగా సత్తా చాటింది. అదే స్ఫూర్తి ఇంగ్లండ్‌పై కూడా కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, నీలమ్, అభిషేక్, షంషేర్ సింగ్ కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది. డిఫెన్స్‌లో భారత్ బలంగా కనిపిస్తోంది. తాజా సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన టీమిండియా ఇప్పటి వరకు ప్రత్యర్థులకు కేవలం 8 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. తొమ్మిది జట్లలో ఇదే అతి తక్కువ కావడం మన రక్షణ శ్రేణి పటుత్వాన్ని చాటుతోంది. అయితే పెనాల్టీ కార్నర్లను సది్వనియోగ పరుచుకోవడంపై మరింత దృష్టి సారిస్తేనే ఇంగ్లండ్‌పై విజయం సాధ్యమవుతుంది. నెదర్లాండ్స్‌ను నిలువరించేనా.. మహిళల ప్రొ లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న భారత జట్టు... సోమవారం డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. భారత అంచె పొటీలను ఘనవిజయంతో ప్రారంభించిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... ఆసాంతం అదే జోరు కొనసాగించలేకపోయింది. తాజా సీజన్లో 6 మ్యాచ్‌లాడిన మన అమ్మాయిలు 2 విజయాలు, 3 పరాజయాలు, 1‘డ్రా’తో 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో ఉన్నారు.మరోవైపు 15 పాయింట్లు సాధించిన నెదర్లాండ్స్ రెండో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో జర్మనీపై సాధించిన స్ఫూర్తితో సమష్టిగా సత్తాచాటాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై 5–1, 6–0తో విజయాలు సాధించిన నెదర్లాండ్స్ జట్టు టీమిండియాపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ‘ప్రపంచంలోనే అత్యంత పటిష్ట జట్లలో నెదర్లాండ్స్ ఒకటి. వాళ్లతో మ్యాచ్ కఠినమైందని తెలుసు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టాం. జర్మనీపై విజయం ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని భారత సారథి సలీమ చెప్పింది. 2013 నుంచి భారత్, నెదర్లాండ్స్ మధ్య 7 మ్యాచ్‌లు జరగగా... అందులో ఐదింట నెదర్లాండ్స్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ టీమిండియా నెగ్గగా... మరొకటి ‘డ్రా’ అయింది. -
మార్కో ఫినిష్డ్
అతనో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్. పాతికపైగా దేశాలకు మోస్ట్‌వాంటెడ్ కూడా. అలాంటోడు.. కిందటి ఏడాది జరిగిన గ్యాంగ్ వార్‌లో చచ్చాడని కథనాలు వచ్చాయి. అతని ప్రేయసి కూడా బోరుమనడంతో అందరూ అది నిజమేనని నమ్మారు. కట్ చేస్తే.. ఇప్పుడు నిజంగానే ఆ క్రిమినల్ ఓ ఆగంతకు కాల్పుల్లో హతమయ్యాడు!.డచ్ డ్రగ్ డీలర్.. మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ మార్కో ఎబ్బెన్(Marco Ebben) ఎట్టకేలకు హతమయ్యాడు. మెక్సికోలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. నెదర్లాండ్స్‌కు చెందిన మార్కో ఎబ్బెన్ యూరప్ దేశాలకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. 2014-15 మధ్యకాలంలో మార్కో, అతని అనుచరులు 400 కేజీల కొకైన్‌ను పైనాపిల్స్(Pineapples)లో స్మగ్లింగ్ చేయడం వార్తల్లోకి ఎక్కింది. బ్రెజిల్(Brazil) నుంచి నెదర్లాండ్స్‌కు, ఇతర యూరోపియన్ దేశాలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసినట్లు అభియోగాలున్నాయి. 2020లో డచ్ కోర్టు అతనికి ఏడేళ్ల శిక్ష విధించగా.. పోలీసుల చెర నుంచి పరారయ్యాడు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కిందటి ఏడాది అక్టోబర్‌లో మార్కో పెద్దడ్రామానే ఆడాడు. క్యూలికాన్లో జరిగిన గ్రూప్వార్లో అతను చనిపోయినట్లు ప్రచారం చేయించాడు.పైగా అతని ప్రేయసి మార్కో డెడ్‌బాడీని గుర్తు పట్టినట్లు ఆ డ్రామాలో భాగమైంది కూడా. అయితే ప్రస్తుతం అతన్ని కాల్చి చంపింది ఎవరనేదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: డాలర్‌తో గేమ్స్ వద్దు! -
అతిచిన్న ఎయిర్పోర్ట్
విమానాశ్రయం అంటే సాధారణంగా, పొడవైన రన్‌వే, విశాలమైన ప్రదేశంలో చాలా పెద్దగా ఉంటుంది. కాని, కరీబియన్ దీవుల్లో నెదర్లాండ్స్ అధీనంలో ఉన్న సబా దీవిలో ‘జువాంకో ఇ. య్రాస్క్విన్’ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత చిన్న విమానాశ్రయంగా పేరొందింది. దీని రన్‌వే పొడవు కేవలం 400 మీటర్లు మాత్రమే! అంటే దాదాపు ఒక విమానం పొడవు కంటే కాస్త ఎక్కువ.చుట్టూ ఎత్తైన కొండలు, పక్కనే సముద్రంతో చూడటానికి అందంగా కనిపించే ఈ విమానాశ్రయం, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో ఒకటి. అందుకే, ఇక్కడ పెద్ద విమానాలను అనుమతించరు. కేవలం విమానయాన సంస్థ విండైర్కు చెందిన చిన్న విమానాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు. అయితే, 1959లో రెమీ డి హానెస్ ప్రారంభించిన ఈ విమానాశ్రయం, సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలాకాలం నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం డచ్ ప్రభుత్వం దీనిని పునరుద్ధరించింది. అంతేకాదు, రోజువారీగా చిన్న విమానాలను నడుపుకునేందుకు కూడా అనుమతించింది. -
2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌ను... ఎత్తుకెళ్లారు
ఎస్సెన్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్‌లో దొంగలు ఏకంగా వేల ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌పైనే కన్నేశారు. ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను బాంబులతో బద్ధలుకొట్టి మరీ దోచుకెళ్లిపోయారు. అది ఏకంగా 2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్! దాంతో ఈ దొంగతనం సంచలనం సృష్టించింది. ప్రాచీన వస్తు ప్రదర్శన కోసం తమ దేశం నుంచి నెదర్లాండ్స్ పట్టుకుపోయిన అత్యంత విలువైన వస్తువులు చోరశిఖామణుల పాలబడటంతో రొమేనియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. నెదర్లాండ్స్‌లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తుప్రదర్శనశాలలో ఈ భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకొచ్చి బయటివైపు ఉన్న భారీ తలుపును రంధ్రాలు పెట్టే మెషీన్, ఇనుప రాడ్లతో ఎలాగోలా తెరిచారు. అక్కడే లోపలివైపు ఇంకో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్టంగా ఉన్న దీనిని మామూలుగా తెరవడం సాధ్యంకాదని దొంగలకు తెలుసో ఏమో, ముందుజాగ్రత్తగా పెద్ద బాంబును వెంట తెచ్చుకున్నారు. తలుపుకు బాంబు అమర్చి పేల్చేశారు. తునాతునకలైన ద్వారం గుండా ఎంచక్కా లోపలికి వెళ్లి అక్కడ అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువులను తీసుకుని ఉడాయించారు. వెలకట్టలేని హెల్మెట్ చోరీకి గురైన వాటిల్లో 2,500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉంది. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్‌ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. ‘హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీ’గా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారు. హెల్మెట్ ముందుభాగంలో పెద్ద కళ్లను చెక్కారు. దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు. జంతు వధ చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనుకవైపు చెక్కారు. రొమేనియా సంస్కృతి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తంచేసింది. దీంతోపాటు డేసియన్ల రాజ్యానికి చెందిన అలనాటి రాయల్ బ్రేస్లెట్సహా మూడు వస్తువులనూ దొంగలు పట్టుకెళ్లిపోయారు. రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజ్యమేలిన డేసియన్ల సంస్కృతిని కళ్లకుకట్టేందుకు ఆనాటి వస్తువులను ఒక దగ్గరకు చేర్చి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. గత ఏడాది జూలై నుంచి ఈ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన హెల్మెట్‌ను సైతం రొమేనియా నుంచి తెప్పించిమరీ ప్రదర్శనకు ఉంచగా అది కాస్తా ఇప్పుడు దొంగలపరమైంది.చోరుల కోసం వేట మొదలు మళ్లీ అప్పజెప్తామని చెప్పి బుకారెస్ట్ నగరంలోని ‘నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా’ నుంచి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు పోవడంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం క్రితం చోరీకి గురైన ఒక కారు ఈ మ్యూజియం దగ్గర కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి ఈ రెండు చోరీలకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టుకొచ్చిన కారులో ఇక్కడికొచ్చిన దొంగలు ఆ తర్వాత పారిపోతూ నాలుగు మైళ్ల దూరంలో కారును వదిలేసి తగలబెట్టిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కొట్టేసిన కారుకు నకిలీ నంబర్ ప్లేట ఉండటం చూస్తుంటే ఇదేదో ఆరితేరిన దొంగలముఠా పనిగా అనుమానిస్తున్నారు. ‘‘ మా మ్యూజియం 170 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి చోరీ ఘటన చూడలేదు. నిజంగా ఇది దురదృష్టకరం’’ అని ఎస్సెన్లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ అన్నారు. -
‘పరాయి స్త్రీలను తాకను’.. ఇంత పొగరు పనికిరాదు!
టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో(Tata Steel Chess Tournament) ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ నొదిర్బెక్ యకుబొయేవ్(Nodirbek Yakubboev) వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. భారత గ్రాండ్ మాస్టర్ ఆర్.వైశాలి(R Vaishali)తో గేమ్ సందర్భంగా నొదిర్బెక్ ఆమెతో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.క్షమించండిఈ నేపథ్యంలో నొదిర్బెక్ ‘ఎక్స్’ వేదికగా క్షమాపణలు తెలిపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరచలేదని.. తన వల్ల తెలిసోతెలియకో పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని కోరాడు. అయినప్పటికీ అతడి వ్యవహార శైలిపై మాత్రం విమర్శలు ఆగటం లేదు. ఇంత పొగరు పనికిరాదుద్వంద్వ ప్రమాణాలు పాటించే వారు ఎప్పటికీ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరంటూ నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విశ్వాసాల పేరిట మహిళల పట్ల వివక్ష చూపించడం తగదంటూ హితవు పలుకుతున్నారు. ఇంత పొగరు పనికిరాదంటూ మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ వేదికగా టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో భాగంగా నాలుగో రౌండ్లో ఆర్.వైశాలితో నొదిర్బెక్ ముఖాముఖి తలపడ్డాడు. అయితే, ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్న నొదిర్బెక్.. గేమ్ ఆరంభం కావడానికి ముందు కర్టెసీలో భాగంగా వైశాలి కరచాలనం చేసేందుకు చేయి ముందుకుచాచగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అవసరం లేదన్నట్లుగా సైగ చేస్తూ తన కుర్చీలో కూర్చున్నాడు.విజయం తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వలేదుఇక ఈ గేమ్‌లో నొదిర్‌బెక్‌పై వైశాలి గెలుపొందింది. గేమ్‌కు ముందు ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విజయం తర్వాత అతడికి షేక్ హ్యాండ్ ఆఫర్ చేయకుండా మిన్నకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. నొదిర్బెక్ తాను కావాలని ఇలా చేయలేదంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.పరాయి స్త్రీలను తాకను‘‘ఇండియాలోని ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులైన వైశాలి, ఆమె సోదరుడు ప్రజ్ఞానందల పట్ల నాకు గౌరవం ఉంది. నా ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే.. క్షమించండి. నాకు ఏది సరైంది అనిపిస్తే అదే చేస్తాను.పరాయి స్త్రీలతో నేను కరచాలనం చేయలేను. ఇక మహిళలు హిజాబ్ లేదంటే బుర్ఖా ధరించాలా లేదా అన్నవి పూర్తిగా వారి నిర్ణయాలు. 2023లో దివ్యతో నేను పొరపాటుగా అలా వ్యవహరించాను. ఈరోజు గేమ్ ఆడేటపుడు నా ప్రత్యర్థి బుల్మాగాకు ముందే చెప్పాను.షేక్ హ్యాండ్ నాకు ఇష్టం ఉండదని. తను అందుకు అంగీకరించింది. అయితే, కొంతమంది మర్యాదపూర్వక పలకరింపునకు చిహ్నంగా నమస్తే అయినా చెప్పాలని కోరారు. ఏదేమైనా.. దివ్య, వైశాలిలతో గేమ్‌లకే ముందే నేను మహిళలతో షేక్ హ్యాండ్‌కు విరుద్ధం అని చెప్పి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు’’ అని నొదిర్బెక్ వివరణ ఇచ్చాడు. కాగా అంతకుముందు మరో భారత గ్రాండ్‌మాస్టర్ దివ్యతో గేమ్‌కు ముందు ఆమె ముంజేయికి ముంజేయి తాకించి.. విష్ చేశాడు. ఇక చెన్నైకి చెందిన చెస్ సంచలనం ఆర్.ప్రజ్ఞానందకు తోడబుట్టిన అక్క వైశాలి అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు ప్రస్తుతం టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు.. 23 ఏళ్ల నొదిర్బెక్ 2019లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందగా.. 23 ఏళ్ల వైశాలి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా ఇటీవలే చరిత్ర సృష్టించింది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా?A renowned Uzbek chess Grandmaster, Nodirbek, refused to shake hands with India's Women's Grandmaster Vaishali.Does religion influence sports? However, he was seen shaking hands with other female players earlier. pic.twitter.com/fGR61wvwUP— Ayushh (@ayushh_it_is) January 27, 2025 -
డుం.. డుం.. డుం..
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి. మనసులు కలవడానికి భాషా, సంస్కృతులు అడ్డంకులు కాబోవని చాటింది. తాను ఇష్టపడిని పరదేశీయుడిని పెద్దల అనుమతితో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. వీరి ప్రేమపెళ్లిని అందరూ మెచ్చుకుంటూ, శుభాకాంక్షలు చెబుతున్నారు.సేలం : కోవైకు చెందిన మహిళ నెదర్లాండ్ దేశానికి చెందిన తన ప్రియుడిని కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకుంది. కోవై జిల్లా పెరియ నాయకన్ పాలయానికి చెందిన ప్రమీలా.. నెదర్లాండ్ ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. అక్కడ ఒక టీవీ ఛానల్లో పని చేస్తున్న స్టీన్హీస్ అనే యువకుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. ఆ మేరకు ఇరు కుటుంబీకుల సమ్మతితో ప్రమీలాకు, నెదర్లాండ్ యువకుడికి కోవైలో తమిళ సాంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది. நெதர்லாந்து நாட்டு இளைஞரை காதலித்து தமிழ் பாரம்பரியப்படி தாலி கட்டி கரம் பிடித்த தமிழ் பெண்..#Coimbatore | #Netherland | #marriage | #TamilCulture pic.twitter.com/QPzEn6aPCY— Polimer News (@polimernews) January 20, 2025video credit To Polimer Newsచదవండి: పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ! -
అమెరికా విప్లవం ముందునాటిది.. అదిరిపోయే ధర పలికింది
17వ శతాబ్దంనాటి అత్యంత అరుదైన వెండి నాణెం అది. అందులోనూ అమెరికా విప్లవానికి ముందునాటిది. మరీ ముఖ్యంగా అమెరికాలోనే తయారైంది. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు(యూఎస్ఏ)గా అమెరికా ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించకముందునాటిది. ప్రపంచంలో ఇలాంటిది ఇంకొక్కటి మాత్రమే ఉంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ఆ చిన్ని నాణెం ఏకంగా రూ.21.28 కోట్ల ధర పలికిందని స్టేక్స్ బోవర్స్ గ్యాలరీస్ వేలం సంస్థ ప్రకటించింది. తయారుచేసినపుడు దీని ముఖ విలువ మూడు పెన్నీలు మాత్రమే. బోస్టన్ మింట్ ప్రారంభించిన కొద్ది వారాలకే 1652వ సంవత్సరంలో దీనిని ముద్రించారు. నాణేనికి ఒకవైపు న్యూ ఇంగ్లండ్(ఎన్ఈ) అన్న రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు రోమన్ అంకెల్లో మూడు అని రాసి ఉంది. న్యూ ఇంగ్లండ్ ప్రభ పెరుగుతోందని తెలియజేసేందుకు గుర్తుగా మొదట్లో కొన్నింటిని మాత్రమే ఇలా వెండితో ముద్రించారు. ప్రస్తుత మార్కెట్లో నికెల్, వెండి విలువల్లో లెక్కిస్తే దీని ధర కేవలం 1.03 అమెరికన్ డాలర్లు. కానీ అమెరికా స్వాతంత్య్రం ముందునాటిది కావడం, చారిత్రక విశేషాలుండటంతో దీనికి ఎక్కడా లేనంతటి విలువ వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం వెలుగుచూసి.. నెదర్లాండ్స్‌లో 2016లో ఒక పేస్ట్బోర్డ్ పెట్టెలో దీనిని కనుగొన్నారు. దీంతోపాటు ఒక కవర్ ఉంది. దానిపై ‘1798 డిసెంబర్లో క్విన్సీ కుటుంబానికి బోస్టన్ మింట్ నుంచి వచ్చిన సిల్వర్ టోకెన్ ఇది’అని మాత్రమే రాసి ఉంది. అయితే దీని విలువ తెలియని ఆ యజమాని దీని గురించి పట్టించుకోవడం మానేశారట. అయితే అరుదైన నాణెం వార్త అందరి నోటా పడి చివరకు దీని మూలాల గుట్టు తెల్సుకునే పని మొదలైంది. అరుదైన నాణేల ప్రమాణాలను నిర్ధారించే స్వతంత్ర ‘పీసీజీఎస్’విభాగం రంగంలోకి దిగి దీని విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా చేసింది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగిందన్న విషయం పీసీజీఎస్ పరిశోధనలో వెల్లడైంది. ఇంగ్లండ్‌కు చెందిన నాణేలను సేకరించే థామస్ బ్రాండ్ అనే పెద్దాయన 1781లో నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారి జాన్ ఆడమ్స్కు ఒక లేఖ రాశారు. ఆడమ్స్ భార్య ఎబిగేల్కు ఈ నాణేనికి ఒక సంబంధం ఉండటమే ఇందుకు కారణం. ఈ నాణేన్ని ముద్రించిన స్వర్ణకారుడు జాన్ హల్కు సవతి సోదరుడి ముని మనవరాలే ఈ ఎబిగేల్. ఇలా ఈ నాణెం ఎప్పుడు ఎక్కడ ముద్రించబడిందనే వివరాలు తెలిశాయి. ఇలాంటి మరో నాణెం గతంలో ఉండేదని మసాచుసెట్స్ హిస్టారికల్ సొసైటీ పేర్కొంది. గతంలో అమెరికాలోని యేల్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచగా చోరీకి గురైంది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ‘‘నాణెం వేలం మొదలెట్టిన కేవలం 12 నిమిషాల్లోనే ఊహించిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది’అని వేలంపాట నిర్వహకుడు బెన్ ఒరోజీ చెప్పారు. గతంలోనూ కొన్ని అమెరికా నాణేలు రికార్డ్ ధరలకు అమ్ముడుపోయాయి. 2013లో 1794నాటి వెండి డాలర్ నాణెం ఒక కోటి డాలర్లకు అమ్ముడుపోయింది. 1933లో ముద్రించిన డబుల్ ఈగిల్ బంగారు నాణెం మూడేళ్ల క్రితం ఒక వేలంపాటలో 1.89 కోట్ల డాలర్లకు అమ్ముడుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నో క్లాసులు...నో పాఠాలు..దాని పేరే అగోరా స్కూల్!
స్కూల్ అనగానే క్లాస్‌రూమ్‌లు, బల్లలు, బ్లాక్‌బోర్డులు, పాఠాలు చెప్పే టీచర్లు గుర్తుకొస్తారు. కానీ యూరప్‌లోని నెదర్ల్యాండ్స్ దేశంలో ఉన్న ‘అగోరా స్కూల్’లో మాత్రం అవేమీ ఉండవు. అక్కడున్న పిల్లలంతా తమకు నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు, నచ్చినట్లు ఉండొచ్చు. అక్కడ గదుల్లో బల్లలు, కుర్చీలుంటాయి. కానీ అవేవీ మనకు మామూలు స్కూళ్లలో కనిపించేలా ఉండవు. అక్కడ పిల్లలు చూసేందుకు టీవీ, వాడేందుకు కంప్యూటర్లు ఉంటాయి. అక్కడ తరగతులకు బదులుగా గ్రూప్‌లు మాత్రమే ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో 17 మంది దాకా ఉంటారు. రకరకాల వయసున్నవారు ఒకచోట చేరతారు. స్కూల్‌కి రాగానే ఆ రోజు వారు చేయాల్సిన పనులను, పూర్తి చేయాల్సిన లక్ష్యాలను రాసుకుంటారు. ఇవి కూడా అందరికీ ఒకేలా ఉండవు. ఎవరికి తగ్గట్టు వారికి వేరుగా ఉంటాయి. ఒకరు సంగీతం నేర్చుకోవాలనుకుంటే మరొకరు పుస్తకం చదవాలన్నది పనిగా పెట్టుకుంటారు. మరొకరు ఆ రోజుకు ఒక బొమ్మ గీయడాన్ని లక్ష్యంగా మార్చుకుంటారు. టీచర్లు వారు చేయాలనుకున్న పనిలో సాయం చేస్తారు... కొట్టడం, కోప్పడటం లాంటివి చేయరు. ఆటల మీదే కాకుండా ఇతర అంశాల మీద దృష్టి పెట్టేవారు కూడా ఉంటారు. అలాంటి వారి కోసం అక్కడ రకరకాల విభాగాలున్నాయి. వంట నేర్చుకోవడం, శిల్పాలు చేయడం, చెక్కతో కళాకృతులు తయారు చేయడం, చిత్రలేఖనం, రోబోలు తయారు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన పని వారు నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. కేవలం చదువుకోవాలనుకునేవారి కోసం ‘సైలెంట్ రూమ్స్’ ఉంటాయి. అందులోకి వెళ్లి, కూర్చుని నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు. రొటీన్ స్కూళ్లకు భిన్నంగా పిల్లలకు సృజనాత్మక విద్య నేర్పించాలనుకునే వారి కోసం 2014లో ఈ స్కూల్‌ని స్థాపించారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పిల్లలు ఈ స్కూల్లో ఉంటారు. మొత్తం మూడు దేశాల్లో ఈ స్కూళ్లను మొదలుపెట్టారు. ప్రస్తుతం 1800 మందికిపైగా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. -
జ్యోతి సురేఖకు కాంస్య పతకం
సాక్షి, హైదరాబాద్: జేవీడీ ఓపెన్ ఇండోర్ ఆర్చరీ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ కాంస్య పతకం గెలిచింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ 900 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 18 మీటర్ల దూరం ఉన్న లక్ష్యంవైపు ఆయా ప్లేయర్లు 30 బాణాలను మూడుసార్లు చొప్పున సంధించారు.నిర్ణీత 90 బాణాల తర్వాత సురేఖతోపాటు ఎలీసా రోనెర్ (ఇటలీ), అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా), ఆండ్రియా మునోజ్ (స్పెయిన్) 900 పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే పతకాల వర్గీకరణ కోసం కేంద్ర బిందువుపై కొట్టిన అత్యధిక షాట్లను లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా ఎలీసా రోనెర్ (87)కు స్వర్ణ పతకం, అలెజాంద్రా (80) రజతం, జ్యోతి సురేఖ (79)కు కాంస్య పతకం ఖరారయ్యాయి. ఉమామహేశ్‌కు నాలుగో స్థానం న్యూఢిల్లీ: వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఉమమహేశ్ 208.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. -
Paralympics: తొలి స్వర్ణం నెదర్లాండ్స్ ఖాతాలో...
ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణలో పారిస్ ఒలింపిక్ కమిటీ మరోసారి తమ అభిరుచిని ప్రదర్శించింది. నెల రోజుల క్రితం జరిగిన ఒలింపిక్స్ ప్రధాన ఈవెంట్ కార్యక్రమంతో పోలిస్తే ఏమాత్రం తగ్గకుండా పారాలింపిక్స్ పోటీల ప్రారంభాన్ని ఘనంగా నిర్వహించింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ వేడుకలు జరిగాయి. 50 వేల మంది ప్రేక్షకులుసూర్యాస్తమయ వేళ సుమారు 50 వేల మంది ప్రేక్షకులు ఈ సంబరాలకు హాజరయ్యారు. 250 మంది పారా అథ్లెట్ల బృందంతో బ్రెజిల్ హైలైట్‌గా నిలవగా... మయన్మార్ నుంచి ముగ్గురు మాత్రమే మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమైన ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత బృందానికి పతాకధారులగా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, మహిళా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాధవ్ వ్యవహరించారు. నెదర్లాండ్స్ ఖాతాలో...ప్రధాన క్రీడల తరహాలోనే ఈసారి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా ఫ్రాన్స్ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగాయి. వేదికపై జరిగిన ప్రదర్శనలో పలువురు దివ్యాంగ కళాకారులు కూడా తమ ఆటాపాటలతో అలరించడం విశేషం. పారిస్ పారాలింపిక్స్ తొలి స్వర్ణ పతకం నెదర్లాండ్స్ ఖాతాలో చేరింది. మహిళల పారా సైకింగ్ ట్రాక్ సీ4–5 500 మీటర్ల టైమ్ ట్రయల్ ఈవెంట్లో నెదర్లాండ్స్ సైక్లిస్ట్ కరోలైన్ గ్రూట్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. -
నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన కెనడా
నెదర్లాండ్స్ ముక్కోణపు టోర్నీలో ఆతిథ్య జట్టుకు షాక్ తగిలింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నెదర్లాండ్స్.. కెనడా చేతిలో 8 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టోర్నీలో భాగంగా నిన్న (ఆగస్ట్ 26) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేయగా.. ఆ తర్వాత బ్యాటంగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌కు ఇది తొలి పరాజయం కాగా.. కెనడాకు తొలి విజయం. ఈ టోర్నీలో పాల్గొంటున్న మరో జట్టు యూఎస్ఏ. ఆ జట్టు ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది.రాణించిన శ్రేయస్, జాఫర్తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా శ్రేయస్ మొవ్వ (33), సాద్ బిన్ జాఫర్ (33) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. కెనడా ఇన్నింగ్స్‌లో ఆరోన్ జాన్సన్, పఠాన్, రవీంద్రపాల్ డకౌట్లు కాగా.. నికోలస్ కిర్టన్ 13, హర్ష్ థాకర్ 10, పర్వీన్ కుమార్ 4, అఖిల్ కుమార్ 9, డిల్లన్ హేలిగర్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. డచ్ బౌలర్లలో కైల్ క్లెయిన్, వాన్ మీకెరెన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. డొరామ్ 2, విక్రమ్‌జీత్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నారు.సత్తా చాటిన కెనడా బౌలర్లు133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. కెనడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 124 పరుగులకే పరిమితమైంది.పర్వీన్ కుమార్, కలీమ్ సనా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హేలిగర్, సాద్ బిన్ జాఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో నోవహా క్రోయిస్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్ కట్టండి’
ప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్లకు చేరవేయడంపై డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (డీటీఏ) 290 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,718 కోట్లు) భారీ జరిమానా విధించింది.డ్రైవర్ సమాచారాన్ని రక్షించడంలో ఉబెర్ విఫలమైందని, ఇలా డ్రైవర్ల సమాచారాన్ని చేరవేయడం యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) ప్రకారం "తీవ్రమైన ఉల్లంఘన" అని డీటీఏ పేర్కొంది. "యూఎస్‌కు డేటా బదిలీకి సంబంధించి ఉబెర్ జీడీపీఆర్ నిబంధనలు పాటించలేదు. ఇది చాలా తీవ్రమైనది" అని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఛైర్మన్ అలీడ్ వోల్ఫ్సెన్ ఒక ప్రకటనలో తెలిపారు.యూరోపియన్ డ్రైవర్లకు సంబంధించిన టాక్సీ లైసెన్స్‌లు, లొకేషన్ డేటా, ఫోటోలు, చెల్లింపు వివరాలు, గుర్తింపు పత్రాలతోపాటు కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల క్రిమినల్, మెడికల్ డేటాను సైతం ఉబెర్ సేకరించిందని డీపీఏ తెలిపింది. సరైన నిబంధనలు పాటించకుండా రెండేళ్ల వ్యవధిలో ఉబెర్ ఈ సమాచారాన్ని తమ యూఎస్ ప్రధాన కార్యాలయానికి చేరవేసిందని ఆరోపించింది. అయితే ఈ జరిమానాపై అప్పీల్ చేస్తామని ఉబెర్ తెలిపింది. "ఇది లోపభూయిష్ట నిర్ణయం. అసాధారణ జరిమానా పూర్తిగా అన్యాయమైనది" అని ఉబెర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
యూఎస్ఏపై నెదర్లాండ్స్ భారీ విజయం
నెదర్లాండ్స్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించిన నెదర్లాండ్స్.. తాజాగా యూఎస్ఏను 102 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. నిన్న (ఆగస్ట్ 25) యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మైఖేల్ లెవిట్ (68), స్కాట్ ఎడ్వర్డ్స్ (81 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ 28, విక్రమ్‌జీత్ సింగ్ 0, జాక్ క్యాచెట్ 14, ర్యాన్ క్లెయిన్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్క్విక్ 3, హర్మీత్ సింగ్, జునోయ్ డ్రైస్డేల్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఎస్ఏ.. డచ్ బౌలర్లు విజృంభించడంతో 15.4 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. విక్రమ్‌జీత్ సింగ్ 3, కైల్ క్లెయిన్, పాల్ వాన్ మీకెరెన్, జాక్ క్యాచెట్ తలో 2, ఆర్యన్ దత్ ఓ వికెట్ పడగొట్టి యూఎస్ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో షయాన్ జహంగీర్ (37), ఆరోన్ జోన్స్ (34), మోనాంక్ పటేల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లో తదుపరి మ్యాచ్ ఇవాళ జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లే తలపడనున్నాయి. -
యూఎస్ఏతో టీ20.. నెదర్లాండ్స్ భారీ స్కోర్
నెదర్లాండ్స్ ముక్కోణపు టోర్నీలో భాగంగా యూఎస్ఏతో ఇవాళ (ఆగస్ట్ 25) జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. మైఖేల్ లెవిట్ (34 బంతుల్లో 68; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), స్కాట్ ఎడ్వర్డ్స్ (40 బంతుల్లో 81 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్దసెంచరీలతో చెలరేగారు. మ్యాక్స్ ఓడౌడ్ 28, విక్రమ్‌జీత్ సింగ్ 0, జాక్ కాచెట్ 14, ర్యాన్ క్లెయిన్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 3, డ్రైస్డేల్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ ముక్కోణపు టోర్నీలో నెదర్లాండ్స్, యూఎస్ఏతో పాటు కెనడా జట్లు పాల్గొంటున్నాయి. -
సూపర్ సిఫాన్...
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యంతో కలిపి మూడు పతకాలు గెలిచిన నెదర్లాండ్స్ మహిళా అథ్లెట్ సిఫాన్ హసన్ ‘పారిస్’లోనూ మూడు పతకాలతో మెరిసింది. ‘పారిస్’లో ఇప్పటికే 5000 మీటర్లు, 10000 మీటర్ల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన 31 ఏళ్ల సిఫాన్... ఆదివారం జరిగిన మారథాన్ రేసులో ఏకంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని సిఫాన్ 2 గంటల 22 నిమిషాల 55 సెకన్లలో అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా పూర్తి చేసి కొత్త ఒలింపిక్ రికార్డును నమోదు చేసింది. 2012 లండన్ గేమ్స్‌లో 2 గంటల 23 నిమిషాల 7 సెకన్లతో జెలెనా టికి (ఇథియోపియా) నెలకొల్పిన ఒలింపిక్ రికార్డును సిఫాన్ సవరించింది. తాజా విజయంతో సిఫాన్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో డిస్టెన్స్ రన్నింగ్ (5000, 10000 మీటర్లు, మారథాన్)లోని మూడు ఈవెంట్లలో పతకాలు గెలిచిన తొలి మహిళా అథ్లెట్‌గా సిఫాన్ గుర్తింపు పొందింది. పురుషుల్లో ఎమిల్ జటోపెక్ (చెక్ రిపబ్లిక్; 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో... 5000, 10000 మీటర్లు, మారథాన్) మూడు స్వర్ణ పతకాలు గెలిచాడు. -
Netherlands: విద్యుత్ విమానం వచ్చేస్తోంది...
ప్రపంచమంతటా విద్యుత్ వాహనాల హవా పెరిగిపోతోంది. అదే బాటలో త్వరలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ విమానం కూడా రానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 805 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగేలా దీన్ని తయారు చేస్తున్నట్టు నెదర్లాండ్స్‌కు చెందిన ఎలిసియాన్ అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. ఈ9ఎక్స్‌గా పిలుస్తున్న ఈ విమానంలో 90 మంది ప్రయాణించవచ్చు. దీన్ని 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ చెబుతోంది. ‘‘అప్పటికల్లా విద్యుత్ బ్యాటరీల సామర్థ్యం బాగా పెరుగుతుంది. కనుక మా విమానం ప్రయాణ రేంజ్, మోసుకెళ్లగలిగే ప్రయాణికుల సంఖ్య కూడా కచ్చితంగా పెరుగుతాయి’’ అని కంపెనీ డిజైన్, ఇంజనీరింగ్ డైరెక్టర్ రేనార్డ్ డి వ్రైస్ వివరించారు. వీలైనంత తక్కువ బరువు, అదే సమయంలో పూర్తిస్థాయి భద్రత, గరిష్ట సామర్థ్యం ఉండేలా విమానాన్ని డిజైన్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘‘ఈ9ఎక్స్ చూసేందుకు 1960ల నాటి జెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో 8 ప్రొపెల్లర్ ఇంజన్లు, బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ230లను కూడా తలదన్నేలా 42 మీటర్ల పొడవైన రెక్కలుంటాయి’’ అని తెలిపారు. ఒక్కసారి మార్కెట్లోకి వచ్చిందంటే దేశీయంగా తక్కువ దూరాలకు తమ విమానమే బెస్ట్ ఆప్షన్‌గా మారుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘అంతేకాదు, వాయు, శబ్ద కాలుష్యం కారణంగా విమా నాల రాకపోకలపై ఆంక్షలున్న ద్వితీయశ్రేణి నగరాలకు మా విమానం వరప్రసాదమే కాగలదు. పైగా ప్రయాణ సమయంలో విమానం లోపల ఎలాంటి శబ్దాలూ విని్పంచవు. ఇది ప్రయాణికులకు చక్కని అనుభూతినిస్తుంది. ప్రస్తుత విమానాల్లో క్యాబిన్ లగేజీ పెద్ద సమస్య. మా విమానంలో క్యాబిన్ లగేజీ సామర్థ్యాన్ని బాగా పెంచడంపైనా డిజైనింగ్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాం. అదనపు క్యాబిన్ లగేజ్ ప్రయాణికులకు బాగా ఆకట్టుకునే అంశంగా నిలుస్తుంది’’ అని చెబుతున్నారు.అరగంటలో చార్జింగ్ ఎలక్ట్రిక్ వాహనం అనగానే ప్రధానంగా ఎదురయ్యే సమస్య చార్జింగ్. విపరీత మైన పోటీ నెలకొని ఉండే దేశీయ వైమానిక రంగంలో విమానం ఎంత త్వరగా తర్వాతి ప్రయాణానికి సిద్ధమవుతుందన్నది చాలా కీలకం. ముఖ్యంగా చౌక విమానయాన సంస్థలకు ప్రయాణికుల ఆదరణను నిర్ణయించడంలో దీనిదే కీలక పాత్ర. ‘‘ఈ అంశంపైనా ఇప్పట్నుంచే దృష్టి సారించాం. అరగంటలోనే విమానం ఫుల్ చార్జింగ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని వ్రైస్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రేక్ డ్యాన్స్‌లో ‘ఇండియా’ జోరు
విశ్వక్రీడల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన బ్రేక్ డ్యాన్స్ (బ్రేకింగ్) ఈవెంట్లో ఇండియా జోరు సాగుతోంది. అదేంటి ఈ విభాగంలో భారత్ నుంచి ఒక్క డాన్సర్ కూడా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు కదా అని అనుకుంటున్నారా.. ఇండియా అంటే భారత్ అనుకుంటే మీరు పొరబడినట్లే. నెదర్లాండ్స్‌కు చెందిన 16 ఏళ్ల యువ డాన్సర్ ఇండియా సర్జో... ‘పారిస్’ క్రీడల్లో తాను పోటీపడుతున్న నాలుగు విభాగాల్లోనూ సెమీ ఫైనల్‌కు చేరింది. సాధారణంగా బ్రేక్డ్యాన్స్లో పాల్గొనే డాన్సర్లు ‘బి’ గర్ల్స్, ‘బి’ బాయ్స్ అని ఆసక్తికర పేర్లు వినియోగిస్తారు. కానీ 16 ఏళ్ల సర్జో మాత్రం తన అసలు పేరుతోనే పోటీల్లో దిగింది. ‘బి–గర్ల్ పేరు ఎందుకు పెట్టుకోలేదని చాలా మంది అడుగుతున్నారు. కానీ చిన్నప్పటి నుంచి నాకు అలాంటి ప్రత్యేకమైన పేరు ఎవరూ పెట్టలేదు. అందుకే ఇండియా పేరుతోనే బరిలోకి దిగుతున్నా’ అని సర్జో వెల్లడించింది. -
ఇంగ్లండ్ ఫినిషింగ్ టచ్
డార్ట్మండ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 58 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెర దించేందుకు ఇంగ్లండ్ జట్టుకు మరో అవకాశం లభించింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ తరఫున కెపె్టన్ హ్యారీ కేన్ (18వ ని.లో), ఓలీ వాట్కిన్స్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు సిమోన్స్ (7వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన ఇంగ్లండ్ ఆ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరో టైటిల్ గెలవలేకపోయింది. 2020 యూరో టోర్నీలో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరినా ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నెదర్లాండ్స్‌తో సెమీఫైనల్ మ్యాచ్ అదనపు సమయానికి దారి తీయడం ఖాయమనిపించిన దశలో... స్టాపేజ్ ఇంజ్యూరీ టైమ్‌లో (90+1వ నిమిషంలో) సబ్‌స్టిట్యూట్ ఓలీ వాట్కిన్స్ గోల్ సాధించి ఇంగ్లండ్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత మరో మూడు నిమిషాలు నెదర్లాండ్స్‌ను నిలువరించిన ఇంగ్లండ్ విజయాన్ని ఖరారు చేసుకుంది. నిర్ణీత సమయంలో పలు కారణాలతో రిఫరీ ఆటను నిలిపివేయాల్సి వచ్చినపుడు అలా వృథా అయిన సమయాన్ని 90 నిమిషాల తర్వాత స్టాపేజ్ ఇంజ్యూరీ టైమ్‌గా జత చేస్తారు. ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు అద నంగా నాలుగు నిమిషాలు జోడించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ హెడ్ కోచ్ గ్యారెత్ సౌత్‌గేట్ తీసుకున్న సమయోచిత నిర్ణయం విజయవంతమైంది. తొలి గోల్ చేసిన ఇంగ్లండ్ కెపె్టన్ హ్యారీ కేన్‌ను 81వ నిమిషంలో వెనక్కి రప్పించి అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ఓలీ వాట్కిన్స్‌ను... మిడ్‌ఫీల్డర్ ఫిల్ ఫోడెన్ స్థానంలో కోల్ పాల్మెర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. పది నిమిషాల తర్వాత సౌత్‌గేట్ నిర్ణయం సరైనదేనని తేలింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన పాల్మెర్, వాట్కిన్స్ అద్భుత సమన్వయంతో రెండో గోల్ సాధించి పెట్టారు. కుడి వైపు నుంచి పాల్మెర్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో వాట్కిన్స్ అందుకొని కళ్లు చెదిరే కిక్‌తో నెదర్లాండ్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చడంతో ఇంగ్లండ్ శిబిరం సంబరాలు చేసుకుంది. -
గంభీర్ మార్క్.. భారత ఫీల్డింగ్ కోచ్‌గా నెదర్లాండ్స్ లెజెండ్!?
భారత జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 నుంచి శ్రీలంక పర్యటనతో అతడు తన కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. కాగా కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు సమాచారం.ఈ క్రమంలో తన సహాయక సిబ్బంది నియామకంపై గంభీర్ కసరత్తులు మొదలెట్టాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ టెన్ డష్కాటేను తన టీమ్‌లోకి తీసుకునేందుకు గంభీర్ ఆసక్తిగా ఉ న్నట్లు తెలుస్తోంది.అతడికి ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశముందని క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. తాజాగా టెన్ డష్కాటేను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ర్యాన్ టెన్ డష్కాటే నిస్వార్థపరుడని, తను జీవితాంతం నమ్మే వ్యక్తి అతడేనని గంభీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొనియాడాడు. దీంతో డష్కాటే గంభీర్ కోచింగ్ స్టాప్‌లో భాగం కావడం దాదాపు ఖారారైనట్లు అభిమానులు భావిస్తున్నారు. కాగా టెన్ డష్కాటేకి కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. కరీబియన్ ప్రీమియర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్, యూఏఈ టీ20 వంటి ప్రాంఛైజీ క్రికెట్ లీగ్‌ల్లో సపోర్ట్ స్టాప్‌లో భాగంగా ఉన్నాడు. నెదర్లాండ్స్ తరపున 33 వన్డేలు, 24 టీ20లు ఆడిన అతడు.. వరుసగా 1541, 533 పరుగులు చేశాడు. అదేవిధంగా బౌలింగ్‌లో 88 వికెట్లు పడగొట్టాడు. 2011 వన్డే వరల్డ్‌కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో టెన్ డష్కాటే మరి కన్పించలేదు. -
యూరో కప్-2024 సెమీస్ బెర్తులు ఖరారు..
జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీ-2024లో సెమీఫైనల్ బెర్త్‌లు అధికారకంగా ఖరారయ్యాయి. శనివారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టర్కీని ఓడించి నెదర్లాండ్స్ నాలుగో జట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది.ఇంగ్లండ్-స్విట్జర్లాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ 5 గోల్స్ చేయగా స్విస్ జట్టు 3 గోల్స్‌కే పరిమితమై ఓటమి చవి చూసింది. మరోవైపు నాలుగో క్వార్టర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది.కాగా యూరో కప్ సెమీఫైనల్లో నెదర్లాండ్స్ అడుగుపెట్టడం 20 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్ తమ సెమీఫైనల్స్ బెర్త్‌లను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
20 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లో నెదర్లాండ్స్
బెర్లిన్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో రెండు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టర్కీ జట్టుతో ఆదివారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. 35వ నిమిషంలో సామెత్ అకెదిన్ గోల్‌తో టర్కీ ఖాతా తెరిచింది. 70వ నిమిషంలో డెవ్రిజ్ గోల్‌తో నెదర్లాండ్స్ స్కోరును 1–1తో సమం చేసింది. 76వ నిమిషంలో టర్కీ ప్లేయర్ మెర్ట్ ముల్డర్ ‘సెల్ఫ్ గోల్’ చేయడంతో నెదర్లాండ్స్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నెదర్లాండ్స్ కాపాడుకొని 2004 తర్వాత మళ్లీ యూరో టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో స్పెయిన్‌తో ఫ్రాన్స్; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడతాయి. -
Video: 14 ఏళ్లు ప్రధానిగా సేవలు.. ఓటమి తర్వాత సైకిల్‌పై ఇంటికి!
జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎంత ఆస్తి సంపాదించినా, ఎన్ని మంచి పనులు చేసినా.. గర్వం, అహంకారం దరిచేరకుండా నిరాడంబరంగా ఉండాలనేది దీని సారంశం. కొందరికి డబ్బు, అధికారం అందగానే గొప్పగా జీవిస్తుంటారు.. కానీ మరికొందరు తాము ఎంత పెద్ద స్థాయిలో ఉన్న సింపుల్‌గానే జీవిస్తుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచారు. డచ్ ప్రధాని మార్క్ రుట్టే..ఇటీవల జరిగిన నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా 14 ఏళ్లు సేవలందించిన మార్క్ రుట్టే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే కొత్త పీఎంగా ఎన్నికైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డిక్ షూఫ్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించి రుట్టే సాధారణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్లిపోయారు.రుట్టే సైకిల్‌పై వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన సైకిల్‌పై అధ్యక్ష భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది రుట్టేను చప్పట్లు కొట్టి ప్రశంసించడం వీడియోలో చూడొచ్చు. అయితే, రూట్టేకు ‘సైకిల్ రైడ్’ చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా సభలకు సైకిల్‌పై వచ్చి తన నిరాడంబరతను, అంకితభావాన్ని చాటారాయన.అయితే డచ్ పద్ధతిలో ఇలా చేయడం ఆ దేశ ఆచారమని అంటున్నారు. ఎలాగైతే ఖాళీ చేతులతో ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వచ్చారో, అలాగే వెళ్లిపోవడం అక్కడ జరుగుతుందట. ఇక ఇక 14 ఏళ్లు నెదర్లాండ్స్ ప్రధానిగా సేవలు అందించిన మార్క్ రుట్టే.. వచ్చే ఏడాది 'నాటో' కొత్త సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.After 14 years in power, this is how former Dutch Prime Minister Mark Rutte left the Prime Minister's Office after completing the ceremony of officially handing over power to his successor, Dick Schoof.#netherlands pic.twitter.com/exux8saX0D— Kiran Bedi (@thekiranbedi) July 6, 2024 -
EURO CUP 2024: ఉత్కంఠ పోరులో ఆస్ట్రియాపై విజయం.. క్వార్టర్ ఫైనల్లో తుర్కియే
యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లన్నీ ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, తుర్కియే జట్లు ఫైనల్ 8కి అర్హత సాధించాయి. ఇవాళ (జులై 3) జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఆస్ట్రియాపై తుర్కియే 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. Mert Günok's incredible 95th-minute save 🤯😱#EUROLastMinute | @Hublot pic.twitter.com/N2AImAbc7A— UEFA EURO 2024 (@EURO2024) July 2, 2024తుర్కియే తరఫున మెరి దెమిరల్ రెండు గోల్స్ చేయగా.. ఆస్ట్రియా తరఫున మైఖేల్ గ్రెగోరిచ్ గోల్ చేశాడు. చివరి నిమిషంలో తుర్కియే గోల్‌కీపర్ మెర్ట్ గునాక్ అద్భుతమైన స్టాప్‌తో మ్యాచ్ డ్రా కాకుండా చేశాడు. మరోవైపు, నిన్న జరిగిన మరో రౌండ్ ఆఫ్ 16 (ప్రీ క్వార్టర్ ఫైనల్స్) మ్యాచ్‌లో రొమేనియాపై నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది, క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నెదర్లాండ్స్ వర్సెస్ తుర్కియే (జులై 7) -
ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మ్యాచ్ ‘డ్రా’
లీప్జిగ్ (జర్మనీ): ప్రతిష్టాత్మక యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో గోల్ నమోదు కాని తొలి ‘డ్రా’ నమోదైంది. అదీ యూరోప్‌లోని రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య మ్యాచ్‌లో కావడం విశేషం. శనివారం గ్రూప్ ‘డి’లో భాగంగా ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. హోరాహోరీ సమరంలో ఇరు జట్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే మ్యాచ్ కీలక దశలో నెదర్లాండ్స్‌ను దురదృష్టం వెంటాడింది. డచ్ ప్లేయర్ గ్జెవీ సైమన్స్ చేసిన గోల్‌ను రిఫరీ తిరస్కరించాడు. సుదీర్ఘ సమయం పాటు వీడియో రీప్లేలు చూసిన తర్వాత ఆ గోల్‌ను ‘ఆఫ్‌సైడ్’గా ప్రకటించారు. మరో వైపు తమ స్టార్ ప్లేయర్ ఎంబాపె లేకుండా ఫ్రాన్స్ ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. మరో మ్యాచ్‌లో పోర్చు గల్ 3–0 గోల్స్ తేడాతో టర్కీని చిత్తు చేసింది. -
T20 WC: రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ క్రికెటర్
నెదర్లాండ్స్ క్రికెటర్ సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ ఓటమి తర్వాత సిబ్రాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో 1988లొ జన్మించిన సిబ్రాండ్.. అక్కడే క్రికెటర్‌గా మారాడు.విరాట్ కోహ్లి క్యాచ్ అందుకునిఅండర్-19 ప్రపంచకప్-2008లో సౌతాఫ్రికా తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. నాడు యువ భారత్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు.జాంటీ రోడ్స్ మాదిరి క్యాచ్ పట్టాడంటూ అప్పట్లో సిబ్రాండ్పై ప్రశంసలు కురిశాయి. ఇక తర్వాత సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో కేప్ కోబ్రాస్(2008/09, 2015/16), వెస్టర్న్ ప్రావిన్స్(2009/10 to 2016/17) జట్లకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించాడు.చాంపియన్స్-2014 లీగ్‌లో భాగంగా కోబ్రాస్ తరఫున.. జేపీ డుమిన్ స్థానంలో బరిలోకి దిగి.. సూపర్ ఓవర్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అయితే, ఆ తర్వాత ఉన్నత విద్యనభ్యసించడంపై దృష్టి పెట్టిన సిబ్రాండ్ క్రికెట్‌కు విరామం ఇచ్చాడు.ఉద్యోగం కోసం అక్కడికిఎంబీఏ చేసేందుకు ఆటను పక్కనపెట్టి.. చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో ఉద్యోగ విధుల నిమిత్తం 2021లో నెదర్లాండ్స్‌కు మకాం మార్చాడు. అక్కడ క్లబ్ క్రికెట్ ఆడిన సిబ్రాండ్.. డచ్ టాప్క్లాసెస్ చాంపియన్‌షిప్-2023లో వూబర్గ్ సీసీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఈ నేపథ్యంలో 2023లో వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2024లో టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన సిబ్రాండ్.. ప్రపంచకప్-2024 జట్టులోనూ భాగమయ్యాడు.ఇక ఇప్పటి వరకు మొత్తంగా డచ్ జట్టు తరఫున 12 వన్డేలు, 12లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఆయా ఫార్మాట్లలో 385, 280 పరుగులు చేశాడు. ఇక రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన 35 ఏళ్ల సిబ్రాండ్ టీ20లలో 5 వికెట్లు కూడా పడగొట్టాడు.టీ20 వరల్డ్‌కప్-2024 - గ్రూప్-డి శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్👉వేదిక: సెయింట్ లూసియా, వెస్టిండీస్👉టాస్: నెదర్లాండ్స్.. తొలుత బౌలింగ్👉శ్రీలంక స్కోరు: 201/6 (20)👉నెదర్లాండ్స్ స్కోరు: 118 (16.4)👉ఫలితం: 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన శ్రీలంక👉ఈ మ్యాచ్‌లో సిబ్రాండ్ చేసిన పరుగులు: 11.చదవండి: అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్ -
వెఘొర్స్ 'సూపర్ గోల్'.. నెదర్లాండ్స్ సంచలన విజయం
యూరో కప్-2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం హాంబర్గ్ వేదికగా పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1తో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ గేమ్‌లో ఆఖరికి విజయం డచ్ జట్టునే వరించింది.తొలుత ఫస్ట్‌హాఫ్ 16వ నిమిషంలో ఆడమ్ బుకస పోలండ్‌కు మొదటి గోల్‌ను అందించాడు. అనంతరం 29వ నిమిషంలో నెదర్లాండ్స్ ఫార్వర్డ్ కోడి గక్పో అద్బుతమైన గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు.ఫస్ట్‌హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో బ్రేక్ సమయంలో పొలాండ్ మేనెజర్ మిచాల్ ప్రోబియర్జ్ తమ జట్టులో ఒక మార్పు చేశాడు. జాకుబ్ మోడర్‌కు బదలుగా ఇంపాక్ట్ సబ్‌గా స్జిమాన్స్కీ జాకుబ్ తీసుకువచ్చాడు.కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ప్రోబియర్జ్ మళ్లీ 10 నిమిషాల తర్వాత మరో రెండు మార్పులు చేశాడు. కానీ ఫలితం ఏ మాత్రం మారలేదు. ఇక సెకెండ్ హాఫ్ ముగిసే సమయం దగ్గరపడుతుండడంతో 1-1 డ్రాగా ముగుస్తుందని అంతా భావించారు.వౌట్ వెఘొర్స్ అద్బుతం..ఈ క్రమంలో డచ్ మేనేజర్ రోనాల్డ్ కోమాన్ తీసుకున్న ఓ నిర్ణయం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఆఖరి బ్రేక్ సమయంలో రోనాల్డ్ కోమాన్.. మెంఫిస్ డిపే స్థానంలో వౌట్ వెఘోర్స్ట్ని ఇంపాక్ట్ సబ్‌స్ట్యూట్‌గా తీసుకువచ్చాడు.మైదానంలో అడుగపెట్టిన వెఘొర్స్.. ఆట మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా 83వ నిమిషంలో గోల్‌కొట్టి డచ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో నెదర్లాండ్స్ జట్టు ఒక్కసారిగా సంబరాల్లో మునిగి తేలిపోగా.. పొలాండ్ నిరాశలో కూరుకు పోయింది.చదవండి: ఆర్చరీలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్ -
T20 World Cup 2024: సూపర్-8లో చివరి బెర్త్ నేడు (జూన్ 16) ఖరారు
టీ20 వరల్డ్‌కప్ 2024లో చివరి బెర్త్ నేడు (జూన్ 16) ఖరారు కానుంది. గ్రూప్-డి నుంచి రెండో స్థానంలో నిలిచే జట్టేదో ఇవాళ జరిగే మ్యాచ్‌లతో తేలిపోనుంది. గ్రూప్-డి నుంచి సూపర్-8 రేసులో ఉన్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ నేడు వేర్వేరు జట్లతో తలపడనున్నాయి.సెయింట్ విన్సెంట్ వేదికగా జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నేపాల్‌తో తలపడనుండగా.. సెయింట్ లూసియా వేదికగా జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్.. శ్రీలంకను ఢీకొట్టనుంది. నేపాల్‌పై బంగ్లాదేశ్ గెలిస్తే నెదర్లాండ్స్-శ్రీలంక మ్యాచ్‌తో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ సూపర్-8లోకి ప్రవేశిస్తుంది. ఒక వేళ నేపాల్ చేతిలో బంగ్లాదేశ్ ఓడి.. శ్రీలంకపై నెదర్లాండ్స్ గెలిస్తే నెదర్లాండ్స్ సూపర్-8కు అర్హత సాధిస్తుంది. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సూపర్-8లోకి ప్రవేశించింది.బంగ్లాదేశ్-నేపాల్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం కానుండగా.. నెదర్లాండ్స్-శ్రీలంక మ్యాచ్ రేపు ఉదయం 6 గంటలకు మొదలవుతుంది.ఈ రెండు మ్యాచ్‌లతో పాటు ఇవాళ మరో మ్యాచ్ కూడా జరుగనుంది. గ్రూప్-ఏలో భాగంగా పాకిస్తాన్-ఐర్లాండ్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్-ఏ నుంచి భారత్, యూఎస్ఏ ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది.సూపర్-8కు అర్హత సాధించిన జట్లు..గ్రూప్-ఏ నుంచి భారత్, యూఎస్ఏగ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్/నెదర్లాండ్స్సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ D2 (బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్) (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
T20 WC 2024: గెలిచి నిలిచిన బంగ్లాదేశ్
కింగ్స్టౌన్: టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గెలిచి నిలిచింది. సూపర్–8 అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు గురువారం జరిగిన పోరులో బంగ్లా 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్ గెలుపుతో గ్రూప్ ‘డి’లోని మరో జట్టు శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన డచ్ జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గుచూపగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (46 బంతుల్లో 64 నాటౌట్; 9 ఫోర్లు) రాణించాడు. టాపార్డర్‌లో కెపె్టన్ నజ్ముల్ హోస్సేన్ (1), లిటన్ దాస్ (1)ల వైఫల్యంతో 23 పరుగులకే బంగ్లా 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ తంజిద్ హసన్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి షకీబ్ మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.ఆఖర్లో మహ్మూదుల్లా (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాకిర్ అలీ (7 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసి ఓడింది. సైబ్రాండ్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), విక్రమ్‌జీత్ సింగ్ (16 బంతుల్లో 26; 3 సిక్స్‌లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (23 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడినప్పటికీ కీలకమైన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరాజయం తప్పలేదు. రిషాద్ హోస్సేన్ 3, టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. టి20 ప్రపంచకప్‌లో నేడుఅఫ్గానిస్తాన్ X పాపువా న్యూగినీ వేదిక: ట్రినిడాడ్; ఉదయం గం. 6 నుంచిఅమెరికా X ఐర్లాండ్ వేదిక: లాడెర్‌హిల్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 World Cup 2024: రాకాసి బౌన్సర్.. తృటిలో తప్పిన అపాయం
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య ఇవాళ (జూన్ 13) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ పేసర్ వివియన్ కింగ్మా సంధించిన రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో బంగ్లా బ్యాటర్ తంజిద్ హసన్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్ 3వ ఓవర్లో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.ఇంతకీ ఎం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బంగ్లా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి తంజిద్ హసన్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. డచ్ పేసర్ వివియన్ కింగ్మా సంధించిన రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో బంతి తంజిద్ హెల్మెట్ గ్రిల్లో ఇరుక్కుపోయింది. View this post on Instagram A post shared by ICC (@icc)ఒకవేళ బంతి ఇంకాస్తా వేగంగా వచ్చి ఉంటే హెల్మెట్ గ్రిల్ లోనుంచి దూసుకుపోయి తంజిద్ కంటికి పెద్ద గాయం చేసేది. ఊహించని ఈ ఘటనలో తంజిద్ షాక్‌కు గురయ్యాడు. కొద్ది సేపటి వరకు అతనికి ఏమీ అర్దం కాలేదు. బంతి కంటి దగ్గరకు రావడంతో కళ్లు మూసుకున్న తంజిద్, కొద్ది సేపటి తర్వాత కళ్లు తెరిచి చూసే సరికి అంగులాల దూరంలో బంతి ఉంది. షాక్ నుంచి తేరుకున్న తంజిద్ వెంటనే హెల్మెట్ తీసి నేలపై పెట్టాడు. ఫిజియో హుటాహుటిన మైదానంలోకి వచ్చి తంజిత్కు ఫస్ట్ ఎయిడ్ అందించాడు.కాగా, ఈ ఘటన తర్వాత మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన తంజిద్ 26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనికి ముందు ఆర్యన్ దత్ (2 వికెట్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తంజిద్.. షకీబ్ సాయంతో బంగ్లా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 17.2 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 130/4గా ఉంది. షకీబ్ (50), మహ్మదుల్లా (25) క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో షాంటో (1), లిటన్ దాస్ (1), తౌహిద్ హ్రిదోయ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. డచ్ బౌలర్లలో వివియర్ కింగ్మా 2, పాల్ వాన్ మీకెరెన్, టిమ్ ప్రింగిల్ తలో వికెట్ పడగొట్టారు. -
T20 World Cup 2024: నెదర్లాండ్స్-బంగ్లాదేశ్ 'కీ' ఫైట్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 13) బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. కింగ్స్టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8కు చేరే క్రమంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతానికి ఇరు జట్లు చెరి రెండు మ్యాచ్‌లు ఆడి తలో మ్యాచ్‌లో గెలిచి గ్రూప్-డిలో రెండు (బంగ్లాదేశ్), మూడు (నెదర్లాండ్స్) స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ ప్లేస్‌లో ఉన్న సౌతాఫ్రికాతో పాటు సూపర్-8కు చేరే అవకాశాలు అధికంగా ఉంటాయి. నేటి మ్యాచ్ కోసం బంగ్లాదేశ్.. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. నెదర్లాండ్స్ ఓ మార్పు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన తేజ నిడమానూరు స్థానంలో ఆర్యన్ దత్‌ను బరిలోకి దించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్‌కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మాబంగ్లాదేశ్: తంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), లిట్టన్ దాస్(వికెట్‌కీపర్), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రెహమాన్ -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
న్యూయార్క్: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చెమటోడ్చి రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన పోరులో సఫారీ 4 వికెట్లతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ నెగ్గిన సఫారీ ఫీల్డింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకేల్ లెవిట్ (0), మ్యాక్స్ ఓ డౌడ్ (2) సహా టాపార్డర్‌లో విక్రమ్‌జీత్ (12) కూడా నిరాశపరిచారు. ఈ దశలో సైబ్రాండ్ (45 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ లొగాన్ వాన్ బిక్ (23; 3 ఫోర్లు) అండతో జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఐదో ఓవర్ ముగియకముందే 12 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్ ఫలితం పునరావృతమవుతుందేమో అనిపించింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్ (37 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్)కు జతయిన మిల్లర్ (51 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితి చక్కబెట్టాడు. అనంతరం అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (జూన్ 8) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగారు. ఓట్నీల్ బార్ట్‌మన్ (4-0-11-4), అన్రిచ్ నోర్జే (4-0-19-2), మార్కో జన్సెన్ (4-0-20-2) ధాటికి నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్.. సౌతాఫ్రికా పేసర్లు మూకుమ్మడిగా విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో సైబ్రాండ్ ఎంజెల్బ్రెట్చ్ (40), లొగాన్ వాన్ బీక్ (23) రాణించకపోయంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో సైబ్రాండ్, వాన్ బీక్తో పాటు విక్రమ్‌జీత్ (12), స్కాట్ ఎడ్వర్డ్స్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లెవిట్ 0, మ్యాక్స్ ఓడౌడ్ 2, బాస్ డి లీడ్ 6, తేజ నిడమనూరు 0, టిమ్ ప్రింగిల్ 0, వాన్ మీకెరన్ 1 నాటౌట్ పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, కేశవ్ మహారాజ్‌లకు వికెట్లు దక్కనప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన బార్ట్‌మన్ ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.కాగా, గ్రూప్-డిలో భాగమైన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా.. శ్రీలంకపై విజయం సాధించగా..నెదర్లాండ్స్.. నేపాల్‌ను మట్టికరిపించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్‌కీపర్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మాదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్ -
T20 World Cup 2024: సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 8) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో నెదర్లాండ్స్-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగుతున్నాయి. గ్రూప్-డిలో భాగమైన సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన చెరో మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికా.. శ్రీలంకపై విజయం సాధించగా..నెదర్లాండ్స్.. నేపాల్‌ను మట్టికరిపించింది.తుది జట్లు..నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్‌కీపర్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, టిమ్ ప్రింగిల్, పాల్ వాన్ మీకెరెన్, వివియన్ కింగ్మాదక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, ఒట్నీల్ బార్ట్‌మన్ -
టీ20 వరల్డ్‌కప్ 2024లో నేటి (జూన్ 4) మ్యాచ్‌లు
టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాళ (జూన్ 4) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్-బిలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. పసికూన స్కాట్లాండ్తో తలపడనుండగా.. గ్రూప్-డిలో భాగంగా నెదర్లాండ్స్-నేపాల్ జట్లు పోటీ పడనున్నాయి. ఇంగ్లండ్-స్కాట్లాండ్ మ్యాచ్ బార్బడోస్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుండగా.. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్-నేపాల్ సమరం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2024లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. డల్లాస్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కెనడాపై యూఎస్ఏ 7 వికెట్ల తేడాతో గెలుపొందగా.. గయానాలో జరిగిన రెండో మ్యాచ్‌లో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో చెమటోడ్చి నెగ్గింది.బార్బడోస్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించగా.. న్యూయార్క్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. తాజాగా గయానా వేదికగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఉగాండపై ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.మెగా టోర్నీలో భారత తొలి మ్యాచ్ న్యూయార్క్ వేదికగా రేపు జరుగనుంది. ఐర్లాండ్‌తో జరుగబోయే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్‌లో జరుగనుంది. -
T20 World Cup 2024: లంకేయులకు షాక్.. పసికూన చేతిలో పరాభవం
శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మైఖేల్ లెవిట్ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లెవిట్‌తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (12 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్ తుషార, దునిత్ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. లంక ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హసరంగ బ్యాట్ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్‌లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్ షనక (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్ క్లెయిన్ 2, లొగాన్ వాన్ బీక్ ఓ వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ తమ రెండో వార్మప్ మ్యాచ్‌ను మే 30న ఆడనుంది. డల్లాస్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్ మ్యాచ్‌ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్‌లో లంకేయులు ఐర్లాండ్‌తో తలపడతారు. ప్రపంచకప్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు గ్రూప్-డిలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్ 9న న్యూయార్క్‌లో జరుగనుంది. -
బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ వెండింగ్ మెషీన్స్.. ఎక్కడో తెలుసా?
సన్‌స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లడమా..! నో వే..అంటారు అమ్మాయిలు కదా. చర్మ కేన్సర్ బారిన పడకుండా రక్షించుకునేందుకు ఇది మేలైన మార్గం కూడా. అయితే హడావుడిలోనో.. లేదా ఖర్చు అవుతుందనో కొంతమంది సన్ స్క్రీన్‌ను పెద్దగా వాడరు. బహుశా అలాంటి వారి కోసమేనేమో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ ను అందించే ఏర్పాట్లు చేసింది. తద్వారా ప్రజలను కేన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిస్తోంది. భూ ఉత్తరార్ధగోళంలో న్ని చోట్ల సూర్యకిరణాల్లో హానికారక అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సన్‌స్క్రీన్ డిస్పెన్సర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా వేదికలు, ఉద్యానవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సన్ క్రీమ్ డిస్పెన్సర్లను అందుబాటులో ఉంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 80 లక్షల మంది చూసేశారు. చర్మ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేలా చూడాలని నెదర్లాండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇటీవలి సంవత్సరాలలో చర్మ కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే, పళ్లు తోముకున్నట్లే చిన్నప్పటి నుండే సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల మాట.Free sunscreen vending machines have begun to be placed in public areas in the Netherlands.pic.twitter.com/XVXjcI2Pwa— The Best (@ThebestFigen) May 16, 2024> అయితే ట్వీపుల్ మాత్రం భిన్నంగా స్పందించారు. అద్భుతం.. ఉచితంగా ఇస్తే ఇంకా మంచిదని కొందరనగా, ఇవి ఫ్రీ కేన్స్‌ర్ మెషీన్స్ అంటూ వ్యంగ్యంగా మరికొందరు కమెంట్ చేశారు. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, సూర్యుడు మన శరీరంలోని చొచ్చుకెళ్లే రసాయనాలను నాశనం చేసేలా చేద్దాం అంటూ మరికొరు సమాధానమిచ్చారు. -
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్‌లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
రోబో తోటమాలి!
కృత్రిమ మేధ ఇందుగలదు, అందులేదనే సందేహానికి తావులేకుండా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం ఇంతింతై... అన్నట్టుగా క్రమంగా పెరిగిపోతోంది. వ్యవసాయంలో కూడా ఇప్పటికే కృత్రిమ మేధను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో తులిప్స్ రైతులు ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేశారు. తెగుళ్ల బారిన పడ్డ పూల ఏరివేతకు హైటెక్ బాట పట్టారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు ఏఐ సాయంతో రూపొందిన రోబోను ఉపయోగిస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువే అయినా ఈ రోబో మనుషులకు ఏమాత్రంతీసిపోకుండా పని పూర్తి చేస్తూ మన్ననలు అందుకుంటోంది. దాంతో నెదర్లాండ్స్ అంతటా తులిప్ తోటల్లో ఈ రోబోల వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందాల తులిప్ పూలకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తులిప్స్ ఉత్పత్తిదారు కూడా. సీజన్లో విరగబూసి అందాలు వెదజల్లే అక్కడి తులిప్ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బారులు తీరతారు. ఇలా తులిప్స్ సాగు ఉత్పత్తిపరంగానే గాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం. పూలను, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వైరస్లు, తెగుళ్ల బారిన పడ్డ పూలు, మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఏరివేయడం చాలా కీలకం. లేదంటే మొక్కలు బలహీనపడిపోతాయి. పూలు కూడా చిన్నగా, బలహీనంగా పూస్తాయి. పైగా వైరస్ తోటంతా విస్తరించి మొత్తానికే చేటు తప్పదు. ఇప్పటిదాకా మనుషులే రాత్రింబవళ్లూ తోటల్లో కలియదిరుగుతూ ఒక్కో మొక్కనూ, పువ్వునూ పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరేసేవారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. వారిని సిక్నెస్ స్పాటర్స్‌గా పిలిచేవారు. కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి దీటుగా ఈ పని చేసి పెడుతోంది. తులిప్ తోటలను తెగుళ్ల బారినుంచి కాపాడే హైటెక్ ఆయుధంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఏఐ రోబోలు తులిప్ తోటలను కాపు కాస్తున్నాయి. చీడపీడలు, రోగాల బారినుంచి వాటిని కాపాడే పనిలో తలమునకలుగా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇలా పని చేస్తుంది... ► ఏఐ రోబో తులిప్ తోటల్లో ఒక్కో సాలు గుండా గంటకు కిలోమీటర్ వేగంతో నింపాదిగా కదులుతుంది. ►ఒక్కో మొక్కనూ, ఒక్కో పూవునూ, దాని తాలూకు రెమ్మలను అణువణువూ పరీక్షిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వేలాది పొటోలు తీస్తుంది. ►తనలో స్టోరై ఉన్న సమాచారం సాయంతో ఆ ఫొటోలను కూలంకషంగా విశ్లేషిస్తుంది. తద్వారా సదరు మొక్క, పూవు పాడైందీ, బాగున్నదీ నిర్ణయిస్తుంది. ►పాడైనవాటిని ఎప్పటికప్పుడు ఏరేస్తూ ముందుకు సాగుతుంది. ►ఈ రోబోలను తయారు చేసింది హెచ్2ఎల్ రోబోటిక్స్ లిమిటెడ్‌కు చెందిన ఎరిక్ డీ జోంగ్ కంపెనీ. ►తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు, పూలను పక్కగా గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతటినీ రోబోకు ఫీడ్ చేసినట్టు కంపెనీ వివరించింది. ►ఈ సమాచారాన్ని తులిప్స్ సాగు చేసే రైతులు, సిక్నెస్ స్పాటర్ల నుంచి కంపెనీ సేకరించింది. కచ్చితత్వంతో కూడిన సాగు... అలెన్ విసర్ అనే ఆసామి తన తులిప్ తోటలో రెండేళ్లుగా ఏఐ రోబోను వాడుతున్నాడు. ఆయన కుటుంబం మూడు తరాలుగా తులిప్స్సాగు చేస్తోంది. ‘‘ఈ రోబో ఖరీదు 2 లక్షల డాలర్లు! అంత డబ్బుతో ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారే కొనుక్కోవచ్చు’’ అన్నాడాయన. అయితే, ‘స్పోర్ట్స్ కారు పాడైన తులిప్‌లను ఏరిపడేయదు కదా!’ అంటూ చమత్కరించాడు. ‘‘ఈ రోబో ఖరీదైనదే. కానీ నిపుణులైన సిక్నెస్ స్పాటర్లు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో సరిగ్గా చేతికి అందివచ్చింది’’ అని చెప్పాడు. దీన్ని ‘కచ్చితత్వంతో కూడిన సాగు’గా అభివరి్ణంచాడు! కొసమెరుపు నెదర్లాండ్స్ ఉత్తర కోస్తా తీరంలో ప్రఖ్యాత డబ్ల్యూఏఎం పెన్సింగ్స్ తులిప్ తోటలోని ఏఐ రోబోకు అక్క డే జీవితాంతం సిక్నెస్ స్పాటర్‌గా పని చేసి రిటైరైన థియో వాన్‌డర్ వూర్ట్ పేరు పెట్టారు. దీని పనితీరు ఆయన్ను కూడా మెప్పించడం విశేషం. ‘‘తోటల్లో తిరిగీ మా నడుములు పడిపోయేవి! మా పనిని ఈ రోబో అలవోకగా చేసేస్తోంది. పాడైన మొ క్కలు, పూలను మాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా గుర్తించి ఏరేస్తోంది’’ అంటూ కితాబిచ్చాడాయన! -
ఉత్కంఠ సమరం.. నెదర్లాండ్స్ బ్యాటర్ల విధ్వంసం.. ముక్కోణపు సిరీస్ కైవసం
నేపాల్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను నెదర్లాండ్స్ కైవసం చేసుకుంది. నేపాల్‌తో ఇవాళ (మార్చి 5) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో నెదర్లాండ్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. లోయర్ ఆర్డర్ ఆటగాడు టిమ్ వాన్ డర్ గుగ్టెన్ చివరి ఓవర్ రెండు, మూడు బంతులను వరుసగా బౌండరీ, సిక్సర్‌గా మలిచి నెదర్లాండ్స్‌ను గెలిపించాడు. గుగ్టెన్ మొత్తం 5 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి నెదర్లాండ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. The Nepal crowd is simply amazing in every manner! 🇳🇵pic.twitter.com/giCO1hA1oE— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 గుగ్టెన్ మెరుపు ఇన్నింగ్స్‌కు ముందు సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ సైతం బ్యాట్ ఝులిపించాడు. 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులకు రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన సైబ్రాండ్.. మొత్తంగా 29 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి నెదర్లాండ్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. Netherlands' victory lap. - Nepal fans cheering and applauding them in numbers. 👏pic.twitter.com/uc8ch0XO52 — Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (47), గుల్సన్ ఝా (34), కుశాల్ మల్లా (26), రోహిత్ పౌడెల్ (25), కుశాల్ భుర్టెల్ (20) రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫ్రెడ్ క్లాసెన్, గుగ్టెన్, మైఖేల్ లెవిట్, సైబ్రాండ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్.. లెవిట్ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సైబ్రాండ్ (48), గుగ్టెన్ (21 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (22), విక్రమ్‌జిత్ సింగ్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ మల్లా 4 వికెట్లతో చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సిరీస్‌లో నేపాల్, నెదర్లాండ్స్‌తో పాటు నమీబియా పాల్గొంది. -
మారిన గుండెతో 4 దశాబ్దాలు
ఆమ్స్టర్డ్యామ్: గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో 6 నెలలకు మించి బతకవు అని వైద్యులు కరాఖండిగా చెప్పేశారు. అదేకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీనిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి, 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ కథ ఇది. ప్రస్తుతం గ్లైడర్ పైలెట్‌గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినపుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు. త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అనేందుకు నేనే నిలువెత్తు నిదర్శనం. బర్త్‌డేను అయినా పెద్దగా పట్టించుకోనుగానీ ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు’ అని జాన్సెన్ వ్యాఖ్యానించారు. ‘గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి’ అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మ్యాగ్డీ యాకూబ్ చెప్పారు. ‘40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు. అందుకే జాన్సెన్ను లండన్‌లోని హేర్ఫీల్డ్ ఆస్పత్రిలో గుండెమార్పిడి చేశా’ అని చెప్పారు. -
T20I: స్ట్రైక్‌రేటు ఏకంగా 600..? అంతలోనే..
నమీబియాతో టీ20 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్, తెలుగు మూలాలున్న తేజ నిడమనూరు చేసిన పరుగులు కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేదు. అయినా.. అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే...?! నేపాల్- నమీబియా- నెదర్లాండ్స్ మధ్య నేపాల్ వేదికగా టీ20 ట్రై సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నమీబియా- నెదర్లాండ్స్ కీర్తిపూర్ వేదికగా గురువారం తలపడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మైకేల్ లెవిట్ మెరుపు శతకం(62 బంతుల్లో 135 రన్స్) బాదగా.. వన్‌డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ సూపర్ హాఫ్ సెంచరీ(40 బంతుల్లో 75 పరుగులు) చేశాడు. LEVITT! Maiden T20I century for Michael Levitt! He's only 20 years old and he's just the 2nd Dutcman to acheive the milestone!#NAMvNED | #TheNetherlandsCricket | #KNCB pic.twitter.com/AetJhyZzyo — Netherlands Cricket Insider (@KNCBInsider) February 29, 2024 చిచ్చరపిడుగు పరుగుల విధ్వంసం ఈ క్రమంలో లెవిట్ స్ట్రైక్‌రేటు 217.74గా నమోదు కాగా.. సైబ్రండ్ స్ట్రైక్‌రేటు 187.50. మరి తేజ నిడమనూరు స్ట్రైక్‌రేటు ఎంతో తెలుసా?!.. సరిగ్గా 600. నిజమే.. నమీబియాతో మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న అతడు మూడు సిక్సర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. నెట్టింట చర్చ ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20లలో 600 స్ట్రైక్‌రేటు వద్ద ఉండగా అవుటైన మొదటి బ్యాటర్ తేజ నిడమనూరేనా అంటూ ఓ నెటిజన్ చర్చకు దారితీశారు. ఇందుకు స్పందనగా మిగతా యూజర్లు తమకు తోచిన సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా వన్డేల్లో ఆండీ మెక్‌బ్రైన్ అనే క్రికెటర్ ఒక బంతి ఎదుర్కొని సిక్సర్ కొట్టాడని ఓ నెటిజన్ ప్రస్తావించారు. మొత్తానికి అలా తేజ స్ట్రైక్‌రేటు గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సాధారణంగా ఓ బ్యాటర్ మ్యాచ్‌లో మొత్తంగా చేసిన పరుగులను వందతో గుణించి, అతడు ఎదుర్కొన్న బంతులతో భాగించి స్ట్రైక్‌రేటును నిర్ణయిస్తారు. అలా తేజ స్ట్రైక్‌రేటు 600 అయింది. అదీ సంగతి!! భారీ స్కోరుతో సత్తా చాటి ఇదిలా ఉంటే నమీబియాతో మ్యాచ్‌లో లెవిట్, సైబ్రండ్ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 178 పరుగులు జోడించడం విశేషం. నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక భాగస్వామ్యం. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది. మరోవైపు.. తేజ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా 1994లో విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు 2022లో నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 30 వన్డేలు, 8 టీ20లు ఆడి వరుసగా 679, 79 పరుగులు చేశాడు. Is Teja Nidamanuru the first batter to be out with a strike rate of 600 in T20 International cricket? @ZaltzCricket — DB Kate (@DutchBKate) February 29, 2024 -
సిక్సర్ల వర్షం.. యువ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ
నమీబియాతో టీ20 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ యువ క్రికెటర్ మైకేల్ లెవిట్ దుమ్ములేపాడు. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిది సిక్సర్లు, ఏడు బౌండరీల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు లెవిట్. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఇదే తొలి శతకం. కాగా నేపాల్ వేదికగా నమీబియా- నెదర్లాండ్స్- నేపాల్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి టీ20లో నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆతిథ్య నేపాల్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఓపెనింగ్ బ్యాటర్ మైకేల్ లెవిట్.. నేపాల్‌పై అర్ధ శతకం(54) బాదాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లోనూ బ్యాట్ ఝులిపించిన లెవిట్.. 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లెవిట్కు తోడు వన్‌డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ అద్భుత అర్థ శతకం(40 బంతుల్లో 75)తో రాణించాడు. ఇద్దరూ కలిసి ఏకంగా రెండో వికెట్‌కు ఏకంగా 178 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లెవిట్, సైబ్రండ్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. కాగా కీర్తిపూర్లో నమీబియాతో జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. ఈ మేరకు భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ తరఫున టీ20లలో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా మైకేల్ లెవిట్ చరిత్రకెక్కాడు. మాక్స్ ఒడౌడ్ లెవిట్ కంటే ముందు పొట్టి ఫార్మాట్లో సెంచరీ సాధించాడు. -
నేపాల్ బ్యాటర్ల వీరోచిత పోరాటం
నేపాల్ టీ20 ట్రై సిరీస్‌లో రసవత్తర సమరం జరిగింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్‌లో నేపాల్ బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. మ్యాచ్ గెలవాలంటే 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా.. దీపేంద్ర సింగ్ (34 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కరణ్ (7 బంతుల్లో 11; సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడి నేపాల్‌ను విజయానికి చేరువ చేశారు. అయితే చివరి ఓవర్ మూడు, నాలుగు బంతులకు కరణ్, దీపేంద్ర ఔట్ కావడంతో నేపాల్ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. వీరిద్దరూ చెలరేగడంతో నేపాల్ 17వ ఓవర్లో 9 పరుగులు, 18వ ఓవర్లో 18, 19వ ఓవర్లో 15, 20వ ఓవర్లో 12 పరుగులు సాధించింది. చివరి ఓవర్లో దీపేంద్ర సింగ్ తొలి రెండు బంతులను బౌండరీ, సిక్సర్‌గా మలచి నేపాల్ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మైఖేల్ లెవిట్ (54), సైబ్రాండ్ ఎంజెల్బ్రెచ్ట్ (49), ఎడ్వర్డ్స్ (33), తేజ నిడమనూరు (31) రాణించగా.. మ్యాక్స్ ఓడౌడ్ (4) తక్కువ స్కోర్‌కు ఔటయ్యాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, కుశాల్ మల్లా తలో వికెట్ పడగొట్టగా.. ఎడ్వర్డ్, తేజ రనౌట్ అయ్యారు. ఛేదనలో చివరి వరకు పోరాడిన నేపాల్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. దీపేంద్ర సింగ్, కరణ్‌తో పాటు ఆరంభంలో ఆసిఫ్ షేక్ (34), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (50) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్, సైబ్రాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. వివియన్ కింగ్మా, వాన్ డర్ గుగ్టెన్, ఆర్యన్ దత్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో భాగంగా నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆటగాడు లాఫ్టీ ఈటన్ 33 బంతుల్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. -
భారత్‌ను గెలిపించిన శ్రీజేశ్
పురుషుల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 4–2తో డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో విజయం. ‘షూటౌట్’లో గోల్‌కీపర్ శ్రీజేశ్ నెదర్లాండ్స్ జట్టు రెండు ప్రయత్నాలను నిలువరించి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. -
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్‌లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
36 బంతుల్లోనే శతకం.. 11 సిక్సర్లు, 5 ఫోర్లు
యూరోపియన్ మహిళల టీ10 లీగ్ 2023లో సంచలనం నమోదైంది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ ఐరిస్ జ్విల్లింగ్ 36 బంతుల్లోనే శతక్కొట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ 11 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగుల భారీ స్కోర్ చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో జ్విల్లింగ్ ఒక్కరే మూడొంతుల పరుగులు చేయడం విశేషం. మహిళల క్రికెట్ టీ10 ఫార్మాట్లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్ జ్విల్లింగే కావడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో జ్విల్లింగ్ ధాటికి ఇద్దరు బౌలర్లు ఓవర్‌కు 23 పరుగుల చొప్పున సమర్పించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి, 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నెదర్లాండ్స్ బౌలర్లలో డి లాంజ్, రాబిన్ రిజ్కే, హన్నా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కార్లిన్ వాన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మల్లిక మహదేవ 30 పరుగులు చేసింది. ఆస్ట్రియా ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్లు అయ్యారు. -
భారత్ అదరహో
కౌలాలంపూర్: ఆద్యంతం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన భారత జట్టు జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున ఆదిత్య అర్జున్ లలాగే (34వ ని.లో), అరిజిత్ సింగ్ హుందల్ (35వ ని.లో), సౌరభ్ ఆనంద్ కుష్వా (52వ ని.లో), ఉత్తమ్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు టిమో బోర్స్ (5వ ని.లో), వాన్ డెర్ హెజ్డెన్ (16వ ని.లో), ఒలివియర్ హోర్టెన్సియస్ (44వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ 2–1తో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై, ఫ్రాన్స్ 3–2తో ఆ్రస్టేలియాపై, స్పెయిన్ 4–2తో పాకిస్తాన్‌పై విజయం సాధించాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీతో భారత్; స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడతాయి. జూనియర్ స్థాయిలో చివరిసారి 2005లో నెదర్లాండ్స్‌పై గెలిచిన భారత జట్టుకు ఈసారీ గట్టిపోటీ ఎదురైంది. అయితే మ్యాచ్‌లో మూడుసార్లు వెనుకబడ్డ భారత్ ఏమాత్రం ఆందోళన చెందకుండా పోరాడింది. రెండు క్వార్టర్లు ముగిసేసరికి 0–2తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్లో నెదర్లాండ్స్ మూడో గోల్ చేసి మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ ముగిసేందుకు ఎనిమిది నిమిషాలు ఉన్నాయనగా భారత్ మళ్లీ స్కోరును సమం చేసింది. అదే జోరులో మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాలముందు నాలుగో గోల్‌తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. చివర్లో నెదర్లాండ్స్ జట్టు స్కోరును సమం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. నెదర్లాండ్స్ ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... భారత జట్టు గోల్‌కీపర్ మోహిత్‌తోపాటు రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండి నెదర్లాండ్స్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. చివరి పది సెకన్లలోనూ నెదర్లాండ్స్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా భారత ఆటగాళ్లు దానిని నిర్వీర్యం చేసి చిరస్మరణీయ విజయం అందుకున్నారు. మ్యాచ్ మొత్తంలో నెదర్లాండ్స్‌కు 12 పెనాల్టీ కార్నర్లు రాగా వాటిలో మూడింటిని గోల్స్‌గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక దానిని భారత్ లక్ష్యానికి చేర్చింది. 6 జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరడం ఇది ఆరోసారి. గతంలో భారత జట్టు 2001, 2016లలో విజేతగా, 1997లో రన్నరప్‌గా నిలిచింది. 2005, 2021లలో సెమీఫైనల్‌తోపాటు మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. -
రైట్...రైట్!
ఉదారవాదులూ, వామపక్షవాదులూ ‘గత కాలమె మేలు వచ్చు కాలము కంటెన్...’ అనుకోక తప్పని సమయం వచ్చినట్టుంది. మొన్న అర్జెంటీనాలో, ఇప్పుడు నెదర్లాండ్స్‌లో జరిగిన ఎన్నికల్లో మితవాద నేతలు విజయకేతనాలు ఎగరేయటం...యూరప్ ఖండంలోని చాలాచోట్ల నానాటికీ మితవాద పార్టీలకు ఆదరణ పెరుగుతుండటం ప్రపంచం ‘కుడి’వైపు మళ్లుతున్న సూచనలు అందిస్తున్నాయి. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఇటీవల తీవ్ర మితవాద పక్ష నేత జేవియర్ మిలీ వామపక్ష నేత సెర్జియా మాసాను ఓడించి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సెంట్రల్ బ్యాంకు మూసివేత, స్థానిక కరెన్సీ పెసో రద్దు ఆయనగారి వాగ్దానాలు. దేశ సాంఘిక, ఆర్థిక విధానాలను ధ్వంసం చేసి నవ అర్జెంటీనా నిర్మించటమే తన ధ్యేయమని చెప్పుకొన్నారు. తాజాగా నెదర్లాండ్స్‌లో తీవ్ర మితవాద పక్షమైన పార్టీ ఫర్ ఫ్రీడమ్ (పీవీవీ) 37 స్థానాలు గెల్చుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. 150 స్థానాలున్న దిగువ సభలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 76 స్థానాలకు దూరంలోనే వున్నా ఆ పార్టీ నేత గీర్డ్ వైల్డర్స్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే పీవీవీ ప్రవచించే ఇస్లాం వ్యతిరేకత అక్కడ రాజ్యాంగ విరుద్ధం కావటంవల్ల ప్రధాన స్రవంతి పార్టీలు ప్రభుత్వంలో చేరేందుకు నిరాకరిస్తున్నాయి. మసీదుల మూత, ఖురాన్ నిషేధం, ముస్లిం దేశాల నుంచి వలసలు అరికట్టడం వైల్డర్స్ వాగ్దానాలు. రెండో ప్రపంచ యుద్ధానంతరం పశ్చిమ యూరప్‌లో మితవాద పక్షాలకు కాలం చెల్లి, ఉదార వాద పార్టీల ఆధిక్యతే సాగింది. ఒక్క ఇటలీలోని సోషల్ మూవ్మెంట్ పార్టీ (ఎంఎస్ఐ)కి తప్ప ఎక్కడా మితవాదులకు ఆదరణ దొరకలేదు. 1955–80 మధ్య అక్కడక్కడ మితవాద పార్టీలు తలెత్తి కొద్దో గొప్పో స్థానాలు గెల్చుకున్న ఉదంతాలున్నా అవి ఒకటి రెండు దఫాలకు మించి నిలబడ లేకపోయాయి. 1956లో ఫ్రాన్స్‌లో యూనియన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రెటర్నిటీ (యూఎఫ్‌ఎఫ్) 13 శాతం ఓట్లు గెల్చుకుని, 52 స్థానాలు సాధించినా చాలా త్వరగానే కనుమరుగయింది. అంతవరకూ దుందు డుకువాదులుగా పేరుబడిన అతి మితవాద పక్షాలు 1980–2000 మధ్య అంతక్రితంతో పోలిస్తే ఎంతోకొంత మెరుగయ్యాయి. ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీ), నెదర్లాండ్స్‌లో సెంటర్ పార్టీ (సీపీ) ఓటర్లను ఆకట్టుకోవటం మొదలెట్టాయి. అయితే ఉదారవాద పార్టీలు, వామపక్ష పార్టీల తర హాలో వీటికి నిర్దిష్టమైన సిద్ధాంతమేమీ ఉండదు. స్థానికత, జనాకర్షణ, అవినీతి, పెరుగుతున్న నేరాలు, వలసలు, ముస్లింలపై వ్యతిరేత వంటివే ఈ పార్టీలకు ఊపిరి. 1980కి ముందు ఒక శాతం అంతకన్నా తక్కువ ఓట్లు మాత్రమే రాబట్టుకునే మితవాదులు 2010 నాటికి 10 శాతం ఓట్లు తెచ్చు కునే స్థితికి ఎదిగారు. ఒక్క ఆస్ట్రియా దీనికి మినహాయింపు. అక్కడ తీవ్ర మితవాద ఫ్రీడమ్ పార్టీ (ఎఫ్పీ) 1999లో 27 శాతం ఓట్లు సాధించి కూటమి ప్రభుత్వంలో చేరింది. ఈ పరిణామం యూర ప్‌కు మింగుడుపడలేదు. ఆ దేశంపై పలు ఆంక్షలు సాధించటంతోపాటు చాలా దేశాలు అక్కడికి దౌత్య పర్యటనలు మానుకున్నాయి. 2019లో ఎఫ్పీ నేత అవినీతి ఆధారాలతోసహా బట్టబయలు కావటంతో దానికి ఆదరణ సన్నగిల్లింది. కానీ మొన్న ఫిబ్రవరిలో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో అది 24 శాతం ఓట్లతో బలం పుంజుకుంది. వేరే దేశాల్లో కూడా మితవాదులకు ఆదరణ పెరుగుతున్న దాఖలాలు కనబడుతూనే వున్నాయి. స్పెయిన్, బెల్జియం, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది మొదట్లో ఇటలీలో నియో ఫాసిస్ట్ పార్టీగా ముద్రపడిన ఎంఎస్ఐ అధికారం చేజిక్కించుకోగా, నిరుడు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో అతి మితవాది మెరిన్ లీ పెన్ రెండో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు. ఆమె పార్టీ దిగువ సభలో భారీగా స్థానాలు గెల్చుకుంది. జర్మనీలో నియో నాజీ పార్టీ ఏఎఫ్‌డీ ప్రస్తుతానికైతే ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్క పోలాండ్ ఇందుకు మినహాయింపు. అక్కడ 2019 ఎన్నికల్లో 43.6 శాతం ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ (పీఐఎస్)ని మొన్న అక్టోబర్ ఎన్నికల్లో అధికారంలో నుంచి దించలేకపోయినా, ఆ పార్టీ ఆధిక్యతను 35 శాతానికి తగ్గించటంలో ఉదారవాద పార్టీలు విజయం సాధించాయి. నెదర్లాండ్స్‌లో వైల్డర్స్ సాధించిన ఆధిక్యత సహజంగానే యూరప్ అంతటా రాజకీయ ప్రకంప నలకు కారణమైంది. ఎందుకంటే ఇంతవరకూ నెదర్లాండ్స్‌లో ఏ మితవాద పార్టీ 20 శాతం దాటి ఓట్లు సాధించలేదు. తొలిసారి వైల్డర్స్ 23.6 శాతం ఓట్లు గెల్చుకున్నారు. అంతేకాదు... ఇటలీ మిత వాద నేత మెలొని, ఫ్రాన్స్ మితవాద నేత మెరైన్ లీ పెన్ మాదిరి తన తీవ్రవాద భావాలను కాస్త యినా సవరించుకోలేదు. అధికారంలోకి రాగానే ఈయూలో ఉండాలా వద్దా అనే అంశంపై రిఫరెండమ్ నిర్వహిస్తానని వైల్డర్స్ హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యమా కాదా అన్న సంగతలావుంచి వర్తమాన స్థితిగతుల నుంచి గట్టెక్కటం ఎలాగో తెలియక అన్ని దేశాల్లోనూ పాలకులు తలలు పట్టు కుంటున్నారు. ఒకపక్క ఉక్రెయిన్ నుంచి రోజూ వేలాదిమంది శరణార్థులు వస్తున్నారు. పశ్చిమా సియా, ఆఫ్రికా ఖండ దేశాల నుంచి సైతం నిత్యం వలసలుంటున్నాయి. ఇందుకు ఈయూనే తప్పు బట్టాలి. వివిధ దేశాల్లో మంటరాజుకోవటానికి కారణమవుతున్న అమెరికా వైఖరిని నిలువరించక పోగా దానికి సహకారం అందించటమే వలసలు పెరగటానికి కారణం. అశాంతితో దహించుకుపో తున్న దేశాలను వదిలి సహజంగానే జనం సురక్షిత ప్రాంతాలు వెదుక్కుంటారు. ఇతరత్రా విషయా లెలావున్నా వలసలపై ఓటర్లలో ఉన్న భయాందోళనలకు పరిష్కారం వెదకటంలో ప్రధాన స్రవంతి పార్టీలు విఫలమైతే అన్నిచోట్లా రాగలకాలంలో అతి మితవాద పక్షాలదే పైచేయి అవుతుంది. -
ఉద్యోగులకు టాటా స్టీల్ భారీ షాక్.. 800 మంది తొలగింపు
న్యూఢిల్లీ: నిర్మాణాత్మక పోటీతత్వం, లాభదాయకతలో భాగంగా టాటా స్టీల్ కీలక నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్‌లో 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వీరిలో 300 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. టాటా స్టీల్ యూరప్ నుండి రెండు స్వతంత్ర కంపెనీలుగా టాటా స్టీల్ యూకే, టాటా స్టీల్ నెదర్లాండ్స్‌ను వేరు చేసే ప్రక్రియను 2021 అక్టోబరులో టాటా స్టీల్ పూర్తి చేసింది. నెదర్లాండ్స్‌లో కంపెనీకి ఏటా ఏడు మిలియన్ టన్నుల సామర్థ్యంగల తయారీ ప్లాంట్ ఉంది. -
ICC ODI World Cup 2023, India vs Netherlands: భారత్ 9/9
సంపూర్ణం... లీగ్ దశలో భారత్ జైత్రయాత్ర! నెదర్లాండ్స్ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్ ప్రాక్టీస్‌తో టీమిండియా ముగించింది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి ఫిఫ్టీలతో.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్; కేఎల్ రాహుల్ సెంచరీలతో డచ్ బౌలర్లను నెట్ ప్రాక్టీస్‌లో ఆడుకున్నంత ఈజీగా ఆడేశారు. అనంతరం ఏకంగా 9 మంది భారత బౌలర్లు నెదర్లాండ్స్ బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. చివరకు భారీ విజయ సాధించిన రోహిత్ శర్మ బృందం అజేయంగా లీగ్ దశను పూర్తిచేసి బుధవారం న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ పోరుకు సై అంటోంది. బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌లో భారత్ వంద శాతం అంకితభావంతో తొమ్మిదికి తొమ్మిది విజయాలతో లీగ్ దశను అజేయంగా దాటింది. ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. క్రికెట్ కూనపై టాస్ గెలవగానే బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు శతకాన్ని... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ సెంచరీని సాధించారు. రోహిత్ శర్మ (54 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (32 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కోహ్లి (56 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. తేజ నిడమనూరు (39 బంతుల్లో 54; 1 ఫోర్, 6 సిక్స్‌లు) మెరిపించాడు. బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలా 2 వికెట్లు తీస్తే... కోహ్లి, రోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు. బుధవారం ముంబైలో జరిగే తొలి సెమీఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది. ఐదుగురూ చితగ్గొట్టారు... ఓపెనర్లు రోహిత్ బౌండరీలతో... శుబ్‌మన్ సిక్సర్లతో భారత్ 10 ఓవర్లలోనే 91/0 స్కోరు చేసింది. 30 బంతుల్లోనే గిల్ ఫిఫ్టీ పూర్తవగానే నిష్క్రమించాడు. 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి వచ్చాక కెపె్టన్ రోహిత్ 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కాసేపటికే అతనూ పెవిలియన్ చేరాడు. కోహ్లి, అయ్యర్ జోడీ కూడా పాతుకుపోవడంతో డచ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. కోహ్లి 53 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకోగా, భారత్ స్కోరు 29వ ఓవర్లో 200 దాటింది. అక్కడే కోహ్లి వికెట్ పడింది. ఇక్కడితో అర్ధశతకాల ఆట ముగియగా... శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాల బ్యాటింగ్‌ను చూపెట్టారు. 48 బంతుల్లో అయ్యర్, 40 బంతుల్లో రాహుల్ అర్ధశతకాలు సాధించారు. 42వ ఓవర్లో భారత్ 300 పరుగులు చేయగా... ఆ తర్వాత రాహుల్ ఆట పూర్తిగా మారింది. పరుగుల వేగం పుంజుకుంది. అయ్యర్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో ఆఖరి 8.2 ఓవర్లలోనే భారత్ 110 పరుగులు చేసింది. 49వ ఓవర్లో అయ్యర్ మూడు సిక్స్‌లు, ఒక బౌండరీతో 25 పరుగులు పిండుకుంటే... ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా బాదిన రాహుల్ 62 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. దీంతో భారత్ స్కోరు 400 మార్క్ దాటింది. ఐదో బంతికి రాహుల్ అవుటయ్యాడు. రాహుల్, అయ్యర్ 208 పరుగులు జోడించి ప్రపంచకప్ చరిత్రలో నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం రికార్డు సృష్టించారు. కూన కుదేల్ లక్ష్యం కొండంత ఉన్నా దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా నెదర్లాండ్స్ బ్యాటర్లు తమ వంతుకు వచ్చిన ఆటే ఆడారు. మ్యాక్స్ ఒ డౌడ్ (30), అకెర్మన్ (35), సైబ్రాండ్ (80 బంతుల్లో 45; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. విజయవాడలో జని్మంచి నెదర్లాండ్స్‌లో స్థిరపడ్డ తేజ నిడమనూరు మిడిలార్డర్లో కాసేపు భారీ సిక్సర్లతో మురిపించాడు. అయ్యర్, కీపర్ రాహుల్ మినహా 9 మంది భారత తరఫున బౌలింగ్‌కు దిగారు. ప్రధాన బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా ఒక చేయివేశారు. తేజ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తికాగానే ఆ మెరుపులకు రోహిత్ స్వయంగా బౌలింగ్ చేసి ముగింపు పలికాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వెస్లీ (బి) లీడే 61; గిల్ (సి) తేజ (బి) మీకెరన్ 51; కోహ్లి (బి) మెర్వ్ 51; అయ్యర్ (నాటౌట్) 128; రాహుల్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 102; సూర్యకుమార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 410. వికెట్ల పతనం: 1–100, 2–129, 3–200, 4–408. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–52–0, వాన్ బిక్ 10–0–107–0, అకెర్మన్ 3–0–25–0, మీకెరన్ 10–0–90–1, వాన్‌డెర్ మెర్వ్ 10–0–53–1, బస్ డి లీడే 10–0–82–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 4; ఒ డౌడ్ (బి) జడేజా 30; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 35; సైబ్రాండ్ (బి) సిరాజ్ 45; ఎడ్వర్డ్స్ (సి) రాహుల్ (బి) కోహ్లి 17; లీడే (బి) బుమ్రా 12; తేజ (సి) షమీ (బి) రోహిత్ 54; వాన్ బిక్ (బి) కుల్దీప్ 16; మెర్వ్ (సి) షమీ (బి) జడేజా 16; ఆర్యన్ (బి) బుమ్రా 5; మీకెరన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (47.5 ఓవర్లలో ఆలౌట్) 250. వికెట్ల పతనం: 1–5, 2–66, 3–72, 4–111, 5–144, 6–172, 7–208, 8–225 9–236, 10–250. బౌలింగ్: బుమ్రా 9–1–33–2, సిరాజ్ 6–1–29–2, షమీ 6–0–41–0, కుల్దీప్ 10–1–41–2, జడేజా 9–0–49–2, కోహ్లి 3–0–13–1, గిల్ 2–0–11–0, సూర్యకుమార్ 2–0–17–0, రోహిత్ 0.5–0–7–1. 9: ఒకే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందడం ఇదే తొలిసారి. 2003 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 8 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఆ్రస్టేలియా జట్టు 2003, 2007 ప్రపంచకప్‌లలో వరుసగా 11 మ్యాచ్‌ల్లో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. 7: వన్డేల్లో 400 అంతకంటే ఎక్కువ స్కోరు చేయడం భారత్‌కిది ఏడోసారి. దక్షిణాఫ్రికా జట్టు అత్యధికంగా 8 సార్లు ఈ మైలురాయిని దాటింది. 9: ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలిసారి భారత్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ వేయించింది. గతంలో ఇంగ్లండ్ (1987లో శ్రీలంకపై), న్యూజిలాండ్ (1992లో పాకిస్తాన్‌పై) జట్లు మాత్రమే తొమ్మిది మంది బౌలర్లకు అవకాశం ఇచి్చంది. 24: ఈ ఏడాది వన్డేల్లో భారత్ సాధించిన విజయాలు. 1998లోనూ భారత్ అత్యధికంగా 24 వన్డేల్లో గెలిచింది. 60: ఒకే ఏడాది వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ (60) నిలిచాడు. 2015లో ఏబీ డివిలియర్స్ 58 సిక్స్‌లు కొట్టాడు. 215: ఈ ఏడాది భారత జట్టు 30 వన్డేలు ఆడి కొట్టిన సిక్స్‌లు. 2019లో వెస్టిండీస్ అత్యధికంగా 209 సిక్స్‌లు కొట్టింది. -
CWC 2023: 31 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
వన్డే వరల్డ్‌కప్-2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి, లీగ్ దశ అనంతరం అజేయ జట్టుగా నిలిచిన భారత్.. ఆదివారం నెదర్లాండ్స్‌పై గ్రాండ్ విక్టరీతో పలు ప్రపంచకప్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇందులో ఓ రికార్డును భారత్ 31 ఏళ్ల అనంతరం సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించి, వరల్డ్‌కప్ రికార్డును సమం చేశాడు. వరల్డ్‌కప్ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే ఓ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించారు. 1987 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఇలా జరిగింది. నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. అనంతరం 1992 వరల్డ్‌కప్‌లో రెండోసారి ఇలా జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంతో వరల్డ్‌కప్ చరిత్రలో 31 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా, విరాట్, రోహిత్, షమీ, గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయగా.. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు, విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. షమీ, గిల్, సూర్యకుమార్ యాదవ్‌లకు వికెట్ దక్కలేదు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. -
CWC 2023: కుంబ్లే, యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన జడేజా
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (16) పడగొట్టిన స్పిన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జడ్డూకు ముందు ఈ రికార్డు అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్‌ల పేరిట సంయుక్తంగా ఉండేది. 1996 వరల్డ్‌కప్‌లో కుంబ్లే, 2011 వరల్డ్‌కప్‌లో యువరాజ్ 15 వికెట్లు పడగొట్టాడు. తాజాగా జడ్డూ వీరిద్దరి రికార్డును అధిగమించి, వరల్డ్‌కప్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ స్పిన్ బౌలర్‌గా అవతరించాడు. ఈ విభాగంలో కుల్దీప్ (14 వికెట్లు).. జడేజా, కుంబ్లే, యువరాజ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. కాగా, వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు జహీర్ ఖాన్ పేరిట ఉంది. 2011 ఎడిషన్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
CWC 2023 IND VS NED: అజేయ భారత్.. అరుదైన ఘనత
నెదర్లాండ్స్‌పై విక్టరీతో వన్డే వరల్డ్‌కప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది. 2003 ఎడిషన్‌లో సాధించిన 8 వరుస విజయాల రికార్డును భారత్ ప్రస్తుత ఎడిషన్‌లో అధిగమించింది. ప్రపంచకప్ చరిత్రలో ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ఈ జట్టు 2003, 2007 ఎడిషన్లలో వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ జాబితాలో ఆసీస్, భారత్‌ల తర్వాత న్యూజిలాండ్ ఉంది. ఈ జట్టు 2015 వరల్డ్‌కప్‌లో భారత్ పూర్వపు రికార్డుతో సమానంగా వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. నెదర్లాండ్స్‌పై గెలుపుతో టీమిండియా తొమ్మిది వరుస విజయాల రికార్డుతో పాటు మరో ఘనత కూడా సాధించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో తమ అత్యుత్తమ విజయాల రికార్డును ఈ గెలుపుతో సమం చేసింది. 1998లో 24 వన్డేల్లో విజయాలు సాధించిన భారత్.. ప్రస్తుత ఏడాది ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ఆ మార్కును అందుకుంది. కాగా, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
CWC 2023: శ్రేయస్-రాహుల్.. జోడీ నంబర్ వన్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో విజృంభించి నెదర్లాండ్స్‌ను 160 పరుగుల భారీ తేడాతో ఓడించారు. భారత గెలుపులో రాహుల్, శ్రేయస్ ప్రధానపాత్ర పోషించారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు అభేద్యమైన 208 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి దోహదపడింది. ఈ క్రమంలో రాహుల్-శ్రేయస్ జోడీ వరల్డ్‌కప్ రికార్డు నెలక్పొంది. వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున నాలుగు అంతకంటే తక్కువ వికెట్లకు నమోదైన భాగస్వామ్యాల్లో ఇదే అత్యుత్తమంగా నిలిచింది. దీనికి ముందు 2015 వరల్డ్‌కప్‌లో ధోని, రైనా జోడీ జింబాబ్వేపై నెలకొల్పిన అజేయ 196 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా ఉండింది. ఇదే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌పై విరాట్-రాహుల్ జోడీ నెలకొల్పిన 165 పరుగుల భాగస్వామ్యం ఈ విభాగంలో మూడో అత్యుత్తమంగా ఉంది. ఆతర్వాత 1996 వరల్డ్‌కప్‌లో కాంబ్లీ-సిద్దూ నెలకొల్పిన 142 పరుగుల భాగస్వామ్యం.. 1999 వరల్డ్‌కప్‌లో అజయ్ జడేజా, రాబిన్ సింగ్ నెలకొల్పిన 141 పరుగుల భాగస్వామ్యం వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా నెదర్లాండ్స్‌పై కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి దోహదపడిన రాహుల్-శ్రేయస్ జోడీ నంబర్ వన్ జోడీ అనిపించుకుంది. -
11 ఏళ్ల తర్వాత వికెట్ తీసిన హిట్‌మ్యాన్.. ఇదే మ్యాచ్‌లో కోహ్లి కూడా..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పసికూనను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) రెచ్చిపోగా.. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి గెలిపించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ మ్యాచ్‌లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచకప్‌లో తొలిసారి తొమ్మిది మంది భారత బౌలర్లు బౌలింగ్‌కు దిగారు. రెగ్యులర్ బౌలర్లతో పాటు విరాట్, రోహిత్, గిల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఫుల్‌టైమ్ బ్యాటర్లు బౌలింగ్ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చాలాకాలం తర్వాత బంతిపట్టిన విరాట్, రోహిత్ తలో వికెట్ పడగొట్టి, భారత అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించారు. విరాట్ తొమ్మిదేళ్ల తర్వాత.. రోహిత్ 11 ఏళ్ల తర్వాత వన్డే వికెట్ తీసి ఫ్యాన్స్‌కు దీపావళి కానుక అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) విరాట్.. స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీయగా, రోహిత్.. నెదర్లాండ్స్ టాప్ స్కోరర్ తేజ నిడమనూరు వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్, రోహిత్ వికెట్ తీసిన వైనం రాహుల్, శ్రేయస్ మెరుపు శతకాలను సైతం మరుగున పడేసింది. రోహిత్ చివరిసారిగా 2012 ఫిబ్రవరిలో వన్డే వికెట్ తీశాడు. నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆసీస్ ఆటగాడు మాథ్యూ వేడ్ వికెట్ (క్యాచ్ అండ్ బౌల్డ్) దక్కించుకున్నాడు. రోహిత్ తన కెరీర్లో తొమ్మిది వన్డే వికెట్లు, రెండు టెస్ట్ వికెట్లు, ఓ టీ20 వికెట్ పడగొట్టాడు. -
టీమిండియాను ఓడించడం చాలా కష్టం: నెదర్లాండ్స్ కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో రాణించి పసికూనపై పూర్తి స్థాయి ఆధిక్యత ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేస్తూ కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో 410 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్‌లో టీమ్‌గా రాణించి ప్రత్యర్ధిని 250 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ గెలుపుతో భారత్ వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసి, లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచింది. మ్యాచ్ అనంతరం నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కితాబునిచ్చాడు. ప్రస్తుత టోర్నీలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. భారత్ పటిష్టమైన జట్టు అనడానికి, వారు సాధిస్తున్న విజయాలే నిదర్శనమని తెలిపాడు. భారత బ్యాటింగ్ విభాగాన్ని ఆకాశానికెత్తాడు. సొగసైన బ్యాటింగ్ లైనప్ అని కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో కొన్ని సందర్భాల్లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, భారత బ్యాటర్లు ఎదురుదాడికి దిగి, మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసారని అన్నాడు. ఈ టోర్నీ చాలా కఠినంగా ఉండబోతుందని ముందే తెలుసు. శక్తివంచన లేకుండా ఆడాం. రెండు అద్భుత విజయాలు సాధించాం. పలు మ్యాచ్‌ల్లో గెలిచే అవకాశాలు కల్పించుకున్నాం. మరిన్ని విజయాలు సాధించాల్సి ఉండింది. ఓవరాల్‌గా మా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే రాటుదేలుతున్నారు. ఈ టోర్నీ మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. చాలా నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. జట్టుగా ఎదగడానికి ఈ టోర్నీ చాలా సాయపడింది. టీ20 వరల్డ్‌కప్ 2024లోపు మరింత మెరుగుపడాలని ఆశిస్తున్నామని అన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్.. పటిష్టమైన సౌతాఫ్రికాను, తమకంటే మెరుగైన బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చిన విషయం తెలిసిందే. -
మా విజయ రహస్యం అదే.. నెదర్లాండ్స్‌పై విజయానంతరం రోహిత్ శర్మ
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి, లీగ్ దశలో అజేయ జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి పసికూన నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఏకంగా తొమ్మది మంది బౌలర్లను ప్రయోగించిన రోహిత్ శర్మ దాదాపుగా అందరి నుంచి ఫలితం రాబట్టాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. షమీ, గిల్,సూర్యకుమార్ యాదవ్‌లకు వికెట్ దక్కలేదు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము టోర్నమెంట్ ప్రారంభం నుంచి ఒక సమయంలో ఒకే గేమ్ గురించి ఆలోచించి, ఆ మ్యాచ్‌లో బాగా ఆడాలని అనుకున్నాం. ఇది సుదీర్ఘ టోర్నమెంట్ కాబట్టి చాలా దూరం చూడాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కో మ్యాచ్ లక్ష్యంగా పెట్టుకుని, అందులో బాగా ఆడాలని అనుకున్నాం. అలాగే చేశాం. వివిధ వేదికపై పరిస్థితులకు అనుగుణంగా, అందరం కలిసికట్టుగా ఆడాం. ఫలితం సాధించాం. మా వరుస విజయాల వెనుక ఉన్న రహస్యం ఇదే. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఒక్కో సందర్భంలో బాధ్యతలు తీసుకుని సత్తా చాటడం శుభపరిణామం. పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుండాలంటే ఫలితాలు చాలా ముఖ్యం. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి జట్టు సభ్యులందరం కుటంబంలా మమేకమైపోయాం. ఒకరి కంపెనీని మరొకరం ఆస్వాదించాం. ప్రతి గేమ్నుసరదాగా, ఉత్సాహంగా ఆడాలని ప్లాన్ చేసుకున్నాం. అదే విజయాలకు దోహదపడింది. ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఇదే మమ్మల్ని కాపాడింది. మాపై అంచనాలు చాలా ఉన్నాయి. మేము అన్నింటినీ పక్కనపెట్టి, తదుపరి టాస్క్‌పైనే (సెమీస్) దృష్టి పెట్టాలనుకున్నాం. తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంపై స్పందిస్తూ.. బౌలింగ్‌లో ప్రయోగాలు చేసేందుకు ఇదే సరైన సమయమని భావించా. మాకు ప్రస్తుతం ఐదు మంది ఫుల్‌టైమ్ బౌలర్ల సేవలు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ప్రయోగం చేస్తే పార్ట్ బౌలర్‌గా ఎవరు పనికొస్తారో తెలుస్తుందని అలా చేశా. దీనికి తోడు ఈ మ్యాచ్‌లో మా పేసర్లు అనవసరమైన వైడ్ యార్కర్లు వేశారు. అందుకే పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా నేను, గిల్, స్కై బరిలోకి దిగాం అని అన్నాడు. -
కేఎల్ రాహుల్ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సుడిగాలి శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లోనే శతక్కొట్టిన రాహుల్.. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలోనే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్‌కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఇదే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో హిట్‌మ్యాన్ ఆఫ్ఘనిస్తాన్పై 62 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. నెదర్లాండ్స్‌పై సెంచరీతో రాహుల్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (1999లో శ్రీలంకపై 145 పరుగులు) తర్వాత వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన భారత వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోర్ చేసిన వికెట్‌కీపర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. కాగా, రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్ చేసింది. వీరితో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్ 160 పరుగుల తేడాతో గెలుపొంది, ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్, విరాట్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో భారత్ లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. -
IND VS NED: విరాట్ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేస్తుండటంతో ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు స్కోర్ 38 ఓవర్లు ముగిసిన అనంతరం 173/6గా ఉంది. ఎలా చూసినా ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలిచే అవకాశాలు లేవు. pic.twitter.com/tuz5dcN5Tw — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) November 12, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సమయంలో టీవీల్లో తారసపడిన పలు ఆసక్తికర సన్నివేశాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. సూపర్ టచ్‌లో కనిపించిన విరాట్ కోహ్లి 51 పరుగుల వద్ద వాన్ డర్ మెర్వ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో అతని భార్య అనుష్క శర్మ ముఖంలో కనిపించిన హావభావాలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. కోహ్లి 50వ వన్డే సెంచరీ కోసం అతని కంటే అతని భార్య ఎక్కువగా పరితపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదే మ్యాచ్‌లో తారసపడిన మరో సన్నివేశం సైతం నెట్టింట హల్చల్ చేస్తుంది. విరాట్ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీసిన అనంతరం అతనికంటే అతని భార్య అనుష్క శర్మనే ఎక్కువగా సంబురాలు చేసుకుంది. ఈ వీడియో కూడా నెట్టింట సందడి చేస్తుంది. మొత్తంగా నిన్నటి నుంచి విరాట్-అనుష్క వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోలో సైతం వీరిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే, విరాట్ వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును (49) బద్దలు కొట్టేందుకు కేవలం సెంచరీ దూరంలో ఉన్న విషయం తెలిసిందే. -
తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన విరాట్.. ఏకంగా కెప్టెన్‌కే ఝలక్
వన్డేల్లో విరాట్ కోహ్లి తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీశాడు. వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్‌కు బంతినందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయని విరాట్.. తన స్పెల్ రెండో ఓవర్లో వికెట్ తీసి అదరగొట్టాడు. విరాట్ పడగొట్టన వికెట్ సాదాసీదా వికెట్ కాదు. అతను ఏకంగా ప్రత్యర్ధి కెప్టెన్ స్టాట్ ఎడ్వర్డ్స్కే (17) ఝలక్ ఇచ్చాడు. వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ లెగ్‌సైడ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విరాట్‌కు చాలాకాలం తర్వాత వికెట్ దక్కింది. వికెట్ తీసిన అనంతరం విరాట్ సంబురాలు ఆకాశాన్ని అంటాయి. అతను సెంచరీ చేసినప్పుడు కూడా ఇంతలా సంతోషపడి ఉండడు. విరాట్ సాధించిన ఈ ఘనతను చూసి స్టాండ్స్‌లో ఉన్న అతని భార్య అనుష్క శర్మ కూడా ఉబ్బితబ్బి బైపోయింది. ఆమె సంతోషానికి కూడా అవథుల్లేకుండా పోయాయి. వాస్తవానికి విరాట్‌కు అంతకుముందు ఓవర్లోనే వికెట్ దక్కాల్సి ఉండింది. అయితే స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టకపోవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. మొత్తంగా విరాట్ సాధించిన ఈ వికెట్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. వన్డేల్లో విరాట్‌కు ఇది ఐదో వికెట్. అతను తన వన్డే కెరీర్లో అలిస్టర్ కుక్, కీస్వెట్టర్, డికాక్, మెక్కల్లమ్, స్కాట్ ఎడ్వర్డ్స్‌ల వికెట్లు పడగొట్టాడు. విరాట్ టీ20ల్లో (4), ఐపీఎల్‌లోనూ (4) వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by ICC (@icc) కాగా, ఈ మ్యాచ్‌లో 411 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ ఓటమి దిశగా సాగుతుంది. ఆ జట్టు 33 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. విరాట్, సిరాజ్, బుమ్రా, కుల్దీప్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
భారత బ్యాటర్ల మహోగ్రరూపం.. విలవిలలాడిన నెదర్లాండ్స్ బౌలర్, చెత్త రికార్డు
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్ జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు మెరుపు వేగంతో 50 అంటకంటే ఎక్కువ స్కోర్లు చేశారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఒకరికిమించి ఒకరు పేట్రేగిపోవడంతో నెదర్లాండ్స్ బౌలర్లు విలవిలలాడిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ పేసర్ లొగాన్ వాన్ బీక్ భారత బ్యాటర్ల విధ్వంసం ధాటికి బెంబేలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన వాన్ బీక్ ఏకంగా 107 పరుగులు సమర్పించుకుని వరల్డ్‌కప్‌లో మూడో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు కూడా నెదర్లాండ్స్ బౌలర్ పేరిటే ఉండటం విశేషం. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బాస్ డి లీడ్ ఏకంగా 115 పరుగులు సమర్పించుకున్నాడు. ఆతర్వాత వరల్డ్‌కప్‌లో అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాల రికార్డు ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ పేరిట ఉంది. 2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ 110 పరుగులు సమర్పించుకున్నాడు. -
టపాసుల్లా పేలిన టీమిండియా బ్యాటర్లు.. వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్
దీపావళి పర్వదినాన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు టాపాసుల్లా పేలారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు మెరుపు వేగంతో 50 అంతకంటే ఎక్కువ స్కోర్లు చేసి క్రికెట్ అభిమానులకు అసలైన దీపావళి మజాను అందించారు. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) లక్షీ బాంబుల్లా విధ్వంసం సృష్టించగా.. రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చిచ్చుబుడ్లలా మెరుపు హాఫ్ సెంచరీలతో ఎగిసిపడ్డారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ చేసింది. వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ 400 అంతకంటే ఎక్కువ స్కోర్ చేయడం ఇది రెండోసారి. 2007 వరల్డ్‌కప్‌లో బెర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది. బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఆ స్కోర్‌కు మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. ఇదే ఎడిషన్‌లో సఫారీలు శ్రీలంకపై 428 పరుగులు చేశారు. వరల్డ్‌కప్ టాప్-5 అత్యధిక స్కోర్లలో భారత్ రెండు స్థానాల్లో (413, 410) ఉండటం విశేషం. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి ఇలా..
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని అరుదైన ఘనతను ఇవాల్టి మ్యాచ్‌లో సాధించింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు భారత బ్యాటర్లు (రోహిత్, గిల్, విరాట్, శ్రేయస్ రాహుల్) 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు హాఫ్ సెంచరీలు, ఇద్దరు సెంచరీలు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో 50 ప్లస్ స్కోర్లు సాధించిన వారు టాప్-5 బ్యాటర్లు కావడం మరో విశేషం. గతంలో వరల్డ్‌కప్‌యేతర మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఐదుగురు బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు. 2008లో (కరాచీ) జింబాబ్వేతో జరిగిన ఓ వన్డేలో ఐదుగురు పాక్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. అలాగే 2013, 2020ల్లో జరిగిన మ్యాచ్‌ల్లో (జైపూర్, సిడ్నీ) భారత్‌పై ఐదుగురు ఆసీస్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలు స్కోర్ చేశారు. కాగా, నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
కొనసాగుతున్న గిల్ మేనియా.. నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీతో..!
టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అరాచకమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో అయితే అతను ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ (32 బంతుల్లో 51; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) నమోదు చేసిన గిల్.. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇందులో గిల్ ఒక్క వన్డేల్లోనే 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీల సాయంతో 1500 పరుగులు (27 ఇన్నింగ్స్) సాధించడం విశేషం. గిల్ తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగలు (అన్ని ఫార్మాట్లు) చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి (1712), కుశాల్ మెండిస్ (1690), డారిల్ మిచెల్ (1686), రోహిత్ శర్మ (1677) వరుసగా ఉన్నారు. కాగా, నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన గిల్, రోహిత్ శర్మతో కలిసి టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. గిల్‌కు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇది మూడో హాఫ్ సెంచరీ (7 మ్యాచ్‌ల్లో). నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ (61), గిల్‌తో పాటు విరాట్ (51), శ్రేయస్ (62 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీలు సాధించడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 37 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 257/3గా ఉంది. శ్రేయస్‌కు జతగా కేఎల్ రాహుల్ (22) క్రీజ్‌లో ఉన్నాడు. -
CWC 2023: నెదర్లాండ్స్‌పై రోహిత్ హాఫ్ సెంచరీ.. ఒక్క ఫిఫ్టితో ఇన్ని రికార్డులా..!
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (నవంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ (54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు) నమోదు చేశాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ 9 మ్యాచ్‌ల్లో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 503 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. హాఫ్ సెంచరీ అనంతరం హిట్‌మ్యాన్ అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నప్పటికీ, ఈ ఫీట్‌తో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డులు ఏవంటే.. వరుస వరల్డ్‌కప్‌లలో (2019, 2023) 500 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (59) బాదిన ఆటగాడిగా రికార్డు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు (23) బాదిన కెప్టెన్‌గా రికార్డు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక ఫోర్లు (58) బాదిన కెప్టెన్‌గా రికార్డు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు (503) చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో 500 పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు. వన్డేల్లో ఓ వేదికపై (బెంగళూరు) అత్యధిక సిక్సర్లు (31) బాదిన ఆటగాడిగా రికార్డు. సచిన్ (1996, 2003) తర్వాత రెండు వరల్డ్‌కప్ ఎడిషన్లలో 500 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు (13) చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో సచిన్ (21), కోహ్లి (14) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఔటయ్యాక టీమిండియా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. కోహ్లి (46) హాఫ్ సెంచరీకి చేరువ కాగా.. శ్రేయస్ (23) ఆచితూచి ఆడుతున్నాడు. అంతకుముందు శుభ్‌మన్ గిల్ (53) మెరుపు హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 184/2. -
CWC 2023: నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా తొమ్మిదో విజయం
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా తొమ్మిదో విజయం వన్డే వరల్డ్‌కప్ 2023లో భారత జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో రోహిత్ సేన వరుసగా తొమ్మిదో మ్యాచ్‌లో విజయం సాధించింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్, విరాట్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో భారత్ లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఆరో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 172 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. మొహమ్మద్ సిరాజ్ సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్ (45)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐదో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 144 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. బాస్ డి లీడ్‌ను (12) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. తొమ్మిదేళ్ల తర్వాత విరాట్‌కు వికెట్.. వన్డేల్లో విరాట్ తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీశాడు. నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతను స్టాట్ ఎడ్వర్డ్స్ (17) వికెట్ పడగొట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 72 పరుగుల వద్ద నెదర్లాండ్స్ మూడో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (30) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 66 పరుగుల వద్ద నెదర్లాండ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అకెర్మన్ (35) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 411 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి బరెస్సీ (4) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 5/1. రాహుల్, శ్రేయస్ మెరుపు శతకాలు.. టీమిండియా భారీ స్కోర్ కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. వీరిద్దరితో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) కూడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. శతక్కొట్టిన రాహుల్ కేఎల్ రాహుల్ 62 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. బాస్ డి లీడ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది రాహుల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపిస్తున్న శ్రేయస్ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 346/3గా ఉంది. శ్రేయస్‌తో పాటు కేఎల్ (70) క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో రాహుల్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన రాహుల్ .. ఆతర్వాతి ఇన్నింగ్స్‌ల్లో మంచి ఆరంభాలే లభించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాప్-5 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. 43 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 312/3గా ఉంది. శ్రేయస్ (86), రాహుల్ (51) క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్.. హ్యాట్రిక్ శ్రేయస్ అయ్యర్ 48 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఎడిషన్‌లో శ్రేయస్‌కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా (77), శ్రీలంకతో (82) జరిగిన మ్యాచ్‌ల్లోనూ శ్రేయస్ హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతకుముందు పాక్‌పై (53) కూడా ఫిఫ్టి కొట్టాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 244/3. శ్రేయస్ (56), కేఎల్ రాహుల్ (16) క్రీజ్‌లో ఉన్నారు. కోహ్లి ఔట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విరాట్ కోహ్లి (51) ఔటయ్యాడు. వాన్ డర్ మెర్వ్ బౌలింగ్‌లో కోహ్లి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 28.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 200/3. శ్రేయస్‌కు (30) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి విరాట్ కోహ్లి 53 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో తన వన్డే కెరీర్లో 71వ హాఫ్ సెంచరీని, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఐదో ఫిఫ్టిని పూర్తి చేసుకున్నాడు. విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా (9 మ్యాచ్‌ల్లో 592 పరుగులు) అవతరించాడు. 28 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 198/2. విరాట్ (50), శ్రేయస్ (30) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. హిట్‌మ్యాన్ ఔట్ 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. బాస్ డి లీడ్ బౌలింగ్‌లో బరెస్సీకి క్యాచ్ ఇచ్చి హిట్‌మ్యాన్ వెనుదిరిగాడు. 17.4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 129/2. కోహ్లి (12)కి జతగా శ్రేయస్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్ ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో భీకరఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ మరో హాఫ్ సెంచరీ తన సాధించాడు. మీకెరెన్ బౌలింగ్ ఫోర్ కొట్టి హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 44 బంతుల్లో రోహిత్ ఈ ఫీట్‌ను సాధించాడు. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 109/1గా ఉంది. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి (3) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 100 పరుగుల వద్ద భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. 11.5 ఓవర్ల వద్ద ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. అప్పటికే హాఫ్ సెంచరీ (51) పూర్తి చేసిన గిల్.. మీకెరెన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 11 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ అర్ధ శతకాలకు చేరువయ్యారు. వన్డే ప్రపంచకప్-2023లో చివరి లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తమ జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నెదర్లాండ్స్: వెస్లీ బరేసి, మాక్స్ ఓ డౌడ్, కోలిన్ అకెర్మాన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..
వన్డే ప్రపంచకప్-2023లో చివరి లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తమ జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. తుది జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నెదర్లాండ్స్: వెస్లీ బరేసి, మాక్స్ ఓ డౌడ్, కోలిన్ అకెర్మాన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ -
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. బుమ్రా దూరం! జట్టులోకి యువ బౌలర్
వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా తమ అఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో డచ్ జట్టును చిత్తు చేసి రెట్టింపు ఆత్మవిశ్వాసంతో సెమీఫైనల్ బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. డచ్తో మ్యాచ్ కోసం నెట్స్‌లో రోహిత్ సేన తీవ్రంగా శ్రమించింది. టీ20 తరహా నెట్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే పరుగులు వరద పారడం ఖాయం. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్‌పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనెజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. బుమ్రా స్ధానంలో యువ పేసర్, లోకల్ బాయ్ ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ ప్లేస్‌లో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా గాయం కారణంగా టోర్నీ మధ్యలో తప్పుకున్న హార్దిక్ పాండ్యా స్ధానంలో ప్రసిద్ద్ జట్టులోకి వచ్చాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, షమీ, అశ్విన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చదవండి: మిచెల్ మార్ష్ వీరవిహారం -
పరుగుల ధమాకాకు భారత్ సిద్ధం
ఒక మ్యాచ్‌ను మించి మరో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన...ఒకరితో పోటీ పడి మరొకరు చెలరేగుతూ విజయాల్లో తమ భాగస్వామ్యం...ఎదురు లేని ఆటతో దూసుకుపోతున్న భారత జట్టు ప్రపంచకప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించేందుకు సిద్ధమైంది. ఎనిమిది వరుస విజయాల తర్వాత చివరి పోరులోనూ నెగ్గి స్కోరును 9/9కు చేర్చాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పెద్ద పెద్ద జట్లే రోహిత్ సేన ముందు నిలవలేకపోగా...బలహీనమైన నెదర్లాండ్స్ ఇప్పుడు ఎదురుగా ఉంది. బెంగళూరు: వరల్డ్ కప్‌లో ఎప్పుడో సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకున్న టీమిండియా వరుసగా తొమ్మిదో విజయాన్ని ఆశిస్తోంది. 2003 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా 8 మ్యాచ్‌లు నెగ్గింది. ఇప్పుడు మరో మ్యాచ్‌లో గెలిస్తే కొత్త ఘనత నమోదవుతుంది. ఈ ప్రపంచకప్‌లోనే ఆఖరి లీగ్ మ్యాచ్ (45వ)లో నేడు నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. బలాబలాలు, అంచనాల ప్రకారం టీమిండియా డచ్కంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. ఈ వరల్డ్ కప్‌లో కూడా భారీ స్కోర్లే నమోదు కాగా, మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. ప్రసిద్‌కు అవకాశం... భారత జట్టు జైత్రయాత్ర చూస్తే తుది జట్టులో నిజానికి ఎలాంటి మార్పులు అవసరం లేదు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ పోరు గురించే ప్రస్తుతం భారత జట్టు ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుత ప్రత్యర్థిని బట్టి చూస్తే ఒకటి రెండు మార్పులతో బరిలోకి దిగవచ్చు. పేసర్లలో ఒకరిని పక్కన పెట్టిన కొత్తగా జట్టులోకి చేరిన ప్రసిధ్ కృష్ణకు అవకాశం కల్పించవచ్చు. కర్నాటకకే చెందిన ప్రసిధ్ బరిలోకి దిగితే అతనికి ఇదే తొలి వరల్డ్ కప్ మ్యాచ్ అవుతుంది. చెన్నైలో ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ ఆడిన తర్వాత మిగిలిన 7 మ్యాచ్‌లలో స్పిన్నర్ అశ్విన్‌కు చోటు దక్కలేదు. ఇక్కడ కుల్దీప్ స్థానంలో అతడిని ఆడించేందుకు అవకాశం ఉంది. మరో వైపు ఐపీఎల్లో విరాట్ కోహ్లి సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో అతని ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోల్‌కతాలో 49వ సెంచరీతో సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లి ఇక్కడ 50వ శతకం బాదుతాడా అనేది ఆసక్తికరం. పోటీనిచ్చేనా... అక్కడక్కడా కొన్ని మెరుపులు మినహా ఓవరాల్‌గా నెదర్లాండ్స్ ఆటతీరు సాధారణంగా ఉంది. పటిష్టమైన భారత్‌కు ఈ టీమ్ ఏమాత్రం పోటీనివ్వగలదనేది చూడాలి. ఓపెనర్లు డౌడ్, బరెసి శుభారంభంతో పాటు కెప్టెన్ ఎడ్వర్డ్స్, అకెర్మన్, డి లీడ్ బ్యాటింగ్‌లో... మీకెరెన్, వాన్ బీక్ బౌలింగ్‌లో అంచనాలకు తగినట్లుగా రాణిస్తే కొంత పోరాడవచ్చు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి ఆపై న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ప్రస్తుతం నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తేజ నిడమనూరు తొలిసారి స్వదేశంలో భారత జట్టుపై ఆడనున్నాడు. ఈ క్షణం కోసం తాను ఉద్వేగభరితంగా ఎదురు చూస్తున్నట్లు అతను చెప్పాడు. ప్రపంచకప్ సెమీ ఫైనల్ భారత్ x న్యూజిలాండ్ నవంబర్ 15 (ముంబై) ఆ్రస్టేలియా x దక్షిణాఫ్రికా నవంబర్ 16 (కోల్‌కతా) -
టీమిండియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ యువ బ్యాటర్ ఎంట్రీ! కారణమిదే..
CWC 2023- Ind Vs Ned: వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో అదరగొట్టి ప్రధాన టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్ చెప్పుకోదగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఈవెంట్లో ఇప్పటి వరకు ఎనిమిదింట రెండు విజయాలు సాధించింది. ఆరంభం నుంచి భారీ విజయాలు సాధిస్తున్న సౌతాఫ్రికాకు షాకిచ్చి అద్భుత రీతిలో గెలుపొందిన డచ్ జట్టు.. తర్వాత బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. అట్టడుగున డచ్ జట్టు.. టేబుల్ టాపర్‌తో అయితే, రన్‌రేటు పరంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల కంటే వెనుకబడి పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తమ చివరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్ టీమిండియాతో తలపడనుంది. ఇప్పటి వరకు ఎనిమిదికి ఎనిమిది విజయాలు సాధించి జోరు మీదున్న రోహిత్ సేనతో మ్యాచ్‌లో గెలుపు గురించి పక్కనపెడితే.. కనీస పోటీ అయినా ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే.. బెంగళూరులో ఆదివారం జరుగనున్న ఈ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. యువ బ్యాటర్ ఎంట్రీ పేసర్ రియాన్ క్లెన్ స్థానంలో యువ బ్యాటర్ నోవా క్రోస్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ధ్రువీకరించింది. ఈ మేరకు.. ‘‘ఆదివారం బెంగళూరులో అజేయ టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా నెదర్లాండ్స్ కోరిన మార్పునకు టెక్నికల్ కమిటీ అంగీకారం తెలిపింది. క్రోస్ ఈ మ్యాచ్‌తో జట్టులోకి వస్తాడు’’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా వెన్నునొప్పి కారణంగా రియాన్ క్లెన్ జట్టుకు దూరమయ్యాడు. ఇక ఈ టోర్నీలో అతడు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరోవైపు.. నోవా క్రోస్ ఇంతవరకు డచ్ జట్టు తరఫున ఒకే ఒక్క వన్డే ఆడాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌లో 23 ఏళ్ల నోవా ఏడు పరుగులు చేశాడు. చదవండి: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
నెదర్లాండ్స్‌పై విజయం.. ఖుషీలో ఇంగ్లండ్ ఫ్యాన్స్, ఇంత మాత్రానికేనా..!
ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ముక్కీ మూలిగి రెండో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పసికూన నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. ఈ వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ కాక బంగ్లాదేశ్‌పై మాత్రమే విజయం సాధించిన ఇంగ్లండ్.. నిన్న లభించిన చిన్నపాటి విజయానికే ఉబ్బితబ్బిబ్బైపోతుంది. నెదర్లాండ్స్‌పై విజయాన్ని ఇంగ్లండ్ అభిమానులు కూడా ఆస్వాధిస్తున్నారు. ఈ గెలుపుతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ వారి ఖుషీకి కారణం వేరే ఉంది. నెదర్లాండ్స్‌పై 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందడంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు అర్హత సాధించాలంటే వరల్డ్‌కప్‌లో టాప్-7లో (లీగ్ దశ మ్యాచ్‌ల తర్వాత) ఉండాలని ఐసీసీ మెలిక పెట్టిన నేపథ్యంలో ఈ గెలుపు ఇంగ్లండ్‌కు అతి ముఖ్యమైంది. ఇదే ఇంగ్లండ్‌కు, ఆ జట్టు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. నెదర్లాండ్స్‌పై గెలుపుతో ఇంగ్లండ్ ఏడో స్థానానికి వెళ్లడమే కాకుండా మెరుగైన రన్‌రేట్ సాధించి, ఆ స్థానానికి ఢోకా లేకుండా చేసుకుంది. దీంతో ఆ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న వరుస ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించనట్టే. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్.. నెదర్లాండ్స్‌పై కంటితుడుపు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు బెన్ స్టోక్స్ సెంచరీతో (84 బంతుల్లో 108; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. మలాన్ (87), క్రిస్ వోక్స్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ ఛేదనలో చేతులెత్తేసి ఓటమిపాలైంది. ఆ జట్టు 37.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ స్పిన్నర్లు మొయిన్ అలీ (3/42), ఆదిల్ రషీద్ (3/54) నెదర్లాండ్స్‌ను దెబ్బకొట్టారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు (41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
CWC 2023: ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఇలా..
2023 వన్డే ప్రపంచకప్ రికార్డుల అడ్డాగా మారింది. ఈ ఎడిషన్‌లో నమోదైనన్ని రికార్డులు బహుశా ఏ ఎడిషన్‌లోనూ నమోదై ఉండకపోవచ్చు. ప్రతి మ్యాచ్‌లో పదుల సంఖ్యలో రికార్డులు నమోదవుతున్నాయి. ప్రపంచ రికార్డులు సైతం ఈ ఎడిషన్‌లో సులువుగా బద్దలవుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పలు వ్యక్తిగత, టీమ్ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఓ ప్రధానమైన రికార్డు ఉంది. అదేంటంటే.. ప్రపంచకప్ చరిత్రలో ఓ ఎడిషన్‌లో అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. నెదర్లాండ్స్‌పై గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో విజయాన్ని (బంగ్లాదేశ్, నెదర్లాండ్స్) నమోదు చేసింది. నెదర్లాండ్స్ ఇదివరకే రెండు విజయాలు (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో పాల్గొన్న మిగతా జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించాయి. ఈ ఎడిషన్‌లో భారత్ అందరికంటే ఎక్కువగా, ఆడిన 8 మ్యాచ్‌ల్లో 8 వరుస విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరి 6 విజయాలు (8 మ్యాచ్‌ల్లో) సాధించాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలో 4 విజయాలు (8 మ్యాచ్‌ల్లో) నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఎడిషన్‌లో పాల్గొన్న పది జట్లు కనీసం రెండ్రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి వరల్డ్‌కప్ రికార్డు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే, బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ గెలుపుతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అర్హత దృష్ట్యా కీలకంగా పరిగణించడుతుంది. వరల్డ్‌కప్ లీగ్ దశ తర్వాత టాప్-7లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. -
బెన్ స్టోక్స్ సెంచరీ
పుణే: వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడి సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్ టోర్నీలో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. టోర్నీ తొలి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి, అనంతరం బంగ్లాదేశ్‌పై నెగ్గిన ఇంగ్లండ్... ఆపై వరుసగా అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆ్రస్టేలియా జట్ల చేతిలో చిత్తయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 108; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... డేవిడ్ మలాన్ (74 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), క్రిస్ వోక్స్ (45 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఒకదశలో 133/1తో మెరుగైన స్థితిలో కనిపించిన ఇంగ్లండ్... తర్వాతి 15 ఓవర్లలో 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 192/6 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో స్టోక్స్, వోక్స్ ఏడో వికెట్‌కు 13.3 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అనంతరం నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. తేజ నిడమనూరు (34 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... స్కాట్ ఎడ్వర్డ్స్ (38), వెస్లీ బరేసి (37), సైబ్రాండ్ (33) ఫర్వాలేదనిపించారు. తాజా విజయంతో ఏడో స్థానానికి చేరిన ఇంగ్లండ్ 2025 చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశాలను ప్రస్తుతానికి సజీవంగా ఉంచుకుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) మీకెరెన్ (బి) దత్ 15; మలాన్ (రనౌట్) 87; రూట్ (బి) వాన్ బీక్ 28; స్టోక్స్ (సి) సైబ్రాండ్ (బి) వాన్ బీక్ 108; బ్రూక్ (సి) అకెర్మన్ (బి) డి లీడ్ 11; బట్లర్ (సి) తేజ (బి) మీకెరెన్ 5; అలీ (సి) డి లీడ్ (బి) దత్ 4; వోక్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 51; విల్లీ (సి) సైబ్రాండ్ (బి) డి లీడ్ 6; అట్కిన్సన్ (నాటౌట్) 2; రషీద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 339. వికెట్ల పతనం: 1–48, 2–133, 3–139, 4–164, 5–178, 6–192, 7–321, 8–327, 9–334. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–0–67–2, వాన్ బీక్ 10–0–88–2, మీకెరెన్ 10–0–57–1, డి లీడ్ 10–0–74–3, వాన్‌డర్ మెర్వ్ 3–0–22–0, అకెర్మన్ 7–0–31–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ బరేసి (రనౌట్) 37; మ్యాక్స్ ఒ డౌడ్ (సి) అలీ (బి) వోక్స్ 5; అకెర్మన్ (సి) బట్లర్ (బి) విల్లీ 0; సైబ్రాండ్ (సి) వోక్స్ (బి) విల్లీ 33; ఎడ్వర్డ్స్ (సి) మలాన్ (బి) అలీ 38; డి లీడ్ (బి) రషీద్ 10; తేజ నిడమనూరు (నాటౌట్) 41; వాన్ బీక్ (సి) మలాన్ (బి) రషీద్ 2; వాన్‌డర్ మెర్వ్ (సి) రషీద్ (బి) అలీ 0; దత్ (బి) రషీద్ 1; మీకెరెన్ (స్టంప్డ్) బట్లర్ (బి) అలీ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (37.2 ఓవర్లలో ఆలౌట్) 179. వికెట్ల పతనం: 1–12, 2–13, 3–68, 4–90, 5–104, 6–163, 7–166, 8–167, 9–174, 10–179. బౌలింగ్: వోక్స్ 7–0–19–1, విల్లీ 7–2–19–2, అట్కిన్సన్ 7–0–41–0, మొయిన్ అలీ 8.2–0–42–3, ఆదిల్ రషీద్ 8–0–54–3. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ x శ్రీలంక వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నెట్స్‌లో తీవ్రంగా శ్రమించిన రాహుల్, గిల్.. కోహ్లి డుమ్మా
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా నవంబర్ 12న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్న భారత జట్టు.. బుధవారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. నెట్ ప్రాక్టీస్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్‌కు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్లు శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ మాత్రం ఎక్కువ సమయం పాటు నెట్స్‌లో గడిపినట్లు తెలుస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో ప్రసిద్ద్ కృష్ణను తుది జట్టులోకి తీసుకురానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్‌కు షాక్ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే! First practice session for the Indian team at the M. Chinnaswamy Stadium. India takes on Netherlands on Nov 12. pic.twitter.com/pzNz4vaiEI — Ashwin Achal (@AshwinAchal) November 8, 2023 -
నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలు సజీవం
వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. ఈ టోర్నీలో భాగంగా పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 179 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్ ఒక్క వికెట్ సాధించారు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో తేజ నిడమనూరు(41 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతుకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్(108) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలలో 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. స్టోక్స్‌తో పాటు డేవిడ్ మలాన్(87), క్రిస్ వోక్స్(51) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. డచ్ బౌలర్లలో బాస్ డీలీడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అర్యన్ దత్, వాన్ బీక్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో ఏడో స్ధానానికి చేరుకుంది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశాలను ఇంగ్లండ్ సజీవంగా నిలుపుకుంది. చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు -
WC 2023: వరల్డ్‌కప్‌లో స్టోక్స్ తొలి సెంచరీ.. ఇంగ్లండ్ భారీ స్కోరు
ICC WC 2023- Eng Vs Ned: వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వరల్డ్‌కప్ టోర్నీలో తన తొలి శతకం నమోదు చేశాడు. పుణె వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(15) విఫలం కాగా.. మరో ఓపెనర్ డేవిడ్ మలన్ 87 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ చెత్త షాట్ సెలక్షన్‌తో 28 పరుగులకే వెనుదిరగగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో తన పేరిటా ఓ సెంచరీని లిఖించుకున్నాడు. మిగతా వాళ్లలో క్రిస్ వోక్స్ అర్ద శతకం(51) బాదాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించింది. డచ్ బౌలర్లలో బాస్ డి లిడే మూడు, ఆర్యన్ దత్, లోగన్ వాన్ బీక్ చెరో రెండు, పాల్ వాన్ మెకెరన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ వేదికగా ప్రపంచకప్ బరిలో దిగిన ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్‌కు కూడా సెమీ ఫైనల్ అవకాశాలు లేవు. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో 9, 10 స్థానాల కోసం అన్నట్లుగా ఈ నామమాత్రపు మ్యాచ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన స్టోక్స్ పునరాగమనంలోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, ఈ నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం సెంచరీ చేయడం విశేసం. కాగా 2019లో ఇంగ్లండ్ ట్రోఫీ గెలవడంలో స్టోక్స్‌దే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. రెండు మార్పులు
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పూణే వేదికగా ఇవాళ (నవంబర్ 8) నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత ఎడిషన్ నుంచి ఇదివరకే ఎలిమినేట్ అయిన ఇంగ్లండ్.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండి కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్‌లో ఆడిన మార్క్ వుడ్, లివింగ్‌స్టోన్ స్థానాల్లో హ్యారీ బ్రూక్, అట్కిన్సన్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు నెదర్లాండ్స్ ఒకే మార్పుతో బరిలోకి దిగుతుంది. జుల్ఫికర్ స్థానంలో తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు బరిలోకి దిగుతున్నాడు. తుది జట్లు.. ఇంగ్లండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మొయిన్ అలీ, అట్కిన్సన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్ నెదర్లాండ్స్: వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్‌కీపర్), బాస్ డి లీడ్, తేజ నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ -
WC 2023: అతడు ఎప్పుడూ ఇలాగే.. సెమీస్ చేరుతాం: అఫ్గనిస్తాన్ కెప్టెన్
ICC WC 2023- Afg Vs Ned- Hashmatullah Shahidi: ‘‘ఈరోజు మా బౌలర్లు రాణించారు. బ్యాట్‌తోనూ అనుకున్న ఫలితాన్ని రాబట్టాం. లక్ష్యాన్ని ఛేదించాం. ఈ టోర్నీలో ఛేజింగ్‌లో విజయవంతం కావడం ఇది మూడోసారి. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఇలాంటి విజయాలు ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తాయి. ఇక మహ్మద్ నబీ గురించి చెప్పేదేముంది. అతడు ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. ఎప్పుడూ ఇలాగే.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ నేనున్నానంటూ పట్టుదలగా నిలబడతాడు. మేమంతా సమిష్టి కృషితో ఇక్కడి దాకా చేరుకున్నాం. ప్రతీ గెలుపును పూర్తిగా ఆస్వాదిస్తున్నాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సెమీ ఫైనల్లో అడుగుపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒకవేళ మేము గనుక ఆ ఫీట్ సాధిస్తే అంతకంటే పెద్ద విషయం మరొకటి ఉండదు’’ అని అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది అన్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) సెమీస్ చేరాలని పట్టుదలగా ఉన్నాం వన్డే వరల్డ్‌కప్-2023లో జట్టు సాధిస్తున్న విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నామంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇలాగే ముందుకు సాగి సెమీస్ చేరాలని పట్టుదలగా ఉన్నామని తెలిపాడు. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో అఫ్గన్ జట్టు నాలుగో గెలుపు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే మూడు మాజీ చాంపియన్లను ఓడించిన హష్మతుల్లా బృందం శుక్రవారం నాటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) స్పిన్నర్ల ధాటికి అఫ్గన్ బౌలర్ల ధాటికి 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కీలక సమయంలో రనౌట్ల కారణంగా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అఫ్గన్ స్పిన్నర్లు మహ్మద్ నబీ మూడు, ముజీబ్ ఉర్ రహ్మాన్ ఒకటి, నూర్ అహ్మద్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గన్‌ను డచ్ బౌలర్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(10), ఇబ్రహీం జద్రాన్(20)లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు. హష్మతుల్లా కెప్టెన్ ఇన్నింగ్స్ ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా(52) అర్ద శతకం సాధించాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 56, అజ్మతుల్లా ఒమర్జాయ్ 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి అఫ్గన్‌కు విజయం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ ముగ్గురు రాణించడంతో 31.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించిన అఫ్గనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగపరచుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హష్మతుల్లా మాట్లాడుతూ.. ఈసారి తాము కచ్చితంగా సెమీ ఫైనల్ రేసులో నిలుస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల క్రితం మా అమ్మను కోల్పోయాం. మా కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మా దేశానికి చెందిన చాలా మంది శరణార్థులు బతుకుపోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల బాధను మేము అర్థం చేసుకోగలం. ఈ రోజు ఈ విజయాన్ని వాళ్లకు అంకితం చేస్తున్నాం’’ అని హష్మతుల్లా ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో మహ్మద్ నబీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ -
WC 2023: అఫ్గాన్... అదే జోరు.. సెమీఫైనల్ ఆశలు సజీవం
లక్నో: సమష్టి ప్రదర్శనతో అదరగొడుతూ... అంచనాలకు మించి రాణిస్తూ... వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో అఫ్గానిస్తాన్ నాలుగో విజయం నమోదు చేసింది. ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన మూడు జట్లపై సంచలన విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్ తాజాగా నెదర్లాండ్స్ జట్టును ఓడించి సెమీఫైనల్ రేసులో నిలిచింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. సైబ్రాండ్ (86 బంతు ల్లో 58; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, మ్యాక్స్ ఓ డౌడ్ (40 బంతుల్లో 42; 9 ఫోర్లు) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నబీ 3 వికెట్లు, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. అనంతరం అఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి గెలిచింది. రహ్మత్ షా (54 బంతుల్లో 52; 8 ఫోర్లు), కెపె్టన్ హష్మతుల్లా (64 బంతు ల్లో 56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. డచ్ రనౌట్... నెదర్లాండ్స్ జట్టులో టాప్–5లో ఒక్క ఓపెనర్ వెస్లీ (1) మినహా... తర్వాత వరుసగా నలుగురు బ్యాటర్లు మ్యాక్స్ ఓ డౌడ్, అకెర్మన్ (35 బంతుల్లో 29; 4 ఫోర్లు), సైబ్రాండ్, కెపె్టన్ ఎడ్వర్డ్స్ (0) రనౌట్ కావడమే డచ్ కొంపముంచింది. వన్డేల్లో ఒక జట్టు తరఫున టాప్–5లో నలుగురు రనౌట్ కావ డం ఇదే ప్రథమం. సమన్వయలోపం, పరుగేలేని చోట ప్రయత్నించి భంగపడటంతో నెదర్లాండ్స్ కష్టాలు కొనితెచ్చుకుంది. తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. గెలిపించిన రహ్మత్, హష్మతుల్లా సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్ల వైఫల్యం కంగారుపెట్టింది. రహ్మనుల్లా గుర్బాజ్ (10), ఇబ్రహీం జద్రాన్ (20) నిరాశపరిచారు. ఈ దశలో రహ్మత్ షా, కెపె్టన్ హష్మతుల్లా ఇన్నింగ్స్ నడిపించి, గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో రహ్మత్ షా (47 బంతుల్లో) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. మూడో వికెట్‌కు 74 పరుగులు జోడించాక జుల్ఫికర్ బౌలింగ్‌లో రహ్మత్‌షా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన అజ్మతుల్లా (31 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 52 పరుగులు జత చేసిన హష్మతుల్లా జట్టును విజయతీరానికి చేర్చాడు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా... అఫ్గాన్ ఏదో గాలివాటం గెలుపులేమీ గెలవలేదు. చక్కని బౌలింగ్, నిలకడైన బ్యాటింగ్‌తో మాజీ చాంపియన్లను ఓడించి 8 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో నిలిచింది. ఇప్పటివరకైతే బానే ఉంది. కానీ హష్మతుల్లా జట్టుకు మిగిలినవి రెండు మ్యాచ్‌లే! అవి కూడా గట్టి ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా (7న ముంబైలో), దక్షిణాఫ్రికా (10న అహ్మదాబాద్‌లో)లతో కావడంతో... సెమీస్ చేరడం, కల సాకారమవడం మాత్రం అంత సులభమైతే కాదు. అయితే సంచలనాల మజా ఆఖరి దశను రసవత్తరం చేస్తే మాత్రం... 2003లో కెన్యా సెమీస్ చేరినట్లే... అఫ్గాన్‌కు ఆ అవకాశం దక్కినా దక్కొచ్చు! స్కోరు వివరాలు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: వెస్లీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ముజీబ్ 1; మ్యాక్స్ ఓ డౌడ్ (రనౌట్) 42; అకెర్మన్ (రనౌట్) 29; సైబ్రాండ్ (రనౌట్) 58; ఎడ్వర్డ్స్ (రనౌట్) 0; బస్ డి లీడే (సి) ఇక్రామ్ (బి) నబీ 3; జుల్ఫీకర్ (సి) ఇక్రామ్ (బి) నూర్ అహ్మద్ 3; వాన్ బిక్ (స్టంప్డ్) ఇక్రామ్ (బి) నబీ 2; వాన్‌డెర్ మెర్వ్ (సి) జద్రాన్ (బి) నూర్ అహ్మద్ 11; ఆర్యన్ దత్ (నాటౌట్) 10; మీకెరన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నబీ 4; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 179. వికెట్ల పతనం: 1–3, 2–73, 3–92, 4–92, 5–97, 6–113, 7–134, 8–152, 9–169, 10–179. బౌలింగ్: ముజీబ్ 10–0–40–1, ఫరూఖీ 5–0–36–0, ఒమర్జాయ్ 3–0–11–0, నబీ 9.3–1–28–3, రషీద్ ఖాన్ 10–0–31–0, నూర్ అహ్మద్ 9–0–31–2. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బిక్ 10; జద్రాన్ (బి) వాన్‌డెర్ మెర్వ్ 20; రహ్మత్ షా (సి అండ్ బి) జుల్ఫికర్ 52; హష్మతుల్లా (నాటౌట్) 56; అజ్మతుల్లా (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (31.3 ఓవర్లలో 3 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–27, 2–55, 3–129. బౌలింగ్: ఆర్యన్ దత్ 8.3–0–49–0, వాన్ బిక్ 7–0–30–1, మీకెరన్ 5–0–35–0, వాన్‌డెర్ మెర్వ్ 5–0–27–1, జుల్ఫికర్ 3–0–25–1, అకెర్మన్ 3–0–12–0. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ X పాకిస్తాన్ వేదిక: బెంగళూరు ఉదయం గం. 10:30 నుంచి ఆ్రస్టేలియా Xఇంగ్లండ్ వేదిక: అహ్మదాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్.. పాక్‌ను వెనక్కి నెట్టి
వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్ మరో అద్బుత విజయం సాధించింది. లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ షాహిదీ(56నాటౌట్) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెహమత్ షా(52) పరుగులతో రాణించాడు. డచ్ బౌలర్లలో వాన్‌బీక్, జుల్ఫికర్, వాండర్ మెర్వ్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. డచ్ బ్యాటర్లలో నలుగురు రనౌట్ల రూపంలో వెనుదిరిగారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్ రెండు, ముజీబ్ ఒక్క వికెట్ సాధించాడు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
నెదర్లాండ్స్ కొంపముంచిన రనౌట్లు.. 179 పరుగులకే ఆలౌట్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా అఫ్గానిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులకే డచ్ జట్టు కుప్పకూలింది. డచ్ బ్యాటర్లలో నలుగురు రనౌట్ల రూపంలో వెనుదిరిగారు. స్టార్ డచ్ బ్యాటర్లు మ్యాక్స్ ఓడౌడ్, అకెరమెన్, కెప్టెన్ స్కాట్ ఎడవర్డ్స్, ఎంగెల్‌బ్రెచ్ట్ రనౌట్లగా పెవిలియన్‌కు చేరారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్ రెండు, ముజీబ్ ఒక్క వికెట్ సాధించాడు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన నేపాల్.. టీ20 వరల్డ్ కప్‌కి అర్హత -
CWC 2023: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన నెదర్లాండ్స్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 3) ఆఫ్ఘనిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఫ్ఘనిస్తాన్ (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఆరో స్థానంలో ఉండగా.. నెదర్లాండ్స్ (6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు) ఎనిమిదో స్థానంలో ఉంది. తుది జట్లు.. నెదర్లాండ్స్: మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేసి, కోలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్‌కీపర్), బాస్ డి లీడ్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, సకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూఖీ -
WC 2023: రోజురోజుకీ మరింత చెత్తగా.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్
ICC WC 2023- Ban vs Ned: ‘‘మేము బాగానే బౌలింగ్ చేశామని భావించాను. నిజానికి వాళ్లను 160- 170 పరుగులకే కట్టడి చేయాల్సింది. ఇక టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటి వరకు బ్యాటింగ్ పరంగా మేము పూర్తిగా విఫలమయ్యాం. టోర్నీ ఆసాంతం గెలుపు కోసం మేము తంటాలు పడుతూనే ఉన్నాం. ఈరోజు మా ప్రదర్శన మరింత చెత్తగా ఉంది. అసలు ఇది బంగ్లా జట్టేనా అనేలా మా ఆట తీరు ఉంది. ఇక ముందు కూడా మాకు అన్నీ కఠిన సవాళ్లే ఎదురవుతాయి. అయితే, ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి ధైర్యంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంటుంది’’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అన్నాడు. పటిష్టమైన దక్షిణాఫ్రికాను కంగుతినిపించి కాగా ప్రపంచకప్-2023లో ఇదివరకే పటిష్టమైన దక్షిణాఫ్రికాను కంగుతినిపించిన నెదర్లాండ్స్ తాజాగా బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. షకీబ్ బృందాన్ని ఏకంగా 87 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. డచ్ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (89 బంతుల్లో 68; 6 ఫోర్లు) రాణించాడు. వెస్లీ బారెసి (41 బంతుల్లో 41; 8 ఫోర్లు), సైబ్రాండ్ (61 బంతుల్లో 35; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. సులువైన లక్ష్యాన్ని ఛేదించలేక ఈ క్రమంలో సులువైన లక్ష్యమే ఎదురైనా... బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. మెహిదీ హసన్ మిరాజ్ (40 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా మిగతావారంతా విఫలమయ్యారు. దీంతో బంగ్లాకు నెదర్లాండ్స్ చేతిలో పరాభవం తప్పలేదు. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బంగ్లాదేశ్ సారథి షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. మిగిలిన మ్యాచ్‌లలోనూ సవాళ్లు తప్పవని.. అయినా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు సాగుతామని తెలిపాడు. ఏదేమైనా గెలుపోటముల్లో మాకు అండగా ఉన్న అభిమానులు ఇప్పటికీ తమకు మద్దతుగానే నిలుస్తున్నారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక శనివారం నాటి ఈ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు నెదర్లాండ్స్ బౌలర్ పాల్ వాన్ మీకెరెన్ (4/23)కు దక్కింది. స్కోరు వివరాలు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జీత్ (సి) షకీబ్ (బి) తస్కీన్ 3; ఓ డౌడ్ (సి) తన్జీద్ (బి) షరీఫుల్ 0; వెస్లీ (సి) షకీబ్ (బి) ముస్తఫిజుర్ 41; అకెర్మన్ (సి) ముస్తఫిజుర్ (బి) షకీబ్ 15; ఎడ్వర్డ్స్ (సి) మిరాజ్ (బి) ముస్తఫిజుర్ 68; లీడ్ (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 17; సైబ్రాండ్ (ఎల్బీ) మెహదీ హసన్ 35; వాన్ బిక్ నాటౌట్ 23; షారిజ్ రనౌట్ 6; ఆర్యన్ (సి) మిరాజ్ (బి) షరీఫుల్ 9; మీకెరెన్ (ఎల్బీ) (బి) మెహదీ హసన్ 0; ►ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 229. ►వికెట్ల పతనం: 1–3, 2–4, 3–63, 4–63, 5–107, 6–185, 7–185, 8–194, 9–212, 10–229. బౌలింగ్: షరీఫుల్ 10–0–51–2, తస్కీన్ 9–1–43–2, షకీబ్ 10–1– 37–1, మిరాజ్ 4–0–17–0, ముస్తఫిజుర్ 10–1–36–2, మెహదీ హసన్ 7–0–40–2. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ (సి) ఎడ్వర్ట్స్ (బి) ఆర్యన్ 3; తన్జీద్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బిక్ 15; మిరాజ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) లీడ్ 35; నజు్మల్ (సి) వాన్ బిక్ (బి) మీకెరెన్ 9; షకీబ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) మీకెరన్ 5; ముష్ఫికర్ (బి) మీకెరెన్ 1; మహ్ముదుల్లా (సి) ఆర్యన్ (బి) లీడ్ 20; మెహదీ హసన్ రనౌట్ 17; తస్కీన్ (సి) లీడ్ (బి) మీకెరెన్ 11; ముస్తఫిజుర్ (బి) అకెర్మన్ 20; షరీఫుల్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; ►మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 142. ►వికెట్ల పతనం: 1–19, 2–19, 3–45, 4–63, 5–69, 6–70, 7–108, 8–113, 9–142, 10–142. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–3–26–1, వాన్ బిక్ 9–1–30–1, అకెర్మన్ 7–1–25–1, మీకెరెన్ 7.2–0–23–4, లీడ్ 7–0–25–2, షారిజ్ అహ్మద్ 2–0–13–0. చదవండి: WC 2023: ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. అయినా పాక్ సెమీస్ చేరే ఛాన్స్! ఎలా? View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
జయకు పాస్‌పోర్ట్ వచ్చిం... దహో!
హమ్మయ్య! జయకు పాస్‌పోర్ట్ అండ్ వీసా వచ్చింది. జయ ఇక హాయిగా నెదర్లాండ్స్‌కు వెళ్లవచ్చు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంతకీ సదరు జయ మనిషి కాదు. వీధి శునకం. ల్యాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్, పమేరియన్లను ముద్దు చేసే వాళ్లలో చాలామంది వీధికుక్కలను మాత్రం ‘అసుంట’ అంటారు. మెరల్ మాత్రం అలా అనుకోలేదు. నెదర్ ల్యాండ్స్‌కు చెందిన మెరల్ మన దేశానికి వచ్చింది. వారణాసిలో ఆమెకు ఒక వీధికుక్క కనిపించింది. ఈ శునకంపై వేరే శునకాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటి బారినుంచి మెరల్ దానిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో మెరల్ ఎటు వెళితే అటు వచ్చేది కుక్క. ఆ కుక్కను చూస్తే మెరల్‌కు జాలిగా అనిపించింది. దాని చురుకుదనం, అందం మెరల్‌కు నచ్చి, ఆ కుక్కను దత్తత తీసుకొని నెదర్లాండ్స్‌కు తీసుకు పోవాలని డిసైడైపోయింది. దత్తత, పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ కోసం కొంతకాలం అదనంగా మన దేశంలో ఉంది. ‘పెద్ద ప్రక్రియ పూర్తయి పోయింది. ఎట్టకేలకు జయను నాతోపాటు తీసుకువెళుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టింది మెరల్. -
ప్రపంచకప్‌లో మరో సంచలనం.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన నెదర్లాండ్స్
2023 వన్డే ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ తమకంటే చాలా రెట్లు మెరుగైన బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ను బంగ్లా బౌలర్లు నామమాత్రపు స్కోర్‌కే (229 పరుగులు) కట్టడి చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా తడబడిన బంగ్లా పులులు 142 పరుగులకు ఆలౌటై, 87 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చిన నెదర్లాండ్స్ బౌలర్లు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగ్లాదేశ్‌ను మట్టికరిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లు పాల్ వాన్ మీకెరెన్ (4/23), బాస్ డి లీడ్ (2/25) బంగ్లా పతనాన్ని శాసించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మెహిది హసన్ మీరజ్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించిన నెదర్లాండ్స్ తాజాగా బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌ను చివరి స్థానానికి నెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68), వెస్లీ బరెస్సీ (41), సైబ్రాండ్ (35), లొగాన్ వాన్ బీక్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. -
CWC 2023: బంగ్లాదేశ్ ముందు నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచిన నెదర్లాండ్స్
కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 229 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68) అర్ధసెంచరీతో రాణించగా.. వెస్లీ బరెస్సీ (41), సైబ్రాండ్ (35), లొగాన్ వాన్ బీక్ (23 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విక్రమ్‌జిత్ సింగ్ (3), మ్యాక్స్ ఒడౌడ్ (0), కొలిన్ అకెర్‌మెన్ (15), బాస్ డి లీడ్ (17), షరిజ్ అహ్మద్ (6), ఆర్యన్ దత్ (9), పాల్ వాన్ మీకెరెన్ (0) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మెహిది హసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ షకీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నెదర్లాండ్స్ చివరి స్థానంలో, బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా, భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రస్తుతానికి టాప్-4లో ఉన్నాయి. -
‘జయ’ చాలా లక్కీ... విదేశాలకు చెక్కేసింది!
ఛీ.. కుక్క బతుకు అని తిట్టుకుంటుంటారు చాలామంది. కానీ ఈ కుక్కను చూశాక కచ్చితంగా అభిప్రాయం మార్చుకుంటారు. నో డౌట్. ఎందుకంటే మనిషి ఎవరి ముందైనా లోకువైనా లేదా తక్కువైతే ఛీ కుక్క బతుకు అని ఈజీగా అనేస్తాడు. నిజానికి వాటి విశ్వాసం ముందు మనిషి ఎందుకు పనికిరాడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఇక్కడొక వీధి కుక్క అదృష్టం మాములుగా లేదు. ఓ విదేశీయురాలి మనసు దోచుకుని ఆమె తోపాటు విదేశానికి వెళ్లే అదృష్టాన్ని కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే..నెదర్లాండ్‌లోని ఆమ్స్టర్డామ్కి చెందిన మెరల్ బోంటెన్‌బెల్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వచ్చింది. కాశీ నగరం అందాలు ఆస్వాదిస్తూండగా జయ అనే ఆడ వీధి కుక్క ఆమె వద్దకు వచ్చి తచ్చాడింది. ఆమె కూడా ఆ కుక్కను చూసి భలే ముద్దుగా ఉందని కాసేపు దానితో గడిపి వెళ్లిపోయింది. ఐతే ఈ కుక్క ఆమెను కొంతసేపు ఫాలో అయ్యి ఆమె వద్ద ఉండే ప్రయత్నం చేసింది. సరిగ్గా అదే సమయంలో ఇంకో కుక్క ‘జయ’పై దాడి చేసింది. సమీపంలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు జయను రక్షించాడు. ఈ ఘటన తరువాత బోంటెన్‌బెల్ వెంటనే తన మనసు మార్చుకుని ఆ కుక్కను తనతోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. తనతోపాటు నెదర్లాండ్స్‌కి తీసుకువెళ్లాలని డిసైడ్ పోయింది కూడా. ఆరునెలలపాటు శ్రమించి కుక్కకి పాస్‌పోర్ట్, వీసా ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల అనుమతులు లభించడంతో ఎట్టకేలకు స్వదేశానికి పయనమయ్యేందుకు సిద్ధమైంది బోంటెన్‌బెల్. అనుకున్నట్లుగానే ఆ కుక్కకి పాస్‌పోర్ట్, వీసా కూడా వచ్చేయండతో సంతోషంగా బోంటెన్‌బెల్ ఆ కుక్కును తనతోపాటు నెదర్లాండ్స్ తీసుకువెళ్లిపోయింది. నిజానికి అదేం జాతి కుక్క కాదు. ఆ కుక్కలో ప్రత్యేకతకు కూడా ఏమిలేదు. అదృష్టం ఆ విదేశీయురాలి రూపంలో వెతుక్కుంటు రావడమే గాక చక్కగా ఆమెను యజామనిగా మార్చుకుని నెదర్లాండ్స్ చెక్కేసింది ఆ వీధి కుక్క. #WATCH | Varanasi, Uttar Pradesh: A female street dog named Jaya from Varanasi is set to leave India with a proper visa and passport with her new owner from the Netherlands. pic.twitter.com/i57rMJqyjb — ANI (@ANI) October 26, 2023 (చదవండి: ఇవేం అంత్యక్రియలు? మృతదేహాలను రాబందులకు వదిలేస్తారా!) -
మ్యాక్స్‌వెల్ విధ్వంసం
న్యూఢిల్లీ: ప్రత్యర్థులు బహు పరాక్! వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా ఫామ్‌లోకి వచ్చేసింది. క్రికెట్ కూన నెదర్లాండ్స్‌ను హడలెత్తించింది. ఏకంగా 309 పరుగుల తేడాతో అఖండ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కాగా... వన్డే ఫార్మాట్ చరిత్రలో రెండో అతి పెద్ద విజయంగా నమోదైంది. తన ఫామ్ కొనసాగిస్తూ డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) వరుసగా రెండో సెంచరీ చేయగా... స్టీవ్ స్మిత్ (68 బంతుల్లో 71; 9 ఫోర్లు, 1 సిక్స్), లబుషేన్ (47 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (44 బంతుల్లో 106; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) నెదర్లాండ్స్ బౌలర్ల భరతం పట్టి... వీర విధ్వంసం సృష్టించి... ప్రపంచకప్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీని సాధించాడు. 40 బంతుల్లో మ్యాక్స్‌వెల్ 100 పరుగులు పూర్తి చేసి ఇదే టోర్నీలో శ్రీలంకపై దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్ (49 బంతుల్లో) సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆడమ్ జంపా (3–0–8–4) మూడు ఓవర్లతోనే స్పిన్ ఉచ్చు బిగించాడు. దంచుడు వార్నర్‌తో మొదలైతే... నాలుగో ఓవర్లోనే ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ (9) అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో డచ్ శిబిరానికి కలిగిన ఆనందం ఇదొక్కటే! తర్వాతంతా అలసిపోవడమే! ఎందుకంటే అప్పటికే క్రీజులో ఉన్న వార్నర్గానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్, లబు షేన్‌లు గానీ నెదర్లాండ్స్‌పై కనీస దయ చూపలేదు. బంతిని వదల్లేదు. ఫీల్డర్లను విడిచిపెట్టలేదు. బంతిని, బౌలర్లు, ఫీల్డర్లను కలిపి బలిపీఠం ఎక్కించినట్లుగా వీరబాదుడు బాదేశారు. స్మిత్ 53 బంతుల్లో, వార్నర్ 40 బంతుల్లో అర్ధసెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం తర్వాత స్మిత్ వెనుదిరిగాడు. తర్వాత లబుõÙన్ (42 బంతుల్లో) ఫిఫ్టీ కొడితే... వార్నర్ (91 బంతుల్లో) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు 84 పరుగులు జోడించారు. 39వ ఓవర్లో వచ్చి... 40 బంతుల్లో శతక్కొట్టి... ఓ సెంచరీ, ఇద్దరి ఫిఫ్టీలతోనే ఆసీస్ కథ ముగియలేదు. 39వ ఓవర్లో వచ్చిన మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్‌లో తన బ్యాట్‌తో కొత్త రాత (రికార్డు) రాశాడు. 48 ఓవర్లలో ఆసీస్ స్కోరు 361/6. మ్యాక్సీ (75 పరుగులతో) సెంచరీకి దూరంగానే ఉన్నాడు. కానీ లీడే వేసిన 49 ఓవర్లో 4, 4, 6, 6, నోబ్ 6, 1, 0లతో ఏకంగా 28 పరుగులు పిండుకోవడంతో 40 బంతుల్లోనే ఎవరి ఊహకందని విధంగా శతకం పూర్తయ్యింది. 115 వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నెదర్లాండ్స్ ప్లేయర్ లీడే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో లీడే 10 ఓవర్లలో 115 పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మిక్ లూయిస్ (0/113; 2006లో దక్షిణాఫ్రికాపై), ఆడమ్ జంపా (0/113; 2023లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న రికార్డును లీడే అధిగమించాడు. 6 ప్రపంచకప్‌లో ఆరో సెంచరీతో వార్నర్ ఈ టోర్నీలో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. రోహిత్ శర్మ (7) అగ్రస్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) అకెర్మన్ (బి) వాన్ బిక్ 9; వార్నర్ (సి) ఆర్యన్ (బి) వాన్ బిక్ 104; స్మిత్ (సి) మెర్వ్ (బి) ఆర్యన్ 71; లబుషేన్ (సి) ఆర్యన్ (బి) లీడే 62; ఇంగ్లిస్ (సి) సైబ్రాండ్ (బి) లీడే 14; మ్యాక్స్‌వెల్ (సి) సైబ్రాండ్ (బి) వాన్ బిక్ 106; గ్రీన్ (రనౌట్) 8; కమిన్స్ (నాటౌట్) 12; స్టార్క్ (సి) అకెర్మన్ (బి) వాన్ బిక్ 0; జంపా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–28, 2–160, 3–244, 4–266, 5–267, 6–290, 7–393, 8–393. బౌలింగ్: ఆర్యన్ దత్ 7–0–59–1, అకెర్మన్ 3–0–19–0, వాన్ బిక్ 10–0–74–4, మికెరన్ 10–0–64–0, విక్రమ్‌జీత్ 4–0–27–0, వాన్‌డెర్ మెర్వ్ 5–0–41–0, బస్ డి లీడే 10–0–115–2. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జీత్ (రనౌట్) 25; మ్యాక్స్ ఓ డౌడ్ (బి) స్టార్క్ 6; అకెర్మన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హాజల్‌వుడ్ 10; సైబ్రాండ్ (సి) వార్నర్ (బి) మార్ష్ 11; లీడే (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 4; ఎడ్వర్డ్స్ (నాటౌట్) 12; తేజ (సి) ఇంగ్లిస్ (బి) మార్ష్ 14; వాన్ బిక్ (సి) ఇంగ్లిస్ (బి) జంపా 0; వాన్‌డెర్ మెర్వ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 0; ఆర్యన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 1; మికెరన్ (స్టంప్డ్) ఇంగ్లిస్ (బి) జంపా 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (21 ఓవర్లలో ఆలౌట్) 90. వికెట్ల పతనం: 1–28, 2–37, 3–47, 4–53, 5–62, 6–84, 7–86, 8–86, 9–90, 10–90. బౌలింగ్: స్టార్క్ 4–0–22–1, హాజల్‌వుడ్ 6–0–27–1, కమిన్స్ 4–0–14–1, మార్ష్ 4–0–19–2, జంపా 3–0–8–4. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ X శ్రీలంక వేదిక: బెంగళూరు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: క్రేజీ ఇన్నింగ్స్.. అతడు అద్భుతం.. ఆ ‘వంద’లో నాదీ సమాన పాత్ర: కమిన్స్
WC 2023 Aus Vs Ned- Pat Cummins Comments: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రికార్డు విజయం సాధించడంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హర్షం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితో గెలుపు సాధ్యమైందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో బుధవారం తలపడింది ఆస్ట్రేలియా. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచిన కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని డచ్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించాడు. డేవిడ్ వార్నర్(104) శతకంతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులు సాధించారు. ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ములేపాడు వీరి ముగ్గురి ఇన్నింగ్స్‌ను మరిపించేలా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టీ20 తరహా వినోదం అందించాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 106 పరుగులు స్కోరు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) 90 పరుగులకే నెదర్లాండ్స్ ఆలౌట్ దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించిన ఆసీస్.. నెదర్లాండ్స్‌ను 90 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా అత్యధికంగా 4 వికెట్లు దక్కించుకోగా.. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మిచెల్ మార్ష్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తర్వాత.. ఈ క్రమంలో వన్డే చరిత్రలో ప్రత్యర్థిని అత్యంత భారీ తేడాతో ఓడించిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీమిండియా(శ్రీలంక మీద 317 పరుగుల తేడాతో) తర్వాత ఈ ఘనత సాధించిన టీమ్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ప్రపంచకప్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో విజయానంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. పరిపూర్ణమైన విజయం. ప్రత్యర్థికి 400 పరుగుల లక్ష్యాన్ని విధించడం.. దానిని కాపాడుకోవడం.. రెండింటిలోనూ మేము పూర్తిగా విజయవంతమయ్యాం. ఆ వందలో నాకూ భాగం ఉంది ఇంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది. క్రేజీ ఇన్నింగ్స్. ఆ వంద పరుగుల భాగస్వామ్యంలో మా ఇద్దరి పాత్ర సమానమే కదా(నవ్వులు).. అద్భుతమైన ఇన్నింగ్స్. నేనిలాంటి క్లీన్ హిట్టింగ్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు’’ అంటూ మాక్స్‌వెల్‌పై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా స్మిత్ కూడా హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్న కమిన్స్.. ‘‘మా ఆట తీరు ఎలా ఉండాలనుకుంటామో ఈరోజు అలాగే ఆడాం. పవర్ ప్లేలో వీలైనన్ని వికెట్లు తీయాలన్న వ్యూహం అమలు చేశాం. జంపా మరోసారి నాలుగు వికెట్లు కూల్చాడు’’ అని బౌలింగ్ విభాగాన్ని కూడా ప్రశంసించాడు. మాక్సీ- కమిన్స్ జోడీ చరిత్ర.. అందుకే అలా సరదాగా కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా వరల్డ్‌కప్ చరిత్రలో 100+ పరుగుల భాగస్వామ్యంలో హయ్యస్ట్ రన్‌రేటు(14.37 (103) సాధించిన మూడో జోడీగా మాక్స్వెల్- కమిన్స్ జోడీ చరిత్ర సృష్టించింది. ఈ గణాంకాలను ఉద్దేశించే కమిన్స్.. మాక్సీతో పాటు తాను కూడా ఈ పార్ట్నర్షిప్లో సమాన పాత్ర పోషించానంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ 12 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: WC 2023: పసికూనపై ప్రతాపం.. వరల్డ్‌కప్‌లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలి జట్టుగా View this post on Instagram A post shared by ICC (@icc) -
వార్నర్ సెంచరీ.. మాక్సీ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్ చరిత్రలో ఆసీస్ ఇలా..
ICC Cricket World Cup 2023- Australia vs Netherlands: వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా తమ రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుత శతకాల కారణంగా పసికూన నెదర్లాండ్స్‌పై భారీ స్కోరు సాధించింది. కాగా ప్రపంచకప్ -2023లో భాగంగా అరుణ్‌జైట్లీ మైదానంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో డచ్ బౌలర్లకు చుక్కలు చూపించిన వార్నర్ 104 పరుగులతో అదరగొట్టగా.. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ 71 రన్స్, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన మార్నస్ లబుషేన్ 62 పరుగులతో రాణించాడు. ఇక ఆరో స్థానంలో బరిలోకి దిగిన మాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని వరల్డ్‌కప్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డులకెక్కాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు సాధించాడు. ఆఖరి ఓవర్ మూడో బంతికి వాన్ బీక్ బౌలింగ్‌లో అవుటై మాక్సీ నిష్క్రమించాడు. ఇలా స్టార్ బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు స్కోరు చేసింది. ఇక డచ్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ వికెట్లు మాత్రం తీయగలిగారు. వాన్ బీక్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టగా.. బాస్ డీ లీడే రెండు, ఆర్యన్ దత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ రనౌట్‌గా వెనుదిరగడంతో మొత్తంగా 8 వికెట్లు పడ్డాయి. వరల్డ్‌కప్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యధిక స్కోర్లు ఇవే! ►417/6- అఫ్గనిస్తాన్‌పై, పెర్త్‌లో- 2015 ►399/8- నెదర్లాండ్స్‌పై ఢిల్లీలో- 2023 ►381/5- బంగ్లాదేశ్‌పై నాటింగ్‌హాంలో- 2019 ►377/6- సౌతాఫ్రికా మీద బాసెటెరెలో- 2007 ►376/9- శ్రీలంక మీద సిడ్నీలో- 2015. చదవండి: మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ View this post on Instagram A post shared by ICC (@icc) -
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డచ్తో మ్యాచ్‌లో ఆసీస్ తమ జట్టులో కేవలం ఒకే ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్ స్టోయినిష్ స్ధానంలో కామెరూన్ గ్రీన్ తుది జట్టులోకి వచ్చాడు. నెదర్లాండ్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా చదవండి: World Cup 2023: అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర ఓటమి.. పాకిస్తాన్ కెప్టెన్‌పై వేటు! -
తొలి విజయం సాధించిన శ్రీలంక..
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా లక్నో వేదికగా శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. 263 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో లంక ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో సదీరా సమరవిక్రమచక్ర(91 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అతడితో పాటు నిస్సంకా(54), అసలంక(44) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో అర్యన్ దత్త్ 3 వికెట్లు పడగొట్టగా.. అకెరమన్, వాన్ మీకరన్ తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 262 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో ఎంగెల్‌బ్రెచ్ట్ (70), వాన్ బీక్ (59) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో పేసర్లు మధుశంక, రజితా తలా నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: SA vs ENG WC 2023: క్లాసెన్ విధ్వంసకర శతకం.. ఇంగ్లండ్ టార్గెట్ 400 పరుగులు -
నెదర్లాండ్స్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. శ్రీలంక టార్గెట్ 263 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకపై నెదర్లాండ్స్ బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు 262 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడిన నెదర్లాండ్స్‌ను.. ఎంగెల్‌బ్రెచ్ట్, వాన్ బీక్ అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 135 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే 7వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరిద్దరూ నిలిచారు. ఎంగెల్‌బ్రెచ్ట్ 82 బంతుల్లో 70 పరుగులు చేయగా.. వాన్ బీక్ 75 బంతుల్లో 59 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అకెరమన్ 29 పరుగులతో పర్వాలేదనపించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో పేసర్లు మధుశంక, రజితా తలా నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మొన్నటి దాకా మావాళ్లు తోపులు అన్నారు.. ఇప్పుడు: రమీజ్ రాజా -
అనలిస్ట్‌లు లేరు, పరిమిత కిట్లు కూడా లేవు.. అయినా సౌతాఫ్రికాను ఓడించారు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నిన్న (అక్టోబర్ 17) జరిగిన మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్.. పటిష్టమైన సౌతాఫ్రికాను మట్టికరిపించి, సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ ఆటగాళ్లు, ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భీకర ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికాను ఖంగుతినిపించడంతో డచ్ ఆటగాళ్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ విజయం వారికి చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ నెదర్లాండ్స్ గురించిన పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఐసీసీ టోర్నీల్లో (2022 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే వరల్డ్‌కప్) సఫారీలను రెండుసార్లు మట్టికరిపించిన డచ్ టీమ్ కనీస మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేదని ప్రచారం జరుగుతుంది. సంచలన ప్రదర్శనలతో చిన్న జట్లకు స్పూర్తిగా నిలుస్తున్న ఆ జట్టు తీవ్రమైన ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటుందని తెలుస్తుంది. ఆ దేశ క్రికెట్ బోర్డుకు కనీసం డేటా అనలిస్ట్‌ను కూడా నియమించుకునే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో పేపర్లపై వ్యూహాలు అమలు చేస్తుందని సమాచారం. పరిమిత కిట్లు కూడా లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన టీమ్ నెదర్లాండ్స్.. ఇక్కడ ప్రాక్టీస్‌లో వారికి సాయపడిన భారత ఆటగాళ్లకు తమ బూట్లు, ఇతర పరికరాలు ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. 2020 టీ20 ప్రపంచకప్ వాయిదా పడిన అనంతరం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్న డచ్ ఆటగాళ్లు.. పిజ్జా డెలివరీ బాయ్‌లుగా, బార్లలో వెయిటర్లుగా చిన్నిచిన్న పనులు చేశారు. ఈ విషయాలను కొందరు డచ్ ఆటగాళ్లు స్వయంగా వెల్లడించారు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ డచ్ ఆటగాళ్లు ఎంతమాత్రం నిరుత్సాహపడకుండా, కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టి సంచలనాలు సృష్టిస్తున్నారు. డచ్ టీమ్ కష్టాలు తెలిసి అభిమానులు వీరిని పొగడకుండా ఉండలేకున్నారు. నెదర్లాండ్స్ మున్ముందు మరిన్ని సంచలన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా, డచ్ టీమ్.. క్వాలిఫయర్స్‌లో కూడా ఓ సంచలన విజయం నమోదు చేసి ప్రపంచకప్-2023కు అర్హత సాధించింది. ఆ టోర్నీలో వీరు రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్స్ వెస్టిండీస్‌ను ఖంగుతినిపించారు. తాజాగా హేమాహేమీలతో కూడిన సౌతాఫ్రికాను మట్టికరిపించిన డచ్ టీమ్.. తమను తక్కువ అంచనా వేస్తే ఎంతటి జట్టుకైనా ఇదే గతి పడతుందని హెచ్చరికలు పంపింది. -
భారీ అంచనాలతో వచ్చాం.. ఇంకా సాధించాల్సి ఉంది: నెదర్లాండ్స్ కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023లో పటిష్టమైన సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. డచ్ టీమ్.. ప్రొటీయాస్పై 38 పరుగుల తేడాతో గెలుపొంది, ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని, ఓవరాల్‌గా (ప్రపంచకప్ టోర్నీల్లో) మూడో గెలుపును సొంతం చేసుకుంది. 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేయగా.. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి సౌతాఫ్రికాను 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో దక్షిణాఫ్రికా ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం తాము సాధించిన చిరస్మరణీయ విజయంపై నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఇలా స్పందించాడు. ‘‘చాలా గర్వంగా ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న అగ్రశేణి జట్టుపై విజయం సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మేము ఇక్కడికి (ప్రపంచకప్) భారీ అంచనాలతో వచ్చాం. అందులో మొదటి మెట్టు ఎక్కాం. ఇంకా సాధించాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాం. మాకు చాలా మంచి ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. అందరం కలిసికట్టుగా రాణిస్తే, ప్రస్తుత ప్రపంచకప్‌లో మరిన్ని విజయాలు సాధించగలం. మేము తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా తొలుత మంచి పొజిషన్లో ఉన్నాం. అయితే మ్యాచ్ జరిగే కొద్ది మేము పట్టు కోల్పోయాం. అందుకే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాం. ఈ గెలుపును ఇక్కడే వదిలి తదుపరి మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం’’ అని అన్నాడు. కాగా, నెదర్లాండ్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్.. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల కంటే మెరుగైన స్థితిలో ఉండటం విశేషం. పాయింట్ల పట్టికలో ఆసీస్ తొమ్మిది, శ్రీలంక 10వ స్థానాల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో అక్టోబర్ 21న లక్నోలో జరుగనుంది. -
CWC 2023 SA VS NED: అక్కడే మ్యాచ్‌ను కోల్పోయాం: బవుమా
వన్డే ప్రపంచకప్-2023లో నిన్న మరో సంచలనం నమోదైంది. అక్టోబర్ 15న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. నిన్న (అక్టోబర్ 17) ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేయగా.. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సౌతాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం తామెదుర్కొన్న ఘోర పరాభవంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్పందిస్తూ ఇలా అన్నాడు. మొదటిగా నెదర్లాండ్స్‌కు శుభాకాంక్షలు. ఇవాళ వారు అద్భుతంగా ఆడారు. అన్ని విభాగాల్లో మాపై పైచేయి సాధించారు. మా బౌలర్లు డచ్ బ్యాటర్లను 200 స్కోర్‌ను దాటనివ్వాల్సింది కాదు. డచ్ టీమ్ 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో మేము మ్యాచ్‌పై పట్టు సాధించాల్సింది. అయితే అలా జరగలేదు. అప్పుడే సగం మ్యాచ్‌ను కోల్పోయాం. అయినా మేము నమ్మకాన్నికోల్పోలేదు. డచ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. అయితే అలా జరగలేదు. డచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు మాపై ఒత్తిడి తీసుకొచ్చి వికెట్లు కోల్పోయేలా చేశారు. అంతకుముందు శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో మేం ప్రొఫెషనల్ గేమ్ ఆడాం. అది మా స్థాయి. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మేము మా స్థాయికి తగ్గట్టుగా ఆడలేదు. అందుకే ఓడిపోయాం. మా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో లోపాలు ఉన్నాయి. అవి డచ్తో జరిగిన మ్యాచ్‌లో బయటపడ్డాయి. ఈ రెండు విషయాల్లో మా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. వీటిని అధిగమించి తదుపరి మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించేందుకు ప్రయత్నిస్తామని బవుమా అన్నాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో భారత్, న్యూజిలాండ్ తర్వాత మూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా అక్టోబర్ 21న జరుగనుంది. -
నెదర్లాండ్స్ చేతిలో ఓటమి.. సౌతాఫ్రికాకు ఘోర పరాభవం.. కొత్తేమీ కాదు..!
వన్డే ప్రపంచకప్ 2023లో మరో పెను సంచలనం నమోదైంది. అక్టోబర్ 15న న్యూఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఊహించని షాకివ్వగా.. నిన్న (అక్టోబర్ 17) ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ భీకర ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 38 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి, ప్రస్తుత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని, ఓవరాల్‌గా (ప్రపంచకప్ టోర్నీల్లో) మూడో గెలుపును (నమీబియా, స్కాట్లాండ్, సౌతాఫ్రికా) సొంతం చేసుకుంది. మరోవైపు సౌతాఫ్రికా.. టెస్ట్ అర్హత సాధించని దేశంపై (నెదర్లాండ్స్) తొలిసారి ఓటమి చవిచూసింది. సౌతాఫ్రికాకు ఐసీసీ టోర్నీలో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి కొత్తేమీ కాదు. 2022 టీ20 వరల్డ్‌కప్‌లో డచ్ టీమ్ సఫారీలకు భారీ షాకిచ్చింది. ఆ టోర్నీ సూపర్ 12 మ్యాచ్‌లో నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాపై 13 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉంటే, నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) రాణించడంతో 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ఎంగిడి, మార్కో జన్సెన్, రబాడ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కొయెట్జీ, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఘెర పరాభవాన్ని మూటగట్టుకుంది. లొగాన్ వాన్ బీక్ (3/60), పాల్ వాన్ మీకెరెన్ (2/40), వాన్ డర్ మెర్వ్ (2/34), బాస్ డి లీడ్ (2/36), అకెర్‌మెన్ (1/16) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. -
‘సఫారీ’కి డచ్ దెబ్బ
దాదాపు ఏడాది క్రితం...టి20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్యే మ్యాచ్...అనూహ్య ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ కంగుతినిపించింది. దీంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొన్నప్పటికీ దక్షిణాఫ్రికా సూపర్ ఫామ్‌తో వార్ వన్‌సైడ్‌గా భావించారు.. నెదర్లాండ్స్ 27 ఓవర్లలో 112/6 స్కోరు చేయడం చూస్తే అందరూ అనుకున్నట్లే జరుగుతున్నట్లే అనిపించింది. అయితే ఇక్కడే సీన్ మారింది. మరో సంచలనానికి నాంది పలికే ఇన్నింగ్స్‌తో నాయకుడు ఎడ్వర్డ్స్ నడిపించాడు. తర్వాతి 16 ఓవర్లలో మరో 133 పరుగులు జోడించాడు. సారథి పడిన కష్టానికి, చేసిన పోరాటానికి న్యాయం చేసేందుకు బౌలర్లంతా శ్రమించడం పెను సంచలనానికి దారి తీసింది. ధర్మశాల: ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ సంచలన విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (69 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (52 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్), కేశవ్ మహరాజ్ (37 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఎడ్వర్డ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ రబడ, జాన్సెన్, ఇన్‌గిడిల బౌలింగ్‌కు నెదర్లాండ్స్ టాపార్డర్ బదులివ్వలేకపోయింది. విక్రమ్‌జీత్ (2), ఒడౌడ్ (18), అకెర్మన్ (12), బస్ డి లీడ్ (2), సై బ్రాండ్ (19), తేజ (20)... ఇలా ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేదు. అయితే కెప్టెన్ ఎడ్వర్డ్స్ కనబరిచిన పోరాటం సంచలనానికి ఓ మెట్టు వేసింది. వాన్‌డెర్ మెర్వ్ (29)తో 8వ వికెట్‌కు 64 పరుగులు, ఆర్యన్ దత్ (23 నాటౌట్)తో అబేధ్యమైన 9వ వికెట్‌కు 41 పరుగులు ఎడ్వర్డ్స్ జతచేశాడు. సఫారీ విలవిల ఆడేది సులువైన ప్రత్యర్థి తో, ఎదురుగా ఉన్నది స్వల్ప లక్ష్యమే కానీ సఫారీ వల్ల అసాధ్యమైంది. నెదర్లాండ్ బౌలర్లు వాన్ డెర్ మెర్వ్, అకెర్మన్, మెకెరన్, వాన్ బీక్, డి లీడే కలిసికట్టుగా పిడికిలి బిగించడంతో...డి కాక్ (20), కెప్టెన్ బవుమా (16), హిట్టర్లు డసెన్ (4), మార్క్రమ్ (1) చేతులెత్తేశారు. 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాక మిల్లర్ కొద్దిగా పోరాడాడు. చివర్లో కేశవ్ దూకుడుగా ఆడినా అప్పటికే ఆలస్యమైంది. స్కోరు వివరాలు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జీత్ (సి) క్లాసెన్ (బి) రబడ 2; మ్యాక్స్ ఒడౌడ్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 18; అకెర్మన్ (బి) కొయెట్జీ 12; బస్ డి లీడ్ (ఎల్బీ) (బి) రబడ 2; సైబ్రాండ్ (సి) జాన్సెన్ (బి) ఎన్గిడి 19; తేజ (ఎల్బీ) (బి) జాన్సెన్ 20; ఎడ్వర్డ్స్ నాటౌట్ 78; వాన్ బీక్ (స్టంప్డ్) డికాక్ (బి) కేశవ్ 10; వాన్‌డర్ మెర్వ్ (సి) డికాక్ (బి) ఎన్గిడి 29; ఆర్యన్ దత్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం (43 ఓవర్లలో 8 వికెట్లకు) 245. వికెట్ల పతనం: 1–22, 2–24, 3–40, 4–50, 5–82, 6–112, 7–140, 8–204. బౌలింగ్: ఎన్గిడి 9–1–57–2, జాన్సెన్ 8–1–27–2, రబడ 9–1–56–2, కొయెట్జీ 8–0–57–1, కేశవ్ 9–0–38–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (బి) వాన్ డెర్ మెర్వ్ 16; డికాక్ (సి) ఎడ్వర్డ్స్ (బి) అకెర్మన్ 20; వాన్‌డెర్ డసెన్ (సి) ఆర్యన్ (బి) వాన్ డెర్ మెర్వ్ 4; మార్క్రమ్ (బి) వాన్ మెకెరన్ 1; క్లాసెన్ (సి) విక్రమ్‌జీత్ (బి) వాన్ బీక్ 28; మిల్లర్ (బి) వాన్ బీక్ 43; జాన్సెన్ (బి) వాన్ మెకెరన్ 9; కొయెట్జీ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 22; కేశవ్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాన్ బీక్ 40; రబడ (సి) సైబ్రాండ్ (బి) డి లీడ్ 9; ఎన్గిడి నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 207. వికెట్ల పతనం: 1–36, 2–39, 3–42, 4–44, 5–89, 6–109, 7–145, 8–147, 9–166, 10–207. బౌలింగ్: ఆర్యన్ దత్ 5–1–19–0, వాన్ బీక్ 8.5–0–60–3, అకెర్మన్ 3–0–16–1, పాల్ మెకెరన్ 9–0–40–2, వాన్ డెర్ మెర్వ్ 9–0–34–2, బాస్ డి లీడ్ 8–0–36–2. -
World Cup 2023: సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసిన నెదర్లాండ్స్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. తమ కంటే ఎంతో బలంగా ఉన్న సౌతాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ మట్టికరిపించి అందరికీ షాక్ ఇచ్చింది. మొత్తం 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాపై 38 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది నెదర్లాండ్స్ జట్టు. One of the greatest ICC Men's Cricket World Cup upsets of all time in Dharamsala as Netherlands overcome South Africa 🎇#SAvNED 📝: https://t.co/gLgies5ZBv pic.twitter.com/KcbZ10qdAG — ICC Cricket World Cup (@cricketworldcup) October 17, 2023 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు డచ్ బౌలర్లు చుక్కలు చూపారు. కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టును కష్టాల్లోకి నెట్టారు. వర్శం కారణంగా ఈ మ్యాచ్‌ను 43 ఓవర్లకే కుదించారు. స్కోర్లు: నెదర్లాండ్స్ 245-8 (43), దక్షిణాఫ్రికా 207 (42.5) -
దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్న నెదర్లాండ్స్..
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ చుక్కలు చూపిస్తోంది. 246 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రోటీస్ బ్యాటర్లు తడబడుతున్నారు. డచ్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా టాపర్డర్ కుప్పకూలింది. కేవలం 89 పరుగులకే ప్రోటీస్ 5 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా నెదర్లాండ్స్ స్పిన్నర్ వాన్ డెర్ మెర్వే.. ప్రోటీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇప్పటివరకు 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వాన్ డెర్ మెర్వే.. కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కోలిన్ అకెర్మాన్, వాన్‌మీకరన్, వాన్‌బీక్ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ టాపర్డర్‌లో బావుమా(16), డికాక్(20), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(4), మార్క్రమ్(1),క్లాసెన్(28), పరుగులు చేశారు. ప్రస్తుతం 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్(17). జానెసన్(2) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి. కాగా ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. చదవండి: WC 2023: ఇదేమి బాల్ రా బాబు.. బ్యాటర్‌కు కాకుండా స్లిప్‌కు! వీడియో వైరల్ -
ఇదేమి బాల్ రా బాబు.. బ్యాటర్‌కు కాకుండా స్లిప్‌కు! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ ఓ విచిత్రమైన బంతితో అందరని ఆశ్చర్యపరిచాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా కోయెట్జీ చేతికి బంతి ఇచ్చాడు. అయితే తన మొదటి ఓవర్లో తొలి రెండు బంతులను వేసేందుకు కోయెట్జీ చాలా కష్టపడ్డాడు. మొదటి బంతిని వైడ్‌గా సంధించిన కోయెట్జీ.. రెండో బంతిని అయితే మరి విచిత్రంగా వేశాడు. అతడు వేసిన బంతి బ్యాటర్‌కు, వికెట్ కీపర్‌కు కాకుండా.. మొదటి స్లిప్‌లో ఉన్న క్లాసన్ చేతికి వెళ్లింది. ఒక్కసారిగా చూసిన వారంతా స్లిప్ క్యాచ్ అనుకున్నారు. కానీ అది వైడ్‌బాల్ అని తెలుసుకున్నాక అంతా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేమి బాల్‌రా బాబు.. బ్యాటర్‌కు కాకుండా స్లిప్ ఫీల్డర్‌కు వేశావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సరికొత్త చరిత్ర.. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 11 బంతుల్లోనే.. యువీ రికార్డు బద్దలు View this post on Instagram A post shared by ICC (@icc) -
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ జట్టు ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ షమ్సీ స్ధానంలో పేసర్ గెరాల్డ్ కోయెట్జీ జట్టులోకి వచ్చాడు. అదే విధంగా డచ్ జట్టు కూడా తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ర్యాన్ క్లైన్ స్ధానంలో లోగాన్ వాన్ బీక్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దట్, పాల్ వాన్ మీకెరెన్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, గెరాల్డ్ కోయెట్జీ -
CWC 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. మరో భారీ స్కోర్‌పై కన్నేసిన సౌతాఫ్రికా
వన్డే వరల్డ్‌కప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా.. ఇవాళ (అక్టోబర్ 17) పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సఫారీలు మరో భారీ స్కోర్‌పై కన్నేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అతి భారీ స్కోర్లు చేసిన సౌతాఫ్రికా.. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేయడం ఖాయమని తెలుస్తుంది. ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో ఈ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా మరోసారి 400 స్కోర్‌ను దాటడం ఖాయమని అభిమానులు అంటున్నారు. సఫారీ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ప్రకారం 400 స్కోర్ వారికి పెద్ద లెక్క కాకపోచ్చు. ఓ మోస్తరుగా ఉండే నెదర్లాండ్స్ బౌలింగ్‌పై సఫారీ హిట్టర్లు ప్రతాపం చూపవచ్చు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో డికాక్ (100), డస్సెన్ (108), మార్క్రమ్ (106) సెంచరీలతో స్వైరవిహారం చేయడంతో 428 పరుగులు స్కోర్ చేసిన సఫారీ టమ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 300కుపైగా స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో డికాక్ మరోసారి శతక్కొట్టడంతో (109) సౌతాఫ్రికా 311 పరుగులు స్కోర్ చేసింది. వరుణుడు అడ్డుతగులుతాడా..? ధర్మశాలలో ఇవాళ ఉదయం నుంచి జల్లులు కురుస్తున్నాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా, క్రికెట్‌కు అనుకూలంగా ఉంది. అయితే ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉండటంతో ఏ క్షణంలో అయినా భారీ వర్షం పడే అవకాశం ఉంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమయితే లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్ స్వభావంలో స్వల్పంగా మార్పులు జరుగవచ్చు. సౌతాఫ్రికాకు సంపూర్ణ ఆధిపత్యం.. సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 7 సార్లు ఎదురెదురుపడగా.. 6 సందర్భాల్లో సౌతాఫ్రికానే విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో ఈ ఇరు జట్లు ఇప్పటివరకు ఎదురెదురుపడలేదు. వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్ అవుతుంది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 102 పరుగుల తేడాతో.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 134 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
న్యూజిలాండ్ బ్యాటర్‌కు దండం పెట్టిన డచ్ బౌలర్..! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్‌కు డచ్ బౌలర్ పాల్ వాన్ మీకెరెన్ చేతులు జోడించి మరీ నమస్కారం పెట్టాడు. అసలేం జరిగిందంటే? కివీస్ ఇన్నింగ్స్ 39 ఓవర్ వేసిన పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో రెండో బంతికి మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైక్‌లోని స్టంప్స్‌ను గిరాటేసింది. అంతకంటే ముందు వాన్ మీకెరెన్ కాలికి బలంగా తాకిండేది. కానీ మీకెరెన్ ఆఖరి నిమిషంలో తన కాలిని వెనుక్కితీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ గాయం అయిండేది. అయితే సెకన్ల వ్యవధిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వాన్ మీకెరెన్.. చేతులను జోడించి, వంగి మరీ దండం పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో తలపడనుండగా.. నెదర్లాండ్స్ ఆక్టోబర్ 17న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. చదవండి: ODI WC 2023: చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
NZ VS NED: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. ప్రపంచకప్‌లో తొలి బౌలర్..!
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్‌లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా అలాగే ప్రస్తుత ఎడిషన్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన సాంట్నర్.. తొలుత బ్యాట్‌తోనూ రాణించి (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ 2 వికెట్లు పడగొట్టిన సాంట్నర్.. ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా (7) కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 99 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. విల్ యంగ్ (70), రచిన్ రవీంద్ర (51), టామ్ లాథమ్ (53) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, వాన్ డర్ మెర్వ్, వాన్ మీకెరెన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నెదార్లండ్స్ ఆదిలోనే చేతులెత్తేసి 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ (10-0-59-5), మ్యాట్ హెన్రీ (8.3-0-40-3), రచిన్ రవీంద్ర (10-0-46-1) నెదర్లాండ్స్‌ను కుప్పకూల్చారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కొలిన్ ఆకెర్మన్ (69) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. తెలుగబ్బాయి తేజ నిడమనూరు 26 బంతుల్లో 21 పరుగులు చేసి రనౌటయ్యాడు. నెదర్లాండ్స్‌పై గెలుపుతో న్యూజిలాండ్ (1.958 రన్‌రేట్) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో తన హవాను కొనసాగిస్తుంది. కాగా, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) మరో మ్యాచ్ జరుగనుంది. మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ధర్మశాలలో మరో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్-బంగ్లాదేశ్ తలపడతాయి. -
కివీస్ గెలుపు జోరు...
ప్రపంచకప్‌లో మరో ఏకపక్ష విజయం... గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్ సమష్టి ప్రదర్శన ముందు అసోసియేట్ టీమ్ నెదర్లాండ్స్ నిలవలేకపోయింది... బ్యాటింగ్ పిచ్‌పై ముందుగా భారీ స్కోరు నమోదు చేసిన న్యూజిలాండ్ విసిరిన సవాల్‌కు పసికూన నెదర్లాండ్స్ వద్ద జవాబు లేకపోయింది... ఫలితంగా కివీస్ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా... హైదరాబాద్ వేదికగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ డచ్ బృందానికి ఓటమే ఎదురైంది. బ్యాటింగ్‌లో విల్ యంగ్, లాథమ్, రచిన్ రవీంద్ర, బౌలింగ్‌లో సాన్‌ట్నర్ న్యూజిలాండ్ విజయసారథులుగా నిలిచారు. సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ జట్టు తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మళ్లీ సత్తా చాటింది. విడిగా చూస్తే విధ్వంసక ప్రదర్శనలు లేకపోయినా... ప్రతీ ఒక్కరూ రాణించడంతో క్వాలిఫయర్ జట్టు నెదర్లాండ్స్‌పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ 99 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. విల్ యంగ్ (80 బంతుల్లో 70; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్ లాథమ్ (46 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (51 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... డరైల్ మిచెల్ (47 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కొలిన్ అకెర్మన్ (73 బంతుల్లో 69; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ సాన్‌ట్నర్ (5/59) ఉప్పల్ స్టేడియంలో వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సమష్టి బ్యాటింగ్‌తో... ఆశ్చర్యకర రీతిలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదిగా ప్రారంభమైంది. తొలి మూడు ఓవర్లూ ఒక్క పరుగు లేకుండా మెయిడిన్లుగా ముగియడం విశేషం. అయితే ఆ తర్వాత జట్టు ధాటిని పెంచింది. కాన్వే (40 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), యంగ్ చక్కటి బ్యాటింగ్‌తో తర్వాతి 7 ఓవర్లలో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు రాబట్టారు. ఈ జోడీ విడిపోయిన తర్వాత వచ్చిన రచిన్ తన ఫామ్‌ను కొనసాగించాడు. 59 బంతుల్లో యంగ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, రచిన్‌కు హాఫ్ సెంచరీ కోసం 50 బంతులే సరిపోయాయి. మరో ఎండ్‌లో మిచెల్ కూడా జోరు ప్రదర్శించాడు. కానీ ఈ దశలో డచ్ బౌలర్లు ప్రత్యర్థిని కొద్దిసేపు నిలువరించారు. 16 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. అయితే మరోవైపు లాథమ్ దూకుడు కివీస్ స్కోరును 300 వందలు దాటించింది. సాన్‌ట్నర్ (17 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా చెలరేగడంతో చివర్లో భారీ స్కోరు చేయడంలో న్యూజిలాండ్ సఫలమైంది. ఆఖరి 10 ఓవర్లలో 84 పరుగులు సాధించిన న్యూజిలాండ్ వీటిలో చివరి 3 ఓవర్లలోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 పరుగులు రాబట్టడం విశేషం. అకెర్మన్ మినహా... భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఏ దశలోనూ నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ వేగంగా సాగలేదు. పాక్‌తో మ్యాచ్‌తో పోలిస్తే జట్టు బ్యాటింగ్ ఈ సారి పేలవంగా కనిపించింది. ఓపెనర్లు విక్రమ్‌జిత్ (12), డౌడ్ (16) విఫలం కాగా, అకెర్మన్ ఒక్కడే పోరాడగలిగాడు. అకెర్మన్, తేజ నిడమనూరు (26 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మధ్య నమోదైన 50 పరుగుల భాగస్వామ్యమే ఈ ఇన్నింగ్స్‌లో పెద్దది. క్రీజ్‌లో నిలదొక్కుకొని చక్కటి షాట్లతో జోరుపెంచిన దశలో తేజ లేని రెండో పరుగు కోసం అనవసరంగా ప్రయత్నించాడు. అకెర్మన్తో సమన్వయ లోపంతో అతను రనౌటయ్యాడు. 55 బంతుల్లో అకెర్మన్ అర్ధ సెంచరీ పూర్తయింది. చివర్లో స్కాట్ ఎడ్వర్డ్స్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), సైబ్రాండ్ (34 బంతుల్లో 29; 3 ఫోర్లు) కొంత వరకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. లక్ష్యానికి చాలా దూరంలో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) డి లీడ్ (బి) వాండర్ మెర్వ్ 32; యంగ్ (సి) డి లీడ్ (బి) మీకెరెన్ 70; రచిన్ (సి) ఎడ్వర్డ్స్ (బి) వాండర్ మెర్వ్ 51; మిచెల్ (బి) మీకెరెన్ 48; లాథమ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) దత్ 53; ఫిలిప్స్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 4; చాప్మన్ (సి) వాండర్ మెర్వ్ (బి) దత్ 5; సాన్‌ట్నర్ (నాటౌట్) 36; హెన్రీ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1–67, 2–144, 3–185, 4–238, 5–247, 6–254, 7–293. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–2–62–2, ర్యాన్ క్లీన్ 7–1–41–0, మీకెరెన్ 9–0–59–2, వాండర్ మెర్వ్ 9–0–56–2, అకెర్మన్ 4–0–28–0, డి లీడ్ 10–0–64–1, విక్రమ్‌జిత్ 1–0–9–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (బి) హెన్రీ 12; డౌడ్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 16; అకెర్మన్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 69; డి లీడ్ (సి) బౌల్ట్ (బి) రచిన్ 18; తేజ (రనౌట్) 21; ఎడ్వర్డ్స్ (సి అండ్ బి) సాన్‌ట్నర్ 30; సైబ్రాండ్ (సి) కాన్వే (బి) హెన్రీ 29; వాండర్‌మెర్వ్ (సి) హెన్రీ (బి) సాన్‌ట్నర్ 1; క్లీన్ (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 8; ఆర్యన్ దత్ (బి) హెన్రీ 11; మీకెరెన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 223. వికెట్ల పతనం: 1–21, 2–43, 3–67, 4–117, 5–157, 6–174, 7–180, 8–198, 9–218, 10–223. బౌలింగ్: బౌల్ట్ 8–0–34–0, హెన్రీ 8.3–0–40–3, సాన్‌ట్నర్ 10–0–59–5, ఫెర్గూసన్ 8–0–32–0, రచిన్ రవీంద్ర 10–0–46–1, ఫిలిప్స్ 2–0–11–0. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి పాకిస్తాన్ X శ్రీలంక వేదిక: హైదరాబాద్ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WC 2023: ‘పసికూన’పై కివీస్ ప్రతాపం.. వరుసగా న్యూజిలాండ్ రెండో విజయం
ICC Cricket WC 2023- New Zealand vs Netherlands, 6th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. రెండో మ్యాచ్‌లో ‘పసికూన’ నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది. ముగ్గురు అర్ధ శతకాలతో రాణించి ఓపెనర్ విల్ యంగ్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 51, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో రాణించారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విక్రంజిత్ సింగ్(12), మాక్స్ ఒడౌడ్(16) వికెట్లు కోల్పోయి డీలా పడినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ అకెర్మాన్ డచ్ శిబిరంలో ఆశలు రేపాడు. ఆశలు రేపాడు 69 పరుగులతో రాణించిన అతడు అవుట్ కావడంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. సాంట్నర్ దెబ్బకు డచ్ జట్టు పెవిలియన్‌కు క్యూ కట్టింది. దీంతో... 99 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐదు వికెట్లతో చెలరేగిన సాంట్నర్ స్పిన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ అత్యధికంగా ఐదు వికెట్లు కూల్చి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. పేసర్ మ్యాట్ హెన్రీకి మూడు, మరో లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక తెలుగు మూలాలున్న డచ్ బ్యాటర్ తేజ నిడమనూరు రనౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: WC 2023: తడబడి.. నిలబడిన టీమిండియాకు బిగ్ షాక్! పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి.. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: పాపం ‘బాస్’! ‘ఆఖరి బంతి’కి 13 పరుగులు.. చుక్కలు చూపించాడు!
ICC Cricket World Cup 2023- New Zealand vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 17 బంతులు ఎదుర్కొని 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. సాంట్నర్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఈ లెఫ్టాండ్ బ్యాటర్ బాదిన రెండు సిక్స్‌లు కివీస్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రావడం విశేషం. అంతేకాదు.. చివరి బాల్‌కు సాంట్నర్ ఏకంగా 13 పరుగులు రాబట్టడం మరో విశేషం. ఆఖరి బంతికి అలా 13 పరుగులు ఎలా అంటారా? న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లిడే 50వ ఓవర్ వేసేందుకు బరిలోకి దిగాడు. మొదటి బంతికే సాంట్నర్ ఫోర్ బాదగా.. ఆ తర్వాత లిడే అతడిని కట్టడి చేయగలిగాడు. సాంట్నర్‌తో పాటు మ్యాచ్ హెన్రీ క్రీజులో ఉండగా.. మరో నాలుగు బంతుల్లో కివీస్ కేవలం నాలుగు పరుగులే రాబట్టగలిగింది. కానీ ఆఖరి బంతికి సీన్ మొత్తం రివర్స్ అయింది. లిడే వేసిన లో ఫుల్‌టాస్‌ను అద్భుత రీతిలో సిక్సర్‌గా మలిచాడు సాంట్నర్. అయితే, అక్కడే మరో ట్విస్టు చోటు చేసుకుంది. లిడే వేసిన బంతిని No Ball(Waist Height)గా తేల్చాడు అంపైర్. దీంతో ఏడు పరుగులు ఖాతాలో చేరాయి. ఇక అప్పటికే ఒత్తిడిలో కూరకుపోయిన బాస్ డి లిడే ఆఖరి బంతికి మరోసారి మూల్యం చెల్లించుకోకతప్పలేదు. ఆఫ్ సైడ్ దిశగా లిడే మరోసారి లో ఫుల్ టాస్ వేయగా.. సిక్సర్ బాది కివీస్ ఇన్నింగ్స్‌కు అద్భుతమైన ముగింపునిచ్చాడు సాంట్నర్. ఇలా ఒకే బంతికి పదమూడు పరుగులు ఇచ్చిన లిడేకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆఖరి ఓవర్లో మొత్తంగా 21 పరుగులు వచ్చాయి. ముగ్గురి అర్ధశతకాలతో కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విల్ యంగ్(70) సహా వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(51), కెప్టెన్ టామ్ లాథమ్(53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సాంట్నర్ మెరుపుల కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించి డచ్ జట్టుకు గట్టి సవాల్ విసిరింది. వరుసగా రెండో విజయంపై కన్నేసింది. చదవండి: WC 2023: పాక్, కివీస్‌లకు అంత సీన్ లేదు.. సెమీస్‌లో ఆ 4 జట్లే! ఫైనల్లో: ఆండర్సన్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: రచిన్ రవీంద్ర.. మొన్న సెంచరీ.. ఇప్పుడేమో!
ICC Cricket World Cup 2023 - New Zealand vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ అర్ధ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. కాగా ఉప్పల్‌లో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన డచ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మూడు హాఫ్ సెంచరీలు ఈ క్రమంలో స్కాట్ ఎడ్వర్డ్ బృందం ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే(32), విల్ యంగ్ శుభారంభం అందించారు. గత మ్యాచ్ సెంచరీ హీరో, వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఈసారి 51 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన డారిల్ మిచెల్ 48, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో అదరగొట్టారు. సాంట్నర్ మెరపులు అయితే, ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్(4) పూర్తిగా నిరాశపరచగా.. మార్క్ చాప్మన్ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిదో స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక.. తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్ చేసిన మ్యాట్ హెన్రీ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 322 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌కు కష్టమే! నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మెకెరెన్, ఆర్యన్ దత్ రెండేసి వికెట్లు తీయగా.. ఆల్‌రౌండర్ బాస్ డి లిడేకు ఒక వికెట్ దక్కింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ విధించిన 323 పరుగుల లక్ష్యాన్ని డచ్ టీమ్ ఛేదించడం కష్టంగానే కనిపిస్తోంది! ఇదిలా ఉంటే.. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. నెదర్లాండ్స్.. ఉప్పల్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. మరి ఇదే వేదికపై మరోసారి పటిష్ట కివీస్‌తో తలపడుతున్న డచ్ జట్టు పరిస్థితి ఎలా ఉండబోతుందో!? చదవండి: CWC 2023: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం.. షాకిచ్చిన ఐసీసీ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023 NZ Vs NED Match Pics: ఉప్పల్‌లో న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్(ఫొటోలు)
-
CWC 2023: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ న్యూజిలాండ్-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ ఓ మార్పు చేసింది. జేమ్స్ నీషమ్ స్థానంలో లోకీ ఫెర్గూసన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. సైబ్రాండ్ ఏంజెల్బ్రెచ్, ర్యాన్ క్లెయిన్ జట్టులోకి వచ్చారు. కాగా, న్యూజిలాండ్ గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించగా.. నెదర్లాండ్స్ పాకిస్తాన్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కొలిన్ అకెర్మాన్, బాస్ డి లీడ్, తేజ నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సైబ్రాండ్ ఏంజెల్బ్రెచ్, ర్యాన్ క్లెయిన్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ -
గెలుపు జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు బిగ్‌షాక్..
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో టోర్నీ తొలి మ్యాచ్‌కు దూరమైన కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇప్పుడు డచ్తో మ్యాచ్‌కు అందుబాటులో లేడు. అతడు ఇంకా పూర్తి స్ధాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో జట్టు మేనెజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధృవీకరించాడు. అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేసర్ లూకీ ఫెర్గూసన్ మాత్రం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.లాకీ ఫెర్గూసన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ఈ నేపథ్యంలో అతడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. టిమ్ సౌథీ కూడా తన ప్రాక్టీస్‌ను మొదలపెట్టాడు. అతడు బౌలింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. టిమ్ ఫీల్డింగ్ కూడా ప్రాక్టీస్ కూడా చేశాడు. అతడి చేతి వేలికి ఆదివారం మరోసారి ఎక్స్-రే చేయ్యాలి. ఆ తర్వాత అతడి సెలక్షన్‌పై ఓ నిర్ణయం తీసుకుంటాం. ఇక కేన్ విలియమ్సన్ కూడా బాగా కోలుకుంటున్నాడు. అతడు ఫీల్డింగ్ చేయడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అతడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కూ దూరం కానున్నాడు. కేన్ మా మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నానని స్టెడ్ పేర్కొన్నాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. కివీస్ బ్యాటర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీలతో చెలరేగారు. సోమవారం హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో బ్లాక్ క్యాప్స్ తలపడనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్‌కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టార్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్‌ను ది హేగ్‌లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్‌లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డమ్‌లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్‌లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
‘డచ్’ పని పట్టిన పాక్
ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనలు, అసాధారణ బౌలింగ్ లేకపోయినా సమష్టి తత్వంతో ఆ జట్టు తొలి అడుగును విజయవంతంగా వేసింది. అసోసియేటెడ్ టీమ్ నెదర్లాండ్స్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తమ ఆటతో మ్యాచ్‌లో అక్కడక్కడ పైచేయి సాధించినట్లు కనిపించినా... చివరకు నెదర్లాండ్స్ సులువుగానే తలవంచింది. ‘ఆరెంజ్’ జట్టు సంచలన విజయానికి ఈ ఆట సరిపోలేదు. సాక్షి, హైదరాబాద్: రెండు వామప్ మ్యాచ్‌లతో ఉప్పల్ స్టేడియంపై అంచనాకు వచ్చిన పాకిస్తాన్ ఈ వారం రోజుల అనుభవాన్ని అసలు మ్యాచ్‌లో సమర్థంగా వాడుకుంది. శుక్రవారం జరిగిన వన్డే వరల్డ్ కప్ పోరులో పాక్ 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సౌద్ షకీల్ (52 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (75 బంతుల్లో 68; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. బాస్ డి లీడ్ (68 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), విక్రమ్‌జిత్ సింగ్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా జట్టుకు ఓటమి తప్పలేదు. సెంచరీ భాగస్వామ్యం... కనీసం 300 పరుగులు నమోదు చేస్తాం. టాస్ సమయంలో పాక్ కెపె్టన్ బాబర్ ఆజమ్ చేసిన వ్యాఖ్య ఇది. అయితే దానికి చేరువగా వెళ్లడంలో పాక్ సఫలమైంది. ఆరంభ ఓవర్లలో ప్రదర్శన చూస్తే అది కష్టంగానే అనిపించినా రెండు కీలక భాగస్వామ్యాలు జట్టును ఆదుకున్నాయి. తొలి పవర్‌ప్లేలో 9.1 ఓవర్లు ముగిసేసరికి పాక్ 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు ఫఖర్ (12), ఇమామ్ (15)లతో పాటు కెపె్టన్ బాబర్ ఆజమ్ (5) కూడా తొందరగా వెనుదిరిగారు. ఈ దశలో రిజ్వాన్, షకీల్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్న వీరిద్దరు ఆ తర్వాత చక్కటి షాట్లతో దూకుడు పెంచారు. ఈ క్రమంలో షకీల్ 32 బంతుల్లో, రిజ్వాన్ 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి శతక భాగస్వామ్యం తర్వాత తక్కువ వ్యవధిలో పాక్ 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే నవాజ్ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు), షాదాబ్ (34 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) మళ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 70 బంతుల్లో 64 పరుగులు జత చేశారు. చివరి 2 వికెట్లకు కలిపి మరో 34 పరుగులు రావడం కూడా పాక్‌ను మెరుగైన స్థితికి చేర్చింది. ఆ ఇద్దరు మినహా... ఛేదనలో నెదర్లాండ్స్‌కు విక్రమ్‌జిత్ చక్కటి షాట్లతో శుభారంభం అందించాడు. అయితే తక్కువ వ్యవధిలో జట్టు డౌడ్ (5), అకెర్మన్ (17) వికెట్లు కోల్పోయింది. దాంతో విక్రమ్‌జిత్‌కు డి లీడ్ జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 76 బంతుల్లో 70 పరుగులు జత చేసింది. అయితే 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విక్రమ్ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. తేజ నిడమనూరు (5) విఫలం కాగా, డచ్ ఆ వెంటనే మరో 2 చేజార్చుకుంది. అయితే డి లీడ్ క్రీజ్‌లో ఉన్నంత వరకు టీమ్‌కు కాస్త ఆశలు ఉన్నాయి. 50 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. నవాజ్ చక్కటి బంతిని లీడ్ బౌల్డ్ కావడంతో ‘డచ్’ జట్టు ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫఖర్ (సి అండ్ బి) వాన్ బీక్ 12; ఇమామ్ (సి) దత్ (బి) మీకెరెన్ 15; బాబర్ (సి) సాఖిబ్ (బి) అకెర్మన్ 5; రిజ్వాన్ (బి) డి లీడ్ 68; షకీల్ (సి) సాఖిబ్ (బి) దత్ 68; ఇఫ్తికార్ (సి) ఎడ్వర్డ్స్ (బి) డి లీడ్ 9; నవాజ్ (రనౌట్) 39; షాదాబ్ ఖాన్ (బి) డి లీడ్ 32; హసన్ అలీ (ఎల్బీ) (బి) డి లీడ్ 0; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 13; రవూఫ్ (స్టంప్డ్) ఎడ్వర్డ్స్ (బి) అకెర్మన్ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–15, 2–34, 3–38, 4–158, 5–182, 6–188, 7–252, 8–252, 9–267, 10–286. బౌలింగ్: ఆర్యన్ దత్ 10–0–48–1, వాన్ బీక్ 6–0–30–1, అకెర్మన్ 8–1–39–2, మీకెరెన్ 6–0–40–1, డి లీడ్ 9–0–62–4, మెర్వ్ 6–0– 36– 0, విక్ర మ్జిత్ 2–0–16–0, సాఖిబ్ 2–0– 15–0. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్: విక్రమ్‌జిత్ (సి) ఫఖర్ (బి) షాదాబ్ 52; మ్యాక్స్ డౌడ్ (సి) షాహిన్ (బి) హసన్ 5; అకెర్మన్ (బి) ఇఫ్తికార్ 17; డి లీడ్ (బి) నవాజ్ 67; తేజ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 5; ఎడ్వర్డ్స్ (ఎల్బీ) (బి) రవూఫ్ 0; సాఖిబ్ (ఎల్బీ) (బి) షాహిన్ 10; వాన్‌డర్ మెర్వ్ (రనౌట్) 4; వాన్ బీక్ (నాటౌట్) 28; దత్ (బి) హసన్ 1; మీకెరెన్ (బి) రవూఫ్ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–28, 2–50, 3–120, 4–133, 5–133, 6–158, 7–164, 8–176, 9–184, 10–205. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 7–0–37–1, హసన్ అలీ 7–1–33–2, రవూఫ్ 9–0–43–3, ఇఫ్తికార్ అహ్మద్ 3–0–16–1, మొహమ్మద్ నవాజ్ 7–0– 31–1, షాదాబ్ ఖాన్ 8–0–45–1. ప్రపంచకప్‌లో నేడు అఫ్గానిస్తాన్ X బంగ్లాదేశ్ వేదిక: ధర్మశాల ఉదయం గం. 10:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం శ్రీలంక X దక్షిణాఫ్రికా వేదిక: న్యూఢిల్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
అప్పుడు తండ్రి టీమిండియాపై.. కొడుకు ఇప్పుడు పాకిస్తాన్‌పై! అరుదైన రికార్డు
ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఫాస్ట్‌బౌలర్ బాస్ డి లిడే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. 9 ఓవర్ల బౌలింగ్‌లో 62 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాక్ ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్‌తో కలిసి 68 పరుగులతో సంయుక్తంగా టాప్ స్కోరర్‌గా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ రూపంలో లిడేకు తొలి వికెట్ దక్కింది. అదే ఓవర్లో(32) ఇఫిక్తర్ అహ్మద్(9) వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు బాస్ డి లిడే. ఆ తర్వాత షాదాబ్ ఖాన్(32), హసన్ అలీ(0) వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో అతడి ఖాతాలో నాలుగు వికెట్లు చేరాయి. తండ్రి అడుగుజాడల్లో ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో తండ్రి అడుగుజాడల్లో నడిచిన కొడుకుగా బాస్ డి లిడే గుర్తింపు సాధించాడు. నెదర్లాండ్స్ తరఫున ప్రపంచకప్ ఈవెంట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాకాలు సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 2003 వరల్డ్‌కప్‌లో బాస్ తండ్రి.. టిమ్ డి లిడె టీమిండియాతో పర్ల్ మ్యాచ్‌లో 4/35 నమోదు చేశాడు. (PC: Voorburg Cricket Club) వన్డే ప్రపంచకప్ చరిత్రలో అదే ప్రపంచకప్ టోర్నీలో టిమ్ డి లిడేతో పాటు ఫీకో క్లాపెన్బర్గ్ నమీబియాపై 4/42, ఆదిల్ రాజా నమీబియాపైనే 4/42 గణాంకాలు నమెదు చేశారు. ఇక తాజాగా భారత్ వేదికగా హైదరాబాద్‌లో బాస్ డి లిడే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 4/62 బౌలింగ్ ఫిగర్స్‌తో ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా ఈ ఎలైట్ లిస్టులో చోటు సంపాదించిన తండ్రీ కొడుకులుగా( నెదర్లాండ్స్ తరఫున) అరుదైన రికార్డు సృష్టించారు టిమ్, బాస్. 286 పరుగులకు పాక్ ఆలౌట్ ఇక ఉప్పల్ వేదికగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. డచ్ బౌలర్లలో అకెర్మాన్ రెండు, వాన్ మెకెరిన్, వాన్‌బీక్, ఆర్యన్ దత్ ఒక్కో వికెట్ తీయగా.. లిడేకు నాలుగు వికెట్లు దక్కిన విషయం తెలిసిందే. నాడు సచిన్ వికెట్ తీసి కాగా తండ్రి టిమ్ డి లిడే మాదిరే బాస్ డి లిడే సైతం బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఇక టిమ్ 2003 వరల్డ్‌కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజ బ్యాటర్లతో పాటు హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వికెట్లు తీశాడు. నాటి.. లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టిమ్.. హర్భజన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరగడం గమనార్హం. చదవండి: Asian Games: జపాన్ను చిత్తు చేసి.. పసిడి గెలిచి! ప్యారిస్ ఒలంపిక్స్ బెర్తు ఖరారు -
చరిత్ర సృష్టించిన రిజ్వాన్, సౌద్ షకీల్.. ప్రపంచకప్ హిస్టరీలో..!
ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన పాక్ బ్యాటర్ల జోడీలో నాలుగో స్థానంలో నిలిచారు. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్ అరంగేట్రంలోనే ఒకే మ్యాచ్‌లో యాభైకి పైగా పరుగులు సాధించిన బ్యాటర్లుగా చరిత్రకెక్కారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడుతోంది. అర్ధ శతకాలతో ఆదుకున్నారు అయితే, పసికూనే కదా అని డచ్ జట్టును తక్కువగా అంచనా వేసిన బాబర్ ఆజం బృందానికి ఆరంభంలోనే షాక్ తగిలింది. హైదరాబాద్‌లో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ అద్భుత ఆట తీరుతో పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. అర్ధ శతకాలతో చెలరేగి నాలుగో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐసీసీ ప్రపంచకప్ ఈవెంట్లో నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జోడీగా రికార్డు సాధించారు. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు అంతకు ముందు.. 1983లో నాటింగ్‌హాంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇమ్రాన్ ఖాన్, జహీర్ అబ్బాస్ 147* పరుగులు, అదే టోర్నీలో లీడ్స్ మ్యాచ్‌లో షాహిద్ మహబూబ్తో కలిసి ఇమ్రాన్ ఖాన్ 144.. 2019లో బర్మింగ్‌హాంలో బాబర్ ఆజం- హ్యారిస్ సొహైల్ 126 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక వరల్డ్‌కప్ డెబ్యుటెంట్స్ ఒకే మ్యాచ్‌లో ఫిఫ్టీ ప్లస్ సాధించిన పాక్ ఆటగాళ్ల జాబితాలో మజీద్ ఖాన్(65), ఆసిఫ్ ఇక్బాల్(53)(1975లో ఆస్ట్రేలియా మీద), మిస్బా ఉల్హక్(65), ఉమర్ అక్మల్(71)- (2011లో కెన్యా మీద) తర్వాతి స్థానాల్లో రిజ్వాన్(65), సౌద్ షకీల్(68)-(2023లో హైదరాబాద్‌లో) నిలిచారు. చదవండి: పాకిస్తాన్‌కు ఘోర ఓటమి.. ఫైనల్లో టీమిండియాతో అఫ్గన్ -
WC 2023: నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ విజయం
ICC Cricket World Cup 2023, 2nd Match- - Pakistan vs Netherlands Updates: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 205 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 81 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో పాక్.. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీని ఘన విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా శుక్రవారం డచ్ జట్టుతో మ్యాచ్‌లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, నెదర్లాండ్స్ ఆరంభం నుంచే పాక్‌కు చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో ఉన్నవేళ మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ చెరో 68 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసి కష్టాల నుంచి గట్టెక్కించారు. ఆ తర్వాత మహ్మద్ నవాజ్ 38, షాదాబ్ ఖాన్ 32 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో 49 ఓవర్లలో పాక్ 286 పరుగులు స్కోరు చేసింది. ఓడినా భళా అనిపించారు లక్ష్య ఛేదనలో ఆరంభంలో అదరగొట్టినప్పటికీ నెదర్లాండ్స్ కీలక సమయంలో కీలక వికెట్లు కోల్పోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే.. పాక్‌కు మాత్రం గట్టి పోటీనివ్వడంలో సఫలమైంది. అద్భుత ఆట తీరుతో అభిమానుల మనసు గెలుచుకుంది. 37.1: తొమ్మిదో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ హసన్ అలీ బౌలింగ్‌లో ఆర్యన్ దత్ బౌల్డ్(1). స్కోరు: 186/9 (38) 35.6: ఎనిమిదో వికెట్ డౌన్ నవాజ్ బౌలింగ్‌లో మెర్వే(4) వెనుదిరిగాడు. 33.2: కీలక వికెట్ డౌన్ బాస్ డి లిడే 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నవాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో నెదర్లాండ్స్ ఏడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 164/7 (33.2) 32.1: ఆరో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ సాకిబ్ జుల్ఫికర్(10) రూపంలో డచ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు.. 159/6 (32.3). లిడే 63, మెర్వే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. 26.4: కెప్టెన్ డకౌట్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. స్కోరు: 133-5(27). లిడే(50), జుల్ఫికర్ క్రీజులో ఉన్నారు. 26.2: తేజ నిడమనూరు అవుట్ పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో తేజ నిడమనూరు అవుటయ్యాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో నెదర్లాండ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు: 133/4 (26.3). లిడే(49), ఎడ్వర్డ్స్ క్రీజులో ఉన్నారు. 23.5: మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ హాఫ్ సెంచరీ హీరో విక్రంజిత్ సింగ్(52) షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. స్కోరు 125/3 (24.5). బాస్ డి లిడే 46, తేజ నిడమనూరు క్రీజులో ఉన్నారు. 21 ఓవర్లలో నెదర్లాండ్స్ స్కోరు: 104-2 విక్రంజిత్ సింగ్ 43, బాస్ డి లిడే 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11.1: రెండో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్‌లో అకెర్మాన్(17) బౌల్డ్. 12 ఓవర్లలో స్కోరు: 52-2 5.5: పాక్‌తో మ్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ హసన్ అలీ బౌలింగ్‌లో మాక్స్ ఒడౌడ్(5) అవుట్. ఆరు ఓవర్లలో స్కోరు: 28-1. పాకిస్తాన్ ఆలౌట్ వన్డే వరల్డ్‌కప్-2023లో తమ ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతున్న పాకిస్తాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాక్ 46.2: అకెర్మాన్ బౌలింగ్‌లో నవాజ్(38) రనౌట్. ఆఫ్రిది 11, రవూఫ్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 268/9 (47) 43.5: ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ బాస్డి లిడే బౌలింగ్‌లో హసన్ అలీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పాక్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 252/8 (43.5) 43.4: బాస్ డి లిడే బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ బౌల్డ్(32) అయ్యాడు. పాక్ స్కోరు: 252/7 (43.4) 40 ఓవర్లలో పాక్ స్కోరు: 227-6 31.6: ఒకే ఓవర్లో రెండు వికెట్లు బాస్ డి లిడే అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో రిజ్వాన్(68)ను బౌల్డ్ చేయడం సహా ఇఫ్తికర్ అహ్మద్(9)ను అవుట్ చేశాడు. 32 ఓవర్లలో పాక్ స్కోరు: 188-6. మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ క్రీజులో ఉన్నారు. 31.3: మహ్మద్ రిజ్వాన్ బౌల్డ్ 68 పరుగులతో జోరు మీదున్న మహ్మద్ రిజ్వాన్‌ను బాస్ డి లిడే పెవిలియన్‌కు పంపాడు. దీంతో పాక్ ఐదో వికెట్ కోల్పోయింది. 28.1: నాలుగో వికెట్ కోల్పోయిన పాక్ ఆర్యన్ దత్ బౌలింగ్‌లో సౌద్ షకీల్ అవుటయ్యాడు. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాకిబ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిజ్వాన్ 53 పరుగులతో, ఇఫ్తికర్ అహ్మద్ క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 143/3. 22.6: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సౌద్ షకీల్ ఆరంభంలో తడబడిన పాకిస్తాన్ రిజ్వాన్, షకీల్ ఇన్నింగ్స్‌తో కోలుకుంది. 32 బంతుల్లో షకీల్ అర్ధ శతకం సాధించగా.. రిజ్వాన్ సైతం హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. ఎట్టకేలకు సెంచరీ కొట్టిన పాక్ ►20 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 101-3 రిజ్వాన్ 38, షకీల్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►16 ఓవర్లలో పాక్ స్కోరు: 81/3 ►నిలకడగా ఆడుతున్న రిజ్వాన్, షకీల్ పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్(21), సౌద్ షకీల్(23) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నారు. వీరిద్దరి భాగస్వామ్యంతో పాకిస్తాన్ 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ►10 ఓవర్లలో పాక్ స్కోరు: 43/3 ►9.1: మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ పాకిస్తాన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కెప్టెన్ బాబర్ ఆజం అవుటైన మరుసటి ఓవర్లోనే ఇమామ్ ఉల్ హక్ అవుటయ్యాడు. 15 పరుగులో నిలకడగా ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్‌ను డచ్ బౌలర్ వాన్ మీకెరెన్ అద్భుతమైన బౌన్సర్‌తో బోల్తా కొట్టించాడు. షాట్‌కు యత్నించిన ఇమామ్ ఆర్యన్ దత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ క్రీజులో ఉన్నారు. 8.3: రెండో వికెట్ డౌన్ డచ్ జట్టుతో మ్యాచ్‌లో కెప్టెన్ బాబర్ ఆజం(5) రూపంలో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. అకెర్మాన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా బంతిని తరలించబోయిన బాబర్ సాకిబ్ కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. ఈ వన్డే వరల్డ్ నంబర్ బ్యాటర్‌ను అకెర్మాన్ అవుట్ చేయగానే నెదర్లాండ్స్ శిబిరంలో సంతోషం వెల్లివిరిసింది. 5 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 18-1 బాబర్ ఆజం 2, ఇమామ్ ఉల్ హక్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాక్ 3.4: వాన్ బీక్ బౌలింగ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ అవుటయ్యాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. నెదర్లాండ్స్‌తో పాక్ తొలిపోరు వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా పాకిస్తాన్ తమ ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్లు శుక్రవారం పోటీకి దిగాయి. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుని బాబర్ ఆజం బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తుది జట్లు నెదర్లాండ్స్ విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఒడౌడ్, కొలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్& వికెట్ కీపర్), బాస్ డి లీడే, తేజ నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్. పాకిస్తాన్ ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్. చదవండి: పాక్, ప్రోటీస్ కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చెరే జట్లు ఇవే: సచిన్ -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్..
వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్-నెదర్లాండ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ముగ్గురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌కు పాక్ తుది జట్టులో ఆఘా సల్మాన్, అబ్ధుల్లా షఫీక్‌కు చోటు దక్కలేదు. పాక్ ఇన్నింగ్స్‌ను ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్ ప్రారంభింనున్నారు. తుది జట్లు పాకిస్తాన్: ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్ నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓ'డౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికెట్ కీపర్), సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ -
'మా ఫాస్ట్ బౌలర్లు చాలా డేంజర్.. స్పిన్నర్లు ఫామ్‌లోకి రావడం సంతోషం'
వన్డే ప్రపంచకప్-2023 తమ తొలి మ్యాచ్‌లో ఆడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఉప్పల్ వేదికగా శుక్రవారం పసికూన నెదర్లాండ్స్‌తో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని ఘనంగా ఆరంభించాలని పాకిస్తాన్ భావిస్తోంది. కాగా ప్రధాన టోర్నీకి ముందు జరిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వామప్ మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తమ ఫాస్ట్ బౌలర్లు ఎప్పుడూ రిథమ్‌లో ఉంటారని, స్పిన్నర్లు తిరిగి గాడిలో పడడం సంతోషంగా ఉన్నానని బాబర్ తెలిపాడు.బౌలింగ్, బ్యాటింగ్ రెండూ కూడా మా బలాలు. మా బ్యాటర్లు టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అద్భుతంగా రాణిస్తారు. ప్రతీ ఒక్క ప్లేయర్ బాధ్యతాయుతంగా ఆడుతారు. ఇక బౌలింగ్‌లో మా ఫాస్ట్ బౌలర్లు మా ప్రధాన బలం. కానీ మా స్పిన్నర్లు కూడా తిరిగి వారి రిథమ్‌ను పొందారు. రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ మా స్పిన్నర్లు మిడిల్ఓవర్లలో వికెట్లు తీశారు. ఇది మాకు శుభపరిణామం. ఇదే జోరును ప్రధానటోర్నీలో కొనసాగిస్తామని పీసీబీ డిజిటిల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్ పేర్కొన్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు పాకిస్తాన్ తుది జట్టు(అంచనా): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ. చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి? -
ఉప్పల్ వేదికగా పాక్-నెదర్లాండ్స్ పోరు.. సర్వం సిద్దం
వరల్డ్‌కప్-2023లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2 ఈ మ్యాచ్ గంటలకు ప్రారంభమవుతుంది. క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో తమను తాము నిరూపించుకున్న నెదర్లాండ్స్.. ప్రధాన టోర్నీలోనూ సత్తాచాటాలని భావిస్తోంది. మరోవైపు డచ్ జట్టును చిత్తు టోర్నీని ఘనంగా ఆరంభించాలని పాకిస్తాన్ యోచిస్తోంది. అయితే నెదర్లాండ్స్‌ను తక్కువగా అంచనా వేస్తే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ క్వాలిఫియర్స్‌లో వెస్టిండీస్ వంటి జట్టునే నెదర్లాండ్స్ చిత్తు చేసింది. కాగా ఈ ప్రధాన టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓటమి పాలైంది. మరి ప్రధాన టోర్నీని ఎలా ఆరంభిస్తుందో వేచి చూడాలి. 12 గంటల నుంచి ఎంట్రీ.. ఇక ఈ మ్యాచ్ కోసం 1200 మంది పోలీస్‌లతో భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అభిమానులకు ఎంట్రీ ఇవ్వనున్నారు. మ్యాచ్ జరిగే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విధించారు. అదే విధంగా అర్ద రాత్రి వరకు మెట్రో రైల్వే సేవలు అందుబాటులో ఉండనున్నాయి. తుది జట్లు(అంచనా) పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ. నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, వెస్లీ బరేసి, బాస్ డి లీడ్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లైన్, ఆర్యన్ దత్ చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్! -
‘టీమిండియా’తో సంజూ శాంసన్.. కొంచెం బాధగా ఉంది... కానీ
With Team India" - Sanju Samson: కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియాపై అభిమానం చాటుకున్నాడు. తాను ఎల్లప్పుడూ జట్టు వెంటే ఉంటానంటూ భావోద్వేగ పోస్టుతో అభిమానుల ముందుకు వచ్చాడు. కాగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఆడాలని ఆశపడ్డ ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న సంజూను కాదని.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌వైపే మొగ్గుచూపారు. మిస్టర్ 360 ప్లేయర్‌పై నమ్మకం ఉంచిన బీసీసీఐ సెలక్టర్లు సంజూకు 15 మంది సభ్యుల జట్టులో చోటివ్వలేదు. ఏది జరగాలని ఉందో అదే జరిగింది! ఈ క్రమంలో.. ‘‘ఏది జరగాలని ఉందో అదే జరిగింది! నేను మాత్రం ముందుకు సాగిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అంటూ సంజూ సోషల్ మీడియా వేదికగా తన భావాలు పంచుకున్నాడు. అయితే, తాజాగా అతడు చేసిన మరో పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా కేరళలోని తిరువనంతపురం వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజూ సొంత మైదానం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. సంజూ శాంసన్ పోస్టర్ ముందున్న నెట్స్‌లో శ్రమిస్తూ బంతితో సన్నద్ధమయ్యారు. కొంచెం బాధగా ఉంది.. కానీ పర్లేదు ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన సంజూ.. ‘‘టీమిండియాతో ఇలా.. ఈ దైవభూమిలో’’ అంటూ విక్టరీ సింబల్‌ను జతచేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘కొంచెం బాధగా ఉంది.. కానీ పర్లేదు’’ అంటూ సంజూను ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘‘పాపం సంజూ.. ఇలా పోస్టర్‌తో సరిపెట్టారు. బీసీసీఐ తన నిర్ణయం మార్చుకుని ఉంటే బాగుండేది’’ అంటూ 28 ఏళ్ల వికెట్ కీపర్‌కు అండగా నిలుస్తున్నారు. కాగా నెదర్లాండ్స్‌తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇక వరల్డ్‌కప్‌లో అక్టోబరు 8న భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) -
World Cup 2023: టీమిండియా అభిమానులకు నిరాశ
టీమిండియా అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు ఆడాల్సిన రెండు వార్మప్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సెప్టెంబర్ 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో జరగాల్సిన వార్మప్ మ్యాచ్ టాస్ అనంతరం రద్దు కాగా.. ఇవాళ (అక్టోబర్ 3) తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. మొత్తంగా తిరువనంతపురంలో జరగాల్సిన నాలుగు గేమ్స్‌లో మూడు వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసాయి. ఈ వేదికపై నిన్న జరిగిన న్యూజిలాండ్-సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఒక్కటే ఫలితం తేలింది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డు తగిలినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మరోవైపు ఇవాళ జరగాల్సిన మిగతా రెండు వార్మప్ మ్యాచ్‌లు సజావుగా సాగుతున్నాయి. గౌహతి వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఇరగీస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మరో మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రీలంక 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగా.. పాక్‌తో మ్యాచ్‌లో ఆసీస్ 37 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 59 బంతుల్లోనే శతక్కొట్టిన కుశాల్.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో లంక తాత్కాలిక కెప్టెన్ కుశాల్ మెండిస్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 59 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం కూడా కుశాల్ మెండిస్ తగ్గకుండా ఆడాడు. 87 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 158 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. పథుమ్ నిస్సంక (30), దిముత్ కరుణరత్నే (8) ఔట్ కాగా.. సమరవిక్రమ (32), అసలంక క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, అబ్దుల్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు. బ్యాట్ ఝులిపిస్తున్న మ్యాక్సీ.. పాక్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. మ్యాక్సీ 55 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (48), లబూషేన్ (40), మిచెల్ మార్ష్ (31), స్టీవ్ స్మిత్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. అలెక్స్ క్యారీ (11) నిరాశపరిచాడు. మ్యాక్స్‌వెల్‌తో పాటు గ్రీన్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో ఉసామా మిర్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, మొహమ్మద్ నవాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
WC 2023: కేరళలో టీమిండియా.. ముంబైకి వెళ్లిపోయిన కోహ్లి! కారణమిదే!
ICC World Cup 2023- India vs Netherlands Warm Up Match: వన్డే వరల్డ్‌కప్-2023 వార్మప్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కేరళకు చేరుకుంది. నెదర్లాండ్స్‌తో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్నాహక మ్యాచ్ ఆడేందుకు తిరువనంతరపురంలో అడుగుపెట్టింది. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం భారత జట్టుతో లేకపోవడం గమనార్హం. గువాహటిలో తొలి వార్మప్ మ్యాచ్ వర్షార్పణమైన అనంతరం అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. మిగతా ఆటగాళ్లంతా ఆదివారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరారు. పర్సనల్ ఎమర్జెన్సీ కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా కోహ్లి ముంబైకి వెళ్లినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారి ధ్రువీకరించినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. అయితే, సోమవారం నాటికి అతడు తిరిగి జట్టుతో చేరతాడని వెల్లడించింది. భార్య అనుష్కను చూడటానికే.. విరాట్ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మను కలిసేందుకే గువాహటి నుంచి నేరుగా ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సెలబ్రిటీ జంట త్వరలోనే తమ రెండో సంతానానికి జన్మనివ్వబోతోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హఠాత్తుగా ఇలా కోహ్లి ఇంటికి వెళ్లడం చూస్తుంటే విరుష్క శుభవార్త చెప్పడం ఖాయమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి 2017లో ఆమెను పెళ్లాడాడు. డచ్ జట్టుతో మ్యాచ్ కూడానా? ఈ జంటకు 2021 , జనవరి 11న కుమార్తె వామిక జన్మించింది. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మరోసారి అనుష్క గర్భం దాల్చిందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైపోయింది. ఇక తిరునవంతరపురంలోనూ ఇదే పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..! #WATCH | Thiruvananthapuram: Indian Cricket team arrive at Trivandrum Domestic Airport ahead of the World Cup scheduled to be held between October 5 to November 19. pic.twitter.com/LH1Ra5FhpW — ANI (@ANI) October 1, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
స్టార్క్ హ్యాట్రిక్... ఆ్రస్టేలియా, నెదర్లాండ్ మ్యాచ్ రద్దు
తిరువనంతపురంలో జరిగిన ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వానతో ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ముందుగా ఆసీస్ 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (55) అర్ధ సెంచరీ సాధించగా...గ్రీన్ (34), క్యారీ (28), స్టార్క్ (24 నాటౌట్) రాణించారు. వాన్ డర్ మెర్వ్, డి లీడ్, వాన్ బీగ్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం నెదర్లాండ్స్ 14.2 ఓవర్లలో 6 వికెట్లకు 84 పరుగులు సాధించింది. మిచెల్ స్టార్క్ చెలరేగి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అతను వరుసగా మూడు బంతుల్లో మ్యాక్స డౌడ్, వెస్లీ బరెసి, బాస్ డి లీడ్లను అవుట్ చేశాడు. అయితే మళ్లీ వాన రావడంతో అంపైర్లు ఇక ఆటను కొనసాగించకుండా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ్రస్టేలియా తర్వాతి వామప్ మ్యాచ్‌లో అక్టోబర్ 3న హైదరాబాద్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
WC- Aus Vs Ned: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియా స్కోరు 166-7
ICC Cricket World Cup Warm-up Matches 2023 - Australia vs Netherlands: వన్డే వరల్డ్‌కప్-2023లో తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. వర్షం కారణంగా 23 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కాగా ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా శనివారం ఆసీస్- నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. కేరళలోని తిరువనంతపురంలో గల గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌కు వరణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో డచ్ బౌలర్ వాన్ బీక్ ఆరంభంలోనే కంగారూలకు షాకిచ్చాడు. స్టీవ్ స్మిత్‌తో పాటు ఓపెనింగ్‌కు వచ్చిన జోష్ ఇంగ్లిస్‌ను డకౌట్ చేశాడు. అయితే, స్మిత్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాన్ డెర్ మెర్వె బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(5) పూర్తిగా నిరాశపరచగా.. కామెరాన్ గ్రీన్ 34, అలెక్స్ క్యారీ 28, మిచెల్ స్టార్క్ 24(నాటౌట్) పరుగులతో రాణించారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(1), మాథ్యూ షార్ట్(5) పూర్తిగా విఫలం కాగా.. లబుషేన్ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, వాన్ డెర్ మెర్వె, బాస్ డీ లీడే రెండేసి వికెట్లు పడగొట్టగా.. షారిజ్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఆస్ట్రేలియా విధించిన 167 పరుగుల లక్ష్యంతో డచ్ జట్టు తదుపరి బ్యాటింగ్‌కు దిగనుంది. ఆస్ట్రేలియా ప్లేయింగ్ టీమ్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, సీన్ అబాట్. నెదర్లాండ్స్ ప్లేయింగ్ టీమ్: విక్రమ్ జిత్ సింగ్, మ్యాక్స్ ఓడోడ్, వెస్లీ బారెసి, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), షరీజ్ అహ్మద్, ఆర్యన్ దత్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వె, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, లోగాన్ వాన్ బీక్, ర్యాన్ క్లీన్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్, కొలిన్ అకెర్మాన్, సాకిబ్ జుల్ఫికర్, బాస్ డీ లీడే. -
WC 2023: వన్డే వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఆటగాళ్లు.. 10 జట్ల పూర్తి వివరాలివే
ICC ODI World Cup 2023 All Final Squads: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా అక్టోబరు 5న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరుతో మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. పుష్కరకాలం తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్.. మొత్తంగా పది జట్లు పాల్గొననున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచే వామప్ మ్యాచ్‌లు కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే వరల్డ్‌కప్-2023 కోసం ఆయా మేనేజ్మెంట్లు ఖరారు చేసిన ఫైనల్ టీమ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్. పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం. అఫ్గనిస్తాన్ హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా జుర్మతి, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ ఇసాఖిల్, ఇక్రమ్ అలీ ఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ అర్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లకన్వాల్, ఫజల్హక్ ఫారూఖీ, అబ్దుల్ రెహ్మాన్ రహ్మానీ, నవీన్ ఉల్ హక్ మురీద్. ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ కుమర్ దాస్, తన్జిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (వైస్ కెప్టెన్), తవ్హిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసూమ్ అహ్మద్, షేక్ మహేదీ హసన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్. ఇంగ్లండ్ జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్. నెదర్లాండ్స్ స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మ్యాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కొలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లెయిన్, వెస్లీ బారెసి, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్. న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. సౌతాఫ్రికా తెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్. శ్రీలంక దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దుషన్ హేమంత, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీషా పతిరానా, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ -
కోహ్లిని ఔట్ చేయడానికి ఐదు బంతులు చాలు.. పసికూన బౌలర్ వార్నింగ్
నెదర్లాండ్స్.. వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టి భారత్ వేదికగా జరగనున్న ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్‌ను చిత్తు చేసి మరి డచ్ జట్టు ప్రపంచకప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్రమంలో మెగా టోర్నీకి సిద్దమయ్యేందుకు నెల రోజులు ముందే నెదర్లాండ్స్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది. బెంగళూరు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమించింది. భారత నెట్‌బౌలర్లను ఎంపిక చేసి మరీ తమ ప్రాక్టీస్‌ను కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్, చెన్నైకు చెందిన నెట్‌బౌలర్లు డచ్ జట్టుతో జత కట్టారు. ఇక ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్స్ తమ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా, భారత్‌తో వార్మాప్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న నేపథ్యంలో నెదర్లాండ్స్.. టీమిండియాతో కూడా తలపడనుంది. భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ నవంబర్ 12 బెంగళూరు వేదికగా జరగనుంది. అయితే భారత్‌తో మ్యాచ్‌కు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు డచ్ స్టార్ ఆల్‌రౌండర్ లోగాన్ వాన్ బీక్ తెలిపాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఔట్చేసేందుకు ఇప్పటికే ప్లాన్లు వేసేసుకున్నామని చెప్పాడు. తను కేవలం 5 బంతుల్లోనే కోహ్లిని ఔట్ చేస్తానని థీమా వ్యక్తం చేశాడు. "నేను విరాట్ కోహ్లికి బౌలింగ్ చేసేటప్పుడు మొదటి రెండు బంతులను ఔట్స్వింగర్లగా సంధిస్తాను. ఆ తర్వాత బంతని ఆఫ్ కట్టర్ స్లోయర్ బాల్ వేస్తాను. అప్పుడు విరాట్ పోర్ కొడతాడని నాకు తెలుసు. దీంతో చికాకు పడినట్లు నటిస్తా. ఒక ఐదు నిమిషాలు ఆట జరగకుండా ఆపేస్తా. కెప్టెన్‌ను పిలిచి ఏదో మాట్లాడుతున్నట్లు ఇద్దరం నటిస్తాము. ఏదో ఒక వైపు చెయ్యి చూపించి అటువైపు బౌలింగ్ చేస్తున్నట్లు యాక్ట్చేస్తాను. కానీ నేను ఆ దిశగా బౌలింగ్ చేయను. అతడిని నేను మోసం చేస్తాను. నాలుగో బంతిని హాఫ్ సైడ్‌గా వేస్తాను. అది కూడా అతడు బౌండరీకి పంపిస్తాడు. భారత అభిమానులు ఒక్కసారిగా స్టేడియం మొత్తం హోరెత్తిస్తారు. కోహ్లిలో కూడా మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. నాకు కూడా కావల్సింది అదే. ఈ సమయంలో ఐదో బంతిని వేసేముందు పైకి ఒక్కసారి చూస్తా. ఈ క్షణం నన్ను ఏం అడిగినా చేస్తా జస్ట్ కోహ్లి వికెట్ ప్రసాదించు స్వామీ అని క్రికెట్ దేవుళ్లను కోరుకుంటా. కళ్లు మూసుకొని వచ్చి వేస్తా ఆ బంతికి కోహ్లి అవుటైపోతాడు' అని క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోగాన్ వాన్ పేర్కొన్నాడు. -
టీమిండియా తొలుత ఇంగ్లండ్.. తర్వాత పసికూనతో! పూర్తి షెడ్యూల్, వివరాలు
ICC Men's Cricket World Cup warm-up matches 2023: భారత్‌లో క్రికెట్ ఫీవర్ తారస్థాయికి చేరింది. వారం రోజుల్లో ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్‌కప్-2023 ఆతిథ్యానికి టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు భారత్‌కు చేరుకుంటున్నాయి. ప్రధాన మ్యాచ్‌ల కంటే ముందు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు సన్నద్ధమవుతున్నాయి. హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి ఈ సన్నాహక మ్యాచ్‌లకు వేదికలుగా మారనున్నాయి. మరి.. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు జరుగనున్న వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్, టైమింగ్స్ లైవ్ స్ట్రీమింగ్, టికెట్ల బుకింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?! సెప్టెంబరు 29, 2023 - శుక్రవారం 1. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి 2. దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్తాన్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం 3. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ సెప్టెంబరు 30, 2023- శనివారం 4. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి 5.ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం. అక్టోబరు 2, 2023- సోమవారం 6.ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి 7.న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం అక్టోబరు 3, 2023- మంగళవారం 8.అఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి 9.ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం 10.పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ మ్యాచ్ ఆరంభ సమయం వార్మప్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే? ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్‌కప్-2023కు సంబంధించిన వార్మప్, ప్రధాన మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్‌స్టార్‌లో మొబైల్లో ఉచితంగా వీక్షించవచ్చు. బుక్ మై షోలో.... వరల్డ్ కప్- 2023 ప్రధాన, వార్మప్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు. టీమిండియా మినహా ఇతర జట్ల వార్మప్ మ్యాచ్‌లకు టికెట్లు ఆగష్టు 25 నుంచే అందుబాటులోకి రాగా.. భారత జట్టు ఆడే వార్మప్ మ్యాచ్‌లకు ఆగష్టు 30 నుంచి అందుబాటులో వచ్చాయి. చదవండి: హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి: బాబర్ భావోద్వేగం -
వన్డే వరల్డ్‌కప్‌లో మన వాడు ఒకే ఒక్కడు.. టీమిండియాలో కాదు..!
అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్ 2023లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. వీరిలో ఒకరు తెలంగాణకు చెందిన ఆటగాడు కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన క్రికటర్. తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చెందిన మొహమ్మద్ సిరాజ్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. 29 ఏళ్ల తేజ విజయవాడ నుంచి ఆమ్స్టర్డామ్కు వలస వెళ్లి, అక్కడే స్థిరపడి డచ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తేజ నెదర్లాండ్స్ జట్టుకు బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు. డచ్ టీమ్ తరఫున 20 వన్డేలు, 6 టీ20లు ఆడిన తేజ.. మొత్తంగా 531 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తేజ ఓ అద్భుతమైన సెంచరీ చేసి, డచ్ టీమ్ ఈ ఏడాది వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వడంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి చెందిన 29 ఏళ్ల మొహమ్మద్ సిరాజ్ టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదుగుతున్నాడు. ఇటీవలే అతను నంబర్ వన్ వన్డే బౌలర్‌గా అవతరించాడు. టీమిండియా తరఫున 21 టెస్ట్‌లు, 29 వన్డేలు8 టీ20లు ఆడిన సిరాజ్ మొత్తంగా 123 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. బంగ్లాదేశ్ మినహా.. వన్డే ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ మినహా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. జట్ల ప్రకటనకు ఆఖరి తేదీ సెప్టెంబర్ 28గా ఐసీసీ నిర్ణయించింది. జట్ల వివరాల.. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), విక్రమ్‌జీత్ సింగ్, సకీబ్ జుల్ఫికర్, సైబ్రాండ్ ఎంజెల్‌బ్రెచ్, కొలిన్ అకెర్‌మ్యాన్, బాస్ డీ లీడ్, తేజ నిడమనూరు, షరీజ్ అహ్మద్, మ్యాక్స్ ఔడౌడ్, రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్, వెస్లీ బర్రెసీ, లొగన్ వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లే, మార్క్ వుడ్ పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్ శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక -
నాలుగేళ్లుగా ఫుడ్ డెలివరీ చేస్తున్నా! ఇప్పుడిలా వరల్డ్‌కప్ జట్టు క్యాంపులో..
ICC ODI World Cup 2023: ‘‘నా కెరీర్లో అత్యంత విలువైన క్షణాలు ఇవే. నేనింత వరకు కనీసం.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ థర్డ్ డివిజన్ లీగ్‌లో కూడా ఆడలేదు. నాలుగేళ్లపాటు ఐదో డివిజన్లో ఆడాడు. ఈసారి నాలుగో డివిజన్లో ఆడేందుకు రిజిస్టర్ చేసుకున్నాను. నెదర్లాండ్స్ నెట్ బౌలర్‌గా ఎంపికయ్యానని తెలియగానే.. ఎట్టకేలకు నా ప్రతిభను గుర్తించే వాళ్లు కూడా ఉన్నారనే భావన కలిగింది’’ అని తమిళనాడుకు చెందిన లోకేశ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన లోకేశ్‌కు క్రికెటర్‌గా ఎదగాలని ఆశయం. వేలాది మందిలో నలుగురు.. అందులో ఒక్కడు ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం పేసర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడతడు. అయితే, కాలక్రమంలో చైనామన్ స్పిన్నర్‌గా మారాడు. తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటున్న లోకేశ్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలనేది చిరకాల కోరిక. అక్కడ ప్రతిభ నిరూపించుకుంటే.. అదృష్టం కలిసివస్తే ఏదో ఒకరోజు టీమిండియాకు కూడా ఆడొచ్చనే ఆశ. ఈ క్రమంలో.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రాక్టీసులో భాగంగా తమకు భారత నెట్ బౌలర్లు కావాలని నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ప్రకటన అతడిలో ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో తన అర్హతలను జోడిస్తూ అప్లికేషన్ పెట్టుకోగా.. వేలాది మందిలో నలుగురు ఫైనలిస్టులలో ఒకడిగా ఎంపికయ్యాడు. ఆటగాళ్లకు పరిచయం చేస్తూ హైదరాబాదీ రాజమణి ప్రసాద్, రాజస్తాన్ హైకోర్టు ఉద్యోగి హేమంత్ కుమార్, హర్యానాకు చెందిన హర్ష్ శర్మలతో పాటు నెదర్లాండ్స్ క్యాంపులో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మొదటి ట్రెయినింగ్ సెషన్లో భాగంగా.. ఈ నలుగురిని తమ ఆటగాళ్లకు పరిచయం చేసింది మేనేజ్మెంట్. కాగా పొట్టకూటి కోసం లోకేశ్ కుమార్ స్విగ్గీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ ఇచ్చిన ఆఫర్ గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆత్మీయ స్వాగతం పలికారు.. డచ్ ఫ్యామిలీలో ఒకడినని ‘‘నెదర్లాండ్స్ జట్టు సభ్యులు నన్ను తమలో ఒకడిగా భావించి ఆత్మీయ స్వాగతం పలికారు. నెట్ బౌలర్ల పరిచయ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇది మీ జట్టు.. ఇక్కడ మీరు స్వేచ్ఛగా ఆడవచ్చు అని మమ్మల్ని ప్రోత్సహించారు. నాకైతే ఇప్పుడే డచ్ ఫ్యామిలీలో సభ్యుడినయ్యానన్న భావన కలిగింది’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘‘కాలేజీ చదువు తర్వాత నా దృష్టి మొత్తం క్రికెట్ మీదే పెట్టాను. నాలుగేళ్లపాటు మొత్తం అంతా క్రికెట్ కోసమే. అయితే, 2018లో ఏదైనా ఉద్యోగం చేయాలని భావించాను. గత నాలుగేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాను. అలా నాకు కావాల్సిన డబ్బు నేను సంపాదించుకుంటున్నాను. ఇది తప్ప నాకు మరో ఆదాయ వనరు లేదు. వీకెండ్స్‌లో మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి వీక్‌డేస్‌లోనే పనిచేస్తాను’’ అంటూ తన ఆర్థిక స్థితి గురించి లోకేశ్ చెప్పుకొచ్చాడు. నెదర్లాండ్స్ క్రికెట్‌పై నెటిజన్ల ప్రశంసలు కాగా ఐదోసారి వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టు.. ప్రస్తుతం బెంగళూరులోని ఆలూరులో ట్రెయినింగ్ క్యాంపు నిర్వహిస్తోంది. మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డచ్ టీమ్.. సెప్టెంబరు 29న పాకిస్తాన్‌తో తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో భారత నెట్ బౌలర్లను నియమించుకుని కావాల్సినంత ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో లోకేశ్ లాంటి ఆశావహులకు ఛాన్స్ ఇచ్చిన నెదర్లాండ్స్ మేనేజ్మెంట్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నెట్ బౌలర్‌కే ఇంత హైప్ అవసరమా అంటే.. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకోవచ్చు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రతిభ నిరూపించుకుని టీమిండియాకు ఎంపికై సత్తా చాటిన అతడు లోకేశ్ లాంటి వాళ్లకు ఆదర్శం. చదవండి: నెక్ట్స్ సూపర్‌స్టార్.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా Our first training session in India for the #CWC23 began with a small induction ceremony for our four new net bowlers from different parts of India. 🙌 pic.twitter.com/ug0gHb73tn — Cricket🏏Netherlands (@KNCBcricket) September 20, 2023 -
WC: స్విగ్గీ డెలివరీ బాయ్, హైకోర్టు ఉద్యోగి.. నెదర్లాండ్స్ నెట్‌బౌలర్లుగా మనోళ్లు
ICC ODI WC 2023- Netherlands Net Bowlers: ‘‘మాకు భారత నెట్ బౌలర్లు కావాలి.. ఈ అర్హతలు ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు..’’ వన్డే వరల్డ్‌కప్-2023 సన్నాహకాల్లో భాగంగా భారత్‌లో అడుగుపెట్టిన నెదర్లాండ్స్ జట్టు ఇచ్చిన ఈ ప్రకటన గుర్తుండే ఉంటుంది. భారత పౌరుడై.. 18 ఏళ్లకు పైబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంలో బౌలింగ్ చేయగల పేసర్లు.. గంటకు 80 కి.మీ వేగంతో బంతిని విసరగల స్పిన్నర్లకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా డచ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన ఈ ప్రకటనకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు.. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హులైన నలుగురిని తమ నెట్ బౌలర్లుగా ఎంచుకుంది. తమ అవసరాలకు అనుగుణంగా ఇద్దరు లెఫ్టార్మ్ పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను సెలక్ట్ చేసుకుంది. ఇందులో స్విగ్గీ డెలివరీ బాయ్ కూడా ఉన్నాడు. ఆ నలుగురి వివరాలివే! 1. రాజమణి ప్రసాద్.. లెఫ్టార్మ్ పేసర్ ►హైదరాబాద్, తెలంగాణ ►హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడిన అనుభవం ►ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ నెట్ బౌలర్‌గా ఉన్నాడు. 2. హేమంత్ కుమార్- లెఫ్టార్మ్ పేసర్ ►చురు, రాజస్తాన్ ►రాజస్తాన్ హైకోర్టులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ►2022, 2023 సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ అతడిని నెట్‌బౌలర్‌గా నియమించుకుంది. 3. హర్ష్ శర్మ.. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ►కురుక్షేత్ర, హర్యానా ►నార్త్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ విజేత.. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ రన్నరప్ ►2022లో ఆర్సీబీ క్యాంపులో నెట్‌బౌలర్‌గా సేవలు అందించాడు. 4. లోకేశ్ కుమార్- మిస్టరీ బౌలర్ ►చెన్నై, తమిళనాడు ►జీవనోపాధి కోసం పగలంతా స్విగ్గీలో లోకేశ్ పని ►ఐపీఎల్లో ఆడాలనే ఆశయం ►ఎనిమిదేళ్ల క్రితం పేసర్‌గా మొదలైన లోకేశ్ ప్రస్తుతం మిస్టరీ స్పిన్నర్‌గా మారాడు. ఇదిలా ఉంటే... హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్‌తో సెప్టెంబరు 29న నెదర్లాండ్స్ తమ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: నెక్ట్స్ సూపర్‌స్టార్.. మరో కోహ్లి కావాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా Thank you for the overwhelming response to our net bowlers hunt, India. Here the 4 names who will be part of the team's #CWC23 preparations. 🙌 @ludimos pic.twitter.com/arLmtzICYH — Cricket🏏Netherlands (@KNCBcricket) September 19, 2023 Our first training session in India for the #CWC23 began with a small induction ceremony for our four new net bowlers from different parts of India. 🙌 pic.twitter.com/ug0gHb73tn — Cricket🏏Netherlands (@KNCBcricket) September 20, 2023 -
భారత బౌలర్లు కావాలి.. నెదర్లాండ్స్ బోర్డు ప్రకటన! పట్టుమని 10 మంది లేరు..
Netherlands Cricket Board: జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి అర్హత సాధించింది నెదర్లాండ్స్. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను మట్టికరిపించి తమను పసికూనలు అన్న వాళ్లకు ఆటతోనే సమాధానం చెప్పింది. 1996, 2003, 2007, 2011 తర్వాత మరోసారి ఐసీసీ ఈవెంట్ ఆడే అవకాశం దక్కించుకుంది. మాకు నెట్ బౌలర్లు కావాలి ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచకప్ జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్ ప్రధాన పోరులోనూ తమదైమ ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా తమకు భారత నెట్ బౌలర్లు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. సాధారణంగా పర్యాటక జట్లకు స్థానిక క్రికెట్ సంఘాలు నెట్ బౌలర్ల సేవలు అందేలా చూడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే, డచ్ బోర్డు మాత్రం.. తమ అవసరాలకు అనుగుణంగా నిర్దష్ట నైపుణ్యాలు గల బౌలర్లు కావాలని ప్రకటన ఇవ్వడం విశేషం. షరతులు ఇవే భారత పౌరుడై 18 ఏళ్లు పైబడిన వాళ్లు ఇందుకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకు జతగా.. అత్యధికంగా ఒక ఓవర్ పాటు బౌలింగ్ చేసిన వీడియో అప్లోడ్ చేయాలని కోరింది. అయితే, ఎడిటెడ్ వీడియోలు మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది. సెప్టెంబరు 17, 2023 నాటికి వీడియోలు అప్లోడ్ చేయాలని షరతు విధించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల పేసర్లు, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగల స్పిన్నర్లకు ప్రాధాన్యం ఉంటుందని నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు తమ ఎక్స్ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది. లెఫ్టార్మ్ సీమర్.. ఇంకా కాగా కర్ణాటకలోని ఆలూరులో సెప్టెంబరు 20-24 వరకు నెదర్లాండ్స్ జట్టు ఐదు రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించనుంది. ఈ క్రమంలో స్థానిక క్రికెట్ సంఘం కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నా.. తమ అవసరాలను బట్టి లెఫ్టార్మ్ సీమర్, రైటార్మ్ సీమర్, మిస్టరీ స్పిన్నర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ కావాలని కోరడం గమనార్హం. అది వాళ్ల ఇష్టం ఈ విషయంపై స్పందించిన కర్ణాటక క్రికెట్ సంఘం అధికారి.. ‘‘వాళ్లు ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడారు. వారి అభ్యర్థన మేరకు ఇప్పటికే కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. వాళ్లు మళ్లీ ఎప్పుడు కావాలన్న సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నెట్ బౌలర్లను అందిస్తున్నాం. అయితే, వారికి కావాల్సిన విధంగా శిక్షణా శిబిరం ఉండాలని కోరుకునే స్వేచ్ఛ వారికుంది’’ అని పీటీఐతో పేర్కొన్నారు. పట్టుమని పది మంది లేరు అసోసియేట్ దేశమైన నెదర్లాండ్స్‌లో వివిధ దేశాల నుంచి వచ్చి జాతీయ జట్టుకు క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. డచ్ బోర్డు కింద కనీసం 10 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు కూడా లేకపోవడం గమనార్హం. దేశవాళీ క్రికెటర్లు కూడా చాలా తక్కువ. వన్డే ప్రపంచకప్-2023 జట్టుకు నెదర్లాండ్స్ జట్టు స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), కొలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, వెస్లీ బారెసి, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఎస్ఏ ఎంగెల్‌బ్రెచ్ట్, ర్యాన్ క్లెయిన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, తేజ నిడమనూరు, మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్. చదవండి: పాక్ ఫాస్ట్‌బౌలర్లే కాదు.. టీమిండియా పేసర్లూ భేష్! వాళ్లకు చుక్కలు ఖాయం If you can bowl and want to be a part of the team's ICC Men's ODI World Cup 2023 preparations, then head over to the link below and upload your videohttps://t.co/cQYjcW7bQq pic.twitter.com/S4TX8ra7pN — Cricket🏏Netherlands (@KNCBcricket) September 7, 2023 -
WC 2023: జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. ‘ఆంధ్ర అబ్బాయి’కి చోటు! కెప్టెన్‌గా
Netherlands 15-member squad for 2023 World Cup: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లను గురువారం వెల్లడించింది. అదే విధంగా ఇద్దరు రిజర్వు ప్లేయర్లను కూడా ఎంపిక చేసినట్లు తెలిపింది. వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ డచ్ జట్టును ముందుండి నడిపించనుండగా.. తెలుగు మూలాలున్న తేజ నిడమనూరుకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన అనిల్ తేజ.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో నెదర్లాండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అనూహ్యరీతిలో స్కాట్లాండ్పై నెగ్గి ఇక జింబాబ్వేలో జరిగిన క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అసాధారాణ పోరాటం కనబరిచింది. తమ చివరి మ్యాచ్‌లో అనూహ్యరీతిలో స్కాట్లాండ్పై నెగ్గింది. భారత్‌లో జరిగే మెగా ఈవెంట్లో అడుగుపెట్టాలంటే నాటి మ్యాచ్‌లో 44 ఓవర్లలో లక్ష్యం 278 పరుగులుగా ఉన్న సమయంలో... బాస్ డి లీడె అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడి శతకానికి తోడు జుల్ఫికర్ అండగా నిలవడంతో నెదర్లాండ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. తేజ అద్భుత సెంచరీ దీంతో ఐదోసారి వన్డే ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టింది. ఇక 2011 తర్వాత మళ్లీ భారత్‌లోనే ఆ జట్టు బరిలోకి దిగనుండటం విశేషం. ఇక అంతకుముందు.. ఆంధ్రకు చెందిన తేజ నిడమనూరు సైతం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగి.. నెదర్లాండ్స్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో అక్టోబర్ 6న తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌తో తలపడనుంది. హైదరాబాద్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. తదుపరి నవంబర్ 11న బెంగళూరులో భారత్‌ను ఢీకొట్టనుంది. వన్డే ప్రపంచకప్-2023 జట్టుకు నెదర్లాండ్స్ జట్టు స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), కొలిన్ అకెర్మాన్, షరీజ్ అహ్మద్, వెస్లీ బారెసి, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఎస్ఏ ఎంగెల్‌బ్రెచ్ట్, ర్యాన్ క్లెయిన్, బాస్ డి లీడే, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, తేజ నిడమనూరు, మాక్స్ ఓ డౌడ్, విక్రమ్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్. చదవండి: Ind vs Pak: నెట్స్‌లో శ్రమించిన రాహుల్.. కోహ్లి, రోహిత్ డుమ్మా! -
ప్రత్యర్థులుగా ఇంగ్లండ్, నెదర్లాండ్స్
దుబాయ్: వన్డే వరల్డ్ కప్ ప్రధాన పోరుకు ముందు సన్నాహకంగా జరిగే వామప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. మూడు వేదికలు హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లూ సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 3 మధ్య రెండేసి మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. సెప్టెంబర్ 30న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో గువహటిలో తలపడే భారత్... అక్టోబర్ 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటుంది. మూడు ప్రధాన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో రెండు వామప్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. సెప్టెంబర్ 29న పాకిస్తాన్, న్యూజిలాండ్...అక్టోబర్ 3న పాకిస్తాన్, ఆ్రస్టేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో వామప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. టికెటింగ్ పార్ట్నర్గా బుక్ మై షో... వరల్డ్ కప్ కోసం ‘బుక్ మై షో’ను తమ టికెటింగ్ భాగస్వామిగా బీసీసీఐ ప్రకటించింది. ప్రధాన మ్యాచ్‌లు, వామప్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 58 మ్యాచ్‌ల టికెట్లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్ మినహా ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 25 నుంచి, భారత్ ఆడే వామప్ మ్యాచ్‌లకు ఈ నెల 30 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే బోర్డు స్పాన్సర్లలో ఒకరైన ‘మాస్టర్ కార్డ్’ వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగానే (నేటి సాయంత్రం 6 గంటల నుంచి, 29 సాయంత్రం 6 గంటల నుంచి) టికెట్లు లభిస్తాయి. -
నెదర్లాండ్స్‌లో కిడ్నీ మార్పిడికే ప్రాధాన్యత
లక్డీకాపూల్: తమ దేశంలో కిడ్నీ బాధితులకు ఎక్కువ కాలం డయాలసిస్ చేయమని.. కిడ్నీ మార్పిడికే ప్రాధాన్యత ఇస్తామని నెదర్లాండ్స్ ఆరోగ్య, సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ప్రొఫెసర్ ఎర్నెస్ట్ కైపర్స్ తెలిపారు. తెలంగాణలోని వైద్య సేవలను అధ్యయనం చేసేందుకు వచ్చిన ఆయన గురువారం నిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని లివర్ డయాలసిస్, మెడికల్ ఆంకాలజీ, యూరాలజీ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్క్రీనింగ్ కేన్సర్, మామోగ్రామ్, రొమ్ము కేన్సర్, సర్వైకల్ కేన్సర్‌కు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో నిమ్స్ వైద్యులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్న కైపర్స్... నెదర్లాండ్స్‌లోని వైద్య సేవల తీరును వివరించారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులను తమ దేశంలో హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కోవిడ్ తర్వాత ఎదురవుతున్న పరిణామాల నేపథ్యంలో నిమ్స్‌తో కలసి ఓ వ్యాక్సిన్ రూపొందించాలన్న యోచనలో ఉన్నట్లు కైపర్స్ తెలిపారు. అలాగే వైద్యవిద్యపై ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బ్యాక్టీరియా, యాంటీబయోటెక్ డ్రగ్స్‌పై పరిశోధనలకు నిమ్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కైపర్స్ వివరించారు. తెలంగాణలో వైద్య సేవలు బాగున్నాయి.. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని నెదర్లాండ్స్ మంత్రి ఎర్నెస్ట్ కైపర్స్ ప్రశంసించారు. తెలంగాణలో పదేళ్ల కాలంలో మాతాశిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం గొప్ప విషయమని... అందుకే తెలంగాణ వైద్యపరంగా నీతి అయోగ్ లెక్కల ప్రకారం 11 స్థానం నుంచి 3వ స్ధానానికి చేరిందన్నారు. కాగా, రాష్ట్రంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లోనే ట్రామా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. 50 పడకలతో కూడిన ఈ సెంటర్లలో అన్ని రకాల అత్యవసర వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. నెదర్లాండ్స్ మంత్రి కైపర్స్, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వరల్డ్ కప్‌లో టీమిండియా మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు.. పాక్ మ్యాచ్‌తో పాటు..!
వన్డే వరల్డ్‌కప్-2023 సవరించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 9) ప్రకటించింది. భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సహా మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. అందరూ ఊహించిన విధంగానే అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ఓ రోజు ముందుకు (అక్టోబర్ 14) కదిలింది. ఈ మ్యాచ్‌తో పాటు టీమిండియా ఆడే మరో మ్యాచ్ తేదీలో కూడా మార్పు జరిగింది. బెంగళూరు వేదికగా నవంబర్ 11న నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 12వ తేదీకి మారింది. ఈ రెండు మార్పులతో పాటు మరో ఏడు మ్యాచ్‌ల తేదీల్లో కూడా మార్పులు జరిగాయి. అవేంటంటే.. ఢిల్లీ వేదికగా అక్టోబర్ 14న జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్-ఇంగ్లండ్ మ్యాచ్ ఓ రోజు తర్వాత (అక్టోబర్ 15), అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరగాల్సిన పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10న, అక్టోబర్ 13న లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ అక్టోబర్ 12న, చెన్నై వేదికగా న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య అక్టోబర్ 14న జరగాల్సిన మ్యాచ్ అక్టోబర్ 13న, ధర్మశాల వేదికగా నవంబర్ 11న ఇంగ్లండ్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన డే అండ్ నైట్ మ్యాచ్ అదే రోజు (నవంబర్ 11) డే మ్యాచ్ (10:30)గా, ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య నవంబర్ 12 ఉదయం (10:30) పూణే వేదికగా జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 11కు, ఇంగ్లండ్-పాకిస్తాన్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్ 12న జరగాల్సిన డే అండ్ నైట్ మ్యాచ్ నవంబర్ 11కు మారింది. కాగా, ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ శ్రీలంక (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 12: ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (బెంగళూరు) నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు.. నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై) నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా) నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్) హైదరాబాద్‌లో (ఉప్పల్ స్టేడియం) జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ అక్టోబర్ 10 (మంగళవారం): పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక -
నెదర్లాండ్స్ నౌకలో భారీ అగ్నిప్రమాదం
ది హేగ్: నెదర్లాండ్స్‌లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమైనట్టు అంచనా. నౌక సిబ్బందిలో ఒకరు మంటల్లో చిక్కుకొని మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణరక్షణ కోసం సముద్రంలో దూకారు. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్ కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ కారుల్లో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జర్మనీలోని బ్రెమర్‌హెవన్ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా మంగళవారం రాత్రి అమెలాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో మంటలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
ప్రభుత్వాన్నే ముంచేసిన.. వలసల వరద..
నెదర్లాండ్స్‌లో నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికైన ఏడాదిన్నరకే పేకమేడలా కుప్పకూలింది. యూరప్‌లో చాలా దేశాలు ఎదుర్కొంటున్న వలసల ఉధృతే ఇందుకు ప్రధాన కారణం కావడం అక్కడ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.. నెదర్లాండ్స్‌లోకి వలసలను కట్టడి చేసేందుకు ప్రధాని మార్క్ రుట్టె ప్రతిపాదించిన కఠినతరమైన వలసల విధానం చివరికి ఆయన ప్రభుత్వానికే ఎసరు తెచి్చంది. పాలక సంకీర్ణంలోని మిగతా మూడు భాగస్వామ్య పార్టీలూ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో రుట్టె రాజీనామా చేశారు. అయితే, భాగస్వాముల మాటకు తలొగ్గి రాజీ పడేకంటే దీర్ఘకాలిక స్వీయ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న దూరదృష్టి ఆయన నిర్ణయంలో ప్రతిఫలించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాక యూరప్‌లో వలసల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతోందో, అక్కడి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తోందో, దీన్ని రైట్ వింగ్ పార్టీలు సొమ్ము చేసుకోకుండా ఆపడం ప్రధాన పార్టీలకు ఎంత కష్టతరంగా పరిణమిస్తోందో ఈ ఉదంతం మరోసారి తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ► యూరప్‌లోని అత్యంత ధనిక దేశాల్లో నెదర్లాండ్స్‌ది నాలుగో స్థానం ► నెదర్లాండ్స్‌లోకి వలసల సంఖ్య గతేడాది ఏకంగా మూడో వంతు పెరిగి 47 వేలు దాటేసింది! దాంతో ప్రధాని రుట్టె కట్టడి చర్యలను ప్రతిపాదించాల్సి వచి్చంది. ► ఈసారి దేశంలోకి శరణార్థుల సంఖ్య ఏకంగా 70 వేలు దాటొచ్చని అంచనా. ► వలసదారుల దెబ్బకు చాలా యూరప్ దేశాల్లో మాదిరిగానే నెదర్లాండ్స్‌లో కూడా ఇళ్ల ధరలు, అద్దెలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ► ఇదేగాక పెరుగుతున్న వలసల వల్ల అనేకానేక సమస్యలతో నెదర్లాండ్స్ సతమతమవుతోంది. ► నవంబర్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఇది అది పెద్ద ప్రచారాంశంగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ► ఇప్పుడిక నెదర్లాండ్స్ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏమిటీ ప్రతిపాదిత విధానం... ప్రధానంగా, నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న వలసదారుల పిల్లలకు వలసదారులుగా గుర్తింపు ఇచ్చేందుకు కనీసం రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండాలని ప్రధాని రుట్టె ప్రతిపాదించారు. దీన్ని సంకీర్ణ భాగస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు. యూరప్‌కు పెనుభారంగా వలసలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర కారణాలతో యూరప్ దేశాలకు కొన్నేళ్లుగా వలసలు భారీగా పెరుగుతున్నాయి. ► 2015లో సిరియా నుంచి శరణార్థులు వెల్లువెత్తిన నాటి నుంచీ ఈ ధోరణి నానాటికీ పెరుగుతూనే ఉంది. ► కానీ ద్రవ్యోల్బణం తదితరాలతో అసలే ధరాభారం, జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతున్న సమయంలో ఈ వలసలు క్రమంగా యూరప్ దేశాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ► దీన్ని అవకాశంగా మలచుకుంటూ పలు యూరప్ దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు శరణార్థుల పక్షం వహిస్తుండటంతో యూరప్ రాజకీయాలే కీలకమైన, అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి కూడా. ► ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలకు ఈ రైట్ వింగ్ పార్టీల ఎదుగుదల పెను సవాలుగా మారుతోంది. ► జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, హంగరీ మొదలుకుని చిన్నా పెద్దా యూరప్ దేశాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! ► దాంతో రైట్ వింగ్ పార్టీలకు ముకుతాడు వేసేందుకు సంప్రదాయ పార్టీలన్నీ చేతులు కలుపుతున్న కొత్త ధోరణి కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైంది. రుట్టె కేంద్రంగా... ► నెదర్లాండ్స్‌లో వలసలపై నెలకొన్న తాజా సంక్షోభం ప్రధాని రు ట్టె సంప్రదాయ వైఖరి కారణంగానే ముదురు పాకాన పడింది. ► 13 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రుట్టె, దీన్ని కూడా అందివచి్చన అవకాశంగానే మలచుకుని వెంటనే రాజీనామా చేశారు. ► ఇటీవల బలం పుంజుకుంటున్న రైట్‌వింగ్ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అధికారాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్న ఇమేజీ సాధించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టే లక్ష్యంతోనే ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది. ► రైట్ వింగ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా రుట్టె తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ► అంతేగాక రాజీనామా ద్వారా యూరప్ యవనికపై వలసల కట్ట డి కోసం గళమెత్తుతున్న బలమైన నేతగా రుట్టె ఆవిర్భవించారు. ► యూరప్‌లోకి వలసల కట్టడికి సంయుక్త ఈయూ బోర్డర్ ఏజెన్సీ వంటివాటి ఏర్పాటును కూడా కొంతకాలంగా ఆయన ప్రతిపాదిస్తున్నారు. అయితే రాజీనామా ద్వారా దేశ ప్రయోజనాల కంటే స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేసుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి! ‘కేవలం ప్రతిపాదిత వలస విధానంపై విభేదాల వల్ల ఏకంగా పాలక సంకీర్ణమే కుప్పకూలడం నమ్మశక్యం కాని నిజం! ఏదేమైనా రాజీనామా నిర్ణయం ప్రధాని రుట్టె రాజకీయ చతురతకు అద్దం పట్టింది’ – మార్సెల్ హనెగ్రాఫ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
సరికొత్త చరిత్ర.. మిస్ నెదర్లాండ్స్‌గా ట్రాన్స్‌జెండర్ మహిళ
అమ్‌స్టర్‌డ్యామ్: మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే గెలుచుకుంది. అందగత్తెల పోటీలో ట్రాన్స్‌జెండర్ మహిళ ఈ ఘనత సాధించడం నెదర్లాండ్స్‌లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విధంగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల రిక్కీ వలేరి కొల్లే ప్రముఖ మోడల్స్ నుంచి ఎదురైన పోటీని అవలీలగా అధిగమించింది. విజేతగా నిలిచింది. మిస్ నెదర్లాండ్స్ టైటిల్ సాధించడం గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది. మహిళలకు ఆదర్శం కావాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. ఎల్సాల్వేడార్లో జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో రిక్కీ నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. -
అందాల పోటీల్లో.. తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది!
అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది. శనివారం ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఓ వేడుకలో 22 ఏళ్ల డచ్ మొలుకన్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె అనే ట్రాన్స్ జెండర్ ఈ ఘనతను సృష్టించింది. ఆమె ఈ వేడుకలో హబీబా మోస్టాఫా, లౌ డిర్చ్లు, నథాలీ మోగ్బెల్జాదాలను వెనక్కి నెట్టి మరీ మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను గెలుచుకుంది. అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కి కిరీటం దక్కడం తొలిసారి. ఈ చారిత్రత్మక విజయం 72వ మిస్ యూనివర్స్ టైటిల్‌కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌జెండర్ హబీబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..నా కమ్యూనిటీని గర్వించేలా చేశాను. నేను విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం ప్రతిక్షణం తపనపడ్డా. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తాను తనలాంటి వాళ్లందరికీ ఒక రోల్‌మోడల్‌గా ఉండాలని కోరుకున్నా. సమాజంలో తమ పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడేలా శక్తిమంతం చేసేందుకు దీన్ని ఒక ఫ్లాట్‌ఫాంగా చేయాలనుకుంటున్నా. నిబద్ధత, బలం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తన ధ్యేయం అని పేర్కొంది రిక్కీ. మిస్ నెదర్లాండ్స్ సంస్థ నా వెనుక ఉండటం వల్లే ఈ విజయం సాధించగలిగానని సంతోషంగా చెబుతోంది రిక్కీ. (చదవండి: కెమెరా లాక్కున్న ఆక్టోపస్..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది) -
క్వాలిఫయర్స్ టీమ్ ఆఫ్ ది టోర్నీ ప్రకటన.. విండీస్ నుంచి ఒక్కరు కూడా లేరు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నీని ఐసీసీ కొద్ది సేపటి కిందట ప్రకటించింది. ఈ జట్టులో టోర్నీ విజేత శ్రీలంక నుంచి ముగ్గురు, రన్నరప్ నెదర్లాండ్స్ నుంచి ముగ్గురు, టోర్నీ ఆధ్యాంతం సూపర్‌గా రాణించిన జింబాబ్వే నుంచి ముగ్గురు, సంచలన విజయాలు నమోదు చేసిన స్కాట్లాండ్ నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టులో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. సూపర్ సిక్స్ దశలో విండీస్ ఐదో స్థానానికి పరిమితం కావడంతో ఐసీసీ ఆ జట్టును పరిగణలోకి తీసుకోలేదు. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (7 మ్యాచ్‌ల్లో 350 పరుగులు, 2 సెంచరీలు), షాయ్ హోప్ (7 మ్యాచ్‌ల్లో 341 పరుగులు, సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) సత్తా చాటినా, వీరిని సైతం ఐసీసీ విస్మరించింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (శ్రీలంక, 417 పరుగులు, 2 సెంచరీలు), విక్రమ్‌జీత్ సింగ్ (నెదర్లాండ్స్, 326, సెంచరీ)లను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో బ్రాండెన్ మెక్‌ముల్లెన్ (స్కాట్లాండ్, 364, 2 సెంచరీలు, 13 వికెట్లు), నాలుగో స్థానంలో క్వాలిఫయర్స్ టాప్ స్కోరర్ సీన్ విలియమ్స్ (జింబాబ్వే, 600, 3 సెంచరీలు), ఐదో స్థానంలో యువ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్, 285, సెంచరీ, 15 వికెట్లు), ఆరో ప్లేస్‌లో సికందర్ రజా (జింబాబ్వే, 325, సెంచరీ, 9 వికెట్లు), ఏడో స్థానంలో స్కాట్ ఎడ్వర్డ్స్ (నెదర్లాండ్స్, 314, 4 అర్ధసెంచరీలు), స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా క్వాలిఫయర్స్ లీడింగ్ వికెట్ టేకర్లు హసరంగ (22 వికెట్లు), తీక్షణ (21) (శ్రీలంక), ఫాస్ట్ బౌలర్లుగా క్రిస్ సోల్ (స్కాట్లాండ్, 11 వికెట్లు), రిచర్డ్ నగరవ (జింబాబ్వే, 14 వికెట్లు)లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్‌గా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను ఎంపిక చేసింది. -
అజేయ లంక.. క్వాలిఫయర్స్ ఫైనల్లో జయకేతనం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక అజేయ జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని శ్రీలంక.. వన్డేల్లో తమ విజయ పరంపరను కొనసాగించింది. ఈ ఫార్మాట్లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన శ్రీలంక.. ఇవాళ (జులై 9) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, క్వాలిఫయర్స్ విజేతగా నిలిచింది. 🇦🇪 ✅ 🇴🇲 ✅ 🍀 ✅ 🏴 ✅ 🇳🇱 ✅ 🇿🇼 ✅ 🌴 ✅ 🏆 ✅ 🙏 Namaste India ✅#LionsRoar #CWC23 pic.twitter.com/nO7U14F9ky — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లంక బౌలర్లు చెలరేగిపోయారు. మహేష్ తీక్షణ (6.3-1-31-4), దిల్షన్ మధుశంక (7-1-18-3), హసరంగ (7-1-35-2) నెదర్లాండ్స్ పతనాన్ని శాసించారు. 🔥 Another fiery spell of fast bowling by Dilshan Madushanka! 💪🏏#LionsRoar #CWC23 pic.twitter.com/tCwDdA6ojw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్‌జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. He is unstoppable! 💪 Another match-winning spell by Maheesh Theekshana! 🏏🎉🔥#LionsRoar pic.twitter.com/FY0YwfMAwg — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. తీక్షణ, మధుశంక, హసరంగ ధాటికి 23.3 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (33), వాన్ బీక్ (20 నాటౌట్), విక్రమ్‌జీత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మధుశంకకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం రాణించిన జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
శ్రీలంకను వణికించిన నెదర్లాండ్స్ బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే కట్టడి
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023 ఫైనల్లో నెదర్లాండ్స్ బౌలర్లు లంకేయులను కట్టడి చేశారు. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంక జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు శ్రీలంకను ఆలౌట్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్‌జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓ దశలో (35.3 ఓవర్లలో 180/3) పటిష్ట స్థితిలో ఉండింది. అయితే ఆ జట్టు 10 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాదించిన శ్రీలంక, నెదర్లాండ్స్.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఇదివరకే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు.. భారత్ సహా 8 జట్లతో తలపడతాయి. క్వాలిఫయర్స్‌లో రెండో బెర్తు కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ల నుంచి తీవ్రపోటీ ఎదుర్కొన్న నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరి, ఇక్కడ ఓటమి ఎదరుగని శ్రీలంకకు చుక్కలు చూపించింది. లంక నిర్ధేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ఛేదించగలిగితే చరిత్ర సృష్టించినట్లవుతుంది. -
Dutch Crisis: డచ్ సర్కార్ ఎందుకు కుప్పకూలినట్లు?
పద్దెనిమిది నెలల పాలన తర్వాత అనూహ్య పరిణామాలతో.. సంకీర్ణ ప్రభుత్వం చీలిపోయి నెదర్లాండ్స్ ప్రభుత్వం కుప్పకూలింది. డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే(56) తన రాజీనామాను స్వయంగా ప్రకటించారు. కీలకమైన విషయంలో కూటమి ప్రభుత్వంలోని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వస్తోందని ప్రకటించారాయన. ఇంతకీ ఆ కీలకమైన అంశం ఏంటంటే.. నెదర్లాండ్స్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం.. వలసల సమస్య. ఇమ్మిగ్రేషన్ పాలసీపై ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా ఒక ఒప్పందానికి కూటమి పార్టీలు ముందుకు రాకపోవడంతో గందరగోళనం నెలకొని.. రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. నెదర్లాండ్స్‌లో దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని రుట్టే కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. వార్ జోన్ల నుంచి వచ్చే శరణార్థుల సంఖ్యను 200 మందికి మాత్రమే పరిమితం చేసేందుకు మొగ్గు చూపించారాయన. ఈ ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం(రుట్టేIV)లోని D66, క్రిస్టియన్ యూనియన్ పార్టీలు అంగీకరించలేదు. ఇవి చిన్న పార్టీలే అయినా.. ప్రజల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. అయితే రుట్టే సొంత పార్టీ పీపుల్స్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ అండ్ డెమొక్రసీ మాత్రం శరణార్థుల సంఖ్యను పరిమితం చేసేందుకే మొగ్గుచూపించింది. అధిక వలసలతో దేశంపై ఆర్థిక భారం పడుతోందని.. కట్టడి కోసం యత్నించాలని సూచిస్తూ వచ్చింది. మిత్ర పక్షాలు మాత్రం శరణార్థులను కట్టడి చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపబోమని స్పష్టం చేశాయి. ఈ భేదాభిప్రాయాలు కాస్త తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. తక్షణ ఎన్నికలు జరపాల్సిందే! ప్రధాని రుట్టే.. శుక్రవారం తన రాజీనామా ప్రకటించారు. తన రాజీనామాను కింగ్ విల్లెమ్ అలెగ్జాండర్‌కు సమర్పించారు. డచ్ ఎన్నికల సంఘం.. నవంబర్ మధ్యలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రకటన చేసింది. దీంతో అప్పటిదాకా రుట్టే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, ప్రతిపక్షాలు మాత్రం తక్షణ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే కూటమి ప్రభుత్వం ద్వారా తాము అధికారంలో కూర్చుంటామని చెబుతున్నాయి. మార్క్ రుట్టే.. 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. నెదర్లాండ్స్‌కు సుదీర్ఘంగా ప్రధాన మంత్రిగా కొనసాగిన వ్యక్తాయన. 2010 నుంచి ఆయన ప్రధాని పదవిలో ఉన్నారు. 2012, 2017, 2021.. ఎన్నికల్లోనూ ఆయన ప్రధానిగా ప్రమాణం చేశారు. 2021లో 150 సీట్లకుగానూ 34 సీట్లు గెల్చుకుని.. డీ66, సీయూ, సీడీఏ పార్టీల సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. -
#BasDeLeede: తండ్రికి తగ్గ తనయుడు..
ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టు ఐదోసారి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1996, 2003, 2007, 2011లో నాలుగుసార్లు డచ్ జట్టు వన్డే వరల్డ్‌కప్ ఆడింది. ఈ నాలుగు సందర్భాల్లో మూడుసార్లు తన జట్టును వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అతనే టిమ్ డీ లీడే.. ఈ పేరు మీకు ఎక్కువగా పరిచయం లేకపోవచ్చు. కానీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం సూపర్ సిక్స్‌లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఒకడి పేరు బాగా మార్మోగిపోయింది. అతనే బాస్ డీ లీడే. బౌలింగ్‌లో ఐదు వికెట్లు.. బ్యాటింగ్‌లో 123 పరుగులు వీరోచిత సెంచరీ.. వెరసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తన జట్టును వన్డే వరల్డ్‌కప్ ఆడే అర్హతను సాధించిపెట్టాడు. 278 పరుగులు లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలోనే చేధించిన డచ్ జట్టు క్వాలిఫయర్-2గా.. పదో జట్టుగా వన్డే వరల్డ్‌కప్‌లోకి అడుగుపెట్టింది. మరి ఒంటిచేత్తో నెదర్లాండ్స్‌ను వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేలా చేసిన బాస్ డీ లీడే.. ఎవరో కాదు.. పైన మనం చెప్పుకున్న టిమ్ డీ లీడే కుమారుడే. బాస్ డీ లీడే తన వీరోచిత పోరాటంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ నెదర్లాండ్స్ వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు అర్హత సాధించిపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక టిమ్ డీ లీడే 1996లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 11 ఏళ్ల కెరీర్లో కేవలం వన్డే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన టిమ్ డీ లీడే 29 మ్యాచ్‌ల్లో 400 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2018లో నేపాల్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బాస్ డీ లీడే అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు. మిడిలార్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే బాస్ డీ లీడే మంచి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 30 వన్డేల్లో 765 పరుగులతో పాటు 24 వికెట్లు, 31 టి20ల్లో 610 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 27 వికెట్లు పడగొట్టాడు. కాగా స్కాట్లాండ్తో మ్యాచ్‌లో విజయం అనంతరం ఐసీసీ నెదర్లాండ్స్‌కు అభినందనలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసిది. ఆ ఫోటోలో బాస్ డీ లీడే.. తన తండ్రి టిమ్ డీ లీడేను గుర్తుచేస్తూ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని ఐసీసీ వివరిస్తూ తండ్రికి తగ్గ తనయుడు.. బాస్ డీ లీడే సన్నాఫ్ టిమ్ డీ లీడే అంటూ క్యాప్షన్ జత చేసింది. Tim de Leede, Bas de Leede 🏏 Like father, like son 🇳🇱 #CWC23 More: https://t.co/qguNPPA8ai pic.twitter.com/KGECQ1yt5s — ICC (@ICC) July 7, 2023 చదవండి: #NED Vs SCO: ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత Bas De Leede: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజం సరసన.. -
వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్.. భారత షెడ్యూల్ ఇలా..!
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే పదో జట్టుగా నెదర్లాండ్స్ నిన్ననే (జులై 6) తమ బెర్తును ఖరారు చేసుకుంది. క్వాలిఫయర్స్ పోటీల్లో నిన్న స్కాట్లాండ్పై విజయం సాధించడం ద్వారా డచ్ టీమ్ మెగా టోర్నీలో పాల్గొనే సువర్ణావకాశాన్ని దక్కించుకుంది. దీనికి ముందు ఇదే క్వాలిఫయర్స్‌లో సత్తా చాటడం ద్వారా శ్రీలంక కూడా వరల్డ్‌కప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. మొత్తంగా క్వాలిఫయర్స్ పోటీల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయర్-1గా శ్రీలంక, క్వాలిఫయర్-2గా నెదర్లాండ్స్ నిలిచాయి. క్వాలిఫయర్స్ ఫైనల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఈ జట్ల చేరిక తర్వాత వరల్డ్‌కప్ షెడ్యూల్‌కు తుది రూపు వచ్చింది. మెగా టోర్నీలో భారత్ ఆడబోయే మ్యాచ్‌లపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. 7 మ్యాచ్‌లు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యధాతథంగా జరుగనుండగా.. నవంబర్ 2న ముంబై వేదికగా భారత్‌తో తలపడబోయే ప్రత్యర్ధిగా నెదర్లాండ్స్, నవంబర్ 11న బెంగళూరు వేదికగా జరుగబోయే మ్యాచ్‌లో భారత ప్రత్యర్ధిగా శ్రీలంక జట్లు నిలువనున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల్లోనూ ఏయే జట్లు తలపడునున్నది కూడా కన్ఫర్మ్ అయ్యింది. మొత్తంగా క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 జట్లు ఖరారు కావడంతో వరల్డ్‌కప్ షెడ్యూల్ తుది రూపు సంతరించుకుంది. భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా) నవంబర్ 11: ఇండియా వర్సెస్ శ్రీలంక (బెంగళూరు) ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌ల వివరాలు.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ -
ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో
CWC Qualifiers 2023: వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు నెదర్లాండ్స్ తమ చివరి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై తప్పనిసరిగా గెలవాలి. లక్ష్యం 278 పరుగులు... అదీ 44 ఓవర్లలో సాధిస్తేనే బెర్త్ దక్కుతుంది. అంతకంటే ఒక్క బంతి ఎక్కువ తీసుకొని మ్యాచ్ గెలిచినా లాభం లేదు. స్కాట్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తక్కువ వ్యవధిలో ఒక్కో వికెట్ కోల్పోతూ వచ్చిన జట్టు ఒక దశలో 163/5 వద్ద నిలిచింది. 79 బంతుల్లోనే మరో 115 పరుగులు కావాలి. ఇలాంటి స్థితిలో బాస్ డి లీడె ఒక్కసారిగా చెలరేగిపోయాడు. తర్వాతి 40 బంతుల్లోనే 76 పరుగులు సాధించి జట్టుకు సంచలన విజయం అందించాడు. డి లీడె శతకానికి తోడు జుల్ఫికర్ అండగా నిలవడంతో నెదర్లాండ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరి ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ‘సూపర్ సిక్స్’ దశలో జింబాబ్వేను ఓడించి ఆ జట్టును వరల్డ్ కప్‌కు దూరం చేసి తమ అవకాశాలు మెరుగుపర్చుకున్న స్కాట్లాండ్ అనూహ్య ఓటమితో నిష్క్రమించింది. వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించడం ఇది ఐదోసారి. 2011 తర్వాత మళ్లీ భారత్‌లోనే ఆ జట్టు బరిలోకి దిగుతోంది. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2003 వన్డే వరల్డ్ కప్... పార్ల్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 68 పరుగుల తేడాతో ఓడింది. అయితే సచిన్ టెండూల్కర్ సహా 4 వికెట్లు తీసిన టిమ్ డి లీడె ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతని కొడుకే ఈ బాస్ డి లీడె. టోర్నీ ఆసాంతం నిలకడైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను జట్టును ముందుకు నడపడంలో కీలకపాత్ర పోషించాడు. 285 పరుగులు చేయడంతో పాటు డి లీడె 15 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రధాన ఆటగాళ్లు తప్పుకొన్నా.. కౌంటీల్లో ఒప్పందాల కారణంగా పలువురు ప్రధాన ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నా... డి లీడె మాత్రం రెండిటిలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్నే ఎంచుకున్నాడు. సీనియర్లు లేకపోయినా స్ఫూర్తిదాయక ఆటతో డచ్ బృందం సత్తా చాటింది. గ్రూప్ దశలో జింబాబ్వే చేతిలో ఓడినా అమెరికా, నేపాల్‌పై సునాయాస విజయాలు సాధించింది. విండీస్‌తో మ్యాచ్ ఆ జట్టు స్థాయిని చూపించింది. 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ తడబడకుండా స్కోరు సమం చేయగలిగింది. తేజ అద్భుతంగా ఆడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తేజ నిడమనూరు అద్భుత సెంచరీతో చెలరేగగా, కీలకమైన సూపర్ ఓవర్లో వాన్ బీక్ 30 పరుగులు కొట్టి జట్టును గెలిపించాడు. ‘సూపర్ సిక్స్’ దశలో ఒమన్‌పై భారీ విజయం జట్టుకు మేలు చేయగా, ఇప్పుడు స్కాట్లాండ్పై గెలుపు ఆ జట్టును ప్రధాన టోరీ్నకి చేర్చింది. 4 అర్ధ సెంచరీలు చేసిన స్కాట్ ఎడ్వర్డ్స్, మరో సెంచరీ చేసిన విక్రమ్‌జిత్ సింగ్‌తో పాటు బౌలింగ్‌లో వాన్ బీక్, ర్యాన్ క్లీన్ కీలక పాత్ర పోషించారు. ‘భారత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది నా కల’ అని తేజ కొన్నాళ్ల క్రితం ‘సాక్షి’తో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అతను భారత్‌పైనే వరల్డ్ కప్ మ్యాచ్ ఆడబోతుండటం విశేషం. నవంబర్ 11న బెంగళూరులో భారత్‌తో తలపడే నెదర్లాండ్స్... అక్టోబర్ 6న తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో హైదరాబాద్‌లో ఆడుతుంది. చదవండి: Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్! వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
నెదర్లాండ్స్ ఆశలు సజీవం
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ నిలిచింది. సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 74 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. వర్షంవల్ల 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా నెదర్లాండ్స్ 48 ఓవర్లలో 7 వికెట్లకు 362 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (109 బంతుల్లో 110; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. వెస్లీ బరెసి (65 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ భాగ్యాన్ని త్రుటిలో కోల్పోయాడు. తర్వాత మళ్లీ వానతో ఒమన్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఒమన్ 44 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులే చేసింది. అయాన్ ఖాన్ (92 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 2) ఒంటరి పోరాటం చేశాడు. నేడు జింబాబ్వే గెలిస్తే... ఇప్పటికే శ్రీలంక జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారుకాగా... రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రేసులో ఉన్నాయి. ఈరోజు స్కాట్లాండ్తో తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్ విజయం సాధిస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ల మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఖరారవుతుంది. -
క్రికెట్ చచ్చిపోతుంది.. ప్రపంచకప్ అంటే పేరుకు తగ్గట్టుగా ఉండాలి..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఘోర పరాజయాలు ఎదుర్కొని, తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో క్రికెట్ సర్కిల్స్‌లో ప్రపంచకప్ అర్హతలకు సంబంధించి పలు ఆసక్తికర చర్చలు తెరపైకి వచ్చాయి. ప్రపంచకప్ అంటే పేరుకు తగ్గట్టుగా కనీసం 16 దేశాలతో పోటీలు నిర్వహించాలని, అలా కాకుండా 4 ఏళ్లకు ఓ సారి జరిగే మెగా టోర్నీని 10 జట్లకే పరిమితం చేసి, విండీస్‌లా మేలైన జట్లకు అన్యాయం చేయడం సమంజసం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ మైబుర్గ్ సైతం చెప్పుకొచ్చాడు. వాస్తవ విషయం ఏంటంటే.. పరిమిత జట్లతో ప్రపంచకప్ నిర్వహించడం వల్ల క్రికెట్ చచ్చిపోతుంది. ప్రపంచకప్ పేరుకు తగ్గట్టుగా ప్రపంచం నలుమూలల నుంచి జట్లకు ప్రాతినిధ్యం లభించాలి. మెగా టోర్నీలో కనీసం 16 జట్లైనా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. అన్ని క్రీడల మెగా టోర్నీల్లో జట్ల సంఖ్య పెరుగుతుంటే క్రికెట్లో మాత్రం జట్లను తగ్గించుకుంటూ వస్తున్నారు. వెస్టిండీస్ లాంటి జట్టు వరల్డ్‌కప్ ఆడటం లేదన్న విషయం తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అంటూ స్టీఫెన్ మైబుర్గ్ అన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. Spare your thoughts on 10 teams at the ODI World Cup main event✍️ 📸: ICC#ICCWorldCupQualifier #WestIndies pic.twitter.com/WRAaBfXQJI — CricTracker (@Cricketracker) July 3, 2023 కాగా, ప్రస్తుతానికి (జులై 3) వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీల ద్వారా శ్రీలంక వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ మధ్య పోటీ నెలకొని ఉంది. రేపు ఈ ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో రెండో బెర్త్‌పై కూడా దాదాపుగా క్లారిటీ రానుంది. సూపర్ సిక్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు క్వాలిఫయర్స్ ఫైనల్‌కు చేరడంతో పాటు ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ సహా 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఇటీవలే వరల్డ్‌కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది.