
అమ్‌స్టర్‌డ్యామ్: మిస్ నెదర్లాండ్స్ కిరీటాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ రిక్కీ వలేరి కొల్లే గెలుచుకుంది. అందగత్తెల పోటీలో ట్రాన్స్‌జెండర్ మహిళ ఈ ఘనత సాధించడం నెదర్లాండ్స్‌లో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ విధంగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది.
22 ఏళ్ల రిక్కీ వలేరి కొల్లే ప్రముఖ మోడల్స్ నుంచి ఎదురైన పోటీని అవలీలగా అధిగమించింది. విజేతగా నిలిచింది. మిస్ నెదర్లాండ్స్ టైటిల్ సాధించడం గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసింది. మహిళలకు ఆదర్శం కావాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. ఎల్‌సాల్వేడార్‌లో జరుగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో రిక్కీ నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment