
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్‌లో సోమవారం భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత మహిళల జట్టు 2–4 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 2–3 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోయాయి.
నెదర్లాండ్స్‌తో జరిగిన పోరు ద్వారా భారత జట్టు గోల్‌కీపర్ సవితా పూనియా తన కెరీర్‌లో 300 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. వందన కటారియా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ప్లేయర్‌గా సవిత గుర్తింపు పొందింది.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత్ తరఫున ఉదిత (18వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున ఎమ్మా రెజ్నెన్ (7వ నిమిషంలో), ఫే వాన్‌డెర్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... ఫెలిస్ అల్బెర్స్ (34వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది.
ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టుకు అభిషేక్ (18వ నిమిషంలో), సుఖ్‌జీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇంగ్లండ్ తరఫున జేకబ్ పేటన్ (15వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... సామ్ వార్డ్ (19వ, 29వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment