FIH champions
-
‘టాప్’లోనే టీమిండియా
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత్ తమ సత్తా చాటుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో 21 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ, 43వ ని.లో), మన్‌ప్రీత్ సింగ్ (15వ, 26వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా హర్మన్‌ప్రీత్ కెరీర్లో 100 గోల్స్ మైలురాయిని దాటాడు. ఇంగ్లండ్ తరఫున లియామ్ సాన్ఫోర్డ్ (7వ ని.లో), డేవిడ్ కాన్డన్ (39వ ని.లో), సామ్ వార్డ్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్ ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్‌లోనే జర్మనీతో రెండు మ్యాచ్‌ల్లో తలపడుతుంది. -
అజేయ భారత్
భువనేశ్వర్: సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చలాయించిన భారత పురుషుల హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5–1 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ, 25వ నిమిషాల్లో), వరుణ్ కుమార్ (2వ, 49వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ సాధించగా... వివేక్ ప్రసాద్ (35వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున రిచర్డ్ పౌట్జ్ (53వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. తుది ఫలితంతో సంబంధం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 4–2తో అమెరికాను ఓడించింది. అదే జోరు... లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్... సెమీఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ను చిత్తుగా ఓడించింది. అదే జోరును ఫైనల్లోనూ కనబరిచింది. ఆట మొదలైన రెండో నిమిషంలోనే వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను, పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చడంతో భారత ఆధిక్యం 3–0కి పెరిగింది. ఆ తర్వాత భారత్ అదే దూకుడు కొనసాగించగా... దక్షిణాఫ్రికా డీలా పడింది. ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత్ 35 గోల్స్ సాధించి, కేవలం నాలుగు గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. -
చివరి మ్యాచ్ ‘డ్రా’
చన్‌చన్‌దేవి రెండు గోల్స్ భారత్, ఐర్లాండ్ మహిళల హాకీ సిరీస్ డబ్లిన్: ఎఫ్ఐహెచ్ చాంపియన్స్ చాలెంజ్ టోర్నీ సన్నాహాల్లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌ను టీమిండియా 2-2తో ‘డ్రా’గా ముగించింది. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ క్రీడాకారిణి చన్‌చన్‌దేవి రెండు గోల్స్ చేసింది. అనా ఒ ఫ్లాంగన్ ఐర్లాండ్‌కు రెండు గోల్స్ అందించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరుజట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. ఏడో నిమిషంలో ఐర్లాండ్ ప్లేయర్ ఒ ఫ్లాంగన్ గోల్ చేయగా, 31వ నిమిషంలో చన్‌చన్‌దేవి (భారత్) స్కోరును సమం చేసింది. రెండో అర్ధభాగంలో గోల్స్ కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే పెనాల్టీ కార్నర్‌ను చక్కని గోల్‌గా మలిచిన చన్‌చన్‌దేవి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. కానీ 64వ నిమిషంలో ఒ ఫ్లాంగన్ రెండో గోల్ సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 3-1తో, రెండో మ్యాచ్‌లో 2-1తో నెగ్గింది.