
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత్ తమ సత్తా చాటుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో 21 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (26వ, 43వ ని.లో), మన్‌ప్రీత్ సింగ్ (15వ, 26వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఈ మ్యాచ్ ద్వారా హర్మన్‌ప్రీత్ కెరీర్‌లో 100 గోల్స్ మైలురాయిని దాటాడు. ఇంగ్లండ్ తరఫున లియామ్ సాన్‌ఫోర్డ్ (7వ ని.లో), డేవిడ్ కాన్‌డన్ (39వ ని.లో), సామ్ వార్డ్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్ ఈనెల 14, 15వ తేదీల్లో భువనేశ్వర్‌లోనే జర్మనీతో రెండు మ్యాచ్‌ల్లో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment