
మస్కట్: పురుషుల హాకీ ‘ఫైవ్–ఎ–సైడ్’ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. జమైకాతో జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 13–0 గోల్స్ తేడాతో గెలిచింది.
భారత్ తరఫున మణీందర్ సింగ్ (28వ, 29వ ని.లో), మంజీత్ (5వ, 24వ ని.లో), రహీల్ మొహమ్మద్ (16వ, 27వ ని.లో), మన్‌దీప్ మోర్ (23వ, 27వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. ఉత్తమ్ సింగ్ (5వ ని.లో), రాజ్‌భర్ పవన్ (9వ ని.లో), గుర్జోత్ సింగ్ (14వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. పూల్ ‘బి’లో ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment