భారత్‌ ఖాతాలో వరుసగా నాలుగో​ విజయం | Asian Champions Trophy Hockey: India Beat South Korea For Fourth Consecutive Win | Sakshi
Sakshi News home page

Asian Champions Trophy Hockey: భారత్‌ ఖాతాలో వరుసగా నాలుగో​ విజయం

Published Thu, Sep 12 2024 7:09 PM | Last Updated on Thu, Sep 12 2024 7:34 PM

Asian Champions Trophy Hockey: India Beat South Korea For Fourth Consecutive Win

ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీమెంట్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. దక్షిణ కొరియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-1 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు, స్ట్రయికర్‌ అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ ఓ గోల్‌ చేశారు. కొరియా చేసిన ఏకైక గోల్‌ను జిహున్‌ యంగ్‌ సాధించాడు. భారత్‌ తమ తదుపరి లీగ్‌ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. 

ఈ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 14న జరుగనుంది. భారత్‌ ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో చైనాపై 3-1 గోల్స్‌ తేడాతో.. రెండో మ్యాచ్‌లో జపాన్‌పై 5-1 గోల్స్‌ తేడాతో.. మూడో మ్యాచ్‌లో మలేసియాపై 8-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. భారత్‌ ఈ టోర్నీలో జయకేతనం ఎగురవేసి రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి టైటిల్‌ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement