భారత్‌పై అక్కసు తీర్చుకున్న పాక్‌ హాకీ జట్టు! | Pakistan Hockey Players Wave Chinese Flag During India VS China Asian Champions Trophy Final | Sakshi
Sakshi News home page

భారత్‌పై అక్కసు తీర్చుకున్న పాక్‌ హాకీ జట్టు!

Published Wed, Sep 18 2024 8:04 AM | Last Updated on Wed, Sep 18 2024 9:31 AM

Pakistan Hockey Players Wave Chinese Flag During India VS China Asian Champions Trophy Final

పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ చైనాను 1-0 గోల్స్‌ తేడాతో ఓడించి ఐదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై న్యారో మార్జిన్‌తో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన తుది సమరంలో జుగ్‌రాజ్‌ సింగ్‌ 51వ నిమిషంలో గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. భారత్‌ ఇదే లీడ్‌ను చివరి వరకు కొనసాగించి విజేతగా నిలిచింది.

చైనాకు మద్దతుగా పాక్‌ ఆటగాళ్లు
ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు చైనాకు మద్దతుగా నిలిచి అబాసుపాలయ్యారు. పాక్‌ ఇదే టోర్నీ సెమీఫైనల్లో చైనా చేతిలో ఘోరంగా ఓడింది. అయినా పాక్‌​ ఆటగాళ్లు నిసిగ్గుగా చైనా జెండాలు పట్టుకుని వేలాడారు. వారు ఏకంగా చెంపలపై చైనా జెండా స్టిక్కర్లు అంటించుకుని మద్దతు తెలిపారు. 

తాము మద్దతు తెలిపినా చైనా ఓడిపోవడంతో పాక్‌ ఆటగాళ్లు దిగాలుగా ఉండిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతుండటంతో భారత అభిమానులు పాక్‌ను ఆటాడేసుకుంటున్నారు. వారి బుద్ధే అంతా చీవాట్లు పెడుతున్నారు.  

కాగా, సెమీస్‌లో చైనా చేతిలో ఓడిన పాక్‌ మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కొరియాపై 5-2 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన అనంతరమే పాక్‌ ఆటగాళ్లు నేరుగా వచ్చి భారత్‌-చైనా ఫైనల్‌ మ్యాచ్‌ వీక్షించారు. 

చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement