asia champions trophy
-
భారత్‌పై అక్కసు తీర్చుకున్న పాక్ హాకీ జట్టు!
పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చైనాను 1-0 గోల్స్ తేడాతో ఓడించి ఐదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై న్యారో మార్జిన్‌తో విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన తుది సమరంలో జుగ్రాజ్ సింగ్ 51వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. భారత్ ఇదే లీడ్‌ను చివరి వరకు కొనసాగించి విజేతగా నిలిచింది.చైనాకు మద్దతుగా పాక్ ఆటగాళ్లుఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు చైనాకు మద్దతుగా నిలిచి అబాసుపాలయ్యారు. పాక్ ఇదే టోర్నీ సెమీఫైనల్లో చైనా చేతిలో ఘోరంగా ఓడింది. అయినా పాక్ ఆటగాళ్లు నిసిగ్గుగా చైనా జెండాలు పట్టుకుని వేలాడారు. వారు ఏకంగా చెంపలపై చైనా జెండా స్టిక్కర్లు అంటించుకుని మద్దతు తెలిపారు. తాము మద్దతు తెలిపినా చైనా ఓడిపోవడంతో పాక్ ఆటగాళ్లు దిగాలుగా ఉండిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతుండటంతో భారత అభిమానులు పాక్‌ను ఆటాడేసుకుంటున్నారు. వారి బుద్ధే అంతా చీవాట్లు పెడుతున్నారు. కాగా, సెమీస్‌లో చైనా చేతిలో ఓడిన పాక్ మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కొరియాపై 5-2 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన అనంతరమే పాక్ ఆటగాళ్లు నేరుగా వచ్చి భారత్-చైనా ఫైనల్ మ్యాచ్ వీక్షించారు. India's Asian Champions Trophy heroes rewarded! 🏆🇮🇳The victorious Indian Men's Hockey Team gets a well-deserved bonus for their record 5th title win! Each player will receive ₹3 lakhs, while support staff members will be awarded ₹1.5 lakhs each.This well-deserved reward… pic.twitter.com/cvI8avkpvx— Hockey India (@TheHockeyIndia) September 17, 2024చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా -
కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో
ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు మరోసారి దుమ్ములేపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఏకంగా ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. చైనా వేదికగా సోమవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సౌత్ కొరియాను 4-1తో చిత్తు చేసింది. ఆద్యంతం ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ.. గెలుపు జెండా ఎగురవేసింది. భారత ఆటగాళ్లలో ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ చెరొక గోల్ చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో మెరిశాడు. ఆట తొలి క్వార్టర్ చివరలో ఉత్తమ్ భారత్‌కు తొలి గోల్ అందించగా.. హర్మన్‌ప్రీత్ రెండో క్వార్టర్ ఆరో నిమిషంలో పెనాల్టీ కార్నర్ కిక్‌ను గోల్‌గా మలిచాడు. కొరియా ఒక గోల్ కొట్టిందిఆ తర్వాత జర్మన్ గోల్ సాధించగా.. మూడో క్వార్టర్లో హర్మన్ మరోసారి గోల్‌తో అదరగొట్టాడు. ఈ మూడూ కూడా ఫీల్డ్ గోల్సే(ప్రత్యర్థి గోల్‌పోస్టు ముందున్న స్ట్రైకింగ్ సర్కిల్ నుంచి) కావడం విశేషం. అయితే, మూడో క్వార్టర్‌లోనే కొరియా కూడా గోల్ కొట్టి పుంజుకునేందుకు ప్రయత్నించింది. అయితే, భారత డిఫెన్స్ వారిని కట్టడిచేయడంతో పరాజయం తప్పలేదు. భారత్ అజేయంగా ఫైనల్కుకాగా ఈ ఆసియా చాంపియన్స్ తాజా ఎడిషన్‌లో భారత్ ఇంత వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఇక లీగ్ దశలో చైనాను 3-0తో, జపాన్ను 5-1తో, మలేషియాను 8-1తో, పాకిస్తాన్‌ను 2-1తో ఓడించింది. సెమీ ఫైనల్లో కొరియాను 4-1తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో ఆతిథ్య చైనాతో తలపడనుంది.చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన చైనా.. తొలిసారి ఫైనల్‌కుPicture perfect team goal by the #MenInBlue 🤩#TeamIndia sizzle & notch up their 3️⃣rd with the finish from Jarmanpreet Singh 🔥Watch 🇮🇳 🆚 🇰🇷, LIVE NOW on #SonyLIV 📲 pic.twitter.com/Gw3v6A04ZW— Sony LIV (@SonyLIV) September 16, 2024 -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన చైనా
ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో చైనా సంచలన విజయం సాధించింది. సెమీస్‌లో పాకిస్తాన్‌ను మట్టికరిపించి.. తొలిసారి ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఉత్కంఠగా సాగిన షూటౌట్లో గోల్‌కీపర్ సైయూ వాంగ్ తన అద్భుత ప్రదర్శనతో చైనాకు ఈ చిరస్మరణీయ గెలుపు అందించాడు.సెమీస్‌లో ఆ నాలుగు జట్లుమరోవైపు.. పాకిస్తాన్‌కు కాంస్య పతక పోరు రూపంలో మెడల్ గెలిచేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. చైనాలోని హులున్‌బుయిర్‌లో గల మోకీ హాకీ ట్రెయినింగ్ బేస్‌లో ఆసియా చాంపియన్స్ హాకీ పోటీలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, చైనా టాప్-4లో నిలిచాయి.1-1తో సమం.. షూటౌట్లో ఫలితంఈ క్రమంలో తొలి సెమీస్‌లో చైనా సోమవారం పాకిస్తాన్‌తో తలపడింది. ఆట 18వ నిమిషంలో డ్రాగ్‌ఫ్లికర్ యువాన్లిన్ లూ గోల్ కొట్టి చైనాకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఐదుసార్లు పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్ కొట్టేందుకు ప్రయత్నించినా.. చైనా డిఫెన్స్ చేసింది. అయితే, 37వ నిమిషంలో అహ్మద్ నదీం అద్భుతంగా ఆడి గోల్ కొట్టగా.. ఆ తర్వాత చైనా మళ్లీ పాకిస్తాన్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు.ఈ నేపథ్యంలో మ్యాచ్ 1-1తో డ్రా కాగా.. షూటౌట్ నిర్వహించారు. చైనా తరఫున బెన్హాయి, చింగాలియాంగ్ లిన్ గోల్స్ కొట్టగా.. పాకిస్తాన్ ఒక్కటీ స్కోరు చేయలేకపోయింది. చైనా గోల్ కీపర్ సైయూ వాంగ్ పాక్ జట్టుకు అడ్డుగోడలా నిలిచి తమ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. షూటౌట్లో చైనా 2-0తో పాకిస్తాన్‌పై గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.మరో సెమీస్‌లో భారత్- కొరియా జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటికే 4-0తో పటిష్ట స్థితిలో నిలిచి ఫైనల్‌కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు పాకిస్తాన్‌తో కాంస్య పతకం కోసం పోటీ పడుతుంది.చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. ఆ షాట్లు ఆడటంలో వాళ్లే బెస్ట్: అశ్విన్ -
భారత్ X పాక్
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్ ఈ టోర్నీలో నాలుగు వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు సాధించింది. టీమిండియా 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా... నాలుగింట రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్ 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సంపాదించింది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఇది నామమాత్రమైన పోరే అయినప్పటికీ మైదానంలో జరిగే సమరం మాత్రం హైవోల్టేజీతో ఉంటుంది. భారత కెపె్టన్ సహా ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పారిస్ పతకం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పటివరకు ఎదురైన అన్ని జట్లను మట్టికరిపించారు. ఆతిథ్య చైనాను 3–0తో చిత్తు చేసిన భారత్ 5–1తో జపాన్‌పై, 8–1తో మలేసియాపై తిరుగులేని విజయాలు సాధించింది. 3–1తో కొరియాను ఓడించిన భారత్ ఇప్పుడు ఇదే జోరుతో దాయాది జట్టును కంగుతినిపించాలని తహతహలాడుతోంది. గతేడాది చైనాలోనే జరిగే హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ 10–2తో పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. గత ఏడాది చెన్నైలో జరిగిన పోరులోనూ భారత్ 4–0తో ఘనవిజయం సాధించింది. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దుర్భేధ్యమైన టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత సులభం కాదు. ప్రపంచంలోనే ఉత్తమ డ్రాగ్ఫ్లికర్లలో ఒకడైన కెపె్టన్ హర్మన్‌ప్రీత్ చిరకాల ప్రత్యరి్థతో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడున్న పాక్ జట్టులోని ఆటగాళ్లను జూనియర్ స్థాయి నుంచే ఎదుర్కొన్న అనుభవం తనకుందని చెప్పాడు. దీంతో వారితో చక్కని అనుబంధం ఏర్పడిందని, సోదరభావంతో మెలుగుతామని అన్నాడు. అయితే మైదానంలోకి దిగగానే ప్రత్యర్థులపై చెలరేగేందుకు సై అంటామని చెప్పుకొచ్చాడు. -
‘హ్యాట్రిక్’ విజయంతో సెమీస్‌లోకి భారత్
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత ఏడాది రన్నరప్ మలేసియా జట్టుతో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 8–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. మలేసియా జట్టుపై భారత్‌కిది అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్ తరపున రాజ్‌కుమార్ పాల్ (3వ, 25వ, 33వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరిజీత్ సింగ్ హుండల్ (6వ, 39వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ ని.లో), ఉత్తమ్ సింగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా జట్టుకు అఖీముల్లా అనూర్ (34వ ని.లో) ఏకైక గోల్ అందజేశాడు. గత ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారి ముఖాముఖిగా పోటీపడ్డాయి. నాటి ఫైనల్లో అర్ధభాగం ముగిసేసరికి 1–3 గోల్స్‌తో వెనుకబడ్డ భారత్ ఆ తర్వాత తేరుకొని చివరకు 4–3 గోల్స్ తేడాతో నెగ్గి విజేతగా అవతరించింది. ఈసారి మాత్రం మలేసియాపై ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే రాజ్‌కుమార్ మలేసియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ చేశాడు. ఆ తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలో భారత్ మరో రెండు గోల్స్ చేసి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్ తమ జోరు కొనసాగించింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో జపాన్‌పై, కొరియా 3–2తో చైనాపై గెలిచాయి. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఆడతుంది. హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత ఏడాది రన్నరప్ మలేసియా జట్టుతో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 8–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. మలేసియా జట్టుపై భారత్‌కిది అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్ తరపున రాజ్‌కుమార్ పాల్ (3వ, 25వ, 33వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరిజీత్ సింగ్ హుండల్ (6వ, 39వ ని.లో) రెండు గోల్స్ చేయగా... జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (22వ ని.లో), ఉత్తమ్ సింగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మలేసియా జట్టుకు అఖీముల్లా అనూర్ (34వ ని.లో) ఏకైక గోల్ అందజేశాడు. గత ఏడాది ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారి ముఖాముఖిగా పోటీపడ్డాయి. నాటి ఫైనల్లో అర్ధభాగం ముగిసేసరికి 1–3 గోల్స్‌తో వెనుకబడ్డ భారత్ ఆ తర్వాత తేరుకొని చివరకు 4–3 గోల్స్ తేడాతో నెగ్గి విజేతగా అవతరించింది. ఈసారి మాత్రం మలేసియాపై ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే రాజ్‌కుమార్ మలేసియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్ చేశాడు. ఆ తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలో భారత్ మరో రెండు గోల్స్ చేసి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్ తమ జోరు కొనసాగించింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో జపాన్‌పై, కొరియా 3–2తో చైనాపై గెలిచాయి. నేడు జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ ఆడతుంది. -
భారత్ శుభారంభం.. చైనాపై ఘన విజయం
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. ఆతిథ్య చైనా జట్టుతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (14వ ని.లో), ఉత్తమ్ సింగ్ (27వ ని.లో), అభిõÙక్ (32వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ 2–2తో... జపాన్, దక్షిణ కొరియా మధ్య మ్యాచ్ 5–5తో ‘డ్రా’గా ముగిశాయి. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది. తొలి విజయంతో భారత్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈనెల 17 వరకు మొత్తం ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ? -
థాయ్‌లాండ్‌తో భారత్ తొలి పోరు
రాంచీ: భారత్ వేదికగా తొలిసారి జరగనున్న మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జరిగే ఈ టోర్నీకి రాంచీ ఆతిథ్యమివ్వనుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలేసియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అక్టోబర్ 27న థాయ్‌లాండ్ జట్టుతో భారత్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. అనంతరం 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్‌తో, నవంబర్ 2న కొరియాతో భారత్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ నవంబర్ 4న, ఫైనల్స్ నవంబర్ 5న జరుగుతాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఆరుసార్లు జరిగింది. భారత్ 2016లో టైటిల్ గెలిచింది. 2010లో మూడో స్థానం పొందగా.. 2013, 2018లో రన్నరప్‌గా నిలిచింది. -
అజేయంగా టైటిల్ పోరుకు భారత్
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన భారత్ శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 5–0 గోల్స్ తేడాతో జపాన్‌పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియా తో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో మలేసియా 6–2తో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి ఈ టోర్నీలో మొదటిసారి ఫైనల్ చేరింది. 2018 ఆసియా క్రీడల సెమీఫైనల్లో చివరిసారి మలేసియా చేతిలో ఓడిన భారత్ ఆ తర్వాత ఈ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడలేదు. 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 6–1తో చైనాపై గెలిచి ఐదో స్థానాన్ని దక్కించుకోగా... చైనా చివరిదైన ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జపాన్‌పై గెలుపుతో హర్మన్‌ప్రీత్ సేన నాలుగో టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీలో లీగ్ దశలో 1–1తో తమని నిలువరించిన జపాన్‌పై టీమిండియా ఎదురు లేని విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లో జరిగిన గత టోర్నీ (2021)లో సెమీస్‌లో ఎదురైన పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. భారత శిబిరం అటాకింగ్‌కు జపాన్ వద్ద బదులే లేకపోయింది. తొలి క్వార్టర్ 0–0తో ముగిసింది. ఆ తర్వాత మూడు క్వార్టర్లు భారత ఆటగాళ్లదే జోరు. ఆకాశ్‌దీప్ సింగ్ (19వ ని.లో), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (30వ ని.లో), సుమిత్ (39వ ని.లో), కార్తీ సెల్వం (51వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ 300 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. -
పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి.. భారత్‌ను నిలువరిస్తేనే సెమీఫైనల్ బెర్త్
చెన్నై: సాధారణంగా దాయాదుల మధ్య హాకీ మ్యాచ్ జరిగినా... క్రికెట్ పోరు జరిగినా... అది ఆ టోర్నీకే ఆసక్తికరమైన సమరమవుతుంది. కానీ ఈసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు బుధవారం తలపడుతున్నప్పటికీ మునుపటిలా ఇది మాత్రం భారత్ పక్షం నుంచి అవసరం, అంతటి ఆసక్తికరమని అనలేం! ఎందుకంటే ఇదివరకే భారత జట్టు అజేయంగా సెమీఫైనల్ చేరింది. పాక్‌తో మ్యాచ్ పూర్తిగా నామమాత్రమైంది. కానీ దాయాదికి మాత్రం ఇది చావోరేవోలాంటి పోరు. ఓడితే మాత్రం సెమీస్ దారులు మూసుకుపోతాయి. కనీసం ‘డ్రా’తో గట్టెక్కితేనే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచే అవకాశముంది. మరోవైపు ముందుకెళ్లడమో, ఇక్కడే ముగించుకోవడమో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కాబట్టి పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. భారత్ ఫామ్, ఈ టోర్నిలో కనబరిచిన దూకుడు, ఆధిపత్యం దృష్ట్యా పాక్ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో! అసాధారణ ఆటతో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే పాక్ గెలిచేందుకు సాధ్యమవుతుంది. లేదంటే ఎదురేలేని భారత్‌ను ఎదురించడం అంత సులభం కానేకాదు. 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో చివరిసారి భారత్‌పై పాకిస్తాన్ గెలిచింది. భారత్–పాక్ మ్యాచ్ కంటే ముందు చైనాతో జపాన్; దక్షిణ కొరియాతో మలేసియా తలపడతాయి. మలేసియా కూడా సెమీఫైనల్ చేరడంతో మిగతా రెండు బెర్త్‌ల కోసం కొరియా, పాకిస్తాన్, జపాన్ రేసులో ఉన్నాయి. ఆసియా క్రీడల్లో ఒకే గ్రూప్‌లో... హాంగ్జౌలో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసి యా క్రీడల్లో హాకీ ఈవెంట్లో భారత్, పాకిస్తాన్‌లు ఒకే గ్రూపులో తలపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో దాయాదులతో పాటు జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్లు ఉన్నాయి. సెపె్టంబర్ 24న జరిగే తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. ఆసియా క్రీడల ఈవెంట్‌కే హై లైట్ కాబోయే ఇండో–పాక్ పోరు సెపె్టంబర్ 30న జరుగుతుంది. టైటిల్ పోరు అక్టోబర్ 6న నిర్వహిస్తారు. మహిళల విభాగంలోనూ భారత్ ‘ఎ’ గ్రూపులో ఉంది. ఇందులో హాంకాంగ్, సింగ పూర్, కొరియా, మలేసియా ఇతర జట్లు కాగా... అమ్మాయిల బృందం 27న తమ తొలి పోరులో సింగపూర్‌తో ఆడుతుంది. -
ఎదురులేని భారత్
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఎదురేలేని భారత్ మూడో విజయాన్ని సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో టీమిండియా 3–2 గోల్స్‌తో దక్షిణ కొరియాపై గెలుపొందింది. భారత్ తరఫున నీలకంఠ శర్మ (6వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (33వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. కొరియా బృందంలో సంగ్‌హ్యూన్ కిమ్ (12వ ని.లో), జిహున్ యంగ్ (58వ ని.లో) చెరో గోల్ చేశారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో భారత్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రేపు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో చైనాపై గెలుపొంది సెమీస్ ఆశల్ని నిలబెట్టుకుంది. మరోవైపు మలేసియా 3–1తో జపాన్ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సంపాదించింది. -
పాక్‌పై నెగ్గిన భారత్.. కాంస్యం కైవసం
పురుషులు హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో భారత్.. పాకిస్తాన్‌ను 4-3 తేడాతో ఓడించి కాంస్యం కైవసం చేసుకుంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా మన్‌ప్రీత్ సింగ్ నిలిచాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ తరపున హర్మన్‌ప్రీత్, అక్షదీప్‌సింగ్, వరుణ్ కుమార్, గుర్‌సాహిబిజిత్ సింగ్‌లు గోల్ చేశారు. చదవండి: BWF Rankings: అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్.. రెండేళ్ల తర్వాత..! ఇక పాకిస్తాన్ తరపున అర్ఫాజ్, అబ్దుల్ రాణా, అహ్మద్ నదీమ్‌లు గోల్ చేశారు. ఇక లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో గ్రూఫ్ టాపర్‌గా నిలిచిన భారత్ సెమీఫైనల్లో మాత్రం జపాన్ చేతిలో చతికిలపడింది. అయితే కాంస్య పతక పోరు కోసం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం భారత్ విజయం సాధించింది. లీగ్ దశలోనూ భారత్ పాకిస్తాన్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. -
Asia Champions Trophy Hockey: సెమీఫైనల్లో ఓటమి పాలైన భారత్
India Lose Semi Final Vs Japan Hockey Asia Champions Trophy.. పురుషుల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పోరు ముగిసింది. జపాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 5-3 తేడాతో పరాజయం పాలైంది. ఇక ఫైనల్ చేరిన జపాన్.. దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఇదే జపాన్ను లీగ్ దశలో 6-0 తేడాతో చిత్తు చేసిన భారత పురుషుల జట్టు మళ్లీ అదే ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగిన లీగ్ దశలో 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో గ్రూఫ్ టాపర్‌గా నిలిచిన భారత్ కీలకమైన సెమీస్‌లో మాత్రం ఒత్తిడికి తలొగ్గి పరాజయం చవిచూసింది. ఇక మూడోస్థానం కోసం భారత్ పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
విజయంతో ముగించాలని...
ఢాకా: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను విజయంతో ముగించేందుకు డిఫెండింగ్ చాంపియన్ భారత హాకీ జట్టు సిద్ధమైంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించిన టీమిండియా నేడు జరిగే తన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. కొరియాతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించిన భారత్... అనంతరం బంగ్లాదేశ్‌పై 9–0తో, పాకిస్తాన్‌పై 3–1తో గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో చివరిసారిగా జపాన్‌తో తలపడిన భారత్ ఆ మ్యాచ్‌లో 5–3 గోల్స్‌తో విజయం సాధించింది. -
ఆట ఏదైనా పాక్‌పై భారత్‌దే పైచేయి
ఢాకా: మూడుసార్లు చాంపియన్ భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో దూకుడు కనబరుస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. దాంతో టోర్నీలో రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం ఏడు పాయింట్లు సాధించిన టీమిండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. భారత వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ (8వ, 53వ నిమిషాల్లో) చేయగా... మరో గోల్‌ను ఆకాశ్‌దీప్ సింగ్ (42వ నిమిషంలో) చేశాడు. పాకిస్తాన్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జునైద్ మన్జూర్ (45వ నిమిషంలో) చేశాడు. గత ఐదేళ్లలో పాక్‌తో జరిగిన 12 మ్యాచ్‌ల్లో భారత్ 11 గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడనుంది. -
పాక్‌పై జయం మనదే
మస్కట్ (ఒమన్): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (24వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (31వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (42వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్‌కు ఇర్ఫాన్ జూనియర్ మొహమ్మద్ (1వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌తో భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ కెరీర్లో 200వ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. పాక్‌పై భారత్‌కిది వరుసగా 11వ విజయం కావడం విశేషం. భారత్ చివరిసారి 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో 1–2తో పాక్ చేతిలో ఓడింది. నేడు జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. -
ఈసారి రన్నరప్‌తో సరి
డాంఘయీ సిటీ (దక్షిణ కొరియా): లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు అసలు సమరంలో మాత్రం తడబడింది. ఫలితంగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సునీత లాక్రా బృందం ఆదివారం జరిగిన ఫైనల్లో 0–1తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో ఫైనల్ చేరిన మన అమ్మాయిలు కొరియా డిఫెన్స్ ఛేదించడంలో విఫలమయ్యారు. మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా ఖాతా తెరవలేకపోయాయి. రెండో క్వార్టర్ ఆరంభం నుంచే ఒత్తిడి పెంచిన ఆతిథ్య కొరియా జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పదే పదే దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో యంగ్సిల్ లీ (24వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేసి కొరియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. భారత స్ట్రయికర్ వందన కటారియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’, లాల్రేమ్సియామికి ‘అప్‌కమింగ్ ప్లేయర్’ పురస్కారాలు దక్కాయి -
ఫైన ల్లో భారత మహిళలు
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో దూసుకెళుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని సాధించి మరో లీగ్ మ్యాచ్ మిగిలుండగానే ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. జపాన్‌లోని కకామిగహరాలో జరుగుతున్న ఈ ఈవెంట్లో సోమవారం మలేసియా జట్టును 5-1 తేడాతో భారత్ ఓడించింది. 15వ నిమిషంలోనే మలేసియా తొలి గోల్ సాధించి ఆధిక్యం సాధించింది. అయితే తొమ్మిది నిమిషాల అనంతరం భారత్ తరఫున పూనమ్ రాణి పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరును సమం చేసింది. ద్వితీయార్థంలో భారత మహిళలు అద్భుత ఆటతీరును కనబరిచారు. నమిత టొప్పో (44వ ని.), రితూ రాణి (52 వ ని.), అమన్‌దీప్ కౌర్ (54వ ని.), దీప్ గ్రేస్ ఎక్కా (65వ ని.) వరుసగా గోల్స్ సాధించిన ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు జపాన్ 5-1తో చైనాను ఓడించి ఫైనల్‌కు చేరింది. భారత్ తన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో గురువారం తలపడుతుంది. శనివారం ఫైనల్ కూడా ఈ రెండు జట్ల మధ్యనే జరుగుతుంది. -
ఆసియా చాంపియన్స్‌ట్రోఫీకి హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ సర్ధారా సింగ్‌కు విశ్రాంతినిచ్చిన హెచ్ఐ సెలక్టర్లు జట్టు పగ్గాలు మన్‌ప్రీత్ సింగ్‌కు అప్పగించారు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ జపాన్‌లోని కకమిగహరలో వచ్చే నెల 2 నుంచి 10 వరకు జరగనుంది. సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్‌లో మన్‌ప్రీత్ జూనియర్ జట్టును విజయపథాన నడిపించాడు. దీంతో అతని సారథ్యంలోని 18 మంది సభ్యుల సీనియర్ జట్టును ఎంపిక చేశారు. ఈ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో నవంబర్ 2న భారత్... చైనాతో తలపడుతుంది. అనంతరం 3న జపాన్, 5న ఒమన్, 7న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోటీపడుతుంది.