ఎదురులేని భారత్‌ | India beat Korea 3-2 to seal semi-final berth | Sakshi
Sakshi News home page

ఎదురులేని భారత్‌

Aug 8 2023 4:05 AM | Updated on Aug 8 2023 4:05 AM

India beat Korea 3-2 to seal semi-final berth - Sakshi

చెన్నై: ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఎదురేలేని భారత్‌ మూడో విజయాన్ని సాధించి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో టీమిండియా 3–2 గోల్స్‌తో దక్షిణ కొరియాపై గెలుపొందింది. భారత్‌ తరఫున నీలకంఠ శర్మ (6వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (23వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (33వ ని.లో) తలా ఒక గోల్‌ చేశారు.

కొరియా బృందంలో సంగ్‌హ్యూన్‌ కిమ్‌ (12వ ని.లో), జిహున్‌ యంగ్‌ (58వ ని.లో) చెరో గోల్‌ చేశారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో భారత్‌ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రేపు తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్‌ ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ 2–1తో చైనాపై గెలుపొంది సెమీస్‌ ఆశల్ని నిలబెట్టుకుంది. మరోవైపు మలేసియా 3–1తో జపాన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సంపాదించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement