hockey tournament
-
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ ఫైనల్లో భారత్
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్‌చాంపియన్ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మస్కట్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 3–1 తేడాతో జపాన్ను చిత్తు చేసి ముందంజ వేసింది. భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (4వ నిమిషంలో), సాక్షి రాణా (5వ ని.లో), దీపిక (13వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున నికో మరుయమా (23వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు రెండో నిమిషంలోనే గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నా... మరో 2 నిమిషాల తర్వాత ముంతాజ్ ఖాన్ గోల్‌తో ఖాతా తెరిచింది. అదే ఊపులో తొలి క్వార్టర్‌లోనే మరో రెండు గోల్స్ చేసిన భారత్... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. దీపికకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
దీపిక ‘హ్యాట్రిక్’
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపిక మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. దీపిక 37వ, 39వ, 48వ నిమిషాల్లో గోల్స్ చేసింది. వైష్ణవి ఫాల్కే (32వ నిమిషంలో), కనిక సివాచ్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు... రెండు పెనాలీ స్ట్రోక్‌లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను భారత జట్టు గోల్స్‌గా మలిచింది. మిగతా ఐదు పెనాల్టీ కార్నర్లను, మరో పెనాల్టీ స్ట్రోక్‌ను భారత్ లక్ష్యానికి చేర్చి ఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 7–2 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా చేసిన గోల్స్ (27) సంఖ్యకంటే భారత్ చేసిన గోల్స్ (17) తక్కువగా ఉండటంతో చైనా టాప్ ర్యాంక్‌లో, భారత్ రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. -
‘ఆసియా’ యువ భారత్‌దే
మస్కట్: ఒకే విజయంతో యువ భారత జట్టు రెండు లక్ష్యాలను సాధించింది. పురుషుల అండర్–21 ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు టోర్నీని అజేయంగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో శర్దానంద్ తివారి సారథ్యంలోని టీమిండియా 5–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ టైటిల్‌ను ఐదోసారి సొంతం చేసుకుంది. గతంలో భారత జట్టు 2004, 2008, 2015, 2023లలో ఈ టైటిల్‌ను సాధించింది. తాజా విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. ఇదే టోర్నీలో గతంలో రెండుసార్లు ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించిన భారత జట్టు మూడోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ ఏకంగా నాలుగు గోల్స్ (4వ, 18వ, 47వ, 54వ నిమిషాల్లో) సాధించగా... దిల్‌రాజ్ సింగ్ (19వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. పాకిస్తాన్ జట్టు తరఫున సూఫియాన్ ఖాన్ (30వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... హన్నాన్ షాహిద్ (3వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 2–1తో మలేసియాను ఓడించింది. పాకిస్తాన్, జపాన్, మలేసియా జట్లు కూడా వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందాయి. పాక్‌తో జరిగిన తుది పోరులో భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మూడో నిమిషంలో హన్నాన్ చేసిన గోల్‌తో పాకిస్తాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న భారత జట్టు మరుసటి నిమిషంలోనే గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. 14 నిమిషాల తర్వాత భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పాక్ పోరాడి మూడో క్వార్టర్ ముగిసేసరికి మరో రెండు గోల్స్ చేసి భారత ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. చివరి క్వార్టర్లో భారత్ జోరు కొనసాగించి ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 5–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో టీమిండియా నాలుగింటిని సది్వనియోగం చేసుకొని, రెండింటిని వృథా చేసింది. మరోవైపు పాక్ జట్టు సంపాదించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. -
భారత్ 16... తైపీ 0
మస్కట్: ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన భారత జట్టు... శనివారం మూడో మ్యాచ్‌లో 16–0 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో యువభారత్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్‌రాజ్ సింగ్ (17వ, 40వ, 45వ, 57వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో చెలరేగగా... రోషన్ కుజుర్ (23వ, 32వ, 42వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుషా్వహా (20వ, 29వ, 58వ నిమిషాల్లో) చెరో మూడు గోల్స్‌తో అదరగొట్టారు. అర్ష్ దీప్ సింగ్ (37వ, 44వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... యోగేంబర్ రావత్ (7వ నిమిషంలో), ప్రియోబర్తా (31వ నిమిషంలో), శార్దానంద్ తివారి (39వ నిమిషంలో), అర్జీత్ సింగ్ హుండల్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలో రావత్ తొలి గోల్ సాధించి జట్టుకు మంచి ఆరంభం ఇవ్వగా... ఇక అక్కడి నుంచి మనవాళ్లు వరుస గోల్స్‌తో విజృంభించారు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను కకావికలం చేస్తూ గోల్స్ వర్షం కురిపించారు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. నేడు జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో కొరియాతో భారత్ తలపడుతుంది. మంగళవారం సెమీఫైనల్స్ జరగనున్నాయి. గతంలో ఆసియా జూనియర్ హాకీ టోరీ్నలో భారత్ నాలుగు సార్లు విజేతగా నిలిచింది. -
భారత్‌కు రెండో విజయం
ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మస్కట్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున థోక్చోమ్ కింగ్సన్ సింగ్ (12వ నిమిషంలో), రోహిత్ (36వ నిమిషంలో), అరిజిత్ సింగ్ హుండల్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ జట్టుకు నియో సాటో (15వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టుకు ఏకంగా 16 పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే జపాన్ రెండింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు దక్కగా ఇందులో రెండింటిని సది్వనియోగం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత జట్టు ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. శనివారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టుతో భారత్ తలపడుతుంది. -
భారీ విజయంతో భారత్ బోణీ
మస్కట్ (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 11–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ (2వ, 24వ నిమిషాల్లో), గుర్జోత్ సింగ్ (18వ, 45వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుశ్వాహ (19వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు.దిల్‌రాజ్ సింగ్ (21వ నిమిషంలో), ముకేశ్ టొప్పో (59వ నిమిషంలో), శారదానంద్ తివారీ (10వ నిమిషంలో), రోహిత్ (29వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (8వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. -
దీపిక ఐదు గోల్స్... సెమీస్‌లో భారత్
రాజ్‌గిర్ (బిహార్): ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. థాయ్‌లాండ్ జట్టుతో గురువారం జరిగిన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 13–0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ తరఫున దీపిక అత్యధికంగా ఐదు గోల్స్ (3వ, 19వ, 43వ, 45వ, 45వ నిమిషంలో) చేయగా ... ప్రీతి దూబే (9వ, 40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (12వ, 56వ నిమిషంలో), మనీషా చౌహాన్ (55వ, 58వ నిమిషంలో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. బ్యూటీ డుంగ్‌డుంగ్ (30వ నిమిషంలో), నవ్‌నీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఆరు జట్లు మూడేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, భారత్ 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే గోల్స్ అంతరం కారణంగా చైనా (చేసిన గోల్స్ 22; ఇచ్చిన గోల్స్ 1) టాప్ ర్యాంక్‌లో, భారత్ (చేసిన గోల్స్ 20; ఇచ్చిన గోల్స్ 2) రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. 3 పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, 2 పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో, 1 పాయింట్‌తో కొరియా ఐదో స్థానంలో, 1 పాయింట్‌తో థాయ్‌లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. నిర్ణీత ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్తాయి. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా చైనా, భారత జట్ల తొమ్మిది పాయింట్లను మిగతా జట్లు దాటే పరిస్థితి లేదు. దాంతో ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్‌లు ఖరారయ్యాయి. మూడో నిమిషంలో మొదలై... గత పదేళ్లలో ఏడోసారి థాయ్‌లాండ్‌తో తలపడిన భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. గతంలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌కు ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని 39 గోల్స్ సాధించిన భారత జట్టు ఏడోసారీ అదే దూకుడును కొనసాగించింది. మూడో నిమిషంలో దీపిక చేసిన గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. అటునుంచి టీమిండియా వెనుదిరిగి చూడలేదు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో ఐదింటిని మాత్రమే భారత్ గోల్స్‌గా మలిచింది. లేదంటే విజయాధిక్యం మరింతగా ఉండేది. గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో చైనా 2–1 గోల్స్‌తో జపాన్‌పై, మలేసియా 2–1 గోల్స్‌తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో మలేసియాతో జపాన్; కొరియాతో థాయ్‌లాండ్; చైనాతో భారత్ తలపడతాయి. -
భారత్ శుభారంభం
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో మలేసియా జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (8వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ప్రీతి దూబే (43వ నిమిషంలో), ఉదిత (44వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఇతర తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా 15–0తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేయగా... జపాన్, కొరియా మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మలేసియా చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఈసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఎనిమిదో నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్‌ను సంగీత లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించినా ఫినిషింగ్ వేధించింది. ఫలితంగా 42వ నిమిషం వరకు భారత్ ఖాతాలో మరో గోల్ చేరలేదు. అయితే రెండు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ప్రీతి దూబే, ఉదిత సది్వనియోగం చేసుకోవడంతో భారత్ ఒక్కసారిగా 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా సంగీత ఫీల్డ్ గోల్‌తో భారత ఆధిక్యం 4–0కు పెరిగింది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్లు, మలేసియాకు ఒక పెనాల్టీ కార్నర్ లభించాయి. -
కాంస్యం కోసం యువ భారత్ పోరు
కౌలాలంపూర్: జొహర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. టాప్–2లో నిలిచిన ఆ్రస్టేలియా, బ్రిటన్ జట్లు టైటిల్ కోసం పోటీపడనుండగా... మూడో స్థానంలో నిలిచిన భారత్, నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్లు కాంస్య పతకం కోసం తలపడతాయి. 5–6 స్థానాల కోసం జపాన్, ఆతిథ్య మలేసియా జట్లు ఆడతాయి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు నాలుగో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా కళ్లెం వేసింది. ఒక్క గోల్ సమర్పించుకోకుండా భారత్‌ఫై నాలుగు గోల్స్ సాధించి ఆ్రస్టేలియా ఘనవిజయం నమోదు చేసుకుంది. అయినప్పటికీ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిస్తే భారత జట్టు ఫైనల్‌కు చేరుకునేది. కానీ అలా జరగలేదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను భారత జట్టు 3–3తో ‘డ్రా’ చేసుకుంది.భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (6వ నిమిషంలో), రోహిత్ (17వ నిమిషంలో), తాలెమ్ ప్రియోబర్తా (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు జాంటీ ఎల్మెస్ (17వ, 32వ, 45వ నిమిషాల్లో) ఏకంగా మూడు గోల్స్ అందించాడు. కివీస్‌తో మ్యాచ్ ‘డ్రా’ కావడంతో భారత జట్టు ఫైనల్ బెర్త్ ఖరారయ్యేది ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధార పడింది. అయితే బ్రిటన్ జట్టు 3–1తో జపాన్‌పై, ఆ్రస్టేలియా 9–3తో మలేసియాపై ఘనవిజయం సాధించాయి. ఫలితంగా బ్రిటన్, ఆ్రస్టేలియా, భారత జట్లు 10 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఆ్రస్టేలియా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో నిలువగా... భారత్‌కు మూడో స్థానం దక్కింది. -
హెడ్ కోచ్ శ్రీజేశ్ ఆధ్వర్యంలో...
బెంగళూరు: భారత సీనియర్ హాకీ జట్టు మేటి గోల్‌కీపర్, ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేశ్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు తొలిసారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈనెల 19 నుంచి మలేసియాలో జరిగే సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు శ్రీజేశ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా ప్రకటించింది. డిఫెండర్లు అమీర్ అలీను కెపె్టన్‌గా, రోహిత్‌ను వైస్ కెపె్టన్‌గా నియమించారు. ఆతిథ్య మలేసియాతోపాటు భారత్, బ్రిటన్, జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు 26న జరిగే ఫైనల్లో తలపడతాయి. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను 19న జపాన్‌తో ఆడుతుంది. ఆ తర్వాత బ్రిటన్ (20న), మలేసియా (22న), ఆ్రస్టేలియా (23న), న్యూజిలాండ్ (25న) జట్లతో భారత్ తలపడుతుంది. భారత జట్టు: అమీర్ అలీ (కెపె్టన్), రోహిత్ (వైస్ కెపె్టన్), బిక్రమ్‌జీత్ సింగ్, అలీఖాన్, తాలెమ్ ప్రియోబర్తా, శారదనాంద్ తివారి, సుఖ్వీందర్, అన్మోల్ ఎక్కా, అంకిత్ పాల్, మనీ్మత్ సింగ్, రోషన్ కుజుర్, ముకేశ్ టొప్పో, చందన్ యాదవ్, గుర్జోత్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుశ్వా, దిల్‌రాజ్ సింగ్, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ కొనైన్ దడ్. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన చైనా
ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో చైనా సంచలన విజయం సాధించింది. సెమీస్‌లో పాకిస్తాన్‌ను మట్టికరిపించి.. తొలిసారి ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఉత్కంఠగా సాగిన షూటౌట్లో గోల్‌కీపర్ సైయూ వాంగ్ తన అద్భుత ప్రదర్శనతో చైనాకు ఈ చిరస్మరణీయ గెలుపు అందించాడు.సెమీస్‌లో ఆ నాలుగు జట్లుమరోవైపు.. పాకిస్తాన్‌కు కాంస్య పతక పోరు రూపంలో మెడల్ గెలిచేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. చైనాలోని హులున్‌బుయిర్‌లో గల మోకీ హాకీ ట్రెయినింగ్ బేస్‌లో ఆసియా చాంపియన్స్ హాకీ పోటీలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, చైనా టాప్-4లో నిలిచాయి.1-1తో సమం.. షూటౌట్లో ఫలితంఈ క్రమంలో తొలి సెమీస్‌లో చైనా సోమవారం పాకిస్తాన్‌తో తలపడింది. ఆట 18వ నిమిషంలో డ్రాగ్‌ఫ్లికర్ యువాన్లిన్ లూ గోల్ కొట్టి చైనాకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఐదుసార్లు పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్ కొట్టేందుకు ప్రయత్నించినా.. చైనా డిఫెన్స్ చేసింది. అయితే, 37వ నిమిషంలో అహ్మద్ నదీం అద్భుతంగా ఆడి గోల్ కొట్టగా.. ఆ తర్వాత చైనా మళ్లీ పాకిస్తాన్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు.ఈ నేపథ్యంలో మ్యాచ్ 1-1తో డ్రా కాగా.. షూటౌట్ నిర్వహించారు. చైనా తరఫున బెన్హాయి, చింగాలియాంగ్ లిన్ గోల్స్ కొట్టగా.. పాకిస్తాన్ ఒక్కటీ స్కోరు చేయలేకపోయింది. చైనా గోల్ కీపర్ సైయూ వాంగ్ పాక్ జట్టుకు అడ్డుగోడలా నిలిచి తమ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. షూటౌట్లో చైనా 2-0తో పాకిస్తాన్‌పై గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.మరో సెమీస్‌లో భారత్- కొరియా జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటికే 4-0తో పటిష్ట స్థితిలో నిలిచి ఫైనల్‌కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు పాకిస్తాన్‌తో కాంస్య పతకం కోసం పోటీ పడుతుంది.చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. ఆ షాట్లు ఆడటంలో వాళ్లే బెస్ట్: అశ్విన్ -
Ind vs Pak: పాకిస్తాన్‌ను ఓడించిన భారత్
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దాయాదిని 2-1తో ఓడించింది. తద్వారా లీగ్ దశలో ఓటమన్నదే లేకుండా.. సెమీస్ వరకు అజేయంగా నిలిచింది. కాగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్- పాకిస్తాన్ ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.చిరకాల ప్రత్యర్థిపై మరోసారి పైచేయిటీమిండియా పన్నెండు పాయింట్లతో.. పాక్ ఎనిమిది పాయింట్లతో టాప్-4 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. అయితే, లీగ్ దశలో నామమాత్రపు పోరులో దాయాదులు పోటీపడటం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఆది నుంచి వరుస విజయాలతో జోరు మీదున్న హర్మన్‌ప్రీత్ సింగ్ సేన.. నామమాత్రపు మ్యాచ్‌లోనూ దుమ్ములేపింది. చిరకాల ప్రత్యర్థిపై 2-1తో పైచేయి సాధించి జయభేరి మోగించింది. ఆదిలో పాక్‌కు ఆధిక్యంచైనాలోని మోకీ వేదికగా శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో.. తొలి గోల్ పాక్ కొట్టింది. ఆట ఎనిమిదవ నిమిషంలో అహ్మద్ నదీం తమ జట్టుకు తొలి పాయింట్ అందించాడు. అయితే, భారత జట్టు కెప్టెన్, ఉత్తమ డ్రాగ్ఫికర్లలో ఒకడైన హర్మన్‌ప్రీత్ సింగ్ దాయాదిని పైచేయి సాధించనివ్వలేదు. హర్మన్ చేసెను అద్భుతం మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా రెండు గోల్స్ కొట్టి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. మిగిలిన ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించి.. మ్యాచ్ ముగిసే వరకు పాక్‌కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా 2-1తో భారత్ గెలుపొందింది.ఇక ఈ టోర్నీలో భారత్ అంతకుముందు చైనాను 3–0తో, జపాన్ను 5–1తో, మలేషియాను 8–1, కొరియాను 3–1తో ఓడించింది. ఇక భారత్‌తో పాటు పాకిస్తాన్, సౌత్ కొరియా సెమీ ఫైనల్ బెర్తులను ఇప్పటికే ఖరారు చేసుకున్నాయి. మలేషియా, చైనాలలో ఏదో ఒక జట్టు వీటితో పాటు సెమీస్‌లో నిలిచే అవకాశం ఉంది.చదవండి: టెన్నిస్ టోర్నమెంట్.. హెలికాప్టర్లలో స్టేడియానికిCaptain Harmanpreet gets us 🔙 in the game 🔥Harmanpreet led the Indian attack from the front with 2️⃣ beautiful penalty corner conversions which gave the #MenInBlue a well-deserved lead 💪Watch the intense clash LIVE on #SonyLIV 📲 pic.twitter.com/VINOMUPqbR— Sony LIV (@SonyLIV) September 14, 2024 -
భారత్ X పాక్
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్ ఈ టోర్నీలో నాలుగు వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు సాధించింది. టీమిండియా 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా... నాలుగింట రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్తాన్ 8 పాయింట్లతో సెమీఫైనల్‌కు అర్హత సంపాదించింది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఇది నామమాత్రమైన పోరే అయినప్పటికీ మైదానంలో జరిగే సమరం మాత్రం హైవోల్టేజీతో ఉంటుంది. భారత కెపె్టన్ సహా ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పారిస్ పతకం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పటివరకు ఎదురైన అన్ని జట్లను మట్టికరిపించారు. ఆతిథ్య చైనాను 3–0తో చిత్తు చేసిన భారత్ 5–1తో జపాన్‌పై, 8–1తో మలేసియాపై తిరుగులేని విజయాలు సాధించింది. 3–1తో కొరియాను ఓడించిన భారత్ ఇప్పుడు ఇదే జోరుతో దాయాది జట్టును కంగుతినిపించాలని తహతహలాడుతోంది. గతేడాది చైనాలోనే జరిగే హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ 10–2తో పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. గత ఏడాది చెన్నైలో జరిగిన పోరులోనూ భారత్ 4–0తో ఘనవిజయం సాధించింది. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన దుర్భేధ్యమైన టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత సులభం కాదు. ప్రపంచంలోనే ఉత్తమ డ్రాగ్ఫ్లికర్లలో ఒకడైన కెపె్టన్ హర్మన్‌ప్రీత్ చిరకాల ప్రత్యరి్థతో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడున్న పాక్ జట్టులోని ఆటగాళ్లను జూనియర్ స్థాయి నుంచే ఎదుర్కొన్న అనుభవం తనకుందని చెప్పాడు. దీంతో వారితో చక్కని అనుబంధం ఏర్పడిందని, సోదరభావంతో మెలుగుతామని అన్నాడు. అయితే మైదానంలోకి దిగగానే ప్రత్యర్థులపై చెలరేగేందుకు సై అంటామని చెప్పుకొచ్చాడు. -
సవిత సారథ్యంలో...
బెంగళూరు: స్వదేశంలో జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్ మహిళల హాకీ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు గోల్‌కీపర్ సవిత పూనియా నాయకత్వం వహిస్తుంది. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధిస్తాయి. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చిలీ, చెక్ రిపబ్లిక్, జర్మనీ, జపాన్... గ్రూప్ ‘బి’లో భారత్, ఇటలీ, న్యూజిలాండ్, అమెరికా జట్లున్నాయి. భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌ను 13న అమెరికాతో ఆడుతుంది. ఆ తర్వాత 14న న్యూజిలాండ్‌తో, 16న ఇటలీతో టీమిండియా తలపడుతుంది. భారత హాకీ జట్టు: సవిత పూనియా (కెపె్టన్, గోల్‌కీపర్), బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్‌కీపర్), నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషికా చౌధరీ, మోనిక, నిషా, వైష్ణవి విఠల్ ఫాలే్క, నేహా, నవ్‌నీత్ కౌర్, సలీమా టెటె, సోనిక, జ్యోతి, బ్యూటీ డుంగ్‌డుంగ్, లాల్రెమ్సియామి, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా. -
భారత జట్టుకు నిరాశ
కౌలాలంపూర్: మూడోసారి జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సుదీప్ చిర్మాకో (11వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. జర్మనీ జట్టు తరఫున బెన్ హాస్బాష్ (8వ ని.లో, 30+వ ని.లో) రెండు గోల్స్ చేయగా... పాల్ గ్లాండర్ (41వ ని.లో), ఫ్లోరియన్ స్పెర్లింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో జర్మనీ జట్టు తొమ్మిదోసారి ఈ మెగా ఈవెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత జట్టుకు సెమీఫైనల్లో ఏకంగా 12 పెనాల్టీ కార్నర్లు వచ్చినా ఒక్క దానిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మూల్యం చెల్లించుకుంది. -
భారత్ అదరహో
కౌలాలంపూర్: ఆద్యంతం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన భారత జట్టు జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున ఆదిత్య అర్జున్ లలాగే (34వ ని.లో), అరిజిత్ సింగ్ హుందల్ (35వ ని.లో), సౌరభ్ ఆనంద్ కుష్వా (52వ ని.లో), ఉత్తమ్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు టిమో బోర్స్ (5వ ని.లో), వాన్ డెర్ హెజ్డెన్ (16వ ని.లో), ఒలివియర్ హోర్టెన్సియస్ (44వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ 2–1తో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై, ఫ్రాన్స్ 3–2తో ఆ్రస్టేలియాపై, స్పెయిన్ 4–2తో పాకిస్తాన్‌పై విజయం సాధించాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీతో భారత్; స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడతాయి. జూనియర్ స్థాయిలో చివరిసారి 2005లో నెదర్లాండ్స్‌పై గెలిచిన భారత జట్టుకు ఈసారీ గట్టిపోటీ ఎదురైంది. అయితే మ్యాచ్‌లో మూడుసార్లు వెనుకబడ్డ భారత్ ఏమాత్రం ఆందోళన చెందకుండా పోరాడింది. రెండు క్వార్టర్లు ముగిసేసరికి 0–2తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్లో నెదర్లాండ్స్ మూడో గోల్ చేసి మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ ముగిసేందుకు ఎనిమిది నిమిషాలు ఉన్నాయనగా భారత్ మళ్లీ స్కోరును సమం చేసింది. అదే జోరులో మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాలముందు నాలుగో గోల్‌తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. చివర్లో నెదర్లాండ్స్ జట్టు స్కోరును సమం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. నెదర్లాండ్స్ ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... భారత జట్టు గోల్‌కీపర్ మోహిత్‌తోపాటు రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండి నెదర్లాండ్స్‌కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. చివరి పది సెకన్లలోనూ నెదర్లాండ్స్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా భారత ఆటగాళ్లు దానిని నిర్వీర్యం చేసి చిరస్మరణీయ విజయం అందుకున్నారు. మ్యాచ్ మొత్తంలో నెదర్లాండ్స్‌కు 12 పెనాల్టీ కార్నర్లు రాగా వాటిలో మూడింటిని గోల్స్‌గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక దానిని భారత్ లక్ష్యానికి చేర్చింది. 6 జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరడం ఇది ఆరోసారి. గతంలో భారత జట్టు 2001, 2016లలో విజేతగా, 1997లో రన్నరప్‌గా నిలిచింది. 2005, 2021లలో సెమీఫైనల్‌తోపాటు మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. -
తొమ్మిదో స్థానంతో భారత్ ముగింపు... ‘షూటౌట్’లో అమెరికాపై విజయం
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు తొమ్మిదో స్థానం దక్కింది. చిలీ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో 9–10 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో అమెరికా జట్టును ఓడించింది. నిvత 60 నిమిషాలు ముగిశాక భారత్, అమెరికా జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున మంజు (11వ ని.లో), సునెలితా (57వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... అమెరికా జట్టుకు కిర్‌స్టెన్ థామసె (27వ, 53వ ని.లో) రెండు గోల్స్ అందించింది. ‘షూటౌట్’లో మొదటి ఐదు షాట్లు ముగిశాక కూడా రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున ముంతాజ్, రుతుజా గోల్స్ చేయగా... ప్రీతి, సాక్షి, అన్ను విఫలమయ్యారు. అమెరికా జట్టు తరఫున అబిగెయిల్, లారెన్ వడాస్, అండర్వుడ్ కొట్టిన షాట్లను భారత గోల్‌కీపర్ మాధురి నిలువరించగా... కేటీ డిక్సన్, ఒలివియా గోల్స్ చేశారు. ‘సడెన్‌డెత్’లో లారెన్ వడాస్ షాట్‌ను మాధురి అడ్డుకోగా... అనంతరం రుతుజా గోల్‌తో భారత విజయం ఖరారైంది. -
కొరియాపై భారత్ గెలుపు
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు 9–10వ స్థానాల కోసం పోటీపడనుంది. 9–13 స్థానాల మధ్య వర్గీకరణ మ్యాచ్‌లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున రోప్ని కుమారి (23వ ని.లో), ముంతాజ్ ఖాన్ (44వ ని.లో), అన్ను (46వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు జియున్ చోయ్ (19వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. 9–10 స్థానాల కోసం శనివారం అమెరికా జట్టుతో భారత్ ఆడుతుంది. -
భారత్‌కు స్పెయిన్ షాక్
కౌలాలంపూర్: జూనియర్ పురుషుల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. గురువారం వరుసగా రెండో విజయం సాధించి దర్జాగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఆశించిన యువ భారత్ గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్‌లో 1–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 4–2తో నెగ్గి శుభారంభం చేసిన భారత జట్టుకు రెండో మ్యాచ్‌లో స్పెయిన్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఆట తొలి నిమిషంలోనే పాల్ క్యాబిర్ వెర్డెల్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 18వ నిమిషంలో ఆండ్రెస్ రాఫి గోల్‌తో స్పెయిన్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 33వ నిమిషంలో రోహిత్ గోల్ సాధించడంతో భారత్ ఖాతా తెరిచింది. అయితే స్పెయిన్ జోరు తగ్గించకుండా ఆడుతూ ఎనిమిది నిమిషాల తర్వాత మూడో గోల్ చేసింది. పాల్ క్యాబిర్ వెర్డెల్ గోల్‌తో స్పెయిన్ 3–1తో ముందంజ వేసింది. మ్యాచ్ చివరి నిమిషంలో ఆండ్రెస్ రాఫి గోల్‌తో స్పెయిన్ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో ఏడు పెనాల్టీ కార్నర్లు రాగా కేవలం ఒక దానిని సహాకీ టోర్నీ నియోగం చేసుకుంది. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 4–1తో కెనడాను ఓడించి క్వార్టర్ ఫైనల్ రేసులో నిలిచింది. శనివారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్; కొరియాతో స్పెయిన్ తలపడతాయి. కొరియా–స్పెయిన్ మ్యాచ్ తర్వాతే భారత జట్టు మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ స్పెయిన్ చేతిలో కొరియా ఓడితే భారత్ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే చాలు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ స్పెయిన్‌పై కొరియా గెలిస్తే మాత్రం భారత్ భారీ తేడాతో కెనడాపై తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. -
యువ భారత్ శుభారంభం
కౌలాలంపూర్: జూనియర్ పురుషుల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పూల్ ‘సి’ తొలి మ్యాచ్‌లో టీమిండియా 4–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. భారత్ తరఫున అరైజీత్ సింగ్ హుండల్ మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరైజీత్ 11వ, 16వ, 41వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. మరో గోల్‌ను అమన్‌దీప్ (30వ ని.లో) సాధించాడు. కొరియా తరఫున డోహున్ లిమ్ (38వ ని.లో), మిన్‌క్వాన్ కిమ్ (45వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్‌తో భారత్ ఆడుతుంది. మంగళవారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ 3–1తో ఈజిప్ట్‌పై, జర్మనీ 5–3తో దక్షిణాఫ్రికాపై, స్పెయిన్ 7–0తో కెనడాపై, అర్జెంటీనా 1–0తో ఆ్రస్టేలియాపై, మలేసియా 7–1తో చిలీపై గెలుపొందాయి. -
థాయ్‌లాండ్‌తో భారత్ తొలి పోరు
రాంచీ: భారత్ వేదికగా తొలిసారి జరగనున్న మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జరిగే ఈ టోర్నీకి రాంచీ ఆతిథ్యమివ్వనుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, మలేసియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అక్టోబర్ 27న థాయ్‌లాండ్ జట్టుతో భారత్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. అనంతరం 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్‌తో, నవంబర్ 2న కొరియాతో భారత్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ నవంబర్ 4న, ఫైనల్స్ నవంబర్ 5న జరుగుతాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఆరుసార్లు జరిగింది. భారత్ 2016లో టైటిల్ గెలిచింది. 2010లో మూడో స్థానం పొందగా.. 2013, 2018లో రన్నరప్‌గా నిలిచింది. -
అజేయంగా టైటిల్ పోరుకు భారత్
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన భారత్ శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 5–0 గోల్స్ తేడాతో జపాన్‌పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియా తో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో మలేసియా 6–2తో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి ఈ టోర్నీలో మొదటిసారి ఫైనల్ చేరింది. 2018 ఆసియా క్రీడల సెమీఫైనల్లో చివరిసారి మలేసియా చేతిలో ఓడిన భారత్ ఆ తర్వాత ఈ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడలేదు. 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 6–1తో చైనాపై గెలిచి ఐదో స్థానాన్ని దక్కించుకోగా... చైనా చివరిదైన ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జపాన్‌పై గెలుపుతో హర్మన్‌ప్రీత్ సేన నాలుగో టైటిల్‌పై కన్నేసింది. ఈ టోర్నీలో లీగ్ దశలో 1–1తో తమని నిలువరించిన జపాన్‌పై టీమిండియా ఎదురు లేని విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లో జరిగిన గత టోర్నీ (2021)లో సెమీస్‌లో ఎదురైన పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. భారత శిబిరం అటాకింగ్‌కు జపాన్ వద్ద బదులే లేకపోయింది. తొలి క్వార్టర్ 0–0తో ముగిసింది. ఆ తర్వాత మూడు క్వార్టర్లు భారత ఆటగాళ్లదే జోరు. ఆకాశ్‌దీప్ సింగ్ (19వ ని.లో), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (30వ ని.లో), సుమిత్ (39వ ని.లో), కార్తీ సెల్వం (51వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ 300 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. -
పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి.. భారత్‌ను నిలువరిస్తేనే సెమీఫైనల్ బెర్త్
చెన్నై: సాధారణంగా దాయాదుల మధ్య హాకీ మ్యాచ్ జరిగినా... క్రికెట్ పోరు జరిగినా... అది ఆ టోర్నీకే ఆసక్తికరమైన సమరమవుతుంది. కానీ ఈసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు బుధవారం తలపడుతున్నప్పటికీ మునుపటిలా ఇది మాత్రం భారత్ పక్షం నుంచి అవసరం, అంతటి ఆసక్తికరమని అనలేం! ఎందుకంటే ఇదివరకే భారత జట్టు అజేయంగా సెమీఫైనల్ చేరింది. పాక్‌తో మ్యాచ్ పూర్తిగా నామమాత్రమైంది. కానీ దాయాదికి మాత్రం ఇది చావోరేవోలాంటి పోరు. ఓడితే మాత్రం సెమీస్ దారులు మూసుకుపోతాయి. కనీసం ‘డ్రా’తో గట్టెక్కితేనే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచే అవకాశముంది. మరోవైపు ముందుకెళ్లడమో, ఇక్కడే ముగించుకోవడమో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కాబట్టి పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. భారత్ ఫామ్, ఈ టోర్నిలో కనబరిచిన దూకుడు, ఆధిపత్యం దృష్ట్యా పాక్ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో! అసాధారణ ఆటతో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే పాక్ గెలిచేందుకు సాధ్యమవుతుంది. లేదంటే ఎదురేలేని భారత్‌ను ఎదురించడం అంత సులభం కానేకాదు. 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో చివరిసారి భారత్‌పై పాకిస్తాన్ గెలిచింది. భారత్–పాక్ మ్యాచ్ కంటే ముందు చైనాతో జపాన్; దక్షిణ కొరియాతో మలేసియా తలపడతాయి. మలేసియా కూడా సెమీఫైనల్ చేరడంతో మిగతా రెండు బెర్త్‌ల కోసం కొరియా, పాకిస్తాన్, జపాన్ రేసులో ఉన్నాయి. ఆసియా క్రీడల్లో ఒకే గ్రూప్‌లో... హాంగ్జౌలో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసి యా క్రీడల్లో హాకీ ఈవెంట్లో భారత్, పాకిస్తాన్‌లు ఒకే గ్రూపులో తలపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో దాయాదులతో పాటు జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్లు ఉన్నాయి. సెపె్టంబర్ 24న జరిగే తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. ఆసియా క్రీడల ఈవెంట్‌కే హై లైట్ కాబోయే ఇండో–పాక్ పోరు సెపె్టంబర్ 30న జరుగుతుంది. టైటిల్ పోరు అక్టోబర్ 6న నిర్వహిస్తారు. మహిళల విభాగంలోనూ భారత్ ‘ఎ’ గ్రూపులో ఉంది. ఇందులో హాంకాంగ్, సింగ పూర్, కొరియా, మలేసియా ఇతర జట్లు కాగా... అమ్మాయిల బృందం 27న తమ తొలి పోరులో సింగపూర్‌తో ఆడుతుంది. -
ఎదురులేని భారత్
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఎదురేలేని భారత్ మూడో విజయాన్ని సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో టీమిండియా 3–2 గోల్స్‌తో దక్షిణ కొరియాపై గెలుపొందింది. భారత్ తరఫున నీలకంఠ శర్మ (6వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (33వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. కొరియా బృందంలో సంగ్‌హ్యూన్ కిమ్ (12వ ని.లో), జిహున్ యంగ్ (58వ ని.లో) చెరో గోల్ చేశారు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో భారత్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రేపు తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ 2–1తో చైనాపై గెలుపొంది సెమీస్ ఆశల్ని నిలబెట్టుకుంది. మరోవైపు మలేసియా 3–1తో జపాన్ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సంపాదించింది. -
FIH Hockey Nations Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. సెమీ ఫైనల్ దిశగా భారత్
FIH Hockey Nations Cup: నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. స్పెయిన్‌లో సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్‌పై గెలిచింది. భారత్ తరఫున సలీమా టెటె (5వ ని.లో), బ్యూటీ డుంగ్‌డుంగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు రుయ్ తకషిమా (49వ ని.లో) ఏకైక గోల్ అందించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే భారత్ సెమీఫైనల్ చేరుతుంది. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే!