![India win over Korea - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/9/odisha.jpg.webp?itok=TesH8kqv)
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు 9–10వ స్థానాల కోసం పోటీపడనుంది. 9–13 స్థానాల మధ్య వర్గీకరణ మ్యాచ్‌లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో గెలిచింది.
భారత్ తరఫున రోప్ని కుమారి (23వ ని.లో), ముంతాజ్ ఖాన్ (44వ ని.లో), అన్ను (46వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు జియున్ చోయ్ (19వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. 9–10 స్థానాల కోసం శనివారం అమెరికా జట్టుతో భారత్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment