Korea
-
Miss Universe Korea : జస్ట్ 80!
సియోల్: పేరు: చోయి సూన్ హ్వా, వయస్సు:80. ఇటీవలే మిస్ యూనివర్స్ కొరియాఫైనలిస్ట్ల్లో ఒకరిగా నిలిచిరికార్డు బద్దలు కొట్టారు. త్వరలో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని, వయోధికురాలిగా చరిత్ర సృష్టించబోతున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమవ్వడానికి దశాబ్ధం ముందు 1952లో ఈమె జన్మించారు. ఈ నెలారంభంలో మిస్ యూనివర్స్ కొరియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచారు. సోమవారం మరో 31 మంది పోటీదారులతో ‘మిస్ యూనివర్స్ కొరియా’కిరీటం కోసం పోటీ పడనున్నారు. ఇందులో విజేతగా నిలిస్తే నవంబర్‌లో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ ఫైనల్స్‌లో దక్షిణ కొరియాకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ కొట్టేయనున్నారు. ‘80 ఏళ్ల మహిళ ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? శరీర సౌష్టవాన్ని ఎలా నిలుపుకోగలిగారు? ఏ ఆహారం తీసుకుంటున్నారు? అని ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలనుకుంటున్నా’అని ఆమె సీఎన్ఎన్తో అన్నారు. హాస్పిటల్లో చిన్న ఉద్యోగం చేసి రిటైరైన చోయి..ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ ఆ ఉద్యోగంలో చేరారు. మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని తన వద్దకు వచ్చే రోగి ఒకరు ప్రోత్సహించారని ఆమె చెప్పారు. ‘మొదట్లో ఆమె సలహా అర్థం లేనిదిగా అనిపించింది. ఆ తర్వాత నా చిన్ననాటి అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఇదే సమయమని తోచింది’అని తెలిపారు. అదే సమయంలో అప్పులు ఆమెకు భారంగా మారాయి. అలా, 72 ఏళ్ల వయసులో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. 2018లో 74 ఏళ్ల వయస్సులో సియోల్ ఫ్యాషన్ వీక్‌లో మొట్టమొదటిసారిగా కనిపించారు. ఆ తర్వాత హార్పర్స్ బజార్, ఎల్ల్ మ్యాగజీన్లలో కనిపించారు. ఇప్పుడు, కొరియన్ ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. -
వివాదానికి తెర.. వెనక్కి తగ్గిన దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో వైద్యులు- ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగిన వైద్యుల లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది.సమ్మె చేస్తున్న వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య మంత్రి చౌ క్యో హాంగ్ తెలిపారు. వారు తిరిగి విధుల్లో చేరాలని ఆయన కోరారు. అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఎన్ని వేల మంది వైద్యులు విధుల్లోకి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అత్యవసర చికిత్సలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు చికిత్స అందించే వైద్యుల కొరతను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని చౌ క్యో హాంగ్ పేర్కొన్నారు. కాగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలన్న ప్రభుత్వ యోచనకు నిరసనగా ఫిబ్రవరి నుంచి మెడికల్ ట్రైనీలుగా పనిచేస్తున్న 13వేల మంది జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్స్ సమ్మెకు దిగారు. ఇది ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది.ప్రభుత్వ ప్రణాళికకు మద్దతుగా మేలో సియోల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో సమ్మెకు దిగిన వైద్యులకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఆ దరిమిలా ఆసుపత్రుల్లో విధుల నిర్వహణకు తిరిగివచ్చే వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు 2035 నాటికి 10 వేల మంది వైద్యులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికారులు తెలిపారు.అయితే దేశంలో వైద్య విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో, ఇది అంతిమంగా దేశంలోని వైద్య సేవలపై ప్రభావం చూపుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. కాగా దక్షిణ కొరియాలో అత్యధిక వేతనం పొందే వృత్తులలో వైద్య వృత్తి ఒకటి. వైద్యుల సంఖ్య పెరిగితే తమ ఆదాయాలు తగ్గిపోతాయని పలువురు వైద్యులు ఆందోళన చెందున్నారు. -
క్రూయిజ్ క్షిపణులు పేల్చిన నార్త్ కొరియా
ప్యాంగ్యాంగ్: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పొరుగు దేశం దక్షిణ కొరియాను రెచ్చగొట్టే విధంగా నార్త్ కొరియా చర్యలుండటమే ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తాజాగా ఆదివారం(జనవరి 28) ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సింప్నో ప్రాంతానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లోకి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ‘ఆదివారం ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా గుర్తు తెలియని కొన్ని క్రూయిజ్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు మా ఆర్మీ గుర్తించింది’ అని సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కూడా ఉత్తర కొరియా సముద్రంలో ఆర్టిలరీ బాంబులు వేసి ద్వీపకల్పంలో ఉద్రిక్తలకు కారణమైన విషయం తెలిసిందే. ఇదీచదవండి..బ్రిటీష్ నౌకపై హౌతీ మిలిటెంట్ల దాడి -
కొరియాపై భారత్ గెలుపు
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు 9–10వ స్థానాల కోసం పోటీపడనుంది. 9–13 స్థానాల మధ్య వర్గీకరణ మ్యాచ్‌లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున రోప్ని కుమారి (23వ ని.లో), ముంతాజ్ ఖాన్ (44వ ని.లో), అన్ను (46వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు జియున్ చోయ్ (19వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. 9–10 స్థానాల కోసం శనివారం అమెరికా జట్టుతో భారత్ ఆడుతుంది. -
సీఎం వైఎస్ జగన్ ను కలిసిన రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్
-
కంప్యూటర్ల దిగుమతి ఆంక్షలపై ఆందోళన
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై దిగుమతి ఆంక్షలు విధించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, చైనా, కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశంలో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఓ అధికారి తెలిపారు. నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులతో సహా ఈ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా పేర్కొన్నట్టు జెనీవాకు చెందిన అధికారి వెల్లడించారు. భారత నిర్ణయం ఎగుమతిదారులు, అంతిమ వినియోగదా రులకు అనిశి్చతిని సృష్టిస్తోందని అమెరికా పేర్కొంది. అయితే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గత వారం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వాలీబాల్‌లో భారత్ సంచలనం
హాంగ్జూ (చైనా): మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల వాలీబాల్ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. గ్రూప్ ‘సి’లో టాప్ ర్యాంక్‌లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం కంబోడియా జట్టును ఓడించిన భారత జట్టు బుధవారం పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 25–27, 29–27, 25–22, 20–25, 17–15తో దక్షిణ కొరియాపై గెలిచింది. 1966 నుంచి ప్రతి ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో ఏదో ఒక పతకం సాధిస్తూ వస్తోంది. భారత జట్టు చివరిసారి 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచింది. కొరియాతో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సమష్టి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అమిత్ అత్యధికంగా 24 పాయింట్లు స్కోరు చేశాడు. వినిత్ కుమార్, అశ్వల్ రాయ్ 19 పాయింట్ల చొప్పున సాధించారు. మనోజ్ ఎనిమిది పాయింట్లు, ఎరిన్ వర్గీస్ ఏడు పాయింట్లు అందించారు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కొరియా రజత పతకం నెగ్గగా, భారత్ 12వ స్థానంలో నిలిచింది. రోయింగ్‌లో జోరు... రోయింగ్‌లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశి‹Ùలతో కూడిన భారత పురుషుల జట్టు కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరింది. మహిళల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో అశ్వతి, మృణమయి సాల్గావ్కర్, ప్రియా దేవి, రుక్మిణి, సొనాలీ, రీతూ, వర్ష, తెన్దోన్తోయ్ సింగ్, గీతాంజలిలతో కూడిన భారత జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు మలేసియాతో భారత మహిళల పోరు మహిళల టి20 క్రికెట్లో భారత నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో నేడు జరిగే పోరులో స్మృతి మంధాన బృందం బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడంతోపాటు పతకం రేసులో నిలుస్తుంది. ఉదయం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు!
ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ కొరియాలోని చాంగ్వాన్లో జరిగింది. ఈ పోటీలకు భారత్ పెద్ద సంఖ్యలో షూటర్లను కొరియాకు పంపింది. ఈ పోటీలో 44 దేశాల నుంచి 550 మందికి పైగా షూటర్లు పాల్గొన్నారు. భారత్ 6 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలతో సహా 17 పతకాలు సాధించి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైనా 12 స్వర్ణాలు సహా 28 పతకాలను సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయం పక్కనబెడితే కొరియా వెళ్లిన భారత జూనియర్ షూటింగ్ జట్టులోని కొందరు సభ్యులు నిబంధన ఉల్లఘించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా షూటర్లు మగ షూటర్ల హోటల్ గదిలో ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. హోటల్ గదిలో అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటున్నారని, బిగ్గరగా పాటలు పాడుతూ సందడి చేశారని తెలిసింది. సమాచారం అందుకున్న అధికారులు భారతీయులకు గదులు ఇవ్వవద్దని సిబ్బందిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమే అక్కడే ఉన్న భారత అధికారులు పీటీఐకి బదులిస్తూ.. పురుష షూటర్లు ఉన్న హోటల్‌కు మహిళా షూటర్లు వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 'మగ షూటర్లు ఉన్న గదికి ఎవరూ వెళ్లినట్లు లేదా అక్కడ నుండి తిరిగి వచ్చినట్లు కనిపించలేదు.' అని అధికారులు స్పష్టం చేశారు. ''అంతర్జాతీయ పోటీల కోసం భారతదేశం నుండి బయలుదేరే ముందు చేయవలసినవి, చేయకూడని వాటి గురించి షూటర్లకు వివరిస్తాం. ఏది సరైనది, ఏది తప్పు అనే దానిపై వారికి అవగాహన కల్పించడానికి రోజువారీ బ్రీఫింగ్ కూడా ఉంటుంది.'' అని ఓ అధికారి చెప్పారు. అయితే హోటల్లోని కొన్ని పరికరాలు దెబ్బతిన్నాయని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ తప్పిదానికి పరిహారం ఇవ్వడంతో అక్కడి నుంచి చెక్ అవుట్ చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: Ben Stokes: 'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు' Cristiano Ronaldo: ఎట్టకేలకు గోల్.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్‌లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్‌లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్‌లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్‌లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
భారత్–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం పటిష్టం
న్యూఢిల్లీ: భారత్–కొరియా ద్వైపాక్షిక వాణిజ్యం 2022లో 17 శాతం పెరిగి 27.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2021లో ఈ విలువ 23.7 బిలియన్ డాలర్లని కొరియా– ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కేఓటీఆర్ఏ) పేర్కొంది. భారత్‌కు కొరియా ఎగుమతులు 2022లో 21% పెరిగి 18.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతు లు 10.5% ఎగసి 8.9 బిలియన్ డాలర్లకు చేరాయి. 2023 భారత్–కొరియా ఇండస్ట్రీ భాగస్వామ్య కార్యక్రమంలో దేశంలో కొరియా రిపబ్లి క్ రాయబారి చాంగ్ జియో–బుక్ ఈ విషయాల ను తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగాల్లో ఇరుదేశాలు పరస్ప రం సహకరించుకుంటున్నట్లు వెల్లడించారు. -
భారీ సైనిక విన్యాసాలు.. అణుక్షిపణుల ప్రయోగం
సియోల్: కొరియా ద్వీపకల్పం వేడెక్కుతోంది. ఒకవైపు అమెరికా– దక్షిణకొరియా భారీ సైనిక విన్యాసాలు ప్రారంభం కాగా, వీటిని సవాల్ చేస్తూ జలాంతర్గామి నుంచి అణు సామర్థ్యమున్న క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించింది. దక్షిణకొరియా, అమెరికా సైనిక బలగాలు సోమవారం నుంచి భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. 2018 తర్వాత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఉమ్మడి విన్యాసాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే, దక్షిణకొరియా, అమెరికాల చర్యలు తమ దేశ దురాక్రమణకు రిహార్సల్ వంటివని ఆరోపిస్తున్న ఉత్తరకొరియా దీనికి నిరసనగా ఆదివారం జలాంతర్గామి నుంచి రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ రెండు క్షిపణులు వ్యూహాత్మక ఆయుధాలని అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ అభివర్ణించింది. దేశ అణు సామర్థ్యాన్ని ఇవి చాటుతున్నాయని తెలిపింది. ఇవి రెండు గంటలపాటు గాలిలోనే ఉన్నాయని, 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉందని తెలిపింది. అయితే, ఉత్తరకొరియా జలాంతర్గామి నుంచి అణు వార్హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల పరిజ్ఞానాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సౌత్ కొరియన్ యాక్టర్స్‌తో రష్మిక సందడి, ఫొటోలు వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ బ్యూటీ రష్మీక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, స్టైల్‌తో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక పుష్మ మూవీతో నేషనల్ స్టార్‌గా ఎదిగింది. ఇక ఆమె హీరోయిన్గా ఎంత బిజీగా ఉన్న మరోవైపు నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె ఓ ఈవెంట్లో కొరియన్ నటులతో సందడి చేసిన ఫొటోలను షేర్ చేసింది. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శింబు, వధువు ఎవరంటే! కాగా రష్మీక ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉంది. మిలాన్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె రీసెంట్గా ఇటలీకి పయనమైంది. ఈ షోకి ప్రపంచవ్యాప్తంగా నటీనటులు హాజరయ్యారు. అలా రష్మిక కూడా వైట్ అండ్ వైడ్ డ్రస్ డ్రెస్‌లో ఈ ఫ్యాషన్ వీక్‌లో మెరిసింది. ఇదే ఫ్యాషన్ వీక్‌లో సౌత్ కొరియా నటుడు జంగ్ ఊ, థాయిలాండ్ నటుడు గల్ఫ్ కానవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక వీరితో కలిసి ఫొటోలను ఫోజులు ఇచ్చింది. అంతేకాదు వారితో కలిసి డాన్స్ కూడా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ‘వారసుడు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రష్మిక.. రీసెంట్గా ‘యానిమల్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కే మేనియా.. కొరియన్ కల్చర్‌కు ఫిదా అంటున్న భారతీయులు
హైదరాబాద్‌లోని ఓ మెట్రో రైల్వే స్టేషన్.. ‘అన్యొహసేవ్.. అజొస్సి..?’ అని పిలిచింది ఒక 23 ఏళ్ల అమ్మాయి తన దారికి అడ్డంగా ఉన్న ఓ పాతికేళ్ల కుర్రాడిని. ‘ఎస్..’ అంటూ అతను పక్కకు తప్పుకున్నాడు. ‘కమ్సహమీదా’ అని చెబుతూ గబగబా ముందుకు సాగిపోయింది ఆ అమ్మాయి. తీరా ఆమె ప్లాట్‌ఫామ్ చేరుకునే సరికి అప్పుడే ట్రైన్ డోర్స్ మూసుకున్నాయి. ‘ఒమో..’ అంటూ నిట్టూర్చుంది. అంతలోనే ఫోన్.. ‘చింగు’ అనే పేరున్న నంబర్ నుంచి. ‘అన్యొహసేవ్’ అంది ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే. అవతలి నుంచీ ‘అన్యొహసేవ్’ అని బదులిచ్చి ‘ట్రైన్ క్యాచ్ చేశావా?’ అని అడిగింది ఆ స్వరం. ‘లేదు.. జస్ట్ మిస్డ్’అంది ఇవతలి అమ్మాయి. ‘చించా?’ అంది అవతలి స్వరం నమ్మలేనట్టుగా. ‘ఎస్.. కానీ ఇంకో ట్రైన్ క్యాచ్ చేసి వచ్చేస్తాలే..’అని చెప్పింది ఈ అమ్మాయి నమ్మకంగా. ‘ఓకే.. తర్వగా రా.. బెగొపాయో’ అంది అవతలి స్వరం. ‘నేనూ బెగొపాయో’ అంది ఈ అమ్మాయి. ఇంతలోకే ఇంచుమించు ఆ అమ్మయి వయసు అబ్బాయి ఆమె పక్కనుంచి ‘వావ్.. యెప్పుదా..!’ అనుకుంటూ వెళ్లాడు. అసలే ట్రైన్ మిస్ అయిన చిరాకుతో ఉన్న ఆ అమ్మాయి.. ఆ మాటకు ‘షిరొ.. మీచెస్సో’ అంటూ రిటార్ట్ ఇచ్చింది. గూఢచారుల కోడ్ భాష అనుకుంటున్నారా ఏమీ.. ఆ సంభాషణ విని?! కాదండీ.. అది కొరియన్ భాషండీ.. కొరియన్ భాష! ‘అన్యొహసేవ్.. అజొస్సి’ అంటే ‘హలో మిస్టర్’ అని, ‘కమ్సహమీదా’ అంటే ‘థాంక్యూ’ అని, ‘ఒమో’ అంటే ‘ ‘నో’ అని, ‘చింగు’ అంటే ఫ్రెండ్, ‘చించా’ అంటే ‘రియల్లీ’, ‘బెగొపాయో’ అంటే ‘అకలేస్తోంది’, ‘యెప్పుదా’ అంటే ‘ప్రెటీ’, ‘షిరొ’ అంటే ‘నాకు నచ్చలేదు’ అని, ‘మీచెస్సో’ అంటే ‘క్రేజీ’ అని అర్థం.. కొరియన్ భాషలో! ‘ఓహ్.. చించా! అయితే.. ఇక్కడ కొరియన్ భాషను నేర్పే కాలమ్ ఏదైనా మొదలుపెడుతున్నారా అనే సందేహం వలదు. దిస్ పేజ్ ఈజ్ వెరీమచ్ డెడికేటెడ్ టు కవర్ స్టోరీ ఓన్లీ. కొరియన్ మేనియా మీదే ఈ స్టోరీ! టీన్స్ నుంచి ‘టీ (ఫిఫ్టీ..సిక్సీ›్ట, సెవెంటీ.. ఎట్సెట్రా)’ల దాకా అన్ని వయసుల వాళ్లు కొరియన్ డ్రామా, కొరియన్ పాప్కి పరమవీర ఫ్యాన్స్! ఈ అఫైర్ కొరియన్ పాప్‌తో పదేళ్ల కిందటే మొదలైనా కొరియన్ డ్రామాతో స్టార్ట్ అయింది మాత్రం కరోనా లాక్‌డౌన్‌లోనే. ఇంట్లోనే గడిపిన ఆ సమయాన్ని చాలామంది ఓటీటీతో కాలక్షేపం చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లోని ‘డిసెండెంట్స్ ఆఫ్ ది సన్’, ‘బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్’, ‘రిప్లై1988’, ‘కింగ్డమ్’, ‘స్కైకెసిల్’ వంటి కొరియన్ సిరీస్‌తో మన వీక్షకుల ప్రేమకథ మొదలైంది. క్వారంటైన్‌ను మనం ఓటీటీలో కొరియన్ సిరీస్, యూట్యూబ్‌లో కొరియన్ పాప్‌తో ఎంటర్టైన్ అయ్యామని పలు అధ్యయనాల సారాంశం. అదిగో అప్పుడే కొరియన్ డ్రామా, కొరియన్ పాప్ క్రేజ్‌ను పెంచి ఓ వేవ్‌లా మార్చింది. దీన్నే అంటే కొరియన్ డ్రామా, కొరియన్ పాప్‌తో కలసి కొరియన్ కల్చర్ పట్ల మోజు పెంచుకోవడాన్ని .. అదో వేవ్‌లా కొనసాగడాన్ని ‘హాల్యు’ అంటున్నారు. ఎందుకంత క్రేజ్? హై ప్రొడక్షన్ వాల్యూస్, అంతే అద్భుతమైన ప్రెజెంటేషన్‌తో మనమూ ఐడెంటిఫై అయ్యేలా కుటుంబ కథాంశాలతో కొరియన్ డ్రామాలు స్ట్రీమ్ అవుతున్నాయి. ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. అందులో విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు? అందుకే వాటి వ్యూయర్షిప్ అంత హైలో ఉంటోంది. భాష, సెట్టింగ్స్, పాత్రలు కొరియన్ నేపథ్యం. కథనం మాత్రం అంతర్జాతీయ వీక్షకులను అలరించేదిగా ఉంటోంది. మరీ ముఖ్యంగా మన వాళ్లకు దగ్గరగా.. ఇంకా చెప్పాలంటే మనం అన్వయించుకునేలా ఉంటాయి ఆ సిరీస్‌లు. అందుకే కదా.. ఆస్కార్ విన్నర్ ‘పారసైట్’ని చూసి ప్రపంచమంతా ‘వహ్వా’ అంటుంటే మనకు వెరీమచ్ తెలుగు సినిమాలా అనిపించింది! ‘కొత్త మనుషులు, కొత్త వాతావరణం.. కొత్త కథలుగా అస్సలు అనిపించవు’ అని చెబుతుంటారు కొరియన్ డ్రామాను అమితంగా ఇష్టపడే తెలుగు వీక్షకులు. అప్పటిదాకా గూఢచర్య, మిలిటరీ ఆపరేషన్ నేపథ్యపు అమెరికన్ డ్రామాలు, నేరస్థులను పట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సాగే స్కాండినేవియన్ డిటెక్టివ్ సిరీస్‌లు చూసీ చూసీ పాతబడున్న ప్రేక్షకులు, వీక్షకులకు కొరియన్ డ్రామా ఓ మత్తులా పట్టుకుంది.. కొత్త సీసాలో పాత మందులాగా! ముక్కోణపు ప్రేమ, శృంగారం, అమ్మ సెంటిమెంట్, కిడ్నాప్‌లు, గతం మర్చిపోవడాలు, కుటుంబ పరువు–ప్రతిష్ఠలను కాపాడుకోవడం, పాటలు, పగ– ప్రతీకారం, పురిట్లోనే కవలలిద్దరూ విడిపోవడం, దేశభక్తి .. ముఖ్యంగా మెలోడ్రామా.. ఇలా ఇండియన్ సినిమాల్లో కనిపించే నవరస, మసాలా దినుసులన్నీ కొరియన్ డ్రామాలో పుష్కలం. అందుకే మనవాళ్లు అంతలా కనెక్ట్ అవుతున్నారు. ‘మన సినిమాలనే ఫారిన్ లొకేషన్స్‌లో.. ఫారిన్ యాక్టర్స్‌తో చూసినట్టుంటాయి.. భలే ఎంటర్టైన్ అవుతాం’ అంటున్నారు కొరియన్ డ్రామా వీరాభిమానులు కొందరు. ‘ఆ డ్రామాల్లో ఉండే ఎమోషనల్ స్టిక్నెసే వాటి పట్ల క్రేజ్ పెరగడానికి కారణం’ అంటారు ‘క్రాస్ పిక్చర్స్’ అనే కొరియన్ మల్టీనేషనల్ ప్రొడక్షన్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న చిత్ర సుబ్రహ్మణ్యం. ‘సౌత్ కొరియన్ సంస్కృతీసంప్రదాయాల్లో ఒక తరహా అప్పీల్ ఉంటుంది. అవి మనకు ఇదివరకే పరిచయమున్నట్టు తోస్తాయి. అందుకే వాటి మేళవింపుగా ఉన్న కొరియన్ డ్రామాలు మన దగ్గర అంత హిట్ అవుతున్నాయి’ అంటారు దక్షిణ కొరియాలోని భారతీయ రాయబారి శ్రీప్రియ రంగనాథన్. చవకకే.. భారతీయులు ఇలా ఏకబిగిన కొరియన్ డ్రామాలను చూడడం వల్ల నెట్‌ఫ్లిక్స్ వ్యూయర్షిప్ 2019తో పోలిస్తే 2020లో ఏకంగా 370 శాతం పెరిగిందని తేలింది.. యూరోమానిటర్ సర్వేలో! దీంతో మన దగ్గర కొరియన్ డ్రామాలకున్న క్రేజ్, డిమాండ్ మిగిలిన ఓటీటీ చానెల్స్‌కూ అర్థౖమైపోయింది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి జీ గ్రూప్ శాటిలైట్ ప్రొవైడర్ డిష్ టీవీ హిందీలోకి డబ్ అయిన కొరియన్ డ్రామాలను అతి చవక (రూ. 1.3.. అంటే ఒక సెంట్ కన్నా తక్కువ) ప్యాకేజీకే స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. ఎమ్ఎక్స్ ప్లేయర్ (ఓటీటీ ప్లాట్‌ఫామ్) అయితే ఇంకో అడుగు ముందుకేసి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోకి అనువదించిన కొరియన్ డ్రామాలను స్ట్రీమ్ చేస్తోంది. ఈ ప్రయత్నం ఇక్కడి ఔత్సాహిక కంటెంట్ రైటర్స్‌కూ అవకాశాలను పెంచి మంచి ఆదాయ మార్గాన్ని చూపిస్తోంది. బిజినెస్ బూమ్ ఇదిగో ఇలా కొరియన్ డ్రామా రేకెత్తించిన కుతూహలం, జిజ్ఞాస మన మార్కెట్లో కొరియన్ కంపెనీలకు కాసుల పంట కురిపిస్తోంది. ‘అందేంటీ.. కొరియన్ ఉత్పత్తులు మనకేం కొత్త కాదే. సామ్సంగ్, ఎల్జీ, కియా మోటార్స్, లాటీ, హ్యూండైలాంటి 20కి పైగా కొరియన్ కంపెనీలే కదా మన మార్కెట్‌ను ఏలుతున్నది! అవన్నీ దాదాపుగా 17.45 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాయని మన ప్రభుత్వమే లెక్కలు చెప్తోంది! పైగా 2010లో మనకు, దక్షిణ కొరియాకు మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది. దానిప్రకారం ఎలాంటి పన్ను లేకుండానే మనం దక్షిణ కొరియా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నాం’ అంటారా?! నిజమే.. అదేం కొత్త విషయం కాదు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్‌తో మన దగ్గర వ్యాపారం పెంచుకున్న .. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన కొరియన్ కంపెనీలే ఇక్కడ విషయం.. విశేషమూనూ. కే మోజు కొరియన్ తిండి, సోజూ( ్జౌu.. ఆల్కహాల్), బట్టలు, నగలు, బ్యూటీ ప్రొడక్ట్, కొరియన్ టూరిజం ఆఖరుకు కొరియన్ భాష, కొరియన్ కల్చర్ వరకూ సాగి.. కొరియన్ బ్రాండ్స్ డిమాండ్‌ను పెంచుతున్నాయి. నూడుల్స్ అమ్మే దక్షిణ కొరియా కంపెనీ నాన్షిన్ బ్రాండ్.. 2020లో మిలియన్ డాలర్ల అమ్మకాలు చేసింది. మీకో విషయం తెలుసా.. 2020 కన్నా 2021లో మనం 178 శాతం అధికంగా కొరియన్ ఇన్స్టంట్ నూడుల్స్‌ను వినియోగిం చామని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ అంచనా. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ‘ఐల్ ఆఫ్ స్కిన్’ అనే కొరియన్ బ్యూటీ బ్రాండ్‌ను లాంచ్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి కే మేనియాను. ఇలా ఇన్నిస్‌ఫ్రీ, లనేజ్ ( ్చn్ఛజీజ్ఛ), ఎట్యూడ్ (్ఛ్టuఛ్ఛీ), స్లవషూ (టu ఠీజ్చిటౌౌ) వంటి దక్షిణ కొరియా బ్రాండ్స్‌కి, ది ఫేస్ షాప్ లాంటి ఆన్లైన్ స్టోర్స్‌కి భలే గిరాకీ మొదలైంది. ఇక్కడి కే క్రేజ్ వల్ల అమెజాన్‌లో కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్స్ ఇదివరకంటే మూడున్నర రెట్లు పెరిగాయని తెలిపింది అమెజాన్ సంస్థ ఒక ఇంటర్వ్యూలో. అయితే ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకోవడానికి భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఆ మేరకు మన మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిట్లోనూ వాటి ఔట్లెట్స్ వచ్చేశాయి. హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. భాష మీదా.. పరాయి భాష మరీ ముఖ్యంగా ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలను నేర్చుకుంటున్నారు అంటే ఆయా దేశాల్లో చదువు, ఉద్యోగాల నిమిత్తమే అని చెప్పకనే అర్థమైపోతుంది. ఏ భాషనైనా దాని మీద అభిమానంతో నేర్చుకోవడమనేది అరుదే. కొరియన్ ఆ కోవలోకే వస్తుంది. కే డ్రామా మీద వీక్షకులకున్న అభిమానం ఆ భాష నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. వారి సంఖ్యను పెంచుతోంది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాలన్నిట్లో కొరియన్ భాషను నేర్పే ఇన్స్టిట్యూట్స్ వెలిశాయి.సెంట్రల్ సిలబస్‌ను బోధిస్తున్న అన్ని స్కూళ్లల్లో.. ఎనిమిదవ ఫారిన్ లాంగ్వేజ్‌గా కొరియన్‌ను బోధించాలని కేంద్రప్రభుత్వం 2020లో కొత్త విధానాన్నీ తీసుకువచ్చింది. ‘తమ కొరియన్ అభిమాన నటీనటులు, గాయనీగాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం పాడుతున్నారు అని ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో కాకుండా నేరుగానే తెలుసుకోవాలనుకుంటున్నారు వీక్షకులు. ఇంకా చెప్పాలంటే కొరియన్ భాష మీద ఆపేక్షను పెంచుకుంటున్నారు. తద్వారా ఆ దేశంతో ప్రత్యక్షానుబం«ధాన్ని కోరుకుంటున్నారు’ అని చెబుతారు తమిళనాడులోని ఇండో– కొరియన్ కల్చరల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు హెడ్‌గా పనిచేస్తున్న రతి జాఫర్. ఫ్యాన్ క్లబ్స్.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్సేకే కాదు కే డ్రామా, కే పాప్కీ మన దగ్గర ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకుంటే చాలు. ఆ క్లబ్‌లు ఎక్కడో డెహ్రాడూన్, అహ్మదాబాద్, పట్నా, ముంబై, పుణే, నాగపూర్లలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కూడా వెలిశాయి. ఇవి తమ అభిమాన కొరియన్ నటీనటులు, కొరియన్ పాప్ సింగర్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటాయి. ముంబైలోని కే పాప్ ఫ్యాన్ క్లబ్ .. 2021, మార్చి 24న బీటీఎస్ బ్యాండ్‌లోని ఓ మెంబర్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది. నిధులను సమీకరించి.. ముంబై శివారు ప్రాంతమైన ములుండ్‌లోని ఓ బస్ షెల్టర్‌ను వారం పాటు అద్దెకు తీసుకుని దాన్నిండా జియాన్ జంగ్‌కూక్ పోస్టర్లను అతికించి వీరాభిమానాన్ని చాటుకుంది. ఇదంతా గమనించిన కొరియన్ కల్చరల్ సెంటర్ (ఢిల్లీ).. క్రమం తప్పకుండా కే పాప్, డాన్స్ పోటీలను నిర్వహించేలా ఈ ఫ్యాన్ క్లబ్స్‌కు సహకారమందిస్తోంది. ఈ పోటీల్లో ఎవరైతే తమ అభిమాన గాయనీగాయకుల గాత్రాన్ని, డాన్స్‌ను, వస్త్రధారణను అనుకరిస్తారో వారికే ట్రోఫీలను అందించడం విశేషం. 2021లోనే చెన్నైలోని కొరియన్ కాన్సులేట్ అక్కడ అమ్మాయిలకు కే పాప్ డాన్స్ పోటీలను నిర్వహించి అయిదుగురు విజేతలను ఎంపిక చేసుకుని వాళ్లతో ‘డ్రీమ్ కే పాప్’ అనే బాండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ బాండ్ కే డాన్స్‌లో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. అలాగే పాపులర్ కే పాప్ సాంగ్స్‌ను తమ యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూంటుంది. ఇక్కడ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టే దిశగా కొరియన్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ టూరిజం, ఫారిన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖలు యోచిస్తున్నాయట. ఇలా కే డ్రామా.. కే పాప్ వినోదాన్ని పంచుతూ మన వీక్షకుల, ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. ఆ అభిమానాన్ని తన వ్యాపారానికి అనుగుణంగా మలచుకుంటోంది. ‘కే డ్రామా.. కే పాప్ మీద ఇండియన్స్ ప్రేమ ఇలాగే పెరిగి.. పెరిగి అది కే ఫుడ్, బ్యూటీ ఇంకా ఇతర కొరియన్ ప్రొడక్ట్స్‌కి ఇండియన్ మార్కెట్లో డిమాండ్‌ను పదింతలు చేయాలని కోరుకుంటున్నాం’ అంటాడు కొరియాలోని యూరోమానిటర్ కన్సల్టెంట్ సన్నీ మూన్. అదన్న మాట కే మేనియా ఫలితం!! పట్టించుకోకపోయినా.. చిత్రమేంటంటే అటు కొరియన్ డ్రామాలు కానీ.. ఇటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ కానీ 60 ఏళ్ల పైబడిన వాళ్లను పట్టించుకోవడం లేదు. ఆ డ్రామాల్లోని కంటెంట్ సీనియర్ సిటిజన్స్‌ను భాగస్వాములుగా చేసుకోవడం లేదు. ఇటు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వీళ్ల కోసం కంటెంట్‌ను జనరేట్ చేయడంలేదు. అయినా.. ఆ పెద్దవాళ్లు సారీ.. ఆ సెకండ్ యూత్ .. ఓటీటీలోని ఈ కొరియన్ డ్రామాలను కన్నార్పకుండా చూస్తున్నారు. టైమ్ తెలియకుండా అందులో మునిగిపోతున్నారు. ముఖ్యంగా 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులు. అంతేకాదు కొరియన్ భాషా పదాలను నేర్చుకుని.. ఉపయోగిస్తున్నారు. ‘అన్యొహసేవ్ (హలో)’ అంటూ ఫోన్లలో, మెసేజెస్‌లో సంభాషణలు కావిస్తున్నారు. ముంబైకి చెందిన 67 ఏళ్ల సీఎస్ మణి ఇప్పటి వరకు 70కి పైగా కొరియన్ డ్రామాలను వీక్షించాడు. వాటి ద్వారా దాదాపు 60 కొరియన్ నుడికారాలను నేర్చుకున్నాడు. ఆ డ్రామాలు కలిగించిన ఆసక్తితో సియోల్ గురించి తెలుసుకున్నాడు. ‘సియోల్‌లో లక్షా డెబ్బయి ఐదువేల సీసీ కెమెరాలు ఉంటాయి తెలుసా! అక్కడ ఇంటర్నెట్ చాలా ఫాస్ట్. ప్రతి కారులో కెమెరా ఉండాల్సిందే. కొరియన్స్ భోజనప్రియులు. ఆల్కహాల్ ఫ్రీక్స్ కూడా’ అంటూ ఉత్సహంగా చెబుతుంటాడు. హాల్యూ.. ఓటీటీ ద్వారా మనకు ఇన్ఫెక్ట్ అయ్యేకంటే ముందే భారతీయ చిత్రసీమను ఎఫెక్ట్ చేసింది. హాలీవుడ్ ఎట్సెట్రా రంగాల్లోని చిత్రాలు మన మీద ప్రభావం చూపినట్టే.. కొరియన్ చిత్రసీమా మన మీద ప్రభావం చూపింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్.. టాలీవుడ్ దాకా చాలా వుడ్‌లలో కొరియన్ స్ఫూర్తి చిత్రాలు మన వెండి తెర మీద వెలుగు చూశాయి. తెలుగులో ‘అబ్బ.. భలే సినిమా’ అనిపించుకున్న ‘ఓ బేబీ’.. కొరియన్ ‘మిస్ గ్రానీ’కి రీ మేడ్. ఇలా తమిళంలోనూ కొన్ని కొరియన్ సినిమాలు రీమేడ్ అయ్యాయి. బాలీవుడ్‌లోనైతే ఆ జాబితా పదుల సంఖ్యలో ఉంది. నిన్నటి ‘ధమాకా’ .. ‘ది టెర్రర్ లైవ్’, ‘రాధే’.. ‘ది అవుట్ లాస్’, అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ‘తీన్’.. ‘మాంటేజ్’, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, ఇలియానా సూపర్ హిట్ ‘బర్ఫీ’.. ‘లవర్స్ కన్సర్టో’, రితేశ్ దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా హిట్ ‘ఏక్ విలన్’.. ‘ఐ సా ది డెవిల్’కి రీమేడ్లే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ పెద్దదే! ఈ ప్రేరణ కథను చూసి సాక్షాత్తు కొరియన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లోని పెద్దలే వచ్చి మన దగ్గర చిత్రనిర్మాణం చేపడుతు న్నారు. అతియోశక్తి కాదు.. నిజం! బెంగళూరులో నివాసముంటున్న మూన్ అనే అమ్మాయి (18) మంచి డాన్సర్. తన ఇంట్లోనే కే పాప్ సాంగ్స్ మీద డాన్స్‌ను షూట్ చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూంటుంది. ఈ పోస్ట్‌లకు 86,700 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్‌ను గమనించిన ఫ్లిప్‌కార్ట్ ఆమెను తమ మార్కెటింగ్ ప్రొడక్ట్స్‌కి మోడల్‌గా పెట్టుకుంది. -
Asian Boxing Championships 2022: స్వర్ణ పతక పోరుకు లవ్లీనా అర్హత
ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. జోర్డాన్‌లో బుధవారం జరిగిన సెమీఫైనల్లో లవ్లీనా 5–0తో సెయోంగ్ సుయోన్ (కొరియా)పై గెలిచింది. భారత్‌కే చెందిన అల్ఫియా (ప్లస్ 81 కేజీలు), మీనాక్షి (52 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. అంకుశిత (66 కేజీలు), ప్రీతి (57 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. -
పోషకాలు, ఔషధ గుణాల సమ్మిళితం.. 'సీ వీడ్'
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో పోషక విలువలు.. మరెన్నో ఔషధ గుణాల మేలు కలయిక.. సీవీడ్ (సముద్రంలో పెరిగే నాచులాంటి మొక్క). జపాన్, చైనా, కొరియా తదితర దేశాల్లో ప్రాచీన కాలం నుంచి ఇది అందుబాటులో ఉంది. నేరుగానూ, ఆహార పదార్థాల రూపంలోనూ దీన్ని తింటున్నారు. సీవీడ్‌పై ఇప్పుడు మనదేశంలోనూ ఆసక్తి పెరుగుతోంది. మారుతున్న జీవనశైలి, ఆరోగ్యంపై శ్రద్ధ అధికమవుతున్న నేపథ్యంలో సీవీడ్ ఆధారిత ఆహార ఉత్పత్తులపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ).. సీవీడ్స్తో వైవిధ్య ఆహార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, వినియోగం పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి. మ్యాక్రో ఆల్గేగా పిలిచే ఈ సీవీడ్ మన దేశ తూర్పు, పశ్చిమ తీరాల్లో విరివిగా లభిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సీవీడ్‌తో సూప్‌లు, నూడుల్స్, పాస్తాల్లో పొడి, రోల్ రూపంలో తినడానికి వీలుగా తయారుచేస్తున్నారు. అలాగే బిస్కెట్లు/కుకీస్, డ్రింకులు, నూట్రియెంట్ బార్స్, బ్రెడ్లు, సాచెట్లు వంటి వాటి తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సీవీడ్‌తో తినే పదార్థాలు, సూప్, సాచెట్లు వంటివి తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీని విశాఖ ఐకార్–సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తినడానికి వీలుగా 221 రకాల జాతులు.. సీవీడ్‌లో ఎరుపు, గోదుమ, ఆకుపచ్చ రంగుల్లో తినడానికి వీలుగా 221 రకాల జాతులున్నాయి. వీటిలో సోడియం, కాల్షియం, క్లోరిన్, మెగ్నీషియంతోపాటు ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. తక్కువ కొవ్వు, కేలరీలుంటాయి. సీవీడ్‌లో పలు ఔషధ గుణాలు ఉండడంతో వాటితో తయారైన ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, హెచ్ఐవీ, కోవిడ్ వంటివి నియంత్రణలోకి వస్తాయని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం ఐకార్–సీఐఎఫ్టీ శాస్త్రవేత్తలు డైటరీ ఫైబర్ ఫోర్టిఫైడ్ ఫిష్ సాసేజ్‌ను అభివృద్ధి చేశారు. వీటిని ఆహార, చేపల శుద్ధి చేసే రిటైల్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కియోస్కుల్లో అందుబాటులో ఉంచే వీలుంది. కృత్రిమంగానూ పెంచే వీలు.. సీవీడ్ సముద్రంలో సహజసిద్ధంగానే పెరుగుతుంది. దీనిని కృత్రిమంగానూ పెంచవచ్చు. ఇలా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో వీటి పెంపకాన్ని చేపట్టారు. తీరం నుంచి అర కిలోమీటరు దూరం వరకు.. అలల తీవ్రత అంతగా లేని, లోతు తక్కువగా ఉండే సముద్ర ప్రాంతం సీవీడ్ పెంపకానికి అనుకూలం. సీవీడ్‌తో శానిటైజర్ల తయారీ.. ఐకార్– సీఐఎఫ్టీ కొచ్చి శాస్త్రవేత్తలు సీవీడ్‌తో హ్యాండ్ శానిటైజర్ల తయారీ సాంకేతికతను కూడా అభివృద్ధి చేశారు. ఇది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నియంత్రణలో చురుగ్గా పనిచేస్తున్నట్టు నిర్ధారించారు. రెడ్ సీవీడ్.. ఫుడ్, కాస్మొటిక్స్, ఫార్మా, బయోమెడికల్ పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇది హెర్పిస్, ఇన్ఫ్లుయెంజా, హెచ్ఐవీ వైరస్‌లపై ప్రభావం చూపుతోందని గుర్తించారు. మరోవైపు విశాఖలో లభించిన గ్రీన్ సీవీడ్‌తో సూప్‌ను కూడా తయారు చేసినట్టు విశాఖ ఐకార్–సీఐఎఫ్టీ సీనియర్ శాస్త్రవేత్త జెస్మీ దేబర్మ ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ తీరంలో 1,215 హెక్టార్లు దేశంలో సముద్ర తీరంలో సీవీడ్ పెంపకానికి అనువైన ప్రాంతాలను గుర్తించడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 49 ప్రాంతాల్లో తీరానికి ఆనుకుని సముద్రంలో 1,215 హెక్టార్లు సీవీడ్ పెంపకానికి అనువుగా ఉందని గుర్తించారు. విశాఖ తీర ప్రాంత పరిసరాల్లో రెడ్, బ్రౌన్లకంటే గ్రీన్ సీవీడ్ (ఉల్వా రకం) ఎక్కువగా లభిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్కే బీచ్ వద్ద 40, ఉడా పార్క్ 10, తెన్నేటి పార్క్ 50, తొట్లకొండ 25, భీమిలి 25, తిమ్మాపురం 50, మంగమారిపేట 50, ఎండాడ 25, ముత్యాలమ్మపాలెం 25, పూడిమడక 50, బంగారమ్మపాలెం 25, రాంబిల్లి వద్ద 25 వెరసి 400 హెక్టార్లు అనుకూలంగా ఉన్నట్టు తేల్చారు. ఇంకా విజయనగరం జిల్లాలో 165, శ్రీకాకుళంలో 75, తూర్పు గోదావరిలో 250, పశ్చిమ గోదావరిలో 100, కృష్ణాలో 105, ప్రకాశంలో 75, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 45 హెక్టార్లను గుర్తించారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సహజసిద్ధంగా సీవీడ్ పెరుగుతోంది. ఔత్సాహికులు ముందుకొస్తే పెంచేందుకు ఈ ప్రాంతాలు అనుకూలమని నిర్ధారించారు. సముద్రంలో కేజ్ కల్చర్‌తోపాటు మల్టీ ట్రాఫిక్ ఆక్వాకల్చర్ పేరిట సీవీడ్‌ను పెంచేలా ఆలోచన చేస్తున్నారు. సీవీడ్‌పై అవగాహన కల్పిస్తున్నాం.. పలు ఔషధ గుణాలు, పోషకాలు ఉన్న సీవీడ్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. సీవీడ్‌లో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌లను చంపే గుణాలున్నాయి. సీవీడ్‌తో పశుగ్రాసం, ఎరువులను తయారు చేసే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. సీవీడ్ వినియోగం పెరగాలంటే వీటి ఉత్పత్తులు తయారు చేసే అనుబంధ పరిశ్రమలు రావాలి. – బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐకార్–సీఐఎఫ్టీ, విశాఖపట్నం -
'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ రీమేక్
Yoo Ji-tae As The Professor In Money Heist: Korea Joint Economic Area: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. దేశాలు, భాషలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లకు మోస్ట్ పాపులారిటీ వస్తోంది. అలా మోస్ట్ పాపులర్ అయిన వెబ్ సీరీస్లలో 'మనీ హెయిస్ట్' ఒకటి. ముందుగా ఈ సిరీస్ స్పానిష్‌లో 'లా కాసా డె పాపెల్ (ది హౌజ్ ఆఫ్ పేపర్)' అనే టైటిల్‌తో వచ్చింది. తర్వాత యూఎస్‌లో ఇదే సిరీస్‌ను 'మనీ హెయిస్ట్' టైటిల్‌తో ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. బ్యాంకుల దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి వచ్చిన 5 సీజన్లు మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా ఈ సిరీస్‌కు రీమేక్ రాబోతుంది. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ కొరియన్ భాషలో రీమేక్ కానుంది. 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1' టైటిల్‌తో కొరియాలో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రకటిస్తూ ఇందులోని ప్రొఫెసర్ పోస్టర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. కొరియన్ 'మనీ హెయిస్ట్‌లో ప్రొఫెసర్‌గా 'యూ జి-టే' నటించనున్నాడు. ఈ పోస్టర్లో జాకెట్‌తో పాటు ఫార్మల్ దుస్తులు ధరించి, స్పెక్ట్స్ పెట్టుకుని ప్రొఫెసర్ ఏదో ఆలోచిస్తున్నట్లు మనం చూడొచ్చు. ఈ సిరీస్‌ను జూన్ 24 నుంచి ప్రదర్శించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. చదవండి: స్పానిష్ టీవీ సిరీస్‌కు ఫుల్ క్రేజ్ ఎందుకంటే.. Get ready to go back to class, The Professor arrives in just 6 weeks 🥳 MONEY HEIST: KOREA - JOINT ECONOMIC AREA ARRIVES ON JUNE 24th 🕺🏻💃 pic.twitter.com/fBtWRU4FQJ — Netflix India (@NetflixIndia) May 13, 2022 ఇదివరకు వచ్చిన 'మనీ హెయిస్ట్'లో ప్రొఫెసర్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సిరీస్‌లోనే కేవలం ప్రొఫెసర్ పాత్రకే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ప్రొఫెసర్‌గా అల్వారో మోర్టే నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే ప్రస్తుతం వస్తున్న 'మనీ హెయిస్ట్: కొరియా- జాయింట్ ఎకనామిక్ ఏరియా పార్ట్ 1'పై అందులోని ప్రొఫెసర్ పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఇందులో ప్రొఫెసర్‌గా నటిస్తున్న 'యూ జి-టే' ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కాగా వెన్ మై లవ్ బ్లూమ్స్, హీలర్, మ్యాడ్ డాగ్ చిత్రాల్లో అలరించాడు 'యూ జి-టే'. అలాగే దక్షిణ కొరియా సిరీస్ స్క్విడ్ గేమ్ కూడా పాపులర్ అయిన విషయం తెలిసిందే. చదవండి: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆమెకు ‘కొరియా’ వ్యాధి.. ప్రపంచం మొత్తంలో వెయ్యి మందికి మాత్రమే
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ఆమె వయస్సు 32. కానీ చూడటానికి 50 ఏళ్లు పైబడిన మహిళగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడింది. కాళ్లు చేతులు తన ప్రమేయం లేకుండానే నిత్యం కదులుతూ ఉంటాయి. అన్నం తినేందుకు నోట్లో ముద్ద పెడితే.. తన ప్రమేయం లేకుండానే నాలుక ఆ ముద్దను బయటకు తోసేస్తుంది. ఇలాంటి వింతైన, అరుదైన పరిస్థితిని ఆస్పరికి చెందిన వీరేషమ్మ అనుభవిస్తోంది. వైద్యం చేయించాలని కుటుంబసభ్యులు కనిపించిన వైద్యులందరి వద్దకు తిరిగారు. మంత్రాలు చేయించారు.. తాయెత్తులు కట్టించారు.. దెయ్యం పట్టిందేమోనని భూతవైద్యులనూ ఆశ్రయించారు. ఇలా ఆ కుటుంబం దాదాపు మూడు లక్షల రూపాయలను ఖర్చు చేసింది. చివరకు కర్నూలుకు చెందిన న్యూరోఫిజీషియన్ డాక్టర్ హేమంత్‌కుమార్ ఆదోని క్యాంపునకు వెళ్లినప్పుడు కలిసి పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన ఆమెకు గల పరిస్థితిని అర్థం చేసుకుని వైద్య పరీక్షల కోసం హోల్ ఎక్సీమ్ సీక్వెన్సింగ్ జెనటిక్ టెస్ట్‌ను అహ్మదాబాద్‌కు పంపించారు. నెలరోజుల స్టడీ అనంతరం వైద్యపరీక్షల నివేదిక రెండురోజుల క్రితం డాక్టర్‌కు అందింది. ఆమెకు కొరియా అకాంటో సైటోసిస్ అనే అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. యూపీఎస్ 13ఎ అనే జీన్ మ్యూటేషన్ చెందడంతో ఈ వ్యాధి వస్తుందని డాక్టర్ చెప్పారు. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) నరాలపై ప్రభావం చూపడం వల్ల రోగికి తెలియకుండానే కాళ్లూ, చేతులు కదులుతూ ఉంటాయని తెలిపారు. ఆహారాన్ని నాలుక తోసేయడం వల్ల సరిగ్గా ఆహారం అందక పోషకాహార లోపం ఏర్పడిందన్నారు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స ఇవ్వడం వల్ల సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ప్రపంచం మొత్తంగా ఇప్పటి వరకు ఇలాంటి సమస్యతో కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. -
‘కరోనా’తో తప్పుకున్న భారత్!
డాంఘె (కొరియా): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత హాకీ జట్టును కరోనా కారణంగా టోర్నీ నుంచి తప్పిస్తున్నట్లు ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్ఎఫ్) గురువారం ప్రకటించింది. జట్టులో ఒకరికి కరోనా సోకడంతో ఏహెచ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో మ్యాచ్‌కు ముందు భారత జట్టులో ఒకరికి కరోనా సోకడంతో ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇదే కారణంగా మలేసియా కూడా టోర్నీ నుంచి విరమించుకుంది. చదవండి: Ravi Shastri: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే.. -
వైరల్ వీడియో.. 60 గుడ్లతో ఆమ్లెట్
రోజులు గడుస్తున్న కొద్ది భోజనం విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త రుచులు జ్విహను లబలబలాడిస్తున్నాయి. తినడంతో పాటు వడ్డించే విధానం కూడా చాలా ఆకర్షణీయంగా మారింది. కేకులు, దోశలు, లడ్డులు వంటి వాటిని భారీ సైజుల్లో తయారు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకి ఆమ్లెట్ చేరింది. 60 గుడ్లతో భారీ ఆమ్లెట్‌ను తయారు చేసి.. ముక్కలుగా కత్తిరించి అందంగా ప్యాక్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో ఓ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఓ భారీ ఆమ్లెట్‌ని తయారు చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తన దుకాణంలో అమ్మకానికి ఉంచాడు. అతడు ఆమ్లెట్ తయారు చేసే విధానం నెటిజనులను తెగ ఆకట్టుకుంటుంది. (చదవండి: ఇంట్లో ప్రయత్నించకండి.. కాలిపోద్ది!) ఇక వీడియోలో చెఫ్ ఓ పెద్ద గిన్నె తీసుకుని.. 60 గుడ్లను పగులకొట్లి దానిలో వేస్తాడు. వాటిని బాగా చిలకొట్టి.. ఉల్లిపాయ, ఉల్లికాడల తరుగు, క్యారెట్, మాంసం ముక్కలు కలుపుతాడు. ఆ తర్వాత సరిపడా ఉప్పు, మసలాలు వేసి మరోసారి బాగా గిలక్కొట్టి... ప్యాన్‌పై నూనె వేసి మిశ్రమం మొత్తాన్ని దాని మీద వేస్తాడు. తరువాత దాన్ని చుట్టి పెద్ద ఇటుకలాగా తయారు చేస్తాడు. పూర్తిగా కాలాక దాన్ని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాక్ చేస్తాడు. దాన్ని కంటైనర్‌లో ఉంచి అమ్మకానికి పెడతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అర్జెంట్‌గా ఆమ్లెట్ తినాలినిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
ఇండోనేసియా, కొరియా అవుట్
జకార్తా: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలుగుతున్న జట్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. కరోనా భయంతో ఇప్పటికే థాయ్‌లాండ్, తైవాన్, ఆస్ట్రేలియా జట్లు ఈ టోర్నీ నుంచి వైదొలగగా... తాజాగా వాటి సరసన ఇండోనేసియా, దక్షిణ కొరియా జట్లు కూడా చేరాయి. టోర్నీలో పాల్గొంటే తమ ఆటగాళ్లు కరోనా బారిన పడే అవకాశం ఉందని... అందుకే తాము టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ఇండోనేసియా బ్యాడ్మింటన్ సంఘం (పీబీఎస్ఐ) తెలిపింది. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇండోనేసియా థామస్ కప్ (పురుషుల విభాగంలో)ను రికార్డు స్థాయిలో 13 సార్లు గెలుచుకోగా... ఉబెర్ కప్ (మహిళల విభాగంలో)ను 3 సార్లు కైవసం చేసుకుంది. ఈ టోర్నీతో పాటు అక్టోబర్‌లోనే జరిగే డెన్మార్క్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్ టోర్నీల్లో కూడా తమ ప్లేయర్లు పాల్గొనడం లేదని ఇండోనేసియా పేర్కొంది. -
రెండో రౌండ్లోనే ఇంటిముఖం..
గ్వాంగ్జు(కొరియా): భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నమెంట్లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో శ్రీకాంత్ 14-21, 19-21 తేడాతో కంటా సునేయామా(జపాన్)చేతిలో పరాజయం చవిచూశాడు. సునేయామాతో తొలిసారి తలపడిన శ్రీకాంత్ ఎటువంటి వరుస రెండు గేమ్‌లు సమర్పించుకుని ఓటమి పాలయ్యాడు. కేవలం 37 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు. తొలి గేమ్‌ను దారుణగా కోల్పోయిన శ్రీకాంత్.. రెండో గేమ్ చివర్లో కాస్త ప్రతిఘటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన శ్రీకాంత్.. అప్పట్నుంచీ తిరిగి గాడిలో పడటానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం నమోదు చేయడం లేదు. ఇక భారత షట్లర్ సమీర్ వర్మ కథ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. దక్షిణకొరియాకు చెందిన కిమ్ డాంగన్ చేతిలో సమీర్ పరాజయం చెందాడు. డాంగన్ 21-19, 21-12 తేడాతో సమీర్‌ను బోల్తా కొట్టించాడు. -
సింధు మళ్లీ చిత్తు
ఒడెన్స్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ తేలిపోయింది. మరో టోరీ్నలోనూ చిత్తుగానే ఓడిపోయింది. మిగతా భారత షట్లర్లందరూ డెన్మార్క్ ఓపెన్‌లో చేతులెత్తేశారు. దీంతో ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 ఈవెంట్లో భారత్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన తెలుగుతేజం సింధు రెండో రౌండ్లోనే పరాజయం చవిచూసింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆమె 14–21, 17–21తో అన్ సె యంగ్ (కొరియా) చేతిలో ఓడింది.24 ఏళ్ల సింధు ఇక్కడ కూడా తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయింది. ఆగస్టులో ప్రపంచ చాంపియన్ అయ్యాక చైనా ఓపెన్‌లో రెండో రౌండ్లో, కొరియా ఓపెన్‌లో అయితే తొలిరౌండ్లోనే ఆమె కంగుతింది. గురువారం భారత ఆటగాళ్లెవరికీ కలిసిరాలేదు. పాల్గొన్న ప్రతీ ఈవెంట్లోనూ అందరికీ చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భమిడిపాటి సాయిప్రణీత్ 6–21, 14–21తో టాప్‌సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో చిత్తుగా ఓడాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 12–21, 10–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం 16–21, 15–21తో ఆరో సీడ్ హన్ చెంగ్ కయ్–జౌ హో డాంగ్ (చైనా) జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి కూడా నిరాశ ఎదురైంది. భారత జంట 24–26, 21–13, 11–21తో నాలుగో సీడ్ మలేసియన్ జోడి చన్ పెంగ్ సున్–గొ లియు చేతిలో పరాజయం చవిచూసింది. ఇది వరకే సైనా, శ్రీకాంత్ తొలిరౌండ్లోనే ని్రష్కమించిన సంగతి తెలిసిందే. కెరీర్‌కు లీ జురుయ్ గుడ్‌బై ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా ముద్రపడిన చైనీస్ బ్యాడ్మింటన్ దిగ్గజం లీ జురుయ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. లండన్ ఒలింపిక్స్ చాంపియన్ అయిన ఆమె గాయం తర్వాత పూర్తిస్థాయిలో కోలుకోలేదు. 2012లో ఆమె ఒలింపిక్స్‌తో పాటు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచింది. 2013, 2014లలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అక్కడ గాయపడిన ఆమె ఆ తర్వాత కెరీర్‌నే ఇలా ముగించాల్సి వచ్చింది. తన అంతర్జాతీయ కెరీర్లో లీ జురుయ్ 14 సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచింది. 2013లో బీడబ్ల్యూఎఫ్ మహిళా ప్లేయర్ అవార్డును గెలుచుకుంది. -
మనతో పాటు ఆ నాలుగు...
నేడు మనం 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనతో పాటు కాంగో, కొరియా, బహ్రెయిన్, లీచ్టెన్స్టెయిన్ దేశాలకు సైతం పరాయిదేశ పాలన నుంచి స్వాతంత్య్రం సిద్ధించింది. పాకిస్తాన్ భారత్‌కన్నా ఒక రోజు ముందు ఆగస్టు 14నే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కొరియా ఆగస్టు 15ని నేషనల్ లిబరేషన్ డే ఆఫ్ కొరియాగా జరుపుకుంటోంది. 1945, ఆగస్టు 15న జపాన్ అధీనంలోని కొరియా ద్వీప కల్పం నుంచి అమెరికా, సోవియట్ యూనియన్ బలగాలను విరమించుకున్నాయి. నార్త్, సౌత్ కొరియాల రెండింటికీ కామన్ పబ్లిక్ హాలిడే ఆగస్టు 15. మూడేళ్ల అనంతరం కొరియా.. ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయింది. ఇక 1971, ఆగస్టు 15న బహ్రెయిన్ బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 18 దశాబ్దాల పాటు ఫ్రాన్స్ ఆధిపత్యంలో కొనసాగిన తరువాత 1960, ఆగస్టు 15న సంపూర్ణ స్వాతంత్య్రం పొందింది. ప్రపంచంలోనే ఆరవ అతి చిన్న దేశం లిచిన్స్టెయిన్. జెర్మనీ పాలన నుంచి 1866, ఆగస్టు 15న విముక్తి పొందింది. ఆగస్టు 16 లిచిన్స్టెయిన్ రాజు రెండవ ఫ్రాంజ్ జోసెఫ్ పుట్టిన రోజు కావడంతో 1940 నుంచి ఆగస్టు 16ని స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటోంది. -
సరికొత్తగా శాంసంగ్ ఫ్రిజ్‌లు
సియోల్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త రిఫ్రిజిరేటర్లను లాంచ్ చేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎనిమిది రకాల ఫ్రిజ్‌లను కొరియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన స్టాండర్డ్ మోడల్ ఫ్రిజ్‌లకు భిన్నంగా,కొరియన్ కిచెన్లకు అనుగుణంగా వీటిని రూపొందించింది. విభిన్న రంగులు, డిజైన్లతో సరికొత్తగా ఆవిష్కరించింది. వీటిల్లో ఫోర్ డోర్ ఫ్రిజ్‌లు, డబుల్ డోర్ ఫ్రిజ్లున్నాయి. 1.8 మీటర్లు ఎత్తు, 70 సెం.మీ. లోతు వుండేలా వీటిని డిజైన్ చేసింది. వినియోగదారుల విభిన్న పోకడలను ప్రతిబింబించేలా శాంసంగ్ కస్టమైజ్డ్ రిఫ్రిజరేటర్లను లాంచ్ చేశామని కిమ్ హున్-సక్ పత్రికా సమావేశంలో ప్రకటించారు. -
వచ్చే నెల్లో శాంసంగ్ ‘గెలాక్సీ ఎం సిరీస్’ విడుదల..!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షావోమికి పోటీగా.. కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ అతి త్వరలోనే ‘గెలాక్సీ ఎం సిరీస్’ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండంకల వృద్ధి రేటును సాధించడంలో భాగంగా తొలుత ఈఫోన్ సిరీస్‌ను భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు రూ.20,000 వరకు ఉండనున్నట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సీ మీడియాతో అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల తరువాత స్మార్ట్ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నాం. శాంసంగ్, అమేజాన్ వెబ్సైట్లలో వీటిని అందించనున్నాం. ఎం సిరీస్ విడుదల ద్వారా 2019లో రెండంకెల వృద్ధి రేటును లక్ష్యంగా నిర్థేశించుకున్నాం. కేవలం డివైజ్‌ల పరంగానే కాకుండగా.. ఫ్యాక్టరీ, ఎక్సిపీరియన్స్ సెంటర్ల విస్తరణపై కూడా దృష్టి సారించాం. భారత మార్కెట్‌కు అవసరాలకు తగిన విధంగా సేవలందించడమే మా సంస్థ ధ్యేయం.’ అని వివరించారు. -
కొరియా.. ఇదేం పిచ్చయా..
వెర్రి వెయ్యి విధాలు అంటారు.. ఆ మాటను పెద్దలు ఊరికే అనలేదు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుంటుంటే ఈ విషయం అర్థం అవుతుంటుంది. ఇదిగో ఆ కోవలోకే చెందుతాడు.. ఈ ఫొటోలోని వ్యక్తి. థాయ్‌లాండ్‌కు చెందిన 25 ఏళ్ల రచడపాంగ్ ప్రసిత్కు కొరియాకు చెందిన వ్యక్తిలాగా కనిపించడం అంటే ఇష్టం. అతడేమో థాయ్‌లాండ్‌కు చెందినవాడు. అందుకోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించాడు. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 30 వరకు సర్జరీలు చేయించుకుని అసలు ముందున్న ముఖానికి, ప్రస్తుతం ఉన్న ముఖానికి కొంచెం కూడా సంబంధం లేకుండా తయారయ్యాడు. ఓ రకంగా కొత్త ముఖం పెట్టుకున్నాడనే చెప్పుకోవచ్చు. దీంతో ఆసియా మొత్తం ప్రసిత్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే కొరియాకు చెందిన సింగర్, నటుడు మిన్హోను స్ఫూర్తిగా తీసుకుని ఆయనకు దగ్గరి పోలికలు ఉండేలా ముఖాన్ని మార్చుకున్నాడు. ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే.. తాను డ్యాన్సర్‌ను అని, ఎన్ని టీవీ షోలకు ఆడిషన్స్ ఇచ్చినా ఎంపిక కాలేదని ప్రసిత్ చెప్పాడు. తన ముఖం వల్ల వ్యక్తిగతంగా గానీ, వృత్తి పరంగా కానీ తాను విజయవంతం కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తన ముఖాన్ని మార్చుకోవడమేననే ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు. తన ముఖం మొత్తం ఇలా మార్పు చెందేందుకు రెండేళ్లు పట్టిందట. ముఖం మారిన తర్వాత లక్కు కలిసొచ్చిందని, డ్యాన్సర్‌గా చాలా టీవీ షోలు చేస్తున్నానని, జీవితం ఇప్పుడు సెట్ అయిందని సంతోషపడుతున్నాడు. మొత్తానికి కొరియా వాళ్ల ముఖం అంటే పిచ్చో.. లేదా కెరీర్ మీద దృష్టో కానీ ప్రసిత్ జీవితం అలా ప్రశాంతంగా గడిచిపోతోంది. -
ప్రపంచకప్ బెర్త్ గల్లంతు
కౌలాలంపూర్: ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచ కప్ బెర్త్ సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) అండర్–16 చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 0–1తో కొరియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమితో యువ భారత్ ప్రపంచకప్‌లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఇందులో సెమీస్ చేరిన జట్లకు పెరూ వేదికగా 2019లో జరుగనున్న అండర్–17 ప్రపంచకప్ టోర్నీకి అర్హత లభిస్తుంది. 2017లో భారత్ వేదికగా జరిగిన ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఆతిథ్య హోదాలో ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే అవకాశం దక్కింది. ఈ సారి క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత సాధించాల్సిన స్థితిలో భారత్ విఫలమైంది. ఆకట్టుకున్న నీరజ్... 16 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆడుతున్న యువభారత్... టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన కొరియాపై తుదికంటా పోరాడింది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఆట 67వ నిమిషంలో జియాంగ్ సాంగ్బిన్ (కొరియా) సాధించాడు. ఈ మ్యాచ్‌లో గోల్‌కీపర్ నీరజ్ అడ్డుగోడలా నిలిచి కొరియన్ల సహనాన్ని పరీక్షించాడు. ఆట 14వ నిమిషంలోనే ప్రత్యర్థి గోల్‌ను అడ్డుకున్న నీరజ్... ఆట 34వ నిమిషంలో, 36వ నిమిషంలో కొరియన్లు చేసిన మెరుపు దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొని వారిని నిలువరించాడు. కొద్ది క్షణాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా రవిరాణా షాట్‌ను కొరియన్లు అడ్డుకోవడంతో గోల్ లేకుండానే భారత్ విరామానికెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ దూకుడు పెంచిన భారత్ 52వ నిమిషంలో గోల్ చేసినంత పని చేసింది. భారత ఆటగాడు రిడ్గే డి మెలోస్ వ్యాలీని ప్రత్యర్థి రక్షణశ్రేణి అడ్డుకుంది. 2002లోనూ భారత్ 1–3తో కొరియా చేతిలోనే ఓటమి పాలైంది. -
కొరియాల మధ్య శిఖరాగ్ర చర్చలు
సియోల్: చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఉభయ కొరియాల మధ్య శిఖరాగ్ర చర్చలు ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉ.కొరియాకు వెళ్లారు. ప్యాంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అధ్యక్షుడు కిమ్–జొంగ్–ఉన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ఇద్దరూ కలిసి అధ్యక్ష భవనానికి బయలుదేరారు. దక్షిణ కొరియా అధ్యక్షుడికి దారిపొడవునా వందలాది మంది ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు నేతలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ‘ప్రపంచం మొత్తం మమ్మల్ని గమనిస్తోంది. ప్రపంచ ప్రజలకు శాంతి, సంపదను సాధించడమనే బృహత్తర బాధ్యత నాపై ఉంది’ అనంతరం మూన్ మీడియాతో అన్నారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. సంపూర్ణ అణునిరాయుధీకరణ జరగాలని అమెరికా పట్టుబడుతుండగా, తమ దేశ భద్రతకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర కొరియా కోరుతోంది. గత పదేళ్లలో ద.కొరియా అధ్యక్షుడొకరు ఉ.కొరియాలో పర్యటించడం ఇదే ప్రథమం. -
భారత్ కూడా భాగస్వామే
న్యూఢిల్లీ: కొరియా ద్వీపకల్పంలో శాంతి కోసం జరిగిన ప్రయత్నాల్లో భారత్ కూడా ఓ భాగస్వామి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, భద్రత, కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ప్రాంతీయ శాంతి తదితర అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భంగా 10 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ) నవీకరణ ప్రక్రియపై సంప్రదింపులను ప్రారంభించాలని ఓ ఒప్పందంపై సంతకం చేశాయి. అనంతరం మూన్, మోదీ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం సందర్భంగా ఉ.కొరియాతో పాక్‌కు గల అణు వ్యాప్తి లింకేజీల గురించి మూన్ వద్ద మోదీ ప్రస్తావించారు. ద్వైపాక్షిక సహకారం, సముద్ర వివాదాలకు సంబంధించి ఓ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని పెంచాలని, సైనిక మార్పిడి, శిక్షణ, అనుభవ భాగస్వామ్యాన్ని∙పెంపొం దించుకోవాలని చెప్పారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత సభ్యత్వానికి ద.కొరియా మద్దతు తెలిపింది. -
జర్మనీ కూలింది
జర్మనీ... నాలుగుసార్లు చాంపియన్... మరో నాలుగుసార్లు రన్నరప్...! ప్రపంచ కప్‌లో కాలుపెట్టిందంటే కనీసం క్వార్టర్స్ ఖాయమనే బలీయ నేపథ్యం దానిది. ఫుట్‌బాల్ ప్రపంచంలో జగజ్జేతకు నిర్వచనం అనదగ్గ జట్టు! మరీ ముఖ్యంగా గత నాలుగు కప్‌లలో ఓసారి రన్నరప్, రెండు సార్లు మూడో స్థానం, క్రితంసారి విజేత..! ఏ ఒక్కరిపైనో ఆధారపడని స్థితిలో, అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తూ టైటిల్‌ను నిలబెట్టుకుంటుందనే అంచనాలతో అమేయ శక్తిగా ఈ కప్‌లో అడుగిడింది. ...కానీ బరిలో దిగాక అనుకున్నదంతా తలకిందులైంది! తొలి మ్యాచ్‌లో మెక్సి‘కోరల్లో’ చిక్కి విలవిల్లాడి ఓడింది. రెండో మ్యాచ్‌లో స్వీడన్‌పై చచ్చీ చెడి నెగ్గింది. చివరి మ్యాచ్‌లో కొరియా చేతిలో ఏకంగా చావుదెబ్బ తిన్నది. గెలుపు మాత్రమే నాకౌట్ మెట్టెక్కించే స్థితిలో బోర్లాపడింది. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తమ జట్టు చరిత్రలోనే దారుణ పరాభవం మూటగట్టుకుంది. పోరాడితే పోయేదేమీ లేని స్థితిలో... కొరియా పోతూపోతూ డిఫెండింగ్ చాంపియన్నూ తనతో పట్టుకుపోయింది. కజన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలనం. ఆ మాటకొస్తే ఫుట్‌బాల్ ప్రపంచంలోనే పెను సంచలనం. చిన్న జట్లు మాజీ చాంపియన్లను నిలువరిస్తున్న ప్రస్తుత కప్‌లో దక్షిణ కొరియా ఏకంగా జర్మనీకి జీవితాంతం మర్చిపోలేని షాక్ ఇచ్చింది. ఆటలో, చరిత్రలో, ర్యాంకులో తమకంటే ఎంతో మెరుగైన డిఫెండింగ్ చాంపియన్‌ను 2–0 తేడాతో ఓడించి టోర్నీ నుంచి తమతో పాటే ఇంటికి తీసుకెళ్లింది. కప్‌కు ముందు ఆటగాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండి, మొత్తం జట్టుకు జట్టే ప్రబలంగా కనిపించిన జర్మనీ... జట్టుగానే విఫలమై తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. 1938 తర్వాత గ్రూప్ దశలోనే నిష్క్రమించడం జర్మనీకిదే తొలిసారి. గెలిస్తేనే నాకౌట్ చేరే పరిస్థితుల్లో బరిలో దిగి... చావోరేవో తేల్చుకోవాల్సిన వేళ జర్మనీ చతికిలపడింది. మ్యాచ్ రెండు భాగాల్లోనూ గోల్ చేయలేకపోయిన ఆ జట్టు... కొరియాకు (90+3వ నిమిషంలో వైజి కిమ్), (90+6వ నిమిషంలో హెచ్ఎం సన్) ఇంజ్యూరీ సమయంలో రెండు గోల్స్ సమర్పించుకుంది. ఇందులో రెండో గోల్ నమోదైన తీరు జర్మనీ ఆటగాళ్ల దారుణ సమష్టి వైఫల్యానికి అద్దంపట్టింది. ఆఖరి నిమిషాలు కావడంతో కీపర్ మాన్యుయెల్ న్యూర్ సహా జర్మనీ ఆటగాళ్లంతా ప్రత్యర్థి ఏరియాలోకి రాగా, బంతిని కొరియా ఆటగాడు బలంగా అవతలి ఏరియాలోకి కొట్టాడు. సన్... వాయువేగంతో పరిగెడుతూ దానిని అందుకుని గోల్ పోస్ట్‌లోనికి పంపించాడు. ఆ సమయంలో కీపర్ న్యూర్ ఎక్కడో దూరంగా ఉన్నాడు. 2014 కప్‌లో అత్యుత్తమ కీపర్‌గా ‘గోల్డెన్ గ్లౌవ్’ అందుకున్న న్యూర్... దీన్నంతటినీ చూస్తూ ఉండిపోయాడు. ఇదే సమయంలో గోల్స్‌ను నిరోధించడంలో ప్రతిభ చూపిన కొరియా కీపర్ జేవో హియాన్వూకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కడం విశేషం. ఊదేస్తుందనుకుంటే... ఆఖరి క్షణాల్లోన్నైనా ఫలితాన్ని తనవైపు తిప్పుకొనే జర్మనీ బలాబలాల ముందు కొరియా ఏమాత్రం సరితూగనిది. దానికి తగ్గట్లే గోర్టెజ్కా, ఓజిల్, రూయిస్, క్రూస్, ఖెదిరాల సమన్వయంతో ఆ జట్టు ఆధిపత్యంతోనే మ్యాచ్ ప్రారంభమైంది. రక్షణాత్మక శైలితో ఆడిన కొరియాకు వీరిని కాచుకోవడంతోనే సరిపోయింది. అయితే, ఫ్రీ కిక్ రూపంలో మొదటి అవకాశం దానికే దక్కింది. జంగ్ వూయంగ్ షాట్‌ను కీపర్ న్యూర్ కొంత క్లిష్టంగానే తప్పించాడు. తర్వాత కూడా జర్మనీ ఒత్తిడి పెంచింది. 40వ నిమిషంలో బాక్స్ లోపల హమ్మెల్స్కు గోల్ చాన్స్ దక్కినా... హియెన్వూ తలతో పక్కకు నెట్టాడు. ప్రత్యర్థి ఆధిపత్యాన్ని ఛేదించేందుకు కొరియా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకుండా, గోల్సేమీ లేకుండానే మొదటి భాగం ముగిసింది. ఎన్నో అవకాశాలు వచ్చినా... రెండో భాగంలో ఎక్కువగా డిఫెండింగ్ చాంపియన్‌కే అవకాశాలు వచ్చాయి. మూడో నిమిషంలో గోర్టెజ్కా కొట్టిన హెడర్‌ను కీపర్ హియాన్వూ డైవ్ చేస్తూ నిరోధించాడు. గోమెజ్ దాదాపు గోల్ కొట్టినంత పనిచేశాడు. అటువైపు కొరియా కూర్పు మారుస్తూ ప్రయోగంతో పట్టు కోసం ప్రయత్నించింది. ఇరు జట్లలో ఇవేవీ ఫలించలేదు. ఇంజ్యూరీలో కుదేలు... ఇంజ్యూరీ రెండు నిమిషాలు కూడా గణాంకాలేమీ నమోదు కాకుండానే సాగింది. 90+3వ నిమిషంలో మాత్రం అద్భుతం జరిగింది. కార్నర్ నుంచి అందిన బంతిని యంగ్వాన్ షాట్ కొట్టగా నేరుగా జర్మనీ గోల్‌పోస్ట్‌లోకి చేరిపోయింది. ఇది ఆఫ్‌సైడ్ అంటూ అభ్యంతరాలు వచ్చినా వీఏఆర్‌లో కాదని తేలింది. 90+6 నిమిషంలో ఇంకో అద్భుతం చోటుచేసుకుంది. న్యూర్ సహా జట్టంతా కొరియా మిడ్ ఫీల్డ్ వద్ద ఉండగా... ఇటువైపు పడిన బంతిని ఛేదించిన సన్... గోల్ అందించడంతో వారి శిబిరం భావోద్వేగంలో మునిగిపోయింది. -
శాంతి కోసం తొలి అడుగు
కొరియా ద్వీపకల్పంలో శాశ్వతమైన, సుస్థిరమైన శాంతిని స్థాపించడానికి కలిసి పనిచేస్తామని వాగ్దానం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు మంగళవారం సింగపూర్‌లో చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా, దీని నిర్ణయాల అమలు కోసం సాధ్యమైనంత త్వరలో తదుపరి చర్చలు ప్రారంభిం చాలని కూడా వారు నిశ్చయించుకున్నారు. గతాన్ని పక్కనబెట్టి ముందుకు అడుగేయాలని ప్రతిన బూనారు. మూడునెలల క్రితం ఎవరి ఊహకూ అందని ఈ శిఖరాగ్ర చర్చలు ఎన్నో అవాంతరాలను అధిగమించి ఇలా సాకారం కావడం ప్రపంచ శాంతిని కాంక్షించేవారికి సంతృప్తినిస్తుందనడంలో సందేహం లేదు. ఈ చర్చలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రపంచమంతా ఎదురుచూస్తుండగా అమెరికా,ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం రాజుకోవడం... చివరకు వాటిని నిలిపేస్తున్నట్టు గత నెల చివరిలో ట్రంప్ ప్రకటించడం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. చివరకు ఉత్తర కొరియా సంయమనంతో స్పందించిన పర్యవసానంగా పరిస్థితి మళ్లీ కుదుటపడింది. ప్రపంచమంతా ఇలాంటి చర్చల కోసమే ఎన్నాళ్లనుంచో ఎదురు చూసింది. ఎందుకంటే ఉత్తర కొరియాది దేనికీ వెరవని తత్వం. 1950లో మొదలై మూడేళ్లపాటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సాగిన యుద్ధంలో దాదాపు 12 లక్షలమంది మరణించారు. ఇందులో ఉత్తర కొరియాకు అండగా వచ్చిన అమెరికన్ సైనికులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 1953లో యుద్ధ విరమణ సంధి కుదిరినా దక్షిణ కొరియా దాన్ని ఖాతరు చేయలేదు. ఆ సంధిపై ఉత్తర కొరియాతోపాటు అమెరికా, చైనాలు మాత్రమే సంతకాలు చేశాయి. రెండు కొరియాల మధ్యా పరస్పర దాడులు ఆగినా ఉద్రిక్తతలు మాత్రం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్థావరాలొ చ్చాయి. అణ్వాయుధాలు, క్షిపణులు చేరాయి. ఇప్పుడు ట్రంప్ చెప్పిన లెక్కల ప్రకారం ఆ దేశంలో ప్రస్తుతం 32,000మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. వీటన్నిటికీ అమెరికా విధించిన ఆంక్షలు అదనం. ఇన్ని దశాబ్దాలుగా ఉత్తర కొరియా ప్రజలు వీటన్నిటినీ ఎలా తట్టుకున్నారన్నది పెద్ద పజిల్. తమది సోషలిస్టు ప్రభుత్వమని ఉత్తర కొరియా చెప్పుకున్నా అక్కడ మొదటినుంచీ ఎడతెగకుండా సాగుతున్న వంశపారంపర్య పాలన ఆ అభిప్రాయానికి బలాన్నివ్వదు. ఇక పాశ్చాత్య మీడియాలో కిమ్ గురించి తరచుగా వెలువడే కథనాలు ఆయన్నొక నియంతగా, మూర్ఖత్వం మూర్తీ భవించిన నేతగా చూపుతుంటాయి. అందువల్లే సింగపూర్‌లో కిమ్ ఎటు వెళ్లినా, ఎలాంటి హావ భావాలు ప్రదర్శించినా అవి అందరిలోనూ ఆసక్తిని రేపాయి. ] గతాన్ని పక్కనబెట్టాలని అమెరికా, ఉత్తర కొరియాలు నిర్ణయించినా... ఇరు దేశాల అధినేతలూ నిజంగానే ఆ పని చేసినా అందరిలోనూ ఏదో ఒక మూల అనుమానాలుంటాయి. ఎందుకంటే ఆ గతం అలాంటిది. 1985లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసినా దానికి కొన సాగింపుగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)తో రావలసిన ఒప్పందానికి ఉత్తర కొరియా ససేమిరా అంది. దక్షిణ కొరియా నుంచి అమెరికా సేనలు వైదొలగితే తప్ప దానిపై సంతకం చేయబోనని స్పష్టం చేసింది. 1994లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆ దేశంతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నారు. 2000లో అమెరికాలో సీనియర్ బుష్ హయాం మొదలు కావడంతో అది కాస్తా మూలనబడింది.ఆయన కుమారుడు బుష్ అధ్యక్షుడిగా ఉండగా మళ్లీ చర్చలు మొదలయ్యాయి. చైనా, జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రష్యా, అమెరికాలు ఇందులో పాల్గొన్నాయి. అవి ఒక కొలిక్కి వచ్చే దశలో తమ బ్యాంకు ఖాతాలను అమెరికా స్తంభిం పచేయడంతో ఆగ్రహించిన ఉత్తర కొరియా చర్చల నుంచి వైదొలగింది. ఏడాది తర్వాత అమెరికా దారికొచ్చి ఆ ఆంక్షలు తొలగించింది. తిరిగి 2009లోనూ, 2012లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందువల్లే సింగపూర్ చర్చలూ అదే తరహాలో ముగుస్తాయని అనుమానాలు రావడం సహజం. శిఖరాగ్ర చర్చల పర్యవసానంగా ఇప్పటికి జరిగిన మేలు ఏమంటే ఆ ఇద్దరు దేశాధినేతలూ ఇకపై పరస్పరం బెదిరించుకోరు. తమ దేశ భద్రతకు గ్యారెంటీ ఇస్తే అణ్వాయుధాలను వదులు కోవడానికి సిద్ధమని కిమ్ ప్రకటించినా... మరిన్ని చర్చల తర్వాతగానీ ఈ విషయంలో స్పష్టత ఏర్పడదు. అటు ట్రంప్ కీలకమైన హామీలిచ్చారు. ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని చెబు తూనే దక్షిణ కొరియాతో ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలుండవని, అక్కడి తమ సైనిక స్థావరాలను మూసేస్తామని, 32,000మంది అమెరికా సైనికులనూ వెనక్కు రప్పిస్తానని ఆయన ప్రకటించారు. ట్రంప్ స్వభావం తెలిసినవారు తొలి అడుగులోనే ఉత్తర కొరియాకు ఇన్ని వరాలివ్వడంలోని ఆంతర్యమేమిటో బోధపడక సహజంగానే గందరగోళపడతారు. ఇన్నాళ్లూ ఉత్తర కొరియాకు సహకరించిన చైనా... అమెరికా మిత్రదేశం దక్షిణ కొరియా కూడా సహకరిస్తేనే ఈ చర్చలు సవ్యమైన దిశగా సాగుతాయి. అయితే ఉత్తర కొరియా వద్ద అణ్వస్త్రాలు లేనట్టయితే ప్రపంచానికి ముప్పు తప్పుతుందని అమె రికా చేస్తున్న ప్రచారం వాస్తవాన్ని ప్రతిబింబించదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో 9 దేశాల వద్ద 16,000 అణ్వస్త్రాలున్నాయి. మరికొన్ని దేశాలు ఆ బాటన నడవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అణ్వస్త్రాలు చేజిక్కించుకోవాలని ఉగ్రవాద ముఠాలు కాచుక్కూర్చున్నాయి. ఇలాంటి విపత్కర పరి స్థితుల్లో అణ్వస్త్ర దేశాలన్నీ స్వచ్ఛందంగా వాటిని వదులుకుని సంపూర్ణ అణు నిరాయుధీకరణకు సహకరిస్తే తప్ప ఈ ప్రపంచం సురక్షితంగా ఉండదు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పడం ఆ దిశగా తొలి అడుగైతే బాగుండునని నిజమైన శాంతికాముకులు కోరుకుంటారు. అలాగాక నయానో భయానో మరో దేశం అమెరికాకు లొంగి ఉండటానికి సిద్ధపడిందనిపించుకోవాలని ట్రంప్ భావిస్తే దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. -
సంయుక్త ప్రకటనలో ఏముందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జాంగ్ ఉన్ కొత్త అధ్యాయానికి తెరలేపుతూ ఒక చారిత్రక ప్రకటన మీద సంతకాలు చేశారు. సమగ్రమైన, లోతైన చర్చలు జరిపి, పరస్పరం అభిప్రాయాలు పంచుకున్న అనంతరం కొరియా ద్వీపంలో శాంతి స్థాపన, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలు చేపడతామని ఇరువురు నేతలు ప్రతిజ్ఞ చేశారు. కొరియా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ హామీ ఇస్తే, అణు నిరాయుధీకరణకు తాము కట్టుబడి ఉన్నామని కిమ్ మరోసారి గట్టిగా చెప్పారు. అనంతరం ఒక సంయుక్త ప్రకటన మీద సంతకాలు చేశారు. ఆ ప్రకటనలో ఉన్న అంశాలు శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య బంధం బలపడేలా చర్యలకు కట్టుబడి ఉండడం కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం ఏప్రిల్ 27, 2018న ఉత్తర కొరియా తాను చేసిన అణునిరాయుధీకరణ ప్రకటనకు కట్టుబడి ఉండడం, సంపూర్ణ అణునిరాయుధీకరణ జరిగేలా కిమ్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధం సమయంలో కనిపించకుండా పోయిన వారిని గుర్తిస్తే వారిని తిరిగి తమ తమ దేశాలకు అప్పగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలి. చాలా సంక్షిప్తంగా ఉన్న ఈ ప్రకటనపై సంతకాలు చేసిన ఇరువురు నేతలు, ఈ సానుకూల దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి విదేశాంగ శాఖ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారుల స్థాయిలో చర్చలు జరపడాలని నిర్ణయించారు. వీలైనంత త్వరలో వీరి భేటీ ఉండేలా చర్యలు తీసుకోవడానికి ఇరువురు అంగీకరించారు. కిమ్‌ను వీడియోతో పడగొట్టిన ట్రంప్..!! -
గత అధ్యక్షులు విఫలం
వాషింగ్టన్: కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం గతంలో అమెరికా చేసిన ప్రయ త్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆ విషయంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన 11 మంది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయా రు. 1960ల్లో కెన్నడీ, జాన్సన్ అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఉత్తర కొరియాతో కొంతవరకు సత్సంబంధాలు కొనసాగాయి. 1968లో అమెరికా నిఘా నౌకల్ని నిర్బంధించడంతో పాటు గూఢచర్య విమానాల్ని ఉత్తర కొరియా పేల్చివేసింది. ఆ తర్వాత రెండేళ్లకి ఉత్తర కొరియా తన ధోరణి మార్చుకుని శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 1974 అనంతరం అప్పటి ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇల్ సంగ్, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు చేశారు. అయితే చర్చల్లో ముందడుగు పడలేదు. 1981 లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. దక్షిణా కొరియాను సమర్థిస్తూ మిలటరీ బలగాల్ని పెంచారు. ఆ తర్వాతి అధ్యక్షుడు జార్జ్ బుష్(సీనియర్) దక్షిణకొరియా నుంచి భారీగా సైన్యాన్ని వెనక్కి రప్పించారు. అయితే ఉత్తరకొరియాతో శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. 1993–2001 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఉత్తర కొరియాతో సంక్షోభ పరిష్కారానికి కొంతవరకు ప్రయత్నాలు చేశారు. పదేళ్ల పాటు శాంతియుత సంబంధాలే కొనసాగినా, జార్జ్ బుష్(జూనియర్) అధ్యక్షుడయ్యాక మళ్లీ సంబంధాలు క్షీణించాయి. ఉ.కొరియాతో సంబంధాల విషయంలో ఒబామా సంయమనం పాటించారు. ఆంక్షలతో దారికి వస్తుం దని భావించారు. 2011లో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టిన కిమ్ ఆంక్షల్ని లెక్క చేయకుం డా అణుపరీక్షలు కొనసాగించారు. ఈ సారైనా ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు వెళ్తా యా? లేక గతంలో మాదిరిగా ప్రహసనంగా మారుతుం దా? అన్నది ట్రంప్ చేతుల్లోనే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. -
కొరియాతో శాంతి చర్చలు ఏ ఫెయిల్యూర్ స్టోరీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మధ్య సింగపూర్‌లో జరగనున్న చర్చలు సానుకూల ఫలితాలే వస్తాయన్న అంచనాలు ఉన్నాయి కానీ ఒక్కసారి గత చరిత్ర చూస్తే మనకి అన్నీ ఫెయిల్యూర్ స్టోరీలే కనిసిస్తాయి. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన, భద్రతకు సంబంధించిన చర్చల విషయంలో గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన 11 మంది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయారు. 1960 దశకంలో అమెరికాలో కెన్నడీ, జాన్సన్ అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఉత్తర కొరియాతో కొంతవరకు సత్సంబంధాలనే కొనసాగించారు. 1968లో ఉత్తర కొరియా అమెరికాకు చెందిన నిఘా నౌకల్ని నిర్బంధించడం, గూఢచర్య విమానాల్ని పేల్చివేయడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఆ తర్వాత రెండేళ్లకి ఉత్తర కొరియా తన ధోరణి మార్చుకొని శాంతి చర్చలకు సిద్ధమంటూ ప్రకటించింది. 1974లో అమెరికా కాంగ్రెస్‌కు బహిరంగ లేఖరాసినప్పటికీ నాటి అమెరికా నాయకత్వం ప్రతిస్పందించలేదు. ఆ తర్వాత కాలంలో అప్పటి ఉత్తర కొరియా అధినేత కిమ్ ఇల్ సంగ్, నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు సాగించారు. దక్షిణ కొరియా భూభాగంలో సైనిక బలగాన్ని తగ్గించాలని కార్టర్ విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ చర్చల విషయంలో ముందడుగు పడలేదు. ఇక 1981లో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. దక్షిణా కొరియాను సమర్థిస్తూ మిలటరీ బలగాల్ని పెంచారు. ఆ తర్వాత అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ విదేశాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణలో భాగంగా దక్షిణకొరియా నుంచి కూడా భారీ సంఖ్యలో సైన్యాన్ని వెనక్కి రప్పించారు. కానీ ఉత్తరకొరియాతో శాంతి చర్చలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. 1993–2001 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్ ఉత్తర కొరియాతో ఉన్న సంక్షోభ పరిష్కారానికి కొంతలో కొంతవరకు ప్రయత్నాలు చేశారు. 1994లో కొన్ని ప్రతిపాదనలు రూపొందించడం, 2001లో ఒక సంయుక్త ప్రకటన జారీ కావడం వంటివి మైలురాళ్లుగా నిలిచాయి. దాదాపు పదేళ్ల పాటు శాంతియుత సంబంధాలే కొనసాగినా, జార్డ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడయ్యాక మళ్లీ సంబంధాలు క్షీణించాయి. ఉత్తరకొరియా తదితర దేశాలనూ దుష్ట కూటమి అని అభివర్ణించిన బుష్ కొరియాతో ఉద్రిక్తతలనే పెంచి పోషించారు. ఇరు దేశాల మ«ధ్య రాజకీయ, ఆర్థిక సయోధ్యకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు అమెరికా కట్టుబడి లేకపోవడంతో ఉత్తర కొరియా 2003 సంవత్సరంలో అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగింది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు మరి ముందుకు సాగలేదు. 2006 నుంచి ఉత్తరకొరియా ముమ్మరంగా అణు పరీక్షలు ఆ తర్వాత కాలంలో ఉత్తర కొరియా విస్తృతంగా అణు పరీక్షల్ని నిర్వహించడం మొదలు పెట్టింది. గత ఏడాది వరకు అణు పరీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో ఒబామా అధ్యక్షుడు అయ్యాక ఉత్తర కొరియాతో సంబంధాల విషయంలో వ్యూహాత్మక సహనం అనే విధానాన్ని పాటిస్తూ వచ్చారు. ఆర్థిక ఆంక్షలతో ఉత్తర కొరియా దారిలోకి వస్తుందని భావించారు. మరోవైపు 2011లో ఉత్తర కొరియాలో అధికార పగ్గాలు చేపట్టిన కిమ్ జాంగ్ ఉన్ ఆంక్షల్ని లెక్క చేయకుండా అణు పరీక్షలు ముమ్మరంగా సాగించారు. ఖండాంతర క్షిపణుల్ని పరీక్షించారు. హైడ్రోజన్ బాంబు పరీక్షలు కూడా జరిపినట్టు ప్రకటించారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య అణుబాంబుల్లాంటి మాటల తూటాలు పేలాయి. చివరికి ఉత్తర కొరియాను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆర్థిక ఆంక్షల్ని తొలగింపజేసుకోవడం కోసం కిమ్ కొన్ని మెట్లు దిగివచ్చారు. అణు పరీక్ష కేంద్రాలను ధ్వంసం చేస్తూ శాంతి మంత్రానికి పచ్చ జెండా ఊపారు. ఇప్పుడు మళ్లీ బంతి అమెరికా కోర్టులోనే ఉంది. ఈ సారైనా ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు వెళతాయా, లేదా గతంలో మాదిరిగా ఇదో ప్రహసనంగా మారిపోతుందా అన్నది ట్రంప్ చేతుల్లోనే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
భారత మహిళలకు రెండో గెలుపు
సియోల్: దక్షిణ కొరియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కొరియాతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత్ 3–2తో గెలిచింది. భారత్ తరఫున పూనమ్ రాణి (6వ నిమిషంలో), రాణి రాంపాల్ (27వ ని.లో), గుర్జీత్ కౌర్ (32వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు యురిమ్ లీ (10వ ని.లో), జంగ్‌జియున్ సియో (31వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ గురువారం జరుగుతుంది. -
రాష్ట్రంలో జపాన్, కొరియా పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చే ఏడాది జపాన్, దక్షిణ కొరియా నుంచి పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వారికి వివరించామన్నారు. మంత్రి కేటీఆర్ బృందంతో కలసి ఈ రెండు దేశాల్లో పర్యటించిన విశేషాలను సోమవారం విలేకరులకు వివరించారు. కొరియా సహకారంతో వరంగల్‌లో ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు చేయనున్నామన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తోన్న మెగా టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ పారిశ్రామికవేత్తలను కోరామన్నారు. టెక్స్టైల్స్ ఉత్పత్తుల ప్రదర్శన కోసం నగరంలో ఫ్యాషన్ సిటీతో పాటు కొరియా లాంగ్వేజ్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ అంగీకరించినట్లు తెలిపారు. క్లీన్ ఎనర్జీ, పౌల్ట్రీ రంగాల్లో సహకారం కోసం జపాన్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపన కోసం సుజూకీతో చర్చలు జరిపామన్నారు. వచ్చే నెలలో కొరియా కాన్సులేట్ హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో దక్షిణ కొరియా కొత్త కాన్సులేట్‌ను కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి ప్రారంభించానున్నారని తెలంగాణలో కొరియన్ గౌరవ కాన్సుల్ జనరల్ సురేశ్ చుక్కపల్లి తెలిపారు. -
కొరియా కల్లోలం!
ముంబై: అంతర్జాతీయ ప్రతికూలతలకు దేశీయ అంశాలు తోడుకావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలపాలయ్యాయి. కొరియా తాజాగా యుద్ధ కాంక్షను ప్రకటించడం, చైనా రేటింగ్ డౌన్‌గ్రేడ్, దేశీయ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు తోడుకావడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సూచీలు నిట్టనిలువునా కూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సుమారు 170 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా, రోజంతా నష్టాల్లోనే కొనసాగి చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 447.60 పాయింట్లు (1.38 శాతం) కోల్పోయి 31,922.44 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు సూచీలు ఏ దశలోనూ కోలుకోకపోవడం అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది. గతేడాది నవంబర్ 15 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద పతనం ఇది. అంతకుముందు మూడు సెషన్లలో సెన్సెక్స్ 53 పాయింట్ల మేర నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక మార్కు 10,000లోపునకు జారిపోయింది.157.50 పాయింట్ల నష్టంతో 9,964.40 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో నిఫ్టీ 9,952.80 కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ వారంలో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 350 పాయింట్లు (ఒక శాతం) కోల్పోగా, నిఫ్టీ 121 పాయింట్లు (1.19 శాతం) నష్టపోయింది. సెన్సెక్స్ ప్యాక్‌లో టాటాస్టీల్ షేరు ధర గరిష్టంగా 5 శాతం పతనమై రూ.654.55 వద్ద క్లోజయింది. ఎల్అండ్టీ 3.5 శాతం తగ్గగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ సైతం నష్టాలను ఎదుర్కొన్నాయి. సూచీలోని విప్రో, కోల్ ఇండియా తప్ప మిగతావన్నీ నష్టాల్లోనే ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రూ.1,299 కోట్ల మేర విక్రయాలు జరపగా, శుక్రవారం రూ.1,200 కోట్ల అమ్మకాలు జరిపారు. ఈ రెండు రోజుల్లో దేశీయ ఇనిస్టిట్యూషన్స్ నికరంగా రూ.1,900 కోట్ల మేర కొనుగోళ్లు జరిపాయి. బీఎస్ఈ రియల్టీ సూచీ 4.29 శాతం తగ్గింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీలు 3 శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈలో 2,139 స్టాక్స్ నష్టాల పాలు కాగా, 484 స్టాక్స్ లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదకు చిల్లు మార్కెట్ల భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.2.68 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.2,68,853.7 కోట్ల మేర తగ్గి రూ.1,33,40,008 కోట్ల వద్ద స్థిరపడింది. విశ్లేషకులు ఏమంటున్నారు..? ‘‘కొరియా ఉద్రిక్తతలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఫ్యూచర్స్, ఆప్షన్ల ముగింపు దగ్గర పడుతుండటంతో లిక్విడిటీపై ఒత్తిడి పడింది. ఎఫ్ఐఐలు నికర విక్రయదారులుగా ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం చర్యల్ని చేపడితే ద్రవ్యలోటు లక్ష్యాలపై ప్రభావం పడుతుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ముఖ్య విశ్లేషకుడు ఆనంద్‌జేమ్స్ తెలిపారు. ‘‘కొరియా ఉద్రిక్తతల కారణంగా బలహీన ప్రపంచ సంకేతాల వల్లే మార్కెట్లు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. దీనికి తోడు ఎఫ్ఐఐలు అమ్మకాలు కొనసాగిస్తుండటం నష్టాలకు కారణం’’ అని యెస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ పేర్కొన్నారు. కొరియా ఉపఖండంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కరెక్షన్కు కారణమని యాక్సిస్ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో అరుణ్ తుక్రాల్ కూడా తెలిపారు. ఈ తరహా పరిస్థితులకు ఈక్విటీ మార్కెట్లు వేగంగా స్పందిస్తాయని అభిప్రాయపడ్డారు. అమ్మకాలు ఇందుకే...! 1 పసిఫిక్ మహాసముద్రంలో మరో శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించే అవకాశం ఉందంటూ స్వయంగా ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపింది. అది మన మార్కెట్లనూ తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానసికంగా కలత చెందుతున్నారని, ఉత్తరకొరియాను దెబ్బతీయాలన్న కాంక్ష వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. దీంతో తగ్గుముఖం పట్టాయనుకున్న ఉద్రిక్త పరిస్థితి మొదటికొచ్చినట్టయింది. 2 ఉత్తరకొరియా వరుస అణు క్షిపణి ప్రయోగాలతో అమెరికా, ఆ దేశం మధ్య ఉద్రిక్తతలు మొదలైన దగ్గర్నుంచి అంటే గత నెల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. ఆగస్ట్ నెలలో నికరంగా రూ.15,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఆగస్ట్ నుంచి ఈ నెల 14 నాటికి చూస్తే... నికరంగా ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.22,693 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మార్కెట్ల పతనానికి ఇది కూడా కారణమే. 3 ఈ ఏడాది ముగిసేలోపు మరోసారి పాలసీ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని, ఆర్థిక ఉద్దీపనలను అక్టోబర్ నుంచి క్రమంగా వెనక్కి తీసుకుంటామని(లిక్విడిటీ తగ్గింపు చర్యలు) అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేసిన తాజా ప్రకటనతో డాలర్ తిరిగి బలపడుతోంది. రూపాయి 6 నెలల కనిష్ట స్థాయి(64.79)కి చేరింది. 4 మన స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ) ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మూడేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.7 శాతానికి పడిపోవడంతో, దీన్ని పునరుద్ధరించేందుకు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా చేసిన ప్రకటన సైతం ప్రభావం చూపింది. ప్రభుత్వం వృద్ధి రేటు కోసం వ్యయాలను పెంచితే ద్రవ్యలోటు క్రమం తప్పుతుందన్న ఆందోళనా తోడయింది. మరోపక్క, వృద్ధి అంచనాలను తాజాగా ఓఈసీడీ తగ్గించడం గమనార్హం. 5 మరోవైపు చైనా సార్వభౌమ రేటింగ్‌ను ఎస్అండ్పీ తగ్గించడం సైతం ప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్ల నష్టాలకు ఇది కూడా కారణమే. -
ఫెడ్ భేటీ,కొరియాపై దృష్టి!
► ఉత్తర కొరియా ఉద్రిక్తతల ప్రభావం ► ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితం ► మూడు కొత్త కంపెనీల లిస్టింగ్ ► ఈ నెల 20 నుంచి ఎస్బీఐ లైఫ్ ఐపీఓ కొరియా ప్రాంతంలో చెలరేగుతున్న ఉద్రిక్తతలు ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ ఫలితం కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తుందని వారంటున్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు కూడా కీలకం కానున్నాయని విశ్లేషకులంటున్నారు. ఇక రెండో క్వార్టర్‌కు సంబంధించిన కరంట్ అకౌంట్ గణాంకాలను ప్రభుత్వం ఈ వారంలోనే వెలువరిస్తుంది. కొరియా పరిణామాలతో ముడిపడిన భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం కీలకం కానున్నాయని కోటక్ మ్యూచువల్ ఫండ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ శిబానీ కురియన్ చెప్పారు. గత వారంలో ఉత్తర కొరియా జపాన్ మీదుగా మరో క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీలు ముఖ్యంగా ముడి చమురు ధరల గమనం కూడా స్టాక్ సూచీల కదలికలను ప్రభావితం చేస్తుందని కురియన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగింపుకు వచ్చిన నేపథ్యంలో రానున్న వారాల్లో మార్కెట్ దృష్టి కంపెనీల ఆర్థిక ఫలితాల రికవరీపై ఉంటుందని వివరించారు. కొరియాతో చర్చలు జరిగితే సానుకూల ప్రభావం ఉంటుందని, మరో క్షిపణి ప్రయోగం జరిగితే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. ఫెడ్ వ్యాఖ్యల ప్రాధాన్యం.... అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు విషయమై తీసుకునే నిర్ణయం ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. అమెరికాలో అర్థిక పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో 25 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు తప్పదని, అయితే భవిష్యత్ రేట్ల పెంపుపై ఫెడ్ సమావేశం వ్యాఖ్యలు కీలకం కానున్నాయని జైఫిన్ ఆడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. 21న ఫెడ్ సమావేశం నిర్ణయం వెలువడనుంది. ఈ వారంలోనే ఎస్బీఐ లైఫ్ ఐపీఓ ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓలు ఉండగా, మూడు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కానున్నాయి. నేడు (సోమవారం) డిక్సన్ టెక్నాలజీస్, భారత్ రోడ్ నెట్వర్క్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. ఈ రెండు ఐపీఓలు ఈ నెల 8న ముగిశాయి. డిక్సన్ టెక్నాలజీస్ ఇష్యూ ధర రూ.1,766గా, భారత్ రోడనెట్వర్క్ తన ఇష్యూ ధరను రూ.205గా నిర్ణయించాయి. ఈ నెల 21న(గురువారం)మాట్రిమోనిడాట్కామ్ స్టాక్ మార్కెట్లో లిస్టవనున్నది. ఇక ఈ నెల 20న(బుధవారం) ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మొదలవుతుంది. ఈ నెల 22న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.8,400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓ ధరల శ్రేణి రూ.685–700. అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేర్‌కు రూ.68 డిస్కౌంట్ లభిస్తుంది. కనీసం 21 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక గత శుక్రవారం ప్రారంభమైన ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఐపీఓ 19న(మంగళవారం) ముగియనున్నది. రూ.3,000 కోట్ల విదేశీ స్టాక్ పెట్టుబడులు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్ల స్టాక్ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. ఉత్తర కొరియా ఉద్రిక్తతలు, అంతంత మాత్రంగానే ఉన్న కంపెనీల క్యూ1 ఫలితాలు దీనికి కారణాలని నిపుణులంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.12,770 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని, దీనికి కొనసాగింపుగా ఈ నెలలో కూడా స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని వారంటున్నారు. డిపాజిటరీల తాజా గణాంకాల ప్రకారం.., ఈ నెల 15 వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి రూ.3,085 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా, డెట్ మార్కెట్లో మాత్రం రూ.3,051 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు రూ.45,099 కోట్లుగా ఉన్నాయి. -
మన ‘రాకెట్’ పైపైకి...
⇔ పురుషుల సింగిల్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ల జోరు ⇔ ఒకరిని మించి మరొకరు రాణిస్తున్న వైనం ⇔ సంచలన విజయాలతో ప్రత్యర్థులకు చుక్కలు ⇔ చైనాకు దీటుగా ప్రదర్శన నాడు... చైనా, కొరియా, జపాన్, మలేసియా, ఇండోనేసియా ఆటగాళ్లు ప్రత్యర్థులుగా ఎదురైతే మనోళ్ల విజయంపై ఎవరికీ అంతగా నమ్మకం ఉండేది కాదు. నేడు... ప్రపంచ నంబర్‌వన్ లేదా ఒలింపిక్ చాంపియన్ లేదా ఆసియా విజేతలు ప్రత్యర్థులుగా ఎదురైనా మనోళ్లు వెనుకడుగు వేయడం లేదు. సంచలనం కూడా సంబర పడేలా విజయాలు సాధిస్తున్నారు. ఇన్నాళ్లూ మహిళల సింగిల్స్‌లో సైనా, సింధు సాధించిన విజయాలతోనే మనం మురిసిపోయాం. పురుషుల సింగిల్స్ విషయానికొస్తే మనోళ్ల పోరాటం క్వార్టర్ ఫైనల్లో లేదా సెమీఫైనల్లో ముగిసేది. ఏడాదిలో ఒకటి లేదా రెండు టోర్నీల్లో ఈ మెరుపులు కనిపించేవి. కానీ నేడు సీన్ రివర్స్ అయింది. అడపాదడపా విజయాలు కాకుండా నిలకడగా రాణిస్తూ భారత్ నుంచి ఒక్కసారిగా నలుగురైదుగురు ఆటగాళ్లు తెరపైకి వచ్చేశారు. సాక్షి క్రీడావిభాగం : వరుసగా మూడు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా... వారం వ్యవధిలో రెండు సూపర్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్స్ సాధించి కిడాంబి శ్రీకాంత్ భారత క్రీడాభిమానులను ఆనందడోలికల్లో ముంచాడు. పట్టుదలకు తోడు కృషి, సరైన మార్గదర్శకత్వం జతకలిస్తే అంతర్జాతీయస్థాయిలో మన ఆటగాళ్లు ఎవరికీ తీసిపోరని శ్రీకాంత్ నిరూపించాడు. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో దిగ్గజం లిన్ డాన్ (చైనా)ను మట్టికరిపించి శ్రీకాంత్ పెను సంచలనమే సృష్టించాడు. ఆ తర్వాత ఏడాది అతని ఖాతాలో గొప్ప విజయాలు కనిపించలేదు. 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించి శ్రీకాంత్ మరోసారి మెరిశాడు. ఈ టైటిల్ తర్వాత అదే ఏడాది అతను మళ్లీ ‘సూపర్ సిరీస్’ విజయాలు సాధించలేకపోయాడు. 2016లో రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం మినహా శ్రీకాంత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఈ ఏడాది ఈ తెలుగు తేజం పడిలేచిన కెరటంలా ఎగిశాడు. చీలమండ గాయం నుంచి తేరుకున్నాక శ్రీకాంత్ ఈ ఏడాది వరుసగా మూడు సూపర్ సిరీస్ టోర్నీలలో (సింగపూర్, ఇండోనేసియా, ఆస్ట్రేలియన్) ఫైనల్‌కు చేరుకున్నాడు. సింగపూర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన అతను తర్వాతి రెండు టోర్నీల్లో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో వరుసగా రెండు సూపర్ సిరీస్ టోర్నీలు గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన శ్రీకాంత్‌ను ఇటీవలే కొత్తగా వచ్చిన ఇండోనేసియా కోచ్‌లు ముల్యో హొండోయో, హరియవన్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. జయహో సాయి... అద్భుత ప్రతిభ ఉన్నా కీలక సమయంలో ఒత్తిడికి లోనై పరాజయాలు మూటగట్టుకున్న భమిడిపాయి సాయిప్రణీత్ ఈ ఏడాది అద్భుత పురోగతి సాధించాడు. తొలుత జనవరిలో సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో ఈ హైదరాబాద్ ప్లేయర్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి టైటిల్‌ను ఎగురేసుకపోయాడు. ఫైనల్లో అతను శ్రీకాంత్‌ను ఓడించడం విశేషం. ఆ తర్వాత జూన్‌లో థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సాయిప్రణీత్ విజేతగా నిలిచాడు. ఇండోనేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడినప్పటికీ... ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్ చేతిలో ఓడిపోయాడు. ప్రణయ్ నాదం... ఏడేళ్ల క్రితం యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో రజతం సాధించి వెలుగులోకి వచ్చిన కేరళ ప్లేయర్ ప్రణయ్ ఇటీవలే జరిగిన ఇండోనేసియా ఓపెన్‌లో వరుస మ్యాచ్‌ల్లో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా), ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)లను ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 2014లో ఇండోనేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్, 2016లో స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్స్ గెలిచిన ప్రణయ్ తాజా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే... ఈ ఏడాది మిగిలిన ఆరు సూపర్ సిరీస్ టోర్నీలలో అతని రాకెట్ నుంచి మరిన్ని అద్భుత విజయాలు వచ్చే అవకాశాలున్నాయి. శభాష్...సమీర్ ఆరేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సమీర్ వర్మ గత రెండేళ్లలో ఒక్కసారిగా దూసుకొచ్చాడు. గతేడాది హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సమీర్... ఈ ఏడాది సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ ఫైనల్లో సాయిప్రణీత్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు సీనియర్లు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ, పారుపల్లి కశ్యప్ కూడా మళ్లీ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతుండగా... జూనియర్ ఆటగాళ్లు సిరిల్ వర్మ, ప్రతుల్ జోషి, ఆదిత్య జోషి, లక్ష్య సేన్ కూడా ఆకట్టుకుంటున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య పురుషుల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో చైనా తర్వాత భారత్ నుంచి మాత్రమే టాప్–35లో ఆరుగురు (శ్రీకాంత్, జయరామ్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ) ఆటగాళ్లున్నారు. ఈ ఏడాది జరిగిన ఆరు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మూడు టైటిల్స్ లభించడం విశేషం. సింగపూర్ ఓపెన్‌లో సాయిప్రణీత్, ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శ్రీకాంత్ విజేతలుగా నిలిచారు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో లీ చోంగ్ వీ (మలేసియా)... ఇండియా ఓపెన్‌లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), మలేసియా ఓపెన్‌లో లిన్ డాన్ (చైనా) టైటిల్స్ గెలిచారు. ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా), విశ్వవిజేత, ఆసియా చాంపియన్, రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) వరుసగా రెండు టోర్నీల్లో భారత ఆటగాళ్ల చేతిలోనే ఓడిపోయారు. ఇండోనేసియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సన్ వాన్ హోపై శ్రీకాంత్ రెండుసార్లు గెలుపొందాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో చెన్ లాంగ్‌ను శ్రీకాంత్ ఓడించాడు. ఇండోనేసియా ఓపెన్‌లో చెన్ లాంగ్తోపాటు మలేసియా దిగ్గజం లీ చోంగ్ వీపై ప్రణయ్ గెలిచాడు. ఈ ఏడాది జరిగిన ఆరు సూపర్ సిరీస్ టోర్నీలలోనూ బ్యాడ్మింటన్ పవర్ సెంటర్స్‌గా పేరొందిన చైనా, కొరియా, ఇండోనేసియా, మలేసియా, జపాన్ దేశాల ఆటగాళ్లపై భారత ఆటగాళ్లు కనీసం ఒక్కో విజయమైనా సాధించారు. -
ఇన్ఫ్రా అభివృద్ధికి భారత్–కొరియా ఒప్పందాలు
న్యూఢిల్లీ/సియోల్: మౌలిక సదుపాయాల అభివృద్ధి, ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి సంబంధించి భారత్, కొరియాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. సియోల్‌లో జరిగిన ఐదవ ఇండియా–కొరియా ఆర్థిక సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, దక్షిణ కొరియా ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి కిమ్ డాంగ్–యెన్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాజా ఒప్పందాలు జరిగాయి. భారత్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధికి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం, 9 బిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణాలు అందించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. -
కొరియా చేతిలో ఓడినా...
క్వార్టర్స్‌లో భారత్ ► ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్ షిప్ హో చి మిన్ (వియత్నాం): ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్ షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో కొరియా చేతిలో ఓడినప్పటికీ గ్రూప్ ‘డి’ విభాగంలో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 24–22, 21–9తో వాన్ హో సాన్ పై గెలుపొందగా... మిగిలిన అన్ని మ్యాచ్‌లో్లనూ భారత క్రీడాకారులకు పరాజయాలే ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్‌లో యూ జంగ్ చై– సోల్గ్యు చోయ్ జోడి 21–17, 17–21, 21–17తో అశ్విని పొన్నప్ప– సుమీత్ రెడ్డి జంట పై, పురుషుల డబుల్స్‌లో జి జంగ్ కిమ్– యెన్ సియోంగ్ యూ 21–15, 28–26తో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టిపై నెగ్గగా... మహిళల డబుల్స్‌లో యె న చంగ్– సీ హీ లీ జంట 21–13, 21–19తో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీపై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లోనూ తన్వి లాడ్ 8–21, 15–21తో జి హ్యూన్ సంగ్ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్, థాయిలాండ్‌తో తలపడుతుంది. -
ఫైనల్లో భారత్
క్వాంటన్ (మలేసియా):ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీలో భారత జట్టు ఫైనల్ కు చేరింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో గెలిచి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి నాలుగు క్వార్టర్లు ముగిసే సరికి ఇరు జట్లు 2-2 తో సమంగా ఉండటంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో భారత్ ఐదు గోల్స్ సాధించి ఫైనల్ కు చేరగా, కొరియా నాలుగు గోల్స్ కు మాత్రమే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2011లో తొలిసారి జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. మరోసారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగింది. లీగ్ దశను దిగ్విజయంగా అధిగమించిన భారత్.. అదే జోరును సెమీస్‌లో కూడా కనబరించింది. కీలక ఆటగాళ్లు దూరమైనా భారత అభిమానులు పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఫైనల్లోకి ప్రవేశించింది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి కొరియా
కౌంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నీ సెమీఫైనల్లో భారత్ జట్టు శనివారం కొరియాతో తలపడుతుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత్ 13 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలవగా... మలేసియా, పాకిస్తాన్, కొరియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గురువారం మలేసియా, కొరియా జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కొరియా గెలిచి ఉంటే... సెమీస్‌లో భారత్‌కు పాక్ ప్రత్యర్థిగా ఎదురయ్యేది. మ్యాచ్ డ్రాగా ముగిసినందున కొరియా పారుుంట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్, కొరియాల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మరో సెమీస్‌లో మలేసియా, పాకిస్తాన్ తలపడతారుు. -
భారత్‌కు కొరియా షాక్
• కబడ్డీ ప్రపంచకప్‌లో పెను సంచలనం • ఆఖరి క్షణాల్లో ఓడిన ఆతిథ్య జట్టు అహ్మదాబాద్: తొమ్మిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న కబడ్డీ ప్రపంచకప్ పెను సంచలనంతో ప్రారంభమైంది. ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా స్టార్స్‌గా మారిన భారత ఆటగాళ్లు ప్రపంచ వేదికపై మాత్రం షాక్ తిన్నారు. ప్రొ కబడ్డీలో కోల్‌కతా తరఫున ఆడి భారత్‌కు చిరపరిచితుడైన కొరియా ఆటగాడు జాంగ్ కున్ లీ సంచలన ఆటతీరుతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శనివారం జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో కొరియా 34-32తో భారత్‌ను ఓడించింది. తొలి ఐదు నిమిషాల్లో కొరియా 4-2 ఆధిక్యంతో ఉన్నా... భారత జట్టు పుంజుకుని వరుస పాయి0ట్లతో స్టేడియంను హోరెత్తించింది. దీంతో ప్రథమార్ధంలో భారత్ 18-13తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలోనూ భారత్ ఓ దశలో 27-21తో ఆధిక్యంలో ఉంది. అయి0తే చివరి ఐదు నిమిషాల్లో కొరియా ఆటగాళ్లు చెలరేగిపోయారు. పటిష్టమైన డిఫెన్‌సతో టాకిల్ పాయి0ట్లు సాధించారు. మరోవైపు కున్ లీ చివరి మూడు నిమిషాల్లో ఏకంగా ఎనిమిది పాయి0ట్లు తెచ్చాడు. 39వ నిమిషం వరకు 29-27తో ఆధిక్యంలో ఉన్న భారత్... చివరి నిమిషంలో మ్యాచ్‌ను కోల్పోయి0ది. కొరియా తరఫున కున్ లీ మొత్తం పది పాయి0ట్లు సాధించడంతో పాటు మరో ఐదు బోనస్ పాయి0ట్లు కూడా తెచ్చాడు. డాంగ్ జియోన్ లీ ఆరు పాయి0ట్లు సాధించాడు. భారత్ తరఫున కెప్టెన్ అనూప్ కుమార్ 9 పాయి0ట్లు సాధించడంతో పాటు మూడు బోనస్ పాయి0ట్లు తెచ్చాడు. మంజీత్ చిల్లర్ ఐదు పాయి0ట్లు తెచ్చాడు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి 9 సార్లు రైడింగ్‌కు వెళ్లి 3 పాయి0ట్లు తెచ్చాడు. కబడ్డీ చరిత్రలో భారత్‌పై కొరియా గెలవడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో ఇరాన్ 52-15 స్కోరుతో అమెరికాపై గెలిచింది. మేరాజ్, ఫాజల్ ఐదేసి పాయింట్లు సాధించారు. వైభవంగా ఆరంభం కబడ్డీ ప్రపంచకప్ కలర్ఫుల్గా ప్రారంభమైంది. తొలుత కళాకారుల విన్యాసాలు, లేజర్ మెరుపులతో కార్యక్రమం సాగింది. ఆ తర్వాత భారత సంప్రదాయ పద్దతిలో ఒక్కో జట్టు కెప్టెన్‌ను కోర్టులోకి తీసుకొచ్చారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ముఖ్య అతిధిగా ప్రసంగించారు. -
బోపన్న ‘సింగిల్స్’ విజయం
డేవిస్ కప్‌లో భారత్ 4-1తో కొరియాపై గెలుపు చండీగఢ్: తొలి రెండు రోజులు విజయాలతో అదరగొట్టిన భారత డేవిస్ కప్ జట్టు ఆఖరి రోజు మాత్రం ఒక్క గెలుపుతోనే సంతృప్తి పడింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భాగంగా ఆదివారం జరిగిన రివర్స్ సింగిల్స్‌లో రోహన్ బోపన్న 3-6, 6-4, 6-4తో హంగ్ చుంగ్‌పై గెలవగా... రెండో మ్యాచ్‌లో రామ్‌కుమార్ 3-6, 7-5, 6-7 (2/7)తో యంగ్ కు లిమ్ చేతిలో ఓడాడు. దీంతో కొరియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 4-1తో విజయం దక్కించుకుంది. సాకేత్ మైనేని సకాలంలో కోలుకోకపోవడంతో నాలుగేళ్ల తర్వాత బోపన్న సింగిల్స్ మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి వచ్చింది. 2012లో ఉజ్బెకిస్తాన్‌తో బోపన్న చివరిసారి సింగిల్స్ మ్యాచ్ ఆడాడు. డేవిస్‌కప్‌లో బోపన్నకిది 10వ సింగిల్స్ విజయం. చుంగ్‌తో గంటా 23 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్ భారీ సర్వీస్‌లతో అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 27 ఏస్‌లు సంధించాడు. లిమ్తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఇద్దరూ చెరో సెట్‌ను సాధించారు. కానీ మూడోసెట్ టైబ్రేక్‌లో రామ్‌కుమార్ సర్వీస్‌లు అదుపు తప్పడంతో మూల్యం చెల్లించుకున్నాడు. -
ఎల్జీ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తాజాగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విపణిలోకి ప్రవేశపెట్టింది. కె సిరీస్‌లో భాగంగా కె7, కె10 శ్రేణి ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది ఎల్జీ. ఇండియాలో కె7 ధర రూ.9,500 కాగా.. కె10 ధర రూ.13,500లుగా కంపెనీ నిర్ణయించింది. కె7 ఆండ్రాయిడ్ వర్షన్లో 5.1 లాలీపాప్తో పనిచేసే ఈ మొబైల్లో స్టోరేజీ కోసం స్లాట్ ఉంది. ప్రకృతి రమణీయత కనిపించేలా ఉన్న డిజైన్‌ను ఈ ఫోన్ల కోసం వినియోగించారు. కె7 ప్రత్యేకతలు.. 5.0 అంగుళాల స్క్రీన్ ఎఫ్డబ్ల్యూవీజీఏ(854X480) 1.3 జీహెచ్‌జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 5 మెగా పిక్సళ్ల ఫ్రంట్, రీర్ కెమెరాలు 1 జీబీ ర్యామ్ 2,125 ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీ ఫ్లాష్ కె10 ఆండ్రాయిడ్ వెర్షన్ 5.1తో నడిచే ఈ మొబైల్లో స్టోరేజీ సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం ప్రత్యేకమైన స్లాట్‌ను ఏర్పాటు చేశారు. 5.3 అంగుళాల స్క్రీన్‌తో ఫుల్ హెచ్డీ(1280x720) స్నాప్ డ్రాగన్ 410 క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 13 మెగా పిక్సల్ రీర్ కెమెరా 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఫ్లాష్ -
ఫైనల్లో జ్యోతి సురేఖ జంట
సాక్షి, హైదరాబాద్: కొరియాలో జరుగుతున్న ఈ పోటీల మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ-కన్వల్‌ప్రీత్ సింగ్ ద్వయం ఫైనల్లోకి ప్రవేశించిందిప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల ఆర్చరీ విభాగంలో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రాణించింది.. సెమీఫైనల్లో సురేఖ-కన్వల్ జోడి 154-153తో బెల్జియంపై విజయం సాధించింది. మంగళవారం జరిగే ఫైనల్లో భారత్, కొరియాతో తలపడుతుంది. -
భారత్‌కు మూడో స్థానం
షూటౌట్లో కొరియాపై విజయం అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇఫో (మలేసియా): గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అత్యద్భుత ఆటతీరుతో భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో మూడో స్థానం పొందింది. కొత్త కోచ్ పాల్ వాన్ ఆస్ ఆధ్వర్యంలో తొలిసారిగా బరిలోకి దిగిన సర్దార్ సింగ్ సేన ఆదివారం కొరియాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో 4-1 తేడాతో నెగ్గి కాంస్య పతకం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. నికిన్ తిమ్మయ్య పదో నిమిషంలోనే ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచాడు. అయితే ఆ వెంటనే యు హ్యోసిక్ (20) స్కోరును సమం చేశాడు. దీంతో జోరు పెంచిన భారత్‌కు 22వ నిమిషంలో సత్బీర్ సింగ్ మరో ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యంలో ఉంచాడు. కానీ 29వ నిమిషంలోనే నామ్ హ్యూన్వూ చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. ఆ తర్వాత ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యం కాగా.. భారత్ నుంచి ఆకాశ్‌దీప్, సర్దార్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా గోల్స్ చేసి జట్టును గెలిపించారు. అటు కొరియా ప్రయత్నాలను కీపర్ శ్రీజేష్ రెండు సార్లు అడ్డుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. -
మెట్రోకు విదేశీ తలుక్
కొరియా కోచ్‌లు.. ఫ్రాన్స్ పట్టాలు అడుగడుగునా విదేశీ హంగులు సాక్షి, సిటీ బ్యూరో: కొరియా కోచ్‌లు.. శ్యామ్‌సంగ్ హంగులు... ఫ్రాన్స్ పట్టాలు.. నగర మెట్రో ప్రాజెక్ట్‌లో ప్రతిదీ విశేషమే. అన్ని వర్గాల వారికీ మన మెట్రో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విదేశీ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను సంతరించుకుంది. దేశ విదేశాల్లో పేరొందిన సంస్థ లు మెట్రో ప్రాజెక్ట్‌లో మేము సైతం అన్నట్టుగా కీలక పనులు చేపడుతున్నా యి. మరికొన్ని అవసరమైన విడి భాగాలను సరఫరా చేస్తున్నాయి. ఇంకొన్ని ప్రముఖ సంస్థలు సాంకేతిక, డిజైనింగ్, సేవలు, నిర్మాణం, ప్రణాళిక, నిర్వహణ, కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్నాయి. వీటన్నింటిలో పాలు పంచుకుంటున్న దేశ విదేశాలకు చెందిన పేరెన్నికగన్న సంస్థల వివరాలివే.. కొరియా కోచ్‌లు దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ మెట్రో రైళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ఒక్కో బోగీ ఖరీదు రూ.10 కోట్లు. ఇప్పటివరకు నాలుగు మెట్రో రైళ్లు ఉప్పల్ మెట్రో డిపోకు చేరుకున్నాయి. మరో మూడు త్వరలో కొరియా నుంచి నగరానికి చేరనున్నాయి. మొత్తంగా ఈ సంస్థ మెట్రో ప్రాజెక్ట్‌కు 2017 నాటికి సుమారు 171 బోగీలు(57రైళ్లు-ఒక్కో రైలుకు 3 బోగీలు)ను దశల వారీగా సరఫరా చేయనుంది. శ్యామ్సంగ్డేటా సిస్టమ్స్: కొరియాకు చెందిన ఈ సంస్థ మెట్రో రైలు స్టేషన్లలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన డిజైన్, విడిభా గాల తయారీ, సరఫరా, పరీక్షలను నిర్వహించనుంది. పార్సన్స్ బ్రింకర్‌హాఫ్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఈ సంస్థ మౌలిక వసతుల కల్పన రంగంలోని భారీ ప్రాజెక్ట్‌లకు కన్సల్టెన్సీ సేవలు అందిస్తోంది. మెట్రో ప్రాజెక్ట్‌లో సంక్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో అద్భుత ఇంజినీరింగ్ డిజైన్లను ఈ సంస్థ రూపొందిస్తోంది. ఇది 1885 నుంచి ఈ రంగంలో ఉంది. ఐదు ఖండాలలో సేవలందిస్తోంది. కియోలిస్ ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ ప్రజా రవాణా రంగంలో విశేష అనుభవం గడించింది. 12 దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. మన మెట్రో ప్రాజెక్ట్ నిర్వహణలోనూ కీలక భాగస్వామిగా మారింది. హాల్క్రో ఈ సంస్థ మెట్రో ప్రాజెక్ట్ ప్రణాళిక, డిజైన్, నిర్వహణ అంశాల్లో సహకారం అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ పన్నులు, సేవలు, మేనేజ్మెంట్ విభాగాల్లో విలువైన సూచనలు, సలహాలు అందించడంలో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మెట్రో ప్రాజెక్ట్‌లో కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తున్నందుకు సంస్థకు వచ్చే కార్భన్క్రెడిట్స్ (పర్యావరణ రాయితీలు)ను లెక్కగడుతుంది. ఏఈకామ్ యూరప్‌కు చెందిన ఈ కంపెనీ సాంకేతిక, యాజ మాన్య సేవలు అందిస్తోంది. పర్యావరణ, ఇంధనం, మంచినీరు, మౌలిక వసతుల విషయంలో మెట్రో ప్రాజెక్ట్‌కు సలహాలు అందిస్తోంది. లూయిస్‌బెర్జర్ అమెరికాకు చెందిన ఈ సంస్థ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలో మనకు సహకారం అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా 90 దేశాల్లో సేవలందిస్తోంది. ఓటీఐఎస్ నగరంలోని ఎలివేటెడ్ మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న 260 లిఫ్టులను, 410 ఎస్కలేటర్లను ఈ సంస్థ సరఫరా చేస్తోంది. చైనాకు చెందిన ఈ కంపెనీ నగర మెట్రో ప్రాజెక్టులో సుమారు రూ.400 కోట్ల కాంట్రాక్టు దక్కించుకుంది. ఆర్థిక సహకారం ఇలా.. దేశంలో తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో చేపడుతున్న మెట్రో ప్రాజెక్ట్‌కు ఎల్అండ్టీ సంస్థ సుమారు రూ.3500 కోట్లు ఖర్చు చేస్తోంది. మరో రూ.11,500 కోట్లను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, జమ్మూకాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, సిండికేట్ బ్యాంక్‌ల నుంచి రుణంగా సేకరిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.1458 కోట్లు ఖర్చు చేస్తోంది. భూసేకరణ, ఇతర వసతుల కల్పనకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేసింది. ఫ్రాన్స్ పట్టాలు ఆకాశమార్గం (ఎలివేటెడ్) పట్టాలను ఫ్రాన్స్‌కు చెందిన రైల్స్, టాటా స్టీల్ (ఫ్రాన్స్‌లోని విభాగం) సంస్థ సరఫరా చేస్తోంది. సముద్ర మార్గంలో మొదట ముంబయికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్, మియాపూర్ డిపోలకు చేరుకుంటున్నాయి. మొత్తం మెట్రో ప్రాజెక్టుకు ఫ్రాన్స్ నుంచి 22,500 మెట్రిక్ టన్నుల పట్టాలను దిగుమతి చేసుకోవడం విశేషం. -
యంగ్ పికాసో!
జార్జ్ పొచెస్తోవ్ పదకొండు నెలల వయసులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న బ్రెయిన్ కాన్సర్‌తో చనిపోయాడు. చావు గురించి జార్జ్‌కు తెలిసే వయసేమీ కాదు అది. కానీ, ఆ చిట్టి కళ్లు తండ్రి కోసం వెదుకుతున్నట్లు తల్లి కనిపెట్టింది. పిల్లాడిని దారి మళ్లించడానికి అన్నట్లు అతని ముందు పెయింటింగ్ సామాగ్రి ముందు పెట్టేది. వాటితో తనకు తోచిన గీతలేవో గీసేవాడు జార్జ్. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉక్రెయిన్ దంపతులకు జన్మించిన జార్జ్ పదిహేడు సంవత్సరాల వయసులో కారు బొమ్మను అద్భుతంగా గీశాడు. వయసుతో పాటు అతనిలో చిత్రకళా ప్రతిభ పెరగడం ప్రారంభమైంది. బ్రైట్ కలర్ స్కీమ్‌లతో రకరకాల ప్రయోగాలు చేశాడు. గురువంటూ ఎవరూ లేకపోయినా చిత్రకళను తనకు తానే స్వయంగా నేర్చుకున్నాడు. జార్జ్ గీసిన చిత్రాలకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. త్రీ-డైమన్షల్ కాన్వాస్ మీద దృష్టి పెట్టినా, ఇ్రంపెషనిస్టిక్ ఆర్ట్ మీద దృష్టి పెట్టినా...తనదైన శైలిని ఎప్పుడు కోల్పోలేదు జార్జ్. హిల్లరీ క్లింటన్ నుంచి మైఖెల్ జోర్డన్(ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్) వరకు జార్జ్‌కు అభిమానులు ఉన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, కొరియా, దక్షిణ అమెరికా, నెదర్లాండ్స్, రష్యా, ఉక్రేయిన్లలో ఎక్కువగా జార్జ్ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని. ఇరవెరైండు సంవత్సరాల జార్జ్ పొచెస్తోవ్ను మీడియా ముద్దుగా ‘యంగ్ పికాసో’ అని పిలుస్తుంది. నిజానికది భారీ పొగడ్తే కావచ్చు, కానీ చిత్రకళలో జార్జ్ మెరుపులు చూస్తుంటే ఆ మాత్రమైనా అనకుంటే ఎలా అనిపిస్తుంది! జార్జ్‌పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్‌కు ఎంతో ఇష్టమైన పని. -
ఆరేళ్ల తర్వాత అర్హత
వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు భారత్ కొరియాపై 3-1తో గెలుపు బుసాన్ (కొరియా): భారత డేవిస్‌కప్ జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్ పోటీల్లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన పోటీలో భారత్ 3-1తో గెలిచింది. ఆదివారం జరిగిన తొలి రివర్స్ సింగిల్స్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-4, 5-7, 6-3, 6-1తో యాంగ్ క్యు లిమ్‌ను ఓడించాడు. దాంతో భారత్ విజయం ఖాయమైంది. ఫలితం తేలిపోవడంతో సనమ్ సింగ్, హ్యున్ చుంగ్ మధ్య జరగాల్సిన రెండో రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. 2008 తర్వాత భారత జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత పొందింది. చివరిసారి భారత్ 2008 వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 1-4తో రుమేనియా చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలు సెప్టెంబరు 12 నుంచి 14 వరకు జరుగుతాయి. నెదర్లాండ్స్, కెనడా, స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికా, అర్జెంటీనా, బెల్జియం, సెర్బియా జట్ల నుంచి ఒక జట్టు భారత ప్రత్యర్థిగా ఉంటుంది. -
దక్షిణ కొరియాకు పెళ్లి కళ
-
రీజినింగ్ - ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్
Directions(Q. 1-5): These questions are based on the following information. Study it carefully and answer the questions. Seven members L, H, K, T, F, J and R represent different countries in Olympics, viz, USA, China, Korea, France, Russia, Australia and Japan; each one competes for a different sport, viz. Volleyball, Archery, Rifle Shooting, Tennis, Boxing, Athletics and Football. The order of persons, countries and games is not necess-arily the same. K represents China for Archery. T represents USA but not for Volleyball or Rifle Shooting. The one who represents Japan competes for Boxing. F competes for Volleyball but not for Korea. L represents Australia for Athletics. The one who represents Russia competes for Tenn-is. J does not represent Korea or Japa n. R competes for Rifle Shooting. 1. Which of the following combi-nations is correct? 1) J - Tennis - France 2) R - Tennis - Russia 3) R - Tennis - France 4) J - Tennis - Russia 5) None of these 2. Who represents Japan? 1) F 2) R 3) J 4) H 5) None of these 3. F represents which country? 1) France 2) Russia 3) Japan 4) Korea 5) None of these 4. The one who competes for Rifle Shooting, represents which country? 1) France 2) Korea 3) Japan 4) USA 5) None of these 5. For which game does T compete? 1) Boxing 2) Football 3) Tennis 4) Can't be determined 5) None of these Directions(Q. 6-10): These ques-tions are based on the following letter/number/ symbol arrangement. Study it carefully and answer the questions. T 8 # 1 7 F J 5 % E R @ 4 D A 2 B © Q K 3 1 ? U H 6 L 6. Four of the following five are alike in a certain way on the basis of their positions in the above arrangement and so form a group. Which is the one that does not belong to the group ? 1) E@% 2) #78 3) 5EJ 4) U6? 5) QKB 7. How many such symbols are there in the above arrangem-ent, each of which is immedia-tely preceded by a consonant and not immediately followed by a vowel? 1) None 2) One 3) Two 4) Three 5) More than three 8. Which of the following is seve-nth to the right of thirteenth from the right? 1) 1 2) ? 3) F 4) 7 5) None of these 9. What will come in place of the question mark (?) in the follow-ing series based on the above arrangement? TL8 #6I 7HF ? 1) FUJ 2) JU? 3) FU? (4) JU5 5) None of these 10. How many such vowels are there in the above arrangement each of which is immediately preceded by a symbol and immediately followed by a number? 1) None 2) One 3) Two 4) Three 5) More than three 11. How many meaningful four letter English words can be formed with the letters ITED, using each letter only once in each word? 1) None 2) One 3) Two 4) Three 5) More than three 12. How many such digits are there in the number 6 4 3 8 2 1 7 9 each of which is as far away from the beginning of the number as when the digits are arranged in ascending order within the number? 1) None 2) One 3) Two 4) Three 5) More than three 13. Among six friends L, M, N, P, Q and S, each having a different height. N is taller than Q and P but shorter than M. P is taller than only Q while S is shorter than only L. Which of the following pairs represents the tallest and the shortest among the five friends? 1) M, P 2) L, Q 3) P, Q 4) Can't be determined 5) None of these 14. If 'P' denotes 'multiplied by', 'R' denotes 'added to'. 'T' denotes 'substracted from' and 'W' denotes 'divided by' then 64 W 4 P 8 T 6 R 4 = ? 1) 96 2) 3) 130 4) 126 5) None of these 15. Four of the following five are alike in a certain way and so form a group. Which is the one that does not belong to that group? 1) Black 2) Yellow 3) Red 4) Green 5) Violet Directions(Q. 16-20): In the following questions, the symbols $, @, # & and * are used with the following meanings as illustrated bellow: 'P $ Q' means 'P is not smaller than Q' 'P @ Q' means 'P is neither smaller than nor equal to Q' 'P # Q' means 'P is neither greater than nor equal to Q' 'P & Q' means 'P is neither greater than nor smaller than Q' 'P * Q' means 'P is not greater than Q' 16. Statements: H @ T, T # F, F& E, E * V Conclusions: I. V $ F II. E @ T III. H @ V IV. T # V 1) Only I, II and III are true 2) Only I, II and IV are true 3) Only II, III and IV are true 4) Only I, III and IV are true 5) All I, II, III and IV are true 17. Statements: D # R, R * K, K @ F, F $ J Conclusions: I. J # R II. J # K III. R # F IV. K @ D 1) Only I, II and III are true 2) Only II, III and IV are true 3) Only I, III and IV are true 4) All I, II, III and IV are true 5) None of these 18. Statements: N & B, B $ W, W # H, H * M Conclusions: I. M @ W II. H @ N III. W & N IV. W # N 1) Only I is true 2) Only III is true 3) Only IV is true 4) Only either III or IV are true 5) Only either III or IV and I are true 19. Statements: R * D, D $ J, J # M, M @ K Conclusions: I. K # J II. D @ M III. R # M IV. D @ K 1) None is true 2) Only I is true 3) Only II is true 4) Only III is true 5) Only IV is true 20. Statements: M $ K, K @ N, N * R, R # W Conclusions: I. W @ K II. M $ R III. K @ W IV. M @ N 1) Only I and II are true 2) Only III and IV are true 3) Only III or IV are true 4) Only II, III and IV are true 5) None of these Directions(Q. 21-25): 21. Statement: Many employees of the organization applied for special sabbatical leave of two years to pursue higher education. Assumption: I. The management of the organization may not grant leave to most of these employees. II. These employees may be able to complete their education during the sabbatical leave. 22. Statement: The college admi-nistration has instructed all the students to stop using cell phones within the college premises. Assumption: I. The students may stop using cell phones in the college premises. II. The students may continue to use cell phones in the college premises. 23. Statement: The Govt. has decid ed to levy congestion tax on pass engers travelling by air to and from the metro cities Assumption: I. The tax so collected may be adequate to meet part of the expenses for providing additional resources to handle huge traffic. II. Passengers travelling by air to and from these cities may be able to pay extra amount by way of congestion tax. 24. Statement: The local citizens group submitted a memora-ndum to the civic authority for allowing them to convert the vacant plot in the locality into a garden at their own cost. Assumption: I. The local citizen group may be able to gather enough funds to develop the garden. II. The civic authority may not accede to the request of the local citizen group 25. Statement: Most of the private companies have decided against awarding annual increase in the salaries of their employees for the previous year due to the current economic situation. Assumption: I. Majority of the employees may leave their job to protest against the decision. II. These companies may announce hike in salaries next year.