
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ బ్యూటీ రష్మీక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, స్టైల్‌తో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక పుష్మ మూవీతో నేషనల్ స్టార్‌గా ఎదిగింది. ఇక ఆమె హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్న మరోవైపు నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె ఓ ఈవెంట్‌లో కొరియన్ నటులతో సందడి చేసిన ఫొటోలను షేర్ చేసింది.
చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శింబు, వధువు ఎవరంటే!
కాగా రష్మీక ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉంది. మిలాన్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె రీసెంట్‌గా ఇటలీకి పయనమైంది. ఈ షోకి ప్రపంచవ్యాప్తంగా నటీనటులు హాజరయ్యారు. అలా రష్మిక కూడా వైట్ అండ్ వైడ్ డ్రస్ డ్రెస్‌లో ఈ ఫ్యాషన్ వీక్‌లో మెరిసింది. ఇదే ఫ్యాషన్ వీక్‌లో సౌత్ కొరియా నటుడు జంగ్ ఊ, థాయిలాండ్ నటుడు గల్ఫ్ కానవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక వీరితో కలిసి ఫొటోలను ఫోజులు ఇచ్చింది. అంతేకాదు వారితో కలిసి డాన్స్ కూడా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ‘వారసుడు’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రష్మిక.. రీసెంట్‌గా ‘యానిమల్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment