ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ కొరియాలోని చాంగ్వాన్‌లో జరిగింది. ఈ పోటీలకు భారత్ పెద్ద సంఖ్యలో షూటర్లను కొరియాకు పంపింది. ఈ పోటీలో 44 దేశాల నుంచి 550 మందికి పైగా షూటర్లు పాల్గొన్నారు. భారత్ 6 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలతో సహా 17 పతకాలు సాధించి పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైనా 12 స్వర్ణాలు సహా 28 పతకాలను సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ విషయం పక్కనబెడితే కొరియా వెళ్లిన భారత జూనియర్ షూటింగ్ జట్టులోని కొందరు సభ్యులు నిబంధన ఉల్లఘించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా షూటర్లు మగ షూటర్ల హోటల్ గదిలో ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి. హోటల్ గదిలో అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటున్నారని, బిగ్గరగా పాటలు పాడుతూ సందడి చేశారని తెలిసింది. సమాచారం అందుకున్న అధికారులు భారతీయులకు గదులు ఇవ్వవద్దని సిబ్బందిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమే అక్కడే ఉన్న భారత అధికారులు పీటీఐకి బదులిస్తూ.. పురుష షూటర్లు ఉన్న హోటల్‌కు మహిళా షూటర్లు వెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. 'మగ షూటర్లు ఉన్న గదికి ఎవరూ వెళ్లినట్లు లేదా అక్కడ నుండి తిరిగి వచ్చినట్లు కనిపించలేదు.' అని అధికారులు స్పష్టం చేశారు. ''అంతర్జాతీయ పోటీల కోసం భారతదేశం నుండి బయలుదేరే ముందు చేయవలసినవి, చేయకూడని వాటి గురించి షూటర్లకు వివరిస్తాం. ఏది సరైనది, ఏది తప్పు అనే దానిపై వారికి అవగాహన కల్పించడానికి రోజువారీ బ్రీఫింగ్ కూడా ఉంటుంది.'' అని ఓ అధికారి చెప్పారు.
అయితే హోటల్‌లోని కొన్ని పరికరాలు దెబ్బతిన్నాయని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ తప్పిదానికి పరిహారం ఇవ్వడంతో అక్కడి నుంచి చెక్ అవుట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
చదవండి: Ben Stokes: 'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు'
Cristiano Ronaldo: ఎట్టకేలకు గోల్.. దిగ్గజం రికార్డును బద్దలు కొట్టిన రొనాల్డో
Comments
Please login to add a commentAdd a comment