![Samsung Galaxy M Series to Launch in India on January 28 - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/15/SAMSUNG1.jpg.webp?itok=MCyxQe1L)
న్యూఢిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమికి పోటీగా.. కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ అతి త్వరలోనే ‘గెలాక్సీ ఎం సిరీస్’ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండంకల వృద్ధి రేటును సాధించడంలో భాగంగా తొలుత ఈఫోన్ సిరీస్‌ను భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు రూ.20,000 వరకు ఉండనున్నట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సీ మీడియాతో అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల తరువాత స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నాం. శాంసంగ్, అమేజాన్ వెబ్‌సైట్లలో వీటిని అందించనున్నాం. ఎం సిరీస్ విడుదల ద్వారా 2019లో రెండంకెల వృద్ధి రేటును లక్ష్యంగా నిర్థేశించుకున్నాం. కేవలం డివైజ్‌ల పరంగానే కాకుండగా.. ఫ్యాక్టరీ, ఎక్సిపీరియన్స్ సెంటర్ల విస్తరణపై కూడా దృష్టి సారించాం. భారత మార్కెట్‌కు అవసరాలకు తగిన విధంగా సేవలందించడమే మా సంస్థ ధ్యేయం.’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment