Mobile Handsets
-
99.2 శాతం దేశంలో తయారైన మొబైళ్లే!
మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. తాజా నివేదికల ప్రకారం ఇండియాలో ఉపయోగించే మొబైల్ హ్యాండ్ సెట్లలో 99.2% దేశీయంగా తయారైనవేనని పేర్కొన్నారు. 2014లో భారత్‌లో విక్రయించిన మొబైల్ ఫోన్లలో 74 శాతం దిగుమతులపైనే ఆధారపడినట్లు చెప్పారు. గడిచిన పదేళ్లలో ఈ రంగం భారీగా వృద్ధి చెందినట్లు వివరించారు.తయారీ కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీకండక్టర్ల తయారీ ప్రోత్సాహక పథకం (స్పెక్స్) వంటి వివిధ కార్యక్రమాలు ఇందుకు ఎంతో తోడ్పడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ రూ.1,90,366 కోట్లుగా ఉంటే అది 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,52,000 కోట్లకు పెరిగిందని మంత్రి చెప్పారు. ఇది 17% కంటే ఎక్కువ సమ్మేళన వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను సూచిస్తుంది. దాంతో పదేళ్ల కాలంలో మొబైల్ ఫోన్ల ప్రధాన దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా దేశం ఎదిగిందన్నారు.ఇదీ చదవండి: యూట్యూబ్‌లో థంబ్‌నేల్స్ చేస్తున్నారా..? ఇకపై అది కుదరదు!ఎలక్ట్రానిక్స్ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని ప్రసాద పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కోసం రూ.76,000 కోట్ల పెట్టుబడితో ఇటీవల ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు. దేశంలో సెమీకండక్టర్, డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పునరుద్ఘాటించారు. -
వచ్చే నెల్లో శాంసంగ్ ‘గెలాక్సీ ఎం సిరీస్’ విడుదల..!
న్యూఢిల్లీ: చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షావోమికి పోటీగా.. కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ అతి త్వరలోనే ‘గెలాక్సీ ఎం సిరీస్’ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండంకల వృద్ధి రేటును సాధించడంలో భాగంగా తొలుత ఈఫోన్ సిరీస్‌ను భారత్‌లోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలు రూ.20,000 వరకు ఉండనున్నట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సీ మీడియాతో అన్నారు. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల తరువాత స్మార్ట్ఫోన్లను విడుదల చేయాలని భావిస్తున్నాం. శాంసంగ్, అమేజాన్ వెబ్సైట్లలో వీటిని అందించనున్నాం. ఎం సిరీస్ విడుదల ద్వారా 2019లో రెండంకెల వృద్ధి రేటును లక్ష్యంగా నిర్థేశించుకున్నాం. కేవలం డివైజ్‌ల పరంగానే కాకుండగా.. ఫ్యాక్టరీ, ఎక్సిపీరియన్స్ సెంటర్ల విస్తరణపై కూడా దృష్టి సారించాం. భారత మార్కెట్‌కు అవసరాలకు తగిన విధంగా సేవలందించడమే మా సంస్థ ధ్యేయం.’ అని వివరించారు. -
మొబైల్ మార్కెట్లో 40% వాటా లక్ష్యం: ఫ్లిప్‌కార్ట్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’.. మొబైల్ హ్యాండ్సెట్స్ విక్రయాల్లో బలమైన వృద్ధి సాధిస్తున్నామని పేర్కొంది. 2020 నాటికి 40 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపింది. ‘మొబైల్స్ 40 బై 20’ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ‘ఇప్పటికే వివిధ హ్యాండ్సెట్ బ్రాండ్స్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాం. మొబైల్స్ కేటగిరీలో మా ఆధిపత్య స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్ వైస్‌ప్రెసిడెంట్ (మొబైల్స్ అండ్ లార్జ్ అప్లయెన్సెస్) అజయ్ యాదవ్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భారత్‌లో కొనుగోలు చేస్తున్న ప్రతి నాలుగు ఫోన్లలో ఒకటి ఫ్లిప్‌కార్ట్ నుంచే ఉంటోదని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ కేటగిరీలో 60 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. అసుస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఫ్లిప్‌కార్ట్ తన ‘మొబైల్స్ 40బై20’ స్ట్రాటజీలో భాగంగా అసుస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ‘జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో’ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 23న మార్కెట్లోకి రానుంది. అలాగే ఇరు సంస్థలు భారతీయ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణమైన ప్రొడక్టులను తయారు చేయడానికి సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇండియన్ మార్కెట్‌కు అవసరమైన ప్రొడక్టుల తయారీ, సర్వీసుల ద్వారా అపార వృద్ధి అవకాశాలు అందుకుంటామని అసుస్ సీఈవో జెర్రీ షేన్ తెలిపారు. ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో 4.2 రెట్లు వృద్ధి ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి వివిధ పరిశ్రమ సంబంధిత నివేదికలను ఉటంకిస్తూ.. భారత్‌లో 2012లో 7 కోట్ల యూనిట్లుగా ఉన్న ఆఫ్‌లైన్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 2017 నాటికి 1.2 రెట్లు వృద్ధితో 8.2 కోట్ల యూనిట్లకు చేరాయని పేర్కొన్నారు. అదే సమయంలో ఆన్లైన్ అమ్మకాలు 4.2 రెట్లు వృద్ధితో కోటి యూనిట్ల నుంచి 4.2 కోట్ల యూనిట్లకు ఎగశాయని తెలిపారు. -
జూలై నుంచి మొబైళ్లకు దేశీ భాషల సపోర్ట్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారునికి మొబైల్ హ్యాండ్సెట్ వినియోగాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జూలై 1 నుంచి దేశంలో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్లు దేశీ భాషలను సపోర్ట్ చేయాలనే నిబంధనను తీసుకువచ్చింది. అంటే జూలై 1 నుంచి మనం కొనుగోలు చేసే ప్రతి ఫోన్ అన్ని ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేయాల్సిందే. -
18 రోజుల్లో 10 లక్షల షావోమి ఫోన్ల విక్రయం
బీజింగ్: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ ఈ దీపావళి పండుగ సీజన్లో ఒక్క భారత్‌లోనే 18 రోజుల్లో 10 లక్షల ఫోన్లను విక్రయించింది. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అతిపెద్ద మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు షావోమి వ్యవస్థాపకుడు, సీఈవో లీ జున్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ భారతదేశమేనని, తమ గ్లోబలైజేషన్ లక్ష్యాల సాకారానికి భారత్ అత్యంత కీలకమని చెప్పారాయన. చైనా తర్వాత ఇండియానే తమ అతి పెద్ద మొబైల్ మార్కెట్‌గా అభివర్ణించారు. ‘‘ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు పెంచుతాం. కార్యకలాపాలను మరింత విస్తరిస్తాం’’ అని లీ వివరించారు. భారత్‌లో ఇప్పటికే పలు చైనా కంపెనీలు రకరకాల వ్యూహాలతో అమ్మకాలు పెంచుకుంటున్నాయి. షావోమీ అమ్మకాలు చైనాలో ఈ మధ్య తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో షావొమీ వాటా పెరగటం గమనార్హం. అందుకే ఈ కంపెనీ భారత్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది. -
జీవీ మొబైల్స్ నుంచి ఏడు ఫీచర్ ఫోన్లు
న్యూఢిల్లీ: దేశీ మొైబెల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘జీవీ మొబైల్స్’ తాజాగా ఏడు ఫీచర్ ఫోన్లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు రూ.699-రూ.1,199 శ్రేణిలో ఉన్నాయి. తాము ప్రధానంగా ఫీచర్ ఫోన్ల విభాగంపై దృష్టి కేంద్రీకరించామని, ఈ విభాగంలో అగ్ర స్థానాన్నే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని జీవీ మొబైల్స్ సీఈవో పంకజ్ ఆనంద్ తెలిపారు. అన్ని ఫోన్లను దేశీయంగానే అసెంబ్లింగ్ చేశామని చెప్పారు. తక్కువ ధరల్లో అధిక ప్రత్యేకతలున్న ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నామని, అన్నింటికీ బీఎస్ఐ ఆమోదం ఉందని తెలిపారు. మేకిన్ ఇండియా ఫోన్లను విదేశాలకు కూడా ఎగుమతి చేయాలనుకుంటున్నామని చెప్పారు. -
సెల్కాన్ ‘క్యూ5కే’ రివర్స్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ సెల్కాన్ తాజాగా ‘క్యూ5కే ట్రాన్స్ఫార్మర్’ పేరుతో రివర్స్ చార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. రివర్స్ చార్జింగ్ ఫీచర్‌తో ఈ ఫోన్ నుంచి మరో ఫోన్‌ను చార్జ్ చేసే వీలుండడం దీని ప్రత్యేకత. అలాగే ఇందులో 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యువీజీఏ ఐపీఎస్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఓఎస్, 1.2 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, డ్యూయల్ ఫ్లాష్‌తో 8 ఎంపీ ఆటో ఫోకస్ కెమెరా, 3.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఓటీజీ, కస్టమైజేబుల్ స్మార్ట్ కమాండ్స్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, డ్యూయల్ సిమ్ తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్ ధర రూ.5,999. తమ సక్సెస్‌కు కొత్త ఆవిష్కరణలే ప్రధాన కారణమని, ఈ విషయాన్ని క్యూ5కే ట్రాన్స్ఫార్మర్ మరోసారి నిజం చేస్తుందని సెల్కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ఫోన్లను అందుబాటు ధరల్లో సామాన్యులకు అందించడంలో సెల్కాన్ ఎప్పుడూ ముందుం టుందని తెలిపారు. -
ఒప్పొ ‘జాయ్ 3’ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఒప్పొ ‘జాయ్ 3’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.7,990. ఆండ్రాయిడ్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 4.5 అంగుళాల తెర, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ స్మార్ట్‌ఫోన్
హైదరాబాద్ : ఫస్ట్‌టచ్ భాగస్వామ్యంతో ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ‘బోల్ట్ డీ303’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3,499. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.3 గిగాహెర్ట్జ్ డ్యూయెల్ కోర్ ప్రాసెసర్, 4 అంగుళాల తెర, 3 ఎంపీ రియర్ కెమెరా, ఫస్ట్‌టచ్ యాప్ బజార్, 10 ప్రాంతీయ భాషల సపోర్ట్, అనువాదం కోసం స్వైప్ ఆప్షన్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. -
కోల్‌కతా ప్లాంటులో వీడియోకాన్ హ్యాండ్సెట్స్ ఉత్పత్తి
కోల్‌కతా : వీడియోకాన్ గ్రూప్ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్లాంటులో మొబైల్ హ్యాండ్సెట్స్ ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించనుంది. ‘సాల్ట్ లేక్ ప్లాంటులో వీడి యోకాన్ బ్రాండ్ హ్యాండ్‌సెట్స్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ప్లాంటులో దుర్గా పూజ పండుగ అనంతరం పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తాం’ అని వీడియోకాన్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ అనిరుధ్ దూత్ తెలిపారు. ప్రస్తుతం తాము మొబైల్ మార్కెట్‌పై దృష్టికేంద్రీకరించామని, అందులో భాగంగానే ఈ ప్లాంటులో తొలిగా ఫీచర్, స్మార్ట్‌ఫోన్ విభాగాల్లో 30 లక్షల మొబైళ్లను తయారు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. కోల్‌కతాను వీడియోకాన్ హ్యాండ్సెట్స్ తయారీ హబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి మమతా బెన ర్జీ చెప్పినట్లు పేర్కొన్నారు. మరొక ప్లాంటును గుర్గావ్లో ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీడియోకాన్ హ్యాండ్సెట్స్ ఔరంగాబాద్‌లోని ప్లాంటులో తయారు అవుతున్నాయి. -
భారత్‌లో 30కోట్ల మొబైల్ హ్యాండ్ సెట్స్