జీవీ మొబైల్స్ నుంచి ఏడు ఫీచర్ ఫోన్లు | seven feature phones from jiivi mobiles | Sakshi
Sakshi News home page

జీవీ మొబైల్స్ నుంచి ఏడు ఫీచర్ ఫోన్లు

Published Fri, Apr 22 2016 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

జీవీ మొబైల్స్ నుంచి ఏడు ఫీచర్ ఫోన్లు

జీవీ మొబైల్స్ నుంచి ఏడు ఫీచర్ ఫోన్లు

న్యూఢిల్లీ: దేశీ మొైబెల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘జీవీ మొబైల్స్’ తాజాగా ఏడు ఫీచర్ ఫోన్లను గురువారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి ధరలు రూ.699-రూ.1,199 శ్రేణిలో ఉన్నాయి. తాము ప్రధానంగా ఫీచర్ ఫోన్ల విభాగంపై దృష్టి కేంద్రీకరించామని, ఈ విభాగంలో అగ్ర స్థానాన్నే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని జీవీ మొబైల్స్ సీఈవో పంకజ్ ఆనంద్ తెలిపారు. అన్ని ఫోన్లను దేశీయంగానే అసెంబ్లింగ్ చేశామని చెప్పారు. తక్కువ ధరల్లో అధిక ప్రత్యేకతలున్న ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నామని, అన్నింటికీ బీఎస్‌ఐ ఆమోదం ఉందని తెలిపారు. మేకిన్ ఇండియా ఫోన్లను విదేశాలకు కూడా ఎగుమతి చేయాలనుకుంటున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement