![జూలై నుంచి మొబైళ్లకు దేశీ భాషల సపోర్ట్ తప్పనిసరి](/styles/webp/s3/article_images/2017/09/4/41477594731_625x300.jpg.webp?itok=mGc5UC38)
జూలై నుంచి మొబైళ్లకు దేశీ భాషల సపోర్ట్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్క మొబైల్ వినియోగదారునికి మొబైల్ హ్యాండ్‌సెట్ వినియోగాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జూలై 1 నుంచి దేశంలో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్లు దేశీ భాషలను సపోర్ట్ చేయాలనే నిబంధనను తీసుకువచ్చింది. అంటే జూలై 1 నుంచి మనం కొనుగోలు చేసే ప్రతి ఫోన్ అన్ని ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేయాల్సిందే.