న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతు ప్రకటించింది. తమకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘థాంక్యూ దీదీ’ అంటూ బుధవారం(జనవరి 8) ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.‘ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు టీఎంసీ మద్దతు ప్రకటించింది.
ఇందుకు మమతా దీదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. థాంక్యూ దీదీ. మీరు మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు’అని కేజ్రీవాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. తృణమూల్ ప్రకటనతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు మద్దతుగా నిలిచిన ‘ఇండియా’ కూటమి పార్టీలో జాబితాలో తాజాగా ఆప్ చేరడం గమనార్హం. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి.
గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆప్ ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి: రమేష్ బిదూరిపై బీజేపీ చర్యలు
Comments
Please login to add a commentAdd a comment