ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Delhi Assembly Election 2025) తర్వాత ఆప్ శకం ముగిసిందని అంటున్నారు మాజీ ఆప్ నేత, న్యాయవాది ప్రశాంత్ భూషణ్. ఈసారి ఢిల్లీలో వచ్చిన ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ముగింపు ప్రారంభమైందని విమర్శించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు ప్రశాంత్ భూషణ్.ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆప్.. ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకతతో పరిపాలించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
ఆ పార్టీ సహజ స్వరూపాన్ని కోల్పోయి స్వలాభం కోసం రాజకీయాలు చేయడంతోనే ఆప్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. లోక్‌పాల్ సిద్ధాంతాలతో రాజకీయ ప్రవేశం చేసిన ఆప్.. ఇప్పుడు సొంత లోక్‌పాల్‌ను సృష్టించుకుందన్నారు. ఇది ఆప్ ఓటమికి కారణమని ప్రశాంత్ భూషణ్ ేపేర్కొన్నారు.2015లో ఆప్ నుంచి బహిష్కరించబడ్డ ప్రశాంత్ భూషణ్..ఆప్ అనేది అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
Kejriwal is largely responsible for AAP’s Delhi debacle. A party formed for alternative politics which was supposed to be transparent, accountable & democratic was quickly transformed by Arvind into a supremo dominated, non transparent & corrupt party which didn’t pursue a Lokpal…
— Prashant Bhushan (@pbhushan1) February 8, 2025
నిన్న(శనివారం) వెలువడ్డ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాదించగా, ఆప్ అధికారాన్ని కోల్పోయింది. 70 సీట్లలో బీజేపీ 48 సీట్లలో విజయం సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కాగా, ఆప్ మాత్రం 22 స్థానాలతో సరిపెట్టుకుని ప్రతిపక్ష పాత్రకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment