Prashant Bhushan
-
‘ఇక ఆప్‌కు ముగింపు ప్రారంభమైంది’
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల(Delhi Assembly Election 2025) తర్వాత ఆప్ శకం ముగిసిందని అంటున్నారు మాజీ ఆప్ నేత, న్యాయవాది ప్రశాంత్ భూషణ్. ఈసారి ఢిల్లీలో వచ్చిన ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ముగింపు ప్రారంభమైందని విమర్శించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు ప్రశాంత్ భూషణ్.ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆప్.. ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకతతో పరిపాలించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆ పార్టీ సహజ స్వరూపాన్ని కోల్పోయి స్వలాభం కోసం రాజకీయాలు చేయడంతోనే ఆప్‌కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. లోక్‌పాల్ సిద్ధాంతాలతో రాజకీయ ప్రవేశం చేసిన ఆప్.. ఇప్పుడు సొంత లోక్‌పాల్‌ను సృష్టించుకుందన్నారు. ఇది ఆప్ ఓటమికి కారణమని ప్రశాంత్ భూషణ్ ేపేర్కొన్నారు.2015లో ఆప్ నుంచి బహిష్కరించబడ్డ ప్రశాంత్ భూషణ్..ఆప్ అనేది అవినీతిలో కూరుకుపోయిందన్నారు. Kejriwal is largely responsible for AAP’s Delhi debacle. A party formed for alternative politics which was supposed to be transparent, accountable & democratic was quickly transformed by Arvind into a supremo dominated, non transparent & corrupt party which didn’t pursue a Lokpal…— Prashant Bhushan (@pbhushan1) February 8, 2025 నిన్న(శనివారం) వెలువడ్డ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాదించగా, ఆప్ అధికారాన్ని కోల్పోయింది. 70 సీట్లలో బీజేపీ 48 సీట్లలో విజయం సాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం కాగా, ఆప్ మాత్రం 22 స్థానాలతో సరిపెట్టుకుని ప్రతిపక్ష పాత్రకు సిద్ధమైంది. -
అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్‌దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తిచేసుకునేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేశ్ వ్యాస్‌ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు. మైక్రోకంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు? వాటి ప్రోగ్రామ్‌ను మళ్లీ మార్చొచ్చా? అంటూ ప్రశ్నలు అడిగారు.బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లలో మైక్రోకంట్రోలర్లను బిగిస్తామని, వాటి పోగ్రామ్‌ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండాపోతాయని వ్యాస్ వివరణఇచ్చారు. ఈ వివరణతో అసిసోయేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫారŠమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటపుడు తప్పుడు ప్రోగామ్‌ను అప్లోడ్ చేసే ఆస్కారముందని వాదించారు. దీనిపై జడ్జీ దత్తా కలి్పంచుకుని.. ‘ మీ ఆలోచనలను మేం మార్చలేం. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంల సోర్స్ కోడ్‌ను బహిర్గతంచేయాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోశ్ వాదించగా కుదరదని జడ్జీ తిరస్కరించారు. -
Supreme Court of India: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు ఆస్కారం ఉండొద్దని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో ఓటర్ల సంతృప్తి, విశ్వాసం అనేవి చాలా ముఖ్యమని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నమోదైన ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో క్రాస్–వెరిఫికేషన్ చేయాలని కోరుతూ అసోసియేసన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఏడీఆర్ తరపున సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. అన్నింటికీ అనుమానించవద్దని సూచించింది. పిటిషన్లపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. -
ఆ లేఖ రాయటం తప్పు కాదు...
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు ప్రజల్లోకి వెళితేనే చర్యలకు వీలుంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటంలో కానీ, ఆ లేఖను బయటపెట్టడంలో కానీ ఎలాంటి తప్పూ లేదని చెప్పారాయన. అభిశంసన లాంటి అవసరం వస్తే... ఆరోపణల గురించి తెలిస్తేనే కదా పార్లమెంటు సభ్యులు ముందుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల గొంతు నొక్కేయడం ద్వారా న్యాయ వ్యవస్థలో విశ్వసనీయత నిలబడదని స్పష్టంచేశారు. తాజా వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా విచారణ జరుపుతారని తాను భావిస్తున్నట్లు చెప్పారాయన. అమరావతి ల్యాండ్ స్కామ్ ఎఫ్ఐఆర్పై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటాన్ని తప్పుపట్టిన ప్రశాంత్ భూషణ్... పలు అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యాంశాలివీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయటం తప్పంటారా? నేనైతే తప్పనుకోవటం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తి, వచ్చే ఏప్రిల్‌లో ప్రధాన న్యాయమూర్తి కాబోతున్న వారిపై చేసిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ప్రధాన న్యాయమూర్తి తగిన వారు కనుక వారికే లేఖ రాయాలి. ఇంతటి తీవ్రమైన ఆరోపణలొచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి తప్పకుండా విచారణ జరపాలి. అత్యంత నిజాయితీ పరులుగా పేరున్న రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఒక స్వతంత్ర కమిటీ వేసి విశ్వసనీయమైన విచారణ జరిపించాలి.. ఈ లేఖను ఏపీ ప్రభుత్వం బహిరంగం చేసింది కదా! ఇది తప్పంటారా? అసలు న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ఆరోపణలొచ్చినప్పుడు వాటిని రహస్యంగా ఉంచాలా? అలాంటిదేమీ లేదు. ఆరోపణలొచ్చింది న్యాయమూర్తులపై కదా అని వేరేగా చూడకూడదు. వేరేవాళ్లపై ఆరోపణలొచ్చినప్పుడు ఎలా చూస్తామో.. దీన్నీ అలాగే చూడాలన్నది నా అభిప్రాయం. ప్రజలకు దాన్ని తెలియకుండా ఉంచాలనటానికి ఎలాంటి కారణమూ లేదు. రహస్యంగా ఉంచాలనుకోవడమంటే.. తొక్కి పట్టడమే. ఒకవేళ దాన్ని రహస్యంగా ఉంచితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ, పార్లమెంటు సభ్యులు గానీ దానిపై ఏమీ చేయలేరు. అంటే లేఖలోని విషయాలు బయటకు రాకపోతే చర్యలు తీసుకోలేరా? దీనిపై రెండు రకాలుగా చర్యలు తీసుకోవచ్చు. ఒకటి.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరపడం. రెండోది అభిశంసన. మరి అభిశంసన విషయానికొస్తే దాన్లో పార్లమెంటు సభ్యుల పాత్ర ఉంటుంది. విషయం ప్రజల్లోకి రానప్పుడు పార్లమెంటు సభ్యులు కూడా అభిశంసన తీర్మానంపై సంతకం చేసేందుకు ముందుకు రారు. తాము ఏదో చేయాలనే అభిప్రాయానికి రానిపక్షంలో.. కాబోయే సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి ఇబ్బంది తెచ్చిపెట్టాలని ఎవరూ అనుకోరు కదా!. కొందరైతే ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడాన్ని కోర్టు ధిక్కరణగా వ్యాఖ్యానిస్తున్నారు. అత్యున్నతస్థాయి వ్యక్తులపై ఆరోపణలొస్తే అసలెలా పరిష్కరించాలి? ఆరోపణలు చేయటమంటే కోర్టును అపకీర్తి పాలు చేయడమనే వ్యాఖ్యలు కొందరు చేస్తుంటారు. ఇది పురాతన చట్టం. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాగే ఉంది. వలస పాలన నాటి సంప్రదాయాన్ని కొనసాగించేందుకు తగిన కారణాలైతే ఏమీ లేవు. చక్రవర్తుల కాలంలోనైతే న్యాయమూర్తుల్ని రాజుల ప్రతినిధులుగా పరిగణించేవారు. న్యాయవ్యవస్థలోని అవినీతిపై ప్రజల నోళ్లు నొక్కేయడం ద్వారా న్యాయవ్యవస్థలో ఉన్న వారి విశ్వసనీయతను కాపాడలేం. న్యాయవ్యవస్థలోని అవినీతి లేదా ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి. అమరావతి భూకుంభకోణంలో ఎఫ్ఐఆర్ను మీడియా రిపోర్ట్ చేయకుండా ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం, దర్యాప్తు నిలిపివేయటంపై ఏమంటారు? ఎఫ్ఐఆర్ను రిపోర్ట్చేయకుండా మీడియాపై గ్యాగ్ ఆర్డర్ జారీచేయడం హైకోర్టు పనికాదు. ఇలాంటి చర్యలన్నీ భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం. సమాచారం తెలుసుకునే ప్రజల హక్కుకు వ్యతిరేకం. ఏం జరుగుతోందో తెలుసుకునే అవసరం ప్రజలకుంది. అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఆరోపణలొచ్చినప్పుడు దర్యాప్తు జరగాలా... వద్దా? తప్పనిసరిగా జరగాలి. అవినీతి, లేదా ఇతరత్రా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొస్తే తప్పకుండా దర్యాప్తు జరగాల్సిందే. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన ప్రకారం అమరావతి భూకుంభకోణంలో దర్యాప్తు జరపాలి. అలా చేయొద్దనటానికి కారణమేమీ లేదు. దర్యాప్తు నిలిపివేయాల్సిన అవసరమూ లేదు. న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఎలాంటి వ్యవస్థ ఉండాలంటారు? న్యాయ వ్యవస్థపై ఫిర్యాదులకు జ్యుడీషియల్ కంప్లయింట్ కమిషన్ అవసరం. న్యాయమూర్తులపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్న అంశాన్ని స్పష్టం చేయాలి. కమిషన్‌లో కనీసం ఐదుగురు సభ్యులుండాలి. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు గానీ, ఇతరులు గానీ ఉండాలి. కానీ న్యాయ వ్యవస్థ నుంచి, ప్రభుత్వం నుంచి స్వతంత్రంగా ఉండాలి. ఎంపిక విషయంలో కూడా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పెత్తనం ఉండకుండా చూడాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులపై స్వతంత్ర విచారణ జరిగేలా ఉండాలి. విచారణ అనంతరం తొలగింపు లేదా ఏ ఇతర సిఫారసులైనా పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలి. ఏపీ హైకోర్టు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి విజ్ఞాపనకు ఎలాంటి పరిష్కారం ఉండాలని భావిస్తున్నారు? ప్రధాన న్యాయమూర్తి దాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలి. సుప్రీం కోర్టు ప్రవర్తన నియమావళి ప్రకారం సిట్టింగ్ న్యాయమూర్తులతోనే విచారణ జరిపించాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తి సీనియర్. ఆయనకంటే జూనియర్ న్యాయమూర్తులతో విచారణ జరిపిస్తే.. వారు స్వతంత్రంగా విచారణ జరపలేరేమోనన్నదే నా అభిప్రాయం. అందుకని ముగ్గురు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించడం అవసరం. -
నైతిక సంక్షోభంలో ‘న్యాయం’
భారత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించడం– ప్రజల పౌర, రాజకీయ హక్కుల రక్షణకు గ్యారంటీ పడుతూ అంతర్జాతీయ కన్వెన్షన్ ప్రకటించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం. కోర్టు ధిక్కార నేరం మోపడానికి రూపొందిం చిన ప్రమాణాలను తక్షణం సమీక్షించాలని కోరిన 1800 మంది భారత న్యాయవాదులతో ఏకీభవిస్తూ అంతర్జా తీయ న్యాయవాదులు, న్యాయ శాస్త్రవేత్తలు, న్యాయమూర్తుల కన్వెన్షన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. (1–9–2020) ‘సుప్రీంకోర్టుపై తాను అపనిందలు వేశానన్న మిషపైన కోర్టు (జస్టిస్ అరుణ్ మిశ్రా) నాకు ఒక రూపాయి జరిమానా విధించారు. అలాగే నేను కోర్టును క్షమాపణ వేడుకోనందుకూ విమర్శించారు. కానీ, ఆత్మగౌరవం, దాన్ని కాపాడుకోచూసే ఆత్మచైతన్యం, సత్యాన్ని సదా ప్రేమించే ఏ వ్యక్తికైనా రక్షణ కవచాలు కనుకనే తాను రూపాయి జరి మానాను చెల్లించలేద’ని ది హిందూ పత్రిక ప్రత్యేక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ భూషణ్ జవాబిచ్చారు (7–9–2020) అంటే దీనర్థం ఆ ఒక్క రూపాయి జరిమానాను ప్రశాంత్ భూషణ్ న్యాయవాది దావే చెల్లించి ఉంటారు. పౌరహక్కులకు, సభా హక్కు లకు, పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు హామీపడిన భారత రాజ్యాంగం మౌలిక సూత్రాలకు, వాటిని తు.చ. తప్పకుండా దేశపాలకులు, శాసన కర్తలు ఆచరించడానికి నిర్దేశించిన పౌర ధర్మాల అధ్యాయానికి (డ్యూటీస్ చాప్టర్) విధిగా కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన విశిష్ట న్యాయవాది, ప్రజాస్వామ్యవాది భూషణ్. అందుకే పౌరుల విమర్శనా హక్కునే నొక్కి వేయడానికి ‘క్రిమినల్ కంటెంప్ట్ లా’ను న్యాయస్థానాలు వినియోగించడాన్ని ప్రజలముందు అదే న్యాయ స్థానాల ముందు ప్రశాంత్ భూషణ్ కడిగివేయవలసి వచ్చింది. కోర్టుల పరువు ప్రతిష్టలన్నవి న్యాయస్థానాలు వెలువరించే తీర్పులపైన వాటిని అమలు జరిపించే తీరుతెన్నులపైన మాత్రమే ఆధారపడి ఉంటాయిగానీ ప్రజల స్పందనపైన, రియాక్షన్ పైన ఆధారపడి ఉండవు అని ప్రశాంత్ భూషణ్ భావన. అందుకే కనీసం గత మూడు దశాబ్దాల కాలంలో పాలక రాజకీయ వ్యవస్థలో మాదిరే శాసన న్యాయవ్యవస్థా చట్రంలో కూడా.. ప్రజాబాహుళ్యం స్వాతంత్య్ర పోరాటాలలో అనుపమ త్యాగాల ద్వారా సాధించుకున్న మంచి ఫలి తాలు కూడా తారుమారవుతూ వచ్చాయి. చివరికి కనీసం 1997లో ప్రధాన న్యాయమూర్తులు సహా 22 మంది న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ పనితీరును, న్యాయమూర్తుల ప్రవర్తనను నిర్దేశిస్తూ జాతీయ స్థాయిలో ఒక విశిష్టమైన తీర్మానాన్ని కన్వెన్షన్‌లో ఏకగ్రీవంగా ఆమో దించారన్న సంగతి జాతీయ, రాష్ట్రాల స్థాయిలో న్యాయ వ్యవస్థలు నిర్వహించే పెద్దలు ఇప్పటికైనా గుర్తించాలి. రాజకీయ ఆర్థిక, సామా జిక ప్రలోభాలకు లోనుకాకుండా నడుచుకోవాలన్న 1997 నేషనల్ కన్వెన్షన్ ఆదేశిక సూత్రాలను తప్పకుండా పాటించాలి. కానీ న్యాయపాలనా జీవిత విలువల పునరుద్ధరణ గురించి ఆ కన్వెన్షన్ నెలకొల్పిన సూత్రాలను న్యాయవ్యవస్థ నిర్వాహకులు పెక్కు మంది పాటించకపోవడం వల్ల గత పాతికేళ్లకు పైగా జరుగుతున్న అక్రమాలకు, అన్యాయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అలాగని మన న్యాయవ్యవస్థలో రాజకీయ ప్రలోభాలకు లోను కాకుం డానే పెక్కు తీర్పులు చెప్పిన న్యాయమూర్తులూ లేకపోలేదు. 22 మంది న్యాయమూర్తుల చేవ్రాళ్లతో ఆమోదం పొందిన ఆ కన్వెన్షన్ తీర్మానంలో న్యాయమూర్తులకు కీలకమైన 16 నిబంధనలు విధిం చారు. వాటిలో ప్రధానమైనవి.. న్యాయపాలనా జీవితంలో న్యాయ మూర్తులు.. న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రవర్తించాలని, అదే కోర్టు ఆవరణలో బంధువులతో, తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సున్నితంగా వ్యవహరించరాదని, తనకు సన్నిహిత బంధువులు, స్నేహితులకు సంబంధించిన కేసులు వినరాదని నిర్దేశించడం జరి గింది. ఎలాంటి బయటి రాజకీయ ప్రలోభాలకు, లోపాయకారీ ఒత్తి ళ్లకూ లొంగరాదనీ, ఏ కంపెనీలలోనూ షేర్లు, స్టాక్ మార్కెట్ లావా దేవీలతో ఎలాంటి సంబంధం ఉండరాదని నేషనల్ కన్వెన్షన్ నిర్దేశిం చింది. ఈ నిబంధనల తీర్మానాలకే ‘న్యాయమూర్తుల జీవిత విలువల పునశ్చరణ’గా పేర్కొన్నారు. ఈ నైతిక విలువల పునరుద్ధరణకు నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మ సూత్ర ప్రతిపాదకుడు. దీనర్థాన్ని వివరిస్తూ జస్టిస్ కృష్ణయ్యర్ స్వేచ్ఛ అంటే కేవలం స్వేచ్ఛ అని కాదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమని అర్థం కాదని కూడా అన్నారు. అయితే న్యాయవ్యవస్థలో నేడు అనేక రకాల ఉల్లం ఘనలకు కారణం రాజకీయ పాలనా వ్యవస్థల ప్రభావంతో కొన్ని న్యాయస్థానాల్లో (కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ) కొందరు ప్రలోభాలకు లోనవుతుండటమేనని మరికొందరి ఫిర్యాదులు. అసలు ఈ మాలోకానికి ప్రధాన కారణం ఎక్కడ గూడుకట్టుకుని ఉందో జస్టిస్ మార్టిన్ ఇలా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు. ‘అసలు మనం చెప్పుకునే స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది భ్రమా, వాస్తవమా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, న్యాయమూర్తులు వర్గానికి సంబంధం లేకుండానే పాలకవర్గ సభ్యులుగానే వ్యవహరిస్తారు, ప్రభుత్వాల బాడుగ ఉద్యోగులవుతారు. చివరికి తీర్పులలో తమ నిర్ణ యాలను అమలు జరిపే ప్రభుత్వ పాలకుల నిరంకుశాధికారంపై ఆధారపడతారు. అందువల్ల న్యాయవ్యవస్థ సర్వ స్వతంత్ర శక్తిగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా ఉండాలని భావించడం అర్థం లేని విన్యాసం’. బహుశా ఈ కారణం రీత్యానే సుప్రసిద్ధ న్యాయ వ్యవహారాల ‘హిందూ’ పత్రిక విలేకరి వి. వెంకటేశన్ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఇటీవల కొలువు చాలించుకున్న జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంలో అత్యంత పలుకుబడిగల జడ్జిగా ఎలా ఎదుగుతూ వచ్చారో ‘వైర్’ సంస్థకు అందించిన తాజా విశ్లేషణలో వెల్లడించాడు. తరచుగా జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్‌కే ఎందుకని రాజకీయంగా అత్యంత కీలక మైన కేసులు చేరుతూ వచ్చిందీ వివరిస్తూ ఈ విచిత్ర పరిణామాన్ని ప్రశ్నించేందుకే జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్‌లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తీరుపై ధ్వజమెత్తారు. ‘సుప్రీంలో ప్రతీ వ్యవహారం సవ్యంగా లేదు. ఉన్నత న్యాయస్థానంలో బయల్దేరిన ఈ లొసుగుల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడనుంది’ అని ప్రకటిం చారు. అలా జస్టిస్ చలమేశ్వర్ నిలబడినందుకే ఆ తరువాయి ఉన్నత స్థానానికి రావలసిన ఆయనను తగ్గించి, మరో జూనియర్‌ను ప్రమోట్ చేయటం లోకానికి తెలిసిన సత్యం. సీబీఐ స్పెషల్ జడ్జిగా బీహెచ్ లోయా అనుమానిత హత్య కేసు, బీజేపీ అగ్ర నాయకులలో ఒకరు షొరాబుద్దీన్–కౌసర్బీ హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న సమయంలో ఎలాంటి విచారణ లేకుండానే ఒక బొంబాయి హైకోర్టు జడ్జి అవినీతి కారణంగా కేసుల్ని నిర్వీర్యపరిచారో పత్రికలన్నీ కోడై కూశాయని మరవరాదు. ఇలా ఎన్నో కేసులు కొందరు న్యాయమూర్తుల పాక్షిక రాజకీయాల మూలంగా కొలిక్కి రాకుండా వీగిపోతూ వచ్చాయన్నది ఒక బండనిజం. గుజరాత్లో మైనారిటీల హత్యాకాండ విషయంలో నాటి బీజేపీ గుజరాత్ పాల కులపై కేసులన్నీ నిర్వీర్యమైపోవడానికి న్యాయవ్యవస్థ చేతులను అటు కాంగ్రెస్ సహాయంతోనూ, ఇటు బీజేపీ పాలకుల జమానాలోనూ మెలిపెడుతూ రావడమే కారణం. ఒకసారి హైకోర్టు కొట్టివేసిన కేసును మరో కోర్టు తిరగతోడకూడదని రాజ్యాంగంలోని 20(2)వ అధికరణ నిషేధిస్తున్నా కొన్ని కోర్టులు ‘తూ.నా. బొడ్డు’గా భావించటం కూడా ఒక రివాజు అయిపోయింది. ఇక ఈ రాజకీయ–న్యాయస్థానాల మధ్య అతివేలంలో 2019లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న రంజన్ గొగోయ్‌పైన కోర్టు ఉద్యోగిగా ఉన్న మహిళ పెట్టిన వేధింపుల అభియోగం కథను ఎలా కంచికి నడిపించారో కూడా లోకానికి తెలుసు. అనంతరం అనేక కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువడటం, రిటైర్మెంట్ తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా రావడం విశేషమే. అలా పరస్పరం ‘వాయినాలు’ ఇచ్చి పుచ్చుకోవడం జయప్రదంగా ముగిశాయని మరవరాదు. కోర్టు కేసుల్లో ప్రభుత్వమే ఫిర్యాదుదారుగా ఉన్నపుడూ జస్టిస్ అరుణ్ మిశ్రా తరచుగా ప్రభుత్వం తరఫునే ఉంటారు. ప్రభుత్వమే ప్రతివాదిగా హాజరైనప్పుడూ మిశ్రా ప్రభుత్వం తరఫున ఉంటూ వచ్చారు. పౌరహక్కుల ఉద్యమ నేతలపై కేసులన్నీ కూడా ఏళ్లూ పూళ్లుగా అతీగతీ లేకుండా పడి ఉండటం మన ‘ప్రజాస్వామ్యం’లో ఓ బంతులాటగా మారింది. మెరుగైన సంప్రదాయాలను కాపాడిన న్యాయవ్యవస్థల తీర్పుల్ని పక్కన పడేసి, విస్మరించడమే జస్టిస్ అరుణ్ మిశ్రా సామాజిక మితవాదంలో కీలకమైన అంశంగా న్యాయ నిపు ణులు, వ్యాఖ్యాతలూ భావించడం విశేషం. దేశ పౌరులకు సంపూర్ణ న్యాయం ఒనగూర్చే అసాధారణ అధికారాన్ని న్యాయవ్యవస్థకు, కోర్టు లకూ రాజ్యాంగంలోని 142వ అధికరణ కల్పిస్తోంది. కానీ, ఈ అధిక రణను కాదని చివరికి పెద్ద బెంచ్ తీర్పును కూడా తోసిపుచ్చి వ్యవ హరించే అవకాశాన్ని కోర్టు చిన్న బెంచ్‌లకు దఖలుపరుస్తున్న ఉదా హరణలు కూడా దేశంలో చెలామణీలో ఉన్నాయని కొందరు నిపుణుల అభిప్రాయం. ‘ఉపాహార్’ (1997) విషాద ఘట్టంపై విచారణలో సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ ఆ విషాదంలో కోల్పోయిన ఇద్దరు బిడ్డల ఉదం తాన్ని తలచుకుంటూ తల్లిదండ్రులు చేసిన వ్యాఖ్య పాఠకుల గుండెల్ని పిండేస్తుంది: ‘పంతొమ్మిదేళ్లనాడు నాకు దేవుడిలో నమ్మకం పోయింది, ఇప్పుడు భారత న్యాయ వ్యవస్థలో విశ్వాసం పోయింది. న్యాయస్థానా లంటే మాకెంతో గౌరవం. కానీ, ఉపాహార్ సినిమా యజమానులు మాత్రం రూ.60 కోట్లతో తమ స్వేచ్ఛను కొనుక్కోగలిగారు’! బహుశా అబ్రహాం లింకన్ అన్నట్టు ‘కొన్ని తీర్పులు లీగల్‌గా సమర్థనీయం కావచ్చునేమోగానీ, నైతికంగా సమర్థనీయం కావు’!! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఇది సబబు కాదు
గత కొన్ని రోజులుగా ప్రశాంత్ భూషణ్ చుట్టూ తిరిగిన కోర్టు ధిక్కార వివాదం సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు రూపాయి జరిమానా విధించడంతో ముగిసింది. ఆయన పెట్టిన రెండు ట్వీట్లు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వున్నాయని, ఆయన నేరం చేసినట్టు నిర్ధారణ అయిందని సర్వోన్నత న్యాయస్థానం గత నెల 13న తేల్చింది. క్షమాపణ చెబితే సరేసరి...లేనట్టయితే శిక్ష తప్పదని చెబుతూ తుది తీర్పును వాయిదా వేసింది. వేయదగ్గ శిక్షపై ఆ నెల 20నుంచి వాదప్రతివాదాలు నడిచాయి. చివరకు విధించిన శిక్ష–రూపాయి జరిమానా లేదా మూడు నెలల జైలు, మూడేళ్లపాటు న్యాయవాద వృత్తినుంచి సస్పెన్షన్. జరిమానా చెల్లించడానికే ప్రశాంత్ భూషణ్ మొగ్గుచూపారు. కేవలం ఈ శిక్షను సమీక్షించమని కోరడానికి తనకున్న హక్కును వినియోగించుకోవడం కోసమే జరిమానా చెల్లిస్తున్నట్టు ఆయన వివరించారు. సుప్రీంకోర్టు సుమోటాగా ఈ కేసు తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్‌పై వున్న ఫొటోపై ప్రశాంత్ చేసిన వ్యాఖ్య, గత ఆరేళ్లుగా సుప్రీంకోర్టు తీరుతెన్నులపై చేసిన వ్యాఖ్య ఈ వివాదానికి మూలం. సుప్రీంకోర్టును లేదా న్యాయవ్యవస్థ మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశం తనకు లేదని ప్రశాంత్ వాదిస్తే...తగినవిధంగా స్పందించకపోతే దేశవ్యాప్తంగా న్యాయవాదులకూ, కక్షిదారులకూ తప్పుడు సంకేతం వెళ్తుందని ధర్మాసనానికి నేతృత్వంవహించిన జస్టిస్ అరుణ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. చూడటానికి ఇది రూపాయితో సరిపెట్టిన దండనగా కనబడవచ్చు. కానీ న్యాయవ్యవస్థపై విమర్శలు సహించబోమన్న సంకేతాలు పంపింది. దేశంలోని కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థపై సాధారణ ప్రజానీకంలో ఇప్పటికీ గౌరవప్రపత్తులున్నాయి. అడపా దడపా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమైన సందర్భాలు లేకపోలేదు. కానీ మొత్తంగా మిగిలిన రెండింటితో పోలిస్తే అది మెరుగన్న అభిప్రాయమే బలంగా వుంది. అందులో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన న్యాయమూర్తులే ఇందుకు కారణం. నిజానికి బయటవారితో పోలిస్తే వారే అవినీతిని బాహాటంగా ఎత్తిచూపారు. ఇందుకు జస్టిస్ కృష్ణయ్యర్ మొదలుకొని జస్టిస్ కట్జూ వరకూ ఎందరినో ఉదాహరించవచ్చు. న్యాయమూర్తులుగా పనిచేస్తున్నప్పుడూ, రిటైరయ్యాక కూడా వారు ఈ పని చేశారు. న్యాయపీఠంపై వున్నవారిలో కనీసం 20 శాతంమంది అవినీతిపరులని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వెంకటాచలయ్య చెప్పిన మాటను ఎవరూ మరిచిపోరు. న్యాయమూర్తుల్లో రెండు రకాలవారున్నారని...న్యాయం తెలిసినవారు, కేంద్ర న్యాయమంత్రి తెలిసినవారు అని విపక్షంలో వున్నప్పుడు బీజేపీ నేత స్వర్గీయ అరుణ్ జైట్లీ చమత్కరించారు. ‘మేం అధికారంలోకొచ్చాక ఆ ధోరణి పూర్తిగా పోయింద’ని ఆ తర్వాత ఆయన ఎక్కడా చెప్పిన దాఖలా లేదు. అలహాబాద్ హైకోర్టుపై పదేళ్ల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలవల్ల నిజాయితీపరులైన న్యాయమూర్తులపై సైతం నీలినీడలు కమ్ముకున్నాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తరఫున పిటిషన్ దాఖలైనప్పుడు ‘ఇది స్పందించాల్సిన సమయం కాదు...ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం’ అంటూ ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. న్యాయవ్యవస్థ అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ మూడేళ్లక్రితం నివేదిక విడుదల చేసినప్పుడు సైతం నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని ధర్మాసనం అది కోర్టు ధిక్కారం కిందకు రాదని తేల్చిచెప్పింది. 1995లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. రామస్వామి ఈ విషయంలో ఇంకాస్త ముందుకెళ్లారు. సదుద్దేశంతో, సంయమనంతో న్యాయమూర్తి ప్రవర్తనను లేదా న్యాయస్థానం ప్రవర్తనను కఠిన పదజాలంతో విమర్శించినా కోర్టు ధిక్కారంకాదన్నారు. అయితే అవి న్యాయమూర్తి వ్యక్తిత్వహననానికి, నిష్పాక్షికతను ప్రశ్నార్థకం చేసే స్థాయికి దిగజారకూడదన్నది జస్టిస్ రామస్వామి గీసిన లక్ష్మణరేఖ. ఇతర వ్యవస్థలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య మౌలికంగా వ్యత్యాసం వుంది. మిగతా రెండు వ్యవస్థల్లో పనిచేసేవారు ఇతర వ్యవస్థలపై లేదా తమ వ్యవస్థలపై విమర్శలు చేయలేరు. నిబంధనలు ఒప్పుకోవు. ఒక్క న్యాయవ్యవస్థ మాత్రమే ఎవరిలోపాలనైనా నిశితంగా విమర్శించగలదు. అటువంటి అధికారమూ, హక్కూ వున్న వ్యవస్థ మరీ ఇంత సున్నితంగా వుండటం సబబు కాదు. విమర్శలను మాత్రమే కాదు..ఆ విమర్శలు చేస్తున్నవారెవరో, వారి ఉద్దేశాలేమిటో, అందుకు దారితీస్తున్నవేమిటో కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాగని న్యాయమూర్తులను బెదిరిస్తే, కించపరిస్తే సహించాలని ఎవరూ చెప్పరు. న్యాయవ్యవస్థతోసహా వ్యక్తులకైనా, వ్యవస్థలకైనా కావలసింది పారదర్శకత, జవాబుదారీతనం. ఆ రెండూ లోపించినా, అవి తగినంతగా లేకపోయినా విమర్శలు రాకతప్పదు. 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై సుప్రీంకోర్టులో పనిచేసే యువతి లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో అసలు జరిగిందేమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆమెపై కేసు పెట్టారు. ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేసే ఆమె భర్త, బావలను సస్పెండ్ చేశారు. ఆరోపణల్లో పెద్ద కుట్ర వున్నదని జస్టిస్ గొగోయ్ ఆరోపించారు. తీరా ఏడాది గడిచేసరికి అందరూ ఎవరి ఉద్యోగాల్లో వారు చేరారు. కేసులు రద్దయ్యాయి. పరిస్థితి ఇలా వున్నప్పుడు ప్రశాంత్‌భూషణ్ వంటివారు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని సడలేలా చేస్తున్నారని అనడం సబబేనా? అందుకు బదులు ఆయన వ్యాఖ్యలకున్న ప్రాతిపదికేమిటో వెల్లడిస్తే దిద్దుబాటుకు సిద్ధమని లేనట్టయితే తదుపరి చర్యలు తప్పవని చెబితే బాగుండేది. బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీ వేయాల్సింది. -
ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా!
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన నేరానికిగాను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించింది. న్యాయాన్ని అందించే వ్యవస్థ గౌరవాన్ని ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్లతో తగ్గించారని వ్యాఖ్యానించింది. అయినప్పటికీ కఠిన శిక్షలేవీ విధించకుండా ఉదారంగా వ్యవహరిస్తున్నామని, నామమాత్రంగా రూపాయి జరిమానా చెల్లించాలని తీర్పులో పేర్కొంది. సెప్టెంబర్ 15లోగా ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టులో జమచేయాలని, లేని పక్షంలో 3 నెలల జైలు, న్యాయవాద వృత్తి నుంచి మూడేళ్ల నిషేధం అనుభవించాల్సి ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ సోమవారం తీర్పునిచ్చింది. వాక్స్వాతంత్య్రాన్ని అదుపు చేయడం సరికాకపోయినప్పటికీ ఇతరుల హక్కులను గౌరవించాల్సిన అవసరముందని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రశాంత్ భూషణ్ తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పాలని బెంచ్ పదేపదే కోరిందని, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ఆ ట్వీట్లు క్షణికావేశంలో చేసినవిగా అభిప్రాయపడుతూ క్షమాపణ వ్యక్తం చేయాలని కోరారని బెంచ్ గుర్తు చేసింది. సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోక ముందే ప్రశాంత్ భూషణ్ కోర్టుకు సమర్పించిన ప్రకటనను మీడియాకు విడుదల చేశారని బెంచ్ గుర్తించింది. సుమారు 82 పేజీలున్న తీర్పును మంగళవారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా చదివి వినిపించారు. తీర్పు ఎవరు రాశారన్నది ప్రతిపై లేకపోవడం విశేషం. న్యాయవ్యవస్థపై, సుప్రీంకోర్టుపై తనకు అపారమైన గౌరవం ఉందని, తన ట్వీట్లు సుప్రీంకోర్టును అగౌరవపరిచేందుకు కాదని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ‘సుప్రీంకోర్టు నన్ను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా కోరే హక్కును ఉపయోగించుకుంటా. ఈ తీర్పు (జరిమానా)ను అంగీకరిస్తూ ఇంకే శిక్ష విధించినా అనుభవించేందుకు సిద్ధం. ఒక్క రూపాయి జరిమానా చెల్లిస్తా’అని పేర్కొన్నారు. -
కోర్టు ధిక్కరణ: రూపాయి జరిమానాకు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా తేలిన ఆయన.. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం తుది తీర్పును వెల్లడించిన అత్యున్నత న్యాయస్థానం సీనియర్ అటర్నీ జనరల్ విజ్ఞప్తి మేరకు ఒక్క రూపాయి జరిమాన విధించింది. ఇక కోర్టు తీర్పు అనంతరం స్పందించిన ప్రశాంత్ భూషన్ న్యాయస్థానంపై తనకు అపారమైన నమ్మకం ఉందని, సుప్రీం కోర్టు విధించిన ఒక రూపాయ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు తన సీనియర్, న్యాయవాది రాజీవ్ ధవన్ తనకు ఒక రూపాయి ఇచ్చారని ట్విటర్ వేదికగా ప్రకటించారు. (జరిమానా చెల్లించండి.. లేదంటే జైలుకే: సుప్రీంకోర్టు) కోర్టు దిక్కరణ కేసులో సుప్రీం విధించిన జరిమానాను అంగీకరించినట్లు వెల్లడిస్తూ.. తన సీనియర్‌తో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. కాగా తాను తప్పేమీ చేయలేదని, కోర్టుకు క్షమాపణ చెబితో తప్పు చేసినట్లు అవుతుందని ప్రశాంత్ భూషన్ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే తీర్పు సందర్భంగా ప్రశాంత్ భూషన్‌పై న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించకపోతే.. మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి జరిమానా చెల్లించేందుకు అతని అంగీకరించినట్లు తెలుస్తోంది. (క్షమాపణ కోరితే తప్పేముంది) -
ప్రశాంత్ భూషణ్‌కు ఒక్క రూపాయి జరిమానా
-
ప్రశాంత్ భూషణ్‌కు ఒక్క రూపాయి ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించని పక్షంలో.. మూడు నెలల జైలు శిక్ష సహా మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని స్పష్టం చేసింది. కాగా సర్వోన్నత న్యాయవ్యవస్థ పనితీరు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.(చదవండి: న్యాయవాది భూషణ్‌కు ఏ శిక్ష విధిస్తేనేం? ) ఈ నేపథ్యంలో అనుజ్ సక్సేనా అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణను చేపట్టడమే కాకుండా ఆగస్టు 14న ఆయనను దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్షమాపణ కోరాల్సిందిగా ఆదేశించింది. అయితే ఇందుకు ససేమిరా అంగీకరించని ప్రశాంత్ భూషణ్ ఆత్మసాక్షికి విరుద్ధంగా క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. అదే సమయంలో తనని దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుని రీకాల్ చేయాలని గత మంగళవారం కోర్టుని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు నేడు తీర్చునిచ్చింది. (చదవండి: క్షమాపణ కోరితే తప్పేముంది) -
ప్రశాంత్ భూషణ్: తుది తీర్పు వెల్లడించనున్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సంబంధించిన కోర్టు దిక్కారణ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ మేరకు ప్రశాంత్ భూషణ్ ట్వీట్లపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. కాగా కోర్టు ధిక్కరణ ఆరోపణలతో ప్రశాంత్ భూషణ్‌కు జూలై 22న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా సుప్రీంకోర్టు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, అంతకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. -
న్యాయవాది భూషణ్‌కు ఏ శిక్ష విధిస్తేనేం?
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేత్రికన్ తిరప్పినమ్, కుట్రమ్ కుట్రమే’ అన్న తమిళ వ్యాక్యానికి ‘శివుడు మూడో కన్ను తెరిచినాసరే, తప్పు తప్పే’ అని అర్థం. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తనపై దాఖలైన ‘కోర్టు ధిక్కార నేరం’ కేసులో దాదాపు ఇదే అర్థంలో వాదించారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డావని సుప్రీం కోర్టు తేల్చినా, శిక్ష పడుతుందని హెచ్చరించినా ప్రశాంత్ భూషణ తన మాటలకే కట్టుబడి ఉన్నారు. కోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలు సబబేనని పునరుద్ఘాటించారు. అత్యున్నత న్యాయవ్యవస్థ పనితీరు, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదం అవడం, దీనిపై స్వయంగా స్పందించిన సుప్రీం కోర్టు ఆయనపై కోర్టు ధిక్కార నేరం మోపడం తెల్సిందే. భూషణ్ నేరం చేసినట్లు గత వారమే నిర్ధారించిన సుప్రీం కోర్టు ఆయనకు శిక్ష విధించేందుకు మంగళవారం నాడోసారి కొలువుదీరింది. క్షమాపణలకు అవకాశం ఇచ్చినప్పటికీ భూషణ్ అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ఆయనకు కోర్టు ఏ శిక్ష విధించినా అది ఆయన ప్రతిష్టను మరింత పెంచుతుందే తప్పా, తగ్గించేదేమీ లేదు. భూషణ్ ధిక్కారం కేసులో కోర్టు వ్యవహారం ‘గోరుతో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్న’ చందంగా మారింది. కోర్టు పనితీరును, న్యాయమూర్తుల ప్రవర్తనను విమర్శిస్తూ భూషణ్ చేసిన ట్వీట్లు అస్పష్టంగానే ఉన్నాయి. కానీ తనపై దాఖలైన కోర్టు ధిక్కార కేసుకు సమాధానంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో కోర్టు వ్యవహరించిన తీరును సమూలంగా వివరించారు. వివాదాస్పద పౌరసత్వ బిల్లు, జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన బిల్లు, కశ్మీర్లో పౌరసత్వ హక్కుల పునరుద్ధణకు సంబంధించిన కేసుల్లో కోర్టు వ్యవహరించిన తీరును ఆయన ప్రస్తావించారు. అయోధ్య–రామ జన్మభూమి కేసులో గొగొయ్ ఇచ్చిన తీర్పును సైతం ఆయన వదిలిపెట్టలేదు. (క్షమాపణ కోరితే తప్పేముంది) అంతేకాకుండా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌కి వ్యతిరేకంగా దాఖలైన లైంగిక వేధింపుల కేసులో కోర్టు వ్యవహరించిన తీరును, గొగొయ్ పదవీ విరమణ తర్వాత ఆ కేసును దాఖలు చేసిన యువతికి కోర్టులో మళ్లీ అదే పోస్ట్ ఇవ్వడం లాంటి పరిణామాలను భూషణ్ కూలంకుషంగా ప్రస్తావిస్తూ వాటిపై తన అభ్యంతరాలను నిక్కచ్చిగా వెల్లడించారు. బిర్లా–సహారా కేసు నుంచి సుప్రీం కోర్టు జడ్జీలకు వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాలిఖోపాల్ ఆత్మహత్య నోట్లో చేసిన ఆరోపణల వరకు ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. మాజీ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను విధులు నిర్వహించకుండా కేంద్రం అడ్డుకున్న వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన గత నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పులనే ఎక్కువగా ప్రస్థావించారు. దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ అనేక కేసుల్లో అనేక సార్లు తీర్పు చెప్పిన మన న్యాయ వ్యవస్థ తన విషయంలో మాత్రం ఎందుకు ‘ధిక్కారం’ అంటుందో...!! -
క్షమాపణ కోరితే తప్పేముంది
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారు తీర్పుని సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పడానికి ససేమిరా అంటూనే తనని దోషిగా ఇచ్చిన తీర్పుని రీకాల్ చేయాలని మంగళవారం కోర్టుని అభ్యర్థిం చారు. భూషణ్‌ను ఇంతటితో వదిలేయాలని ఆయన తరఫున న్యాయవాది రాజీవ్ ధావన్ కోరారు. మరోవైపు అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ కూడా భూషణ్‌ని క్షమించి వదిలేయాలని, అయితే ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్లన్నీ వెనక్కి తీసుకోవాలని వాదించారు. భూషణ్‌ని క్షమించాలి: లాయర్ వాదనలు ప్రశాంత్ భూషణ్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ సుప్రీం కోర్టు ప్రశాంత్ భూషణ్‌ని ఎలాంటి హెచ్చరికలు, మందలిం పులు లేకుండా వదిలేయాలన్నారు. భూషణ్ ఎలాంటి దోపిడీలు, హత్యలు చేయలేదని అన్నారు. న్యాయస్థానం తన రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తేనే ఈ వివాదం ముగుస్తుందని చెప్పారు. ఈ వాదనలు విన్న జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘మీరు ఒకరి మనసు గాయపరిచినప్పుడు క్షమాపణ చెపితే తప్పేంటి’అని జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశ్నించారు. ‘‘న్యాయవ్యవస్థని కించపరిచేలా విమర్శలు చేస్తూ ఉంటే ఎంతకాలం భరించాలి? మీరు ఎవరినైనా గాయపరిస్తే, గాయానికి మందు పూయాల్సిందే’’అని స్పష్టం చేశారు. విమర్శల్లో నిజాయితీ ఉండాలి ‘‘విమర్శలనేవి నిజాయితీగా చేస్తే ఇబ్బందేమీ ఉండదు. వ్యవస్థకీ మంచి జరుగుతుంది. కానీ ఒక న్యాయవాదే తోటివారిపై నిందలు వేస్తూ ఉంటే, ఈ వ్యవస్థపై ప్రజలకి నమ్మకం ఎందుకు ఉంటుంది’’అని మిశ్రా వ్యాఖ్యానిం చారు. మంగళవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు మొదలయ్యాక కూడా సుప్రీం బెంచ్ క్షమాపణ చెప్పడానికి ప్రశాంత్ భూషణ్‌కి అరగంట గడువు ఇచ్చింది. అయినా ఆయన తాను చేసిన ట్వీట్లలో తప్పేం లేదనే వాదించారు. సుప్రీంకోర్టు కుప్పకూలిపో యిందని భూషణ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం కాదా అని ప్రశ్నించిన జస్టిస్ మిశ్రా శిక్ష ఖరారుని వాయిదా వేశారు. -
క్షమాపణకు ప్రశాంత్ భూషణ్ ససేమిరా
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా తాను చేసిన ట్వీట్లపై క్షమాపణలు చెప్పేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ట్వీట్లలో వ్యక్తపరిచింది తాను విశ్వసించిన నమ్మకాలనేనని, అవి ఇప్పుడూ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిజాయితీ లేకుండా క్షమాపణ చెప్పడం ఆత్మసాక్షిని, ఒక వ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని ఆయన కోర్టు ధిక్కరణ కేసు విషయంలో సోమవారం దాఖలు చేసిన అనుబంధ వాంగ్మూలంలో తెలిపారు. అనుజ్ సక్సేనా అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ కేసు విచారణను చేపట్టడమే కాకుండా దోషి అని ఆగస్టు 14న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 20వ తేదీన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశాంత్ భూషణ్ కేసుపై విచారణ చేస్తూ.. తన వ్యాఖ్యలపై పునరాలోచన చేసేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. శిక్ష ఖరారు విచారణను వేరే బెంచ్‌కు బదలాయించాలన్న ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. శిక్ష ఖరారుపై తుదితీర్పును రిజర్వ్‌లో ఉంచింది. న్యాయ వ్యవస్థ నిష్కళంక చరిత్ర పక్కదారి పడుతూంటే ఆ విషయంపై గళమెత్తడం న్యాయవాదిగా తన బాధ్యతని, ఆ కారణంగానే మంచి విశ్వాసంతోనే తన భావాలను వ్యక్తం చేశానని ప్రశాంత్ సోమవారం నాటి వాంగ్మూలంలో తెలిపారు. సుప్రీంకోర్టుకు లేదా ఏ ప్రధాన న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు. రాజ్యాంగ ధర్మకర్తగా, ప్రజల హక్కులను కాపాడే న్యాయవ్యవస్థ తప్పుదోవ పట్టరాదని సద్విమర్శ మాత్రమే చేశానని వివరించారు. క్షమాపణ మాటవరసకు చేసేదిగా కాకుండా నిజాయితీగా ఉండాలని న్యాయస్థానమే చెబుతుందని గుర్తు చేశారు. దేశంలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉన్న చిట్టచివరి ఆశ సుప్రీంకోర్టేనని, ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలకు ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. -
‘అది నా మనస్సాక్షికి విరుద్ధం’
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, సుప్రీంకోర్టులపై తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పేందుకు ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రశాంత్ భూషణ్ మూడు రోజుల్లోగా తన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని కోర్టు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. అయితే తాను పూర్తి విశ్వాసంతో ఈ ట్వీట్లు చేశానని, దీనిపై షరతులతో లేదా బేషరుతగా క్షమాపణలు చెప్పడం సరైంది కాదని ప్రశాంత్ భూషణ్ సర్వోన్నత న్యాయస్ధానానికి స్పష్టం చేశారు. అది తన మనస్సాక్షికి విరుద్ధమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలపై గురువారం విచారించిన సుప్రీంకోర్టు ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలని, తన ప్రకటనపై మూడు రోజుల్లోగా పున:పరిశీలించాలని కోర్టు కోరింది. ‘మీరు వందలకొద్దీ మంచి పనులు చేయవచ్చు..కానీ అది మీరు పది నేరాలు చేసేందుకు లైసెన్స్ ఇవ్వబోద’ని ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ప్రశాంత్ భూషణ్‌ను ఉద్దేశించి అన్నారు. దీనిపై తాను తన న్యాయవాదిని సంప్రదిస్తానని, తన వైఖరిలో మాత్రం పెద్దగా మార్పును ఆశించరాదని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు నివేదించారు.తాను పూర్తి వివరాలతో సత్యాన్ని ఉటంకిస్తూ ఆ ప్రకటనలు చేశానని, వీటిని కోర్టులు పరిగణించలేవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, విలువల పరిరక్షణకు బహిరంగ విమర్శలు కీలకమని ఈ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలోనే తాను ఆ ట్వీటుల చేశానని చెప్పుకొచ్చారు. కాగా గత నెలలో నాగపూర్‌లో ప్రధాన న్యాయమూర్తి హ్యార్లీ డేవిడ్సన్ హెల్మెట్, ముఖానికి మాస్క్ లేకుండా బైక్‌పై ప్రయాణిస్తున్న ఫోటోను ఉద్దేశించి ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. కోర్టు లాక్డౌన్లో ఉండగా, ప్రజలు న్యాయం పొందే హక్కును నిరాకరిస్తూ ప్రధాన న్యాయమూర్తి బైక్ రైడింగ్ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్లో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడంలో నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల పాత్ర ఉందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఇక ప్రధాన న్యాయమూర్తిని విమర్శిస్తే న్యాయస్ధానం అధికారాన్ని తక్కువ చేయడం కాదని ఆయన కోర్టుకు తన వాదనలు వినిపించారు. చదవండి : నటి స్వర భాస్కర్‌కు ఊరట -
క్షమాపణపై పునరాలోచించుకోండి
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణ కోరబోనన్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పునరాలోచించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. భేషరతుగా క్షమాపణ చెప్పడానికి ఈనెల 24 దాకా సమయం ఇస్తున్నట్లు తెలిపింది. ప్రశాంత్ భూషణ్ చేసిన కొన్ని ట్వీట్లు న్యాయవ్యవస్థను ధిక్కరించేవిగా ఉన్నాయని, ఆయనను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు బెంచ్ ఈనెల 14న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో భూషణ్‌కు గరిష్టంగా ఆరునెలల వరకు జైలుశిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా పడొచ్చు. లేదా రెండు శిక్షలు కలిపి విధించొచ్చు. శిక్ష ఖరారుపై సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికరమైన వాదనలు నడిచాయి. ధిక్కరణ కేసులో శిక్ష ఖరారును మరో బెంచ్ చేపట్టాలని ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ నిర్ద్వందంగా తిరస్కరించింది. ధిక్కార పూరిత ప్రకటన, న్యాయవ్యవస్థను ధిక్కరిస్తూ చేసిన ట్వీట్లపై క్షమాపణలు చెప్పే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రశాంత్ భూషణ్‌కు ఈనెల 24 దాకా గడువు ఇచ్చిం ది. ఇందుకు ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ తన న్యాయవాదులతో సంప్రదించిన తరువాత కోర్టు ఇచ్చిన సలహాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అంతకుమునుపు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బెంచ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ధిక్కరణ కేసులో ఇప్పటికే దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో ప్రశాంత్ భూషణ్‌కు అదనంగా ఎలాంటి శిక్ష విధించవద్దని అభ్యర్థించారు. తన ట్వీట్లపై క్షమాపణలు చెప్పరాదన్న ప్రశాంత్ భూషణ్ నిర్ణయంపై పునరాలోచించకపోతే వేణుగోపాల్ అభ్యర్థనను పరిగణించలేమని బెంచ్ స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్ తన తప్పును తెలుసుకుంటే తామూ ఉదారంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన బెంచ్ తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. శిక్ష ఖరారును ఆపడం కుదరదు ధిక్కరణ కేసులో సమీక్ష కోసం వేయనున్న రివ్యూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకూ శిక్ష ఖరారు చేయకూడదనే ప్రశాంత్ భూషణ్ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే రివ్యూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేంతవరకు శిక్ష అమలును నిలిపి ఉంచుతామని తెలిపింది. ఖరారు విచారణను ఇంకో బెంచ్‌కు బదిలీ చేయడం సంప్రదాయలకు విరుద్ధమవుతుందని, గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని బెంచ్ స్పష్టం చేసింది. ప్రతిదానికీ ఒక లక్ష్మణ రేఖ ఉంటుందని, భూషణ్ దాన్ని అతిక్రమించారని కోర్టు అభిప్రాయపడింది. త్వరలో తాను పదవీ విరమణ చేస్తున్న కారణంగా ఈ కేసులో వాయిదాలు కోరరాదని జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలు కాపాడేందుకు సద్విమర్శకు తావు ఉండాలని, ఆ విలువలను కాపాడే ఉన్నత లక్ష్యంతోనే తాను ఆ ట్వీట్లు చేశానని ప్రశాంత్ వివరించారు. ‘‘దయ చూపాలని అడగను. ఉదాత్తంగా వ్యవహరించమనీ కోరను. ఈ కోర్టు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తా’’అని స్పష్టం చేశారు. -
ప్రశాంత్ భూషణ్‌కు మరో ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కార కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ప్రతిష్టకు భంగం కలిగేలా ట్వీట్లు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా తేలుస్తూ శుక్రవారం(ఆగస్టు 14) తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. (చదవండి : ధిక్కారం కేసులో ప్రశాంత్ భూషణ్ దోషే) ఈ రోజు (ఆగస్టు 20) శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ తీర్పును ఆయన సవాల్ చేస్తూ రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. మరొక బెంచ్‌తో శిక్ష ఖరారు చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది సముచితమైన కోరిక కాదని, శిక్ష విధించిన తర్వాతే తీర్పు పూర్తవుతుందని తేల్చి చెప్పింది. శిక్ష ఖరారును వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్‌పై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో ఆయనకు విధించాల్సిన శిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. గరిష్టంగా ఆయనకు 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. -
ధిక్కారం కేసులో ప్రశాంత్ భూషణ్ దోషే
న్యూఢిల్లీ: న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కి సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ప్రతిష్టకు భంగం కలిగేలా ట్వీట్లు చేసినందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనను దోషిగా తేలుస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థపైనే ప్రశాంత్ భూషణ్ వదంతులు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారని అవన్నీ దేశ గౌరవాన్నే దెబ్బ తీసేలా ఉన్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు ధిక్కార కేసులో ఆయనకు 6నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఈ కేసు నుంచి ట్విట్టర్‌కి విముక్తి కల్పించింది. ‘నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీర్పులు చెప్పే న్యాయస్థానాలు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పెట్టని గోడలు’ అని ధర్మాసనం అభివర్ణించింది. రాజ్యాంగానికి మూలస్తంభమైన అత్యున్నత న్యాయస్థానంపై ప్రశాంత్ భూషణ్ దాడికి దిగారని, అది కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్ ఏమని ట్వీట్ చేశారంటే ..? ప్రశాంత్ భూషణ్ జూన్ 27న చేసిన ట్వీట్లో దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, గత ఆరేళ్లలో సుప్రీం కోర్టు పోషించిన పాత్ర, నలుగురు ప్రధాన న్యాయమూర్తులే దీనికి కారణమన్నారు. రెండో ట్వీట్లో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే ఎలాంటి మాస్క్, హెల్మెట్ ధరించకుండా నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో బీజేపీ నేతకు చెందిన రూ.50 లక్షల బైక్‌ని నడుపుతున్నారని, లాక్డౌన్ అంటూ జనం సమస్యల్ని ప్రత్యక్షంగా విచారించడానికి నిరాకరిస్తూ హెల్మెట్ లేకుండా ప్రధాన న్యాయమూర్తి ఎలా బండి నడుపుతారంటూ ఆ ట్వీట్లో ప్రశ్నించారు. -
ప్రశాంత్ భూషణ్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టులోఎదురుదెబ్బ తప్పలేదు. ట్విటర్ వేదికగా ఉన్నత న్యాయస్థానం, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా నిర్ధారించిన కోర్టు ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చింది. ‘‘తీవ్రమైన" ధిక్కారానికి పాల్పడినట్లుగా తేలిందంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. అనంతరం భూషణ్‌కు శిక్షపై విచారణను ఈ నెల 20 తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, అంతకుముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేస్తూ దోషిగా తేల్చింది. దీనిపై ప్రశాంత్ భూషణ్‌కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష లేదా 2000 రూపాయల వరకు జరిమానాతో లేదా రెండింటితో సాధారణ జైలు శిక్ష విధించవచ్చని భావిస్తున్నారు. కాగా కోర్టు ధిక్కరణ ఆరోపణలతో ప్రశాంత్ భూషణ్‌కు జూలై 22న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు సమాధానమిస్తూ, వివరణాత్మక అఫిడవిట్‌ను ప్రశాంత్ దాఖలు చేశారు. దీన్ని ఆగస్టు 5 న విచారించిన కోర్టు తీర్పును రిజర్వు చేసిన సంగతి తెలిసిందే -
‘ధిక్కారం’పై కేసు వాపసుకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ రాజ్యంగబద్ధతను సవాలు చేస్తూ మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు గురువారం అనుమతిచ్చింది. ఇదే అంశంపై ఇప్పటికే పలు ఇతర పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్లు వీరు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. (ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా) జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ ఈ అంశంపై గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపి పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. నేరపూరిత ధిక్కరణ విషయంలోని ఓ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు, సమానత్వ హక్కుకు భంగం కలిగిస్తుందని పిటిషనర్లు గతంలో సుప్రీంను ఆశ్రయించారు. (రామోజీకి ‘సుప్రీం’ నోటీసులు) -
ప్రశాంత్ భూషణ్‌కి షాకిచ్చిన సుప్రీం కోర్టు!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో 16 మంది అవినీతిపరులేనంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ 2009లో ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ కేసులో ప్రశాంత్ భూషణ్ వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాక ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా లేదా అన్నది పరిశీలించనున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ప్రశాంత్ భూషణ్ తండ్రి, సీనియర్ న్యాయవాది, మాజీ న్యాయ మంత్రి శాంతి భూషణ్ కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత కోర్టు భౌతిక విచారణ ప్రారంభమైనప్పుడు ఈ కేసును విచారించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. (రామోజీరావుకు సుప్రీం నోటీసులు) 2009లో తెహల్కా మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ భూషణ్ ప్రధాన న్యాయమూర్తుల్లో 16 మంది అవినీతిపరులే ఉన్నారంటూ ఆరోపించారు. ఈ కేసుతో పాటు న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై నమోదైన మరో కోర్టు ధిక్కరణ కేసును కూడా సుప్రీంకోర్టు విచారిస్తున్నది. చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేపై ప్రశాంత్ భూషణ్ ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద రీతిలో కామెంట్ చేశారు. బాబ్డే బైక్ తొలడాన్ని తప్పుపడుతూ ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛకు, కోర్టు ధిక్కరణకు స్వల్ప తేడా ఉన్నట్లు సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. (మాల్యా కేసు : సంచలన ట్విస్టు) ఈ క్రమంలో ‘16 మంది ప్రధాన న్యాయమూర్తులు అవినీతిపరులంటూ నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరు ఇబ్బందిపడ్డా.. వారి కుటుంబ సభ్యులకు బాధ కలిగినా అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ ప్రశాంత్ భూషణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. లాయర్ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రచురించిన సీనియర్ జర్నలిస్టు తరుణ్ తేజ్‌పాల్ కూడా క్షమాపణలు చెప్పారు. -
సుప్రీంకోర్టుకు మేధావుల లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుపైనే కాక ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ విచారణను నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టుకు మేధావుల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 131 మంది మేధావులు లేఖ రాశారు. వీరిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకుర్ కూడా ఉన్నారు. బడుగు బలహీన వర్గాల పక్షాన పనిచేస్తున్న ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు సరి కావని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రతిష్ట, న్యాయవ్యవస్థ నిష్పక్షపాత వైఖరిని దృష్టిలో ఉంచుకొని ఆయనపై చర్యలను నిలిపివేయాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు. (బాకీలపై మరో మాట లేదు..) వారం రోజుల క్రితం ప్రశాంత్ భూషణ్ దేశంలో గత ఆరేళ్లలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కీలక పాత్ర పోషించారని ట్వీట్ చేశారు. అంతేకాక ఇక ప్రస్తుత సీజేఐ ఎస్ ఏ బాబ్డే ఆ మధ్య హార్లే డేవిడ్ సన్ బైక్‌ని నడిపారని.. ఆ సమయంలో హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారంటూ మరో ట్వీట్ చేశారు. కోర్టు లాక్డౌన్లో ఉండగా ఒక చీఫ్ జస్టిస్ ఇలా చేయవచ్చా అని ప్రశ్నించారు. దాంతో ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ సుప్రీం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. (బ్యాట్ పట్టిన సీజే బాబ్డే.. టాప్ స్కోరర్) -
పాలమూరుపై విచారణ జనవరి 14కు వాయిదా
న్యూఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో నిధులకు సంబంధించి సవరించిన అంచనాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సవరించిన అంచనాలతో ప్రాజెక్ట్ వ్యయంలో నిధులకు సంబంధించి అంకెలు అసాధారణ రీతిలో పెరిగాయని ఈ మేరకు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగాయని, కాంట్రాక్టు తీసుకున్న సంస్థలపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆదాయపన్ను శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తమ సంస్థ పేర్లు లేవని మేఘా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 14కు వాయిదా వేసింది. -
‘రఫేల్’ ఒప్పందంపై ‘ఫేక్’ వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను.. పరిగణనలోకి తీసుకోకూడదంటూ ప్రభుత్వ అటార్నీ జనరల్ కేకే వేణు గోపాల్ బుధవారం కోర్టు ముందు చేసిన వాదన చిత్రంగా ఉంది. ‘రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పత్రాలను రక్షణ శాఖ నుంచి ఎవరో తస్కరించారు. అందులోని అంశాలను హిందూ ఆంగ్ల దిన పత్రిక ప్రచురిస్తే వాటిని ఆధారంగా చేసుకొని ప్రశాంత భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా సాధించిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకున్నందున ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదు. పైగా ఆ డాక్యుమెంట్లలోని అంశాలను హిందూ పత్రిక ప్రచురించడం అనేది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఆ మేరకు ఆ పత్రికపై చర్య తీసుకోవచ్చు’ అన్నది అటార్నీ జనరల్ చేసిన వాదన. పిటిషన్లో సవాల్ చేసిన లేదా లేవనెత్తిన అంశాల్లో బలం ఉందా, లేదా ? అవి తప్పా, ఒప్పా ? అని వాదించాల్సిన అటార్నీ జనరల్, అవి దొంగలించినవి, అవి అక్రమంగా సంపాదించినవి అనడం చిత్రమే కాదు, అవివేకం కూడా. రఫేల్ పత్రాలను దొంగలించారంటే, ఆ లెక్కన ప్రశాంత్ భూషణ్ పిటిషన్లో ప్రస్తావించిన అంశాలన్నీ నిజమని తేలినట్లే. పత్రిక మీద అధికార రహస్యాల చట్టం కింద చర్య తీసుకోమని సూచించడం అంటే కేంద్రానికి మద్దతుగా ఏదో దాస్తున్నట్లే లెక్క! మరో పక్క ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే.(రఫేల్ పత్రాలు చోరీ) 1923 నాటి చట్టం ఏమి చెబుతోంది? భారత దేశానికి స్వాతంత్య్ర రాకముందు బ్రిటీష్ హయాంలో అంటే, 1923లో అధికార రహస్యాల చట్టం అమల్లోకి వచ్చింది. జాతీయ భద్రతా లేదా జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు నాటి నుంచి నేటి వరకు పాలకులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇరుకున పడినప్పుడల్లా ఈ చట్టాన్ని ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయింది. పైగా 2005లో తీసుకొచ్చిన సమాచార హక్కుకు ఈ అధికార రహస్యాల చట్టం పూర్తి భిన్నంగా ఉంది. ఈ చట్టాన్ని సమీక్షించాల్సిందిగా ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే 2015లో చట్టం సమీక్షకు ఓ ప్యానెల్‌ను నియమించింది. ఆ ప్యానెల్ సమీక్ష ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో రెండు చట్టాలు పరస్పరం భిన్నంగా ఉన్నందున ప్రభుత్వ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో కేసులు భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని మిలిటెంట్లకు అందజేశారన్న ఆరోపణలపై ఓ కశ్మీర్ జర్నలిస్ట్‌పై అధికార రహస్యాల చట్టం కింద 2006లో కేసు పెట్టారు. దర్యాప్తు సందర్భంగా ఆ సమాచారం ఎంత మాత్రం రహస్యమైనది కాదని, అది ప్రజలందరికి అందుబాటులో ఉన్న సమాచారమేనని తేలింది. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన కేబినెట్ నోట్‌ను బయట పెట్టినందుకు 1998లో కూడా ఓ జర్నలిస్టుపై ఈ చట్టం కింద కేసు పెట్టి వేధించారు. అమెరికా సుప్రీం కోర్టు ఏమి తీర్పు ఇచ్చింది ? ‘వియత్నాంతో ఎన్నేళ్లు యుద్ధం చేసినా విజయం సాధించడం కష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం చేయక తప్పడం లేదు. వేలాది మంది యువకుల ప్రాణాలు వృథా అవుతున్నాయి. ప్రాణ నష్టంతోపాటు ఎంతో అర్థిక నష్టం జరుగుతోంది’ అన్న కీలక సమాచారం కలిగిన ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలంలో అమెరికాలోని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు దొరికాయి. వాటిని ప్రచురించాలా, వద్దా ? అని అప్పటి ఎడిటర్ ఇన్ చీఫ్ బెన్ బ్రాడ్లీ సంశయించారు. చివరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రచురించాలని నిర్ణయించుకొని వరుసగా ప్రచురించారు. అందులో ఓ భాగాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కూడా ప్రచురించింది. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆ రెండు పత్రికలపైనా అమెరికా ప్రభుత్వం ‘యూఎస్ ఎస్పనేజ్ యాక్ట్’ కింద కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛ ప్రకారం ఆ డాక్యుమెంట్లను ప్రచురించడంలో తప్పు లేదంటూ తొమ్మిది మంది సభ్యులు గల అమెరికా జ్యూరీ 6-3 తేడాతో మెజారిటీ తీర్పు చెప్పింది. ‘ది పోస్ట్’ పేరిట సినిమా పత్రికల న్యాయపోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాలివుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత స్టీవెన్ స్పీల్బెర్గ్ ‘ది పోస్ట్’ చిత్రాన్ని నిర్మించారు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో పత్రికా సంపాదకుడిగా టామ్ హాంక్స్ నటించారు. పలు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినా అవార్డులు మాత్రం రాలేదు. -
రఫేల్ డీల్: సుప్రీంకోర్టులో బాంబు పేల్చిన కేంద్రం
న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. రఫేల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని, వీటిని ప్రభుత్వ ఉద్యోగులే దొంగలించి ఉంటారని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాలను ఎంతకు కొనుగోలు చేశారు? వాటి ధర ఎంత? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో రఫేల్ ధరలకు సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వశాఖ నుంచి దొంగలించబడ్డాయని, ప్రచురణ కోసం ఈ పత్రాలను ‘ది హిందూ’ న్యూస్‌పేపర్‌కు అందించారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లో.. దొంగలించిన పత్రాల నుంచి సేకరించిన విషయాలు ఉన్నాయని, కాబట్టి ఆయన పిటిషన్ కొట్టివేయాలని వేణుగోపాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. పత్రాలు దొంగలించిన వారు.. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషులుగా మారుతారని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో చట్టపరమైన ఉల్లంఘనలేమీ లేవని, ఈ పత్రాల్లోని సమాచారం సమాచార హక్కు చట్టం పరిధిలోనేదేనని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు స్పష్టం చేశారు. ఫ్రెంచ్ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన రఫేల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే. -
రఫెల్ డీల్ తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష
న్యూఢిల్లీ: రఫెల్ డీల్‌పై తీర్పును రివ్యూ చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. రఫెల్ ఒప్పందంపై గతేడాది డిసెంబర్ 14న తీర్పును వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యవహరంలో కేంద్రం తీరును సమర్ధించిన సంగతి తెలిసిందే. ఇందులో భారీ అవకతవకలు జరిగనట్టు కనిపించడం లేదని అభిప్రాయపడ్డ న్యాయస్థానం.. చిన్న పొరపాట్లకు ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన పనిలేదని పేర్కొంది. వివాదస్పద రఫెల్ డీల్‌కు సంబంధించి సుప్రీం తీర్పుపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పెద్దలు సరైన సమాచారం ఇవ్వకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, వీటిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును రివ్యూ చేసేందుకు అంగీకారం తెలిపారు. రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని.. ఇందుకోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రఫెల్ డీల్‌పై డిసెంబర్లో సుప్రీం ఇచ్చిన తీర్పు: రఫేల్ ఒప్పందం సక్రమమే -
‘సిట్’ పిటిషన్‌కు సుప్రీం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని విచారించేందుకు కోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిల్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కామన్‌కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ పిల్ వేశారు. సీబీఐని ప్రభావితం చేస్తున్న విస్తృత అవినీతికి సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయని, వెంటనే విచారణకు చేపట్టాలన్న ఆయన విజ్ఞప్తికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ అంగీకరించింది. పూర్తి వివరాలు సమర్పించాలని, పిటిషన్‌ను అత్యవసరంగా విచారించే అంశాన్ని పరిశీలిస్తామని భూషణ్‌కు తెలిపింది. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని భూషణ్ కోర్టును కోరారు. కేబినెట్ సెక్రటరీ, సీవీసీ, రాకేశ్ అస్థానా, అలోక్ వర్మ, నాగేశ్వరరావులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ‘ప్రతివాదులు దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ స్వతంత్రతను దెబ్బతీయాలని చూశారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్లు ఉన్నప్పటికీ ఆ నిబంధనను పక్కనబెడుతూ ఆయన్ని సెలవులోకి పంపి తాత్కాలిక డైరెక్టర్‌ను నియమిస్తూ చట్టబద్ధమైన నియామక ప్రక్రియను ఉల్లంఘించారు. ఒకవేళ సీబీఐ డైరెక్టర్‌పై ఫిర్యాదులు వస్తే సీవీసీ నేరుగా తొలగించకూడదు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన హైపవర్డ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలి’ అని అన్నారు. దురుద్దేశపూర్వకం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను విధుల నుంచి తప్పిస్తూ సీవీసీ, ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు దురుద్దేశపూర్వకమని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ‘రాకేష్ అస్థానాపై చర్యలు తీసుకున్నందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను బాధితుడిగా చేసినట్లు తెలుస్తోంది. రాకేష్ అస్థానాను స్పెషల్ డైరెక్టర్‌గా నియమించినప్పుడే అలోక్ వర్మ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అస్థానాపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని అలోక్ 2017 అక్టోబరు 21న కేబినెట్ కన్సల్టేషన్ కమిటీకి లేఖ రాశారు. సంబంధిత ఆరోపణలు ఉన్న కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. సీనియర్ ఐటీ అధికారులు ముగ్గురు గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్, సందేసర గ్రూప్ కంపెనీల నుంచి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో అస్థానా పాత్ర కూడా ఉంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సతీష్ బాబు సానా అస్థానాకు లంచం ఇచ్చారన్న మరో కేసు కూడా దర్యాప్తులో ఉంది. దీనిపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు నమోదవగానే అస్థానా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అదే రోజు రాత్రి కేంద్రం, సీవీసీలు..డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి’ అని పిటిషన్లో పేర్కొన్నారు. -
అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారైన నాగేశ్వరావుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన నియామకాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నాగేశ్వరావు నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్పమెయిలీ వ్యతిరేకించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశాలో నాగేశ్వరావు ఐపీఎస్ అధికారిగా పనిచేసినప్పుడు ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. సీబీఐని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, అనుకూలమైన వ్యక్తులను డైరెక్టర్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరు వల్ల సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందన్నారు. నాగేశ్వరరావు నియామకంపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను రక్షించేందుకే అలోక్ వర్మ తొలిగించారని ఆయన ఆరోపించారు. నాగేశ్వర రావుపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులున్నాయని, అతన్ని సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గతంలో నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ తాజా మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి సిఫార్సు కూడా చేశారని గుర్తు చేశారు. అప్పుడు నాగేశ్వరరావుపై సీవీసీ చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఏకంగా డైరెక్టర్‌ను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి -
రాత్రికి రాత్రే మార్పులు; సుప్రీంకోర్టులో హైడ్రామా
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్ పార్టీ అనూహ్యరీతిలో ఉపసంహరించుకుంది. రాత్రికే రాత్రే ధర్మాసనాన్ని మార్చేయడం, ఆర్డర్ కాపీలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం, అసంతృప్తితో కాంగ్రెస్ వెనుకడుగు వేయడం తదితర పరిణామాలు సుప్రీంకోర్టు వద్ద హైడ్రామాను తలపించాయి. అసలేం జరిగింది?: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు(ప్రతాప్ సింగ్ బజ్వా, అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్‌లు) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణార్హమా, కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సోమవారమే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం.. రెండో నంబర్ కోర్టులో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ ప్రకటించారు. కానీ.. రాత్రికి రాత్రే మార్పులు: కాగా, సోమవారం నాటి రిజిస్ట్రార్ ప్రకటనకు విరుద్ధంగా.. మంగళవారం ఉదయం 6వ నంబర్ కోర్టులో, వేరొక ధర్మాసనం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పిటిషన్‌పై విచారణను ప్రారంభించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్‌లు ఆశ్చర్యానికి గురయ్యారు. ధర్మాసనం మార్పునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను సిబల్ కోరగా, కోర్టు నిరాకరించింది. దీంతో అసహనానికి గురైన సిబల్.. సదరు ధర్మాసనం ముందు వాదించబోమని, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాలని చెప్పారు. ధర్మాసం అంగీకారం మేరకు కాంగ్రెస్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ సీజేఐనే కాబట్టి ఏ నిమిషంలోనైనా ధర్మాసనాలను మార్చే అధికారం చీఫ్ జస్టిస్‌కు ఉంటుందని తెలిసిందే. ఆశ్యర్యంగా ఉంది: ‘‘రాత్రికి రాత్రే ధర్మాసనాన్ని మార్చే అధికారం సీజేఐకి ఉంది. అయితే, సంబంధిత ఆదేశాల కాపీని ఇవ్వబోమని చెప్పడం మాత్రం ఆశ్యర్యం కలిగించింది. ‘ఆర్డర్ కాపీ లేకుండా, దాన్ని చదవకుండా మేం చాలెంజ్‌కు ఎలా వెళ్లగలం? అని సిబర్ అడిగారు. అప్పుడు కోర్టు.. ‘మెరిట్స్ ఆధారంగా ముందుకు వెళ్లండి’ అని సూచించింది. విచారణపై నమ్మకం సడలిన పరిస్థితిలో సిబాల్ కాంగ్రెస్ ఎంపీల పిటిషన్‌ను వెనక్కితీసుకున్నారు’’ అని ప్రశాంత్ భూషణ్ మీడియాకు చెప్పారు. -
వెంకయ్యా.. ఇదేందయ్యా..!
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మాన నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్ణయంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీజేఐ దీపక్ మిశ్రాపై అభిశంసన కోరుతూ 64 మంది ఎంపీలు సంతకాలు చేసిన నోటీసులు గత వారం ఉప రాష్ట్రపతి వద్దకు చేరగా.. సోమవారం వాటిని వెంకయ్య నాయుడు తిరస్కరించిన అనంతరం ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఉపరాష్ట్రపతికి నేతలు ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసులు సరిగ్గా ఉన్నాయో లేదో చెప్పడం మాత్రమే వెంకయ్య పని అని, తిరస్కరించే అధికారం లేదని అభిప్రాయపడ్డారు. 'తన వద్దకు తీర్మానం నోటీసులలో 50 మంది కంటే ఎక్కువ ఎంపీలు సంతకాలు చేశారా లేదా అన్నది చూడాలి. అసలు ఏ విషయం ఆధారంగా తీర్మానాన్ని వెంకయ్య తిరస్కరించారు. ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు. ముగ్గురు జడ్జీలతో కమిటీ నియమించాలని ఎంపీలు నోటీసులలో కోరారు. కానీ అభిశంసన తీర్మానాన్ని తీరస్కరించడం సరైన నిర్ణయం కాదని' ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. ఉపరాష్ట్రపతి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజ్యసభలో తీర్మానం కోరుతూ కాంగ్రెస్ సహా ఏడు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు ఇచ్చిన నోటీసులను వెంకయ్య నాయుడు తిరస్కరించారు. సంతకం చేసిన ఎంపీలకు తమ కేసుపై వారికే కచ్చితత్వం లేదని, ఆరోపణలకు సంబంధించి జరిగి ఉండొచ్చు.. అవకాశముంది.. పాల్పడొచ్చు అనే పదాలను ఉపయోగించారని వెంకయ్య నాయుడు తెలిపారు. రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులను తిర్కరించినట్లు వివరించారు. What!! VP Naidu rejects impeachment motion against CJI signed by 64 RS MPs! On what grounds? He has no power to say that charges are not made out. That's for the inquiry committee of 3 judges. He only has to see if it's signed by >50 MPs & possibly if charges are of misbehaviour — Prashant Bhushan (@pbhushan1) 23 April 2018 -
ఆ పిల్‌ను విచారించలేను
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ గురువారం మరోసారి ఆవేదన వెలిబుచ్చారు. అలాగే సుప్రీంలో కేసుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేనని, తన తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని మరోసారి తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు వెల్లడించారు. సుప్రీంకోర్టులో సీజేఐనే సుప్రీం అని పేర్కొంటూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో తన తండ్రి శాంతిభూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని.. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆశ్రయించారు. సీజేఐకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాల్ని సవాలు చేయడంతో పాటు, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాల్ని రూపొందించాలని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ గతవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గురువారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతిభూషణ్ పిల్‌ను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ చలమేశ్వర్ నిరాకరించడంతో.. ప్రశాంత్ భూషణ్ వెంటనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని కోరగా.. ‘పరిశీలిస్తాం’ అని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అంతకుముందు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ వద్ద పిల్ అంశాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ.. ఇది అత్యవసర అంశమని పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని పిల్ సవాలు చేస్తున్నందున సీజేఐ విచారణ చేయకూడదని.. అందువల్లే మీ బెంచ్‌కు రిఫర్ చేశానని చెప్పారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవేనని చలమేశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని తప్పుపడుతూ లేఖలు రాసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాపై దుష్ప్రచారం: జస్టిస్ చలమేశ్వర్ ‘సుప్రీంకోర్టులో, దేశంలో జరుగుతున్న వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ నేను కొద్ది రోజుల క్రితం లేఖ రాశా. నేను ఏదో ప్రయోజనం ఆశిస్తున్నానంటూ కొందరు తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఈ సమయంలో అలాంటి ప్రచారాన్ని నేను కోరుకోవడం లేదు. అందువల్ల ఈ విషయంలో నేను ఇంతకంటే ఏమీ చేయలేదు. క్షమించండి. దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకోండి’ అని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. ‘వచ్చే 24 గంటల్లో మరోసారి నా తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని నేను కోరుకోవడం లేదు. అందువల్లే నేను ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేను’ అని ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ 10న తన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ బెంచ్ తోసిపుచ్చిన విషయాన్ని పరోక్షంగా ఆయన గుర్తుచేశారు. ఏకే సిక్రీ ధర్మాసనానికి పిల్ సుప్రీం బెంచ్‌లకు కేసుల కేటాయింపులో మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకున్న అధికారాల్ని ప్రశ్నిస్తూ శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్ శుక్రవారం విచారణకు రానుంది. సుప్రీం జడ్జీల్లో సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారిస్తుంది. ఆరు నెలలుగా... సుప్రీంకోర్టులో అధికార పరిధిపై దాదాపు ఆరు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ► నవంబర్ 9, 2017: మెడికల్ అడ్మిషన్ స్కాంలో ఒక ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నవంబర్ 10న ఆదేశాలు జారీ చేసిన చలమేశ్వర్ ధర్మాసనం గతంలో ఆ కేసు విచారణలో జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉన్నందున... ధర్మాసనంలో ఆయన ఉండకూడదని పిటిషనర్ కోరగా.. చీఫ్ జస్టిస్ లేకుండానే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు. ► నవంబర్ 10: ఆ ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. ధర్మాసనం ఏర్పాటు అధికారం సీజేఐకే ఉంటుందని, ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలు కేసును తమ బెంచ్‌కు గాని, రాజ్యాంగ ధర్మాసనాలకు గానీ కేటాయించలేవని స్పష్టీకరణ. ► జనవరి 11, 2018: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిన కొలీజియం. ► జనవరి 12: కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్. ► మార్చి 21: న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యంపై ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీజేఐకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ. ► ఏప్రిల్: జనవరి 11న కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం జాప్యాన్ని తప్పుపడుతూ సీజేఐకి జస్టిస్ జోసెఫ్ కురియన్ లేఖ ► ఏప్రిల్ 11: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం ఆయనకే ఉంటుందని తీర్పిచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం. -
బత్తాయిల భాషలో మాట్లాడుకున్నారు..!!
సాక్షి, న్యూఢిల్లీ : నలుగురు సీనియర్ జడ్జిలు పుట్టించిన సెగ ఇప్పుడిప్పుడే చల్లారుతుందనగా.. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ మరో బాంబు పేల్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్ మెడికల్ సీట్ల కుంభకోణంలో సీజేఐ పాత్ర ముమ్మాటికీ నిజమని, అందుకే సిట్ ఏర్పాటుకు ఆయన జంకుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ భూషణ్.. జస్టిస్ మిశ్రాపై సుప్రీంకోర్టులో అంతర్గత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘సీజేఐకి, కుట్రదారులకు మధ్య బత్తాయి పండ్లు, ఆలయాల పేర్లతో కోడ్ లాగ్వేజీ సంవాదాలు నడిచాయ’ని చెప్పారు. లక్నో పోలీస్ స్టేషన్లో సీజేఐపై ఈ మేరకు ఫిర్యాదుచేశానని కూడా చెప్పారు. 200 బత్తాయి పండ్లను ఢిల్లీ మందిర్‌కు తీసుకురా! : ఉత్తరప్రదేశ్ మెడికల్ సీట్ల కుంభకోణంలో జడ్జిల పాత్రను సీబీఐనే నిర్ధారించిందన్న ప్రశాంత్ భూషణ్.. సిట్టింగ్ జడ్జిలను ప్రశ్నించే అధికారం దర్యాప్తు సంస్థకు లేనందున సుప్రీంకోర్టు నేతృత్వంలోనే ఇన్వెస్టిగేషన్ జరగాలని డిమాండ్ చేశారు. ‘‘యూపీలోని 46 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై మెడికల్ కౌన్సిల్ విధించిన నిషేధాన్ని తొలగిస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల వెనుక పెద్ద కథ నడిచింది. దీపక్ మిశ్రా సభ్యుడిగా ఉన్న ధర్మాసనమే ఆ తీర్పు ఇచ్చింది. అత్యంత వ్యూహాత్మకంగా, రహస్యంగా సాగిన ఈ వ్యవహారానికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. డబ్బుల్ని బత్తాయి పండ్లుగా, కలవాల్సిన చోటుని మందిరంగా పేర్కొంటూ కోడ్ లాగ్వేజీ సంభాషణలు నడిచాయి. ‘200 బత్తాయిలను తీసుకుని ఢిల్లీ మందిర్‌కు రా..’, ‘100 బత్తాయిలు.. అలహాబాద్ మందిర్..’ లాంటి మాటలు రికార్డయ్యాయి. వీటితోపాటు మరికొన్ని ఆధారాలను చూపించి లక్నో పోలీస్ స్టేషన్లో సీజేఐ మిశ్రాపై కేసు పెట్టాను’’ అని ప్రశాంత్ భూషణ్ వివరించారు. జాస్తి చలమేశ్వర్‌కు పంపిన నోట్లోనూ దొరికిపోయారు : యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు.. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నుంచి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ దీపక్ మిశ్రా ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ లోపాలున్నాయని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ‘‘నవంబర్ 8న సుప్రీంకోర్టులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. జాస్తి చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను అప్పటికప్పుడు రద్దుచేయడమేకాక ఆ కేసును వేరే బెంచ్‌కు మార్చుతూ సీజేఐ నోటీసులు ఇచ్చారు. కానీ ఆ కాపీలో తేదీ నవంబర్ 6 అని ఉంది. అంటే ఏమిటి? రెండు రోజుల ముందే ఉత్తర్వులు జారీ అయిఉంటే రహస్యంగా ఎందుకు ఉంచినట్లు? ఇలాంటి ప్రశ్నలెన్నింటికో సమాధానం చెప్పాల్సింది సీజేఐనే. కాబట్టి ఆయన లేకుండా పారదర్శకంగా దర్యాప్తు, విచారణ జరగాలని మేం డిమాండ్ చేస్తున్నాం..’’ అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఇవే ఆ రెండు కేసులు.. సుప్రీంకోర్టులో నంబర్2గా కొనసాగుతోన్న జస్టిస్ చలమేశ్వర్‌ను విచారణ నుంచి తొలగించినవి.. పరస్పరం సంబంధమున్న రెండు కేసులు. 1. యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, 2. ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు. పూర్వాపరాల్లోకి వెళితే.. : ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నో కేంద్రంగా నడిచే ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెందిన మెడికల్ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్ కాలేజీల్లో సరైన వసతులులేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే.. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు కాలేజీ యాజమాన్యాలతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. డీల్స్ కుదుర్చుకున్నది మరెవరోకాదు సాక్షాత్తూ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి(2004-10 మధ్య పనిచేశారు) ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ, ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాథ్ అగ్రావాలాలే అని తేల్చింది. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌లో జస్టిస్ ఇష్రత్ సహా ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. పలువురు సిట్టింగ్ జడ్జిల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందరుపర్చింది. ఆ పేర్లలో దీపక్ మిశ్రా పేరుకూడా ఒకటికావడం గమనార్హం. ఈ కేసులో స్వయంగా జడ్జిలపైనే ఆరోపణలు వచ్చినందున... ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపై వాదనలు విన్న జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. చివరకు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పింది. అంతలోనే.. ‘కాలేజీల్లో అడ్మిషన్లు జరుపుకోవచ్చు’అన్న తీర్పు ఇచ్చింది మిశ్రా ధర్మాసనమే కాబట్టి ఆయన పేరు లేకుండా బెంచ్‌ను ఏర్పాటుచేయాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను కూడా పరిగణలోకి తీసుకున్న చలమేశ్వర్.. 145(3) ప్రకారం సీజేఐ లేకుండానే బెంచ్‌ను ఏర్పాటుచేశారు. అంతలోనే.. ‘ఈ కేసును మీరు విచారించరాదు, దీన్ని వేరొక బెంచ్‌కు అప్పగించాలంటూ’ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి హుటాహుటిన ఆదేశాలు వచ్చాయి. జస్టిస్ ఇష్రత్ పేరుతో ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ మిశ్రా మరో ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు అంశాలే తాజా వివాదానికి ప్రధాన కారణాలు భావిస్తున్నారు. -
మయన్మార్‌లో మారణకాండ
► కొత్తగా బంగ్లాకు 87 వేల మంది రోహింగ్యా శరణార్థులు ► సిద్ధంగా మరో 20వేల మంది కాక్స్‌బజార్/న్యూఢిల్లీ: మయన్మార్‌లో చెలరేగిన హింస కారణంగా గత పది రోజుల్లోనే దాదాపు 87,000 మంది రోహింగ్యా ముస్లింలు రఖైన్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి మరో 20 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింస వల్ల ఈ వలసలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది.భారీ వర్షాలకు నిలువనీడ లేక బంగ్లా ప్రభుత్వం ఏర్పరచిన శిబిరాల సమీపంలోనే రోహింగ్యాలు అందరూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ హింసలో 86 మంది హిందువులు మృతి చెందడంతో దాదాపు 500 మంది హిందువులు రోహింగ్యాలతో కలసి బంగ్లాదేశ్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్ సైన్యం దాడుల నేపథ్యంలో పదుల సంఖ్యలో రోహింగ్యాలు బుల్లెట్ గాయాలతో కాక్స్బజార్లోని సదర్ హాస్పిటల్లో చేరినట్లు వైద్యాధికారి షాహిన్ అబ్దుర్ రెహ్మన్ చౌధురీ తెలిపారు. బ్రిటిష్ వారి హయాంలో అప్పటి అవిభక్త బెంగాల్ నుంచి వెళ్లి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో స్థిరపడ్డ రోహింగ్యా ముస్లింలను పౌరులుగా గుర్తించడానికి మయన్మార్ పాలకులు నిరాకరిస్తూనే వచ్చారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలాఉండగా, భారత్‌లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిప్పిపంపే విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. రోహింగ్యాలను తిప్పిపంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సవాల్ చేశారు. -
ఆయన ఇంటిపై 'రంగు' పడింది!
శ్రీకృష్ణుడు కూడా ఈవ్టీజరే అంటూ ప్రముఖ న్యాయవాది, స్వరాజ్ అభియాన్ పార్టీ సహ స్థాపకుడు ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. శ్రీకృష్ణుడిని కించపరుస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే బీజేపీ సహా పలువురు వ్యక్తులు కేసులు నమోదు చేశారు. తాజాగా నోయిడా, సెక్టర్ 14లోని ఆయన నివాసంపై కొందరు వ్యక్తులు ఇంకుతో దాడి చేశారు. శ్రీకృష్ణుడిపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలంటూ ఏడెనిమిది మంది భూషణ్ ఇంటిముందు గుమిగూడి నినాదాలు చేశారని, ఆ తర్వాత ఇంటిపై, నేమ్ప్లేటుపై ఇంకు చల్లి నిరసన తెలిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమయంలో ప్రశాంత్ భూషణ్ ఇంట్లో లేరు. ఆయన ఇంట్లో పనిచేసేవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోపే వారు వెళ్లిపోయారు. పోలీసులు గంటసేపు ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు. 'రోమియో ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాడు. కానీ కృష్ణుడు లెజండరీ ఈవ్‌టీజర్. తన విజిలెంట్స్‌ను యాంటికృష్ణస్క్వాడ్ అని పిలిచే దమ్ము యోగిఆదిత్యనాథ్‌కు ఉందా' అంటూ భూషణ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. హిందూ దేవుడు శ్రీకృష్ణుడిపై రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ బీజేపీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
శ్రీకృష్ణుడు ఈవ్టీజరే: ప్రశాంత్ భూషణ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఆకతాయిలకు వ్యతిరేకంగా అమలుచేస్తున్న ‘యాంటీ రోమియో’ కార్యక్రమాన్ని విమర్శిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ శ్రీకృష్ణునిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘రోమియో ఒక్క అమ్మాయినే ప్రేమించాడు. కానీ శ్రీకృష్ణుడు పురాణాల్లో ఈవ్టీజర్గా నిలిచిపోయాడు. తన అనుచరులను కృష్ణ వ్యతిరేక బృందాలు అని పిలిచేందుకు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు ధైర్యముందా?’ అని భూషణ్ ట్వీట్ చేశారు. తర్వాత.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, హిందూ సెంటిమెంట్లను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. -
కృష్ణుడికి అవమానం: లాయర్‌పై బీజేపీ కేసు
ప్రముఖ లాయర్, కొత్త పార్టీ స్వరాజ్ అభియాన్ సహ స్థాపకుడు ప్రశాంత్ భూషణ్‌పై బీజేపీ కేసు పెట్టింది. హిందు దేవుడు శ్రీకృష్ణుడిపై రెచ్చగొట్టేవిధంగా ట్వీట్లు చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్‌పాల్ సింగ్ బగ్గా తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఉత్తరప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యాంటీ రోమియో స్క్వాడ్లు ఏర్పాటుచేయడాన్ని ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్లో తప్పుబట్టారు. 'రోమియో ఒక్క అమ్మాయిని మాత్రమే ప్రేమించాడు. కానీ కృష్ణుడు లెజండరీ ఈవ్‌టీజర్. తన విజిలెంట్స్‌ను యాంటికృష్ణస్క్వాడ్ అని పిలిచే దమ్ము ఆదిత్యనాథ్‌కు ఉందా' అంటూ భూషణ్ ట్విట్టర్లో సవాల్ చేశారు. అయితే, ఈ ట్వీట్ హిందూయిజాన్ని, హిందువులను కించపరచడమే అంటూ పలువురు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బగ్గా ప్రశాంత్ భూషణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రకటించారు. -
బలమైన ప్రతిపక్షం అత్యావశ్యం
♦ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ♦ పౌర హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపణ ♦ కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్: కోదండరాం సాక్షి, హైదరాబాద్: విశ్వసనీయత కలిగిన, బలమైన విపక్షాలు లేకపోవటంతో ఇటు తెలంగాణ, అటు కేంద్రంలో అధికారపక్షాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలతో దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలు ఎదురవుతాయ ని హెచ్చరించారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రత్యామ్నాయంగా బలమైన ప్రతిపక్షం ఎదగ డం అవశ్యమని చెప్పారు. ‘స్వరాజ్ అభియా న్’ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాంతో కలసి ప్రశాంత్ భూషణ్ పాల్గొన్నారు. ‘నేను చెప్పిందే వినాలి, నా మాటే వేదం, ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడొద్దు.. అన్నట్టు ప్రభుత్వాలు వ్యవహ రిస్తున్నాయి. బీజేపీ హిందుత్వవాదాన్ని ప్రమోట్ చేస్తోంది. గతంలో భారీగా అక్రమా లు జరిగాయి. ఇప్పుడు అంతకు మించి జరుగుతున్నాయి. అక్రమాలను నిరోధించే వ్యవస్థలను నిర్వీర్యం చేసి యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా ప్రధాని మోదీ అవినీతి అరోపణల్లో ఇరుక్కున్నా.. మచ్చలేని నేత అంటూ ప్రమోట్ చేస్తున్నారు’ అని విమర్శించారు. ఓ మతానికి చెందిన యోగి ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎం కుర్చీలో కూర్చో బెట్టడం దారుణమన్నారు. న్యాయవ్యవస్థ, మీడియాలోనూ అవినీతి ప్రవేశించి విశ్వసనీయత సన్నగిల్లిందని, వాటిని నమ్ముకోకుండా ప్రజలే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, రైతులు తీవ్ర సమస్యల్లో ఉన్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే.. ఆంధ్రా పాలకుల తొత్తులంటున్నారు..: కోదండరాం ‘మా పాలన మేం చూసుకుంటాం, ఎవరూ ఏం చెప్పొద్దు, మీరు మాకు సహకరించాల్సిం దే తప్ప ప్రశ్నించొద్దు. లేదంటే అభివృద్ధి నిరోధకులనో, ఆంధ్రా పాలకుల తొత్తులనో ముద్ర వేస్తాం’ ఇది ప్రస్తుతం తెలంగాణ పాలన తీరని కోదండరాం విమర్శించారు. ప్రజల కోసం కాకుండా కాంట్రాక్టర్ల కోసం పాలన సాగుతున్నట్టు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. బడ్జెట్ రూప కల్పన కూడా కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకునే జరుగుతోందని దుయ్యబట్టారు. ఉద్యమ ఆకాంక్ష అమలు కావటం లేదని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుందని చెప్పారు. -
బాబు కోసం 25మంది జర్నలిస్టులు
-
బాబు కోసం 25మంది జర్నలిస్టులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగానే 25మంది జర్నలిస్టులకు లంచాలు చెల్లిస్తున్నారని పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ల న్యాయవాది, కార్యకర్త ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. 25 మంది జర్నలిస్టులను నియమించుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు విడుదల చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా ఆయన ప్రజల ముందు పెట్టారు. సాధారణంగానే మీడియా ఫోకస్‌ను ఎక్కువగా కోరుకునే సీఎం చంద్రబాబు జాతీయ స్ధాయిలో తన పరిపాలనకు అనుకూలంగా కథనాలను రాయడం కోసమే జర్నలిస్టులను నియమించుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నియమించుకున్న 25మంది జర్నలిస్టుల టీమ్ కోసం నెలకు రూ.12,86,700 చెల్లిస్తూ ఆర్థిక శాఖ జీవో-24987ను కూడా విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం జీవో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోను ట్విట్టర్ లో పోస్టు చేసిన ప్రశాంత్ భూషణ్ చంద్రబాబు తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు జర్నలిస్టులకు అధికారికంగా లంచం ఇవ్వడం లాంటివేనని అభిప్రాయపడ్డారు. Now AP CM officially bribes 25 journos to do his PR & publicly work! pic.twitter.com/f52UQuv80T — Prashant Bhushan (@pbhushan1) December 12, 2016 -
యోగేంద్ర, భూషణ్‌ల కొత్త పార్టీ ‘స్వరాజ్ ఇండియా’
ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో పోటీ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు ఆదివారం ‘స్వరాజ్ ఇండియా’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోవడం లేదని తెలిపారు. పార్టీకి యోగేంద్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టిన ధరమ్వీర గాంధీ(సస్పెండైన పంజా బ్ ఆప్ ఎంపీ)కి మద్దతిస్తామని యోగేంద్ర చెప్పారు. ఆమ్ ఆద్మీకి(సామాన్యుడికి) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ద్రోహం చేశారని ఆరోపించారు. తమ పార్టీ ప్రత్యమ్నాయ రాజకీయాలను తీసుకొస్తుందని, వ్యక్తిపూజ రాజకీయాలకు పాల్పడదని అన్నారు. తమ పార్టీ తనంత తాను ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని, ఎమ్మెల్యేలు, ఎంపీలపై విప్ ప్రయోగించదని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. విప్‌ను కేవలం అవిశ్వాస పరీక్షకే పరిమతం చేస్తామన్నారు. తమ సంస్థ ఇకముందూ కొనసాగుతుందని యోగేంద్ర, భూషణ్‌లు స్థాపించిన స్వరాజ్ అభియాన్ తెలిపింది. దీనికి భూషణ్ నాయకత్వం వహిస్తారు. -
రాజకీయ పార్టీగా ‘స్వరాజ్ అభియాన్’
న్యూఢిల్లీ: అక్టోబర్ 2లోగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత ఆప్ నేతలు, స్వరాజ్ అభియాన్ సంస్థ ప్రతినిధులు యోగేశ్ యాదవ్, ప్రశాంత్ భూషణ్ తెలిపారు. తమ పార్టీలో ఆప్ తరహాలో కేంద్రీకృత నాయకత్వ వ్యవస్థ ఉండదని, పూర్తి పారదర్శకతతో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీని ప్రారంభిస్తున్నామన్నారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వీరు స్పష్టతనివ్వలేదు. -
'ఆ సీఎం చేసేవన్నీ జిమ్మిక్కులే'
న్యూఢిల్లీ: కాలుష్య నివారణ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన సరిభేసి విధానం ఓ జిమ్మిక్కు అని సామాజిక ఉద్యమకారుడు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఆయన ..అరవింద్ కేజ్రీవాల్ వద్ద కీలక సభ్యుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. కాలుష్యం నుంచి ఢిల్లీ ప్రజలను బయటపడేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయని సరి బేసి విధానం మాత్రమే పరిష్కారం కాదన్నారు. ప్రత్యేక బైక్ మార్గాలు ఏర్పాటు చేయడం, ఉత్తమ ప్రజా రవాణ వ్యవస్థ కల్పన పరిష్కార మార్గాలుగా చూపించవచ్చని ప్రశాంత్ భూష ణ్ సూచించారు. సరి బేసి విధానం ఒక జిమ్మిక్కు అంటూ ఆయన ట్వీట్ చేశారు. గతంలో ఒకసారి సరి బేసి విధానం ప్రవేశ పెట్టిన ఢిల్లీ ప్రభుత్వం కొంత విరామం అనంతరం శుక్రవారం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. -
'కేజ్రీవాల్ వచ్చినా అవినీతి అంతే ఉంది'
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఢిల్లీ వాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఓ సర్వే తేల్చింది. ఇప్పటికీ అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏమాత్రం తగ్గలేదని దాదాపు 77శాతం ఢిల్లీ ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పినట్లు సర్వే వెల్లడించింది. స్వరాజ్ అభియాన్ అనే సంస్థ ఫిబ్రవరి 10 నుంచి 14వరకు తన కార్యకర్తలతో దాదాపు పది నియోజకవర్గాల్లో 10 వేల ఢిల్లీ కుటుంబాలని ఆప్ సర్కార్ పనితీరుపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం విద్యుత్ ఛార్జీలు ఏమాత్రం తగ్గలేదని 62శాతంమంది చెప్తుండగా.. ప్రతి నెల 20 వేల లీటర్ల తాగు నీరు ఇస్తామన్న హామీ కూడా అమలు కావడం లేదని వారు చెప్పినట్లు సర్వే పేర్కొంది. రామ్ లీలా మైదాన్ లో ఎలాంటి జన్ లోక్ పాల్ తీసుకొస్తానని కేజ్రీవాల్ చెప్పారో అది తీసుకురాలేదని 86శాతంమంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించింది. ఇక రేషన్ షాపుల్లో కూడా అవినీతి దందా ఆగడం లేదని పేర్కొంది. స్వరాజ్ అభియాన్ సంస్థను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి బహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
ఆప్.. ఒక ఖాప్ పంచాయత్!
అసమ్మతి నేతల ధ్వజం కేజ్రీవాల్‌ను హిట్లర్‌తో పోల్చిన శాంతిభూషణ్ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక పార్టీ కాదని, అది నియంతృత్వ పోకడలున్న ఒక ‘ఖాప్ పంచాయత్’ అని మంగళవారం పార్టీ తిరుగుబాటు నేతలు శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను హిట్లర్‌తో పోలుస్తూ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు శాంతి భూషణ్ తీవ్రంగా విమర్శించారు. ‘హిట్లర్ విధానాలను అవలంబిస్తున్న కేజ్రీవాల్.. హిట్లర్ వస్త్రధారణనూ అనుకరిస్తే మంచిది’ అన్నారు. ‘ఈ ఖాప్ పంచాయత్‌కు ఒక నియంత(కేజ్రీవాల్) ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు పంచాయత్ సభ్యులు పనిచేస్తుంటారు. ఆయన భజన చేస్తుంటారు’ అంటూ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న తొలగింపుల పర్వం అసమ్మతి నేతలపై వేటు కార్యక్రమాన్ని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొనసాగిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత పదవి నుంచి మంగళవారం పాటియాలా ఎంపీ ధరమ్వీర్ గాంధీని తొలగించి, ఆ స్థానంలో కేజ్రీవాల్‌కు నమ్మకస్తుడైన భగవంత్ మన్ను నియమించారు. మన్.. సంగ్రూర్(పంజాబ్) ఎంపీ. అసమ్మతి నేతలు ప్రశాంత్, యోగేంద్రయాదవ్, ఆనంద్‌కుమార్, అజిత్‌లను సోమవారం పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. ప్రశాంత్, యోగేంద్రలతో పార్టీ వ్యవహరిస్తున్న తీరును ధరమ్వీర్ వ్యతిరేకించిన ఫలితమే ఈ తొలగింపని భావిస్తున్నారు. -
పార్టీలకతీతంగా 'స్వరాజ్ అభియాన్'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆమ్ఆద్మీపార్టీ బహిష్కృత నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ సొంత కుంపటిని ప్రారంభించారు. అయితే, అది పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని పేర్కొంటూ స్వరాజ్ అభియాన్ అని దానికి నామకరణం చేశారు. తమ సంస్థ దేశంలోని రైతులు, మహిళలు, సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుందని ప్రకటించారు. నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాల ద్వారా ప్రజల పక్షాన తమ పోరాటం ఉండనుందని తెలియజేశారు. అయితే, ఆప్ నుంచి బలవంతంగా బహిష్కరణకు గురైన ఈ నేతలు సొంతంగా పార్టీ పెడతారని భారీ ఊహగానాలు వచ్చిన విషయం తెలిసిందే. స్వరాజ్ అభియాన్ ప్రకటన సందర్భంగా మాట్లాడిన నేతలు భూషణ్, యోగేంద్ర.. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉంటూనే తమకు మద్దతు ఇస్తామని 75శాతం కార్యకర్తలు మాట ఇచ్చారని, 25శాతం మంది మాత్రం సొంతంగా పార్టీ పెట్టేందుకు మద్దతిచ్చారని చెప్పారు. అయితే, స్వరాజ్ అభియాన్ తమ పార్టీకి సంబంధించినది కానందున బుధవారం చర్యలు తీసుకుంటామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. -
‘స్వరాజ్ సంవాద్’కు వెళ్లొద్దు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అసమ్మతి నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి రోజున నిర్వహించనున్న ‘స్వరాజ్ సంవాద్’ సమావేశంలో పాల్గొనొద్దని తమ వలంటీర్లను ఆప్ హెచ్చరించింది. ఇలాంటివి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలని పేర్కొంది. ఆప్‌లోని కొంత మందిని ఆకర్షించేందుకు యోగేంద్ర, ప్రశాంత్.. స్వరాజ్ సంవాద్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 14న నిర్వహించనున్న ఆ సమావేశంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం. కాగా, ఆప్ నేత ఆనంద్ కుమార్.. పార్టీ నాయకత్వాన్ని విమర్శించారు. స్వరాజ్ సంవాద్‌కు వెళ్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కొత్తగా నియమితుడైన ఒక పార్టీ అధికార ప్రతినిధి హెచ్చరించారని, ఇలాంటి నియంత్రృత్వ పోకడలు విడనాడాలన్నారు. -
ఆప్‌లో ముదురుతున్న సంక్షోభం
ఆప్ క్రమశిక్షణ కమిటీ నుంచి ప్రశాంత్‌భూషణ్ తొలగింపు అంతర్గత లోక్‌పాల్ రాందాస్‌కు కూడా ఉద్వాసన న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభం ముది రింది. పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను తొలగించిన మర్నాడు.. ఆదివారం ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే, పార్టీ అంతర్గత లోక్‌పాల్ పదవి నుంచి నేవీ మాజీ చీఫ్ ఎల్.రాందాస్‌నూ సాగనంపింది. అది ఆయనను తొలగించడం కాదని, ఆయన పదవీకాలం ముగిసినందున కొత్త లోక్‌పాల్ కమిటీని ఎన్నుకున్నామని సీనియర్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. కొత్త కమిటీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు దిలీప్‌కుమార్, రాకేశ్ సిన్హా, విద్యావేత్త ఎస్పీ వర్మలకు స్థానం కల్పించారు. ముందుగా చెప్పకుండా తనను తొలగించడంపై రాందాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌పాల్‌గా మరో ఐదేళ్లు కొనసాగాలని గతనెలలోనే వారు తనను కోరారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి రాందాస్ అంతర్గత లోక్‌పాల్‌గా ఉన్నారు. ప్రశాంత్‌ను తొలగించిన అనంతరం.. దినేశ్ వాఘేలా అధ్యక్షుడిగా కేజ్రీవాల్‌కు నమ్మకస్తులైన ఆశిశ్ ఖేతన్, పంకజ్ గుప్తా సభ్యులుగా పార్టీ క్రమశిక్షణ కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 22న నిర్వహించే పార్లమెంట్ ఘెరావ్ బాధ్యతలను ఇల్యాస్ ఆజ్మీ, ప్రేమ్‌సింగ్ పహడి తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ బాధ్యతల నిర్వహణను సంజయ్‌సింగ్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ప్రశాంత్, యోగేంద్రలను జాతీయ కార్యవర్గం(ఎన్ఈ) నుంచి తొలగించడంతో ఇక మిగిలింది వారిని పార్టీ నుంచి పంపించేయడమేనని భావిస్తున్నాయి. మరోపక్క.. తాము కొత్త పార్టీని ప్రారంభించే అవకాశముందని ప్రశాంత్, యోగేంద్రలు మరోసారి సంకేతాలిచ్చారు. వారు ఆదివారం తమ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మిత్రులే ద్రోహం చేశారు: కేజ్రీవాల్ శనివారం జాతీయ కార్యవర్గ మండలి భేటీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రసంగాన్ని(ఎడిటెడ్ వీడియో) పార్టీ ఆదివారం యూట్యూబ్‌లో, ట్వీటర్లో పోస్ట్ చేసింది. అందులో.. ‘ఢిల్లీ మొత్తం మన వెంట నిలిచిన సమయంలో కొందరు మిత్రులు మనకు వెన్నుపోటు పొడిచారు. ఢిల్లీ ఎన్నికల్లో మన ఓటమికి కుట్రలు పన్నారు. వలంటీర్లను ప్రచారం కోసం ఢిల్లీ రాకుండా అడ్డుకున్నారు. విరాళాలు రాకుండా చూశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతేనే పార్టీకి, కేజ్రీవాల్‌కు బుద్ధొస్తుందని ప్రశాంత్ ఎన్నికల ముందు మనలోనే చాలామందితో అన్నారు. నాకు వ్యతిరేకంగా యోగేంద్ర పనిచేస్తున్నారని రెండు ప్రముఖ ఆంగ్ల వార్తా చానళ్ల ఎడిటర్లు నాతో చెప్పారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ తన మొదటి చాయిస్ కాదని చెప్పిన ప్రశాంత్.. అప్పుడే పార్టీని వదిలి ఎందుకు వెళ్లలేదు? నా సొంత మనుషులే నా నిజాయితీని శంకించారు. ప్రశాంత్, యోగేం ద్రలతో పోరులో నా ఓటమిని అంగీకరిస్తున్నా. ఎవరు కావాలో మీరే నిర్ణయించండి. నన్నో, లేక వారినో.. ఎన్నుకోండి’ అని ఉద్వేగంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. -
ఆమ్ ఆద్మీ పార్టీలో తారాస్ధాయికి చేరిన సంక్షోభం
-
ఆయనొక నియంత..
న్యూఢిల్లీ: ఆప్‌లో విభేదాల సెగ మరింత రగులుతోంది. ఆప్ అధినేత, ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆప్ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడిన ఇరువురు ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలతో విరుచుపడ్డారు. కేజ్రీవాల్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వరాజ్య పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీలో స్వరాజ్యం ఉందా అని వారు ప్రశ్నించారు. తనను ప్రశ్నించేవారిని కేజ్రీవాల్ సహించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య మానవుడికి అధికారం, అవినీతి నిర్మూలన లాంటి సదుద్దేశాలతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని పేర్కొన్నారు. తమ పార్టీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు సామాన్యుడికి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. అలాంటి పార్టీ ఆశయాలను నీరుగార్చే ప్రయత్నాలను సహించమనీ. పార్టీని రక్షించుకోవడానికి పోరాడతామన్నారు. కేజ్రీవాల్‌ను జాతీయ కన్వీనర్‌గా రాజీనామా చేయాలని తాము కోరలేదని మరోసారి స్పష్టం చేశారు. మేం పదవి, అధికారం, సాయం కోరడంలేదు. పార్టీలో ప్రజాస్వామ్యానికి సంబంధించి మా డిమాండ్లను తీరిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని తేల్చి చెప్పారు. -
ఉంచుతారా.. ఊడకొడతారా..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభం మరింత ముదరనుందా.. శనివారం జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అంశంపై వివాదానికి తెరపడుతుందా.. లేక ఆ నేతలను జాతీయ కార్యవర్గ సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటిస్తారా.. ఇలా పలు ప్రశ్నలు చుట్టుముడుతుండగా.. వారిని పక్కకు పెడతారనే విషయమే తెలుస్తోంది. అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వర్గం జరిపిన రాజీ చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఆ సమావేశంలో తమ అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని భూషణ్, యోగేంద్ర కేజ్రీవాల్‌కు లేఖ కూడా రాశారు. మరి ఆ లేఖపై కేజ్రీవాల్ స్పందిస్తారా.. లేఖ శనివారం నాటి సమావేశానికే వదిలేస్తారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే, గురువారంనాటి సమావేశంలోని ప్రధాన అంశాలను ఒకసారి గమనిస్తే... 1.యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ఇప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మద్ధతుదారులు మరోసారి ఈ సమావేశంలో ఆరోపించారు. కానీ, అవన్నీ అవాస్తవాలని వారు కొట్టిపారేశారు. 2. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని తానెప్పుడూ కోరలేదని, సీనియర్ సభ్యులు తమపై ఈ ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగించిందని, దిగ్భ్రాంతికి గురిచేసిందని ఈ సమావేశం అనంతరం మీడియాకు ప్రశాంత్ భూషణ్ తెలియజేశారు. 3. కానీ, అందుకు విరుద్ధంగా కేజ్రీవాల్ మద్దతుదారుడు సంజయ్ సింగ్ అదే మీడియాతో మాట్లాడుతూ చర్చలు ముగిసాయని, ఈ చర్చల్లో పార్టీ పరిస్థితుకన్నా భూషణ్, యోగేంద్ర వారి అహానికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. 4. 'యాదవ్, భూషణ్‌కు జాతీయ కన్వీనర్ పదవి ఇచ్చేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారు. కానీ వారు మాత్రం మా అందరిపై ప్రజా వ్యతిరేకులమని ఆరోపణలు చేశారు. కానీ మేం వారిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు' అని అశుతోష్ అనే కేజ్రీవాల్ మద్ధతుదారుడు తెలిపాడు. 5. 'చర్చలు ముగిశాయి. కేజ్రీవాల్‌ను జాతీయ కన్వీనర్ పదవినుంచి తొలగించాలని వారు నొక్కి చెప్పారు. దానిపై జూలై 28న నిర్ణయం తీసుకుంటాం' అని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ట్విట్టర్లో పేర్కొన్నారు. 6.'ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నుంచి భూషణ్ ను, యోగేంద్రను తొలగించామని, శనివారం వారి విషయంలో ఓటింగ్ నిర్వహిస్తాం' అని సిసోడియానే చెప్పారు. 7.తమ డిమాండ్లు నెరవేరిస్తే అన్ని పదవులు వదులుకుంటామని మార్చి 17న లేఖలు రాశారని, వాటి వెనుక ఉన్న ఉద్దేశం కేజ్రీవాల్ రాజీనామానేని ఆప్ మరోసారి ఈ సమావేశం అనంతరం ప్రస్తావించింది. 8.కానీ, ఆ వెంటనే స్పందించిన అసమ్మతిదారులు 'మేం రాజీనామా చేయం. మా డిమాండ్లు ఎప్పటికీ నెరవేరవు. ఎందుకంటే మమ్మల్ని జాతీయ కార్యవర్గం నుంచి పూర్తిగా తప్పించాలని చాలామంది చూస్తున్నారు' అని అన్నారు. 9.శనివారం ఆప్ మరోసారి ఇదే విషయంపై సమావేశం కానుంది. 24 గంటలు గడిచినంతలోనే ఆప్ నిర్వహించే రెండో సమావేశం ఇది కానుంది. 10. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆప్ రాష్ట్రాల్లోనూ విస్తరించాలనుకుంటుండటంతో ఎలాంటి వివాదాలు లేకుండా త్వరగా పార్టీలో సమస్యలకు ముగింపు పలకాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యోగేంద్ర, భూషణ్ భవితవ్యం శనివారం తేలనుంది. -
‘ఆప్’లో రాజీ చర్చలు విఫలం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు. అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వర్గం జరిపిన రాజీ చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో తమ వాదనను అస లు వినిపించుకోలేదని చర్చలు విఫలమైన నేపథ్యంలో అసమ్మతి నేతలు కేజ్రీవాల్‌కు గురువారం ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో.. ‘మర్యాదగా జాతీయ కార్యవర్గానికి రాజీనామా చేయండి లేదా తొలగింపునకు సిద్ధం కండి అని చర్చల సందర్భంగా మీ తరఫువారు మాకు చెప్పారు. ఇది మీ మాటేనని వారు స్పష్టం చేశారు. మేము సభ్యులుగా ఉన్న జాతీయ కార్యవర్గానికి కన్వీనర్‌గా ఉండబోనని మీరు పట్టుబడ్తున్నారనీ చెప్పారు. మేమేం చేశామని మాపై మీకు ఇంత వ్యక్తిగత కక్ష అరవింద్ భాయ్!. నిజమేంటో మీ మనస్సాక్షికి తెలుసు. మిమ్మల్నెప్పుడూ మేం పదవి, అధికారం, సాయం ఏదీ కోరలేదు. పార్టీలో ప్రజాస్వామ్యానికి సంబంధించి మా డిమాండ్లను తీరిస్తే రాజీనామాకు సిద్ధమని కూడా చెప్పాం మీ అపాయింట్మెంట్ కోరి 10 రోజులైంది. మీ నుంచి స్పందన లేదు. అందుకే ఈ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది’ అని వారు పేర్కొన్నారు. కాగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ గురువారం కేజ్రీవాల్ నివాసంలో సమావేశమై, పార్టీలోని అంతర్గత విబేధాలపై చర్చించింది. యాదవ్, భూషణ్‌లకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని ఆ భేటీలో కేజ్రీవాల్ మద్దతుదారులు పట్టుబట్టారని సమాచారం. -
సీనియర్లపై భగ్గుమన్న ఆప్
యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్‌లపై ధ్వజం పార్టీని దెబ్బతీయాలని చూశారని తీవ్ర ఆరోపణలు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ప్రయత్నించారని మండిపాటు న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత పోరు బహిరంగమైంది. పార్టీ సీనియర్లు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లపై ఇటీవల చర్య తీసుకున్న ఆప్ నాయకత్వం తాజాగా వారిపై తీవ్ర ఆరోపణలు చేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి ఆ ఇద్దరినీ తొలగించడానికి కారణాలను అధికారికంగా వెల్లడించింది. యోగేంద్ర, ప్రశాంత్‌లతో పాటు శాంతి భూషణ్ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి కోసం కుట్రపన్నారని ఆరోపించింది. ఢిల్లీలో ప్రచారం చేయకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్యకర్తలను ప్రశాంత్ నిరుత్సాహపరిచారని విమర్శించింది. ఈమేరకు ఆప్ అగ్ర నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, పంకజ్గుప్తా, సంజయ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అందుకే మార్చి 4న జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వారిపై కఠిన చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. యాదవ్, ప్రశాంత్‌లను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల దృష్టిలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న అభిప్రాయంతోనే ఇంతవరకు ఈ కారణాలను వెల్లడించలేదన్నారు. అయితే మీడియా కథనాలతో పార్టీ నిర్ణయం అప్రజాస్వామికమన్న భావన కలుగుతున్నందు వల్ల అన్ని విషయాలను వెల్లడించక తప్పడం లేదన్నారు. ఎన్నికల్లో ఆప్ ఓడిపోవాలని, అప్పుడే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేలకు దిగుతారని భూషణ్ అన్నట్లు వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీకి 20-22 సీట్లే వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎన్నికలకు ముందు ఓ నేతతో ఆయన చెప్పినట్లు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను ప్రశాంత్, యోగేంద్ర ఖండించారు. దీనిపై త్వరలోనే స్పందిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ మద్దతుదారులు గతంలోనూ తమపై ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు. నేషనల్ కౌన్సిల్ పై దృష్టి ఈ నెల 28న జరగనున్న ఆప్ అత్యున్నత నిర్ణాయక విభాగం నేషనల్ కౌన్సిల్ భేటీపై ఆసక్తి నెలకొంది. పీఏసీ నుంచి యాదవ్, భూషణ్ తొలగింపు ఏకగ్రీవం కానందువల్ల తీవ్ర చర్చ జరగొచ్చు. హాజరు కానున్న సీఎం కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. -
కీలక బాధ్యతల నుంచి యోగేంద్ర, భూషణ్‌లు తొలగింపు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీ ఉద్భవించిన నాటినుంచి కీలకంగా వ్యవహరించిన యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్లను కీలక బాధ్యతల నుంచి తొలగించారు. బుధవారం ఆరుగంటలపాటు సమావేశమైన ఆప్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఎసీ) ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్‌లకు మధ్య అంతర్గత విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో 19మంది జాతీయ కార్యనిర్వాహక సభ్యులు హాజరయ్యారు. యోగేంద్ర, భూషణ్లను తొలగించేందుకు ఓటింగ్‌ను పీఎసీ నిర్వహించింది. ఈ ఓటింగ్‌లో 11మంది వారిద్దరిని తొలగించాలని తమ నిర్ణయాన్ని తెలిపారు. ఓటింగ్‌లో మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు ఆప్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. -
పేర్లు కాదు డబ్బు తేవటం ముఖ్యం
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ఖాతాలు కలిగివున్న వారి పేర్లను బహిర్గతం చేయడంకన్నా.. విదేశాల్లో దాచేసిన నల్లధనాన్ని వెనక్కు తీసుకురావడమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. విదేశాల్లో అక్రమ ఖాతాలున్న వారి పేర్లను వెల్లడించాలని కోరుతూ న్యాయవాదులు రామ్‌జెఠ్మలానీ, ప్రశాంత్‌భూషణ్‌లు వేసిన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ మేరకు స్పష్టంచేసింది. అంతకుముందు విచారణ సందర్భంగా జెఠ్మలాని తరఫు న్యాయవాది అనిల్దివాన్ వాదనలు వినిపిస్తూ గత ఆరు నెలల్లో ఒక్క రూపాయి కూడా ఈ దేశానికి తిరిగిరాలేదని.. కేవలం కొన్ని సోదాలు, అటాచ్‌మెంటులు మాత్రమే జరిగాయని విమర్శించారు. అటార్నీ జనరల్ ముకుల్ రహ్తొగీ వాదిస్తూ.. జెనీవా హెచ్ఎస్బీసీ బ్యాంకులోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన ఆదాయ పన్ను అంచనాలను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయటం జరుగుతుందన్నారు. భూషణ్ తరఫు న్యాయవాది దివాన్ వాదిస్తూ.. ఆయా ఖాతాదారుల పేర్లను ప్రచురిస్తే.. విదేశాల్లో నల్లధనం దాచుకుని, దానిని మాదకద్రవ్యాలు, ఉగ్రవాదం, మనుషుల అక్రమ రవాణాల్లోకి మళ్లించిన వారికి అది హెచ్చరికగా పనిచేస్తుంద్కన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఖాతాదారుల పేర్లను బహిర్గతపరచాలని తాము ఆదేశాలు ఇవ్వబోమని, నల్లధనాన్ని వెనక్కు తేవటం ఇక్కడ ముఖ్యాంశమని పేర్కొంది. నల్లధనం అంశంపై ఫ్రెంచ్ ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు, ఇతరత్రా సమాచారం సిట్‌కు సమర్పించామని, వాటిని పిటిషనర్లకు అందించాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆ దర్యాప్తు బృందమేనని పేర్కొన్న కేంద్రం వైఖరిపై పిటిషనర్లు స్పందనను సమర్పించేందుకు కోర్టు 3 వారాల సమయం ఇచ్చింది. రెండు వారాల్లోగా సమర్పించండి... నల్లధనాన్ని వెనక్కు తెచ్చేందుకు తాము చేసిన వివిధ సూచనలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిగణనలోకి తీసుకోవాలని జెఠ్మలానీ చేసిన విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ కేసుకు సంబంధించిన వారందరూ తమ సూచనలను మంగళవారం నుంచి రెండు వారాల్లోగా సిట్ దృష్టికి తీసుకువెళ్లేందుకు అనుమతిస్తున్నామంది. చట్టం చేస్తారో లేదో చెప్పాలి: జెఠ్మలానీ ఈ తీర్పు ప్రకటించిన తర్వాత.. ప్రభుత్వం ఆరు నెలలుగా నల్లధనంపై ఎటువంటి చర్యలూ చేపట్టలేదంటూ జెఠ్మలానీ కోర్టులోనే తన ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నేను నా డబ్బును వెనక్కు ఇవ్వాలని ఇక్కడికి రాలేదు. దేశానికి చెందిన డబ్బును వెనక్కు తేవాలని కోరుతూ వచ్చాను. చట్టం లేకుండా ఏమీ జరగదు. ఒక ముసాయిదా తయారు చేయాలని సిట్ నాకు చెప్పింది. నేను ముసాయిదాను సిట్‌కు, ప్రధానికి పంపించాను. ఆయన ఆర్థిక శాఖకు పంపారంతే. కానీ.. ప్రధాని నుంచి నాకు ఎలాంటి సమాచారమూ రాలేదు. అసలు చట్టం చేయాలనుకుంటున్నారో లేదో ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆ చట్టంలో ఈ ముసాయిదా భాగంగా ఉంటుందో లేదో చెప్పాలి. లేదంటే నేను బహిరంగంగా గొంతెత్తాల్సి ఉంటుంది. సలహా ఇవ్వటం తప్ప నేను ఏం చేయగలను? మీరు ఆ సలహాను అంగీకరించకపోతే నేను ఈ దేశ సార్వభౌమ ప్రజల ముందుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని అన్నారు. 15 లక్షల పరిమితి పెట్టండి: సిట్ న్యూఢిల్లీ: ఒక వ్యక్తి లేదా సంస్థ రూ.15 లక్షలకు మించి నగదును దగ్గర ఉంచుకోవడానికి వీల్లేకుండా పరిమితిని విధించాలని సిట్ సుప్రీంకోర్టుకు సూచించింది. నగదును పోగేయడం కూడా నల్లధనం పెరిగిపోవడానికి కారణమని పేర్కొంది. -
సీబీఐకి స్వతంత్ర హోదా కల్పించాలి
న్యూఢిల్లీ: సీబీఐపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా స్వతంత్ర హోదా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం సీబీఐ ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తోందని ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు ప్రశాంత్ భూషణ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా డిసెంబర్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్నార ని, అయినప్పటికీ ఆ పోస్టుకు పేర్లను ప్రకటించడంలో ఎందుకు జాప్యం చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ నూతన డెరైక్టర్ నియామకంలో పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘ సీబీఐ నూతన డెరైక్టర్ నియమించే విషయమై కనీస పారదర్శక పాటించాలన్నారు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారి సౌకర్యం కోసం బలహీనమైన, అవినీతి అధికారులను ఈ పోస్టులో నియమించి తమ పబ్బం గడుపుకొంటాయని, ఇది పాలకపక్షంతోపాటు ప్రతిపక్షానికి కూడా సౌకర్యవంతంగా ఉంటోందనే విషయం ఎన్నోసార్లు రుజువైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో అవినీతి కేసుల్లో కూరుకుపోయారని, అందుకే ఆ పార్టీ కూడా ఆ పోస్టులో నీతిమంతుడు, బలమైన వ్యక్తిని నియమించాలని కోరుకోవడం లేదని భూషణ్ ఆరోపించారు. అదేవిధంగా సీబీఐ స్వతంత్రహోదాలో పనిచేస్తూనే, లోక్‌పాల్ పరిధిలో ఉండేలా చూడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. 2జీ స్పెక్ట్రామ్ కేసులో నిందితులను రక్షించడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాను సస్పెండ్ చేయకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉండాల్సి ఉందని కేంద్రం చర్యలను తప్పుబట్టారు. సిన్హాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, నేర విచారణ చర్యలకు పూనుకోరాదని, కానీ కేంద్రం పై రెండింటిని చేపట్టి తప్పు చేసిందని అన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు. వాద్రా అధికార దుర్వినియోగం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని శనివారం బెంగళూరులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకుడు ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ ఎయిర్ లైన్స్ వద్ద ఉచితంగా ఆయనకు, కుటుంబ సభ్యులకు ప్రయాణ టిక్కెట్లు, ఇతర సౌకర్యాలు పొందారని విమర్శించారు. శుక్రవారం ‘తెహల్కా’ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించిందని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. వాద్రాతో పాటు కొంత మంది అధికారులు, ప్రముఖ వ్యక్తులు కూడా ఉచితంగా సౌకర్యాలు పొందిన వారిలో ఉన్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వాద్రా ఇంకా అనేక రాయితీలు పొందారని ఆరోపించారు. ఆ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇలాంటి రాయితీలు ఇవ్వడం తప్పని, అలా చేయకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. -
బీజేపీకి అవకాశం ఇవ్వొద్దు: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి, తాజాగా శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. బీజేపీకి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు ఇవ్వవని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి బీజేపీ అవకాశాలు లేవని చెప్పారు. బీజేపీ అవకాశం ఇస్తే రాజకీయ బేరసారాలకు, పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించామన్నారు. -
ఆ జాబితా ఎవరిచ్చారో చెప్పండి
సీబీఐ డెరైక్టర్ ఇంటి గుట్టు వ్యవహారంలో ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అధికార నివాసానికి వచ్చిన వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితాను, 2జీ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అంతర్గత నోట్స్‌ను అందజేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని సోమవారం సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ తేదీకల్లా ఆ పేరును సీల్డ్ కవర్లో సమర్పించాలని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఈ కేసులోని ఆరోపణలు సీబీఐ డెరైక్టర్ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు స్కాం దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని, ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడిస్తే, ఈ ఆరోపణల్లో నిజానిజాలెంతో నిర్ధారించవచ్చని పేర్కొంది. దాన్నిబట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామంది. అయితే తనకు వివరాలిచ్చిన వ్యక్తి పేరు బయటపెట్టాలన్న కోర్టు సూచనను ఆయన వ్యతిరేకించారు. సుప్రీంకోర్టుకు తాను సమర్పించిన సందర్శకుల జాబితా రిజిస్టర్ అసలైనదేనని, కావాలంటే దాని ప్రామాణికతను తెలుసుకునేందుకు ఓ కమిటీని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించుకోవచ్చని నివేదించారు. ‘‘ఆ రిజిస్టర్ ప్రామాణికతపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందులోని వివరాలను మార్చడం అసాధ్యం. ఆ రిజిస్టర్‌ను సీబీఐ డెరైక్టర్ నివాసం గేటు వద్ద నిర్వహించిందే అని పూర్తి ఘంటాపథంగా చెప్పగలను’’ అని ప్రశాంత్ స్పష్టంచేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి పేరు సీల్డ్ కవర్లో తెలియజేయాలని ధర్మానసం ఆయనకు సూచించింది. కాగా, సుప్రీంకోర్టుకు భూషణ్ సమర్పించిన తన ఇంటి సందర్శకుల జాబితా రిజిస్టర్ వాస్తవికతపై రంజిత్ సిన్హా అనుమానం వ్యక్తంచేశారు. అందులో పది శాతం వివరాలు సరైనవి అయి ఉండొచ్చని, మిగిలిన 90 శాతం వివరాలను మార్చేశారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలను ఎవరో నియంత్రిస్తున్నారని, లేకుంటే అసలైన సందర్శకుల జాబితాను ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారని మీడియా ముందుగానే కథనాలు ఎలా ప్రచురించిందని రంజిత్ సిన్హా తరఫు న్యాయవాది వికాస్ సింగ్ సందేహం లేవనెత్తారు. వీటి వెనుక ఓ కార్పొరేట్ సంస్థ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. -
సీల్డ్‌కవర్ లో వివరాలివ్వండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సీబీఐ చీఫ్ రంజిత్ సిన్హాను కలిసిన వారి వివరాలకు సంబంధించిన ఆధారాలు చూపాలని లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. రంజిత్ సిన్హా నివాసానికి వచ్చి వెళ్లినవారి వివరాలుండే సందర్శకుల జాబితా ఎక్కడినుంచి వచ్చిందో వెల్లడించాలని పేర్కొంది. జాబితా అందజేసిన ‘ప్రజా వేగు’ వివరాలు సీల్డ్ కవర్లో పెట్టి అందజేయాలని సూచించింది. జాబితాలో పేర్కొన్న వివరాలు 90 శాతం బోగస్ అని, పదిశాతం మాత్రమే కచ్చితంగా ఉన్నాయని కోర్టుకు రంజిత్ సిన్హా తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈనెల 22కు వాయిదా వేసింది. 2జీ కేసులో నిందితులు సీబీఐ చీఫ్‌తో ఆయన ఇంట్లో చాలాసార్లు సమావేశమయ్యారని, దీనికి సందర్శకుల జాబితాయే నిదర్శనమని, ఆయన్ను 2జీ కేసు నుంచి తప్పించాలని భూషణ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్నికలు నిర్వహించండి ఎల్జీకి ఆప్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలు తొందరగా నిర్వహించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత ప్రశాంత్ భూషణ్. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడానికి ఎల్జీకి ఎలాంటి కాలపరిమితీ లేదని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ సమయంలోనైనా రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు ఆయనకు అధికారాలు ఉన్నాయని వివరణ ఇచ్చింది. కాబట్టి సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన ఎల్జీని కోరారు. ‘‘70 అసెంబ్లీ సీట్లకు గాను 31 గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ నేతలను ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటుకు వారు సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని మేం వినయపూర్వకంగా కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ఆప్‌నేత. ‘‘ఒకవేళ వాళ్లు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా లేకపోతే గతంలో మీరు చేసిన సూచనలను పునఃసమీక్షించి సరైన నిర్ణయం తీసుకోండి. దానివల్ల తొందరగా ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశముంటుంది’’ అని లేఖలో పొందుపరిచారు. ఈ మార్చి 31న దాదాపు ఇలాంటి లేఖనే ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా జంగ్కు ఇచ్చారు. -
రూ. 6,500 కోట్ల సంగతేంటి..?
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు కేటాయించిన కేజీ-డీ6 బేసిన్‌లోని ఆయిల్, గ్యాస్ క్షేత్రం కాంట్రాక్ట్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన రూ. 6,500 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలపై ఎలాంటి దర్యాప్తును చేపట్టిందీ వివరించమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌ను వివరణ అడిగింది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించిందని, తమ వంతు వచ్చాక తగువిధంగా స్పందిస్తుందని మోహన్ కోర్టుకు వివరించారు. ముకేష్ అంబానీ గ్రూప్ కంపెనీ ఆర్ఐఎల్కు సహకరించేందుకు అన్ని రాజకీయ పార్టీలూ ఏకమయ్యాయంటూ ఎన్జీవో కామన్ కాజెస్ కౌన్సిల్ తరఫున ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఇది కీలకమైన అంశమే అయినప్పటికీ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ విషయాన్ని లేవనెత్తకపోవడం గమనార్హమని జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. సీనియర్ సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా, ఎన్జీవో కామన్ కాజ్ వేసిన పిటిషన్లపై స్పందిస్తూ కేవలం వ్యక్తులే ఈ విషయాలను తమ దృష్టికి తీసుకువచ్చినట్లు వ్యాఖ్యానించింది. కాగా, ఎంపీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కొలిన్ గాన్‌సేల్వ్స్ తమ వాదనను ముగించిన తరువాత, ఎన్జీవో తరఫున విచారణకు హాజరైన భూషణ్ ఈ కేసుకు సంబంధించిన ఒక లేఖను కోర్టుకు చదివి వినిపించారు. ఊరూపేరూలేని కంపెనీలతో..: సింగపూర్‌లోని ఇండియన్ హైకమిషన్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖగా పేర్కొంటూ భూషణ్ లేఖలోని కొన్ని విషయాలను కోర్టుకు వినిపించారు. సింగపూర్‌లో ఒకే గదిలో ఏర్పాటు చేసిన ఎలాంటి వ్యాపారాలూ నిర్వహించని ఒక సంస్థ రూ. 6,500 కోట్లను ఇన్వెస్ట్ చేయడంపై దర్యాప్తునకు సంబంధించిన ఈ లేఖను భూషణ్ కోర్టుకు సమర్పించారు. బయో మెట్రిక్స్ మార్కెటింగ్ అనే సంస్థ ద్వారా ఇండియాకు ఈ పెట్టుబడులు అందినట్లు హైకమిషన్ పేర్కొన్న విషయాన్ని భూషణ్ తెలియజేశారు. ఈ కంపెనీకి ఎలాంటి ఆస్తులు, ఈక్విటీ లేదని ఆయన వివరించారు. బ్యాంకింగ్ లెసైన్స్‌లపై ఈసీ దృష్టి న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల జారీ అంశంపై ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టిసారించింది. సోమవారం(31న) లెసైన్స్‌ల అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయని ఎలక్షన్ కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ బుధవారమిక్కడ చెప్పా రు. ఈసీ అడిగిన కొన్ని వివరణలను ఆర్బీఐ ఇప్పటికే సమర్పించిందని కూడా ఆయన వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున లెసైన్స్‌ల జారీపై నిర్ణయం కోసం ఆర్బీఐ ఈసీకి లేఖరాయడం తెలిసిందే. ఇండియా పోస్ట్, ఐఎఫ్సీఐ, ఎల్ఐసీ హౌసింగ్ ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థలు; అనిల్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌లతో సహా మొత్తం 24 కంపెనీలు బ్యాంకింగ్ లెసైన్స్‌ల రేసులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కొత్త లెసైన్స్‌ల జారీ విషయంలో ఈసీకి ఉన్న అభ్యంతరాలేంటన్న ప్రశ్నకు... వాళ్లు(ఆర్బీఐ) నిబంధనల విషయంలో పూర్తి విశ్వాసంతో ఉంటే మా పరిశీలన కోసం ఎందు కు పంపాల్సి వస్తుంది. తమ విధులను నమ్మకంగా, సంతృప్తికరంగా, సక్రమంగా నిర్వర్తించినప్పుడు అసలు ఈ అంశాన్ని ఈసీ నిర్దేశం కోసం పంపించాల్సిన అవసరమే లేదని బ్రహ్మ స్పష్టం చేశారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల అంశానికి సంబంధించి గతేడాది(2013)లోనే నిర్ణయం తీసుకున్నప్పుడు జారీ చేయనీయకుండా ఆర్బీఐకి ఉన్న అడ్డకుంలేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. -
అసెంబ్లీని రద్దు చేయాల్సిందే.. మరో ఆప్షన్ లేదు
జన లోక్‌పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీ తిరస్కరించిన తర్వాత ఆమ్ ఆద్మీపార్టీ ప్రభుత్వానికి రాజీనామా చేయడం తప్ప మరో అవకాశం ఏమీ లేదని పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత భూషణ్ అన్నారు. ఈ బిల్లును ఆమోదించి, అమలులోకి తెస్తామన్నది తాము ఢిల్లీ వాసులకు ఇచ్చిన మొట్టమొదటి హామీ అని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ - కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆలోచనలో ఎటూ లేవు కాబట్టి, ఇక అసెంబ్లీని రద్దు చేయడం తప్ప మరో ఆప్షన్ ఏదీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు లేదని భూషణ్ అన్నారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం, దాన్ని నడిపించడం తమముందున్న అతిపెద్ద బాధ్యత అని, దాన్ని తాము నెరవేర్చకుండా బీజేపీ, కాంగ్రెస్ అడ్డుపడినప్పుడు ఇక తాము అధికారంలో ఉండటంలో ఏమాత్రం అర్థం లేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడానికే ఆమ్ ఆద్మీ పార్టీ జన లోక్‌పాల్ బిల్లు గురించి అంతగా పట్టుబట్టిందన్న కిరణ్ బేడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆమె ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి అయిపోయారన్నారు. -
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు
న్యూఢిల్లీ: పార్టీని ఏర్పాటుచేసి ఎన్నికల బరిలోకి దిగడంద్వారా రాజకీయ రంగంలోకి తాను ప్రవేశిస్తానని అనుకోలేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. అవినీతిపరులైన కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మీడియాకు చెందిన మరికొందరు సంతోషంగా బతుకుతున్నారని, అయితే సామాన్యుడు మాత్రం ఇంకా బాధల్లోనే ఉన్నాడని అన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే విషయమై మాట్లాడుతూ ఇది వారిలో అరాచకానికి తెరతీస్తోందన్నారు. అటువంటివారికి తాను అరాచకవాదినేనన్నారు. అంతేకాకుండా తనను తాను రాజకీయ విప్లవకారుడిగా ఆయన అభివర్ణించుకున్నారు. మిమ్మల్ని నియంత అని పిలిచేవారి విషయంలో ఏవిధంగా స్పందిస్తారని అడగ్గా... అలా అయితే ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్వంటివారు తనతో ఏవిధంగా పనిచేయగలుగుతారని ఆయన ఎదురుప్రశ్నించారు. ఆప్ నాయకులంతా కలసికట్టుగా ఉంటారని, ఒకవేళ తాము నియంతలమే అయితే తమ పక్కన నలుగురు కూడా నిలబడలేరన్నారు. 2012, అక్టోబర్‌లో ఆప్ పార్టీని చేశానన్నారు. ఎన్నికల బరిలోకి దిగితే మంచి ఫలితాలు వస్తాయని అనుకున్నానని, అయితే ముఖ్యమంత్రినవుతానని మాత్రం ఊహించలేదన్నారు. పీఎం కావాలనుకోవడం లేదు ప్రధానమంత్రి అవుదామని అనుకుంటున్నారా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. భారత్‌ను అవినీతిరహిత దేశంగా మార్చాలనేదే తన కోరికని అన్నారు. అందుకోసమే తాము పోరాడుతున్నామన్నారు. అంతేతప్ప అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదన్నారు. భవిష్యుత్తలో ప్రధాని అవుతారా అని ప్రశ్నించగా మున్ముందు ఏమిజరుగుతుందనే విషయం ఎవరికి తెలుసన్నారు. అయితే లోక్‌సభకు పోటీ చేస్తానా లేదా అనే విషయం ఇప్పుడే చెప్పలేనన్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానన్నారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులు బరిలోకి దిగిన ప్రతి నియోజకవర్గంలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయం ఇప్పుడే చెప్పలేనన్నారు. వారినుంచి ఏమీ ఆశించలేం కేంద్రంలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తాము చెప్పడం లేదన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్‌గాంధీల గురించి మాట్లాడుతూ వారిరువురూ రాజకీయ వ్యవస్థలో భాగమని మాత్రం చెప్పగలనన్నారు. అయితే వారినుంచి ఏమీ ఆశించలేమన్నారు. ‘ప్రత్యామ్నాయం చూసుకుంటాం ‘ఆరోగ్యకర వాతావరణంతో ముందుకెళ్తే ఫర్వాలేదు. లేదంటే ప్రత్యామ్యాయం చూసుకుంటామని సీఎం అరవింద్ కుమార్ కేజ్రీవాల్ విద్యుత్ పంపిణీ సంస్థలకు చురకలంటించారు. విద్యుత్ కంపెనీలకు గడ్డుకాలం ఉందని, విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రభుత్వంపై లా కంపెనీలు ఒత్తిడి తేవడంతో ఆయన పైవిధంగా స్పందించారు. అనిల్ పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వానికి మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవని పేర్కొన్నారు. అనిల్, టాటాలు ఎవరైనా నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. విద్యుత్ విషయంలో వారు గందరగోళం సృష్టిస్తే తాము ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తామని హెచ్చరించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలను ఒప్పుకోబోమన్నారు. ‘ప్రజలకు విద్యుత్ అవసరం తప్పనిసరి. అయితే విద్యుత్ భారాన్ని వారు అంగీకరించరు’ అని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంచితే వారు ఆందోళనకు దిగుతారన్నారు. గత ప్రభుత్వంపై ఇలాంటి ఆందోళననే జరిగిందన్నారు. ఢిల్లీకి అనిల్ అంబానీ గ్రూప్, రాజధాని పవర్, యమున పవర్ల నుంచి దాదాపు 70 శాతం విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. అయితే నిజాయితీ వ్యాపారులతోనే తాము సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. తమకు మిత్రులు, శత్రువులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. సంబంధాలు తెంచుకోవాలనుకోవడంలేదు విద్యుత్ సంస్థలతో ప్రస్తుతానికైతే సంబంధాలు తెంచుకోవాలనుకోవడంలేదని సీఎం అరవింద్‌కుమార్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు విద్యుత్ సంస్థలు ససేమిరా అంటే ఏం చర్యలు తీసుకుంటారని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. తమను ఒత్తిడి చేయకుండా 10 గంటల విద్యుత్ కోతలు విధిస్తే దానికి తగిన డబ్బులను ఇవ్వాలని పేర్కొన్నారు. లెసైన్స్‌లు కొనసాగాలంటే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సంస్థల యజమానులు ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే తాము అంతకుమంచి సంస్థలను చూసుకుంటామని చెప్పారు. అదేవిధంగా వారి లెసైన్సులను తొలగించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు గత సోమవారం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో విద్యుత్ ట్రిబ్యునల్ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉత్తర్వులు తమకే అనుకూలంగా ఉన్నాయని, ఏం జరుగుతుందో వేచిచూద్దామని ఆయన పేర్కొన్నారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ
-
ఆమ్ ఆద్మీ పార్టీకి రాష్ట్ర విభజన సెగ
హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీకీ రాష్ట్ర విభజన సెగ తగిలింది. హైదరాబాద్ ఏవీ కళాశాలలో జరుగుతున్న ఆప్ సభలో శనివారం గందరగోళం చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించే నేపథ్యంలో ఏవీ కాలేజీలో ఆమ్ఆద్మీపార్టీ కార్యకర్తలు ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి ఆప్ ముఖ్యనేత ప్రశాంత్ భూషణ్ హాజరు అయ్యారు. ఆయన ఎదుట తెలంగాణ, సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. పోటా పోటీ నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
‘షా’ నివేదికను మాకివ్వండి: సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ఒడిశా, జార్ఖండ్‌లలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ షా కమిషన్ నివేదికను జనవరి 27లోగా తమకు అందించాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర సాధికార కమిటీకి కూడా నివేదిక ప్రతిని ఇవ్వాలని జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని హరిత ధర్మాసనం పేర్కొంది. వార్తాపత్రికల్లో ప్రచురితమైన షా కమిషన్ నివేదికలోని కొన్ని అంశాలు దిగ్భ్రాంతి గొలిపేలా ఉన్నాయని, వాటిపై అత్యున్నత న్యాయస్థానం సమీక్ష జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనాన్ని కోరారు. షా కమిషన్ గడువును మరో ఏడాది పెంచాలని కేంద్రాన్ని ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై జనవరి 27న వాదనలు వింటామని బెంచ్ తెలి పింది. మైనింగ్ వ్యాపారంలో ఉన్న పెద్దల ప్రయోజనాలకు విఘా తం కలుగుతుందనే షా కమిషన్ గడువును పెంచడం లేదని గోవా ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ తన పిటిషన్లో ఆరోపించింది. -
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి
-
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి
ఘజియాబాద్ కొశాంబిలోని ఆమ్ఆద్మీ పార్టీ కార్యాలయంపై శ్రీరామ్ సేన మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. సేన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆప్ కార్యాలయానికి చేరుకుని, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ క్రమంలో ఆప్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దాంతో కిటికి అద్దాలు పగిలాయి. ఆప్ కార్యాలయంపై దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు పరారయ్యారు. హిందూ రక్షక సంస్థకు చెందిన శ్రీరామ్ సేనకు చెందిన మద్దతుదారులు ఆ దాడికి పాల్పడ్డారని ఘజియాబాద్ ఎస్ఎస్పీ ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. శ్రీరామ్ సేన మద్దతుదారుడు విష్ణు గుప్తా సారథ్యంలో ఆ దాడి జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆప్ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆప్ కార్యాయలం వద్ద భారీ భద్రతను మోహరించారు. ప్రముఖ న్యాయవాది జమ్మూ కాశ్మీర్‌పై వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ దాడి చేశారని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
వెనకడుగేస్తే కాంగ్రెస్‌కే దెబ్బ
ముంబై: అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ‘ఆప్’ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ ప్రజలు క్షమించబోరని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తమ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. తాము కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వారే తమకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. మద్దతుకు వారి విధించే ఎటువంటి షరతులకూ తాము ఒప్పుకునేదిలేదని ముందే చెప్పామన్నారు. ఆప్ సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే.. పరిస్థితి ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు అయన సమాధానమిస్తూ.. ఒకవేళ కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఢిల్లీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఏమాత్రం క్షమించబోరని ఆయన తేల్చి చెప్పారు. తాము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. జనలోక్‌పాల్, అవినీతిరహిత భారతదేశం లక్ష్యంగా తాము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. అయితే జాతీయ పార్టీలు తమను తక్కువ అంచనా వేశాయని, ఢిల్లీ ఎన్నికల్లో తమ ప్రభావం ఉండబోదనే ఆలోచనతో ముందుకు వెళ్లి బోర్లాపడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.‘ మనం వారిని ఐదేళ్లపాటు పాలించండని ఓటేసి గెలిపించాం. అయితే వారు సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగంలేని చట్టాలను తీసుకువచ్చి, బడా పారిశ్రామికవేత్తల కొమ్ముకాశారు..’ అని ఆయన గత పార్టీల పనితీరును దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అధికార , న్యాయవ్యవస్థల పని విధానం సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేవని ఆయన విశ్లేషించారు. పోలీసు, ఉద్యోగస్వామ్యం, న్యాయవ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీల అహాన్ని దెబ్బతీశాయని ఆయన వివరించారు. బీజేపీ బహిరంగ మతతత్వ పార్టీ అయితే, కాంగ్రెస్ ప్రచ్ఛన్న మతతత్వ పార్టీ అని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలు సామాన్య మానవుడిలో ఉన్న భ్రమలను తొలగించాయని ఆయన చెప్పారు. ఆప్‌ను రాజకీయ పార్టీగా కాకుండా వ్యవస్థ మార్పు నకు ఒక సూచికగా పేర్కొనవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ దేశం మొత్తం పోటీచేయనున్నట్లు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ పార్టీకి మంచి అభ్యర్థులు దొరుకుతారో, ఎక్కడ తమకు పట్టు ఉంటుందో ఆయా స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నామన్నారు. ప్రస్తుతం పార్టీకి దేశవ్యాప్తంగా 310 జిల్లాల్లో శాఖలున్నాయని చెప్పారు. తమ పార్టీ పాలనా తీరుకు, గత పార్టీల పాలనా విధానం మధ్య వ్యత్యాసాన్ని ఢిల్లీ ప్రజలు ఇప్పటికే గమనించారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునేదీ లేనిదీ ఇప్పటివరకు నిర్ణయించుకోలేదన్నారు. అయితే చాలావరకు లోకల్ పార్టీలు సైతం అవినీతిమయమై ఉన్నాయన్నారు. తమ పార్టీ కేజ్రీవాల్ నాయకత్వంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళుతుందని, అయితే తాము ఏ ఒక్కరి చరిష్మానో నమ్ముకుని పనిచేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మధ్య పోలికే లేదన్నారు. మోడీ కేపటలిస్టులకే ఎక్కువ సన్నిహితుడని ఆయన విశ్లేషించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు ప్రైవేట్ విద్యుత్ కంపెనీలపై కాగ్ ఆడిటింగ్‌కు ఆదేశించిందన్నారు. గత ప్రభుత్వాలు ఆ కంపెనీలపై కనీస చర్యలకు కూడా సాహసించలేదని ఆయన గుర్తుచేశారు. రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆప్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా, మహారాష్ట్రలో తమ పార్టీ మనుగడకు అన్నాహజారే, మేధా పాట్కర్ వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. ‘మేం అన్నా హజారేను గౌరవిస్తాం.. ఎందుకంటే ఆయన మార్గదర్శక సూత్రాలపైనే మా పార్టీ ఏర్పాటైంది..’ అని మయాంక్ వివరించారు. -
వెనకడుగేస్తే కాంగ్రెస్‌కే దెబ్బ
ముంబై : అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ‘ఆప్’ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ ప్రజలు క్షమించరని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తమ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. తాము కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో వారే తమకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. మద్దతుకు వారి విధించే ఎటువంటి షరతులకూ తాము ఒప్పుకునేదిలేదని ముందే చెప్పామన్నారు. ఆప్ సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే.. పరిస్థితి ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు అయన సమాధానమిస్తూ.. ఒకవేళ కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఢిల్లీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఏమాత్రం క్షమించబోరని ఆయన తేల్చి చెప్పారు. తాము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. జనలోక్‌పాల్, అవినీతిరహిత భారతదేశం లక్ష్యంగా తాము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. అయితే జాతీయ పార్టీలు తమను తక్కువ అంచనా వేశాయని, ఢిల్లీ ఎన్నికల్లో తమ ప్రభావం ఉండబోదనే ఆలోచనతో ముందుకు వెళ్లి బోర్లాపడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.‘ మనం వారిని ఐదేళ్లపాటు పాలించండని ఓటేసి గెలిపించాం. అయితే వారు సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగంలేని చట్టాలను తీసుకువచ్చి, బడా పారిశ్రామికవేత్తల కొమ్ముకాశారు..’ అని ఆయన గత పార్టీల పనితీరును దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అధికార , న్యాయవ్యవస్థల పని విధానం సామాన్య ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేలా లేవని ఆయన విశ్లేషించారు. పోలీస్, ఉద్యోగస్వామ్యం, న్యాయవ్యవస్థల్లో మార్పులు తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీల అహాన్ని దెబ్బతీశాయని ఆయన వివరించారు. బీజేపీ బహిరంగ మతతత్వ పార్టీ అయితే, కాంగ్రెస్ ప్రఛన్న మతతత్వ పార్టీ అని ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఢిల్లీ ఎన్నికలు సామాన్య మానవుడిలో ఉన్న భ్రమలను తొలగించాయని ఆయన చెప్పారు. ఆప్‌ను రాజకీయ పార్టీగా కాకుండా వ్యవస్థ మార్పు నకు ఒక సూచికగా పేర్కొనవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ దేశం మొత్తం పోటీచేయనున్నట్లు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ పార్టీకి మంచి అభ్యర్థులు దొరుకుతారో, ఎక్కడ తమకు పట్టు ఉంటుందో ఆయా స్థానాల్లో పోటీకి సిద్ధపడుతున్నామన్నారు. ప్రస్తుతం పార్టీకి దేశవ్యాప్తంగా 310 జిల్లాల్లో శాఖలున్నాయని చెప్పారు. తమ పార్టీ పాలనా తీరుకు, గత పార్టీల పాలనా విధానం మధ్య వ్యత్యాసాన్ని ఢిల్లీ ప్రజలు ఇప్పటికే గమనించారని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది తమ పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునేదీ లేనిదీ ఇప్పటివరకు నిర్ణయించుకోలేదన్నారు. అయితే చాలావరకు లోకల్ పార్టీలు సైతం అవినీతిమయమై ఉన్నాయన్నారు. తమ పార్టీ కేజ్రీవాల్ నాయకత్వంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళుతుందని, అయితే తాము ఏ ఒక్కరి చరిష్మానో నమ్ముకుని పనిచేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మధ్య పోలికే లేదన్నారు. మోడీ కేపటలిస్టులకే ఎక్కువ సన్నిహితుడని ఆయన విశ్లేషించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు ప్రైవేట్ విద్యుత్ కంపెనీలపై కాగ్ ఆడిటింగ్‌కు ఆదేశించిందన్నారు. గత ప్రభుత్వాలు ఆ కంపెనీలపై కనీస చర్యలకు కూడా సాహసించలేదని ఆయన గుర్తుచేశారు. రుణాలు తీసుకుని ఎగవేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆప్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా, మహారాష్ట్రలో తమ పార్టీ మనుగడకు అన్నాహజారే, మేధా పాట్కర్ వంటి ప్రముఖ సామాజిక కార్యకర్తల మద్దతు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ తెలిపారు. ‘మేం అన్నా హజారేను గౌరవిస్తాం.. ఎందుకంటే ఆయన మార్గదర్శక సూత్రాలపైనే మా పార్టీ ఏర్పాటైంది..’ అని మయాంక్ వివరించారు.