బీజేపీకి అవకాశం ఇవ్వొద్దు: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి, తాజాగా శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. బీజేపీకి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు ఇవ్వవని అన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి బీజేపీ అవకాశాలు లేవని చెప్పారు. బీజేపీ అవకాశం ఇస్తే రాజకీయ బేరసారాలకు, పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్ని సుప్రీంకోర్టుకు వెల్లడించామన్నారు.