కీలక బాధ్యతల నుంచి యోగేంద్ర, భూషణ్లు తొలగింపు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీపార్టీ ఉద్భవించిన నాటినుంచి కీలకంగా వ్యవహరించిన యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్లను కీలక బాధ్యతల నుంచి తొలగించారు. బుధవారం ఆరుగంటలపాటు సమావేశమైన ఆప్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఎసీ) ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్నిరోజులుగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు యోగేంద్రయాదవ్, ప్రశాంత్ భూషణ్లకు మధ్య అంతర్గత విబేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సమావేశంలో 19మంది జాతీయ కార్యనిర్వాహక సభ్యులు హాజరయ్యారు. యోగేంద్ర, భూషణ్లను తొలగించేందుకు ఓటింగ్ను పీఎసీ నిర్వహించింది. ఈ ఓటింగ్లో 11మంది వారిద్దరిని తొలగించాలని తమ నిర్ణయాన్ని తెలిపారు. ఓటింగ్లో మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు ఆప్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.