
‘స్వరాజ్ సంవాద్’కు వెళ్లొద్దు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అసమ్మతి నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ నేతృత్వంలో అంబేద్కర్ జయంతి రోజున నిర్వహించనున్న ‘స్వరాజ్ సంవాద్’ సమావేశంలో పాల్గొనొద్దని తమ వలంటీర్లను ఆప్ హెచ్చరించింది. ఇలాంటివి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలని పేర్కొంది. ఆప్‌లోని కొంత మందిని ఆకర్షించేందుకు యోగేంద్ర, ప్రశాంత్.. స్వరాజ్ సంవాద్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 14న నిర్వహించనున్న ఆ సమావేశంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం. కాగా, ఆప్ నేత ఆనంద్ కుమార్.. పార్టీ నాయకత్వాన్ని విమర్శించారు. స్వరాజ్ సంవాద్‌కు వెళ్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కొత్తగా నియమితుడైన ఒక పార్టీ అధికార ప్రతినిధి హెచ్చరించారని, ఇలాంటి నియంత్రృత్వ పోకడలు విడనాడాలన్నారు.