B R Ambedkar
-
భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం
వాషింగ్టన్: భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్థంతి రోజైన ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’గా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతోపాటు, భారత్, తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు. ‘మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వమనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతిచోటా వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది’అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు సరిగ్గా 22 మైళ్ల దూరంలో ఉన్న అకోకీక్ టౌన్‌షిప్‌లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుద్ధా గార్డెన్‌తోపాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ సెంటర్ ఆవరణలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. -
అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేడ్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు దండ వేసి రాజ్యాంగ రచయితను ఘోరంగా అవమానించారు. ఈ దురాఘాతానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా జంగారెడ్డిగూడెం, లక్కవరం మండలాల్లో దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు దళిత సంఘాల నేతలు పాలాభిషేకం చేశారు. ఈ విషయంపై చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాల్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన వారు ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదని హామీ ఇచ్చారు. మేధావి, మహనీయుడు, ప్రతిభావంతుడైన అంబేడ్కర్‌కు ఘోర అవమానం జరిగిందని, అతని విగ్రహానికి చెప్పుల దండ వేయటం చాలా బాధాకరం ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆకాశం లాంటి వారని, ఆయన మీద ఉమ్మి వేసే ఆలోచన చేస్తే అది వారి మీదే పడుతుంది ఆయన వ్యాఖ్యనించారు. దళిత సంఘాలతో పాటు ఎమ్మెల్యే కూడా ర్యాలీలో పాల్గొన్నారు. -
‘నేను బీజేపీ ఐటమ్ గర్ల్‌ని’
లక్నో : నోటి దురుసుతో వార్తల్లో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను బీజీపీ ఐటమ్ గర్ల్‌ను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లో హజ్ హౌస్ ప్రారంభోత్సావానికి హాజరైన అజామ్ ఖాన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. దాంతో అంబేడ్కర్ మహాసభ సభ్యులు అజామ్ ఖాన్ మీద మంగళవారం (నిన్న) హజ్రత్గని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ‘బీజేపీ గత ఎన్నికల్లో నా పేరే వాడింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా నా పేరును అడ్డు పెట్టుకుని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఎందుకంటే బీజేపీ నన్ను తన ఐటమ్ గర్ల్‌గా భావిస్తోంది. ఇక మీదట కూడా నాకు సమన్లు, వారెంట్లూ వస్తూనే ఉంటాయాం’టూ అజామ్ మండిపడ్డారు. -
రాజ్యాంగాన్ని కాపాడండి ప్లీజ్..
పార్వతీపురం విజయనగరం : ప్రజలహక్కులను కాలరాస్తూ రా జ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న సర్కారు తీరుపై వైఎస్సార్సీపీ నిరసన తెలియజేసింది. ఈ మేరకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జో గారావు ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి ఆస్పత్రి కూడలిలోగల అంబేడ్కర్ వి గ్రహం వరకూ శుక్రవారం ప్రదర్శన చేపట్టి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా రాక్షసపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డైరెక్షన్లో దిగువస్థాయి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపైన, వైఎస్సార్సీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పార్వతీపురం పట్టణంలో గురువారం బురదనీరుపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఆయన అనుచరులు సామాన్యులపై దాడికి పాల్పడడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమేనని చెప్పారు. వారి దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌నే రాజ్యంగ విలువలు కాపాడాల్సిందిగా కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలియజేశారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు అదే రాజ్యాంగ విలువలను కాపాడకుండా రాక్షసుల్లా ప్రవర్తించడం చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, అరకు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపల గురురాజు, సీనియర్ కౌన్సిలర్లు గొల్లు వెంకటరావు, ఓ.రామారావు, ఎస్.శ్రీనివాసరావు, ఏగిరెడ్డి భాస్కరరావు, బోను ఆదినారాయణ, సర్పంచ్‌లు బొమ్మి రమేష్, ఏగిరెడ్డి తిరుపతిరావు, రణభేరి బంగారునాయుడు, సిగడం భాస్కరరావు, జొన్నాడ శ్రీదేవి, పొట్నూరు జయంతి, గొట్టా శివకేశ్వరరావు, జయంత్, వల్లేపు చిన్నారావు, పాతగోవింద్, పల్లెం కనకరావు, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహానికి నల్ల ముసుగు
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వినాయక చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నల్ల ముసుగు వేశారు. దీంతో దళిత సంఘాలు ఆదివారం ఉదయం వినాయక చౌరస్తా వద్ద ధర్నా చేపట్టాయి. నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని ఏసీపీ జితేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించాయి. తర్వాత దళిత సంఘాలు అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశాయి. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై దళిత నాయకుల ఆగ్రహం
-
ఓటుకు నోటు కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు
-
‘కేసీఆర్‌తో లాలూచీ పడి.. పారిపోయి వచ్చారు’
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా తుళ్లూరులో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తుళ్లూరు మండలంలోని శాకమూరులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మరిచారన్నారు. దళిత నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మూడేళ్లుగా చర్యలేవి? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో బాబు అడ్డంగా దొరకడం వల్లే ఏపీ ప్రజల హక్కులను పణంగా పెట్టి విజయవాడకు పారిపోయివచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతో లాలూచీ పడి ఏపీ నీటి హక్కులను రాసిచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి చట్టం, రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఓటుకు నోట్లు కేసు విచారణను నిష్పక్షపాతంగా చేయాలని సూచించారు. గత మూడేళ్లుగా ఈ కేసులో చర్యలు లేవంటే.. ఇక సామాన్యునికి ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో చంద్రబాబుపై చాలా అవినీతి ఆరోపణలొచ్చాయని, కానీ ఏ ఒక్క అంశంపై విచారణ చేయించుకోలేదన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ప్రజలు ఆలోచన చేయాలని తెలిపారు. బాబుకు పరిపాలనపై పట్టు లేనందునే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలకు మహిళలు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేవని పేర్కొన్నారు. -
తుళ్లూరులో ఉద్రిక్తత.. నేతల అరెస్టు..
సాక్షి, గుంటూరు : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటు ఆలస్యంపై మంగళవారం వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. తుళ్లూరు మండలం శాకమూరులో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పార్టీ ఇచ్చిన హామీని పట్టించుకోనందుకు నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు మౌనదీక్షకు సిద్ధమయ్యారు. ఈ మౌనదీక్షను అడ్డుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మౌనదీక్షకు వెళుతున్న నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాక శాకమూరులో నాగార్జున సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉద్దండరాయునిపాలెం ఉద్రిక్తత జిల్లాలోని తుళ్లూరు మండలం ఉద్దండ రాయునిపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాపట్ల పార్లమెంట్ నియోజక వర్గ సమన్వయకర్త సురేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శాకమూరు స్మృతివనం వద్దకు వెళ్లకుండా హోస్ అరెస్టు చేశారు. అంతేకాక తాడికొండ సమన్వయం కర్త క్రిస్టియానాను తెనాలిలో హౌస్ అరెస్టు చేశారు. శాకమూరు స్మృతివనం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ
సాక్షి, కాకినాడ : సీఎం చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ నుంచి మహారాష్ట్రకు దళితుల కోసం ఉచితంగా ప్రత్యేక రైళ్ళు నడపాలని ఆయన కోరారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పుట్టిన గ్రామమైన మహారాష్ట్రలోని మౌహంను జయంతి సందర్భంగా వారు దర్శించుకుంటారు. అంతేకాక ప్రతి జిల్లా నుంచి కనీసం 30 బోగిలు ఉన్న రైళ్ళను ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నడపాలని ముద్రగడ అన్నారు. రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయాలని మీ కడుపు నుంచి కాకపోయినా.. పెదాల నుంచి వచ్చినందుకు సంతోషమని ముద్రగడ అన్నారు. గత కొద్ది రోజులగా స్మృతివనం ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
కేశనకుర్రుపాలెంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
ఐ.పోలవరం : గుర్తుతెలియని దుండగులు కేశనకుర్రుపాలెం సంత మార్కెట్ సెంటర్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడినట్టు గురువారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు మండలంలోని దళిత నేతలకు, ప్రజలకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పెద్ద ఎత్తులో చేరుకున్న దళిత నాయకులు రహదారులపై బైఠాయించి ధర్నా చేశారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, విగ్రహం ఉన్న స్థానే నిలువెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని, ఈ స్థలానికి పంచాయతీ తీర్మానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సంఘటన స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించి దళిత సంఘాల నేతలతో చర్యలు జరిపారు. దోషులను త్వరిత గతిన పట్టుకోవాలని పోలీసులకు సూచించారు. ధ్వంసమైన విగ్రహం స్థానే పంచాయతీ తీర్మానం చేసి కాంస్య విగ్రహం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ సతీష్‌కుమార్, భూపతిరాజు సుదర్శనబాబు, మండల కన్వీనర్ పిన్నంరాజు వెంకటపతిరాజు తదితరులు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పొన్నాడ మాట్లాడుతూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని, విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘ జిల్లా అధ్యక్షుడు రేవు అప్పలస్వామి, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కాశి శ్రీహరి, కాశి పరివాజ్ కుమార్, జనిపెల్ల విప్లవ్‌కుమార్, మోకా రవి, దుక్కిపాటి సత్యనారాయణ, ఎం.టి.ప్రసాద్, తదితరులు ఉన్నారు. డీఎస్పీ విచారణ అంబేడ్కర్ విగ్రహం ధ్వంసమైన ప్రదేశాన్ని అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ పరిశీలించి, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. జాగిలాలు కిలోమీటరు దూరంలో ఉన్న జైభీమ్ నగర్లో ఒక బావి వద్ద ఆగిపోయాయి. డీఎస్పీ మాట్లాడుతూ దోషులను తొందర్లోనే గుర్తిస్తామన్నారు. ఈయన వెంట అమలాపురం రూరల్ సీఐ దేవకుమార్, ఎస్సైలు ప్రభాకరావు, క్రాంతి కుమార్, దుర్గా శేఖర్‌రెడ్డి, భారీస్దాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పంచాయతీ తీర్మానం చేయాలని చెప్పడంతో గురువారం మధ్యాహ్నం పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనిపై సరైన స్పష్టత రాకపోవడంతో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆందోళన చేస్తున్న దళిత సంఘాలతో రాత్రి ఎమ్మెల్యే బుచ్చిబాబు చర్చలు జరిపారు. తనసొంత ఖర్చులతో శుక్రవారం విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే దోషులను కఠినంగా శిక్షించేందుకు హామీ ఇచ్చారు. దీంతో దళిత సంఘాలు ఆందోళను తాత్కాలికంగా నిలిపివేశాయి. -
కాబోయే సీఎంను.. మీ సంగతి చూస్తా
మూసాపేట: వచ్చేది మా ప్రభుత్వమే.. కాబోయే సీఎంను.. అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా అంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వైపు వేలు చూపిస్తూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆహ్వానం పంపలేదని కలెక్టర్‌పై చిందులు తొక్కారు. దీంతో కలత చెందిన కలెక్టర్ సభలో మొహం చిన్నబుచ్చుకున్నారు. కూకట్పల్లి వైజంక్షన్‌లో శనివారం నిర్వహించిన అంబేడ్కర్ జయంత్యుత్సవాల సభ ఈ వివాదానికి వేదికైంది. సభ కొనసాగుంతుండగా వేదిక వద్దకు సర్వే వచ్చారు. ఆ సమయంలో కలెక్టర్ ప్రసంగిస్తుండగా దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు నపారి చంద్రశేఖర్ స్టేజీపైకి పిలవడంతో సర్వే వెళ్లి ఆసీనులయ్యారు. కలెక్టర్ ప్రసంగం ముగియడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో మెట్రో ఎండీ మాట్లాడుతుండగా మధ్యలో సర్వే సత్యనారాయణ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. కలెక్టర్ స్పందిస్తూ ఇది అధికారిక కార్యక్రమం అని, ప్రొటోకాల్ ప్రకారం పిలిచినట్లు చెప్పారు. అధికారిక కార్యక్రమం అయితే ప్రభుత్వ పథకాలు ఎందుకు చెబుతున్నావంటూ సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంవీ రెడ్డి ప్రతిస్పందిస్తుండగానే.. ‘నో మోర్ ఆరగ్యమెంట్.. మా ప్రభుత్వం వస్తే నేనే సీఎం’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో సర్వేను మాట్లాడాల్సిందగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనకు మైక్‌ను అందించారు. సర్వే సత్యనారాయణ మైక్‌ను అందుకుంటూనే.. ‘అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. బీజేపీ దళితుల పట్ల వివక్ష చూపిస్తోందని, ఇలాగే చేస్తే దళికిస్తాన్ అని ప్రత్యేక దేశం కోరుతాం.. ఖబడ్దార్ మోదీ అని హెచ్చరిస్తుండగా.. దళిత ఐక్యవేదిక అధికార ప్రతినిధి కట్టా నర్సింగరావు కల్పించుకుని ఇది పార్టీ సమావేశం కాదని, అంబేడ్కర్ గురించి చెప్పాలని చేతులు జోడించి వేడుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కల్పించుకుని రాజకీయాలు మాట్లాడవద్దని కలెక్టర్‌కు సూచించిన మీరే రాజకీయాలు మాట్లాడితే ఎలా అంటూ సర్వేను ప్రశ్నించారు. సభను తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంపై సర్వేను ఎమ్మెల్యే నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు సైతం వేదికపైకి చేరడంతో సభ రసాభాసగా మారింది. తోపులాటలో కలెక్టర్‌కు రక్షణగా నిల్చొన్న ఆర్ఐ అశ్విన్‌కుమార్ ముక్కుకు గాయాలయ్యాయి. మైక్‌లు విరిగిపోయాయి. దీంతో డీసీపీ వెం కటేశ్వర్‌రావు, ఏసీపీ భుజంగరావు వేదికపైకి చేరుకున్న దళిత నాయకులను, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులను అదుపు చేసి వివాదం సద్దుమణిగేలా చూశారు. తనను అకారణంగా దూషించడంతో కలత చెందిన కలెక్టర్ రెండు చేతులు జోడించి సర్వేకు మొక్కి కంటతడి పెట్టుకుంటూ సభలోంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సర్వే సత్యనారాయణ నిష్క్రమించారు. అందరూ వెళ్లిపోవడంతో సభ అర్ధంతరంగా ముగిసింది. సర్వేపై కేసు నమోదు.. కేపీహెచ్‌బీ కాలనీ: ఈ ఘటనపై తహసీల్దార్ నాగరాజు ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వడ్డే ప్రసన్నకుమార్ తెలిపారు. కూకట్‌పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డితో సర్వే సత్యనారాయణ వాగ్వాదానికి దిగారని, కలెక్టర్‌కు రక్షణగా వచ్చిన తహసీల్దార్ నాగరాజు, ఆర్ఐ అశ్విన్కుమార్లపై దాడికి పాల్పడ్డారని తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘సర్వే’పై చర్యలు తీసుకోండి: రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్ కేపీహెచ్‌బీకాలనీ: మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని మేడ్చల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శనివారం సర్వే సత్యనారాయణ చర్యలను నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. కూకట్‌పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డిపై దుర్భాషలాడటం, బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆర్ఐపై అకారణంగా చేయి చేసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వే సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీపీ భుజంగరావు, సీఐ ప్రసన్నకుమార్‌లకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతంకుమార్, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు. -
పంజాబ్‌లో ఘర్షణలు
చండీగఢ్ / ఫగ్వాడా: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా పంజాబ్‌లో కపుర్తలా జిల్లాలోని ఫగ్వాడాలో ఘర్షణలు జరిగాయి. రెండు హిందూ సంస్థలు, ఓ దళిత సంఘానికి చెందిన సభ్యుల మధ్య శుక్రవారం జరిగిన ఈ గొడవలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం కపుర్తలా, జలంధర్, హోషియార్పూర్, ఎస్బీఎస్ నగర్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటలపాటు నిలిపివేసింది. తొలుత అంబేడ్కర్ సేనకు చెందిన సభ్యులు కొందరు ఫగ్వాడాలోని గౌల్ కూడలిలో అంబేడ్కర్ చిత్రమున్న బోర్డును ఏర్పాటుచేయడంతో పాటు ఆ కూడలి పేరును సంవిధాన్ చౌక్‌గా మార్చేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. దీన్ని శివసేన బాల్‌థాకరే, హిందూ సురక్షా సమితి నేతలు వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందన్నారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. -
ఘర్షణ కాదు.. సామరస్యం కావాలి
న్యూఢిల్లీ/వడోదర/మహూ (ఎంపీ): దేశంలో నేడు సామరస్యం అవసరం కానీ సంఘర్షణ కాదనీ, ప్రజలు విభజనవాద శక్తులతో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ సూచించారు. శాంతి, సౌభ్రాతృత్వాలతో ప్రజలంతా శాంతి మార్గంలో జీవించాలన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోవింద్ శనివారం మధ్యప్రదేశ్‌లోని అంబేడ్కర్ జన్మస్థలం మహూ కంటోన్మెంట్లో నివాళులర్పించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి రాష్ట్రపతి కోవిందే. మరోవైపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితిలోనూ భారత శాశ్వత మిషన్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాగా, అంబేడ్కర్ వారసత్వాన్ని బీజేపీ చెరిపేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఓవైపు బీజేపీ, ఆరెస్సెస్‌లు దళిత వ్యతిరేక భావాలతో ఉంటే మరోవైపు మోదీ చిత్తశుద్ధి లేకుండా కేవలం నోటిమాటగా అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు సెల్జా విమర్శించారు. రాజ్యాంగాన్ని రాసే మహత్తర బాధ్యతను అంబేడ్కర్‌కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేననీ ఆమె అన్నారు. మేనకా గాంధీకి చేదు అనుభవం గుజరాత్‌లోని వడోదరలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం మిగిలింది. బీజేపీ నేతలు అక్కడకు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేయడంతో వాతావరణం కలుషితమైందంటూ దళిత నాయకులు అంబేడ్కర్ విగ్రహాన్ని పాలు, నీళ్లతో కడిగారు. మేనక కన్నా మందుగా తాము వచ్చామనీ, విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ముందుగా తమనే అనుమతించాలంటూ దళిత నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
దళిత పారిశ్రామికవేత్తలకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శనివారం రవీంద్రభారతిలో జరిగిన దళిత పారిశ్రామికవేత్తల అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు ఆయన అవార్డులు అందించారు. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) పలు డిమాండ్లను మంత్రి ముందుంచింది. గతేడాది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో భాగంగా రూ.100 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.200 కోట్లకు పెంచామని మంత్రి చెప్పారు. డిక్కి ప్రతిపాదనలపై 15 రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అవార్డులు అందుకున్న వారు.. తయారీరంగం: దాసరి అరుణ, మోక్ష మేరీ, కె.గోవిందరావు, ఎల్.ప్రకాశ్ సేవారంగం: కేవీ స్నేహలత, మంచాల శ్రీకాంత్, పంద సొలొమాన్ వివేక్, ఎన్.వినోద్‌గాంధీ మహిళా పారిశ్రామికవేత్తలు: సుశీల, భుక్యా సరోజిని -
హక్కుల కోసం నక్సల్స్‌లో చేరొద్దు
బాబాసాహెబ్ మనకు రాజ్యాంగాన్నిఇచ్చారు. మీ హక్కులను కాపాడేలా భరోసానిచ్చారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు తుపాకీ మోయాల్సిన పనిలేదు. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఉద్యమాన్ని నడుపుతున్న వారు మీలో ఒకరు కాదు. ఆ నాయకులంతా భద్రంగా ఉంటూ.. మీ పిల్లలనుబలి చేస్తున్నారు. జంగాలా (బీజాపూర్): సమాజంలోని వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణ కోసం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్.. రాజ్యాంగంలో ప్రత్యేకాంశాలను జోడించారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల వారు తమ హక్కులను పొందటానికి అంబేడ్కరే కారణమన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం కారణంగానే తను ఈ స్థాయికి ఎదిగినట్లు మోదీ తెలిపారు. ‘సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన ఓ పేదరాలి కుమారుడు.. ప్రధాని కావటం నిజంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణంగానే సాధ్యమైంది’ అని ప్రధాని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లా జంగాలాలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని అంబేడ్కర్ జయంతి సందర్భంగా మోదీ ప్రారంభించారు. ‘అంబేడ్కర్ విదేశాల్లో గొప్ప చదువు చదివారు. దీని కారణంగా ఏదో ఓ అభివృద్ధి చెందిన దేశంలో స్థిరపడి.. దర్జాగా బతికేసేందుకు అవకాశం ఉంది. కానీ అలా చేయలేదు. స్వదేశానికి తిరిగొచ్చి.. దళితుల జీవితాలను ఉద్ధరించేందుకు తన జీవితాన్నే అంకితం చేశారు. అంబేడ్కర్ కారణంగానే.. నేడు దళితులు తమ హక్కులను పొందుతూ గౌరవంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం కూడా వారి ఆకాంక్షలను పూర్తి చేసేందుకు పనిచేస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. యువతీ, యువకులు తమ హక్కులను కాపాడుకునేందుకు నక్సలిజంలో చేరొద్దని ఆయన సూచించార. అంబేడ్కర్ చూపిన బాటలో.. మావోయిస్టుల కారణంగానే వీరి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుబడిందన్నారు. హక్కుల సాధనకు యువకులు నక్సలిజం వైపు అడుగులు వేస్తున్నారని.. అది సరైన మార్గం కాదని మోదీ తెలిపారు. ‘బాబాసాహెబ్ మనకు రాజ్యాంగాన్నిచ్చారు. మీ హక్కులను కాపాడేలా ఆయన భరోసా ఇచ్చారు. ఈ భరోసాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. మీరు (యువతీ, యువకులు) తుపాకీ మోయాల్సిన పనిలేదు. అది మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఉద్యమాన్ని నడుపుతున్న వారు ఎక్కడినుంచో వచ్చారు. వారు మీలో ఒకరు కాదు. అడవుల్లో ఆ నాయకులంతా భద్రంగా ఉంటూ.. మీ పిల్లలను బలిపశువులు చేస్తున్నారు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే.. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పీహెచ్‌సీల దశ మారుస్తాం.. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా.. లక్షా 50వేల గ్రామాల్లోని ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయి, సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో పనిచేయనున్నారు. 2022 కల్లా పీహెచ్‌సీలను ఆరోగ్య, వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తామని మోదీ తెలిపారు. ఈ పథకంలో భాగంగా జంగాలాలో తొలి పీహెచ్‌సీని మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో దేశంలోని 115 వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. ‘పాత మార్గాల్లో వెళ్తూ.. కొత్త లక్ష్యాలను చేరుకోవటం కష్టం. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు కొత్త అభివృద్ధి నమూనాలను సిద్ధం చేస్తోంది’ అని ప్రధాని తెలిపారు. శనివారం ప్రారంభించిన మరో పథకం ‘గ్రామ్ స్వరాజ్ యోజన’ ద్వారా పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు, సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చరణ్ పాదుకా పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఓ గిరిజన మహిళకు చెప్పులు బహూకరించి తొడుగుతున్న మోదీ -
అంబేడ్కర్తోనే దేశం ముందడుగు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ దూరదృష్టి, దార్శనికత వల్లే ఇవాళ దేశం సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేస్తున్నదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. శనివారం అంబే డ్కర్ జయంతి పురస్కరించుకుని సీఎం, అంబేడ్కర్ సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని, భవిష్యత్ మార్గనిర్దేశనం చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలకు, భారత్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి, భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. -
ప.గో.జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న హరీష్
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్నను మంత్రి హరీశ్ రావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో నిర్వహించదలిచిన పలు అభివృద్ధి పనులకు హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి హరీశ్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. -
యోగికి దళిత మిత్ర వద్దన్నందుకు అరెస్ట్
లక్నో : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ మహాసభ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు దళిత మిత్ర అవార్డు అందజేసింది. దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న యోగికి ఈ అవార్డు ఇవ్వడమేమిటంటూ నిరసన వ్యక్తం చేసిన దళిత కార్యకర్తలు ఎస్ఆర్ దారాపురి, హరీశ్ చంద్ర, గజోదర్ ప్రసాద్, చౌరాసియాలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు కూడా అంబేద్కర్ మహాసభ సభ్యులు కావడం గమనార్హం. ఏ ప్రాతిపదికన అవార్డు ఇచ్చారు..? యోగి ఆదిత్యనాథ్‌కు దళిత మిత్ర అవార్డు అందజేయడం వల్ల అంబేద్కర్ మహాసభ సభ్యుల మధ్య విభేదాలు చెలరేగాయి. సభ్యులందరినీ సంప్రదించకుండానే అధ్యక్షుడు లాల్జీ నిర్మల్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ ఐపీఎస్ అధికారి, మహాసభ సభ్యుడు ఎస్ఆర్ దారాపురి ఆరోపించారు. యోగి ఈ అవార్డుకు అనర్హులంటూ మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేందుకే లాల్జీ నిర్మల్.. యోగిని ఈ అవార్డుకు ఎంపిక చేశారని ఆరోపణలు చేశారు. 30 కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లు : యోగి గవర్నర్ రామ్‌నాయక్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం యోగి ప్రసంగించారు. మోదీ సర్కారు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. 30 కోట్ల మంది దళితులకు బ్యాంకు అకౌంట్లు తెరిచే అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ ఆశయాలను పాటిస్తూ ఆయన గౌరవాన్ని పెంపొందిస్తున్న ఏకైక వ్యక్తి మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ మహాసభ అధ్యక్షుడు లాల్జీ నిర్మల్ మాట్లాడుతూ..దళితుల కోసం యోగి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. -
25 ఎంపీ సీట్లిస్తే హోదా తెస్తా..
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?’’ అని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తననుతాను దళితోద్ధారకుడిగా ప్రకటించుకునే ప్రయత్నం చేశారాయన. శనివారం అమరావతిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో మాట్లాడిన సీఎం.. ఏపీకి ప్రత్యేక హోదాపైనా మరోసారి మాటమార్చారు. అప్పుడు రాజ్యాంగమే చెడ్డదవుతుంది : గడిచిన నాలుగేళ్లుగా రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలన సాగిస్తోన్న చంద్రబాబు నాయుడు అదే రాజ్యాంగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మంచిదే కావచ్చు, కానీ దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లతై అంబేద్కర్ రాజ్యాంగమే చెడ్డదవుతుంది’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లోగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని చేస్తామని, దళితుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. 25 ఎంపీ సీట్లిస్తే హోదా తెస్తా : ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఇన్నాళ్లూ చేసినవన్నీ డ్రామాలేనని తేలిపోయింది. ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిదిపోయి.. ‘‘వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తా’’ అని వ్యాఖ్యానించడం ద్వారా హోదా విషయంలో బాబు మరో యూటర్న్ తీసుకున్నట్లైంది. 2019ఎన్నికల తర్వాత టీడీపీ ఎవరికి మద్దతిస్తే వారే కేంద్రంలో అధికారంలోకి వస్తారని, ఆ విధంగా ఢిల్లీలో తాను చక్రం తిప్పుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మోదీ తరహాలో బాబు ఒక్కరోజు దీక్ష : విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకున్నందుకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన తరహాలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ‘‘పార్లమెంట్ జరగనీయకుండా చేసిన మోదీనే మళ్లీ దీక్ష చేశారు. ఇదెక్కడి విడ్డూరమో నాకు అర్థం కాలేదు. కేంద్రం వైఖరికి నిరసనగా నేనూ ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తా. ఈ నెల 20న నా పుట్టినరోజునాడే దీక్షకు కూర్చుకుంటా. నా దీక్షకు అందరి సహకారం కావాలి’’ అని సీఎం పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
ఒంగోలులో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
తూ.గో.జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
వెలుగు దివిటీ
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి..
సాక్షి, అమరావతి, హైదరాబాద్ : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకున్నాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని కాలరాశాయని పేర్కొంటూ.. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలను అందించారు. చంద్రబాబు సంతలో గొర్రెల్ని, బర్రెల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొని రాజ్యాంగాన్ని అవహేళన చేశారనీ, అందుకనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకుంటున్నామని కరుణాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై గల అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీసీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని భవిష్యత్తును నిర్దేశించిన మహామూర్తి అంబేద్కర్ అని కొనియాడారు.ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు గారుస్తూ సుప్రీం తీర్పు ఇచ్చినప్పుడు నోరు మెదపని ప్రధాని మోదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మొసలి కన్నీరు కారుస్తున్నారని రాఘవులు ఎద్దేవా చేశారు. -
‘రాజకీయాల్లోనే కుల, మత జబ్బులు’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రాన్ని పాటించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాబా సాహెబ్ కుల నిర్మూలన వ్యవస్థ కోసం పోరాడి.. బౌద్ధాన్ని స్వీకరించారన్నారు. అంబేద్కర్ అందరి వాడని.. ఆయనను కొందరి వాడిలా చేయడం జాతికి మంచిది కాదన్నారు. దేశంలో ప్రజల మధ్య ఎన్ని వైరుధ్యాలు ఉన్నా, అందరూ కలిసి ఉన్నారంటే దానికి కారణం మన రాజ్యాంగమని తెలిపారు. కుల, మత, పేద, ధనిక అనే వివక్ష లేని సమసమజాన్ని ఏర్పరచుకోవడమే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. అన్నీ కులాలను, ప్రతీ పేదవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వాదన్నారు. అంబేద్కర్ ఓవర్సెస్ స్కాలర్ షిప్ ద్వారా 25 లక్షల రూపాయలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీసర్కార్ అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే వ్యక్తుల్లో కులం, మతం అనే జబ్బులొస్తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
‘కేసీఆర్‌కు ఆ తీరిక కూడా లేదు’
సాక్షి, నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నివాళర్పించడానికి కూడా తీరిక లేదు. అన్ని రాష్ట్రాల సీఎంలు జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తుంటే.. కేసీఆర్ మాత్రం అహంకారంతో ప్రగతి భవన్లో కూర్చున్నాడు. కేసీఆర్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. -
నెల్లూరులో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
భీమ్ యాప్: మరోసారి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్లు అందించనుంది. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్ చేసిన ప్రభుత్వ యాప్ భీమ్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ అఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా గూగుల్ తేజ్, ఫ్లిప్‌కార్ట్ ఫోన్ పే మార్కెటింగ్ వ్యూహాలను ఫాలో అవుతూ ఇపుడు భీమ్ యాప్ ద్వారా కూడా ఆఫర్ల వెల్లువ కురిపించేందుకు తద్వారా వినియోగదారులను భారీగా పెంచేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఆగస్టులో భీమ్ లావాదేవీలు 40.5 శాతం ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అది 5.75 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన భీమ్ యాప్ ద్వారా అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అమలు చేయనుంది. సుమారు రూ.900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. ఫోన్‌పే, తేజ్, పేటీఎం నమూనాలను పరిశీలించాం. క్యాష్‌బ్యాక్, ప్రోత్సాహకాలు ప్రకటించినప్పుడల్లా లావాదేవీలు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. ఇదొక ప్రవర్తనా మార్పు’ అని దీనిపై పనిచేస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలపై దృష్టిపెట్టిన కేంద్రం గూగుల్ తేజ్, ఫోన్‌పే లావాదేవీలు పెరగడం, ఇటు భీమ్ యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్‌లో లావాదేవీలు గణనీయంగా(సింగిల్ డిజిట్‌కు) పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఆఫర్‌తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భీమ్ యాప్ ద్వారా తొలి లావాదేవీ జరిపినప్పుడు (కనీస మొత్తం రూ.100కి) రూ.51 క్యాష్ బ్యాక్ లభ్యం. ఇలా వినియోగదారులకు గరిష్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదే వ్యాపారులకయితే మొత్తంగా ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు. మరిన్ని వివరాలు అధికారిక వెబ్సైట్లో లభ్యం. కాగా భీమ్ యాప్ ద్వారా ఆఫర్లను మొదటిసారి కాదు. గత ఏడాది కూడా, ప్రభుత్వం రెండు కొత్త పథకాలను లాంచ్ చేసింది. భీమ్ రిఫరల్ బోనస్ స్కీమ్, భీమ్ మర్చంట్ క్యాష్ బ్యాక్ స్కీమ్ లను ప్రకటించి.. బహుమతులను అందించిన సంగతి తెలిసిందే. -
శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి
-
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
-
దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను ‘విశ్వ మానవుడి’గా అభివర్ణించారు. పీడిత ప్రజలు తమ సమస్యలు లేవనెత్తేందుకు, హక్కులను సాధించుకునేందుకు అంబేద్కర్ వారికి గొంతుక నిచ్చాడని మోదీ పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో, మేధో సంపత్తితో అంబేద్కర్ పేదలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేశారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. వారి సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. -
అసలు సిసలు స్త్రీవాది
‘మహిళల విముక్తే మానవ జాతి విముక్తి’ అంటారు అంబేడ్కర్. రాజకీయ, సామాజిక ఆర్థిక అసమానతలో పాటు లింగ వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తోందనీ స్త్రీపురుష సమానత్వం మాత్రమే సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలదనీ ఆయన మనసా వాచా నమ్మారు. అసమానతలను తరిమికొట్టేందుకు రాజ్యాంగ రచనను ఒక సమున్నతావకాశంగా అంబేడ్కర్ భావించారు. ఆర్టికల్ 14 నుంచి 16 వరకు స్త్రీపురుష సమానత్వాంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతేకాకుండా స్త్రీల రక్షణకు ఉద్దేశించిన అనేక చట్టాలకు ఆయన రూపకల్పన చేశారు. అందులో భాగమే.. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు న్యాయ శాఖా మంత్రి హోదాలో అంబేడ్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్. భారత స్వతంత్య్రానంతర తొలి న్యాయ శాఖా మంత్రి అయిన అంబేడ్కర్.. వివాహం, విడాకులు, సంపద హక్కుతో పాటు సంరక్షణ హక్కులకు హామీ యిచ్చే హిందూ కోడ్ బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా స్త్రీల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను ఆశించారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందకుండా నెహ్రూ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తిరస్కరిస్తూ న్యాయ శాఖా మంత్రి పదవినే తృణప్రాయంగా వదులుకున్న ఘనత డాక్టర్. బిఆర్ అంబేడ్కర్‌కే దక్కుతుంది. మహిళా చట్టాలకు ఆద్యుడు స్త్రీజనోద్ధరణకోసం అంబేడ్కర్ అనేక చట్టాలకు రూపకల్పన చేశారు. ఉమన్ లేబర్ వెల్ఫేర్ ఫండ్, ఉమన్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్ ఫర్ వుమెన్ లేబర్ బిల్, లీవ్ బెనిఫిట్ టు పీస్ వర్కర్స్, రివిజన్ ఆఫ్ స్కేల్ ఆఫ్ పే ఫర్ ఎంప్లాయీస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బ్యాన్ ఆన్ వుమెన్ వర్కింగ్ అండర్‌గ్రౌండ్ మైన్స్, మెయింటెనెన్స్ అలవెన్స్ ఫ్రం హస్బెండ్స్ ఆన్ గెటింగ్ లీగల్లీ సెపరేషన్, వేతనాల్లో లింగ వివక్ష పాటించకుండా సమాన పనికి సమాన వేతనం.. ఇలాంటì చట్టాలన్నిటికీ అంబేడ్కరే ఆద్యుడు. ప్రధానంగా మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ రూపకల్పనలో అంబేడ్కర్ కృషి అత్యంత కీలకమైంది. 1929లో ముంబై అసెంబ్లీలో దేశంలోనే తొలిసారిగా మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ ఆమోదం పొందింది. ఆ తరువాతే 1934లో మద్రాసు లెజిస్లేచర్ కౌన్సిల్ మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్‌ని ఆమోదింపజేసుకుంది. 1942– 46 మధ్యన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ‘మైన్స్ మెటర్నిటీ బెనిఫిట్స్ బిల్ ఫర్ ఉమెన్’ బిల్లుని తీసుకురావడంలో కూడా ఆయన పాత్రే కీలకం. ఈ చట్టమే గనుల్లో పనిచేసే మహిళలకు 8 వారాల పాటు జీతంతో కూడిన సెలవుని ప్రసాదించింది. అనంతరం 1961లో ‘కామన్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్’తో కేంద్రం ఈ చట్టాన్ని దేశంమొత్తానికీ వర్తింపజేసింది. సమాన పనికి సమాన వేతనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(డి) డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్‌లోని నాల్గవ భాగం సమాన పనికి సమాన వేతనాన్ని ఖరారు చేస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ధనికులకు, ఉన్నత వర్గాల వారికీ, భూస్వాములకూ, పన్నులు కట్టేవారికీ మాత్రమే ఉన్న ఓటు హక్కుని పురుషులందరితో పాటు స్త్రీలకు సైతం వర్తింపజేయాలని చెప్పి స్త్రీల రాజకీయ హక్కుకు పునాది వేసిన స్త్రీజన పక్షపాతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. – అత్తలూరి అరుణ -
కాషాయం నుంచి నీలంలోకి..
సాక్షి, లక్నో : యూపీలోని బదౌన్‌లో దుండగులు కూలగొట్టిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. అయితే ఈ విగ్రహంలో అంబేడ్కర్ తరచూ కనిపించే సూట్లో కాకుండా కాషాయ రంగులో ఉన్న ప్రిన్స్ సూట్లో కనిపిస్తుండటం గమనార్హం. అంబేడ్కర్ విగ్రహానికి కాషాయం పులమడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఎస్పీ నేత హిమేంద్ర గౌతం కాషాయం రంగు మార్చి నీలం రంగు వేయించారు. వివరాల్లోకి వెళితే.. బదౌన్ ప్రాంతంలోని దగ్రాయ గ్రామంలో ఈనెల ఏడున కొందరు దుండగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో బదౌన్ ప్రాంతం ఆందోళనలతో హోరెత్తగా స్పందించిన అధికార యంత్రాంగం ఆగ్రా నుంచి ఆఘమేఘాలపై మరో విగ్రహాన్ని తెప్పించి అదే ప్రాంతంలో ప్రతిష్టించింది. అయితే కాషాయ రంగులో విగ్రహం రూపొందించడం పట్ల అధికారులను ప్రశ్నించగా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఈ వ్యవహారంలో తమ పార్టీ ప్రమేయం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ స్వరూప్ పట్నాయక్ అన్నారు. ‘ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. విగ్రహంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు..కాషాయ వర్ణమైతే భారత సంస్కృతికి ప్రతీక’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మార్చిలో సిద్ధార్ధనగర్, అలహాబాద్‌లో 24 గంటల వ్యవధిలోనే రెండు అంబేడ్కర్ విగ్రహాలను దుండగులు కూల్చివేశారు. ఏమైనా కొద్ది గంటల్లోనే అంబేడ్కర్ విగ్రహం నీలం నుంచి కాషాయం..కాషాయంలోంచి నీలంలోకి మారింది. -
అంబేద్కర్ కి గౌరవం.. మోదీకి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గట్టి కౌంటర్ ఇచ్చారు. అంబేద్కర్ ను గౌరవించే విషయంలో బీజేపీ అవలంభిస్తున్న విధానాలను చూడండంటూ శుక్రవారం ఆయన తన ట్విటర్లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరిగిన పలు ఘటనల్లో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాల తాలుకూ ఫోటోలవి. ‘బీజేపీ-ఆర్ఎస్ఎస్ పాలిత దేశంలో అంబేద్కర్ కు దక్కిన గౌరవాన్ని చూడండి. దేశంలోని దళితులను, అంబేద్కర్ ను బీజేపీ-ఆర్ఎస్ఎస్లు ఎన్నటికీ గౌరవించవు. రాజ్యాంగపితను గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్న మోదీ.. ముందు ఆయన(అంబేద్కర్) విగ్రహాలను ధ్వంసానికి గురికాకుండా చూసుకోవాలి' అని రాహుల్ హితవు పలికారు. కాగా, బుధవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశాన్నేలిన ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు సరైన గౌరవాన్ని ఇవ్వలేకపోయానని.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. मोदीजी, जिस दमनकारी विचारधारा से आप आते हैं वो दलितों और बाबासाहेब का सम्मान कभी कर ही नहीं सकती| भाजपा/RSS विचारधारा द्वारा बाबासाहेब के सम्मान के कुछ उदाहरण... pic.twitter.com/7QXCKUoGMe — Rahul Gandhi (@RahulGandhi) April 6, 2018 -
ఓయూలో అర్ధరాత్రి అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని న్యాయ కళాశాల ఎదుట బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన్నట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. దీనిపై గురువారం ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డిలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ, ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి ఏర్పాటు చేయడాన్ని అధికారులు తప్పుపట్టినట్లు తెలిపారు. దీనిపై విచారణ కమిటీని నియమించినట్లు చెప్పారు. ‘నేనే ఆవిష్కరించాను..’ ఓయూ న్యాయ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తానే ఆవిష్కరించినట్లు బషీర్‌బాగ్ పీజీ న్యాయ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు ఐదేళ్లుగా కళాశాల ఎదుట అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు న్నా ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఓయూలో ఈ నెల 14న అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓయూను స్థాపించిన 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని, ఆయన విగ్రహాన్ని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేయాలని, అంబేడ్కర్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధ్యాయన కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
యూపీలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేత
మీరట్ : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో బీజేపీ గెలుపు అనంతరం మొదలైన ధ్వంసరచన దేశమంతా విస్తరిస్తున్నది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా మనావాలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతకు గురైంది. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కొందరు విగ్రహం తలను, విరగొట్టి కిందపడేసి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన దళితులు బుధవారం ఉదయం నుంచి ఆందోళనలకు దిగారు. మవానా రహదారిపై బైఠాయించి, విద్వేషకారులకు వ్యతికేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అడ్డకునే సమయంలో కొంత ఉద్రిక్తత తలెత్తింది. గంటలపాటు రాస్తారోకో చేసిన దళితులు.. నిందితులను పట్టుకునేదాకా ఆందోళన విరమించబోయేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉపశమన చర్యగా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. విగ్రహం కూల్చివేతకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ప్రస్తుతం మనావాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి హింసాయుత ఘటనలు నమోదుకాలేదని పోలీసులు తెలిపారు. మొన్న లెనిన్, నిన్న పెరియార్, ముఖర్జీ.. ఇప్పుడు అంబేద్కర్ : త్రిపురలో బీజేపీ వర్గీయులు లెనిన్ విగ్రహాన్ని కూల్చిన తర్వాత ఆ పార్టీకే చెందిన తమిళనాడు నేతలు ‘ఇక పెరియార్ విగ్రహాలు కూల్చుతాం’అని ప్రకటన చేశారు. ఆ మేరకు వేలూరు సహా కొన్ని జిల్లాల్లో పెరియార్ విగ్రహాలు ధ్వసమయ్యాయి. త్రిపుర ఘటకు ప్రతీకారంగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలిసిందే. విగ్రహాల ధ్వంసాలు కూడదంటూ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఒక ప్రకటన చేశారు. -
‘రైతు సమన్వయ’ సదస్సుకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదికగా 16 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల సమన్వయ సమితులు పది వేల వరకు, రైతులు, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయాధికారులు, హార్టికల్చర్ సిబ్బంది, కో ఆపరేటివ్ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ప్రాంతీయ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నారు. ఈనెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో జరిగే ప్రాంతీయ రైతు సమన్వయ సమితి సదస్సుకు హాజరు కానుండగా, ఏర్పాట్లను శుక్రవారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతుల భవిష్యత్తు మార్చడానికి ముఖ్యమంత్రి ఆలోచన విధానమే గ్రామం, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు అని అన్నారు. ఎకరానికి రెండు పంటలకు ఎనిమిది వేలు ఇవ్వడం, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం దేశానికి ఆదర్శమని మంత్రి తెలిపారు. వ్యవసాయం అంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలని వలసలు తిరిగి వచ్చే విధంగా పంట వేసిన దగ్గర నుంచి ఆమ్మే వరకు అండగా ఉంటామని మంత్రి అన్నారు. ఈ సదస్సు ఉదయం 10.30 గంటల మొదలైన మొదట ముఖ్యమంత్రి సందేశానంతరం మధ్యాహ్న భోజన విరామ సమయం అనంతరం రైతులతో నేరుగా సుదీర్ఘమైన చర్చ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే వ్యవసాయాధికారులు రైతులు గ్రీన్, పింక్ కలర్ పేపర్లు ఇచ్చిన గ్రీన్ కలర్ సలహాలు, సూచనలు, పింక్ కలర్ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఇవ్వనున్నట్లు చెప్పారు. సదస్సుకు వచ్చి గ్రామాలకు వెళ్లే రైతులు నూతనోత్సాహంతో వ్యవసాయం చేసేందుకు తోడ్పడుతుందని మంత్రి అన్నారు. అధికారులతో సమీక్ష.. పలు సూచనలు.. ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అంబేద్కర్ స్టేడియం ఆవరణలో అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను, బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ ఈఈ రాఘవచారిని ఆదేశించారు. మైకులో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీరును ఆదేశించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందునా రైతులకు మంచినీటి సౌకర్యం ఏర్పాట్లు చేయాలన్నారు. కరీంనగర్‌కు వచ్చే అన్ని దారుల్లో స్వాగత తోరణాలు కొబ్బరి మండలు, అరటి ఆకులతో తోరణాలను బ్రహ్మాండంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కోడూరి రవీందర్రావు, జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్వో అయేషామస్రత్‌ఖానమ్, ఆర్డీఓ బి.రాజాగౌడ్, ఆర్అండ్బీ ఈఈ, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, మా ర్కెటింగ్ శాఖ ఉప సంచాలకులు పద్మావతి, కరీంనగర్ ఏసీపీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరమ్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్ చాంబర్ ఆఫ్ కామర్స్(డాక్) పేరుతో జాతీయ స్థాయిలో ఒక నూతన వేదిక ఏర్పాటైంది. ఢిల్లీలో మంగళవారం డాక్ ప్రారంభసభలో డాక్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి.వివేకానంద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి దళిత పారిశ్రామిక వేత్తలు, ఎస్సీ, ఎస్టీ లెజిస్లేటర్లు, పార్లమెంటేరియన్ల ఫోరం సభ్యులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేయడం ఈ చాంబర్ ఉద్దేశమని వివేక్ మీడియాకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల అభివృద్ధికి పథకాలు అమలుచేస్తున్నా సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఉపయోగించుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ చాంబర్ ద్వారా ఔత్సాహిక దళిత పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇచ్చి, ప్రభుత్వాలతో చర్చించి దళితుల అభివృద్ధికి కృషిచేయనున్నట్టు తెలిపారు. -
‘అంబేడ్కర్’పై నేడు తుది నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సచివాలయం పక్కన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అంబేడ్కర్ విగ్రహ కమిటీ తుదిరూపం ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో అంబేడ్కర్ విగ్రహ కమిటీ చైర్మన్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశం జరిగింది. కమిటీ రూపొందించిన ప్రతిపాదనలతో బుధవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమై అంతిమ నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. దేశ విదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైన్ అసోసియేట్స్ రూపొందించిన నమూనాలు, విగ్రహం నెలకొల్పనున్న ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన భవన సముదాయం, పార్క్‌కు ఆమోదం తెలిపింది. ఎటువంటి విగ్రహం పెట్టాలన్న నిర్ణయం మాత్రం కేసీఆర్‌కు వదిలి పెట్టాలని కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ ప్రాంగణంలోని విగ్రహ నమూనాతోపాటు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న విగ్రహం, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు చెందిన శిల్పి బోళ్ళ శ్రీనివాసరెడ్డి రూపొందించినది కలిపి మూడు విగ్రహాల ప్రతిపాదనలను కేసీఆర్ ముందు ఉంచాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, బుద్ధవనం అభివృద్ధి చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్డేడియంలో నవంబర్ 1 నుంచి 10వ తేదీవరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాటీ జరగనుంది. చెన్నైలోని హెడ్‌క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు (10 పాత జిల్లాల ప్రకారం) చెందిన 4,9078 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గుంటూరులో జరిగిన ర్యాలీ నుంచి 5,895 మంది అభ్యర్థులతో పాటు మొత్తం 54,973 మంది అభ్యర్థులు ర్యాలీకి హాజరుకానున్నారు. కరీంనగర్ కేంద్రంలోని అంబేవడ్కర్ స్టేడియంలో నియామక ప్రక్రియ జరుగనుంది. సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ క్లర్క్/ ఎస్కెటీ, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థుల కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయనుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి సోమవారం ర్యాలీ ఏర్పాట్లను సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్ ర్యాలీ నియామకాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు చెప్పారు. -
దళిత నేతల అరెస్ట్
భీమవరం : అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ విమర్శించారు. గరగపర్రు బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ శనివారం చలో గరగపర్రు కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పరిహారం అందని 32 మందికి ఆర్థిక సహాయం అందించకపోతే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని రాజేష్ హెచ్చరించారు. గరగపర్రు గ్రామంలో సెక్షన్ 144 అమలులో ఉండగా ధిక్కరించిన నేరానికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, తానేటి పుష్పరాజు, పల్లపు వేణు, దారం సురేష్, తోటే సుందరంతో సహా 25 మందిని అరెస్ట్ చేసినట్లు పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు చెప్పారు. -
అంబేద్కర్ విగ్రహానికి అవమానం
తాళ్లరేవు: రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది. అర్ధరాత్రి వేళ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టరు బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో ఉన్న విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసినట్లు స్ధానికులు గుర్తించారు. దీంతో దళిత సంఘాలు, నేతలు 216 జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో యానాం-కాకినాడ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో చర్చిస్తున్నారు. నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. -
దేశానికే తలమానికం
అంబేడ్కర్ విగ్రహ స్థాపనపై మంత్రి జగదీశ్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ విగ్రహ స్థాపన దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దా లని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ విగ్రహ స్థాపన తెలంగాణకి ఓ రోల్ మోడల్ కావాలని ఆయన ఆకాంక్షిం చారు. శుక్రవారం సచివాలయంలో జగదీశ్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన విగ్రహ కమిటీ సభ్యులు డిజేయిన్ స్టూడియో ప్రతినిధులు రూపొందించిన నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. నమూనా లో కొన్ని మార్పులు చేయడంతో పాటు అంతిమంగా ఎలా ఉండాలి, ఎంత స్థలంలో నిర్మిం చాలి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం అభివృద్ధి చైర్మన్ మల్లె్లపల్లి లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, వేముల వీరేశం, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, రోడ్లు భవనాలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కరుణాకర్, జేఎన్టీయూ శిల్పి శ్రీనివాస రెడ్డి లతో పాటు ఢిల్లీకి చెందిన డిజేయిన్ స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహంపై దాడి.. నిందితుల అరెస్ట్
► సోషల్ మీడియా ద్వారా బయటకొచ్చిన ఉదంతం పహాడీషరీఫ్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని అవమానకర రీతిలో ధ్వంసం చేస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో దళిత సంఘాల నాయకులు గురువారం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం కమ్యూనిటీ హాల్‌కు గత నెల 18న బడంగ్‌పేటకు చెందిన బ్యాండ్ బృందం అనుగొందుల రాజు(19), నాదర్గుల్కు చెందిన గోడ నవీన్(19), బైండ్ల శివ(22)లతో పాటు మరి కొంత మంది వచ్చారు. వీరు హాల్లోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ అవమాన పరిచారు. ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలాపూర్‌కు చెందిన కొప్పుల సురేష్ దీన్ని గమనించి బాలాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకుడు ఇబ్రాం శేఖర్, దళిత సంఘాల నాయకులు బాలాపూర్ ఠాణా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ లేకపోవడంతో వెంటనే మీర్‌పేట ఇన్స్పెక్టర్ రంగస్వామి, పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతిపర్చేందుకు యత్నించారు. వారు మాట వినకపోవడంతో పోలీసులు వెంటనే అనుగొందుల రాజు, గోడ నవీన్‌లను అరెస్ట్ చేయడంతో ఆందోళన విరమించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. -
అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పెళ్లి
సెహోర్(మధ్యప్రదేశ్): వివాహానికయ్యే ఖర్చు భరించే స్థోమత లేక ఓ నిరుపేద జంట రాజ్యాంగ నిర్మాత విగ్రహం సాక్షిగా ఒక్కటయింది. పెళ్లి పేరుతో జరుగుతున్న ఆడంబరాలు, వృథా వ్యయాన్ని నివారించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంసెహోర్ పట్టణానికి చెందిన కల్లు జాతవ్, వైజయంతి రజోరియా అనే యువ జంటకు ఈనెల 3వ తేదీన పెళ్లి నిశ్చయమయింది. అయితే, ఇరు కుటుంబాల వారు నిరుపేదలు. వారికి పెళ్లి ఆడంబరంగా జరిపించే స్థోమత లేదు. దీంతో సామాజిక కార్యకర్తలను ఆశ్రయించారు. వారిచ్చిన సూచనల మేరకు స్థానిక పార్కులోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా నిశ్చయించిన ప్రకారమే బంధువులు, కుటుంబసభ్యులతో కలిసి పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన ఆ జంట అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహం పక్కనే బుద్ధభగవానుని చిత్రపటం ఉంచి ఏడుసార్లు ప్రదక్షిణ చేశారు. అనంతరం కల్లు జాతవ్, వైజయంతి దండలు మార్చుకున్నారు. కలకాలం అన్యోన్యంగా, ఆదర్శంగా ఉంటామని ప్రతిన చేశారు. నిరుపేద బాలికలకు సాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన’కు కూడా దరఖాస్తు చేసుకున్నామని, అయితే అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదని వారు వివరించారు. అవనసర ఖర్చులను నివారించానికే తాము ఈ విధానాన్ని వధూవరులకు వివరించి, ఆచరింపజేశామని పెళ్లికి పెద్దగా వ్యవహరించిన నరేంద్ర ఖంగ్రాలే తెలిపారు. -
హృదయాలను గెలిచిన జననేత
-
హృదయాలను గెలిచిన జననేత
- రాష్ట్ర ప్రజలను అబ్బురపరిచిన ప్రతిపక్ష నేత పరిణితి - గరగపర్రు పర్యటనలో జగన్ వ్యవహార శైలిపై హర్షాతిరేకాలు - ఎవరినీ నొప్పించకుండా శాంతి వచనాలు - సోషల్ మీడియాలోనూ ప్రశంసల వర్షం - ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారని కితాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు పర్యటనలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రదర్శించిన పరిణతి రాష్ట్ర ప్రజలను అచ్చెరువొందించింది. సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించి, వారిలో మనో స్థైర్యం పెంచేందుకు వెళ్లిన జగన్ ఎక్కడా రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయకపోవడం, పూర్తి సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం అబ్బురపరిచిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన మాట్లాడిన తీరు పార్టీలకతీతంగా ప్రజల మనసు లను దోచుకుంది. గ్రామంలో శాంతిని నెలకొల్పేం దుకు ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్ష నేత చేశారంటూ సామాజిక మాధ్య మాల్లోనూ విస్తృతంగా చర్చ జరిగింది. గరగపర్రులో బాధితులతో జగన్ మాట్లాడిన మాటలను చాలామంది ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో షేర్ చేశారు. ఎవరినీ నొప్పించకుండా ఆయన పూర్తి సంయమనంతో మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపించారు. జగన్ హిత వచనాలపై హర్షం ప్రశాంతతకు, పచ్చటి పంటలకు నెలవైన గరగపర్రులో రెండున్నర నెలలుగా వివాదాల అగ్గి రగులుతోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ గ్రామంలో రాజకీయ నాయకులు పర్యటనకు వెళితే ఏమవుతుం దోనన్న అనుమానాలు జగన్ వ్యవహార శైలితో పటాపంచలు అయ్యాయి. సాధార ణంగా ఎక్కడైనా కులపరమైన విభేదాలు తలెత్తితే అక్కడ పర్యటించిన రాజకీయ నాయకులు ఏదో ఒక వర్గం వైపు ప్రాతినిధ్యం వహించడంతో సమస్య మరింత జఠిల మయ్యేది. కానీ జగన్ అందుకు భిన్నంగా, ఈ గ్రామంలో ఇరు వర్గాల మధ్య సమస్య పరిష్కా రానికి కృషి చేసిన తీరుపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గరగపర్రులో జగన్ పర్యటన తరువాత శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అవకా శాలు ఏర్పడ్డాయని గ్రామస్థులు చెబుతున్నారు. గరగపర్రులో ఇరు వర్గాలతో జగన్ స్వయంగా మాట్లాడారు. విభేదాలను పక్కనపెట్టి, అంతా కలిసుందామంటూ ఆయన ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వంపై, అధికార టీడీపీ నేతలపై జగన్ ఎలాంటి విమర్శలు చేయలేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్లు, చెడ్డ వాళ్లు ఉంటారని, దుష్టులను పక్కన పెట్టి మిగిలిన వారితో కలిసిమెలిసి జీవించాలని హితవు చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దళితుల వద్దకు వెళ్లినప్పుడు వారు ఆయనతో చాలా చను వుగా వ్యవహరించారు. జగన్ ఎక్కడా భేషజాన్ని ప్రదర్శించకుండా వారి బిడ్డలను తన ఒళ్లోకి తీసు కుని కూర్చోబెట్టుకోవడం, పిలవగానే వారితో కలిసి భోజనం చేయడం దళితులను బాగా ఆకట్టుకుంది. ఇరు వర్గాలతో మమేకం గరగపర్రు దళితవాడలో జగన్ రాక సందర్భంగా సభా వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగన్ కటిక నేలపైనే కూర్చొని బాధిత మహిళలతో మాట్లా డారు. దాదాపు గంటన్నరపాటు వారితో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దళితే తరులను కలిసినప్పుడు కూడా వారితోపాటు మట్టిలోనే కూర్చొని వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. జగన్ తమతో సన్నిహితంగా కలిసిపోయిన తీరు గ్రామంలో ఇరు వర్గాల ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. అడుగడుగునా బ్రహ్మరథం గన్నవరం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రుకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయన్ను చూడ్డానికి భీమడోలు, ఉంగు టూరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, పిప్పర, యండగండి, కోరుకొల్లు, అత్తిలి గ్రామాల్లో అభిమా నులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది
గరగపర్రులో మీడియాతో వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: గరగపర్రు ఉదంతంలో ఇన్ని రోజులు చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే ప్రభుత్వం కదిలి నిందితులను అరెస్టులు చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత అన్నీ రాజకీయం చేస్తున్నారని అధికార పక్షం అంటోంది కదా అని ప్రశ్నించగా... ‘‘ప్రతిపక్ష నేత వస్తున్నాడు కాబట్టే న్యాయం జరిగింది. గ్రామంలో తలెత్తిన వివాదంపై ఇప్పటి వరకూ అరెస్టులు ఎందుకు చేయలేదు? సస్పెండ్లతో సరిపెట్టిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత వస్తున్నాడనే భయంతో నిందితులను అరెస్టు చేసింది. ఈ వివాదం పెద్దది కాకుండా అందరం నాలుగు అడుగులు ముందుకు వేసి సమస్యను పరిష్కరిం చాలని కోరుతున్నా’’ అని సమాధానం ఇచ్చారు. కులం పేరుతో మను షులను వేరు చేయడం అనేది సరైంది కాదని అందరం నమ్ముతున్నామన్నారు. ప్రజల్లోనూ అందరూ మంచి వాళ్లుండరు, అందరూ చెడ్డవాళ్లు ఉండరని అన్నారు. కొంతమంది చేసిన తప్పిదం వల్ల ఏదైనా ఘటన జరిగితే ఆ కొందరిపైనే చర్య తీసుకోవాలన్న డిమాండ్ ఇక్కడ ఉందన్నారు. గరగపర్రు గ్రామంలో సమస్య న్యాయంగా పరిష్కారం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. -
ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి
-
గతాన్ని మరిచి అంతా ముందుకెళ్లాలి: వైఎస్ జగన్
ఏలూరు : ఊరంటే అందరూ ఉండాలి, అంతా కలిసి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమను అన్యాయంగా సాంఘిక బహిష్కరణ చేశారని, పనుల్లో నుంచి తొలగించారని దళితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టడమే తమ పొరపాటా అని వారు ప్రశ్నించారు. 50 ఏళ్లుగా ఇతర కులాలతో బంధువుల్లా మెలిగామని, గత మూడు నెలలుగా వివాదం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. స్థానిక నేతలతో పాటు, అధికారులు కూడా తమను పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.... ‘సమాచార లోపం వల్లే వివాదం పెరిగిందని దళితేతరులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఊరు ఉంటే... అంతా ఉండాలి, ఇరుపక్షాలు ఊళ్లో ఉండాలి. రోజు మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఇష్టం ఉన్నా, లేకున్నా జీవితాలు ఇక్కడే గడపాలి. చట్టప్రకారం ఏం జరగాలో అది జరగాలి. వివాదం పరిష్కారానికి నాలుగు అడుగులు ముందుకేయాలి. అన్ని మరిచిపోయి కలిసి ఉండాలన్నదే మా ఆశ. అందరు చెడ్డవాళ్లు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎమ్మార్వోను, సెక్రటరీనీ సస్పెండ్ చేశారు. ఇలాంటి పరిణామాలు మళ్లీ రాకూడదని వాళ్లు కూడా (దళితేతరులు) ఆశిస్తున్నారు. తప్పు చేసిన వారికే శిక్షలు పరిమితం కావాలని మీరు (దళితులు) అంటున్నారు. ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్టీ తరఫున కమిటీని ఏర్పాటు చేస్తున్నా. రెండు వర్గాలు కలిసిమెలిసి ఉండటానికి కమిటీ కృషి చేస్తుంది. గతాన్ని మరిచిపోయి అంతా ముందుకు వెళ్లాలి.’ అని సూచించారు. తమకు హామీ ఇస్తే అందుకు సిద్ధమేనని దళితులు తెలిపారు. అన్ని విగ్రహాలు తీసేస్తే...అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసేయలని వారు కోరారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్ దళితేతరులను కలిసి ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన -
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
-
గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో పర్యటించారు. సాంఘిక బహిష్కరణ ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చా. నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదు. ఇది అన్నివర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే...దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు.’ అని అన్నారు. ఈ సంఘటనపై గరగపర్రు దళితేతరులు మాట్లాడుతూ... సోదరభావంతోనే తాము బతకాలనుకుంటున్నామన్నారు. కొందరు వల్ల ఈ సమస్యవ వచ్చిందని, తమ గ్రామం ఆదర్శ గ్రామంగా ఇప్పటివరకూ నిలిచిందన్నారు. సమస్యను గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారం అవుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండువైపులా ఉన్నాయన్నారు. -
ఉద్రిక్తం.. ఉద్విగ్నం
► గరగపర్రులో కొనసాగుతున్న 144 సెక్షన్ ► తరలివచ్చిన అధికారగణం ► జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడి విచారణ ► నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశం ► నేడు గ్రామానికి వైఎస్సార్ సీపీ బృందం పాలకోడేరు మండలం గరగపర్రులో ఇంకా ఉద్విగ్నం.. ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. గ్రామం పోలీసు వలయంలో బందీ అయింది. 144 సెక్షన్ వల్ల గ్రామంలోకి బయట వ్యక్తులను ఎవరినీ రానీకుండా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పాలకోడేరు : గరగపర్రు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై తలెత్తిన వివాదం నేపథ్యంలో దళితులు సాంఘిక బహిష్కరణకు గురైనట్టు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దళిత నేతలను అరెస్ట్ చేయడంతో ఆందోళనలు మిన్నంటాయి. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సోమవారం కూడా గ్రామం ఖాకీల వలయంలోనే ఉండాల్సి వచ్చింది. గ్రామంలోకి ఎవరినీ రానీకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. సాధారణ ప్రజాజీవనానికీ ఆటంకం కలిగించారు. ప్రతిఒక్కరూ తాము గ్రామస్తులమనే ఆధారం చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగడుగునా నిర్బంధాల వల్ల బయట నుంచి వచ్చిన ప్రజా, దళిత సంఘాల నేతలు అతి కష్టమ్మీద దళితవాడకు చేరుకుని బాధితులకు సంఘీభావం ప్రకటించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలి : రాములు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.రాములు సోమవారం గ్రామానికి వచ్చారు. ఆయనతోపాటు కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, ఇతర అధికారగణం తరలివచ్చారు. దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనపై రాములు బహిరంగ విచారణ చేపట్టారు. బాధితుల నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో పూర్వ పరిస్థితి నెలకొనే వరకూ బాధితులకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ముందుగానే ఈ చర్యలు తీసుకుంటే ఇప్పుడీ విపత్కర పరిస్థితులు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. దళితులు కౌలు చేస్తున్న భూములను తిరిగి ఇప్పించాలని, వెంటనే పనులు కల్పించాలని, వారికి సరుకులు ఇవ్వని దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. అంతేగాక దళితులకు దగ్గర్లో ఉండేలా దుకాణాలను ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. శాంతి కమిటీని ఏర్పాటు చేసి ఇరువర్గాల్లో సభ్యులను ఎంపిక చేసి చర్చల ద్వారా న్యాయం చేయాలని కోరారు. దీంతో పోలీసులు కొంత గడువు కావాలని కోరారు. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. తహసీల్దార్, తదితర అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని, గ్రామంలో 400 ఎకరాలు ప్రభుత్వ భూములను బడా బాబులు కబ్జా చేశారని పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా.. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు చేపడతామని బదులిచ్చారు. నేతల నిర్బంధం గొల్లలకోడేరు వద్ద వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్, లీగల్ సెల్ నాయకులు స్టాలిన్ రాజును పోలీసులు అడ్డుకుని రెండు గంటలపాటు నిర్బంధించారు. వీరు అతికష్టమ్మీద గ్రామానికి చేరుకుని దళితులను పరామర్శించారు. దళిత స్త్రీశక్తి జాతీయ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, ఢిల్లీ నుంచి వచ్చిన దళిత రైట్స్ జాతీయ అధ్యక్షుడు కందుకూరి ఆనందరావు గ్రామంలో పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. ఉత్తరప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, కోల్‌కతాల నుంచీ దళిత, మానవహక్కుల నేతలు గరగపర్రు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. ఇదిలా ఉంటే ఏపీ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి సుంకర సీతారాం, ఆపార్టీ జిల్లా నాయకుడు పాలా సత్తిరామరెడ్డి, ఐఏఎస్ ఫోరం కార్యదర్శి సిద్దోజిరావు, సీపీఎం, వివిధ ప్రజాసంఘాల నేతలు బాధిత దళితులను పరామర్శించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాడు తుందుర్రు.. నేడు గరగపర్రు.. భీమవరం : అధికారులు, పోలీసుల అత్యుత్సాహం వల్లే గరగపర్రు సమస్య మరింత జఠిలమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోకి ప్రవేశించాలంటే గ్రామస్తులతో సహా అందరూ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో గోదావరి ఆక్వా మెగా ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలని తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడితో సహా భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనలు చేపట్టిన సమయంలోనూ అధికారులు, పోలీసులు యాజమాన్యానికి కొమ్ముకాస్తూ బాధిత గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. బాధితులను ముప్పుతిప్పలు పెట్టారు. గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా.. లోపలకు రావాలన్నా.. ధ్రువీకరణ చూపించాలని ఆంక్షలు పెట్టారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం రెట్టింపయింది. ఇప్పుడు గరగపర్రు విషయంలోనూ పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి శనివారమే కలెక్టర్ గ్రామానికి వచ్చి ఇరువర్గాలకూ నచ్చచెప్పారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి దళితనేతలను అరెస్ట్ చేయడం, తదనంతరం 144 సెక్షన్ విధించడం బాధితుల్లో ఆగ్రహానికి కారణమైంది. వివాదం చినికిచినికి గాలివాన అయింది. ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతోంది. గ్రామంలో పోలీసులు లేకపోతేనే సమస్య త్వరగా పరిష్కారమవుతుందని, ఎక్కువ మంది పోలీసులను మోహరించడం వల్ల ఏదో జరిగిపోతుందన్న ఆందోళన ఇటు బాధితుల్లోనూ, ఇటు మిగిలిన గ్రామస్తుల్లోనూ పెరిగిపోతుందని, దీనివల్ల సమస్య మరింత జఠిలమవుతుందని ఓ పోలీసు అధికారి చెప్పారు. వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించి అధికారులు సావధానంగా ఇరువర్గాలతో చర్చలు జరిపితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
గరగపర్రులో వైఎస్ఆర్సీపీ బృందం పర్యటన
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గరగపర్రు బాధితులతో బృందం సభ్యులు భేటీ అయ్యారు. పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మేరుగ నాగార్జున తదితరులు దళితవాడలో బాధితులతో సమావేశమై గ్రామంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ గరగపర్రు ఘటనపై బాధితులు మాట్లాడుతూ...‘ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాట్లకు సన్నాహాలు చేశాం. ఏప్రిల్ 23న విగ్రహాన్ని చెరువుగట్టు సెంటర్లో పెట్టాం. రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు. కోర్టు వివాదం ఉన్న నేపథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని చెప్పారు. అన్ని విగ్రహాలను తొలగించే సమయంలో మేం కూడా అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పినా వినిపించుకోలేదు. గ్రామంలోని అన్ని కులాలు శివాలయంలో సమావేశం అయ్యారు. మే 5వ తేదీ లోపు విగ్రహం తొలగించాలని డెడ్‌లైన్ పెట్టారు. ఆ తర్వాత నుంచి మమ్మల్ని సాంఘీక బహిష్కరణ చేశారు. పాలు, కూరగాయలు, మందులు కూడా అందకుండా చేశారు.’ అని తమ ఆవేదన వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ గరగపర్రు గ్రామంలో సామాజిక బహిష్కరణ కేసు విచారణ రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు గరగపర్రు సందర్శించి సంఘటనకు సంబంధించి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని పూర్వాపరాలను విచారించారని చెప్పారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. -
గరగపర్రు వివాదంపై వైఎస్ఆర్ సీపీ కమిటీ
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు వివాదంపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగ నాగార్జున తదితరులు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్ సీపీ కమిటీ సభ్యులు మంగళవారం గరగపర్రులో పర్యటించి, వాస్తవాలను తెలుసుకోనున్నారు. కాగా గరగపర్రులో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తమను సాంఘిక బహిష్కరణ చేశారంటూ దళితులు .....కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన పలువురు దళిత సంఘం నేతలను అరెస్ట్ చేశారు. అయితే ఒకరిని రాజమండ్రిలో విడిచిపెట్టగా...మిగిలిన నాయకులను పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ విషయం తెలియగానే దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా భీమవరం-తాడేపల్లిగూడెం రహదారిపై పోలీసులు మోహరించారు. దళితులకు మద్దతుగా వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రతోపులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. -
‘ న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తాం’
పాలకోడేరు: పశ్చిమగోదావరి జల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో దళితులకి న్యాయం జరిగే వరకు వారి తరపున పోరాడతామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. గ్రామానికి చేరుకున్న కేంద్ర పాలక మండలి సభ్యులు కొయ్యే మోషెన్ రాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజులు అండగా ఉంటామన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఏర్పడిన వివాదంలో రెండు నెలలుగా దళితులపై జరుగుతున్న పలు సంఘటనలను వారు ఖండించారు. గ్రామంలో దళితులు సాంఘిక బహిష్కరణను వారు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా దళితపేటను సందర్శించి సాంఘిక బహిష్కరణపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజుల నుంచి వివిధ దళిత సంఘాలు గ్రామానికి రావడంతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. గ్రామంలో దళితులందరు ఏకమై సాంఘిక బహిష్కరణకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని ధర్నా చేశారు. దీనికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు సాంఘిక బహిష్కరణకు కారణమైన గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ ఇందుకురి బలరాంరాజును వెంటనే అరెస్టు చేసి గరగపర్రు దళితులకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
ఒంగోలు: రాజ్యంగ నిర్మాత విగ్రహానికి అవమానం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరు సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చెప్పులదండ వేశారు. ఇది గుర్తించిన దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఈ దుశ్ఛర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. పోలీసులు నిందితులను పట్టుకుని శిక్షిస్తామని సర్ది చెప్పడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. -
మహనీయుల విగ్రహాలనూ వదల్లేదు..!
► శ్రుతి మించిన అధికారపార్టీ ఆగడాలు ► లాడ్జి సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం పసుపు మయం ► బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం మెడకు పసుపు తోరణాలు ► రెండు రోజులైనా తోరణాలు, జెండాలు తొలగించని అధికారులు ► టీడీపీ నేతల తీరుపై మండిపడుతున్న నగర ప్రజలు సాక్షి, గుంటూరు : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి టీడీపీలోకి చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు మహనీయుల విగ్రహాలనూ వదల్లేదు. అధికార మదంతో మహనీయుల విగ్రహాలకు సైతం పసుపుజెండాలు, తోరణాలు కట్టి పైశాచికానందం పొందుతున్నారు. అధికార పార్టీ నేతల ‘పచ్చ’ పాత బుద్ధిని చూసి గుంటూరు నగరవాసులు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. మహనీయుల విగ్రహాలను అవమానపరిచారంటూ అధికార పార్టీ నేతలను చీత్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... మహనీయుల విగ్రహాలకు పచ్చ తోరణాలు గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం టీడీపీకి సంబంధించి మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. అంతర్గత విభేదాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు గుంటూరు నగరాన్ని టీడీపీ జెండాలు, పసుపు తోరణాలతో నింపేశారు. రోడ్లు, ప్రైవేటు భవనాలు, విద్యుత్ స్తంభాలు దేన్నీ వదలకుండా పసుపు మయం చేసేశారు. వీరు మరో అడుగు ముందుకు వేసి, నగరంలోని మహనీయుల విగ్రహాలకు టీడీపీ తోరణాలు కట్టేశారు. ముఖ్యంగా నగరంలోని లాడ్జిసెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు జెండాలు, తోరణాలతో ముంచేశారు. అంబేద్కర్ పార్టీ వ్యక్తి కాదని, ఆయన భారత జాతి సంపదని తెలిసి కూడా ఆయనకు రాజకీయ పార్టీ జెండాలు, తోరణాలు కట్టి అవమానించడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల తీరుపై మండిపాటు.. టీడీపీ నేతలు ఇంతటితో ఆగకుండా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఎదురుగా ఉన్న దివంగత ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం మెడకు పసుపు తోరణాలతో ఉరివేసినట్లుగా కట్టి పడేశారు. ఈ దృశ్యాలు చూసిన నగర వాసులు టీడీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఇతర పార్టీ నేతలు ప్రైవేటు స్థలాల్లో ప్లెక్సీలు, జెండాలు వేస్తేనే ఊరుకోని నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సాక్షాత్తూ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న జగజ్జీవన్‌రామ్ విగ్రహానికి పచ్చతోరణాలు కట్టినా పట్టించుకోకపోవడం శోచనీయం. రెండు రోజులు గడుస్తున్నా వాటిని తొలగించిన నాథుడే లేకుండా పోయారు. గతంలోనూ మదర్ థెరిస్సా విగ్రహానికి అడ్డుగా ఓ టీడీపీ ఎమ్మెల్యే ప్లెక్సీని కట్టడం ఆ ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మరోసారి మహనీయుల విగ్రహాలకు అవమానం జరుగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
పాలకోడేరు: పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయతలపెట్టిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మరో వర్గం వారు రాత్రికిరాత్రి తరలించడంతో దళి తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా మారి ధర్నా, రాస్తారోకోకు దారితీసింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వివరాలిలా ఉన్నాయి.. గరగపర్రు గ్రామానికి చెందిన దళితులు అంబేడ్కర్ విగ్రహాన్ని బస్టాండ్ సెంటర్లో తాండ్ర పాపారాయుడు విగ్రహం వద్ద ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఆదివారం రాత్రి విగ్రహాన్ని తెచ్చి ఆ ప్రాంతంలో ఉంచారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన కొందరు పంచాయతీ కార్యదర్శి సహకారంతో విగ్రహాన్ని తరలించి పాత పంచాయతీ కార్యాలయంలో ఉంచి తాళం వేశారు. విషయం తెలిసిన దళితులు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున సర్పంచ్ ఉన్నమట్ల ఎలిజబెత్ ఇంటికి వెళ్లి బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ ఎస్సీ అయినా ఆందోళనకారులకు భయపడి ఇంట్లోంచి రాలే దు. అక్కడి నుంచి దళితులు గ్రామంలో ఊరేగింపుగా నినాదాలు చేస్తూ భీమవరం–తాడేపలి్లగూడెం రహదారిపై బైఠాయించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాస్తారోకో సాగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి.. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, దళిత ఐక్యవేదిక, వైఎ స్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా సుందర్‌కుమార్, జిల్లా మాలమహానాడు నాయకులు గుమ్మాపు వరప్రసాద్, మాలమహానాడు జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు మంతెన యోగీం ద్ర కుమార్ తదితరులు ఇక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ దశలో కొందరు ఆందోళనకారులు వాటర్ ట్యాం క్ ఎక్కి నిరసన తెలిపారు. నరసాపురం సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆందో ళనకారులతో చర్చించారు. విగ్రహం ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతం అభ్యంతరకరమైందని, వేరేచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇందుకు దళితులు ససేమిరా అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించాలని, విగ్రహం తీసుకువచ్చి ఆ ప్రాంతంలో పెట్టాలని, లేకపోతే జిల్లాస్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. చివరకు పాత పంచాయతీ కార్యాలయం వద్ద విగ్రహం ఏర్పాటుకు సబ్‌కలెక్టర్ స్థలం ప్రతిపాదించడంతో ఆందోళన ముగిసింది. ఉండి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి బుట్టాయగూడెం: అంబేడ్కర్‌పై ప్రేమను తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లి రాజేష్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విగ్రహం తొలగించడంపై ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు సమాధానం చెప్పాలని నల్లి రాజేష్ డిమాండ్ చేశారు. -
‘లాల్ నీల్ జెండా’ నేటి ఎజెండా
అణగారిన సామాజిక ప్రజా సమూహాలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య ఏర్పడుతున్న ఈ మైత్రీ బంధాన్ని విచ్ఛినం చేయాలని కొందరు చూస్తున్నారు. మార్క్సిజాన్ని, అంబేద్కర్ భావసంచయాన్ని పరస్పరం పొసగనివిగా చూపే ప్రయత్నాలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసే శక్తులు, ఆర్థిక దోపిడీ నిర్మూలన శక్తులు సహజంగానే దృఢ బంధంతో ఐక్యం కావాల్సిన వారు. మహాజన యాత్ర, సమర సమ్మేళన సభల్లో వెల్లివిరిసిన ఈ నూతన చైతన్యం మరింత బలపడాలి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో అపూర్వమైన మహాజన పాదయాత్ర జరిగింది. దాని ముగింపుగా హైదరాబాద్‌లో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభ పరిమాణాత్మకంగానే కాదు, గుణాత్మకంగాను ప్రశస్తమైనది. ఇంత దనుక వర్గ పోరాటమే ఏకైక పోరాట రూపం, తమ అంతిమ లక్ష్యానికి అదే సర్వే సర్వత్రా ఆచరణీయం అన్న భావనలతో ఏ ఇతర సామాజిక అణచివేతలను, ముఖ్యంగా దళిత, ఆది వాసి, గిరిజన, మైనారిటీలు, మహిళలు తదితర వెనుకబడిన కులాలపై ఆధి పత్య కులాల అహంకారపూరిత దాడులను పట్టించుకోవడం లేదనే కొంత వాస్తవిక విమర్శ ఉండేది. దానికి సీపీఎం ఆచరణాత్మకంగా చెప్పిన సరైన సమాధానం ‘లాల్ నీల్ జెండా’. మన దేశ ప్రత్యేకపరిస్థితుల్లో తమ ఎజెండా సామాజిక న్యాయంతో పాటూ సాగే వర్గపోరాటమే పార్టీ లక్ష్య సాధనకు దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆ సభాముఖంగా తేల్చి చెప్పింది. అదే విషయాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి ఏచూరి సీతారాం చేత కూడా నిర్ద్వంద్వంగా స్పష్టం చేయించింది. ఈ వినూత్న వైఖరి సీపీఎం శ్రేణులతో పాటూ, వామపక్ష శ్రేణులు, అభిమానులందరికీ నిస్సందేహంగా ఉత్తేజం కలి గించి ఉంటుంది. ఆ సభలో సీపీఎం నేతలేగాక సీపీఐ కార్యదర్శి చాడ వెంక టరెడ్డి, ప్రజా కళాకారుడు గద్దర్, ఐలయ్య, హరగోపాల్ వంటి మేధావులు పాల్గొనడం అభినందనీయం. నూతన అధ్యాయానికి నాంది స్వాతంత్య్రోద్యమం తర్వాతి తరం వచ్చేసరికి కార్మిక వర్గ పునాదిగా, ఆ వర్గ ఐక్యతే ప్రధానంగా జరపవలసిన ఉద్యమాల ఆవశ్యకత వల్ల కష్టజీవుల మధ్య అభేద్యమైన ఐక్యత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫలితంగా కొన్ని సామాజిక పోరాటాలపట్ల, వారి అస్తిత్వ ఉద్యమాల పట్ల అవి కార్మికవర్గ ఉద్యమానికి భంగకరం కాగలవేమోననే భయాందోళనలుండేవి. దీంతో ఆ ఉద్యమాల పట్ల వామపక్షాల్లో కొంత సందేహాత్మకమైన, ఊగిసలాట వైఖరిని ప్రదర్శించడం చూశాం. అయితే వర్గ ఐక్యతకు అవి భంగం కలిగిస్తాయనే అపోహా కొనసాగుతున్నా... సామాజిక న్యాయం అనే అంశం పార్టీలో చర్చనీ యాంశం కాకుండా పోలేదు. ఏది ఏమైనా ఏచూరి లాల్ నీల్ జెండా నినాదం నుంచి నాలుగువేల కిలోమీటర్లకు పైగా సాగిన సుదీర్ఘ పాదయాత్ర తదుపరి తమ్మినేని చేసిన ఉపన్యాసం వరకు ఆ సభ ఎంతో ఉత్తేజభరితంగా సాగింది. అది పార్టీ చరిత్రలో ఒక ఉత్సాహపూరిత నూతనాధ్యాయానికి నాంది అవు తుంది. ఇదే వేదికపై నుంచి గద్దర్, తాను గతంలో సీపీఐ, సీపీఎంలను విమ ర్శించినందుకు సభాముఖంగా ప్రజాసమూహం ముందే చెంపలు వేసుకు న్నారు. శ్రీశ్రీ గతంలో ఇందిరాగాం«ధీ అత్యవసర పరిస్థితిని వామపక్ష నియం తృత్వంగా పొరబడ్డారు. అయితే గద్దర్ ప్రజా కళాకారుడే కాదు, అనుభవం గల రాజకీయ మేధావి. అయినా ఆ సభ సృజించిన భావోద్వేగంతో ఇకపై పార్లమెంటరీ రంగాన కృషి చేస్తానని ప్రకటించారు. గతంలో నేను 11 మందితో కూడిన సీపీఎం కార్యదర్శి వర్గంలో సభ్యు నిగా ఉండేవాడిని. అందులో ఒక్క బీసీగానీ, దళితుడుగానీ, మైనారిటీ వ్యక్తి గానీ, మహిళగానీ లేరు. అది కావాలని జరిగిందని అనుకోను. అలా వారిని ఇముడ్చుకోవాలన్న ప్రత్యేక అవగాహన, పోనీ చైతన్యం తగినంతగా లేనందు వలననే ఈ విషయమై ‘వివిధ రాజకీయ పార్టీలలో ఈ సామాజిక అణచివే తకు గురవుతున్న శక్తుల ప్రాధాన్యత’పై ఉస్మానియా యూనివర్సిటీలో డాక్ట రేట్ చేస్తున్న కృష్ణారావు సమాచారం కోసం నన్ను కలిశారు. మీ రాష్ట్ర ఉన్నత కమిటీ సెక్రెటేరియట్‌లో పరిస్థితి ఎలా ఉందని అడిగారు. నేను పై విషయం చెప్పి, మా పార్టీలో రిజర్వేషన్లు ఉండవని సమాధానం ఇచ్చాను. కనీసం అది మా లోపమేనని కూడా చెప్పలేక పోయాను. ఆ తర్వాత అందుకు కొంత పశ్చాత్తాపపడి అందుబాటులో ఉన్న ఓ ఇద్దరు కార్యదర్శివర్గ సభ్యులతో, కొర టాల గంగాధరరావుతో ఆ విషయాన్ని ప్రస్తావించాను, ‘‘అందులో పశ్చా త్తాపపడాల్సింది ఏముంది? రాష్ట్ర కమిటీలో నలుగురు దళితులున్నారు, కార్య దర్శివర్గ స్థాయికి వారు ఇంకా ఎదగాల్సి ఉంది’’ అన్నారు. అలాగే కొత్తపట్నంలో రాజకీయ పాఠశాల జరిగిన సందర్భంగా కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. ఆ పాఠశాలకు హాజరైన విద్యార్థుల నుంచి సూచనలను, అభిప్రా యాలను రాతపూర్వకంగా పార్టీకి అందజేయాలని కోరాం. ప్రస్తుతం తెలం గాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్న సి. రాములు మాత్రం ‘‘మన పార్టీలో అంబేద్కర్‌పై తగురీతిలో అవగాహన ఉన్నట్టు అనిపించడం లేదు. బహుశా అందువల్లనే పార్టీలో దళితులు తదితర అణగారిన సమూ హాల పట్ల మరింత శ్రద్ధ చూపలేకపోతున్నాము’’ అంటూ తన అభిప్రా యాన్ని తెలిపారు. అది నన్ను బాగా ఆకట్టుకుంది. దీంతో దాన్ని కార్యదర్శి వర్గ సమావేశంలో చర్చకు పెడదామనుకుని, ముందుగా కార్యదర్శి గంగా ధరరావుతో చెప్పాను. ‘‘దాన్ని ఆ కామ్రేడ్ విమర్శనాత్మక దృష్టితో పెట్టారని అనుకోవడంలేదు. అందుకు అతణ్ణి వివరణ అడగనవసరం లేదు. సహ జంగా దళితులలో ఒకరుగా జన్మించి ఆ బాధలు అనుభవించారు గనుక అలా భావించడంలో తప్పు లేదు’’ అంటూ ఆ అభిప్రాయాన్ని ఒక క్షమార్హమైన భావనగా భావించి తీసి పక్కన పెట్టేశారు. అది చర్చనీయాంశమని నేనంటే.. ‘‘ఈచర్చ అనవసరమైన కుల చర్యలకు దారి తీస్తుంది’’ అన్నారాయన. చర్చకు వస్తూనే ఉన్న సామాజిక న్యాయం నేను కార్యదర్శివర్గంలో ఉండగానే కారంచేడులో దళితులపై అక్కడి ఆధి పత్య కులాల వారు దాడి చేయగా పలువురు మరణించారు, గాయపడ్డారు. నాటి పౌరహక్కుల సంఘం కార్యదర్శిగా అక్కడికి వెళ్లిన నేను అది నగ్న అగ్రకుల దురహంకార దాడి అని స్పష్టంగా ‘ప్రజాశక్తి’లో రాశాను, కార్యదర్శివర్గానికీ చెప్పాను. ఆ తర్వాత మళ్లీ కారంచేడు వెళ్లినప్పుడు నాటి ప్రకాశం జిల్లా పార్టీ కార్యదర్శి తవనం చెంచయ్య అక్కడ కలిశారు. అన్ని కులాల్లోని పేదలు, కష్ట జీవులను ఏకంచేసి, వర్గపోరాటం ద్వారా ఇలాంటి దురాగతాలను ఎండ గట్టగలమనే మన అవగాహన చెప్పడం తప్ప, క్షేత్ర స్థాయిలో ఆ ఘటనపై తగినంత చేయలేకపోయామనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చగా నేను ఏకీభవించాను. ఆ తర్వాత విజయవాడలో జరిగిన రాష్ట్ర మహాసభలో పాతూరి రామయ్య (నేటి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు) ‘‘కారంచేడు దళితులపై దాడి సందర్భంగా మన పార్టీ తగిన రీతిలో స్పందించిందా అన్నది ఆలోచించుకోవాలి’’ అన్నారు. ఏవైనా ప్రధాన అంశాలు సభలో ప్రస్తావనకు వస్తే కార్యదర్శివర్గంలో చర్చించి, సమాధానం ఇవ్వాలి. కానీ కార్యదర్శి గంగా«ధరరావు లేచి ‘‘రామయ్య ఏనాడూ రాష్ట్ర కమిటీలోగానీ విడిగాగానీ ఇలాంటి సందేహాస్పద వ్యాఖ్యచేయలేదు. అదేమిటి హఠాత్తుగా ఇలా ఏకంగా రాష్ట్ర మహాసభలో ప్రస్తావించడం వింతగా ఉంది’’ అన్నారు. కార్యదర్శివర్గ కమిటీని మించిన అత్యున్నత వేదిక రాష్ట్ర మహాసభ. అక్కడ అభిప్రాయం చెప్పేహక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయినా వెంటనే రామయ్య ‘‘తొందర పడ్డాను, పొరపాటయ్యింది, క్షమించమని సభను, కార్యదర్శిని కోరుతు న్నాను’’ అంటూ చిన్నబుచ్చుకున్నారు. విజయవంతమైన నాటి సామాజిక న్యాయసభ ఉమ్మడి ఏపీలో సీపీఎంకు బలమైన జిల్లా నల్లగొండ. 1995 శాసనసభ ఎన్ని కల సందర్భంగా ‘సామాజిక న్యాయం’ అంశంపై పార్టీలో చీలిక వచ్చింది. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మల్లు స్వరాజ్యం(రెడ్డి)ను నిలపాలన్న పార్టీ నాయకత్వ అభిప్రాయానికి వ్యతిరేకంగా బుచ్చిరాములు (గౌడ)కు ఆ సీటును కేటాయించాలనీ, ఎప్పుడూ ఆ సీటును బీఎన్, స్వరాజ్యం, వీయన్, కుశలవరెడ్డిలకేనా, ఒక్కసారైనా బీసీకి ఇవ్వవచ్చు కదా అనే డిమాండ్ వచ్చింది. దీంతో రాష్ట్ర నాయకత్వం అయిష్టంగానే అయినా బుచ్చిరాములుకు సీటు ఇవ్వక తప్పలేదు. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. స్వరాజ్యం, వీయన్లే అందుకు కారణం అంటూ సామాజిక న్యాయ గ్రూపుగా ఉన్న దళిత నాయకత్వం పార్టీ నుంచి విడిపోయింది. జిల్లా అగ్రనేత బీఎన్ సైతం వారితో నిలిచారు. 1977 డిసెంబర్ 2న సూర్యాపేటలో లక్షన్నర ప్రజానీకంతో భారీ ఎత్తున ‘సామాజికన్యాయసభ’ జరిగింది. దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా జరిగిన ఆ సభకు బీఎన్ అధ్యక్షత వహించారు, ఓంకార్ ప్రధాన వక్త. మాదిగ దండోరా వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ, మాల మహానాడు నేత పీవీ రావు తదితర నేతలతో పాటూ ఆర్ కృష్ణయ్య, తుడుందెబ్బ గిరిజన నేతలు ఆ సభకు హాజరై సంఘీభావ సందేశాలిచ్చారు. నేను ప్రారంభోప న్యాసం చేశాను. దీంతో ఆ సభకు వ్యతిరేకంగా సీపీఎం తరఫున మోటూరు హనుమంతరావు ‘వెనుకబడిన కులాల సభకు బ్రాహ్మణ నాయకత్వం!?’ అంటూ నన్ను దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా కరపత్రాన్ని రచించారు. వాస్తవానికి నాడు న్యాయపోరాట శ్రామికపార్టీగా ఏర్పడిన సీపీఎం (బీఎన్) ప్రధాన నిర్వాహకులతో పోలిస్తే నేను చేసిన కృషి స్వల్పం.ఆ సభ నాడు శ్రమ జీవులకు, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీలు, మహిళలకు ఎంతో ఉత్తేజా న్నిచ్చింది. ఈ మైత్రీ బంధం విడరానిది ఈ పరిణామ ప్రభావం వల్ల, కమ్యూనిస్టు పార్టీలలో క్రమంగా పెరుగుతూ వచ్చిన ‘సామాజిక న్యాయ’ వాంఛా బలంవల్ల... నాటి సీపీఎం కార్యదర్శి రాఘవులు ముఖ్య బాధ్యతతో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పాటు చేశారు. దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించుతున్నారు. సీపీఐ మాజీ ఎంఎల్ఏ మల్లేశ్ నాయకత్వాన దళిత హక్కుల వేదికను, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షులుగా సామాజిక హక్కుల వేదికను ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ దిశగానే తెలంగాణలో సీపీఎం నేతృత్వాన దాదాపు వంద ప్రజా సంఘాలతో ప్రజా సాంస్కృతిక వేదిక ఏర్పాటైంది. వీటన్నిటి పర్యవసానమే గుణాత్మకంగా భిన్నమైనదిగా సాగిన తమ్మినేని సామాజిక న్యాయ సాధనా పాదయాత్రగా చెప్పవచ్చు. అణగారిన సామాజిక ప్రజా సమూహాలకు, కమ్యూనిస్టు పార్టీలకు మధ్య ఏర్పడుతున్న ఈ మైత్రీ బం«ధాన్ని విచ్ఛినం చేయాలని కొందరు రంగం మీదకు వస్తున్నారు. వారు మార్క్సిజాన్ని, అంబేడ్కర్ భావసంచయాన్ని పరస్పరం పొసగనివిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేసే శక్తులు, ఆర్థిక దోపిడీ నిర్మూలనాశక్తులు సహజమైన దృఢ బంధంతో ఐక్యం కావాల్సిన వారు. ఈ నూతన చైతన్యం మరింత బలపడి నిర్ణయాత్మక శక్తి కావాలని ఆశిద్దాం! డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విమర్శకులు మొబైల్ : 98480 69720 -
దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేడ్కర్
► అంబేడ్కర్ బాటలో పయనించి పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత వైఎస్సార్ ► రాజ్యాంగానికి విరుద్ధంగా కొనసాగుతున్న నేటి చంద్రబాబు ప్రభుత్వం ► అంబేడ్కర్ జయంతిలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు అర్బన్ : దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానీయుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్..అని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో అంబేడ్కర్ 126వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల్లో అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేమ్మన్నారు. అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న ఓ దళిత కుటుంబంలో 14వ సంతానంగా జన్మించారని ఎంపీ చెప్పారు. పేద కుటుంబంలో జన్మించినా ప్రపంచం మొత్తం గర్వించేలా ఆయన సేవలు, ఆలోచనలు ఉన్నాయని, వాటిని ఇప్పటి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. హిందువుగా జన్మించి బౌద్ధునిగా మరణించారని చెప్పారు. అంబేడ్కర్ ఆశయాలను దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేశారని గుర్తు చేశారు. దళిత రైతులకు 36 లక్షల హెక్టార్లు భూమిని పంపిణి చేసిన ఘనత దివంగత నేతదేనన్నారు. దళిత, బలహీన బడుగు వర్గాలు డబ్బులు లేవని విద్య, వైద్యానికి దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి మహోన్నత పథకాలు అందించారని ఎంపీ వైవీ వివరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సీఎం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఎంపీ వైవీ మండిపడ్డారు. ఇతర పార్టీ గుర్తుతో గెలచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగాన్ని అవమానుపరుస్తూ మంత్రి పదవులు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ సేవలకు తగ్గట్టుగా ఆయనకు భారతరత్న ఇవ్వడం సంతోషకరమని ఎంపీ వైవీ పేర్కొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. అంబేడ్కర్ ఏ ఒక్కరి సొంతం కాదని, ఆయన జాతి సంపదని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడుగు కోటేశ్వరరావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభానీ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రమణమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, సేవదళ్ జిల్లా అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి బడుగు ఇందిర, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు వేమూరి సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి నాయకులు వై.వెంకటేశ్వరరావు, కాకుమాను రాజశేఖర్, అక్కిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు అనూరాధ, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావళి, రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య పాల్గొన్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని నీలాయపాలెం, హెచ్‌సీఎం కాలేజీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు ఎంపీ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఎంపీ వైవీ పాల్గొన్నారు. -
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
-
అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్
-
నా జాతికి లేని రక్షణ నాకెందుకు?
గన్మెన్లను వెనక్కి పంపుతున్నా: ఎమ్మెల్యే సంపత్ గద్వాల అర్బన్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ‘‘నా జాతికి లేని పోలీసు రక్షణ నాకెందుకు?.. అందుకే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా ప్రభుత్వ గన్మెన్లను వెనక్కి పంపు తున్నాను’’అని ఆయన ప్రకటించారు. గద్వాలలో జరిగిన అంబేడ్కర్ 126వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డీకే అరుణతో కలసి ఆయన పాల్గొన్నారు. సంపత్ మాట్లాడుతూ ఒక దళిత మహిళ శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే బట్టలు ఊడదీసి కొడతానని ఎస్ఐ అసభ్య పదజాలంతో దూషిం చాడని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల దళితులపై దాడులు జరిగిన విషయాన్ని ఎస్పీ, డీఎస్పీ, సీఐల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
అంబేడ్కర్ జయంతిని వర్ధంతిగా మార్చిన లోకేశ్
వర్ధంతి సందర్భంగా అంటూ శుభాకాంక్షలు చెప్పిన వైనం భవానీపురం (విజయవాడ పశ్చిమం) : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తప్పుగా ప్రసంగించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అన్నారు. ఆడిటోరియంలో ఉన్నవారు వర్ధంతి కాదు.. జయంతి అని అరవడంతో ఆయన నాలుక్కరుచుకుని.. సారీ.. జయంతి అని సరిదిద్దుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం సమయంలో కూడా లోకేశ్.. శ్రద్ధా పూర్వకంగా అనడానికి బదులు శ్రద్ధాంజలి అంటూ తడబడ్డారని సభికులు గుర్తు చేసుకున్నారు. -
పేదల గొంతుక.. డిజిధన్
ఇది అవినీతిపై స్వచ్ఛ ఉద్యమం ► నాగ్‌పూర్ దీక్షాభూమిలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళులు ► అక్కడే భీమ్–ఆధార్ యాప్‌ను ప్రారంభించిన మోదీ నాగ్‌పూర్: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిధన్ ఉద్యమం అవినీతిని పారదోలటంతోపాటు పేదల గొంతుకగా పనిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది అవినీతిపై స్వచ్ఛ ఉద్యమమన్నారు. తక్కువ నగదు లావాదేవీలను ప్రోత్సహించే దిశగా భీమ్ యాప్ వినియోగదారులకు రిఫరల్ బోనస్, దుకాణదారులకు క్యాష్‌బ్యాక్ పథకాలను ఆయన ప్రారంభించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా నాగ్‌పూర్‌లోని అంబేడ్కర్ దీక్షాభూమిలో ప్రత్యేక నివాళులు అర్పించిన ప్రధాని.. అదే వేదికగా భీమ్–ఆధార్ యాప్‌ను ఆవిష్కరించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా మేం డిజిటల్ ఇండియా నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ దిశగా పేదల నిజమైన ధనంగా మారేందుకు డిజిధన్ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది పేద ప్రజల గొంతుకగా మారనుంది. ’ అని వెల్లడించారు. భీమ్ రిఫరల్ బోనస్ భీమ్ యాప్‌కు రూ.10తో రిఫరల్ బోనస్‌తోపాటు వ్యాపారులకు ప్రోత్సాహం అందించేలా క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆర్నెల్లకు రూ.495 కోట్లను క్యాష్‌బ్యాక్, రిఫరల్ బోనస్లుగా ఇవ్వనున్నారు. ‘మీరు ఒకరికి భీమ్ యాప్‌ను సూచిస్తే మీకు 10 రూపాయలొస్తాయి. అదే ఒకరోజులో 20 మందికి సూచిస్తే రూ.200 సంపాదించుకోవచ్చు. మొబైల్ ఫోన్ ఉంటేచాలు లావాదేవీలు జరుపుకునే స్థితికి మనం చేరుకుంటున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా భీమ్–ఆధార్ యాప్‌ను మోదీ ప్రారంభించారు. ఆధార్ ద్వారా డిజిటల్ చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్ సాయపడనుంది. యాప్ ద్వారా భారతీయ పౌరులు దుకాణదారుడి వద్దనున్న బయోమెట్రిక్ పరికరం ద్వారా వేలిముద్రతోనే చెల్లింపులు చేయొచ్చు. తక్కువ నగదు వాడకంతో లావాదేవీలు పూర్తవుతాయి. ‘నిరక్షరాస్యులు మాత్రమే తమ సంతకంగా వేలిముద్ర వినియోగించే రోజులుండేవి. కానీ ఇప్పుడు వేలిముద్రే మీ బలం’ అని అన్నారు. దేశవ్యాప్తంగా 75 నగదు రహిత/తక్కువ నగదు లావాదేవీలు జరిగే టౌన్‌షిప్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో రోజుకు లక్షన్నర రూపాయల నగదురహిత లావాదేవీలు, ఏడాదికి 5.5 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇందులో గరిష్టంగా గుజరాత్ నుంచే 56 ఉన్నాయి. ఈ టౌన్‌షిప్‌ల ఎంపిక ప్రక్రియను ప్రైస్ వాటర్‌హౌజ్ కూపర్ సంస్థ ద్వారా నీతి ఆయోగ్ చేపట్టింది. అంబేడ్కర్‌కు నివాళులు అంతకుముందు దీక్షాభూమిలో అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించిన మోదీ.. చేతులు కట్టుకుని కాసేపు ప్రార్థన చేశారు. తర్వాత మాట్లాడుతూ.. అంబేడ్కర్ చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో ఐఐఎం, ట్రిపుల్ఐటీ, ఎయిమ్స్ సంస్థలకు శుక్రవారం మోదీ శంకుస్థాపన చేశారు. కోరడి, చంద్రపూర్, పర్లీలో 3,230 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన 14 యూనిట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. అంబేడ్కర్ బౌద్ధ స్వీకరణకు ప్రత్యక్ష సాక్షి లక్నో: అంబేడ్కర్ బౌద్ధమత స్వీకరణకు ప్రత్యక్ష సాక్షులైన ఏడుగురు బౌద్ధ సన్యాసుల్లో భదంత్ ప్రజ్ఞానంద్ ఒకరు. వారిలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఆయనొక్కరే. శ్రీలంకలో జన్మించిన ప్రజ్ఞానంద్(93) లక్నో బౌద్ధ విహార్‌లో నివసిస్తున్నారు. 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో అంబేడ్కర్ బౌద్ధమతాన్ని పుచ్చుకున్నారు. ఆయనను బౌద్ధంలోకి మార్చిన భదంత్ చంద్రమణి మహాథేరోకు అప్పటికి 22 ఏళ్ల వయసున్న ప్రజ్ఞానంద్ సహాయకుడిగా పనిచేశారు. ‘ఆరోజు నాగ్‌పూర్ దీక్షాభూమికి ఐదు లక్షల మంది వచ్చారు.. అంబేడ్కర్ పూర్తిగా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలేవీ లేనట్లు కనిపించారు..’ అని ప్రజ్ఞానంద్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమై, సైగలతో సంభాషించే ప్రజ్ఞానంద్.. అంబేడ్కర్ అనే మాట వినగానే ఉత్సాహంతో మాట్లాడతారని శిష్యులు చెప్పారు. కోటి గెలుచుకున్న శ్రద్ధా న్యూఢిల్లీ: లక్కీ గ్రాహక్ పథకంలో రూ.కోటి గెలుచుకున్న శ్రద్ధా మోహన్ మంగ్షెటే(20)కి నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని స్వయంగా బహుమతి అందించారు. శ్రద్ధా ప్రస్తుతం మహారాష్ట్రలోని లాతుర్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. తాను కొత్తగా కొన్న మొబైల్ ఫోన్ నెలసరి వాయిదా(ఈఎంఐ) రూ.1509ని రూపే కార్డుతో ఆన్లైన్లో చెల్లించడంతో శ్రద్ధాను అదృష్టం వరించింది. లక్కీ గ్రాహక్ యోజనలో రెండో బహుమతి రూ.50 లక్షలను గుజరాత్ ఖంభట్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హార్దిక్ కుమార్(29) అందుకున్నారు. -
గన్మెన్లను తిప్పిపంపిన ఎమ్మెల్యే
హైదరాబాద్: తన రక్షణకు కేటాయోగించిన గన్ మెన్లను అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తిప్పి పంపారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా తన గన్మెన్లను ఎమ్మెల్యే తిప్పి పంపారు. రాష్ట్రంలో ప్రజలకు లేని రక్షణ తనకెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే ప్రజలను భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అంబేద్కర్ అందరివాడు
కంభం: అంబేద్కర్ అందరివాడని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎస్ఐ రామానాయక్ అన్నారు. స్థానిక కందులాపురం కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కాటమాల చెన్నకేశవరావు అధ్యక్షతన అంబేడ్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో కందులాపురం కూడలి నుంచి తహశీల్దార కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి షాలెంరాజు, బీఎస్పీ జిల్లా కార్యదర్శి పానుగంటి సతీశ్, మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు కల్వకూరి అబ్రహం, అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ చింతల అరుణ్‌దీప్, ఎన్జీఓ ఏలియా, సీఐటీయూ నాయకుడు దాసరిరెడ్డి, పీపుల్స్ యాక్షన్ ఫోరం నాయకుడు పులుగుజ్జు సురేశ్, కంభం, కందులాపురం సర్పంచులు స్టార్బాషా, మెర్సికమల తదితరులు పాల్గొన్నారు. వాసవీ విద్యాసంస్థల వైస్ చైర్మన్ గోళ్ల సుబ్బరత్నం సిబ్బందితో కలిసి కందులాపురం కూడలిలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి చెన్ను విజయ ఆధ్వర్యంలో కంభం, అర్ధవీడు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు ర్యాలీగా వచ్చి కందులాపురం కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కంభం మండల రూరల్ లాయర్ శ్రీనివాసులరెడ్డి, నాయకులు సి.హెచ్. వెంకటేశ్వర్లు, గర్రె వెంకటేశ్వర్లు, పఠాన్ జఫ్రుల్లా ఖాన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ అశయాలను కొనసాగించాలి
పెండ్లిమర్రి: పేద, బడుగు, బహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అశయాలను కొనసాగించాలని ఎంపీడీవో మల్రెడ్డి, తహశీల్దార్ అంజనేయులు పేర్కొన్నారు. అంబేడ్కర్ 126వ జయంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అనంతరం మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వెంకటన్న మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు.అలాగే పెండ్లిమర్రి వీరభద్రస్వామి దేవాళయంలో సమరసత సేవా పౌండేషన్ అధ్యక్షుడు రామలక్ష్మన్రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ రఘనాథ్‌రెడ్డి, ఏఎస్ఐ నాగన్న, వీఆర్వో ప్రసాద్, పంచాయితీ కార్యదర్శి బాస్కర్, బీజెపీ అసెంబ్లీ కన్వీనర్ బాలగురవయ్య, మండల మాల మహనాడు అధ్యక్షుడు రాజు, ఉపాధ్యాక్షుడు లారెన్స్ పాల్గొన్నారు. -
బుద్దుని ఎదుట ధ్యానం చేసిన మోదీ
-
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చులో విఫలం
హైదరాబాద్: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఏర్పడ్డ ప్రభుత్వాలు చట్టాలకు అనుగుణంగా పనిచేయాల్సిందిపోయి.. వాటిని తుంగలో తొక్కుతున్నాయని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు వచ్చే కార్యక్రమాల కోసం బడ్జెట్ నిధులు ఖర్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను సరిగ్గా ఖర్చు పెట్టడంలో విఫలమైంది. మంత్రివర్గ కూర్పులో దళితులు, మహిళలకు చోటు ఇవ్వనేలేదు.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేశారన్నారు. యాల్సి ఉంది. -
స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై : స్టాక్ మార్కెట్లు నేడు సెలవును పాటిస్తున్నాయి. గుడ్ ప్రైడే, అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు ట్రేడింగ్ ను జరుపడం లేదు. కాగ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించిన క్యూ4 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో నిన్న మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పతనమైంది. మొత్తం మీద సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 29,461 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9,151 పాయింట్ల వద్ద సెటిలయ్యాయి. శుక్రవారం సెలవుతో పాటు, శని, ఆదివారాలు కూడా మార్కెట్లు ట్రేడింగ్ ఉండకపోవడంతో దేశీయ ఈక్విటీ సూచీలకు మూడు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. మరోవైపు దేశీయ మార్కెట్లతో పాటు అమెరికా ఫైనాన్సియల్ మార్కెట్లు గుడ్ ప్రైడే సందర్భంగా నేడు సెలవును పాటించనున్నాయి. మేజర్ ఆసియన్ మార్కెట్లు కూడా గుడ్ ప్రైడే, ఈస్టర్ మండే కారణంగా ఈ రోజుల్లో ట్రేడ్ హాలిడేను ప్రకటించాయి. అమెరికా కమోడిటీస్ మార్కెట్లు అంటే గోల్డ్, క్రూడ్-ఆయిల్ ఫ్యూచర్స్ నేడు ట్రేడింగ్ జరుపవు. -
అంబేద్కర్ చిరస్మరణీయుడు: వైవీ
విజయవాడ: భారతీయుల గుండెల్లో అంబేద్కర్ చిరస్మరణీయుడని, ఆయనకు మరణం లేదని ఒంగోలు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. విలేకరులతో మాట్లాడుతూ..అంబేద్కర్ ఆలోచనలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునికి పుచ్చుకొని పని చేశారని వైవీ తెలిపారు. పేద, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దళితుల పట్ల కపటనాటకం ప్రదర్శిస్తుందని విమర్శించారు. దళితులకు ఒక్క ఇల్లు కూడా కట్టని చంద్రబాబు తాను మాత్రం విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన చంద్రబాబుకి రాజ్యంగ పట్ల ఎంత గౌరవం ఉందో అర్దమౌతుందన్నారు. తెలుగదేశంలో సరైన నాయకులు లేరని అందుకే వైఎస్సార్సీపీ నుంచి గెలిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దళితులని విస్మరిస్తోందని, ఇది ముమ్మాటికీ దళిత వ్యతిరేక ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. -
12న 3కే, 5కే రన్
– కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ కర్నూలు(అర్బన్): అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 12న అన్ని మండల కేంద్రాల్లో 3కే రన్, జిల్లా కేంద్రంలో 13న 5కే రన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ డీఎస్డీఓ మల్లికార్జునుడుని ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో ఈనెల 14న 125వ అంబేద్కర్ జయంతి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే యువతీ యువకులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేయాలన్నారు. నగరంలో 13వ తేదీ కలెక్టరేట్ నుండి కొండారెడ్డి ఫోర్ట్ వరకు 5కే రన్ నిర్వహించాలన్నారు. నర్సింగ్, మెడికల్ కళాశాల విద్యార్థులు రన్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అంబేద్కర్ సర్కిల్లో డయాస్ ఏర్పాటు, పూలమాల అలంకరణ తదితర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబును ఆదేశించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగస్వాములైన వాళ్లందరికీ సర్టిఫికెట్స్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, మెప్మా పీడీ రామాంజనేయులు, మైనార్టీ సంక్షేమాధికారి మస్తాన్ వలి, సాంఘిక సంక్షేమాధికారి తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ చైతన్యాన్ని నింపే ‘శరణం గచ్ఛామి’
విజయవాడ రైల్వే డీఎస్పీ సత్తిబాబు అమలాపురం టౌ¯ŒS : రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రిజర్వేషన్ల కోసం కల్పించిన హక్కులు, నిర్దేశించిన సూత్రాలను ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు విధిగా అమలు చేయాలో తెలుపుతూ తెరకెక్కించిన ‘శరణం గచ్ఛామి’ చిత్రం ప్రజల్లో రాజ్యాంగ చైతన్యాన్ని నింపుతుందని విజయవాడ రైల్వే డీఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు దేశానికి ఎంత అవసరమో చాటుతూ నిర్మించిన ‘శరణం గచ్ఛామి’ చిత్ర ప్రదర్శనను స్థానిక శేఖర్ స్క్రీ¯ŒS–2 థియేటర్లో ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు. అంతకు ముందు థియేటర్‌కు సమీపంలోని బుద్ధవిహార్ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంబేడ్కర్‌వాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి చిత్ర సందేశాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. రిజర్వేషన్ల వ్యవస్థపై అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఈ చిత్రం ఓ సమగ్రమైన, శాస్త్రీయమైన ఆధారపూరిత వివరణ ఇచ్చిందన్నారు. అమలాపురంలో చిత్ర ప్రదర్శనకు సహకరించిన మున్సిపల్ మాజీ చైర్మన్, కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లా విçష్ణుమూర్తి, రాష్ట్ర కాపు జేఏసీ కో కన్వీనర్ నల్లా పవ¯ŒSకుమార్‌లను అభినందించారు. విషు్టమూర్తి, పవ¯ŒSకుమార్‌లు కూడా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ చెప్పారు. చిత్రాన్ని వీక్షించేందుకువచి్చన వందలాది మంది అంబేడ్కర్‌వాదులను డీఎస్పీ సత్తిబాబు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం డీఎస్పీ సహా కోనసీమ దళిత నేతలు చిత్రాన్ని వీక్షించారు. థియేటర్ వద్ద అంబేడ్కర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పూలమాలలు వేశారు. ‘జోహార్ అంబేడ్కర్’ నినాదాలతో థియేటర్ మారుమోగింది. అంబేడ్కర్ వాదులు పెనుమాల చిట్టిబాబు, పెయ్యల పరశురాముడు, మట్టా వెంకట్రావు, పోతుల సుభాష్ చంద్రబోస్, జిల్లా ఎక్సైజ్ సిబ్బంది అసోసియేష¯ŒS అధ్యక్షుడు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గాయం పాడిన గేయం
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా... కవిత్వం, సమాజం వేరు వేరు కాదు. సమాజంలో మనుషుల మధ్య హెచ్చు తగ్గులు, దూరాలు పెరిగే కొద్దీ ప్రశ్నించే క్రమంలో కవిత్వం కూడా కొత్త రూపాలు తొడుక్కుంటుంది.మనం హాయిగా ఉన్నంత కాలం మన పాలీ మెత్తగా ఉంటుంది. మన అస్తిత్వానికి అవమానం జరిగినప్పుడు మనలో ఒకరు కవిత్వంతో తన పాలీ ద్వారా తన జాతి ఆలోచనలకి పదును పెడతారు. అలా వచ్చిన ఈ తరం కవులే ఈ పది మంది. ప్రస్తుత తెలుగు సాహిత్యంలో దళిత కవిత్వం అనగానే మనకు గుర్తుకొచ్చే పేర్లు కొలకలూరి, మద్దూరి, తెరేష్ బాబు, కలేకూరి, ఎండ్లూరి, శిఖామణి, సతీష్ చందర్, గుండె డప్పు కనకయ్య తదితరులు. ఈ పాత నీటిని ఆస్వాదిస్తూ, వారి సొంత బాట వేసుకుని తమ గొంతుకు ప్రాణం పోసుకుంటున్నారు కొత్త కవులు. దళిత సాహిత్యం అవమానాల్లోంచి, ఆర్థిక పీడనల్లోంచి, అవహేళనలలోంచి, అమానుషత్వంలోంచి పుట్టింది. దళిత బహుజన ముస్లిం సమస్యలు సాహిత్య పరంగా ఎప్పుడూ తోడుగానే ఉంటాయి. ఇటు కులానికి అటు మతానికి దెబ్బ తిన్న వారు దళిత ముస్లింలు. ముఖ్యంగా క్రైస్తవ దళిత స్త్రీలు, ముస్లిం స్త్రీలు చాలా ప్రత్యేకమైన వివక్షలతో పోరాడుతుంటారు. ఈ స్త్రీలు తమ మతాల పేరుతో ఇళ్లలోంచే స్వాతంత్య్రాన్ని కోల్పోవడం ఎదుర్కొంటారు. మత పరంగా ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి అనే సంకెళ్ళ నుంచి చదువుతో ఇప్పుడిప్పుడే బయట పడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్త్రీలకు మొదటి శత్రువు తమ ఇంటి లోని పురుషులే అవుతారు. ఊరందరికీ దళితుడు బానిసగా ఉండి ఊడిగం చేసొచ్చి తన భార్యని తనకు బానిసను చేసుకుంటాడు. ఏ స్త్రీకయినా చదువే ఆయుధం. చదువుకుని, ఆర్ధిక స్వేచ్ఛ లభించడం తోనే ఆమె ప్రథమమైన పోరాటంలో గెలుస్తుంది. ఆమె ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడంలో నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటుంది. స్త్రీలందు దళిత స్త్రీలు వేరని దళిత రచయితలు నిరంతరం వారి వాదన వినిపిస్తూనే ఉంటారు. ఆ వాదాన్ని తమ కవితలతో మరింత బలంగా వినిపిస్తున్నారు అరుణ గోగులమండ, నస్రీన్ ఖాన్, రెహానా బేగం, మెర్సీ మార్గరెట్, షంషాద్ మొహమ్మద్. అత్యాచారానికి గురైన దళిత ఆడపిల్లలు ఎందుకు ’ఇండియాస్ డాటర్స్’ కాదో బల్ల గుద్ది చెబుతారు అరుణ. జ్యోతి సింగ్ దళితురాలైతే నిర్భయ చట్టం వచ్చేదా అన్న ప్రశ్నను మనలో రేపుతోంది తన కవిత. ముస్లింలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు. మధ్యయుగంలో కాస్త బాగానే బతికుండొచ్చు కానీ రాను రాను వారి పై దాడులు, హింస పెరుగుతూనే వస్తున్నాయి. వీరు పేరుకి దళితులు కాకపోయినా అంతే అవమానాలను చవి చూస్తుంటారు. ముస్లిం రచయితలు రాసే రచనలు ముందుగా ముస్లింలే చదవాల్సిన అవసరం ఉంది. సాహిత్యం ఎక్కువగా చదవకపోయినా దళితులకు వారి సమస్యల పట్ల ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ ముస్లింలకు వారి స్త్రీలు పడే చెప్పుకోలేని ఇబ్బందులు తెలియాలంటే ముస్లిం సాహిత్యం చదవాల్సిందే. తమని తాము లోపలి నుంచి తెలుసుకోవాలంటే ఈ సాహిత్యం అనే అద్దంలో చూస్కోవాల్సిందే. నస్రీన్ ఖాన్ రాసిన ’మూలవాసీ చెట్టు’ కవితలో ఇలా అంటారు //పుట్టినచోటే నిరంకుశంగా పరాయీకరణ పాలవుతున్న వైనం అతలాకుతలం చేస్తోంది ఒకే ఇంటిలో ఉంటున్నా తమను వేరు చేయడంపై ఆవేదనను వ్యక్తం చేశారు. రెహానా ’స్వప్న శిథిలాలు’ కవితలో ముస్లిం స్త్రీల పేదరికం, పైకి చెప్పుకోలేని బాధలను కళ్ళకు కట్టారు. నిజానికి, నిజాలు రాసే తెలుగు కవులు, కథకులు కరువవుతున్న ఈ నేపథ్యంలో వీరు అచ్చంగా తమ జీవితాల్లోంచి తాము పడ్డ వేదన, హింస, అసమానతలను అక్షరీకరించడం అభినందనీయం. దళిత సాహిత్యం అనగానే వెలివాడల వెతలు, అంటరాని అకృత్యాలు మాత్రమే ఉంటాయనే అపోహ, అభియోగం ఉన్నాయి. వాస్తవానికి పేదరికంలో కష్టాలతో పాటు హాస్యం, చతురులు కూడా ఉండకపోవు.దళిత హాస్యాన్ని ఏ మాత్రం వాస్తవం లోపించకుండా గుంటూరు మాండలికంలో విరివిగా రాస్తున్నారు ఇండస్ మార్టిన్. ’నిర్దేశం’ అనే కవితలో దళితవాడ లోని జీవననాన్ని వివరిస్తూ ఇలా అంటారు మార్టిన్. కుక్కిమంచాల్లోని బక్కజీవుల్ని నిదర్లు లేపుతూంటే కదుల్తున్న కడుపుని వుగ్గబట్టుకుంటా చాప రంగçస్థలం మీద నేనాడే నిద్రానాటకం మాయమ్మకు తెలిసిపోద్ది కుండలోని ఇగం లాంటి నీళ్ళు మొకాన పడితే కుంభకర్ణుడూ కుదేలైపోవాల్సిందేనని ఆయమ్మకు నేర్పిందెవుడో మనువాదాన్ని ధిక్కరించి మూలాలను ప్రశ్నించడం తోనే దళిత కవిత పురుడు పోసుకుంది. ఆ మనువాదాన్ని వివక్ష రూపంలో తాము స్వయంగా ఎదుర్కొన్న చేదు అనుభవాల్లోంచి నిగ్గదీసి అడుగుతున్నారు నవ కవులు వేణు ఉడుగుల, దానక్క ఉదయ భాను వారి ’ప్రాచీన శవాలు’ , ’మనువ్యాధి’ కవితలలో. భారత దేశంలో దళితులపై ఎన్నో దాడులు జరిగినా తెలుగు నాట జరిగిన చుండూరు, కారంచేడు, లక్షింపేట ఉదంతాలు ఇప్పటికీ వెన్నులో వణుకు, గుండెల్లో మంట పుట్టిస్తుంటాయి. పెద్దింటి అమ్మాయిని ప్రేమించినందుకు తెలంగాణాలో మంథని మధుకర్ ని చంపిన తీరు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ దాడులకు అంతు ఉండదేమో ఇక. ఈ ఘటనల పై పసునూరి రవీందర్ ’అన్‌టచబుల్ ఎమర్జెన్సీ’ అనే పదునైన కవిత రాశారు. ‘వెలివాడలు మీ వెంటపడక ముందే మీ మస్తిష్కాల్లో తిష్ట వేసిన మౌఢ్యాన్ని పొలిమేరల అవతలికి తరమండి, మనుషులారా సరికొత్తగా బతకండి’ అంటూ హెచ్చరికతో ముగిస్తాడు. ప్రశ్నించే వాడే కవి, వెలివాడల కలల్ని గానం చేసినవాడే గాయకుడు అంటారు దళిత కవులు. నిప్పు కణికల్లాంటి అక్షరాలని నువ్వు రాయాలంటే మా మాల మాదిగ గూడేలకి రమ్మని పిలిపునిస్తాడు తంగిరాల సోని.మరుగుతున్న కొత్త నెత్తురు సురేంద్ర దేవ్ చెల్లి. ’కారంచేడు’ ను తన గోడుని చేసుకుని అగ్రవర్ణ తలలు సిగ్గుపడే ప్రశ్నతో కవితకు ముగింపు పలుకుతాడు. ఆ గాయాల సలపరాన్ని వివరిస్తూ పెద్ద కులపోళ్ల గుండెల్లో నిదురిస్తాడు. దళిత బహుజన ముస్లింల సమస్యలు చర్చించేది, వినేది కూడా వారే. పాలనలో వీరికి పరిష్కరించే వారు తక్కువ. యుగాలుగా ఇవి సమస్యలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సమాధానాలు, సంతోషాలు లేని జీవితాలు వీరివి. ఈ వివక్షను ఎదురుకొని కలసి పోరాడడానికి మరిన్ని గొంతులు కావాలి. ఎంతో సాహిత్యం రావాలి. యువత తమ పాళీని కదపాలి. -
అంబేడ్కర్.. తాత ఇంట్లో నివసించారు
ముంబై: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ బాల్యంలో సతారాలోని తాత ఇంట్లో కచ్చితంగా నివసించి ఉంటారని భావిస్తున్నందునే ఆ ఇంటిని రక్షిత నిర్మాణంగా ప్రకటించామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు బాంబే హైకోర్టులో మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ‘అంబేడ్కర్ తండ్రి రాంజీ మలోజీ సక్పల్ ఆ ప్రదేశంలో నివసించారు. ఆ ఆస్తి ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. అంబేడ్కర్ పేరు ప్రతాప్‌సింగ్ హైస్కూల్లో నమోదైంది. అప్పుడు ఆయన ఎక్కడ నివసించాడో రికార్డుల్లో లేకున్నా.. చుట్టుపక్కల ఇళ్లేవీ లేకపోవడంతో కచ్చితంగా తండ్రితో కలసి ఆ ఇంట్లోనే జీవించి ఉంటారు’ అని వివరించింది. ఈ ఆస్తిని ప్రభుత్వం రక్షణ నిర్మాణంగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ లక్ష్మణ్ ఆమ్నే అనే వ్యక్తి ఇటీవల కోర్టుకెక్కారు. దీనిపై కోర్టు ప్రభుత్వాన్ని వివరణ కోరింది. -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
గుడివాడ టౌన్ : ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి మరోసారి అవమానం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత నేత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం దుండగుల చేతుల్లో ధ్వంసమైంది. రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఖండన.. భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో జీవిస్తున్నామంటే అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ ఫలమేనని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అన్నివేళల్లో అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆయనను అవమాన పరిచామనుకుంటే భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరచినట్లేనన్నారు. ఈ విధమైన చర్యలకు స్వస్తి పలకాలని ఆయన హితవుపలికారు. ఎమ్మెల్యే నానితో పాటు కౌన్సిలర్ గొర్ల శ్రీను, కో–ఆప్షన్ సభ్యుడు సర్ధార్‌బేగ్, వైఎస్సార్ సీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఖర్చులతో విగ్రహం నిర్మిస్తాం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయ డం నీచమైన చర్యని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సంఘటన స్థలం వద్ద దళిత సంఘాల నాయకులు, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితరులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ మున్సిపల్ నిధులతో ఇక్కడే భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత సంఘాల నాయకులు, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారీ ర్యాలీ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ దళిత నాయకులు, పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నుంచి నెహ్రూచౌక్ వరకు దోషులను శిక్షించాలి, నిందితులను అరెస్టు చేయాలి, జోహార్ అంబేడ్కర్ అంటూ ర్యాలీ కొనసాగింది. స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటాం సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ అంకినీడు ప్రసాద్ మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్యని నిందితులు ఎంతటి వారైనా సాధ్యమైనంత త్వరలో పట్టుకుని అరెస్టు చేస్తామన్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్‌ను తీసుకువచ్చామని, అది సంఘటన సమీపంలోని కొన్ని స్థలాల్లో సంచరించిందని తెలిపారు. తమకున్న సమాచారంతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
హైదరాబాద్ చేరుకున్న అంబేడ్కర్ విగ్రహ కమిటీ
⇒ త్వరలో సీఎం కేసీఆర్‌కు నివేదిక: కడియం ⇒ 9 రోజుల పాటు చైనాలో భారీ విగ్రహాల తయారీపై అధ్యయనం చేసిన కమిటీ సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసేందుకు అవసరమైన అధ్యయనం కోసం చైనా వెళ్లిన అంబేడ్కర్ విగ్రహ కమిటీ బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ సభ్యులు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ లు బాల్క సుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్, ఇతర అధికారులు 9 రోజులపాటు చైనాలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహా లను సందర్శించారు. వాటిని తయారు చేసిన కంపెనీలు, నిర్వహణ చేస్తున్న కమిటీ లతో చర్చించారు. ఈ కమిటీ చైనాలోని షాంఘై, నాన్జింగ్, వుక్సి, లింగ్ షాన్, హాం కాంగ్ వంటి నగరాల్లో పర్యటించింది. ఇందులో వుక్సిలో 88 మీటర్ల (289 అడు గుల) ఎత్తైన విగ్రహాన్ని, హాంకాంగ్ లో 70 మీటర్ల (220 అడుగుల) ఎత్తైన బుద్ధుని విగ్రహాన్ని ఈ కమిటీ సందర్శించింది. షాంఘై ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ కంపెనీ, ఏరోసన్ ఇంజనీరింగ్ కంపెనీలు భారీ విగ్రహాలు రూపొందించడంలో ప్రఖ్యాతి గాంచినవని కమిటీ తెలిపింది. హైదరాబాద్ లో అంబేడ్కర్ భారీ విగ్రహ ఏర్పాటు, స్మృతి వనం రూపకల్పనపై ఆయా కంపెనీల ఆసక్తి, భాగస్వామ్యంపై చర్చించారు. త్వరలోనే తాము సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేస్తామని కడియం పేర్కొన్నారు. -
హాంకాంగ్ బుద్ధ విగ్రహాన్ని దర్శించిన కమిటీ
హైదరాబాద్ రాగానే సీఎంకు నివేదిక: కడియం సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా చైనాలో పర్యటిస్తున్న అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీ మంగళవారం హాంకాంగ్‌లో బుద్ధ విగ్రహాలున్న ప్రదేశాల్లో పర్యటిం చింది. గ్యుయాన్‌ఇన్ బుద్ధ విగ్రహాన్ని సందర్శించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దాదాపు 70 మీటర్ల ఎత్తైన బుద్ధ విగ్రహం (220 అడుగులు) అక్కడ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. చైనాకు చెందిన ఏరోసన్ కంపెనీ దీనిని ఏర్పాటు చేసిందని చెప్పారు. భారీ విగ్రహాలను ఏర్పాటు చేయ డానికి కావాల్సిన మొత్తం సమాచారాన్ని, అన్ని అంశాలను, సాంకేతికంగా, తయారీ పరంగా అన్ని విషయాలను ఆ కంపెనీ ద్వారా తెలుసుకున్నామన్నారు. భారీ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నైపుణ్యం, మానవ వనరులు ఆ కంపెనీకి ఉన్నాయన్నారు. దీనిపై హైదరాబాద్‌కు వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందిస్తామన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఇచ్చే ఆదేశాలను బట్టి వీలైనంత త్వరగా హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే పనులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ బృందంలో కడియం శ్రీహరితోపాటు విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, ఆరూరి రమేశ్ ఇతర అధికారులు ఉన్నారు. -
పథకాలు సమర్థవంతంగా అమలుచేయాలి
అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ దిలావర్పూర్ : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తోపాటు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు డి.జగన్మోహన్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘ సర్వసభ్య సమావేశానికి జగన్మోహన్ హాజరై మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానం, ఆశయాలు గ్రామ గ్రామానికి తీసుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా దిలావర్పూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొల్ల దయాకర్, ఉపాధ్యక్షుడిగా దండి రాజు, కార్యదర్శిగా రావుల రవి, సంయుక్త కార్యదర్శిగా సప్పల రవి, జి.మధుకర్, కోశాధికారిగా పోల లస్మన్న, ప్రచార కార్యదర్శిగా సప్పల మహేశ్, మద్ది మహిపాల్, కార్యవర్గసభ్యులుగా సాద అజయ్‌కుమార్, చిట్టి శ్రీనివాస్, డి.కరుణాకర్, సాద అమృత్‌రావు, మాయాపూర్ సాయన్న, గౌరవ సలహాదారులుగా రాజరత్నం, బ్యాగరి సుధాకర్, రావుల శ్యామ్యూల్, దుర్కి డేవిడ్, వినయ్సాగర్లను ఎన్నుకున్నారు. సోషల్డెమొక్రటిక్ అలయెన్స్ ప్రతినిధులు విజయ్ చంద్రప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు. -
తొలిసారి మహిళా ఫుట్‌బాల్ లీగ్
న్యూఢిల్లీ: భారత క్రీడారంగం చరిత్రలో మరో కొత్త లీగ్‌కు తెర లేవనుంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి తొలిసారిగా ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) జరగనుంది. వచ్చే నెల 14 వరకు జరిగే ఈ లీగ్‌ను మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగే పోటీల్లో జెప్పియార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎఫ్‌సీ (పుదుచ్చేరి), ఎఫ్‌సీ అలఖ్‌పురా (మిజోరం), ఎఫ్‌సీ పుణే సిటీ (మహారాష్ట్ర), రైజింగ్ స్టూడెంట్ క్లబ్ (ఒడిషా), ఈస్టర్న్ స్పోర్టింగ్ యూనియన్ (మణిపూర్) పేరిట ఆరు జట్లు పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్‌తోపాటు ఐడబ్ల్యూఎల్ చైర్పర్సన్ సారా పైలట్ కూడా పాల్గొన్నారు. -
వంద ‘ఫీట్ల’ విస్తరణ
► ఇష్టారాజ్యంగా పనులు ► అనధికారికంగా ఇరువైపులా కలిపి 80 ఫీట్లకే కుదింపు ► డ్రెయినేజీ నిర్మాణంలోనూ నిబంధనలు గాలికి.. గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు ప్రధాన రహదారిని విస్తరించాలని గతంలో నిర్ణయించారు. ఈమేరకు 2015 ఫిబ్రవరి 28న జరిగిన సాధారణ సమావేశంలో పాలకవర్గం తీర్మానించింది. జీవో 199, ఎంఏ 11–05–2001 ప్రకారం వంద ఫీట్ల వెడల్పుతో విస్తరించనున్నట్లు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తారు రోడ్డు నిర్మాణం చేపట్టిన సింగరేణి గోదావరిఖని పట్టణంలో 3.1 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారిని విస్తరించేందుకు పాలకవర్గంతోపాటు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కార్మిక సంఘాల నాయకులు సింగరేణి యాజమాన్యాన్ని రహదారి పనులు చేపట్టాలని కోరడంతో అంగీకరించింది. రూ.6.50 కోట్లను విడుదల చేయడంతో మంచిర్యాలకు చెందిన కాంట్రాక్టర్ ద్వారా రూ.5.75 కోట్ల మేరకు తారురోడ్డు పనులను పూర్తి చేయించారు. మొత్తం వంద ఫీట్ల రోడ్డు విస్తరణలో డివైడర్ నుంచి ఇరువైపులా 50 ఫీట్ల రోడ్డులో 25 ఫీట్ల మేర సింగరేణి ఆధ్వర్యంలో తారురోడ్డు నిర్మించారు. మిగతా 25 ఫీట్లలో ఇరువైపులా ఎవరు రహదారిని ఆక్రమించకుండా చివరలకు ఐదు ఫీట్ల వరకు రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రెయినేజీని నిర్మించాలకి నిర్ణయించారు. తారు రోడ్డుకు, డ్రెయినేజీ నిర్మాణానికి మధ్యలో ఉన్న 20 ఫీట్లమట్టి రోడ్డును ఖాళీగానే వదిలి పెట్టాలి. ఏం జరుగుతుంది...? కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రూ.రెండు కోట్ల 92 లక్షల 50వేల కార్పొరేషన్ నిధులతో రహదారికిరువైపులా వర్షపు నీరు వెళ్లేందుకు 2016 మే 1న డ్రెయినేజీ పనులకు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రధాన చౌరస్తా సమీపం వరకు అక్కడక్కడ పనులు చేపట్టగా...అవి అస్తవ్యస్తంగా మారాయి. కార్పొరేషన్ కార్డుల్లో వంద ఫీట్ల రహదారి విస్తరణ చేపట్టి అందుకనుగుణంగా డ్రెయినేజీ పనులు చేస్తున్నట్లు నమోదు చేసినా... వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. సాక్షాత్తు కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోనే రహదారి విస్తరణ 80 ఫీట్లకు కుదించగా...డ్రెయినేజీ పనులూ ఇరువైపులా వేర్వేరుగా సాగుతున్నాయి. కార్పొరేషన్ కార్యాలయం, రాజేశ్ టాకీస్ ఏరియా, గాంధీనగర్ వద్ద, టీఎన్ టీయూసీ కార్యాలయం వద్ద డ్రెయినేజీ పనులను ఒక్కోక్క చోట 40 నుంచి 50 ఫీట్లుగా మార్కింగ్ చేసి చేపట్టారు. దీంతో కాలువ వంకరటింకరగా మారింది. జూనియర్ కళాశాల ఎదురుగా ఒక వైపు డ్రెయినేజీ పనులు ఎక్కువ వెడల్పుతో, మరో వైపు రహదారిపై ఉన్న నిర్మాణాలకు నష్టం కలగకుండా తక్కువ వెడల్పుతో నిర్మించారు. ఇలా ఒకే రహదారిపై ఒక్కో చోట రహదారి కుదించుకుపోవడం అనుమానాలకు తావిస్తోంది. సింగరేణి ప్రహరీని ముట్టుకోని కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా సింగరేణి యాజమాన్యం కార్మికుల కోసం క్వార్టర్లను నిర్మించింది. ఈక్రమంలో బయటివ్యక్తులు సింగరేణి స్థలంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారనే ఉద్దేశంతో క్వార్టర్ల చుట్టూ ప్రహరీ నిర్మించింది. అయితే వంద ఫీట్ల రహదారిని విస్తరించే క్రమంలో సింగరేణి ప్రహరీఅడ్డురావడంతో దానిని కూల్చివేయడానికి కార్పొరేషన్ యంత్రాంగం మార్కింగ్ చేసింది. ఇదిలా ఉండగా...ఈ గోడ ఎత్తు పెంచేందుకుగాను కార్పొరేషన్ అనుమతినివ్వాలని కోరుతూ సింగరేణి ఆర్జీ–1 జీఎం 2015 నవంబర్ 19న కార్పొరేషన్ కమిషనర్‌కు లేఖ రాశారు. కానీ వందఫీట్లతో రహదారిని విస్తరిస్తున్నందున అడ్డుగా ఉన్న ప్రహరీని కూల్చివేయాలని, ప్రస్తుతం దాని ఎత్తు పెంచేందుకు వీలు లేదంటూ కార్పొరేషన్ నుంచి సింగరేణికి లేఖ పంపించారు. ప్రస్తుతం రహదారి విస్తరణలో సింగరేణి ప్రహరీగోడను కూల్చకపోగా.. దానికి అనుకుని ఉన్న డ్రెయినేజీ కాల్వనే కొనసాగించడం గమనార్హం. పేరుకు వంద ఫీట్లతో కాగితాలపై రాసుకున్న పాలకవర్గం ఆచరణలో 80 ఫీట్లు, అంతకన్నా తక్కువగా విస్తరించడం, డ్రెయినేజీ పనులు అస్తవ్యస్తంగా, ఇష్టారాజ్యంగా చేపట్టడం ప్రమాదాలను నెలవుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు రాజేశ్ టాకీస్ నుంచి మార్కండే కాలనీమీదుగా అడ్డగుంటపల్లి వరకు రహదారి విస్తరణలో భవనాలను బలవంతంగా కూల్చివేయిస్తున్న పాలకవర్గం మరోవైపు కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు ఇష్టంవచ్చినట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. -
అంబేద్కర్‌కు నివాళి
నారాయణఖేడ్: అంబేద్కర్ వర్ధంతిని నారాయణఖేడ్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్వార్ గ్రామంలో దళితులతో కలిసి బీజేపీ నాయకులు సహపంక్తి భోజనాలు చేశారు. రాజీవ్‌చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని సూచించారు. అవినీతి రహిత సమాజం బీజేపీ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా నకిలీనోట్లు, నల్లధనం నివారణ కోసం పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులకు సహాయం అందకుండా పోయిందన్నారు. ఇందుకు ప్రజల ఆమోదం ఉందన్నారు. తాత్కాలింకగా ఇబ్బందులున్నా శాశ్వతంగా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ వెంకటేశం, నాయకులు అమర్‌సింగ్, కృష్ణ, సంగమేశ్వర్, సిద్దయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్‌కు ఎంపీల ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పలు పార్టీల ఎంపీలు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్ రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బి.బి.పాటిల్, నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, మాగంటి వెంకటేశ్వరరావు, మురళీమోహన్, గల్లా జయదేవ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. -
దళితులు మరింత అభివృద్ధి చెందాలి
విజయవాడ (భవానీపురం) : సమాజంలో అప్పటికి, ఇప్పటికీ కులవ్యవస్థ వేళ్లూనుకునే ఉందని, ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 60వ మహాపరి నిర్యాణం సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దళితులు వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించే స్థాయికి చేరాలని ఆయన కోరారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద 250 మంది విద్యార్థులను విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు పంపామని చెప్పారు. అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించడంతోపాటు స్ఫూర్తి భవన్‌ను నిర్మించి లైబ్రరీ నెలకొల్పుతామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు రామారావు మాట్లాడుతూ దేశంలో లక్షలాది మందికి దారిచూపిన అంబేడ్కర్ మహాపరి నిర్యాణం పొందిన ఈ రోజును ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సౌదా అరుణ అనువదించిన 'అంబేడ్కర్ వర్ణ నిర్మూలన', 'అంబేడ్కర్ ఆత్మకథ' పుస్తకాలను మంత్రి రావెల ఆవిష్కరించారు. వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ డైరెక్టర్లు ప్రసాద్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం’
పాత గుంటూరు: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో పూలే, అంబేడ్కర్ అధ్యయన కేంద్రం నిర్వహణలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ సింధూరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్.డి.విజయభాస్కర్ కలం నుంచి వెలువడిన నాటకాన్ని పడమటి గాలి సృష్టికర్త పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో జిల్లా రిజిష్ట్రర్.ఎస్.బాలస్వామి, కె.రవిశేఖర్, ఎస్.ఎమ్.ప్రకాష్‌కుమార్. డాక్టర్.నూతక్కి సతీష్, టి.రజనీకాంత్, డాక్టర్.కాకాని సుధాకర్, జి.సుకుమార్,అబ్దుల్‌వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
ఆందోళన చేపట్టిన దళిత సంఘాలు ∙ విగ్రహానికి దొరబాబు క్షీరాభిషేకం పిఠాపురం రూరల్ : పిఠాపురం మండలం పి.తిమ్మాపురం ఎస్సీ కాలనీలోని అంబేడ్కర్ విగ్రహం చూపుడువేలును ఆదివారం తెల్ల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా విగ్రహంపై పేడను చల్లారు. విషయం తెలుసుకున్న దళిత సంఘ నేతలు ఆదివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో పిఠాపురం మండల పరిధిలోని పి.తిమ్మాపురం, చిత్రాడ గ్రామాల్లోని అంబేడ్కర్ విగ్రహాలపై దాడులు జరపడం దారుణమన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, పిఠాపురం సీఐ ఉమర్, రూరల్ ఎస్సై వి.సుభాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి చూపుడు వేలుకు మరమ్మతులు చేయించారు. దళిత సంఘ నేతలు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎ¯ŒS వర్మలు పూలమాలలు వేసి అంబేడ్కర్‌కు ఘన నివాళులర్పించారు. దళిత సంఘ నేతలు ఆర్ఎస్.దయాకర్, గుబ్బల రాజు, దానం లాజర్‌బాబు, దారా వెంకట్రావు, మూరా కరుణ, బోను దేవ, పాల్గొన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలి అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే అంబేడ్కర్‌కు అవమానాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాల వద్ద పోలీసు పహరా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట పైలా సత్యనారాయణమూర్తి, పైలా నాయుడు, లోకారపు సతీష్ తదితరులు ఉన్నారు. -
చిత్రాడలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
పిఠాపురం రూరల్ : చిత్రాడ ఎస్సీ కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గురువారం దళిత సంఘ నేతలు ఆందోళనకు దిగారు.నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం–కాకినాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వారితో సీఐ ఉమర్, ఎస్.ఐ. కోటేశ్వరరావు చర్చించారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌తో ఫో¯ŒSలో మాట్లాడారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. నిందితులను వెంటనే అరెస్టు చేయకుంటే దళితులకు మద్దతుగా ఆందోళనకు దిగుతానని దొరబాబు హెచ్చరించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిస్థితిని సమీక్షించారు. చిత్రాడ అంబేడ్కర్ యువజన సంఘ సభ్యుల ఫిర్యాదు మేరకు పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మాలమహానాడు సంఘ నేతలు ఆర్ఎస్ దయాకర్, దానం లాజర్‌బాబు, వర్థనపు కృష్ణవంశీ, దారా వెంకట్రావు, ఉలవల భూషణం, బోను దేవ, పచ్చిమళ్ల అప్పలరాజు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గండేపల్లి బాబీ, సంయుక్త కార్యదర్శి కర్రి ప్రసాద్, నేతలు బొజ్జా రామయ్య, బత్తిన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ స్టడీ సర్కిల్ అడ్‌హక్ కమిటీని రద్దు చేయాలి
మెదక్ మున్సిపాలిటీ: బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ అడ్‌హక్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకులాలను విస్మరించడం అన్యాయమని దళిత బహుజన ఐక్య వేదిక నాయకులు ఆగ్రహంవ్యక్తంచేశారు. దళిత ఐక్య వేదిక సమావేశం మంగళవారం మెదక్పట్టణలలోని ఆర్అండ్బి అతిథిగృహంలో జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, ఓ వర్గం వారు అంబేద్కర్ తమ సొంతం అన్నట్లు అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేయడం దారుణమన్నారు. అంబేద్కర్ సమాజంలోని అన్ని కులాల ఆరాధ్యుడన్నారు. అడహక్ కమిటీని రద్దు చేసి, తిరిగి అన్ని కులాలను కలుపుకొని కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రామస్వామి, అనంతరావు, దేవయ్య, శంకర్, శేఖర్, భాస్కర్, డానియల్, వినయ్‌సాగర్, అభి, ప్రసాద్, యేసు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులకు చంద్రబాబు ద్రోహం
తూర్పుదిగవల్లి(నూజివీడు రూరల్) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు ద్రోహం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితవాడలోఅంబేడ్కర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. తొలుత రమణక్కపేట అడ్డ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి తొలుత పూల మాల వేసి నివాళులర్పించారు. మేరుగ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటించారని పేర్కొన్నారు. టీడీపి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని చెప్పారు. మహానేత ఆశయాలు నెరవేరాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్మోçßæన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందన్నారు. ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రిజర్వేషన్లు అంబేడ్కర్ కృషి ఫలితామేనని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం విలువ లేకుండా చేసిందని పేర్కొన్నారు. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మహానేత వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రమించవద్దన్నారు. విగ్రహవిష్కరణ అనంతరం భారీ అన్నదానం చేశారు. కార్యక్రమంలో నూజివీడు, చాట్రాయి జెడ్పీటీసీ సభ్యులు బాణావతు రాజు, దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పల్లె రవీంద్రరెడ్డి, కోటగిరి గోపాల్, కలగర వెంకటేశ్వరరావు, సర్పంచి నక్కనబోయిన వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు బూరుగు ప్రతాప్ పాల్గొన్నారు. -
ప్రేమికుడితోనే పెళ్లి జరిపించాలని...
విజయనగరం: ప్రేమించిన యువకుడితోనే తన పెళ్లి జరిపించాలని కోరుతూ ఓ యువతి నిరాహార దీక్షకు కూర్చుంది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన దొనక రోహిణి(20), తాపీ మేస్త్రీగా పని చేస్తున్న వరప్రసాద్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆమెకు వరప్రసాద్ అబార్షన్ చేయించాడు. రోహిణి పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ వర ప్రసాద్ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇటీవల గట్టిగా నిలదీయగా ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వరప్రసాద్‌కు స్థానిక టీడీపీ నేతలు కొమ్ముకాయటంతో రోహిణి ఫిర్యాదును పోలీసులు పట్టించుకో లేదు. దీంతో విసిగిపోయిన రోహిణి వారం క్రితం పోలీస్‌స్టేషన్‌లోనే పురుగు మందు తాగేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు ఆమెను వారించి నచ్చ చెప్పి ఇంటికి పంపారు. తనకు న్యాయం దక్కేలా లేదని భావించిన బాధితురాలు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షకు పూనుకుంది. వరప్రసాద్‌తోనే తనకు వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఆమెకు బీజేపీ, సీపీఎం, ఐద్వా, సీఐటీయూ తదితర ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. -
అంబేద్కర్ స్టేడియం సుందరీకరణకు రూ.10 లక్షలు
పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే అథ్లెటిక్ పోటీలను విజయవంతం చేయాలి కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో అక్టోబర్ 4, 5 తేదీల్లో జరిగే సౌత్ ఇండియా అథ్లెటిక్ పోటీలను అట్టహాసంగా నిర్వహించాలని ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని, స్టేడియం సుందరీకరణకు ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్టేడియంలో అథ్లెటిక్ పోటీలు జరగనున్న నేపథ్యంలో వారు స్టేడియాన్ని సోమవారం పరిశీలించారు. అథ్లెటిక్ ట్రాక్, స్టేడియంలోని మైదానాలు చూశారు. స్టేడియానికి కావాల్సిన వాటిపై నివేదికలు ఇవ్వాలని డీఎస్డీఓకు సూచించారు. మైదానంలో నీరు నిలుస్తున్నందున డ్రెయినేజీ వ్యవస్థను బాగా చేయించుకుని సుందరంగా తీర్చిదిద్దేలా చేయాలన్నారు. సింథటిక్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రూ.10లక్షలతో గ్యాలరీలకు రంగులు వేయాలని, మరమ్మతు పనులకు వినియోగించాలని డీఎస్డీఓ శివకుమార్‌కు సూచించారు. అథ్లెటిక్ పోటీలను విజయవంతం చేయాలి రాష్ట్ర, జిల్లా అథ్లెటిక్ సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 4,5 తేదీల్లో జరగనున్న దక్షిణ భారతస్థాయి అథ్లెటిక్ పోటీలను విజయవంతంచేయాలని పోటీల నిర్వహణ కమిటీ చీఫ్ ప్యాట్రన్, ఎంపీ వినోద్ కుమార్, చైర్మన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. స్టేడియం పరిశీలించిన అనంతరం వారు విలేకరులకు పోటీల వివరాలను వెల్లడించారు. అండర్ 16, 18, 20, 22 బాలబాలికలకు నిర్వహించే ఈ పోటీలకు 7రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని తెలిపారు. క్రీడాకారులకు ఉచితభోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ మేయర్, పోటీల అధ్యక్షుడు రవీందర్ సింగ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు, పోటీల నిర్వహణ కార్యదర్శి నందెల్లి మహిపాల్, డీఎస్డీవో శివకుమార్, యోగా సంఘం కార్యదర్శి సిద్దారెడ్డి పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
ముస్తాబాద్ : కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన దళిత సంఘాల నాయకులు విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
ట్యాంక్‌బండ్ వద్ద టీఎస్ వైఎస్ఆర్ సీపీ నిరసన
-
గట్టు శ్రీకాంత్‌రెడ్డికి అస్వస్థత
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా అఖిలపక్ష సమావేశానికి వైఎస్ఆర్ సీపీని ఆహ్వానించకపోవడంపై ళ టీఎస్-వైఎస్ఆర్ సీపీ ఇవా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో గట్టు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటీన ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది. -
ట్యాంక్‌బండ్‌పై టీ-వైఎస్ఆర్సీపీ నిరసన
హైదరాబాద్: ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీ-వైఎస్ఆర్సీపీ నిరసనకు దిగింది. తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ఆర్సీపీ నేతలు ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
‘అంబేద్కరిజం–ఉద్యోగుల పాత్ర’పై 10న సదస్సు
హన్మకొండ : భారత రాజ్యాంగ నిర్మా త బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ది యునైటెడ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు సాదు మహేందర్ తెలిపారు. ఈ మేరకు సదస్సు కరపత్రాలను హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు.10వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు హన్మకొండ నక్కలగుట్టలోని విద్యుత్ ఇంజనీర్స్ గెస్ట్‌హౌస్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు.‘అంబేద్కరిజం–ఉద్యోగుల పాత్ర’ అంశంపై జరగనున్న ఈ సదస్సులో సౌత్ ఇండియా సమాతా సైనిక్దల్ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కాంబ్లే, ది యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు జి.ఎస్.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి బి.భద్రూనాయక్, రాష్ట్ర అ ధ్యక్షుడు మామిడి నారాయణ ప్రసం గిస్తారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉ ద్యోగులు పాల్గొని విజయవంతం చే యాలని కోరారు. ఫోరం నాయకులు వై.కొండల్రావు, కవిరాజారావు, రమేష్‌కుమార్, విష్ణుమూర్తి, కె.ఎల్లయ్య, రాజ్‌కుమార్, జితేందర్ పాల్గొన్నారు. -
నిందితులను అరెస్టు చేయాలి
లోకేశ్వరం : అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపర్చిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌వాఘ్మారే అన్నారు. గురువారం మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 6న మండలంలోని రాయపూర్‌కాండ్లీలో గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి లోకేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వరకు మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘాల సభ్యులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని దళిత సంఘాల నాయకులు తరలి రావాలని కోరారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిరిధర్ జాంగ్మే, ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ జాడే, తాలూకా యూత్ అధ్యక్షుడు గౌతం పింగ్లే, అంబేద్కర్ మండల ప్రధాన కార్యదర్శి దండే రమేష్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, రత్నయ్య పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహానికి అవమానం
చెప్పుల మాల వేసిన దుండగులు రాయపూర్‌కాండ్లీలో ఘటన నిరసనగా బంద్ పాటించి ధర్నాకు దిగిన నాయకులు దోషులను శిక్షించాలని డిమాండ్ లోకేశ్వరం : మండలంలోని రాయపూర్‌కాండ్లీ గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల మాల వేశారు. శనివారం దీనిని గమనించిన గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఉన్న చెప్పుల మాలను దళిత నాయకుల సమక్షంలో తొలగించారు. అవమానపర్చిన విగ్రహానికి అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు గౌరోల్ల దిగంబర్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. విషయం తెలుసుకున్న లోకేశ్వరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తర్వాత భైంసా డీఎస్పీ అందె రాములు, ముథోల్ సీఐ రఘుపతి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలి అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల మాల వేసిన దోషులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు భీంరావు డోగ్రె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నిరసనగా లోకేశ్వరం, ధర్మోరా, రాయపూర్‌కాండ్లీ తదితర గ్రామాల్లో కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించారు. మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బర్ల రాజ్‌కుమార్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు దిగంబర్, రాయపూర్‌కాండ్లీ అధ్యక్షుడు ప్రేమానందం, నాయకులు భోజన్న, పురుషోత్తం, శ్రీరాములు, మాదరి ఆంజనేయులు, ముత్తన్న, శంకర్, బాబన్న, దండే రమేశ్, గంగాధర్, ఆనందం, సుంకరి భోజన్న, రత్నయ్య, భీమన్న, దేవన్న, గంగన్న, మోషన్న, దేవిదాస్, సాగర్, సదానందం పాల్గొన్నారు. వెంటనే పట్టుకుంటాం రాయపూర్‌కాండ్లీలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల మాల వేసిన దోషులను వెంటనే పట్టుకుంటామని భైంసా డీఎస్పీ అందె రాములు అన్నారు. అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ లోకేశ్వర్‌రావు, ముథోల్ సీఐ రఘుపతి, లోకేశ్వరం ఏఎస్సై దయానంద్, వీఆర్వో లక్ష్మణ్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, నాలం గంగాధర్, నందకేశ్వర్రావు, మెండే శ్రీధర్, రాజేశ్వర్, వీడీసీ చెర్మన్ దేవేందర్ ఉన్నారు. -
‘కరెన్సీ’పై అంబేడ్కర్ ఉండాల్సిందే!
అరండల్‌పేట: ఇండియా కరెన్సీ నోటుపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బొమ్మను ముద్రించాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి డిమాండ్ చేశారు. ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ కార్యాలయంలో శనివారం కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ ఇండియా కరెన్సీ నోటుపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బొమ్మను ముద్రించాలని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇండియా రూపాయి ఇలా ఉండాలని సృష్టించిన కర్త అంబేడ్కర్ అని అన్నారు. అంబేడ్కర్ బొమ్మను ఇండియా కరెన్సీపై ముద్రించాలని ఆర్థిక శాఖ మంత్రికి ఫ్యాక్స్ రూపంలో వినతి పత్రం పంపించామన్నారు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీన చలో ఢిల్లీ చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించడం, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళతామన్నారు. -
అంబేడ్కరిజం, మార్కిజం కలిస్తేనే అభివృద్ధి
సీపీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణ పొన్నూరు : భారతదేశంలో దళితుల కోసం నిరంతరం కృషిచేస్తున్న అంబేడ్కరిజం, మార్సిజం కలిస్తేనే బహుజనులు అభివృద్ది సాధించగలరని సీపీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. దళిత మహాసభ నేత కత్తి పద్మారావు 63వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్హయ్యకుమార్ కూడా లాల్‌సలాం నీల్‌సలాం అని చెప్పారని గుర్తుచేశారు. అనంతరం పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో సత్తెనపల్లి నలంద కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్, ప్రొఫెసర్ పట్టేటి రాజశేఖర్, మట్టా ఝాన్సీ, న్యాయవాది పిల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ యూనివర్సిటీ ఓవరం
రాజంపేట టౌన్: చదువుకునే వయస్సులో వివిధ కారణాల రీత్యా డిగ్రీ, పీజీ వంటి కోర్సులను చదవలేని వారికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓ వరం లాంటిదని ఆ యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్వీ కృష్ణారెడ్డి (ఎల్వీకే) తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జగదీష్క్రిష్ణకుమార్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.శివశంకరయ్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీజీ వంటి కోర్సులను చేసి అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారన్నారు. 18 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు, వయో ధృవీకరణ పత్రం ఉంటే ఎవరైనా డిగ్రీలో ప్రవేశానికి అర్హత పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపారు. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం యూనివర్సిటీ ఈ ఏడాది రెండవ మారు డిగ్రీలో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 29వ తేదీలోపు ఏపీ ఆన్లైన్లో 225 రూపాయిలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లోని యూనివర్సిటీ రీజనల్ కో–ఆర్డినేషన్ సెంటర్లలో అర్హత పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే పీజీ, డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లకు కూడా నోటిఫికేషన్ జారీ అయినట్లు ఎల్వీకే తెలిపారు. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులకు ఆగస్టు 14వ తేదీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎల్వీకే తెలిపారు. ఆగస్టు 6వ తేదీలోపు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ పెంచలయ్య, అల్లం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత
సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీ గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రోహిత్ చిత్రపటంతో ఊరేగింపు జరిపారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
సెంటినరీకాలనీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సెంటినరీకాలనీలోని రాణీరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో మంగళవారం నిర్వహించే యోగా కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని ఆర్జీ-3, ఏపీఏ జీఎంలు ఎంఎస్ వెంకట్రామయ్య, చం ద్రశేఖర్ కోరారు. స్థానిక జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో సోమవారం మాట్లాడా రు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21న మధ్యాహ్నం 3 గంటలకు సేవా భవనం నుంచి క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహిస్తామని, 4 గంటలకు మెగా యోగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, పాఠశాలల విద్యార్థులు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. యైటింక్లయిన్‌కాలనీ :అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యైటింక్లయిన్‌కాలనీలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్జీ-2 జీఎం విజయపాల్‌రెడ్డి తెలిపారు. జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉ దయం 7 నుంచి 8గంటల వరకు సీఈఆర్ క్లబ్లో యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి సీఈఆర్ క్లబ్ వరకు ర్యాలీ ఉం టుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతి థిగా డెరైక్టర్ మనోహర్‌రావు హాజరవుతారని చెప్పారు. అనంతరం సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసిన మల్టీజిమ్‌ను డెరైక్టర్ ప్రారంభిస్తారని తెలి పారు. సమావేశంలో అధికారులు రవీందర్, రాజేశ్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. -
జనం గొంతుక... సాక్షి
► టీవీ ప్రసారాలు తక్షణం పునరుద్ధరించాలి ► అనంతలో జర్నలిస్టుల నిరసన ► అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన అనంతపురం టౌన్ : జనం గొంతుకైన ‘సాక్షి’ మీడియాను నియంత్రించాలనుకోవడం మంచి పద్ధతి కాదని జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడ్డారు. తక్షణం టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓ టీవీ చానల్ ప్రసారాలు రాకుండా చేస్తే గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు ‘సాక్షి’పై కక్షకట్టడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ మీడియా ఎండగడుతోందని, దీన్ని జీర్ణించుకోలేక ముద్రగడ దీక్షను సాకుగా చూపి ఇలాంటి చర్యలు దిగడం మంచిది కాదని హితవు పలికారు. మోసాలకు పాల్పడే వారి పట్ల మీడియా ఎప్పుడూ యుద్ధం చేస్తుందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించకుంటే ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రిటీష్ తరహా పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మీసార రంగన్న అన్నారు. కార్యక్రమంలో కదలిక ఎడిటర్ ఇమాం, ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్, జాప్ నేతలు రామాంజనేయులు, రవిచంద్ర, చలపతి, రామ్మూర్తి, జయరాం, సాయినాథరెడ్డి, చౌడప్ప, అనిల్‌కుమార్‌రెడ్డి, వీరశేఖరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, నగర యూత్ అధ్యక్షుడు మారుతీనాయుడు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.నరేంద్రరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.విద్యాసాగర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నపూస రామచంద్రారెడ్డి, నాయకులు గోపాలమోహన్, ఆర్.పురుషోత్తం, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అత్యధికుల గమ్యస్థానం అమెరికానే!
‘అంబేడ్కర్ ఓవర్సీస్’ కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు విదేశాల్లో ఉన్నత చదువుకు వెళ్లిన 268 మంది ఎస్సీ విద్యార్థుల్లో 241 మంది, 72 మంది ఎస్టీ విద్యార్థుల్లో 60 మందికిపైగా అమెరికాలోని కోర్సులను, అందులోనూ ఎక్కువ ఇంజనీరింగ్‌లో ఎమ్మెస్ను ఎంచుకున్నారు. షెడ్యూల్డ్కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి రూపంలో ఉన్నతవిద్యా స్పప్నం ఫలిస్తోంది. 2013-14లో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రూ.10 లక్షల మేర ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న ఆర్థిక సహాయం సరిపోవడంలేదు. దీంతో అప్పు చేస్తే తప్ప కోర్సులు పూర్తి చేసే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని బీసీ విద్యార్థులకు కూడా వర్తింపచేసి రూ.10 లక్షల మేర విదేశాల్లో ఉన్నతవిద్యకు సహాయాన్ని అందించాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఈ మేరకు బీసీ సంక్షే మ శాఖ రూ.50 కోట్లకు ప్రతిపాదనలను సమర్పించినా బడ్జెట్ మాత్రం కేటాయించలేదు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 268 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.26.80 కోట్ల మేర ప్రభుత్వం కేటాయించింది. -
అంబేడ్కరిస్టులు-మార్క్సిస్టుల ఐక్యత కొనసాగేనా..!
‘‘మీరు షెడ్యూల్డ్ కులాల వారికే కాకుండా మొత్తం భారతదేశానికి నాయకులవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డాక్టర్ అంబేడ్కర్నుద్దేశించి సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియా. 1955 డిసెం బరులో ఈ మేరకు అంబేడ్కర్‌కు లేఖ రాశారు. బాబాసాహెబ్‌తో చర్చించి ఆయన నాయకత్వంలో నూతన పార్టీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఉత్తర ప్రత్యుత్తరాలూ కొనసాగించారు. అంబేడ్కర్ కూడా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ సమావేశాల్లోనూ, సన్నిహి తుల సంభాషణల్లోనూ ఇదే అలోచన చేశారు. లోహియా, ఎం.ఎన్. రాయ్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప మేధావులనీ, వారితో కలసి పని చేయాలనీ ఆయన అనేవారు. 1956 సెప్టెంబరులో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అఖిల భారత కార్యవర్గ సమావేశం జరిగింది. కొత్త పార్టీ ఏర్పాటు చేయబోయే ముందు (రిపబ్లికన్ పార్టీ) లోహియాతో తప్పని సరిగా చర్చించాలని ఈ సందర్భంగా బాబాసాహెబ్ తన సహచరు లతో అన్నారు. అయన హఠాన్మరణంతో ఈ మహత్తర ప్రయోగానికి గండిపడింది. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులను ఒక వేదిక మీదికి తీసుకురావాలనేది లోహియా చిరకాల ఆకాంక్ష. ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ అటువంటి ఆశలు చిగురి స్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ‘హత్య’, తదనంతర పరిణామాలూ దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో కమ్యూనిస్టు, అంబే డ్కర్ విద్యార్థి సంఘాల్ని దగ్గర చేశాయి. కొన్నేళ్లుగా ఏబీవీపీ ఉన్నత విద్యాలయాల్లో పట్టుకోసం విద్వేష రాజకీయాల్ని మొదలెట్టింది. అంబేడ్కర్, కమ్యూనిస్టు సంఘాల కార్యకర్తలపై జాతిద్రోహులు, కులతత్వవాదులనే ముద్ర వేసింది. పర్యవసానాల్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిగా ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు అంబేడ్కర్ - కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్యకుమార్ ఉపన్యాసంలో జైభీం, లాల్ సలామ్ నినాదాలు అంతర్భాగాలయ్యాయి. ‘‘నేను జై భీం అంటాను. లాల్ సలామ్ అంటాను. అన్ని నినా దాలు భగత్‌సింగ్ ఇచ్చిన ఇంక్విలాబ్ జిందాబాద్‌తో మమేకమవు తాయి. దేశంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు అంబేడ్కరిస్టులు -కమ్యూనిస్టుల కలయిక తక్షణ అవసరం. నూతన భారత ఆవిష్కా రానికి ఇది మనందరి కర్తవ్యం’’ అన్నారు చెన్నైలో జరిగిన అంబేడ్కర్ సంస్మరణ సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. 1980-90లలో శరద్‌పాటిల్ అంబేడ్కర్-కమ్యూనిస్టు సిద్ధాంతాల సమ్మేళనంగా సత్యశోధక్ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేశారు. ఇది చిన్న ప్రయోగం. ఇప్పుడు యూనివర్సిటీల్లో ప్రారంభమైన ఐక్య ఉద్య మాన్ని రాజకీయ పోరాటంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విజయవంతం కావడానికి కొన్ని సవాళ్లున్నాయి. ఇప్పటికీ అంబేడ్కర్ వాదులు కమ్యూనిస్టుల నిబద్ధతను పూర్తిగా నమ్మడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కాలం నాటి నుంచీ ఆ దూరం, అనుమానం కొనసాగుతూనే ఉంది. భారతదేశ సమస్యల పరిష్కారానికి వర్గ దృక్పథమే ముఖ్యమనీ, కులం ఉపరితలాంశమనీ కమ్యూనిస్టులు ఇప్పటికీ భావిస్తున్నారు. ఇందుకు భిన్నంగా కులం ఒక ఘనీభవించిన వర్గమని లోహియా చెప్పారు. మన సమాజానికి అవసరమైన విధంగా కమ్యూనిజాన్ని అన్వ యించి నూతన ఆలోచనను తెరపైకి తెచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిజాన్ని మన సమాజానికి అన్వయిస్తూ సరైన విశ్లేషణలు చేయడంలో వెనకబడ్డాయి. ఈ ధోరణి మారాలి. అంబేడ్కర్‌వాద ఉద్య మాల్ని కేవలం అస్తిత్వ రాజకీయాలుగా చూడడం సరికాదు. ఇదొక సరి కొత్త న్యాయబద్ధమైన ప్రజాతంత్ర ఆకాంక్ష. కమ్యూనిస్టు పార్టీల్లో దళి తులు ఉన్నత నాయకత్వ స్థానాల్లో లేకపోవడాన్ని గుర్తించినట్లు, దీన్ని సరిచేయనున్నట్లు సీపీఎం కోల్‌కతా ప్లీనం ప్రకటించింది. అంబేడ్కర్ వాదులు మొదటి నుంచీ చేస్తున్న విమర్శల్లో నాయకత్వ అంశం ప్రధాన మైంది. సైద్ధాంతిక-ఆచరణపరమైన ఇలాంటి సమస్యల్ని కమ్యూని స్టులు, అంబేడ్కరిస్టులు పరిష్కరించుకోవాలి. సానుకూల గత తప్పి దాల్ని అంగీకరించగలగాలి. రోహిత్ వేముల ‘ఆత్మ త్యాగం’ భారతదేశ రాజకీయాలపై సరికొత్త వెలుగులు ప్రసరింపచేయాలి. అప్పుడే అంబే డ్కర్ ఆకాంక్షించిన ప్రజాస్వామ్య భారతదేశం రూపుదిద్దుకుంటుంది. వ్యాసకర్త: బి. భాస్కర్ సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 9989692001 -
దుర్భర జీవితాలు గడుపుతున్న గిరిజనం
► సంక్షేమ పథకాలు దరిచేరడంలేదు ► విద్య, వైద్యం, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి ► అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి దివాకర్‌రావు పీలేరు: ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ ఫలాలు దరిచేరక రాష్ట్రంలో గిరిజనులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి దివాకర్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం పీలేరులో డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనేటి దివాకర్‌రావు మాట్లాడుతూ గిరిజనులకు కేటాయించిన పథకాలు వారికే అందేలా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు రాజకీయ, విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో సముచిత స్థానం కల్పిం చాలని కోరారు. నేటికీ గిరిజన గ్రామాల్లో కనీస వసతులకు నోచుకోక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని తెలిపారు. దేశంలో సుమారు 10 కోట్లమంది, రాష్ట్రంలో 25 లక్షలకు పైబడి గిరిజన జనాభా ఉందన్నారు. ప్రభుత్వ ఫలాలు వారికి అందకపోవడంతో మానవ అభివృద్ధి సూచికలో అత్యధిక పేదరికంలో గిరిజనులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీవీ రమణ మాట్లాడుతూ గత నెల 14వ తేదీ నుంచి అంబేడ్కర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. ఐక్యరాజ సమితిలోనూ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తామని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తామని చెప్పారు. అంభేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాలులర్పించారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ. శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు జయచంద్ర, సతీస్, ఎస్.రాజశేఖర్, నారాయణ పాల్గొన్నారు. -
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దళిత సంఘాలు, పోలీసుల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. దళిత సంఘాలకు చెందిన కొందరు స్థానిక బస్టాండ్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అనుమతి తీసుకున్న తర్వాతే ఈ పని చేయాలంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో డీఎస్పీ శంకర్ వి.కోట చేరుకుని దళిత సంఘాల వారితో చర్చలు ప్రారంభించారు. -
మార్క్సిజం.. అంబేడ్కరిజం మిళితం కావాలి
ఆర్.నారాయణమూర్తి మార్క్సిజం, అంబేడ్కరిజం మిళితం అయితే దేశం బాగుపడుతుందని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: అంబేడ్కరిజమ్ను.. మార్క్సిజమ్ బలపరుస్తాందా? సమాధానం: కారల్‌మార్క్స్ వర్గసమాజం గురించి చెప్పారు. అంబేడ్కర్ కులవర్గ రహిత సమాజం గురించి తెలిపారు. విభిన్న జాతులతో కూడుకున్న భారతదేశంలో రెండూ ఏకమవ్వాలి. ప్ర: దేశం బాగుపడాలంటే ఏమి చేయాలి? స: కులం లేని దేశం ఉండాలి. ప్ర: ప్రస్తుత యూనివర్సిటీల పరిస్థితిపై మీ సమాధానం? స: కళాశాలల్లో విద్యార్థి సంఘాలకు రాజకీయపార్టీల అనుబంధం ఎక్కువైంది. అందుకే పార్టీలు ఓటు బ్యాంకు వ్యాపారం చేస్తున్నాయి. ప్ర: ర్యాగింగ్‌పై మీ అభిప్రాయం? స: కళాశాలలో ర్యాగింగ్,కుల, మత, మానసిక ఒత్తిడులు ఉండకూడదు. రోహిత్, రిషితేశ్వరి వంటి ఘటనలు మళ్లీ జరగకూడదు. -
అందరికీ ఆరాధ్యుడు అంబేడ్కర్
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరూపించారని, దళిత సామాజిక వర్గానికేకాక అన్నివర్గాలవారికి ఆరాధ్యుడయ్యారని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులోని గురుకుల పాఠశాలలో గురువారం జరిగిన బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం యావత్ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉందన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అంబేడ్కర్ ఆనాడు అనేకసార్లు వివక్షకు గురైనప్పటికీ కుంగిపోలేదని, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి అందరికీ ఆదర్శప్రాయుడయ్యారన్నారు. అంబేడ్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎంపీ పొంగులేటి కోరారు. -
ఐరాసలో తొలిసారిగా అంబేడ్కర్ జయంతి
అంబేడ్కర్ ఆశయాల సాధనకు భారత్‌తో కలసి కృషి: క్లార్క్ ఐరాస: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఐక్యరాజ్యసమితి (ఐరాస) తొలిసారిగా నిర్వహించింది. ఐరాసలో సివిల్ సొసైటీ అడ్వొకసీ గ్రూప్స్ కల్పనా సరోజ్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ హారిజన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అంబేడ్కర్ 125వ జయంతి వేడుక లకు ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) నిర్వాహకురాలు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ భారత సామాజిక సంస్కర్త అయిన అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు భారత్‌తో కలసి ముందుకు నడవనున్నట్లు తెలిపారు. ‘మేం 2030 అభివృద్ధి ఎజెండా సాధనకు, అంబేడ్కర్ ఆశయాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా పేద, అట్టడుగు వర్గాల కోసం భారత్‌తో కలసి కృషి సాగిస్తాం’ క్లార్క్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక, సామాజిక ప్రగతికి సవాళ్లుగా నిలిచిన అసమానతలను అర్థం చేసుకున్న మహోన్నతుడు అంబేడ్కర్ అని కొనియాడారు. వెలివేతకు గురైన వర్గాల సాధికారిత కోసం, కార్మిక చట్టాల సంస్కరణకు, మెరుగుదలకు, అందరికీ విద్య కోసం అంబేడ్కర్ చేసిన కృషి ప్రశంసనీయమైనదని అన్నారు. ఈ సందర్భంగా ‘స్థిర అభివృద్ధి ఆశయ సాధనకు అసమానతలపై పోరు’ అన్న అంశంపై ప్యానల్ డిస్కషన్ జరిగింది. అంబేడ్కర్ జీవితం, పోరాటం, ఆశయాలు తదితర అంశాలపై 14 నిమిషాల సేపు సాగిన వీడియోను ప్రదర్శించారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఐరాస చేపట్టిన 2030 అభివృద్ధి ఎజెండాలోనూ అంబేడ్కర్ దృక్పథం కనబడుతుందన్నారు. సమానత్వ దినోత్సవంగా ప్రకటించాలి అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14ను ‘ప్రపంచ సమానత్వ దినోత్సవం’గా ప్రకటించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ చరణ్‌జీత్ సింగ్ అత్వాల్ ఐరాసను కోరారు. ‘బాబా సాహెబ్ జీవితాంతం భారతదేశంతో పాటు ప్రపంచ ప్రజల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం పోరాటం చేశారు. అందువల్ల ఆయన జయంతి రోజును ప్రపంచ సమానత్వ దినోత్సవంగా ప్రకటించాలి. ఇదే ఆయనకు నిజమైన నివాళి, గౌరవం’ అని అత్వాల్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
అంబేడ్కర్ భారత జాతికి మార్గదర్శకుడు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ న్యూఢిల్లీ: ఆధునిక భారత దేశానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మార్గదర్శకుడని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభివర్ణించారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆమె గురువారం మాట్లాడారు. దేశ ప్రగతికి బాబాసాహెబ్ కృషి చేశారని కొనియాడారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌లతో స్వాతంత్య్ర సమరంలో అంబేడ్కర్ పాల్గొన్నారని సోనియా గుర్తుచేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అన్ని వర్గాల వారికి అధికారాన్ని కల్పిస్తూ సమానత్వం చూపిస్తోందని తెలిపారు. అందరికీ హక్కులు కల్పిస్తూ సామాజిక, ఆర్థిక అసమానతలకు తావులేకుండా అంబేడ్కర్ బాటలు వేశారని ఆమె కొనియాడారు. -
ఎంపీ, ఎమ్మెల్యేలకు నిలదీత
చోడవరం టౌన్: మండలంలో లక్కవరం గ్రామంలో గురువారం రాత్రి అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ అవంతి శ్రీనివాసరావుని, అలాగే ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజుని ఎస్సీ కాలనీ వాసులు సమస్యలపై నిలదీశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం ఎస్సీకాలనీని సందర్శించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లారు. ఈసందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను ఏకరుపెట్టారు. కాలనీలో ఇప్పటి వరకు డ్రైనేజీలు నిర్మించలేదని, వాటర్ ట్యాంకు శిథిలమైందని, కమ్యూని భవనం లేదని, హుద్‌హుద్ తుపానుకు కూలిపోయిన స్టేజ్‌కు ఇంతవరకూ మరమ్మతులు చేపట్టలేదని నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ సమస్యలపై అడిగేందుకు ఇది సమయం కాదని, అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించేటప్పుడు దానిగురించి మాట్లాడాలని ఆవేశంగా అన్నారు. అయితే తమ సమస్యలు ఎప్పుడు చెప్పుకోవాలని అక్కడి యువకులు ప్రశ్నించడంతో చోడవరంలోనే నిత్యం ఉంటామని, గ్రామానికి చెందిన నాయకులను తీసుకొని వస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే అధికారులతో మాట్లాడి ఎస్సీ కాలనీ సమస్యలు పరిష్కారానిక చర్యలు తీసుకుంటానని ఎంపీ అవంతి హామీ ఇచ్చారు. దీంతో యువకులు శాంతించారు. -
లండన్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకలు
లండన్: బాబా సాహెబ్ అంబేడ్కర్ జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించిన నూతన భవంతిలో ఆయన 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ వీరందర్ పాల్ అంబేడ్కర్ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. 1921-22లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివే సమయంలో అంబేడ్కర్ ఇక్కడే నివసించారు. గత ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్‌కు సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేశాక ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటన సందర్భంగా వాటిని అధికారికంగా ప్రారంభించారు.మూడంతస్తులు,ఆరు గదులతో కూడిన ఈ భవనాన్ని త్వరలోనే ప్రజల సందర్శనకు అనుమతిస్తారు. ఇందులో అంబేడ్కర్ జీవిత విశేషాలను తెలిపే చిత్రాలు, ఆయన సూక్తులతో కూడిన గోడలు, ర చనా ప్రతులను భద్రపరిచారు. ఒక అంతస్తును.. ఇంగ్లండ్‌కు విద్యనభ్యసించడానికి వచ్చే భారత విద్యార్థులకు తాత్కాలిక నివాసంగా మార్చాలని భావిస్తున్నారు. -
ఐక్యతతోనే మాలల అభివృద్ధి
అనంతపురం న్యూటౌన్ : ఐక్యతతో హక్కులను సాధించుకున్నప్పుడే మాలల అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ మేవా అధ్యక్షుడు ఎస్టీ శ్రీనివాసు లు పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భం గా రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సం ఘం (ఏపీ మేవా) మాల మహానాడు సంయుక్త ఆధ్వర్వంలో గురువారం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఫంక్షన్ హాలులో మాలల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా విచ్చేసిన మాల ఉద్యోగులు ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా విచ్చేసినరాష్ట్ర అధ్యక్షుడు శ్రీని వాసులు, రాష్ట్ర కార్యదర్శి పెన్నోబిలేసు, బీజేపీ దళి త మోర్చా రాష్ర్ట సభ్యుడు తలమర్ల శ్యాంసుందర్, సామాజిక సేవా కార్యకర్త దాసరి ఆదినారాయణ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబు తదితరులు మాట్లాడారు. మాల విద్యార్థులకు సకాలంలో స్కాలర్ షిప్పులు విడుదల చేయాలని, ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయాలని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీలకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా బీసీ కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సురేష్‌బాబు, రామన్న, కటిక జయరామ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
♦ రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలు ♦ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం ♦ సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ పార్టీల నేతల నివాళులు ♦ అంబేడ్కర్ టవర్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వపరంగా వివిధ కార్యక్రమాలు, శంకుస్థాపనలు నిర్వహించగా... కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ఉన్నారు. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, ఆరెపల్లి మోహన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, టీటీడీపీ నాయకులు ఎల్.రమణ, మోత్కుపల్లి, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం తదితరులు కూడా అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని పాత అంబేడ్కర్ భవన్ స్థానంలో అంబేడ్కర్ టవర్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. -
దళితులను అవమాన పరుస్తారా?
► అంబేడ్కర్ జయంతి సభలో అర్ధాంతరంగా వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులు ► దళిత సంఘాల నాయకుల మండిపాటు అనంతపురం సెంట్రల్ : అంబేడ్కర్ వర్ధంతి సభ నుంచి ప్రజా ప్రతినిధులు అర్ధాంతరంగా వెళ్లి పోవడంపై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. గురువారం అంబేద్కర్ వర్దంతి సభ జిల్లా పరిషత్ హాలులో నిర్వహించారు. పలువురు దళిత సంఘాల నాయకులు వారి అభిప్రాయాలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఉన్న ఫలంగా ఒకేసారి జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో దళిత సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు శంకర్, జిల్లా అధ్యక్షుడు ఓబిలేసు తదితరులు ఆందోళనకు దిగారు. దళితులు అంటే అంత చులకనా? అంబేడ్కర్‌ను అవమాన పర్చేలా ప్రజాప్రతినిధులు వెళ్లిపోవడం ఏంటని ఇన్చార్జ్ కలెక్టర్ సయ్యద్ఖాజామొహిద్దీన్తో వాగ్వాదానికి దిగారు. ముందస్తు షెడ్యూల్ మేరకు వారు ఇందిరమ్మ గృహాల శంకుస్థాపన అనంతరం తిరిగి సమావేశంలో పాల్గొంటారని ఆయన వివరించారు. అప్పటికీ దళిత సంఘాల నాయకులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసుల సహకారంతో సభనుంచి బయటకు పంపించారు. -
అంబేడ్కర్ విజన్‌ను నిర్లక్ష్యం చేశారు
ఇందుకు కాంగ్రెస్ పశ్చాత్తాప పడక తప్పదు ♦ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ♦ బాబా సాహెబ్ చూపిన దారిలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది ♦ ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్విస్తున్నా.. ♦ గ్రామాల అభివృద్ధితోనే అంబేడ్కర్‌కు ఘనమైన నివాళి అని వ్యాఖ్య ♦ ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమం ప్రారంభం మహు: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేడ్కర్ ఘన వారసత్వాన్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇందుకు ఆ పార్టీ పశ్చాత్తాపపడాలని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ చూపిన దారిలో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ‘బాబా సాహెబ్’ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహులో గ్రామ స్వయం పాలనా కార్యక్రమం ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అంబేడ్కర్ జన్మస్థలానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని మోదీ చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందని... ఇదే మనం అంబేడ్కర్‌కు అర్పించే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. అంబేడ్కర్ ఆదర్శాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. ఆయన ఆశయాలైన బలహీన వర్గాల సంక్షేమం, సముద్ర తీర ప్రాజెక్టులు వంటివాటిని చేపడుతున్నామని చెప్పారు. ఇన్నేళ్లూ కాంగ్రెస్ ఏం చేసింది? అంబేడ్కర్ విజన్ చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఇన్నేళ్లూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అంబేడ్కర్‌కు చెందిన ఐదు స్థలాల (పంచ తీర్థాలు)ను అభివృద్ధి చేయలేదేమని ప్రశ్నించారు. ‘‘బాబా సాహెబ్ చూపిన మార్గాన్ని అనుసరిస్తేనే సామాజిక సమతౌల్యం సాధ్యమవుతుంది. ఆయన అడుగుజాడల్లో నడవడాన్ని నేను గర్వంగా భావిస్తున్నా. అంబేడ్కర్ చివరిరోజుల్లో నివసించిన ఢిల్లీలోని అలీపూర్ రోడ్, 26 నంబర్ ఇంటిని ఆయన స్మారకంగా మారుస్తున్నాం. కానీ చాలా ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ పని ఎందుకు చేయలేకపోయింది. ఇన్నేళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించి.. ఇప్పుడు మేం ఆ పని చేస్తుంటే తట్టుకోలేకపోతోంది. దీనిపై వారు పశ్చాత్తాపపడాల్సిందే. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారికి సమాజాన్ని విభజించడం తప్ప మరో ఆలోచన రాదు..’’ అని మోదీ మండిపడ్డారు. గత 60 ఏళ్లుగా పేదలకు ఏమీ చేయలేని కాంగ్రెస్.. రాత్రీపగలూ పేదల గురించే మాట్లాడడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. కానీ తమ ప్రభుత్వం పేదరికాన్ని పారదోలేందుకు చర్యలు చేపడుతోందన్నారు. పేదలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని, వారికి బ్యాంకులతో అనుసంధానం కల్పించేందుకు జన్‌ధన్ యోజనను ప్రారంభించామని తెలిపారు. గ్రామ పునాదులను బలోపేతం చేయాలి సుస్థిర, సమగ్ర అభివృద్ధి కోసం గ్రామాలను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాము చేపట్టిన గ్రామీణ విద్యుదీకరణ, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, గృహాల నిర్మాణం వంటివన్నీ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగానే రూపొందినవని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇప్పటికీ రూపును సంతరించుకోలేదన్నారు. గ్రామాలను మార్చివేసేందుకే తాము ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ను చేపట్టామన్నారు. -
నాది ఆశావాద దృక్పథం: దేవెగౌడ
బెంగళూరు:జేడీఎస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరాలనుకునే వారికి జ్ఞానోదయమయ్యే సమయం వస్తుందని జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని కేఈబీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్.డి.దేవేగౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘జేడీఎస్ పార్టీని చాలా మంది విడిచి వెళ్లిపోతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నేను ఆశావహ దృక్పథంతో ఉన్నాను. పార్టీని వీడాలనుకునే వారికి జ్ఞానోదయమయ్యే సమయం వస్తుంది’ అని దేవేగౌడ పేర్కొన్నారు. రానున్న శనివారం మైసూరులో జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు దేవేగౌడ ప్రకటించారు. -
రూ.16 వేల కోట్లతో ఆరు లక్షల ఇళ్లు: సీఎం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రూ.16 వేల కోట్లతో ఆరు లక్షల ఇళ్లను నిర్మించి పేదవారి సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పదివేల గృహాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే రాష్ట్రంలో నిర్మించనున్న ఆరులక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 265 ఎకరాల స్థలంలో నిర్మించే ఈ గృహ సముదాయాన్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ గృహసముదాయానికి సమీపంలో పోలవరం కుడికాలువ, జాతీయ రహదారి, నగరానికి 15 కిలోమీటర్ల దూరం వంటి సదుపాయాలున్నాయని తెలిపారు. ఇక్కడ లక్షమంది నివసించేలాగా టౌన్షిప్ ఏర్పాటు చేస్తామని, అన్నిరకాల మౌలిక సదుపాయాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
అవిద్య, పేదరికం వల్లే అస్పృశ్యత
♦ అంబేద్కర్ జయంతి సభలోమంత్రి హరీశ్‌రావు ♦ 71 మంది దళితులకు భూ పంపిణీ సంగారెడ్డి టౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం అర్పించే నివాళి అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవిద్య, పేదరికం వల్ల అస్పృశ్యతకు గురవుతున్నారన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకు ముందుకు స్థానిక జెడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం కేజీ టు పీజీ పీజీ విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలు పెంచుతామన్నారు. సాగుకు యోగ్యమైన 1236 ఎకరాల భూమిని 70 కోట్ల ఖర్చుతో జిల్లాలోని దళితులకు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో భూ పంపిణిలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 11 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా123.39 ఎకరాల భూమిని 5.79 కోట్లతో 71 మంది దళితులకు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఒకరికి హోండా కారును, మరొకరికి కంకర యంత్రాన్ని అందజేశారు. మహిళా సంక్షేమానికి కృషి చేయాలి : కలెక్టర్ మహిళా సంక్షేమానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ రోనాల్డ్ రాస్ అన్నారు. అప్పుడే అంబేద్కర్ ఆశయం నెరవేరుతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలు అన్ని కాలాల్లో ఆచరణీయమన్నారు. కల్యాణలక్ష్మి కింద 2848 కుటుంబాలకు రూ.51 వేల చొప్పున అందించామని వెల్లడించారు. కల్యాణలక్ష్మి నెల రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 27 వేల మంది పోస్టు మెట్రిక్ విద్యార్థులకు 25.65 కోట్లు, 20635 మంది ప్రీ మెట్రిక్ విద్యార్థులకు రూ.3.85 కోట్లు అందించామన్నారు. 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న వారికి 92738 కుటుంబాలకు విద్యుత్ చార్జీల కింద 2.35 కోట్లు విద్యుత్ బోర్డుకు చెల్లించామని చెప్పారు. ఎస్సీలకు స్వయం ఉపాధి కింద ఇస్తున్న సబ్సిడీని 50 నుంచి 80 శాతానికి పెంచామన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్, ఏజేసీ వాసం వెంకటేశ్వర్లు, డీఆర్వో దయానంద్, జెడ్పీ సీఈఓ అలుగు వర్షిణి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాగవ్వకు అంబేద్కర్ అంటే అభిమానం మిరుదొడ్డి: నిరక్ష ్యరాస్యురాలైన ఆ అవ్వ పేరు జోడోళ్ల నాగవ్వ. మండల పరిధిలోని కాసులాబాద్లోని 9వ వార్డు సభ్యురాలు. కూలీ నాలీ చేసుకోవడమే ఆమె వృత్తి. అక్షరం ముక్క రాకపోయినా ఆమెకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం. ఆయన జయంతి, వర్ధంతి రోజున గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం ఆనవాయితీగా పెట్టుకుంది. గురువారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి అధికారులతో పాటు ఆమె దండ వేసి నివాళుర్పించింది. అంబేద్కర్ అంటే ఎందుకింత అభిమానం అని ప్రశ్నించగా పెద్ద సారు అందరు మంచిగుండాలని గదేదో పెద్ద పుస్తకం (రాజ్యాంగం) రాసిండట. గాయిన పెట్టిన రిజర్వేషన్లతోనే నేను వార్డు సభ్యురాలిగా పోటీ చేసి గెలిచా అంటోంది.. అక్షరం ముక్క రాక పోయినా అంబేద్కర్‌పై అవగాహన కలిగిన ఈ నాగ వ్వను పలువురు అభినందించారు. -
సుందర్రాజ్కు రూ.5లక్షల నగదు బహుమతి
మహబూబ్‌నగర్ క్రీడలు : అంతర్జాతీయ స్థాయి యోగాలో పతకాలు సాధించిన యోగా క్రీడాకారుడు సుందర్రాజ్కు అరుదైన గౌరవం దక్కింది. పేదింటి సుందర్‌రాజ్‌ను గురువారం హైదరాబాద్ నెక్లస్‌రోడ్డులో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ రూ.5లక్షల నగదు పారితోషికం అందజేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి రామలక్ష్మయ్య మాట్లాడుతూ గురుకులంలో చదువుతున్న సుందర్రాజ్కు సీఎం రూ.5లక్షల చెక్కు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు ప్రతినిధులు పుల్లయ్యయాదవ్, లక్ష్మయ్య, క్రీడల అధికారి సోమేష్ సీఎం కేసీఆర్, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎమ్మెల్యే నరేంద్రను అడ్డుకున్న అంబేడ్కర్ యూత్
పొన్నూరు : అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న తమను టీడీపీ కార్యకర్తలు, పోలీసులు దౌర్జన్యంగా పక్కకు తొలగించినందుకు నిరనగా గురువారం అంబేడ్కర్ యూత్ సభ్యులు ఎమ్మెల్యే థూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ను అడ్డుకుని నిలదీశారు. వివరాలిలా ఉన్నాయి. అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక క్రీస్తు శతవార్షిక లూథరన్ దేవాలయం సమీపం నుంచి ఐలాండ్ సెంటర్ వరకు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆధ్వర్యంలో మరో ర్యాలీ కూడా అదే సమయంలో అక్కడికి చేరుకుంది. పోలీసులు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న అంబేడ్కర్ యూత్ సభ్యులను కిందికి దించేసే క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పలువురు అంబేడ్కర్ యూత్ సభ్యులకు గాయాలయ్యాయి. ఇదంతా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ సమక్షంలోనే జరగడం, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిలువరించకపోవడం గమనార్హం. దీంతోఅంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న తమను తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు అన్యాయంగా అడ్డుకోవడంపై సమాధానం చెప్పాలని అంబేడ్కర్ యూత్ సభ్యులు ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌ను అడ్డుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా నిరోధించారు. పోలీసులు అంబేడ్కర్ యూత్ సభ్యులను పక్కకు తొలగించి ఎమ్మెల్యేకు మార్గం సుగమం చేశారు. -
మాజీ ఎమ్మెల్యేను చంపిన మావోయిస్టులు
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. అంబెద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపారు. గడ్చిరోలి జిల్లా అయిర తాలుక రేషన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చల్లవాడ గ్రామంలో జరుగుతున్న అంబెద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దీపక్ అత్రంను మారువేషాల్లో వచ్చిన మావోయిస్టులు కాల్చిచంపారు. దీపక్ అత్రం ఆదివాసి విద్యార్థి సంఘం తరఫున ఇండిపెండెంట్‌గా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు గాను మావోయిస్టులు ఈ ఘతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
అంబేద్కర్‌కు వైఎస్ జగన్ ఘననివాళి
-
వైన్స్‌పై అంబేద్కర్ సంఘ నాయకుల దాడి
దండేపల్లి : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని అంబేద్కర్ సంఘ నాయకులు దాడులకు పాల్పడ్డారు. స్థానికంగా ఉండే పెద్దయ్య వైన్స్‌పై గురువారం దాడికి దిగారు. ఓ వైపు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతుంటే మద్యం అమ్మకాలు జరుపుతారా అంటూ వైన్స్ యజమానిని అడ్డుకుని షాపు మూసివేయించారు. నాయకుల దాడిలో మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. -
వైఎస్ఆర్ సీపీ భారీ ర్యాలీ
విజయవాడ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా విజయవాడ నగరంలో వైఎస్సార్సీపీ నాయకులు భారీ ర్యాలీ తీశారు. గాంధీనగర్ నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు కొల్లు పార్థసారధి, మేరుగ నాగార్జున, సామినేని ఉదయభాను, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేశ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, దళితులు పాల్గొన్నారు. ఆర్కే కార్యాలయంలో జయంతి వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బడుగు బలహీనవర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలను ఎమ్మెల్యే ఆర్కే కొనియాడారు. ఈ వేడుకల్లో స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీపీ రత్నకుమారి, కన్వీనర్లు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా అంబేద్కర్‌కు ఘననివాళి
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ప్రధాని మోదీ ముంబైలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 'అంబేద్కర్ విశ్వ మానవుడు..ఆయన జీవితాంతం పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికు ఎంతో పాటు పడ్డారు. ఆయన గొప్ప విద్యావేత్త.. ఆయన స్పూర్తి ఎంతో మందికి ఆదర్శం... జై భీమ్' అని తన ట్విట్టర్లో సందేశమిచ్చారు. అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహులో గురువారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 'గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్' పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు జయంతి వేడుకలను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, నాయకులు, అధికారులు అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి సీఎం కేసీఆర్ గురువారం భూమి పూజ చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద కుల రహిత సమాజం కోసం రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ నిర్వహించారు. శాంతిచక్ర ఇంటర్నేషనల్, పలు స్వచ్ఛంద సేవాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పలు రాజకీయ నాయకులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. On his Jayanti, I bow to the venerable Dr. Babasaheb Ambedkar. Jai Bhim. pic.twitter.com/oQSkh98ZiU — Narendra Modi (@narendramodi) 14 April 2016 -
బాలకృష్ణ దండ వేశాకే..
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీనేతల దౌర్జన్యం ఎక్కువైంది. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన వైఎస్సాసీపీ నియోజక వర్గ ఇంచార్జి నవీన్ నిశ్చల్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తమ ఎమ్మెల్యే బాలకృష్ణ దండ వేసిన తర్వాత మిగతా వారు వేసుకోవాలని వితండవాదానికి దిగారు. దీంతో నవీన్ టీడీపీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని పూలమాల వేయనివ్వడంతో గొడవ సద్దుమణిగింది. -
చంద్రబాబు మైండ్‌సెట్ మారాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: దళితుల విషయంలో చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం మైండ్ సెట్ మారాలని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి వేడుకలు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలన్నారు. అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని అంబేద్కర్ కృషి చేశారని, అయితే ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం నిధులు ఖర్చు చేయకుండా చంద్రబాబు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఇంకా ఏంమాట్లాడారంటే...అంబేద్కర్ స్ఫూర్తిని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తున్నా. ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు కొద్దిగా అటు ఇటుగా చూస్తే.. 'ఎన్నాళ్లు బతికామన్నది కాదు, బతికినంత కాలం ఎంత గొప్పగా బతికామన్నది ముఖ్యం'. ఆయన చెప్పినమాటల్లో ఇది ముఖ్యమైనది. అదే చాలా విషయాలు చెబుతుంది. ఈవాళ మన రాష్ట్రంలో అంబేద్కర్‌గారిని ఆయన జయంతి, వర్ధంతి రోజుల్లో గుర్తుచేసుకుంటాం గానీ, ఆయన స్ఫూర్తిని పాలకులు మర్చిపోవడం చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పటికైనా పాలకులు ఆ స్ఫూర్తిని మర్చిపోకుండా అమలు చేయాలని కోరుతున్నా. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన ఆశించారు. కానీ న్యాయం జరగడం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు జనాభా ప్రకారం వాళ్లకు కేటాయించి ఖర్చుచేయాలని చట్టబద్ధత తెస్తే, చట్టసభల్లో ఆ నిధులు ఖర్చుచేయకుండా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. కాగ్ తన నివేదికలలోనే ఈ విషయాన్ని తప్పుపడుతోందంటే అంత దుర్మార్గంగా వీళ్ల పాలన కొనసాగుతోంది. ట్రైబల్ ఎడ్వైజరీ కమిటీ వేయాలని, ఐటీడీఏ నిధుల్లో కమిటీ చెప్పిన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యాంగ హక్కుగా ఇస్తే, రెండేళ్లయినా ఆంధ్రప్రదేశ్‌లో ఆ కమిటీ వేయలేదు. ఎందుకంటే, కమిటీలో మూడు వంతుల సభ్యులు ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ గిరిజన ఎమ్మెల్యేలు ఏడుగురు ఉంటే అందులో ఆరుగురు వైఎస్ఆర్సీపీ సభ్యులు కాబట్టి చంద్రబాబు అసలు కమిటీయే వేయలేదు. చంద్రబాబు తన అంతరంగాన్ని, మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. దేశవ్యాప్తంగా ప్రతి దళితుడు అడుగుతున్నాడు. కేవలం మేం క్రైస్తవ మతం తీసుకున్నాం కాబట్టి ఎస్సీ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నారు. దళితుడు ఏ మతం పాటిస్తే ఏంటి, ఏ దేవుడిని పూజిస్తే ఏంటి? కేవలం క్రైస్తవమతం తీసుకున్నారన్న ఏకైక కారణంతో ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దారుణం కాదా? ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అయినా ముఖ్యమంత్రి కనీసం నోరెత్తడం లేదు. చంద్రబాబు మైండ్ సెట్, ప్రభుత్వ మైండ్‌సెట్ కూడా మారాలి. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారంటే.. ఇలాంటి ముఖ్యమంత్రి తమకొద్దని ఎస్సీలు నినదిస్తున్నారు. వర్ధంతి రోజు, జయంతి రోజు తలచుకుని, 125 అడుగుల విగ్రహాన్ని పెడితే చాలదు. చంద్రబాబుకు ఒక రోగం ఉంది. అవసరం అనుకుంటే ఫొటోలు, విగ్రహాలకు దండ వేస్తారు, అవసరం లేదనుకుంటే ఎన్టీ రామారావు జరిగినటలు వెన్నుపోటు పొడుస్తారు. మళ్లీ ఎన్నికలు వస్తే మాత్రం ఆయన ఫొటోలకు, విగ్రహాలకు దండ వేస్తారు. అంబేద్కర్ స్ఫూర్తిని కాలరాసి, పేదలకు అన్యాయం చేస్తారు. మరోవైపు ఇలా జయంతి, వర్ధంతిరోజు విగ్రహాలకు దండ వేసి, తానే వాళ్లకోసం పోరాడుతున్నట్లు పోజిస్తారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాల వల్ల ప్రజలంతా అతలాకుతలం అవుతున్నారు. చివరకు ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలని, ప్రజల గొంతు వినిపించకూడదని వేరే పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. కనీసం చేర్చుకున్నాక వాళ్లతో రాజీనామా చేయించి చేర్చుకుంటే తప్పులేదు. కానీ చంద్రబాబు ఈవాళ ప్రజల తరఫున మాట్లాడాల్సిన ఎమ్మెల్యేల గొంతు నొక్కేస్తున్నారు. వాళ్లచేత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించరు, కనీసం డిస్క్వాలిఫై చేయించరు. ప్రజల వద్దకు తీసుకెళ్లి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలిపించుకుంటానన్న నమ్మకం ఆయనకు లేదు. ఈ చంద్రబాబుకు బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అన్నారు. -
అంబేద్కర్ ఫ్లెక్సీ విషయంలో గొడవ
ఆలమూరు: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో అంబేద్కర్ ఫ్లెక్సీ విషయంలో వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఒక సామాజిక వర్గానికి చెందిన ముగ్గురితో పాటు మండపేట రూరల్ పోలీస్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ తలకు కూడా గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత గుమ్మిలేరు సెంటరులో(రావులపాలెం మండపేట రోడ్డులో) ఒక సామాజిక వర్గం ఫ్లెక్సీ పెడుతుండగా మరో సామాజిక వర్గం యువకులు అడ్డుకున్నారు. దీంతో వివాదం తలెత్తింది. విషయం తెలిసిన పోలీసులు ఎటువంటి ఘర్షణ తలెత్తకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
అంబేద్కర్‌కు వైఎస్ జగన్ ఘననివాళి
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులకు అభినందనలు తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తిని అందరం కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు కొద్దిగా అటూ ఇటూగా ట్రాన్స్ లేట్ చేస్తూ 'ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం. ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం' అన్న మాటలు చెప్పుకోవాల్సి ఉందన్నారు. అంబేదర్క్ స్ఫూర్తిని పాలకులు మర్చిపోవటం బాధాకరమన్నారు. రాజ్యాంగాన్ని రచించటమే అంబేద్కర్ గొప్పదనమన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నదే ఆయన రాసిన రాజ్యాంగంలో ఉందన్నారు. అయితే అది అమలు జరగటం లేదన్నారు. ఈ సందర్భంగా నేతలు అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. జీవితం గొప్పగా ఉండాలి తప్ప ఎక్కువ కాలం కాదన్న అంబేద్కర్ స్ఫూర్తిని ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ఆయన 125వ జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. 'Life should be great rather than long' Remembering our Constitution's architect and visionary Dr B.R. Ambedkar on his 125th jayanthi. — YS Jagan Mohan Reddy (@ysjagan) 14 April 2016 -
దళిత సీఎం హామీ ఏమైంది?: జైపాల్ రెడ్డి
సికింద్రాబాద్ : నగరంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాదు, దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత దిగ్విజయ్‌సింగ్, జైపాల్‌రెడ్డితోపాటు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతలు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ... సామాజిక సిద్ధాంతాన్ని స్వీకరించనివారికి అంబేద్కర్ పేరు పలిక అర్హత లేదన్నారు. దేశంలో విశ్వవిద్యాలయాలను ఏబీవీపీ అడ్డాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలతో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. కాగా, అంబేద్కర్‌పై ముఖ్యమంత్రిది బూటకపు ప్రేమగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దళితులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి మోసం చేశారని ఆరోపించారు. -
అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం
రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి పాక్షికంగా ధ్వంసం చేశారు. చేయితోపాటు నడుం కింది భాగం ధ్వంసం అయింది. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. విగ్రహానికి నష్టం కలిగించిన వారిని పట్టుకుని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇన్చార్జి ఎస్ఐ ఖలీల్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఇందుకు కారకులైన వారిని రెండు రోజులలో దుండగులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. -
స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్
స్పెషల్ స్టోరీ ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి న్యాయాన్ని పొందే హక్కును ఎవరి నుంచీ తీసేయకూడదు అన్నారు. వర్ణధర్మాన్నీ మనుస్మృతినీ బహిరంగంగా వ్యతిరేకించారు. కింది కులాల వారి హక్కుల కోసం గొంతెత్తి అరిచారు. సమ సమాజ స్థాపన అవసరాన్ని ఎలుగెత్తి చాటారు. బాల్యం నుండీ కుల వివక్షకు గురైన ఆయన... ఒకనాడు దేశం యావత్తూ నడవాల్సిన దారిని నిర్దేశించే రాజ్యాంగాన్ని రాస్తారని ఎవరూ ఊహించి ఉండరు. అంతటి ఖ్యాతిని, విజయాన్ని సాధించి వ్యక్తి... బాబా సాహెబ్ అంబేడ్కర్! ఈనాడు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా జరపటానికి పోటీపడు తున్నాయి. ఇది నిశ్చయంగా భిన్నత్వంలోని ఏకత్వ నిరూపణే. వర్ణ ధర్మ వ్యవస్థను తమ సంస్కృతిగా చెప్పుకుంటూ గర్వపడే దేశంలో ఒక మహర్ కులానికి చెందిన వ్యక్తి, బాల్యం నుండీ కుల వివక్షకు గురైన వ్యక్తి ఆ దేశపు రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడుగా వ్యవహరించి సౌభ్రాతృత్వమూ, సమానత్వమూ, మానవతావాదమూ స్ఫూర్తిగా రాజ్యాంగాన్ని మలచగలిగాడంటే అది అనితర సాధ్యమైన విషయం అని అంగీకరించవలసిందే. అతిరథ మహారథులుగా పేరుపొందిన రాజకీయ నాయకులు సంప్రదాయవాదులు ఉన్న రాజ్యాంగ పరిషత్తును ఒప్పించి, ‘‘చట్టం ముందు అందరూ సమానులే. న్యాయాన్ని పొందే హక్కు ఏ ఒక్కరి నుంచీ ఏ కారణంగానూ తీసివేయకూడదు. రంగు, కులం, లింగం, ప్రాంతం, పుట్టిన చోటు, జాతి పేరిట వివక్ష చూపకూడదు. అంటరానితనం పాటించడం నేరం!!’’ వంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరచగలిగాడంటే అంబేడ్కర్ శేముషీ వైభవాన్ని క్షమాగుణాన్నీ అర్థం చేసుకోవచ్చు. వ్యక్తి గౌరవంతో పాటు దేశ ప్రతిష్ఠకు ఐక్యతకు భరోసా ఇచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారు. అంబేడ్కర్ 14-4-1891న మధ్యప్రదేశ్‌లోని మౌ (కంటోన్మెంటు ప్రాంతం)లో రాంజీ, భీమాబాయి దంపతులకు జన్మించాడు. అది మిలిటరీ కేంద్రం. యుద్ధంలో పాల్గొనవలసిన సైనికుల శిక్షణా కేంద్రం. ‘ఆతడనౌకయుద్ధముల నారియు తేరిన ధీర మూర్తి’గా ఎదగడానికి ఆ నేపథ్యమూ దోహదపడిందేమో. అంబేడ్కర్ జన్మించిన కులం మహర్ కులం. భారతదేశం సగర్వంగా చెప్పుకునే వర్ణాశ్రమ ధర్మ సంస్కృతిలో మహర్లు అంటరాని, చూడరాని, చెప్పరాని కులాల కోవలోకి వస్తారు. దుర్భరమైన పరిస్థితులలో పెరిగినప్పటికీ సహృదయులైన గురువుల ప్రోత్సాహంతో సంస్కరణాభిలాషులైన బరోడా, కొల్హాపూర్ - సంస్థానాధిపతులు అందించిన ఆర్థిక సహాయంతో ఆయన విదేశాలకు ఉన్నత విద్యలను అభ్యసించగలిగారు. 1913-1916ల మధ్య అమెరికాలో కొలంబియా విశ్వవిద్యాలయంలో తత్త్వ శాస్త్రం, అర్ధశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం, మానవ శాస్త్రం వంటి ఎన్నెన్నో శాస్త్రాలు చదివారు. 1915లో అర్ధశాస్త్రంలో ఎం.ఎ., డిగ్రీ, డాక్టరేట్ అందుకున్నారు. 1917లో స్వదేశానికి తిరిగివచ్చి బరోడా సంస్థానంలో మిలిటరీ కార్యదర్శిగా చేరారు. కులం కారణంగా అవమానాల పాలై అక్కడి సత్రం యజమాని రోడ్డుమీదకు గెంటివేస్తే రైల్వేస్టేషనులో చెట్టు కింద కూర్చుని నిస్సహాయంగా విలపించిన అనుభవం ఆయనను జీవితాంతం వెన్నాడుతూనే ఉంది. అలాంటి పరిస్థితులను తనవారికి తప్పించటానికే ఆయన కృషి చేశారు. 1920 - 23 సంవత్సరాలలో లండన్‌లో ఎం.ఎస్.సి (1921) డి.ఎస్.సి. (1922) న్యాయశాస్త్రంలో బార్-ఎల్-లా. డిగ్రీలు సాధించి, 1923లో బొంబాయిలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలను చైతన్యపరచటం కోసం ఆయన అనుక్షణమూ శ్రమించారు. పత్రికలు నడిపారు, పుస్తకాలు రాశారు. మారుమూల పల్లెలకూ వెళ్లి సమావేశాలు ఏర్పాటుచేసి, ప్రజలు తమ జీవనశైలిని ఎలా రూపొందించు కోవాలో చెప్పారు. ప్రతి సమావేశంలోనూ స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరచి వారికి మార్గదర్శనం చేశారు. దుర్మార్గులైన భర్తలను సన్మార్గంలోకి నడిపించాలనీ అది సాధ్యం కాకపోతే వారిని వదిలిపెట్టవచ్చుననీ వారికి ధైర్యం చెప్పారు. మంచి సమాజం ఆవిర్భవించాలంటే అది స్త్రీల వల్లనే సాధ్యం అని చెప్పారు. వర్ణ ధర్మాన్నీ మనుస్మృతినీ విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ సమ సమాజం కోసం ఆలోచనలు రేకెత్తిస్తూ ప్రజలను ఉద్భోదిస్తూ, ఆయన గడపిన జీవితం అసాధారణమైనది. కింది కులాలకు అందరితో పాటు ఊరి చెరువులు వాడుకునే హక్కు, ఆలయాలలోకి వెళ్లే హక్కు ఉన్నాయని చెప్పటానికి ఆయన జరిపిన మహజీ (1927), నాసిక్ (1930) పోరాటాలు దేశం మొత్తాన్ని ప్రభావితం చేశాయి. అలాంటి ఉద్యమాలు చాలా నడిపాక, ‘‘చెరువులు, ఆలయాలు మనకు వద్దు. తిండి, బట్ట, చదువు, ఆత్మగౌరవం మనకు కావాలి’’ అంటూ కింది వర్గాలను జాగృత పరిచారు. భూమినీ భారీ పరిశ్రమలనూ జాతీయం చేయాలన్నారు. దేశంలోని ఆర్థిక రాజకీయ సామాజిక సమస్యలవైపు వారి దృష్టి మళ్లించారు. 1927లో అంబేడ్కర్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ అయ్యారు. 1935-38 వరకూ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించారు. 1937లో బొంబాయి ప్రొవిన్షియల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1942-46లలో వైస్రాయి కౌన్సిలులో లేబర్ మెంబర్‌గా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమ దేశ నాయకులతో చర్చలు జరిపిన ప్రతిసారీ అంబేడ్కర్‌ను కూడా ఆహ్వానించి ఆయన వాదన వింటూ ఉండేది. ఆయన జ్ఞాన సంపదను గౌరవించింది. అయినా స్వతంత్ర భారతదేశంలోనే దేశ ప్రగతి సాధ్యమంటూ అంబేడ్కర్ ప్రకటనలు చేస్తుండేవాడు. స్వరాజ్యం వస్తే కింది వర్గాల/ కులాల సంగతి ఏమిటి? స్వతంత్ర భారతదేశంలో వారి స్థానం ఎక్కడ అంటూ ప్రశ్నించిన ధైర్యశాలి అంబేడ్కర్ ఒక్కడే. ‘‘నేను హిందువుగా పుట్టాను. పుట్టుక నా చేతిలో లేదు. కాని నేను హిందువుగా మాత్రం మరణించను’’ అని 1935లో ప్రకటించాడు అంబేడ్కర్. హిందూ మతం చాలా గొప్పదనీ తన ధోరణి మార్చుకుంటుందనీ అప్పటి నాయకులు అంబేడ్కర్‌కు వాగ్దానాలు చేశారు. ఆ మార్పు ఎంతకూ రానందున ఆయన విసిగి 1956లో బౌద్ధం స్వీకరించారు. బౌద్ధం ఇండియాకు పురాతన ధర్మమే విదేశీయం కాదు గనక జాతి సమైకత్యతకు, దేశ సమైక్యతకు భంగం కలగదనీ సంతృప్తిపడ్డారు. 1956లో అంబేడ్కర్‌ను నిరాశపరచిన పరిస్థితులు ఈనాడు 2016లో కూడా దేశంలో కనిపిస్తుండటం ఆలోచించదగ్గది. తరచుగా మతపరమైన విమర్శలు చేస్తుండటం వల్ల అప్పటి రాజకీయ నాయకులు అంబేడ్కర్‌ను తమ ప్రత్యర్ధిగా భావించేవారు. 1946లో రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినప్పుడు ఆయన బొంబాయి నుండి ఎన్నిక కాకుండా ఉండేందుకు వారు సర్వ ప్రయత్నాలూ చేశారు. ఆయన ఓడిపోయారు. అయితే బెంగాల్‌లోని ముస్లిం లీగు నామ శూద్ర వర్గాల తోడ్పాటుతో జైసూల్ కోల్కాల జిల్లాల నుంచి రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశించాడు. రాజ్యాంగ పరిషత్తులో ఆయన ప్రసంగం విని సభ నివ్వెరపోయింది. బెంగాల్ విభజనలో అంబేడ్కర్ సభ్యత్వం పోయినప్పుడు కాంగ్రెస్ మహారాష్ట్రలోని తన సభ్యులలో ఒకరిచేత రాజీనామా చేయించి ఆ స్థానంలో అంబేడ్కర్‌ను రాజ్యాంగ పరిషత్తుకు తెచ్చుకున్నది (14-7-1947). స్వతంత్ర భారతదేశపు తొలి కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనను న్యాయ శాఖామంత్రిగా ఆహ్వానించింది. రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షునిగా చేసి ఆయన ప్రజ్ఞాపాటవాలను వినియోగించుకున్నది. అయితే న్యాయ శాఖామంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లుకు అడుగడుగునా పరోక్షంగా ప్రతి బంధకాలు ఏర్పరచి ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకూ తెచ్చింది. స్త్రీల ప్రాతినిధ్యానికీ హక్కులకూ సంబంధించి దేశంలో అంబేడ్కర్ ఆశించిన మార్పు ఇంతవరకూ రానేలేదు. వ్యక్తి స్వేచ్ఛ, సమాజ ఆర్థిక నిర్మాణ స్వరూపాల గురించి నాయకులెవరికీ ఏ మాత్రమూ అవగాహన లేని కాలంలోనే అంబేడ్కర్ వాటి సంబంధాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటివరకూ అర్థం చేసుకోలేని ఆచరణలో పెట్టలేని పాలక వర్గాలు ఇంత ఆర్భాటంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో ఆయన ప్రవచనాలను పునశ్చరణ చేసుకోవలసిన అవసరం ఉన్నది. ఈనాడు దేశంలోని విద్య ప్రైవేటీకరణ - విశ్వవిద్యాలయాలలోని కులతత్త్వ ధోరణులు చూస్తే అంబేడ్కర్ స్థాపించిన విద్యాసంస్థలు గుర్తువస్తాయి. పని చేస్తూనే చదువుకునే (షిఫ్టు పద్ధతిలో) విద్యాలయాలు మొదటగా శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలనుకున్నారు ఆయన. సమానతా ప్రాతిపదికపై యువత పురోగమించాలని ఆశించాడు. ప్రభుత్వాధికారాలు ప్రైవేటు పరం కాకుండా చూడాలన్నారు. రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాలను రక్షించుకోవటానికి సన్నద్ధులం కావటానికి 125 ఏళ్ల అంబేడ్కర్ స్ఫూర్తిని అందుకోవలసిందే. మరో 125 ఏళ్లకైనా ఆయన కలలు సాకారమవుతాయా అనేది కాలమే నిర్ణయించటం కాదు, మనమే పూనుకోవాలి. దేశంలో బలపడుతున్న కార్పొరేట్ శక్తులు, ప్రబలుతున్న అనైతికత, అసహనం, కులతత్వం అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగానికి ఎంత అనుగుణంగా ఉన్నాయో ఆలోచించాలి. విద్య ప్రైవేటీకరణ - విశ్వవిద్యాలయాలలోని పక్షపాత ధోరణులు - సమర్ధతకు చోటు లేకపోవటం వంటి సమస్యలపై దృష్టి సారించటమే ఆయనకు ప్రభుత్వమూ ప్రజలూ ఇవ్వగలిగిన గౌరవం. - బి.విజయభారతి జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్‌లతో బాబబా సాహెబ్ అంబేడ్కర్ వ్యక్తి స్వేచ్ఛ, సమాజ ఆర్థిక నిర్మాణ స్వరూపాల గురించి నాయకులెవరికీ ఏ మాత్రమూ అవగాహన లేని కాలంలోనే అంబేడ్కర్ వాటి సంబంధాన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటివరకూ అర్థం చేసుకోలేని ఆచరణలో పెట్టలేని పాలక వర్గాలు ఇంత ఆర్భాటంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న సమయంలో ఆయన ప్రవచనాలను పునశ్చరణ చేసుకోవలసిన అవసరం ఉన్నది. -
కలెక్టర్, ఎస్పీ హాజరు కావాల్సిందే..
అంబేడ్కర్ విగ్రహం తొలగింపుపై తాజాగా సమన్లు జారీ మార్చి 31న విచారించనున్న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ రెవిన్యూ సెక్రెటరీకి సైతం సమన్లు సాక్షి ప్రతినిధి, కడప: నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో అంబేడ్కర్ విగ్రహం తొలిగింపు వ్యవహారంలో స్వయంగా తమ ఎదుట హాజరు కావాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తాజాగా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఇది వరకు జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ హాజరైన నేపథ్యంలో ప్రత్యేకించి కలెక్టర్, ఎస్పీలతో పాటు రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీకి సైతం సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు మార్చి 31న స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్ పుణియా నుంచి జిల్లా కేంద్రానికి సమన్లు చేరాయి. నూతన కలెక్టరేట్లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు చాలా కాలంగా కోరుతున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 30న కలెక్టరేట్లో అనూహ్యంగా అంబేడ్కర్ విగ్రహం వెలిసింది. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు చేయడం చట్టసమ్మతం కాదని జిల్లా యంత్రాంగం అదేరోజు రాత్రి పొద్దుపోయాక విగ్రహాన్ని తొలగించింది. ఆపై అక్కడే తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమించాయి. అనంతరం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ కమలమ్మకు రాయలసీమ ఎస్సీ, ఎస్టీ హ్యుమన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు జెవి రమణ ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూలగొట్టడమే కాకుండా, విగ్రహం కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను సైతం కూల్చివేశారని వివరించారు. కూలగొట్టిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారో కూడా తెలియదని, ఈ వ్యవహారంతో ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవహ దెబ్బతినిందని, ఇందుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదును కమలమ్మ చైర్మన్ పుణియాకు అందజే శారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్ కెవి రమణ, ఎస్పీ నవీన్ గులాటీలు జనవరి 28న కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే జనవరి 28 కలెక్టర్ స్థానంలో జాయింట్ కలెక్టర్ శ్వేత, అడిషనల్ ఎస్పీ విజయకుమార్‌లు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ గైర్హాజర్ కావడంపై కమిషన్ మెంబర్ కమలమ్మ సీరియస్ అయ్యారు. సమస్యకు మూలమైన అధికారులు హాజరు కాకపోవడమేమిటని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకున్నామని అధికారులు సర్ది చెప్పినా.. అన్ని ప్రాంతాల్లో అవే నిబంధనలు ఎందుకు వర్తింప చేయలేదని నిలదీశారు. అంబే డ్కర్ విగ్రహం తొలగింపులోనే ఎందుకు ఉత్సాహం చూపారని నాడు నిలదీస్తూ విచారణ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మార్చి 31న కలెక్టర్ కెవి రమణ, ఎస్పీ నవీన్ గులాటీ, రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ అయ్యాయి. కలెక్టర్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఫిర్యాదుదారుడికి సైతం సమన్లు జారీ అయినట్లు రాయలసీమ ఎస్సీ, ఎస్టీ హ్యుమన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు జెవి రమణ ధ్రువీకరించారు. -
జయంతి వేడుకలకు పక్కా ఏర్పాట్లు
► జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జయంతి పై కలెక్టర్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): మహనీయుల జయంతి వేడుకలను పండుగలా నిర్వహించాలని, ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని దళిత సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ .. కాన్పరెన్స్ హాల్లో దళిత, యువజన, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. మహనీయల జయంతి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలన్నారు. ఇందు కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీని ఆదేశించారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌లో పరిష్కరించిన అంశాలపై విజయగాథలను సభకు తీసుకరావాలన్నారు. ప్రతి నాయకుడు కనీసం 5 మంది కార్యకర్తలను సమావేశానికి తీసుకరావాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ర్యాలీ నిర్వహించడం లేదని చెప్పిన కలెక్టర్.. సభను ఉదయం 9గంటలకే ప్రారంభిస్తామన్నారు. 8.45కే అందరూ సభ నిర్వహించే 5 రోడ్ల కూడలికి చేరకోవాలన్నారు. 12 గంటలకు ఉపన్యాసాలు ముగించిన తర్వాత బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. జేసీ, జేసీ-2 తో సమావేశమై జయంతి వేడుకల ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. వేదికపై ఎవరెవరు కూర్చోవాలో నిర్ణయించాలని, ఈ విషయంలో గత ఏడాది చోటుచేసుకున్న పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. బాబు జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ దళితుల అభున్నతికి చేసిన కృషిని సమాజానికి తెలిసే విధంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు తదితరవాటిని ముద్రణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జయంతి వేడుకలను నిర్వహ ణలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా పలువురు దళిత నేతలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఒక్కో అసోసియేషన్ నుంచి ఒకరిని మాత్రమే వేదిక పైకి పిలవాలన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసీ-2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ప్రసాద్‌రావు, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత, ఉద్యోగ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
అంబేద్కర్‌కు వినతిపత్రం
హైదరాబాద్: అసెంబ్లీలో తమ మాట వినిపించడానికి కూడా అవకాశం లేకపోవడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా ట్యాంక్‌బండ్ వద్దకు బయల్దేరి వెళ్లారు. ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్నారు. రాజ్యాంగం మీద కూడా ఏమాత్రం గౌరవం లేని ప్రభుత్వం.. హైకోర్టు ఉత్తర్వులున్నా ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి వినతిపత్రం అందించారు. రోజాను అసెంబ్లీలోకి అనుమతించే అంశంపై సభలో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎంత ప్రయత్నించినా దానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. దాంతో ప్రతిపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళం నడుమ తొలుత రెండుసార్లు పదేసి నిమిషాలు వాయిదా పడిన అసెంబ్లీ.. చివరకు సోమవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత బయటకు వచ్చిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా తొలుత ఎమ్మెల్యే రోజాను పరామర్శించి, ఆమెకు సంఘీభావం తెలిపి, అనంతరం పాదయాత్రగా ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లారు. -
బడ్జెట్ ప్రతుల దహనం
దండేపల్లి : బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పిట్టల తిరుపతి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్టెట్‌లో తగినన్ని నిధులు కేటాయంచకపోవడం శోచనీయం అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఉన్నత విద్య భారం అవుతుందని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు శివగణేశ్, రాహుల్, సంతోశ్, రాజశేఖర్, తిరుమలేశ్, సుధీర్, మహేశ్, కార్తీక్, విద్యార్థులు పాల్గొన్నారు. -
బౌద్ధ క్షేత్రాల్లో భీమ్ దీక్ష ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో స్వేరోస్ (ఎస్సీ గురుకులాల పూర్వ విద్యార్థులు) నెట్వర్క్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష ప్రారంభమైంది. కాన్షీరాం జయంతి (మార్చి 15) నుంచి రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14) వరకు నెలరోజుల పాటు నిర్వహించే ఈ దీక్షను మంగళవారం రాష్ట్రంలోని వివిధ బౌద్ధ క్షేత్రాల వద్ద మొదలుపెట్టారు. దీక్ష సందర్భంగా అంబేడ్కర్ జీవితం, ఇతర మహనీయుల జీవిత విశేషాలపై పుస్తకాల పఠనం, చర్చ, చెడు అలవాట్లకు, మాంసాహారానికి దూరంగా ఉండటం, అంబేడ్కర్ చిత్రపటాలు, స్వేరోస్ పైలాన్ గుర్తును దగ్గర పెట్టుకోవడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాల, ఇంటి పరిసరాల్లో కనీసం పది చెట్ల పెంపకం, సాటి వారికి సహాయపడటం వంటివి పాటించనున్నారు. -
దళితులంటే బాబుకు చులకన
ఎస్సీ వర్గాలను అణచివేసేలాప్రవర్తిస్తున్నారు వైఎస్సార్సీపీ నేతల మండిపాటు అంబేడ్కర్విగ్రహాలకు పాలాభిషేకం అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు దళితుల పట్ల చులకనభావాన్ని మరోసారి బయటపెట్టారని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి విమర్శించారు. ఇటీవల చంద్రబాబు దళితులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురునాథరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అహంకార ధోరణితో ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఆయన వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీలపై కపట ప్రేమ చూపిన బాబు.. ఆ తర్వాత నిజ స్వరూపాన్నిబయట పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎస్సీలు ఇప్పటికైనా మేల్కోని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు దళిత వ్యతిరేకి అన్నారు. ఆయన వ్యాఖ్యలను దళితులతో పాటు అన్ని వర్గాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పురుషోత్తం, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలె జయరాంనాయక్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జైపాల్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, నాయకులు మైనుద్దీన్, గోపాల్‌మోహన్, చింతకుంట మధు, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, లింగారెడ్డి, చిరంజీవి, వెంకటేష్, మారుతీనాయుడు, శివశంకర్, బలరాం, అంజద్‌ఖాన్, శీనా, శ్రీదేవి, షమీమ్, జేఎం బాషా పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో పాలాభిషేకం సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. గుంతకల్లులో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్, కేవీపీఎస్ నాయకులు , మడకశిరలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ అంజినరెడ్డి, తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి, పెనుకొండలో పార్టీ కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, టౌన్ కన్వీనర్ ఇలియాజ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. శింగనమల ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ రైతు విభాగం మండలాధ్యక్షుడు నారాయణ, ట్రేడ్ యూనియన్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాలాభిషేకం చేశారు.ఉరవకొండలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎగ్గుల శ్రీనివాసులు, బసవరాజు, విడపనకల్లు జెడ్పీటీసీ సింగాడి తిప్పయ్యు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాకెట్ల ఆశోక్ తదితరులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి.. క్లాక్‌టవర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలోమాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు దళితులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్‌నాయక్, పార్టీ నేత పాటిల్ అజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
దళితులను కించపరచడం తగదు
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి బుచ్చిరెడ్డిపాళెం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం తగదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు దళితులను చంద్రబాబు కించపరిచేలా మాట్లాడినందుకు నిరసనగా శనివారం బుచ్చిరెడ్డిపాళెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కులరాజకీయాలు చేస్తున్నారన్నారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. అంబేడ్కర్ రచిం చిన రాజ్యాంగ సూత్రంతో అందరూ సమా న భావంతో మెలుగుతుంటే, వారి మధ్య చంద్రబాబునాయుడు కుల అంతరాల చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారన్నారు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ వారిని అవహేళన చేస్తూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు. దళితుడిగా పుట్టాలని కోరుకుంటున్నా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ మరో జన్మంటూ ఉంటే దళితుడిగా పుట్టాలని కోరుకుంటున్నానన్నారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కిన అగ్రకులాల వాళ్లు నేడు దళితులను కించపరిచేలా మాట్లాడడం దారుణమన్నారు. ఇక మీదట కులాల పేరుతో దూషిస్తే వారిని బహిరంగంగా కాల్చివేయాలన్నారు. సభ్య సమాజం తలదించేలా మాట్లాడిన చంద్రబాబునాయుడు దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళితులను కించపరచడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లేనని తెలిపారు. దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరన్న చంద్రబాబుకు దళితులే తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, నాపా వెంకటేశ్వర్లునాయుడు, సూరా శ్రీనివాసులురెడ్డి, గొల్లపల్లి విజయ్‌కుమార్, కోడూరు మధుసూదన్‌రెడ్డి, అనపల్లి ఉదయ్‌భాస్కర్, స్వర్ణా సుధాకర్‌బాబు, చీమల రమేష్‌బాబు, షేక్ అల్లాబక్షు, జెడ్పీటీసీ సభ్యులు రొండ్ల జయరామయ్య, వెంకటరమణయ్య, దేవసహాయం పాల్గొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నిరసనలు
విజయవాడ: దళితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంలో 13 జిల్లాల్లోని అంబేడ్కర్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ నాయకులు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేటలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, పోరుమామిళ్లలో ఎమ్మెల్యే జైరాములు, కడపలో ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలముడుగులో వైఎస్సార్ సీపీ నేత సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో ఆముదాలవలసలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విజయనగరం: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర నేతృత్వంలో సాలూరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. విశాఖపట్టణం: నక్కపల్లి, ఎల్ఐసీ సర్కిల్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు రామకృష్ణ, గురువులు, జాన్‌వెస్లీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద వైఎస్సార్ సీపీ నేత మళ్లా విజయ్ ప్రసాద్ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపట్టారు. తూర్పుగోదావరి: ఏలేశ్వరంలో ఎమ్మెల్యే సుబ్బారాయుడు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాజమండ్రిలో ఆకుల వీర్రాజు నేతృత్వంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమగోదావరి: మార్టేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. కృష్ణాజిల్లా: కైకలూరులో వైఎస్సార్ సీపీ నేత డీఎన్ఆర్ నేతృత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో వైఎస్సార్ సీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం: వైఎస్సార్ సీపీ నేత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరు: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కర్నూలు: కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. -
నిరసన దీక్ష నేడు
నిరసన దీక్ష నేడు బుచ్చిరెడ్డిపాళెం : దళితులను కించపరిచేలా మాట్లాడిన చంద్రబాబు మాటలకు నిరసనగా బుచ్చిరెడ్డిపాళెం అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 9 గంటలకు నిరసన దీక్ష జరగనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, గంధం వెంకటశేషయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొంటారని వారు తెలిపారు. -
అమరావతిలో అంబేడ్కర్ స్మృతి చిహ్నం
10 ఎకరాల్లో ఏర్పాటు: మంత్రి రావెల కిశోర్‌బాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో పదెకరాల్లో అంబేడ్కర్ స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణపై సదస్సు నిర్వహించారు. అంబేడ్కర్ 125వ జయంతిని ఏడాది పొడవునా నిర్వహించేందుకు కేంద్రం తయారు చేసిన ప్రణాళికను రాష్ట్రంలోనూ అమలు చేయడానికి అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకుంటామని రావెల చెప్పారు. వాటిపై కేబినెట్లో చర్చించి ఉత్సవాలకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.