రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది. అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
తాళ్లరేవు: రాజ్యాంగ నిర్మాతకు అవమానం జరిగింది. అర్ధరాత్రి వేళ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టరు బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఓ ప్రైవేటు కళాశాలలో ఉన్న విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసినట్లు స్ధానికులు గుర్తించారు.
దీంతో దళిత సంఘాలు, నేతలు 216 జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో యానాం-కాకినాడ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులతో చర్చిస్తున్నారు. నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.