Strike
-
‘కోడ్’ ముగిశాక ఆర్టీసీలో సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సంస్థ యాజమాన్యంపై పోరుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఒక కార్మిక జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వాలని మరో జేఏసీ తాజాగా నిర్ణయించింది. మొదటి జేఏసీ నిరవధిక సమ్మెకు మొగ్గు చూపుతుండగా, రెండో జేఏసీ మాత్రం ఐదారు రోజులపాటు సమ్మె చేయాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసేలోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మె అనివార్యమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. అయితే, కార్మికుల్లో సమ్మెపై ఒకింత భయం కనిపిస్తుండగా, సంఘాల నాయకులు మాత్రం సమ్మెకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ప్రైవేటు సంస్థల పెత్తనంతో..ఇటీవల ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. అవన్నీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు తీసుకుంటోంది. ఆ బస్సుల నిర్వహణ కోసం కొన్ని డిపోలను సదరు సంస్థకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది ఆర్టీసీలో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయటమేనని మండిపడుతున్నారు. దీంతో అధికారులు వెనక్కు తగ్గి డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతోపాటు సాధారణ సొంత బస్సులు కూడా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. అయినా ఉద్యోగుల్లో అనుమానాలు తొలగిపోలేదు. ఈ అంశంతోపాటు చాలా కాలంగా పెండింగులో ఉన్న ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. విలీనం, పీఆర్సీనే ప్రధాన ఎజెండాగా..గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంతలోనే ప్రభుత్వం మారటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెండింగులో పెట్టింది. 2017 వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించలేదు. 2021 వేతన సవరణపై ప్రభుత్వం స్పందించటంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన గుర్తింపు యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. సీసీఎస్, పీఎఫ్‌లకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి సాధనే లక్ష్యంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఎవరికి వారే..ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ చీలికవర్గం, బీడబ్ల్యూయూ, బీకేయూ, ఎన్ఎంయూ చీలిక వర్గం, కేపీ సంఘాలతో కూడిన తొలి జేఏసీ గత నెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 3న ఆ యూనియన్ల ప్రతినిధులను కార్మిక శాఖ చర్చలకు పిలిచి, తర్వాత ఎన్నికల కోడ్ కారణం చూపి సమావేశం రద్దు చేసింది. దీంతో, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఆర్టీసీ సమ్మెకు మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు ఎన్నికల కమిషనర్‌కు విన్నవించారు. టీఎంయూ, ఎన్ఎంయూ వర్గాలు, బీఎంఎస్, ఎస్టీ ఎంయూలతో కూడిన మరో జేఏసీ తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభు త్వానికి గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మార్చి 7 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఐదారు రోజులపాటు సమ్మె చేసి, కొద్ది రోజుల గడువు ఇచ్చి మళ్లీ సమ్మె చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మికుల్లో 10 వేల మంది మాత్రమే సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. -
కేరళలో సినిమా షూటింగులు బంద్
తిరువనంతపురం: మలయాళ సినీ పరిశ్రమ (Mollywood)లో సమ్మె సైరన్ మోగింది. జూన్ ఒకటి నుంచి షూటింగులు ఆపివేయడంతో పాటు థియేటర్ల ప్రదర్శనలు సైతం నిలిపివేస్తున్నామని ఫిలిం ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రకటించింది. మలయాళ సినిమా బడ్జెట్లు మితిమీరిపోతుండగా వాటి సక్సెస్ రేటు మాత్రం తగ్గిపోతూ వస్తున్నాయి. నటీనటులతో పాటు టెక్నీషియన్లు పారితోషికం పెంచడంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దీంతో నిర్మాతలపై భారం పెరిగిపోతోంది. వీటన్నింటినీ పరిష్కరించుకునేందుకే మాలీవుడ్ సమ్మె బాట పట్టింది. అయితే దీని ప్రభావం ఇతర ఇండస్ట్రీల మీద పడనుంది. మలయాళంలో డబ్ అయ్యే ఇతర సినిమాల పరిస్థితి గందరగోళంగా మారనుంది.చదవండి: జాలిరెడ్డిపై బెంగ పెట్టుకున్న తల్లి.. ఐదేళ్ల ఎదురుచూపులకు బ్రేక్.. -
Bangladesh: సమ్మెకు దిగిన రైల్వే సిబ్బంది.. కదలని రైళ్లు
ఢాకా: బంగ్లాదేశ్‌లో రైల్వే సిబ్బంది సమ్మెతో ఈరోజు (మంగళవారం) రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ఉద్యోగులు ఓవర్ టైం పనికి తగిన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. రైల్వే సిబ్బంది సమ్మె ప్రభావం లక్షలాది మంది ప్రయాణికులపై పడింది.పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, ఓవర్ టైం పనికి ప్రయోజనాలు కల్పించాలని కోరూతూ బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. ఈ సమ్మె దాదాపు 400 ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను ప్రభావితం చేసింది. బంగ్లాదేశ్ రైల్వే రోజుకు దాదాపు 2,50,000 మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. బంగ్లాదేశ్‌లో గత కొన్ని నెలలుగా హింస కొనసాగుతోంది. ఇప్పుడు రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగడంతో యూనస్ ప్రభుత్వానికి ఇబ్బందులు మరింతగా పెరిగాయి.ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
TGSRTC: ఆర్టీసీలో సమ్మె సైరన్.. 21 డిమాండ్లతో నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు.కాగా, నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు.. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ సందర్భంగా కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఇక, 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. -
TG: ఆర్టీసీలో సమ్మె సైరన్.. నేడు యాజమాన్యానికి నోటీసులు
సాక్షి,హైదరాబాద్:నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. తాజాగా ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ (Tgsrtc) యాజమాన్యానికి సమ్మె నోటీసు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం(జనవరి27) ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఇదీ చదవండి: నేడు ఇండోర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం -
శ్రమదోపిడీకి గురవుతున్నాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: విద్యాభివృద్ధి కోసం ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని సర్వశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేత నం కూడా లేకుండా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయా లని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన సమ్మె బాట పట్టా రు. రాష్ట్రవ్యాప్తంగా 19,325 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమైనప్పటి కీ మెరిట్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంలోనే నియమితులయ్యామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో తాము ఉద్యోగ భద్రతకు అర్హత కలిగి ఉన్నామని, వెంటనే తమ ఉద్యోగాలను క్రమబదీ్ధకరించాలని కోరుతున్నారు. కనీస వేతనాలు సైతం కరువు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు సైతం అమలు చేయడంలేదని సర్వశిక్ష ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టమ్ అనలిస్ట్‌లు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎల్‌ఎంటీ, మెసెంజర్స్, మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఐఈఆర్‌పీఎస్, మెసెంజర్స్, సీజీవీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో స్పెషల్ ఆఫీసర్లు (పీజీ హెచ్ఎం హోదా), కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్ (స్కూల్ అసిస్టెంట్ హోదా), పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్స్, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, కుక్స్, వాచ్ఉమెన్స్, స్వీపర్లు, స్కావెంజర్లు, పాఠశాల స్థాయిలో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్స్(ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్), భవిత కేంద్రాల్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్లుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరికి కేవలం రెగ్యులర్ ఉద్యోగుల వేతనాల్లో నాలుగోవంతు జీతం మాత్రమే ఇస్తున్నారు. మెసెంజర్లకు రూ.11వేలు, సీఆర్పీలకు రూ.19,350 (ఏపీలో మాత్రం రూ.26వేలు), పీజీ హెచ్ఎం స్థాయిలో ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ.32 వేలు వేతనంగా ఇస్తున్నారు. టీఏ, డీఏలు ఇవ్వడంలేదు. పైగా ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. సర్వ శిక్షలో ఇప్పటివరకు 119 మంది మరణిస్తే కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తమను రెగ్యులరైజ్ చేయాలని, రూ.10 లక్షల బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, మహి ళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం, 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ. 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. -
108 ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, అమరావతి: అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మె బాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒక రోజు రిలే దీక్షలు చేశారు. ప్రభుత్వం నిర్వహణ సంస్థలను పదేపదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవులు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే శాపాలు సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారాయి. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు 108, 104 నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, ఉన్నఫళంగా నిర్వహణ సంస్థను వెళ్లగొడితే ఆరి్థకంగా నష్టపోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒక సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత ఉంటుంది. అరబిందో సంస్థ నిర్వహణ బాధ్యతలను 2020 జూలై 1నుంచి ప్రారంభించింది. 2027 వరకూ కాంట్రాక్ట్ కాలపరిమితి ఉంది. వచ్చే ఏడాది జూలై 1 నాటికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఇంతలోనే ప్రభుత్వం ఆ సంస్థను వెళ్లగొట్టే చర్యలకు పూనుకుంటోందని, అలా జరిగితే 108లో పనిచేసే డ్రైవర్, ఈఎంటీ రూ.30 వేలు చొప్పున, 104లో పనిచేసే డ్రైవర్, డీఈవోలు రూ.15 వేల వరకూ గ్రాట్యుటీ నష్టపోతామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వమే అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు సేవలను సక్రమంగా నిర్వహించడం లేదని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే సేవలను నిర్వహించాలి. ఇదే ప్రధాన డిమాండ్‌గా సమ్మె నోటీసు ఇచ్చాం. ఈ నెల 25లోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం. ఐదేళ్లు తిరగకుండానే నిర్వహణ సంస్థను మారిస్తే మేం ఆర్థికంగా చాలా నష్టపోతాం. ఒక్క గ్రాట్యుటీ రూపంలోనే 108 ఉద్యోగులే రూ.30 వేల చొప్పున రూ.10 కోట్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లలోపే నిర్వహణ సంస్థ మారితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – బి.కిరణ్‌కుమార్, ప్రెసిడెంట్, ఏపీ 108 సరీ్వసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ -
ఆపద్భాంధవులకే ఆపద.. సమ్మె బాటలో 108 ఉద్యోగులు
సాక్షి, విజయనగరం జిల్లా : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే 108 ఉద్యోగులకు ఇప్పుడు పుట్టెడు కష్టాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 ఉద్యోగులు తరచూ వేతనాలు సకాలంలో అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు. నవంబర్ 25 నుంచి సమ్మె చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు సమ్మె నోటీసులు అందించారు. జీతం బకాయిలు వెంటనే చెల్లించాలి. 108లను ప్రభుత్వమే నిర్వహించాలి. ఉద్యోగులను ఆరోగ్య శాఖ సిబ్బందిగా గుర్తించడంతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
సోమవారం... వలంటీర్ల నిరసన వారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం వలంటీర్ల నిరసన వారంగా మారిపోయింది. గత ఐదేళ్లు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేర్చడంలో కీలకపాత్ర పోషించిన లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు గత 16 వారాలుగా రోడ్డెక్కి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు పెండింగ్‌లో పెట్టిన గౌరవ వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రతి సోమవారం అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.ఇందులో భాగంగా ఈ వారం కూడా రాష్ట్రంలోని పలు మండలాల్లో వలంటీర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా విజయనగరం కలెక్టరేట్ ముందు వలంటీర్లు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల గౌరవ వేతనాలు చెల్లించాలని నినదించారు. ఐదు నెలలుగా తేల్చని కూటమి సర్కారుఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఈ ఏడాది జూన్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎన్నికల ముందు వరకు వలంటీర్లు నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ సహా అన్ని విధుల నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. జూలై, ఆగస్టు,సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలను ఒక్కరికి కూడా చెల్లించలేదని వలంటీర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా వలంటీర్లకు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయాలని వారు కోరారు. -
జూడాల సమ్మె విరమణ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
ఉద్యోగం పోతుందని హెచ్చరిక!
చెన్నైలోని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా పరిధిలో నిరసనకు దిగిన ఉద్యోగులకు కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందజేయమని, ఉద్యోగంలో నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. చెన్నై ప్లాంట్‌లోని సామ్సంగ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని, తమ యూనియన్‌కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9 నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించింది.‘నో వర్క్..నోపే ప్రాతిపదికనను కంపెనీ పాటిస్తుంది. సమ్మె ప్రారంభమైన సెప్టెంబర్ 9 నుంచి నిరసనలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు ఉండవు. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. నిరసన కొనసాగిస్తే ఉద్యోగాల నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉంది. నాలుగు రోజుల్లోగా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరకపోతే, వారిని సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి’ అని కంపెనీ హెచ్ఆర్ విభాగం అధికారులు ఈమెయిల్ పంపించారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకంభారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉద్యోగులు వేతనాలు పెంచాలని, తమ యూనియన్ను కంపెనీ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులను సమీకరించడంలో సహాయపడిన సీఐటీయూ వివరాల ప్రకారం సామ్సంగ్ ఉద్యోగులు నెలకు సగటున రూ.25,000 వేతనం అందుకుంటున్నారు. మూడేళ్లలో రూ.36,000కు పెంచాలని డిమాండ్ ఉంది. -
సమ్మె విరమించేది లేదు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదిస్తూ జారీ చేసిన జీవో 85ను రద్దు చేసే వరకూ సమ్మె విరమించబోమని పీహెచ్సీ వైద్యులు తేల్చిచెప్పారు. బుధవారం మంత్రి సత్యకుమార్‌తో చర్చల్లో సమ్మెల విరమణకు అంగీకరించిన పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రతినిధులపై వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ప్రధాన డిమాండ్ అయిన జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకరించకుండా సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి ఎలా చెబుతారని నిలదీశారు.సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో మంత్రితో పాటు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో జీవో 85 రద్దు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సహా పలు అంశాలను వైద్యుల సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. జీవో సవరణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ప్రకటన విడుదల చేశారు. ఎంపిక చేసిన కోర్సుల్లోనే కాకుండా అన్ని క్లినికల్ కోర్సుల్లోనూ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. చర్చల అనంతరం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్లో సుమారు 1500 మంది వైద్యులతో సంఘం నేతలు సమావేశమయ్యారు. మరోమారు ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో చర్చలకు పిలుస్తుందని, ఈ క్రమంలో సమ్మె విరమిస్తామని ఒప్పుకున్నట్టు వెల్లడించారు. జీవో రద్దు చేయకుండా సమ్మె ఎలా విరమిస్తామంటూ వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగించాల్సిందేనని చెప్పారు. వైద్యులను అవమానించిన పోలీసులుధర్నా చౌక్‌లో నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అవమానించారు. ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనకు పోలీస్ శాఖను వైద్యులు అనుమతి కోరారు. మంగళ, బుధవారాల్లో నిరసన తెలపడానికి పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు. బుధవారం ప్రభుత్వం చర్చలకు పిలిచినందున ధర్నాచౌక్‌లో అనుమతి రద్దు చేశామంటూ వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. నిల్చోడానికి కూడా వీల్లేకుండా వెళ్లిపోవాలంటూ బలవంతంగా పంపేశారు. చేసేదేమీ లేక బసవపున్నయ్య ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని అక్కడ సమావేశమయ్యారు. పోలీసుల చర్య తమను అవమానించడమేనని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు -
150 మంది సామ్సంగ్ ఉద్యోగులు అరెస్టు
వేతనాలు పెంచాలని నిరసనకు దిగిన 150 మంది సామ్సంగ్ ఉద్యోగులను సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో కార్మికులు ర్యాలీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి మంజూరైన అనుమతులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దాంతో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేసేందుకు దాదాపు 400కుపైగా కార్మికులు సోమవారం కాంచీపురం కలెక్టరేట్‌కు బయలుదేరారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లిన 150 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన ఇండియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ నాయకుడు ముత్తు కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు కార్మికులు తెలిపారు.సామ్సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వేతన సవరణ కోరుతూ సమ్మెకు దిగారు. ఇప్పటికే సమ్మె ప్రారంభించి ఎనిమిది రోజులు అయింది. అయినా సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ర్యాలీ నిర్వహించాలని భావించి కలెక్టర్ అనుమతి కోరారు. చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..‘కాంచీపురంలోని సామ్సంగ్ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలి సమ్మె. స్థానికంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్‌లో దాదాపు 1,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి వేతనాలు ఇతర సంస్థల్లోని అదే స్థాయి ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 16 సంవత్సరాలుగా ఈ కార్మికులకు ఎలాంటి రిజిస్టర్డ్ యూనియన్ లేదు. వేతనాలు సవరించాలని సంస్థకు ఎన్నిసార్లు లేఖలు రాసినా లాభం లేకుండాపోయింది. సంస్థ వేతనాలపై స్పందించకపోగా కార్మికులపై పనిభారం మోపుతోంది. సామసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ పేరుతో సమ్మెకు దిగాం. సంస్థలో 25 శాతం మంది అప్రెంటిస్ కార్మికులున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్లైన్స్భారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్‌లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
సమ్మెకు వెనుకాడబోం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలైన జెన్కో, ట్రాన్స్‌కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్‌లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇ చ్చిన పదోన్నతుల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, లేనిపక్షంలో ఉద్యోగులు సమ్మె చేయడానికి వెనకాడబోరని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా గత కొంత కాలంగా తాత్కాలికం (అడ్‌హక్) పేరుతో షరతులతో కూడిన పదోన్నతులు కల్పిస్తూ బీసీ, ఓసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించారని ఆందోళన వ్యక్తం చేసింది. 35 వేల మందికి పైగా ఉన్న బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు కోరినా యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఆందోళనబాట పట్టక తప్పడం లేదని తెలిపింది. విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను పునఃసమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో మహాధర్నా జరిగింది.యాజమాన్యాలకు నోటీసులు అందజేసిన తర్వాత కూడా 3,830 మందికి మళ్లీ అడ్‌హక్ పదోన్నతులు కల్పి0చారని జేఏసీ చైర్మన్ కోడెపాక కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విధించిన షరతులను పక్కనబెట్టి ఇప్పుడు కొత్త షరతులతో పదోన్నతులు ఇస్తున్నారని, ఇప్పుడు గత ప్రభుత్వం విధించిన షరతులు ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ రొనాల్డ్ రాస్ సెలవులో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి ఆదేశాల పేరుతో పదోన్నతులు కల్పి0చడం బీసీ, ఓసీ ఉద్యోగులకు విస్మయాన్ని కలిగించిందన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎండీ రోనాల్డ్ రాస్ ప్రత్యేక చొరవ తీసుకుని బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.మాది ఉద్యోగ సానుకూల ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధులు భట్టిని కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 39 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, స్టీరింగ్ కమిటీ నేతలు దేవరకొండ సైదులు, శ్యాంసుందర్, కస్తూరి వెంకట్ తదితరులున్నారు. యశోద గ్రూప్ రూ.కోటి విరాళం వరద బాధితుల సహాయార్థం యశోద గ్రూప్ హాస్పిటల్స్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ఆసుపత్రి చీఫ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఆపద సమయంలో దాతృత్వాన్ని చాటుకున్న యశోద ఆసుపత్రి చైర్మన్ రవీందర్రావు, డైరెక్టర్లు సురేందర్‌రావు, దేవేందర్‌రావులను ఈ సందర్భంగా భట్టి అభినందించారు. -
ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట ప్రణాళికను రచిస్తున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను ముందుంచిన ఉద్యోగ సంఘాల నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ సమితి(జేఏ సీ) ఏర్పాటుకు సంఘాల నేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటైన ఈ కమిటీకి చైర్మన్‌గా టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వ్యవహరిస్తారు. జేఏసీ సెక్రటరీ జనరల్‌గా ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతారు. ఈ కమిటీలో తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ సంఘాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పీఆర్టీయూ టీజీ సైతం ఇదే జేఏసీలో భాగస్వామ్యమైంది. ప్రస్తుతం 15 మందితో స్టీరింగ్ కమిటీని వేసినప్పటికీ వారం, పది రోజుల్లో అన్ని సంఘాలను సంప్రదించి వారి ఆమోదంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా ప్రభుత్వానికి సమాచారం అందించాలనీ, అప్పటికీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుంటే 15 రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటించాలని సోమవారం నాటి సమావేశంలో వివిధ సంఘాల నేతలు కమిటీ ముందు స్పష్టం చేయగా... ఆమేరకు తీర్మానించాయి. తర్వాత జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కార్యాచరణకు సంబంధించి వివరాలు వెల్లడించారు. హక్కుల కోసం కొట్లాడతాం:మారం జగదీశ్వర్ ‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ప్రస్తుతం ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందించడం ఎంతో సంతోషకరం. ఆర్థిక స్థితిని ఆగం చేసి అప్పులపాలు చేసిన గత ప్రభుత్వ తీరును పరిగణించి కొంత సమయం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో సూచించారు. ప్రస్తుతం వేచి చూసే పరిస్థితి దాటింది. సీఎం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. రాష్ట్రానికి వచ్చిన తర్వాత జేఏసీ తరపున కలిసి పరిస్థితిని వివ రిస్తాం. ఆయన నుంచి వచ్చే స్పందన బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. నాలుగు డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ ఖరారు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ, జీవో 317 సమస్యల పరిష్కారం ప్రధాన సమస్యలుగా గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. గచి్చ»ౌలి, భాగ్యనగర్ సొసైటీ స్థలాలనూ ఉద్యోగులకు అప్పగించాలి.’ జేఏసీ నిర్ణయంతోనే పోరాడుతాం: ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వ శాఖల్లో దాదాపు 53 సంఘాల ప్రతినిధులతో చర్చించి జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఉద్యోగుల సమస్యలను జేఏసీ ద్వారానే ప్రభుత్వానికి వివరిస్తాం. సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ 36 అంశాలను ప్రాధాన్యత క్రమంలో కూర్పు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఆర్థిక పరమైన భారం లేనివి కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది. వీటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. 010 పద్దు కింద లేని ఉద్యోగులకు, మోడల్ స్కూల్, కేజీబీవీలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. ముందుగా ఈ–కుబేర్ అనేది రద్దు చేయాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలి. తీర్మానించిన వాటిలో ప్రధానాంశాలు.. » సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి » మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు » పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి » ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వి సు నిబంధనల అమలు » ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు » జీవో 317 సమస్యల సత్వర పరిష్కారం »కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ -
సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కారి్మకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.సాక్షి నెట్వర్క్: బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతోపాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎనీ్టఆర్ జిల్లాలో చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చిరుద్యోగులంతా పుట్టపర్తి చేరుకుని అధికార పార్టీ నాయకుల వేధింపులకు నిరసనగా కదం తొక్కారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి కారణమైన టీడీపీ కార్యకర్త ఆంజనేయులు కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నినదించారు. ఖాళీ ప్లేట్లతో నిరసన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో చిరుద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపును నిరసిస్తూ.. చేసిన పనులకు వేతనాలు చెల్లించాలంటూ ఖాళీ ప్లేట్లతో ఉపాధి కూలీలు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కాకినాడలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి నేతల రాజకీయ వేధింపులను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్ ఎదుట చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి ‘మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. మాకు రాజకీయ మరకలు పూయకండి’ అంటూ చిరుద్యోగులు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిరుద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఓఏలు, అంగన్వాడీ హెల్పర్లు ఒంగోలులో కదం తొక్కారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
దారి ఇలా.. పాఠశాలకు వెళ్లేది ఎలా?
జనగామ జిల్లా, చిల్పూరు: దారి ఇలా ఉంటే తాము పాఠశాలకు ఎలా వెళ్లేదంటూ విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టగా తల్లిదండ్రులు, నాయకులు సహకరించారు. మండలంలోని ఫత్తేపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు వెళ్లే రహదారిలో గ్రామంలోని మురుగు నీరు పాఠశాల సమీపంలో నిలుస్తోంది.చిరుజల్లులకే కుంటలా మారుతోంది. గతంలో గ్రామ ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే పాఠశాల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదుగతంలో ఎన్నో సార్లు అధికారులకు విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల అంటూ పనులు చేస్తున్నారే తప్ప పాఠశాలకు పిల్లలు వచ్చే రోడ్డు ఎందుకు పట్టించుకోరు. త్వరగా సమస్య తీర్చాలి.– బానోత్ బాలరాజు, గ్రామస్తుడుబురదలోనే నడుస్తున్నాంప్రతీ రోజు చెప్పులు చేతపట్టుకుని బురదలో నడిచి పాఠశాలకు వెళ్తున్నాం. మధ్యాహ్న భోజనం తినే సమయంలో వాసన భరించలేక పోతున్నాం. అధికారులు స్పందించాలి.– హరిప్రసాద్, విద్యార్థిఒక్కోసారి బురదలో జారిపడుతున్నాం..పుస్తకాల బ్యాగుతో నడిచి వస్తుంటే ఒక్కోసారి జారి బురదలో పడుతున్నాం. దీంతో తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ వాసన భరించలేక వాంతులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మా బడి వరకు రోడ్డు నిర్మించాలి.– సాత్విక, విద్యార్థిని -
గాజా: స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజా పట్టణంలో ఉన్న స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం(జులై 15) సెంట్రల్ గాజాలోని అబు అరబన్ ప్రాంతంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఈ దాడిలో స్కూలులో ఆశ్రయం పొందుతున్న గాజా వాసులు 15 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన గాజా వాసులు వేలాది మంది అబు అరబన్ స్కూల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో గాజా వాసులు ఆశ్రయం పొందుతున్న స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇది ఐదోసారి. ఈ దాడిపై ఇజ్రాయెల్ స్పందించింది. అబు అరబన్ స్కూల్ కేంద్రంగా ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు జరుగుతున్నందునే తాము టార్గెట్ చేశామని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగి వందలాదిమందిని చంపింది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. -
శాంసంగ్ చరిత్రలో భారీ సమ్మె!!
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం చరిత్రలో ఇది అతిపెద్ద వ్యవస్థీకృత కార్మిక చర్య. వేతన పెంపు, సెలవుల విషయంలో గత నెలలో చర్చలు విఫలం కావడంతో కంపెనీలోని అతిపెద్ద యూనియన్ గత కొన్ని వారాలుగా మూడు రోజుల వాకౌట్ కు సిద్ధమవుతోంది.శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా గత జూన్ ఆరంభంలో ఒక్క రోజు సమ్మె జరిగింది. తాజాగా జూలై 8న భారీ సమ్మెను కార్మికులు చేపట్టారు. కంపెనీకి చెందిన అత్యాధునిక చిప్ ప్లాంట్లలో ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ద్వారా యాజమాన్యానికి సందేశాన్ని పంపడానికి దీన్ని ఉద్దేశించినట్లుగా యూనియన్ నాయకులు చెబుతున్నారు.సియోల్ కు 38 కిలోమీటర్ల దూరంలోని హ్వాసియోంగ్ లోని శాంసంగ్ సెమీకండక్టర్ ప్లాంట్ల వెలుపల సోమవారం ఉదయం 11 గంటలకు ర్యాలీలకు 5,000 మందిని సమీకరించాలని కార్మిక సంఘం లక్ష్యంగా పెట్టుకుందని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యూన్ కుక్ బ్లూమ్ బర్గ్ న్యూస్ కు తెలిపారు. వాస్తవానికి ఎంత మంది కార్మికులు విధులను పక్కన పెడతారో స్పష్టంగా తెలియదు. ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ వాకౌట్ లక్ష్యమని యూనియన్ నేత సన్ వూ మోక్ తెలిపారు.3% వార్షిక మూలవేతనం పెంపునకు అంగీకరించని సుమారు 855 మంది సిబ్బందికి పెద్ద వేతన పెంపును కోరుతున్నట్లు మొదట చెప్పిన యూనియన్ నాయకులు తమ డిమాండ్లను మార్చారు. ఇప్పడు మొత్తం 28,000 మందికి పైగా యూనియన్ సభ్యులకు అధిక వేతనాలు, అదనపు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.సెమీకండక్టర్ సిబ్బందికి ప్రథమార్ధం పనితీరు సంబంధిత బోనస్ లను ప్రకటించడం ద్వారా కార్మికుల సమ్మె ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి శాంసంగ్ ప్రయత్నించింది. కాని వారు వాగ్దానం చేసిన నెలవారీ జీతాలలో గరిష్టంగా 75% గతంలో సాధారణమైన పూర్తి నెల చెల్లింపు కంటే తక్కువగా ఉంది.కొరియాలోని అనేక ప్రముఖ కంపెనీలను పీడిస్తున్న గ్రౌండ్ అప్ కల్లోలాన్ని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడో నివారించింది. శాంసంగ్ దివంగత చైర్మన్, ప్రస్తుత అధినేత జే వై లీ తండ్రి లీ కున్ హీ యూనియన్లు ఏర్పడకుండా నిరోధించడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇప్పుడు నేషనల్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ అనేది సుమారు 28,000 మందికి పైగా కార్మికులతో కంపెనీ యూనియన్లలో కెల్లా అతి పెద్దది. -
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
-
TG: తాత్కాలికంగా సమ్మె విరమించిన జూడాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది తాత్కాలిక విరమణ మాత్రమే తెలుస్తోంది. కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించినట్లు తెలుస్తోంది. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు.. ఈ రెండు జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది. అయితే ఈ సాయంత్రంలోపు జీవోలు విడుదల కాకుంటే.. రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు.మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్‌ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు. స్టైఫండ్స్, విద్యార్థుల సమస్యలతో పాటు ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం వెంటనే చేపట్టాలనే ఎనిమిది ప్రధాన డిమాండ్లతో జూన్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాలు సమ్మె ప్రారంభించారు. ఈ క్రమంలో విధులకు దూరంగా ఉంటూనే.. ఆస్పత్రుల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. -
క్షీణించిన మంత్రి ఆతిషి ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి ఆతిషి ఆరోగ్యం సోమవారం అర్దరాత్రి క్షీణించింది. దీంతో ఆప్ నేత సంజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు ఆమెను లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (ఎల్ఎన్జేపీ)కి తరలించారు.ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆతిషి రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి 36కు చేరాయని అన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆతిషి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయంతో, తాము ఆమెను ఆస్పత్రిలో చేర్చామని అన్నారు. ఆతిషి ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి ఆతిషి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు. నిరాహార దీక్ష నాలుగో రోజుకు ఆమె బరువు 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పడంతో ఆమెను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. #WATCH | Delhi Water Minister Atishi being taken to LNJP hospital due to deteriorating health. Atishi has been on an indefinite hunger strike since the last four days claiming that Haryana is not releasing Delhi's share of water. pic.twitter.com/BZtG4o9ThS— ANI (@ANI) June 24, 2024 -
టీజీలో కొనసాగుతున్న జూడాల సమ్మె..రోగుల ఇక్కట్లు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఉపకార వేతనాలు చెల్లించి.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదురోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరుపున ఎలాంటి స్పందన రాకపోవడంతో జూడాలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో రోజులు గడుస్తున్నా ప్రభుత్వం చలించకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ సేవల్ని బహిష్కరించి సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. జూడాల నిర్ణయంతో పలు ఆస్పత్రులలో రోగులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించిన తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.మరో వైపు వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉపకార వేతనాల పెంపు, ఆస్పత్రులలో అసౌకర్యాలు, పలు సందర్భాలలో వైద్యులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా 4వేలకు మందికి పైగా జూనియర్ డాక్టర్లు నిరవదిక సమ్మెను కొనసాగిస్తున్నారు.ఈ తరుణంలో సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహంతో జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ పలు అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో జూడాలు తమ సమ్మెను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సమ్మె
-
రేపట్నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: జూనియర్ డాక్లర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24 నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఏడు ప్రధాన డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌జీ సాయిశ్రీహర్ష, ఐజక్ న్యూటన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. శనివారం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో భోజ న విరామ సమయంలో జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. 24 నుంచి తలపెట్టే సమ్మెలో అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులు నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఔట్ పేషెంట్, వార్డు సర్వీసులు, ఎలక్టివ్ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి. కార్యక్రమంలో టీ–జూడా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీశ్లతోపాటు పీజీలు, హౌస్సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవీ డిమాండ్లు » ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెలా స్టైపెండ్ నిధులు విడుదల చేయాలి » సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్‌కు రూ.1.25 లక్షలు గౌరవ వేతనం చెల్లించాలి » ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలి ళీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15 శాతం కోటా తొలగించాలి ళీ నూతన మెడికల్ కాలేజీల్లో వసతిగృహాలు, రవాణా, పరిశోధనశాల సదుపాయాలు కల్పించాలి » బోధనాస్పత్రులు, కాలేజీల్లో సెక్యూరిటీ ఔట్‌పోస్టు బలోపేతం చేయాలి » సెక్యూరి టీ ఔట్‌పోస్టు లేనిచోట కొత్తగా ఏర్పాటు చేయాలి -
ఢిల్లీ నీటి సమస్య పరిష్కరించకపోతే.. ప్రధానికి ఆప్ మంత్రి లేఖ
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో తాగునీటి సంక్షోభ పరిస్థితులు మెరుగుపడకపోతే సత్యాగ్రహ దీక్ష చేపడతామని జలనరుల శాఖ మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశాను. ఢిల్లీ నీటి సంక్షోభం సమస్యను తర్వగా పరిష్కరించాలని కోరాను. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే జూన్ 21 నుంచి సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపాను. ఢిల్లీకి రావల్సిన నీటి వాటాను హర్యానా రాష్ట్రం విడుదల చేయటం లేదు. హర్యానా వ్యవహరిస్తున్న తీరుతో ఢిల్లీ ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.#WATCH | Delhi Water Minister Atishi says, "Today I have written a letter to the Prime Minister saying that 28 lakh people in Delhi are not getting water. I have requested that he should help provide water as soon as possible...If the people of Delhi do not get their rightful… pic.twitter.com/25aoBprKeN— ANI (@ANI) June 19, 2024 .. నిన్న హర్యానా ఢిల్లీకి రావాల్సిన 613 ఎంజీడీ నీటికి కేవలం 513 ఎంజీడీ నీరు విడుదల చేసింది. ఒక్క ఎంజీడీ నీరు 28, 500 మందికి సరిపోతాయి. అంటే హర్యానా విడుదల చేసిన నీరు కేవలం 28 లక్షల మందికి మాత్రమే సరిపోతాయి. ఇక నీటీ సమస్య అనేకసార్లు హర్యానా ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాను’’ అని మంత్రి అతిశీ తెలిపారు. -
మళ్లీ సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష.. కారణమిదే!
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దేశంలోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరవ షెడ్యూల్‌ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లేహ్‌లో 21 రోజుల నిరాహార దీక్షకు దిగారు. మార్చి 7న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష 21 రోజుల పాటు కొనసాగనుంది. సోనమ్ వాంగ్‌చుక్ ఎవరు? సోనమ్ వాంగ్‌చుక్ వృత్తిరీత్యా ఇంజనీర్, ఆవిష్కర్తగా, వాతావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా పేరొందారు. లడఖ్‌లోని విద్యా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్’ను స్థాపించారు. కృత్రిమ హిమానీనదాలను సృష్టించే మంచు స్థూప సాంకేతికతను రూపొందించారు. ఇందుకోసం ఆయన 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డులను అందుకున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్‌తో వాంగ్‌చుక్ మరోసారి నిరాహారదీక్షకు దిగారు. ఇవే డిమాండ్లతో గత ఏడాది జనవరిలో ఐదు రోజుల పాటునిరాహార దీక్ష చేశారు. అది కూడా 18 వేల అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిరాహార దీక్షకు దిగారు. లడఖ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వాంగ్‌చుక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశానికి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. వాంగ్‌చుక్ తన దీక్షతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. #SAVELADAKH #SAVEHIMALAYAS Sonam Wangchuk appeals to the world to live simply, starts #ClimateFast of 21 days (extendable till death) Please watch full video in English here:https://t.co/XHkcIdQQ7b#ILiveSimply #MissionLiFE #ClimateActionNow pic.twitter.com/KQi5EMro9X — Sonam Wangchuk (@Wangchuk66) March 6, 2024 -
సమ్మెకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైరన్?
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. 2024, మే ఒకటి నుంచి చేపట్టబోయే ఈ సమ్మెలో 28 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మూడు కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు పాల్గొననున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అమవుతున్న జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ని పునరుద్ధరించాలని ఈ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ జాయింట్ ఫోరమ్(జేఎఫ్ఆర్ఓపీఎస్) ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మార్చి 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఫోరమ్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు ఫోరమ్ కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. -
కోల్ ఇండియాలో 16న సమ్మె సైరన్
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా నిలిచిన కోల్ ఇండియాలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒకరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా సిబ్బంది సమ్మె బాటపడుతుండటంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మె చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సమ్మెలో హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌ఎంఎఫ్, సీఐటీయూ యూనియన్లు పాల్గొంటున్నాయి. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్!
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె (స్ట్రైక్) చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్‌తో సహా నాలుగు ఫుడ్ యాప్‌ల డ్రైవర్లు, రైడర్లు ఈ స్ట్రైక్‌లో పాల్గొంటారని సమాచారం. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్‌లలో పనిచేసే వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు. స్ట్రైక్ చేయడానికి కారణం, 'ప్రతి రోజూ దోపిడీకి గురవుతూ, మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయాము. ఇది మా గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చింది. మేము చేసే పనికి మాకు న్యాయమైన పరిహారం కావాలి' అని చెప్పడమే. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్‌కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యూఎస్‌లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! View this post on Instagram A post shared by Delivery Job UK (@deliveryjobuk) -
అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అంగన్వాడీల సమస్యలపై సానుభూతితో వ్యవహరిస్తోందనీ, ఆయన ఆదేశాలతో ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిపామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వారికి వీలైనంతవరకూ మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి చర్చలు జరిపారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల కోర్కెలు అన్యాయమని అనడంలేదని, ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని కోరామని చెప్పారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదన్న విషయాన్ని గమనించాలని తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది పిల్లలకు ఆహారం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీకి నెల రోజులుగా ఇబ్బంది ఏర్పడిందనీ, వారికి సేవలు అందకపోవడంవల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయనీ, పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని కోరుతున్నామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... అడిగినవన్నీ ఆమోదించాం.. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాం. దానిపై వారు మరోసారి ప్రతిపా దించడంతో వర్కర్లకు రూ.1.20లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. సర్వీసులో ఉండగా చనిపోతే గతంలో రూ.3వేలే ఇచ్చే వారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.25 వేలు ఇవ్వాలని కోరగా రూ.20 వేలు ఇస్తామన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు, పదోన్నతుల వయో పరిమితి 40 నుంచి 50 ఏళ్లకు అంగీకరించాం. టీఏ, డీఏలు, హౌస్ రెంట్ అలవెన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చేలా ఆమోదించాం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపాం. మిగిలిన డిమాండ్లు కూడా సమ్మె విరమిస్తే ప్రాధాన్యత క్రమంలో తీరుస్తాం. వేతనం పెంపుపై పట్టు తగదు.. చంద్రబాబు హయాంలో అంగన్వాడీలకు ఇచ్చిన వేతనం ఎంత? వైఎస్ జగన్ ఇస్తున్న వేతనం ఎంత? అనేది అంగన్వాడీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2014లో అంగన్వాడీ వర్కర్లకు రూ.4,200, హెల్పర్లకు రూ.2,200, అదే 2016లో రూ.7 వేలు, రూ.4,500 ఇచ్చారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనం పెంచుతామని పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వడంతో ఎన్నికల ఆర్నెల్ల ముందు చంద్రబాబు వేతనాలు పెంచినా... సక్రమంగా అందించలేదు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ అధికారం చేపట్టిన వెంటనే జూలైలో వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలకు వేతనాలు పెంచారు. చంద్రబాబు హయాంలో వర్కర్లకు సగటున నెలకు రూ.6,100 మాత్రమే వస్తే... జగన్ పాలనలో నాలుగున్నరేళ్లుగా రూ.11,500 ఇస్తున్నారు. వేతనాల పెంపునకు గడువు కోరాం ప్రభుత్వానికి ఆర్థిక పరమైన అంశాలను అంచనా వేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చాం. 2019 జూలైలో వేతనాలు పెంచాం. కనీసం ఐదేళ్లు గడువు ఇవ్వాలని చెప్పాం. వచ్చే జూలైలో ఆమోదయోగ్యమైన విధంగా వేతనాలు పెంచుతామనీ, సమ్మె విరమించాలని కోరాం. యూనియన్లు ఇప్పటికైనా ఆలోచించాలి. రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అంగన్వాడీల సమ్మె విషయంలో సంయమనం పాటించాం. ఎస్మా విషయంలో రాజకీయ పార్టీలు, అంగన్వాడీలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ అజెండాతో రెచ్చగొడుతున్న ప్రతిపక్షాల డైరెక్షన్లో అంగన్వాడీలు వెళితే నష్టపోక తప్పదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందుకోసం గురువారం నుంచి నోటీసులు ఇస్తోంది. పది రోజుల గడువు ఇచ్చి కొత్త వారిని నియమించుకుంటాం. తెగే వరకు సమస్యను సాగదీయకుండా అంగన్వాడీలు అర్థం చేసుకుని సమ్మె విరమించాలి. -
అంగన్వాడీలు మెట్టు దిగడం లేదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం మూడు దఫాలుగా అంగన్వాడీలతో చర్చించిందని.. సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే చర్చలు జరిపామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మూడో దఫాలో మంత్రి వర్గంతో అంగన్వాడీ కార్మికులు, సంఘాలు చర్చలు జరిపాయి. చర్చల అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని చెప్పాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచాం. వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పాం. అంగన్వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్ చేస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా వ్యవహరించాం. వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది’’ అని సజ్జల అన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ఎప్పుడూ పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని, గర్భిణీలు, పసిబిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మాన పరిధిలోకి తెచ్చామని సజ్జల స్పష్టం చేశారు. ఈ సమ్మె కాలంలో.. అంగన్వాడీ కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాం. అంగన్వాడీలు విధుల్లో చేరాలని ప్రభుత్వం తరఫున కోరారాయన. ఈ సమ్మె వెనుక పొలిటికల్ ఎజెండా ఉంది. ఈ పోలిటికల్ ఎజెండాతో అంగన్వాడీలు నష్టపోతారు. వారు విధుల్లో చేరకుంటే నిబంధనలు ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది అని సజ్జల పేర్కొన్నారు. -
పపువా న్యూగినీలో అల్లర్లు..
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు. -
అత్యవసర సేవలకు ఇబ్బంది రాకూడదనే..
సాక్షి, అమరావతి: బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అందాల్సిన అత్యవసర సేవల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, ఈ చర్యను సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు.. ఎన్నికల ముందు బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో అంగన్వాడీలు సమ్మెకు దిగడాన్ని తప్పుబట్టాయి. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నాయి. వాస్తవానికి దేశంలో అంగన్వాడీలకు ఎక్కువ వేతనాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, వీరి వేతనాల నిమిత్తం కేంద్రం కేవలం రూ. 1,800 మాత్రమే ఇస్తున్నా మిగతా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపాయి. చాలా రాష్ట్రాల్లో వారికి ఇచ్చే వేతనం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు మాత్రమే ఉందని చెప్పాయి. కాగా, ఇప్పుడు అంగన్వాడీలను ఇష్టమొచ్చిన మాటలతో రెచ్చగొడుతున్న విపక్ష నేత చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న 2000వ సంవత్సరంలో ఉద్యోగులను గుర్రాలతో తొక్కించాడన్నది పచ్చి నిజం. మళ్లీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్ల పాటు వారికి కేవలం రూ. 4 వేలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత రెండున్నరేళ్లు రూ. 7 వేలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల వేతనాన్ని తెలంగాణతో సమానంగా పెంచుతామని 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే కొద్ది నెలల ముందు హడావుడిగా వారి వేతనాన్ని రూ. 10,500కు పెంచి దానిని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్వాడీల వేతనాన్ని రూ. 11,500కు పెంచి చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది తలెత్తినా ఎప్పుడూ ప్రభుత్వం వెనకడుగు వేయని ప్రభుత్వ పరిస్థితిని అంగన్వాడీలు అర్థం చేసుకోకపోవడం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే ఎస్మా.. అత్యంత బలహీనులకు పౌష్టికాహార పంపిణీ తదితర సేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అంగన్వాడీలు ఆరు నెలల పాటు సమ్మె చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నెలలో 25 రోజుల చొప్పున ఏడాదిలో 300 రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గత నెల 12 నుంచి సమ్మెకు దిగడంతో ప్రజల్లో అత్యంత బలహీనులైన వారికి పౌష్టికాహార పంపిణీలో అవరోధం ఏర్పడింది. ఇప్పటికే పలుమార్లు వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం వారి 11 డిమాండ్లలో 10 ఆమోదించి అమలుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీ నిలిచిపోయింది. పిల్లల గ్రోత్ మోనిటరింగ్ నిర్వహణ, ఇమ్యూనైజేషన్, ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు ఆగిపోయాయి. సమ్మె కారణంగా 7.5 లక్షల ప్రీ స్కూల్ పిల్లలు అంగన్వాడీలకు రావడం తగ్గిపోయి ప్రస్తుతం రెండు లక్షలే వస్తున్నారు. కొత్తగా పిల్లల నమోదు కూడా ఆగిపోయింది. ప్రతి నెల సుమారు 45 వేల మంది గర్భిణులు, బాలింతలకు సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనార్థం తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్విసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్–1971(ఎస్మా)’ను ప్రయోగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు నెలలపాటు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రోత్సాహకాలిస్తున్న ప్రభుత్వం ఇది.. ♦ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని ఐదేళ్ల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ. 6,950, అంగన్వాడీ సహాయకులకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ.3,900 మాత్రమే చెల్లించింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలున్నగురేళ్లుగా వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7 వేలు చొప్పున పెంచిన వేతనాలు అందిస్తోంది. అంతేగాక మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ఇస్తోంది. ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. -
సమ్మె విరమించండి.. సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్మికులు కోరిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కార్మికులు సమ్మె విరమిస్తే పది రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంఘాల ప్రతినిధులతో శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నుంచి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు వి.రవి కుమార్ (వైఎస్సార్టీయూసీ), ఎ.రంగనాయకులు (ఏఐటీయూసీ), కె. ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు (టీఎన్టీయూసీ), బాబా ఫకృద్దీన్ (ఏపీఎంఈడబ్లు్యయూ), జీవీఆర్కేహెచ్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ), ఆర్.సత్యం (జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్), ఇ.మధుబాబు (ఏపీ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్) హాజరయ్యారు. చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి పది రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. ఆ హామీలు ఇవీ.. ♦ సీవరేజీ మరణాలకు సుప్రీం కోర్టు ఆదేశానుసారం రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని కార్మికులు కోరారు. సుప్రీం తీర్పును అమలు చేస్తాం. ♦ సరండర్ లీవ్ బిల్లులు విడుదల చేస్తాం ♦ రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ చెల్లింపులు చేస్తాం ♦ పారిశుద్ధ్య కార్మికులు కాని వారి కేటగిరీల మార్పుపై ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకుంటాం ♦ గతంలో చనిపోయిన కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడానికి అంగీకారం ♦ కోవిడ్ మరణాల ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు మరోసారి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తాం ♦ కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి వేతనం, అలవెన్స్ కలిపి రూ.21 వేల వేతనాన్ని ఒకేసారి అందిస్తాం. ప్రస్తుతం ఇస్తున్న 15 వేలు, రూ.6 అలవెన్స్ స్థానంలో మొత్తం కలిపి జీతంగా పరిగణించాలని కార్మికులు కోరారు. అందుకు అంగీకరించాం. ♦ వాటర్ సప్లైలో పని చేస్తున్న నైపుణ్యం గల పొరుగు సేవల కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ నిచ్చి సర్టిఫికెట్లు అందజేస్తాం ♦ మరణించిన పొరుగు సేవల కార్మికుల దహన సంస్కారాలకు ఇస్తున్న ఖర్చులను పెంచుతాం ♦ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల కేటగిరీ సమస్యలను అన్నింటినీ పది రోజుల్లో పరిష్కరిస్తాం. ♦ పొరుగు సేవల నుంచి రిటైర్ అయిన కార్మికులకు రూ.50 వేలు ఇస్తాం. అయితే, వారు సర్వీసును కనీసం 10 ఏళ్లు పూర్తి చేయాలి. ఆపై సర్విసు పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.2 వేల చొప్పున అదనంగా చెల్లిస్తాం ♦ అన్ స్కిల్డ్ వర్కర్లకు కూడా స్కిల్డ్ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అన్ స్కిల్డ్ వర్కర్లు కూడా చదువుకుని ఐటీఐ వంటి స్కిల్ సర్టిఫికెట్ సాధిస్తే వారికీ స్కిల్డ్ వేతనం అందిస్తాం. ఇందుకోసం వారికి చదువుకునే అవకాశం కూడా కల్పిస్తాం. -
అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు నీచ రాజకీయాలు
సాక్షి అమరావతి: అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేశ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్నారు. వారు అత్యవసర సర్విసుల కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలింతలు, గర్భిణిలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కాదా? అందుకే అలా చేశాం. వారి డిమాండ్లలో 90 శాతం నెరవేర్చాం. ఒకటి రెండు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశాం. ఇప్పుడు ఎన్నికల తర్వాత మిగతా డిమాండ్లు కూడా కచ్చితంగా అమలుచేస్తామనే చెప్పాం. ఇప్పుడే కావాలని వారు అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు ప్రభుత్వం మోయలేదు. ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్‌గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా?. చంద్రబాబు ఏనాడైనా ఇంత సంయమనంతో ఉన్నాడా? తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు. గుర్రాలతో తొక్కించింది ఎవరు అంటే చంద్రబాబే కనిపిస్తారు. చంద్రబాబు నైజాన్ని పుణికి పుచ్చుకున్న లోకేశ్ మా గురించి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం విడ్డూరం. ఇక అంబటి రాయుడు కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్‌తో వచ్చారో, దేనికి రాజీనామా చేశారో అనేది తెలియదు. కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ట్వీట్లో తెలిపారు. పూర్తి వివరాలు తెలిశాక స్పందిస్తాం. -
ఇప్పటికైనా గ్రహిస్తారా?!
సదుద్దేశమే ఉండొచ్చు... సత్సంకల్పమే కావొచ్చు... బాధిత వర్గాలకు బాసటగా నిలవాలన్నదే ధ్యేయం కావొచ్చు. కానీ చట్టాల రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో సంబంధిత వర్గాలను సంప్రదించటం అవసరమని మరోసారి రుజువైంది. ఎవరు పిలుపునిచ్చారో, వారి డిమాండ్లేమిటో స్పష్టత లేదు. కానీ చెదురుమదురుగా మొదలైన ట్రక్కు ఆపరేటర్ల మూడురోజుల సమ్మె 48 గంటలు గడవకుండానే దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టించింది. నిత్యావసరాలకు కొరత ఏర్పడి జనం అల్లాడారు. పలు రాష్ట్రాల్లో చేంతాడంత క్యూలు పుట్టుకొచ్చాయి. చివరకు ట్రక్కు ఆపరేటర్ల సంఘాలతో మాట్లాడాకే చట్టం అమలు చేస్తామని కేంద్ర హోమ్ శాఖ హామీ ఇవ్వటంతో మంగళవారం సాయంత్రానికి సమ్మె విరమించారు. వలసపాలనలోని చట్టాలన్నిటినీ ప్రక్షాళన చేసి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని ఆ మధ్య కేంద్రం ప్రకటించింది. మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వాటి తాలూకు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా జరిగిన ట్రక్కు ఆపరేటర్ల మెరుపు సమ్మె భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలపైనే! గతంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామంటూ కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలపై దాదాపు ఏడాదిన్నరపాటు రైతులు సాగించిన ఉద్యమంతో చివరకు ఆ చట్టాలను వెనక్కు తీసుకోకతప్పలేదు. దాన్నుంచి తెలుసుకున్న గుణపాఠాలేమిటో గానీ... పాత నేర చట్టాలకు పాతరేస్తున్నామంటూ తీసు కొచ్చిన కొత్త చట్టాల పైన కూడా అలాంటి వివాదమే బయల్దేరింది. తమ వాదనేమిటో తెలుసు కోకుండా ఈ నిబంధనలు పెట్టారని ట్రక్కు ఆపరేటర్లు అంటున్నారు. పార్లమెంటులో ఆ చట్టాలపై చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో భిన్నస్వరం వినిపించగలిగిన విపక్షంలో అత్యధికులు సస్పెండయ్యారు. చట్టసభల్లో వుండే మెజారిటీతో అధికారపక్షాలు ఎలాంటి బిల్లులనైనా సులభంగా దాటించవచ్చు. కానీ అమలు సమయంలో సమస్యలు తలెత్తుతాయని గ్రహించలేనంత అమాయ కత్వంలో పాలకులుంటే ఎలా? మన రహదారులు తరచు రక్తసిక్తమవుతున్నాయి. ట్రక్కు ఆపరేటర్ల నిర్లక్ష్యమో, అజాగ్రత్తో కానీ ఏటా వేలాదిమంది ప్రాణాలు బలవుతున్నాయి. గత నెలలో విడుదలైన 2022 నాటి జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆ సంవత్సరం దేశంలో 47,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అంటే సగటున రోజుకు 140 మంది, గంటకు ఆరుగురు చనిపోయారు. కేంద్రం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక గణాంకాలు మరోలా వున్నాయి. దానిప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 67,387 మంది మరణించారు. అంటే సగటున రోజుకు 85 మంది,గంటకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలకు అందని దుర్మరణాలు మరెన్ని వున్నాయో చెప్పలేం. వీటిని అరికట్టడం కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రం చాన్నాళ్లుగా అనుకుంటోంది. 2019లో అందుకోసం మోటారు వాహనాల చట్టాన్ని సవరించారు కూడా! కానీ భారీ జరిమానాలు వసూలు చేయటం మొదలెట్టిన కొద్దిరోజులకే వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆ చట్టాన్ని అటకెక్కించాయి. ఈసారి బీఎన్ఎస్ వంతు వచ్చింది. వాస్తవానికి అదింకా అమల్లోకి రాలేదు. కానీ అది అమలైతే వాహనాల డ్రైవర్లకు కఠిన శిక్షలుంటాయి. ప్రస్తుతం అమల్లోవున్న ఐపీసీలోని 304ఏ ప్రకారం ప్రమాదకారకులై, పరారీ అయిన డ్రైవర్లకు గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష, జరిమానా విధిస్తున్నారు. కానీ బీఎన్ఎస్లోని 106/2 ప్రకారం అలాంటి డ్రైవర్లకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా ఉంటుంది. పరారీ కావటానికి ట్రక్కు ఆప రేటర్లు చెబుతున్న కారణాలు వేరే వున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా స్థానికులు తమనే బాధ్యుల్ని చేసి కొట్టి చంపడానికి, వాహనాన్ని తగలబెట్టడానికి లేదా లూటీ చేయటానికి ప్రయత్నిస్తారని అందువల్లే అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నిస్తామని వారి వాదన. అందుకే ట్రక్కు ఆపరేటర్లు సమ్మెకు దిగారు. ఒక బలమైన వర్గం దేన్నయినా వ్యతిరేకిస్తే ఏ చట్టమైనా ఆగి పోవాల్సిందేనని ఈ అనుభవం నిరూపిస్తోంది. బీఎన్ఎస్ ఇంకా అమల్లోకి రాలేదని, రోడ్డు ప్రమాదాల నిబంధనలపై అఖిల భారత మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌తో చర్చించాకే అమలు చేస్తామని తాజాగా కేంద్రం చెబుతోంది. వలసపాలకులు తెచ్చిన చట్టాల స్థానంలో ‘మనవైన’ చట్టాలుండాలని ఉబలాటపడటం మంచిదే! అందుకోసం సంబంధిత వర్గాలతో ముందే చర్చించివుంటే, కనీసం విపక్షాలతో సహా అందరూ తమ అభిప్రాయాలు తెలియజేసేవరకూ బిల్లుల ఆమోదాన్ని ఆపివుంటే వ్యవహారం వేరేగా ఉండేది. నిజానికి రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వుండటం లేదని సాధారణ ప్రజానీకం భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకో, ఇతరేతర ప్రలోభాలకో లొంగి పోలీసులు ప్రమాద కారకుల్ని తప్పిస్తున్న ఉదంతాలు సరే, నిబంధనలు కూడా సరిగా లేవని నిపుణుల వాదన. కనుక బీఎన్ఎస్లో నిర్దేశించిన శిక్షలు, జరిమానాలు సరైనవేనని వారి వాదన. కానీ చట్ట రూపకల్పన ప్రక్రియ సరిగా సాగకపోవటం వల్ల సమస్య తలెత్తింది. అమల్లోకి రాకముందే సవరణలు చేయక తప్పని స్థితి ఏర్పడింది. రహదారులు మన ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. అవి ఆరు లేన్లు, ఎనిమిది లేన్లుగా విస్తరించాయి. కానీ వాటి నిర్మాణం, నిర్వహణ, వాహనాల అదుపు సక్రమంగా లేకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఇందుకు ట్రక్కు ఆపరేటర్లను మాత్రమే బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునే కంటే మెరుగైన పరిష్కారాలు వెదకటం ఉత్తమం. -
రోజంతా అల్లాడించి...రోడ్డెక్కిన ట్రక్కులు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్త గందరగోళానికి, అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారి తీసింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజుల పాటు కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో దేశమంతటా వాహనదారులంతా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దాంతో ఎక్కడ చూసినా బంకుల ముందు భారీ క్యూ లైన్లే దర్శనమిచ్చాయి. ఇది నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లకు దారితీసింది. అత్యధిక బంకుల్లో చూస్తుండగానే నిల్వలు అడుగంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్లతో పాటు కాయగూరలు, ఇతర నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయి జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కేంద్రంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారికి హామీ ఇచ్చారు. దానిపై ఏఐఎంటీసీతో లోతుగా చర్చించాకే నిర్ణయం తీసుకునేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్ మల్కిత్సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సర్వత్రా నో స్టాక్...! రోడ్డు ప్రమాద మృతికి బాధ్యుడైన వాహనదారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. వాటి రద్దు డిమాండ్‌తో మహారాష్ట్ర తదితర చోట్ల సోమవారం నుంచే మూడు రోజుల సమ్మెకు దిగారు. అది మంగళవారాకల్లా దేశమంతటా విస్తరించింది. దాంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటింది. పెట్రోల్ బంకులన్నీ జనంతో పోటెత్తి కన్పించాయి. కిలోమీటర్ల పొడవున వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డు పెట్టి బంకులను మూసేయడం ఉద్రిక్తతకు, గొడవలకు దారి తీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు డ్రైవర్లు కూడా తమ లారీలు, ట్రక్కులను హైవేలపై రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటూ కన్పించారు. -
సానుకూలంగానే మున్సిపల్ కార్మికులతో చర్చలు: మంత్రి ఆదిమూలపు
గుంటూరు, సాక్షి: పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ.. సానుకూలంగానే జరిగినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పలు డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని పేర్కొంటూ.. చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘కార్మికుల డిమాండ్ మేరకు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఇచ్చాం. ఎక్స్‌గ్రేషియాపై సానుకూలంగా స్పందించాం. సమానపనికి సమాన వేతనంపై చర్చించాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చాం. దాని మేరకే చర్యలు తీసుకున్నాం. ఇవాళ్టి చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నాం. మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో ఇతర సమస్యలపైనా చర్చిస్తాం’’ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పారిశుద్ధ్య సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ ఫే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు & శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఝ చర్చలు జరిగాయి. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా సుదీర్ఝ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్), వై.వి.రమణ (YSRTUC ప్రధాన కార్యదర్శి), ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు), పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్), శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర ప్రెసిడెంట్), అంజినీయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు), కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు. -
Truck Drivers Protest: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ట్రక్కు డ్రైవర్ల సమ్మెపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. రోడ్ యాక్సిడెంట్ల కేసుల్లో శిక్షను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్ట సవరణ చేయడాన్ని షెహన్షాకా ఫర్మానాగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం రాహుల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రతిపక్షంతో చర్చించకుండా చట్టాలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడే. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి డ్రైవర్లకు వ్యతిరేకంగా చేసిన చట్ట సవరణ వల్ల తీవ్ర పరిణామాలుంటాయి. కష్టపడి పనిచేసుకుని జీవితాలు గడిపే డ్రైవర్ల జీవితాలను చట్టాల పేరు చెప్పి ఇబ్బందుల పాలు చేయడం సరికాదు. ఈ చట్టాన్ని కొన్ని వ్యవస్థలు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అవకాశం ఉంది’అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో సోమవారం(జనవరి 1) నుంచి దేశంలోని పలు నగరాల్లో బంకులకు పెట్రోల్, డిజిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆయా నగరాల్లో వాహనదారులు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ కోసం ద్వి చక్ర వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
HYD: బంకుల్లో నో పెట్రోల్.. వాహనదారుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మంగళవారం మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పెట్రోల్ బంకుల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మెకు దిగినట్లు తెలుస్తోంది. రోడ్లపై ప్రమాదానికి పాల్పడి పారిపోతే వాహన యజమానులు, డ్రైవర్లకు పదిలక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్ష విదించేలా ఇటీవలే చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలోనూ ఇది వర్తింపు ఉంటుంది కాబట్టి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగ్రహానికి గురైన ట్యాంకర్ల యజమానులు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. ఇదీచదవండి.. చలాన్ల చెల్లింపుపై వాహనదారులకు పోలీసుల హెచ్చరిక -
ఈ నెల 5 నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారించకపోతే ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. మంగళవారం టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు సాక్షి మీడియాతో మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతున్నాయన్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. ప్రమాదానికి ఇన్య్సూరెన్స్ రాకపోతే మాపై కేసులు పెడుతున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు టెండర్లు వేయలేదు. ఇందులో గిట్టుబాటు కావడం లేదు. టెండర్లు వేయొద్దని కోరుతున్నాం’’ అని అద్దె బస్సుల యజమానులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: నేను ఎక్కడికి పారిపోలేదు: బైరి నరేష్ -
ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించి బాలింతలు, తల్లులు, పిల్లలకు సేవలందించాలని ప్రభుత్వ బృందం విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీల సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డితో కూడిన అధికారుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మరోమారు చర్చించింది. ఈ చర్చల్లో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, తల్లులు ఇబ్బంది పడుతున్నారని, అర్థం చేసుకుని సమ్మె విరమించి సహకరించాలని అన్నారు. జనవరి 5 నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోం రేషన్ కిట్లు, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు. సంక్రాంతి తర్వాత మరలా కూర్చుని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో ఒక్కటి తప్ప 10 డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు. వాటిని అమలు చేస్తూ జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు, టీఏ, డీఏలు, అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనం రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంపు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంచడం వంటి వాటికి సంబంధించిన జీవోలు ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. మిగిలిన వాటిపై కూడా రెండు, మూడు రోజుల్లో జీవోలు జారీ చేస్తుందని తెలిపారు. గౌరవ వేతనం పెంపు అంశం ఒక్కటే మిగిలి ఉందని, దీనిపై సంక్రాంతి తర్వాత చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుందాని చెప్పారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగారు. అంగన్వాడీల గ్రాట్యుటీ అంశం తమ పరిధిలో లేదని, దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. తాము బెదిరించడం లేదని, సమ్మె విరమించాలని కోరుతున్నామని మంత్రి బొత్స వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, డైరెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వేతనాలు పెంచకపోతే ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు ప్రకటించారు. చర్చల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బరావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, ఉపాధ్యక్షురాలు సుప్రజ, అంగన్వాడీ హెల్పర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు గంగావతి, ఉపాధ్యక్షురాలు జి.భారతి, కార్యదర్శి వీఆర్.జ్యోతి, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ప్రేమ, ఉపాధ్యక్షురాలు ఫ్లారెన్స్, ప్రధాన కార్యదర్శి జె.లలిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ రంగం సిగలో విరిబోణి సింగరేణి
సింగరేణికి ప్రభుత్వ రంగంలో 103 ఏండ్లు వచ్చాయి. మరో 150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలున్నాయి. 10 వేల మిలయన్ టన్నులకు పైగా ఇప్పటికే గోదావరి తీరంలో గుర్తించిన నల్లబంగారం ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు వల్ల సంస్థ భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి పడింది. మళ్ళీ అస్తిత్వం కోసం, ప్రభుత్వ రంగంలో నిలదొక్కు కోవడం కోసం యూనియన్లకు, రాజకీయ పార్టీ లకు అతీతంగా పోరు బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిల దొక్కుకున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులూ, వారి కుటుంబ సభ్యులూ ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్ట మొదటి సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న సింగరేణి లిమిటెడ్ కంపెనీగా మారింది. రాష్ట్రం 51 శాతం.. కేంద్రం 49 శాతం వాటాతో సంస్థ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్ట మొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే. ఈ సంవత్సరం డిసెంబర్ 23 నాటికి ‘సింగరేణి లిమిటెడ్’ సంస్థగా మారి 103 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. సంస్థ నష్టాల నుంచి బయటపడి 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది. సింగరేణి 2001–02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి వాటా బోనస్‌ను చెల్లిస్తూ వస్తోంది. భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్‌ను ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు. డిపెండెంట్ ఎంప్లాయి మెంట్‌ను కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్ వ్యాలి డేషన్ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధన మేరకు కొనసాగిస్తున్నారు. సింగరేణి సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన 1,200ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తూ 50 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. దీని వల్ల సంస్థకు ప్రతి ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తు న్నాయి. సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే సగం వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. డిపెండెంటు, ఇతర కేట గిరీల కింద మొత్తంగా 9 వేల వరకు ఉద్యోగాలను సింగరేణి గడిచిన 7 సంవత్సరాలలో యువతకు కల్పించడం జరిగింది. ఉద్యోగులకు సొంత గృహం నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఇంటింటికీ ఏసీలు పెట్టు కునే అవకాశం కల్పించింది సంస్థ. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి అమలు చేస్తున్న ‘ప్రైవేటీకరణ చట్టం’ వల్ల ప్రైవేట్ మల్టీ నేష నల్స్తో కలిసి ఫీజులు చెల్లించి వేలంలో పాల్గొంటే తప్ప కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించే పరిస్థితి లేదు. అటు కోల్ ఇండియా దుఃస్థితి కూడా ఇలాగే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నులు, రాయల్టీల పేరిట ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా సింగరేణికి వేలంలో పాల్గొంటే తప్ప ఇప్పుడు కొత్త బ్లాక్‌లు వచ్చే పరిస్థితి లేదు. బొగ్గు బ్లాక్‌ల కోసం గత ఏడాది 72గంటల సమ్మె కూడా చేశారు. ఈ పోరు ఇంకా కొనసాగు తూనే ఉంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంపికైన ఆ ప్రాంత ప్రజా ప్రతి నిధులూ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసు కోవాలి. లేకపోతే సంస్థ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుంది. సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లి లాంటిది. అలాంటి సంస్థను ప్రభుత్వరంగంలో కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాలకు కూడా దశబ్దాల పోరాట చరిత్ర ఉంది. హక్కుల కోసం 1936లో ‘ఉబాసి లాల్ ఫాసి’ అనే కార్మికుడి నేతృత్వంలో 13 రోజులు సమ్మె జరిగిన దాఖలాలున్నాయి. 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు, పోరాటాలు కొనసాగు తున్నాయి. 1998 నుంచి దేశంలోని ఎక్కడా కూడా బొగ్గు సంస్థలలో లేని విధంగా యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఉన్నాయి. 7వ సారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగ రేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. అయితే సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడంతో క్యాష్ రిచ్ కంపెనీ కాలేక పోతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. బొగ్గు విద్యుత్ సరఫరా చేసిన వేల కోట్ల బకాయీలనైనా అవి చెల్లించాలి. అందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి, నిజాయితీతో కృషి చేయాలి. - ఎం.డి. మునీర్ - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం -
TS: ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్‌తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుతోపాటు ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసతులతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు.. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
మానవతా దృక్పథంతో సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతిపాదించిన అనేక అంశాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లు పలు డిమాండ్లపై సమ్మెచేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం శుక్రవారం మరోదఫా సానుకూలంగా చర్చలు జరిపింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కె.వి.ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలతో చర్చలు జరిపారు. యూనియన్ నేతలు ప్రస్తావించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు వివరించారు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించిందన్నారు. కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్‌ను ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. హెల్పర్లకూ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయించిందన్నారు. సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ కోసం గరిష్ట వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించిందని తెలిపారు. కార్యకర్తలకు టీఏ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించిందని తెలిపారు. గ్రాట్యుటీ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో లేఖరాశామని, దానిపైన కూడా కేంద్రం ఆమోదంతో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు గతంతో పోల్చుకుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక వేతనాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500, సహాయకులకు రూ.7 వేలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి పనితీరు కనబర్చిన వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఇస్తున్నామని, ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదని, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసిందన్నారు. సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించిందని, నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వర్తింపజేసిందని వివరించారు. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు అందించిందని, డేటా చార్జీల కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు రూ.2 లక్షల జీవిత బీమాను వర్తింపజేస్తోందని, రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించిందని చెప్పారు. అంగన్వాడీల్లో కూడా మంచి వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నాడు–నేడు ద్వారా అనేక చర్యలు చేపట్టిందన్నారు. గతంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశతోపాటు వర్కర్లు, హెల్పర్లకు ఎంతో మేలు జరిగిందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. తాజాగా ప్రతిపాదించిన అనేక అంశాలపైనా సానుకూలంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అత్యంత అణగారిన వర్గాలకు చెందిన వారికి పౌష్టికాహార పంపిణీ సమ్మె కారణంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అన్నీ అంగీకరించినప్పటికీ ఒక్క వేతనం పెంపు విషయంలోనే అంగన్వాడీ యూనియన్ నేతలు పట్టువీడకపోవడం గమనార్హం. -
అంగన్వాడీలపై సానుకూలం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత శాఖ ద్వారా పరిశీలించి పలు అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది. సంబంధిత యూనియన్లతో విస్తృతంగా చర్చించిన అనంతరం మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల ద్వారా పలు అంశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అంగన్వాడీల సమ్మె కారణంగా అత్యంత అణగారిన వర్గాలకు చెందిన బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆందోళన విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో విధులకు గైర్హాజరైనట్లుగా భావించి సంబంధించిన జీవోల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ఆమోదం తెలిపిన అంశాలివీ.. ♦ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం. ♦ అంగన్వాడీ కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచేందుకు నిర్ణయం. ♦ హెల్పర్లకు సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం. ♦ సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా అవకాశం కల్పించేందుకు గరిష్ట వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకారం. ♦ టీఏ, డీఏలు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి విడుదల చేయడానికి ఆమోదం. ♦ రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం. మేలు చేసిన సీఎం జగన్ ♦ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు చేస్తూ పలు చర్యలు తీసుకుంది. అందులో కొన్ని ఇవీ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకూ టీడీపీ హయాంలో అంగన్వాడీల జీతం నెలకు రూ.7 వేలు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల జీతాలను పెంచుతూ జీఓ 18 జారీ చేసింది. అంగన్వాడీల జీతాలను రూ.11,500కి పెంచుతూ 2019 జూన్ 26న జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసింది. గత నాలుగేళ్లుగా పెంచిన వేతనం అమలవుతోంది. ♦ అంగన్వాడీ కార్యకర్తలతోపాటు మినీ అంగన్వాడీ వర్కర్లకు కూడా గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. ♦ సహాయకులకు గత ఎన్నికలకు ముందు వరకు రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. వీటిని జీవో 18 ద్వారా ప్రభుత్వం వెంటనే అమల్లోకి తెచ్చింది. ♦ టీడీపీ హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీతాలు పెంచి అందించింది. ♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ♦ 2013 నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు (ప్రమోషన్లు) ఇవ్వలేదు. గత సర్కారు దీన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది. ♦ సూపర్వైజర్ పోస్టుల పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వయో పరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది. ♦ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి రూ.1,313 కోట్లు అందించింది. జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికీ వర్తింపజేసింది. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి వారికి అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా డేటా కూడా ఇస్తోంది. 2023 జూలై 1 నుంచి ఇది అమలవుతోంది. డేటా కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది. ♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపచేస్తూ ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది. ♦ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించింది. నాడు–నేడు ద్వారా అంగన్వాడీల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ♦ గర్భిణులు, బాలింతలు, పిల్లలకు హోం రేషన్ పద్ధతిని అమలు చేస్తోంది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది. -
అలెర్ట్, దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె.. బ్యాంక్ సేవలపై ఎఫెక్ట్!
బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్. డిసెంబర్, జనవరిలో అత్యవసరమైన బ్యాంక్ పనులున్నాయా? ఉంటే ఇప్పుడే చూసుకోండి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్ 4 నుంచి జనవరి 20 వరకు దేశ వ్యాప్తంగా సమ్మె చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్‌కి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు డిసెంబర్ 4 నుంచి స్ట్రైక్ చేయనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి పలకాలన్న ప్రధాన డిమాండ్లతో బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘అన్ని బ్యాంకులలో తగినంత సిబ్బందిని నియమించాలి. బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాల ఔట్సోర్సింగ్ లేదా, అవుట్ సోర్సింగ్‌కు సంబంధించిన బీపీ సెటిల్మెంట్ నిబంధనల ఉల్లంఘనను ఆపాలి’ అని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మెలో ప్రైవేట్ బ్యాంకులు సైతం ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులు సైతం సమ్మెలో పాలు పంచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 11న సమ్మెకు దిగనుండగా.. జనవరి 19, 20 తేదీలలో స్ట్రైక్ చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడనుంది. డిసెంబర్ 4 నుంచి సమ్మె ప్రారంభం డిసెంబరు 4న ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ల సమ్మెలతో అఖిల భారత సమ్మె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5, 6, 7, 8, 11 తేదీల్లో వివిధ బ్యాంకులు మూసివేయబడతాయి. రాష్ట్రాల వారీగా బ్యాంకుల సమ్మె అయితే, జనవరి 2 నుండి సమ్మె ఆయా రాష్ట్రాల వారీగా కొనసాగుతుంది. జనవరి 2తో ప్రారంభమైన ఈ స్ట్రైక్‌లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్, లక్ష్వదీప్‌లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు. జనవరి 3, 4, 5, 6 తేదీల్లో రాష్ట్రాల వారీగా సమ్మె నిర్వహించనున్నారు. యూపీ, ఢిల్లీ బ్యాంకుల సమ్మె ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలోని బ్యాంకులు వరుసగా జనవరి 4, 5 తేదీలలో మూసివేయబడతాయి. రెండు రోజుల సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్‌పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
కస్టమర్లకు అలర్ట్: దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న ఉద్యోగులు
న్యూఢిల్లీ: డిసెంబరు నెలలో దేశవ్యాప్త సమ్మెకు దేశంలోని పలు బ్యాంకులు సిద్ద మవు తున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు లక్షల ఉద్యోగాలను భర్తి , బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్వస్తి అనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పలు బ్యాంకులు సమ్మెలో భాగం కానున్నాయి. డిసెంబర్ 4 -11 వరకు బ్యాంకుల వారీగా సమ్మె కొనసాగుతుంది. బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బందిఉండేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాల అవుట్సోర్సింగ్ వల్ల దిగువ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ను తగ్గించడమే కాకుండా కస్టమర్ల గోప్యత , వారి డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే బ్యాంకుల వివరాలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి. అలాగే డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెను పాటిస్తారు.అలాగే డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. #BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/YkbNeE87kK — CH VENKATACHALAM (@ChVenkatachalam) November 14, 2023 -
మొదటికొచ్చిన ఏఎన్ఎంల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: రెండో ఏఎన్ఎంల ఆందోళన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసి అధికారుల హామీతో విరమించిన ఏఎన్ఎంలు... హామీలు నెరవేరకపోవడంతో తిరిగి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గత కొన్నాళ్లుగా ఏఎన్ఎంలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 16 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవగా ప్రభుత్వం నాలుగుసార్లు వారితో చర్చలు జరిపింది. సెప్టెంబర్ ఒకటిన యూనియన్ నేతలతో జరిగిన చర్చల్లో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించింది. దీంతో ఒప్పందం ప్రకారం అదే నెల నాలుగో తేదీ నుంచి ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. ఒప్పందంలో భాగంగా సెపె్టంబర్ నెల 15గా పీఆర్సీ బకాయిలతోపాటు సమ్మె కాలపు వేతనాన్ని ఈ నెల జీతంతో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ సమ్మె విరమించి నెల రోజులైనా ఇప్పటివరకు తమ డిమాండ్లను పరిష్కరించలేదని ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆందోళనకు దిగారు. ఇవీ ప్రధాన డిమాండ్లు... ♦ నోటిఫికేషన్లో ఇచ్చిన బేసిక్ పేతో 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలి. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, ఏఎన్ఎంలు దురదృష్టవశా త్తూ మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేíÙయాను అందించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి 6 నెలల్లోగా కారుణ్య నియామకం కింద కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఇవ్వాలి. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పూర్తి కాలానికి గ్రాట్యుటీ చెల్లించాలి. ♦ సమ్మె కాలానికి సంబంధించిన జీతం విడుదల చేయాలి. ♦ కరోనాకాలంలో మరణించిన రెండో ఎఎస్‌ఎంలను గుర్తించి వారి కుటుంబాలకు రూ. 5 లక్ష ల ఎక్స్‌గ్రేíÙయా చెల్లించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి కాంట్రాక్ట్ బేసిక్ లోనైనా సరే కారుణ్య నియామకం చేపట్టాలి. ♦ యూపీహెచ్‌సీల్లో పనిచేసే వారికి కూడా íపీహెచ్సీ వాళ్లకు ఇచ్చినట్లే రెండు మార్కుల వెయిటేజీ ఇవ్వాలి. ♦ నవంబర్ 10న జరిగే పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు వేతనంతో కూడిన ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలి. ♦ పీహెచ్‌సీల్లో ఫస్ట్ ఏఎస్‌ఎంలు లేని సబ్ సెంటర్లలో పనిచేస్తున్న రెండో ఏఎస్‌ఎంకు రూ. 10 వేల అదనపు వేతనాన్ని అందించాలి. ♦ 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైనా రిపోర్టు పంపాలని ఒత్తిడి చేయకూడదు. ♦ యూనిఫాం అలవెన్స్ కింద రూ. 4,500 ఇవ్వాలి. ♦ లక్ష్యాలను నిర్దేశిస్తూ జీతాలను నిలిపే ప్రక్రియను ఆపాలి. ♦ సమ్మె సందర్భంగా ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలి. ♦ వివాహం కాకముందు ఉద్యోగంలో నియమితులైన ఏఎస్‌ఎంలను వారి భర్తల సొంత మండలాలకు బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలి. ∙పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే ఓఎంఆర్ షీట్‌తో నిర్వహించాలి. -
24 గంటలు కరెంటు ఇవ్వాలి
గరిడేపల్లి: 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొట్టదశలో ఉందని విద్యుత్ కోతలు విధించడంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతోందని, సబ్ స్టేషన్ నుంచి మాత్రం విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. కనీసం 12 గంటలు అయినా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా చేయకపోయినా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగితే 80 శాతం పంట రైతులకు దక్కుతుందన్నారు. ధర్నాలో రైతులు సప్పిడి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె విరమించండి.. సమస్యలుంటే పరిష్కరిస్తాం
సాక్షి,హైదరాబాద్/ వెంగళరావునగర్: అంగన్వాడీటీచర్లు, హెల్పర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించి చర్చలతో వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించిన పలు అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, జీఓలు జారీ అయ్యాక సమ్మెకు దిగడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం అమీర్‌పేటలోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్‌లో మంత్రి సత్యవతిరాథోడ్ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల్లో నమోదయ్యే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎక్కువమంది బలహీనవర్గాలకు చెందినవారే ఉన్నారని, విధులు బహిష్కరించి సమ్మె చేయడంతో వారంతా ఇబ్బంది పడే అవకాశం ఉందని, వారి సేవలను తక్షణమే కొనసాగించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయలబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీల క్రమబద్ధీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రాష్ట్రప్రభుత్వం నెరవేర్చడం సాధ్యం కాదని చెప్పారు. అంగన్వాడీల తరపున డిమాండ్లు కేంద్రానికి నివేదిస్తామని, అవసరమైతే స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోలికేరి, జేడీ లక్ష్మీదేవీ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్/ కైలాస్‌నగర్ (ఆదిలాబాద్)/జగిత్యాల క్రైం/సుభాష్ నగర్ (నిజామాబాద్): అంగన్వాడీల్లోని టీచర్లు, హెల్పర్లు తలపెట్టిన సమ్మె పదోరోజూ ఉధృతంగా కొనసాగింది. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించారు. టీచర్లు, హెల్పర్లు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీ టీచర్ల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసు పెన్షన్, ఆరోగ్య పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఉద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఆదిలాబాద్‌లో జుట్లు పట్టుకుని.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో పలువురు అంగన్వాడీలు, పోలీసులకు గాయాలయ్యాయి. అంగన్వాడీలను నిలువరించే క్రమంలో తలమడుగు ఎస్సై ధనశ్రీ ఓ అంగన్వాడీ జుట్టు పట్టుకుని నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు అంగన్వాడీలు ఎస్సై ధనశ్రీని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు పలువురిని పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొంతమంది అంగన్వాడీలు స్టేషన్‌కు చేరుకుని బైఠాయించడంతో కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు. వారంతా తిరిగి కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన కొనసాగించడంతో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా సమ్మె శిబిరానికి చేరుకున్న తర్వాత బేల మండలం సదల్పూర్ అంగన్వాడీ టీచర్ ప్రగతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాలలో పోలీసులపై దాడి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ముట్టడి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు పలువురు అంగన్ వాడీలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఈశ్వర్రావు తదితరులు అంగన్వాడీల ఆందో ళనకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు కూడా అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారితో పాటు సీఐటీయూ నాయకులు గేట్లు ఎక్కి లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్‌బామ్‌ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌ను సీనియర్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
104 కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
సుల్తాన్‌బజార్: తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని కోరుతూ 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో ధర్నా చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది 104 సిబ్బంది పాల్గొన్నారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాఖలో పనిచేస్తున్న 104 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా 104 కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో 104 ఉద్యోగ నాయకులు సుభాష్‌చందర్, గాదె శ్రీనివాస్, వెంకన్న, నవీన్, రచ్చ రవీందర్, విద్యాసాగర్, సతీష్ కృష్ణప్రసాద్, ఎండీ మాజిద్ పాల్గొన్నారు. -
తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆ దేశంలో పెట్రోల్ బంకులు బంద్
ఇస్లామాబాద్: పెట్రోల్ అమ్మకాలపై పాకిస్తాన్ ప్రభుత్వం మార్జిన్ పెంచని కారణంగా జులై 22 నుండి జులై 24 వరకు రెండు రోజులు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం. పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్లో లీటరు పెట్రోల్ రూ.253 కాగా డీజిల్ ధర రూ. 253.50 గా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్. గత కొంతకాలంగా పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ వారు పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5%(రూ.12) మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం కేవలం 2.4%(రూ.6) మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా జులై 22, శనివారం నుండి జులై 24,సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం. ఈ మేరకు శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసు నిలిపివేస్తున్నట్లు తెలిపారు సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్. ఇది కూడా చదవండి: తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే.. -
సినీ కార్మికుల సమ్మె.. రిలీజ్‌కు సిద్ధమైన భారీ బడ్జెట్ మూవీ!
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ . యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్‌లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది. ఈ మూవీ 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. (ఇది చదవండి: అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!) మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్‌హైమర్ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్‌గా నటించగా.. ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్‌నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. హాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె.. ప్రభావం ఉండదన్న మేకర్స్ ఇప్పటికే ఏఐ వల్ల వచ్చే ముప్పుపై సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. ఇప్పటికే హాలీవుడ్లో అన్ని రకాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. అయినప్పటికీ సినిమా విడుదలకు ఎటువంటి ప్రభావం ఉండదని యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. ఆందోళనల నడుమ ఓపెన్ హైమర్ రిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు! ) -
ఎంత పని చేశావ్ ఏఐ.. నీ దెబ్బకు అన్నీ మూసేయాల్సి వచ్చింది!
ఇప్పుడు ఎవరి నోటా విన్న ఒకటే మాట ఏఐ. అదేనండీ ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్. ఇటీవలే యాంకరమ్మను కూడా పరిచయం చేశారు కదా. తాజాగా ఈ సెగ హాలీవుడ్‌కు తాకింది. ఏఐ వచ్చి హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ భవిష్యత్తు భరోసా ఇవ్వాలంటూ హాలీవుడ్‌కు చెందిన ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఏఐ నుంచి తమను కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెతో హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరింత ఆలస్యంగా విడుదల కానున్నాయి. (ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్ ) నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాదాపు 1,60,000 మంది నటీనటులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇవే డిమాండ్లతో గత 11 వారాలుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా కూడా సమ్మెకు దిగింది. తాజాగా నటీనటులు ధర్నాకు దిగడంతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మూతపడింది. చివరిసారిగా 1980లో నటీనటుల సంఘం చేపట్టిన సమ్మె మూడు నెలలకు పైగా కొనసాగింది. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే భారీ సినిమాలు సైతం రిలీజ్ వాయిదా పడనున్నాయి. (ఇది చదవండి: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!) -
జేపీఎస్‌ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్/తొర్రూరు: జూనియర్/ ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్/ఓపీఎస్) నిరవధిక సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు 16 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆ ధీమాతోనే సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె శ్రీకాంత్‌గౌడ్, ఇతర జిల్లాల నాయకులతో కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వెల్లడించారు. అంతకుముందు వరంగల్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్ తదితరులు కలిశారు. ఈ క్రమంలో తొలుత సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని వారికి మంత్రి సూచించినట్టు సమాచారం. ఆది లేదా సోమవారాల్లో టీపీఎస్ఎఫ్ ప్రతినిధులతో ఆయా అంశాలపై చర్చిస్తామని మంత్రి హామీనిచ్చిన మీదట సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు సంఘం ప్రకటించింది. – జేపీఎస్‌ల వ్యవస్థ సృష్టికర్త కేసీఆరే కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక, శాంతియుత సమ్మె నిర్వహించామని, జేపీఎస్‌ల వ్యవస్థను సృష్టించిందే సీఎం కేసీఆర్ అని సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ అన్నారు. జేపీఎస్‌ల వల్లే తెలంగాణకు కేంద్రం నుంచి 73 అవార్డులు వచ్చాయని, మున్ముందు సైతం అదే రీతిన పనిచేసి మంచి ఫలితాలు రాబడుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా విధుల్లో కొనసాగుతామని స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ కఠిన వైఖరి ప్రభావంతోనే విరమణ? ప్రభుత్వం కఠినచర్యలకు దిగనున్నట్టు చేసిన ప్రకటన సమ్మె విరమణను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. శనివారంలోగా విధుల్లో చేరకుండా గైర్హాజరైన జేపీఎస్, ఓపీఎస్‌ల తొలగింపుతో పాటు వారి స్థానాల్లో తాత్కాలిక పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి దాకా సమ్మె కొనసాగించాలా వద్దా, విరమిస్తే పరిస్థితి ఏమిటి, కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే దానిపై టీపీఎస్ఎఫ్ రాష్ట్ర,జిల్లా కమిటీల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. సమ్మెలో ఉన్న జేపీఎస్లలోనూ పునరాలోచన మొదలైంది. దీనికి తగ్గట్టే శనివారం సాయంత్రానికి పలుజిల్లాల్లో పెద్దసంఖ్యలోనే జేపీఎస్‌లు విధుల్లో చేరినట్టు పీఆర్ కమిషనరేట్‌కు నివేదికలు అందాయి. ఇది సమ్మె విరమణ దిశగా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం కూడా సమ్మె చేసిన జేపీఎస్‌ల పట్ల కొంత చూసీచూడనట్టు వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. జేపీఎస్‌ల సమ్మె విరమణ నేపథ్యంలో.. వారి స్థానంలో గతంలో జేపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నియామకం, గ్రామాల్లో స్థానికంగా డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానమున్న వారిని నియమించే ప్రక్రియను కూడా నిలిపేసినట్టు తెలుస్తోంది. -
సమ్మెలో జీపీఎస్‌లు.. ప్రభుత్వం ఆఫర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలంటూ జేపీఎస్‌లు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జీపీఎస్‌లు ఇప్పటికైనా విధుల్లో చేరాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మరోసారి ఆఫర్ ఇచ్చింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపింది. ఈ క్రమంలో వారిని వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. జీపీఎస్‌ల పట్ల ప్రభుత్వం సానుకూలతతో ఉన్నట్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలకు అవార్డులు రావటంలో కార్యదర్శుల కృషి ఉంది. కొంత మంది తమ స్వలాభం కోసం వారిని రెచ్చగొట్టడం వల్ల జీపీఎస్‌లు సమ్మె చేస్తున్నారు. సమ్మె అనేది చివరి అస్త్రం. కానీ.. ముందు దశలోనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు వెళ్ళారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులైనప్పటికీ రాష్ట్రపతి దగ్గర అవార్డులు తీసుకునే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన పోస్టు.. పంచాయతీ కార్యదర్శులు. అలాంటిది ప్రభుత్వం పై ఉద్యోగులు నమ్మకంతో ఉండాలి అని సూచించింది. ఇక, అంతకుముందు కూడా జీపీఎస్‌లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్‌షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు -
తగ్గేదేలే.. డెడ్‌లైన్ దాటినా సమ్మెలోనే జీపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మె కొనసాగుతోంది. కాగా, సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా జీపీఎస్‌లు విధుల్లో చేరలేదు. ప్రభుత్వం హెచ్చరించినా తగ్గేదేలే అన్నట్టుగా జీపీఎస్‌లు సమ్మెలో ఉన్నారు. అయితే, కేవలం 800 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. కాగా, ఉద్యోగులు సమ్మె విరమించకపోవడంతో ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేపీఎస్‌లు తక్షణమే విధుల్లో చేరాలని ఆయన కోరారు. గతంలో సమర్పించిన ఒప్పందాన్ని ఉల్లఘించవద్దని ఉద్యోగులకు చెప్పారు. ఇదిలా ఉండగా.. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. తమను రెగ్యులర్ చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. ఇక, రేపటి నుంచి కుటుంబ సభ్యులతో సమ్మెలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు. -
TS: ‘జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైంది’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తప్పిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో, వారికి మంగళవారం సాయంత్రం 5గంటలలోపు విధుల్లోకి చేరాలని గడువు ఇచ్చింది. ఈ క్రమంలో జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. తాజాగా జేపీఎస్‌ల సమ్మెకు కరీంనగర్లో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దుర్మార్గం. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ వేతనాలు ఎందుకు పెంచడం లేదు. వెంటనే జేపీఎస్‌ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి’ అని సీరియస్ అయ్యారు. మరోవైపు, జేపీఎస్‌ల సమ్మెపై టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్‌ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. జేపీఎస్‌లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి! -
జేపీఎస్‌లను రెగ్యులర్ చేయండి.. కేసీఆర్‌కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ..
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీర్‌కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు దిగారని జీవర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు వాళ్లను రెగ్యులర్ చేయాలని కోరారు. కాగా.. తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్ 29 నుంచి నిరవదిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహ్యం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు కూడా పంపింది. మంగళవారం సాయంత్రం 5:00 గంటల్లోగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. విధుల్లో చేరిన తర్వాత రెగ్యులర్ చేసే విషయంపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
TS: జేపీఎస్‌లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్ నుంచి తొలగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం 5గంటలలోపు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ విధుల్లో చేరకుంటే శాశ్వతంగా తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగారు. ఈ క్రమంలో రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు.. జూనియర్ సెక్రటరీలకు రాజకీయ పార్టీలు, నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతు ప్రకటించారు. జేపీఎస్‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావటంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఇది కూడా చదవండి: TSRTC: చరిత్రలో తొలిసారి.. లాభాల్లోకి 45 డిపోలు.. గట్టెక్కించిన శుభ ముహూర్తాలు -
ఆర్టిజన్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల సమ్మె ముగిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాల మధ్యవర్తిత్వం వహించడంతో సమ్మెను బేషరతుగా విరమించుకున్నట్టు .. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్ 82), ఎంఐఎం అనుబంధ ఇతెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనకు ఈ రెండు యూనియన్లు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు పిలుపునివ్వగా, విద్యుత్ సంస్థలపై పాక్షిక ప్రభావం కనబడింది. సమ్మెలో పాల్గొన్న యూనియన్ల ముఖ్య నేతలతో సహా 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనియన్ల నాయకుల విజ్ఞప్తితో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బుధవారం సీఎండీతో ఫోన్లో మాట్లాడారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి చేర్చుకుంటాం.. తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని ఒవైసీ కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ ..బేషరతుగా సమ్మె విరమిస్తే 10 రోజుల్లోగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇతేహాద్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అహమద్ బలాల రెండు యూనియన్ల నేతలతో కలిసి విద్యుత్ సౌధలో ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డిని కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్టు హెచ్–82 యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, ఇతెహాద్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుసేన్‌లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా ఆర్టిజన్లకు రూ.16లక్షల గ్రాట్యుటీతో పాటు మెడికల్ అన్‌ఫిట్ పథకం కింద కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ప్రభాకర్‌రావు సానుకూలంగా స్పందించారని సాయిలు వెల్లడించారు. సమ్మె తొలిరోజే 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బుధవారం రెండోరోజు సమ్మెకు ఆర్టిజన్లు సుముఖత వ్యక్తం చేయలేదని, ఈ కారణంగానే విరమణ ప్రకటన చేయాల్సి వచ్చిందని యూనియన్ల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. -
నేటి నుంచి ఆర్టి‘జనుల’ సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని ‘ఆర్టిజన్లు’ మంగళవారం ఉదయం 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. 23 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గతంలో విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ల పేరుతో విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టిజన్ల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో ఈనెల 25 నుంచి సమ్మెబాటపట్టాలని.. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్82), ఇత్తెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు పిలుపునిచ్చాయి. కాగా, విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, ఎవరైనా సమ్మెకు దిగినా, విధులకు గైర్హాజరైనా అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగించి ఉద్యోగం నుంచి తొలగించాలని అధికారులకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీచేశాయి. దీంతో సమ్మెపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలి.. రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులకు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్‌ను, ఆర్టిజన్ల కోసం ‘స్టాండింగ్ ఆర్డర్స్’ పేరుతో ప్రత్యేక సర్వీస్ రూల్స్‌ను అమలుచేస్తున్నారు. అయితే, తమకూ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్‌ను వర్తింపజేయాలని ఆర్టిజన్లు డిమా ండ్ చేస్తున్నారు. అలాగే, 7% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ నెల 15న విద్యుత్ ఉద్యోగ సంఘాల ఉభయ జేఏసీలతో సంస్థల యాజమాన్యాలు వేతన సవరణ ఒ ప్పందం కుదుర్చుకోగా, దీన్ని ‘ఆర్టిజన్ల’ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా ఆర్టిజన్లను రెగ్యులర్ పోస్టులకు తీసు కుని పదోన్నతి కల్పించాలని, 50% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని, కనీసం రూ.25 వేలకు తగ్గకుండా మాస్టర్ స్కేల్‌ను ఖరారు చేయాలని ఈ సంఘాలు సమ్మె నోటీసుల్లో కోరాయి. నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రభావం ! నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగింపులో ఆర్టిజన్ల సేవలు కీలకం. ఎక్కడ చిన్న అంతరాయం కలిగినా రంగంలో దిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తా రు. మరమ్మతులు, నిర్వహణ విభాగాల్లో వీరి సంఖ్యే అధికం. దీంతో ఆర్టిజన్లు పాక్షికంగా సమ్మెకి దిగి నా నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మెలో పాల్గొంటే కఠిన చర్యలు విద్యుత్ సంస్థల్లో ఎస్మా కింద సమ్మెలపై నిషేధం అమల్లో ఉన్నందున ఆర్టిజన్లు పిలుపునిచ్చిన సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 15న అన్ని ఉద్యోగ సంఘాలతో పాటే ఆర్టిజన్లకు కూడా సహేతుకమైన వేతన సవరణ చేశామన్నారు. కాగా, ఆర్టిజన్ల సమ్మెతో తమకు సంబంధం లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, టీఈఈ 1104 యూనియన్, టీఎస్‌పీఈయూ–1535, బీఆర్వీకేఎస్, టీఎస్‌ఈఈయూ–327 యూనియన్లు ప్రకటించాయి. (చదవండి: నేటి నుంచి బడులకు వేసవి సెలవులు) -
జొమాటోకు మరో ఎదురు దెబ్బ!
ట్రాఫిక్ కష్టాల్ని దాటుకుని వన్.. టూ.. త్రీ.. రన్ అంటూ పది నిమిషాల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని డెలివరీ చేసే ఉద్యోగులు బ్లింకిట్‌కు భారీ షాకిచ్చారు. వారం రోజుల పాటు డెలివరీ ఉద్యోగులు చేసిన స్ట్రైక్ దెబ్బకు సంస్థ స్పందించకపోవడంతో ఇతర సంస్థల్లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని గంటల్లో డెలివరీ చేస్తాం’ అంటూ సంస్థలు ప్రచారం చేసేవి. కానీ ఇప్పుడు అలాంటి మాటలు వినిపించడం లేదు. ఆర్డర్ పెట్టడం ఆలస్యం పదే పదినిమిషాల్లో మీ కాలింగ్ బెల్ కొట్టేస్తాం.. అంటున్నాయి క్విక్ కామర్స్ సంస్థలు. ఆ కోవకే చెందుతుంది జొమాటోకి చెందిన బ్లింకిట్ అనే గ్రోసరీ యాప్. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌కు పోటీగా బ్లింకిట్ క్విక్ కామర్స్ సేవల్ని అందిస్తుంది. పది నిమిషాల్లో ఆర్డర్స్‌ను డెలివరీ చేయడంలో మంచి పేరు సంపాదించింది. కానీ ఆర్డర్ తీసుకొని బయలుదేరిన మరుక్షణం నుంచి సరుకును చేరవేసే వరకూ.. ప్రతిక్షణం ఒత్తిడికి గురయ్యే డెలివరీ ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదనే కారణంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఇదివరకు డెలివరీపై రూ.50 ఉండే చార్జీని రూ.25కు తగ్గించిందని, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.15 చేయడం వల్ల తమ ఆదాయం చాలా తగ్గిపోతోందని, న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో కార్యకలాపాల్ని నిలిపి వేశారు. దీంతో బ్లింకిట్ ఆయా స్టోర్ల కార్యకలాపాల్ని నిలిపి వేసింది. ఈ తరుణంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ గురుగావ్, గజియాబాద్, ఫరీదాబాద్‌లలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో చేరారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బ్లింకిట్‌కు చెందిన ఢిల్లీ -ఎన్సీఆర్లలో దాదాపు వందల స్టోర్లు మూత పడ్డాయి. సమ్మెకు ముందు బ్లింకిట్ తన ప్లాట్‌ఫారమ్‌లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దాదాపు 3,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా.. వారిలో మూడింట ఒక వంతు మంది ఇతర ఫ్లాట్ఫారమ్లలో కార్యకలాపాలకు ఉపక్రమించారు. బ్లింకిట్‌లో పని చేసే ఉద్యోగులు తక్కువ వేతనం కారణంగా ఇతర సంస్థల్లో చేరాల్సి వచ్చింది. వేతనం విషయంలో బ్లింకిట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఉద్యోగులకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు స్ట్రైక్‌తో బ్లింకిట్ భారీగా నష్టపోవడంతో కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్! -
సమ్మెకు దిగితే బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: సమ్మెకు దిగిన ఆర్టీ జన్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇతర ఆర్టీ జన్లను సమ్మెకు పురిగొల్పినా లేక సమ్మెకు ఆర్థిక సాయం అందించినా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి. రఘుమారెడ్డి శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్, ఇతెహద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సమ్మెకు సమయం దగ్గర పడడంతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తీవ్ర చర్యలకు ఉపక్రమించాయి. విద్యుత్ ఉద్యోగుల తో పాటు ఆర్టీ జన్లకు7 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు తోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల తో కార్మిక శాఖ సమక్షంలో పారిశ్రామిక వివాద పరిష్కార చట్టం లోని సెక్షన్ 12(3) కింద ఒప్పందం చేసుకున్నామని, దీనికి విరుద్ధంగా పైన పేర్కొన్న రెండు సంఘాలు సమ్మెకు వెళ్తుండడం చట్ట విరుద్ధమని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశాయి. -
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
-
కరెంట్ ఉద్యోగులకు 7% ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగుల జేఏసీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యాలు ప్రతిపాదించిన 7 శాతం ఫిట్మెంట్తోపాటు ఇంక్రిమెంట్ల మంజూరు, పలు ఇతర ప్రతిపాదనలకు జేఏసీల ప్రతినిధులు అంగీకారం తెలిపారు. దీనితో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్టు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించగా, అన్నిరకాల ఆందోళనలను విరమించుకుంటున్నట్టు ఎలక్ర్టీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. పలు విడతల్లో జరిగిన చర్చలతో.. విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై వేసిన పీఆర్సీ కమిటీ తొలుత 5శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీనితో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు.. తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ర్టీసిటీ ఎంప్లాయిస్ జేఏసీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. తొలుత 6 శాతం, తర్వాత 7 శాతానికి ఫిట్‌మెంట్‌ను పెంచుతామని యాజమాన్యాలు ప్రతిపాదించగా జేఏసీలు తిరస్కరించాయి. అయితే శనివారం మరోసారి జరిగిన చర్చల్లో అనూహ్యంగా 7శాతం ఫిట్మెంటే ఫైనల్ కావడం గమనార్హం. చర్చల్లో అంగీకారం కుదిరిన అంశాలపై యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగింది. చర్చల్లో ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ జేఏసీ నేతలు జి.సాయిబాబు, రత్నాకర్‌రావు, ఎలక్ట్రిసిటీ జేఏసీ నేత ఎన్.శివాజీ పాల్గొన్నారు. ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవీ.. ♦ 7 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న 24.992 శాతం డీఏ (కరువు భత్యం) వేతనంలో విలీనం. ♦ 2022 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ వర్తింపు. బకాయిలను జీతం/పెన్షన్‌తో పాటు 12 నెలల సమ వాయిదాల్లో చెల్లిస్తారు. ♦ ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ సదుపాయం కల్పనపై విద్యుత్ సంస్థల బోర్డుల్లో సానుకూల నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ♦ వర్క్‌మెన్, ఇతరులకు సింగిల్ మాస్టర్ స్కేలువర్తింపు. ♦ ఆర్టిజన్ల పర్సనల్ పేను బేసిక్ పేలో విలీనం చేస్తారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏ, సీసీఏ సదుపాయం. ఈ విషయంలో పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ జీవోల అమలు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.16 లక్షల గ్రాట్యూటీ, అదనపు పెన్షన్ సదుపాయం. ♦ జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.10లక్షలు, ఆర్టీజన్లకు రూ.2లక్షల పరిమితితో వైద్య సదుపాయం. ♦ పెద్ద జబ్బులకు జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.15లక్షల వరకు వైద్య సదుపాయం (ఒక విడతలో రూ.5లక్షల గరిష్ట పరిమితి). ♦ సెల్ఫ్ ఫండింగ్ వైద్య పథకం కింద నెలకు రూ.1,000 చెల్లిస్తే.. ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు రూ.12లక్షల వరకు వైద్య సదుపాయం. ♦ ఈఎన్టీ/డెంటల్/కంటి వైద్యానికి పరిమితి రూ.15వేల నుంచి రూ.50వేలకు పెంపు. ఆపై ఖర్చులను సెల్ఫ్ ఫండింగ్ పథకం నుంచి చెల్లిస్తారు. ♦ 5 ఏళ్లలోపు సర్విసు ఉంటే ఒక ఇంక్రిమెంట్, ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య సర్విసుంటే రెండు ఇంక్రిమెంట్లు, 15ఏళ్లకుపైగా సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ఆర్టిజన్లకు రెండు ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ప్రస్తుత అలవెన్సులను ప్రస్తుత రేట్లతో యథాతథంగా కొనసాగిస్తారు. ♦ జెన్కో ఉద్యోగుల ప్రత్యేక అలవెన్సు కొనసాగింపు 25 నుంచి ఆర్టీజన్ల సమ్మె యథాతథం ఆర్టిజన్లకు 7శాతం ఫిట్‌మెంట్‌ను తిరస్కరిస్తున్నామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. విద్యుత్ సంస్థల్లో ఆర్టీజన్లుగా విలీనమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు. తమను చర్చలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఆర్టిజన్లకు ఇప్పటికే హెచ్ఆర్ఏ తగ్గించారన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో ఆర్టిజన్లు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగినట్టుగా పీఆర్సీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. -
జూడాల సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కౌషిక్ కుమార్ పింజర్ల, డాక్టర్ ఆర్.కె.అనిల్ కుమార్ నోటీసులు అందించారు. ♦ జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్ అధికారులు జూనియర్ డాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ♦ ఇక జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ♦ స్టైఫండ్ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి. ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!
డ్రైవర్ల సమ్మె కారణంగా వరడు నానాపాట్లు పడ్డాడు. పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడ్డాడు. చివరికి వరుడు కుటుంబం కాలినిడకన వధువు ఇంటికి చేరుకుని మరీ ఆ వధవరులకు వివాహం జరిపించారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కల్యాణ్ సింగ్‌పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే శుక్రవారం ఆ జంటకి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ ఏక్తా మహాసంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి కె జెనా, డీజేపీ ఎస్ కే బన్సక్ సమ్మెను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలే డ్రైవర్ల ఏక్తా మహాసంఘ్ సమ్మెను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్ల సమ్మె కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు, పర్యాటకులు, సామాన్యులు ఎంతగానే ఇబ్బందిపడ్డారు. ఈ సమ్మె కారణంగా ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి కూడా. (చదవండి: మద్యం మత్తులో కళ్యాణ మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు) -
మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా.. వారంలో నాలుగోది!
వాషింగ్టన్: గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువులు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. గత వారం రోజులుగా అగ్రరాజ్యంలో వరుస గగనతల ఉల్లంఘన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆకాశంలో 20 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఓ వస్తువును అమెరికా కూల్చేసింది. మిచిగాన్ రాష్ట్రంలోని హురాన్ సరస్సుపై ఎగురుతున్న అనుమానస్పద వస్తువును యూఎస్ యుద్ద విమానం పేల్చేసింది. గతం వారం రోజుల్లో వింత వస్తువులను కూల్చేయడం ఇదే నాలుగోసారి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వస్తువును పేల్చేశారు. ఎఫ్-16 యుద్ద విమానంతో కూల్చివేయాలని బైడెన్ ఆదేశించినట్లు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా గుర్తించిన వస్తువు అష్టభుజి ఆకారంలో తీగలు వేలాడుతూ కనిపించిందని అమెరికా తెలిపింది. ఇది ప్రమాదకరం కాదని, దాని వల్ల ఎలాంటి నష్టంలేదని అమెరికా తెలిపింది. నిఘా సామర్థ్యం, సైనిక ముప్పు కలిగించే శక్తి లేదని నిర్ధారించింది. అయితే ఇది సుమారు 20 వేల అడుగుల ఎత్తులో మిచిగాన్ మీదుగా ఎగురుతుండటం వల్ల పౌర విమానాల రాకపోకలకు విఘాతం కలుగుతుందన్న అనుమానంతో ఈ వస్తువును కూల్చేసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 4న చైనాకు భారీ బెలూన్ను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. దీని వెనక చైనా గూఢచర్యం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణను డ్రాగన్ దేశం కొట్టివేసింది. This footage was uploaded on Reddit by the user u/Grizz_fan12. The Video shows the Grant Park and the Lake Michigan at 12:10pm with a flying object which is the alleged #UFO that has been shot down a few moments ago. No confirmation yet but it‘s all we got. #ufo #usa #Michigan pic.twitter.com/HR9YpKTr2E — DustinsHotSauce (@HotSauceDustin) February 12, 2023 అది వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ మాత్రమేననీ.. దారి తప్పి అమెరికా ఆకాశంలోకి వచ్చిందని చెప్పింది. ఈ వాదనను అమెరికా ఖండించింది. అనంతరం అలాస్కా తీరంలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని శుక్రవారం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. తరువాత శనివారం కెనడాలోని యూకాన్ ప్రాంతంలో.. ఇప్పుడు మిచిగాన్‌లో మరో వస్తువును పేల్చేశారు. అయితే, ఈ మూడు వస్తువులు ఏంటీ? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నదానిపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అమెరికా మిలిటరీ ఆ వస్తువుల శకలాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉంది. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన అమెరికన్లు.. ఇంకా ఎన్ని ఎగురుతాయోనని నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. 🇺🇲 #Unknown #flyingobject in the #sky again #USA #spyballoon #MYSTERY #unexplained #video Connecting with the skies again 😊 pic.twitter.com/CHh6x0zO1S — Tasos Perte Tzortzis (@TasosPerte) February 12, 2023 -
హైదరాబాద్‌లో మెట్రో రైలుకు సమ్మెసెగ
-
హైదరాబాద్: సమ్మె బాటలో మెట్రో రైల్వే ఉద్యోగులు?!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్ టికెటింగ్ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. అమీర్‌పేట వద్ద సిబ్బంధి ధర్నాకు దిగారు. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ రూట్లో గందరగోళం నెలకొంది. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు వాళ్లు. కరోనా టైం తప్పిస్తే.. మిగతా రోజుల్లో విరామం లేకుండా పని చేస్తున్నప్పటికీ తమకు సరైన న్యాయం జరగట్లేదని అంటున్నారు వాళ్లు. కేవలం పదకొండు వేల జీతంతో నెట్టుకొస్తున్నామని చెబుతున్నారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళ వ్యక్తం చేశారు. ఇక ఈ పరిణామంపై హైదరాబాద్ మెట్రో స్పందించాల్సి ఉంది. ఆ స్పందన తర్వాత సమ్మె గురించి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొత్త ఏడాదిలో అలర్ట్ : దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆయా కంపెనీల ఉద్యోగుల్లో కొన్ని వర్గాలు జనవరి 4న సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనం అవుతాయని జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (జేఎఫ్‌టీయూ) ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల లాభాల్లో ఉన్న ఆఫీసులతో పాటు పలు కార్యాలయాలను విలీనం చేయడమో లేదా మూసివేయడమో జరుగుతుందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా దాదాపు 1,000 కార్యాలయాలు మూతబడ్డాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. ఇవన్నీ ఎక్కువగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఉండేవని వివరించింది. ఫలితంగా పాలసీదారులపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ సౌరభ్ మిశ్రా ఇష్టా రీతిగా వ్యవహరిస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లోని 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు, అధికారులు జనవరి 4న ఒక రోజు సమ్మెకు దిగనున్నట్లు జేఎఫ్‌టీయూ తెలిపింది. -
'వారీసు' వివాదం.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యాఖ్యలు సరికాదు : నిర్మాత
‘‘ఈ మధ్య 30రోజులు షూటింగ్ ఆపడమనేది అట్టర్ ఫ్లాప్ షో. చిన్న చిత్రాల నిర్మాతలు రిలీజ్ రోజున సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారం దొరుకుతుందని సమ్మెకి సమ్మతించా. అయితే సమ్మె వల్ల ఏం జరగదని నాలుగు మీటింగ్స్‌లోనే అర్థమైంది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించినా వాటి పరిష్కారం జరగలేదు. సినిమా పరిశ్రమ బతికుందంటే కొత్తగా వచ్చే నిర్మాతల వల్లే’’ అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. నేడు (శుక్రవారం) తన పుట్టినరోజుని పురస్కరించుకుని సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘చెన్నైలో సహాయ దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 200 కోట్లతో ‘కల్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్’ ప్రాజెక్ట్ చేయడం తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. సదరన్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు మించి అవార్డ్స్‌ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యాఖ్యలు సరికాదు. చిరంజీవిగారి సినిమా నిర్మాతలుగానీ, బాలకృష్ణగారి మూవీ నిర్మాతలుగానీ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయలేదు.. అలాంటప్పుడు రిలీజ్ విషయంలో కౌన్సిల్ మాట్లాడటం వంద శాతం తప్పు. థియేటర్లు రెంటల్ వ్యవస్థ నుండి పర్సంటేజ్లోకి మారిస్తే బాగుంటుంది. కానీ, కొందరు పెద్దవాళ్లు మారనివ్వరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లాబ్ సిస్టం తెస్తే కానీ ఇది మారదు. సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ రెండో ఊరు అయిపోయింది. ఏదైనా సమస్య వస్తే అక్కడికి నలుగురు మాత్రమే వెళుతున్నారు.. ఆ రకంగా ఒక దూరం వచ్చేసింది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఇక్కడి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండరని భావిస్తాను. గతంలో కృష్ణా నుండే పది మంది పరిశ్రమలోకి వచ్చి అందులో ఎవరో ఒకరు సక్సెస్ అయ్యేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి మాత్రం ఏపీలో చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలని ఉంది. ప్రస్తుతం ఎస్వీ కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో నేను నిర్మించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ సినిమా పూర్తయింది. అలాగే బాలకృష్ణగారితో ‘రామానుజాచార్య’ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
జీతం సరిపోట్లేదు... సమ్మె బాటపట్టిన టీచర్లు, లెక్చరర్లు తపాలా సిబ్బంది..
లండన్: పెరుగుతున్న జీవన వ్యయానికి తగ్గట్లుగా వేతనాలను పెంచాలని కోరుతూ యూకేలో వేల సంఖ్యలో పోస్టల్ సిబ్బంది, యూనివర్సిటీ లెక్చరర్లు, స్కూల్ టీచర్లు గురువారం సమ్మెకు దిగారు. ఇప్పటికే వివిధ రంగాల సిబ్బంది సమ్మెల్లో పాల్గొనడంతో దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వీధుల్లో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోయింది. ఇటీవల లాయర్లు, నర్సులు కూడా పలుమార్లు విధులను బహిష్కరించారు. గురువారం యూనివర్సిటీల్లో 70 వేల మంది లెక్చరర్లు బోధన విధులను బహిష్కరించారు. ఈ నెల 30వ తేదీన మరోసారి స్ట్రైక్ చేస్తామని తెలిపారు. సమ్మె ప్రభావం సుమారు 25 లక్షల మంది విద్యార్థులపై పడింది. స్కాట్లాండ్లో టీచర్ల సమ్మెతో దాదాపు సూళ్లన్నీ మూతబడ్డాయి. రాయల్ మెయిల్ ఉద్యోగులు గురు, శుక్రవారాలతోపాటు క్రిస్టమస్ రోజున కూడా సమ్మెకు దిగుతామన్నారు. చదవండి: మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతు ఇచ్చిన బద్ధ శత్రువు -
All India bank strike: 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏఐబీఈఏ ఈ నెల 19న (రేపు) సమ్మెకు పిలుపునిచ్చింది. అధికారులు ఇందులో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరింగ్ వంటి లావాదేవీలపై కొంత ప్రభావం ఉండవచ్చని అంచనా. సమ్మె జరిగితే పరిస్థితుల గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైన పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం అందించాయి. కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను అవుట్సోర్స్ చేయడం వల్ల కస్టమర్ల ప్రైవసీకి, వారి సొమ్ముకు రిస్కులు పొంచి ఉండటంతో పాటు కింది స్థాయిలో రిక్రూట్మెంట్ తగ్గిపోతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల (సవరణ) చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, సమ్మెలు జరపడం మినహా తమ ఆందోళనను వ్యక్తపర్చేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు. -
కస్టమర్లకు అలర్ట్ : ఉద్యోగుల స్ట్రైక్..ఆ రోజు పని చేయని బ్యాంకులు
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఇటీవల బ్యాంకు ఉద్యోగులపై పెరిగిపోతున్న దాడుల్ని నిరసిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. వచ్చే నెల 19న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో స్ట్రైక్ జరగనుంది. ఆ రోజు బ్యాంకుల్లో కార్యకలాపాలకు విఘాతం కలగనుంది. ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్.వెంకటాచలం తెలిపిన వివరాల మేరకు..ఏఐబీఈఏ యూనియన్‌లో యాక్టీవ్‌గా ఉన్నారనే కారణంగా బ్యాంకు ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ఊతం ఇచ్చేలా ఏఐబీఏ యూనియన్ నాయకులను సోనాలి బ్యాంక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సర్వీస్ నుండి తొలగించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రభుత్వ బ్యాంకులు ట్రేడ్ యూనియన్ హక్కులను నిరాకరిస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంకులు అనేక బ్యాంకింగ్ కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఉద్యోగుల్ని విచక్షణారహితంగా బదిలీ చేస్తుందన్నారు. ద్వైపాక్షిక సెటిల్మెంట్, బ్యాంక్ లెవల్ సెటిల్మెంట్ను ఉల్లంఘిస్తూ 3,300 మందికి పైగా క్లరికల్ సిబ్బందిని ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్‌కు బదిలీ చేశారన్నారని అన్నారు. పై వాటన్నింటిని తిప్పికొట్టడం లేదా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. చదవండి👉 హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త