వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపైత తాజాగా నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఫిలిం చాంబర్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఇరువర్గాలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. దీంతో సమస్య పరిష్కారం దిశగా మాట్లాడుకోని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించినట్లు తెలుస్తోంది.
చదవండి: సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన
ఈ క్రమంలో చాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు తాజాగా ఫిలిం చాంబర్‌లో భేటీ అయ్యి సినిమా కార్మికుల సమ్మె, సినిమా షూటింగ్స్, వేతనాల పెంపు వంటి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశానికి సి కల్యాణ్, ఎన్‌వీ ప్రసాద్, ప్రసన్న కుమార్, కిరణ్, సుప్రియ, కొల్లి రామకృష్ణ, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు తదితరలు హజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment