
పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడు నెలలకు పైగా సమయం ఉంది. అయితే రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. కొన్ని రోజుల క్రితం సీఎం నితీష్ కుమార్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియోలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో మౌనంగా ఉండకుండా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని ఆర్జేడీ నేతలు సీఎం నితీష్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
#WATCH | Bihar: Amid CM Nitish Kumar's National Anthem controversy, a poster targeting the Chief Minister comes up outside the residence of former Chief Minister and RJD leader Rabri Devi in Patna. The poster addresses him as "The Non Serious Chief Minister." pic.twitter.com/t6I5Sr1PPh
— ANI (@ANI) March 23, 2025
ఇప్పుడు పట్నాలోని ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి ఇంటి వెలుపల సీఎం నితీష్‌కు సంబంధించి ఒక పోస్టర్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్‌లో నితీష్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రాశారు. ఈ పోస్టర్‌లో ‘నాయక్ నహీ.. ఖల్‌నాయక్ హూ మై’(నేను హీరోని కాదు విలన్‌ను’ అని రాసి ఉంది. అలాగే ఈ పోస్టర్‌లో నితీష్ కుమార్ మహిళలను, మహాత్మా గాంధీని, జాతీయ గీతాన్ని అవమానించారని కూడా ఆరోపించారు.
ఇటీవల వెలుగు చూసిన సీఎం నితీష్ కుమార్ వీడియోను దృష్టిలో పెట్టుకుని శాసనసభ, శాసన మండలిలో ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రి జాతీయ గీతాన్ని అవమానించారంటూ గందరగోళం సృష్టించాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీరు దేశంలోని ప్రజల మనోభావాలను అపహాస్యం చేసినట్లుందని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అసెంబ్లీలో విమర్శించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment