Poster
-
ఢిల్లీ పోస్టర్ వార్‌లో ఆసక్తికర మలుపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ.. ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఓపక్క ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది. మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.నిజాయితీలేని వ్యక్తులందరినీ నిజాయితీపరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్‌లైన్ ఉంచింది. ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు. అయితే.. రాహుల్ గాంధీ ఫొటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది. ఆప్ సర్కార్‌పై, ఆ పార్టీ కన్వీనర్‌పై అరవింద్ కేజ్రీవాల్‌పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ గురువారం ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. అయితే.. కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు. అంతకు ముందు సైతం ఆయన కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేజ్రీవాల్ కూడా మోదీ తరహాలోనే తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారని విమర్శించారు. కాలుష్య నివారణ, రాజధాని ద్రవ్యోల్బణం లాంటి విషయాల్లో ఆయన విఫలమయ్యారని మండిపడ్డారు. అలాగే.. దళితులను, గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఆప్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు సంధిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్.. కేజ్రీవాల్‌ను దేశ వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. దీంతో.. ఆయన ఫొటోను కూడా తాజా పోస్టర్లో ఉంచారు. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌పై పోటీకి దిగిన సందీప్ దీక్షిత్ (షీలా దీక్షిత్ కొడుకు) ఫొటోను కూడా ఉంచారు.]మరోవైపు.. బీజేపీ కూడా సోషల్ మీడియాలో ఆప్దా(డిజాస్టర్) సిరీస్ భాగంగా వరుస పోస్టర్లను వదులుతోంది. గూండాలు, నేరస్తులైన ‘‘ఆప్-దా గ్యాంగ్’’కు ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం నేర్పబోతున్నారంటూ తాజాగా మరో పోస్టర్ వదిలింది. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ కాంగ్రెస్‌ల మధ్య పోటీ రాజకీయ చర్చకు దారి తీసింది. హర్యానా, ఢిల్లీ.. ఇలా వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. ఇండియా కూటమి జాతీయ రాజకీయాల వరకు.. అదీ లోక్‌సభ ఎన్నికలకే పరిమితమని కూటమి పార్టీలు స్పష్టత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే.. పోటీకి సై అంటున్న ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిజాయితీ కూడిన పాలనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఫొటోతో ఆప్ ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీ విషయంలో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని చెబుతోంది. ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చోటు అక్కర్లేదని ఆప్ వాదిస్తోంది. అయితే దానికి కాంగ్రెస్ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. మొత్తం 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే తేదీన ఫలితాలను ప్రకటించనుంది. ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.08 లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నారు. -
సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. ఆసక్తిగా సంక్రాంతి పోస్టర్
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్‌తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.ఈ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రేక్షకులకు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. పోస్టర్లో ప్రెగ్నెన్సీ కిట్ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఒక కాంటెంపరరీ ఇష్యూను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. పోస్టర్ చూస్తేనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా సునీల్ కశ్యప్ పని చేస్తున్నారు. -
గూస్ బంప్స్ తెప్పించేలా ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ఫస్ట్ లుక్
అభినయ చతుర సతీష్ నీనాసం నటించిన ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్స్ హౌస్ బ్యానర్ల మీద వర్ధన్ నరహరి, జైష్ణవి, సతీష్ నీనాసం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది.ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్లో వినిపించే ఆ పాట, బీజీఎం, హీరోని చూపించిన విధానం, ఆ రక్తపాతం చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అనే ఎక్స్ పీరియెన్స్ను ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టాకీ సీక్వెన్స్‌లు, పాటల్ని త్వరితగతిన షూట్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లో సతీష్ నీనాసం బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. కత్తులు పట్టుకుని ఊచకోత కోస్తున్న హీరో లుక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.ఫిబ్రవరి 15న షూటింగ్‌ని పునఃప్రారంభించడానికి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ది రైజ్ ఆఫ్ అశోక మూవీ సతీష్ నీనాసం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతోందని టీం ఎంతో నమ్మకంగా ఉంది. సతీష్ కెరీర్లో ఇదొక డిఫరెంట్ ప్రయోగం అని చెబుతున్నారు. ఈ సినిమాలో బి. సురేష్, అచ్యుత్ కుమార్, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే, సంపత్ మైత్రేయ, యశ్ శెట్టి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా లవిత్, ఆర్ట్ డైరెక్టర్‌గా వరదరాజ్ కామత్, సంగీత దర్శకుడిగా పూర్చంద్ర తేజస్వి SV పని చేస్తున్నారు. డా. రవివర్మ, విక్రమ్ మోర్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను మను షెడ్గర్ నిర్వర్తిస్తున్నారు. -
మేము న్యూట్రల్..ఎన్డీఏ కాదు,ఇండియా కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం:నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం(డిసెంబర్24) మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాంరాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంమేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయనిజమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడునిజేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందిజేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారువిద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలుఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారుఅధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారుఅధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారువైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాంవచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందిఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారుసంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదునాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు -
హారర్ థ్రిల్లర్
‘శంబాల’ కోసం జియో సైంటిస్ట్‌గా మారారు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. అర్చనా అయ్యర్ హీరోయిన్ . యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా సోమవారం (డిసెంబరు 23) ఆది బర్త్ డే. ఈ సందర్భంగా ‘శంబాల’ నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్‌తో ఈ మూవీ తీస్తున్నాం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో శిక్షణ పొందిన యుగంధర్ ముని ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హన్్స జిమ్మర్తో పని చేసిన శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు’’అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీలో శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ’..పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
సాక్షి,తాడేపల్లి:అన్నదాతకు అండగా వైఎస్సార్సీపీ నినాదంతో ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి,రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతిపత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడా. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు.ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. రైతులకు కనీస మద్దతుధర దక్కడం లేదు.మంత్రి నాదెండ్ల ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందని చెప్పారు.ఒక్క మెసేజ్ పెడితే ధాన్యం కొనేస్తామన్నారు. రెండు రోజులైనా రైతులు హాయ్ పెట్టినా..ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.దళారులు ఎంటరైపోతున్నారు. రైతుల నుంచి తక్కువ ధరకే ధాన్యం కొంటున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకే ధాన్యాన్ని కొన్నాం.ఈ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. వానల భయంతో రైతులు ఎంతో కొంతకు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.రైతులకు 20 వేలు ఇస్తామన్నారు కానీ నయాపైసా ఇవ్వలేదు. రైతుల వద్ద ధాన్యం కొంటే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. ధాన్యం కొని రైతులను ఆదుకోవాలి’అని అంబటి డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్‌ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్‌లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్‌లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్‌కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్‌ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
ముఫాసా: ది లయన్ కింగ్.. మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్ రిలీజ్
చిన్నా, పెద్దా అనే తేడా అందరినీ అలరించిన చిత్రం లయన్ కింగ్. ఈ చిత్రంలో రాజ్యాన్ని పాలించే ముఫాసా, అతని తమ్ముడు స్కార్ పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అడవికి రాజుగా ముఫాసా తన రాజ్యాన్ని కాపాడుతూ ఉంటారు. అతనికి సింబా అనే కుమారుడు జన్మిస్తాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే లయన్ కింగ్-2 కూడా వచ్చింది. తాజాగా లయన్ ప్రీక్వెల్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు మేకర్స్.అయితే ముఫాసా ది లయన్ కింగ్ పేరుతో ప్రీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కాగా.. అకాడమీ అవార్డ్ విజేత, దర్శకుడు బారీ జెంకిన్స్ లయన్ కింగ్ ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ముఫాసా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో రఫీకిగా జాన్ కనీ, పుంబాగా సేథ్ రోజెన్, టిమోన్‌గా బిల్లీ ఐచ్నర్, సింబాగా డోనాల్డ్ గ్లోవర్, నాలాగా బియాన్స్ నోలెస్-కార్టర్ కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. 1994లో వచ్చిన ది లయన్ కింగ్ యానిమేటెడ్ క్లాసిక్ ఆధారంగా రూపొందిస్తున్నారు. 2019లో జోన్ ఫావ్రూ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.When @urstrulyMahesh s̶p̶e̶a̶k̶s̶ ROARS, the pride listens! 🦁🔥Presenting special poster for Mufasa: The Lion King, featuring superstar Mahesh Babu!Watch the film in cinemas on 20th December! pic.twitter.com/LDU6IyXObX— Walt Disney Studios India (@DisneyStudiosIN) December 1, 2024 -
కొచ్చిలో పుష్ప-2 ఫీవర్.. అల్లు అర్జున్ కొత్త పేరేంటో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఐకాన్ స్టార్‌కు తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. లివా మాల్లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరగనుంది.ఈ భారీ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్పోర్ట్ వద్ద ఐకాన్ స్టార్ కోసం ఫ్యాన్స్ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు. అయితే పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసిన పుష్ప-2 వెల్కమ్ పోస్టర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్ పేరును ముద్దుగా మల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. ఓవర్సీస్లో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. Kerala Allu Arjun fans waiting at kochi airport since afternoon 💥Expecting @alluarjun arrival in 15mins #PushpaRulesKeralam KOCHI WELCOMES ALLUARJUN pic.twitter.com/eNwfBwQ3k5— Allu Arjun Devotees 🐉 (@SSAADevotees) November 27, 2024 KERALA WELCOMES MALLU ARJUN 🔥🔥#PushpaRulesKeralam ❤️🔥❤️🔥#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/NPj9CqPQBz— Pushpa (@PushpaMovie) November 27, 2024 -
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'వశిష్ఠ'మూవీ
సుమన్ తేజ్, అను శ్రీ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా "వశిష్ఠ". ఈ చిత్రాన్ని బేబి నేహా సమర్పణలో లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్ పై నోరి నాగప్రసాద్ నిర్మిస్తున్నారు. మైథలాజికల్ సోషల్ డ్రామా కథతో దర్శకుడు హరీశ్ చావా రూపొందిస్తున్నారు. "వశిష్ఠ" మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు టెలివిజన్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, నిర్మాత లయన్ సాయివెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. నటుడు గగన్ విహారి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. యాడ్ ఫిలింమేకర్ యమున కిషోర్ ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ చేశారు.నిర్మాత లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ.. వశిష్ఠ పోస్టర్ చూస్తుంటే హనుమాన్ సినిమా గుర్తుకొస్తుంది. హనుమాన్ మూవీలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వారందరిలో కాన్ఫిడెన్స్, సంతోషం కనిపిస్తోంది. వశిష్ఠ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.నిర్మాత నోరి నాగప్రసాద్ మాట్లాడుతూ.. మా వశిష్ఠ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. సాయివెంకట్ , నాగబాల సురేష్ అతిథులుగా వచ్చి బ్లెస్ చేశారు. పక్కా స్క్రిప్ట్ వర్క్ తో వశిష్ఠ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించే సినిమా అవుతుంది. స్క్రిప్ట్ వినగానే మా హీరో సుమన్ తేజ్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. టీమ్ అంతా ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాం. ఒక సక్సెస్ ఫుల్ మూవీతో మీ ముందుకు వస్తాం. మీడియా మిత్రుల సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.డైరెక్టర్ హరీశ్ చావా మాట్లాడుతూ.. మా వశిష్ఠ మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే సోషల్ డ్రామా ఇది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. కథ వినగానే సింగిల్ సిట్టింగ్‌లో మా హీరో సుమన్ తేజ్ ఓకే చేశారు. మంచి టీమ్ నాకు సపోర్ట్ గా దొరికింది. మా ప్రొడ్యూసర్ నాగ ప్రసాద్ నాకు వెన్నంటే ఉన్నారు. ఒక మంచి మూవీతో మీ ముందుకు వస్తాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోస్టర్ కలకలం
-
ఉత్సవంలో ...
‘జరగండి... జరగండి...’ అంటూ రామ్‌చరణ్ ఏ రేంజ్లో మాస్ స్టెప్పులేశారో ఆ పాట వీడియో చూసినవాళ్లకి తెలిసిందే. రామ్‌చరణ్‌తో కలిసి కియారా అద్వానీ కూడా జోష్‌గా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరూ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలోని పాట ఇది. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.ఈ నెలలోనే మరో పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసి, ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఓ ఉత్సవం నేపథ్యంలో రామ్‌చరణ్, ఉత్సాహంగా డ్యాన్స్ చేసే పాట ఇది అని పోస్టర్ స్పష్టం చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఎస్. తిరుణావుక్కరసు. -
'కానిస్టేబుల్' మోషన్ పోస్టర్ విడుదల
వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్". వరుణ్ సందేశ్‌కు జోడిగా మధులిక వారణాసి హీరోయిన్గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నిర్మాత కుమార్తె జాగృతి జన్మదినం సందర్భంగా తాజాగా విడుదల చేశారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. 'సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా మోషన్ పోస్టర్ కూడా చాలా బాగా వచ్చింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో కానిస్టేబుల్‌గా కొత్తకోణం కలిగిన పాత్రలో నటిస్తున్నాను. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. తప్పకుండ ఈ చిత్రం నా కెరీర్‌ను మరో మలుపు తిప్పుతుంది" అని చెప్పారు. నిర్మాత బలగం జగదీష్ కూడా చిత్ర యూనిట్‌ను మెచ్చుకున్నారు. కథ, కధనాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని ఆయన చెప్పారు. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ చాలా ఆకట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు. -
నటనకు 50 ఏళ్లు.. బాలకృష్ణ పోస్టర్ ఆవిష్కరణ!
తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన హీరో నందమూరి బాలకృష్ణ . ఈ ఏడాదితో ఆయన నటుడిగా యాభైఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాన్ని సెప్టెంబరు 1న నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు కలిసి స్వర్ణోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాగా.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు.దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. 'బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ తర్వాత బాలకృష్ణలాగా నటించిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. బాలయ్య నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి' అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి, మాదాలరవి, నటుడు శివబాలాజీ, దామోదర్ ప్రసాద్, భరత్ భూషణ్, వైవీఎస్ చౌదరి, సీ కల్యాణ్, పరుచూరి గోపాలకృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. -
బోనమెత్తిన తమన్నా.. దాదాపు 800 మందితో!
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోన్నతాజా చిత్రం ఓదెల-2. ఈ సినిమాను అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఓదెల రైల్వేస్టేషన్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే తెలంగాణలో బోనాల పండుగ సందర్బంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టులో తమన్నా బోనం మోస్తున్న పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 800 మందితో క్లైమాక్స్ సీన్ షూట్..ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఏకంగా 800 మంది కళాకారులతో భారీస్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓదెల మల్లన్న టెంపుల్ సెట్లో జరుగుతోంది. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే అత్యంత భారీ ఆలయ సెట్‌ను అధిక బడ్జెట్‌తో నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో తమన్నాతో పాటు ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు. కాగా.. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Team #Odela2 wishes everyone celebrating the festival a very Happy Bonalu ✨#Odela2 climax currently being shot in a Grand Mallanna Temple set erected at Ramoji Film City.@tamannaahspeaks @IamSampathNandi @ashokalle2020 @ImSimhaa @AJANEESHB @SampathNandi_TW @creations_madhu… pic.twitter.com/xfSR8QFfZh— Telugu FilmNagar (@telugufilmnagar) July 29, 2024 -
సీతారామం హీరో బర్త్ డే.. తెలుగులో మరో మూవీ!
సీతారామం మూవీతో సూపర్ హిట్ అందుకున్న నటుడు దుల్కర్ సల్మాన్. ఆ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం లక్కీ భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కల్కి 2898 ఏడీలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మరో కొత్త మూవీని ప్రకటించారు. తెలుగులో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా దుల్కర్ పుట్టిన రోజు కావడంతో మూవీ టైటిల్ మేకర్స్ రివీల్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణసంస్థ స్వప్న సినిమాస్ దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో దుల్కర్ సాంప్రదాయ కుర్తా, ఎరుపు కండువా ధరించి కనిపించాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా..దుల్కర్ నటించిన లక్కీ భాస్యర్ సెప్టెంబర్ 7వ తేదీ 2024న విడుదల కానుంది. ఆకాశంలో ఒక తార 💙Wishing a blockbuster birthday to our STAR @Dulquer who will enchant us all with a story that makes your heart SOAR ❤️🔥#AakasamLoOkaTara@pavansadineni @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/MIJpZjDsrI— Swapna Cinema (@SwapnaCinema) July 28, 2024 -
వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త సినిమా 'విరాజి' నుంచి ఫస్ట్‌లుక్, టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ దీనిని విడుదల చేశారు. మహా మూవీస్, ఎమ్ 3 మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాజి చిత్రాన్ని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు.విరాజి టీజర్‌ను విడుదల చేసిన అనంతరం చిత్ర యూనిట్‌ను దర్శకుడు సాయి రాజేష్ అభినందించారు. టీజర్ చాలా బాగుందని, విజువల్స్ బాగున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ లుక్ అదిరిపోయిందని ఆయన తెలిపారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు దర్శకుడు ఆద్యంత్ హర్షకు మరిన్ని అవకాశాలు రావాలని ఆయన కోరారు. ఆద్యంత్ కూడా తమ జిల్లా నెల్లూరు నుంచే చిత్రపరిశ్రమకు వచ్చారని ఆయన తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా సంతోషమని సాయి రాజేష్అన్నారు. అనంతరం నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. 'విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము, ఈరోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ విడుదల చేయడం చాలా సంతోషం. ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరికి నచ్చుతుంది.' అని తెలిపారు. -
‘భావి ప్రధాని అఖిలేష్’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టిన రోజు నేడు(జూలై 1). ఈ సందర్భంగా యూపీలోని పార్టీ నేతలు, కార్యకర్తలు అఖిలేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వారు కేక్‌లను తీసుకువచ్చి అఖిలేష్ చేత కట్ చేయిస్తున్నారు. అయితే లక్నోలోని పార్టీ కార్యాలయం బయట వెలిసిన పోస్టర్ చర్చనీయాంశంగా మారింది.ఆ పోస్టర్లో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అని రాశారు. దీనిని చూసిన వారంతా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. మరోవైపు యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా అఖిలేష్‌కు తన ట్విట్టర్ ఖాతా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నేత పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు లక్నోలోని హజ్రత్‌గంజ్‌లో గల మంచముఖ హనుమాన్ మందిరంలో అఖిలేష్‌కు దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అనంతం ఆలయానికి వచ్చినవారందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. -
సినీ ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించేది అదే: డైరెక్టర్ తేజ
సన్నీ అఖిల్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక ". దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. "ఏ సినిమాకైన ప్రేక్షకులను ఆకర్షించేది. వారిని థియేటర్ల వద్దకు రప్పించేలా చేసేది టైటిల్ మాత్రమే. ఈ పోలీస్ వారి హెచ్చరిక అనే టైటిల్ కూడా అలాంటిదే. ఈ టైటిల్ దర్శక నిర్మాతలకు మంచి విజయాన్ని అందిస్తుంది" అని అన్నారు. దర్శకుడు తేజ గారి చేతుల మీదుగా మా సినిమా పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత బెల్లి జనార్థన్ పేర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా.. ఈ చిత్రంలో రవి కాలే , గిడ్డేశ్ , శుభలేఖ సుధాకర్ , షియాజీ షిండే , హిమజ , జయవాహినీ , శంకరాభరణం తులసి , ఖుషి మేఘన , రుచిత , గోవింద , హనుమ, బాబురాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మస్కా మజాకా!
తన ‘తప్పట్టం’ సినిమా పోస్టర్‌ను ‘వరల్డ్–ఫేమస్’ చేసినందుకు ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు తమిళ చిత్ర నిర్మాత ఆదమ్ భవా. ‘హౌ ఇంటెలిజెన్స్ వర్క్స్’ కాప్షన్‌తో డిజైన్ చేసిన మీమ్ పోస్టర్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశాడు మస్క్. ఈ పోస్టర్లో ఇద్దరు నటులు కొబ్బరి నీటిని షేర్ చేసుకుంటూ కనిపిస్తారు. ఈ కొబ్బరినీటి షేరింగ్‌ను యాపిల్, ఓపెన్ ఏఐల మ«ధ్య డేటా షేరింగ్ డైనమిక్స్‌తో పోల్చుతుంది ఈ మీమ్. అంత పెద్ద ఎలాన్ మస్క్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయడంతో ‘తపట్టం’ సినిమా పోస్టర్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. లక్షల వ్యూస్‌తో దూసుకు పోతుంది. ఈ పోస్టర్ పుణ్యమాని యాపిల్–ఓపెన్ ఏఐ భాగస్వామ్యం గురించి చర్చ కూడా జరుగుతుంది. -
మస్క్‌కు ధన్యవాదాలు తెలిపిన నిర్మాత.. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలొన్ మస్క్ ఇవాళ చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.అయితే ఆ ట్వీట్లో ఓ సినిమా పోస్టర్‌ను మస్క్ పంచుకున్నారు. దీంతో అందరి దృష్టి ఆ ఫోటోపైనే పడింది. ఇంతకీ ఆ పోస్టర్ చూస్తే ఇండియన్ సినిమాకే చెందినదిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఆ పోస్టర్ గురించే చర్చ మొదలెట్టారు.అయితే ఆ పోస్టర్ కోలీవుడ్ సినిమాకు చెందినదిగా తెలుస్తోంది. తాజాగా మస్క్ షేర్ చేసిన ఫోటో.. తమ సినిమా తప్పట్టం లోనిది అంటూ తమిళ నిర్మాత ఆదం బవ రిప్లై ఇచ్చారు. నా చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. My thanks to Elon Musk for making my movie thappattam poster world famous..😁🙏🏻@elonmusk https://t.co/LRQ7teFgzn pic.twitter.com/pg9DRMImFa— Adham Bava (@adham_bava) June 11, 2024 -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్ డైరెక్టర్ ట్వీట్!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్‌గా వస్తోన్న జై హనుమాన్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 -
'నా పెళ్లాం దెయ్యం'.. ఆర్జీవీ టైటిల్ అదరహో!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే వ్యూహం, శపథం లాంటి సినిమాలతో సినీ ప్రియులను అలరించారు. తాజాగా మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శారీ మూవీని తెరకెక్కిస్తోన్న ఆర్జీవీ.. మరో ఆసక్తికర సినిమాను ప్రకటించారు. 'నా పెళ్లాం దెయ్యం' పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ పోస్టర్‌ను ఏలాంటి క్యాప్షన్ లేకుండా రిలీజ్ చేశారు. అందులో నా పెళ్లాం దెయ్యం అనే టైటిల్ తోపాటు.. తాళి తీసి పడేసినట్లుగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో కిచెన్‌లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను చూపించారు. కాగా.. ఈ విషయాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ వెల్లడించారు. నా పెళ్లాం దెయ్యం పేరుతో మూవీని తీయబోతున్నట్లు తెలిపారు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్లాం దెయ్యమనే అంటారని.. నాకు కూడా నిజ జీవితంలో అలాగే అనిపించిందని అప్పట్లోనే ఆర్జీవీ అన్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్నీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/61WPNVbJ5R — Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2024 -
టీచర్ కొలువుకు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డీఎస్సీని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచి్చన నోటిఫికేషన్‌ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్‌ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధివిధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు నుంచే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇచి్చన నోటిఫికేషన్ సమయంలో 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసినప్పటికీ గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తులు పంపాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) పద్ధతిలోనే డి్రస్టిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ఆన్లైన్ కేంద్రాలను గుర్తించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డిలలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపింది. 2023 జూలై ఒకటవ తేదీ నాటికి 18–46 ఏళ్ల మధ్య ఉన్న వారిని డీఎస్సీకి అనుమతిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి నుంచి మినహాయింపు ఉండనుంది. పరీక్షకు సంబంధించిన సిలబస్, సబ్జెక్టులవారీ పోస్టులు, రిజర్వేషన్ నిబంధనలకు సంబంధించిన సమాచార బులెటిన్ ఈ నెల 4న https:// schooledu. telangana. gov. in వెబ్సైట్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. డీఎస్పీ మే 20 తర్వాత 10 రోజులపాటు ఉండే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 21 వేల ఖాళీలను గుర్తించినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డీఎస్సీని ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆరీ్ట) పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 సెపె్టంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70 శాతం ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30 శాతం పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నారు.