సూపర్‌ స్టార్‌ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్! | Malayalam Star Mammootty New Movie Bramayugam Poster Goes Viral On Social Media, Deets Inside - Sakshi
Sakshi News home page

Mammootty Bramayugam Poster: హారర్ చిత్రంగా 'భ్రమయుగం'.. ఆకట్టుకుంటోన్న పోస్టర్!

Published Mon, Jan 1 2024 3:26 PM | Last Updated on Mon, Jan 1 2024 3:55 PM

Malayalam Star Mammootty new poster of Bramayugam Movie - Sakshi

ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్‌పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్‌తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం  పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. 

ఈ పోస్టర్‌లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్‌లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం  మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.  కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement