
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ జ్యోతిక. ఈ నెల 18న జ్యోతిక బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మమ్ముట్టి హీరోగా మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఫేమ్ జో బేబీ దర్శకత్వంలో ‘కాతల్’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది.
ఈ సినిమాలోనే జ్యోతిక హీరోయిన్‌గా నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన జ్యోతిక ఇంతకుముందు మలయాళంలో ‘రాఖిలి పట్టు’(2007), ‘సీతాకల్యాణం’ (2009) అనేసినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment