official announcement
-
మీరు వద్దనుకుంటే పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం
న్యూఢిల్లీ: రెండురోజులుగా ఇండియా పేరుని భారత్‌గా మార్చే విషయమై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంటే సోషల్ మీడియాలో మరో వార్త దావానలంలా వ్యాపించింది. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని అనుకుంటోందట. ఇదిలా ఉండగా దేశం పేరు మార్పుపై కేంద్రం నుంచైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆహ్వానంతో మొదలైంది.. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి భావం నుంచి అతిధులకు చేరిన ప్రత్యేక డిన్నర్ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది కేంద్రం. ఈ నేపథ్యంలో సౌత్ ఏషియా ఇండెక్స్ అనే ఒక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ప్రత్యక్షమైంది. మాకే హక్కుంది.. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో మార్చుకుని భారత్ అని నామకరణం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే పాకిస్తాన్ దేశం తమ దేశానికి ఇండియా అని పేరు పెట్టుకోవచ్చని స్థానిక మీడియా తెలిపినట్లు రాశారు. చాలాకాలంగా పాకిస్తాన్ జాతీయవాదులు ఇండియా అనేది సింధు ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ పేరు మీద తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయని చెబుతూ వస్తోంది. అక్కడ ఊరే లేదు.. ఇక ఈ పోస్టుపై సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా పేరు పెట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పేరు పెట్టుకుంటుంది. అపుడు రష్యా ఆఫ్ఘనిస్తాన్ పేరును పెట్టుకోవచ్చంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారొక యూజర్. మరో వ్యక్తి అయితే పెరు మారినా పాకిస్తాన్ తలరాత మాత్రం మారదులే అని రాశారు. ఇక భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. అక్కడ గ్రామమే లేదు అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయారయ్యారని రాశారు. Just IN:— Pakistan may lay claim on name "India" if India derecongnises it officially at UN level. - local media — Nationalists in Pakistan have long argued that Pakistan has rights on the name as it refers to Indus region in 🇵🇰. — South Asia Index (@SouthAsiaIndex) September 5, 2023 Gaaon basa nahin aur …. https://t.co/g5Zfe4GUHV — Virender Sehwag (@virendersehwag) September 5, 2023 ఇది కూడా చదవండి: అమెరికాలో అసలేం జరుగుతుంది?బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు -
ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!
ప్రభాస్ అభిమానులు సలార్ టీజర్‌తో ఫుల్ జోష్‌లో ఉండగానే 'ప్రాజెక్ట్-కె' మేకర్స్ కడా బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్,కమల్ హాసన్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే 'ప్రాజెక్ట్-కె' పోస్టర్స్ అదిరిపోయే విదంగా ఉన్నాయి. సినిమాకు సంబంధించి టైటిల్ రివీల్‌తో పాటు గ్లింప్స్‌ను జులై 20న విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ నుంచి ఇదే విషయాన్ని అదికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన 7:11 పీఎమ్ మూవీ రివ్యూ) అమెరికాలో జరిగే శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) వేడుకలో 'ప్రాజెక్ట్-కె' ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేయడమే కాకుండా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. అమెరికాలో జూలై 19 నుంచి కామిక్- కాన్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా, జులై 20న ఈ వేడుకలకు ప్రభాస్, కమల్,అమితాబ్, దీపికా, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొననున్నారు. ఆపై చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఆ వేదిక మీద రివీల్ చేస్తారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు మా డార్లింగ్ క్రేజ్ వెళ్తోంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: Rangabali Review In Telugu: 'రంగబలి' రివ్యూ) 𝐏𝐑𝐎𝐔𝐃 𝐌𝐎𝐌𝐄𝐍𝐓! San Diego @Comic_Con, here we come.#ProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/uodkNyPmSk — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 6, 2023 -
విమాన ప్రమాదంపై నేపాల్ ప్రభుత్వం అధికారిక ప్రకటన
-
13 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళంలో జ్యోతిక
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ జ్యోతిక. ఈ నెల 18న జ్యోతిక బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మమ్ముట్టి హీరోగా మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఫేమ్ జో బేబీ దర్శకత్వంలో ‘కాతల్’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలోనే జ్యోతిక హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన జ్యోతిక ఇంతకుముందు మలయాళంలో ‘రాఖిలి పట్టు’(2007), ‘సీతాకల్యాణం’ (2009) అనేసినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
సరికొత్తగా రానున్న 'స్క్విడ్ గేమ్ 2'.. మరబొమ్మకు బాయ్‌ఫ్రెండ్ అట..
Squid Game Season 2 Official Announcement And Doll Has Boyfriend: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' వినడానికి చిన్న పిల్లల ఆటల ఉన్నా చూసే ఆడియెన్స్‌ను ప్రతిక్షణం థ్రిల్లింగ్‌కు గురిచేసింది. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై నెంబర్ వన్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు రెండో సీజన్ వస్తున్నట్లుగా డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్ మరింత కొత్తగా, ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసేలా ఉండన్నున్నట్లు తెలిపారు. 'గతేడాది స్క్విడ్ గేమ్‌కు ప్రాణం పోసి ఓ సిరీస్ రూపంలో ఒకటో సీజన్‌గా తీసుకురావడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ మోస్ట్ పాపులర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా అవతరించేందుకు 12 రోజులు మాత్రమే పట్టింది. స్క్విడ్ గేమ్‌ను ఇంతగా ఆదరించి ఘన విజయాన్ని అందించిన వరల్డ్‌వైడ్‌గా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు జీ-హన్ రిటర్న్స్.. ది ఫ్రంట్ మ్యాన్ రిటర్న్స్.. సీజన్-2 వచ్చేస్తోంది. ఆ సూట్ ధరించి మేమ్ ప్రారంభించేందుకు డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. ఈసారి యంగ్ హీ (మరబొమ్మ)కి బాయ్‌ఫ్రెండ్‌గా 'కియోల్-సు' రానున్నాడు.' అని డైరెక్టర్ తెలిపారు. Hwang Dong-Hyuk writer, director, producer, and creator of @squidgame has a message for the fans: pic.twitter.com/DxF0AS5tMM — Netflix (@netflix) June 12, 2022 అయితే ఇందులో ఉన్న మరబొమ్మ (రోబోట్)కు బాయ్‌ఫ్రెండ్ ఉండటం అనే విషయంపై నెటిజన్స్ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. 'ఈ బొమ్మకు (రోబోట్) కూడా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా ? నమ్మలేకపోతున్నాను. నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నా' అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా వెల్లడించలేదు. Red light… GREENLIGHT! Squid Game is officially coming back for Season 2! pic.twitter.com/4usO2Zld39 — Netflix (@netflix) June 12, 2022 how come the doll in squid game has a boyfriend but im single https://t.co/ST4RFRhv77 — xin 🌱 FL!P that (@nagumowife) June 12, 2022 the squid games doll has a boyfriend & some of you guys are still single lol just saying https://t.co/gzJg971Swa — brooke (@brookeab) June 12, 2022 now??? imagine the squid game robot got a boo and ur still single 😭 https://t.co/jlA69DdFDc — jimin connoisseur ⁷ (@sunflowrmemory) June 12, 2022 Girlie got a boyfriend~ 💃🏽 pic.twitter.com/BNsyn4dGv7 — shera || (@ddiddirere) June 12, 2022 -
Its Official: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్..
Its Official: Vignesh Shivan About His Wedding With Nayanthara: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కలిసిన నయన్-విఘ్నేష్ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఖరారు అయిందని కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా వీరి వివాహంపై స్పందించాడు విఘ్నేష్ శివన్. 'నా ప్రేయసి నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్ చేస్తాం. జూన్ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.' అని తెలిపాడు విఘ్నేష్ శివన్. చదవండి: సీఎంను కలిసిన నయనతార.. ఫొటో వైరల్.. -
తొలి రోజు.. కొత్త కబుర్లు
సెలబ్రేషన్ టైమ్‌లో ఏదైనా మూవీ ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తే ఆడియన్స్‌కు అది బాగా రీచ్ అవుతుందని అంటారు. అందుకే పండగ సీజన్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ఆయా సినిమాల నిర్మాతలు పోటీపడుతుంటారు. అలాగే సెట్స్‌పై ఉన్న సినిమావాళ్లు కొత్తలుక్, టీజర్, ట్రైలర్ అంటూ ఇలా ఏౖవైనా అప్డేట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కొత్త సినిమాల అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సీజన్లో సందడి చేయడానికి ఆయా సినిమా బృందాలు రెడీ అవుతున్నాయి. ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు ఫస్ట్ లుక్ ఆయన బర్త్‌డే సందర్భంగా రిలీజైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను 2019 జనవరి 1న రిలీజ్ చేసి ఆడియన్స్‌కు న్యూ ఇయర్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట ‘మహర్షి’ యూనిట్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రధారి. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇన్ని రోజులూ తన నెక్ట్స్ చిత్రం గురించి మౌనంగా ఉన్న అల్లు అర్జున్ ఈ న్యూ ఇయర్‌కు ఆ మౌనాన్ని బ్రేక్ చేయనున్నారు. కొత్త ఏడాది కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నారు. 2019 జనవరి 1న అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. దీంతో అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనే విషయంపై కూడా క్లారిటీ వస్తుంది. దర్శకులు త్రివిక్రమ్, ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ పేర్లు వినిపిస్తున్నాయి. హీరో నాని కూడా రెడీ అవుతున్నారు. అయితే అది కొత్త సినిమా ఎనౌన్స్మెంట్ కాదు. కొత్త లుక్‌తో అన్నమాట. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. క్రికెటర్ అర్జున్ పాత్రలో నటిస్తున్నారాయన. ఈ జనవరి 1న అర్జున్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇక కోలీవుడ్‌లో సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు ఆల్రెడీ మూడు టైటిల్స్‌ను రెడీ చేశారు. వాటిలో ఏ టైటిల్ ఫైనల్ అనేది 2019 జనవరి 1నే తెలియనుంది. ఇంకా మరికొన్ని చిత్రబృందాలు న్యూ ఇయర్‌కు తమ సినిమాల గురించిన అప్డేట్స్ను అందించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
'అటాక్‌కు వాట్సాప్ వాడారు'
వాషింగ్టన్: పారిస్ దాడులకు సంబంధించి విచారణ అధికారులు తొలిసారి కొన్ని అధికారిక ప్రకటనలు చేశారు. దాడులకు పాల్పడిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సంకేత సంక్షిప్త సందేశ యాప్స్‌ను ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. దాడి అంశాన్ని ఎవరూ గుర్తించకుండా ఈ యాప్స్ ద్వారానే దాచిపెట్టి ఉంచినట్లు చెప్పారు. అయితే, ఆ సంకేత రూపంలో ఉన్న సందేశాల్లో ఉన్న సమాచారం ఏమిటనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆ భాషను ఇంకా వారు గుర్తించలేకపోయారని కూడా తెలుస్తోంది. పారిస్ దాడులు జరిగిన తర్వాత విచారణ అధికారులు చేసిన తొలి అధికారిక ప్రకటన ఇదే. గతంలో దాడులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో కొన్ని సంకేత సంక్షిప్త సందేశ యాప్స్ ఉన్నాయని చెప్పారు.. కానీ ఆ అంశాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అనంతరం కొద్ది రోజులపాటు వాటిని పరిశీలించిన అధికారులు కుట్రకు సంబంధించి ఉగ్రవాదులు తమనుతాము సమన్వయం చేసుకునేందుకు వాట్సాప్, టెలిగ్రాంవంటి యాప్స్ ను ఉపయోగించారని, తమ వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారని గుర్తించారు. అయితే, ఈ యాప్స్ లలో ఇంకా ఎలాంటి ఆధారాలు మాత్రం అధికారులకు తెలియలేదు. విచారణ పూర్తయితేగానీ, మొత్తం సమాచారం వివరించలేమని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.