Prabhas Project K Will Be First Indian Movie To Launch At San Diego Comic Con, Deets Inside - Sakshi
Sakshi News home page

Project K Title, Release Date Update: ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌-కె' నుంచి బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..!

Published Fri, Jul 7 2023 8:28 AM | Last Updated on Fri, Jul 7 2023 11:04 AM

Prabhas Project K Launch At San Diego Comic Con - Sakshi

ప్రభాస్‌ అభిమానులు సలార్‌ టీజర్‌తో ఫుల్‌ జోష్‌లో ఉండగానే 'ప్రాజెక్ట్‌-కె' మేకర్స్‌ కడా బిగ్‌  సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా  తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ఇది. దీపికా పదుకొణె  కథానాయిక. అమితాబ్‌,కమల్‌ హాసన్‌ కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే  'ప్రాజెక్ట్‌-కె' పోస్టర్స్‌ అదిరిపోయే విదంగా ఉన్నాయి. సినిమాకు సంబంధించి టైటిల్‌ రివీల్‌తో పాటు గ్లింప్స్‌ను జులై 20న విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్‌ నుంచి  ఇదే విషయాన్ని అదికారికంగా ప్రకటించారు.  

(ఇదీ చదవండి: టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన 7:11 పీఎమ్‌ మూవీ రివ్యూ)

అమెరికాలో జరిగే శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) వేడుకలో  'ప్రాజెక్ట్‌-కె' ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేయడమే కాకుండా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు.  అమెరికాలో జూలై 19 నుంచి కామిక్- కాన్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా, జులై 20న ఈ వేడుకలకు ప్రభాస్, కమల్‌,అమితాబ్‌, దీపికా, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొననున్నారు. ఆపై చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఆ వేదిక మీద రివీల్‌ చేస్తారు.  ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇలాంటి గౌరవం దక్కలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రచ్చ మాములుగా లేదు. టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు మా డార్లింగ్‌ క్రేజ్‌ వెళ్తోంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

(ఇదీ చదవండి: Rangabali Review In Telugu: 'రంగబలి' రివ్యూ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement