
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కే' ప్రమోషన్స్ జోష్ పెంచింది. ఇప్పటికే జులై 20న కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని లాంచ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
(ఇదీ చదవండి: నయనతార ఆస్తుల వివరాలపై మళ్లీ చర్చ)
తాజాగా 'ప్రాజెక్ట్ కే' అంటే ఏమిటి..? అని రాసి ఉన్న ఓ టీషర్ట్‌ని అందుబాటులో ఉంచారు. అయితే.. దీన్ని సొంతం చేసుకోవాలంటే మాత్రం అంత సులువు కాదు. డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ అలా ఉంటుంది. కాబట్టి టీ షర్ట్ కావాలనుకునే వారు చాలా వేగంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వైజయంతి ట్విటర్ అకౌంట్ నుంచి లింక్‌ను షేర్ చేశారు. దీనిని ఇప్పటికే ప్రాజెక్ట్ -కే టీమ్ కూడా ప్రమోట్ చేస్తుంది.
(ఇదీ చదవండి: గుండుతో ఢీ కొట్టేందుకు రెడీ అయిన స్టార్స్)
ఇలా బుక్ చేసుకోండి
వారు షేర్ చేసిన లింక్‌ని క్లిక్ చేసి.. ఆపై ఓపెన్ అయిన విండో 'పసుపు రంగులో' ఉంటే కంటిన్యూ బటన్‌ని కానీ వైజయంతి మూవీస్ లోగోనైనా నొక్కాలి. దాన్ని నొక్కగానే.. మీ పేరుతో పాటు ఈమెయిల్‌ని పొందుపరచాలి. అంతే సింపుల్ మీకు కావాల్సిన సైజ్‌లో టీషర్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది. ఈ విధంగా ప్రాజెక్ట్ కే టీషర్ట్‌ని ఏవరైనా సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి డ్రాప్ పేరుతో లింక్ విడుదల చేశారు. మరోసారి నేడు కూడా విడుదల చేయనున్నట్లు ట్విటర్‌లో సినిమా యూనిట్ తెలిపింది.
Brace yourselves, First Drop 'The Force' is getting ready for dispatch.
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2023
Get ready for the next drop.
Stay Tuned🔗 https://t.co/0rC0ez8o2N#ProjectK #WhatisProjectK pic.twitter.com/4Ni9hT0YVJ