
తెలుగు చిత్రం సీతారామంతో వెలుగులోకి వచ్చిన నటి మృణాల్ ఠాకూర్. అంతకుముందు హిందీ, మరాఠీ తదితర చిత్రాల్లో నటించారు. అయితే సీతారామం చిత్రం ఈమెని తెలుగులో స్టార్ హీరోయిన్‌ను చేసింది. అంతేకాకుండా తమిళం లోను పాపులర్ చేసింది. ఆమె నటించిన మరో చిత్రం హాయ్ నాన్న. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం నిరాశ పచడంతో క్రేజ్ ఒకసారిగా తగ్గిపోయింది. దీంతో అవకాశాలు కూడా మొఖం దాటేసాయి.
అదేవిధంగా హిందీలో లస్ట్ స్టోరీస్ చిత్రంలో మెప్పించిన ఈ బ్యూటీ తెలుగులో అడివి శేష్ చిత్రం డెకాయిట్‌లో నటిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు జతగా స్పిరిట్ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడికి మరో లక్కీ సాంగ్స్ వరించిందని తాజాగా సామాజి మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప– 2 చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్‌నే మార్చేశారు. ఆయనకు డైరెక్ట్‌గా కోలీవుడ్‌లొ ఒక చిత్రం చేయాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. అలా లింగు స్వామి దర్శకత్వంలో చిత్రం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.

అయితే, కారణాలు ఏమైనా ఆ చిత్రం సెట్ పైకి వెళ్లలేదు. అలాంటిది తాజాగా అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం చేయడానికి అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకలు ఉంటారని సమాచారం. అందుకోసం జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటానితో చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ లిస్టులో నటి మణాల్ ఠాగూర్ ముందు వరుసలో చేరినట్లు తెలిసింది. ఈమె ఈ క్రేజీ చిత్రంలో నటించడం దాదాపు ఖరారు అయినట్టు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.