
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ అవార్డులని ప్రకటించింది. ఈ పురస్కారాల ప్రదానోత్సవం.. సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు.
తెలుగు హీరో బాలకృష్ణ(Nandamuri Balakrishna), తమిళ హీరో అజిత్.. పద్మ భూషణ్ (Padma Bhushan 2025) అవార్డులని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. బాలయ్య.. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో కనిపించారు. అజిత్(Ajith Kumar).. బ్లాక్ కలర్ సూట్ వేసుకున్నారు.
(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం)
బాలకృష్ణ ప్రస్థానం చూస్తే.. తాతమ్మ కల (1974) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. 14 ఏళ్ల వయసులో తండ్రి రామారావుతో కలిసి నటించారు. సాహసమే జీవితం సినిమాతో హీరోగా మారారు. వందకు పైగా సినిమాలు చేశారు.
రీసెంట్ టైంలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు.
(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)
Nandamuri Balakrishna Receives Prestigious Padma Bhushan from President Droupadi Murmu | TFPC #nandamuribalakrishna #balayya #padmabhushan #padmaawards pic.twitter.com/M63oQSS4Lj
— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025
Padma Awards 2025: Ajith Kumar's Iconic Moment with President Murmu#ajith #PadmaAwards #PadmabhushanAjithKumar pic.twitter.com/miV0K0x3Px
— Telugu Film Producers Council (@tfpcin) April 28, 2025