Nandamuri Balakrishna
-
మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ సినిమాపై రూమర్స్.. చిత్ర యూనిట్ క్లారిటీ
నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ చిత్రం ప్రకటనతోనే ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ఒక వార్త ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మోక్షజ్ఞకు అనారోగ్యం కారణం పేరుతో మొదలు కాలేదు. ఇదే విషయాన్ని మీడియా వేదికగా బాలయ్య చెప్పారు. దీంతో మోక్షజ్ఞ సినిమాకు బ్రేకులు పడ్డాయిని భారీగా రూమర్స్ రావడం జరిగింది. అయితే, తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.మోక్షజ్ఞ- ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎస్ఎల్వీ సినిమాస్’ తాజాగా ఇలా స్పందించింది. 'మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా గురించి పలు రూమర్స్ వచ్చాయి. అందులో ఏవీ నిజం కాదు. ఈ ప్రాజెక్ట్ గురించి భవిష్యత్‌లో ప్రకటనలు, అప్డేట్స్ను మా సోషల్‌మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తాము. @SLVCinemasOffl, @LegendProdOffl మా ఎక్స్ ఖాతాలలో మాత్రమే ప్రకటిస్తాము. పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలను ఎంకరేజ్ జయకండి అని కోరుతున్నాము'. అని ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్, ఎస్.ఎల్.వి.సినిమాస్ సంయుక్తంగా సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రంగా కొత్త సంవత్సరంలో షూటింగ్ ప్రారంభం కానుంది. బాలయ్య హిట్ సినిమా ఆదిత్య 369 సీక్వెల్లో కూడా మోక్షజ్ఞ నటిస్తున్నారు. 'ఆదిత్య 999 మ్యాక్స్' పేరుతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో తన తండ్రితో కలిసి ఆయన మెప్పించనున్నారు. ఈమేరకు బాలకృష్ణ ఒక ప్రకటన కూడా చేశారు.AN IMPORTANT ALERT about our Next @PrasanthVarma - @MokshNandamuri Project.Please stop spreading fake news. All official information will come through official channels only.#PVCU2#MTejeswiniNandamuri @sudhakarcheruk5 @LegendProdOffl @ThePVCU pic.twitter.com/V9fXc7E0sy— SLV Cinemas (@SLVCinemasOffl) December 18, 2024 -
జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్
బంజారాహిల్స్: రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్‌లో సగభాగం విస్తరణలో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–1 రెండు రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. ఆయన సుమారుగా తన ప్లాట్‌లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరుల ఇళ్లకు కూడా మార్కింగ్ వేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు సన్నద్ధం అవుతుండగా..ఇంకోవైపు కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎలా చూసినా ఈ ఆస్తుల సేకరణ తప్పేలా కనిపించడం లేదు. అంతా ప్రముఖులే కావడంతో రోడ్డు విస్తరణ పనులకు తమ స్థలాలను అప్పగించేందుకు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుత్వంపై కస్సుబుస్సుమంటున్నట్లు తెలుస్తోంది. మా ఇంటికే మార్కింగ్ వేస్తారా? అంటూ నిలదీతలు కూడా మొదలయ్యాయి. మరికొంతమంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకువెళ్తామని చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌లో ఒకవైపే.. బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డుకు ఒకవైపే ఆస్తులు సేకరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ 80 అడుగుల రోడ్డు మాత్రమే 120 అడుగుల వరకు విస్తరించనున్నారు. ఒకవైపు కేబీఆర్ పార్కు గోడ ఉండగా, ఆ ప్రాంతాన్ని ముట్టుకోవడం లేదు. సమరసింహారెడ్డి, జానారెడ్డి, బాలకృష్ణ తదితరులు ఉంటున్న వైపు మాత్రమే రోడ్డు విస్తరణ జరగనుంది. ఆ మేరకే మార్కింగ్ వేశారు. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి ఆస్పత్రి చౌరస్తా నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది. దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తుల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. అయితే పనులు ముందుకుసాగడంలోనే అధికారులకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. అంతా ప్రముఖులే కావడం, ప్రభుత్వంలో ఉండడం వల్ల వీరు తమ ఆస్తులు ఇవ్వడానికి ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. -
'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్ రిలీజ్.. తమన్ మ్యూజిక్‌పై ప్రశంసలు
బాలకృష్ణ నటిస్తున్న 'డాకు మహారాజ్' ప్రకటన వెలువడిన సమయం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో తమన్ అందించిన బీజీఎమ్ మరో రేంజ్లో ఉందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.బాలకృష్ణ నటించిన గత మూడు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఆ ఘన విజయాలలో కీలక పాత్ర పోషించిన తమన్ 'డాకు మహారాజ్' చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి 'ది రేజ్ ఆఫ్ డాకు' పేరుతో మొదటి గీతం విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే, సంగీత ప్రియుల్లో ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తమన్ ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు. 'డాకు మహారాజ్' పాత్ర తీరుని తెలియజేసేలా గీత రచయిత అనంత శ్రీరామ్ అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యాన్ని అందించారు. "డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా" వంటి పంక్తులతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక గాయకులు భరత్ రాజ్, నకాష్ అజీజ్, రితేష్ జి. రావు, కె. ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో పాటకు మరింత అందం తీసుకొచ్చారు.లిరికల్ వీడియోలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. విజువల్‌గా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపిస్తోంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, బలమైన భావోద్వేగాలతో సినిమా అద్భుతమైన అనుభూతిని పంచనుందని లిరికల్ వీడియో స్పష్టం చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. -
'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్ ప్రోమో.. తమన్ మాస్ ర్యాంప్
బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 'డాకు మహారాజ్' నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన 'డాకుస్ రేజ్' ప్రోమో అదిరిపోయింది. తమన్ అందించిన బీజీఎమ్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేలా ఈ సాంగ్ ఉండనుంది. ఈ సాంగ్‌కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా నాకాశ్ అజీజ్ ఆలపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా డాకు మహారాజ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
Akhanda 2 Release Date: బాలయ్య యాక్షన్ తాండవం.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు అఖండ-2 తాండవం పేరుతో ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఇందులో బాలయ్య యాక్షన్ ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. The protector of Dharma will rage a powerful battle 🔱#Akhanda2 - Thaandavam shoot begins 💥💥Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥▶️ https://t.co/l2WnhFjwRj'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus… pic.twitter.com/oZeJPHNwQR— 14 Reels Plus (@14ReelsPlus) December 11, 2024 -
ప్రశాంత్ వర్మ- మోక్షజ్ఞ సినిమా వాయిదా.. కారణమిదే!
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. హనుమాన్ సినిమాతో సెన్సేషన్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే అతడి మొదటి సినిమా రాబోతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు గురువారం (డిసెంబర్ 5న) నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ నేడు జరగాల్సిన పూజా కార్యక్రమం వాయిదా పడింది.మోక్షజ్ఞకు ఆరోగ్యం బాగోలేదంటూ బాలకృష్ణ చివరి నిమిషంలో ప్రశాంత్ వర్మకు కాల్ చేశాడు. సినిమా ఓపినింగ్కుగానూ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా సెట్ వేశారు. ఇందుకోసం నిర్మాత దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేశాడు.చదవండి: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్‌పై కేసు నమోదు -
ఆదిత్య 369 సీక్వెల్ ఫిక్స్.. హీరోగా బాలకృష్ణ కాదు!
కొన్ని సినిమాలు ఆల్‌టైమ్ ఫేవరెట్ కోవలోకి వస్తాయి. ఆదిత్య 369 మూవీ అలాంటి కేటగిరీలోకే వస్తుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ నందమూరి బాలకృష్ణ ఐకానిక్ చిత్రాల్లో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పోషించిన పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.ఆదిత్య 369కి సీక్వెల్తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్లో బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. దీనికి ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపాడు. ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు. ఆ రోజుదాకా ఆగాల్సిందేఈ అప్డేట్ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్లో ఆదిత్య 369 అవతార్‌లో కనిపించనుండటం విశేషం. ఆదిత్య 999 మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్‌తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే! కాగా భూత, భవిష్యత్ కాలాల్లోకి హీరోహీరోయిన్లు ప్రయాణిస్తే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేదే కథ! ఈ టైమ్ ట్రావెల్ కథతో సింగీతం 1991లో 'ఆదిత్య 369' అనే అద్భుతాన్ని సృష్టించాడు.చదవండి: హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్! -
సిక్స్‌ప్యాక్ లేదని నన్ను రిజెక్ట్ చేశారు: నవీన్ పొలిశెట్టి
హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లో హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎప్పటిలాగే నవీన్ పొలిశెట్టి నవ్వులు పంచాడు.. బాలకృష్ణను ఉద్దేశిస్తూ.. సర్, మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ నవ్వులు పూయించాడు.క్లాసికల్ స్టైల్లో కుర్చీ మడతపెట్టిశ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా.. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్ స్టైల్లో ట్రై చేయమంటూ రాగమందుకున్నాడు నవీన్. అతడి గానం విన్న శ్రీలీల.. తన వీణ భరించలేకపోతోందంటూ నవ్వేసింది. ఆడిషన్స్ గురించి చెప్పమని బాలయ్య అడగ్గా.. నవీన్ ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. సిక్స్ ప్యాక్ లేదని..ఓ చిప్స్ కంపెనీ ఆడిషన్లో.. నాకు సిక్స్ ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. అసలు చిప్స్ తిన్నవాడికి సిక్స్‌ప్యాక్ ఎలా వస్తుదని లాజిక్ పాయింట్ అడిగాడు. చివర్లో ముగ్గురూ కిస్సిక్ పాటకు స్టెప్పులేశారు. ఈ ఫన్‌ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది. -
నందమూరి బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం
-
టీడీపీ నాయకుడి ఇంట్లో కర్ణాటక మద్యం.. పరారీలో పచ్చ పార్టీ నేత
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ఏపీలో పలుచోట్ల మద్యం సిండికేట్ నడుస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల టీడీపీ నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇక, తాజాగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత ఇంట్లో కర్ణాటకకు చెందిన మద్యం బాటిళ్లు దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఎక్సైజ్ అధికారుల దాడుల నేపథ్యంలో సదరు టీడీపీ నేత పరారీ అయ్యాడు.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో యథేచ్చగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. హిందూపురం మండలం కొల్లకుంటలో టీడీపీ నేత ముంజునాథ్ ఏకంగా కర్ణాటకకు చెందిన మద్యాన్ని విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఎక్సైజ్ అధికారులు ముంజునాథ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో కర్ణాటకకు చెందిన దాదాపు 1248 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల దాడుల విషయం తెలుసుకున్న ముంజునాథ్ ఇంట్లో నుంచి పరారీ అయ్యాడు. -
నా సినిమా అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తాయి: నిర్మాత నాగవంశీ
నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.అయితే ఇవాళ జరిగిన టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు బ్లాక్స్ వేరే లెవల్లో ఉంటాయని అన్నారు. ఇంటర్వెల్ సీన్ బాలయ్య సీన్ మామాలుగా ఉండదని..టీజర్ కొన్ని ముక్కలు మాత్రమే కట్ చేసి చూపించామని నాగవంశీ వెల్లడించారు.(ఇది చదవండి: బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్)ఆ తర్వాత సంక్రాంతి రేస్, నాగవంశీ సినిమాల విడుదల డేట్స్‌పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ఏడాది గుంటూరు కారం, అలాగే లక్కీ భాస్కర్ సినిమా విడుదల సమయంలో మీకు పోటీగా ఏదైనా సింపతి కార్డ్ సినిమా వస్తోందా? అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? దీనిపై మీరేమంటారని నాగవంశీని అడిగారు.దీనికి ఆయన స్పందిస్తూ..' ఈ ప్రశ్న అడిగిన మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా సినిమా టైమ్‌లోనే ఇలాంటి బాంబులు పేలుస్తున్నారు. అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తున్నాయి. ఇకనుంచి నేను కూడా ఏదైనా కష్టాలు వెతుక్కోవాలి. వచ్చే సంక్రాంతికి మేము కూడా సింపతీ కార్డ్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి' అంటూ సరదాగానే మాట్లాడారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారంతో పాటు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. హనమాన్, నాసామిరంగ, సైంధవ్ చిత్రాలు సందడి చేశాయి. ఈ పోటీలో హనుమాన్ హిట్‌గా నిలిచింది. ఇటీవల దీపావళీ సందర్భంగా లక్కీ భాస్కర్‌తో కిరణ్ అబ్బవరం క మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.Memu Kooda Ee Sankranthiki edho Oka Sympathy Card tho Raavali.- #NagaVamsi Mass at #DaakuMaharaj title teaser eventpic.twitter.com/NsTps1FrRp— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 15, 2024 -
బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్
కొన్నిరోజులుగా అనుకుంటున్నట్లే బాలకృష్ణ కొత్త సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 96 సెకన్ల నిడివి ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు.. డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే రేంజ్ అనేలా కొట్టాడు.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)'ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. కండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.. మరణాన్నే వణికించిన మహారాజుది' అనే వాయిస్ ఓవర్ ఆగగానే.. 'మహారాజ్, డాకు మహారాజ్' అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంది.ఇందులో బాలయ్యతో పాటు చౌందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
బాలయ్య ఇలాకాలో మామా ఏక్ పెగ్గులా..
-
బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం
-
బావ మాట అయినా మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులే!!
సాక్షి, శ్రీ సత్యసాయి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దాదాపు ప్రతీ గ్రామంలో అడ్డగోలుగా బెల్ట్ షాపులు వెలిశాయి. కొన్ని చోట్లైతే టీడీపీ ముఖ్య నేతలు డబ్బులు తీసుకుని మరీ బెల్టు షాపులకు అనుమతి ఇస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ బాటలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం కూడా ఉందనే విషయం తాజాగా వెలుగు చూసింది. హిందూపురం నియోజకవర్గంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా.. భారీగా వెలిశాయి. మందుబాబులకు మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులుగా నడుస్తోంది అక్కడ. ఈ నియోజకవర్గంలో దాదాపు వందకుపైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు అనధికార సమాచారం. ఇక, ఈ బెల్డ్ షాపులు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వాళ్ల ఇష్టానుసారం లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ.20 అదనంగా తీసుకుంటున్నారు. అయితే, ఎలా పడితే అలా బెల్ట్ షాపులకు అనుమతులు ఇవ్వమని, అలా కాదని అమ్మితే రూ.5లక్షలు జరిమానా విధిస్తామని సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబే హెచ్చరించారు. ఇక్కడ కూడా కొందరు టీడీపీ లీడర్లే ఈ దందాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఎక్సైజ్ అధికారులు పట్టించుకోని ఈ విషయాన్ని కనీసం.. బాలయ్య అని పట్టించుకోవాలని కింది స్థాయి కూటమి నేతలు కోరుకుంటున్నారు. మరి బావ మాటలను ఇప్పటికైనా బాలకృష్ణ సీరియస్‌గా తీసుకుంటారా? లిక్కర్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తారా? అనే చర్చ మొదలైంది ఇప్పడు. -
కౌన్సెలర్స్ కొనుగోలు చేసిన బాలకృష్ణ..
-
వెంకీకి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుంది: నిర్మాత నాగవంశీ
'సీతారామం' సినిమా దెబ్బకు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్నారు. ఇదివరకే షూటింగ్ పూర్తవగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.గతవారమే 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్ మొదలైంది. తొలి ఎపిసోడ్‌కి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో 'లక్కీ భాస్కర్' హీరోహీరోయిన్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కనిపించారు.(ఇదీ చదవండి: 'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్)కారు డ్రైవింగ్ స్పీడ్ గురించి బాలకృష్ణ.. 300 కిమీ వేగంతో నడుపుతానని దుల్కర్ చెప్పాడు. అలానే మాటల సందర్భంలో నిర్మాత నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకీ అట్లూరికి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుందని అన్నాడు. అలానే దిల్ రాజు.. చాలాసార్లు పింక్ ప్యాంట్ వేసుకుని వస్తున్నారని, అది వద్దని చెప్పాలనుందని నాగవంశీ అన్నారు.సినిమా సినిమాకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే తెలుగు హీరో గురించి బాలకృష్ణ-నాగవంశీ మధ్య చర్చ జరిగింది. ఆ హీరో పేరు ఏంటనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ప్రోమో చూస్తుంటే సరదాగానే అనిపించింది. ఎపిసోడ్ కూడా ఇలానే ఉంటే మంచి ఫన్ గ్యారంటీ.(ఇదీ చదవండి: హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో) -
బావ, బామ్మర్దుల.. అన్ స్టాపబుల్ అబద్ధాలు
-
వీకెండ్ విహారంలో రియాలిటీ షోకి హాజరైన సీఎం చంద్రబాబు
-
ఇక్కడ ప్రాణాలు పోతుంటే.. హైదరాబాద్ లో బాలకృష్ణ, బాబు అన్ స్టాపబుల్ షో..
-
బాలయ్య అఖండ-2 పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన కూతురు బ్రాహ్మణి (ఫొటోలు)
-
'అఖండ 2' సినిమాపై ప్రకటన.. పోస్టర్ రిలీజ్
బాలకృష్ణ కెరీర్లో 'అఖండ' ఓ టర్నింగ్ పాయింట్. లాక్డౌన్ టైంలో అసలు సీజన్ కాని డిసెంబరులో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ 2' అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: పిచ్చోడిలా ప్రవర్తించిన పృథ్వీ.. కానీ అనుకున్నది జరగలే!)తొలి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ రెండో భాగం మొదలవుతుంది. పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. 'స్కంద' డిజాస్టర్ తర్వాత బయట కనిపించని బోయపాటి.. గత కొన్నాళ్లుగా దీని స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అది పూర్తి చేయడంతో అధికారికంగా ప్రకటించారు. బుధవారం పూజాతో మూవీ లాంచ్ చేయనున్నారు.ప్రస్తుతం డైరెక్టర్ బాబీ మూవీతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దీని షూటింగ్ డిసెంబరుకి పూర్తవుతుంది. దీని తర్వాతే 'అఖండ 2' షూటింగ్లో బాలకృష్ణ పాల్గొంటారు. సీక్వెల్‌కి తమన్ సంగీతమందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మిగతా విషయాల్ని త్వరలో వెల్లడిస్తారు. పాన్ ఇండియా మూవీగా ఇది రాబోతుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి బయటకొచ్చేసిన కంటెస్టెంట్.. అదే కారణం!) -
హిందూపురం ఘటనను ఖండించిన వరుదు కళ్యాణి
-
సూపర్ హీరోగా బాలయ్య.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
బాలకృష్ణపై ఉషశ్రీ చరణ్ ఫైర్