బాలకృష్ణకు బిగ్‌ షాక్‌.. చుట్టుముట్టిన హిందూపురం మహిళలు | Hindupur MLA Nandamuri Balakrishna Faces Protest by Women in Chilamatturu | Sakshi
Sakshi News home page

బాలకృష్ణకు బిగ్‌ షాక్‌.. చుట్టుముట్టిన హిందూపురం మహిళలు

Oct 13 2025 7:08 AM | Updated on Oct 13 2025 12:30 PM

Hindupur womens Protest Against TDP MLA Bala Krishna

సాక్షి, చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం(hindupur) టీడీపీ(TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు(nandamuri Balakrishna) నిరసన సెగ తగిలింది. ఆదివారం ఆయన చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో పర్యటించగా.. బాలకృష్ణను స్థానిక మహిళలు చుట్టుము­ట్టా­రు. తమ సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. 

ఈ సందర్భంగా మహిళలు.. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు, పింఛన్‌ రా­లే­దని మరికొందరు నిలదీశారు. బాడుగ ఇంట్లో ఉంటు­న్నాం. మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు. వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిన బాలకృష్ణ.. ‘ఇస్తాం’ అంటూ మాట దాటవేశారు. మహిళలు అడిగిన వాటిపై సరిగా స్పందించని బాలకృష్ణ.. ఉచిత బస్సు, గ్యాస్‌ సిలిండర్లు అంటూ పథకాలను ప్రస్తావించారు. అవేవీ వినిపించుకోని మహిళలు మళ్లీ మళ్లీ అడగడంతో ఏదైనా జరుగుతుందేమోనని ఆలోచించిన టీడీపీ నేతలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాము చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పినా మహిళలు వినకపోవడంతో చివరకు బాలకృష్ణ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.

ఇది కూడా చదవండి: కోటా వినుత డ్రైవర్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement