hindupuram
-
దారి దోపిడీ కేసులో ‘పురం’ టీడీపీ నాయకుడు అరెస్టు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలో దారి దోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నాయకుడు సడ్లపల్లి నాగరాజు, మరో ముగ్గురు అతడి అనుచరులు గంగాధర్, శివకుమార్, వెంకటేష్‌ను హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం డీఎస్పీ మహేష్ వివరాలు వెల్లడించారు. ఇటీవల బైక్‌పై ఓ చిరు వ్యాపారి ఒంటరిగా వెళుతున్న సమయంలో నాగరాజు, అతని అనుచరులు దౌర్జన్యంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతని అకౌంట్లోని రూ.33 వేలు ఫోన్‌పే ద్వారా వారి ఖాతాలకు జమ చేసుకున్నారు.ఈ విషయంపై బాధితుడు హిందూపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి.. సడ్లపల్లి నాగరాజు,అతని అనుచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.33 వేలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో..దారిదోపిడీ కేసులో అరెస్టయిన టీడీపీ నాయకుడు నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా పలుమార్లు మంత్రి లోకేశ్‌ను కూడా కలిశాడు. -
హిందూపురంలో నీ బావమరిదిని పెట్టినా గెలిచింది ఆరు!
-
హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ కుట్ర రాజకీయాలు
-
పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
-
హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ కుట్ర రాజకీయాలు
-
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న బాలకృష్ణ
-
బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం
-
బాలయ్య ఇలాకాలో మామా ఏక్ పెగ్గులా..
-
బాలకృష్ణ ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం
-
టీడీపీ దిగజారుడు రాజకీయం బాలకృష్ణ డైరెక్షన్ లో కౌన్సిలర్లకు ఎర
-
వేర్ ఈజ్ పోలీస్ ప్రభుత్వం?
సాక్షి, అమరావతి/ సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగ అరాచకం రాష్ట్రంలో విశృంఖలంగా సాగిపోతోంది. అమాయకులను వేధింపులకు గురిచేస్తూ, నేరగాళ్లకు అండగా నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోంది. గత 4 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరాచకాలే ఇందుకు నిదర్శనం. తాజాగా దసరా రోజున శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్త, కోడలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆగంతకులకు టీడీపీ సర్కార్ కొమ్ముకాస్తూ.. కేసును పక్కదారి పట్టించేందుకూ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే దారుణం జరిగి మూడు రోజులైనా పోలీసులు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైపెచ్చు ఈ ముఠాక నాయకుడైన యువకుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. టీడీపీ నేతలు పెంచి పోషిస్తున్న ఈ నేరగాళ్ల ముఠాకు పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన కుటుంబం బలైపోయింది. ఓ పేపర్ మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి, కొడుకుపై వారి ఇంటి ఎదుటే దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వాచ్‌మేన్ భార్య, కోడలిని బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆత్తా కోడళ్లను బలవంతంగా ఎత్తుకుపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా, ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిందుతలకు ప్రభుత్వ వత్తాసును స్పష్టంచేస్తున్నాయి. ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని సీసీ టీవీ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. వారిలో అయిదుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆ ముఠాకు నాయకుడిగా ఉన్న యువకుడిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలీ రాష్ట్రంలో పోలీసులున్నారా.. ప్రభుత్వముందా అంటూ ప్రజలు, విపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.బాధితులను పరామర్శించేందుకు అనుమతినివ్వని పోలీసులు అత్యాచార బాధితులను కలిసేందుకు ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం అనుమతించడంలేదు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించినా పోలీసులు సమ్మతించలేదు. బాధితులను కలిసేందుకు ఎవరినీ అనుమతించడంలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులపై ఒత్తిడి తెచ్చి, నిజాలకు పాతరేసి, కేసును పక్కదారి పట్టించాలన్న ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఇతరులెవ్వరూ బాధితులను కలిసేందుకు అనుమతించడంలేదు. ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు బాధితులను కలసి మాట్లాడితే వారు వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉన్నందునే ఎవర్నీ అనుమతించడం లేదన్నది సుస్పష్టం.రాష్ట్రమంతా ఇదే దారుణకాండచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాపంగా మహిళలు, యువతులపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ బాలికను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది జరిగి నాలుగు నెలలైనా ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా ఆమె తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. ఇక పుంగనూరులో ఇటీవల ఓ ముస్లిం బాలికను అపహరించి హత్య చేశారు. తమ బిడ్డను ఎవరో అపహరించుకుపోయారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అయిదు రోజులు పోలీసులు కాలయాపన చేశారు తప్ప, ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. నిత్యం బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, అరాచకాలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమేలేదు.వేర్ ఈజ్ ఎమ్మెల్యే బాలకృష్ణనందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో విలన్ ఓ మహిళా అధికారిని ఆమె కుమారుడి ఎదుటే అత్యాచారం చేస్తారు. ఆ సినిమాలో హీరో పాత్రధారి బాలకృష్ణ ఆ విలన్‌ను చంపి శిక్షిస్తాడు. అంతేకాదు.. మహిళల ఔన్యత్యాన్ని కీర్తిస్తూ భారీ డైలాగులు చెబుతారు.. కట్ చేస్తే.. అదే హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆగంతకులు అత్త, కోడలిపై వారి ఇంట్లోనే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తన నియోజకవర్గంలోనే జరిగిన ఈ ఘోరంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించనే లేదు. కనీసం పోలీసులతో మాట్లాడి నిందితులను వెంటన అరెస్ట్ చేయమని ఆదేశించనూ లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనూ లేదు. సినిమా షూటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే హిందూపూర్ ప్రజలే కాదు.. యావత్ రాష్ట్రం ‘వేర్ ఈజ్ పోలీస్.. వేర్ ఈజ్ ప్రభుత్వం.. వేర్ ఈజ్ బాలకృష్ణ’ అని ప్రశ్నిస్తోంది. -
‘ముఖ్య’ నేత మాటే ఫైనల్.. మాఫియాదే రాజ్యం
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం మాఫియా దోపిడీకి కూటమి ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ హయాంలో సీసాలో బంధించి బిరడా బిగించి పాతరేసిన సిండికేట్ భూతాన్ని వెలికితీసి మళ్లీ రాష్ట్రంపైకి వదిలిపెట్టింది. ప్రైవేట్ మద్యం దుకాణాల ముసుగులో టీడీపీ సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచింది. ప్రభుత్వ ‘ముఖ్య’నేత పక్కా పన్నాగంతో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగి సిండికేట్ దందాను యథేచ్ఛగా సాగించారు. లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్సుల కేటాయింపు విధానాన్ని ప్రహసనంగా మార్చేసి ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా బెదిరింపులతో బెంబేలెత్తించారు. లాటరీ ముసుగులో 80 శాతం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న టీడీపీ సిండికేట్.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందిన వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేసి వాటిని సైతం హస్తగతం చేసుకునేందుకు దౌర్జన్యాలకు తెగబడుతోంది.80 శాతం ఏకపక్షం.. 20 శాతం కబ్జా– ఇదీ టీడీపీ సిండికేట్ దందా...ఊహించిందే జరిగింది..! రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేటే దక్కించుకుంది. 80 శాతం దుకాణాలకు ఇతరుల నుంచి పోటీ లేకుండా అడ్డుకుని ‘లాటరీ’ ముసుగులో ఏకపక్షంగా హస్తగతం చేసుకోగా.. మిగిలిన 20 శాతం దుకాణాల లైసెన్సులు పొందినవారిని బెదిరించి మరీ కబ్జా చేశారు. టీడీపీ మద్యం సిండికేట్ దందాకు అధికార యంత్రాంగం జీ హుజూర్ అనడంతో రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. టీడీపీ ప్రజాప్రతినిధుల సిండికేట్ మొత్తం లాటరీ ప్రక్రియను తమకు అనుకూలంగా హైజాక్ చేసింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు నామినేట్ చేసిన వారి కనుసన్నల్లోనే అధికారులు లాటరీ ప్రక్రియను నిర్వహించి తతంగాన్ని ముగించారు. కూటమి ఎమ్మెల్యేల వర్గీయులు ముందుగానే లాటరీ నిర్వహించే ప్రాంగణాల్లో భారీ సంఖ్యలోతిష్ట వేసి అంతా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే వర్గీయులు చెప్పింది చేసే కీలుబొమ్మలుగా మిగిలిపోయారు. దాంతో ‘లాటరీ విధానం’లో 80 శాతం మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కు దక్కాయి. కొన్ని చోట్ల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఇతరులు చివరి నిమిషం వరకు అజ్ఞాతంలో ఉండి లాటరీ సమయానికి వచ్చారు. అలాంటి వారికి 20 శాతం మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దాంతో ఉలిక్కిపడ్డ టీడీపీ సిండికేట్ వారి గురించి ఆరా తీసి లాటరీ ప్రాంగణంలోనే బహిరంగంగా బెదిరించింది. మద్యం దుకాణాలను వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించింది. కాదు కూడదు.. నిర్వహిస్తామంటే తమకు 50 శాతం వాటాగానీ ఆదాయంలో 30 శాతం కమీషన్‌గానీ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందుకు సమ్మతించకుంటే మద్యం దుకాణం కూడా తెరవలేరని.. తరువాత పరిణామాలతో తమకు సంబంధం లేదని హెచ్చరికలు జారీ చేసింది. ఇలా మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టింది.డీల్ సెట్.. సిండికేట్‌కు పచ్చజెండాప్రభుత్వ ‘ముఖ్య’నేతతో డీల్ కుదరడంతోనే టీడీపీ మద్యం సిండికేట్‌కు ఏకపక్షంగా లైసెన్సులు దక్కాయి. అందుకే యావత్ అధికార యంత్రాంగం సిండికేట్‌కు సహకరించింది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.10 అధికంగా... వాటికి అనుబంధంగా నెలకొల్పనున్న బెల్ట్ దుకాణాల్లో ఎంఆర్పీ కంటే రూ.25 చొప్పున అధికంగా విక్రయించేందుకు ‘ముఖ్య’నేత అనుమతించారు. అందుకుగాను ఒక్కో బాటిల్‌పై ఆయనకు రూ.3 చొప్పున కమీషన్ చెల్లించేందుకు సిండికేట్ సమ్మతించింది. మరోవైపు డిస్టిలరీలు కూడా ‘ముఖ్య’నేతకు 20 శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలో మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. మొత్తం 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు గతంలో 1995–2004, 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులు జారీ చేశాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు భారీ లాభాలు తెచ్చిపెట్టేందుకు, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం త్వరలో పర్మిట్ రూమ్‌లకు అనుమతించడంతోపాటు అనధికారికంగా దాదాపు 50 వేల బెల్ట్ దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగి డిస్టిలరీ యాజమాన్యాలకు లాభాల పంట పండనుంది. అందుకు ప్రతిఫలంగా డిస్టిలరీలు తమ ఆదాయంలో 20 శాతం ‘ముఖ్య’నేతకు కమీషన్ రూపంలో కప్పం చెల్లించేందుకు సమ్మతించాయి. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అడ్డగోలుగా వ్యవహరించి టీడీపీ మద్యం సిండికేట్‌కు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులు దక్కేలా చేసింది.345 దుకాణాలు మహిళలకే...రాష్ట్రంలో 345 దుకాణాల లైసెన్సులు మహిళల పేరిట దక్కించుకున్నారు. మొత్తం మద్యం దుకాణాల్లో 10.2 శాతం మహిళలకు దక్కాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 31 మంది మహిళలకు లైసెన్సులు కేటాయించగా అనకాపల్లి జిల్లాలో 25 మందికి, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో 24 మంది చొప్పున మహిళలకు లైసెన్సులు లభించాయి.రెండేళ్లలో రూ.6,384 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల ప్రక్రియను ఎక్సైజ్ శాఖ సోమవారం ముగించింది. ఈ నెల 16వతేదీ నుంచి కొత్త మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం కొత్త విధానం ద్వారా ప్రభుత్వానికి 2024–26లో ఏకంగా రూ.6,384 కోట్ల ఆదాయం లభించనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా 2017–19లో వచ్చిన ఆదాయం కంటే ఇది 349 శాతం అధికం కావడం గమనార్హం. 2017–19లో రూ.1,422 కోట్లు ఆదాయం రాగా 2024–26లో రూ.6,384 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎకైŠస్జ్ శాఖ తాజాగా ప్రకటించింది. అందులో రూ.1,798 కోట్లు కేవలం దరఖాస్తు ఫీజుల రూపంలోనే వచ్చింది.ఇతర రాష్ట్రాలవారికీ లైసెన్సులు..శ్రీకాకుళం జిల్లాలో ఐదు మద్యం దుకాణాల లైసెన్సులను ఒడిశాకు చెందినవారు దక్కించుకున్నారు. మరోవైపు ఢిల్లీకి చెందిన నందినీ గోయల్, సారికా గోయల్, సౌరబ్ గోయల్ విశాఖపట్నం జిల్లాలో 155 షాపులకు దరఖాస్తులు చేయగా వారికి ఆరు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారికి మచిలీపట్నంలో రెండు దుకాణాల లైసెన్సులు లభించాయి. యూపీకి చెందిన ఇద్దరు మహిళలు నందిని, మంజు రాణికి రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో రెండు షాపులు లాటరీలో దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గవరపు సరస్వతికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో ఒక షాపు లాటరీలో తగిలింది.అంతా సిండికేట్ ఇష్టారాజ్యం..రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు, సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా హస్తగతం చేసుకున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవీ..అచ్చెన్నదే హవా..మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లలో చక్రం తిప్పారు. జిల్లాలో దాదాపు అన్ని లైసెన్సులు అచ్చెన్న వర్గం చెప్పినవారికే దక్కడం గమనార్హం. మంత్రి అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరాపు పుష్పలతకు పోలాకిలోని 81 నెంబర్ దుకాణం, కోటబొమ్మాళిలోని 113 నెంబర్ దుకాణం, జలుమూరులోని 121 నెంబర్ దుకాణం దక్కాయి. మరికొన్ని దుకాణాలను అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్ అనుచరులు సదాశివుని రాంబాబు(120), సాహుకారి ఝాన్సీరాణి(122), మెండ మోహనరావు(123), అంధవరపు బాలరాజు(98), రత్నాల గణేష్ చౌదరి(99), కె.కె.రామయ్య(101,102), మండల రమణబాబు(104), డొంకాన మోహన్‌రావు(103), బొడ్డేపల్లి నాగవల్లి(116), పల్లి శ్రీనివాసరావు(115), బొంగు అప్పారావు(118), బొంగు దేవి(119), కూశెట్టి మోహనరావు(105), పైడిశెట్టి సంతోష్‌కుమార్(109), బెండి అరుణ్‌కుమార్(110), పులి గణపతి(111), టి.వీరాంజనేయులు(112), కొట్టి మల్లేష్(114)లకు మద్యం దుకాణాలు కేటాయించారు. ⇒ నరసన్నపేట టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోడలు భైరి మోహినికి 74 నెంబర్ దుకాణం, మరదలి కుమారుడు ధర్మాన రామప్రసాద్కు 71,72 నెంబర్ల దుకాణాలు దక్కగా... వియ్యంకుడు గుండ ఏలేశ్వరరావుకు 77, 78 నెంబర్ల దుకాణాలు లభించాయి.⇒ జనసేన నేత డాక్టర్ దానేటి శ్రీధర్ భార్య రాధారాణికి బూర్జ మండలంలోని 40వ నెంబర్ దుకాణం దక్కింది.విశాఖలో పచ్చదండు పాగా..విశాఖపట్నం జిల్లాలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్ మద్యం సిండికేట్‌కు నేతృత్వం వహించారు. వారి ఆధ్వర్యంలోని జనప్రియ, పుష్కరిణి సిండికేట్లకే దాదాపు అన్ని మద్యం దుకాణాల లైసెన్సులు దక్కడం గమనార్హం.⇒ అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ఆయన వియ్యంకుడు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోదరుడు, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సులను దక్కించుకుంది. నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, పాయకారావుపేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మద్యం దుకాణాలను ఈ సిండికేట్ హస్తగతం చేసుకుంది. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీడీపీకి చెందిన గిరిజనేతర నేతలు గిరిజనుల హక్కులను కాలరాశారు. జిల్లాలో 40 మద్యం దుకాణాలను గిరిజనులకే కేటాయించగా... గిరిజనులను బినామీలుగా చేసి టీడీపీ గిరిజనేతర నేతలు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. నర్సీపట్నం కేంద్రంగా టీడీపీ వర్గీయులే ఆ 40 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం గమనార్హం. ⇒ విజయనగరం జిల్లాలో నోటిఫై చేసిన 153 మద్యం దుకాణాలకు 5,237 దరఖాస్తులు దాఖలయ్యాయి. టీడీపీ నాయకులు, వారి బినామీలే షాపులను దక్కించుకున్నారు.అధికార పార్టీ అరాచకాలు⇒ వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఓ ప్రైవేట్ చానల్ అధిపతికి లాటరీ ద్వారా కమలాపురం నియోజకవర్గంలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి వర్గీయులు మండిపడ్డారు. ఆ చానల్ ప్రతినిధులను పిలిపించి బెదిరించారు. తమకు 50 శాతం వాటా ఇస్తేనే దుకాణాలు నిర్వహించుకోగలరని హెచ్చరించారు. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి స్వయంగా పలువురికి ఫోన్లు చేసి బెదిరించినట్లు సమాచారం. కడపలో లాటరీ ద్వారా దుకాణాలు దక్కించుకున్న వారంతా తన వద్దకు రావాలని.. తనకు 50 శాతం వాటాగానీ 30 శాతం కమీషన్‌గానీ ఇవ్వాలని తేల్చిచెప్పారు. లేదంటే ఒక్కరు కూడా మద్యం దుకాణాన్ని నిర్వహించలేరని బెదిరించినట్లు తెలుస్తోంది.⇒ అన్నమయ్య జిల్లాలో మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి సోదరుడు రాహుల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్‌రెడ్డి బంధువు కిరణ్, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సానపురెడ్డి సుజతోపాటు టీడీపీ సిండికేట్ సభ్యులే ఏకపక్షంగా లైసెన్సులు దక్కించుకున్నారు. సంబేపల్లి, కోడూరు, తంబళ్లపలత్లి, పీలేరు తదితర ప్రాంతాల్లో లాటరీ ద్వారా లైసెన్సులు పొందినవారిని పిలిపించి బెదిరిస్తున్నారు. ⇒ అనంతపురం జిల్లాల్లో టీడీపీ సిండికేట్ బెదిరింపులు యథేచ్ఛగా సాగాయి. ఆత్మకూరులో షాపు నెంబర్ 35 లైసెన్స్ స్వాతి అనే యువతికి లాటరీలో దక్కడంతో పరిటాల సునీత వర్గీయులు ఆమెను తీవ్రంగా బెదిరించారు. ఆమె డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించినా అధికారులు స్వీకరించేందుకు నిరాకరించడం గమనార్హం. దాంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పరిటాల వర్గీయులకు ఆ లైసెన్సును కేటాయించారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మద్యం షాపులు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులుకు దక్కాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు ఆయన సన్నిహితుడు. ⇒ కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు 3,046 దరఖాస్తులు అందాయి. కోడుమూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లో కొత్తగా దుకాణాలు దక్కించుకున్న వారిని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ⇒ తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 125 షాపులకు లాటరీ నిర్వహించగా సింహభాగం టీడీపీ, జనసేన సిండికేట్ దక్కించుకుంది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 17 షాపులు సిండికేట్‌కు దక్కాయి. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు 5,627 దరఖాస్తులు రాగా లాటరీలో మొదట షాపు దక్కిన దరఖాస్తుదారుడు డ్రాప్ అవడంతో మరో రెండు రిజర్వు టోకెన్లు తీశారు.⇒ ఏలూరు జిల్లాలో 144 షాపులకు 5,499 దరఖాస్తులు అందాయి. ఆగిరిపల్లిలో మూడు షాపులను మంత్రి అనుచరుల సిండికేట్ దక్కించుకుంది. పోలవరం నియోజకవర్గం కుక్కునూరులో ఎస్టీ రిజర్వుడ్ కేటగిరీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌కు షాపు దక్కింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 8 మంది మహిళలకు వైన్‌షాపులు దక్కాయి. ⇒ కాకినాడ జిల్లాలో 155 మద్యం షాపులకు 3,332 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్తిపాడు స్టేషన్ పరిధిలోని ఒక దుకాణానికి 37 మంది పోటీ పడ్డారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసిన వారిలో 20 మంది షాపులు దక్కించుకున్నారు. ⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 182 మద్యం దుకాణాలకు 3,890 దరఖాస్తులు అందాయి. 24 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో 127 మద్యం షాపులకు 4,448 టెండర్లు దాఖలయ్యాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో షాపు దక్కించుకున్నారు. ⇒ బాపట్ల జిల్లాలో మద్యం దుకాణాలను మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలోని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పీఏకి రెండు దుకాణాలు దక్కాయి. కొండపిలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పీఏకి ఒక దుకాణం లభించింది. మార్కాపురంలో టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు రెండు దుకాణాలు, జనసేన నేత ఒక దుకాణాన్ని దక్కించుకున్నారు. దర్శి టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి 50 శాతం కప్పం చెల్లించాలని హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు.మాచర్లలో తెలంగాణ వ్యాపారి తిప్పలుతెలంగాణకు చెందిన ఓ వ్యాపారికి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెండు మద్యం దుకాణాల లైసెన్సులు దక్కాయి. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గీయులు ఆయన్ని బెదిరించడంతో తెలంగాణలోని ప్రజాప్రతినిధి ద్వారా సిఫార్సు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే 50 శాతం వాటా ఇస్తేనే సమ్మతిస్తామని జూలకంటి వర్గీయులు చెప్పడంతో ఆ వ్యాపారి సమ్మతించక తప్పలేదు. ఆ రెండు మినహా మాచర్ల నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలను ఎమ్మెల్యే జూలకంటి వర్గమే ఏకపక్షంగా దక్కించుకుంది.హిందూపురంలో కిడ్నాప్.. ధర్నాసాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో మద్యం షాపు (నం.57) లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామం వద్ద ఆందోళన నిర్వహించారు. దీనిపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సైతం చేశారు. రూ.15 లక్షలు ఇస్తామని.. షాపు వదిలిపెట్టాలని రంగనాథ్‌ను బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. అయితే ఆడియో రికార్డింగ్ లీక్ కావడంతో వెనక్కి తగ్గిన కిడ్నాపర్లు రంగనాథ్‌ను వదిలేశారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అనంతరం రంగనాథ్ పోలీసులతో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల కనుసన్నల్లోనే మద్యం దరఖాస్తుల ప్రక్రియ సాగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పచ్చబ్యాచ్ ఆగడాలు.. లిక్కర్ షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పచ్చబ్యాచ్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. హిందూపురం నియోజకవర్గంలో దౌర్జన్యానికి దిగారు. మద్యం షాపును దక్కించుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేశారు. లేపాక్షి మద్యం షాపును లాటరీలో దక్కించుకున్న రంగనాథ్‌ను.. లాటరీ ఫలితం వచ్చిన వెంటనే టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రంగనాథ్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు టెండర్ వేసే ప్రక్రియ మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు.. వారి పీఏలు, అనుచరుల కనుసన్నల్లోనే జరిగింది. ప్రతి దుకాణం తమకు, తమ అనుచరులు చెప్పిన వారికే దక్కే విధంగా టీడీపీ నేతలు ముందస్తు ప్లాన్ చేశారు. దీంతో ఆరంభం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలా చోట్ల సింగిల్ డిజిట్లో దరఖాస్తులు ఉండటం గమనార్హం.జిల్లా వ్యాప్తంగా 87 షాపులకు 1,460 దరఖాస్తులు అందాయి. మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 80 శాతం టీడీపీ వర్గీయులకు సంబంధించినవే. మిగతా 20 శాతం మంది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బరిలో దిగారు. అయితే వారందరికీ ఇప్పటికే వార్నింగ్‌లు వెళ్లినట్లు తెలిసింది. ఒకవేళ లాటరీలో దుకాణం దక్కించుకున్నా వదిలి వెళ్లాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి టీడీపీ నేతలు బెదిరింపులు మొదలుపెట్టారు. ఎవరు దరఖాస్తు చేసిన ఖబడ్దార్ అంటూ ఫోన్లలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో చాలామంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు. కాగా ఆన్లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి దరఖాస్తులు చేశారు.ఇదీ చదవండి: అవినీతి కోసం వేసిన స్కెచ్ కాదా బాబూ?: వైఎస్ జగన్ -
కొడవలితో టీడీపీ నేత వీరంగం
-
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన టీడీపీ నేత
శ్రీ సత్యసాయి, సాక్షి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దాడులు ఆగటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పచ్చనేతలు దాడులతో రెచ్చిపోతున్నారు.తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత రెచ్చిపోయాడు. హిందూపురంలో కొడవలితో టీడీపీ నేత శ్రీహరి నాయుడు వీరంగం సృష్టించాడు. వినాయకుడి మండపం వద్ద డీజే పెట్టొద్దని.. పాటలు నిలిపివేయాలని గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా అక్కడి ఉన్నవారిపై దాడికి తెగబడ్డాడు.టీడీపీ నేత దాడిలో పాండురంగ అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం టీడీపీ నేత దౌర్జన్యం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: విపత్తు నిర్వహణను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ -
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతుల ఆగ్రహం
-
రెచ్చిపోతున్న బాలకృష్ణ..
-
CM Jagan In Hindupuram: మీ భూములకు జగన్ గ్యారెంటీ.. హిందూపురం సిద్ధం ప్రచారంలో జనసందోహం (ఫొటోలు)
-
కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!
-
మండుటెండను లెక్కచేయని అభిమానం...!
-
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
శ్రీసత్యసాయి, సాక్షి: చంద్రబాబు చేసేవన్నీ మాయలు.. కుట్రలు అని, ఈ 59 నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హిందూపురం అంబేద్కర్ సెంటర్లో శనివారం మధ్యాహ్నాం జరిగిన ప్రచార భేరిలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. మీ ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడం. పొరపాటున మళ్లీ చంద్రబాబుకి ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. లేచి లకలకలక అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ గుర్తుపెట్టుకోండి.దేవుడి దయతో.. ప్రజల చల్లని దీవెనలతో 58 నెలల మీ బిడ్డ పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా, ప్రతీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా రూ.2 లక్షల 70 కోట్ల వేల రూపాయలు అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీ ద్వారా బటన్లు నొక్కడం జమ చేశాడు. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?. గతంలో ఎన్నడూ లేనంతగా, రాష్ట్ర చరిత్రలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే.. 2 లక్షల 30 వేల ఉద్యోగాలిచ్చాడు. మేనిఫెస్టోలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 99 శాతం హామీలు అమలు అయ్యింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. గతంలో.. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో తీసుకొచ్చి.. తర్వాత చెత్త బుట్టలో వేస్తారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ.. మేనిఫెస్టో హామీలు నెరవేర్చి, ఇప్పుడు ఇదే మేనిఫెస్టోతో ప్రజల ఆశీస్సులు కోరుతున్న ప్రభుతం మీ బిడ్డ ప్రభుత్వమే.మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తున్నాయి. గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులతో ఇబ్బంది పడకూడదని జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. అక్కాచెల్లెమ్మలు తమ సొంత కాళ్ల మీద నిలబడేందుకు ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలు.. అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ కానుక. ఇవేవైనా గతంలో జరిగాయా?. రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పగటి పూట 9గం. ఉచిత కరెంట్.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా?స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ.. ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేస్తం, చేదోడు, లాయర్లకు లా నేస్తం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశామా?. పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతలా పట్టించుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమో. ఆరోగ్యశ్రీని ఉచితంగా రూ.25లక్షలకు విస్తరించడం, గ్రామంలోనే ఫ్యామిలీ క్లినిక్, విలేజ్ డాక్టర్, ఇంటికే సురక్ష.. ఇవేవైనా గతంలో జరిగాయా?..గతంలో ఎన్నడూ లేనివిధంగా.. ఏ గ్రామానికి వెళ్లినా సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీ, గ్రామంలో ఓ మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల సంరక్షణ కోసం దిశా యాప్.. ఇవేప్పుడైనా గతంలో చూశారా?.. ఇవన్నీ 59 నెలల పాలనలో జరిగినవి వాస్తవమా కాదా?..మరో వంక.. 75 ఏళ్ల ముసలాయన. 14 ఏళ్లు సీఎంగా చేశాను అంటాడు. మరి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటైనా ఆయన చేసిన మంచి గుర్తుకు వస్తుందా?. పిండి కొద్ది రొట్టే సామెత.. పిండి ఎక్కువ ఉంటే.. రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువైతే తగ్గుతాయి. కానీ, పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబుది అయితే తాను, తన వారు తినేయడమే స్కీమ్‌గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలన. పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు వేశారా?.. అదే మీ బిడ్డ జగన్.. ఏకంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి.. అక్కాచెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా వెళ్తున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు.చంద్రబాబు హయాంలో ఇదే డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది. దత్తపుత్రుడు, ఈనాడు, టీవీ5, వీళ్ల జన్మభూమి కమిటీల జేబుల్లోకి ఎంత పోయిందో ప్రజలు నిలదీయాలి. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అది ఎలా ఉంటుందంటే.. 2014లో చంద్రబాబు ప్రతీ ఇంటికి పంపిన మేనిఫెస్టో తెలుస్తుంది.స్వయంగా చంద్రబాబు సంతకం చేసి ముఖ్యమైన హామీలంటూ ప్రతీ ఇంటికి పంపించాడు. ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? అని హిందూపురం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రశ్నించారు(లేదు అనే సమాధానం జనం నుంచి వచ్చింది. రుణమాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణమాఫీ అన్నారు.. చేశారా?. ఇంటింటికీ ఉద్యోగం.. అది కుదరకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఇచ్చారా?. అర్హులకు 3 సెంట్ల స్థలం.. పక్కా ఇళ్లు అన్నారు. కనీసం ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. ప్రతీ నగరంలో హైటెక్ సిటీ.. సింగపూర్‌ను మించిన అభివృద్ధి అన్నారు. జరిగిందా?..మళ్లీ ఈ ముగ్గురు కలిశారు. మళ్లీ మేనిఫెస్టో అంట. మేనిఫెస్టో పేరుతో సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అంట. ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అంట. నమ్ముతారా?..మన బతుకులు బాగుపడాలన్నా. పేదల భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతి రహిత పాలన కొనసాగాలన్నా.. రెండు బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. 175కి 175.. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు.. ఒక్కటి కూడా తగ్గేది లేదు.. సిద్ధమేనా?..(సిద్ధం అనే బదులు ప్రజల నుంచి వచ్చింది). మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి. ఈ విషయాల్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలి. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మీలో ఒకరైన.. మీ బీసీ కులానికి చెందిన దీపిక నిల్చుంది. గెలిపిస్తే.. ఎప్పుడూ మీ దగ్గరే, మీతోనే ఉంటుంది. ఇంకా చాలా మంచి చేయిస్తా. ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత.. అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది.. ఓటేసి గెలిపించాలని సీఎం జగన్ కోరారు. ఎండను లెక్క చేయకుండా నాపై ఆప్యాయతను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అనిరాజకీయాలు దిగజారిపోయాయి. భయంకరమైన అబద్ధాలు చూస్తున్నాం. ఇదే చంద్రబాబు తన మనుషులతో అవ్వాతాతలకు వలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటికి రాకుండా చేశారు. ఆ అవ్వాతాతలు తిట్టుకుంటుంటే.. ఆ నెపాన్ని ప్రభుత్వం మీద నెట్టే యత్నం చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. ఈ మధ్య ఇంకో అబద్ధం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారు. మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదు. దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు అసలు నువ్వు మనిషివేనా?. అసలు ఆ చట్టం ఏంటో చంద్రబాబు తెలుసుకోవాలి. భూమిమీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుంది. భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. కానీ, అలా ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదు. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తైన తర్వాత ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇలా ఇచ్చే ల్యాండ్ లైటిల్స్కు ఇన్సూరెన్స్కూడా చేస్తుంది. రైతులు తరఫున, భూ యజమానుల తరఫున ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది, వారి పక్షాన నిలబడుతుంది. ఇది చేయాలంటే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి కావాలి. బ్రిటీష్ కాలం తర్వాత.. ఇప్పుడు వందేళ్ల తర్వాత మీ బిడ్డ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎకరాను సర్వే చేయిస్తున్నాడు. సరిహద్దు రాళ్లు పెడుతున్నాం.. రికార్డులన్నీ అప్డేట్ చేస్తున్నాం. సబ్ డివిజన్ చేస్తున్నాం. రైతన్నలకే పదిలంగా హక్కు పత్రాలు పంపిణీచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రెవెన్యూ గ్రామాలు…. ఉన్నాయి. ఇప్పటివరకు 6 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి అయ్యింది. రాబోయే రోజుల్లో పూర్తిగా 17 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తాం. అప్పుడు ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ల భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. పూర్తి హక్కులతో రికార్డ్స్ అప్డేట్ అవుతాయి, సబ్ డివిజన్లు కూడా అవుతాయి. ఆ తర్వాత రైతులకు ఇచ్చే సంపూర్ణ హక్కులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.ఇంకో అబద్ధం.. ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది. పత్రాలల్లో తప్పులు ఉండకూడదని ఆన్లైన్లో అందుబాటులోకి ఫార్మాట్ తీసుకొచ్చాం. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతోంది.కాబట్టి చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చెబుతున్నారు. ఇవన్నీ నమ్మొద్దు. మోసపోవద్దు. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే.. మీరు మీ బిడ్డకు సైనికులుగా నిలవండి అంటూ సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
-
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
-
జగన్ పాటకే భయపడ్డారు!
హిందూపురం అర్బన్: ప్రజాభిమానం మెండుగా ఉన్న వైఎస్ జగన్ పేరు చెబితేనే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ‘భళి రా.. భళి భళి రా..భళి రా..పులివెందులలో పుట్టింది పులి రా’ అంటూ జనం వైఎస్సార్ సీపీ జెండా పట్టుకుని ఆనందంతో నృత్యాలు చేస్తుంటే టీడీపీ నాయకులు చూసి తట్టుకోలేక ఘర్షణకు దిగుతున్నారు. ఈక్రమంలోనే ముద్దిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తించారు. గురువారం బాలకృష్ణ సతీమణి వసుంధర ముద్దిరెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహించారు. అదే సమయంలో అక్కడే వైఎస్సార్ సీపీ ప్రచార జీపు కూడా ఉంది. అందులో జగన్ పాటలు వినిపిస్తుండటంతో పచ్చమూకలు రెచ్చిపోయాయి. జగన్ పాటలు ఎందుకు పెట్టారంటూ దౌర్జన్యానికి దిగారు. స్థానికులు నచ్చ జెప్పటంతో అప్పటికి వెనుతిరిగారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు అక్కడ గుమికూడటంతో.. వైఎస్సార్సీపీ నాయకులూ అక్కడికి చేరుకున్నారు. ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం అవసరం లేదని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతుండగానే... టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. వైఎస్సార్ సీపీ నాయకులు లోకేష్, నాగభూషన్రెడ్డి, నవీన్, బాబు, అసీఫ్‌లపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో లోకేష్‌తో పాటు బాబు, నవీన్‌లకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో టీడీపీ నేతలు కూడా దాడిలో తమకూ గాయాలయ్యాయని ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలోనూ ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభం కాగా, పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు దాడులకు తెగబడిన టీడీపీ నేతలపై వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నేతలూ ఫిర్యాదు చేశారు. -
నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
బాలకృష్ణను ఓడించి జగనన్నకు గిఫ్ట్ ఇస్తా
-
కూటమిలో వేరు కుంపట్లు
సాక్షి, పుట్టపర్తి: జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు.. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జనసేన కార్యకర్తలూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల పెద్దలు కలుసుకునేందుకు మాత్రమే కూటమి వేదికగా మారినట్లు స్పష్టమవుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరికి వారు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో వేరు కుంపట్లు ఉంటాయని చెబుతున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు నుంచి వరదాపురం సూరి? బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి కూడా నిరాశే ఎదురైంది. బీజేపీ అధిష్టానం ధర్మవరం టికెట్‌ను వై. సత్యకుమార్‌కు ఖరారు చేసింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని భావిస్తున్న సూరి తనకు టికెట్ రాకుండా టీడీపీ అధిష్టానం వద్ద అడ్డుపుల్లలు వేసిన పరిటాల కుటుంబ సభ్యులను ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ‘స్వతంత్రం’గా పరిపూర్ణానందస్వామి.. హిందూపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేస్తానని రెండు నెలలుగా పరిపూర్ణానందస్వామి ప్రచారం చేసుకున్నారు. అయితే, కూటమిలో భాగంగా టీడీపీ నేత బీకే పార్థసారథికి ఆ ఎంపీ టికెట్ ఖరారుచేశారు. కానీ, పరిపూర్ణానందస్వామి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని.. కార్యకర్తలు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ–జనసేన తనను మోసం చేశాయని ఆయన మండిపడుతున్నారు. ప్రచారానికి శ్రీరామ్ దూరం? ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ప్రచారం చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. రాప్తాడులో పరిటాల సునీత గెలుపు కోసం బిజీబిజీగా గడపాల్సి ఉందని.. ఇతర పార్టీ నేతల గెలుపు కోసం తానెందుకు సమయం వృథా చేసుకోవాలని తన అనుచరుల వద్ద శ్రీరామ్ చర్చించినట్లు సమాచారం. అలాగే.. జనసేన నేత చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా సత్యకుమార్‌కు మద్దతిచ్చే పరిస్థితి కనిపించలేదు. కదిరిలో అంటీముట్టనట్లుగా విష్ణు.. ఇక కూటమి నిర్ణయాలు తనను నిరాశపరిచాయని కదిరి బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో కదిరిలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయకపోవచ్చని సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి.. అక్కడ బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీకి సహాయ నిరాకరణ.. కలిసి పోటీచేయాలన్న లక్ష్యంతో టీడీపీ–బీజేపీ –జనసేన కూటమిగా ఏర్పడినా.. పుట్టపర్తిలో మాత్రం ఆ దిశగా ఆయా నాయకులు ముందుకెళ్లడంలేదు. అక్కడ జనసేన నాయకుల అడ్రస్‌లేదు. బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారో కనిపించని పరిస్థితి. కేవలం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నుంచి ఉద్యోగం మాదిరిగా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నట్లు ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు. -
హిందూపురం అభ్యర్థి దీపికా సవాల్
-
పచ్చ నేతల ప్రలోభ పర్వం
హిందూపురం అర్బన్/చిలమత్తూరు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రలోభాలకు తెరతీశారు. స్థానిక నేతల ద్వారా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. క్లస్టర్, బూత్ లెవెల్ కన్వీనర్ల కనుసన్నల్లో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అయితే, చాలాచోట్ల ప్రజల నుంచి వారికి చుక్కెదురవుతోంది. చిలమత్తూరు మండలంలోని అప్పనపల్లిలో శనివారం రాత్రి టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి చీరలు పంపిణీ చేస్తుండగా... సుధాకర్ అనే రైతు వారికి చీవాట్లు పెట్టాడు. ‘ఏమి చేశారని మాకు చీరలు ఇచ్చేందుకు వస్తున్నారు? ఏదైనా మంచి చేసి అప్పుడు పంపిణీ చేయండి. ఎన్నికలు వస్తేనే చీరలు పంచుతారా?! ఇదొక్కటి చేస్తే ఓట్లు పడవు. మంచి చేసిన వారికే ప్రజలు ఓట్లు వేస్తారు. మీలాంటి వాళ్లకు కాదు’ అని ఆయన చురకలు అంటించారు. దీంతో వారు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. రాత్రికి రాత్రే పంపిణీ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రాత్రిపూట చీరల పంపిణీ చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే చీరలు పంచేందుకు ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే మొదలుపెట్టారు. ఈసారి మహిళా ఓట్లు పడవని నిర్ధారణకు వచ్చారో ఏమో తెలియదు కానీ హిందూపురం రూరల్, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో క్లస్టర్, బూత్ కనీ్వనర్ల కనుసన్నల్లో మహిళా ఓటర్లకు చీరల పంపిణీ కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 2,46,463 మంది ఓటర్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లు 1,22,471 మంది ఉన్నారు. ఇందులో లక్ష మందికైనా చీరలు పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటోతో ఉన్న బ్యాగులో చీరలు ఉంచి మహిళలకు అందిస్తున్నారు. నాలుగు రోజులుగా ఈ పంపిణీ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే లేపాక్షి మండలంలోని తిలక్ నగర్, నాయనపల్లి, లేపాక్షి, కంచిసముద్రం, చోళసముద్రం, హిందూపురం రూరల్ మండలంలోని బేవనహళ్లి, చౌళూరు, మనేసముద్రం, చిలమత్తూరు మండలంలో సోమఘట్ట, చాగలేరు, కోడూరు, చిలమత్తూరు, దేమకేతేపల్లిలో పంపిణీ పూర్తి చేశారు. టేకులోడు, తుమ్మలకుంట, వీరాపురంలో రెండు రోజుల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈసారి నందమూరివారి కంచుకోట బద్ధలవ్వడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన బాలకృష్ణ పీఏలు ఈ సమాచారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో తప్పనిసరి పరిస్థితులలో చీరలు పంపిణీ చేసి మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాఫలించవని ప్రజలు అంటున్నారు. -
కుప్పంలో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయం: పెద్దిరెడ్డి
-
హిందూపురంలో బాలకృష్ణకు షాక్..
-
బడుగుల కల సాకారం
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బుధవారం సామాజిక సాధికార బస్సు యాత్ర ఓ ఉత్సవంలా సాగింది. అశేష జనవాహిని మధ్య పండగ వాతావరణంలో బస్సు యాత్ర జరిగింది. ఈ యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును కీర్తిస్తూ ముందుకు సాగారు. సాయంత్రం హిందూపురం అంబేడ్కర్ కూడలిలో అశేష జనవాహిని మధ్య జరిగిన సభలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో సామాజిక న్యాయం నెలకొన్న తీరును వివరించారు. బడుగుల కల సాకారం చేసిన సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రాష్ట్రంలో సామాజిక సాధికారతను సాధించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ బడుగుల కలను సాకారం చేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయినా, వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకున్న నాయకుడు లేరన్నారు. వార్డు స్థాయి నుంచి పార్లమెంటు వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నాలుగింట మూడొంతుల ప్రాధాన్యం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని చెప్పారు. పలు సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అభివృద్ధిలోకి తెచ్చారని తెలిపారు. మైనార్టీల పట్ల చంద్రబాబుది దుర్మార్గపు బుద్ధి అని, 2009లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన అబ్దుల్ ఘనీని 2014లో పక్కనబెట్టి బాలకృష్ణకు టికెట్ ఇచ్చారని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సామాజిక సాధికార సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్వాతంత్య్రం ఇప్పుడే: మంత్రి గుమ్మనూరు జయరామ్ వైఎస్ జగన్ సీఎం అయ్యాకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. గత ఏడు దశాబ్దాలుగా ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణచివేతకు గురయ్యారని తెలిపారు. ఈసారి ఫ్యాన్ గాలికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మైండ్ బ్లాక్ కావాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకమై టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో చరిత్ర తిరగరాద్దాం: మంత్రి ఉషశ్రీ చరణ్ 40 ఏళ్లుగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి చరిత్ర తిరగరాద్దామని మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నసీఎం జగన్‌కు అందరమూ సహకరిద్దామని అన్నారు. బడ్జెట్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ఘనత జగన్‌దేనని చెప్పారు. పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ పాలన – రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య ఏపీ పాలన పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చెప్పారు. బెంగళూరు నుంచి హిందూపురం వస్తుండగా.. కొందరు వచ్చి ఏపీలో పాలన బాగుందని, వారి ప్రాంతాలను ఏపీలో కలిపేందుకు ఉద్యమం చేయాలనుకుంటున్నామని, అందుకు తన సహకారం కోరారని తెలిపారు. ఒక సీఎంకు ఇంతకంటే ఇంకేం కావాలని అన్నారు. జగన్ పాలన ఇలాగే కొనసాగితే రానున్న 20 ఏళ్లలో దేశంలోనే ఏపీ అత్యంత ధనిక రాష్ట్రంగా అవుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాలకూ అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్
-
హిందూపురం జనసేన నేత ఆకుల ఉమేష్ వీరంగం
-
టీడీపీ, జనసేన నాయకుల రౌడీయిజం
హిందూపురం: టీడీపీ, జనసేన నాయకులు పట్టణంలో రౌడీయిజానికి దిగారు. శుక్రవారం రాత్రి స్థానిక రహమత్‌పురం సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ‘చూసుకుందాం రండి’ అంటూ సవాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పెత్తందారుల పక్షాన నిలిచి పేదలపై దాడి చేస్తుండగా.. సీఎం జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నట్లు ఉన్న ఫ్లెక్సీలను వైఎస్సార్సీపీ నాయకులు పట్టణ కూడలిలో ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నాయకులు రమేష్, రఘు, దాదు, అశోక్‌తో పాటు జనసేన నాయకులు ఆకుల ఉమేష్, శేఖర్, చక్రి మరికొంత మంది గొడవకు దిగారు. వైఎస్సార్సీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో వాగ్వాదం మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందరికీ సర్దిచెబుతుండగానే.. టీడీపీ, జనసేన నాయకులు కేకలు వేస్తూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. అందరూ చూస్తుండగానే ఫ్లెక్సీలు చించి విసిరివేశారు. వారిని వారిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను పక్కకు తోసేశారు. దీంతో పోలీసులు.. జనసేన, టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గొడవలకు దిగిన టీడీపీ, జనసేన నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లా, నాయకులు లతీఫ్, కట్లబాషా, కౌన్సిలర్ అయూబ్, ఖలీల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన నిలిచి వారిని కాచుకున్నట్లుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వీరికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. ప్రశాంతమైన హిందూపురంలో రౌడీయిజం, ఘర్షణలకు దిగి భయభ్రాంతులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీన్ని సహించబోమని, ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని స్పష్టం చేశారు. -
తారకరత్న కోసం బాలయ్య కీలక నిర్ణయం.. అలా జరగకూడదంటూ!
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబాంతో పాటు అభిమానులకు తీరని లోటు. ఆ లోటును భర్తీ చేయడం ఎవరి వల్ల సాధ్య పడదు. తారకరత్న మరణంతో ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఇప్పటికే పలుసార్లు భావోద్వేగానికి గురైంది. తారకరత్నను తలుచుకుని ఎమోషనలైంది. అందరికీ అందని లోకాలకు చేరిన తారకరత్న కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసును చాటుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటీవలే తారకరత్న మరణించిన నెల రోజులు పూర్తి కావడంతో అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ బాలయ్య చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే.. కష్టసుఖాల్లో కొండంత అండగా నిలబడిన అన్నిీ తానై నడిపించారని గుర్తు చేసుకున్నారు అలేఖ్యా రెడ్డి. ఆస్పత్రికి తారకరత్న పేరు ప్రస్తుతం బాలయ్య తీసుకున్న నిర్ణయం తారకరత్న అభిమానులకు గుర్తుండిపోయేలా ఉండనుంది. తారకరత్న మనమధ్య లేకపోయినా.. ఆయన పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా బాలయ్య నిర్ణయం తీసుకుని మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని బాలయ్య అన్నారు. (ఇది చదవండి: తారకరత్న కోసం బాలయ్య ఎంతో చేశారు.. ఎమోషనల్ అయిన అలేఖ్య రెడ్డి) తన ప్రాణంగా భావించే తారకరత్న పేరు మీద గుండె జబ్బులు ఉన్న పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయించారు. అంతేకాకుండా హిందూపురంలో బాలయ్య నిర్మించిన హాస్పిటల్ బ్లాక్‌కు తారకరత్న పేరు పెట్టారు. వాటితో పాటు పేదప్రజల వైద్యం కోసం రూ.1.30 కోట్లు పెట్టి ఆపరేషన్ కోసం పరికరాలను ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి వచ్చే చిన్నపిల్లలకు ఉచితంగా భోజనం, మందులు కూడా మూడు నెలల పాటు అందించనున్నారు. తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయేలా బాలకృష్ణ తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పిట్ట కొంచెం.. ప్రతిభ ఘనం: యంగ్ గెస్ట్ ట్యాలెండ్ కిడ్‌గా చిన్నారి
సాక్షి, హిందూపురం టౌన్: తన ప్రతిభతో ఏడాది వయస్సున్న చిన్నారి ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్(ఐడబ్ల్యూఆర్)లో చోటు దక్కించుకుంది. హిందూపురం శ్రీకంఠపురంలో నివాసముంటున్న డాక్టర్ చరణ్‌కుమార్, సుష్మాల కుమార్తె జి.నైనిక వయస్సు ఏడాదే. కానీ 12 గృహోపకరణాలను, 10 జంతువులను గుర్తుపట్టడంతో పాటు 10 జంతువుల శబ్దాలనూ చేయగలదు. ఈ నేపథ్యంలో ఐడబ్ల్యూఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన చిన్నారి నైనిక ప్రతిభను వీడియోల రూపంలో పరీక్షించారు. ఇందులో చిన్నారి ఇంటిలోని 12 వస్తువులను, అలాగే 10 జంతువులను గుర్తు పట్టి వాటి శబ్దాలు చేయడంతో ‘యంగ్ గెస్ట్ ట్యాలెండ్ కిడ్’గా రికార్డును అందజేశారు. ఈ మేరకు సర్టిఫికేట్‌ను శుక్రవారం అందజేశారు. -
పరిశ్రమలకు స్వర్గధామం ఆ జిల్లా.. మూడేళ్లలోనే రూ.300 కోట్లతో 990 పరిశ్రమలు
ఇది పెనుకొండ మండలం గుడిపల్లి ఇండస్టియల్ పార్క్‌లో ఏర్పాటైన ఎస్ఆర్ఎం కంపెనీ. 2021లో దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నెలకొల్పారు. కార్ల సంబంధిత పరికరాలను రోబోల సహాయంతో తయారు చేసి కంపెనీలకు ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. ఏటా రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఈ కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా వందల సంఖ్యలో కార్మికులు లబ్ధి పొందుతున్నారు. సాక్షి, అనంతపురం: పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఉమ్మడి అనంతపురం జిల్లా స్వర్గధామంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారమందుతుండడం, పెద్ద నగరాలకు సులువుగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మూడేళ్లలోనే 900 పరిశ్రమలు.. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలోని 5 ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు కల్పించారు. వీటిల్లో పుట్టపర్తి మండలం కప్పల బండ, రాప్తాడు, ఆర్.అనంతపురం, కొటిపి గ్రామాల్లోని పార్కుల్లో 50 శాతానికి పైగా రాయితీతో పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయించారు. దీంతో గత మూడేళ్లలోనే రూ.300 కోట్ల పెట్టుబడితో 990 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఒక్క శ్రీ సత్యసాయి జిల్లాలోనే 800కి పైగా పరిశ్రమలు రూపుదిద్దుకున్నాయి. 6,200 మందికి ఉపాధి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. 990 పరిశ్రమల ద్వారా దాదాపు 6,200 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుందన్నారు. పరోక్షంగా మరో 10 వేల మందికి ఈ పరిశ్రమలు ఉపాధి కల్పిస్తున్నాయి. హిందూపురం డివిజన్ పరిధిలోని గొల్లాపురం గ్రామంలో గతేడాది రూ.7 కోట్ల పెట్టుబడితో ప్రైమ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏర్పాటు చేశారు. గృహోపకరణాలైన డోర్లు, కిటికీలతోపాటు వివిధ రకాల వస్తువులు ఇక్కడ తయారు చేస్తున్నారు. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, ముంబై తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 250 మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. పారిశ్రామిక హబ్‌ల తయారీ లక్ష్యం.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాలను పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామంగా మార్చి పారిశ్రామిక హబ్‌లుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక సంకల్పంతో సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల నుంచి సులువుగా ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక కారిడార్‌ను సైతం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు సైతం పరిశ్రమిస్తుండడంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా తమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటవుతుండడం, సమీపంలోనే ఉపాధి దొరుకుతుండడంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాల ప్రోత్సాహం పరిశ్రమలను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. భూముల కేటాయింపుతోపాటు విద్యుత్ రాయితీలను సైతం అందిస్తోంది. హిందూపురం పారిశ్రామికవాడ పరిధిలోని గొల్లాపురం, కొటిపిలో ప్రత్యేకంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే భూములను అభివృద్ధి చేశాం. మౌలిక వసతులు కల్పించాం. యువ పారిశ్రామికవేత్తలు యూనిట్ ఏర్పాటు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేక రాయితీలు కల్పిస్తాం. సద్వినియోగం చేసుకోవాలి. – మురళీమోహన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ -
వైఎస్సార్సీపీ నుంచి గోపికృష్ణ సస్పెన్షన్
సాక్షి, పుట్టపర్తి: చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో అరెస్టయిన నిందితుడు గోపీకృష్ణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ, హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ మహమ్మద్ ఇక్బాల్‌కు గోపీకృష్ణ పీఏగా వ్యవహరిస్తున్నారు. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందాయని పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: (జట్టుగా 175 సాధిద్దాం) -
హిందూపురంలో యువ వైద్యురాలు ఆత్మహత్య
హిందూపురం(అనంతపురం జిల్లా): తీవ్రమైన మానసిక ఒత్తిడిని తాళలేక ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురంలోని 1వ వార్డు కౌన్సిలర్ (వైఎస్సార్సీపీ) మల్లికార్జున కుమార్తె సుప్రియ (25) ఇటీవల కర్నూలులోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. బెంగళూరులో పీజీ కోర్సు పూర్తి చేసేందుకు ఆన్లైన్లో పోటీ పరీక్షకు సిద్ధమవుతోంది. చదవండి: రూ.25 లక్షల కట్నం.. రూ.50లక్షలతో ఘనంగా పెళ్లి.. అయినా సరిపోలే! ఈ క్రమంలో తాను ఎంపిక చేసుకున్న విభాగంలో సీటు దక్కుతుందో లేదోననే ఆందోళనతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె సోమవారం ఉదయం ఇంటి మేడపైన ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గమనించిన తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు హిందూపురం వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఫోన్ ద్వారా మల్లికార్జునను పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్లు జబీవుల్లా, బలరామిరెడ్డి, కౌన్సిలర్లు బాధితకుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. -
లాడ్జిలో ప్రియుడితో దిగిన అక్షిత.. దారుణ హత్య
సాక్షి, శ్రీసత్యసాయి: తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత మృతి కేసులో చిక్కుముడి వీడింది. ఆమెది హత్యగా తేల్చారు జిల్లా పోలీసులు. ఆమెతో పాటు ఉన్న స్నేహితుడు, ప్రియుడైన మహేష్‌వర్మ ఆమెను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. వరంగల్‌కు(ములుగు జిల్లా మంగపేటకు) చెందిన అక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కర్ణాటకలోకి చిక్‌బళ్లాపూర్ మెడికల్కాలేజీలో డీఎన్బీ (పీజీ) చేస్తోంది. అయితే అక్షిత, సంగారెడ్డి పటాన్‌చెరువుకు చెందిన మహేష్ వర్మ అనే వ్యక్తితో కలిసి తాజాగా హిందూపురంలోని ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు సాయంత్రం ఆమె చనిపోయినట్లు మహేష్ పోలీసులకు సమాచారం అందించాడు. ఇద్దరం స్నేహితులమని, మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నామని, లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని పోలీసులకు చెప్పాడు మహేష్. దీంతో స్థానికంగా అనుమానాస్పద మృతి కలకలం రేగింది. వెంటనే పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విచారణలో అతను స్నేహితుడు కాదని, ప్రియుడని తేలింది. హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న మహేష్.. అక్షితతో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. లాడ్జిలో ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అయితే.. ఆమెను ఎందుకు చంపాడనే విషయంపై ఇంకా ప్రకటన వెలువడలేదు. అక్షితకు వివాహమైందని, ఆమె భర్త వరంగల్‌లో ఆర్థోపెడిక్ వైద్యుడు కాగా, ఏడాది పాప కూడా ఉందని సమాచారం. ఇదీ చదవండి: ప్రియుడి మృతి.. ప్రియురాలి పరిస్థితి విషమం -
బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?
-
Nandamuri Balakrishna: చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన బాలయ్య
సాక్షి, సత్యసాయి జిల్లా: చంద్రబాబుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు ఫొటో లేకుండానే శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథం బస్సును బాలకృష్ణ ప్రారంభించారు. రూ.40 లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో వైద్య పరికరాలు, టెస్టింగ్ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే బస్సుపై ఎన్టీఆర్ ఫొటో మాత్రమే పెట్టడంపై టీడీపీ నేతల్లో చర్చనీయాంశమైంది. చదవండి: (‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం) -
చంద్రబాబుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఝలక్
-
హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
సాక్షి, హిందూపురం: హిందూపురం వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. ఆధునిక భవనాలు, వసతులతో కూడిన వాణిజ్య, కాయగూరల మార్కెట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల రెండో వారంలో కొత్త మార్కెట్ ప్రారంభానికి ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. వ్యాపారులను చిదిమేసిన టీడీపీ పాలకులు.. దశాబ్దాలుగా ఎందరో వ్యాపారులకు జీవనపాధి కల్పించిన మార్కెట్ సముదాయాన్ని గత టీడీపీ పాలకులు ముందు చూపు లేకుండా కూల్చేసి చిరు వ్యాపారులను రోడ్డున పడేశారు. మల్టీఫ్లస్ త్రీ ఫ్లోర్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో 2016లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి వ్యాపారులను ఖాళీ చేయించి తెల్లారిసరికే పూర్తిగా నేలమట్టం చేసేశారు. 2.24 ఎకరాల్లో రూ.100 కోట్లతో కాంప్లెక్స్‌ను రెండు బ్లాక్‌లుగా విభజించి రెండు సెల్లార్లు, హోల్‌సేల్ మండీలు, రెండో ఫ్లోర్లో కోల్డ్ స్టోరేజీలు, కాయగూరల మార్కెట్, ఆడిటోరియం, ఏసీ గోదాములు, మూడో ఫ్లోర్లో రెండు మల్టీఫ్లక్స్ థియేటర్లు నిర్మిస్తామంటూ గొప్పలకు పోయారు. చివరకు రూ.23 కోట్లతో రెండు ఫ్లోర్లలో గదుల నిర్మాణానికి అనుమతులు తీసుకుని పునాదులకే పరిమితం చేశారు. చదవండి: (ఆ కుటుంబానికి రాజకీయాల్లో ఎలాంటి మచ్చలేదు: బాలినేని) కల సాకారం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మార్కెట్ దుస్థితిని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తీసుకెళ్లారు. రోడ్డున పడ్డ వ్యాపారులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం, మున్సిపాలిటీ, గుడ్‌విల్ మొత్తం రూ.23కోట్ల నిధులతోపాటు మరో రూ.25కోట్లకు పైగా ఖర్చు చేసి ఆధునిక వసతులతో మార్కెట్ సముదాయాల నిర్మాణాలను పూర్తి చేయించారు. దీంతో పట్టణ ప్రజలు, చిరు వ్యాపారుల కల సాకారమైంది. మార్కెట్లోని చాంబర్లు 321 గదులతో సుందరంగా.. నూతనంగా నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని మూడు బ్లాక్‌లుగా విభజించారు. మొత్తం 321 గదుల నిర్మాణం పూర్తి అయింది. ‘ఏ’ బ్లాక్‌లో మొత్తం వాణిజ్య విభాగానికి సంబంధించిన గదులు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 75 షాపులు ఉండగా ఫస్ట్ ఫ్లోర్లో మరో 79 షాపులున్నాయి. ‘బీ, సీ’ బ్లాక్‌లకు సంబంధించి గ్రౌండ్‌ఫ్లోర్‌లో 99 గదులు ఉండగా, ఫస్ట్‌ఫ్లోర్‌లో మరో 68 గదులు ఉన్నాయి. వందలాది వాహనాలు ఒకేసారి పార్కింగ్ చేసేలా ప్రత్యేకంగా విశాలమైన సెల్లార్‌ను ఏర్పాటు చేశారు. కూరగాయల బస్తాల దిగుమతి కోసం భారీ వాహనాలు సైతం సెల్లార్లోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. మార్కెట్లోకి ప్రవేశించేందుకు చుట్టూ ఐదు గేట్లు ఏర్పాటు చేసి, సీసీ రోడ్లు వేశారు. గాం«దీసర్కిల్ వైపున ఉన్న ప్రధాన గేట్ దాటిన తర్వాత అందమైన పార్క్‌తో పాటు వివిధ ఆకృతులను ఏర్పాటు చేస్తున్నారు. 10న ప్రారంభం ఈ నెల 10వ తేదీన మార్కెట్ సముదాయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హిందూపురం వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కెట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. మార్కెట్ వల్ల నెలకు సుమారు రూ.19 లక్షల ఆదాయం మున్సిపాలిటీకి సమకూరనుంది. ఈ నిధులు పట్టణాభివృద్ధికి దోహదపడతాయి. – వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, హిందూపురం చాలా ఆనందంగా ఉంది టీడీపీ పాలనలో వీధిన పడ్డ కాయగూరల వ్యాపారులను ఆదుకునేలా మార్కెట్ నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలు, వ్యాపారుల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని హంగులతో మార్కెట్‌ను సిద్ధం చేశాం. – మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ సహకారం మరువలేం ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు గత మున్సిపాలిటీని ఏలిన టీడీపీ పాలకులు మాకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పాత మార్కెట్‌ను కూల్చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. అప్పటి నుంచి సరైన వ్యాపారాలు లేక కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చింది. రైతుబజార్, ఎంసీఎం మైదానంలో ఎండకు, వానాలకు నానా ఇబ్బందులు పడ్డాం. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చొరవతో మార్కెట్ నిర్మాణం వేగవంతమైంది. ఇన్నాళ్లకు మా కల నేరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. – చాంద్‌బాషా, కాయగూరల మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి, హిందూపురం -
ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏ బాలాజీకి వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విధులకు గైర్హాజరయినా ప్రతి నెలా ఠంచనుగా వేతనం ఖాతాలో వేశారు. పేకాటలో దొరికి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... చర్యలు తీసుకోకుండా అండగా నిలుస్తున్నారు. సగటు ఉద్యోగి ఏ చిన్న తప్పుచేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు... బాలాజీకి అండగా నిలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్‌కు డుమ్మా కొట్టి హాజరుతో సంబంధం లేకుండా జీతం.. వయోజన విద్య పెనుకొండ డివిజన్ సూపర్వైజర్గా పనిచేసే బాలాజీ డిప్యుటేషన్‌పై ఆరేళ్ల క్రితం బాలకృష్ణ పీఏగా నియమితులయ్యారు. అయినప్పటికీ అతను ప్రతి నెలా బాలకృష్ణ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు హాజరుపట్టిక, టూర్గైడ్ను విధిగా వయోజన విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపాలి. కానీ రెండేళ్లుగా టూర్‌గైడ్, హాజరు పట్టిక పంపకపోయినా వయోజన విద్యాశాఖ అధికారులు ప్రతి నెలా బాలాజీకి జీతం మంజూరు చేశారు. పేకాట ఆడినా చర్యలు శూన్యం.. ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ బాలాజీ టీడీపీ నాయకుడిలా వ్యవహరించేవారు. టీడీపీ కార్యక్రమాలు, ఆ పార్టీ సమాచారాన్ని నేరుగా వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ పంపేవాడు. అయినప్పటికీ అతనిపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఏడాది మార్చి 20న గౌరీబిదనూరులో పేకాట ఆడుతూ పట్టుబడగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు రిమాండ్‌కు పంపగా.. అతను బెయిల్ తెచ్చుకున్నాడు. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ... బాలాజీని సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ వయోజన విద్యాశాఖకు ఉత్తర్వులు ఇచ్చారు. బాలకృష్ణ పీఏగా రిలీవ్ చేసి వయోజన విద్యాశాఖకు సరెండర్ చేశారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు బాలాజీని సస్పెండ్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. భోజనం చేస్తుంటే కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారని... పేకాట ఆడలేదని తప్పుడు నివేదికను వయోజన విద్యాశాఖ డైరెక్టర్‌కు పంపి.. కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినా... అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, మభ్యపెట్టి చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్లు వయోజన విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. -
మళ్లీ బాలకృష్ణ పీఏగా మారిన బాలాజీ.. గృహప్రవేశమని చెప్పి ఆఫీస్‌కు డుమ్మా కొట్టి
హిందూపురం(శ్రీసత్యసాయి జిల్లా): వయోజన విద్య సూపర్వైజర్ బాలాజీ... స్వామి భక్తి చాటుకునేందుకు సెలవు చీటీ పెట్టారు. బంధువుల గృహప్రవేశమని చెప్పి కార్యాలయానికి డుమ్మా కొట్టిన ఆయన శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో కీలకంగా వ్యవహరించారు. వయోజన విద్యలో విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఆరేళ్ల క్రితం ప్రభుత్వం డిప్యుటేషన్‌పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏగా నియమించింది. అప్పటి నుంచి రాజకీయ నేత అవతారమెత్తారు. చదవండి: ‘ఆ దెబ్బకి చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయింది’ అన్నీ తానై టీడీపీ నేతలా ఆ పార్టీ కార్యక్రమాలు, ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 20వ తేదీన కర్ణాటక సరిహద్దులోని గౌరీబిదనూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో బాలాజీపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపగా... కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. దీంతో అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మార్చి 30వ తేదీన బాలాజీని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ విధుల నుంచి తప్పించి.. ఆయన మాతృశాఖ వయోజన విద్యకు సరెండర్ చేశారు. అయినప్పటికీ బాలాజీ టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో టీడీపీకి సంబంధించిన రాజకీయ పరమైన పోస్టులు, వ్యవహారాలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లాకు రాగా.. బాలాజీ మళ్లీ వ్యక్తిగత సహాయకుడిగా మారారు. దీనిపై వయోజన విద్య ఇన్చార్జ్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేష్‌ను వివరణ కోరగా... బాలాజీ శుక్రవారం సెలవు తీసుకున్నారని, గృహప్రవేశం ఉన్నట్లు సెలవు చీటీలో పేర్కొన్నారని తెలిపారు. -
అన్నను దారుణంగా చంపిన తమ్మడు
సాక్షి, హిందూపురం: అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడు రఘును ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హిందూపురం రూరల్ సీఐ హమీద్ ఖాన్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. ఈ నెల 17న పరిగి మండలం పైడేటీ గ్రామంలో అన్న మారుతీపై తమ్ముడు కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చిన విషయం విదితమే. ఘటన అనంతరం తమ్ముడు రఘు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం ధనాపురం క్రాస్ వద్ద నిందితుడు రఘును గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అన్నదమ్ములిద్దరికీ తాగుడు అలవాటు ఉంది. మద్యం మత్తులో తమ్ముడు రఘును మారుతి ఇష్టానుసారంగా తిట్టేవాడు. దీంతో అన్నపై కక్ష పెంచుకున్న రఘు అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 17న రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద రఘుతో మారుతి గొడవ పడ్డాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన రఘు ఇంటి లోపలకు వెళ్లి కిరోసిన్ తీసుకువచ్చి అన్నపై పోసి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మారుతిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 18న అతను మృతి చెందాడు. మారుతి తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత..
సాక్షి, హిందూపురం: నాగసులోచనా..నన్ను క్షమించు..! నా ఆరోగ్య విషయంలో ఎన్నో ఆస్పత్రులు తిప్పావు. వెన్ను నొప్పి తగ్గలేదు. కూర్చోడానికి, కాలు కింద పెట్టడానికీ ఇబ్బందిగా ఉంది.. బతికి ఉండి పదే పదే డాక్టర్ల వద్దకు వెళ్లలేను.. నేను బాధపడుతూ నిన్ను మరింత బాధపెట్టలేను..నీకు భారమైపోతాను.. ఇలాంటి జబ్బు ఏ ఒక్కరికీ రాకూడదు.. అందుకే రెండు నెలల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నన్ను క్షమించు..! అంటూ తన భార్యకు విశ్రాంత తహసీల్దార్ రాజశేఖర్‌శెట్టి నోట్ రాసి, తహసీల్దార్ కార్యాలయం వెనుకవైపున పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. హిందూపురం కంసాలిపేటలో నివాసం ఉంటున్న రాజశేఖర్ శెట్టి (70) రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో లేపాక్షి, హిందూపురం, మడకశిర, అమరాపురం తదితర ప్రాంతాల్లో పనిచేశాడు. పదేళ్ల క్రితం తహసీల్దార్‌గా ఉద్యోగ విరమణ చేశాడు. దీర్ఘకాలికంగా షుగరు, బ్యాక్‌బోన్, కడుపునొప్పి తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నాడు. అయినా ఫలితంలేక పోయింది. అవసాన దశలో తాను అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ సభ్యులకు భారం కాకూడదని, బెడ్ రెస్ట్‌లో పడితే తన భార్యకు మరింత భారమవుతాననుకున్నాడు. చదవండి: (దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో) జీవితంపై విరక్తి చెంది సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు రాజశేఖర్‌శెట్టి మృతి చెందినట్లు గుర్తించి, వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఇస్మాయిల్ ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య నాగసులోచన ఉన్నారు. కుమార్తె వివాహమై కర్ణాటక రాష్ట్రం కోలార్‌లో ఉంటోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
MLA Nandamuri Balakrishna Reaction on AP New Districts: పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. అయితే సత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం బాలకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని అర్హతలు హిందూపురానికి ఉన్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూములు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. హిందూపురం పట్టణ ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. చదవండి: (కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన పురందేశ్వరి) -
పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు
-
టీడీపీ చెత్త రాజకీయం.. హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హిందూపురం: డంపింగ్ యార్డు తరలింపునకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలు హిందూపురంలో ఉద్రిక్తతకు దారి తీసాయి. వివరాలు... పట్టణంలోని 21వ వార్డు మోత్కుపల్లి సమీపంలోని డంపింగ్ యార్డు సమస్యపై మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ సోమవారం రాత్రి వాట్సాప్ గ్రూపుల్లో హిందూపురం పార్లమెంట్ టీడీపీ మీడియా కో–ఆర్డినేటర్ చంద్రమోహన్ పోస్టు చేశాడు. దీనిపై 21వ వార్డు కౌన్సిలర్ మారుతీరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు గోపీకృష్ణ స్పందించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా∙మోత్కుపల్లి డంపింగ్ యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేలా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చర్యలు చేపట్టారని, త్వరలో యార్డును చిన్నగుడ్డంపల్లి వద్దకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాధానమిచ్చారు. 37 ఏళ్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈ సమస్యపై ఏమి చేశారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం పట్టించుకోలేదని కౌంటర్ వేశారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీ నేత సవాల్‌ను వైఎస్సార్సీపీ నేతలు స్వీకరించి మంగళవారం ఉదయం 11 గంటలకు చౌడేశ్వరీ కాలనీలోని బాలకృష్ణ ఇంటి వద్దకే వస్తామని ప్రకటించారు. మంగళవారం ఉదయం 10.23 గంటలకు వేదిక మారుస్తూ టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్ వాట్సాప్ గ్రూప్‌ల్లో మెసేజ్‌లు పంపారు. అప్పటికే వైఎస్సార్సీపీ నేత గోపీకృష్ణ, కౌన్సిలర్లు మారుతీరెడ్డి, శివ, తదితరులు బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు. చదవండి: (అర్హతే ప్రామాణికం) గత టీడీపీ హయాంలో హిందూపురంలో బాలకృష్ణ ఎలాంటి అభివృద్ధి చేశారో వచ్చి చెప్పాలంటూ టీడీపీ నాయకులను ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక జై బాలయ్య అంటూ టీడీపీ నేతలు నినాదాలతో వాతావరణాన్ని వేడెక్కించారు. ప్రతిగా వైఎస్సార్సీపీ నాయకులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చదవండి: (నటుడు నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు లెక్కపెట్టారో: మంత్రి పేర్ని నాని) జనవరి నుంచి కొత్త డంపింగ్ యార్డుకు చెత్త జనవరి నుంచి చిన్నగుడ్డంపల్లి వద్దకు డంపింగ్ యార్డును మార్చనున్నట్లు హిందూపురం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా మోత్కుపల్లి రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డు వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ స్పందించి పర్యావరణ శాఖ నుంచి ఎన్ఓసీ తెప్పించి ఇవ్వడంతో 2022, జనవరి నుంచి చెత్తను కొత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందు కోసం అన్ని చర్యలూ పూర్తి అయ్యాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యార్డు చుట్టూ వందలాది మొక్కలు నాటిస్తున్నట్లుగా తెలిపారు. -
‘పుష్ప’ థియేటర్ ఎదుట ఫ్యాన్స్ ఆందోళన, రాళ్లతో దాడి
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పుష్ప సినిమా థియేటర్స్‌లో దుమ్మురేపుతుంది. ఈ రోజు(డిసెంబర్ 17) పుష్ప ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు అన్ని భాషల్లో సూపర్‌హిట్ కావడం, బన్నీ- సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. విడుదలైన అన్ని ప్రాంతాల్లో పుష్ప పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప బెనిఫిట్ సో వేయలేదంటూ బన్నీ ఫ్యాన్స్ థియేటర్‌పై దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చదవండి: Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీ సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్ ఒకప్పుడు మూవీ రిలీజ్ డేకు ముందు రోజు రాత్రి బెనిఫిట్ షో వేసేవారు. ఇప్పడు చాలా చోట్ల ఈ షోని రద్దు చేశారు. కానీ తెలంగాణలోని పలు థియేటర్లో బెనిఫిట్ షోకు అనుమతి ఉండటంతో ఈ షోను వేశారు. ఇక ఏపీలో కూడా ఇటీవల బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ జీవో పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు పుష్ప రిలీజ్ సందర్భంగా ఏపీలో బెనిఫిట్ షోలు వేస్తారని ఫ్యాన్స్ అంతా ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా హిందూపురం బాలాజీ థియేటర్లో బెనిఫిట్ షో వేస్తామని చెప్పి ఆ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్.. తీరా బెనిఫిట్ షో వేయకుండ ఫ్యాన్స్‌కు మొండిచేయి చూపించింది. దీంతో డబ్బులు తీసుకొని బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన అభిమానులు థియేటర్‌పై రాళ్లు విసరి అద్దాలు పగలగొట్టారు. అంతేగాక థియేటర్ ముందు ధర్నాకు దిగి రచ్చ చేశారు. ఇక థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, థియేటర్‌ను క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం
ఒక్కగానొక్క కూతురు.. గారాబంగా పెరిగింది.. బంధుత్వంలోనే సంబంధం కుదిరింది.. భాగస్వామితో జీవితం తలచుకుని ఎన్నో కలలు కనింది.. ఐదు రోజుల్లో పెళ్లి..ఇల్లంతా సందడి.. లాంఛనాలిచ్చేందుకు వరుడి ఇంటికి తానూ వస్తానంటూ తండ్రితో కలిసి పయనమైంది.. అదే ‘చివరి పయనం’ అవుతుందని ఊహించలేకపోయింది. హిందూపురం/పరిగి: హిందూపురం సమీపంలోని మోత్కుపల్లి బ్రిడ్జి వద్ద శనివారం ద్విచక్ర వాహనాన్ని సిమెంట్ లారీ ఢీ కొనడంతో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతి అర్ధంతరంగా తనువు చాలించింది. ఆమె తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు.. హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామానికి చెందిన నరసింహమూర్తి, గంగరత్నమ్మల కుమార్తె చైతన్య(21)కు పరిగి మండలం బీచిగానిపల్లికి చెందిన బంధువుల అబ్బాయితో పెళ్లి కుదిరింది. చైతన్య డిగ్రీ పూర్తి చేసింది. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో వివాహం వైభవంగా చేయాలని తల్లిదండ్రులు భావించారు. వరుడు కూడా సమీప బంధువే కావడంతో అతని ఇంటి వద్దే సెపె్టంబరు రెండున వివాహ వేడుక జరిపించాలని నిర్ణయించారు. పెళ్లి రోజు సమీపిస్తుండడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బంధువులందరికీ పత్రికలు పంచారు. పెళ్లి కుమార్తెకు కొత్త దుస్తులు కొన్నారు. వరుడికి పెళ్లి లాంఛనాలు, దుస్తులు ఇవ్వడంతో పాటు బీచిగానిపల్లిలోనే ఉన్న బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు శనివారం నరసింహమూర్తి బయలుదేరాడు. తానూ వస్తానంటూ చైతన్య కూడా తండ్రి బైక్‌పై పయనమైంది. మోత్కుపల్లి బ్రిడ్జిపై వెళుతుండగా వెనుక నుంచి సిమెంట్ లారీ (ఏపీ 04బీడబ్ల్యూ7462) వేగంగా ఢీకొట్టింది. తండ్రీ కూతురు కింద పడిపోగా.. లారీ టైర్లు చైతన్య పైనుంచి వెAళ్లాయి. దీంతో కాళ్లు రెండూ నుజ్జునుజ్జయ్యాయి. అరగంట పాటు నరకం చూసింది. నరసింహమూర్తికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చైతన్య చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నరసింహమూర్తిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. హిందూపురం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. బాగేపల్లికి చెందిన లారీ డ్రైవర్ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: కులం నుంచి వెలివేశారని వస్తే.. ఎస్సై బూతులు తిట్టారు.. -
నడ్డి విరిచిన అధిక వడ్డీ ఆశ
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సత్యనారాయణపేటలో నివాసముంటున్న విజయలక్ష్మి చిట్టీలు నిర్వహించేది. హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్లతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది నుంచి అధిక వడ్డీ ఆశ చూపి అప్పుల రూపంలో తీసుకుంది. ఈ డబ్బుతో ఫైనాన్స్ కంపెనీ నడుపుతోంది. రూ.50 కోట్లు పోగయ్యాక ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో తాము మోసపోయామని బాధితులు టూటౌన్ పోలీసుస్టేషన్ సీఐ మన్సూరుద్దీన్‌కు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మంది ఫిర్యాదులు అందజేశారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఫిర్యాదులు అందాయి. విజయలక్ష్మి భర్త చనిపోయాడని, ఆమెకు కుమారుడు అశోక్‌కుమార్ ఉన్నాడని బాధితులు తెలిపారు. కొడుకుతో కలిసే ఆమె ఈ మోసాలకు పాల్పడిందన్నారు. విజయలక్ష్మి కుటుంబం ఎక్కడి నుంచో వచ్చి హిందూపురంలో సెటిల్ అయ్యారని చెప్పారు. హిందూపురానికి వచ్చిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఈ వ్యవహారంపై విచారణ చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం
-
ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం
సాక్షి, అనంతపురం: ఏపీలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. డీఆర్డీవో, ఎన్హెచ్ఏఐ సహకారంతో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వారం రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్‌ను మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ, కరోనా కట్టడికి సీఎం వైఎస్ జగన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో మౌలిక సదుపాయాలు పెంచుతామని మంత్రి తెలిపారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం జగన్ అన్నిచర్యలు తీసుకుంటున్నారని ఎంపీ మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడా లేదని హిందూపురంలో ఏర్పాటైన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ దేశంలోనే మొదటిదని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. చదవండి: పంటనష్టంపై చంద్రబాబు దుష్ప్రచారం: కన్నబాబు ఆనందయ్య మందు: నివేదిక సమర్పించిన టీటీడీ -
హిందూపురంలో బాలయ్యకు ఓటు దెబ్బ
సాక్షి, హిందూపురం: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే హిందూపురంలో ఏకంగా 51.51శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి అండగా నిలవడం విశేషం. ఇదే సమయంలో టీడీపీ కేవలం 30.31శాతానికే పరిమితమైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం పట్టణంలో టీడీపీకి 9,655 ఓట్ల మెజార్టీ రాగా, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 14,647 ఓట్ల మెజార్టీని కట్టబెట్టడం ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూలేని విధంగా 38 వార్డుల్లో వైఎస్సార్సీపీ 29 స్థానాలను కైవసం చేసుకోగా.. టీడీపీ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. అదేవిధంగా 10 వార్డుల్లో(1, 5, 11, 13, 15, 16, 22, 23, 24, 26వ వార్డులు) టీడీపీ మూడో స్థానానికే పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఇక్కడే మకాం వేసి ఇంటింటి ప్రచారం చేసినా, ప్రచార రథం ఎక్కి హడావుడి చేసినా.. చెంపదెబ్బలకు తాళలేకపోయిన ఓటర్లు ఆరు స్థానాలకే పరిమితం చేస్తూ ఓటుతో దెబ్బ కొట్టడం గమనార్హం. పోలైన ఓట్లు ఇలా.. హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో 78,259 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. వైఎస్సార్సీపీకి 40,310(51.51 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీకి 23,718 ఓట్లు(30.31 శాతం), బీజేపీకి 3,557(4.55 శాతం), ఎంఐఎం 4,277(5.47 శాతం) ఓట్లతో సరిపెట్టుకున్నాయి. స్వతంత్రులకు 4,617 ఓట్లు, నోటాకు 687 ఓట్లు.. సీపీఐకి 640, జనసేనకు 388, కాంగ్రెస్‌కు 38, బీఎస్పీకి 27 ఓట్లు పోలయ్యాయి. చదవండి: కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య -
వైఎస్సార్సీపీలోకి హిందూపురం మాజీ ఎమ్మెల్యే
హిందూపురం: హిందూపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత పి.రంగనాయకులు మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టీడీపీ తరఫున తొలిసారి రంగనాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో రెండోసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఆదర్శ పాలనకు ఆకర్షితులై ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్సార్సీపీలో చేరారు. రంగనాయకులు కుమారులు, అనుచరులు కూడా ఎమ్మెల్సీ సమక్షంలో పార్టీలో చేరారు. -
హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు నాలుగు మాసాల తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆయనకు తూముకుంటలో ఊహించని పరిణామం ఎదురైంది. పర్యటనలో బాలకృష్ణ ఎదుట చిన్నారులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చిన్నారులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా.. ఎమ్మెల్యే బాలకృష్ణ సూగూరు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఆయన మంత్రాలు చదివి వినిపించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా విస్తుపోయారు. చదవండి: ('చంద్రబాబు నైజం ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు') -
హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు దగ్గరగా ఉండడంతో పాటు హిందూపురానికి అనేక అనుకూలతలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇదే అంశంపై లేఖ రాశారు. హిందూపురం నియోజకవర్గంలోని మలుగూరు వద్ద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి వేర్వేరుగా లేఖలు రాశారు. -
పోలీస్ స్టేషన్లోనే మద్యం తాగిన కానిస్టేబుళ్లు
-
పోలీస్ స్టేషన్లో అడ్డంగా బుక్కైన కానిస్టేబుళ్లు
సాక్షి, అనంతపురం: హిందూపురంలో పోలీసు కానిస్టేబుళ్ల నిర్వాకం బయటపడింది. ఇద్దరు కానిస్టేబుళ్లు హిందూపురం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లోనే మద్యం తాగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కానిస్టేబుళ్లు నూర్ మహ్మద్, తిరుమలేశ్ పీఎస్‌లో మద్యం తాగి పట్టుబడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల కర్ణాటక మద్యం బాటిల్స్‌ను సీజ్ చేసి సదరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. సీజ్ చేసిన లిక్కర్‌ను ఇద్దరు కానిస్టేబుళ్లు తాగి కెమెరాలో అడ్డంగా బుక్కయ్యారు. అప్డేట్: క్రమశిక్షణా చర్యలు హిందూపురం టౌటౌన్ పోలీస్ స్టేషన్లో మద్యం తాగి పట్టుబడ్డ కానిస్టేబుళ్లపై ఎస్పీ సత్యయేసుబాబు సీరియస్ అయ్యారు. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఎస్పీ కానిస్టేబుళ్లను వీఆర్‌కు బదిలీ చేసినట్టు తెలిపారు. (తమ్ముడూ.. ఇది తగునా) -
బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదు
-
బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోవాలి..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదని గతంలో డాక్టర్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని తెలిపారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడు. ఆయన వ్యవహార శైలితో హిందూపురం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణపై అందరికీ అభిమానం ఉంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బాలకృష్ణ భుజాన మోస్తున్నారు. చంద్రబాబు చచ్చిన పాము వంటివాడు. ఏడాదిలోనే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేరు తెచ్చుకున్నారు. తొలి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టించిన ముఖ్యమంత్రి రానున్న నాలుగేళ్లలో ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో టీడీపీ నేతలు గ్రహించాలి. చంద్రబాబు జూమ్ బాబుగా మారిపోయాడు’అని కోరుముట్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. (చదవండి: బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది : ఇక్బాల్) -
హిందూపురంలో కరోనా కలకలం
హిందూపురం: హిందూపురం పట్టణంలో కరోనా అనుమానిత కేసు బుధవారం వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి దుబాయ్ నుంచి మార్చి 10వ తేదిన భారతదేశానికి వచ్చాడు. భార్య పిల్లలు హిందూపురంలోని సీపీఐ కాలనీలో పుట్టింటిలో ఉండడంతో వారిని కలిశాడు. మూడు రోజుల నుంచి అతనికి దగ్గు, గొంతు నొప్పి, జ్వరంగా ఉండడంతో కరోనా అనుమానంతో ఉందని వైద్యులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అతన్ని, భార్యను హిందూపురం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వైద్యులు చికిత్సలు అందించారు. ఇతనికి తీవ్రమైన దగ్గుతో పాటు జ్వరం ఉంది. దీంతో పాటు కరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని తక్షణం అనంతపురం పెద్దాస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారు. అలాగే అతని భార్యను కూడా విచారించగా ఆమెకు కూడా రెండు రోజులుగా ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం వస్తోందని తెలిపింది. ఇరువురిని గట్టి వైద్య భద్రతతో అనంతపురం తరలించారు. బెంగళూరు నుంచి పలువురు బంధువులు వీరిని ఇటీవల కలిసినట్లు సమాచారం. వీరు ఉన్న ఇంటిలోనే వీరి మూడేళ్ల బాబు, అత్తయ్య కూడా ఉన్నట్లు తెలిసింది. మిగతావారిని ఇంట్లో క్వారంటైన్ ఉండాలని వైద్యులు సూచించారు. కాగా కరోనా అనుమానిత వ్యక్తి హిందూపురంకు వచ్చినప్పటి నుంచి గోరంట్ల, అనంతపురం, హిందూపురం ప్రాంతాల్లో సంచరించినట్లు డాక్టర్లకు వివరించారు. ఈ అనుమానిత కేసు వెలుగుచూడడంతో పట్టణంలో ఒక్కసారిగా ప్రచారం సాగి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ
హిందూపురం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. సొంత నియోజక వర్గ కేంద్రంలోనే చేదు అనుభవం ఎదురైంది. గురువారం హిందూపురం పట్టణంలోని రహమత్‌పురం సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు బాలకృష్ణ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు తమ కార్యకర్తలతో బాలకృష్ణకు భద్రతగా తరలివచ్చారు. బాలకృష్ణ కాన్వాయ్ రహమత్‌పురం సర్కిల్ వద్దకు రాగానే నిరసనకారులు రాయలసీమకు అన్యాయం చేయవద్దంటూ శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. అయితే బాలకృష్ణ కనీసం కారు కూడా దిగకపోవడంతో ప్రజా సంఘాల నాయకులు ‘‘బాలకృష్ణ గోబ్యాక్.. సీమద్రోహి గోబ్యాక్’’ అంటూ నినదించారు. అదేతరుణంలో టీడీపీ నాయకులు బాలయ్య జిందాబాద్ అంటూ ప్రతి నినాదాలు చేస్తూ నిరసనకారులను తోసివేయడంతో కిందపడి పలువురు గాయపడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ నిరసన కారులను పక్కకు ఈడ్చేశారు. దీంతో బాలకృష్ణ కాన్వాయ్ ముందుకు సాగగా బైపాస్ క్రాస్ వరకూ నిరసన కారులు వాహనాలను వెంబడిస్తూ నిరసన తెలిపారు. అరెస్టు.. పోలీసు స్టేషన్ వద్ద నిరసన ఎమ్మెల్యే బాలకృష్ణ వాహనాన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకుల్లో కొందరిని హిందూపురం టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు గోపికృష్ణ, మలుగూరు శివన్న, పురుషోత్తంరెడ్డి, అమర్నాథ్ మాట్లాడుతూ మూడు రాజధానులతో రాయలసీమకు మేలు జరుగుతుందని తెలిసీ ఈ ప్రాంతం నుంచి అసెంబ్లీకి వెళ్లిన బాలకృష్ణ కూడా అమరావతికే మద్దతు తెలపడం ఆయన స్వార్థానికి నిదర్శనమన్నారు. మూడు దశాబ్దాలుగా నందమూరి కుటుంబీకులను గౌరవిస్తూ ఇక్కడి నుంచి అసెంబ్లీకి పంపినా ఈ ప్రాంతానికి వారు చేసిందేమీ లేదన్నారు. -
కుటుంబంతో కలపాలని..
బాధ్యతను విస్మరించి కుటుంబాన్ని గాలికి వదిలేసి ఊరూరా తిరిగి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివశంకరయ్య తాను చేసిన తప్పును జీవిత చరమాంకంలో తెలుసుకుని కుమిలిపోతున్నాడు. ఇతనికి వైద్యసేవలందింజేసి, చివరి క్షణాల్లోనైనా సంతోషంగా ఉండాలని కుటుంబ సభ్యులతో కలిపేందుకు ‘అంపశయ్యపై నాన్న’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వైద్యులు, పోలీసులు కూడా తమవంతు సహకారమందిస్తున్నారు. హిందూపురం: వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం మాసాపేటకు చెందిన శివశంకరయ్య (80) హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చక్కెరవ్యాధిగ్రస్తుడైన ఇతడు కుటుంబాన్ని వదిలి ఊరూరా తిరుగుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు. ప్రస్తుతం గాంగ్రిన్‌తో బాధపడుతున్నాడు. ఎడమకాలు పాదం పూర్తిగా కుళ్లిపోయింది. నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. పాదంలో ఏర్పడిన పుండు (గాంగ్రిన్)ను అలాగే వదిలేస్తే శరీరమంతా పాకి ప్రాణాపాయస్థితికి చేరుకునే ప్రమాదముంది. తనలాంటి దుస్థితి ఏ తండ్రికీ రాకూడదని, తాను చేసిన తప్పులకు దేవుడే శిక్ష విధించాడని పశ్చాత్తాపపడుతున్నాడు. సపర్యలు చేస్తున్నస్వచ్ఛంద సంస్థ సభ్యులు వృద్ధుడి దీన స్థితిని చూసి స్వచ్ఛంద సంస్థ సభ్యులు సపర్యలు చేస్తున్నారు. రోజూ ఉదయాన్నే అతనికి పాలు, అల్పాహారం, మధ్యాహ్నం మజ్జిగ అందిస్తున్నారు. దుర్వాసన వస్తున్న దుస్తులను మార్చి అవసరమైన సేవలందిస్తున్నారు. అతనికి వైద్యసేవలు పూర్తిగా అందించి కుటుంబానికి అప్పగించడానికి చేయూత అందిస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ముస్లిం నగరా కన్వీనర్ ఉమర్‌ఫరూక్ అంటున్నారు. ఇతను చేసింది క్షమించరాని తప్పేనని, అయితే మరణానికి చేరువలో ఉన్న క్షణంలో జన్మనిచ్చిన తండ్రికి, కట్టుకున్న భర్తకు ఎంతో కొంత అతని రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని వారి కుటుంబసభ్యులను కోరారు. మానవత్వంతో ఆపరేషన్‌కు ఏర్పాట్లు శివశంకరయ్య ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. డయాబెటిక్ విత్ గాంగ్రిన్ వ్యాధి ఇది. ఇలాగే వదిలేస్తే శరీరమంతా పాకి ప్రాణానికే ప్రమాదమని సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, సర్జన్లు డాక్టర్ శివప్రసాద్‌నాయక్, డాక్టర్ ప్రభాకర్‌నాయుడులు చెప్పారు. అంతేగాక ఇతనికీ, బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నాయని, ఆహారం సరిగా తీసుకోని కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయిందని, మరింత ఆలస్యం చేస్తే మరణించవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం ఇతని పరిíస్థితి చూసి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముందుకు రావడంతో మానవతాదృక్పతంతో ఆపరేషన్ చేసి.. చెడిపోయిన వరకు కాలు తీసేయాలని నిర్ణయించామన్నారు. ఈ విషయమై ఇతని కొడుకు కోసం ప్రయత్నం చేసినా అతను అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. రేపటిలోగా అన్ని లెవల్స్ కంట్రోల్ చేసి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఉన్న కొన్నిరోజులైనా కుటుంబ సభ్యులు చూసుకోవాలని కోరుతున్నామన్నారు. శివశంకరయ్య చేసిన తప్పులకు ఇప్పటికే చాలా అనుభవించేశాడని, కొడుకు పెద్దమనస్సుతో క్షమించి కన్నరుణం తీర్చుకోవాలని సూచించారు. -
అంపశయ్యపై నాన్న!
నేను పోతేనే ఇంట్లో అన్నం: మా పరిస్థితి దయనీయంగా ఉంది. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచి పెద్దచేసింది. నేను ఊరికి పోతేనే ఇంట్లో అన్నం వండుకుంటుంది. లేదంటే కూలి పనులకు వెళ్లిన చోట ఎవరైనా ఏదైనా పెడితే తింటుంది. లేకపోతే పస్తులుంటుంది. ఇంతకాలం మా బాగోగులు పట్టించుకోని నాన్న ఉన్నా లేనట్లే అనుకున్నాం. ఒక్క రోజు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎక్కడున్నాడో, ఏమయ్యాడో కూడా తెలియలేదు. 12 ఏళ్ల తర్వాత ఆయన దీనావస్థ నాకు కన్నీళ్లు పెట్టిస్తోంది. – ‘సాక్షి’తో కన్నీటి పర్యంతమైన శివశంకరయ్య కుమారుడు నాగేంద్ర నాన్న.. ఓ నమ్మకంతల్లి నవమాసాలుమోస్తే.. తండ్రి జీవితాన్నిస్తాడు.. చేయిపట్టి నడిపిస్తాడు..తడబడే అడుగులనుసరిచేస్తాడు..తను కరిగిపోతూ..ప్రతిరూపానికి దారి చూపుతాడు.పిల్లల కంట్లో నలుసుపడినా..ఆ తండ్రి కంట్లో సుడులు,కష్టాల్లో సుఖాల్లో..తోడూనీడ.. ఆ బంధం.ఇంట్లో దీపం పెట్టిన ఇల్లాలికిఅన్నీ తానవుతూ..ఇంట్లో వెలుగులు నింపినపిల్లలకు సర్వస్వం ధారపోసేప్రత్యక్ష దైవం తండ్రి. – ఇదీ సమాజంలో నాన్నకు నిర్వచనం ఏడడుగుల బంధం.. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెట్టిన ఇల్లాలు.భర్త చాటు భార్యగానలుగురికీ తలలో నాలుకగా..ఓ పిల్లాడికి తల్లిగా..ఈ సంతోషంఎంతో కాలం నిలువలేదు..ఎగ‘తాళి’చేసి భార్య చేయి వదిలాడు..బాధ్యత మరిచి తిరిగాడు..ఏళ్ల తరబడి ఇల్లు కాదనుకున్నాడు..జీవిత చరమాంకంలో,నా అనే పిలుపునకు నోచుకోక..అనాథలా బతుకీడుస్తున్నాడు.మృత్యువు ముంగిట రోజులు లెక్కిస్తున్నాడు. – దారి తప్పిన తండ్రి దీనావస్థ ఇది అనంతపురం, హిందూపురం: బలిజ శివశంకరయ్య.. వయస్సు 80 ఏళ్లు. సొంతూరు రాయచోటి సమీపంలోని మాసాపేట. లారీ డ్రైవర్‌గా పనిచేసే ఇతనికి సుమారు 35 ఏళ్ల క్రితం వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం చిట్లూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు సంతానం. కుమార్తె, కుమారుడు. ఇంతవరకు సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత అతను బాధ్యత మరిచిపోయాడు. మాసాపేటలో ఉండలేక భార్య ఊరికి మకాం మార్చాడు. అక్కడా ఇమడలేకపోయాడు. కుటుంబాన్ని గాలికొదిలేశాడు. తన జీవితం, తన ఇష్టమనుకున్నాడు. దొరికిన చోటల్లా అప్పులు చేసి ముఖం చాటేశాడు. అప్పటి నుంచి ఆ ఇంటి నిండా కష్టాలే. తినేందుకు తిండి లేక.. పిల్లల బాగోగులు చూసే స్థోమత కరువై ఆ ఇల్లాలు పడిన వేదన అంతాఇంతా కాదు. భర్త చాటు భార్యగా మెలిగిన ఆమెకు జీవితం శూన్యంగా కనిపించింది. ఓ వైపు ఎదిగి వస్తున్న పిల్లలు.. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేదు. కళ్ల నుంచి ఉబికి వచ్చే నీళ్లతో తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఇంటి నుంచి కాలు బయటపెట్టి బతకడం నేర్చుకుంది. కూలి పనులతో జీవనం భర్త వస్తాడు.. కుటుంబాన్ని చక్కదిద్దుతాడని నిరీక్షించింది. రోజులు.. నెలలు గడిచిపోయాయి. ఇక లాభం లేదనుకొని ఊళ్లోనే కూలి పనులకు వెళ్లింది. పొలం పనులకు వెళ్లిన సమయంలో తోటి కూలీలు పెట్టిన ముద్ద తిని కడుపు నింపుకుంది. పైసా పైసా కూడబెట్టి పిల్లలను ప్రయోజకులను చేసేందుకు ఎంతో శ్రమించింది. కుమార్తెకు వివాహం చేసింది. కుమారుడు ఎంటెక్ పూర్తి చేసేందుకు ఆమె పడిన కష్టం ఆ ఊరంతటినీ కంటతడిపెట్టిస్తుంది. చదవండి: నాకు నాన్న అవసరం లేదు... చికిత్స కోసం కుమారుని వద్దకు.. వయస్సులో ఉండగా శివశంకరయ్యకు భార్య, పిల్లలు గుర్తుకు రాలేదు. సుమారు పదేళ్లు గడిచాక, కాలుకు పుండు కావడంతో చికిత్స కోసం డబ్బు అవసరమై కుటుంబ సమాచారాన్ని సేకరించాడు. కుమారుడు హైదరాబాద్‌లో బ్యాంకు కోచింగ్ తీసుకుంటున్న విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తండ్రిని చూసి ఆ కుమారుడు చలించిపోయాడు. గతాన్ని పక్కనపెట్టి స్నేహితుల వద్ద తలకు మించిన అప్పులు చేసి తండ్రి కాలికి చికిత్స చేయించాడు. తన అద్దెకు ఉంటున్న రూములోనే తండ్రికి ఓ మంచం ఏర్పాటు చేసి తన లక్ష్యాన్ని పక్కనపెట్టి సపర్యలు చేశాడు. ఆరోగ్యం కాస్తకుదుటపడగానే చెప్పాపెట్టకుండా శివశంకరయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హిందూపురంలో ప్రత్యక్షం ఎక్కడున్నాడో తెలియదు.. ఏం చేశాడో తెలియదు.. మూడు రోజుల క్రితం హిందూపురం ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ స్వచ్ఛంద సంస్థకు తారసపడ్డాడు. కుడి కాలుకు ఏర్పడిన గాయం పెద్దదై పురుగులు పట్టిన స్థితిలో ఉన్న శివశంకరయ్యను ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా ముస్లిం నగారా ట్రస్టు వ్యవస్థాపకుడు ఉమర్‌ఫరూఖ్, సభ్యులు అన్నీ తామై సపర్యలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీరట, బయటకు నెట్టేశారట! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ ఆ తండ్రి కుటుంబ పరువును బజారుకీడ్చాడు. తన కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని, తన డబ్బునంతా లాక్కొని భార్య, పిల్లలు బయటకు నెట్టేశారని నిందలు మోపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కుమారునికి ఫోన్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా బెదిరిపోయిన ఆ యువకుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. మీ ఇష్టం సార్, మేము ఆయన వల్ల చాలా కోల్పోయాం, ఇక ఆయనను భరించలేమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంతైనా నాన్న.. జన్మనిచ్చిన తండ్రి తనను గాలికొదిలేసినా.. ఆ యువకుడు బాధ్యతగా భావించాడు. ఇన్నేళ్లు రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిని కనీసం జీవిత చరమాంకంలోనైనా సుఖపెట్టాలనే ఆశ ఒకవైపు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయం మరోవైపు. ఇప్పటికీ జీవితంలో కుదురుకోలేదు. ఎంటెక్ పూర్తి చేసి నాలుగేళ్లయినా ఉద్యోగం లేదు. ఈ పరిస్థితుల్లో హిందూపురానికి వచ్చి తండ్రిని కాపాడుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. పరిస్థితి ఆందోళనకరం ప్రస్తుతం శివశంకరయ్య కాలు కుళ్లిపోయింది. ఇది హైరిస్కు కేసు. షుగర్ కూడా ఉంది. కాలును మోకాలు వరకు తొలగించాలి. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వారి అంగీకారం మేరకు ఆపరేషన్ నిర్వహిస్తాం. వాళ్లు ఎవరూ స్పందించకపోతే రెండు రోజుల్లో మానవతా దృక్పథంతో మేమే ఆపరేషన్ చేస్తాం. – డాక్టర్ కేశవులు,ఆసుపత్రి సూపరింటెండెంట్ చదవండి: నాకు నాన్న అవసరం లేదు... -
నాకు నాన్న అవసరం లేదు...
సాక్షి, హిందూపురం: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రిని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్దయగా వదిలేసిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బలిజ శివశంకరయ్య (80) హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కాలుకు పుండు కావడంతో ఆ ప్రదేశం కుళ్లిపోయింది. వార్డులోని మిగిలిన రోగులు ఆయన స్థితిని చూసి అక్కడ ఉండలేకపోవడంతో ముస్లిం నగారా ట్రస్టు వ్యవస్థాపకుడు ఉమర్‌ఫరూఖ్, సభ్యులు.. రోజూ స్నానం చేయించి దుస్తులు మార్చి సపర్యలు చేస్తున్నారు. అతని ద్వారా వివరాలు సేకరించి వన్‌టౌన్ ఎస్ఐ బాలమద్దిలేటికి సమాచారమిచ్చారు. అతని వద్ద ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా వైఎస్సార్ జిల్లాలోని చెనిక్కాయలపల్లి రామాపురం చిట్లూరు వాసిగా గుర్తించారు. కుమారుడు నాగేంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఉమర్‌ఫరూక్ ట్రస్ట్ సభ్యులు, సీఐ అతన్ని ఫోన్లో సంప్రదించగా ‘నాకు నాన్న అవసరం లేదు. నన్ను ఆయన సాకలేదు. నేనేమీ ఆయన ఆస్తులు తీసుకొని బయటకు గెంటేయలేదు. ఆయన ఎక్కడకు పోయాడో కూడా తెలియదు. ఇప్పుడు నాకు ఆయన్ను చూడటం కష్టం. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి’ అని సమాధానం ఇచ్చాడు. కుమారుని ప్రవర్తనతో కలత చెందిన శివశంకరయ్య కేసు పెట్టేందుకు సిద్ధమని సీఐతో చెప్పడం గమనార్హం. జీవిత చరమాంకంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వృద్ధుడిని చూసి స్థానికుల మనసు ద్రవిస్తోంది. -
హిందూపురంలో టీడీపీ కార్యకర్త శ్రీనివాస్ ఆగడాలు
-
అప్పు ఎగ్గొట్టేందుకు ఆ మహిళ ఎంత పని చేసిందో..!
సాక్షి, అనంతపురం సెంట్రల్: జిల్లాలో సంచలనం సృష్టించిన కొటిపి జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. అప్పు ఎగ్గొట్టేందుకు వృద్ధ దంపతులను హత్య చేసి.. నేరం తమపైకి రాకుండా ఉండేందుకు ఆత్మహత్యగా చిత్రీకరించిన ఓ కిలాడి మహిళతో పాటు నలుగురు నిందితులను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు వెల్లడించారు. ఈ నెల 15న హిందూపురం మండలం కొటిపి రైల్వే ట్రాక్‌పై రెండు మృతదేహాలు కనిపించాయి. అక్కడ లభ్యమైన ఆధారాలను బట్టి మృతులుగా హిందూపురం పట్టణంలో అహ్మ దాబాద్‌కు చెందిన గీతాబాయి, నాగభూషణంరావు దంపతులుగా గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. అయితే మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో కేసును హిందూపురం పోలీసులు తీసుకున్నారు. మృతుల ఇంటి పై పోర్షన్లో అద్దెకు ఉంటున్న సుశీలమ్మ అప్పు ఎగ్గొట్టేందుకు హత్యకు పథక రచన చేసింది. హిందూపురానికి చెందిన ఆంజనేయులు, పవన్‌కుమార్, నారాయణస్వామి, కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాకు చెందిన తాడి నాగభూషణ సహకారంతో హత్య చేసినట్లు తేలింది. అప్పు ఎగ్గొట్టాలని కడతేర్చేశారు.. పామిడి మండలానికి చెందిన నాగభూషణంరావు, గీతాబాయి దంపతులు మూడేళ్ల క్రితం హిందూపురం వచ్చి స్థిరపడ్డారు. అహ్మదాబాద్‌నగర్‌లో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసముంటూ వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిందితుల్లో ఒకరైన సుశీలమ్మ వీరి ఇంటి పై పోర్షన్లో అద్దెకు ఉంటోంది. సుశీలమ్మ భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా.. మరో నిందితుడైన నాగభూషణంతో సహజీవనం చేస్తోంది. అవసరాల కోసం గీతాబాయి దంపతుల నుంచి రూ. 4 లక్షలు అప్పు తీసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో తరచూ గీతాబాయి గొడవ పడేది. అయినా కూడా అప్పు చెల్లించడానికి సుశీలమ్మ ససేమిరా అంటూ వస్తోంది. అయితే గీతాబాయి తరచూ అప్పు అడగటాన్ని సుశీలమ్మ అవమానంగా భావించింది. దీంతో ఎలాగైనా సుశీలమ్మను కడతేర్చాలని భావించి నాగభూషణంతో కలిసి హత్యకు పథక రచన చేసింది. పథకంలో భాగంగా అప్పును చెల్లిస్తామని నమ్మబలికి గీతాబాయి, నాగభూషణరావులను ఓ ఆటోలో పిలుచుకుని సంజీవరాయునిపల్లి దాటగానే కంపచెట్లలోకి తీసుకెళ్లి గొంతుబిగించి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొటిపి సమీపంలో రైల్వే ట్రాక్‌పై పడేసి వెళ్లిపోయారు. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యలుగా గుర్తించారు. పెనుకొండ డీఎస్పీ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో హిందూపురం రూరల్ సీఐ శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐలు ధరణికిశోర్, బాలమద్దిలేటిలు బృందంగా ఏర్పడి కిలాడి లేడీ సుశీలమ్మతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. అతి తక్కువ సమయంలోనే కేసు ఛేదించడంపై పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. -
త్వరలో పారిశ్రామిక విప్లవం
సాక్షి, హిందూపురం(అనంతపురం): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక విప్లవం వస్తోందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్‌భార్గవ్ అన్నారు. శుక్రవారం హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో పరిశ్రమలశాఖ కమిషనర్ సుబ్రమణ్యం అధ్యక్షతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘పరిశ్రమస్థాపన–సులభతరమైన అనుమతులు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో రజత్‌భార్గవ్ మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందుకోసం ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాన్ని యువతకు కల్పించేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యం ఉద్యోగులు అందించబోతున్నామన్నారు. రాష్ట్రంలో 1,16,000 చిన్న తరహా క్టస్టర్లుండగా వాటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తోందన్నారు. రానున్న ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో 13 పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఒక్కో పరిశ్రమలో 10వేల నుంచి 12వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఇక పరిశ్రమల పేరుతో భూములు తీసుకుని ఇంతవరకూ పరిశ్రమలు ఏర్పాటు చేయని వారి నుంచి భూములు వెనక్కు తీసుకుంటామన్నారు. దేశానికే మనం ఆదర్శం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని రజత్ భార్గవ్ వివరించారు. అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. త్వరలోనే వైజాగ్–చైన్నె, బెంగళూరు–చెన్నై కారిడర్లు వస్తున్నాయని, ఇందులో ఎనిమిది క్లస్టర్లు ఉంటాయని చెప్పారు. బెంగళూరు–చెన్నై కారిడార్‌లో ఉన్న హిందూపురం క్లస్టర్లు మార్కెటింగ్ అభివృద్ధికి వచ్చే ఏడాది రూ.1,500 నుంచి రూ. 2 వేల కోట్ల నిధులు కేటాయింపులు ఉంటాయన్నారు. అలాగే పరిశ్రమలకు అనుకులంగా జిల్లాలో విమానాశ్రయాల నుంచి రవాణా సౌకర్యాలు పెంచుతున్నామన్నారు. కర్నూలు ఎయిర్‌పోర్టును మరో ఏడాదిలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలం కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, పరిశ్రమలు నెలకొల్పడానికి జిల్లాలో అవసరమైన భూములతో పాటు గొల్లపల్లి, హంద్రీనీవా ద్వారా నీటిసదుపాయం ఉందన్నారు. అలాగే మానవ వనరులు కూడా అధికంగా ఉన్నాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని, అందువల్లే సింగిల్ డెస్క్ ద్వారా వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం తరఫున అందించాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. జిల్లాలో రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 48 ప్రముఖ కంపెనీలు 36 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఇంకా వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం టాప్ ప్రియారీటి ఇస్తోందని, అన్ని శాఖలను కలవాల్సిన పనిలేకుండా ఆన్లైన్ ద్వారా అన్ని అనుమతులు సులభతరంగా మంజురు అయ్యేలా రూపకల్పన చేసిందన్నారు. అనంతరం పర్యావరణ హితం కోసం రూపొందించిన క్యారీ ఏ బ్యాగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం తూమకుంట పారిశ్రామికవాడలోని పరిశ్రమలను పరిశీలించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ జాహ్నవి, సబ్ కలెక్టర్ నిశాంతి, స్పెషల్ ఆఫీసర్ సుదర్శనబాబు, సమాచార శాఖ ఏడీ జయమ్మ, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
తరగతి గదులే మందుబాబులకు సిట్టింగ్ రూములు
అది ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులు చదువుకునే బడి. సాయంత్రం ఐదు దాటితే విద్యాలయ ప్రాంగణం మందుబాబులకు అడ్డా. బడికి ఆనుకుని ఉన్న బెల్టుషాపుల్లో మద్యం కొనుగోలు చేసి తరగతి గదులను సిట్టింగ్ రూములకు మార్చేసుకుంటున్నారు. పీకల దాకా తాగి మత్తులో ఊగుతూ సీసాలను పగులగొట్టి ఇష్టమొచ్చినట్లు విసురుతున్నారు. ఉదయాన్నే బడికి చేరుకున్న పిల్లలు పగిలిన గాజుపెంకులు గుచ్చుకుని రక్తమోడుతూ బాధతో విలవిలలాడుతున్నారు. సాక్షి, హిందూపురం సెంట్రల్: హిందూపురం మండలం మనేసముద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 100 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత టీడీపీ పాలనలో కొందరు నాయకుల అండదండలతో గ్రామంలో బెల్టుషాపులు వెలిశాయి. ప్రాథమికోన్నత పాఠశాలకు ఆనుకుని ఒకటి.. దాని సమీపంలో మరొకటి.. ఇలా నాలుగు ఏర్పాటు చేశారు. ఐదేళ్లూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తూ వచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బెల్టుషాపులు సమూలంగా నిర్మూలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అప్పటి వరకు నిరాటంకంగా కొనసాగిస్తూ వచ్చిన బెల్టుషాపులను అధికారులు మూసివేయించాల్సి ఉంది. అయితే బెల్టుషాపుల నిర్వాహకులకు టీడీపీ నాయకులతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు ఉన్నాయన్న కారణంతో అధికారులెవరూ పట్టించుకోలేదు. బడి ముగియగానే మందు శాల.. బడి వేళలు ముగియగానే సాయంత్రం నుంచి బెల్టుషాపులు తెరుచుకుంటాయి. అప్పటి వరకు ఇళ్లల్లో ఉంచుకున్న మద్యాన్ని నిర్వాహకులు బెల్టుషాపుల్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ మందు కొనుగోలు చేసిన బాబులు నేరుగా ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోకి వెళ్తున్నారు. అక్కడి తరగతి గదిని ఏకంగా సిట్టింగ్ రూమ్‌గా మార్చుకున్నారు. అక్కడే పూటుగా తాగి తందనాలు ఆడుతున్నారు. అంతటితో ఆగకుండా మద్యం సీసాలను పగులగొడుతున్నారు. గాజు పెంకులు తరగతి గదులు.. ఆవరణల్లోనే ఎగిరిపడుతున్నాయి. పాఠశాలలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు కింద మందు సీసాలు, గ్లాసులు, గాజు పెంకు గుచ్చుకోవడంతో కాలికి గాయమైందని చెబుతున్న విద్యార్థిని పసి మొగ్గలకు రక్తగాయాలు పాఠశాలకు చేరుకున్న పిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగ ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. పాదరక్షలు లేకుండా గదిలోంచి బయటకు వస్తే గాజు పెంకులు గుచ్చుకుని విలవిలలాడుతున్నారు. పాఠశాల ఆవరణంలోనే మందుబాబుల సీసాలతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు పడేస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఉదయాన్నే శుభ్రం చేస్తున్నప్పటికీ సాయంత్రం మళ్లీ పగిలిన సీసాలు దర్శనమిస్తున్నాయి. బడి ఆవరణలో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి ఉపాధ్యాయులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎటువంటి ప్రయోజనమూ కనిపించలేదు. సీఎం ఆదేశాలు బేఖాతరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెల్టుషాపులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా మనేసముద్రంలో బేఖాతరు చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ అదికారులు, తహసీల్దార్ అక్కడ బెల్టు షాపులను ఎత్తివేయించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పాఠశాలలో ఉన్న పాత భవనాలు, క్రీడా ప్రాంగణం మొత్తం వేలాది మద్యం సీసాలతో దర్శనమిస్తున్నాయి. బెల్టుషాపులపై పలుమార్లు అదికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలిపారు. ఎవరైనా ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారన్నారు. ఫిర్యాదు చేసి అలసిపోయాం బెల్టుషాపులు తీసేయాలని పలుమార్లు విన్నవించుకున్నా వారు తొలగించుకోలేదు. ఇది పాఠశాలలాగా కాకుండా ఒక బారులా కనిపిస్తోంది. ఎంతని శుభ్రం చేయించగలం. ఎంత చేసినా రోజూ వందలకొద్దీ మందుబాటిళ్లు ఇక్కడ పడేస్తున్నారు. భయమేస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. విద్యార్థులకు, మాకు గాజు పెంకులు కాళ్లకు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ప్రథమ చికిత్స కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను అందుబాటులో ఉంచుకున్నాం. – జయమ్మ, హెచ్ఎం, ప్రాథమికోన్నత పాఠశాల వాటికి అనుమతుల్లేవు మనేసముద్రంలోని బెల్టుషాపులకు అనుమతులు లేవు. రెండేళ్లుగా వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేశాం. ఫైన్లు వేశాం. వారిపై బైండోవర్లు కూడా ఉన్నాయి. మేము చాలా ప్రయత్నాలు చేశాం. తహసీల్దార్, ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్లాం. వారు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. అక్కడ బెల్టుషాపులు నిర్వహిస్తున్నది మహిళలు. ఇక ఉపేక్షించబోము. విద్యార్థులున్న చోట అలాంటి కార్యకలాపాలకు చోటు కల్పించడం తీవ్ర నేరం. చర్యలు చేపడతాం. – ప్రతాప్‌రెడ్డి, ఎక్సైజ్ సీఐ, హిందూపురం -
అది తప్పు.. సెల్యూట్ నేనే చేశా: గోరంట్ల మాధవ్
సాక్షి, అమరావతి : పోలీస్ ఉన్నతాధికారులు తనకు సెల్యూట్ చేసినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. తానే తన ఉన్నతాధికారులకు సెల్యూట్ చేశానన్నారు. శనివారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మాపై చాలా పెద్ద బాధ్యతను ఉంచారు. మన దరిద్రం పోవాలంటే ప్రత్యేక హోదా రావాలని, ఎంపీలంతా ఏకతాటిపై ఉండి పోరాడాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టమెంటరీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. మిగతా పార్టీల ఎంపీలను కలుపుకొని ముందుకుసాగాలని సూచించారు. నియోజకవర్గాలకు వెళ్లి ప్రజా సమస్యలను అధ్యయనం చేయమని ఆదేశించారు. మా ఎంపీలమంతా ప్రత్యేక హోదానే ఎజెండాగా ముందుకుసాగుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాం. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్.. సార్ నేనిక్కడ కూలీకి వెళ్లాను.. అలాంటి నన్ను ఎంపీనీ చేశారు అంటూ కన్నీటి పర్యంతమవుతూ వైఎస్ జగన్‌కు కృతజ్ఙతలు తెలుపుతుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంట్‌కు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది’ అని గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. పోలీస్ శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ తన పదవికి రాజీనామా చేసి హిందూపురం లోక్‌సభ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలిచిన ఆయనకు పోలీస్ ఉన్నతాధికారులు సెల్యూట్ చేశారని ఓ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఆ ఫొటోలో ఉన్నతాధికారులకు తానే మొదట సెల్యూట్ చేసినట్లు గోరంట్ల మాధవ్ తెలిపారు. -
హిందూపురంలో బాలయ్య హల్చల్
సాక్షి, హిందూపురం: టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ గురువారం పోలింగ్ సందర్భంగా తన అనుచరగణంతోపాటు నేరుగా పోలింగ్ బూత్‌ల్లోకి వెళ్లి హల్చల్ చేశారు. బూత్‌వద్ద ఉన్న మహిళలు, యువకులతో కలిసి మాట్లాడుతూ సెల్ఫీలు తీసుకున్నారు. ఇదే సమయంలో పక్కనున్న నాయకులు ఓటర్లుకు తమ సైకిల్‌కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. బాలకృష్ణ వెనుకనే సీఐ, పోలీసు సిబ్బంది ఉన్నా పోలింగ్ బూత్‌లలో వెళ్తున్న నాయకులు, కార్యకర్తలకు అడ్డు చెప్పకపోవడం గమనార్హం. చౌళూరులో ఉద్రిక్తత బాలకృష్ణ చౌళూరు పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేశారు. పెద్దసంఖ్యలో నాయకులు, అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి వస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు చౌళూరు రామకృష్ణారెడ్డి అక్కడున్న సీఐ సుబ్రహ్మణ్యంకు అభ్యంతరం చెప్పారు. సీఐ రామకృష్ణారెడ్డిని పక్కకు తోసేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా వ్యతిరేకించారు. అడ్డుచెబుతున్న వారిని పోలీసులు తోసేస్తున్నా బాలకృష్ణ తన అనుచరులతో నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లిపోయారు. పోలీసుతీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆ.. ఎవడొచ్చాడిక్కడ.. పగులుద్ది..!
హిందూపురం: అడ్డుకునేవారు లేరు..బుద్ధి చెప్పేవారసలే లేరు..పైగా ఎక్కడికక్కడ జనం నిలదీతలు...అందుకే బాలకృష్ణ అసహనంతో రగిలిపోతున్నారు. ఎవరైనా ఒక్క మాట ఎదురు మాట్లాడినా బూతులతో రెచ్చిపోతున్నారు. తాజాగా శుక్రవారం హిందూపురంలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరి ఓటింగ్ కొనసాగిస్తుండగా.. నిబంధనలకు విరుద్ధంగా బాలకృష్ణ, పెద్దసంఖ్యలో పార్టీనాయకులతో కలిసి వచ్చి నేరుగా ఉద్యోగుల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. సెల్ఫీలు తీసుకుని వారితో కరచాలనం చేస్తూ సహకరించాలని చెప్పుకుంటూ వెళ్లసాగారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న దళిత సంఘం నాయకుడు ఉదయ్, ఇతర నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయవచ్చా ..? అని నిలదీశారు. దీంతో బాలకృష్ణ ‘‘ఆ.. ఎవడొచ్చాడిక్కడ.. పగులుద్ది’’ అని తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తూ మరోకౌంటర్ వద్దకు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు ప్రశ్నించిన తమపై నోరుపారేసుకున్న బాలయ్య తీరుకు నిరసనగా ఉదయ్, మరికొందరు దళితనాయకులు ఆందోళనకు దిగారు. ‘‘ఓట్లు వేసిన పాపానికి మీతో తిట్లు తినాలా’’ అంటూ నిరసనకు దిగారు. అయినా బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోకుండా ఫొటోలు దిగి ప్రచారం ముగించుకుని వెళ్లి పోయారు. అంతవరకు బాలకృష్ణ చుట్టూ తిరిగిన పోలీసులు...ఆయన వెళ్లిపోగానే ఒక్కసారిగా ఆందోళన చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. నాయకులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఉండరాదంటూ బయటకు పంపించారు. దీంతో అక్కడున్న వారంతా బాలకృష్ణకు ఒక న్యాయం..మిగతా వారికి ఒక న్యాయమా..అని ప్రశ్నించినా...సమాధానం చెప్పేవారే కరువయ్యారు. -
కన్నీళ్లు.. ఖాళీ బిందెలు
సాక్షి, హిందూపురం: అతిథి ఎమ్మెల్యేగా పేరుగాంచిన బాలకృష్ణకు ఎన్నికల ప్రచారంలో ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉత్సాహంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న ఆయన్ను.. జనం అడుగడుగునా నిలదీస్తున్నారు. సమస్యలు చెబుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఐదేళ్లు ఎక్కడకు పోయావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. గురువారం బాలకృష్ణ చిలమత్తూరు మండలం టేకులోడు పంచాయతీలో ప్రచారం ముగించుకుని దేమకేతేపల్లి ఎస్సీ కాలనీకి రాగా.. మహిళలంతా ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. ఆయన కాన్వాయ్ ముందు అడ్డుగా నిలిచి ఆందోళన చేశారు. తమ కాలనీలో కొన్ని నెలలుగా తాగునీటి సమస్య ఉందనీ, పరిష్కారానికి అదనంగా మరో బోరు వేయించాలని పలు మార్లు ఫిర్యాదు చేసినా ఏ నాయకుడు పట్టించుకోలేదన్నారు. మీకు చెప్పుకుందామంటే.. మీరెక్కడుంటారో కూడా తెలియదన్నారు. ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేసే నీళ్లు తాగి రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చారని నిలదీశారు. పోలీసులు, నాయకులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా.. వారు వినకుండా నీళ్లు ఇవ్వాలని పట్టుబట్టారు. మహిళలంతా ఏకమై ప్రశ్నించే సరికి బిత్తరపోయిన బాలకృష్ణ.. వెంటనే పక్కనే ఉన్న స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ప్రశ్నించారు. నాయకులు ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా మండిపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున.. నీటిని ట్యాంకర్ల ద్వారా అందించాలని అధికారులకు తెలియజేస్తామని సర్దిచెప్పి ముందుకు వెళ్లిపోయారు. -
జన ప్రభంజనం..
సాక్షి, అనంతపురం : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కళ్యాణదుర్గం, హిందూపురం బహిరంగ సభల్లో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు జగన్ కళ్యాణదుర్గం చేరుకోవాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఆయన సాయంత్రం 4.40 కళ్యాణదుర్గం చేరుకున్నారు. అయినప్పటికీ జగన్ కోసం తరలివచ్చిన వేలాది మంది మండుటెండలోనూ నడిరోడ్డుపై ఉండిపోయారు. జగన్ కన్పించగానే ఈలలు, కేకలతో హోరెత్తించారు. తర్వాత అక్కడికి వచ్చిన ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జీడిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తే, ఇన్నేళ్లలో టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గానికి సాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీటీపీ కాలువ పనులూ నత్తనడకన చేస్తున్నారని, తద్వారా నియోజకవర్గంలోని 114 చెరువులతో పాటు బీటీపీకి నీళ్లందలేదన్నారు. బీటీపీ కెనాల్ కోసం సేకరించిన భూములకు పరిహారం కూడా ఇవ్వలేదంటే రైతులపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘హంద్రీ–నీవా’లో పిల్లకాలువలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వలేని అధ్వాన్నపాలన నడుస్తోందన్నారు. కళ్యాణదుర్గంలో టమాట సాగు ఎక్కువని, కిలోకు రూ.3.50 కూడా రావడం లేదన్నారు. కిలోకు రూ.10 నుంచి రూ.12 వచ్చినా రైతుకు గిట్టుబాటు కాదన్నారు. సీజన్లో కిలోకు ఒక్కరూపాయి వస్తే ఏం చేయాలో తెలియని రైతులు పంటను రోడ్డుపై పడేస్తున్నారన్నారు. అరటి రేటు కూడా కిలో రూ.7 మించలేదని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. వేరుశనగకు మద్దతు ధర రూ.4,890 ఉంటే, రూ.3 వేలకు కూడా కొనుగోలు చేయడం లేదన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక నియోజవకర్గంలో 20 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 11 మంది మాత్రమే చనిపోయారని చెప్పి, అందులో నలుగురికి మాత్రమే అరకొర పరిహారం ఇచ్చిందని దుయ్యబట్టారు. జిల్లాకు మంచి చేయాలనే ధ్యాస చంద్రబాబుతో పాటు మంత్రి కాలవ శ్రీనివాసులకు లేదని మండిపడ్డారు. వేదవతి నుంచి ఇసుకను తరలించి డబ్బు సంపాదించడంపైనే దృష్టి సారించారన్నారు. కళ్యాణదుర్గంలో రోడ్డు విస్తరణలో కూల్చేసిన భవనాలకు పరిహారం కూడా ఇవ్వలేదంటే... అసలు వీరు మనుషులేనా అని మండిపడ్డారు. ఈ అవినీతి పాలనకు అంతం పలికాలనీ, మార్పునకు ఓటేయాలని కోరారు. ఉషాశ్రీచరణ్‌ను ఎమ్మెల్యేగా, బీసీ అభ్యర్థి బోయ రంగయ్యను ఎంపీగా గెలిపించాలని కోరారు. ‘పురం’ దప్పిక తీర్చిన మహానేత వైఎస్సార్: 35 ఏళ్లుగా హిందూపురం వాసులు టీడీపీ వారినే గెలిపించినా... ఆ ప్రజాప్రతినిధులు ప్రజల దప్పిక తీర్చలేదని వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.650 కోట్ల వెచ్చించి హిందూపురం వాసుల దాహార్తి తీర్చారన్నారు. అందువల్లే ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు వైఎస్సార్‌ను తలుచుకుంటున్నారన్నారు. జనాభా పెరిగి తిరిగి... తాగునీటి సమస్య ఏర్పడితే.. గొల్లపల్లి నుంచి తీసుకురావల్సిన కాలవ పనులు కూడా బాలకృష్ణ, చంద్రబాబు పూర్తి చేయలేదని మండిపడ్డారు. బావబామ్మర్దులు షో చేయడం మినహా హిందూపురానికి ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ‘పురం’ పరిధిలో 99 చెరువులకు నీరిచ్చేందుకు వైఎస్సార్ 90 శాతం పనులు పూర్తి చేస్తే తక్కిన 10 శాతం పనులు కూడా చంద్రబాబు చేయలేదని మండిపడ్డారు. కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఇండస్ట్రీయల్ హబ్ పేరుతో బావబామ్మరుదులు శంకుస్థాపన చేశారనీ, కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా..? అని నిలదీశారు. పరిగి సమీపంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు అమ్మేశారని గుర్తు చేశారు. ‘పురం’లో 200 పడకల జిల్లా ఆస్పత్రి ఉంటే, అందులో 32 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 10 మంది మాత్రమే ఉన్నారన్నారు. నలుగురు గైనకాలజిçస్టులు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుమాలిన పాలన ఉంటుందా...? అని ప్రశ్నించారు. గర్భిణులకు సేవ చేసే తీరు ఇదేనా...? అని నిలదీశారు. డిగ్రీ కళాశాల కోసం శ్రీకంఠపురం వద్ద శంకుస్థాపనలు చేశారనీ, మరి ఆ కళాశాల ఏమైందని ప్రశ్నించారు. ఉర్దూ కళాశాల ఏర్పాటు చేస్తామని దాన్ని కూడా విస్మరించారని దుయ్యబట్టారు. ‘ఇక్కడ చింతపండు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారనీ, మొదటిరకం క్వింటాలు రూ. 15 వేలు ధర ఉండాలి, కానీ రూ. 10 వేలు కూడా పలకడం లేదన్నారు. రెండోరకం కనీసం రూ.8 వేలు రావాల్సి ఉన్నా...రూ.5 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పట్టుగూళ్లు బైవోల్టిన్ రకం కేజీ రూ. 650 పలకాల్సి ఉండగా.. రూ. 300లకు కూడా అమ్ముకోలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం కేజీకి రూ. 50 చొప్పున ఇస్తానన్న రాయితీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటికీ ప్రభుత్వం రూ. 4 కోట్ల రాయితీ రైతులకు బకాయి పడిందన్నారు. ఇలాంటి అధ్నాన పాలనపై తీర్పు ఇవ్వాలని కోరారు. మార్పునకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోలీసు అధికారులు బరిలో ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా ఐపీఎస్ అధికారి ఇక్బాల్, ఎంపీగా సీఐగా పనిచేసిన మాధవ్‌ను గెలిపించాలన్నారు. వీరిద్దరూ మంచి చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ‘అనంత’, పురం పార్లమెంట్ అధ్యక్షులు నదీం అహ్మద్, నవీన్ నిశ్చల్, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి స్థానిక నేతలు పాల్గొన్నారు. -
పీక కోస్తా.. కార్యకర్తలపై బాలకృష్ణ ఆగ్రహం
సాక్షి, అనంతపురం : నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా.. ఇవి సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యకర్తలతో ఆగ్రహంతో ఊగిపోతూ అన్న మాటలు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య తన స్వరూపాన్ని మరోసారిబయటపెట్టారు. ఈసారి సొంత కార్యకర్తలపైనే విరుచుకుపడ్డారు. హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భార్య వసుంధరతో కలిసి బాలకృష్ణ ఎన్నికల ప్రచార రథంపై వెళుతుండగా ఓ కార్యకర్త ఈ ఎన్నికల్లో మీకు వేలల్లో మెజారిటీ వస్తుందంటూ అరిచాడు. మరో కార్యకర్త కూడా బాలయ్య ఈసారి 60 వేల మెజారిటీ అంటూ అరిచాడు. హిందూపురంలో గెలవడమే కష్టంగా ఉందని, వేలు లక్షల మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైప్ క్రియేట్ చేసేవారి పీక కోయాలంటూ అనుకరిస్తూ మరీ పక్కనే ఉన్న వసుంధరతో అన్నారు. బాలకృష్ణ కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తుండగా వసుంధర నవ్వుతూ కనిపించారు. మరో కార్యకర్త సర్ 60 వేలు, 70 వేలు మెజారిటీ సర్ అంటూ అరవడంతో.. అరే, నీ పేరు అడ్రస్ చెప్పరా.. గెలవకపోతే నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలకృష్ణ చేష్టలపై హిందూపురం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. చదవండి : బాలకృష్ణ మరో నిర్వాకం.! బాలయ్య హీరోనా... జీరోనా? బాలకృష్ణ బూతు పురాణం వైరల్: బుల్బుల్ బాలయ్య..! బాలయ్య.. మళ్లీ సంభ్రమాశ్చర్యమా!