
సాక్షి, అనంతపురం: హిందూపురంలో పోలీసు కానిస్టేబుళ్ల నిర్వాకం బయటపడింది. ఇద్దరు కానిస్టేబుళ్లు హిందూపురం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లోనే మద్యం తాగిన ఘటన తాజాగా వెలుగుచూసింది. కానిస్టేబుళ్లు నూర్ మహ్మద్, తిరుమలేశ్ పీఎస్‌లో మద్యం తాగి పట్టుబడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవల కర్ణాటక మద్యం బాటిల్స్‌ను సీజ్ చేసి సదరు పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. సీజ్ చేసిన లిక్కర్‌ను ఇద్దరు కానిస్టేబుళ్లు తాగి కెమెరాలో అడ్డంగా బుక్కయ్యారు.
అప్‌డేట్: క్రమశిక్షణా చర్యలు
హిందూపురం టౌటౌన్ పోలీస్ స్టేషన్‌లో మద్యం తాగి పట్టుబడ్డ కానిస్టేబుళ్లపై ఎస్పీ సత్యయేసుబాబు సీరియస్ అయ్యారు. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఎస్పీ కానిస్టేబుళ్లను వీఆర్‌కు బదిలీ చేసినట్టు తెలిపారు.
(తమ్ముడూ.. ఇది తగునా)