Alcohol
-
మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలా ఉండగా స్టార్ హృతిక్ రోషన్‌కు సునయన రోషన్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను మద్యానికి బానిసైనట్లు వెల్లడించారు. ఆ వ్యసనం నుంచి బయప పడేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. రిహబిలిటేషన్ సెంటర్లో నరకం అనుభవించినట్లు సునయన చెప్పుకొచ్చారు. అక్కడ సాధారణ పునరావాస కేంద్రం కంటే అధ్వాన్నంగా ఉంటుందని తాను ఊహించలేదన్నారు. సునయన రోషన్ మాట్లాడుతూ.. 'ఇది మొత్తం 28 రోజుల కోర్సు. అయితే ఇది సాధారణ పునరావాసం లాంటిది కాదు. ప్రాథమికంగా అక్కడ ఎలాంటి వ్యసనానికైనా చికిత్స అందస్తారు. ఆ సెంటర్లో దాదాపు 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అక్కడి వాతావరణం సాధారణ పునరావాసం కంటే చాలా దారుణంగా ఉంది. అసలు నార్మల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్ను రోజుకు 9 గంటల పాటు ఓకే గదిలో ఉంచేవారు. అలా ప్రత్యక్షం నరకం అనుభవించా' అని తెలిపింది.అయితే తాను బాగుపడతానని తెలిసే అక్కడికి వెళ్లినట్లు సునయన రోషన్ తెలిపారు. మద్య వ్యసనం నుండి బయటపడేందుకు జీవితంలో ముందుకు సాగడానికి ఒక అడుగుగా భావించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కేవలం నాకు కాల్ చేసే వ్యక్తుల నంబర్లు మాత్రం అమ్మ వారికి ఇచ్చిందని వెల్లడించింది. అక్కడికి సెల్ ఫోన్లు, షుగర్, కాఫీ , చాక్లెట్, పెర్ఫ్యూమ్లు అనుమతించరని ఆమె చెప్పింది. అయితే పునరావాసం నుంచి బయటపడిన క్షణంలోనే తన తండ్రి రాకేష్ రోషన్‌కు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని సునయన రోషన్ వెల్లడించింది. -
మద్యంపై టారిఫ్ వార్
-
మద్యంపై టారిఫ్‌ల యుద్ధం
వాషింగ్టన్: అమెరికా, యూరప్ మధ్య టారిఫ్‌ల యుద్ధం మరింత ముదురుతోంది. ఇరుపక్షాలు సై అంటే సై అంటున్నాయి. తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అమెరికా నుంచి దిగుమతి అయ్యే విస్కీపై యూరప్ దేశాలు బుధవారం ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వైన్స్, షాంపేన్స్, ఇతర ఆల్కహాలిక్ ఉత్పత్తులపై 200 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. దీనివల్ల యూరప్ మద్యం అత్యంత ఖరీదుగా మారిపోతుందని, అంతిమంగా అమెరికాలో స్వదేశీ వైన్, షాంపేన్ వ్యాపారం లాభపడుతుందని తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేశారు. యూరప్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం టారిఫ్ విధిస్తూ అమెరికా ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ టారిఫ్ రద్దు చేయాలని యూరప్ దేశాలు కోరినా ట్రంప్ యంత్రాంగం లెక్కచేయలేదు. దాంతో ప్రతీకార సుంకాలకు తెరతీసిన యూరప్ దేశాలు అమెరికా ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకున్నాయి. 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా పడవలు, మోటార్‌బైక్‌లపై వచ్చేనెల నుంచి సుంకాలు విధించబోతున్నట్లు ప్రకటించాయి. అమెరికా విస్కీని సైతం వదిలిపెట్టలేదు. 50 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించాయి. అందుకు పోటీగా యూరప్ మద్యంపై 200 శాతం టారిఫ్‌ను విధించడం ఖాయమని ట్రంప్ ప్రకటించడం చూస్తే పరిస్థితి చెయ్యి దాటిపోతున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల వ్యవహారం చివరకు భీకరమైన వాణిజ్య యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అమెరికా మద్యం కంపెనీలకు ఇక్కట్లు: డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడల్లా అమెరికా మద్యం కంపెనీలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎందుకంటే ఇతర దేశాలు అమెరికా మద్యంపై టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. అమెరికాలోని కెంటకీ, టెన్నెస్సీ రాష్ట్రాల్లో విస్కీ కంపెనీలు అధికంగా ఉన్నాయి. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలు ట్రంప్‌నకే మద్దతు పలికాయి. అయినా ట్రంప్ ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం. అమెరికా మద్యంపై పొరుగుదేశం కెనడా ఇప్పటికే సుంకాలు విధించింది. ఇతర దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లపై అమెరికాలోని జాక్ డేనియల్స్ కంపెనీ సీఈఓ బ్రౌన్ ఫార్మన్ ఇటీవల ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఉత్పత్తి చేసిన విస్కీని ఇతర దేశాల్లో విక్రయించకుండా చేస్తున్నారని ఆక్షేపించారు.విస్కీపై సుంకం అసహ్యంగా ఉంది: ట్రంప్ తమ విస్కీపై యూరప్ దేశాలు 50 శాతం టారిఫ్‌ను ప్రకటించడం పట్ల అమెరికా మద్యం పరిశ్రమ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. యూరప్‌కు విస్కీ ఎగుమతులు మళ్లీ పెంచాలని ఇటీవలే నిర్ణయించామని, ఈ టారిఫ్‌ల వల్ల అది నెరవేరే అవకాశం లేదని అమెరికా డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్ సీఈఓ క్రిస్ స్వాగ్నర్ చెప్పారు. బుధవారం యూరప్ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్ స్పందించారు. వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో మాట్లాడారు. యూరప్ సుంకాలపై తగిన విధంగా బదులిస్తానని చెప్పారు. అన్నట్లుగానే గురువారం బాంబు పేల్చారు. 200 శాతం సుంకాలు అంటూ గట్టిగా బదులిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పన్నులు, సుంకాలు యూరప్ దేశాల్లో ఉన్నాయని ఆరోపించారు. అమెరికా నుంచి దోచుకోవాలన్న యావ తప్ప మరొకటి లేదని యూరప్ దేశాల ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఆఖరికి విస్కీపై కూడా టారిఫ్ విధించడం అత్యంత అసహ్యంగా ఉందన్నారు.టారిఫ్ ప్లాన్లు ఆగవు టారిఫ్‌లలో ఉన్న సమస్య ఏమిటంటే అవి మరిన్ని టారిఫ్‌లకు దారితీస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా, యూరప్ మధ్య ఈ టారిఫ్‌ల రగడ ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఒక్కసారి అందులో కూరుకుపోతే బయటపడడం అంత సులభం కాదు. తమ టారిఫ్ ప్రణాళి కలను సమీప భవిష్యత్తులో ముగించే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు సైతం ఆయన తలొగ్గడం లేదు. పైగా అదనపు టారిఫ్‌లు ఉంటాయని చెబుతున్నారు. ఇండియా, చైనా సహా పలు దేశాల ఉత్పత్తులపై విధించిన సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. -
కదులుతున్న బస్సు.. కిటికీలో కాళ్లు
గుత్తి రూరల్: పూటుగా మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కిన ఓ వ్యక్తి.. బస్సు కదిలాక కిటికీలో నుంచి కాళ్లు బయటకు పెట్టి దర్జాగా నిద్రపోయాడు. ఆదివారం సాయంత్రం గుత్తి నుంచి అనంతపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఖరి సీటులో కూర్చున్న మందుబాబు బస్సు కిటికీలో నుంచి తన రెండు కాళ్లు బయటకు పెట్టి నిద్రించి ప్రయాణించాడు. ఈ విషయాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలైంది. దీనిపై పలువురు నెటిజన్లు సెటైర్లు పేల్చారు. ‘మీకు పూర్తిగా కిక్ ఇస్తా, కంపెనీలతో మాట్లాడి నాణ్యమైన మద్యం అందిస్తా’ అంటూ గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఓ వ్యక్తి గుర్తు చేశారు. ‘కూటమి ప్రభుత్వానికి విద్య, వైద్యం మీద శ్రద్ధ లేదనడానికి ఉదాహరణ ఇది’ అంటూ ఒకరు.. ‘కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విచ్చలవిడిగా బెల్ట్ షాపుల రూపంలో మద్యం దొరుకుతోంది. నేడు ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులు దొరుకుతాయో లేదో తెలియదు కానీ ఊరూరా బెల్టు దుకాణాల్లో మద్యం మాత్రం దొరుకుతోంది. చంద్రబాబు చెబుతున్న మంచి ప్రభుత్వం అంటే ఇదే’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. -
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మద్యం
ఒక నూతన ఆరోగ్య హెచ్చరికతో ఈ నూతన సంవత్సరం మొదలైంది. మద్యం సేవించడం, క్యాన్సర్ ప్రమాదం పెరగడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అమె రికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో క్యాన్సర్‌ను ప్రేరేపించగల మూడో ప్రధాన కారణం ఆల్కహాల్ వినియోగం. ఏ రకమైన ఆల్కహాల్ తీసుకున్నా, అది కనీసం ఏడు రకాల క్యాన్సర్లు (రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి కుహరం, గొంతు, స్వరపేటిక) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని ఆ ప్రకటన తెలిపింది. అమెరికాలో 16.4 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ వినియోగం వల్లే సంభవిస్తున్నాయి. రొమ్ము, నోరు,గొంతు వంటి కొన్ని క్యాన్సర్ల విషయంలో, ‘రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువసార్లు మద్యం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు’ అని సలహాదారు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో మద్యం సేవించడం కూడా కాలేయ మచ్చలు (లివర్ సిర్రోసిస్) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది. అయితే, మద్యం సేవించడం వల్ల ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక జీవ, పర్యావరణ, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఎంత తక్కువైనా రిస్కే!శాస్త్రీయ ఆధారాలకు సంబంధించిన క్రమబద్ధమైన మూల్యాంకనం ఆధారంగా, మద్యం సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు, హానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2023 ప్రకటనను అనుసరించి ఈ సలహా ఇవ్వడమైంది. మద్యం నేరుగా ప్రమాద కరమైన వ్యాధిని కలిగిస్తుంది. మద్యం గణనీయంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, ‘మద్యం వినియోగం విషయానికి వస్తే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయనంతటి తక్కువ మోతాదు అనేది లేనే లేదు’ అని పేర్కొంది.‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ సంస్థ, ఆల్కహాల్‌ను ‘గ్రూప్ 1 కార్సినోజెన్’గా 1980లలో వర్గీకరించింది. ఇది పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్ వంటి క్యాన్సర్ కలిగించే పదా ర్థాలలో అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ. ఇథనాల్ శరీరంలో ఇంకిపోవడం వల్ల జీవసంబంధమైన విధానాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. అందువల్ల, ఆల్కహాల్ కలిగిన ఏ పానీయం... అది బీర్, వైన్ లేదా విస్కీ ఏదయినా ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఏ రకమైనా హానికరమే!కొన్ని ఆల్కహాల్ పానీయాలను, ముఖ్యంగా రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే అపోహను ఈ ఆధారాలు బద్దలు కొడుతున్నాయి. దశాబ్దాలుగా, మద్య పరిశ్రమ కార్డియాలజిస్టులను ప్రోత్సహించి, మితంగా వైన్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదనే భావనను ప్రచారం చేస్తోంది.అలాంటి వాదనలకు ఎటువంటి విశ్వసనీయ శాస్త్రీయ అధ్యయ నమూ లేదని గ్రహించాలి. మరోవైపు, డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ ప్రాంతం నుండి వచ్చిన డేటా ప్రకారం, ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్లలో సగం వరకు, సాధారణంగా వారానికి ఒక బాటిల్ వైన్ లేదా రెండు బాటిళ్ల బీర్ వంటి ‘తేలికపాటి’, ‘మితమైన’ వినియోగం వల్ల సంభవిస్తు న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గుండె జబ్బులు లేదా మధుమేహంపై తేలికపాటి, మితమైన మద్యపానం వల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాలను గురించి తెలిపే అధ్యయనాలు లేవు.‘మీరు ఎంత ఎక్కువ తాగితే అంత హానికరం అని మేము కచ్చితంగా చెప్పగలం. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంత తక్కువ తాగితే అంత సురక్షితం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఆల్కహాల్, అక్రమ మాదకద్రవ్యాల నిపుణురాలు కరీనా ఫెర్రీరా –బోర్జెస్ అన్నారు.హెచ్చరికలు మేలు చేస్తాయా?ఒక వస్తువు వల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తుందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పుడు, ఆ వస్తువు ద్వారా కలిగే హానిని తగ్గించడానికి ఉన్న ఎంపికలు ఏమిటి? డబ్ల్యూహెచ్ఓ చేసిన ఆల్కహాల్ ప్రకటన అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను ఎత్తిపడుతోంది. అలాగే అందుబాటులో ఉన్న విధాన ఎంపికలను కూడా ప్రభుత్వాలకు అందిస్తోంది. ప్రభుత్వాలు వాటిపై చర్య తీసుకో వలసి ఉంటుంది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి అత్యంత స్పష్టమైన మార్గాలలో ఒకటి ఏమిటంటే, మద్యం సీసాలపై హెచ్చరిక లేబుళ్ల ద్వారా, కలగనున్న హాని గురించి జనానికి అవగా హన కల్పించడం. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు ఏమి చేయాలని వివేక్ మూర్తి సూచించిన చర్యలలో ఇది ఒకటి. క్యాన్సర్ ప్రమాదాన్ని లెక్కించడానికి మద్యం వినియోగంపై మార్గ దర్శకాల పరిమితులను తిరిగి నిర్వచించాలని కూడా మూర్తి పిలుపునిచ్చారు.వివిధ దేశాలు పరిశీలిస్తున్న హెచ్చరిక లేబుల్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఆరోగ్యానికి సాధారణ హాని; అధిక వినియోగం, దుర్వి నియోగం వల్ల కలిగే హాని; నిర్దిష్ట సమూహాలకు అంటే తక్కువ వయస్సు గలవారు, గర్భిణులు మొదలైన వారికి వ్యతిరేకంగా సందేశాలు వీటిలో కొన్ని. ఉదాహరణకు, 2026లో ఐర్లాండ్ ప్రవేశ పెట్టాలని భావిస్తున్న హెచ్చరికలో, ‘మద్యం తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుంది’ అని ఉంది. 2019లో, భారతదేశం హార్డ్ లిక్కర్‌కు ‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అనీ, తక్కువ ఆల్క హాల్ పానీయాలకు ‘సురక్షితంగా ఉండండి, తాగి వాహనం నడపవద్దు’ అని చెప్పే సాధారణ హెచ్చరికలను తప్పనిసరి చేసింది.ఇండియా ఇంకా చేయాల్సిందేమిటి?భారతదేశంలో హెచ్చరిక లేబుళ్లతో పాటు, ఆల్కహాల్ మార్కెటింగ్‌పై పరిమితులు కూడా అమలులో ఉన్నాయి. వార్తా పత్రికలు, రేడియో, టీవీల్లో ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించారు. అయితే ప్రకటనల నిబంధనలలోని లొసుగులను వాడుకుంటూ వాటిపై ప్రకటనలు మరో రూపంలో కొనసాగుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రహస్య ప్రకటనలు కొత్త సవాళ్లను కలిగిస్తున్నాయి.పొగాకు లేబుళ్లపై హెచ్చరికల మాదిరిగానే, మద్య పరిశ్రమ, పరిశ్రమ అనుకూల సమూహాలు ఆరోగ్య హెచ్చరిక లేబుళ్లు మద్య వినియోగాన్ని తగ్గించడంలో పెద్దగా ఉపయోగపడవని వాదిస్తు న్నాయి. కానీ, ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన ఇటీవలి సమీక్షలో నివేదించినట్లుగా, మద్య ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాయని ఆధారాలు ఎత్తి చూపు తున్నాయి. అవి మద్య సంబంధిత హానిపై అవగాహన పెంచు తాయి, మద్యం వాడకాన్ని సాధారణీకరించకుండా దోహదం చేస్తాయి. పైగా ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయ పడతాయి. తద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. హెల్త్ లేబుల్స్ ప్రభావం వాటి రూపకల్పనపై, కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే, ఆరోగ్య హెచ్చరిక లేబుల్స్‌కు ప్రామాణీకరణ లేదు. అంతేకాకుండా వాటి కంటెంట్ చాలా సాధారణమైనది. ఇది వినియో గదారులు ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడకపోవచ్చు.దాదాపు ఐదేళ్లుగా భారతదేశం మద్యం ఉత్పత్తులకు సంబంధించిన హెచ్చరిక లేబుళ్లపై నిబంధనలను అమలు చేస్తోంది. ఇది ఎంత ప్రభావవంతంగా ఉందో మనకు ఇంకా తెలియదు. హెచ్చరిక సందే శాల రూపకల్పన, కంటెంట్, వాటిపై వినియోగదారుల అభిప్రా యానికి సంబంధించి మనకు నిరంతర పరిశోధన అవసరం. పొగాకు ఉత్పత్తుల్లో ఆరోగ్య హెచ్చరికలు ప్యాకేజింగ్‌లో మంచి జాగాతో వివర ణాత్మకంగా ఉంటాయి. దీనికి భిన్నంగా మద్యం సీసాలపై హెచ్చరికలు చిన్న స్థలాన్ని ఆక్రమిస్తాయి, అస్పష్టంగా ఉంటాయి. ఆరోగ్య హెచ్చరికలతో పాటు, హైవేలపై మద్యం అమ్మకాల నియంత్రణ, తక్కువ వయస్సు గల వినియోగదారులకు అమ్మకాలను అరికట్టడం, తాగి వాహనం నడపడం వంటి అదనపు చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలి.భారతదేశంలో ఆరోగ్య సంబంధమైన, ఇతర నిబంధనలను నిలిపివేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న పరిశ్రమ లాబీల నుండి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మద్యం వల్ల కలిగే ఆరోగ్య సంరక్షణ పెను భారాన్ని తగ్గించడానికి వివేక్ మూర్తి వంటి మరింత మంది ప్రజారోగ్య ఛాంపియన్లు అవసరం. క్యాన్సర్‌కీ పొగాకుకీ ఉన్న సంబంధంపై మొదటి హెచ్చరిక కూడా 1964లో ఒక సర్జన్ జనరల్ నుండే వచ్చిందని గుర్తుంచుకోండి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మద్యం మత్తులో 80 అడుగుల టవర్ ఎక్కి..
‘అసలే కోతి.. ఆపై కల్లు తాగింది’ అని ఓ సామెత. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి తీరు అచ్చం అలాగే ఉంది. జిల్లాలో ఉన్న బెరాసియా తహసీల్‌లో బర్ఖేడీ గ్రామానికి చెందిన 33 ఏళ్ల వివేక్ అనే వ్యక్తి పీకల దాకా తాగాడు. ఇంకేముంది వెయ్యేనుగుల బలం వచ్చింది. ఆ మత్తులో 80 అడుగుల మొబైల్ టవర్ ఎక్కాలనుకున్నాడు. స్థానికులు అడ్డుకుంటున్నా సరే.. పక్కకు నెట్టిమరీ సునాయాసంగా ఎక్కాడు. టవర్ మీదకు ఎక్కనయితే ఎక్కాడు కానీ.. ఎట్లా దిగాలో అర్థం కాలేదు. ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. దీంతో స్థానికులు జహంగీరాబాద్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అతడిని 20 నిమిషాలపాటు మాటల్లో పెట్టి.. అగ్నిమాపక క్రేన్ సహాయంతో కిందకు దించారు. కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిందకు దిగిన వివేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనంతా స్థానికులు తమ సెల్‌ఫోనులో బంధించిన స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వీడియో వైరల్ అవుతోంది. -
మీకు ఆ అలవాట్లు ఉంటే జేబుకు చిల్లే.. నిర్మలమ్మ చేతిలో ట్యాక్స్ అస్త్రం
-
రెండో భార్య మద్యం మానేయమన్నందుకు..
కంబదూరు: మద్యం మానేయడం ఇష్టంలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మొదటి భార్య మృతి చెందింది. దీంతో 30 రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో రోజూ తప్పతాగి ఇంటికి చేరుకునేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో తల్లి నాగమణి, భార్య చైత్ర మందలించారు. రోజూ మద్యం తాగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, ఏదైనా పని చేసుకుంటూ గౌరవంగా బతుకుదామని హితవు పలికారు. అయితే మద్యానికి పూర్తి స్థాయిలో బానిసైన రాజన్న... అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇంట్లో వారు గమనించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రవీన్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
మహిళల్లో మద్యం అలవాటుకు ఈస్ట్రోజన్‌కు లింకు
న్యూఢిల్లీ: ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరిగిన సందర్భాల్లో మహిళల్లో మద్యం అతిగా తాగాలనే ఆలోచనలు ఎక్కువగా రావొచ్చని అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని వెల్ కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల సంబంధిత అధ్యయనం వివరాలు తాజాగా ‘నేచర్ కమ్యూనికేషన్స్’జర్నల్‌లో ప్రచురతమయ్యాయి. ఈస్ట్రోజన్ స్థాయిలకు మహిళల్లో అతి మద్యపాన అలవాట్లకు మధ్య దగ్గరి సంబంధం ఉందని తొలిసారిగా కనుగొన్నామని పరిశోధకులు చెప్పారు. పురుషులతో పోలిస్తే ఈ ధోరణి మహిళల్లోనే ఉందని పేర్కొన్నారు. మహిళ ఒకేసారి నాలుగు కంటే ఎక్కువ పెగ్గులు తాగితే ఆ అలవాటును అతిమద్యపాన సేవనంగా పేర్కొంటారు. సంబంధిత ప్రయోగాన్ని ఎలుకలపై చేసి నిర్ధారించుకున్నారు. మగ ఎలుకలతో పోలిస్తే ఆడ ఎలుకల మెదడులో ‘స్ట్రియా టెరి్మనల్‌లోని బెడ్ న్యూక్లియస్’న్యూరాన్లు ఈస్ట్రోజన్ ఎక్కువ అయినప్పుడు అతిగా మద్యం తాగాలని ప్రేరేపిస్తున్నాయి. మద్యం అందించిన తొలి 30 నిమిషాల్లోనే వాటిలో ఈ అతిపోకడ కనిపించింది. మహిళల్లో అతిమద్యం అలవాట్లకు కారణం ఏమై ఉంటుందో ఇన్నాళ్లూ బోధపడలేదు. ఎందుకంటే ఇంతకాలం జరిగిన ఈ తరహా పరిశోధనలు కేవలం పురుషులమీదే జరిగాయి. ఈ పరిశోధన ఫలితాలు మహిళల్లో మద్యం అలవాట్లపై అధ్యయనానికి కొత్త బాటలు వేశాయి’’అని వెల్ కార్నెల్ మెడిసిన్‌లోని ఫార్మకాలజీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్, నివేదికలో కీలక రచయిత క్రిస్టీన్ పెయిల్ వ్యాఖ్యానించారు. మహిళల్లో నెలసరి రోజులులాగా ఎలుకల్లో ఈస్ట్రోజన్ చక్రం కొనసాగినంతకాలం ఈ పరిశోధన చేశారు. ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువ ఉన్నన్ని రోజులూ ఆడ ఎలుకలు మద్యం ఫూటుగా తాగడం గమనించారు. మద్యానికి బానిసలైన మహిళా బాధితులకు చికిత్సా విధానాల్లో మార్పుకు ఈ కొత్త పరిశోధన ఎంతగానో సాయపడనుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
కొంచెమైనా.. ముంచేస్తుంది!
అతిగా మద్యం తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. కానీ కొందరు వైద్యులు, సైంటిస్టులు, డైటీషియన్లు వంటివారు రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని, గుండె జబ్బులను దూరం పెడుతుందని చెబుతూ ఉంటారు. కానీ దీనికి పక్కా ఆధారాలేమీ లేవని, రోజూ కాస్తంత ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ బారినపడే ముప్పు పెరిగిపోతుందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు అధ్యయనాలు, గణాంకాల్లో తేలిన అంశాలను ఆధారంగా చూపుతున్నారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అవి కేన్సర్‌కు దారితీస్తాయంటూ ఎలా హెచ్చరికలు ముద్రిస్తారో.. అలా ఆల్కహాల్ ఉత్పత్తులపైనా ముద్రించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయన నివేదిక ప్రకారం..ఆల్కహాల్‌కు కేన్సర్‌కు లింకేమిటి?⇒ తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకునే అవకాశమున్న కేన్సర్లలో.. పొగాకు, ఊబకాయం తర్వాత ఎక్కువగా నమోదవుతున్నవి ఆల్కహాల్ కారణంగానే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ రీసెర్చ్ విభాగం కూడా ఆల్కహాల్‌ను ప్రధానమైన కేన్సర్ కారకాల్లో (గ్రూప్ 1 కార్సినోజెన్) ఒకటిగా గుర్తించడం గమనార్హం. ⇒ అమెరికాలో ఏటా ఆల్కహాల్ కారణంగా కేన్సర్ బారినపడి మరణిస్తున్నవారు.. 20 వేల మంది ⇒ 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కారణంగా నమోదైన కేన్సర్ కేసులు... 7.4 లక్షల మంది.(ఒక డ్రింక్ అంటే సుమారుగా.. 330 మిల్లీలీటర్ల బీరు లేదా 35 మిల్లీలీటర్ల విస్కీ)7 ఆల్కహాల్‌తో రకాల కేన్సర్ల ముప్పుపొగాకు నేరుగా కేన్సర్లకు కారణమైతే.. ఆల్కహాల్ ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుంది. మన దేశంలో కాలేయ కేన్సర్‌కు ముఖ్య కారణంగా ఆల్కహాల్ నిలుస్తోంది. ఇక ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు రెండూ కలిస్తే కేన్సర్ల ముప్పు మరింత తీవ్రమవుతుందని కేన్సర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆల్కహాల్ కేన్సర్‌కు దారితీసేదిలా.. 1. శరీరంలో ఆల్కహాల్ అసిటాల్డిహైడ్‌గా మారుతుంది. ఇది మన కణాల్లోని డీఎన్ఏను దెబ్బతీసి, కేన్సర్ ముప్పును పెంచుతుంది. 2. ఆల్కహాల్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. ఇది శరీరంలో కణాలు, ప్రొటీన్లు, డీఎన్ఏను దెబ్బతీసి కేన్సర్‌కు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. 3. ఆల్కహాల్ కారణంగా శరీరంలో వివిధ హార్మోన్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది కేన్సర్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్‌పై ప్రభావం పడి రొమ్ము కేన్సర్ ముప్పు పెరుగుతుంది. 4. కేన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను (కార్సినోజెన్లు) శరీరం ఎక్కువగా సంగ్రహించడానికి ఆల్కహాల్ కారణమవుతుంది.ఎంత తాగితే.. అతిగా తాగినట్టు? ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల మేరకు.. రోజూ కనీసం ఒక డ్రింక్ ఆల్కహాల్ తాగేవారిలో కేన్సర్ల ముప్పు 10 నుంచి 40% వరకు పెరుగుతుంది. డ్రింక్స్ సంఖ్య పెరిగిన కొద్దీ.. ముప్పు అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది. అక్కడి అధ్యయనం మనకెందుకు? ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు తోడు ఆల్కహాల్ వినియోగం కూడా ఎక్కువగానే ఉండటంతో.. భారత్‌లోనూ ఈ కేన్సర్ల ముప్పు ఎక్కువ. ‘ది లాన్సెట్ అంకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల మేరకు... 2020లో భారత్‌లో కొత్తగా 62,100 ఆల్కహాల్ ఆధారిత కేన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేన్సర్ కేసుల్లో ఇవి 5 శాతానికన్నా ఎక్కువే కావడం గమనార్హం.మన దేశంలో కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఊబ కాయం సమస్యకు తోడుఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పరిస్థితికి దారితీస్తోందని అంకాలజీ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ కేన్సర్ల ముప్పు నుంచి బయటపడేదెలా?రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ ముప్పు తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. అంటే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం... ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటమేనని అంకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా అలవాటు మానుకోలేనివారు.. స్వల్పంగా తీసుకుంటూ మానేయాలని, అదే సమయంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు కచి్చతంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. –సాక్షి,సెంట్రల్ డెస్క్ -
మద్యపానం క్యాన్సర్‌కు కారకం: అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా మద్యపానం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మద్యపానం కారణంగా అనారోగ్యం బారినపడి మరణించినవారు కూడా ఉన్నారు. దీనికితోడు మద్యపానం కొన్నిరకాల క్యాన్సర్లకు కారణమవుతుందని కూడా వెల్లడయ్యింది. తాజాగా మద్యపానానికి సంబంధించిన ఒక ప్రకటన అమెరికాలో కలకలం రేపుతోంది.మద్యపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణమని, అమెరికన్ వినియోగదారులు కొనుగోలు చేసే మద్యం బాటిళ్లలపై ‘మద్యపానం క్యాన్సర్‌కు కారకం’ అని ముద్రించాలని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ప్రతిపాదించారు. ఈ దరిమిలా అమెరికన్, యూరోపియన్ మద్యం తయారీదారుల షేర్లు అమాంతం పడిపోయాయి. మద్యం సేవించడం మనిషి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి(Dr. Vivek Murthy) కనుగొన్నారు.మద్యపానం కారణంగా ఏటా సుమారు 20 వేల మంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారని, ఆల్కహాల్‌కు క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధం గురించి అమెరికన్లు తెలుసుకోవాలని డాక్టర్ వివేక్ మూర్తి పేర్కొన్నారు. గత దశాబ్దంలో అమెరికాలో నమోదైన సుమారు పది లక్షల క్యాన్సర్ కేసులకు మద్యం సేవించడం ప్రధాన కారణంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కొన్ని కంపెనీల వైన్, బీర్ బాటిళ్లపై ఇప్పటికే ఈ తరహా హెచ్చరిక లేబుల్స్ ఉన్నాయన్నారు. గర్భిణులు మద్యం సేవించడం వల్ల వారికి పుట్టే పిల్లలకు పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్ మూర్తి హెచ్చరించారు.కాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆల్కహాల్ బాటిళ్లపై ఆరోగ్యానికి హానికరమంటూ ముద్రిస్తున్నాయి. దక్షిణ కొరియాలో మద్యం బాటిళ్లపై కాలేయ క్యాన్సర్(Cancer) సంబంధిత హెచ్చరికను ముద్రిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లోనే ఆల్కహాల్ అనేది కాన్సర్‌కు కారకమని నిర్ధారించింది. క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేలా ఏ ఆల్కహాల్ కూడా ఉండదని పేర్కొంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పరిశోధకుల బృందం ప్రపంచంలోని నాలుగింట ఒక వంతు దేశాలు మాత్రమే ఆల్కహాల్‌పై ఆరోగ్య హెచ్చరికలు ముద్రిస్తున్నయని పేర్కొంది. క్యాన్సర్ హెచ్చరికలు చాలా అరుదుగా ఉంటున్నాయని ఆ బృందం తెలిపింది.దక్షిణ కొరియాలో మద్యం బాటిళ్లపై కాలేయ క్యాన్సర్‌కు సంబంధించిన హెచ్చరిక కనిపిస్తుంది. 2016లో దక్షిణ కొరియా(South Korea) ఈ హెచ్చరికల లేబుల్ ముద్రించడాన్ని తప్పనిసరి చేసింది. ఐర్లాండ్‌లోనూ మద్యం బాటిళ్లపై క్యాన్సర్ హెచ్చరికలు కనిపిస్తాయి. ఈ హెచ్చరికలను తప్పనిసరి చేసిన మొదటి దేశంగా ఐర్లాండ్ నిలిచింది. నార్వే ఇప్పటికే ఆల్కహాల్ వినియోగాన్ని చాలావరకూ నియంత్రించింది. ఇప్పుడు మద్యం బాటిళ్లపై క్యాన్సర్ హెచ్చరికలను ముద్రింపజేయాలనే ప్రతిపాదన చేసింది. ఇదేవిధంగా ‘ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి’ లాంటి హెచ్చరికలను మద్యం బాటిళ్లపై ముద్రించాలని థాయిలాండ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిని మద్యం పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.కెనడా ఆల్కహాల్‌పై క్యాన్సర్ హెచ్చరికలను తప్పనిసరి చేయనప్పటికీ, 2022లో కెనడియన్ పార్లమెంట్లో ఇటువంటి బిల్లును ప్రవేశపెట్టారు. కెనడాలోని పరిశోధకుల బృందం 2017లో క్యాన్సర్‌ను హెచ్చరిక లేబుల్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆల్కహాల్ ట్రేడ్ గ్రూపుల ఫిర్యాదుల కారణంగా ప్రభుత్వం ఈ అధ్యయనాన్ని విరమింపజేయాలని కోరింది. ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు? -
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్‌ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్‌లు రిసెప్షనిస్ట్‌ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. -
సిండికెట్లకు డబ్బే డబ్బు
-
కిక్కే.. కిక్కు
సాక్షి, అమరావతి: ‘సంపద సృష్టిస్తా’ అంటూ ఘనంగా చెప్పే సీఎం చంద్రబాబు... తాను సృష్టిస్తున్న సంపదేమిటో కొత్త సంవత్సర వేడుకల పేరిట చూపించారు. రాష్ట్రంలో మందుబాబులతో రెండు రోజులపాటు ఫుల్లుగా తాగించారు.డిసెంబర్ 30, 31 తేదీల్లోనే ఏకంగా రూ.331.84 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి లిక్కర్ సిండికేట్ దుకాణాలకు తరలిపోయి, మందుబాబులకు చేరింది. తద్వారా టీడీపీ మద్యం మాఫియాకు చంద్రబాబు భారీ లాభాలు తెచ్చిపెట్టారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మార్కు సంపద సృష్టికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.ముందుగానే తరలిన మద్యంకొత్త సంవత్సరం వేడుకల పేరిట భారీగా విక్రయించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి భారీగా మద్యాన్ని రాష్ట్రంలోని 26 డిపోలకు, అక్కడి నుంచి రాష్ట్రంలోని 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలకు తరలించారు. కొత్త సంవత్సర వేడుకలు మొదలవడానికి ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 30న ఏకంగా రూ.219 కోట్ల విలువైన మద్యం లిక్కర్ షాపులకు చేరింది. ఆ నిల్వలు సరిపోవని భావించిన ప్రభుత్వం డిసెంబర్ 31న మరో రూ.112 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు తరలించింది. తద్వారా రెండు రోజుల్లోనే రూ.331.84కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించింది.టీడీపీ మద్యం సిండికేట్‌కు డబ్బే డబ్బుకొత్త సంవత్సరం వేడుకల పేరిట రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్‌కు డబ్బుల పంట పండింది. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా సహకరించడంతో అడ్డూ అదుపు లేకండా మద్యం విక్రయాలు సాగించింది. ప్రభుత్వ ఉద్దేశం గుర్తించిన అధికారులు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా మద్యం విక్రయిస్తున్నా పట్టించుకోలేదు. దాంతో టీడీపీ లిక్కర్ సిండికేట్ ఏకపక్షంగా గుప్పిట పట్టిన 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు ఒక్కో షాపు పరిధిలో దాదాపు 10 బెల్ట్ దుకాణాల ద్వారా యథేచ్ఛగా మద్యం విక్రయించింది. అధికారికంగా రూ.331.84 కోట్ల విలువైన మద్యం విక్రయించగా.. ఒక్కో బాటిల్‌పై ఎంఆర్పీ కంటే రూ.10 నుంచి రూ.25 వరకు అధికంగా విక్రయించినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండిపోయింది. -
మద్యపానంలో ధర్మవరం టాప్
సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం అమలు చేసిన నూతన మద్యం పాలసీతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. కోరుకున్న వారికి ఏ క్షణంలోనైనా మద్యం దొరుకుతుండడంతో రోజూ మద్యం మత్తులో తూలుతున్న వారి సంఖ్య పెరిగింది.అగ్రస్థానంలో ధర్మవరంనిత్యావసర సరుకుల తరహాలో మద్యం అక్రమ సరఫరా కూటమి నేతలు జేబులు నింపుతోంది. అధికారిక పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో మద్యం దుకాణ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత అక్టోబరు 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు మద్యం దుకాణాలు వెలిశాయి. కొన్నచోటే మద్యం తాగేందుకు చాలా ప్రాంతాల్లో అనుమతిస్తుండడం మందుబాబులకు వరంగా మారింది. అక్రమార్జనే ధ్యేయంగా ప్రతి మద్యం దుకాణం పరిధిలో సగటున 10 బెల్టు షాపులూ నిర్వహిస్తున్నారు. క్వార్టర్‌పై రూ.100 ఎక్కువ ఇస్తే ఇంటి వద్దకే మద్యాన్ని చేరవేస్తున్నారు. జిల్లా పరిధిలో ఏర్పాటైన 87 ప్రైవేటు మద్యం దుకాణాల ప్రారంభమైనప్పటి నుంచి ఈ 50 రోజుల వ్యవధిలో రూ.79 కోట్ల విలువ చేసే 13 లక్షల లీటర్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఒక్క ధర్మవరం ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోనే రూ.19 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగడం విశేషం.రోజుకు 26 లక్షల లీటర్ల చొప్పునజిల్లా వ్యాప్తంగా వెలసిన 87 మద్యం దుకాణాలకు గానూ ఇప్పటి వరకూ 13 లక్షల లీటర్ల మద్యం గోదాముల నుంచి సరఫరా అయింది. సగటున 26 వేల లీటర్ల మద్యం వినియోగించినట్లు తెలుస్తోంది. అతి తక్కువ వ్యవధిలో రూ.79 కోట్ల విలువ చేసే మద్యం తాగారంటే ప్రతి మద్యం దుకాణం నుంచి సగటున రోజుకు 300 లీటర్లకుపైగా మద్యం సేల్ అవుతున్నట్లు అంచనా. ఇందులో బీర్ల కంటే మద్యం అమ్మకాలే భారీ స్థాయిలో ఆదాయం తెచ్చి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక చీప్ లిక్కర్ అందుబాటులోకి వస్తే మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.నాల్గో వంతు బీర్ల సేల్జిల్లా వ్యాప్తంగా ఈ 50 రోజుల వ్యవధిలో 1.44 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో కేవలం 35 వేల కేసులు మాత్రమే బీర్లు అమ్ముడు పోయినట్లు ఎకై ్సజ్ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆరంభంలో ఒక్కో మద్యం దుకాణం పరిధిలో రోజుకు రూ.లక్షకు మించి వ్యాపారం జరగలేదు. అనంతరం బెల్టు షాపులకు తెరలేపడంతో వ్యాపారం రెట్టింపయినట్లు తెలుస్తోంది. -
మద్యం మత్తు.. బంధాలు చిత్తు!
సీలేరు/రాయచోటి టౌన్: రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం.. బంధాలను బలి తీసుకుంటోంది. మద్యానికి బానిసైన కుమారుడిని... తండ్రి, మద్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని కుమారుడు హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ ఏనుగుబయలుకు చెందిన చెందిన కొర్రా సన్యాసి(30) మద్యం తాగి తండ్రితో, కుటుంబ సభ్యులతో రోజూ గొడవ పడుతున్నాడు. గురువారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రి చిత్రోతో గొడవ పెట్టుకున్నాడు. అడ్డుకున్న కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టాడు. కుమారుడి నుంచి తప్పించుకునేందుకు తండ్రి ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని అటవీ ప్రాంతానికి పారిపోయాడు. ఆయనను వెంబడిస్తూ కుమారుడు కూడా అడవిలోకి వెళ్లాడు. ఎక్కడ తన కుమారుడు తనను చంపుతాడోనన్న భయంతో గొడ్డలితో కుమారుడిని నరికి చంపేసి.. గొయ్యి తీసి పాతిపెట్టాడు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు అడవికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని.. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణ శివార్లలో నివాసముంటున్న వెంకట చలపతి(55) నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు. వారికి జీవన్ బాబు అనే 19 ఏళ్ల కుమారుడున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ తాగొచ్చి తల్లిని వేధించడంతో ఆమె ఇంటి నుంచి పారిపోయింది. అప్పటికే కోపోద్రిక్తుడైన కుమారుడు అక్కడే ఉన్న క్రికెట్ బ్యాట్‌తో వెంకటచలపతి తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడు తీవ్ర గాయాలతో నేలపై పడిపోవడంతో స్థానికులు రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. జీవన్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం అందించి అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాగు.. ఊగు.. జోగు... బాబు మార్కు ప్రగతి!
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విచ్చలవిడి వ్యాపారం సమాజానికి చేటు తెచ్చేలా కనిపిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇవి చాలవన్నట్టు వ్యాపారులు మద్యం డోర్ డెలివరీ కూడా మొదలుపెట్టారు. విజయవాడ పటమట ప్రాంతంలో ఒక షాపు యజమాని ఈ మేరకు కరపత్రాలు కూడా పంచారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంగతి ఏమోకానీ మద్యం ప్రోగ్రెస్ మాత్రం బాగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం ప్రభుత్వం డబ్బులు దండుకోవడానికి ఉపయోగపడుతూంటే.. సామాన్యుడి జేబు, ఒళ్లూ రెండూ హూనమైపోతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త మద్యం విధానం ప్రజలకు మేలు చేసేదా? కీడు చేసేదా అన్న చర్చ సాగుతోంది. ప్రజలు తమకు అధికారమిస్తే మద్యం సరఫరా చేస్తామన్న ఎన్నికల హామీ ఇచ్చిన పార్టీ దేశం మొత్తమ్మీద ఒక్క తెలుగుదేశం మాత్రమే కావచ్చు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతూండేవారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని, నాణ్యత లేని బ్రాండ్ల అమ్మకాలు జరుగుతున్నాయని అనేవారు. కూలీనాలీ చేసుకునే సామాన్యుడు సాయంకాలం ఒక పెగ్గు మందేసుకుంటామంటే ధరలు ఆకాశాన్ని అంటేలా చేశారని ధ్వజమెత్తేవారు. ఈ మాటలు, విమర్శలు అన్నీ ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమించిన తెలుగుదేశం పార్టీ నుంచి వస్తూండటం ఒక వైచిత్రి. ఏదైతేనేం.. బాబు గారి మాటలకు మందుబాబులు పడిపోయారు. ఎన్నికల్లో సుమారు పాతిక లక్షల మంది మందురాయుళ్లు టీడీపీ కూటమివైపు మొగ్గారని ఒక అంచనా. సామాన్యుడిని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసే, సామాజికంగానూ అనేక రకాల సమస్యలు తెచ్చిపెట్టే మద్యం జనానికి దూరంగా ఉంచాలని గత ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దుకాణాల వారు లాభాపేక్షతో పేదలను పిండుకుంటారన్న ఆలోచనతో సొంతంగా దుకాణాలు నడిపింది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంచేలా చేయడంతోపాటు ధరలు పెంచింది. బెల్ట్ షాపులు దాదాపుగా లేకుండా చేసింది. సామాజిక హితం కోసం చేపట్టిన ఈ చర్యలేవీ ఎల్లోమీడియాకు నచ్చలేదు. ఎప్పటికప్పుడు మద్యం విధానాన్ని విమర్శిస్తూ కథనాలు వండి వార్చేది. కానీ బెల్ట్‌షాపులున్నట్లు మాత్రం ప్రచారం చేయలేకపోయింది. ఈ వ్యతిరేక ప్రచారం ప్రభావంలో పడ్డ జనాలు జగన్‌పై వ్యతిరేకత పెంచుకుంటే.. చంద్రబాబు, పవన్, లోకేశ్ వంటివారు దానికి ఆజ్యం పోశారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే.. అధికారం వచ్చిన వెంటనే కూటమి నేతల వైఖరి పూర్తిగా మారిపోయింది. మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ పరమయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.రెండు లక్షలు వసూలు చేసి, లాటరీ వేసి మరీ కేటాయింపులు జరిపారు. ఈ లాటరీల ద్వారానే ప్రభుత్వానికి రూ.రెండు వేల కోట్లు వచ్చింది. కొంతమంది దుకాణాల కోసం ఎగబడి.. యాభై నుంచి వంద వరకూ దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇలా రూ.కోటి వరకూ ఖర్చు పెట్టినా వారికి ఒకట్రెండు షాపులూ దక్కలేదు. లాటరీలో దుకాణం కేటాయింపు జరిగిన తరువాత లైసెన్స్ ఫీజు కింద కూటమి ప్రభుత్వం మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. దీనికింద రూ.60 లక్షల వరకూ చెల్లించాల్సి వచ్చింది. ఇవి చాలవన్నట్లు కూటమి ఎమ్మెల్యేలకు షాపులలో వాటా లేదంటే ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. విశేషం ఏమిటంటే టీడీపీ వారే ఎక్కువ దుకాణాలు పొందినా సొంతపార్టీ వారికే లంచాలిచ్చుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఇక్కడితో ఆగిందా? లేదు. ప్రభుత్వం ఎకాఎకిన మార్జిన్‌ను 20 నుంచి పది శాతానికి తగ్గించింది. షాపుల ఏర్పాటు, నిర్వహణలు అదనం. వీటన్నింటి కారణంగా మద్యం దుకాణాల ద్వారా నష్టాలే ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ఇది ఒక కోణం. టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటైన లిక్కర్ సిండికేట్లు మందుబాబులను పిండేస్తున్న వైనం ఇంకోటి. రాష్ట్రం నలుమూలల ఈ సిండికేట్ విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు తెరిచేసింది. కొన్నిచోట్ల ఆయా గ్రామాల నేతలే కొందరు వేలం ద్వారా బెల్ట్‌షాపులు ఇచ్చేస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం డి.కొత్తూరు గ్రామంలో జరిగిన బహిరంగ వేలంలో ఒక బెల్ట్ షాపు రూ.లక్ష ధర పలికిందని తెలిసింది. వైసీపీ వారు, మద్యం వ్యతిరేకులు బెల్ట్ షాపులను వ్యతిరేకించినా, టీడీపీ నేతల ఆధ్వర్యంలో వేలం పాటలు యధేచ్చగా సాగినట్లు సోషల్ మీడియా వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. తణుకు వద్ద మద్యం సీసాలు సంతలో బల్ల మీద పెట్టుకుని తండ్రులు అమ్ముతుంటే వారి పిల్లలు అక్కడే కూర్చున్న వీడియో తీవ్ర కలకలం రేపింది. పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర హోం శాఖ మంత్రి మాత్రం బెల్ట్‌షాపులు అస్సలు లేనేలేవని అంటున్నారు. ఇంకోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం ధరలు పెంచి అమ్మినా, బెల్ట్ షాపులు పెట్టినా రూ.5 లక్షల వరకూ జరిమానా అంటూ బెదరగొడుతున్నారు కానీ.. ఆచరణలో ఇది ఏమాత్రం అమలు కావడం లేదు. రిజిస్ట్రేషన్ ఫీజులు, లైసెన్స్ ఫీజులు, మామూళ్లు, దుకాణాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక ఖర్చులు ఉండటంతో తాము నష్టాలను పూడ్చుకునేందుకు అధిక ధరలకు మద్యం అమ్మాల్సి వస్తోందని దుకాణందారులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రూ.99కే క్వార్టర్ మద్యం అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాస్తవానికి రూ.120 నుంచి రూ.130 వరకూ పెట్టాల్సి వస్తోందని మద్యం ప్రియులే చెబుతూండటం గమనార్హం. పైగా గత ప్రభుత్వంలో ఉన్న బ్రాండ్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయని అదనంగా కొన్ని వచ్చి చేరాయని నాణ్యతలో ఏమీ తేడా లేదని వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని మందు తాగి మరీ చెబుతున్నారు.మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై ప్రజల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. జనావాసాల మధ్య దుకాణాల ఏర్పాటును ప్రజలు పలుచోట్ల నిరసించారు. కానీ వారి గోడు పట్టించుకున్న వారు లేకపోయారు. గత ఏడాది మద్యం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం రాగా దాన్ని ఈ ఏడాది రూ.25 వేల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం తన బడ్జెట్లోనే పేర్కొంది. మద్యం ధరలు తగ్గించామని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెరుగుతోందంటే మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. 201419 మధ్య కూడా చంద్రబాబు బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నామని, చర్య తీసుకుంటామని పలుమార్లు చెప్పేవారు. కానీ 45 వేలకు పైగా బెల్ట్ షాపులు నడిచాయని ఒక అంచనా. అంతేకాదు. గోరుచుట్టపై రోకటిపోటు చందంగా ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటల పెంపకం విస్తారంగా సాగిపోతోంది. ఈ మధ్య జరిగిన పోలీసుల దాడిలో 15 ఎకరాలలో గంజాయి పెంచుతున్నట్లు గుర్తించారు. నగర ప్రాంతాలలో కూడా గంజాయి విక్రయాలు పెరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూటమి నేతలు చెప్పినదానికి, ఇప్పుడు జరుగుతున్నదానికి పూర్తిగా విరుద్దంగా పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారన్న ఆరోపణలు విరివిగా వినిపిస్తున్నాయి. ఏపీ సమాజం ఇదే కోరుకుంటోందా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రేషన్ పాయే.. మద్యం డోర్ డెలివరీ వచ్చే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘ఇక మద్యం తాగేందుకు వైన్‌షాపునకు రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరఫరా చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా మద్యం వ్యాపారులు ప్రచారానికి తెరలేపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట ప్రాంతంలోని ఓ వైన్‌షాపు నిర్వహకుడు ఈ రకంగా పోస్టులు పెట్టడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఘోరం అంటూ పలువురు మండిపడుతున్నారు. సూపర్‌సిక్స్, అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మద్యం డోర్ డెలివరీ చేసేందుకు బరితెగిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటికే రేషన్ ఇస్తే.. ఇప్పుడేమో..ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనాల ద్వారా ఇంటికే రేషన్ సరఫరా చేశారని, నేడు కూటమి ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీ చేస్తోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. మద్యం డోర్ డెలివరీ చేయడమే అభివృద్ధా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాయకులు జేబులు నింపుకొనే పనిలో ఉన్నారే కానీ ప్రజలకు చేసిన మంచి పని ఒక్కటీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఇంటికి మద్యం సరఫరా చేయడం కాదన్నారు. గత ప్రభుత్వంలా గుమ్మం వద్దకే పాలనను తీసుకెళ్లాలని, ఇంటి ముంగిటే సంక్షేమ పథకాలు అందించాలని హితవు పలుకుతున్నారు.ఎమ్మెల్యే అండతోనేనా..మద్యం హోం డెలివరీ చేసే వారికి తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అండతోనే పబ్లిక్‌గా ప్రచారం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మద్యం సిండికేట్లు సైతం ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తున్నాయా? అనే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాలో అంటున్నారు. దోచుకో.. దాచుకో.. పంచుకో.. అనేలా కూటమి పాలన సాగిస్తోందంటున్నారు. -
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్‌కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
నో ఆల్కహాల్, నో టాక్సిక్ పీపుల్ మలైకా పోస్ట్: షాకవుతున్న ఫ్యాన్స్
చిరకాల ప్రియుడు అర్జున్ కపూర్‌తో నుంచి బ్రేకప్ తరువాత నటి మలైకా అరోరా సంచలన ప్రకటన చేసింది. ఇటీవల కొన్ని పోస్ట్‌ల తరువాత 'నవంబర్ ఛాలెంజ్' ని ఆసక్తికరంగా ప్రకటించింది. మద్యం,నిద్రతోపాటు టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉంటానంటూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ గురించేనా అంటూ షాక్ అవడం అభిమానుల వంతైంది.శారీరకంగా దృఢంగా ఉండటానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈనెలలో(నవంబరు)లో మలైకా చేయాలను కుంటున్న తొమ్మిది పనుల లిస్ట్‌ను ప్రకటించింది. మలైకా నవంబర్ ఛాలెంజ్ 1. మద్యం దూరంగా ఉండటం 2. ఎనిమిది గంటల నిద్ర. 3. మంచి గురువును 4. రోజూ వ్యాయామం 5. రోజుకు పదివేల అడుగులు. 6. రోజూ ఉదయం 10 గంటల వరకు ఉపవాసం. 7. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం 8. రాత్రి 8 గంటల తర్వాత నోటికి తాః 9. విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉండటం. శారీరంగా ఆరోగ్యంగా ఉండేందుకు సాధారణంగా ఆరోగ్య నిపుణులు కూడా ఇలాంటి సలహాలే ఇస్తారు. అలాగే మానసిక ఉల్లాసానికి సానుకూలంగా, స్నేహంగా ఉండే వ్యక్తులతో సన్నిహితం ఉండటం కూడా అవసరమే అంటారు కూడా.కాగా అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత మలైకా,అర్జున్ రిలేషన్లో ఉన్నారు. అయితే 'సింగమ్ ఎగైన్' మూవీప్రమోషన్ ఈవెంట్లో తాను ఇంకా సింగిల్ అని ప్రకటించి, మలైకాతో తన బంధం గురించి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం తేల్చి చెప్పేశాడు. సింగం ఎగైన్ మూవీలో విలన్‌గా అర్జున్ కపూర్ మంచి మార్కులే సాధించాడు. సినిమా సక్సెస్ కావడంతో మరింత ఉత్సాహంగా ఉన్నాడు. -
విదేశీ మద్యం ఎలాతెచ్చారు?
చేవెళ్ల: రాయల్టీ చెల్లించకుండా విదేశీ మద్యం ఎలా తీసు కొచ్చారు..స్టాంప్ డ్యూటీ చెల్లించారా ? పార్టీకి మద్యం సరఫరా ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి తీసు కొచ్చారు? పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పార్టీలో మద్యం పంపిణీ చేసినా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అంటూ పలు అంశాలపై కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలను ప్రశ్నించినట్టు తెలిసింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించాడనే కేసులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల శుక్రవారం విచారణ నిమిత్తం చేవెళ్లలోని ఎకై ్సజ్ కార్యాలయానికి హాజరయ్యారు. జన్వాడలోని ఆయన ఇంటి పక్కనే ఉండే నాగేశ్వర్‌రెడ్డి విల్లాలోనూ విదేశీ మద్యం దొరకడంతో ఆయనకూ నోటీసులు అందజేయగా, ఆయన కూడా చేవెళ్లకు వచ్చారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్‌కుమార్, చేవెళ్ల సీఐ శ్రీలత తదితరులు రాజ్‌పాకాల, నాగేశ్వర్‌రెడ్డిలను విచారించారు. అడ్వకేట్ల ఎదుట నిర్వహించిన విచారణకు సంబంధించిన వీడియోలు తీసుకున్నట్టు సమాచారం. మధ్యాహ్నం 1:40 నుంచి రాత్రి 8:10 వరకు విచారణ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు రాజ్‌పాకాలను, ఆ తర్వాత నాగేశ్వర్‌రెడ్డిని విచారించారు. అనంతరం రాజ్ పాకాల, నాగేశ్వర్‌రెడ్డి ఒకేసారి న్యాయవాదులతో కలిసి బయటకు వచ్చారు. అయితే ఇంట్లో నిర్వహించే చిన్నపాటి దావత్ అయినందున.. తమ మేనేజర్ ఈ విషయాలు చూసుకున్నారని రాజ్ పాకాల చెప్పినట్టు సమాచారం. విచారణ జరిగినంత సేపు మీడియాతోపాటు ఇతరులెవరినీ లోనికి అనుమతించలేదు. బయటకు వచ్చిన అనంతరం రాజ్ పాకాల మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాం. ఇంట్లో నిర్వహించిన చిన్నపాటి దావత్‌ను మా మేనేజర్ చూసుకున్నారు. పార్టీలో లోకల్ మద్యం సర్వ్ చేశామన్నారు.కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందిఈ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో ఉంది. రాజ్ పాకాల, నాగేశ్వర్‌రెడ్డి విచారణకు సహకరించారు. కేసు కంటిన్యూ అవుతోంది. కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి వివరాలేవీ చెప్పలేం. –దశరథ్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ -
ఇండ్రస్టియల్ ఆల్కహాల్‌పై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: పారిశ్రామిక(ఇండ్రస్టియల్) ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరా నియంత్రపై చట్టాలు చేసే చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 1990లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచి్చన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్రాలకు ఈ విషయంలో ఉన్న అధికారాన్ని తొలగించలేమని తేలి్చచెప్పింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ధర్మాసనం వెల్లడించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 మెజారీ్టతో బుధవారం తీర్పును ప్రకటించింది. అయితే, ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న విభేదించారు. 1990లో సింథటిక్స్, కెమికల్స్ కేసులో అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇండ్రస్టియల్ ఆల్కహాల్ ఉత్పత్తిని నియంత్రించే అధికారం కేంద్రానికి ఉందని తీర్పు ఇచి్చంది. దీనిపై పలు అభ్యంతరాలు వచ్చాయి. 2010లో ఈ అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి సమీక్ష కోసం పంపించారు. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది మానవ వినియోగం కోసం కాదని ఈ ధర్మాసనం పేర్కొంది. -
యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం
బ్యూనస్ ఎయిర్(అర్జెంటీనా): బ్రిటన్ సంగీత సంచలనం, పాప్ గాయకుడు, గేయ రచయిత 31 ఏళ్ల లియాం పెనీ కన్నుమూశారు. బుధవారం సాయంత్రం అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ సిటీలోని ఒక విలాసవంత హోటల్ మూడో అంతస్థు బాల్కనీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మద్యం, మత్తుపదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల హోటల్ గది అంతా చిందరవందర చేసి కిందపడి చనిపోయారని వార్తలొచ్చాయి. పోస్ట్‌మార్టమ్ నివేదిక తర్వాతే మరణానికి కారణాలు తెలిసే వీలుంది. ఆయన బస చేసిన కాసాసర్ హోటల్ గదిలో మద్యంతోపాటు బెంజోడైజీపైన్ అనే ఔషధంను కనుగొన్నారు. బెంజోడైజీపైన్ను ఉద్రేకాన్ని తగ్గించేందుకు, మూర్ఛ, నరాల సంబంధ చికిత్సల్లో వాడతారు. పెనీ తన గది బాల్కనీ నుంచి దూకి ఉంటారని నగర భద్రతా మంత్రి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాబ్లో పోలీసీచియో మీడియాతో చెప్పారు. 14 ఏళ్లకే సంచలనం 2010లో బ్రిటన్ ప్రఖ్యాత టాలెంట్ రియాలిటీ షో ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి అద్భుతంగా పాటి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. మరో నలుగురితో కలిసి ‘వన్ డైరెక్షన్’పేరిట బాయ్బ్యాండ్ను నెలకొల్పాడు. ఈ బ్యాండ్ నుంచి వెలువడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. 7 కోట్ల ‘రికార్డ్’లు అమ్ముడుపోయాయి. 2016లో బ్యాండ్ నుంచి విడిపోయాక సోలోగా కెరీర్‌ను మొదలుపెట్టి సంచలనాలు సృష్టించారు. ఈయన చేసిన సంగీత విభావరిలు సైతం పెద్ద హిట్ అయ్యా యి. సొంత ఆల్బమ్స్ లక్షల్లో అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో వీటిని దాదాపు 390 కోట్ల సార్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మద్యపానంతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక ‘టియర్‌డ్రాప్స్’ పాట అందర్నీ నిరాశపరిచింది. -
‘సార్..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి.. జైలుకు పంపండి..’
ఫిలింనగర్: మద్యం మత్తులో ఓ మహిళ (44) పార్కు పక్కన తూలిపోతూ..రోడ్డు పక్కన పడుకుని న్యూసెన్స్ చేస్తుండగా సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని సయ్యద్‌నగర్ బస్తీలో నివసించే ఓ మహిళ గత కొంతకాలంగా మద్యానికి బానిసై అర్ధరాత్రి దాకా రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రాంతంలో మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తుండగా బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి ఆమె ఇంట్లో అప్పగించి వచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండానే ఆమె మళ్లీ అదే అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో బయటకు వచి్చంది. ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని లోటస్‌పాండ్ పార్కు వద్ద వివస్త్రగా పడి ఉంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె గురించి ఆరా తీయగా సయ్యద్‌నగర్‌లో నివసిస్తుందని తెలిసింది. దీంతో ఆమె కూతురికి ఫోన్ చేయగా ‘సార్..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి..జైలుకు పంపండి..’ అంటూ ఆమె ఇంట్లో చేసిన న్యూసెన్స్‌ను మొరపె ట్టుకుంది. ఆమె భర్త పెయింటర్‌గా పనిచేస్తుంటాడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, మద్యానికి బానిసై నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత నెల రోజుల నుంచి 10 మార్లు పోలీసులు ఆమెను ఇలా గే రోడ్లపై మద్యం మత్తులో తిరుగుతుండగా కు టుం బసభ్యులకు అప్పగించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యలే తాగుడు మాన్పించాలి: చంద్రబాబు
కర్నూలు (సెంట్రల్): నాణ్యమైన మద్యాన్ని మరో పది రోజుల్లో అందుబాటులోకి తెచ్చి రూ.99కే క్వార్టర్ బాటిల్ విక్రయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు భర్తలు మద్యం తాగకుండా భార్యలే చర్యలు తీసుకోవాలని, రూ.100 కోట్లతో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మద్యం షాపుల కేటాయింపులో శెట్టి బలిజలు, ఈడిగ, గౌడలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమాడలో పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. రూ.2.83 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజా వేదికలో మాట్లాడారు. గత ఐదేళ్లలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణలు చేశారు. వలంటీర్లు లేకుండానే ఒక్క రోజులోనే నూటికి నూరు శాతం పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వలంటీర్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. రాయలసీమను గీన్ ఎనర్జీ ప్రాజెక్టుగా తీర్చిదిద్ది 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు. ఎన్నికల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానని, అయితే ఎక్కడ ఇవ్వాలో అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌లో 2,650 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయబోతున్నామని, ఇక్కడ దాదాపు రూ.1,200 కోట్ల పెట్టబడులతో 50 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. కర్నూలు–బళ్లారి రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో ఉద్యోగులు పనిచేయలేదు... మీరంతా 95 నాటి సీబీఎన్‌ను చూస్తారని, తాను పరుగెత్తుతూ మిమ్మల్ని పరిగెత్తిస్తానని అధికారులనుద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ఉన్నతాధికారులు ఏమీ పనిచేయలేదని, వారి పనితీరు తెలుసుకునేందుకు త్వరలో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు రూ.2 లక్షల ఆరోగ్య బీమా పరిధిలోకి వర్తిస్తారని, మిగిలిన వారికిమాత్రమే ఆరోగ్యశ్రీని ప్రస్తుతం ఉన్నట్లు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బుడగ జంగాలకు ఎస్సీ రిజర్వేషన్‌పై నియమించిన వన్ మ్యాన్ కమిటీ నివేదికను కేంద్రానికి పంపినట్లు చెప్పారు. మదాసి/మదారి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్ల జారీ, బోయల సమస్యలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. పుచ్చకాయల మాడ నుంచి హోసూరు, పత్తికొండ, మద్దికెరకు రోడ్లు వేయాలని ఈ సందర్భంగా గ్రామస్తులు సీఎంకు మొర పెట్టుకోగా అవి మాత్రం అడగవద్దని, అందుకు సమయం పడుతుందని చెప్పారు. తన భర్త ఏమీ పని చేయడంలేదని, ఏమైనా పెన్షన్ ఇవ్వాలని ఓ మహిళ కోరగా.. ముందు ఆయనతో పనిచేయించుకోవాలని సీఎం సూచించారు. ముందు రోజు నుంచే ఆంక్షలు సీఎం చంద్రబాబు పర్యటనకు ఒక్క రోజే ముందే పోలీస్ ఆంక్షలు అమలయ్యాయి. సీఎం మధా్నహ్నం గ్రామానికి చేరుకోగా మంగళవారం ఉదయం నుంచే ప్రజలను ఇళ్ల ఉంచి బయటకు రానివ్వలేదు. పొలం పనుల కోసం వెళ్లిన వారిని గ్రామంలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆధార్ కార్డు చూపాలంటూ ఇబ్బందులకు గురి చేశారు. -
మద్యం సేవిస్తూ, బార్ డ్యాన్సర్లతో అసభ్య నృత్యాలు.. స్కూల్లో ఇవేం పనులు!
పాఠశాల అంటే టీచర్లు, విద్యార్ధులు, క్లాస్‌లు, విద్యాబోధన ఇవే మనకు తెలుసు. సాయంత్రం వేళ ఆటలు, సమయం సందర్భం బట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది. కానీ ఓ చోట బడికి వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, వారి భవిహ్యత్తుకు బాటలు వేయాల్సిన చోట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఏకంగా స్కూల్లోనే మద్యం తాగుతూ, బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో మంగళవారం వెలుగు చూసింది.సహర్సా జిల్లా జలాయిలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పెళ్లి వేడుకల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బ్యాండ్, నలుగురు బార్ డ్యాన్సర్లను తీసుకొచ్చారు. పాఠశాలలోనే మద్యం తాగుతూ ఆశ్లీల డ్యాన్స్‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో పలువురు మహిళలు భోజ్‌పురి పాటలకు అసభ్యకరంగా డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఆ మహిళల చుట్టూ కొందరు వ్యక్తులు చేరి, మద్యం తాగుతూ వారితో కలిసి డ్యాన్స్ చేయడం కూడా చూడొచ్చు. అయితే స్కూల్లో తాగి డ్యాన్సులు చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. మరోవైపుఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి మమతా కుమారి స్పందిస్తూఇలాంటి ఏ కార్యక్రమానికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ వైరల్ వీడియో తమ దృష్టికి రాగా.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారుबिहार के सरकारी स्कूल में बार बालाओं ने लगाए ठुमकेसहरसा के जलई ओपी क्षेत्र में स्थित विरगांव पंचायत के प्राथमिक विद्यालय नया टोला में बार बालाओं ने जमकर ठुमका लगाया। विडियो 24 सितंबर की रात का बताया जा रहा है। @bihar_police @NitishKumar @BiharEducation_ pic.twitter.com/Jk9Sn0fHhp— Republican News (@RepublicanNews0) September 26, 2024 -
ప్రభుత్వ మద్యం షాపులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్టంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేర్వేరు ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ చట్టాలకు సవరణలు చేసింది. ఈ రెండు ఆర్డినెన్స్‌లను గెజిట్‌లో ప్రచురిస్తూ న్యాయ శాఖ ఇన్చార్జి కార్యదర్శి వి.సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ల ప్రకారం వచ్చేనెల 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కొత్త మద్యం విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడంతో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు మార్గదర్శకాలను రూపొందించి న్యాయ శాఖకు పంపారు. వీటికి న్యాయ శాఖ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం గవర్నర్ అనుమతితో ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ప్రస్తుతం శాసన సభ సమావేశాలు లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌లు చట్ట రూపం దాలుస్తాయి. దాదాపు 3,736 రిటైల్ షాపులను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
మందు కొడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: మనదేశ మహిళల్లో మద్యం సేవించేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇది అధికంగా ఉన్నట్టుగా తేలింది. ఆల్కాహాల్ అలవాటు అనేది ప్రజారోగ్యంతో ముడిపడి.. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేసే అంశంగా మారింది. మద్యపానానికి అలవాటు పడడం వల్ల 60కు పైగా అనారోగ్యాలు, ఇతర సమస్యలకు దారి తీస్తున్నట్టుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం తీసుకునే అలవాటు పెరగడం, ఓ రుగ్మతగా, మానలేని అలవాటుగా మారింది. గత పదేళ్లలో భారత్‌లో మద్యపాన వినియోగమనేది గణనీయంగా పెరిగినట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019లో జర్మనీలోని టీయూ డ్రిస్డేన్ నిర్వహించిన అధ్యయనంలో 2010– 2017 మధ్యలో భారత్‌లో ఆల్కాహాల్ వినియోగం 38 శాతం పెరిగినట్టుగా వెల్లడైంది.ఏడాదికి ఒక్కో వయోజనుడు (అడల్ట్ పర్ ఇయర్) 4.3 లీటర్ల నుంచి 5.9 లీటర్లకు మద్యం సేవిస్తున్నట్టుగా తేలింది. ఈ కాలంలోనే స్థానికంగా విస్కీ, జిన్ వంటివి పెద్దమొత్తంలో తయారుకావడంతో పురుషులు, మహిళల్లో మద్యపానం అనేది మరింతగా పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. భారత్..మూడో అతిపెద్ద మార్కెట్ చైనా, రష్యాల తర్వాత.. భారత్ లిక్కర్‌కు మూడో అతిపెద్ద మార్కెట్‌గా మారింది. భారత్‌లో మద్యం వినియోగిస్తున్న వారి సంఖ్య పెరగడానికి.వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక, సామాజిక, ఇతర పరిస్థితులు ప్రభావితం చేస్తున్నట్టుగా తేలింది. మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో మద్యపానమనేది ఉన్నతవర్గాల జీవనశైలికి ప్రతిబింబంగా గతంలో గుర్తించిన పరిస్థితులున్నాయి. ఇతర ప్రాంతాల్లో రోజువారి జీవనంలో భాగంగా ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు, భయాలు, ఆందోళనలు వంటి వాటిని అధిగమించేందుకు ఓ సాధనంగా మద్యపానాన్ని చూస్తున్నారు. అదీగాకుండా ఖరీదైన మద్యమే కాకుండా, అన్ని వర్గాల వారికి (మహిళలతో సహా) చీప్ లిక్కర్ అనేది సులభంగా అందుబాటులోకి రావడంతో మద్యం సేవించడం అనేది అలవాటుగా మారుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఎంతో కాలంగా కట్టుబాట్లు, సామాజికపరంగా వివక్ష, వేధింపులకు గురైన మహిళలు మద్యపానంతోపాటు ఇతర విషయాల్లోనూ తమ సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఆల్కాహాల్ వినియోగం, మద్యపానం ఉపయోగించే పద్ధతులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా భౌగోళిక పరంగానూ మారుతున్నాయి. టాప్–7 స్టేట్స్ ఇవే... నేషనల్ ఫ్యామిలీ హెల్త్‌సర్వే–5 2019–20 డేటాను పరిశీలిస్తే మనదేశంలోని ఏడు రాష్ట్రాల్లో మహిళలు అధికంగా మద్యపానానికి అలవాటు పడినట్టుగా వెల్లడైంది. అందులో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. » 15–49 ఏళ్ల మధ్య వయసు్కల్లో 26 శాతం మహిళలు మద్యం సేవిస్తుండగా, అరుణాచల్‌ప్రదేశ్ టాప్–1లో ఉంది. ఆ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా ఆల్కాహాల్ తీసుకోవడం అధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. మద్యం సేవించడాన్ని అక్కడ ప్రోత్సహిస్తారు. ఆ రాష్ట్ర గిరిజన తెగల సంప్రదాయాలు, కట్టుబాట్లలో భాగంగా రైస్ బీర్ (అపాంగ్)ను అతిథులకు అందజేస్తారు. » సిక్కింలో 16.2 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇళ్లలోనే మద్యం తయారీకి ప్రసిద్ధిగా ఆ రాష్ట్రం గుర్తింపు పొందింది. కొన్నితరాలుగా ఈ సంప్రదాయం అక్కడ కొనసాగుతోంది. మద్యం సేవించడాన్ని సంస్కృతితో ముడిపడినట్టుగా భావిస్తారు అక్కడ. » అస్సోంలో 7.3 శాతం మంది మహిళలు ఆల్కాహాల్ తీసుకుంటారు. ఆ రాష్ట్రంలోని గిరిజన, ఆదివాసీ తెగలు మద్యం తయారీలో కొన్ని తరాలుగా నిమగ్నమై ఉన్నాయి. అక్కడ మద్యపానం అనేది ఓ జీవనశైలిగానూ, ఓ తంతుగా పరిగణిస్తారు. » దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే... తెలంగాణలో 6.7 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉన్నట్టుగా తేలింది. పట్టణ ప్రాంతాలతో పోలి్చతే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలే అధికంగా మద్యం సేవిస్తున్నట్టుగా వెల్లడైంది. » జార్ఖండ్‌లో 6.1శాతం మహిళలు. మరీ ముఖ్యంగా గిరిజన తెగలకు చెందిన వారిలోనే మద్యం అలవాటు అధికంగా ఉన్నట్టుగా తేలింది. వీరికి ఉద్యోగ, ఉపాధిపరంగా అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో ఈ తెగల్లోని అత్యధికులు రోజువారీ సవాళ్లను ఎదుర్కొనేందుకు మద్యపానం అలవాటుగా చేసుకున్నారు. » అండమాన్, నికోబార్ దీవుల్లో 5 శాతం మహిళలు మద్యానికి అలవాటు పడ్డారు. సామాజిక కట్టుబాట్లు, ఒత్తిళ్లు, ఇతర ప్రభావాలతో మహిళలు మద్యం సేవిస్తున్నారు. » ఛత్తీస్‌గఢ్‌లో 5% మంది మహిళలు ఆల్కాహాల్ తాగుతున్నారు. మహిళలకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరవడటం, మానసిక ఒత్తిళ్లకు గురికావడం వంటివి ఆల్కాహాల్ సేవనం పెరగడానికి ప్రధాన కారణాలుగా అంచనా వేస్తున్నారు.కారణాలు ఎన్నో....భారత్‌లోని మహిళల్లో మద్యపానం అలవాటుగా మారడానికి అనేక అంశాలు కారణమవుతున్నట్టుగా తేలింది. స్త్రీలలో ఆర్థిక స్వాతంత్య్రం పెరుగుదల, సమాజంలో వస్తున్న మార్పులు, ఆధునికత పేరుతో మారుతున్న అలవాట్లు వంటివి ప్రభావితం చేస్తున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆల్కాహాల్ మార్కెట్ బాగా విస్తరించింది. దీంతోపాటు మద్యపానానికి సంబంధించి వివిధ రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. స్థానిక బ్రాండ్స్ పెరుగుదల కూడా ఒక కారణమే. ఇలా అనేక రకాలుగా మద్యం అనేది మహిళలకు సైతం సులభంగా అందుబాటులోకి వచి్చనట్టుగా చెబుతున్నారు. -
ఇదేం పని ‘గురువా’!
శాంతిపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందే మద్యపానం చేస్తూ ఫొటోలకు చిక్కాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోని బాలుర హాస్టల్లో బుధవారం రాత్రి విద్యార్థులతో పాటు ఉన్న పీఈటీ మురళి అక్కడే మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పిల్లల ముందే వారు నిద్రించే పడకపై కూర్చుని హాయిగా మద్యం తాగుతూ ఎవరితోనో ఫోన్లో గొడవ పెట్టుకున్నాడు. పాఠశాలకు వచ్చి ఈ విషయాన్ని గమనించిన రామకుప్పం మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేంద్రను వివరణ కోరగా.. పిల్లల మధ్య కూర్చుని మద్యం సేవిస్తున్న కాంట్రాక్ట్ పీఈటీ ఫొటోలు తనకు కూడా వచ్చాయన్నారు. తాను ఈ విషయాన్ని డీసీవో దృష్టికి తీసుకెళ్లానని.. ఆమె గురువారం విచారణకు వస్తున్నారని చెప్పారు. -
మందు లవర్స్! లివర్ జాగ్రత్త!
గతంలో మద్యం తాగడం తప్పు అన్న భావనతో చాలామంది దానికి దూరంగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో తాగడం ఓ ఫ్యాషన్ అనే ధోరణి పెరుగుతుండటంతో పాటు... ఆల్కహాల్ అంటే మూడు నాలుగు దశాబ్దాల కిందట ఉన్న అపరాధభావన క్రమంగా కనుమరుగైపోతుండటంతోయువత ఎలాంటి జంకు గొంకు లేకుండా మద్యానికి అలవాటు పడుతున్నారు. దాంతో ఇటీవల యువతలో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, స్కార్డ్ లివర్, లివర్ సిర్రోసిస్ లాంటి ‘ఆల్కహాలిక్ సంబంధిత కాలేయ వ్యాధులు’ (ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్) పెరుగుతున్నాయి. మద్యం ఎన్నిరకాలుగా కాలేయాన్ని దెబ్బతీస్తుందో, ఎన్ని వ్యాధులు కలగజేస్తుందో తెలుసుకుందాం...కాలేయం అత్యంత కీలకమైన అవయవం. జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు బయటనుంచి జీర్ణవ్యవస్థ ద్వారా ఏ పదార్థం దేహంలోకి ప్రవేశించినా అందులోని విషాలను విరిచివేసి, వాటిని బయటకు ప్రయత్నిస్తుంది. ఆల్కహాల్ కూడా ఒకరకంగా విషమే. అందుకే దాని దుష్ప్రభావం పడకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో దీర్ఘకాలంగా మద్యం తాగే అలవాటున్న వ్యక్తుల్లో క్రమంగా పలు మార్పులకు లోనవుతుంది. దాంతో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, సిర్రోసిస్, కాలేయంపైన ఓ గాటులాంటిది పడే స్కారింగ్ వంటి దుష్ప్రభావాల కారణంగా క్రమంగా లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. ఇలా కాలేయాన్ని దెబ్బతీసి, ్రపాణాపాయం వైపునకు వెళ్లేలా చేసే వ్యాధులివి...ఫ్యాటీలివర్ : శక్తిగా మారి, దేహ అవసరాలు పూర్తయ్యాక అదే చక్కెర కాలేయంలో కొవ్వు రూపంలో పేరుకు΄ోతుంది. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఇది చాలా వేగంగా జరుగుతూ కాలేయ కణాలు కొవ్వు పేరుకున్నట్లుగా మారి΄ోతాయి. ఈ కండిషన్‌ను ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్‌లో మూడు దశలుంటాయి. మొదటి దశ : ఈ దశలో కాలేయ కణాల మధ్య కొద్దిగా కొవ్వు పేరుకుంటుంది. ఇది ్రపాథమిక సమస్య. రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి. కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్కు కూడా గురికావచ్చు. అంతేకాదు కాలేయం గాయపడటం వల్ల... ఓ మచ్చగా అంటే... స్కార్లాగా ఏర్పడవచ్చు. మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోవడమేగాక దాన్ని ఆకృతి కూడా మారిపోతుంది. కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప మరో వైద్యమేమీ పనిచేయదు. ఫ్యాటీలివర్ లక్షణాలు : మొదట్లో లక్షణాలు పెద్దగా కనిపించవు. అయితే సాధారణంగా ఇతర సమస్యలకోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది బయటపడుతుంటుంది ∙కొందరికి కుడివైపు పోట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) ΄÷డుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు : ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే అది కాలేయం పూర్తిగా దెబ్బతిని΄ోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి పరిణామాలకు దారితీయవచ్చు ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్)కూ, అక్కడి నుంచే క్రమంగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని భావించడానికే వీల్లేదు. కొన్నిసార్లు నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ తొలిదశలో ఇది కనిపించినప్పుడే జాగ్రత్తపడాలి. ఫ్యాటీ లివర్‌కు చికిత్స : ∙ఆల్కహాల్‌తోనే ఫ్యాటీలివర్ వచ్చిందని తేలితే... లేదా ఇది వచ్చిన వారిలో ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను డాక్టర్లు సూచిస్తారు చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. లివర్ స్కార్ : ఆల్కహాల్ అలవాటు మితిమీరిన కొందరిలో కాలేయం వాపు రావచ్చు. దాన్ని లివర్ ఎన్లార్జ్మెంట్గా చెబుతారు. వీళ్లలో ఆ గాయం తీవ్రమై కాలేయం మీద మచ్చ (స్కార్)లా ఏర్పడవచ్చు. ఇది చాలా ప్రమాదం తెచ్చిపెట్టే అంశం కాబట్టి జాగ్రత్తపడాలి. లివర్ సిర్రోసిస్ : హెపటైటిస్–ఏ, హెపటైటిస్–బి, హెపటైటిస్–సి, హెపటైటిస్–డి, హెపటైటిస్–ఇ వంటి కొన్ని కాలేయ ఇన్ఫెక్షన్లు ముదరడంతో లివర్ సిర్రోసిస్ రావచ్చు. అలాగే ఆల్కహాల్ అలవాటు కారణంగా కాలేయం ఆకృతి, దానికి ఉండే సహజ స్వాభావికమైన రంగు దెబ్బతిని, అది జిగురుజిగురుగా మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి ఆల్కహాల్ తీసుకునే అలవాటుంటే సిర్రోసిస్ ముప్పు మరింత ఎక్కువ. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి మద్యం అలవాటు ఉంటే అది కాలేయ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. ఇలాంటివారికి ప్రమాదం మరింత ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు: ∙అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలా వరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది ∙ఫ్యాటీలివర్ మొదలుకొని మిగతా అన్ని కాలేయ సమస్యలకు లివర్ ఫంక్షన్ పరీక్ష (ఎల్ఎఫ్టీ) అవసరం. దాంతో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న విషయం తెలుస్తుంది ∙డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు ఏమైనా పెరిగాయా అన్నది కూడా పరిశీలించాలి ∙కొందరిలో లివర్ బయాప్సీ (అంటే సూది ద్వారా కాలేయానికి సంబంధించిన చిన్న ముక్కను సేకరించి) చేయించాల్సిన అవసరం ఉంటుంది.ఫ్యాటీలివర్ దశలోనే జీవనశైలి మార్పులో జాగ్రత్తపడటం చాలా మేలు. అయితే... పరిస్థితి లివర్ సిర్రోసిస్ దశకు చేరాక కాలేయ మార్పిడి మినహా మరే చికిత్స కూడా సాధ్యం కాదు. అందుకే ఫ్యాటీలివర్ దశలో ఉన్న సమయంలోనే ఆల్కహాల్ అలవాటు పూర్తిగా మానేయడం మంచిది. -
Telangana: మందు ఖర్చులో మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెళ్లి అయినా, చావు అయినా... సందర్భమేదైనా... పది మంది కూడారంటే ఒకటి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అదేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీకు అర్థమయినా కాకపోయినా, మీరు ఊహించినా లేకున్నా దానిపేరు మద్యం. ఈ మద్యం కిక్కు లేకుండా మన దగ్గర ఏ సంబురం నడవదంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో దేశంలోకెల్లా అత్యంత ఎక్కువ తలసరి మద్యం ఖర్చు మన రాష్ట్రంలోనే నమోదయింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం మీద తలసరి ఖర్చు బాగానే నమోదైంది. తెలంగాణ తలసరి ఖర్చు రూ. 1,623 కాగా, ఏపీలో అది రూ.1,306గా నమోదైంది. అయితే, 2016–17తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఖర్చు తగ్గిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2016–17లో ఏపీలో సగటు మనిషి ఏడాదికి రూ. 1,324 మద్యం మీద వెచ్చిస్తే, 2022–23 వచ్చేసరి కి అది రూ.1,306కి తగ్గడం గమనార్హం. ఇక, కరోనా సమయంలో అయితే తెలంగాణలో అత్యధి క సగటు ఖర్చు నమోదైంది. 2020–21లో ఏకంగా రూ.1,719 తలసరి ఖర్చు వచ్చిందని అధ్యయన గణాంకాలు చెబుతున్నాయి. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలకు తోడుగా రూ. 1,000 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. -
కాపురాల్లో మద్యం చిచ్చు
సాక్షి, హైదరాబాద్: పచ్చని కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. ‘çమద్యం మత్తు’ కారణంగా కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయి. గృహ హింసకు దారితీస్తున్నాయి. పోలీసు కేసులు, కోర్టు మెట్లెక్కే వరకు వెళ్తున్నాయి. గత కొన్నేళ్లుగా నమోదవుతున్న కేసులకు కారణాలను పరిశీలిస్తే.. మద్యం అలవాటు తీవ్రత స్పష్టమవుతోంది. ఇక మరికొందరు తమ జీవిత భాగస్వామి ప్రవర్తనపై అనుమానం పెంచుకుంటున్నారు. దీనితో మనస్పర్థలు ఏర్పడి సంసారం గందరగోళంలో పడిపోతోంది. అయితే గృహ హింస కేసులలో బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి తెచ్చిన ‘సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్)’ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు ఈ సమస్యను కొంత దారిలోకి తెస్తున్నాయి. 2023 ఫిబ్రవరి నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అందుబాటులోకి తెచ్చిన 27 సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో ఇప్పటివరకు 34,090 కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన 40 శాతం జంటలను తిరిగి కలిపారు.మూడు నుంచి నాలుగు సిట్టింగ్లుగృహ హింసకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని సీడీఈడబ్ల్యూ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లకు అటాచ్ చేస్తున్నారు. ఈ సెంటర్లలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సిబ్బంది.. జంటలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కలహాలకు ప్రధాన కారణాలను తెలుసుకుంటారు. భార్య, భర్త ఇద్దరినీ కలిపి, విడివిడిగా మాట్లాడటంతోపాటు అవసరం మేరకు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు. ఇలా మూడు, నాలుగు సార్లు కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తారు. భార్యాభర్తలకు కలిపి, అవసరమైతే కుటుంబంతోనూ కలిపి కౌన్సెలింగ్ చేస్తారు. కలహాలకు కారణమవుతున్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రోత్సహిస్తారు.పెళ్లయిన ఐదేళ్లలోపే..కుటుంబ కలహాల సమస్య యు వ జంటల్లోనే ఎక్కువగా ఉంటు న్నట్టు కేసులను బట్టి స్పష్టమవు తోంది. పోలీసు కేసులు, విడాకు ల వరకు వెళ్తున్న జంటల్లో.. పెళ్ల యి ఐదేళ్లు కూడా కానివారే 40% నికిపైగా ఉంటున్నారు. ఈ తర హా కేసులలో భార్యాభర్తల వయ సు 23 నుంచి 30 ఏళ్లలోపే ఉంటుండటం గమనార్హం.⇒ విడాకుల వరకు వెళ్లేందుకు దారితీస్తున్న అంశాలు⇒భాగస్వామి మద్యానికి బానిస కావడం 63%⇒డబ్బులు, కట్నం కోసం డిమాండ్ చేయడం 49%⇒భాగస్వామి ప్రవర్తనపై అనుమానం 47%గృహ హింసకు కారణమవుతున్న అంశాలివీ..⇒ వరకట్నం కోసం వేధింపులు ూ మద్యానికి బానిసకావడం⇒ వివాహేతర సంబంధాలు ూ అత్తమామల వేధింపులు⇒ జీవిత భాగస్వామిపై అనుమానం⇒ కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు కావడం -
మత్తు వదిలిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాలు రవాణా చేసే ముఠాలను కట్టడి చేయడంతోపాటు మత్తుపదార్థాలకు అలవాటుపడిన వారిని అందులోంచి బయటపడేసే వ్యూహంతో ముందుకు వెళితేనే మత్తు మహమ్మారిని తరిమికొట్టడం సాధ్యమవుతుందని నిపుణులు చెపుతున్నారు. మద్యం, కల్తీకల్లు, గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ సెంటర్లకు రోగుల సంఖ్య ఇటీవల పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతానికి భిన్నంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల గురించి అవగాహన పెరుగుతుండటంతో డీ–అడిక్షన్ సెంటర్లలో చేరే రోగుల సంఖ్యా పెరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డీ–అడిక్షన్ సెంటర్ల పనితీరును టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవలే పరిశీలించి ఓ నివేదికను తయారు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 డీ–అడిక్షన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తుండగా.. ఐదు సెంటర్లు పూర్తిగా మూతపడినట్టు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా డీ–అడిక్షన్‌కు ప్రాధాన్యం పెరగడంతోనషాముక్త భారత్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో డీ–అడిక్షన్ సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీసం 10 చొప్పున బెడ్లు అందుబాటులోకి తెచ్చారు. మద్యం బానిసలే ఎక్కువ.. డీ–అడిక్షన్ సెంటర్లలో చేరుతున్న రోగులలో ఎక్కువ మంది మద్యానికి బానిసలైన వారే ఉంటున్నారు. తర్వాత పెద్ద సంఖ్యలో గంజాయి బానిసలు ఉంటున్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు 12 వరకు డీ–అడిక్షన్ సెంటర్లలో చేరిన రోగుల సంఖ్య ఆధారంగా చూస్తే.. హనుమకొండలోని డీ–అడిక్షన్ కేంద్రంలో 1,067 మంది మద్యానికి బానిసలైన వారుండగా, గంజాయి రోగులు 344 మంది ఉన్నారు. ఆదిలాబాద్ సెంటర్లో 781 మంది మద్యానికి బానిసలైన వారు చేరగా.. 53 మంది గంజాయి బాధితులు ఉన్నారు.ఎల్బీనగర్లోని సెంటర్లో 933 మంది మద్యానికి బానిసలైన రోగులు, 39 మంది గంజాయికి బానిసలైన రోగులున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో 850 మంది మద్యం బానిసలు, 30 మంది గంజాయికి బానిసలైన రోగులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని సెంటర్లో 722 మంది మద్యానికి బానిసలైన వారు.. 24 మంది గంజాయికి అలవాటుపడిన వారున్నారు. ఖమ్మం జిల్లా మధిర‡ సెంటర్లో 427 మంది రోగులు మద్యానికి బానిసలైన వారుండగా, 23 మంది గంజాయి నుంచి డీ–అడిక్షన్ కోసం చేరారు. డీ–అడిక్షన్ సెంటర్లు అంటే..? మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన వైద్య సహాయం, కౌన్సెలింగ్ అందించి వారిని తిరిగి ఆరోగ్యవంతులుగా మార్చే కేంద్రాలను డీ–అడిక్షన్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ (ఎన్ఏపీడీడీఆర్) పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. -
బాలుడిపై యువకుల పాశవిక దాడి
చుండూరు (కొల్లూరు): కొందరు యువకులు మద్యం మత్తులో ఓ బాలుడిపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొడుతూ వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు... బాపట్ల జిల్లా చుండూరు మండలం చినపరిమికి చెందిన బాలుడు(17) ఒంగోలు వెళ్లి తన పెదనాన్న వద్ద ఉంటూ కుట్టుపని నేర్చుకుంటున్నాడు. అతను కొన్ని రోజుల కిందట గ్రామానికి వచ్చి అనారోగ్యం వల్ల ఒంగోలు వెళ్లలేదు.గత నెల 31న ఆ బాలుడి వద్దకు తనతో కలిసి చదువుకున్న స్నేహితుడు సూర్య, మరో యువకుడు బైక్‌పై వచ్చి సరదాగా బయటకు వెళదామని చెప్పి మండూరు చర్చి డొంక రోడ్డులోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడున్న మరో ముగ్గురు యువకులు మద్యం తాగి ఆ బాలుడిని కూడా బీరు తాగాలని ఒత్తిడి చేశారు. అందరూ మద్యం తాగుతుండగా, చినగాదెలవర్రుకు చెందిన దయా, ఆలపాడుకు చెందిన చిన్ను అనే వ్యక్తులు వచ్చి వారితో కలిశారు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా యువకులందరూ కలిసి ఆ బాలుడిని దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. కాళ్లు, చేతులు, కర్రలు, బెల్టులతో పైశాచికంగా కొడుతూ అతని చొక్కా చింపేశారు. సుమారు రెండు గంటలు దాడి చేస్తూ వీడియోలు తీశారు. ప్రమాదమని చెప్పి ఆస్పత్రిలో చేర్పించేందుకు ప్రయత్నం.. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఇద్దరు యువకులు ఆటోలో తెనాలి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి ఆస్పత్రిలో చేరి్పంచేందుకు ప్రయతి్నంచారు. అయితే, ఇది ప్రమాదం కాదని, కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని ఆ యువకులు బయటకు తీసుకురాగా, బాలుడికి తెలిసిన వ్యక్తి చూసి ఏమైందని ప్రశి్నంచడంతో యువకులు పారిపోయారు. అతను బాధిత బాలుడిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చేరి్పంచాడు.బాధితుడి ఫిర్యాదు మేరకు చుండూరు ఎస్ఐ మహ్మద్ రఫీ ఈ నెల ఒకటో తేదీన కూచిపూడి, తెనాలి, పరిమి, గాదెలవర్రు, ఆలపాడుకు చెందిన ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారిపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన యువకులు అధికార పారీ్టకి చెందినవారు కావడంతో రాజీ చేయాలని వేమూరుకు చెందిన ముఖ్య నేత, పార్లమెంట్ స్థాయి నేత ఒకరు పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో దాడికి పాల్పడినవారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేంత చిన్న కేసులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.బైక్‌ల చోరీ కేసులలో పట్టించానని కొట్టారు జూలై 31వ తేదీన నడుచుకుంటూ ఇంటికి వెళుతుంటే చినపరిమి గ్రామానికే చెందిన నా స్నేహితుడు సూర్య బైక్‌పై ఎక్కించుకెళ్లాడు. మండూరు గ్రామం సమీపంలోకి తీసుకెళ్లి బీరు తాగించి కొట్టడం ప్రారంభించారు. సూర్యతోపాటు చినగాదెలవర్రుకు చెందిన యువకుడు దయ, మరో ఐదుగురు ఉన్నారు. తెనాలిలో నన్ను కాల్వలో పడేద్దామని తీసుకెళుతుంటే మా ఊరి వ్యక్తి కనిపించాడు. ఆయన సాయంతో వైద్యశాలలో చేరాను. గతంలో బైక్‌ల చోరీ విషయంలో దయా అనే వ్యక్తిని పోలీసులకు పట్టించానన్న కక్షతో నన్ను కొట్టారు. – బాధిత బాలుడు -
మర్యాదకు మందు తెస్తే తాగకుండా పారిపోయిన చుట్టం
-
మద్యం హోమ్ డెలివరీ!.. త్వరలో ఈ రాష్ట్రాల్లో..
ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి వాటిని హోమ్ డెలివరీ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్వహించడానికి యోచిస్తున్నారు. మద్యం డెలివరీలను అనుమతించడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నట్లు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.ఇప్పటికే మద్యం హోమ్ డెలివరీ విధానం ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం హోమ్ డెలివరీ చేయడానికి అనుమతించాయి. ఆ తరువాత ప్రస్తుతం ఈ విధానంలో మద్యం డెలివరీ చేస్తున్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అమ్మకాలు 20 నుంచి 30 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.గతంలో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వంద శాతం మంది హైదరాబాద్ వాసులు మద్యం హోమ్ డెలివరీ విధానాలకు సుముఖత చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఇది ఎప్పుడు అమలులోకి వస్తుంది అనే విషయానికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.మద్యం హోమ్ డెలివరీ అనేది పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి, పెద్ద నగరాల్లో మితమైన మద్యం అందించడానికి ఉపయోగపడుతుంది. మహిళలు, సీనియర్ సిటిజన్లు మద్యం కోసం షాప్ ముందు నిలబడాల్సిన అవసరం ఉండదని ఓ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. అయితే మద్యం హోమ్ డెలివరీ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన ఉందని పలువురు చెబుతున్నారు. -
ప్రిన్సిపాల్ గదిలో బీరు సీసాలు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలెంల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో మద్యం సీసాలు దర్శనమివ్వడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తరచూ మద్యం తాగుతూ ప్రిన్సిపాల్ శైలజ తమను వేధింపులకు గురిచేసు్తన్నారని వారు ఆరోపించారు. ప్రిన్సిపాల్ అర్థరాత్రి వేళ సహాయ కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి మద్యం తాగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రిన్సిపాల్ రూమ్ కు తాళం వేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో వేణుమాధవ్‌రావు, కళాశాలలో ఆర్సీవో అరుణకుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి, డీఎస్పీ రవికుమార్ కశాశాలకు చేరుకున్నారు. వాస్తవాలను విచారించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. ఈ ఘటనపై మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌ను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటీ అధికారిగా అదనపు కలెక్టర్ బీఎస్ లతను నియమిస్తూ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రాథమిక విచారణ ఆధారంగా కళాశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి ఒక ప్రకటనలో తెలిపారు. -
మద్యం తాగుతూ..విధి నిర్వహణ
మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఒకరు మద్యం తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం మంగళవారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా సదరు ఉద్యోగి మద్యం తాగి విధి నిర్వహణకు రావడం పట్ల అప్పటి జిల్లా అధికారి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అదేవిధంగా మళ్లీ ఆ ఉద్యోగి మద్యం తాగి విధుల్లోకి రావడం, తాజాగా కార్యాలయంలోనే మద్యం తాగడంపై జిల్లా ఉన్నతాధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇటీవల రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగినప్పటికీ అధికారుల తీరుమాత్రం మారకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారి ఎండీ గౌస్ పాషాను వివరణ కోరగా కార్యాలయంలో మద్యం సేవిస్తూ ఉద్యోగం చేయడం సరికాదన్నారు. విషయం తెలిసిన వెంటనే సదరు ఉద్యోగిని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో ఔట్‌సోరి్సంగ్ ఏజెన్సీకి సరెండర్ చేశామని తెలిపారు. -
నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
నాగోలు: జనావాసాల మధ్య..ఉదయం 6 గంటలకే మద్యం తాగుతూ ఓ యువతి, యువకుడు హల్చల్ చేశారు. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ బోడిచెర్ల (25) ఓ యువతితో కలిసి ఫతుల్లాగూడ 100 ఫీట్ రోడ్డుకు కారులో వచ్చారు.కారు ఆపి బీర్లు, సిగరెట్లు తాగుతూ హల్చల్ చేశారు. ఇదే సమయంలో ఆ రహదారిపై మార్నింగ్ వాక్కు వచ్చిన వాకర్స్ కలుగజేసుకుని వారిని హెచ్చరించారు. ఇలా బహిరంగంగా మద్యం తాగుతూ గొడవలు చేయొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో యువతీయువకులు ఇద్దరు వారితో వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకున్నారు.వాకర్స్‌లో ఒకరు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా యువతి అతని వద్ద నుండి ఫోను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనను కొందరు వాకర్స్ వీడియోలు తీయగా వైరల్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి, యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు. . కాగా వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని తెలిసింది.పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ అడిగిన వారితో గొడవ పెట్టుకున్న యువతీ యువకుడుమద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను బూతులు తిట్టిన యువతిహైదరాబాద్ - నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో… pic.twitter.com/DY6d2hI7Vq— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024 -
Hyderabad: మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం
రసూల్‌పురా: మద్యం సీసాల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలి బోల్తా పడిన ఘటన బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొంపల్లి ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి రూ.32 లక్షల విలువైన మద్యం కాటన్ బాక్సులతో డీసీఎం కంటైయినర్ బంజారాహిల్స్ వైపు వెళ్తోంది. బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్ వద్దకు చేరుకోగానే వెనక టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కంటెయినర్లో నుంచి మద్యం సీసాల కాటన్ బాక్స్‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమీపంలో ఉన్న బస్తీవాసులు, రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు మద్యం సీసాలను తీసుకుని ఉడాయించారు. మద్యం సీసాలను తీసుకుని వెళ్తున్న కొందరిని డీసీఎం డ్రైవర్ బసవలింగప్ప, ఇద్దరు హెల్పర్లు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. డీసీఎం బోల్తా పడిన ఘటనతో జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. -
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్‌ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్‌గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్‌కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్‌తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్‌కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్‌ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్‌గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్‌పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్‌తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్‌లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్‌తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్‌కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్‌ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
మద్యానికి బానిసైతే...ఇంత భయంకరమా? వైరల్ వీడియో!
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలుసు, మితిమీరితే ప్రాణాలకే ప్రమాదమనీ తెలిసు. అయినా మద్యం తాగే వారి సంఖ్య రోజురోజుకుపెరుగుతూనే ఉంది. అసలు మద్యం లేదా అల్కహాల్ సేవించడం ఎంత ప్రమాదమో తెలుసా?ఒక్కసారి మద్యానికి బానిపైపోతే మనిషి చివరికి ఎలాంటి దుస్థితికి దిగజారి పోతాడో తెలిపే వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. వారాలు, నెలలు, సంవత్సరాల పాటు ఆల్కహాల్‌కు బానిసై, అకస్మాత్తుగా అకస్మాత్తుగా మద్యపానాన్ని ఆపివేసినా లేదా బాగా తగ్గించేసినా మానసిక, శారీరక సమస్యలు రెండూ వస్తాయి. ఈ లక్షణాలు తేలికపాటి నుండి తీవ్రంగా మారవచ్చు. తక్షణ వైద్య సహాయం తీసుకోకపోతే ప్రాణాపాయం కావచ్చు. మద్యం తాగిన తరువాత నరాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతో అది క్రమేపీ మనతోపాటు పాటు నరాలు కూడా అలవాటు పడతాయన్న మాట. చివరికి అదొక ఎడిక్షన్‌లా మారిపోతోంది. అంటే అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. ఈ స్థాయి మరింత ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం) లాంటివి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి ఇది ప్రాణాపాయం కావచ్చు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి జరుగుతోంది అదే. మద్యానికి అలవాడు పడిన నరాలు స్థిమితంగా ఉండలేకపోయాయి. దీంతో కాస్త మద్యం పుచ్చుకోగానే కుదుటపడ్డాయి. అంతిమంగా ఇది మరణానికి దారితీస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఆల్కహాల్ విత్ డ్రాయల్ లక్షణాలు: అధిక రక్త పోటు, నిద్రలేమి, శరీర భాగాలు బాగా వణికిపోవడం (హైపర్ రెఫ్లెక్సియా) ఆందోళన, కడుపు నొప్పి, తలనొప్పి, గుండె దడ లాంటివి. ఓకే అండీ, మనం మందు తాగమే అనుకోండి, ముందు నరాలు ఎక్సైట్ అవుతాయన్నమాట, తర్వాత తర్వాత అలవాటు పడతాయన్నమాట, చివరికి అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట ఇలాగే. దీన్నే ఆల్కహాల్ విత్‌డ్రావల్ అంటారు. బాగా ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం), ఇంకా ప్రాణాపాయం కావచ్చు. pic.twitter.com/wmqiDsTr6U — Srikanth Miryala (@miryalasrikanth) April 12, 2024 మద్యానికి బానిసైతే ♦ ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ♦ అతిము ఖ్యమైన అవయం కాలేయం దెబ్బతింటుంది. ఇది ముదిరితే కాలేయ కేన్సర్‌కు దారి తీస్తుంది. ♦ఏకాగ్రతను కోల్పోవడం, పాదాలు, చేతుల్లో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు భావోద్వేగాలను నియంత్రించ లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి ♦ ఎంజైమ్‌లు అండ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. నోట్: మద్యం ఆరోగ్యానికి అనర్థం. ఇందులో రెండో మాటకు తావేలేదు. ఆరోగ్య జీవనం కోసం ఆ వ్యసనాన్ని మెల్లిగా వదిలించుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. అవసరమైన నిపుణుల సలహాలు తీసుకొని మద్యానికి దూరంగా ఉండటం ఉత్తమం. -
మద్యపాన వ్యసనానికి చెక్‌పెట్టే సరికొత్త చికిత్స విధానం!
మద్యపాన వ్యసనం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది. బంధాలను ముక్కలు చేసి ఎవర్నీ ఎవరికీ కాకుండా చేసి జీవితాలను కాలరాస్తోంది. అలాంటి మహమ్మారిలాంటి ఈ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు ఇప్పటివరకు అందుబాటుల్లో లేవు. డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి కదా! అని అంటారేమో. మందు బాబులు అక్కడ ఇచ్చే కౌన్సిలింగ్‌కి, జీవనశైలికి దాని అడిక్షన్ నుంచి బయటపడినట్లు అనిపిస్తారు అంతే. కళ్ల ముందు చుక్క కనిపించిందంటే మళ్లీ కథ మాములే. కొందరే ఆయా సెంటర్ల నుంచి మెరుగై మళ్లీ దాని జోలికి వెళ్లకుండా ఉండేందుకు యత్నిస్తారు. ఇది కూడా అంత ప్రభావంతమయ్యింది కాదు. దీని పరిష్కారం కోసం ఎన్నాళ్లుగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా అధ్యయనాల్లో దీనికి ప్రభావంతమైన జన్యు చికిత్స విధానాన్ని కనుగొన్నారు. అదేంటంటే..ఈ ఆల్కాహాల్ యూజ్ డిజార్డర్(ఏయూడీ) ఓ పట్టాన వదిలించుకోలేని జబ్బు అని చెప్పొచ్చు. దీని కోసం శాస్త్రవేత్తలు చేసిని పరిశోధన కొంతవరకు పురోగతినే చూపించింది. ఈ మద్యపానానికి బానిసలుగా మారిన వాళ్ల బ్రెయిన్‌పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఎందుకు మందువైపు నుంచి వాళ్లను వాళ్లు మరల్చుకోలేకపోవడానికి కారణం ఏంటా? అనే దిశగా పరిశోధనలు చేయగా..మెదడులో ఉండే కమ్యేనికేషన్ వ్యవస్థకు సంబంధించిన మొసోలింబిక్ డోపమేన్ సిగ్నలింగ్ లోతుగా ఉన్నట్లు గురించారు. ఇది మద్యం సేవిస్తే కలిగి మంచి అనుభూతిని న్యూరోట్రాన్సిమీటర్కు ఎలా ప్రశారం చేస్తుందో నిర్థారించారు. ఈ వ్యవస్థ పనితీరులో ప్రధానమైనది గ్లియల్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్(జీడీఎన్‌ఎఫ్) అనే ప్రోటీన్. అల్కహాల్ తాగకుండా ఉండేందుకు యత్నిస్తున్న ఏయూడీ రోగుల మెదుడులోని వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా (వీటీఏ) జీడీఎన్ఎఫ్స్థాయిలు పడిపోతాయని పరిశోధనలో తేలింది. దీని కోసం జన్యు చికిత్స ఉపయోగించి వీటీఏలో జీడీఎన్‌ఎఫ్ స్థాయిలను భర్తీ చేస్తే డోపమేన్ సిగ్నలింగ్‌ను బలోపేతం అవుతుందా? అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఆ అధ్యయనంలో తక్కువ మోతాదులో మద్యపానం సేవిస్తే డోపమైన్ సిగ్నలింగ్ విడుదల బాగానే ఉంది. దీర్ఘకాలికంగా తాగితే మాత్రం మెదడును డీసెన్సిటైజ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత కాలక్రమేణ తక్కువ డోపమైన్‌ను విడుదల చేస్తుందని అన్నారు. ఈ వ్యసనంతో బాధపడుతున్నవారికి నిగ్రహంగా ఉందామనే సమయంలో వచ్చే అసౌకర్యం, చికాకుని తట్టుకోలే మళ్లీ తాగడం ప్రారంభిస్తుంటారని అన్నారు. ఇక్కడ తాగాలనిపించేలా మెదడు సిగ్నలింగ్ ఇచ్చే డోపమేన్ వ్యవస్థకే జన్యు చికిత్స చేస్తే సమస్యను అధిగమించవచ్చు అనేది శాస్త్రవేతల ఆలోచన. అందుకోసమని కొన్ని కోతులపై ఈ పరిశోధన చేశారు. దాదాపు 21 రోజుల పాటు కోతులకు మద్యపానం, నీరు వాటికి నచ్చినంత తాగేలా స్వేచ్ఛగా వదిలేశారు. కొద్దిరోజులకే అవి అధికంగా మధ్యపానానికి అడిక్ట్ అవ్వడం చూశారు. ఆ తర్వాత ఆ కోతులకు జీడీఎన్‌ఎఫ్ జన్యు చికిత్సను అందించారు. దీంతో అవి మద్యపానానికి బదులు నీటిని తాగడానికి ప్రయత్నించడం మొదలు పెట్టాయి. తెలియకుండానే మద్యపానాన్ని పక్కనపెట్టడం జరిగింది. వాటి రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ తక్కువుగా ఉండటాన్ని కూడా గుర్తించారు. ఆల్కహాల్ యూస్ డిజార్డర్‌తో బాధపడుతున్నవారికి ఈ చికిత్స గొప్ప పరిష్కార మార్గం అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి ఈ చికిత్స విధానం అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని అన్నారు. అయితే ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ జన్యు చికిత్స మానువులకు ఎంతవరకు సురక్షితం అనేదాని గురించి ట్రయల్స్ నిర్వహించి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడకల్లో 'ఇడ్లీ లొల్లి'..దీని మూలం ఎక్కడిదంటే..) -
ఎయిర్‌పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్‌గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
సౌదీలో తొలి మద్యం దుకాణం
రియాద్: మద్యపాన నిషేధాన్ని పాటించే సౌదీ అరేబియాలో మొట్టమొదటి సారిగా ఆల్కాహాల్ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది. ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మద్యం స్టోర్‌ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలుచేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతులు ఇస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఈ స్టోర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. రియాద్‌లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్‌ను మరి కొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు. -
బైక్‌కు నిప్పు..!
పాలకవీడు: మండలంలోని సజ్జాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సోమవారం రాత్రి గ్రామ శివారులో మద్యం సేవించి గొడవపడ్డారని.. ఈ క్రమంలో ఓ బైక్‌ను తగలబెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ లింగంను వివరణ కోరగా.. సజ్జాపురం గ్రామానికి చెందిన మూగల బాలసైదులు మరో వ్యక్తితో కలిసి సోమవారం రాత్రి బైక్‌పై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని అడ్డుకుని వారి బైక్‌ను తగలబెట్టినట్లు తెలిపారు. మూగల బాలసైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మద్యం మత్తులో జరిగిన గొడవకారణంగానే బైక్‌కు నిప్పు పెట్టారా.. లేదా వ్యక్తిగత కక్షతో ఈ ఘటన చోటుచేసుకుందా అనే విషయం తెలియనుంది. -
మద్యం ప్రియులకు శుభవార్త.. సౌత్‌లో కొత్త బీర్ బ్రాండ్ ఎంట్రీ..
దేశంలోని మద్యం ప్రియుల రుచులు, అభిరుచులకు అనుగుణంగా కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. పానీయాలు ఉత్పత్తి చేసే కంపెనీలు నెమ్మదిగా ఆల్కహాల్ తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. గత నెలలో సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం కోకా-కోలా ఆల్కహాలిక్ బెవరేజెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్లీకి చెందిన పానీయాల తయారీ సంస్థ కిమయా హిమాలయన్ బెవరేజెస్ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ బార్లీ ఆధారిత స్వదేశీ బీర్‌ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడులో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో అభినవ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్తర భారతదేశంలో దిల్లీ, ఉత్తరాఖండ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! కంపెనీ ఇప్పటికే ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ మార్కెట్లలోకి ప్రవేశించింది. సెప్టెంబరు 2019లో కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి మార్చి 2023 నాటికి అమ్మకాలు 1,25,000 కేసుల నుంచి సుమారు 10 లక్షల కేసులకు పెరిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో 96 శాతం రిటైల్ అమ్మకాలేనని సంస్థ తెలిపింది. గత ఏడాది కంపెనీ 100 శాతం ఫెసిలిటీను ఉపయోగించినట్లు తెలిపింది. ఈ క్రమంలో 1,00,000 హెక్టోలీటర్లను ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 2,00,000 హెక్టోలీటర్ల లక్ష్యంతో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి విస్తరణ చర్యలు చేపట్టినట్లు చెప్పింది. -
బీర్లు, లిక్కర్ విక్రయాల్లో పరకాల టాప్
సాక్షి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లాలో మద్యం ప్రియులు బీర్లకే జై కొడుతున్నారు. 2022లో 1,07,73,420.. ఈ ఏడాది ఏకంగా 1,26,32,616 బీర్లు తాగారు. అంటే గతేడాది 8,97,785 కేసులు.. ఎన్నికలు జరిగిన ఈ సంవత్సరంలో 10,52,718 కేసుల బీర్లు తాగారు. 2022లో 5,61,186 ఐఎంఎల్ (లిక్కర్) కేసులు తాగితే ఈసారి ఆ సంఖ్య 5,39,437కి తగ్గింది. మద్యం అమ్మకాలతో 2022లో రూ.574.98 కోట్లు.. ఈసారి రూ.589.89 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాలో వరంగల్ రూరల్ జిల్లా నుంచి వచ్చి చేరాయి. ఈ ఏడాది సంక్రాంతి, దసరా, వివిధ పండుగలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మద్యానికి భారీగా గిరాకీ పెరిగింది. అందుకే గతేడాది మించి ఈసారి ఎక్కువగా మద్యం ప్రియులు మద్యాన్ని లాగేశారని ఎకై ్సజ్ అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుసంధానంగా బెల్ట్ షాపును ప్రోత్సహించడంతో ఆదాయం భారీగా పెరగడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతమున్న ప్రభుత్వం బెల్ట్‌షాపులపై కొరడా ఝుళిపిస్తుండడంతో వచ్చే ఏడాది మద్యం విక్రయాలు తగ్గే అవకాశముందని ఎకై ్సజ్ విభాగంలో అంతర్గత చర్చ జోరుగా జరుగుతోంది. అక్కడే టాప్... వరంగల్ రూరల్ జిల్లాలో 63 వైన్‌షాపులు, ఏడు బార్లు ఉన్నాయి. నర్సంపేట సర్కిల్లో 25, వర్ధన్నపేట సర్కిల్లో 16, పరకాల సర్కిల్లో 22 మద్యం దుకాణాలు ఉన్నాయి. నర్సంపేటలో 2022లో 1,98,551 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 3,30,471 బీరు కేసులు విక్రయిస్తే.. 2023లో 1,90,636 లిక్కర్ కేసులు, 3,84,878 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2022లో 208.61 కోట్ల ఆదాయం వస్తే.. ఇప్పుడు రూ.214.15 కోట్ల ఆదాయం వచ్చింది. పరకాల సర్కిల్లో 2022లో 2,12,263 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 3,29,736 బీరు కేసులు విక్రయించారు. ఈ ఏడాది 2,02,288 లిక్కర్ కేసులు, 3,91,744 బీరు కేసులు అమ్ముడయ్యాయి. అంటే 2022లో రూ.213.98 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.218.41 కోట్లు వచ్చాయి. ఇక వర్ధన్నపేట సర్కిల్లో 2022లో 1,50,372 లిక్కర్ కేసులు, 2,37,578 బీరు కేసులు విక్రయిస్తే ఈ ఏడాది 1,46,513 లిక్కర్ (ఐఎంఎల్) కేసులు, 2,76,096 బీరు కేసులు అమ్ముడుపోయాయి. అంటే 2022లో రూ.152.36 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.157.33 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా ఓవరల్‌గా తీసుకుంటే బీర్ల విక్రయాల్లో పరకాల ముందుండగా.. ఆ తర్వాత నర్సంపేట, వర్ధన్నపేట ఉంది. లిక్కర్ తాగడంలో పరకాల మొదట స్థానంలో ఉండగా.. ఆ తర్వాత నర్సంపేట, వర్ధన్నపేట ఉన్నాయి. -
Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
గాంధీనగర్: మద్యపాన నిషేధం నుంచి గిఫ్ట్ సిటీని మినహాయిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం.. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ‘వైన్ అండ్ డైన్’ సేవలకు అనుమతి ఇచ్చింది. అయితే మద్య నిషేధంలో గాంధీనగర్ జిల్లాలోని (గిఫ్ట్ సిటీ)లో మినహాయిచడాన్ని ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ తప్పుపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గుజరాత్ మొత్తం వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపుతుందని మండిపడ్డారు. ‘గాంధీనగర్ గిఫ్ట్ సిటీలో మద్య నిషేధం లేకపోతే.. ఇక్కడి ప్రజలు మద్యం సేవిస్తారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఒక వ్యతిరేక ప్రభావం పడుతుంది’ అని శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గిఫ్ట్ సిటీలో మద్య నిషేదం ఎత్తివేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి లాభం చేకూరుతుందో తనకు అర్థం కావటం లేదని విమర్శించారు. గుజరాత్ ప్రభుత్వం గిఫ్ట్ సిటీలో ఉద్యోగులు, అధికారులు, సందర్శకులకు మద్యం నిషేధం ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రస్తుతం మందు బాటిళ్ల అమ్మకానికి అనుమతి లేదు. చదవండి: ఈ ఏడాది భారత్‌కు వెరీ బిగ్ ఇయర్ -
ప్రతి రోజు పబ్‌లో మద్యం తాగేదాన్ని: స్టార్ హీరోయిన్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రవర్తన, పరివర్తనలకు శృతిహాసన్ కేరాఫ్‌గా మారారు. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ సలార్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రఖ్యాత నటుడు కమలహాసన్ తనయగా.. తండ్రి కథానాయకుడిగా నటించిన హే రామ్ చిత్రం ద్వారా బాలనటిగా పరిచయౖమైన శృతిహాసన్, ఆ తరువాత హిందీలో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: కేవలం అది మాత్రమే మహిళకు శ్రీరామరక్ష: అనసూయ) అయితే చాలా విభిన్నమైన మనస్తత్వం కలిగిన నటి శృతిహాసన్. కారణం ఆమె పెరిగిన వాతావరణం కావచ్చు. ఈ ఏడాది తెలుగులో ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు విజయం సాధించటం విశేషం. అదే విధంగా నాని కథానాయకుడిగా ఇటీవల విడుదలైన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న హాయ్ నాన్న చిత్రంలో కూడా మోడల్‌గా కీలక పాత్రలో నటించారు. తాజాగా ప్రభాస్ సరసన నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ భారీఅంచనాల మధ్య తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూకు హాజరైన శృతిహాసన్ సలార్ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపింది. తన తండ్రి నుంచి చాలా నేర్చుకున్నానని వెల్లడించింది. కష్ట సమయంలో కూడా నవ్వుతూ ఉండటం ఆయన ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. నేను ఒకప్పుడు మద్యానికి పూర్తిగా బానిస అయ్యానని పేర్కొన్నారు. ప్రతి రోజు నా స్నేహితులతో కలిసి పబ్బులకు వెళ్లి మద్యం సేవించేదాన్ని అని తెలిపింది. అయితే తనకు ఎలాంటి డ్రగ్స్ సేవించే అలవాటు మాత్రం లేదని శృతిహాసన్ చెప్పారు. అయితే కొన్ని రోజుల తరువాత మద్యం సేవించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్థమైందని తెలిపింది. ఎలాగైనా ఆ వ్యసనం నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇప్పటికీ మద్యం మానేసి 8 ఏళ్లు పూర్తవుతోందని తెలిపారు. కాగా.. ప్రస్తుతం తెలుగులో అడవి శేషు సరసన ఓ చిత్రం.. ఇంగ్లిష్‌లో ది ఐ అనే చిత్రంలోనూ శృతిహాసన్ కనిపించనుంది. (ఇది చదవండి: బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు) -
ఆ.. మద్యం... ఏం చేద్దాం..?
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి పరిమితికి మించి కొనుగోలు చేసిన మద్యం తీసుకెళ్తుండగా ఎక్కడికక్కడ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకున్నాయి. వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో అప్పగించి వారిపై పెట్టి కేసులు కూడా నమోదు చేశారు. అయితే స్వాదీనం చేసుకున్న మద్యం సీసాలతో పోలీస్ స్టేషన్ల గదులు నిండిపోయాయి. ఈ మద్యాన్ని ఎంత తొందరగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా అప్పగిద్దామా అని ఆయా ఠాణాల పోలీసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ఖైరతాబాద్, పంజగుట్ట, లేక్ పోలీస్‌స్టేషన్, నారాయణగూడ, అబిడ్స్, దోమలగూడ తదితర 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 2727 లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే అధిక మొత్తంలో మద్యాన్ని తీసుకెళ్తుండగా 11 కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి కిందకు వచ్చే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో 1509 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకొని వీరిపై కేసులు కూడా నమోదు చేశారు. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచే నగదు, మద్యం సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు, ఎఫ్ఎస్టీ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టుబండింది. నమూనాల సేకరణ... ఎన్నికల సమయంలో స్వాదీనం చేసుకున్న మద్యంలో ఒక్కో బ్రాండ్‌కు సంబంధించి ఒక సీసాను పోలీసులు సీజ్ చేసి సీల్ వేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ల్యా»ొరేటరీకి పంపించారు. ఉదాహరణకు 12 బీరుసీసాలు స్వాధీనం చేసుకుంటే అందులో ఒక బీరుసీసాను సీజ్ చేసి ఎక్సైజ్ ల్యా»ొరేటరీకి పంపించడం జరుగుతుంది. మిగతా మద్యం అంతా ఠాణాల్లోని గదుల్లో భద్రపరిచారు. సీజ్ చేసిన పంపించిన మద్యం నాటు సరుకా..? ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కరా..? అనే విషయాన్ని కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే పోలీసులు ఆ మొత్తాన్ని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ వద్ద డిపాజిట్ చేస్తారు. డీసీ ఇచ్చిన రశీదును జత చేసి చార్జిషీట్ దాఖలు చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా పెండింగ్‌లోనే ఉంది. ఇంత వరకు కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ పోలీసులకు అందలేదు. కనీసం పంపించిన నమూనాలు కూడా కెమికల్ ల్యాబ్‌లో ఇంకా పరిశీలించలేదని తెలుస్తున్నది. ఈ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు స్వాదీనం చేసుకున్న మద్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స్వా«దీనం చేసుకున్న మద్యం సీసాల్లో ఒక్కటి మిస్ అయినా సంబంధిత దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకుంటారు. దీంతో ఠాణాల్లో పేరుకుపోయిన మద్యం సీసాలను కాపాడుకోవడానికి దర్యాప్తు అధికారులు పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా ఉంటున్నాయి. కష్టపడి స్వాదీనం చేసుకున్న మద్యాన్ని డిప్యూటీ కమిషనర్‌కు అప్పగించేదాకా జరుగుతున్న ప్రాసెస్ అంతా ఇంతా కాదు. పోలీసులకు ఈ మద్యం చుక్కలుచూపిస్తున్నది. గత ఎన్నికలతో పోలిస్తే భారీగా నగదు స్వాదీనం... ► 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టుబడింది. నిబందనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి రూ. 50 వేలకంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తుండగా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో పాటు ఎఫ్ఎస్టీ బృందాలు నగదును పెద్ద మొత్తంలో స్వా«దీనం చేసుకున్నాయి. ► జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎఫ్ఎస్టీ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో రూ. 17.80 లక్షలు పట్టుబడగా ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 61.46 లక్షలు పట్టుబడ్డాయి. ఈ మొత్తాన్ని జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు పోలీసులు అప్పగించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను బాధితులు చూపిస్తే పోలీసులు ఆ డబ్బును తిరిగి వారికి అప్పగిస్తారు. ► ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో రూ. 5 కోట్ల 51 లక్షల నగదు ఎన్నికల సమయంలో పట్టుబడింది. అలాగే రూ. 3.97 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు కూడా స్వాదీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 18 బస్తాల రేషన్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. -
ఫస్టు నుంచి చూద్దాం!
అందరి షూ ర్యాక్‌లో దుమ్ము పట్టిన వాకింగ్ షూస్ ఉంటాయి. అవి గత సంవత్సరం జనవరి నెలలో కొన్నవి. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, వాకింగ్ చేయాలనుకుని కొన్నవి అవి. ఆ వాకింగ్ ఎన్ని రోజులు సాగిందో. ప్రస్తుతం అవి దుమ్ముకొట్టుకుని, పట్టించుకునే యజమాని కోసం ఎదురు చూస్తూ అలా పడి ఉంటాయి. ఆ దారిన వెళుతున్నప్పుడల్లా ఆ జిమ్ కనిపిస్తూనే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వెళ్లి మూడో నెల నుంచి మానేసిన జిమ్. ట్రైనర్ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు. జిమ్ నుంచి అలెర్ట్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. గత సంవత్సరం కంటిన్యూ చేయలేదు కాని ఈ సంవత్సరం మళ్లీ చేరి కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారు కొందరు. ఉదయం వాకింగ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తూనే ఉంటారు. మనం వారు కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటాం. నాలుగు రోజుల సింగారంగా మన వాకింగ్ ముగిసిపోయి ఉంటుంది. ‘న్యూ ఇయర్ రానివ్వండి. జాయిన్ అవుతాను’ అని వాళ్లు కనిపించినప్పుడల్లా అంటూనే ఉంటారు. తక్షణం అవశ్యం ఆరోగ్యం ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ‘తక్షణం అవశ్యం ఆరోగ్యం’ అనుకోవాలి విజ్ఞులు. ఇవాళ రేపట్లో మనం ఏం తింటున్నామో అందరికీ తెలుసు. విషం. మందులు విషం. కల్తీ గాలి. అయితే పరిగెత్తి చేసే ఉద్యోగాలు లేదా తిష్ట వేసినట్టుగా కదలక కూచుని చేసే కొలువులు... ఆరోగ్యం ఎలా? వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు నెరవేరాలంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకు ప్రయత్నం ముఖ్యం. అక్కడే వస్తుంది చిక్కు. ‘ఆరంభించరు నీచ మానవులు’ అని భర్తృహరి అన్నాడుకాని ‘ఆరంభించడానికి వేచి చూస్తారు సోమరి పోతులు’ అనాలి నిజానికైతే. ‘జనవరి 1 వస్తేనే ఆరంభిస్తా’ అనుకుంటే జనవరి 1 వస్తేనే భోం చేస్తా అనుకోరు ఎందుకో. ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ జనవరి 1 అంటే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్ మారుతుంది. అన్నిచోట్ల ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. కనుక కొత్తగా నిర్ణయాలను అమలు చేద్దాం అని చాలామంది అనుకుంటారు. దీనిని ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ అంటారు. అయితే డాక్టర్ జాన్ నార్క్రాస్ అనే సైకాలజీ ప్రొఫెసర్ ఇలా న్యూ ఇయర్ నిర్ణయాలు తీసుకుంటున్నవారిని గత 40 ఏళ్లుగా పరిశీలిస్తూ ఏమని తేల్చాడంటే– సాధారణంగా న్యూ ఇయర్ నిర్ణయాలలో ముఖ్యమైనవి 2. మొదటిది ఫిట్నెస్ సాధించడం, రెండోది బరువు తగ్గడం. ఫిట్నెస్ సాధించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఒక నెల రోజుల్లో సగానికి సగం మంది వ్యాయామం ఆపేస్తున్నారు. ఆరు నెలల్లో తొంభై శాతం మంది. పది శాతం మందే న్యూ ఇయర్ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం ఎందుకు నీరుగారి పోవడం ఎందుకు? మంచి సీజన్ అమెరికా, బ్రిటన్లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జిమ్‌లు కిటకిటలాడతాయి. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. కొత్త సంవత్సరం ఉత్సాహం, నిర్ణయం నిలబడకపోవడమే కారణం. నిపుణులు ఏమంటున్నారంటే మీరు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు ఉత్సాహం గా ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అని. ఉదాహరణకు మనకు వేసవి కాలం ఉత్సాహంగా అనిపిస్తే అప్పుడు మొదలెట్టి కొనసాగించాలి. లేదా నవంబర్ మంచి సీజన్ అనుకుంటే మొదలెట్టాలి. అమెరికాలో జనవరి నెల చలిలో మొదలెట్టే వ్యాయామాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని తేల్చారు. మన దగ్గర కూడా జనవరి చలి. ఆ చలిలో ఉదయాన్నే లేవలేక న్యూ ఇయర్ రెజల్యూషన్ పాటించడం లేదని బాధపడి... ఇదంతా ఎందుకు? ఈ రోజు నుంచే మొదలెట్టొచ్చు కదా. ముఖ్యం... చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం కష్టపడటం ముఖ్యం. చాలా ముఖ్యం. ఏదో ఒక మంచి సందర్భంలో వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గిస్తాను, స్మోకింగ్ మానేస్తాను, ఫేస్బుక్ కట్టేస్తాను, పిల్లలతో గడుపుతాను, యోగా చేస్తాను, నాన్‌వెజ్ వారంలో ఒక్కరోజే... ఇలా ఏ మంచి నిర్ణయమైనా మీకు మేలు చేస్తుంది. నేటి మీ నిర్ణయం రేపు మీ యోగం. -
బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత
భారతదేశంలో కుబేరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో ఇండియన్ పేరు నమోదైంది. ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరిన వ్యక్తి ఎవరు.. అయన సంపద ఎంత.. ఏ కంపెనీ నడిపిస్తున్నారు.. ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మద్యం వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇండియా ఒకటి. మద్యం వ్యాపారం చేస్తూ ధనవంతుల జాబితాలో చేరిన 'లలిత్ ఖైతాన్' (Lalit Khaitan) 1972-73లలో కంపెనీ స్వాధీనం చేసుకున్న తరువాత దానిని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఈయన అనుదినం కృషి చేసేవారు. అనుకున్న విధంగానే సక్సెస్ సాధించి ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. లలిత్ ఖైతాన్ సారథ్యంలో ముందుకు సాగుతున్న 'రాడికో ఖైతాన్' (Radico Khaitan) ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా, 8 పీఎం విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, రాంపూర్ సింగిల్ మాల్ట్ లాంటి బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది కంపెనీ షేర్లు 50 శాతం పెరిగి సంస్థ విలువ బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో లలిత్ ఖైతాన్ బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయారు. ఖైతాన్.. అజ్మీర్ మాయో కాలేజ్, కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదువు పూర్తి చేసుకుని, బెంగుళూరులోని BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజిరియల్ ఫైనాన్స్ & అకౌంటింగ్ కోర్సును అభ్యసించారు. రాడికో ఖైతాన్‌గా పిలువబడుతున్న కంపెనీని గతంలో రాంపూర్ డిస్టిలరీ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్‌గా పిలిచేవారు. ఆ సంస్థను ఖైతాన్ తండ్రి జీఎన్ ఖైతాన్ 1970 ప్రారంభంలో నష్టాల్లో నడుస్తున్న సమయంలో సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఈ కంపెనీ క్రమంగా వృద్ధి చెందుతూ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థల జాబితాలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కంపెనీ బ్రాండ్లను సుమారు 85 దేశాలలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన మద్యం రంగంలో అతి తక్కువ కాలంలోనే గొప్ప పురోగతి కనపరిచిన లలిత్ ఖైతాన్ 2008లో 'ఇన్స్పిరేషనల్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు', 2017లో ఉత్తర ప్రదేశ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ ద్వారా 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు' వంటి వాటిని సొంతం చేసుకుని.. ఇప్పడూ ఫోర్బ్స్ జాబితాలో ఒకరుగా స్థానం సంపాదించారు. -
కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?
కూల్ డ్రింక్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే బ్రాండ్ 'కోకా కోలా' (Coca Cola). ఈ కంపెనీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి అడుగు పెట్టింది. కోకా కోలా మద్యం పేరు ఏమిటి? దాని ధరలు ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. థమ్స్ అప్, మ్కా, ఫాంటా, స్ర్పైట్, మాజా, కోకా కోలా జీరో షుగర్, డైట్ కోక్, ష్వెప్స్, ఛార్జ్డ్, కిన్లే, మినిట్ మెయిడ్, స్మార్ట్ వాటర్, రిమ్ జిమ్, హానెస్ట్ టీ, కోస్టా కాఫీ, జార్జియా వంటి వాటితో దూసుకెళ్తున్న కోకా కోలా తాజాగా 'లెమన్ డౌ' (Lemon-Dou) అనే పేరుతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టింది. కోకా కోలా 'లెమన్ డౌ' ఇప్పుడు కేవలం గోవా, మహారాష్ట్రలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోవాలో దీని ధర రూ. 150 కాగా.. మహారాష్ట్రలో రూ. 230 కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం భారతీయులను ఆకర్షిస్తుందా? లేదా? అనే టెస్టింగ్ దశలోనే ఉంది. ఆ తరువాత ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే.. కంపెనీ దానికి తగిన విధంగా మద్యం తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ ఏడాది ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే.. 2018లో కోకా కోలా కంపెనీ 'లెమన్ డౌ'ను జపాన్ దేశంలో పరిచయం చేసింది. ఇది చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ మద్యం సక్సెస్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. -
ఆల్కహాల్ అలర్జీ అని పొరబడింది! చివరికి ఏకంగా..
పట్టుమని 20 ఏళ్లు నిండలేదు. ఆ చెడు అలవాటు సరదా అనుకుంది. ప్రెజెంట్ ట్రెండ్ అని స్నేహితులతో తరచుగా బయట పార్టీలు చేసుకుంది. శరీరంపై దద్దర్లు, వాంతులు అవుతున్నా.. జస్ట్ ఎలర్జీయే కదా!.. అని లైట్ తీసుకుంది. చివరికి అదేంటో తెలిసి ఆమె గుండె ఆగినంత పని అయ్యింది. తనలా మరెవ్వరూ చేయకూడదని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని అందుకు తన ఉదంతమే నిదర్శనం అంటూ ఆమె గాథని వివరిస్తోంది ఆ మహిళ. అసలేం జరిగిందంటే..న్యూజిలాండ్‌కి చెందిని పాపీ బెగ్లీకి స్నేహితులతో పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం. ఇలా స్నేహితులతో బయటకి వెళ్లినప్పుడల్లా పార్టీలు చేసుకోవడం అలవాటు. ఆ టైంలో ఆమె వారితో కలిసి ఆల్కహాల్ సేవిస్తుంది. ఏమైందో ఏమో గత కొంతకాలంగా ఇలా తాగి ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచే శరరం అంతా దద్దర్లు, వాంతులు అవ్వడం మొదలవుతోంది. ఆమె అది ఆల్కహాలిక్ ఎలర్జీ అనుకుంటా అని లైట్ తీసుకుంది. అంతగా పట్టించుకోలేదు. పార్టీలు చేసుకున్న ప్రతీసారి ఆమె పరిస్థితి ఇలానే ఉంది. ఉన్నటుండి ఓ రోజు మరింత బలహీనంగా మారి సీరియస్ అయ్యింది. అప్పుడు డాక్టర్ ఆమె ఫేస్ చేస్తున్న సమస్య ప్రతిదీ నోట్ చేసుకుని స్టడీ చేయడం మొదలు పెట్టాడు. తదుపరి ఆల్ట్రాస్కానింగ్ వంటి వైద్య పరీక్షలు చేసి హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు వైద్యులు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకి ఎగ్జిమా, డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులు విపరీతంగా వస్తాయని చెబతున్నారు. కానీ బెగ్లీ అలర్జీ అనే అనుకుంది. వైద్యుల కూడా చర్మవ్యాధిగానే భావించి మందులు ఇచ్చేవారేగానీ సరియైన పద్ధతిలో నిర్ధారణ చేయలేదు. దీనికి తోడు ఆమె కూడా తన శరీరంలోని లక్షణాలను క్లియర్‌గా వివరించలేదు. అయితే ఆమె వైద్య పరీక్షల్లో తన మెడ కింద కూడా నొప్పిగా ఉందని చెప్పడంతో వారు మరింతగా క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేశారు. అప్పుడే వారు గడ్డ ఉన్నట్లు గుర్తించి క్యాన్సర్‌గా నిర్థారించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె టీనేజర్. కనీసం 20 ఏళ్లు కూడా నిండలేదు. కానీ అప్పుడే నాలుగు శస్త్ర చికిత్సలు, కీమోథెరఫీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరికి ఆమెకు 20 ఏళ్ల వచ్చాయి. అయితే తనలా ఎవ్వరూ చాలా చిన్న ఏజ్‌లోనే ఆల్కహాల్ వంటి చెడు అలవాట్ల జోలికి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని చెబుతోంది. అంతేగాదు తనకొచ్చిన హాడ్కిన్స్ లింఫోమా క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్‌కి సంబంధించినదని, దీన్ని చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉంటేనే వైద్యులు క్యూర్ చేయగలరంటూ ప్రజలకు అవగాహన కల్సిస్తోంది. ఏదైనా అనుభవిస్తేగానీ తెలిసిరాదంటారు. బహుశా ఇదే కాబోలు.ఎప్పుడోకప్పుడో అందరం పోయే వాళ్లమే. అలాంటప్పుడూ ఈ జీవితాన్ని ఇలా చెడుఅలవాట్లతో పాడుచేసుకోకుండా మంచి ఆహ్లాదకరంగా జీవించడానికి ఉపయోగిస్తే తనకి, సమాజానికి ఉపయుక్తంగా ఉంటుంది. (చదవండి: యూకేలో కలవరపెడుతున్న 'వందరోజుల దగ్గు'! అధికారులు వార్నింగ్) -
మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్
సాక్షి, విశాఖపట్నం: మందుబాబులకు భీమిలీ కోర్టు షాక్ ఇచ్చింది. మత్తులో డ్రైవింగ్ జోలికి వెళ్లకుండా న్యాయమూర్తి శిక్ష విధించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న 121 మందిని భీమిలి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. 15వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. విజయ లక్ష్మి ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీసు క్రింద బీచ్ రోడ్డులో ఉన్న కోకొనట్ పార్కు, సెయింట్ ఆన్స్ హై స్కూల్, ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రోడ్లు ఎక్కి ముందుబాబులు శుభ్రం చేస్తున్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే జైలుకు పంపాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ‘దృశ్యం’ తరహాలో హత్య! -
కిక్కెక్కింది.. నిద్ర ముంచుకొచ్చింది.. అట్లుంటది మనతోని!
పెద్దపల్లి: మందు బాబులూ.. ఒక్కక్షణం ఆలోచించండి.. మనం బయటకు వెళ్తే మళ్లీ ఇంటికొచ్చే దాకా మన కుటుంబం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తూ ఉంటుంది. ఏదైనా జరగరానిది జరిగి ప్రాణాలు పోతే వాళ్లకు దిక్కెవరు? ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తావద్ద రోడ్డుపై ఓ వ్యక్తి ఇలా గాఢనిద్రలో పడుకున్నాడు. చిత్తుగా మద్యం తాగడంతో మత్తు ఆవరించింది. ఆ కిక్కుతో ఒళ్లు మరిచి ఇలా నడిరోడ్డుపై నిద్రలోకి జారుకున్నాడు. ఎన్నికల వేళ.. ఎవరు పిలిచి మద్యం తాగించారో లేక.. సొంతంగా కొనుగోలు చేసి తాగాడో తెలియదు కానీ.. రాజీవ్‌రహదారి సిగ్నల్స్ పక్కనే రోడ్డుపై నిద్రపోతున్నాడు.. వాహనాల రద్దీ అధికంగా ఉంది. వాహనదారులు ఏమరుపాటుగా ఉంటే.. ప్రాణాలే పోవచ్చు. కానీ ‘సాక్షి’ చొరవ చూపింది. రోడ్డు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
వైన్ షాప్‌నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!
విశాఖపట్నం: మద్యం ఇవ్వలేదని వైన్ షాప్‌ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోతినమల్లయ్య పాలెం పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్ షాప్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.దీంతో వారితో వాగ్వాదానికి దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను వైన్‌షాప్ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది వెంటనే షాప్ బయటకు పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న కంప్యూటర్, ప్రింటర్ ఇతర సామగ్రి కాలిపోయి రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..
మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!. వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్, నటి జెస్సికా లాండన్ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్ చేసింది. మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్‌కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్‌లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి కణితిలా వచ్చింది. దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్ కాకమునుపే ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్‌కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. అసలు మద్య పానం వ్యసనం అంటే.. ఆల్కహాల్‌పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం. అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం. ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం తగని సమయాల్లో కూడా తాగడం మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు. (చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?) -
‘మద్యం చాయ్’.. ప్రయోగాలకు పరాకాష్ట అంటున్న జనం!
సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి టీ తయారీలో వినూత్న ప్రయోగం చేయడాన్ని చూడొచ్చు. ఆ వ్యక్తి ఒక చిన్న కుండలో మద్యం పోసి, దానితో టీ తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది యూజర్లు తెగ రియాక్ట్ అవుతున్నారు. ఒక యూజర్.. ‘సోదరా, మనం ఇకపై ఈ భూమిపై జీవించాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించాడు. మరొక యూజర్ ఎప్పుడూ టీతోనే ఎందుకు ప్రయోగాలు జరుగుతాయి?’ అని ప్రశ్నించాడు. ఈ వీడియో చూసిన కొందరు ఆ టీ తయారీదారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో దేశీమోజిటో అనే ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోకు లక్షకు పైగా వీక్షణలు దక్కాయి. ఇప్పుడే కాదు గతంలోనూ టీపై పలు ప్రయోగాలు జరిగాయి. ఈ జాబితాలో ఎగ్ టీ, ఫ్రూట్ టీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: పారిస్ ఎయిర్ పోర్టులో నమాజ్.. సమర్థించుకున్న ప్రభుత్వం! Old monk chai peelo fraans:) pic.twitter.com/HTYZsCJmGX — desi mojito 🇮🇳 (@desimojito) November 7, 2023 -
మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?
జానకి ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాక అమెరికా వెళ్లింది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి పబ్‌కు వెళ్లేది. అమెరికా వెళ్లాక అది అలవాటుగా మారింది. రోజూ పబ్, క్లబ్, ఆల్కహాల్ ఆమె జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏదైనా ఒకరోజు ఆల్కహాల్ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ నుంచి రాగానే నాలుగైదు పెగ్గులు వేయందే నిద్రపట్టేది కాదు. అలా అలా ఆల్కహాల్ వ్యసనంగా మారింది. అయితే వివాహం తర్వాత ఆమెకు సమస్య మొదలైంది. నెలరోజులు ఎలాగోలా ఓపిక పట్టినా ఆ తర్వాత ఆగలేక తాగడం మొదలు పెట్టింది. దాంతో భర్తతో పెద్ద గొడవైంది. సోషల్ డ్రింకింగ్ విషయంలో తనకూ అభ్యంతరం లేదని, కానీ రోజూ స్పృహ తప్పేంతగా తాగుతానంటే భరించలేనని భర్త తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఇరువైపులా పేరెంట్స్‌కు తెలిసి పంచాయతీ పెట్టారు. చివరకు విడాకుల వరకూ దారితీసింది. అలవాటు కాదు.. జబ్బు జానకిలా మద్యం వ్యసనంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్నవారు, చేసుకుంటున్నవారూ మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. మద్యం తాగడం పాపమని కొందరు వారికి హితబోధలు చేస్తే, బలహీన మనస్తత్వమున్నవారే తాగుతారని మరి కొందరు వాదిస్తుంటారు. నిజానికి మద్యానికి బానిసవ్వడం, విపరీతంగా మద్యం సేవించడం, మద్యం వల్ల జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ తాగకుండా ఉండలేకపోవడం ఒక మానసిక రుగ్మత. దానివల్ల అనేకానేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హఠాత్తుగా మద్యం తాగడం తగ్గించినా, ఆపేసినా కూడా సమస్యలు వస్తాయి. మద్యం వ్యసనం నుంచి శాశ్వతంగా విముక్తి లభించాలంటే చికిత్స అవసరం. తిడితే సరిపోదు.. చికిత్స అవసరం.. మద్యానికి బానిసైన వారిని చులకనగా చూడటం, తిట్టడం సమస్యను పరిష్కరించవు. అలాంటివారిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ లేదా అడిక్షన్ ఎక్స్పర్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొంతకాలం రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచి మద్యపాన వ్యసనం నుంచి బయట పడేయవచ్చు. మద్యపాన వ్యసనం ఉన్నవారు తమకు సమస్య ఉందని గుర్తించక చికిత్స పొందడానికి వెనుకాడతారు. అందువల్ల కుటుంబసభ్యులే వారిని చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వివిధ దశల్లో చికిత్స మద్యపాన వ్యసనానికి వివిధ దశల్లో వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశల్లో వ్యక్తిగత, గ్రూప్ కౌన్సెలింగ్.. సమస్యను బాగా అర్థంచేసుకోవడంలో సహాయపడతాయి. మద్యపాన వ్యసనం వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి మద్దతునిస్తాయి. ఆల్కహాల్ చికిత్స నిపుణుల పర్యవేక్షణలో గోల్ సెట్టింగ్, ప్రవర్తనలో మార్పు తెచ్చే పద్ధతులు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివన్నీ వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగితే వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. మరికొన్ని మందులు ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి · మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు మళ్లీ మద్యం వైపు మళ్లకుండా కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు సహాయపడతాయి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వడం వ్యసనాల నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది రీహాబిలిటేషన్ సెంటర్ లేదా సైకియాట్రిక్ ఆస్పత్రిలో వారం రోజులపాటు డిటాక్స్ అండ్ విత్ డ్రాయల్ చికిత్స అందిస్తారు. విత్ డ్రాయల్ లక్షణాలను నివారించడానికి మందులు తీసుకోవాల్సి రావచ్చు మద్యపాన వ్యసనం తీవ్రంగా ఉన్నవారు కొన్ని నెలలపాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సి రావచ్చు. అక్కడ ఆల్కహాల్, డ్రగ్ కౌన్సెలర్లు, సోషల్ వర్కర్లు, నర్సులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. మద్యపాన వ్యసనం లక్షణాలు మద్యం తాగడం, వ్యసనంగా మారడం, దానికి బానిసవ్వడం మూడూ వేర్వేరు. రెండు గంటల్లో నాలుగైదు పెగ్గులు అంతకంటే ఎక్కువ తాగడాన్ని అనారోగ్యకరమైన డ్రింకింగ్‌గా పరిగణిస్తారు. మద్యపాన వ్యసనానికి ఈ కింది లక్షణాలు ఉంటాయి. ఆల్కహాల్ తాగాలనే బలమైన కోరిక, తాగకుండా ఉండలేకపోవడం · తాగే పరిమాణాన్ని పరిమితం చేయలేకపోవడం తాగడం తగ్గించుకోవడానికి విఫల యత్నాలు చేయడం తాగడంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇతర పనులను పక్కన పెట్టడం మద్యం వల్ల బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం జీవితంలో సమస్యలకు కారణమవుతుందని తెలిసినప్పటికీ కొనసాగించడం డ్రైవింగ్, ఈత లాంటి సందర్భాల్లో కూడా మద్యం తాగడం కారణాలు.. మద్యపాన వ్యసనానికి సామాజిక, మానసిక, జన్యు కారణాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మద్యం వినియోగం సాధారణమైన సమాజంలో, కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి అది తప్పుగా అనిపించదు. సరదాగా మొదలుపెట్టినా చివరకు వ్యసనంగా మారుతుంది. కాలక్రమేణా ఆల్కహాల్ తాగడం మెదడులోని ఆనందం, పనితీరు, ప్రవర్తనపై నియంత్రణ సాధించే భాగాలతో అనుసంధానమవుతుంది. ఇది మంచి భావాలను పునరుద్ధరించడానికి లేదా ప్రతికూల భావాలను తగ్గించడానికి ఆల్కహాల్ కోరికను కలిగిస్తుంది. అలా మద్యానికి బానిసను చేస్తుంది. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనలేక మద్యం మత్తులో సేద తీరుతూ వాస్తవికత నుంచి తప్పించుకుంటారు. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..) -
మద్యం తరలిస్తున్న కారుకు ప్రమాదం, ఎగబడిన జనం: వైరల్ వీడియో
‘మెడిసిన్’ పేరుతో మద్యాన్ని అక్రమ తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.దీంతో మద్యం బాటిళ్లను దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అక్టోబరు 30న బిహార్‌లోని జాతీయ రహదారి- 2పై ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో 2016, ఏప్రిల్ 5 నుంచి మద్య నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం అక్రమ రవాణాకు తెరతీసింది. మెడిసిన్ పేరుతో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న ఈ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సాయం చేసేందుకు వచ్చిన స్థానికులు కారులో ఉన్న దాన్ని చూసి షాకయ్యారు. అంతే ఒక్కసారిగా అక్కడ గలాటా మొదలైంది. మద్యం బాటిళ్లను దొరకబుచ్చుకుని పరుగు అందున్నారు. ఫలితంగా అక్కడ ట్రాఫిక్ స్థంభించి, గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. కానీ అప్పటికే కారులో ఉన్న నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తరవాటిని తీసుకెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు స్థానికి అధికారి చెప్పారు. A video of people looting liquor bottles from a car on National Highway 2 in Bihar after the vehicle was involved in an accident has gone viral. Alcohol has been banned in the state since 2016. #Bihar #alcohol #liquor #viralvideo pic.twitter.com/F0gYIoycBt — Jammu Tribune (@JammuParivartan) November 1, 2023 -
ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా?
మోతాదుకు మించి ఆల్కహాల్ తాగితే చనిపోతారా?..అంటే పలు ఉదంతాల్లో అది నిజమనే ప్రూవ్ అయ్యింది కూడా. ఎందువల్ల ఇలా జరుగుతుంది?. ఒక్కసారిగా అది మన శరీరానికి హని కలిగించే విషంలా ఎలా మారుతోంది తదితారాల గురించే ఈ కథనం. ఈ ఆల్కహాల్‌కి చెందిన ఛాలెంజింగ్లను తీసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే చైనాలో ఓ వ్యక్తి రెండు లక్షలు గెలుచుకోవడం కోసం ఆఫీస్ పార్టీలో ఏకంగా ఒక లీటరు ఆల్కహాల్‌ని కేవలం పది నిమిష్లాల్లో హాంఫట్ చేశాడు. ఇక అంతే కాసేపటికే ప్రాణం పోయింది. ఆ వ్యక్తి పేరు జాంగ్. ఆస్ప్రతికి తరలించగా గుండెపోటు, ఆస్పిరేషన్ న్యూమోనియా తదతరాలతో బాధపడుతున్నట్లు తేలింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఆల్కహాల్ తాగేంతవరకు బాగానే ఉన్న వ్యక్తి వెంటనే ఎలా పాయిజన్ అయ్యి ప్రాణాంతకంగా మారింది...?. తక్కువ సమయంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే.. ఓ వ్యక్తి ఛాలెంజ్ పరంగా, లేదా ఏ కారణం చేతనైనా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగితే అది ఒక్కసారిగా పాయిజన్‌గా మారిపోతుంది. అమాంతం రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెంచేందుకు దారితీస్తుంది. రక్తంలో ఎప్పుడైతే ఆల్కహాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయో..అప్పుడూ కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేయలేక ఇబ్బంది పడుతుంది. రక్తప్రవాహంలో అదనపు ఆల్కహాల్ సాధారణ పనితీరును దెబ్బతీసి శ్వాస, హృదయస్పందన రేటు, రక్తపోటు పడిపోయేలా చేస్తుంది. దీంతోపాటు శరీర విధులను నియంత్రించే మెదుడలోని భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో ఆల్కహాల్ పెరుగుతూనే ఉన్నందున అతడు బతికే అవకాశాలు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గిపోతుంది. సంకేతాలు లక్షణాలు.. ఆల్కహాల్‌తో ఇలాంటి ఛాలెంజ్‌లు ప్రమాదకరమైనవి. అత్యవసరంగా చికిత్స అందించకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వ్యక్తులు ప్రమాదకరంలో ఉన్నారని ఎలా గుర్తించాలంటే.. వారి గోళ్లు, పెదవులు నీలం రంగులో మారి తేమగా లేదా చల్లగా అవుతున్నా.. నడవలేకపోతున్నా హృదయస్పందన సరిగా లేకపోయినా మూత్రశయం లేదా ప్రేగు నియంత్రణ కదలికలను నియంత్రించడం వాంతులు లేదా ఉక్కిరిబిక్కిరి చికిత్స! నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది చాలా తీవ్రమైన పరిస్థితి. తక్షణమే ప్రాణాలను రక్షించేలా చికిత్స అందించాలి. నిర్జలీకరణానికి ఇంట్రావీనస్ ద్రవాలు ఇస్తారు. ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతారు అలాగే ఆల్కహాల్ పాయిజనింగ్తో బాధపడుతున్న వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి కాన్యులాను ఉపయోగించి వారికి ఆక్సిజన్ని అందించడం చికిత్సలో అత్యంత ముఖ్యం పొట్టని ఒక పంపు సాయంతో టాక్సిన్లు లేకుండా శుభ్రం చేయడం రక్తంలోఇన ఆల్కహాల్ స్థాయిలను తగ్గించేలా రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు డయాలసిస్ చేయడం చేసి. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
మందేసుకుంటే కనిపెట్టేస్తుంది
మద్యం తాగి వాహనాలు నడపడం, ప్రమాదాలకు కారణమవడం దాదాపు ప్రపంచవ్యాప్త సమస్య. వాహనాలను నడిపే మందుబాబులను పట్టుకోవడానికి పోలీసులు నగరాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటారు. మూతి దగ్గర గొట్టం పెట్టి ఊదమంటారు. ఊదితే ఎంత మందేశారో తెలిసిపోతుంది. కొందరు తెలివిమీరిన మందుబాబులు గొట్టం ముందు ఊదడానికి నానా విన్యాసాలు చేస్తారు. ఊదాల్సిన అవసరం లేకుండానే, మందుబాబులు ఏ డోసులో తాగారో ఇట్టే కనిపెట్టేసే బ్రాస్లెట్ ఇది. ‘సోబర్సేఫ్’ అనే అమెరికన్ కంపెనీ ‘సోబర్స్యూర్’ పేరుతో ఈ హైటెక్ బ్రాస్లెట్ను గత నెలలోనే మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో జీపీఎస్ టెక్నాలజీని కూడా అమర్చడంతో, దీనిని తొడుక్కున్న వారు ఎక్కడ ఉన్నారో తేలికగా కనిపెట్టవచ్చు. దీనిని వాచీలా చేతికి తొడుక్కుంటే, ఒంట్లో ఆల్కహాల్ ఎంత మోతాదులో ఉందో ఇట్టే తెరపై చూపిస్తుంది. దీని ధర 38 డాలర్లు (రూ.3,159) మాత్రమే! -
తాగుబోతు చేత ప్రమాణం
-
ప్రభుత్వాఫీస్‌లో అధికారి జల్సాలు..
లక్నో:ప్రజలకు సేవచేయాల్సిన స్థానంలో ఉండి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. ప్రభుత్వ ఆఫీసులు తమ సొంత నివాసాలుగా భావిస్తుంటారు. విధులు నిర్వర్తించాల్సిన సమయంలో జల్సాలు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారి విధులు నిర్వర్తించాల్సిన సమయంలో కార్యాలయంలోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలో కపూర్ సింగ్ అనే అధికారి స్వైజ్పూర్ రిజిస్టర్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీస్‌కు వచ్చి టేబుల్ మీదే దర్జాగా మద్యం సేవించారు. ఓ చేతిలో ఫోన్ మాట్లాడుతూ మరో చేత్తో మద్యం సేవిస్తూ స్థానిక మీడియాకు చిక్కారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. #हरदोई- सरकारी दफ्तर में एक कर्मचारी का शराब पीते वीडियो वायरल,रजिस्ट्री ऑफिस सवायजपुर में तैनात चपरासी कपूर सिंह का दारू पीने का वीडियो हुआ वायरल,ऑफिस में जाम छलकते नजर आ रहा है कर्मचारी,हरदोई के सवायजपुर रजिस्ट्री ऑफिस का बताया जा रहा है @hardoipolice#ViralVideos @dmhardoi pic.twitter.com/5gVKmrEI6u — anuj Pal (@anujPal50037043) August 27, 2023 సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు చివాట్లు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల పంజాబ్‌లోని హోషియాపూర్‌లో సెంట్రల్ జైలు పోలీసులు అంబులెన్స్‌లోనే మద్యం సేవించిన ఘటన మరవకముందే యూపీలో ఈ ఘటన జరిగింది. ఇదీ చదవండి: వేధింపుల కేసులో ఘోరం.. తల్లిని వివస్త్ర చేసి.. -
సిమెంట్ ఇటుక, చేతికడెంతో అతనిపై కిరాతకంగా..
కరీంనగర్: మద్యం మత్తులో మాటమాట పెరిగి యువకుడి మర్డర్‌కు దారితీసిందని టౌన్ ఏసీపీ నరేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ రాంనగర్‌లోని ఓ వైన్స్ పర్మిట్‌రూంలో బుధవారం రాత్రి జరిగిన హత్యకేసులో టూటౌన్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. హత్యకు సంబంధించిన వివరాలు గురువారం టౌన్ ఏసీపీ నరేందర్ టూటౌన్ సీఐ రామచందర్‌రావుతో కలిసి టూటౌన్లో వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం ఎలగందుల్ గ్రామానికి చెందిన చేపూరి పవన్(36) వెల్డింగ్ పనులు చేస్తూ రాంనగర్‌లోని చేపలమార్కెట్ సమీపంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే విధులు ముగించుకుని బుధవారం రాత్రి రాంనగర్‌లోని వైన్స్‌కు వెళ్లాడు. పర్మిట్‌రూంలో మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన కామెర అరుణ్(20), ఎండీ.ఆఫ్రిద్(21)తో గొడవ జరిగింది. మాటమాట పెరగడంతో అరుణ్, ఆఫ్రిదిలు తమ స్నేహితులైన బచ్చల ప్రణయ్‌కుమార్(20), కల్వల పృథ్వీ(20), గాజుల ప్రేంకుమార్(21), విజయ్, లోకేష్‌ను అక్కడికి పిలిపించారు. వారందరూ కలిసి పవన్‌పై సిమెంట్ ఇటుక, చేతికడెంతో దాడిచేశారు. పర్మిట్రూం సిబ్బంది, పవన్‌తో వచ్చినవారు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పవన్ మృతిచెందాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టారు. గురువారం అరుణ్, ఆఫ్రిది, బచ్చల ప్రణయ్‌కుమార్, కల్వల పృథ్వీ, గాజుల ప్రేంకుమార్‌ను అరెస్టు చేశారు. మిగితా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. యువత మద్యంమత్తులో నేరాలకు పాల్పడుతున్నారని, పర్మిట్రూముల నిర్వాహకులు నిబంధనలు పాటించి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, చిన్న గొడవ జరిగినా.. పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఏసీపీ సూచించారు. -
78,678 బాక్స్‌ల బీర్ల వృథా.. ఆ ఒక్క పని చేసుంటే ఇలా జరిగేది కాదు
మైసూరు: మైసూరు జిల్లాలోని నంజనగూడులో ఉన్న యునైటెడ్ బ్రువరీస్ కర్మాగారంలో తయారవుతున్న బీరు నాణ్యత ప్రశ్నార్థకమైంది. జిల్లా అబ్కారీ అధికారులు సుమారు రూ. 25 కోట్ల విలుచ చేసే 78,678 బాక్స్‌ల బీర్లను సీజ్ చేశారు. ఈ కంపెనీ తయారుచేసే ప్రముఖ బీర్ల సీసాల్లో అవక్షేపం పేరుకుపోయిందని, ఇటువంటి బీర్లను తాగరాదని తెలిపారు. జూలై 15వ తేదీన ఈ సీసాలు నింపారని తెలిపారు. కొన్ని సీసాల్లో గసి పేరుకుపోయినట్లు మందుబాబుల ద్వారా తెలుసుకున్న అధికారులు బీర్ల శాంపిళ్లను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. దీనిపై ఆగస్టు 2వ తేదీన నివేదిక రాగా, ఈ బీర్లు తాగడానికి పనికిరావని అందులో హెచ్చరించారు. దాంతో ఆ బ్యాచ్‌లో సిద్ధమైన 78,678 పెట్టెల బీర్లను సీజ్ చేశారు. ఇవి అప్పటికే మద్యం షాపులకు వెళ్లిపో గా మళ్లీ వెనక్కి తెప్పించినట్లు తెలిపారు. సీసాల్లోకి నింపేముందు బీర్‌ను సక్రమంగా ఫిల్టర్ చేయకపోతే అవక్షేపం చేరుకుంటుందని చెప్పారు. చదవండి ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు! -
రోజుకొక పెగ్గేసినా..అనర్థమే
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక పెగ్గు చొప్పున తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే ఏం కాదు అనుకుంటే.. అది పొరపాటేనని ఓ అధ్యయనం హెచ్చరించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఇటలీ, అమెరికాకు చెందిన ఓ మల్టీ నేషనల్ టీమ్ అధ్యయనం ప్రకారం.. తక్కువ మోతాదులో మద్యం సేవించే వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, అధిక రక్తపోటు బారినపడుతున్నారని వెల్లడైంది. 1997 నుంచి 2021 మధ్య కాలంలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో మద్యపానం వల్ల సంభవించే పర్యవసానాలపై ఏడు అధ్యయనాలు నిర్వహించారు. 20 నుంచి 70 ఏళ్ల వయసుతో పాటు అధిక రక్తపోటు లేని 19,548 మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా 4 నుంచి 12 ఏళ్ల అనంతరం వీరి రక్తపోటు స్థాయిల్లో నిరంతర పెరుగుదలను కనుగొన్నారు. రోజుకు సగటున 12 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో ఐదేళ్లలో సిస్టోలిక్ రక్తపోటు 1.25 ఎంఎం హెచ్‌జీ పెరిగినట్టు గుర్తించారు. రోజుకు సగటున 48 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో సిస్టోలిక్ రక్తపోటు 4.9 ఎంఎం హెచ్‌జీ పెరిగినట్లు తేలింది.. ఒక్క రక్తపోటే కాదు.. అనేక సమస్యలు మద్యాన్ని ఎక్కువా.. తక్కువా.. అని కాదు.. ఏ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎక్కువ పరిమాణంలో తాగే వారిలో వేగంగా, తక్కువ పరిమాణంలో తాగేవారిలో ఆలస్యంగా ప్రభావాలుంటాయి. రక్తపోటుతో పాటు కాలేయం, గుండె, మెదడుతో పాటు శరీరంలో మద్యపానానికి ప్రభావమవ్వని భాగం ఉండదు. ఆధునిక జీవనశైలి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఇలా అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి మద్యపానం తోడైతే వేగంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మితంగా మద్యపానం ఆరోగ్యానికి మంచిదేనని గతంలో కొన్ని అధ్యయనాలు వచ్చినా.. అవి అవాస్తవమని తర్వాతి రోజుల్లో కొట్టిపడేశారు. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ -
వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా?
మద్యం, జూదం అనేవి వ్యసనాలని, ఇవి ఎవరికైనా ఒకసారి అలవడితే వారు వాటిని జీవితంలో విడిచిపెట్టలేరని చాలామంది అంటుంటారు. ఇవి వ్యవసంగా మారితే వారి జీవితాలను ఎవరూ బాగుచేయలేని కూడా చెబుతుంటారు. మనిషికి మద్యం ఎలా అలవడుతుంది? ఏ మేరకు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుంది. కొందరు చెబుతున్నట్లు వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం అలవాటు అనేది ఒక క్రానిక్ డిసీజ్. మద్యం అలవాటు అనేది మూడు దశలుగా ఏర్పడుతుంది. మొదటి దశలో మద్యం తాగేవారు అది వారికి తెలియకుండానే అలవాటుగా మారిపోతుందని గ్రహించలేరు. ఈ దశలో మద్యం తాగే వ్యక్తి దానిని అధికమోతాదులో తీసుకుంటాడు. మద్యం తాగడంపై నియంత్రణ కోల్పోతాడు. ఇక్కడి నుంచే అతను తప్పు చేయడం మొదలుపెడతాడు. ఇక వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయానికి వస్తే దీనికి స్పష్టమైన రుజువులు లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వరుసగా ఏడు రోజుల పాటు మద్యం తాగితే, అలాగే అది అధిక మోతాదులో ఉంటే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక మద్యం తాగడంలోని రెండవ దశ విషయానికొస్తే ఆ సమయంలో శరీరంలో అంతర్గతంగా మార్పులు వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దశలో సమాజంలోని తోటివారు మద్యం తాగేవారిని అవహేళన చేయడం కనిపిస్తుంది. ఇక చివరిదశ విషయానికొస్తే మద్యం తాగేవారు పూర్తిగా తమపై నియంత్రణ కోల్పోతారు. అదే సమయంలో శరీరాన్ని పలు వ్యాధులు చుట్టుముడతాయి. ఏ పనీ సరిగా చేయలేని స్థితికి చేరుకుంటాడు. శరీరం బలహీనమవుతుంది. ఇది కూడా చదవండి: నిండు గర్భిణిని నేరస్తురాలిని చేసిన ఏఐ.. మున్ముందు ఎన్ని ఘోరాలు చూడాలో? -
Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో
సాక్షి, హైదరాబాద్: తాగుడుకు బానిసైన భర్తను భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా దరూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అంజలికి 2014లో పెళ్లి జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని శ్రీరాంనగర్‌లో నివసిస్తూ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమె భర్త నరేంద్ర రోడ్ నెం. 12లోని టీఎక్స్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తుండేవాడు. ఇటీవల ఉద్యోగం కూడా చేయకుండా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటూ భార్య సంపాదనతోనే మద్యం తాగుతున్నాడు. ఈ విషయంలో ఆమె ఎన్నిసార్లు మందలించినా వినిపించుకోకపోగా సెల్ఫోన్లు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో మద్యం తాగుతుండటమే కాకుండా అబద్దాలు కూడా చెప్తుండేవాడు. దీంతో విసిగిపోయిన అంజలి గురువారం తెల్లవారుజామున తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నారులపై దూసుకెళ్లిన వాహనం -
మాతృత్వానికే మాయని మచ్చ..పసికందు ఏడుస్తుందని ఓ తల్లి..
పక్షులు దగ్గర నుంచి చిన్న చిన్న కీటకాల వరకు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుని చూసుకుంటాయి. ఆఖరికి చిన్న కోడి సైతం తన పిల్లల జోలికి వస్తే పులి అయ్యిపోతుంది. అలాంటి ఓ మహాతల్లి పసిబిడ్డ పట్ల వ్యవహరించిని తీరు చూస్తే గగుర్పాటుకు గురవ్వుతారు. ఆమె అసలు తల్లేనా? అన్నంతగా సీరియస్ అవుతారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వచ్చింది. బిడ్డ ఉలుకుపలుకు లేకుండా శవం మాదిరిగా పడుకుని ఉండటంతో వైద్యులు ఒక్కసారిగా భయపడ్డారు. కానీ ఆ తల్లి నార్మల్‌గా ఉంది. ఎలాంటి భయాందోళన లేకుండా పసిబిడ్డకు కొంచెం ఒంట్లో నలతగా ఉందని ట్రీట్మెంట్ చేయమని చెప్పి మరీ వైద్యులకు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చి డాక్టర్లు ఆ పసికందుని పరీక్షించగా ఆల్కహాల్ పట్టించినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా వైద్యలు నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కన్న బిడ్డకే మద్యం ఇచ్చి చంపాలన చూసిందని ఆరోపణలు చేశారు. సదరు మహిళ హోనెస్టి డీ లా టోర్రేగా గుర్తించారు. ఆ మహిళ రియాల్టో గుండా డ్రైవింగ్ చేస్తుండా పాప ఏడుస్తుందని మద్య పట్టించినట్లు పేర్కొంది. పైగా మద్యం ఇవ్వడంతో ఏడుపు ఆపేసిందని చెబుతోంది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే పసికందు పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులు బయటకు తెలిజేయలేదు. ఏదిఏమైనా ఇంత ఘోరమైన తల్లులు కూడా ఉన్నారా! అనిపిస్తోంది కదూ. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ స్ట్రేంజ్ అడిక్షన్ వింటే షాకవ్వాల్సిందే!) -
హైదరాబాద్ నడిరోడ్డుపై దుశ్శసన పర్వం..
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న యువతిని వివస్త్రను చేసి, దాడికి పాల్పడిన ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జవహర్‌నగర్ డీఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్ శివాజీనగర్‌కు చెందిన పెద్ద మారయ్య (30)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసగా మారి భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన మారయ్య తన తల్లితో కలిసి బాలాజీనగర్ డివైడర్ మార్గంలో రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో షాపింగ్‌కు వెళ్లి వస్తున్న ఓ యువతి (28)పై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మారయ్య చెంప చెళ్లుమనిపించింది. దీంతో అతను కోపంతో ఆమెపై దాడి చేసి దుస్తులు లాగి వివస్త్రను చేశాడు. పక్కనే ఉన్న మారయ్య తల్లి కుమారుడిని వారించలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ మహిళ అడ్డుకోగా ఆమెపై కూడా దాడి చేశాడు. కొద్దిసేపటి తర్వాత పలువురు మహిళలు వచ్చి ఆమెపై కవర్లను కప్పారు. నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేస్తుంటే స్థానికులు సెల్ఫోన్లలో వీడియోలు తీశారు తప్ప అడ్డుకోలేదని పలువురు మండిపడుతున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో యువతి హల్చల్.. రోడ్డుపై గంట పాటు చుక్కలు చూపించింది
బనశంకరి(బెంగళూరు): మద్యం అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరు తాగిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా వారి ఇళ్లకు వెళ్తుంటారు. అయితే కొందరు మాత్రం కిక్కు ఎక్కువై రోడ్డు మీద నానా రభస చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇటీవల ఈ తరహా ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అధికారులు వీరి మీద చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదనే చెప్పాలి. తాజాగా ఓ యువతి పీకల దాకా మద్యం సేవించిన మత్తులో హల్చల్ చేసింది. ఈఘటన నగరంలో జరిగింది. మత్తులో తూలుతూ కాలినడకన వస్తున్న ఆమెను కొందరు వెళ్లి రక్షించే ప్రయత్నం చేయగా వారిని దుర్భాషలాడింది. ఆమెను ఎలాగైన సురక్షితంగా ఇంటిక పంపాలని రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రయత్నం చేశారు. కానీ మహిళా పోలీసు సిబ్బంది లేనికారణంగా యువతిని ఆటోలో కూర్చోబెట్టడానికి ఇబ్బంది పడ్డారు. గంటపాటు ప్రయత్నించిన అనంతరం మరో యువతి సాయంతో ఆమెను ఇంటికి సురక్షితంగా తరలించారు. చదవండి హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు -
హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు
సాక్షి, హైదారాబాద్: జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ బస్టాండ్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని ఓ కీచకుడు వివస్త్రను చేశాడు. పెద్దమారయ్య (30) అనే కూలీ తాగిన మత్తులో యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె బట్టలు చింపేసి అందరి ముందు పరువు తీశాడు. అడ్డుచ్చిన వారిపై సైతం దాడికి తెగబడ్డాడు దుర్మార్గుడు. దీంతో 15 నిముషాల పాటు యువతి రోడ్డుమీద నగ్నంగా ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. మారయ్య అక్కడి నుంచి వెళ్లాక పలువురు కవర్లు కప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి, మారయ్యను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే: రజినీకాంత్
Rajnikanth Speech Latest: సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరు చెప్పగానే ఆవేశంతో ఊగిపోయే ఫ్యాన్స్, విజిల్స్‌తో దద్దరిల్లే థియేటర్లు గుర్తొస్తాయి. అయితే 'రోబో' తర్వాత ఈయన రేంజ్‌కు తగ్గ మూవీస్ పడలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు 'జైలర్' కోసం ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 10న రాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన తలైవా.. తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ విషయంలో పశ్చాత్తాప పడ్డారు. నేను చేసిన పెద్ద తప్పు 'నా జీవితంలో మద్యం అనేది లేకపోయింటే ఈ పాటికి నేను సమాజసేవ చేస్తుండేవాడిని. మందు తాగడం.. జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. 'నువ్వు రాజువి మందు తాగొద్దు' అని నా తమ్ముడు అప్పటికీ చెబుతుండేవాడు. కానీ నేనే వినలేదు. ఒకవేళ నా లైఫ్‌లో ఆల్కహాల్ అనేది లేకపోయింటే.. ఇప్పుడున్న దానికంటే ఎంతో గొప్పస్థాయిలో ఉండేవాడిని, వ్యక్తిగతంగా కూడా' (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) మీ వల్ల వాళ్లకు ఇబ్బంది 'అయితే నేను పూర్తిగా మందు తాగొద్దు అని చెప్పడం లేదు. మీకు సరదాగా అనిపించినప్పుడు ఎప్పుడో ఓసారి తాగండి. కానీ రోజూ మాత్రం డ్రింక్ చేయొద్దు. ఎందుకంటే అది మీ ఆరోగ్యంతోపాటు మీ చుట్టూ వాళ్ల ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఒకవేళ మీరు తాగితే మాత్రం మొత్తం జీవితం తలకిందులైపోతుంది. మీ తల్లిదండ్రులు, కుటుంబం, అందరూ మీ తాగుడు వల్ల ఇబ్బంది పడతారు. అందుకే మందు తాగొద్దు' అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు. మరి రజినీకాంత్ ఇంతలా చెప్పారు కానీ ఫ్యాన్స్ దీన్ని పాటిస్తారా అనేది సందేహమే. సరే ఇదంతా పక్కనబెడితే 'జైలర్' తెలుగులో పెద్దగా బజ్ లేదు. 'కావాలయ్యా' అనే పాట యూట్యూబ్, ఇన్ స్టాలో ట్రెండింగ్ లో ఉంది కానీ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందనేది చూడాలి. తమిళ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి సూపర్‌స్టార్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఆగస్టు 10 వరకు ఆగాలి. (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) -
ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!
చైల్ట్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న భామ నిత్యాశెట్టి. దేవుళ్లు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది హైదరాబాద్‌కు చెందిన నిత్యాశెట్టి. ఓ పిట్టకథ, నువ్వు తోపు రా, పడేశావే, వాంటెడ్ పండు గాడ్, అవరట్టం, కాదల్ కాలం లాంటి చిత్రాల్లో మెప్పించింది. పలు టీవీ షోల్లో మెరిసింది. అయితే తాజాగా తన ఫ్రెండ్ బర్త్ డేకు హాజరైన ముద్దుగుమ్మ ఫుల్‌గా చిల్ అవుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!) సెలబ్రీటీలు అన్నాక పార్టీలు, పబ్‌లకు వెళ్లడం సర్వసాధారణమే. అలా తన ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకి వెళ్లిన నిత్యా శెట్టి ఫుల్‌గా మందుకొడుతూ కనిపించింది. ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో ఎంచక్కా షాట్స్ (ఆల్కహాల్) తాగుతూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తన ఫ్రెండ్‌కు విష్ చేసిన నిత్యా శెట్టి మందు తాగుతూ కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) -
తప్పతాగి పాఠశాలకు వెళ్లి.. ఛీ, విద్యార్థుల ముందే బట్టలు విప్పి...
లక్నో: విద్యార్థులకు చదువుతో వారికి మంచి చెడులను కూడా బోధించే వాడే ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఓ గౌరవం ఉంది. అయితే ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం ఛీ ఇవేం పనులు అనుకునేలా తప్పతాగి పాఠశాలకు వెళ్లడమే కాకుండా తరగతి గదిలోనే ఆదమరిచి నగ్నంగా నిద్రపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో బహ్రైచ్ జిల్లాలోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశేశ్వరగంజ్ బ్లాక్‌లోని శివపుర్ బైరాగి ప్రాథమిక పాఠశాలలో దుర్గా ప్రసాద్ జైశ్వాల్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం ఫూటుగా మద్యం సేవించి పాఠశాలకు వెళ్లాడు. విద్యార్థుల మందే దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా నిద్రపోయాడు. ఇదంతా కొందరు వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్థినుల ముందు దుర్గా జైస్వాల్ అనుచిత ప్రవర్తన గురించి తెలిసి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ ప్రధానోపాధ్యాయుడు తరచూ ఇలాంటి చర్యలను పాల్పడేవాడని ఆరోపించారు. ఇటువంటి చేష్టలతో ఇబ్బంది పడిన విద్యార్థినులు కొందరు పాఠశాలకు వెళ్లడం మానేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై చర్య తీసుకున్న ప్రాథమిక శిక్షా అధికారి (బిఎస్ఎ) బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తో విచారణకు ఆదేశించడంతో పాటు దుర్గా జైస్వాల్‌ను సస్పెండ్ చేశారు. అతడిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని.. అవసరమైతే, ప్రధానోపాధ్యాయుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. చదవండి జేసీబీతో ఏటీఎంపై దాడి.. దోపిడీకి దొంగల యత్నం -
డ్యూటీలో మద్యం తాగి ఇంజినీర్లు చిందులు.. వీడియో వైరల్ కావడంతో
భువనేశ్వర్: ఉద్యోగస్తులు బయట ఎలా ఉన్న ఆఫీసులోకి వెళ్లగానే హుందాగా ప్రవర్తించడంతో పాటు వారి పనిని నిబద్దతతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సంస్థ తమ ఉద్యోగుల నుంచి ఆశిస్తుంది. అయితే కొందరు మాత్రం ఇవేవి తమకు పట్టవంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒరిస్సాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రాపడా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఇంజినీర్లు తమ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనా జలవనరుల శాఖను సోమవారం ఆదేశించారు. ఈ ఇరువురు నిందితులు మహానది నార్త్ డివిజన్లో ఇంజినీర్లుగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని నారాయణపూర్ సెక్షన్ కార్యాలయంలో ఇంజినీర్లు, మరికొందరు వ్యక్తులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మద్యం, ఆహారం సరంజామాతో సమగ్ర వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇరువురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ఆదేశిస్తూ సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి అన్యోన్యంగా ఉండేవాళ్లు,ఎలాంటి లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు! -
అవి సాధారణ మరణాలే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎంఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించడం వల్లే శుక్రవారం ఆరుగురు మృతి చెందారని సూపరింటెండెంట్ సిద్ధానాయక్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ రామచంద్రరావు స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ అందకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా నిరంతరంగా ఉంటుందని తెలిపారు. గూడూరుకు చెందిన కె.సాంబయ్య (55), నెల్లూరుకు చెందిన ఎస్.లలిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో, విపరీతంగా మద్యం అలవాటున్న నరుకూరుకు చెందిన పి.రమేష్ (42), నెల్లూరులోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఎన్.చలపతి (52) క్లోమ గ్రంధి పాడవ్వడంతో మృతి చెందారని తెలిపారు. నెల్లూరులోని వేదాయపాళెంకు చెందిన సుందరం (70), నెల్లూరులోని పొర్లుకట్టకు చెందిన కె.చెంచమ్మ (70) గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయారన్నారు. ఐదారు రోజులుగా చికిత్స పొందుతున్న వీరంతా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు సమయాల్లో మృతి చెందారనే విషయాన్ని గమనించాలన్నారు. ఆరుగురు కూడా దీర్ఘకాలిక రోగులని, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి పెంచలయ్య విచారణ చేపట్టారు. శనివారం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి వైద్య సేవలు బాగున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కూడా ఎంఐసీయూ వార్డును పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. ఆక్సిజన్ ట్యాంకును, పైపులను టెక్నీషియన్ ద్వారా పరిశీలించారు. ఆస్పత్రి సేవల్లో ఎక్కడా లోపం లేదని చెప్పారు. -
తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి..
తిరువనంతపురం: పీకలదాక తాగి రైల్వే ట్రాక్‌పై కారును నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని జయప్రకాశ్‌గా గుర్తించారు. కేరళ, కన్నూర్ సమీపంలోని అంచరకండిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా చొవ్వ రైల్వే క్రాస్ దగ్గర ట్రాక్‌పై ఉన్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. జయప్రకాశ్ మద్యం మత్తులో ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌పైకి కారును పోనిచ్చాడు. మత్తులో ఉన్న కారణంగా ట్రాక్‌ను నిందితుడు రోడ్డుగా భ్రమపడినట్లు తెలుస్తోంది. దాదాపు 15 మీటర్ల దూరం పోగానే ట్రాక్‌పై కారు ఇరుక్కుని నిల్చిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గేట్ కీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో కారును ట్రాక్‌పై నుంచి బయటకు తీశారు. జయప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఆ సయమంలో ఎలాంటి రైలు రానుందున ముప్పు తప్పిందని తెలిపారు. ఇదీ చదవండి: Where Snakes Given As Dowry: వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు.. -
మద్యం కూడా మంచిదే బాసూ.. కానీ దానికీ ఓ లెక్కుంది
మద్యపానం ఆరోగ్యానికి హానీకరం అన్న విషయం తెలిసిందే. ఆల్కహాల్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి దీనికి దూరంగా ఉండటమే బెటర్ అని ఇప్పటివరకు చాలాసార్లు వింటూ వచ్చాం. అయితే మద్యాపానంతో ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు. కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ జరిపిన అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. మితంగా మద్యపానం తీసుకోవడం కలిగే కలిగే లాభాలు ఏంటి? శరీరానికి ఆల్కహాల్ ఏ విధంగా మేలు చేస్తుందన్నది ఇప్పుడు చూద్దాం.. ►మితిమించనిది ఏదైనా మంచిదే. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పనరక్కర్లేదు. కాలేయం దెబ్బతినడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మద్యం మితంగా తీసుకుంటే మంచిదే అని మీకు తెలుసా? సరైన పద్దతుల్లో మద్యం తీసుకుంటే శరీరానికి మంచే చేస్తుందట. ► మితంగా మద్యపానం తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ► తక్కువ మొత్తంలో మద్యపానం తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందట. 25% మరణాల రేటును ఇది తగ్గిస్తుంది. ► రెడ్ వైన్‌లో యాంటీ ఏజినింగ్ గుణాలు ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో ఇది తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరిగి యవ్వనంగా కనిపిస్తారు. ► వైన్ ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెరాట్రాల్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి కొద్దిగా వైన్ తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. ► బీర్, వైన్స్‌లో అధికమొత్తంలో సిలికాన్ ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. ► మితమైన మద్యపానం తీసుకోవడం వల్ల కొన్ని మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ► తక్కువ మొత్తంలో మద్యం తాగేవారికి కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువట. అదే అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురై కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. గమనిక: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతి తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ను తీసుకుంటేనే ప్రయోజనకరం అన్నది ఈ ఆర్టికల్ సారాంశం. మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. గమనించగలరు. Disclaimer: The information provided in this article is based on general information. Please contact the relevant expert before taking alcohol consumption. -
ములుగు జిల్లాలో కలకలం సృష్టిస్తున్న విద్యార్థులు
-
మద్యపానంతో ఇబ్బందులు పడ్డా.. జీవితం తలకిందులైంది: సీనియర్ హీరోయిన్
బాలీవుడ్ నటి, మనీషా కొయిరాలా బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అప్పట్లోనే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించింది. నేపాల్‌లోని ఖాఠ్మండులో జన్మించిన మనీషా కొయిరాలా.. 1991లో సుభాష్ ఘై చిత్రం సౌదాగర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతకుముందే 1989లో ఫేరి భతౌలా అనే నేపాలీ చిత్రంలో నటించింది. (ఇది చదవండి: 7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్) అప్పటి నుంచి ఆమె కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఆమె నటించిన బొంబాయి చిత్రంలో అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో నాగార్జున సరసన క్రిమినల్, అర్జున్‌తో ఒకే ఒక్కడు, నగరం, భారతీయుడు, బూచి, లేడీ టైగర్, నోటుకు పోటు లాంటి చిత్రాల్లో కనిపించింది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ నటించిన షెహాజాదాలో హీరోకు తల్లిపాత్రలో నటించింది. అయితే మనీషా కొయిరాల ఎంత త్వరగా గొప్ప పేరు తెచ్చుకుందో.. ఆమె కెరీర్ కూడా అంతే వేగంగా పతనమైంది. ఆ తర్వాత అప్పట్లో ఆమె నేపాల్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. అప్పట్లో ఆమె మద్యానికి కూడా బానిసైంది. గతంలో మనీషా మద్యం సేవించిన ఓ వీడియో నెట్టింట్లో కనిపించింది. ఆ వీడియోలో మద్యం మత్తులో ఉన్న మనీషా కొయిరాలాను మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండగా వద్దని వేడుకుంది. మద్యానికి బానిస కావడం పట్ల మనీషా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మద్యపానం వల్ల జీవితంలో కష్టాలు పడ్డానని తెలిపింది. మనీషా కొయిరాలా మాట్లాడుతూ.. 'మద్యం నా జీవితంలోకి వచ్చాక పరిస్థితి అంతా తలకిందులైంది. నా జీవితం ఇంతలా మారతుందనినేను గ్రహించలేదు. అప్పుడు చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నా. మనం మద్యం తాగడం ప్రారంభిస్తే దానివల్ల సమస్యలు పరిష్కారం కావు. జీవితంలో అది మన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మద్యం తాగుతారు. మా నాన్న కొన్నిసార్లు తాగేవారు. కానీ మన పరిస్థితులను అర్థం చేసుకుని మెలగాలి. అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది.' అని అన్నారు. కాగా.. 2010లో మనీషా తన తోటి నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లాడింది. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) -
తాగితే మా ఆయన చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు.. ఏం చేయాలి?
వ్యసనాల బారిన పడిన వ్యక్తిని ఆ కుటుంబంలోని వారు మొదట్లో గుర్తించరు. తమ వాళ్లు మంచివాళ్లని, చెడు అలవాట్లకు బానిసలు కారని నమ్ముతారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు స్నేహితుల ప్రభావమో, మరొకటో అనుకుంటారు తప్ప సమస్యను పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యను ఫ్యామిలీ డినైల్ అంటున్నారు నిపుణులు. అడిక్షన్స్ గురించి అసలు మన కుటుంబాలు ఎంతవరకు అర్ధం చేసుకుంటున్నాయి..? ఎలాంటి నిర్ణయాలు అమలు చేస్తున్నాయి? ఈ అంశం పై ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’ ► అపార్ట్మెంట్లో దాదాపు అన్ని ఫ్లాట్స్ ఒకేలా ఉంటాయి. ఒకబ్బాయి రాత్రి టైమ్‌లో బాగా తాగేసి తమ ఇల్లు అనుకొని, వేరేవాళ్ల ఇంటి బెడ్రూమ్కి వెళ్లి పడుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్లు పెద్ద గొడవ చేశారు. ఆ అబ్బాయి వాళ్ల తల్లితండ్రులు తమ పిల్లవాడిని తిట్టకుండా ఏదో పొరపాటున జరిగి ఉంటుందంటూ ఆ కుటుంబంతో గొడవ పడ్డారు. ► ఫ్యామిలీ ఫంక్షన్‌కి భర్త రాలేదు. ‘ఏమైంది..’అని ఎవరైనా అడిగితే ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆ సదరు వ్యక్తి ఇంట్లో ఉండి తాగుతుంటాడు. ► మల్టిపుల్ అడిక్షన్స్‌కు అలవాటుపడిన ఓ అబ్బాయి వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటానంటే, తల్లి ఒప్పుకోలేదు. ‘నీకేమైంది, బాగానే ఉన్నావ్ కదా! పై చదువుల కోసం అమెరికా వెళుతున్నావ్. బాధ్యత తెలిస్తే సెట్ అవుతావులే’ అంటుంది. ► ఒక భార్య ‘మా ఆయన తాగినప్పుడు చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. మిగతా సమయాల్లో చాలా చాలా బాగుంటాడు’ అని సరిపెట్టుకుంటుంది. ► ‘మా వాడు చాలా మంచోడు సార్, చాలా జాగ్రత్తగా ఉంటాడు. మొన్ననే తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యింది’ అంటాడు తండ్రి. ► కజిన్స్ రిలేటివ్ ఫంక్షన్లో ఒకబ్బాయి ఓవర్‌గా తాగాడు. మనవాడు కదా అని మరుసటి రోజు తల్లికి ఫోన్ చేసి ‘అక్కా, మీ అబ్బాయి పార్టీలో ఓవర్‌గా తాగాడు’ అని చెబితే ‘మా అబ్బాయి అలాంటోడు కాదు, ఫ్రెండ్స్, కజిన్స్ బలవంతం చేసుంటారు’ అని వెనకేసుకొచ్చింది. విషయం చెప్పిన వ్యక్తితో మాట్లాడటమే మానేసింది. బంధుమిత్రులు ఎవరైనా ‘మీ అబ్బాయి తాగుతుండగా ఫలానా చోట చూశాం’ అని చెబితే వాళ్లతోనూ మాట్లాడటం మానేసింది. ఒకసారి కాలేజీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు. తల్లిదండ్రులని పిలిస్తే ‘మా అబ్బాయిని కావాలనే బ్లేమ్ చేస్తున్నారు. మీదే అసలు సమస్య అనేసింది.’ ఇలాంటి సమర్థింపులు ఎన్నో .. ఎన్నెన్నో మీకూ తెలిసే ఉంటాయి. వెరీ డేంజర్!! చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు వ్యసనాల బారినపడ్డారనే విషయం తెలిసినా వారు ఒప్పుకోరు. వ్యసనపరులకు కుటుంబాల నుంచి ఇలాంటి రక్షణ దొరికితే ఎప్పటికీ మార్పు రాదు సరికదా సర్దుకుపోవడం, కొట్టిపారేయడం చేస్తుంటే మీ కుటుంబం బీటలు వారడానికి సిద్ధంగా ఉందని గ్రహించాల్సిందే! అడిక్షన్ వెరీ వెరీ డేంజర్ డిసీజ్. ఈ సందర్భంలో కుటుంబంలో ఎవరిలోనైనా అడిక్షన్స్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించడం మేలు. ధైర్యమే ఆయుధం వ్యసనాల బారిన పడ్డవారు నమ్మబలికే మాటలు చెబుతారు. సంఘటన తర్వాత ‘సారీ..’ అనేస్తారు. చిన్న చిన్న కానుకలు ఇచ్చి, తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేవారుంటారు. దీంతో అమ్మ/భార్య/అక్క/ మన వాళ్లే కదా, మన పిల్లలే కదా.. మరోసారి ఇలా చేయరులే అనుకుంటారు. ఇదే విధమైన ప్రవర్తన కొన్నాళ్లకు ముదిరి ఇంట్లో భయోత్పాతాలను సృష్టిస్తుంటారు. కుటుంబం ప్రవర్తన మారాల్సిందే! కొడుకు/కూతురు/హజ్బెండ్/ఫాదర్ కి అడిక్షన్ పట్ల సపోర్ట్ ఇవ్వకూడదు. ఇంట్లో డబ్బులివ్వకపోతే బయట అప్పులు చేస్తారు. పదివేలు, ఇరవైవేలు అప్పు చేసినప్పుడు ఎవరైనా ఇంటి మీదకు వస్తే కుటుంబంలో ఉన్నవారిని బెదిరియ్యకుండా ఆ అప్పు తీర్చేస్తారు. సదరు వ్యక్తికి ఇబ్బంది కలగనీయకుండా అడ్డుగా నిలబడతారు. ఆ సమస్యను ఫేస్ చేయనీయకుండా వెనకేసుకొస్తారు. కాలేజీలో సమస్య వచ్చినా, మరోచోట సమస్య వచ్చినా తల్లిదండ్రులు కొడుకును కాపాడటానికి ట్రై చేస్తారు. దీనివల్ల పిల్లవాడు మరిన్ని తప్పులు చేసేలా ఆ కుటుంబంలోని వారు ప్రోత్సహిస్తున్నట్లే. మందలించాల్సిందే! ముందు తప్పించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం నుంచి కుటుంబాల్లో ఉన్నవారు బయటకు రావాలి. కౌన్సెలింగ్ సమయంలో ముఖ్యంగా ఆడవాళ్లకు బలంగా ఉండాలని చెబుతాం. గట్టిగా మందలించమని చెబుతాం. ‘ఇది మా వ్యక్తిత్వం కాదు కదా’ అంటారు. కానీ, మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు అని గుర్తించరు. సమస్యను భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మిమ్మల్ని వ్యసనపరులు నిస్సహాయ స్థితికి తీసుకెళతారు. కుటుంబం బలంగా ఉండాలంటే మేజర్ రోల్ భార్య/తల్లిదే. ఆమె గట్టిగా ఉండాల్సిందే. కుటుంబం బాగుండాలంటే మంచిగవ్వాల్సిందే! అని చెప్పాలి. ఒకతను ఆల్కహాల్/ డ్రగ్స్ వాడుతున్నాడంటే అతని మైండ్ నిలకడగా లేదని అర్ధం చేసుకోవాలి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, శ్రేయోభిలాషుల సాయంతోనైనా సమస్యను చక్కదిద్దాలి. ‘థెరపీ అవసరం లేదు, సదరువ్యక్తికి తెలియకుండా మందులు ఇప్పిద్దాం’ అనుకుంటారు. కానీ, యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల బ్రెయిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చు. అవగాహన, బిహేవియరల్ థెరపీ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుంది. ముందుగా కుటుంబాల వాళ్లు... 1. ఇదొక వ్యసనం అని అంగీకరించాలి. 2. పూర్తి చికిత్స ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకోవాలి. 3. చికిత్సకు కావాల్సినంత టైమ్ ఇవ్వాలి. నలుగురిలో తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటారు. ఏదైనా అనారోగ్యం చేస్తే హాస్పిటల్‌కు ఎలా వెళతామో సైకలాజికల్ సమస్య వస్తే అందుకు సంబంధించిన డాక్టర్ని కలవడానికి ఇబ్బంది పడకూడదు. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్ -
ఆ నియంతకు ఖరీదైన మద్యం, సిగరెట్ లేనిదే రోజు గడవదట!
ఉత్తర కొరియా పేరు వినిపించగానే ఎవరికైనా సరే ముందుగా ‘మిసైల్ టెస్ట్’.. తరువాత ఆ దేశ నియంత కిమ్ జోంగ్ పేర్లు గుర్తుకువస్తాయి. తన వింత ప్రవవర్తన, ఆదేశాల కారణంగా కిమ్ జోంగ్ ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ చర్చల్లో కనిపిస్తుంటాడు. కిమ్ జోంగ్ లగ్జరీ లైఫ్న్ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక ఏడాది వ్యవధిలో కిమ్‌జోంగ్ వందల కోట్ల విలువైన మద్యాన్ని తాగుతాడు. కిమ్ జోంగ్ తాగే మద్యానికి సంబంధించి ఒక్కో బాటిల్ విలువ వేల డాలర్లలో ఉంటుంది. ఇతర దేశాలకు ఛాలెంజ్.. ఉత్తర కొరియాలో ఆర్థికపరిస్థితి మందగమనంలో ఉంది. దీనికితోడు దేశ నియంత తరచూ మిసైల్ పరీక్షలు నిర్వహిస్తూ, ఇతర దేశాలకు ఛాలెంజ్ విసురుతుంటాడు. జపాన్‌లోనూ ఇటువంటి నియంత పాలనే కొనసాగుందనే వాదనలు వినిపిస్తుంటాయి. కిమ్ జోంగ్ లగ్జరీ లైఫ్ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అతను తాగే ఖరీదైన మద్యం, ఖరీదైన సిగరెట్ల వినియోగం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాంసం అతని లగ్జరీ లైఫ్‌ను ప్రతిబింబిస్తాయి. ఒక బాటిల్ ఖరీదు 7 వేల డాలర్లు.. ఆమధ్య విదేశీ మీడియాతో మాట్లాడిన బ్రిటన్ మంత్రి ఒకరు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ మద్యపాన ప్రియుడని తెలిపారు. ఆయన బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ, ఖరీదైన హెన్సీ బ్రాండ్ తాగడాన్ని ఎంతో ఇష్టపడతారన్నారు. వీటికి సంబంధించిన ఒక బాటిల్ ఖరీదు 7 వేల డాలర్ల వరకూ ఉంటుందన్నారు. ఇంతేకాదు ఆయన అత్యంత ఖరీదైన వైవ్స్ సెంట్ లారెంట్ బ్లాక్ సిగరెట్ తాగుతాన్నారు. ఈ సిగరెట్ బంగారు రేపర్లో చుట్టి ఉంటుందన్నారు. ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు.. కొన్నేళ్ల క్రితం చైనీస్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిరంగపరిచిన గణాంకాల ప్రకారం 40 ఏళ్ల కిమ్‌జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో హైక్వాలిటీ మద్యం తాగేందుకు ఏటా 30 మిలియన్ డాలర్లు ఖర్చుచేస్తారు. ఇంతేగాదు భోజన ప్రియుడైన కిమ్ జోంగ్ ఇటలీకి చెందిన ఖరీదైన వంటకాలు ఆరగిస్తారు. మద్యం, సిగరెట్ల అలవాటు కారణంగానే అతని బరువు 136 కిలోలకు చేరుకుందని అక్కడి నిపుణులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..
తేనె గురించి, అది అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. తేనె పలు వ్యాధులను కూడా దూరం చేస్తుందని చెబుతుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఎర్ర తేనె గురించి విన్నారా? ఇది ఎంతో మత్తును కలిగిస్తుంది. పెద్ద తేనె టీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. ఈ తేనెను ఉత్పత్తి చేసే తేనెటీగలను ‘హిమాలయన్ క్లిఫ్ బీస్’ అని అంటారు. ఈ తేనెకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర తేనెను ఉత్పత్తి చేసేందుకు ‘హిమాలయన్ క్లిఫ్ బీస్’ విషపూరితమైన పండ్ల రసాన్ని సేకరిస్తాయి. ఈ తేనె ఎంతో మత్తునిస్తుంది. దీనిలో పలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఎర్ర తేనెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ తేనె తీసుకోవడం వలన లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చెబుతారు. డయాబెటీస్‌తో పాటు హైబ్లడ్ ప్రజర్‌ను ఇది తగ్గిస్తుందని చెబుతారు. ఇది అందించే మత్తు కారణంగా దీనికి అత్యధిక డిమాండ్ ఏర్పడిందని అంటారు. ఎర్ర తేనె నేపాల్ శివారు ప్రాంతాలలో లభ్యమవుతుంది. కాగా ఈ తెనె తీయడం ఎంతో ప్రమాదకరమని చెబుతారు. సాధారణ తీసే విధానం కన్నా ఇది ఎంతో కష్టమైనది. ఎర్ర తేనెను గురూంగా గిరిజన జాతివారు ఎంతో చాకచక్యంగా సేకరిస్తుంటారు. ఈ తేనె సేకరించేందుకు ముందుగా ఒక తాడు సహాయంతో ఎన్నో అడుగుల ఎత్తయిన ప్రాంతానికి చేరుకుంటారు. తరువాత పొగ సాయంతో తేనేటీగలను తరిమికొడతారు. ఈ నేపధ్యంలో తేనె సేకరించేవారు తేనెటీగల దాడికి కూడా బలవుతుంటారు. ఎర్ర తేనె అత్యధిక మత్తు కలిగిన ఎస్బింథే లాంటిది. ఎస్బింథే వినియోగంపై పలు దేశాల్లో నిషేధం ఉంది. ఎరుపు తేనెను అధికమోతాదులో తీసుకుంటే హృదయ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: డాక్టర్‌కు షాకిచ్చిన సమోసాలు.. రూ 1.40 లక్షలకు టోకరా! -
Kim Jong Un: ఓ వైపు ఆహార సంక్షోభం.. కిమ్ విందు, విలాసాలకు కోట్లు!
ఉత్తర కొరియా దేశం కరువుతో అల్లాడుతోంది. ఆహార కొరతతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వైపు దేశం ఆహార సంక్షోభంతో కొట్టుమిట్లాడుతుంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన లగ్జరీ జీవితాన్ని వదులుకోవడం లేదు. ఉత్తర కొరియా నియంత విందులు, విలాసాలకు కోట్లలో డబ్బులు వెచ్చిస్తున్నాడు. దేశ పరిస్థితిని పట్టించుకోకుండా ఖరీదైన మద్యం, సిగరెట్లు, ఇంపోర్టెడ్ మాంసం రుచిని ఆస్వాదిస్తున్నాడు. రూ. 5 లక్షల విలువ చేసే మద్యం ఈ మేరకు అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు డైలీ స్టార్ పత్రికకు వెల్లడించారు. కిమ్ అత్యంత ఖరీధైన మద్యాన్ని తాగుతాడని ఆయన తెలిపారు. దాదాపు 7 వేల డాలర్లు(ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5 లక్షలకు పైగా) విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని సేవిస్తాడని పేర్కొన్నారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్ ప్రతి ఏడాది 30 మలియన్ డాలర్లు (రూ.247 కోట్లు) ఖర్చుపెడతారని వెల్లడించారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్ అడ్మిన్‌స్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ బహిర్గతం చేసినట్లు తెలిపారు. బంగారపు రేకుతో చుట్టిన సిగరెట్లు కేవలం మద్యం మాత్రమే కాకుండా అత్యంత నాణ్యత, అరుదుగా దొరికే ప్రత్యేక ఆహారాన్ని కిమ్ తీసుకుంటారు. ఇటలీలోని పర్మా ప్రాంతంలో లభించే పర్మా హామ్(పోర్క్‌తో తయారు చేసేది), స్విస్ చీజ్‌ను దిగుమతి చేసుకుంటారు. ఆయన తాగే ఖరీదైన సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు. చదవండి: ఉత్తర కొరియా కిమ్ జోంగ్కు ఇన్సోమ్నియా డిజార్డర్!.. 140 కేజీల బరువు!! పిజ్జాల కోసం ఇటలీ నుంచి చెఫ్ కిమ్‌కు జంక్ ఫుడ్ అన్న అమిత ఇష్టం. 1997లో కిమ్ కేవలు పిజ్జాలు చేసేందుకు ఇటలీ నుండి ఖరీదైన చెఫ్‌ను రప్పించుకున్నాడు. తనకు ఇష్టమైన బ్రెజిలియన్ కాఫీ కోసం ప్రతి సంవత్సరం 9.6 లక్షల డాలర్లను(రూ.7 కోట్ల 96 లక్షలు) వెచ్చిస్తున్నారు. కిమ్, అతని తండ్రి కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం కోబ్ స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్‌తో భోజనం చేసేవారు. ఈ విషయాన్ని కిమ్ వద్ద గతంలో చెఫ్‌గా చేసిన ఒకరు పేర్కొన్నారు. స్నేక్ వైన్ యూకే మెట్రో రిపోర్ట్ ప్రకారం.. 2014లో కిమ్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడట. అయితే ఉత్తర కొరియా నియంత విపరీతమైన మద్యపానం, ధూమపానం చేస్తున్నాడని, అతని బరువు 300 పౌండ్లు (136 కిలోలు) మించిపోయిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించిన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ విలాసవంతమైన ఫుడ్ డైట్ విషయం వెలుగులోకి వచ్చింది. నార్త్ కొరియా నియంత యూఎస్ఏ నుంచి మార్ల్బోరో సిగరెట్లతో సహా, నిద్రలేమికి చికిత్సకు ఉపయోగించే జోల్పిడెమ్ వంటి మందులను కూడా దిగుమతి చేసుకుంటున్నారని సదరు నివేదిక పేర్కొంది. మరోవైపు ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. అదే విధంగా పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. చదవండి: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..! -
మెట్రోలో మద్యం అనుమతి.. ఎన్ని బాటిళ్ల వరకు తెలుసా..?
ఢిల్లీ: మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే.. మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా అడిగిన ఈ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్ఆర్సీ ) సమాధానం తెలిపింది. రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్ఆర్సీ స్పష్టం చేసింది. మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది. అయితే.. ఢిల్లీలో ఎయిర్‌పోర్టు లైన్లో తప్పా మిగిలిన రూట్లలో మద్యం తీసుకురావడానికి ఇప్పటివరకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవల ఢిల్లీ మెట్రో నిబంధనలను సడలించింది. Hi. Yes 2 sealed bottles of alcohol is allowed in Delhi Metro. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 30, 2023 ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్ఎఫ్, డీఎమ్ఆర్సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ నివేదిక ప్రకారం మెట్రో ఏ రూట్లోనైనా ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకురావచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేన్నీ వదలకుండా మాట్లాడారు.. మెట్రో రైలులో అనుభవంపై ప్రధాని మోదీ -
వ్యసనంపై పోరాడటానికి మనం మాట్లాడుకోవాల్సిందే
ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్‌లాంటి దురలవాట్లకు బానిసలై చీకటి నింపుకుంటున్న కుటుంబాలు ఎన్నో. వీటినుంచి బయట పడాలంటే ఏం చేయాలి?! ఈ వ్యసనం కుటుంబాలలో రేపుతున్న చిచ్చును ఆర్పేదెలా?!పరువు పోతుందనే భయంతో సమాజంలో దాక్కుంటున్న మనుషుల్లో ధైర్యం నింపేదెలా?!సమస్యను దాచిపెడితే పెంచి ‘పోషించినట్టే. అందుకే, మనం మాట్లాడుకోవాల్సిందే వ్యసనంపై పోరాడటానికి..! సమస్యను ఎదుర్కొంటున్న ఒక కుటుంబ కథనం,,, ‘బాబూ.. ఏమీ అనుకోకుండా ఈ బ్రాండ్ లిక్కర్ తెచ్చిపెట్టగలవా?!’ అ΄ార్ట్‌మెంట్ పైఫ్లోర్ నుంచి దిగుతున్న ఓ అపరిచిత అబ్బాయిని పిలిచి అడిగింది శారద (పేరుమార్చడమైనది). ఆ అబ్బాయి ఆమెను ఎగాదిగా చూశాడు. పక్క΄ోర్షన్ వాళ్లు చూస్తే ఏమనుకుంటారో అనే భయంతో.. ‘మా వారికి డ్రింక్ చేసే అలవాటుంది. ఎంతకీ మార్చుకోవడం లేదు. ఆయన్ని బయటకు వెళ్లనివ్వడం లేదు. నేనుగా ఆ వైన్ షాప్‌కి వెళ్లలేను. అందుకే అడుగుతున్నాను’ అంది బతిమాలుతున్నట్టుగా. ‘ఓ.. అలాగే తెచ్చిస్తాను’ అని డబ్బులు తీసుకొని వెళ్లి΄ోయాడు. అతను తెచ్చిన బాటిల్‌ను ఎవరూ గమనించట్లేదని నిర్ధారించుకుని, థాంక్స్ చెప్పి లోపలికి తీసుకెళ్లింది. కొన్నాళ్లుగా ఈ సమస్య కారణంగా నరకం చూస్తోంది శారద. ∙∙ శారద ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్తది కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. చుట్టుపక్కల వారిలో గౌరవ మర్యాదలకు లోటు లేని కుటుంబం. ‘వాళ్లకేం.. ఇద్దరూ సం΄ాదిస్తున్నారు. చిన్న కుటుంబం చింతల్లేవు’ అంటుంటారు. నలుగురిలో ఎంతో గొప్పగా ఉండే తమ కుటుంబం నేడు దిగజారి΄ోయిన పరిస్థితి చూస్తూ కొన్నాళ్లుగా కంటిమీద కునుకు లేకుండా గడిపేస్తోంది. మొదట్లో పార్టీలకు వెళ్లినప్పుడు కొద్దికొద్దిగా డ్రింక్ చేసేవాడు శారద భర్త. వద్దని వారిస్తే ‘డ్రింక్ అనేది ఒక ΄ార్టీ కల్చర్, నలుగురిలో కలుపుగోలుగా ఉండాలంటే ఇలాంటివి పట్టించుకోవద్ద’ని చెప్పేవాడు. ‘నిజమే, కదా! దాదాపుగా చుట్టూ అందరూ అలాగే ఉన్నారు’ అనుకుంది శారద. పిల్లల చిన్నప్పుడు తక్కువగానే ఉన్న ఈ డ్రింక్ అలవాటు, ఇప్పుడు వారికీ అన్నీ తెలిసే వయసు వచ్చేసరికి పెరిగింది. ΄ార్టీల నుంచి అలవాటు రోజూ రాత్రిపూట తీసుకోవడం, ఆ తర్వాత పగటికి కూడా మారింది. అదేమంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మాత్రం తప్పదని కొన్నాళ్లు, బాధగా ఉందని, ఆనందంగా ఉందని, ఈ మాత్రమైనా ఉంటున్నాను కదా!’ అంటూ ఏదో ఒక వంకన తాగడం పెరిగింది. పగటిపూట తాగి కాలేజీకి వెళితే, యాజమాన్యం డిస్మిస్ చేసింది. దీంతో జాబ్ ΄ోయిందనే ఆలోచన, డిప్రెషన్‌తో ఇంకా తాగడం పెరిగింది. తాగి బయటకు వెళ్లినా, ఆ మత్తులో ఎవరితోనైనా గొడవ పెట్టుకున్నా నలుగురిలో పరువు ΄ోతుందని, తనే మందుబాటిళ్లు ఇంటికి తెచ్చిస్తాను, ఎక్కడకూ వెళ్లద్దు అని బతిమాలడం మొదలుపెట్టింది. ∙∙ ఇద్దరిలో ఒకరి స్పందన ఎలాగూ పోయింది. తన ఒక్కదాని సం΄ాదనతో ఇల్లు, పిల్లల ఫీజులు నెట్టుకొస్తోంది. దానికితోడు మందుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. కానీ, తప్పడం లేదు. పైగా, రోజు రోజూ భర్త ఆరోగ్య పరిస్థితి ఏమౌతుందో అని ఆందోళన పెరుగుతోంది. ∙∙ కొన్నాళ్లుగా బంధుమిత్రుల వేడుకలు, ΄ార్టీలకు వెళ్లడం బాగా తగ్గించేసింది. అదేమని అడిగితే ముఖ్యమైన పని ఉందని తప్పించుకుని తిరుగుతుంది. ఒక విధంగా స్వీయ సామాజిక బహిష్కరణకు గురైంది. ∙∙ ΄పార్టీ ఉందని చెప్పి వెళ్లిన పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాక΄ోవడంతో ఆందోళన పడి΄ోయింది శారద. వచ్చాక వాడిని గమనిస్తే మందు వాసన వస్తోంది. అదేమని నిలదీస్తే.. ‘డాడీని ఏమీ అనవు. పైగా నువ్వే మందు తెప్పించి ఇస్తావు. నన్ను మాత్రం ఎందుకు తిడుతున్నావు!’ అని ఎదురు తిరిగాడు. ఆ మాటలతో తల తిరిగి΄ోయింది శారదకు. ఇంట్లో అందరివైపు బిక్కుబిక్కుమని చిన్నకొడుకు చూసే చూపులు ఆమెను పూర్తి అగాథంలోకి తోసేసినట్టుగా అనిపించాయి. ఇలాంటి బయటికి చెప్పుకోలేని గాధలు మన చుట్టూ ఉన్నవారిలో ఎన్నో ఉన్నాయి. – నిర్మలారెడ్డి కుటుంబమంతా కలిసి... బయట మద్యం అందుబాటులో ఉంటుంది కాబట్టి, వీళ్లు తాగుతున్నారు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మన చుట్టూ మంచీ–చెడు అంశాలు ప్రతి దానిలోనూ చూస్తుంటాం. దేనిని మనం ఏ విధంగా తీసుకోవాలో మన మెదడు చేసే పనితీరును బట్టి ఉంటుంది. లోపం ఎక్కడ ఉందో గుర్తించి, దానికి విరుగుడు ఏంటా.. అని ఆలోచించడం మన ముందున్న అసలు కర్తవ్యం. ∙కుటుంబం అంతా వ్యసనంపై ΄ోరాటానికి సిద్ధం అన్నట్టుగా ఉండాలి. ∙చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో, బంధుమిత్రుల్లో పరువు ΄ోతుందేమో అనే ఆలోచనకు తావివ్వకుండా ఈ సమస్య గురించి నలుగురితో చర్చించాలి. ∙అపార్ట్మెంట్, కాలనీ, సొసైటీ మీటింగ్స్ సమయాల్లో ‘మద్యం అలవాటు’ తప్పనిసరి టాపిక్ అయి ఉండాలి. సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అనే ఆలోచనలు పంచుకోవాలి. ∙మద్యం తాగినప్పుడు బాగుంటుందనే ఆలోచన రావడమే సరైనది కాదు. ఇలాంటప్పుడు తమ ఆలోచనల్లోనే తేడాలు వస్తున్నట్టు గుర్తించి, ఇంట్లో వారికి చెప్పి, నిపుణుల సలహా తీసుకోవడం, కంట్రోలింగ్ పవర్‌ని పెంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ∙‘కుటుంబంలో ఉన్న అందరూ (పిల్లలు – పెద్దలు) క్రమశిక్షణ ΄ాటించాలి..’ అనే కఠిన నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే. ∙ఇంట్లో ఎవరైనా మద్యం తాగుతున్నారు అంటే మొదట్లోనే అలెర్ట్ చేయాలి. కొన్నిసార్లు మాత్రమే కదా, వాళ్లే మారుతారులే అనే ఆలోచనా ధోరణిని దరి చేరనీయకూడదు. సమస్య పెరిగాక తగ్గిద్దామనుకుంటే ‘అలవాటు’ కుటుంబంలోని మిగతా వ్యక్తులపై దాడి చేయడానికి వెనకాడనీయదు. మద్యం తెచ్చుకోవడానికి డబ్బు లేక΄ోతే ఇంట్లో దొంగతనాలు చేయడం, వస్తువులను అమ్మడం, చావడం, చంపడం .. వంటి నేరాలకు దారులు తెరుస్తుంది. అందుకే, సమస్యను పెంచనీయకూడదు. ∙సమస్య గుర్తించిన వెంటనే ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోవడం, నిపుణుల సలహాలు ΄ాటించడం అత్యవసరం. ఇది ఒక జబ్బు అని గుర్తించాలి నియంత్రణ కోల్పోవడం వ్యసనం ప్రధాన లక్షణం. నూటికి నూరు΄ాళ్లు నయం అవడం ఉండదు కానీ, నియంత్రణ కోల్పోకుండా చికిత్స చేయవచ్చు. మన మెదడు గుర్తించడం, గుర్తుపెట్టుకోవడం, గుర్తుచేయడం అనే మూడు విధాలుగా పనిచేస్తుంది. బ్రెయిన్లో డోపమైన్ కెమికల్ ఉంటుంది. మిగతా సమయాల్లో కంటే తాగినప్పుడు డోపమైన్ రసాయనాలు ఎక్కువ రిలీజ్ అవడంతో ఆనందం అధికంగా ఉంటుంది అనుకుంటారు. మత్తు దిగాక మళ్లీ మామూలే అవుతుంది. అందుకే, ఆ మందు మళ్లీ మళ్లీ తీసుకోవాలని, మోతాదు ఇంకా పెంచమనే బ్రెయిన్ సూచనల ప్రకారం మనిషి నడుచుకుంటాడు. అందుకే, మొదట్లో తక్కువ తాగే వారు కొన్నాళ్లకు డోసు పెంచుతూ ఉంటారు. తాగడానికి ఏవో కారణాలు చెబుతున్నారంటే సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నిపుణుల సూచనలు తీసుకోవాలి. – డాక్టర్ గిడియన్, డి–అడిక్షన్ థెరపిస్ట్, లివింగ్ సోబర్, హైదరాబాద్ పార్టీ ఉందని చెప్పి వెళ్లిన పెద్దబ్బాయి ఇంకా ఇంటికి రాక΄ోవడంతో ఆందోళన పడి΄ోయింది శారద. వచ్చాక వాడిని గమనిస్తే మందు వాసన వస్తోంది. అదేమని నిలదీస్తే.. ‘డాడీని ఏమీ అనవు. పైగా నువ్వే మందు తెప్పించి ఇస్తావు. నన్ను మాత్రం ఎందుకు తిడుతున్నావు!’ అని ఎదురు తిరిగాడు. ఆ మాటలతో తల తిరిగిపోయింది శారదకు. ఇంట్లో అందరివైపు బిక్కుబిక్కుమని చిన్నకొడుకు చూసే చూపులు ఆమెను పూర్తి అగాథంలోకి తోసేసినట్టుగా అనిపించాయి. ఇలాంటి బయటికి చెప్పుకోలేని గాధలు మన చుట్టూ ఉన్నవారిలో ఎన్నో ఉన్నాయి. – నిర్మలారెడ్డి ఆశలు పెంచుతోంది.. చదువు ఉండి, నలుగురిలో ఎలా మెలగాలో తెలిసిన మేమే ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే దీని తీవ్రత సమాజంలో ఎంత ఉందో అర్థమవుతుంది. ఒక తల్లిగా నా పిల్లలకు చెప్పలేక, టీచర్‌గా స్కూల్లో పిల్లలకు ఏ మంచీ బోధించలేక జీవితం శూన్యంగా అనిపించేది. ఓ రోజు నా ఫ్రెండ్‌తో చె΄్పాక సమస్యకు పరిష్కారం దొరికింది. థెరపిస్ట్‌లను కలిసి, అడిక్షన్ నుంచి నా కుటుంబాన్ని కా΄ాడుకోవాలని కృషి చేస్తున్నాను. ఇప్పుడు నా కుటుంబంలో వచ్చిన మార్పు భవిష్యత్తుపైన ఆశలు పెంచుతోంది. – శారద, బాధితురాలు -
ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే?
ఈ రోజుల్లో చాలామందికి మద్యం అలవాటు ఉంది. మద్యాన్ని చాలామంది చల్లగా తాగేందుకు లేదా, ఐస్ ముక్కలు వేసుకుని తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా అది ఎందుకు గడ్డకట్టదో మీకు తెలుసా? దీనికి వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంగతి తెలుసుకునేముందు ఏ ద్రవ పదార్థమైనా ఏ విదంగా గడ్డ కడుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ లిక్విడ్లోనూ దాని అంతర్గత ఉష్ణోగ్రత ఉంటుంది. అది దాని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అది ఉన్న వాతావరణంలోని ఉష్ణోగ్రత తగ్గితే దానిలోని అణువులు ఒకదానికొకటి మరింత దగ్గరవుతాయి. ఫలితంగా ద్రవ పదార్థం గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది. ద్రవ పదార్థం గడ్డకట్టడమనేది వివిధ కారణాలపై ఆధారపడివుంటుంది. మద్యంలో ఉండే ఆర్గానిక్ మాలిక్యూల్స్ దానిని గడ్డకట్టనీయకుండా చేస్తాయి. ద్రవపదార్థం గడ్డకట్టడం అనేది దాని ఘనీభవనస్థానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ పదార్థానికి దాని ఘనీభవన స్థానం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నీటినే తీసుకుంటే అది జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఘనీభవిస్తుంది. అంటే నీటి ఘనీభవన స్థానం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్. మద్యం విషయానికొస్తే దాని ఘనీభవన స్థానం 114 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ కారణం చేతనే మద్యం గడ్డ కట్టాలంటే 114 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. మన ఇళ్లలో ఉండో ఫ్రిజ్‌లలో 0 నుంచి -10 లేదా అత్యధిక ఉష్ణోగ్రత -30 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా ఉంటుంది. అందుకే మద్యాన్ని ఇంటిలోని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా గడ్డకట్టదు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే.. -
వీడెవండి బాబు! యవ్వనం కోసం.. రక్తం తాగేస్తున్నాడు!
అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ, వాటి కోసం పడే పాట్లు, ఎంచుకునే దారులే వేరు. కొంతమంది వ్యాయామం చేస్తే, మరికొంతమంది కాస్మోటిక్స్ ట్రై చేస్తుంటారు. అయితే, థాయ్‌లాండ్‌కు చెందిన రోజాకోర్న్ నైనోన్ మాత్రం రక్తపిపాసిగా మారాడు. అలాగని డ్రాకులా మాదిరిగా మనుషుల రక్తాన్ని పీల్చేయడం లేదు గాని, మొసళ్ల రక్తాన్ని మద్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు. నవయవ్వన రూపాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతనికి సుమారు 12 లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫారమ్ ఉంది. వాటి చర్మం, రక్తం, మాంసాలతో వ్యాపారం చేస్తుంటాడు. అయితే, ఒకరోజు శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉన్న, తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసిందట. ఇక అప్పటి నుంచి రోజూ ఉదయం, రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు. అది కూడా కేవలం మూడు, నాలుగు ఏళ్ల మొసళ్ల రక్తం మాత్రమే! ‘మొసళ్లు బలంగా ఉన్నప్పుడే వాటి రక్తం అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుంది. పైగా, మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం. అందుకే, మొసలి రక్తంలో ‘లావోఖానో’ అనే థాయ్ మద్యాన్ని కలిపి కాక్టెయిల్ చేసుకొని రెండు పూటలా సేవిస్తాను’ అని కోర్న్ చెప్పాడు. ఈ మధ్యనే ఈ కాక్టెయిల్ను ఒక పెగ్ ధర రూ. 800 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడు కోర్న్. చదవండి: బామ్మ వయసు 73.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన పోటీలో పాల్గొని చాంపియన్‌గా నిలిచింది! -
యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి
శివాజీనగర(బెంగళూరు): తాగిన మత్తులో యువకుల బృందం తోటి స్నేహితుడిని నగ్నంగా చేసి పట్టణంలో పరుగెత్తించారు. ఈ కేసులో పోలీసులు రంజిత్, దయానంద్, ఆనంద్‌లను అరెస్ట్ చేశారు. వీరు హాసన్ జిల్లా అరకలగూడుకు చెందినవారు. ఈ యువకులు ఇటీవల అరకలగూడులో పార్టీ చేసుకున్నారు. తరువాత సహచరుడు డ్యాన్స్ చేయలేదన్న కోపంతో అతడిని నగ్నంగా చేసి పట్టణంలో పరుగెత్తించారు. యువకుల పిచ్చి చేష్టలు సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ముగ్గురి అరెస్ట్ చేశారు. చదవండి: సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు! -
స్విమ్మింగ్ పూల్‌లో దూకి యువకుడు మృతి.. కారణమిదే..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ క్లబ్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి సంపత్ అనే యువకుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం.. సంపత్ అనే యువకుడు గురువారం స్విమ్మింగ్ చేసేందుకు తెలంగాణ క్లబ్‌లోని స్విమ్మింగ్ పూల్‌కు వచ్చాడు. ఈ క్రమంలో సంపత్ మద్యం సేవించి ఉండటంతో యాజమాన్యం స్విమ్మింగ్‌కు అనుమతించలేదు. అయినప్పటికీ సంపత్ వారి మాటలు పట్టించుకోకుండా స్విమ్మింగ్ పూల్‌లో డై కొట్టడంతో వెంటనే మునిగిపోయి చనిపోయాడు. ఇది కూడా చదవండి: సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ యాక్సిడెంట్! -
ప్రపంచంలో ఎక్కువ మందు బాబులు ఉండేది ఈ దేశాల్లోనే!
-
వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!
లక్నో: పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే వేడుక. అయితే ఇటీవల చూస్తే.. పీటల వరకు వచ్చిన వివాహాలు ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నాయి. తాజాగా ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దని వరుడుకి షాకిచ్చింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరివురి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం వరుడు అతని బంధువులు ఊరేగింపుగా పెళ్లి మండపంలోకి చేరుకున్నారు. కాసేపటి తర్వాత వరడు, వధువు ఇద్దరూ కలిసి వేదికపైకి వెళ్లారు. పెళ్లి తతంగాలు మొదలు పెట్టారు ఇరువైపు బంధువులు. ఈ క్రమంలో వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో మద్యం సేవించిన వరుడి స్నేహితులు పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. దీంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వారితో పాటు వరుడు కూడా వింత పనులు చేస్తూన్నాడు. మాల వేస్తుండగా వరుడు మద్యం సేవించాడని వధువు గమనించింది. కోపంతో స్టేజి దిగి నేరుగా తన గదిలోకి పెళ్లికి నిరాకరించింది. కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి. చదవండి: భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా బెంగళూరు మహానగరపాలక సంస్థ రిపోర్టు -
‘కేసీఆర్ సారూ.. మీరు సల్లగుండాలె’.. బార్ ఓనర్ల అభిషేకం వీడియో వైరల్
-
Hyderabad: మద్యం కోసం మనవడినే అమ్మేసిన తాత..
బంజారాహిల్స్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి నెల రోజుల వయసున్న మనవడిని కిడ్నాప్ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...హకీంపేట గౌసియా మసీద్ సమీపంలో నివసించే మహ్మద్ ఖలీల్(40) కూతురు యాస్మిన్ బేగం గత నెల 13వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి ఇంట్లోనే ఉంటున్నది. మద్యానికి బానిసైన ఖలీల్ తరచూ భార్యను డబ్బులు అడుగుతూ వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఖలీల్ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు. తీరా చూస్తే తన నెల రోజుల కొడుకు కూడా కనిపించడం లేదని, తన తండ్రే డబ్బుల కోసం మనవడ్ని కిడ్నాప్ చేసి ఉంటాడని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని చిన్నారిని ఎత్తుకెళ్ళిన ఖలీల్ కోసం గాలింపు చేపట్టారు. -
గురుద్వారా ఆవరణలో మద్యం తాగిన మహిళ.. కాల్చి చంపిన సేవాదార్..
చండీగఢ్: పంజాబ్ పాటియాలలో షాకింగ్ ఘటన జరిగింది. దుక్నివరణ్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవిస్తున్న ఓ మహిళపై అక్కడి సేవాదార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు షూట్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని పర్మీందర్ కౌర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమె వయసు 32 ఏళ్లు. పెళ్లికాలేదు. గురుబక్ష్ కాలనీలో నివాసముంటోంది. ఆదివారం సాయంత్రం గురుద్వారా ఆవరణలో మద్యం సేవించింది. ఈ సమయంలో ఆమెను చూసిన సాగర్ మల్హోత్రా అనే సేవాదార్ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనితో ఆమె వాగ్వాదానికి దిగింది. అనంతరం పర్మీందర్ కౌర్‌ను గురుద్వారా మేనేజర్ దగ్గరకు తీసుకెళ్తుండగా.. ఈ సమయంలో అక్కడున్న మరో సేవాదార్ మహిళ తీరుపై ఆగ్రహంతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సాగర్ మల్హోత్రాకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ.. -
ట్రైయిన్‌లో మరో అసభ్యకర ఘటన.. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్..
ఇటీవల ట్రైయిన్‌లో టికెట్ కలెక్టర్ల వరుస అనుచిత ప్రవర్తన ఘటనలు మరువక మునుపే ఓ ప్యాసింజర్ రైలులో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మద్యం మత్తులో టికెట్ ఎగ్జామినర్ ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో నిలంబూరు నుంచి కొచ్చవేలి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో జరిగింది. దీంతో రైల్వే పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ చేశారు. వివరాల్లోకెళ్తే.. రైలు రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ నిలంబూర్ కొచువేలిలోని అలువా స్టేషన్ దాటిన తర్వాత ఈ అనూహ్య ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఆర్ఏసీ టికెట్ వచ్చింది. దీంతో ఆమె ఎస్4లో కూర్చొని ఉండగా ఒక టిక్కెట్ ఎగ్జామినర్ (టీఈ) వచ్చి ఆమె పక్కనే కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే తిరువనంతపురంలోని రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెతోనూ 35 ఏళ్ల టీఈతోనూ మాట్లాడి విచారించి, సదరు టీఈని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత టీఈకి వైద్య పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీని విధించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: బహుభార్యత్వంపై కొరడా ఝళిపిస్తున్న అస్సాం! సీఎం కీలక ప్రకటన) -
ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..
తాగిన మైకంలో పలువురు వ్యక్తులు ఏం చేస్తారో కూడా తెలియదు. కొందరికి ఆ సమయంలో తాము ఏం చేశాం అనే స్పృహ కూడా ఉండదు. మత్తులో చిత్తయిన ఓ యువకుడు చేసిన పని అందర్నీ షాక్‌కి గురి చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం ఆ యవకుడిని చూసి ఒకింత ఆశ్చర్యానికి, ఎక్కడ ఆ ఎద్దు తమపైకి దూసుకొస్తుందోననని మరొకింత ఆందోళనకు గురయ్యారు. జల్లికట్టు మాదిరిగా ఆ ఎద్దుపైకి ఎక్కి కూర్చొని వెళ్లడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్ తపోవన్ ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. మే 5న అర్థరాత్రి రిషికేశ్‌లోని తపోవన్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించిన వైరల్ వీడియోని గుర్తించాం. ఆ యువకుడిపై చర్యలు తీసుకున్నాం. జంతువులతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించొద్దని యువతను గట్టిగా హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు. కొందరు నెటిజన్లు ఎద్దును ఇలా హింసించడం సరికాదని ట్వీట్ చేయగా, మరికొందరూ జల్లికట్టు క్రీడతో పోల్చుతూ ట్వీట్లు చేశారు. (చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..) -
Liquor Price: స్టాకు ఉన్నంత వరకు పాత ధరలే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రాజు వరమిచ్చినా.. మంత్రి అడ్డుకున్నట్లు’గా ఉంది మందుబాబుల పరిస్థితి. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లు ప్రకటించి మూడురోజులు గడుస్తున్నా.. సరుకుపై ధరలు తగ్గించకపోవడంపై మందుబాబులు మండిపడుతున్నారు. దీనిపై వైన్‌షాపుల యజమానులు మాత్రం తమకు కొత్త స్టాకు వచ్చేంత వరకు పాతధరలే కొనసాగుతాయని చెబుతున్నారు. ఈనెల 5 నుంచి మద్యంపై ధరలను ప్రభుత్వం సవరించింది. ఫుల్‌బాటిల్‌పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని కూడా చెప్పింది. అయితే దీన్ని క్షేత్రస్థాయిలో మందుబాబులు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో శని, ఆది, సోమ వారాల్లో మద్యం ధరలు తగ్గాయి కదా? అంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. వారికి సర్ది చెప్పడం ఎలాగో తెలియక వైన్‌షాపుల నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు. దాదాపు పూర్తయిన లేబులింగ్.. ప్రభుత్వం మద్యం ధరలను సవరించిన ప్రతీసారి ప్రభుత్వం కొత్త లేబులింగ్‌తో మద్యం సీసాలు విక్రయిస్తుంది. ఆదేశాలు వెలువడిన అనంతరం తక్షణమే అమలు కావాలి. కానీ అప్పటికే మద్యంషాపులు కొని తెచ్చుకున్న స్టాకు అలాగే ఉండిపోయింది. చాలాషాపుల్లో స్టాకు వారం పది రోజులకు ఒకసారి మారుస్తారు. పాత ధరలకు కొన్న రేట్లకే ఆ మద్యాన్ని అమ్ముకునే వీలుంది. ఎక్కువకు కొని తక్కువకు ఎవరూ విక్రయించరు కదా! ఈ మేరకు ఎకై ్సజ్‌శాఖ కూడా వీరికి పాత స్టాకును, పాత ధరలకు విక్రయించుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈలోపు ఐఎంల్ గోదాముల్లో ఉన్న లిక్కర్ స్టాకు లేబులింగ్ మార్చాల్సి వచ్చింది. పాత ధరలతో ఉన్న స్టాకుపై కొత్తగా సవరించిన ధరలను ముద్రించిన లేబుళ్లను వేస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌లోని వైన్‌షాపులకు వెళ్లే స్టాకుపై కొత్తగా ముద్రించిన లేబులింగ్ ప్రకారం మద్యం సీసాలు విక్రయించనున్నారు. ఈ వ్యవహారం తెలియని మందుబాబులు మాత్రం పాత ధరలకే మద్యం విక్రయిస్తున్నారంటూ యజమానులతో గొడవకు దిగుతున్నారు. పాత ధరలకు విక్రయిస్తే చర్యలు ధరల విషయంలో ఇప్పటికే పలువురు ఎకై ్సజ్ అధికారులకు పలువురు మద్యం ప్రియులు ఫిర్యాదులు చేస్తున్నారు. పాత లేబుల్ ఉన్నవాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని పాత స్టాకు ఉన్నంత వరకు పాత ధరలు అమలవుతాయని, కొత్త లేబులింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత పాత ధరలతో విక్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిమిషానికి 78 బీర్లు..! వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో బీర్లకు డిమాండ్ పెరిగింది. మే మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని మందుబాబులు బీర్లను తెగతాగేశారు. మే 1 నుంచి 7వ తేదీల్లో రూ.23.17 కోట్ల విలువైన 65,961 కాటన్ల బీర్లు అమ్ముడుపోయాయి. కాటన్‌కు 12 బీర్లు చొప్పున మొత్తం 7,91,532 బీర్లు విక్రయించారు. ఈ లెక్కన రోజుకు 1,13,076 బీర్లు, ప్రతీ గంటకు 4,711, నిమిషానికి 78 చొప్పున బీర్లు తాగేశారు. వేసవి తాపానికి మద్యంప్రియులు అంతా బీర్లకు మారుతున్నారు. లిక్కర్ ధరలో మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం బీర్ల ధరల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అయినా మందుబాబులు మాత్రం చల్లగా బీర్లను పీల్చేస్తున్నారు. -
మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన మద్యం ధరలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా తగ్గించింది. ఫుల్ బాటిల్‌పై(750ఎంల్) రూ.40 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 180 ఎంఎల్‌పై రూ.20, 180 ఎంఎల్‌పై రూ.10, 90 ఎంఎల్‌పై రూ.5 తగ్గించింది. తగ్గిన ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పినట్లయింది. అయితే బీరు ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం లిక్కర్ బ్రాండ్లకే కొత్త ధరలు వర్తిస్తాయి. కాగా.. తెలంగాణలో ఏప్రిల్ నెలలో కోటికిపైగా బీర్లు అమ్ముడైన విషయం తెలిసిందే. ఎండల్లో చల్లబడేందుకు బీర్ ప్రియులు తెగ లాగించేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో రోజుకు ఇన్ని వీధి కుక్కలు చనిపోతున్నాయా? -
తగ్గిన నిషాచరులు
అమలాపురం టౌన్: మద్యం బ్రాండ్లు, ధరలు, అమ్మకాలు పెంచేసి తాగుబోతులు మరింత మత్తులో తూగేలా ప్రభుత్వం చేస్తోందని విమర్శించే ప్రతిపక్ష నేతల నోళ్లను మద్యం అమ్మకాల గణంకాలు మూయిస్తున్నాయి. దశలవారీ మద్య నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నిర్ణయాలు కూడా సత్ఫలితాలు ఇస్తున్న క్రమంలో వినియోగంలో తగ్గుదల కనిపిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటయ్యాక అమలాపురంలోని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ లిక్కర్ గొడౌన్ (డిపో) నుంచి 2022–23 సంవత్సరంలో జరిగిన మద్యం అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే అమ్మకాలు పెరిగాయో తగ్గాయో తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో 2018–19 సంవత్సరానికి సంబంధించి ఇదే అమలాపురం గొడౌన్ నుంచి సాగిన అమ్మకాలను 2022–23 సంవత్సరం గణంకాలతో పోల్చితే మద్యం అమ్మకాలు తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇవీ లెక్కలు.. కోనసీమ వ్యాప్తంగా ఉన్న 97 దుకాణాలకు అమలాపురం లిక్కర్ గొడౌన్ నుంచి మద్యం సరఫరా అవుతుంది. ఈ గొడౌన్ నుంచి 1918–19 సంవత్సరంలో లిక్కర్ 10.33 లక్షల కేసులను దుకాణాలకు విక్రయించారు. 2022–23 సంవత్సరంలో ఇదే గొడౌన్ నుంచి 8.18 లక్షల కేసుల లిక్కర్ అమ్మకం సాగింది. 2018–19 సంవత్సరంలో ఈ గొడౌన్ నుంచి బీరు 6.77 లక్షల కేసులను దుకాణాలకు విక్రయించగా 2022–23 సంవత్సరంలో సగం కంటే లోపే అంటే కేవలం 2.30 లక్షల కేసుల బీరు విక్రయం అయింది. ఈ అధికారిక గణంకాలు లిక్కర్, బీరు వినియోగం ఏ మేరు తగ్గిందో స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 12.61 శాతం మేర తగ్గుముఖం అమలాపురం లిక్కర్ డిపో కోనసీమ వ్యాప్తంగా ఉన్న 97 మద్యం దుకాణాలకు సరఫరా చేస్తుంటే కొత్త జిల్లా ఏర్పాటయ్యాక జిల్లా పరిధిలోకి వచ్చే రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు సంబంధించి ఉన్న 49 మద్యం దుకాణాలకు రాజమహేంద్రవరం లిక్కర్ గొడౌన్ నుంచి లిక్కర్, బీరు కేసులు సరఫరా అవుతున్నాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా 2018–19 సంవత్సరం పోల్చితే 2022–23 సంవత్సరంలో 20 నుంచి 25 శాతం వరకూ మద్యం వినియోగం తగ్గింది. గత నెల 21న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల సమీక్షా సమావేశం కూడా 2018–19 సంవత్సరంతో పోల్చితే 2022–23 సంవత్సరంలో లిక్కరు, బీరు వినియోగం ఎంత మేర తగ్గిందో గణాంకాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్, బీరు వినియోగం 12.61 శాతం మేర తగ్గుముఖం పట్టినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు ఇదే సమయంలో రాష్టంలో మద్యం వినియోగాన్ని క్రమేపీ తగ్గిస్తూ మందుబాబుల ఆలోచనలో మార్పు తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దశలవారీ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వీధివీధికి, సందు సందుకీ, గుడి బడి ఎక్కడ పడితే అక్కడ అధికారిక మద్యం దుకాణాలకు తోడు పుట్టగొడుగుల్లా వెలిసిన మద్యం బెల్ట్‌షాపులను ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మూయించి వేసింది. ప్రభుత్వమే దుకాణాల సంఖ్యను తగ్గించి ఏర్పాటు చేసింది. వినియోగం తగ్గింది గతంలో పోల్చుకుంటే మద్యం వినియోగం కొంత తగ్గింది. ముఖ్యంగా 2018–19 సంవత్సరంతో పోల్చితే 2022–23 సంవత్సరంలో అమలాపురం లిక్కర్ డిపోలో వినియోగం తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. – పొంగులేటి దశమంతరావు, -
ఫ్రీగా వస్తోందని తప్పతాగి.. కుప్పకూలిపోయాడు
క్లబ్లో ఫ్రీ ఎంట్రీ, ఉచితంగా లిక్కర్ బోర్డు కనిపించేసరికి అతని ప్రాణం ఆగమైంది. లోపలికి దూరిపోయి తాగడం మొదలుపెట్టాడు. అయితే మత్తులో అక్కడ జరుగుతోంది పెద్ద మోసమని అతనికి అర్థం కాలేదు. నాన్ స్టాప్‌గా అలా తాగుతూనే కుప్పకూలి.. మరణించాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అతని జేబులోంచి డబ్బును లాగేసుకుని.. శవాన్ని బయటకు విసిరిపారేసింది ఆ ముఠా. ఆరేళ్ల కిందట సంచలన సృష్టించిన బ్రిటిష్ టూరిస్ట్ హత్య కేసులో.. 58 మందిపై తాజాగా అభియోగాలు నమోదు చేశారు పోలాండ్ పోలీసులు. ఓ ముఠాగా ఏర్పడి ఈ తరహా నేరాలు చేస్తున్న క్రమంలో.. సదరు టూరిస్ట్ ప్రాణం తీశారని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు 700 నేరపూరితమైన అభియోగాలను ఈ ముఠాపై నమోదు చేశారు. ఏం జరిగిందంటే.. 2017లో బ్రిటన్‌కు చెందిన మార్క్ సీ అనే వ్యక్తి పోలాండ్‌లో పర్యటించాడు. ఆ సమయంలో ఓ స్ట్రిప్ క్లబ్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితుడితో ఫుల్‌గా తాగాడు. ఆపై క్రాకో లో ఉన్న వైల్డ్ నైట్ క్లబ్‌కు చేరాడు. అక్కడ ఉచిత ప్రవేశం బోర్డు చూసి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఫ్రీగా మందు తాగుతూ పోయారు. అయితే ఒక దశకు వచ్చేసరికి.. మార్క్ ఆపేద్దామనుకున్నా క్లబ్ నిర్వాహకులు ఊరుకోలేదు. గంటన్నరలో అతనితో 22 పవర్ఫుల్ షాట్స్ తాగించారు. ఇంకేం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు మార్క్. చనిపోయిన తర్వాత ఆ ముఠా.. అతని జేబులో ఉన్న డబ్బు లూఠీ చేసింది. అతని శవాన్ని, మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిని క్లబ్ బయటకు నెట్టేసింది. శవ పరీక్షలో.. మార్క్ ఒంట్లో బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 0.4 శాతంగా ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. లిక్కర్ పాయిజన్‌తోనే అతను చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీష్ సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.. ఆరేళ్లుగా దర్యాప్తు చేసింది. మద్యం తాగించి మత్తులో మునిగిపోయే మందు బాబుల నుంచి డబ్బు, నగదు దోచుకుంటున్నట్లు.. ప్రత్యేకించి టూరిస్టులే టార్గెట్‌గా ఈ మోసం నడుస్తున్నట్లు తేల్చారు. తాజాగా ఈ కేసులో అభియోగాలు మనిషి శరీరం బ్లడ్‌లో ఆల్కాహాల్ లెవల్ 0.3కి చేరినా, అంతకు మించినా ఆల్కాహాల్ పాయిజనింగ్ జరిగినట్లు లెక్క. దొరికింది కదా అని వేగంగా మద్యం తాగడమూ ఆరోగ్యానికి హానికరమే. మాట, నడకలో తడబాటుతో పాటు తీవ్ర అనారోగ్యం బారినపడడం లేదంటే ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలతో గుండె ఆగిపోవడం లాంటి హఠాత్ పరిణామాలు ఎదురవుతాయి. -
ఆ విషయం తెలియక మందు తాగలేదు: మనోజ్
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ బీ టౌన్లో పరిచయం అవసరం లేదు. ఆయన టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ చిత్రంలో విలన్‌గా నటించారు. అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో తనదైన నటనతో మెప్పించారు. ఆయన నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సక్సెస్ అందుకున్నారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను మొదటిసారి ఫారిన్‌కు వెళ్లినపుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. మనోజ్ మాట్లాడుతూ..'నేను థియేటర్ ఆర్టిస్టుగా ఉన్నపుడు పారిస్ వెళ్లా. అదే నాకు ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ జర్నీ. ఇండియా నుంచి వెళ్లేటపుడు ఆల్కహాల్ తీసుకోలేదు. దానికి డబ్బులు తీసుకుంటారనుకున్నా. కానీ ఫ్లైట్‌లో మందు ఫ్రీగా సర్వ్ చేస్తారని నాకు తెలియదు. అక్కడికి వెళ్లిన తర్వాతే తెలిసింది. ఆ తర్వాత రిటర్న్ జర్నీలో ఫుల్‌గా తాగేసి పడిపోయా.' అని చెప్పుకొచ్చాడు. కాగా.. మనోజ్ చివరగా గుల్మోహర్ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో డెస్పాచ్, సూప్, జోరమ్ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. -
పోలీస్టేషన్లో నవ వధువు హంగామా!..మద్యం మత్తులో ఊగిపోతూ..
ఇటీవల పెళ్లి వేడుకల్లో మద్యం తాగి వచ్చిన పెళ్లి కొడుకులు సృష్టించిన హంగామా గురించి విన్నాం. దీంతో అర్థంతరంగా పెళ్లిళ్లు ఆగిపోయి లబోదిబోమన్న వారిని చూశాం. వాటికి భిన్నంగా ఇక్కడొక నవ వధువు మద్యం తాగి పోలిస్ స్టేషన్లో హల్చల్ చేసింది. వారు ఎంతగా కంట్రోల్ చేసేందుకు యత్నించినా ఆగకపోగా నేను రెండో పెళ్లి చేసుకుంటా అంటూ అరుస్తూనే ఉంది. అసలేం జరిగిందంటే.. మద్యం మత్తులో ఉన్న ఒక నవ వధువు పోలిస్ స్టేషన్‌కి వెళ్లి పెద్ద హంగామా సృష్టించింది. రెండో పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టింది. నాకు రెండో పెళ్లి కావాలి అంటూ స్టేషన్‌లోని కాగితాలను, ఫోన్లను విసిరేసింది. చివరికి ఓ లేడి కానిస్టేబుల్ అదుపు చేసి గదిలోకి లాక్కెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు మొదటి పెళ్లి ఆమెకు బాధ కలిగించిందేమో! అందుకే ఇలా చేసిందని ఒకరూ, ఆ అమ్మాయి చాలా ఆవేదనలో ఉందని మరొకరు కామెంట్లు చేశారు. తప్పతాగి ఇలా చేయడమేంటని మరొక నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "Do shaadi karenge Do Shaadi" Woman demands marriage with lover soon after her wedding with a man Police watches as mute spectators Feeling so bad for her Husband EQUALITY ! pic.twitter.com/S6zbiqE731 — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 30, 2023 (చదవండి: కాఫీ షాప్ పార్కింగ్ ఆఫర్..రూ 60 కోసం పదేళ్లు పోరాడి గెలిచాడు) -
వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ!
మద్యం తాగితే తెలియని కిక్ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరలు వింటే మాత్రం ఎక్కిన కిక్కు కూడా దిగిపోతుంది. ప్రపంచంలో ఖరీదైన ఆల్కహాల్ బ్రాండ్లు ఎవరు ఎక్కువగా వినియోగిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే కొంతమంది ఎంత ఖరీదైన పర్లేదు గానీ ఈ కాస్ట్లీ లిక్కర్‌ను ఒక్కసారైన తాగాలని ఆసక్తి చూపుతారట. దీంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాలపై ఓ లుక్కేద్దాం! టెకీలా లీ 925 (Tequila Lee .925) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్‌గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మద్యాన్ని సేవిస్తే ఎంత మత్తు ఎక్కుతుందో తెలీదు దీన ధర వింటే మాత్రం తాగింది దిగిపోతుంది. దీని ధర దాదాపు రూ. 25 కోట్లట. ఈ లిక్కర్ ఎందుకంత ఖరీదంటే.. సీసాలో 6400 వజ్రాలు పొదిగినవి ఉండడమే. హెన్రీ IV డుడోగ్నే కాగ్నాక్ ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వైన్. ఈ బ్రాండ్ మద్యం బాటిల్ ఖరీదు 56 లక్షల 93 వేల రూపాయలు. దాని బాటిల్ కూడా 24 క్యారెట్ల బంగారం అమరిక ఉండగా దీన్ని ప్లాటినంతో తయారు చేస్తారట. దీంతో ఈ తరహావి.. మద్యం లేకపోయినా కేవలం ఖాళీ సీసాలు కూడా ఎక్కువ ధరకే పలుకుతాయట. ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్ అంటే.. అమండా డి బ్రిగ్నాక్ మిడాస్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ షాంపైన్ ఒక్క బాటిల్ ధర దాదాపు రూ.1 కోటి 40 లక్షల రూపాయలు ఉంటుంది. అత్యంత ఖరీదైన రెడ్ వైన్ ధర తెలిస్తే షాక్ అవుతారు. పెన్ఫోల్డ్స్ ఆంపౌల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్. ఈ బ్రాండ్ రెడ్ వైన్ ఒక బాటిల్ రేటు వచ్చేసి కోటి రూపాయలు పై మాటే ఉంటుందట. ఈ ఖరీదైన మద్యం ధరలు వింటే మద్యం మత్తులో ఉన్న జనం షాక్ అవ్వాల్సిందే. -
మందు తాగే మేక.. రోజూ మద్యం కోసం యాజమాని వద్ద నిలబడి
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం మోదుగకుంటకు చెందిన రైతు సోలిపురం రవీందర్ రెడ్డి పెంచుకుంటున్న ఓ మేకకు ఒకరోజు మద్యాన్ని పట్టించాడు. అప్పటినుంచీ ప్రతిరోజూ సాయంత్రంపూట రవీందర్ రెడ్డి మద్యాన్ని తాగినప్పుడల్లా మేక కూడా వచ్చి యజమాని వద్ద నిలబడుతుంది. దీంతో ప్రతిరోజూ మేకకు మద్యం తాగిస్తుండటంతో దానికి అలవాటుగా మారిపోయింది. మేక మద్యం తాగుతుండటాన్ని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
ఏపీ మద్యంపై తప్పుడు ప్రచారం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ నిషేధించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్ పూర్తిగా అవాస్తవమని డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్, ఎపీఎస్బీసీఎల్ ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి అవడంలేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ క్లిప్పింగ్‌ను వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న ఐఎంఎఫ్ఎల్, బీరు రాష్ట్రంలో మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో ఐఎంఎఫ్ఎల్ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. చెన్నై ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చి న కెమికల్ రిపోర్టు కేవలం వారి శాంపిల్స్‌ను పరీక్షించి ఇచ్చినవేనని, ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ)శాంపిల్స్‌ను ఆ సంస్థ పరీక్షించలేదని గతంలోనే తాము స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. -
విమానంలో తాగి రచ్చ చేసిన ప్యాసింజర్లు.. చివరకు..
దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమానంలో తప్పతాగి రచ్చ రచ్చ చేశారు ఇద్దరు ప్యాసింజర్లు. తోటి ప్రయాణికులతో దరుసుగా ప్రవర్తించారు. మద్యం మత్తులో మితిమీరి రెచ్చిపోయారు. అడ్డుకోబోయిన విమాన సిబ్బందిని కూడా లెక్కచేయకుండా దుర్భాషలాడారు. మద్యం బాటిళ్లను వారి వద్ద నుంచి తీసేసేందుకు ప్రయత్నించగా.. గొడవకు దిగారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ప్యాసింజర్లను దత్తాత్రేయ బపార్డేకర్, జాన్ జార్జ్ డిసౌజాగా గుర్తించారు. యాజమాన్యం వీరిపై ఫిర్యాదు చేయడంతో విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదల అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఇద్దరు గల్ప్ దేశంలో ఏడాదిగా పని చేసి ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంగా మందుబాటిళ్లు కొనుగోలు చేసి విమానంలోనే పార్టీ చేసుకున్నారు. ఇబ్బందిగా ఉందని చెప్పిన తోటి ప్యాసింజర్లతో వాగ్వాదానికి దిగడంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏడాదిలో ఏడోసారి కావడం గమనార్హం. ఈ నెల మొదట్లోనే లండన్-ముంబై విమానంలో సిగరెట్ తాగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనవరిలో ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ మద్యం తాగి రచ్చ చేశాడు. గతేడాది డిసెంబర్లో కొంతమంది ప్యాసింజర్లు విమానంలోనే ఘర్షణకు దిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..! -
పెళ్లి మండపానికి వరుడు రాలేదని.. ఊహించని షాకిచ్చిన వధువు!
ఇటీవల పెళ్లి మండపాలలో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ వరుడు తన పెళ్లి సంగతిని కూడా మరిచిపోయి మండపానికి వెళ్లలేదు. ఇక వరుడి రాక కోసం వేచి చూసి విసుగుచెందిన వధువు అతనికి ఊహించని షాకిచ్చింది. ఈ వింత ఘటన బీహార్‌లోని భాగల్పూర్లోని సుల్తాన్‌గంజ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వరుడు తన పెళ్లి రోజు ఆనందంతో ఫుల్‌గా మందు తాగి ఆ మత్తులో మండపానికి వెళ్లాలన్న విషయాన్ని మరచి నిద్రపోయాడు. ఇరువర్గాల కుటుంబ సభ్యులు వివాహ వేదిక వద్ద వరుడి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎంత సేపు ఎదురుచూసిన అతను రాలేదు. వివాహం మరుసటి నాడు స్పృహలోకి రావడంతో వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే వరుడు నిర్లక్ష్యపు ధోరణి చూసిన ఆమెకు చిరాకు వచ్చింది. ఈ పెళ్లికి నిరాకరించింది. తన బాధ్యతలను కూడా సరిగా అర్థం చేసుకోని వ్యక్తితో తన జీవితాన్ని గడపలేనని తెగేసి చెప్పింది. దీంతో వాయిద్యాలు, డీజే సౌండ్లు హోరెత్తాల్సిన మండపం కాస్త సైలెంట్‌గా మారిపోయింది. పెళ్లి ఏర్పాట్లకు ఖర్చు చేసిన డబ్బును వరుడి కుటుంబీకులు తిరిగి ఇవ్వాలని వధువు కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వరుడి బంధువులు కొందరిని బందీలుగా చేయడంతో అక్కడి పరిస్థితి విషమించింది. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తెచ్చారు. చివరికి ఈ కేసు సద్దుమణిగినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో.. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలోని తిర్వా కొత్వాలి ప్రాంతంలో వధువుకు 12వ తరగతి మార్కులు సరిపోవని భావించిన వరుడు తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. -
స్నేహితులతో మద్యం తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో..
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కార్మికనగర్‌లో నివసించే మల్లె రామారావు(35) సెంట్రింగ్ వర్కర్. భార్య, పిల్లలు ఈ నెల 7న పెద్దపల్లిలో ప్రార్థనకు వెళ్లగా రామారావు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి జవహర్‌నగర్‌లోని సతీష్ వైన్స్ వద్ద మద్యం తాగేందుకు వెళ్లాడు. అక్కడే నలుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే స్నేహితులతో జరిగిన గొడవలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు పిడిగుద్దులు గుద్దడం వల్లే రామారావు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా, ముగ్గురు యువకులు గొడవ పడుతున్నట్టు నిర్ధారణ అయింది. అయితే, ఆ గొడవకు రామారావు చాలా దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఒంటిపైన ఎలాంటి గాయాలు లేవని కార్డియక్ అరెస్ట్ వల్లే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మద్యం మత్తులో గుండెపోటు రాగా వెనక్కి కుప్పకూలాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడి భార్య వరలక్ష్మి ఇచి్చన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీస్ స్టేషన్లోనే పోలీసుల మందు.. చిందులు.. వీడియో వైరల్
రాంచీ: న్యాయం కోసం వచ్చే ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. ఖాకీ దుస్తులు ధరించి బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు తప్పటడుగులు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్లోనే కొందరు పోలీసులు పిచ్చి చేష్టలకు పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లో మద్యం తాగుతూ చిందులేశారు. చివరికి సదరు పోలీసులకు ఉన్నతాధికారులు ఊహించని షాక్ ఇచ్చారు.. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. మార్చి 9వ తేదీన హోలీ సందర్భంగా కొంతమంది పోలీసులు సివిల్ దుస్తులు ధరించి పోలీస్ స్టేషన్ క్యాంపస్‌లో మద్యం సేవించారు. అంతటితో ఆగకుండా తాగిన మైకంలో ఒళ్లు మర్చిపోయి డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం.. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరిపినట్లు ఎస్పీ నాటు సింగ్ మీనా తెలిపారు. విచారణలో అధికారులు నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో అయిదుగురు పోలీసు అధికారులను విధుల నుంచి తక్షణమే తొలగిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు ఏఎస్సైలు ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇదే వీడియోను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబు లాల్ మరాండీ ట్విటర్లో షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చదవండి: దూకుడు పెంచిన ఈడీ.. బిహార్ డిప్యూటి సీఎంకు షాక్! कुछ पुलिसवालों की थाना कैम्पस में यह वल्गर एवं बेपरवाह फूहड़ प्रस्तुति। रक्षक के रूप में भक्षकों का यह भयावह चेहरा। सचमुच बारूद के ढ़ेर पर झारखंड को बिठा दिया है सोरेन सल्तनत के एक्सीडेंटल राजकुमार हेमंत ने। इन्हें जयचंद जैसा याद करेगा आदिवासी समाज और देश।जागो झारखंड के युवा। pic.twitter.com/OAxpohykj5 — Babulal Marandi (@yourBabulal) March 9, 2023 -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే కారు ఉక్రెయిన్‌కే!!
రిగా(లాత్వియా): డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన కార్లను లాత్వియా అధికారులు ఉక్రెయిన్‌కు పంపిస్తున్నారు. రష్యాతో జరిగే యుద్ధంలో ఉక్రెయిన్‌కు తమ ప్రయత్నం సాయంగా ఉంటుందని అంటున్నారు. ఈ కార్లను నడిపిన మాజీ యజమానుల రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు 0.15% పైనే ఉందట. ఇప్పటికే ఇలా పట్టుబడిన 8 కార్లు ఉక్రెయిన్‌కు పంపామని లాత్వియా దేశ రెవెన్యూ విభాగం తెలిపింది. కొనుగోలు చేసిన, విరాళంగా అందిన కార్లను దెబ్బతిన్న, యుద్ధం జరిగే ప్రాంతాల్లో అత్యవసర సేవలకు వినియోగిస్తామని ఉక్రెయిన్‌కు చెందిన అగెండమ్ గ్రూప్ తెలిపింది. 2022 ఫిబ్రవరి నుంచి ఇలాంటి 1,200 కార్లను అందజేసినట్లు వెల్లడించింది. లాట్వియా రోడ్లపై మద్యం తాగి కార్లలో తిరిగే వారు ‘పేలని కమికాజ్ డ్రోన్లు’వంటి వారని చమత్కరించింది. ‘సాధారణంగా స్వాధీనం చేసుకున్న కార్లను అమ్మేయడమో, విడగొట్టి అమ్మేయడమో చేస్తుంటాం. అయితే, ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేయాలనే వీటిని అక్కడికి పంపిస్తున్నాం’అని లాత్వియా అంటోంది. పట్టుబడిన కార్లను వారానికి 25 చొప్పున అగెండమ్కు అందజేస్తామని లాత్వియా అధికారులు హామీ ఇచ్చారు. -
వయాగ్రా అంత డేంజరా? ట్యాబ్లెట్ వేసుకుని మందు తాగిన వ్యక్తి 24 గంటల్లోనే..
న్యూఢిల్లీ: వయగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24 గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి భారత పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి రెండు వయగ్రా ట్యాబ్లెట్లు వేసుకుని అదే సమయంలో ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురు సభ్యులతో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు దీనిపై కేస్ రిపోర్ట్‌ను గతేడాది సెప్టెంబర్‌లో రూపొందించారు. దీన్ని ఈ వారమే ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ నివేదిక ప్రచురణకు కూడా ఆమోదం పొందింది. అయితే పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత జర్నల్‌లో ప్రచురించనున్నారు. వయగ్రా తీసుకుని మద్యం తాగడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనే విషయంపై ఈ పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఈ ఘటనలో మరణించిన 41 ఏళ్ల వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి శస్త్రచికిత్సలు కూడా జరగలేదని గుర్తించారు. ఇతడు చనిపోవడానికి ముందు రోజు తన స్నేహితురాలితో హోటల్లో ఉన్నాడు. రెండు వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే తనకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం వల్లే అతను చనిపోయినట్లు తేలింది. మెదడులో గడ్డకట్టిన రక్తం 300 గ్రాములు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. అలాగే అతని హార్ట్ వాల్స్ గట్టిపడటంతో పాటు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన అవసరం.. దీంతో వైద్యుల సూచన లేకుండా వయగ్రా వాడకూడదని పరిశోధకులు హెచ్చరించారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయంపైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదవండి: ఆ బీజేపీ ఎమ్మెల్యేకు ఈ రేంజ్లో వెల్కం ఏంది నాయనా..? -
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం!
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): మద్యంతో పాటు గంజాయి సేవించి అదుపుతప్పిన వేగంతో కారులో దూసుకువచ్చిన ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ముదిగొండ అనూష్ రావు (22), కొత్తపేటకు చెందిన పవన్ కళ్యాణ్‌రెడ్డి (22) స్నేహితులు. శనివారం రాత్రి శంషాబాద్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగారు. గంజాయి కూడా తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ నుంచి వీరిద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. మత్తులో డ్రైవింగ్.. సిగరెట్లలో గంజాయి నింపుకొని తాగుతూ అదుపుతప్పిన వేగంతో బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి దూసుకెళ్తున్నారు. మాదాపూర్‌లోని సౌండ్స్ అండ్ స్పిరిట్స్ పబ్‌లో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌కు చెందిన అజ్మత్, విజయ్‌కుమార్ బౌన్సర్లుగా పని చేస్తున్నారు. విధులు ముగించుకొని తెల్లవారుజామున బైక్‌పై బంజారాహిల్స్ రోడ్ నెం.2 నుంచి వెళ్తుండగా క్రీమ్‌స్టోన్ వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన అనూష్ రావు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అజ్మత్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. విజయ్‌కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో అనూష్‌రావు స్కూటర్‌ను ఢీకొట్టి పక్కకు తిప్పే క్రమంలో అక్కడ మరో కారును ఢీకొట్టాడు. ఆ కారు రోడ్డుకు అడ్డం తిరగడంతో వెనకాల వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఇలా నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదానికి కారకులైన అనూష్‌రావు, పవన్ కళ్యాణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. ఇద్దరూ మద్యం తాగినట్లు గుర్తించారు. మద్యం, గంజాయితో పాటు డ్రగ్స్ కూడా తీసుకొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో గంజాయి నింపిన సిగరెట్లతో పాటు 50 గ్రాముల గంజాయి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి రక్త నమూనాలు, వెంట్రుకల నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. అనూష్ రావు, పవన్ కళ్యాణ్‌రెడ్డిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును సీజ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ కారు అనూష్ రావు తల్లి పేరు మీద ఉన్నట్లుగా తేలింది. చదవండి: నల్గొండ కాంగ్రెస్‌లో కలకలం.. కోమటిరెడ్డి ఆడియో లీక్! -
మహిళా కాంగ్రెస్ నేత అరెస్ట్.. కారణం ఇదే..
గాంధీనగర్: గుజరాత్‌కు చెందిన మహిళా కాంగ్రెస్ నేత మేఘనా పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, విదేశీ మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో దాదాపు రూ. 10లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో మేఘనా పటేల్‌ను గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఆమె.. తన బొలెరో కారులో విదేశీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పిప్లాడ్ రోడ్డు ప్రాంతంలో మేఘనా పటేల్ కారును ఆపి చెక్ చేశారు. ఈ సందర్బంగా కారు నడుపుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా.. మేఘనా పటేల్ కోసం రూ.7.5 లక్షలకు పైగా విలువైన విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు తేలింది.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో, విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, ఈ విదేశీ మద్యం ఎక్కడ నుంచి వచ్చింది.. దీన్ని ఎవరు విక్రయించారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేఘనా పటేల్, కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, మేఘనా పటేల్ మాజీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పని చేశారు. -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్‌ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్‌పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి.. హెపటైటిస్-బీకి వ్యాక్సిన్ ఉంది.. కానీ,
హెపాటో లేదా హెపాటిక్ అని పిలిచే ఈ గ్రీకు పదానికి కాలేయం అని అర్థం. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తిస్తుంది. కాస్త తొలగించినా... తిరిగి పెరిగేలా... పూర్తిగా పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన ఏకైక అవయవం. మన శరీరం లోపలి అవయవాల్లో అతి పెద్దదైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజితమై ఉండే కాలేయం దాదాపు కిలోన్నర వరకు బరువుంటుంది. దానికి వచ్చే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. విష పదార్థాలు, కలుషిత ఆహారం, నీరు, మద్యం, ధూమపానం వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దాన్ని ‘హెపటైటిస్’ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్లు... ఏ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిల్లో బీ, సీ వైరస్లు ప్రమాదకరమైనవి. రక్తమార్పిడి, అరక్షిత శృంగారం వల్ల, అలాగే తల్లి నుంచి బిడ్డకు...ఇవి సోకే ప్రమాదం ఎక్కువ. హెపటైటిస్–బి వైరస్ సోకకుండా వ్యాక్సిన్ ఉంది. కానీ... హెపటైటిస్–సి కు వ్యాక్సిన్ లేదు. అప్పటికే హెపటైటిస్–బి ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ వ్యాక్సిన్ వేయించుకునే ముందర పరీక్ష చేయించుకుని నెగెటివ్ ఉంటే ఏ వయసువారైనా వేయించుకోవచ్చు. ఆకలి తగ్గడం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు చెట్ల వైద్యం, నాటువైద్యం వంటి సొంతవైద్యాలు చేసుకోకుండా... కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్ఫెక్షన్స్, ఫ్యాటీ లివర్, లివర్ యాబ్సెస్, విల్సన్ డిసీజ్, గిల్బర్ట్ సిండ్రోమ్ వంటి కాలేయ వ్యాధులున్నప్పుడు... హెపటైటిస్ బి, సి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకితే... వాటి ప్రభావంతో కొన్నేళ్ల తర్వాత కాలేయం గాయపడినట్లుగా లేదా గట్టిగా మారడం (సిర్రోసిస్), అటు తర్వాత కాలేయ క్యాన్సర్‌కు దారితీయడం ఎక్కువమందిలో జరుగు తుంది. కాలేయంలోనే మొదలయ్యే హెపాటో సెల్యులార్ కార్సినోమా అనే క్యాన్సర్... దేహంలో ఇతర ్రపాంతాల్లో క్యాన్సర్ వచ్చి అది కాలేయానికి పాకే మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థలోని క్యాన్సర్స్, బ్రెస్ట్‌క్యాన్సర్, లంగ్ క్యాన్సర్... ఇలాంటి ఏ క్యాన్సర్ అయినా కాలేయానికి పాకే ప్రమాదం ఎక్కువ. ఆలస్యంగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు. కాలేయ క్యాన్సర్ తొలిదశలో లక్షణాలు అంత తీవ్రంగా కనిపించకపోవడం వల్ల ఇతర సమస్యలుగా ΄÷రబడే అవకాశం ఎక్కువ. కడుపునొప్పి, బరువుతగ్గడం, కామెర్లు, ΄÷ట్టలో నీరు చేరడం, వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు లివర్ క్యాన్సర్ ముదిరిన దశలో తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించినా... హెపటైటిస్ బి, సి వైరస్లు పాజిటివ్ ఉన్నా, మద్యం వంటి అలవాట్లు ఉన్నా... రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్యను, షుగర్, క్యాల్షియం, కొలెస్ట్రాల్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ (ఏఎఫ్‌పీ)ను రక్తపరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్, డాక్టర్ సలహా మేరకు ట్రిపుల్ ఫేజ్ సీటీ, ఎమ్మారై, పీఈటీ స్కాన్లు చేయించాలి. లివర్ బయాప్సీ చేయించడం వల్ల క్యాన్సర్, దాని స్టేజ్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ క్యాన్సర్ పెరిగే గుణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో నెలలోపే గడ్డ (కణితి) సైజు రెట్టింపు అయితే... మరికొందరిలో ఏడాది పైగా తీసుకోవచ్చు. కణితిని చిన్న సైజులో ఉన్నప్పుడే గుర్తించినా... లివర్ సిర్రోసిస్‌కు గురికావడం వల్ల చాలామందిలో సర్జరీ కుదరకపోవచ్చు. ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైటేషన్ (టీఏసీఈ), రేడియో అబ్లేషన్,ప్రోటాన్ బీమ్ థెరపీ, క్రయో అబ్లేషన్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ వంటి అనేక పద్ధతుల్లో కణితిని తొలగించే లేదా తగ్గించే ప్రయత్నాలు చేస్తారు. గడ్డ చిన్నగా ఉండి, మిగతా కాలేయం బాగానే ఉండి ఫెయిల్యూర్‌కు గురికాకుండా ఉంటే సర్జరీయే సరైన మార్గం. కణితి పరిమాణం పెద్దగా ఉన్నా, అనేక కణుతులు ఉన్నా, లివర్ ఫెయిల్యూర్‌కు గురవుతూ ఉంటే... కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించడంతో పాటు, గతంలో ఎప్పుడైనా ఇతర క్యాన్సర్స్‌కు గురయి, చికిత్స తీసకున్నా ఎప్పటికప్పుడు కాలేయానికి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండటం చాలా మంచిది. చాలామందిలో హెపటైటిస్–బి పాజిటివ్ ఉన్నా, ఏళ్లతరబడి ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా ఆరోగ్యకరంగానే ఉండవచ్చు. కానీ వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే పరీక్షలు చేయించుకోవడం, ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లయితే పుట్టిన బిడ్డకు వెంటనే 12 గంటలలోపు హెపటైటిస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ (హెచ్‌బీఐజీ) ఇప్పించడం మంచిది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తితో కలిసి ఉన్నట్లు అనుమానం ఉన్నా, వాళ్ల రక్తం... శరీరంలో ప్రవేశించినట్లు అనుమానం ఉన్నా ముందుజాగ్రత్త చర్యగా ఆ సంఘటన జరిగిన 14 గంటలలోపే హెచ్‌బీఐజీ ఇంజెక్షన్ తీసుకుంటే హెపటైటిస్–బి పాజిటివ్ కాకుండా కాపాడుకోవచ్చు. - Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421 -
మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి..
వెల్దుర్తి (తూప్రాన్): మద్యం మత్తులో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కాడు. వివిద్యుదాఘాతంతో తీవ్రగాయాలై కిందపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శంకరాజ్ కొండాపూర్ గ్రామానికి చెందిన యాట సాయిరాం (24) శుక్రవారం సాయంత్రం వెల్దుర్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉప్పులింగాపూర్ గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలతోపాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సాయిరాం మద్యం మత్తులో హల్చల్ చేస్తూ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు. గమనించిన పోలీçÜులు కిందకు దించి అక్కడి నుంచి పంపించారు. అనంతరం యథావిధిగా తనిఖీలు చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత సాయిరాం మళ్లీ తిరిగొచ్చి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి తీగలు పట్టుకోవడతో విద్యుదాఘాతంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగితే.. ప్రమాదం ఎక్కువే.. లక్షణాలేంటి? చికిత్స ఉందా?
సాధారణంగా ఇతర అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్ తెలుసుగానీ... రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక్కడ ఓ కీలకం దాగి ఉంది. మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకితే... మెల్లగా పాకుతూ అంత త్వరగా ప్రమాదం రాకపోవచ్చు. కానీ రక్తానికి ఇన్ఫెక్షన్ గనక సోకితే అది అన్ని అవయవాలకూ, కణాలకూ వెళ్తూ ఆహారాన్నీ, ఆక్సిజన్‌ను తీసుకెళ్తూ వెళ్తూ ఇన్ఫెక్షన్ను కూడా దేహమంతటికీ వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి. రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగించే ఈ కండిషన్‌ను 'సెప్టిసీమియా’ అని పిలుస్తారు. దీనిపై అవగాహన కోసం ఈ కథనం. మామూలుగా ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని వాడుకగా ‘సెప్టిక్’ అయిందని అంటారు. రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది దేహాన్నంతటినీ విషపూరితం చేసే కండిషన్‌ను ‘సెప్సిస్’ లేదా ‘సెప్టిసీమియా’ అంటారు. దీని గురించి కొన్ని వివరాలివి... సెప్టిసీమియాకు కారణాలు బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఏవైనా పరాన్నజీవులతో పాటు మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చాలాకాలంగా ఆల్కహాల్‌కు తీసుకుంటూ ఉండటం, దీర్ఘకాలంగా అదుపులేకుండా డయాబెటిస్ బారిన పడటం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం, రోగనిరోధక వ్యవస్థను మందకొడిగా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతుండటం, కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులను విచక్షణరహితంగా వాడటం సెప్టిసీమియాకు దారితీయవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్లలో సెస్టిసీమియా ముప్పు మరీ ఎక్కువ... ♦ గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందని సందర్భాల్లో ♦ ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిలో కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ప్రధానంగా నిమోనియా వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువ. ♦ ఏదైనా కారణంతో పొట్ట (అబ్డామిన్)లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాదాపు మూడోవంతు కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ♦ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో అది సెప్టిసీమియా ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ♦ మెదడు తాలూకు ఇన్ఫెక్షన్స్ కూడా సెప్టిసీమియాగా మారవచ్చు. ♦ ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్ సోకితే చాలా కొద్దిమందిలో (2% మందిలో) అది సెప్టిసీమియాగా మారే అవకాశముంది. నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్–రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో సెప్టిసీమియా ఉనికి, తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా తర్వాత చేయాల్సిన చికిత్సనూ నిర్ణయిస్తారు. నివారణ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగేనీరు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే మరికొన్ని అంశాలూ సెప్సిస్ నుంచి కాపాడతాయి. అవి... ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ♦ నీటిని కాచి, చల్లార్చి లేదా ఫిల్టర్ అయిన నీటినే తాగాలి. ♦ వంటకాల్ని వేడివేడిగా ఉండగానే తినేయాలి. బయటి ఫుడ్‌కు (వీలైనంతవరకు) దూరంగా ఉండాలి. ♦ కూరగాయలను, ఆకుకూరలను శుభ్రంగా కడిగాకే వంటకు ఉపక్రమించాలి. తొక్క ఒలిచి తినే పండ్లు మినహా మిగతా వాటిని కడిగే తినాలి. ♦ తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ♦ మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ♦ గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్ వేసుకోని, సేవలందించాలి. ♦తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ఫేస్‌మాస్క్ ధరించాలి. ♦ చెప్పులు, బూట్లు వంటి పాదరక్షల్ని బయటే విడవాలి. ♦ పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦ డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. లక్షణాలు ♦ చలితో వచ్చే జ్వరం ( ఫీవర్ విత్ చిల్స్) ♦ ఊపిరి అందకపోవడం (బ్రెత్‌లెస్‌నెస్) ♦ గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్ హార్ట్‌బీట్) ♦ అయోమయం / మూర్ఛ (ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ / సీజర్స్) ♦ మూత్రం పరిమాణం బాగా తగ్గడం ♦ దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం ♦ పొట్టలో నొప్పి / వాంతులు / నీళ్ల విరేచనాలు ♦ కామెర్లు (జాండీస్). చికిత్స సెప్టిసీమియా రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రొసీజర్స్ చేస్తారు. ♦ రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్ ఫ్లుయిడ్స్) ♦రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ (ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్) ♦ రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే మందులతో సపోర్ట్ ♦ ఆక్సిజెన్ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్‌తో శ్వాస అందించడం ♦ కిడ్నీ రోగుల్లో డయాలసిస్ ♦ అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్‌ను ఎక్కించడం) ♦ పేషెంట్‌కు ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా రక్తనాళం ద్వారానే అందిస్తారు. (ఇంట్రావీనస్ న్యూట్రిషనల్ సపోర్ట్). - డాక్టర్ ఆరతి బెల్లారి ,సీనియర్ ఫిజీషియన్ -
సెల్ఫీ తీసుకుంటుండగా కోబ్రా కాటేసింది
కందుకూరు: నాగుపాముతో సెల్ఫీకి ప్రయత్నించిన ఓ యువకుడు ఆ పాము కాటేయడంతో ప్రాణాలొదిలాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామానికి చెందిన పోలంరెడ్డి సాయిమణికంఠరెడ్డి (22) కందుకూరులోని జేఏ కాంప్లెక్స్‌లో షాపును అద్దెకు తీసుకుని జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పాములు పట్టి ఆడించే వెంకటస్వామి అనే వ్యక్తి ఆ షాపు వద్దకు వచ్చాడు. ఆ పామును చూసి సంబరపడిన మణికంఠరెడ్డి పాముతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో పామును మణికంఠరెడ్డి మెడలో వేసుకోగా.. ఆ పాము జారి కిందపడిపోయింది. దీంతో మణికంఠరెడ్డి పాము తోక పట్టుకునే ప్రయత్నంలో అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి కాటేసింది. వెంటనే స్నేహితులు మణికంఠను ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మణికంఠ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కోరలు లేవని చెప్పడం వల్లే.. పామును ఆడించే వ్యక్తి మద్యం మత్తులో ఉండటంతో మణికంఠరెడ్డి ఫొటోల కోసం అడిగిన వెంటనే పామును ఇచ్చేశాడు. దానికి కోరలు తీసేశానని, అందువల్ల కాటేయదని చెప్పాడు. దీంతో మణికంఠరెడ్డి భయం లేకుండా పామును మెడలో వేసుకుని సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది కాటేసిన తరువాత కూడా కోరలు తీసేశానని, కాటేసినా విషం ఎక్కదని దానిని ఆడించే వ్యక్తి చెప్పాడు. అయినా స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాటేసిన పాము అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా జాతికి చెందినది కావడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఘటనా స్థలాన్ని కందుకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై కిశోర్ పరిశీలించారు. పామును తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. -
మద్యానికి బానిసైన కిమ్.. అతిగా తాగి ఏడుస్తూ కాలం గడుపుతున్నారా?
సియోల్: రోజంతా మద్యం తాగడం వంటి అనారోగ్యకర ఆహార అలవాట్ల కారణంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ ఆరోగ్యం దెబ్బతిన్నదని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే 39వ బర్త్‌డే జరుపుకున్న కిమ్‌కు.. వయస్సు మీదపడుతుందనే బెంగ ఎక్కువైనట్లుగా ఉందని దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో ఉంటున్న ఉత్తర కొరియా విద్యావేత్త డాక్టర్ చొయ్ జిన్‌వూక్ అంటున్నారు. ఒంటరితనంతో బాధపడుతున్న కిమ్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అతిగా తాగి ఏడుస్తూ కాలం గడుపుతున్నారని చెబుతున్నారు. అనారోగ్య వివరాలు ఎక్కడ బయటకు పొక్కుతాయో అనే భయంతో కిమ్ పర్యటనల సమయంలో సొంత టాయిలెట్‌ను కూడా తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. తాగుడు తగ్గించి, రోజూ సమయం వ్యాయామం చేయాలని భార్య, వైద్యులు సలహాలిచ్చినా పట్టించుకోవడం లేదని మిర్రర్ పత్రిక కథనం పేర్కొంది. -
మద్యం మత్తులోనే వందేభారత్ రైలుపై దాడి
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): నిర్వహణ పనుల నిమిత్తం విశాఖకు వచ్చి.. బుధవారం కోచింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లు వేసిన నిందితులను స్థానిక పోలీసులు, జీఆర్పీ పోలీసుల సహకారంతో రైల్వే భద్రతా దళం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం కంచరపాలెం రైల్వే గేటు వద్ద మద్యం మత్తులో ఉన్న శంకర్, చందు, రాజు అనే వ్యక్తులు కొత్త రైలు వెళ్లడం గమనించి రాళ్లతో దాడి చేశారు. గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ ముగ్గురినీ వెంబడించగా శంకర్ చెప్పును వదిలేసి పారిపోయాడు. రైల్వే పోలీసులకు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ స్థానిక పోలీసులకు ఆదేశించగా.. వెస్ట్ ఏసీపీ, కంచరపాలెం సీఐ, టాస్క్‌ఫోర్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులు ముగ్గురినీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురూ పాత కేసుల్లో నిందితులని పోలీసులు తెలిపారు. న్యూ కోచింగ్ కాంప్లెక్స్‌లో వందేభారత్ రైలును వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి గురువారం తనిఖీ చేశారు. రైలులో ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఆన్‌బోర్డ్ టెక్నీషియన్స్‌తో డీఆర్ఎం మాట్లాడారు. బుధవారం రాత్రి ఈ రైలును కోచ్ కేర్ సెంటర్‌కు తరలిస్తున్న సమయంలో కంచరపాలెం వద్ద ఆకతాయిల వల్ల దెబ్బతిన్న పగిలిన కోచ్‌ల అద్దాలను పరిశీలించారు. పాక్షికంగా పగిలిన అద్దాలను న్యూకోచింగ్ కేర్ సెంటర్లో మార్చారు. గురువారం రాత్రికే ఈ రైలును సికింద్రాబాద్ పంపించేందుకు వాల్తేర్ డివిజన్ అధికారులు ఏర్పాటు చేశారు. ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) మనోజ్‌కుమార్ సాహూ, సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ సీహెచ్ రఘువీర్, సీనియర్ కోచింగ్ డిపో ఆఫీసర్ మోనిష్ బ్రహ్మ, సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ ఎస్కే పాత్ర పాల్గొన్నారు. -
మైనర్ మందుబాబులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ జరిగిన ‘డిసెంబర్ 31’ వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 1413 మంది హైదరాబాద్ పోలీసులకు చిక్కగా... వీరిలో మైనర్లు 22 మంది ఉన్నారు. రాచకొండలో 446 మంది పట్టుబడితే... మైనర్లు ఐదుగురు ఉన్నారు. సైబరాబాద్‌లోనూ ఇలాంటి సీనే. ఇక్కడే ఓ కీలక విషయాన్ని అటు ట్రాఫి క్, ఇటు శాంతిభద్రతల విభాగంతో పాటు ప్రత్యేక విభాగాలైన టాస్క్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్‌లు మర్చిపోయాయి. అదే మైనర్లకు సైతం మద్యం లభించడం. వారికి మద్యం ఎలా వచ్చింది? ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం 21ఏళ్ల కంటే తక్కువ ఉన్న వారికి మద్యం అమ్మకూడదు. వీరిని బార్లు, పబ్‌లలోకి అనుమతించడమూ నిషిద్ధమే. ‘డిసెంబర్ 31’న చేపట్టిన డ్రంక్ డ్రైవింగ్ పరీక్షల్లో పట్టుబడిన మైనర్లు వైన్ షాపులో ఖరీదు చేసుకుని తాగడమో, బార్‌కు వెళ్లడమో జరిగి ఉండాలి. వీటిలో ఏది జరిగినా ఆయా యాజమాన్యాలపై చర్య తీసుకోవాల్సిందే. 2016 నాటి చిన్నారి రమ్య ప్రమాదంతో పాటు నగరంలో అనేక యాక్సిడెంట్లకు మద్యం మత్తులో ఉన్న మైనర్లు కారణమయ్యారు. అలాంటి సందర్భాల్లో మాత్రమే పోలీసులు మద్యం ఎక్కడ నుంచి వచ్చిందనే అంశంపై దృష్టి పెట్టి హడావుడి చేస్తు న్నారు. డిసెంబర్ 31 నాటి డ్రంక్ డ్రైవర్ల విషయంలో మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఇదే అనేక సందర్భాల్లో ఉల్లంఘన జరగడానికి కారణమ వుతోంది. అక్కడితో ఆగిపోయిన సీన్ ఇలా పట్టుబడిన మందు‘బాబుల’ నుంచి ట్రాఫిక్ పోలీసులు అప్పటికప్పుడే వాహనం స్వాధీనం చేసుకుంటారు. వీరికి నిర్ణీత తేదీల్లో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తారు. ఆపై ఈ ‘నిషా’చరులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. కేసు పూర్వాపరాలు, మద్యం మోతాదు, నడి పిన వాహనం... ఇలాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకునే న్యాయస్థానం జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధిస్తుంది. ఈ తంతు పూర్తయిన తర్వాత ఆవ్యక్తికి లేదా సంరక్షకుడికి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ‘డిసెంబర్ 31’ నాడు చిక్కిన డ్రంక్ డ్రైవర్ల కథ కూడా అక్కడితోనే ముగిసిపోతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో ప్రతి ఏడాదీ ఇలానే జరుగుతోంది. కానీ... కనిపెట్టడం పెద్ద కష్టం కాదు... డిసెంబర్ 31’న పట్టుబడిన మందుబాబుల్లో 21 ఏళ్ల లోపు వాళ్లకు మద్యం ఎవరు విక్రయించారో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వీళ్లు నిర్ణీత సమయంలో కచ్చితంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) జరిగే కౌన్సెలింగ్‌కు, ఆపై ట్రాఫిక్ పోలీసులు సూచించినప్పుడు కోర్టుకు రావాల్సిందే. ఆయా సందర్భాల్లో వారిని విచారించడం ద్వారా వారికి మద్యం ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడ తాగారు? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఇది తెలిసినా పోలీసులు నేరుగా చర్యలు తీసుకోలేరు. ఏదైనా సంస్థపై ఇలాంటి ఉల్లంఘనలకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటే లైసెన్స్ ఇచ్చిన అథారిటీకే సాధ్యం. దీంతో ఆయా వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్, లోకేషన్ వంటి ఆధారాలతో సహా ఎక్సైజ్ శాఖకు అందించి, లైసెన్సు రద్దు/సస్పెన్షన్ సహా చర్యలకు సిఫార్సు చేయవచ్చు. ఇలా చేస్తే మరోసారి ఉల్లంఘన, భవిష్యత్తులో ఘోర ప్రమాదాలు తప్పే అవకాశం ఉంది. అయినప్పటికీ పోలీసులకు ఈ అంశం పట్టట్లేదనే విమర్శలు ఉన్నాయి. మైనర్ డ్రైవింగ్ కూడా తీవ్రమైనదే.. డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్లకు సంబంధించి మరో కీలకాంశమూ ఉంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం సాధారణంగా మైనర్లకు లైసెన్సులు జారీ చేయరు. దీంతో వీళ్లు వాహనం నడపకూడదు, మైనర్ డ్రైవింగ్ చేయడమే కాదు వారికి, లైసెన్సు లేని వారికి వాహనం ఇవ్వడం కూడా నేరమే. ఇలా చేసినందుకు వాహనం ఎవరి పేరుతో రిజిస్టరై ఉందో ఆ యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ‘డిసెంబర్ 31’న చిక్కిన మైనర్ల విషయంలోనూ ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. -
కల్తీ మద్యం కలకలం?
నాగర్‌కర్నూల్ క్రైం: ఒకే షాపు నుంచి మద్యం కొనుగోలు చేసి తాగిన ఇద్దరు వ్యక్తులు అను మానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతులు కుటుంబసభ్యుల కథనం మేరకు... నాగర్‌కర్నూల్ మండలం నల్లవెల్లికి చెందిన నర్సింహ(45) సోమవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ బస్టాండ్ సమీపంలోని ఓ మద్యం దుకాణం ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మరో ఘట నలో మండలంలోని కుమ్మెరకు చెందిన ఊషన్న(50) బ్యాంకులో నగదును తీసుకునేందుకు మంగళవారం ఉదయం జిల్లాకేంద్రానికి వచ్చా డు. డబ్బులు తీసుకున్న తర్వాత మద్యం తాగి తిరిగి వెళ్తూ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రహరీ వద్ద కిందపడి మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఊషన్న జేబులో మద్యం సీసా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నర్సింహ, ఊషన్న ఇద్దరూ కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. శాంపిల్స్ సేకరించిన ఎక్సైజ్ అధికారులు జిల్లా కేంద్రంలో ఇద్దరు కల్తీ మద్యం తాగి మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్ డీటీఎఫ్ సీఐ పరమేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం బస్టాండ్ సమీపంలోని మోతీ వైన్స్‌లో తనిఖీలు నిర్వహించి పలు బ్రాండ్లకు సంబంధించి శాంపిల్స్ సేకరించారు. కాగా మృతులు ఇద్దరూ మద్యం కొనుగోలు చేసింది ఒకే వైన్స్ నుంచే కావడం కల్తీ మద్యం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఈ విషయమై ఎక్సైజ్ ఈఎస్ ఫయాజుద్దీన్‌ను వివరణ కోరగా మోతీ వైన్స్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
దుబాయ్‌లో మద్యంపై పన్ను రద్దు
దుబాయ్: పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఇది ఆదివారం నుంచే అమల్లో వచ్చింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్‌లకు ఇకపై ఎలాంటి చార్జీ వసూలు చేయబోరు. దుబాయ్‌లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత ఆల్కహాల్ లైసెన్స్ ఉండాల్సిందే. దుబాయ్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మద్యం విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తోంది. అయితే, పన్ను రద్దు అనేది తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
సాయంత్రం కాగానే వారికి బాబే గుర్తొస్తారట! అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారుగా!
ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోటి వెంట ఆణిముత్యాలు వస్తున్నాయి. ఆయన చెబుతున్న ఈ సుభాషితాలు విన్నవారు ముక్కున వేలేసుకోవల్సిందే. నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన ప్రసంగాలు చేస్తూ, మీడియాతో మాట్లాడుతూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాటిలో అన్నిటికన్నా ఆసక్తికరమైనది ఏమిటంటే .. తమ్ముళ్లూ ..సాయంత్రం అయ్యేసరికి మందుబాబులకు నేనే గుర్తుకు వస్తాను.. అని ఆయన గర్వంగా చెప్పుకోవడం. తాగినప్పుడు బూతులు తిడతారు.. తర్వాత మర్చిపోతారు.. అన్నారు. అంటే మద్యం బాబులు బ్రాందీ, విస్కి వంటివి తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను తిట్టుకుని, ఆ తర్వాత వారు మర్చిపోతున్నారట. ఇది ఆయన బాధ. జగన్ మద్యం రేట్లు పెంచేశారని, మంచి బ్రాండ్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఎవరైనా పెద్ద నాయకుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాలి. అది మంచిదికాదని వారించాలి. కాని చంద్రబాబు ఏమంటున్నారు! సాయంత్రం అయితే పెగ్గు వేసుకోవాలని గతంలో అన్నారు. ఇప్పుడేమో సాయంత్రం అయితే తానే గుర్తుకు వస్తానని చెబుతున్నారు. అవును నిజమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో నలభై వేలకు పైగా బెల్ట్ షాపులు నడిపారు. ఇళ్లకు కూడా మద్యం సరఫరా చేశారు. మహిళలంతా తమ భర్తలను తాగుబోతులుగా చంద్రబాబు ప్రభుత్వం మార్చుతోందని మండిపడి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాని ఆయన మాత్రం మారలేదు. మద్యం ఏదో అత్యవసర వస్తువుగా ఆయన భావిస్తున్నారు. దానిని చౌకగా అందుబాటులోకి తేవాలట. జగన్ ఏవేవో బ్రాండ్లు తెచ్చారట. వాటికి నాణ్యత లేదట. ఇంతవరకు ఆ బ్రాండ్ల వల్ల ఏమైనా హానీ కలిగిందా? అంటే లేదు. పోనీ ఆ బ్రాండ్లు ఏమైనా జగన్ ప్రభుత్వం ఇచ్చిందా అంటే అదీకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ బ్రాండ్ లన్నీ ఇచ్చారని స్వయంగా జగన్ అసెంబ్లీలో పేర్లు చదివి మరీ వినిపించారు. అయినా చంద్రబాబు మాత్రం అదే అసత్యాన్ని వల్లె వేస్తుంటారు. దీనివల్ల రాజకీయంగా చంద్రబాబుకు ఎంత ప్రయోజనం చేకూరుతుందంటే అనుమానమే. మరో మాట చెబుతున్నారు. రాష్ట్రం కోసం అందరూ కలిసిరావాలట. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవారు. అప్పుడు జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా జగన్ నే దూషిస్తున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా ఆయనకు మద్దతు ఇవ్వాలి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదికార వైసిపిపై పోరాటానికి అంతా మద్దతు ఇవ్వాలి. అంతా డబుల్ స్టాండర్డే. చంద్రబాబు నిజంగానే అంత బాగా చేసి ఉంటే జనం ఎందుకు అంత దారుణంగా ఓడిస్తారు? అదేదో జనం చేసిన తప్పు మాదిరిగా ఆయన ఊహించుకుంటూ , శుద్దిమంతుడి మాదిరి గా ఉపన్యాసాలు చెబుతుంటారు. మీడియా వారిని బాగున్నారా? అని అడిగితే బాగున్నాం అంటే ఆయనకు నచ్చలేదట. దానిని గమనించిన ఒకరిద్దరు బాగోలేదని అనగానే మళ్లీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు అందుకున్నారట. ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెడతారని, ఇంకా ఏవేవో అన్నారు. ఏ జర్నలిస్టుపై ప్రశ్నిస్తే కేసు పెట్టారు. తప్పుడు పోస్టింగ్ లు పెట్టిన ఒక రిటైర్డ్ జర్నలిస్టుపై చర్య తీసుకుంటే కోర్టు ద్వారా రక్షణ పొందారు కదా! ఇప్పుడు ఎవరు జగన్ ను విమర్శించినా, అధికారికంగా ఎవరిపైనా చర్య తీసుకోలేకపోతున్నారు. అదే ప్రధాని మోదీనో, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నో అని చూడమనండి .. తమాషా ఏమిటో తెలుస్తుంది. న్యాయ వ్యవస్థను జగన్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అన్నారట. నిజానికి న్యాయ వ్యవస్థ అయినా మరో వ్యవస్థ అయినా అన్నిటి సమస్యలు ఎదుర్కొంటున్నది జగన్ ప్రభుత్వం. అయితే ఈయన ఎదురుదాడి చేస్తుంటారు. అసలు ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని కదా చంద్రబాబుకు పేరు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఎదురుదాడి చేస్తుంటారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించిన కోర్టు, చంద్రబాబు ఆస్తుల విషయంలో ఎన్ని మలుపులు తిప్పింది అందరూ గమనించారు కదా? చాలామందికి నాట్ బిఫోర్ అన్న పదం న్యాయ వ్యవస్థలో ఉంటుందన్న సంగతి తెలియదు. కాని చంద్రబాబు కేసులో మాత్రం అది బాగా పాపులర్ అయింది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. చంద్రబాబు ఎంతసేపు జగన్ ను ఆడిపోసుకోవడమే కాని, తాను ప్రజలకు ఏమి చేస్తారో చెప్పలేక నోటికి వచ్చిన దూషణలతో కాలం గడుపుతున్నారు. అదే రాజకీయం అని, తనకు అండగా ఉండే మీడియాను అడ్డం పెట్టుకుని ఆ దూషణలతో ప్రజలను ప్రభావితం చేయాలని చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. మరి అది సాద్యమేనా? -హితైషి -
10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు
సాక్షి, శివాజీనగర: ఐటీ సిటీలో కొత్త సంవత్సర సంబరాల్లో మద్యం ఏరులై పారింది. కొత్త వేడుకల సమయంలో గత రెండేళ్లుగా కరోనా వల్ల మద్యం వ్యాపారం పూర్తిగా తగ్గుముఖమైంది. ఈసారి కోవిడ్ బెడద అంతగా లేకపోవడంతో మద్యం షాపులు కళకళలాడాయి. క్రిస్మస్ నుంచి నెలాఖరు వరకు వ్యాపారం ఊపందుకుంది. 20 లక్షల లీటర్ల మద్యం తాగేశారు డిసెంబర్ 31న సుమారు మూడు లక్షల లీటర్ల మద్యం, 2.41 లక్షల లీటర్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీనిద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకూ లెక్కిస్తే 20.66 లక్షల లీటర్ల మద్యం, 15.04 లీటర్ల బీర్లను తాగారు. తద్వారా రూ.1,262 కోట్ల వ్యాపారం జరిగితే, పన్ను రూపంలో ఎక్సైజ్ శాఖ రూ.651 కోట్లు ఆర్జించింది. గత కొన్నేళ్లతో పోలిస్తే ఇదే రికార్డు ఆదాయమని ఎక్సైజ్‌వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్‌కు చర్చి స్ట్రీట్‌లో పబ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీంతో మామూలు కంటే 50 శాతం ధరను పెంచారు. అయినా కూడా యువతీ యువకులతో పబ్‌లు కిటకిటలాడాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
TS: 6 రోజులు.. రూ. 1,111 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలు ‘కొత్త’పుంతలు తొక్కాయి. లిక్కర్ షాప్‌లకు కొత్త జోష్ వచ్చింది. లెక్కకు మించిన కిక్కు వచ్చింది. చలి తీవ్రతతోపాటు కొత్త సంవత్సరం వస్తోందన్న ఉత్సాహంతో మందుబాబులు తెగ తాగేశారు. సంవత్సరం చివర్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2022 డిసెంబర్ చివరివారం రూ. 1,111.29 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోవడం గమనార్హం. చివరి ఆరురోజుల మద్యం అమ్మకాలు వెయ్యి కోట్ల మార్కును దాటాయి. ఒక్క డిసెంబర్ 30న రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి రూ.250 కోట్లకుపైగా విలువైన మందు వైన్‌షాపులకు తరలివెళ్లిందంటే కొత్త ఏడాది ఆరంభాన్ని మందుబాబులు ఎలా పండుగ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరి నాలుగు రోజుల అమ్మకాల విషయానికి వస్తే 2021 డిసెంబర్లో చివరి నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఈసారి అది రూ.775 కోట్లు దాటింది. డిసెంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటే 2021లో రూ.2,901 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, 2022 డిసెంబర్లో ఆ విలువ రూ.3,376 కోట్లు దాటింది. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.500 కోట్లు పెరిగిందన్నమాట. 2021 సంవత్సరం మొత్తం మీద 2.73 కోట్ల లిక్కర్ కేసులు, 2.45 కోట్ల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.18,868 కోట్లపైచిలుకు కాగా, 2022లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు రూ.34,352.75 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 3.5 కోట్ల లిక్కర్, 4.5 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 2020తో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2020లో రూ.16,254 కోట్లు అమ్ముడుపోయింది. -
నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం
మద్యం సేవించే అధికారికంటే రిక్షా తొక్కేవాడిని, కూలీలను పెళ్లిచేసుకోవడం సముచితమని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు తమ కుమార్తెలు, సోదరీమణులకు మద్యపానం చేసేవారితో అస్సలు వివాహం చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యపానం డి అడిక్షన్‌పై జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ...తాను ఎంపీగా తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయినప్పుడూ..సామాన్య ప్రజలను ఎలా కాపాడగలనంటూ భావోద్వేగానికి గురయ్యారు. "తన కొడుకు ఆకాష్ తన స్నేహితులతో మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానిపించేందుకు డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. ఆ అలవాటు మానుకుంటాడని పెళ్లి కూడా చేశాను కానీ అతను పెళ్లైన తర్వాత కూడా తాగడం ప్రారంభించాడు. క్రమంగా అది అతని మరణానికి దారితీసింది. దీంతో అతడి భార్య వితంతువుగా మారింది. పైగా వారికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు." అని ఆవేదనగా చెప్పుకొచ్చారు. అందువల్ల దయచేసి మీరు మీ కుమార్తెలను, సోదరీమణులను ఇలాంటి వ్యసనపరులకు కట్టబెట్టకుండా రక్షించండి. ఈ తాగుడు వ్యసనం కారణంగా ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలకు కేవలం పొగాకు, సిగరెట్లు, బీడీల వ్యసనమే కారణమని అన్నారు. ఈ డీ అడిక్షన్ కార్యక్రమంలో ప్రజలు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని కుటుంబాలను రక్షించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిల్లాను వ్యసన రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకువెళ్లాలని, పైగా ఉదయం ప్రార్థన సమయంలో పిల్లలకు దీని గురించి చెప్పాలని కేంద్ర మంత్రి కౌశల్ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఇలా నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు: రాహుల్ గాంధీ) -
మద్యం మత్తులో కన్నబిడ్డ హత్య
విజయనగరం క్రైమ్: మద్యం మత్తులో కన్నబిడ్డను చంపేసుకున్నారు ఆ కసాయి తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానిక మయూరీ కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు ఆదివారం వివరాలు వెల్లడించారు. స్థానిక మయూరి కూడలి వద్ద భిక్షాటన చేస్తూ ఐదేళ్లుగా సహజీవనం సాగిస్తున్న గాయత్రీదాస్, అలోక్ దాస్‌కు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దపాపకు రెండేళ్లు, చిన్నపాపకు నెలన్నర రోజులు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని భార్యాభర్తలు గొడవపడేవారు. ఎప్పటిలాగే శనివారం అర్ధరాత్రి తరువాత మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ తగాదాలోనే తల్లి చేతిలో ఉన్న చిన్న పాపను లాగడంతో గట్టిగా దెబ్బలు తగిలాయి. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రభుత్వాస్పత్రికి పాపను తీసుకువెళ్లగా.. అక్కడ వైద్యులు పాప మృతి చెందిందని చెప్పారు. దీంతో పాప మృతదేహాన్ని రైల్వేస్టేషన్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కంకరపిక్క, క్రషర్ బుగ్గిలో రెండు అడుగుల లోతు గొయ్యి తీసి కప్పేశాడు. అనంతరం మయూరీ కూడలి వద్ద బిడ్డను నువ్వే చంపేశావంటే నువ్వే చంపేశావని ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్ద వాదులాడుకున్నారు. వెంటనే ఆయన వన్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన వన్‌టౌన్ సీఐ వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.. సడన్‌గా వారి మధ్య..
రాయగడ: అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్న స్నేహితులు మధ్య మాటామాటా పెరిగింది. మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. జిల్లాలోని అంబోదల పోలీస్ స్టేషన్ పరిధి గడియాఖాల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గడియాఖాల్ గ్రామానికి చెందిన లుసిలి మాఝి(25), కిర్జో మాఝి(26) స్నేహితులు. శనివారం ఉదయం కూలి పనులకు వెళ్లి, తిరిగి వస్తూ అలవాడు ప్రకారం ఈత కళ్లు తెచ్చుకొని పొలం సమీపంలో తాగుతున్నారు. ఇంతలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన లుసిలి.. ఒక కర్ర సాయంతో కిర్జోపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కిర్జో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. చదవండి: మాయలేడి: సోషల్ మీడియాలో యువకులకు వల.. నమ్మించి జేబు ఖాళీ -
మద్యంతో వచ్చే డబ్బులా? ప్రజల భవిష్యత్ ముఖ్యమా..
బాలానగర్: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మద్యం ద్వారా వచ్చే రూ.35 వేల కోట్లు కావాలా.. 3.77 కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్ కావాలా అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విద్యార్థిని కుటుంబాన్ని ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం మత్తులోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పారు. చక్కగా ఇంగ్లిష్ మాట్లాడే విద్యార్థులు తయారవుతున్న ఈ తరుణంలో గల్లీ గల్లీలో బెల్టు షాపులు ఏర్పడటంతో.. మద్యానికి అలవాటు పడిన యువకులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎంతోమంది పిల్లల భవిష్యత్ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మీకేమో లిక్కర్ స్కాములు.. మాకేమో మరణ శయ్యాలా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాలిక ఆత్మహత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కటుంబానికి న్యాయపరంగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాలవర్ధన్‌గౌడ్, మండల కోఆర్డినేటర్ యాదయ్య తదితరులుఉన్నారు. -
క్వార్టర్ సీసా తెస్తాడని నమ్మితే నట్టేట ముంచాడు.. ఎంతసేపైనా రాకపాయె!
నాగిరెడ్డిపేట (నిజామాబాద్): ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం తాగుదామని పరిచయం పెంచుకొని బైక్ ఎత్తుకెళ్లిన ఘటన నాగిరెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రగుట్ట తండాకు చెందిన మాలవత్ లింగ్య ఈ నెల 24న మద్యం తాగేందుకు తన ద్విచక్ర వాహనంపై గోపాల్పేట మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. అదే సమయంలో వైన్‌షాపు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లింగ్యతో పరిచయం చేసుకుని మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మద్యం తాగుదామని నిర్ణయించుకున్నారు. సదరు వ్యక్తి మద్యం షాప్‌నకు వెళ్లి క్వార్టర్ బాటిల్‌ను తీసుకున్నాడు. ఇద్దరు కలిసి బైక్‌పై మండలంలోని తాండూరు శివారులో పౌల్ట్రీఫామ్ వెనుకకు వెళ్లి మద్యం తాగారు. మరికొంత మద్యం తాగుదామని చెప్పడంతో లింగ్య అంగీకరించాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి లింగ్య బైక్‌ను తీసుకుని మద్యం తెస్తానని చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదు. దీంతో తన బైక్ పోయిందని గుర్తించి, ఇట్టి విషయమై బాధితుడు లింగ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: వలపు వల విసిరి బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట) -
సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?
(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి) ఉద్వేగాల నేల తెలంగాణ.. సంతోషం, సంబురం, వినోదం, విషాదం.. ఏదైనా సామూహిక విందు ఇక్కడి కలివిడి జీవితాలకు సంకేతం. నలుగురు కలిసిన సమయంలో విందు, విలాసాల్లో సరదాగా మొదలవుతున్న మద్యం వినియోగం.. తర్వాత అలవాటుగా మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్న మద్యంతో వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దేశంలో అరుణాచల్‌ప్రదేశ్ 15 లక్షలు జనాభాలో సుమారు 7.60 లక్షల మందికి మద్యం తాగే అలవాటుతో టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ నాలుగు కోట్లకుపైగా జనాభా ఉండగా.. వీరిలో 15– 49 ఏళ్ల మధ్య వయసువారిలో యాభై ఐదు శాతం మంది మద్యం తాగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–21) ఇటీవలే వెల్లడించింది. కొత్తగా మద్యం అలవాటు అవుతున్న వారి సంఖ్య జాతీయ సగటు కంటే వేగంగా పెరుగుతోందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా.. తెలంగాణలో మద్యం అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా 62 శాతం (15–49 ఏళ్ల మధ్య వయసువారిలో) మేర ఉంది. ఇందులో 7శాతం మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇందులో 54శాతం మంది వారంలో ఒకసారి మద్యం తాగుతుంటే.. 28శాతం మంది నాలుగు రోజులకోసారి, మరో 19 శాతం మంది ప్రతిరోజు తాగుతున్నారు. ఇక మద్యం అలవాటు/వ్యసనంగా మారిన కుటుంబాల్లో 28 శాతం మంది మహిళలు భర్తల నుంచి హింసకు గురవుతున్నారు. 16 శాతం మంది మహిళలు తీవ్రగాయాల పాలవుతున్నట్టు జాతీయ కుటుంబ సర్వే పేర్కొంది. నిషాలో ప్రమాదాలతో.. దేశంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పది రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బాధితులు 18– 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇక పదిలక్షల జనాభా దాటిన యాభై నగరాల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి.. హైదరాబాద్ 7వ స్థానంలో ఉందని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ వింగ్ 2020 నివేదిక పేర్కొంది. అమ్మకాలు.. ఆదాయం.. చీర్స్ మద్యం వినియోగం అధికంగా ఉండే రాష్ట్రాలతో పోలిస్తే తలసరి వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉంది. రాష్ట్రంలో 2017–2020 మధ్య మద్యం వినియోగం 18 శాతం పెరిగి రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించింది. అత్యధికంగా మద్యం విక్రయించిన వైన్స్‌ల వివరాలు చూస్తే తాజా ఎక్సైజ్ ఏడాదిలో.. హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ వైన్స్ రూ.38 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయిస్తే, అశ్వారావుపేటలో రూ.31 కోట్లు, కరీంనగర్లో రూ.29 కోట్లు, కల్వకుర్తిలో ఒక వైన్స్ రూ.20.50 కోట్లు, నిజామాబాద్‌లో ఒక వైన్స్ రూ.19.50 కోట్లు, తొర్రూరులో ఒకవైన్స్ రూ.14.33 కోట్లు విలువైన మద్యాన్ని బాటిలింగ్ యూనిట్ల నుంచి కొనుగోలు చేసి జనానికి విక్రయించాయి. డ్రంకెన్ డ్రైవ్.. ప్రాణాలు తీసింది.. అది 2021 డిసెంబర్ 18. తెల్లవారుజామున రెండుగంటలు.. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కారు సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైంది. డ్రైవర్ సీట్లో ఉన్న రహీం అనే యువకుడితోపాటు ఎం.మానస, ఎన్.మానస ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. సిద్ధు అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రహీం మద్యం మత్తులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై జడ్చర్లకు చెందిన మానస తండ్రి రవీందర్‌ను పలకరిస్తే.. ‘‘ఆరేళ్ల క్రితమే తల్లిని పోగొట్టుకున్న మానసను గారాబంగా పెంచాను. ఆమెకు ఇష్టమైన టీవీ, సినిమా రంగంలోకి వెళ్తానంటే సంతోషపడ్డాను. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటుందని భావించాను. కానీ డ్రంకెన్ డ్రైవ్ నా బిడ్డను నాకు కాకుండా చేసింది. ఇలాంటి శిక్ష ఏ తండ్రికి పడొద్దు..’’అని కన్నీళ్లు పెట్టారు. పెంచిన చేతులతోనే.. అతడి పేరు కిరణ్ (28).. బీరుతో సరదాగా మొదలైన వ్యసనం విస్కీతో విస్తరించింది. ఆపై గంజాయికీ చేరింది. మత్తు లేనిదే ఉండలేక డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం, దాడులు చేయడం దాకా ఉన్మాదం చేరింది. కిరణ్ భార్య వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అక్టోబర్ 10న మత్తులో ఇంటికి వచ్చిన కిరణ్ డబ్బులు కావాలంటూ తల్లి మీద దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రినీ గాయపరిచాడు. ఏమీ దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కిరణ్ మెడకు తాడు బిగించి చంపేశారు. ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన విషాద ఘటన. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాలనుకున్న తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ మద్యం పెట్టిన చిచ్చుతో జైలు జీవితం గడుపుతున్నారు. తల్లి కోసం తండ్రిని.. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ ఉన్నంతలో బాగానే కాలం గడిపారు. భర్త భాస్కర్ (45) ఆటో నడుపుతూ భార్య కరుణారాణి, ఇద్దరు కుమారులు బాలతేజ, తరుణ్ తేజలను పోషించుకుంటూ వచ్చాడు. కానీ భాస్కర్ సరదాగా మొదలుపెట్టిన మద్యం తాగుడు.. తర్వాత అలవాటుగా, వ్యసనంగా మారింది. కొన్నేళ్ల క్రితం మద్యం మత్తులో భాస్కర్ దాడి చేయడంతో భార్య చేయి విరిగింది. తర్వాతా మద్యానికి డబ్బుల కోసం వేధించడం పెరిగింది. ఈ నెల 20న ఆలేరు మండలం తూర్పుగూడెంలో చర్చి పండగతో ఊరంతా సందడిగా ఉంటే.. భాస్కర్ మాత్రం తనకు తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన కొడుకులను గాయపర్చాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇద్దరు కొడుకులు కత్తితో దాడి చేయగా.. భాస్కర్ చనిపోయాడు. ఆ ఇద్దరు జైలుకు వెళ్లారు. కరుణారాణిపైనా కేసు నమోదైంది. కష్టం చేస్తేగానీ పూటగడవని కుటుంబానికి మద్యం అలవాటు చేసిన గాయం ఎలా మానుతుందంటూ తూర్పుగూడెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమపెళ్లి.. నడిరోడ్డులో ఆలిని నరికేసి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం భవానినగర్ తండాలో ఉండే జాటోత్ భాస్కర్ 15 ఏళ్ల కింద కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భాస్కర్ ఒకచోట గుమాస్తాగా, కల్పన ఇళ్లలో పనిచేస్తూ ముగ్గురి ఆడపిల్లల్ని పోషించుకుంటూ వచ్చారు. కానీ, కొంతకాలంగా మద్యానికి బానిసైన భాస్కర్ తాగి వచ్చి డబ్బుల కోసం కల్పనను కొట్టేవాడు. వేధింపులు భరించలేక కల్పన ఈ ఏడాది సెప్టెంబర్ 17న పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై ఆగ్రహించిన భాస్కర్ సెప్టెంబర్ 22న ఉదయం పనికోసం వెళ్తున్న కల్పనను నడిరోడ్డులో కత్తితో పొడిచి చంపాడు. తల్లి హత్యకు గురై తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అమ్మమ్మ ఇంట్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. భారీగా మద్యం ఆదాయం 2020–21లో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు పదివేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మిగతా జిల్లాల్లో బాట్లింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వానికి నేరుగా వచ్చిన ఆదాయం ఇదీ .. సులువైన ఆదాయం మద్యం నుంచే.. అది పేరుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. కానీ ప్రొహిబిషన్ (నిషేధం) బదులు విస్తరణ శాఖగా మార్చేశారు. మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వాలకు సులువుగా వచ్చే ఆదాయం ఇదే. కానీ మద్యం వినియోగంతో పాటు క్రైం రేటు భారీగా పెరుగుతోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను మర్చిపోయామనిపిస్తోంది. – ఎంవీ చంద్రవదన్, ఎక్సైజ్ మాజీ కమిషనర్ డేంజర్ జోన్‌కు చేరువలో ఉన్నాం తెలంగాణ ఇప్పుడు డేంజర్ జోన్‌కు చేరువలో ఉంది. మా అంచనా మేరకు 90శాతం మంది (15 ఏళ్లు పైబడిన వారిలో) పలు రకాల మద్యం తాగుతున్నారు. మొదట తొలుత కల్లు, బీరు, విస్కీ.. అనంతరం గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. పంజాబ్ ఇప్పటికే మద్యం వినియోగం నుంచి డ్రగ్స్ వైపు వెళ్లింది. తెలంగాణలో పరిమితికి మించి మద్య వినియోగం జరుగుతుంది. కొన్నాళ్లకు ఈ మత్తు చాలక గంజాయి, డ్రగ్స్ వైపు వెళ్లటం సహజం. తక్షణం మద్య నియంత్రణ కార్యాచరణ ప్రకటించకపోతే తెలంగాణ మరో పంజాబ్ కావడానికి ఎంతో సమయం పట్టదు. – ఎం పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మద్యం విచక్షణను దూరం చేస్తుంది సరదా కోసం తీసుకునే మద్యం అలవాటుగా మారి మనిషిలో విచక్షణను దూరం చేస్తోంది. మెదడు నుంచి కాలిబొటన వేలి వరకు ప్రభావం చూపుతుంది. ఆహారంలా అవసరంగా మారి.. మద్యం తీసుకోకపోతే మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. – డాక్టర్ ఎ.లక్ష్మీలావణ్య, హైదరాబాద్ -
Hiccups: ఎక్కిళ్లు ఆగకుండా వస్తున్నాయా?
సాధారణంగా ఎక్కిళ్లు వస్తే ఒకటి రెండు నిమిషాల్లో తగ్గిపోతాయి. కానీ కొంతమందికి ఒకపట్టాన తగ్గవు. తరచూ ఈ సమస్య వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. నీళ్లు తగ్గినా ఈ సమస్య అలాగే ఉంటుంది. మనకు వెక్కిళ్లు రాగానే శ్వాస ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే డయాఫ్రమ్ కండరం సంకోచిస్తుంది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి గాలి వేగంగా చేరుతుంది. ఫలితంగా స్వరపేటిక అకస్మాత్తుగా మూసుకుపోయి ’హిక్’అనే ధ్వనికి కారణమవుతుంది. అందుకే వీటిని ఇంగ్లిష్‌లో హికప్స్ అని పిలుస్తారు. తెలుగులో వెక్కిళ్లు అని పిలుస్తారు. దాదాపు 100కుపైగా భిన్న శారీరక పరమైన కారణాలు వెక్కిళ్లకు దారితీస్తాయి. అయితే ఇవన్నీ పెద్దగా అపాయాన్ని కలిగించవు. ఒక్కోసారి ఆగకుండా వెక్కిళ్లు వస్తుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా వెక్కిళ్లు వస్తాయి. కొన్ని మత్తు మందులు, స్టెరాయిడ్స్, పార్కిన్సన్స్ వ్యాధికి తీసుకునే ఔషధాలు, కీమో థెరపీ విధానాలు కూడా వెక్కిళ్లకు దారితీస్తాయి. నవ్వడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, వేగంగా తినడం వంటి విధానాల వల్ల, ఒక్కోసారి అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా వెక్కిళ్లు వచ్చే అవకాశముంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే ఏం చేయాలంటే... ► కొద్దిసేపు ఊపిరి బిగబట్టి ఉండాలి. ► కాసేపటి తర్వాత మళ్లీ గాఢంగా శ్వాస తీసుకుని, వదిలాలి ► అనంతరం... మరోసారి ఊపిరి బిగబట్టాలి. ► ఈ ప్రక్రియను కాసేపు ఇలాగే కొనసాగిస్తే ఎక్కిళ్లు ఆగే అవకాశం ఉంటుంది. ► ఇక గబగబా ఊపిరి తీసుకోవడం కూడా ఓ పద్ధతి. ► రెండు నిమిషాల పాటు ఇలా చేసిన తర్వాత.. ఎక్కిళ్లు ఆగుతాయి. ► ఆ తర్వాత మళ్లీ మామూలుగానే ఊపిరి తీసుకోవాలి. ► ఆకస్మాత్తుగా భయపెట్టడం వంటి చర్యతో ఎక్కిళ్లు ఆగుతాయంటారు గానీ అది అంత మంచిది కాదు. ► ఈ కొద్దిపాటి జాగ్రత్తలతోనూ ఎక్కిళ్లు ఆగకపోతే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. -
FIFA WC: బైనాక్యులర్స్‌లో బీర్.. అడ్డంగా దొరికిన అభిమాని
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడం నిషేధంలో ఉంది. కాకపోతే స్టేడియానికి కొంత దూరంలో బయట అమ్ముకునేందుకు వీలు కల్పించారు. అయితే కొందరు అభిమానులు అధికారుల పర్మిషన్తో మద్యంను స్టేడియాల్లోకి తీసుకొస్తున్నారు. మద్యం తాగడం తాము తప్పబట్టమని.. కానీ తాగి స్టేడియంలో పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కానీ ఫుట్‌బాల్ మ్యాచ్ అంటే కాస్త ఉద్రిక్తత ఉంటుంది. ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందోననే కుతూహలంతో మందు కాస్త ఎక్కువ తాగాలనుకుంటారు. అందుకే కొందరు దొంగచాటుగా పోలీసులు, సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం స్టేడియం లోపలికి తీసుకురావాలని చూసి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా ఒక అభిమాని తన బైనాక్యులర్స్‌లో బీర్‌ను తీసుకెళ్లడం అందరిని షాక్‌కు గురి చేసింది. చెకింగ్ సమయంలో సెక్యూర్టీ గార్డ్ ఆ బైనాక్యులర్స్ లెన్స్ తీశాడు. అయితే ఆ బైనాక్యులర్‌లో ద్రవం రూపంలో ఏదో ఉన్నట్లు గుర్తించాడు. శానిటైర్ తీసుకెళ్తున్నట్లు సదరు అభిమాని చెప్పినప్పటికి అధికారులు వినలేదు. ఆ తర్వాత బైన్యాక్యులర్స్లో ఉన్న ద్రవాన్ని వాసన చూడగా అది అల్కాహాల్ అని తేలడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం తెచ్చుకోవడం తప్పు కాదని.. కానీ ఇలా మా కళ్లు గప్పి తేవడం తాము తప్పుగా పరిగణిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/Fjg2Ro6JfS — TF Videos (@TF_Video) November 24, 2022 చదవండి: FIFA WC: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్క మునుగోడులోనే 300 కోట్ల మద్యం అమ్మకాలు
-
Jangaon: గొంతులో ఆమ్లెట్ ఇరుక్కొని వ్యక్తి మృతి
మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్ రూమ్(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్ ఓపెన్ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. మరీ కాస్ట్లీవి మనకెందుకనిఓ ఆమ్లెట్‌తో సరిపెట్టేద్దాంలే అనుకుని ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్ టేబుల్‌పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్‌ను తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణం తీసిన ఆమ్లెట్.. మందు తాగుతుండగా గొంతులో ఇరుక్కొని.. -
వైరల్ వీడియో: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
-
Viral Video: తాగుబోతు కోతి.. లిక్కర్ బాటిల్ కనిపిస్తే అంతే!
లక్నో: ఎవరైనా పిచ్చిగా ప్రవర్తిస్తే ‘కల్లు తాగిన కోతి లెక్క చేస్తున్నవ్’ అంటారు. కానీ, నిజానికి కోతి కల్లు తాగటం చూసినవారు చాలా తక్కువ. అలాంటిది లిక్కర్‌కు బానిసైన వానరాలూ ఉన్నాయంటే నమ్ముతారా? కానీ, ఓ కోతి ఏకంగా వైన్స్ షాప్‌లోకి దూరి చోరీ చేస్తోంది. మద్యం మత్తులో తూలుతూ జల్సా చేస్తోంది. బీరు బాటిల్ ఎత్తి తాగుతున్న ఓ కోతి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో లిక్కర్‌కు అలవాటు పడిన ఓ కోతి షాపుల్లో దూరి మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోందంటూ స్థానిక వైన్స్ షాపుల విక్రయదారులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓ కోతి మద్యం తాగుతూ ఎవరైనా కనిపిస్తే వారి దగ్గర నుంచి బాటిళ్లు లాక్కుని పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. అడ్డుకోవడానికి చూస్తే మీద పడి కరిచేందుకు సైతం ఎనకాడటం లేదటా. దీంతో వైన్స్ షాపులకు వచ్చి మందు కొనాలంటేనే భయపడుతున్నారటా మద్యం ప్రియులు. మొత్తానికి ఈ తాగుబోతి వానరం అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. రాయ్‌బరేలీ జిల్లాలోని గడాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచల్‌గంజ్ ప్రాంతంలో ఓ కోతి బీరు తాగుతున్న వీడియో తెగ వైరల్‌గా మారింది. ఫిర్యాదులు పెరిగిపోతున్న క్రమంలో అటవీ శాఖ అధికారులతో కలిసి కోతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: కేబుల్ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా? -
మద్యం మత్తులో యువతి.. కిక్కు ఎక్కువై ఏం చేసిందంటే?
బొమ్మనహళ్లి(కర్ణాటక): సోమవారం దీపావళి రోజున స్కూటర్ వెనుకాల కూర్చున్న యువతి మద్యం మత్తులో హల్చల్ చేసిన ఘటన ఎల్రక్టానిక్ సిటీ వద్ద నీలాద్రి రోడ్డులో జరిగింది. కేరళ రిజిస్ట్రేషన్ ఉన్న స్కూటర్‌ను యువకుడు నడుపుతుండగా, వెనుక తిరిగి కూర్చున్న యువతి ప్రమాదం అని తెలిసినా కూడా గట్టిగా కేకలు వేస్తూ చేతులు ఊపసాగింది. కొందరు వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులు ఆ వీడియోలో ఉన్న యువతీ యువకుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: పరువు పోతుందని కూతురిని చంపేశాడు.. -
ఆధారాల్లేకుండా భర్తను స్త్రీలోలుడు, తాగుబోతు అనడం క్రూరమే..
సాక్షి, ముంబై: బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భర్తను స్త్రీలోలుడు(తిరుగుబోతు), తాగుబోతు అంటూ భార్య ఆరోపించడం క్రూరత్వమే అవుందని కోర్టు వెల్లడించింది. దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తాజాగా బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా స్థానికంగా ఉండే రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్‌లో పుణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ.. విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మహిళ హైకోర్టు అప్పీల్ విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే ఆర్మీ అధికారి మరణించడంతో అతని చట్టపరమైన వారసుడిని ప్రతివాదిగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. మహిళ తన అప్పీల్లో భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, ఆల్కహాలిక్ అని పేర్కొంది. ఈ దురలవాట్ల కారణంగా తన వైవాహిక జీవితం సజావుగా సాగలేదని, తనకు అందాల్సిన ప్రతిఫలాలు దక్కలేదని ఆరోపించింది. దీనిపై జస్టిస్ నితిన్ జామ్దార్,షర్మిలా దేశ్‌ముఖ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎటువంటి ఆధారాలు లేకుండా భర్తపై అసత్య ఆరోపణలు చేయడం వల్ల సమాజంలో అతని పరువు, మర్యాదలను దెబ్బతీసినట్లవుతందని, ఇది క్రూరత్వానికి సమానమని బెంచ్ తీర్పునిచ్చింది. మహిళ ఆరోపణలు చేసింది గానీ.. వాటిని రుజువు చేసేందుకు ఆమె ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని కోర్టు పేర్కొంది. వారి వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తన ఉత్తర్వులో సమర్థించింది. అయితే భర్తపై పిటిషనర్ తప్పుడు, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసి మానసిక వేదనకు గురి చేసిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భార్య క్రూరత్వం, తప్పుడు ఆరోపణలు.. తన పిల్లలు, మనవరాళ్ల నుంచి అతన్ని వేరు చేసిందని ప్రస్తావించారు. ఈ మేరకు కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పిటిషనర్ భర్త సమాజంలోని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. ఆర్మీ మేజర్‌గా పదవీ విరమణ చేశారు. ఇలాంటి వారికి సంబంధించి తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేయడం మానసిక వేదనను కలిగిస్తుంది. తాగుబోతు, స్త్రీలోలుడు అని ముద్ర వేయడం ద్వారా సమాజంలో నాయన ప్రతిష్టను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆరోపణలు చేసినవారితో కలిసి జీవించడం సాధ్యం కాదు’ అని హైకోర్టు పేర్కొంంటూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. -
మద్యం అక్రమ రవాణా చేస్తున్న తెలుగు యువత నేత అరెస్ట్
గుంతకల్లు: కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ తెలుగు యువత గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బోయ రాము, అదే పార్టీకి చెందిన చంద్ర పోలీసులకు దొరికారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం సాయంత్రం గుంతకల్లు టూటౌన్ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ నరేంద్ర వెల్లడించారు. పాత గుంతకల్లుకు చెందిన తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు బోయ రాముతోపాటు అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న చంద్ర ఆదివారం బళ్లారి నుంచి కర్ణాటక మద్యాన్ని కారులో అక్రమంగా తీసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుంతకల్లు పట్టణ శివారులోని కొనకొండ్ల రోడ్డులో రైల్వే బ్రిడ్జి వద్ద కారు ఆపి తనిఖీ చేశారు. కారులో 19 బాక్సుల్లో 1,824 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలింపు కోసం ముఠా ఏర్పాటు కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన రాము 2010లో అప్పటి గుంతకల్లు రూరల్ సీఐ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఏడాది తర్వాత ఆ పని వదిలేసి, అక్రమ మద్యం రవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. గుంతకల్లుతోపాటు గుత్తి, పామిడి పట్టణాలకు కర్ణాటక మద్యాన్ని సరఫరా చేయడానికి ఏకంగా ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. గుంతకల్లులో పేకాట కేంద్రాలను కూడా నిర్వహించేవాడు. తన అక్రమార్జనకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో టీడీపీలో చేరాడు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మనిషిగా, ఆ పార్టీ నాయకుడు కేసీ హరి అనుచరుడిగా ముద్ర వేసుకున్నాడు. గత ఏడాది జూన్‌లో విడపనకల్లు మండలం డొనేకల్లు వద్ద పట్టుబడిన రూ.5 లక్షల విలువైన కర్ణాటక మద్యం తరలింపు కేసులోనూ రాము ప్రధాన నిందితుడు. అప్పుడు రాముతోపాటు గుంతకల్లుకు చెందిన టీడీపీ నాయకులు ఆకుల మల్లేష్, మహేష్, చంద్ర, దూద్‌పీరా, నవీన్ దాదాపు 15 రోజులు రిమాండుకు వెళ్లి వచ్చారు. అయినప్పటికీ రాములో ఏమాత్రం మార్పు రాలేదు. అక్రమార్జనే ధ్యేయంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. -
మందుబాబుల దసరా ‘ధమాకా’
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని మద్యం ఏడురోజులు ఏరులైంది. రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు రోజుల్లో మద్యం విక్రయాలు రూ.1,100 కోట్లు దాటాయి. అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 5(దసరా)న రెండురోజులు రాష్ట్రంలోని మద్యం డిపోలకు సెలవులుండగా, గత ఏడు పనిదినాల్లో కలిపి ఈ మేరకు మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సెప్టెంబర్ 30న రికార్డుస్థాయిలో రూ.313 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు సాగాయి. అయితే, సెప్టెంబర్ నెలాఖరులో వైన్‌షాపుల యజమానులు లిక్కర్‌కు ఎక్కువ ఇండెంట్ పెట్టి బీర్లు తగ్గించారు. గత ఏడు పనిదినాల్లో అమ్ముడైన మద్యం గణాంకాలను జిల్లాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్ల మేర మద్యం అమ్ముడైంది. వరంగల్ అర్బన్ (149.02 కోట్లు), నల్లగొండ (124.44 కోట్లు), కరీంనగర్ (111.44 కోట్లు), హైదరాబాద్ (108.24కోట్లు) జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయించారు. -
మందేయడంలో గిన్నిస్ రికార్డ్.. 17 గంటల్లో 56 పబ్‌లకు.. 30 లీటర్లు తాగడంతో
ఇంగ్లండ్‌లోని బ్రైటన్‌కు చెందిన నాదన్ క్రింప్ అనే 22 ఏళ్ల యువకుడు మందేయడంలో సరికొత్త గిన్నిస్ సృష్టించాడు! మందుకొట్టడం కూడా రికార్డేనా అని చులకనగా భావించకండి. ఎందుకంటే.. అతను సాధించింది అలాంటి, ఇలాంటి రికార్డు కాదు మరి... కేవలం 17 గంటల వ్యవధిలోనే ఏకంగా 67 పబ్‌లకు వెళ్లి అతను ‘పానీయం’ పుచ్చుకున్నాడు. తద్వారా 24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్‌లను సందర్శించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్‌కే చెందిన గ్యారెత్ మర్ఫీ అనే యువకుడు 17 గంటల్లో 56 పబ్‌లను సందర్శించి నెలకొల్పిన రికార్డును క్రింప్ బద్దలుకొట్టాడు. గిన్నిస్ నిర్వాహకుల నిబంధనల ప్రకారం సందర్శించే ప్రతి పబ్‌లోనూ మద్యమే సేవించాల్సిన అవసరం లేనప్పటికీ క్రింప్ మాత్రం ఒక పబ్‌లో మద్యం, మరో పబ్‌లో పానీయం సేవిస్తూ ముందుకెళ్లాడు. అయితే ఈ తతంగమేదీ ఆషామాషీగా జరగలేదని అతను చెప్పుకొచ్చాడు. చదవండి: హడలెత్తించిన కుక్క.. ఆవుపై దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని.. ముందుగా తమ ప్రాంతంలో ఉన్న పబ్‌లను జీపీఎస్ పరికరం ద్వారా మార్కింగ్ చేసుకొని తన ప్రయాణం మొదలుపెట్టాడట. తాను పబ్‌లను సందర్శించి మద్యం లేదా పానీయం తాగినట్లు ప్రతి పబ్ నుంచి రశీదులు, సాక్షి సంతకాలు కూడా సేకరించాడట. ఈ విషయంలో అతనికి ముగ్గురు స్నేహితులు సహకరించారు. తన పానీయాల జాబితాలో బీర్, ‘బేబీ గిన్నిస్’ షాట్స్, టకీలా, లేగర్ మొదలైనవి ఉన్నట్లు క్రింప్ తెలిపాడు. ఇలా రోజంతా సుమారు 30 లీటర్ల మేర ‘పానీయాలు’ సేవించడం వల్ల తాను ఎక్కువసార్లు బాత్రూంకు వెళ్లాల్సి వచ్చిందని... 17 గంటల సమయంలో దీనికే ఎక్కువ సమయం పోయిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకోసం ఇదంతా చేశావంటే.. కేన్సర్‌తో మృతిచెందిన తన కుక్క జ్ఞాపకార్థంతోపాటు శునకాల ట్రస్టుకు నిధుల సమీకరణకు ఈ మార్గం ఎంచుకున్నట్లు క్రింప్ వివరించాడు. -
మందు మితంగా తాగితే మంచిదే అంటారుగా.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. సిగరెట్ ప్యాకెట్లపై ఆరోగ్యానికి హానికరం అని స్టిక్కర్లు వేసినట్లే.. మద్యం బాటిళ్లపై కూడా స్టిక్కర్లు ముద్రించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని, స్టిక్కర్లు అంటించడం వల్ల యువతకు దీని గురించి తెలిసి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు. పిటిషన్‌ను పరిశీలించిన సిజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతారని పేర్కొంది. కానీ సిగరెట్ల విషయంలో ఇలా ఎవరూ చెప్పలేదని గుర్తు చేసింది. అందుకే మందుబాటిళ్లపై స్టిక్కర్లు అంటించాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, లేదంటే తామే కొట్టివేస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై లా కమిషన్ ముందుకు వెళ్లేందుకైనా తనకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్ విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. దీంతో అడ్వకేట్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. చదవండి: ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక