చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్‌లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది.
కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్‌ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్‌పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్‌ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్‌ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్‌ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు.
చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా
Comments
Please login to add a commentAdd a comment